కడియం శ్రీహరి

కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు. ఆయన 01 డిసెంబర్ 2021 నుండి 9 డిసెంబర్ 2023 వరకు పని చేశాడు.

కడియం శ్రీహరి
కడియం శ్రీహరి


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
01 డిసెంబర్ 2021 నుండి 9 డిసెంబర్ 2023
ముందు జి. విజయ రామారావు
తరువాత టి.రాజయ్య
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ
నియోజకవర్గం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-08) 1952 జూలై 8 (వయసు 71)
ప‌ర్వ‌త‌గిరి , వ‌రంగ‌ల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కె.వినయరాణి
సంతానం కడియం కావ్య, దివ్య , రమ్య
నివాసం హైదరాబాద్
మతం హిందూ

జననం - విద్యాభాస్యం

క‌డియం వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ర్వ‌త‌గిరి గ్రామంలో 8 జులై 1958 లో ల‌క్ష్మీ న‌ర్సింహ‌, విన‌య రాణి దంపతులకు జ‌న్మించారు. కడియం శ్రీహరి వ‌రంగ‌ల్‌లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో పదవ తరగతి పూర్తి చేశాడు. వ‌రంగ‌ల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైద‌రాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచ‌ర్‌గా, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు.

కడియం శ్రీహరి 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం 3 జూన్ 2021న ముగిసింది. కడియం శ్రీహరి తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

ఆయన 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచి, డిసెంబర్ 14న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.

కడియం శ్రీహరి 2024 మార్చి 31న బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

మూలాలు

బయటి లింకులు

Tags:

కడియం శ్రీహరి జననం - విద్యాభాస్యంకడియం శ్రీహరి రాజకీయ ప్రస్థానంకడియం శ్రీహరి మూలాలుకడియం శ్రీహరి బయటి లింకులుకడియం శ్రీహరివరంగల్ జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్పనా చావ్లాపెళ్ళి చూపులు (2016 సినిమా)మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిమకరరాశిబైబిల్తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాఅలంకారమువిష్ణు సహస్రనామ స్తోత్రముగజేంద్ర మోక్షంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఎల్లమ్మకేంద్రపాలిత ప్రాంతంకస్తూరి రంగ రంగా (పాట)శ్రీదేవి (నటి)జాషువామెదడుఆనందవర్ధనుడువృశ్చిక రాశిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురెండవ ప్రపంచ యుద్ధంనెల్లూరు చరిత్రభారత జాతీయగీతంపవన్ కళ్యాణ్క్వినోవావందేమాతరంబొల్లివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపర్యావరణంభారతదేశంలో విద్యతిరుమలవిశాఖ నక్షత్రమురంజాన్పార్వతికమల్ హాసన్ నటించిన సినిమాలువిజయ్ (నటుడు)లోక్‌సభ స్పీకర్తెనాలి రామకృష్ణుడుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంమానవ హక్కులుసామెతల జాబితాఋగ్వేదంభీష్ముడుతెలుగు వాక్యంహోళీనాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)శ్రీరామనవమిశివలింగంనెల్లూరుఇక్ష్వాకులుకొఱ్ఱలురాగులుగర్భాశయ గ్రీవముసమాచార హక్కుసూర్యుడుఆర్టికల్ 370PHదూదేకులభారత రాజ్యాంగంసుందర కాండభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాతెలుగు కథకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవేముల ప్ర‌శాంత్ రెడ్డిసర్పంచికల్వకుంట్ల చంద్రశేఖరరావుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుబోయకాలుష్యంసౌర కుటుంబంతమలపాకులేపాక్షిభానుప్రియభాషా భాగాలుతెలంగాణ దళితబంధు పథకంప్రపంచ రంగస్థల దినోత్సవంఅండమాన్ నికోబార్ దీవులుగోల్కొండభారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితాపరాన్నజీవనం🡆 More