సంస్కృతి

సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం.

దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.

సంస్కృతి
ప్రాచీన ఈజిప్ట్ కళ.
సంస్కృతి
అజర్‌బైజాన్‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - గోబుస్తాన్

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

సంస్కృతి నిర్వచనం

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి. వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు , సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును. ("సంస్కృతి లేదా నాగరికత, దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది , ఏ ఇతర సామర్థ్యాలు , అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం")

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే. ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్, క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు

సంస్కృతి, నాగరికత

సంస్కృతిలో మార్పులు

భారతీయ సంస్కృతి

ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సనాతనమైనది

తెలుగువారి సంస్కృతి (తెలుగుదనం)

సంస్కృతి 
పుట్టింటి సారె
    తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు

వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

సంస్కృతి నిర్వచనంసంస్కృతి , నాగరికతసంస్కృతి లో మార్పులుసంస్కృతి భారతీయ సంస్కృతి తెలుగువారి (తెలుగుదనం)సంస్కృతి ఇవి కూడా చూడండిసంస్కృతి మూలాలుసంస్కృతి బయటి లింకులుసంస్కృతిఆంగ్లంజర్మన్ఫ్రెంచి భాషలాటిన్స్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎస్త‌ర్ నోరోన్హావిరాట్ కోహ్లిసెక్స్ (అయోమయ నివృత్తి)పూర్వ ఫల్గుణి నక్షత్రముమిథాలి రాజ్సూరిగాడుప్లీహముసుందర కాండవిటమిన్ బీ12తెలుగు కులాలురఘువంశమురాహుల్ గాంధీప్రేమలుపవన్ కళ్యాణ్కామసూత్రఅంజలి (నటి)పాల కూరమేషరాశిభారత జాతీయ చిహ్నంపెడన శాసనసభ నియోజకవర్గంజైన మతంధనిష్ఠ నక్షత్రముమిథిలజెర్రి కాటుభారత ఎన్నికల కమిషనుగైనకాలజీఆటలమ్మమ్యాడ్ (2023 తెలుగు సినిమా)ద్వాదశ జ్యోతిర్లింగాలుయునైటెడ్ కింగ్‌డమ్లారీ డ్రైవర్మాల (కులం)తోట త్రిమూర్తులుదసరామోత్కుపల్లి నర్సింహులుఔరంగజేబుతిరుపతిమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిసజ్జల రామకృష్ణా రెడ్డిఉలవలుపూరీ జగన్నాథ దేవాలయంప్రధాన సంఖ్యYఉమ్మెత్తచిరంజీవి నటించిన సినిమాల జాబితాసంపూర్ణ రామాయణం (1971 సినిమా)ఆల్బర్ట్ ఐన్‌స్టీన్పరశురాముడుఉష్ణోగ్రతతెలుగు పత్రికలుపార్లమెంటు సభ్యుడుశ్రవణ కుమారుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఇంగువవసంత వెంకట కృష్ణ ప్రసాద్ఛందస్సుతెలంగాణసోరియాసిస్రామప్ప దేవాలయంమృగశిర నక్షత్రముఅగ్నికులక్షత్రియులునన్నయ్యమానవ శాస్త్రంవరలక్ష్మి శరత్ కుమార్మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ శాసనమండలికేతిరెడ్డి పెద్దారెడ్డిఅమెజాన్ ప్రైమ్ వీడియోతెలుగు సినిమాలు డ, ఢఉస్మానియా విశ్వవిద్యాలయంభారత రాజ్యాంగ పరిషత్ఇంటి పేర్లులావు శ్రీకృష్ణ దేవరాయలుపూర్వాషాఢ నక్షత్రముచిత్త నక్షత్రముఎనుముల రేవంత్ రెడ్డిగుంటూరు కారందేవదాసి🡆 More