లలితా త్రిపుర సుందరి శ్లోకము 52
సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి. సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి. సద్గతిప్రదా - మంచి మార్గమును ఇచ్చునది. సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి. సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది. సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది. శ్లోకం 53
సర్వయంత్రాత్మికా - అన్ని యంత్రములకు స్వరూపముగా గలది. సర్వతంత్రరూపా - అన్ని తంత్రములను తన రూపముగా గలది. మనోన్మనీ - మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది. మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది. మహాదేవీ - మహిమాన్వితమైన ఆధిపత్యము కలది. మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది. మృడప్రియా - శివుని ప్రియురాలు. శ్లోకం 54
మహారూపా - గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది. మహాపూజ్యా - గొప్పగా పూజింపబడునది. మహాపాతక నాశినీ - ఘోరమైన పాతకములను నాశనము చేయునది. మహామాయా - మహిమాన్వితమైన మాయా లక్షణం కలది. మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది. మహాశక్తిః - అనంతమైన శక్తి సామర్థ్యములు గలది. మహారతిః - గొప్ప ఆసక్తి గలది. శ్లోకం 55
మహాభోగా - గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది. మహైశ్వర్యా - విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది. మహావీర్యా - అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది. మహాబలా - అనంతమైన బలసంపన్నురాలు. మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది. మహాసిద్ధిః - అద్వితీయమైన సిద్ధి గలది. మహాయోగేశ్వరేశ్వరీ - గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి. శ్లోకం 56
మహాతంత్రా - గొప్పదైన తంత్ర స్వరూపిణి. మహామంత్రా - గొప్పదైన మంత్ర స్వరూపిణి. మహాయంత్రా - గొప్పదైన యంత్ర స్వరూపిణి. మహాసనా - గొప్పదైన ఆసనము గలది. మహాయాగ క్రమారాధ్యా - గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది. మహాభైరవ పూజితా - శివుడి యొక్క వివిధ రూపములలో 'మహా కాల భైరవ' రూపం కలదు. భయము గొలిపే మహాభైరవుడు చేత పూజింపబడే దేవి. శ్లోకం 57
మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి. మహా కామేశ మహిషీ - మహేశ్వరుని పట్టపురాణి. మహాత్రిపుర సుందరీ - గొప్పదైన త్రిపురసుందరి. శ్లోకం 58 చతుష్షష్ట్యుపచారాఢ్యా - అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది. చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా - గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది. శ్లోకం 59 మనువిద్యా - మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. చంద్రవిద్యా - చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. చంద్రమండలమధ్యగా - చంద్ర మండలములో మధ్యగా నుండునది. చారురూపా - మనోహరమైన రూపము కలిగినది. చారుహాసా - అందమైన మందహాసము కలది. చారుచంద్రకళాధరా - అందమైన చంద్రుని కళను ధరించునది. శ్లోకం 60 చరాచర జగన్నాథా - కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు. చక్రరాజ నికేతనా - చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది. పార్వతీ - పర్వతరాజు (హిమవంతుడి) పుత్రి. పద్మ నయనా - పద్మములవంటి నయనములు కలది. పద్మరాగ సమప్రభా - పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది. శ్లోకం 61 పంచప్రేతాసనాసీనా - పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది. పంచబ్రహ్మ స్వరూపిణీ - పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది. చిన్మయీ - జ్ఞానముతో నిండినది. పరమానందా - బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. విజ్ఞానఘన రూపిణీ - విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. శ్లోకం 62 ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా - ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది. ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది. విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది. జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది. స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది. తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి. శ్లోకం 63 సుప్తా - నిద్రావస్థను సూచించునది. ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది. తుర్యా - తుర్యావస్థను సూచించునది. సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది. సృష్టికర్త్రీ - సృష్టిని చేయునది. బ్రహ్మరూపా - బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది. గోప్త్రీ - గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది. గోవింద రూపిణీ - విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది. శ్లోకం 64 సంహారిణీ - ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది. రుద్రరూపా - రుద్రుని యొక్క రూపు దాల్చింది. తిరోధానకరీ - మఱుగు పరచుటను చేయునది. ఈశ్వరీ - ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది. సదాశివా - సదాశివ స్వరూపిణి. అనుగ్రహదా - అనుగ్రహమును ఇచ్చునది. పంచకృత్య పరాయణా - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది. శ్లోకం 65 భానుమండల మధ్యస్థా - సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది. భైరవీ - భైరవీ స్వరూపిణి. భగమాలినీ - వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది. పద్మాసనా - పద్మమును నెలవుగా కలిగినది. భగవతీ - భగశబ్ద స్వరూపిణి. పద్మనాభ సహోదరీ - విష్ణుమూర్తి యొక్క సహోదరి. శ్లోకం 66 ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి - తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది. సహస్ర శీర్ష వదనా - వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది. సహస్రాక్షీ - వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది. శ్లోకం 67 ఆబ్రహ్మకీట జననీ - బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి. వర్ణాశ్రమ విధాయినీ - వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది. నిజాజ్ఞారూప నిగమా - తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది. పుణ్యాపుణ్య ఫలప్రదా - మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది. శ్లోకం 68 శృతి సీమంత సిందూరీ కృతపాదాబ్జ ధూళికా - వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిన పాదపద్మము యొక్క ధూళిని కలిగినది. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా - అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము. శ్లోకం 69 పురుషార్థప్రదా - పురుషునకు కావలసిన ప్రయోజనములు (ధర్మ అర్థ కామ మోక్షములను) చక్కగా ఇచ్చునది. పూర్ణా - పూర్ణురాలు. భోగినీ - భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది. భువనేశ్వరీ - చతుర్దశ భువనములకు అధినాథురాలు. అంబికా - తల్లి. అనాది నిధనా - ఆది, అంతము లేనిది. హరిబ్రహ్మేంద్ర సేవితా - విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది. శ్లోకం 70 నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది. నాదరూపా - నాదము యొక్క రూపము అయినది. నామరూప వివర్జితా - పేరు, ఆకారము లేనిది హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి. హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. హృద్యా - హృదయమునకు ఆనందము అయినది. హేయోపాదేయ వర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది. మూలాలు
This article uses material from the Wikipedia తెలుగు article లలితా సహస్ర నామములు- 201-300 , which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0") ; additional terms may apply (view authors ). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.