ప్రభుత్వం

ప్రభుత్వం అనగా ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని లేదా సమాజాన్ని నియంత్రించి పరిపాలించే సంస్థ, ఇది ఒక నిర్ధిష్ట ప్రాంతంలో, నిర్దిష్ట సమూహాముపై కార్యనిర్వాహక అధికారాన్ని వినియోగించే సమిష్టి సమూహాము.

ప్రభుత్వం ప్రజలను పరిపాలిస్తుంది. ఇది రాజకీయంగా వ్యవస్థీకృత భూభాగంపై అధికారాన్ని వినియోగించే వ్యక్తి లేదా సమూహాన్ని సూచిస్తుంది. ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థీకృత వ్యవస్థ, ఇది చట్టాన్ని రూపొందించేవారిని, నిర్వాహకులును, పరిపాలనా అధికారులను కలిగి ఉంటుంది. ప్రభుత్వం చట్టాలను రూపొందించి వాటిని అమలు పరుస్తుంది. ప్రభుత్వం తన అధికార యంత్రాంగం ద్వారా పాలన కొనసాగించడానికి కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది, వీటిని ప్రభుత్వ కార్యాలయాలు అంటారు. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది. ప్రభుత్వం న్యాయ, ఆర్థిక, వైద్య నిర్వహణ వ్యవస్థలను పటిష్ట పరచి దేశాభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రభుత్వం ప్రజలకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజేసి వారిని చైతన్యపరుస్తుంది. ప్రతి దేశంలో ప్రతి ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం, రాజ్యాంగం ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక దేశం లేదా రాష్ట్రాలలో ఒక నిర్దిష్ట వ్యవస్థ ద్వారా ఒక నిర్దిష్ట కాలానికి పాలించే కొంతమంది వ్యక్తుల సమూహం. ఒక దేశంలో కేంద్ర స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వమని, రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమని అంటారు.

ప్రభుత్వం అనేది రెండు రకాలు 1.రాచరిక ప్రభుత్వం 2.ప్రజాస్వామ్య ప్రభుత్వం

రాచరిక ప్రభుత్వం

రాచరిక ప్రభుత్వంలో ప్రధాన వ్యక్తిని రాజు అంటారు. రాచరిక ప్రభుత్వంలో రాజు ఎంపిక వంశపారంపర్య వారసత్వంగా జరుగుతుంది. రాచరిక ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తులు రాజు, రాణి, మంత్రి, సేనాధిపతి. ఒక రాజ్యంలో రాజు కింద రాజ్యభాగాలను ఏలే రాజులను సామంత రాజులు అంటారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వం

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో దేశ స్థాయిలో ప్రధాన వ్యక్తులు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన వ్యక్తులు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రధాన బాధ్యత వహిస్తారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికలలో రాజకీయపార్టీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

మూలాలజాబితా

Tags:

దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంచాళుక్యులుతెలుగు కవులు - బిరుదులురామావతారంవడదెబ్బభారతదేశ చరిత్రరజాకార్రుక్మిణీ కళ్యాణంకృతి శెట్టిమౌన పోరాటంఅయోధ్య రామమందిరంహస్త నక్షత్రముతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంసలేశ్వరంసురేఖా వాణిరోజా సెల్వమణిఏప్రిల్ 24భారతీయుడు (సినిమా)లలితా సహస్ర నామములు- 201-300తెలుగు నెలలుఆంధ్రప్రదేశ్ శాసనసభఅక్కినేని నాగ చైతన్యయోగి ఆదిత్యనాథ్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావాసిరెడ్డి పద్మఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంకస్తూరి రంగ రంగా (పాట)ప్రజాస్వామ్యండి. కె. అరుణరావణుడుఫేస్‌బుక్గీతాంజలి (1989 సినిమా)ధర్మో రక్షతి రక్షితఃకాళోజీ నారాయణరావురాజస్తాన్ రాయల్స్కాజల్ అగర్వాల్కుంభరాశిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసమ్మక్క సారక్క జాతరధనిష్ఠ నక్షత్రముకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)సోంపుభగత్ సింగ్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కందుకూరి వీరేశలింగం పంతులుగుణింతంపోకిరిరుతురాజ్ గైక్వాడ్ఆలీ (నటుడు)శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమురఘుపతి రాఘవ రాజారామ్గోత్రాలుఅల్లరి నరేష్సమంతభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాదత్తాత్రేయప్రకృతి - వికృతిసింగిరెడ్డి నారాయణరెడ్డిఇజ్రాయిల్మీనాక్షి అమ్మవారి ఆలయంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిజవహర్ నవోదయ విద్యాలయంసునీల్ గవాస్కర్భారతదేశంలో బ్రిటిషు పాలనబ్రహ్మంగారి కాలజ్ఞానంకాలుష్యంఎబిఎన్ ఆంధ్రజ్యోతిఅక్కినేని అఖిల్పాల్కురికి సోమనాథుడుయవలురక్తపోటుధర్మవరం శాసనసభ నియోజకవర్గంస్త్రీకావ్యమువాల్మీకి🡆 More