జాతీయ గీతం

భారత దేశపు జాతీయ గీతం జనగణమన గురించి భారత జాతీయగీతం వ్యాసం చూడండి.

ఒక దేశపు 'జాతీయ గీతం సాధారణంగా ఆ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, దేశభక్తి వంటి విషయాలను గానం చేసే సంగీత మాధ్యమం. ఆ దేశం ప్రభుత్వంచేత లేదా సంప్రదాయాలచేత గుర్తింపు కలిగి ఉంటుంది. అధికారి లేదా అనధికారిక లేదా మిలిటరీ సందర్భాలలో దీనిని పాడడం జరుగుతూ ఉంటుంది. 19వ శతాబ్దంలో జాతీయ గీతాలు ఐరోపా దేశాలలో బహుళ ప్రచారంలోకి వచ్చాయి. డచ్చివారి జాతీయగీతం "Het Wilhelmus" బహుశా అన్నింటికంటే పురాతనమైన జాతీయ గీతం. ఇది 1568 - 1572 మధ్య కాలంలో 80 సంవత్సరాల యుద్ధం సమయంలో వ్రాయబడింది. జపానువారి జాతీయగీతం "Kimi ga Yo" కమకురా కాలంలో వ్రాయబడింది కాని 1880 వరకు దీనికి సంగీతం సమకూర్చలేదు. యు.కె. దేశపు జాతీయగీతం "God Save the Queen" మొదటిసారి 1745లో ప్రదర్శింపబడింది (అప్పుడు "God Save the King" గా). స్పెయిన్ జాతీయ గీతం "Marcha Real" (The Royal March) 1770 కాలం నుండి అమలులో ఉంది. ఫ్రాన్సు దేశపు జాతీయ గీతం "La Marseillaise" 1792లో వ్రాయబడింది. 1795లో జాతీయగీతంగా స్వీకరింపబడింది. 19, 20వ శతాబ్దంలో దాదాపు అన్ని దేశాలు ఏదో ఒక గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించాయి. జాతీయ గీతం ఒక దేశపు రాజ్యాంగం ద్వారా గాని, లేదా చట్టం ద్వారా గాని, లేదా సంప్రదాయం ద్వారా గాని గుర్తింపబడవచ్చును.

అధికంగా జాతీయ గీతాలు ఆ దేశపు ప్రముఖ భాషలో ఉంటాయి. భారత జాతీయగీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. స్విట్జర్లాండ్‌లోని నాలుగు ముఖ్యభాషలలోను నాలుగు జాతీయగీతాలున్నాయి. దక్షిణాఫ్రికా జాతీయగీతం ప్రత్యేకత ఏమంటే ఆ దేశపు 11 అధికారికభాషలలోని నాలుగు భాషలు వారి జాతీయగీతంలో వాడబడ్డాయి. ఒకోభాషకు ఒకో విభాగం (పద్యం) ఉంది. వివిధ భాషలున్న స్పెయిన్ దేశపు జాతీయగీతంలో పదాలు లేవు. సంగీతం మాత్రమే ఉంది. కాని 2007లో ఆ సంగీతానికి అనుగుణంగా పదాలు కూర్చడానికి ఒక పోటీ నిర్వహించబడింది..

వినియోగం

జాతీయ గీతం 
క్రీడా ఉత్సవాల ప్రారంభంలోను, ఇతర సంప్రదాయ సందర్భాలలోను జాతీయగీతం ఆలాపించేటప్పుడు అందరూ నిలుచోవడం ఆనవాయితీ.

జాతీయ గీతాలు అధికారిక సందర్భాలలోను, క్రీడోత్సవాలలోను, కొన్ని ఇతర ఉత్సవాలలోను పాడడం జరుగుతూ ఉంటుంది. చాలా ఆటల జట్టులు తమ ఆటల మొదట్లో జాతీయగీతం పాడడం ఇటీవల ఆనవాయితీ అవుతున్నది. ఈ ఆనవాయితీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బాస్కెట్ బాల్ ఆటలో మొదలయ్యింది. కొన్ని దేశాల పాఠశాలలలో ప్రతిదినం పాఠాలు మొదలయ్యేముందు అసెంబ్లీలో జాతీయగీతం పాడడం జరుగుతుంటుంది. సినిమా ప్రదర్శన ముందు లేదా చివర జాతీయ గీతం పాడడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం. కొన్ని రేడియో, టెలివిజన్ ప్రసారాలు జాతీయ గీతంతో తమ ప్రసారాలను ఆరంభించడం లేదా ముగించడం చేస్తాయి.

కొన్ని పెద్ద సంస్థలు లేదా సమాజాలు కూడా తమ ప్రత్యేక గేయాలను కలిగి ఉంటాయి. సోషలిస్టు ఉద్యమం,, సోవియట్ యూనియన్ ల గీతం "The Internationale". ఐరోపాకు బీథోవెన్ యొక్క "Symphony No. 9"; ఐక్య రాజ్య సమితికి, ఆఫ్రికన్ యూనియన్ కు ఒలింపిక్ యూనియన్‌కు ఇలా అధికారిక గీతాలున్నాయి.

గీత రచన

భారతదేశం, బంగ్లాదేశ్ జాతీయ గీతాలు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాధ టాగూరు రచనలనుండి తీసుకోబడ్డాయి. బోస్నియా-హెర్జ్‌గొవీనియా, స్పెయిన్, శాన్ మారినో వంటి దేశాల జాతీయ గీతాలలో అధికారిక పదాలు లేవు.

మూలాలు

బయటి లింకులు

Tags:

జాతీయ గీతం వినియోగంజాతీయ గీతం గీత రచనజాతీయ గీతం మూలాలుజాతీయ గీతం బయటి లింకులుజాతీయ గీతంభారత జాతీయగీతం

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వొస్తానంటే నేనొద్దంటానాదాశరథి కృష్ణమాచార్యబొత్స ఝాన్సీ లక్ష్మియమధీరఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాభారతీయ సంస్కృతిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపూజా హెగ్డేటంగుటూరి ప్రకాశంశ్రీ గౌరి ప్రియపంచకర్ల రమేష్ బాబు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుహిందూధర్మంనీ మనసు నాకు తెలుసుగోవిందుడు అందరివాడేలేవృశ్చిక రాశిఅష్టదిగ్గజములుగోదావరిరాయప్రోలు సుబ్బారావుబోయింగ్ 747విశ్వనాథ సత్యనారాయణఅలంకారంవిరాట పర్వము ప్రథమాశ్వాసముభారత రాష్ట్రపతిభారతదేశ జిల్లాల జాబితాబ్లూ బెర్రీరమణ మహర్షిశాసన మండలిసలేశ్వరంశివుడుపంచతంత్రంఅయ్యప్పఛత్రపతి శివాజీపాఠశాలఅయోధ్యతెలుగు సినిమాల జాబితాసాయి సుదర్శన్తెలుగు శాసనాలుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)ఆర్తీ అగర్వాల్చరవాణి (సెల్ ఫోన్)కాపు, తెలగ, బలిజఏప్రిల్ 24రిషబ్ పంత్విశ్వామిత్రుడుకడియం శ్రీహరిరుద్రమ దేవిభారతీయ రిజర్వ్ బ్యాంక్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాగుంటూరు కారంలగ్నంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅనపర్తి శాసనసభ నియోజకవర్గంతెలంగాణశ్రీశైల క్షేత్రంకేంద్రపాలిత ప్రాంతంమలబద్దకంచంద్రుడువెలిచాల జగపతి రావుకుమ్మరి (కులం)షరియాశార్దూల విక్రీడితముకాకతీయులుఏనుగురమ్య పసుపులేటికాకినాడఅవకాడోశ్రీనాథుడుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుPHఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాశ్రీ కృష్ణదేవ రాయలుతిరుమలలోక్‌సభదీపావళిపిఠాపురం శాసనసభ నియోజకవర్గం🡆 More