ఫ్రాన్సు: ఐరోపా లోని ఒక దేశం

ఫ్రాన్సు లేదా ఫ్రాన్స్ (English: France; French: La France), అధికారికంగా ఫ్రెంచ్ గణతంత్రం (English: French Republic; French: République française), పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది.

ఫ్రాన్స్కు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి. ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది.

République française  (in French)
French Republic
Flag of France France యొక్క Coats of arms
నినాదం
Liberté, Égalité, Fraternité
(Liberty, Equality, Fraternity)
జాతీయగీతం
La Marseillaise
France యొక్క స్థానం
France యొక్క స్థానం
Location of  Metropolitan France  (dark green)

– on the European continent  (light green & dark grey)
– in the European Union  (light green)  —  [Legend]

France యొక్క స్థానం
France యొక్క స్థానం

Territory of the French Republic in the world
(excl. Antarctica where sovereignty is suspended)

రాజధాని
అతి పెద్ద నగరం
పారిస్
48°51.4′N 2°21.05′E / 48.8567°N 2.35083°E / 48.8567; 2.35083
అధికార భాషలు ఫ్రెంచి భాష
ప్రజానామము French
ప్రభుత్వం Unitary semi-presidential republic
 -  President ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (La République En Marche!)
 -  Prime Minister Jean-Marc Ayrault (Parti Socialiste (PS))
నిర్మాణము
 -  French State 843 (Treaty of Verdun) 
 -  Current constitution 1958 (5th Republic) 
Accession to
the European Union
25 March 1957
 -  ఫ్రాన్స్ మహానగరము
  - IGN {{{FR_IGN_area}}} km² (47th)
 sq mi
  - Cadastre {{{FR_cadastre_area}}} km² (47th)
 sq mi
జనాభా
  (July, 2022 estimate)
 -  Total 67,897,000 (20th)
 -  ఫ్రాన్స్ మహానగరము 65,707,000 (23rd)
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $2.130 trillion (8th)
 -  తలసరి $34,205 (23rd)
జీడీపీ (nominal) 2009 అంచనా
 -  మొత్తం $2.867 trillion (5th)
 -  తలసరి $46,037 (16th)
జినీ? (2020) 29.3 
మా.సూ (హెచ్.డి.ఐ) (2021) Increase 0.903 (very high) (28th)
కరెన్సీ Euro, CFP Franc
  (EUR,    XPF)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .fr
కాలింగ్ కోడ్ +331
1 The overseas regions and collectivities form part of the French telephone numbering plan, but have their own country calling codes: Guadeloupe +590; Martinique +596; French Guiana +594, Réunion and Mayotte +262; Saint Pierre et Miquelon +508. The overseas territories are not part of the French telephone numbering plan; their country calling codes are: New Caledonia +687, French Polynesia +689; Wallis and Futuna +681
  ఫ్రాన్స్ స్థూల వివరణ (ఫ్రాన్స్ గురించి
  అనేక వందల కథనాల లింకులు)

ఫ్రాన్స్ ప్రధాన భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారంవలన ఫ్రాన్స్ "ది హేక్స్సాగాన్" (షడ్భుజి)) అని తరచూ వర్ణించ బడుతుంది.దేశ సరిహద్దులుగా (ఉత్తరం నుండి గడియారం భ్రమణం వలె) బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, మొనాకో, స్పెయిన్, అండొర్రా ఉన్నాయి. ఫ్రాన్స్ సుదూర భూభాగాల భూసరిహద్దులలో బ్రెజిల్, సురినామ్ (ఫ్రెంచ్ గయానాతో సరిహద్దు కలది), నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ (సెయింట్-మార్టిన్‌తో సరిహద్దు కలది)లు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అడుగు నుండి పోయే ఛానల్ టన్నల్ ద్వారా యునైటెడ్ కింగ్డంతో కలుపబడింది.

ఫ్రాన్స్ వైశాల్యపరంగా ఐరోపా సమాఖ్యలో అతి పెద్దదేశంగానూ అలాగే ఐరోపాలో ( రష్యా, ఉక్రెయిన్ల తరువాత) 3 వ స్థానంలో ఉంది. ఐరోపాయేతర భూభాగాలైన ఫ్రెంచ్ గయానా వంటి వాటిని కలిపితే అది 2 వ స్థానంలో ఉండేది. బలమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, రాజకీయప్రభావంతో ఫ్రాన్స్ అనేక శతాబ్దాల పాటు ప్రబల శక్తిగా ఉంది. 17 - 18వ శతాబ్దాలలో ఫ్రాన్స్ ఉత్తర అమెరికాలోని అధికభాగాలను వలసలుగా చేసుకుంది. 19వ - 20వ శతాబ్దాల ప్రారంభంలో, ఉత్తర, పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని అధికభాగాలను, ఆగ్నేయ ఆసియా, అనేక పసిఫిక్ ద్వీపాలను చేర్చుకోవడం ద్వారా ఆ కాలంలో రెండవ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది.

ఫ్రాన్స్ ఒక అభివృద్ధిచెందిన దేశంగా పరిగణించబడుతుంది. నామమాత్ర జి.డి.పి పరంగా 5వ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. కొనుగోలుశక్తి పరంగా 8వ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. సంవత్సరానికి 82 మిల్లియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తూ ప్రపంచంలో అత్యధికంగా సందర్శింపబడే దేశంగా ఉంది. ఫ్రాన్స్ ఐరోపా సమాఖ్య స్థాపకసభ్యులలో ఒకటిగా ఉండి అన్ని సభ్యదేశాల కంటే ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంది. అది ఐక్యరాజ్య సమితి స్థాపక సభ్యదేశాలలో కూడా ఒకటిగా ఉంది. ఫ్రాంకోఫోనీ, జి 8, జి 20, నాటో, ఒ.ఇ.సి.డి, వరల్డ్ ట్రేడ్ యూనియన్, లాటిన్ యూనియన్‌లలో సభ్యదేశంగా ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఐదు శాశ్వత సభ్యదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ప్రపంచంలో అధిక అణు ఆయుధాలను కలిగిన 3వ దేశంగానూ ఐరోపా సమాఖ్యలో అత్యధిక అణుఇంధన కేంద్రాలను కలిగి ఉన్నదేశంగా ఉంది.

పేరు వెనుక చరిత్ర

"ఫ్రాన్స్"అనే పదం లాటిన్ లోని ఫ్రాన్సియా నుండి వచ్చంది. దీని " ఫ్రాంకుల భూమి " ("ఫ్రాంక్ ల్యాండ్")అని అర్ధం ఫ్రాంకులు అనే పేరు పుట్టుకపై పలు సిద్ధాంతాలు ఉన్నాయి. ఫ్రాంకులచే విసరబడే " గొడ్డలి " ఫ్రాన్సిస్ అని పిలువబడటం, ఈటె లేదా బల్లెం అనే పదాన్ని " ప్రోటో-జర్మనిక్ " భాషలో ఫ్రాన్కన్ అంటారు. ఫ్రాన్కన్ నుండి ఈపదం ఉద్భవించిందని ఒక కథనం వివరిస్తుంది.[ఆధారం చూపాలి]

మరొక కథనం పురాతన జర్మనీ భాషలో " ఫ్రాంక్ " అనే పదానికి స్వేఛ్చ అని అర్ధం. యూరోని స్వీకరించక ముందు దేశీయ ద్రవ్యాన్ని ఫ్రాంకులు అంటారు.

ఏదేమైనా సాంప్రదాయ నామం ఫ్రాంకు నుండి ఈపదం వచ్చి ఉండవచ్చు,[ఆధారం చూపాలి] ఆక్రమణజాతులలో వీరికి మాత్రమే స్వేచ్చగా ఉండే అధికారం ఉందనే ఉద్దేశం నుండి ఇది జరిగింది. జర్మనీలో ఫ్రాన్స్ ఇప్పటికీ ఫ్రాంక్ రీచ్గా పిలువబడుతుంది. "ఫ్రాంకుల రాజ్యం" అని దీని అర్ధం. చార్లెమాగ్నే ఫ్రాన్కిష్ సామ్రాజ్యం నుండి భేదాన్ని చూపేందుకు, ఆధునిక ఫ్రాన్స్ ను ఫ్రాంక్ రీచ్గా పిలిచేవారు. ఫ్రాన్కిష్ రాజ్యాన్ని ఫ్రాంకెన్ రీచ్ అని పిలిచేవారు.

మధ్య యుగాలనాటికి రోమ్ పతనమైనప్పటి నుండి "ఫ్రాంక్" అనే పదం వాడబడుతోంది. "ఫ్రాన్కుల రాజు" ("రెక్స్ ఫ్రాన్కోరం") హగ్ కాపెట్ పట్టాభిషేకం నుండి అది కచ్చితంగా ఫ్రాన్సియా రాజ్యాంగా సూచించబడింది. ఇది తరువాత ఫ్రాన్స్ గా మారింది. కపెషియన్ రాజులు రాబర్టైనుల వారసుల వంశం ఇద్దరు ఫ్రాన్కిష్ రాజులను అందించింది. పూర్వం "డ్యూక్ అఫ్ ది ఫ్రాన్క్స్" ("డక్స్ ఫ్రాన్కోరం") బిరుదు కలిగి ఉండేవారు. ఈ ఫ్రాన్కిష్ సామ్రాజ్యం చాలావరకు ఆధునిక ఉత్తర ఫ్రాంసు భూభాగాలను ఆవరించి ఉంది. కానీ ప్రాంతీయ రాజుల వలన రాజ్యాధికారం అణచివేయబడి ఈపదం క్లుప్తంగా పాలిత ప్రాంతానికి వాడబడింది. కేంద్రీయ అధికారం సంపూర్ణ సామ్రాజ్యానికీ వర్తించడం వలన చివరకు ఈపదం సంపూర్ణ సామ్రాజ్యానికి అన్వయించబడింది.

చరిత్ర

రోమ్ నుండి విప్లవానికి

సెల్టిక్ గాల్స్ చే నివాసితమైన ప్రాచీన గాల్ సరిహద్దులే దాదాపు ఆధునిక ఫ్రాన్స్ సరిహద్దులుగా ఉన్నాయి. గాల్ క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో రోమ్ తరఫున జూలియస్ సీజర్ జయించాడు. తరువాత గాల్స్ చివరికి " రోమన్ " భాష (లాటిన్ దీని నుండే ఫ్రెంచ్ భాష వచ్చింది. అలాగే వారు రోమన్ సంస్కృతిని స్వీకరించారు. క్రీస్తుశకం 2 - 3వ శతాబ్దాలలో క్రైస్తవం మొదటిసారిగా ప్రవేశించి 4-5 శతాబ్దాల నాటికి మరింత బలంగా విస్తరించింది. ఎస్.టి. జెరోం “భిన్న మతాలు లేని ఏకైకప్రాంతం గాల్ మాత్రమే " అని వ్రాసారు.

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
1477లో ఫ్రాన్స్ ఎరుపు రేఖ:ఫ్రాన్స్ రాజ్యం యొక్క సరిహద్దురేఖ; లేత నీలిరంగు: ప్రత్యక్ష పాలితప్రాంతం

సా.శ.4 వ శతాబ్దంలో రైన్ వెంబడే ఉన్న గాల్ తూర్పు సరిహద్దు జర్మానిక్ తెగలచే (ముఖ్యంగా ఫ్రాంకులచే) ఆక్రమించబడింది. వీరినుండే పురాతన నామం “ఫ్రాన్సీ” వచ్చింది. పారిస్ చుట్టుప్రక్కల ఉన్న ఫ్రాన్సు భూస్వామ్య కేపెషియన్ రాజుల ప్రాంతం నుండే ఆధునిక నామమైన ఫ్రాన్స్ వచ్చింది. రోమన్ రాజ్యం అంతరించిన తర్వాత ఐరోపాను ఆక్రమించిన జర్మానిక్ ఆక్రమణ దారులలో " ఫ్రాంకులు " మొదటివారు అవటంవల్లనే " ఆర్యనిజం " (498లో వారి ప్రభువు " క్లోవిస్ " ఈవిధంగా చేశాడు) బదులుగా కాథలిక్ క్రైస్తవం ఫ్రాన్సులో వ్యాపించింది. అందువల్లనే ఫ్రాన్సు "చర్చి ప్రధమ పుత్రిక" (లా ఫిల్లె అనీ డీ ఐ ఎగ్లైస్ ) గా పిలువబడింది. దీనికి తగినట్లుగానే ఫ్రెంచ్ తనకుతాను "సంపూర్ణ క్రైస్తవ రాజ్యం ఫ్రాన్సు"గా అభివర్ణించుకుంటుంది.

వెర్డన్ ఒప్పందం అనుసరించి చార్లె మాగ్నే కారోలిన్జియన్ సామ్రాజ్యం తూర్పు ఫ్రాన్సియా, మధ్య ఫ్రాన్సియా, పశ్చిమ ఫ్రాన్సియాలుగా విభజింపబడిన తరువాత ఈ ప్రాంతంలో ప్రత్యేక ఉనికితో మనుగడ మొదలైంది. పశ్చిమ ఫ్రాన్సియా దాదాపు ఆధునిక ఫ్రాన్సు ఆక్రమించిన ప్రాంతాలన్నిటినీ కలిగిఉంది. ఆధునిక ఫ్రాన్సుకు ఉపోద్ఘాతంగా కూడా ఉంది.

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
Les Grandes Misères de la guerre ముప్పది సంవత్సరాల యుద్ధంలో పౌరులపై అదుపులేని రీతిలో జరిగిన వినాశనాన్ని వర్ణిస్తుంది.

కరోలిన్జియన్ వంశం ఫ్రాన్సును 987 వరకు పరిపాలించినపుడు డ్యూక్ అఫ్ ఫ్రాన్స్, కౌంట్ అఫ్ పారిస్ అయిన " హగ్ కాపెట్" కు ఫ్రాన్స్ రాజుగా కిరీటం అలంకరించబడింది. అతని వారసులు ప్రత్యక్ష కపేషియన్లు, వలోయిస్ వంశం, బోర్బాన్ వంశం అనేక యుద్ధాలలో పాల్గొని రాజ్య వంశపారంపర్యత ద్వారా దేశాన్ని ఏకీకృతం చేసారు. 1209లో ఒసిటేనియ వంశపారంపర్య కాథర్లను నిర్మూలించడానికి " అల్బిజేన్సియన్ క్రుసేడ్ " ప్రారంభించబడింది. (ఆధునిక ఫ్రాన్స్ దక్షిణభాగం). చివరకు కాధర్ల నిర్మూలన దక్షిణ ఫ్రాన్స్ స్వాతంత్ర్యం కూడా నిర్మూలించబడ్డాయి.

1337లో " బ్లాక్ డెత్ " ముందు ఇంగ్లాండ్, ఫ్రాన్సులు వంద సంవత్సరాల యుద్ధంగా పిలువబడే యుద్ధానికి సిద్ధమయ్యాయి. " ఫ్రెంచ్ మత యుద్ధాలలో " (1562–98), అత్యంత దారుణమైన సంఘటనలో 1572 నాటి ఎస్.టి. భర్తలోమ్యూస్ డే ఊచకోతలో అనేక వేలమంది హ్యుజినాట్స్ మరణించారు.

17వ శతాబ్దంలో లూయిస్ XIV పాలనలో ఈ రాచరికం ఉచ్చస్థితికి చేరుకుంది. ఆ సమయంలోనే ఫ్రాన్స్ ఐరోపాలో అత్యధిక జనాభాతో ( " ఫ్రాన్స్ జనాభా అధ్యయనాలు " ) ఐరోపా రాజకీయం, అర్ధశాస్త్రం, సంస్కృతిపై అత్యంత ప్రభావాన్ని చూపింది. 20వ శతాబ్దం వరకు అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలలో ఉమ్మడి భాషగా ఉండేది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ మేధావి వర్గంలో జ్ఞాన సముపార్జన, అనేక శాస్త్ర ఆవిష్కరణలు సాధించబడ్డాయి. దీనికితోడు ఫ్రాంసు అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో దూరతీర భూభాగాలను కలిగి ఉంది.

ఏకస్వామ్యం నుండి గణతంత్రానికి

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
1789 జూలై 14లో బాసిలీ బద్దలు కొట్టడం

ఫ్రెంచ్ విప్లవం వరకు ఫ్రాన్సు రాచరికపు పాలనలో ఉండేది. 1789 జూలై 14న బాసిల్లేను పేల్చివేసిన వెంటనే ఇది అంతరించి పోకుండా 1792 సెప్టెంబరులో మొదటి గణతంత్రం ఏర్పడేవరకు కొనసాగింది. భీకరపాలనలో అనేక వేలమంది ఫ్రెంచ్ పౌరులతో పాటు " లూయిస్ XVI " అతని భార్య " మేరీ అంటోనిటీ " కూడా ఉరితీయబడ్డారు (1793). అనేక స్వల్ప-కాలిక ప్రభుత్వాల తరువాత " నెపోలియన్ బొనపార్టే " 1799లో గణతంత్రాన్ని వశపరచుకొని తనకు తాను " మొదటి కాన్సుల్ "గా ప్రకటించుకొన్నాడు. ఇప్పుడు మొదటి సామ్రాజ్యం (1804–1814)గా పిలువబడుతున్న దానికి చక్రవర్తి అయ్యారు. అనేక యుద్ధాల తరువాత అతని సైన్యం ఖండాంతర ఐరోపాలో చాల భాగం ఆక్రమించుకుంది, కొత్తరాజ్యాలకు బోనపార్టే కుటుంబసభ్యులు నియంతలుగా నియమించబడ్డారు. నెపోలియన్ యుద్ధాలలో సుమారు ఒక మిలియన్ ఫ్రెంచ్ పౌరులు మరణించారు.

1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ అంతిమ ఓటమి తర్వాత నూతన రాజ్యాంగ పరిమితులతో సమైక్య ఫ్రెంచి పాలన తిరిగి స్థాపించబడింది. 1830లో జరిగిన ఒక ప్రజా తిరుగుబాటు తరువాత రాజ్యాంగబద్ధంగా జూలైలో స్థాపించబడిన సమైక్యపాలన 1848 వరకు కొనసాగింది. స్వల్పకాల రెండవ గణతంత్రం 1852లో " లూయిస్-నెపోలియన్ బొనపార్టే " రెండవ సామ్రాజ్య ప్రకటనతో ముగిసింది. 1870లో జరిగిన " ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో " లూయిస్-నెపోలియన్ ఓటమితో అతను తొలగింపబడి మూడవ గణతంత్రం స్థాపించబడింది.

17వ శతాబ్ద ప్రారంభం నుండి 1960ల వరకు ఫ్రాన్స్ ఆధీనంలో అనేక రూపాలలో వలస ప్రాంతాలు ఉండేవి. 19 - 20 శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రానికి ఆవలివైపు ఉన్న ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం " బ్రిటిష్ సామ్రాజ్యం " తరువాత ప్రపంచంలోని రెండవ పెద్ద సామ్రాజ్యంగా ఉంది. 1919 - 1939 మధ్య ఉచ్ఛస్థితిలో రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం 1,23,47,000 చదరపు కిలోమీటర్ల (47,67,000 చదరపు మైళ్ళు) వైశాల్యంలో విస్తరించి ఉంది. 1920లు - 1930ల మధ్యలో ఫ్రాన్స్ ప్రధానభూభాగంతో కలిపి ఫ్రెంచ్ సార్వభౌమాధికారంలో ఉన్న మొత్తం భూమి 1,28,98,000 చదరపు కిలోమీటర్లకు (49,80,000 చదరపు మైళ్ళు) చేరుకుంది. ఇది ప్రపంచం మొత్తం భూభాగంలో 8.6%.

దస్త్రం:Eur.fr.100.gif
2002లో ఫ్రాన్స్ యూరోజోన్ ఏర్పరచే 16 ఇతర ఐరోపాసమాఖ్య సభ్యదేశాలతో కలిసి సమైక్య యూరోపియన్ ద్రవ్యంగా యూరో జారీచేసింది. యూరో నాణెం ఫ్రెంచ్ భాగం ఇక్కడ చూపబడింది.

మొదటి ప్రపంచ యుద్ధం - రెండవ ప్రపంచ యుద్ధంలలో ఫ్రాన్స్ ఒక ఆక్రమితదేశంగా ఉంది. మొదటి ప్రపంచయుద్ధంలో ఫ్రాన్స్ లో కొద్దిభాగమే ఆక్రమింపబడినప్పటికీ మానవ, వస్తు రూపంలోని నష్టం రెండవ ప్రపంచయుద్ధం కంటే చాలా ఎక్కువగా ఉంది. యుద్ధంలో 1.4 మిలియన్ల ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. పాపులర్ ఫ్రంట్ ప్రభుత్వంచే ప్రవేశ పెట్టబడిన వివిధరకాల సాంఘిక సంస్కరణలు అమలుజరిగిన కాలం సంధికాలంగా గుర్తించబడింది. రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీ బ్లిట్జ్ క్రీగ్ ఆక్రమణ తరువాత ఫ్రాన్స్ ప్రధాన భూభాగం, ఉత్తరాన ఆక్రమిత భాగం, దక్షిణభూభాగం జర్మనీ చేతిలో విశ్వసనీయమైన తోలుబొమ్మ పాలనలో " విచీ ఫ్రాన్స్ "గా విడిపోయింది.

రెండవ ప్రపంచయుద్ధం తరువాత " నాల్గవ గణతంత్రం " స్థాపించబడింది. అద్భుతమైన ఆర్థిక ప్రగతి ఉన్నప్పటికీ (లెస్ ట్రేన్టే గ్లోరియూసేస్ ), అది ఒక ఆధిపత్య దేశంగా తన రాజకీయ స్థాయిని కాపాడుకోవడానికి పోరాడింది. ఫ్రాన్స్ తన వలస సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది కానీ వెంటనే ఇబ్బందులను ఎదుర్కొంది. ఫ్రెంచ్ ఇండోచైనాపై నియంత్రణ సాధించడానికి 1946లో జరిగిన ప్రయత్నం " మొదటి ఇండోచైనా యుద్ధానికి " దారితీసింది. అంతిమంగా 1954లో డీన్ బీన్ ఫు యుద్ధంలో చైనా ఓడిపోయింది. కొన్నినెలల తరువాత ఫ్రాన్స్ అల్జీరియాలో నూతనమైన మరింత కఠినమైన పోరాటాన్ని ఎదుర్కుంది.

అప్పటికి ఒక మిలియన్ ఐరోపావాసులు స్థావరం ఉన్న అల్జీరియాపై నియంత్రణ ఉండాలా వద్దా అనే చర్చ దేశాన్ని కుదిపివేసి దాదాపు పౌరయుద్ధానికి దారితీసింది. 1958లో బలహీన అస్థిర నాల్గవ గణతంత్రం నుండి బలమైన అధ్యక్షుడిని కలిగిన ఐదవ గణతంత్రం ఏర్పడడానికి దారితీసింది. తరువాత " చార్లెస్ డి గల్లే " యుద్ధాన్ని అంతం చేయడానికి చర్యలు తీసుకొని దేశాన్ని కలిపి ఉంచగాలిగారు. ముఖ్యపట్టణం అల్జీర్సులో జరిగిన అల్జీరియన్ యుద్ధం, ఫ్రాంకో-ఫ్రెంచ్ పౌర యుద్ధం, 1962లో శాంతి చర్చల తరువాత ముగింపుకు వచ్చి అల్జీరియన్ స్వాతంత్ర్యానికి దారితీసింది.

ఇటీవలి దశాబ్దాలలో " ఐరోపా సమాఖ్య " ఏర్పడిన తరువాత 1999 జనవరిలో యూరోను ప్రవేశపెట్టబడింది. రాజకీయ, ఆర్థికఐక్యత ఫ్రాన్స్, జర్మనీల మధ్య ఐక్యత సర్దుబాటు వంటి మార్పులు చోటుచేసుకున్నాయి. ఐరోపియన్ సమాఖ్య రాజకీయ, రక్షణ, భద్రతారంగాలను శక్తివంతంగా తయారుచేయడానికి అవసరమయ్యే ఆర్థికాభివృద్ధిలో సమాఖ్య సభ్యదేశాలలో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంది. 2005 మేలో ఫ్రెంచ్ ఓటర్లు " యూరోపియన్ కాన్స్టిట్యూషనల్ ట్రియటీ " ధ్రువీకరణకు వ్యతిరేకంగా ఓటు చేసారు. తరువాత వచ్చిన " ట్రిటీ అఫ్ లిస్బన్ " పార్లమెంటుచే ధ్రువీకరించబడింది.

భౌగోళిక స్వరూపం

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రాన్స్ ఉపగ్రహచిత్రం

ఫ్రాన్స్ ప్రధానభూభాగం పశ్చిమ ఐరోపాలో ఉన్నప్పటికీ ఫ్రాంసుకు చెందిన అనేక భూభాగాలు ఉత్తర అమెరికా, కరేబియన్, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం దక్షిణభాగం, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికాలలో ఉన్నాయి. ఈ భూభాగాల్లో విభిన్న సమూహాలకు చెందిన అనేక రకాలైన ప్రభుత్వాలు ఉన్నాయి.

ఫ్రాన్స్ ప్రధాన భూభాగం 5,47,030 ఐరోపా సమాఖ్య సభ్యుదేశాలన్నింటికంటే అత్యధిక భూభాగాన్ని, స్పెయిన్ కంటే కొద్దిగా ఎక్కువ భాగాన్ని కలిగిఉంది. ఫ్రాన్స్ ఉత్తరం, పశ్చిమాల్లో సముద్రతీర మైదాన భూముల నుండి ఆగ్నేయంలో ఆల్ప్స్ పర్వతశ్రేణులు, దక్షిణ-మధ్య భాగంలో మాసిఫ్ సెంట్రల్, నైరుతిలో పైరినీస్ వంటి విభిన్న భూభాగాలను కలిగిఉంది.4807 మీ సముద్ర మట్టానికంటే ఎత్తున పశ్చిమ ఐరోపాలోనే అత్యంత ఎత్తైన మోంట్ బ్లాంక్,ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. ఇవి ఫ్రాన్స్, ఇటలీల సరిహద్దులో ఉంది. ఫ్రాన్స్ ప్రధానభూభాగం విస్తృతమైన నదీ వ్యవస్థలను కలిగిఉంది. లోయిర్, గరోన్నే, సీన్ రెనే నదులు ఉన్నాయి. మాసిఫ్ సెంట్రల్‌ను ఆల్ప్స్ నుండి విభజించి కామర్గ్యూ మధ్యధరా సముద్రంలోనికి ప్రవహిస్తుంది. ఇది ఫ్రాన్స్ లో సముద్రమట్టం కంటే)లోతైన ప్రదేశం.|కామర్గ్యూ వద్ద మధ్యధరా సముద్రంలోనికి ప్రవహిస్తుంది, ఇది ఫ్రాన్స్ లో 2 m (6.56 ft)* సముద్రమట్టం కంటే)లోతైన ప్రదేశం.]] కోర్సికా మధ్యధరా తీరానికి అవతలి ప్రక్కన ఉంది.

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రాన్సు ఆర్థిక మినహాయింపు ప్రదేశం మహాసముద్రంపై నుండి ప్రపంచానికి వ్యాపించింది.

ఫ్రాన్స్ వలస ప్రాంతాలతో కలిపి దాని మొత్తం భూవైశాల్యం ( అడేలీ భూభాగం మినహాయించి) భూమి మొత్తం వైశాల్యంలో చ.కి.మీ. 0.45% (6,74,843చ.కి.మీ) ఉంది. ఫ్రాన్స్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద " ప్రత్యేక ఆర్థిక మండలి "ని కలిగిఉంది. ఇది ప్రపంచంలోని మొత్తం వైశాల్యం 8%(11035000 చ.కి.మీ.) వైశాల్యాన్ని కలిగి ఉంది. వైశాల్యపరంగా ఫ్రాంస్ యునైటెడ్ స్టేట్స్ తరువాత స్థానంలోను (11351000 చ.కి.మీ) ఆస్ట్రేలియా (8,232,000 km2 (3,178,393 sq mi)*) కంటే ముందు స్థానంలోను ఉంది.

ఫ్రాన్స్ ప్రధాన భూభాగం 41° - 51° ఉత్తర అక్షాంశంలో ఐరోపా పశ్చిమ కొసన ఉంది. ఇది ఉత్తర సమశీతోష్ణ ప్రాంతంలో ఉంది. ఉత్తరం,వాయవ్యం సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగిఉంది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో సముద్ర తీర వాతావరణం ఉంది. ఆగ్నేయంలో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంటుంది. పడమరలో శీతోష్ణస్థితి ముఖ్యంగా మహాసముద్ర వాతావరణం ఉంటుంది. అధిక వర్షపాతం, మంద్ర శీతాకాలాలు, నులి వెచ్చని వేసవులు కలిగిఉంటుంది. లోతట్టు ప్రాంతాలలో వేడి గాలులతో కూడిన వేసవులు, చల్లని శీతాకాలాల, తక్కువ వర్షపాతం కలిగిన ఖండాంర్గత శీతోష్ణస్థితి కలిగిఉంటుంది.ఆల్ప్స్, ఇతర పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా పర్వతప్రాంత శీతోష్ణస్థితి ఉంది. సంవత్సరానికి 150 రోజులు ఘనీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆరునెలల వరకు మంచుతో కప్పబడి ఉంటాయి.

ప్రభుత్వం

ఫ్రెంచ్ గణతంత్రం బలమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు కలిగిన పాక్షిక అధ్యక్షతరహా గణతంత్రంగా వర్గీకరించబడింది. 1958 సెప్టెంబరు 28న ఐదవ గణతంత్ర రాజ్యాంగం అభిప్రాయ సేకరణ ద్వారా అంగీకరించబడింది. పార్లమెంటు కార్యనిర్వాహక వర్గం అధికారాన్ని ఇది మరింత బలపరచింది. కార్యనిర్వాహక విభాగం ఇద్దరు నాయకులను కలిగిఉంటుంది:ఒకరు గణతంత్రం అధ్యక్షుడు ప్రస్తుతం " నికోలస్ సర్కోజి ". రాజ్యాధినేత అయిన అధ్యక్షుడు సార్వత్రిక వయోజన ఓటు హక్కుచే ప్రత్యక్షంగా ఐదు-సంవత్సరాల (ఇంతకుముందు ఏడు సంవత్సరాలు)కాలానికి ఎన్నుకోబడతారు. అధ్యక్షునిచే నియమింపబడిన ప్రధానమంత్రిచే ప్రభుత్వం నడుపబడుతుంది. ఫ్రాంకోయిస్ ఫిల్లన్ ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నాడు.

ఫ్రెంచ్ పార్లమెంటు రెండు శాసన సభలను కలిగిన శాసనవ్యవస్థగా ఉంది. జాతీయ శాసనసభ (అసెంబ్లీ నేషనేల్ ), ఒక సెనేట్ లను కలిగి ఉంది. జాతీయ శాసనసభ డెప్యూటీలు స్థానిక నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.వీరు 5-సంవత్సరాల కాలానికి ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడతారు. శాసనసభకు త్రివర్గాన్ని రద్దుచేసే అధికారం ఉంది. అందువలన శాసనసభలో ఆధిక్యత ప్రభుత్వ ఎంపికను శాసిస్తుంది. సెనేటర్లు ప్రాదేశిక నియోజకవర్గాల ద్వారా 6-సంవత్సరాల కాలానికి (మొదటిసారి 9-సంవత్సరాల పదవీకాలం) ఎన్నుకోబడుతుంటారు. 2008 సెప్టెంబర్ నుండి సగం సీట్లు ప్రతి మూడు సంవత్సరాలకు ఎన్నిక కాబడతాయి.

సెనేట్ శాసననిర్మాణ అధికారాలు పరిమితమైనవి. రెండు సభల మధ్య ఏకాభిప్రాయం కుదరనపుడ రాజ్యాంగ చట్టాలు లోయిస్ ఆర్గానిక్స్ (రాజ్యాంగంచే నేరుగా సమర్పించబడిన చట్టాలు) మినహా మిగిలిన వాటిలో జాతీయ శాసనసభకు నిర్ణయాధికారం ఉంటుంది. పార్లమెంట్ కార్యక్రమాలను రూపొందించడంలో ప్రభుత్వ ప్రభావం శక్తివంతమైనది.

ఫ్రెంచ్ రాజకీయాల స్వభావం రెండు రాజకీయ వ్యతిరేక సమూహాల ద్వారా ప్రభావితమవుతోంది:వాటిలో ఒకటి ఫ్రెంచ్ సోషలిస్ట్ పార్టీచే కేంద్రీకరించబడిన వామ-పక్షం, మరియొకటి సాంప్రదాయ-పక్షం. ఇంతకుముందు ఇది " రేసేమ్బెల్మెంట్ పోర్ లా రిపబ్లిక్ " కు అనుబంధంగా ఉండేది. ఇప్పుడు దానిస్థానంలో వచ్చిన " యునియన్ ఫర్ ఎ పాపులర్ మూవ్మెంట్ "కు అనుబంధంగా ఉంది. ప్రస్తుత కార్యనిర్వాహక విభాగం ఎక్కువగా యు.ఎం.పి.తో నిండి ఉంది.

సాంప్రదాయాలు , సంకేతాలు

  • అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి (మెట్రిక్ పద్ధతి)కి ఫ్రాన్స్ జన్మస్థలం. కొన్ని పూర్వ-మెట్రిక్ ప్రమాణాలు ఇంకా వాడబడుతున్నాయి, ముఖ్యంగా లివ్రే (కిలోగ్రాములో సగం బరువుకు సమానమైన ప్రమాణం) క్వింటాల్ (100 కిలోగ్రాముల బరువుకు సమాన ప్రమాణం).
  • ఫ్రాన్స్ చాలా దేశాలవలె గణితంలో అంతర్గత పద్ధతిని వాడుతుంది. పెద్ద సంఖ్యలకు పెద్ద ప్రమాణం వాడతారు. ఆ విధంగా ఫ్రెంచ్ వారు 1,000,000,000,000 అనే సంఖ్యకు బిలియన్ అనే పదాన్ని వాడతారు. కాగా తక్కువ ప్రమాణం వాడే దేశాలు దీనిని ట్రిలియన్ అని పిలుస్తాయి. ఏదేమైనా, 1,000,000,000, అనే సంఖ్యను సూచించే మిలియర్డ్ అనే ఫ్రెంచ్ పదం వాడుకలో ఉంది. అయితే తక్కువ ప్రమాణం వాడే దేశాలు దీనిని ఒక బిలియన్ అని పిలుస్తాయి. ఆ విధంగా పెద్ద ప్రమాణం ఉపయోగించినప్పటికీ ఒక బిలియన్ అన్ మిలియర్డ్ (“ఒక మిలియర్డ్”) అని ఫ్రెంచిలో పిలువబడుతుంది కానీ మిల్లె మిలియన్స్ (“వేయి మిలియన్లు”) అనికాదు. మిలియర్డ్ కంటే ఎక్కువ ఉండే సంఖ్యల పేర్లను అరుదుగా ఉపయోగిస్తారని గమనించాలి. ఆ విధంగా ఒక ట్రిలియన్ తరచుగా ఫ్రెంచిలో మిల్లె మిలియర్డ్స్ (“ఒక వేయి మిలియర్డ్”) లుగా పిలువబడుతుంది. అరుదుగా అన్ బిలియన్గా పిలుస్తారు.
  • ఫ్రెంచ్ సంఖ్యామానంలో కామా (,) అనేది దశాంశ విభాగిని అయితే చుక్క (.) అనేది మూడు అంకెల సమూహానికి మధ్య ప్రత్యేకించి పెద్ద సంఖ్యలకు వాడతారు. మూడు అంకెల సమూహాన్ని విడదీసి చూపడానికి ప్రత్యేకించి చిన్న అంకెల మధ్య ఖాళీని కూడా వాడతారు. ఆ విధంగా మూడువేల ఐదువందలపదిని 3 510 గా వ్రాయవచ్చు అలాగే పదిహేను మిలియన్ల ఐదువందలవేల ముప్ఫైరెండుని 15.500.032 గా వ్రాయవచ్చు. ఆర్థికరంగంలో, కరెన్సీగుర్తు దశాంశ విభాగినిగా ఉపయోగించవచ్చు లేదా సంఖ్య తరువాత ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, €25,048.05 ను 25 048€05 లేక 25 048,05 € (సంఖ్యకు, కరెన్సీగుర్తుకు మధ్య అదనపు ఖాళీ ఎప్పుడూ ఉంటుంది).
  • గణనలో ఒకబిట్‌ను బిట్ గానే పిలుస్తారు కానీ బైట్‌ను ఆక్టేట్ అంటారు (దాని లాటిన్ మూలం ఆక్టో, దాని అర్ధం“8”). ఎస్.టి. పూర్వపదాలను వాడతారు.
  • 24-గంటల గడియారం కాలం వాడతారు. హెచ్ గంటలు నిమిషాల మధ్య విభాగినిగా వాడతారు (ఉదాహరణకు మధ్యాహ్నం 2:30 14h30).
  • రోజుని చూపడానికి వాడే అన్ని సంఖ్యా రూపాలు రోజు-నెల-సంవత్సరం క్రమంలో ఉంటాయి. వాటిని విభజించడానికి ఒక గీతను వాడతారు (ఉదాహరణ: 31/12/1992 లేదా 31/12/92).

చట్టం

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రెంచ్ రిపబ్లిక్ తప్పనిసరిగా గౌరవించవలసిన ఆధార నియమాలు 1789 నాటి డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మాన్ అండ్ ఆఫ్ ది సిటిజెన్ లో పొందుపరచబడ్డాయి.

ఫ్రాన్స్ పౌర చట్ట (సివిల్ లా) వ్యవస్థను అమలుచేస్తుంది. అనగా చట్టం ప్రాథమికంగా లిఖిత శాసనాలనుండి పుడుతుంది. న్యాయమూర్తులు చట్టాన్ని చేయకుండా కేవలం దానిని వ్యాఖ్యానిస్తారు (అయితే కొన్ని సందర్భాలలో న్యాయమూర్తి వ్యాఖ్యానం వ్యాజ్య చట్టం)తో సమానంగా ఉంటుంది. చట్ట నియమం ఆధారసూత్రాలు నెపోలియన్ స్మృతిలో ఉంచబడ్డాయి. " డిక్లేరెషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ " సిద్ధాంతాలతో ఏకీభవిస్తూ చట్టం కేవలం సమాజానికి ఆపత్కకరమైన చర్యలను మాత్రమే నిషేధించాలి. కోర్ట్ అఫ్ కస్సాషన్ మొదటి అధ్యక్షుడైన " గై కానివేట్ " జైళ్ళ నిర్వహణ గురించి వ్రాసిన విధంగా:

    స్వాతంత్ర్యం ఒక చట్టం. దాని నియంత్రణ ఒక మినహాయింపు. యుక్త సూత్రాలను అనుసరిస్తూ చట్ట ప్రకారం మాత్రమే స్వాతంత్ర్యాన్ని ఏ విధంగానైనా నియంత్రించాలి.

అంటే నియంత్రణలు అవసరమైనపుడు మాత్రమే చట్టం వాటిని ప్రవేశపెట్టాలి. ఈ నియంత్రణ వలన కలిగే అసౌకర్యం ఇది తొలగించే అసౌకర్యం కంటే ఎక్కువగా ఉండకూడదు.

ఫ్రెంచ్ చట్టం రెండు ముఖ్యభాగాలుగా విభజింపబడింది: వ్యక్తిగత చట్టం (పర్సనల్ లా), ప్రజా చట్టం. వ్యక్తిగత చట్టంలో పౌర చట్టం (సివిల్ ల), నేర చట్టం ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రజాచట్టంలో నిర్వాహక చట్టం, రాజ్యాంగ చట్టం ప్రత్యేకంగా ఉన్నాయి. ఏదేమైనా ఉపయోగంలో ఫ్రెంచ్ చట్టంలో మూడు ముఖ్యభాగాలు ఉన్నాయి: పౌర చట్టం (సివిల్ లా), నేర చట్టం (క్రిమినల్ లా), నిర్వాహక చట్టం (అడ్మినిస్ట్రేష లా) ఉన్నాయి.

ఫ్రాన్స్ మత చట్టాన్ని గుర్తించదు. నియంత్రణలకు ప్రేరణగా మత నమ్మకాలను లేదా నీతిని నియంత్రణా చట్టాల అమలుకు గుర్తించదు. దీని పరిణామంగా ఫ్రాన్స్ దైవదూషణ చట్టాలు లేదా అసహజ మైధున చట్టాలు లేవు. (చివరిది 1791లో రద్దుచేయబడింది). ఏదేమైనా “ప్రజామర్యాదలకు భంగం కలిగించే నేరాలు" (contraires aux bonnes mœurs ) లేదా పౌర జీవనానికి భంగం కలిగించడం (trouble à l'ordre public ) వంటి వాటిని ఉపయోగించి స్వలింగ సంపర్కం లేదా వీధి వ్యభిచారాన్ని నిరోధిస్తారు.

నేరచట్టం భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుంది కానీ గతానికి కాదు (ఎక్స్ పోస్ట్ ఫాక్టో నేర చట్టాలు నిషేధించబడ్డాయి) ; అనువర్తింప చేయడానికి వాటిని జర్నల్ అఫీషియల్ డి లా రిపబ్లిక్ ఫ్రాన్చైస్లో అధికారికంగా ముద్రించాలి.

విదేశీ సంబంధాలు

దస్త్రం:Signing of the Maastricht Treaty.jpg
ఫ్రాన్సు 1957 లో నెలకొల్పబడిన EC, 1993 లో నెలకొల్పబడిన యూరోపియన్ యూనియన్ యొక్క వ్యవస్థాపక సభ్యురాలు (మాస్ట్రిచ్ ఒప్పందం పై సంతకం చేయటం).

ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్ సభ్యదేశంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో వీటో హక్కులుకలిగిన శాశ్వత సభ్యదేశంగా సేవలందిస్తోంది. అది ఇంకా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, సెక్రటేరియట్ ఆఫ్ ది పసిఫిక్ కమ్యూనిటీ (ఎస్.పి.సి) " ఇండియన్ ఓషన్ కమిషన్ " లలో కూడా సభ్యదేశంగా ఉంది. " అసోసియేషన్ ఆఫ్ కెరిబియన్ స్టేట్స్ "ప్ లో సహచర సభ్యదేశం, పూర్తిగా లేక పాక్షికంగా ఫ్రెంచ్ మాట్లాడే యాభై-ఒక్క దేశాల " ఇంటర్ నేషనల్ ఫ్రాంకోఫోన్ ఆర్గనైజేషన్ "లో నాయకత్వ దేశాలలో ఒకటిగా ఉంది. ఇది ఒ.ఇ.సి.డి, యునెస్కొ, ఇంటర్పోల్, ఎలియన్స్ బేస్, " ఇంటర్ నేషనల్ బ్యూరో ఫర్ వెయిట్స్ అండ్ మెజర్స్ " వంటి సంస్థలకు ప్రధాన స్థావరంగా ఉంది. 1953లో ఐక్యరాజ్యసమితి ఫ్రాన్స్ ను దానికి అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం వహించే ఒక సైనిక కోట్‌ను ఎంపిక చేయవలసినదిగా అభ్యర్థించింది. ఆ విధంగా ఫ్రెంచ్ చిహ్నం అంగీకరించబడి ప్రస్తుతం పాస్ పోర్ట్ లపై వాడబడుతోంది.

ఫ్రెంచ్ విదేశాంగ విధానం ఎక్కువగా ఐరోపాసమాఖ్య సభ్యత్వంచే రూపుదాలుస్తుంది. అందులో ఫ్రాన్స్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఖండాంతర ఐరోపాలో తన స్వంత ఉనికిని నిర్మించడానికి ప్రయత్నిస్తూ, 1960లలో సంస్థ నుండి బ్రిటిష్ వారిని వదలి వేయవలసినదిగా ఫ్రాన్స్ కోరింది. 1990ల నుండి యూరోపియన్ సమాఖ్యలో అధిక ప్రభావవంతమైన శక్తిగా ఎదగడానికి ఫ్రాన్స్ పునరేకీకృత జర్మనీతో దగ్గరి సంబంధాలను అభివృద్ధి చేసుకుంది, కానీ దానితో పాటే UKతో శత్రుత్వం , కొత్తగా ప్రవేశించిన యూరోపియన్ దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం ఉన్నాయి.

ఫ్రాన్స్ " నార్త్ అట్లాంటిక్ ట్రియటీ ఆర్గనైజేషన్ " లో సభ్యదేశంగా ఉంది. కానీ అధ్యక్షుడు డి గల్లె పాలనలో దాని విదేశీ భద్రతా విధానాలు యు.ఎస్. రాజకీయ సైనిక ప్రాబల్యానికి గురవుతాయని తనకు తానుగా ఉమ్మడి సైనికనాయకత్వం నుండి తప్పుకుంది. 1990ల ప్రారంభంలో " ఫ్రెంచ్ పోలినేషియా " లో భూగర్భ అణు పరీక్షలకు గాను ఈ దేశం ఇతరదేశాల నుండి చెప్పుకోదగిన విమర్శలను ఎదుర్కొంది. ఫ్రాన్స్ " 2003 ఇరాక్ ముట్టడి " ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివలన యు.ఎస్, యు.కె. లతో ద్వైపాక్షిక సంబంధాలు ప్రయాసకు గురయ్యాయి. ఫ్రాన్స్ దాని పూర్వపు ఆఫ్రికన్ వలసలపై (ఫ్రాంకా ఫ్రిక్) బలమైన రాజకీయ, ఆర్ధిక ప్రభావాన్ని నిలుపుకుంది. " ఐవరీ కోస్ట్ " చాద్ లలోని శాంతి పరిరక్షణ సంస్థలకు ఆర్ధికసహాయం , దళాలను అందచేసింది.

సైన్యం

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
అణు విమాన వాహకం చార్లెస్ డే గుల్లే

ఫ్రెంచి సైనిక దళాలు నాలుగు శాఖలుగా విభజించబడ్డాయి:

  • ఆర్మీ డి టెర్రె (పదాతి దళం)
  • మరైన్ నేషనేల్ (నావికా దళం)
  • ఆర్మీ డి ఎల్'ఎయిర్ (వాయు సేన)
  • జెండర్మెరీ నేషనేల్ (ఈ సైనికదళం జాతీయ గ్రామీణ పోలీసు , మొత్తం ఫ్రెంచ్ సైన్యానికి మిలిటరీ పోలీసుగా వ్యవహరిస్తుంది.)
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రెంచ్ రిపబ్లికన్ గార్డ్.

అల్జీరియన్ యుద్ధం తరువాత నిర్భంద సైనికీకరణ క్రమంగా తగ్గి 2001లో అధ్యక్షుడు " జాక్వెస్ చిరాక్ " చే పూర్తిగా తొలగించబడింది. సైన్యంలోని మొత్తం సభ్యుల సంఖ్య 3,59,000. ఫ్రాన్స్ దాని జి.డి.పి.లో 2.6% రక్షణకు ఖర్చు చేస్తుంది. ఇది " యునైటెడ్ కింగ్ డం " (2.4%) కంటే స్వల్పంగా అధికం. జి.డి.పి లో 1.5% కంటే తక్కువ మాత్రమే సాధారణంగా రక్షణకు ఖర్చుచేసే ఐరోపా సమాఖ్యలో అత్యధికం. ఫ్రాన్స్, యు.కె. రక్షణ వ్యయం ఐరోపా సమాఖ్య వ్యయంలో 40% ఉంది. ఫ్రాన్స్ రక్షణ బడ్జెట్లో దాదాపు 10% ఫోర్స్ డి ఫ్రాపే , (అణ్వాయుధ దళం) నికి ఖర్చవుతుంది.

ఫ్రాన్స్ బృహత్తర సైనిక పరిశ్రమలను కలిగి ఉంది. అవి ఉత్పత్తిచేసిన వాటిలో రాఫెల్ ఫైటర్, చార్లెస్ డి గల్లె (వైమానిక వాహకం), ఎక్సోసెట్ (క్షిపణి), లేక్లేర్క్ (ట్యాంక్) ఇతరాలు ఉన్నాయి. ఇ-2 హాక్ఐ (ఇ-3 సెంట్రీ) వంటి కొన్ని ఆయుధాలు యునైటెడ్ స్టేట్స్ నుండి కొనుగోలు చేయబడ్డాయి. యూరోఫైటర్ ప్రకల్పన నుండి విరమించుకొన్నప్పటికీ, యూరోకాప్టర్ టైగర్, బహుళార్ధ సాధక యుద్ధనౌకలు, యు.సి.ఎ.వి. ప్రదర్శించే న్యూరాన్, ఎయిర్ బస్ ఎ400ఎమ్ వంటి యూరోపియన్ సంయుక్త సంస్థలలో ఫ్రాన్స్ ఆసక్తితో పెట్టుబడులు పెడుతోంది.

ఫ్రాన్స్ ఆయుధశాల నుండి విదేశీ విపణికి లభించే నమూనాలలో అధికభాగం అణు-శక్తి ఆయుధాల మినహాయింపులతో ఉండటం వలన అది పెద్ద ఆయుధ అమ్మకందారుగా ఉంది. ఫ్రాన్స్‌లో రూపొందించబడిన " ఫ్రాంకో-స్పానిష్ స్కార్పీన్ " తరగతి జలాంతర్గాములు వంటివి కొన్ని ప్రత్యేకించి ఎగుమతి కొరకు రూపకల్పన చేయబడ్డాయి. శక్తివంతమైన యుద్ధనౌకలు (లా ఫఎట్టే తరగతిపై ఆధారపడినవి) లేక " హష్మట్ తరగతి జలాంతర్గాములు " (అగోస్త వర్గ జలాన్తర్గాములపై ఆధారపడినవి) వంటివి కొన్ని మిత్రదేశాల అవసరాలకు అనుగుణంగా మార్చబడ్డాయి.

  • దీనిలో మంచి సామర్థ్యం కలిగిన ఉగ్రవాద-వ్యతిరేక విభాగాలైన జి.ఐ.జి.ఎన్. (ఇ.పి.ఐ.జి.ఎన్) వంటివి ఉన్నప్పటికీ, జెండర్మేరీ సైనిక పోలీసు బలగం అధికభాగం గ్రామీణ, పోలీసు బలగంగా సేవలనందిస్తోంది. దానిని సృష్టించినప్పటినుండి జి.ఐ.జి.ఎన్. సుమారు వేయి కార్యక్రమాలలో పాల్గొంది , ఐదు-వందలకు పైగా బంధితులకు విముక్తిని ప్రసాదించింది " ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 8969 " హైజాకింగ్ దీనిని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.
  • ఫ్రెంచ్ నిఘా వ్యవస్థ రెండు ముఖ్య విభాగాలను కలిగిఉంది: డి.జి.ఎస్.ఇ. (విదేశీ సంస్థ), డి.సి.ఆర్.ఐ. (దేశీయ సంస్థ). దేశీయసంస్థ పోలీసు వ్యవస్థలో భాగంగా ఉండగా విదేశీ సంస్థ సైన్యానికి సహాయకంగా ఉంది. డి.జి.ఎస్.ఇ. " రైన్బో వారియర్ ముంచివేత "తో అపకీర్తి పొందింది. కానీ అది ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ లో " వ్లాదిమిర్ వెట్రోవ్ " అనే గూఢచారి ద్వారా బాగా విస్తృతమైన సాంకేతిక గూడచార వ్యవస్థను వెలికి తీయడంలో పేరుపొందింది.
  • ఫ్రెంచ్ “ఫోర్స్ డి ఫ్రాప్పే ” సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని విశ్వసిస్తుంది. ప్రస్తుతం ఫ్రెంచ్ అణుసైన్యం ఎం45 బాలిస్టిక్ క్షిపణులను కలిగిన నాలుగు జలాంతర్గాములను కలిగిఉంది. ప్రస్తుత ట్రియోమ్ఫేంట్ తరగతిని ఇంతకుముందున్న రిడౌటబుల్ తరగతి స్థానంలో ప్రవేశపెడుతున్నారు. ఎం.51 భవిష్యత్తులో ఎం.45 స్థానాన్ని ఆక్రమించి ట్రియోమ్ఫేంట్ కాల్పుల దూరాన్ని పెంచుతుంది. జలాంతర్గాములతో పాటు ఫ్రెంచ్ తిరుగుబాటు దళం " మిరేజ్ 2000ఎన్ " ను ఉపయోగిస్తుంది. ఇది మిరేజ్ 2000 రూపాంతరం ఆవిధంగా అణు దాడులను చేయడానికి రూపొందించబడింది. ఇతర అణు ఆయుధాలలో ప్లాట్యూ డి'అల్బియోన్ మధ్యతరహా-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి స్వల్పశ్రేణి హడీస్ క్షిపణులను ఆయుధాలలో ఉపయోగించడంలేదు. 350 అణు ఆయుధాలను ప్రోగుచేసుకొని ఫ్రాన్స్ ప్రపంచంలోని మూడవ పెద్ద అణుశక్తిగా ఉంది.
  • " మరైన్ నేషనేల్ " ప్రపంచంలోని అత్యుత్తమ నావికాదళంగా గుర్తించబడుతోంది. 2006లోని కూర్పు వృత్తిపరమైన సంగ్రహమైన ఫ్లోట్టేస్ డి కంబాట్స్ అమెరికన్, రష్యన్, చైనీస్, బ్రిటిష్, జపనీస్ నౌకాదళాల తరువాత ఆరవ పెద్ద నావికాదళ స్థానాన్ని పొందింది. ప్రపంచంలో అమెరికన్లవి కాని అణుశక్తి సహిత విమానవాహకాలను కలిగి ఉంది ఇది ఒక్కటే. ఇటీవలే లెబనాన్ కార్యకలాపాలలో పాల్గొన్న " మిస్త్రాల్ " తరగతి ఓడలు మరైన్ నేషనేల్‌లో చేరాయి. 2004 శాతాబ్దిక ఎంటిటీ కార్దిఎల్‌లో " భవిష్యత్ ఫ్రెంచ్ విమాన వాహకాలు " గ్రేట్ బ్రిటన్‌తో కలిసి ఉమ్మడిగా రూపొందించబడతాయని అధ్యక్షుడు చిరాక్ ప్రకటించారు. ఫ్రెంచ్ నావికాదళంలో " లా ఫఎట్టే తరగతికి చెందిన యుద్ధనౌకలు ", పాతరకపు గూఢచార నౌకలు వంటి వాటిని కలిగిఉంది. చాలా నౌకలు రానున్న కొద్ది సంవత్సరాలలో విరమింపబడి వాటి స్థానంలో ఆధునిక నౌకలు ప్రవేశ పెట్టబడుతున్నాయి. భవిష్యత్ ఉపరితల నౌకలైన ఫోర్బిన్, అక్విటైన్ తరగతి యుద్ధనౌకలు వీటికి ఉదాహరణలుగా ఉన్నాయి. " ఫోర్స్ వోషనిక్ స్ట్రాటజిక్ " లో దాడి చేసే జలాంతర్గాములు భాగమైనప్పటికీ అవి అణుదాడిలో భాగం కావు, ప్రస్తుత తరగతి " రుబిస్ తరగతి " భవిష్యత్ లో " సఫ్రెన్ తరగతి " తో మార్పిడి చేయబడతాయి.
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఒక ఫ్రెంచ్ సైన్యపు సైనికుడు.
  • ఆర్మీ డి టెర్రె 133,500 మంది సిబ్బందిని కలిగిఉంది. ఫ్రెంచ్ ప్రత్యేక దళాలు సమూహంగా లేనప్పటికీ లీజియన్ ఎట్రంజీర్ (ఫ్రెంచ్ విదేశీదళం) ప్రసిద్ధి చెందింది కానీ ఫ్రెంచ్ ప్రత్యేక దళాలు లేజియన్లు కాక " డ్రాగన్స్ పారాచుటిస్తేస్ " మరిన్స్ పారాచుటిస్తేస్. ఫ్రెంచ్ సైన్యం దాడి చేయడానికి ఉపయోగించే తుపాకీ ఫమాస్. భవిష్యత్ పదాతిదళ దాడి వ్యవస్థ ఫీలిన్. ఫ్రాన్స్ ముఖ్యమైన ప్రదేశాలకు రైలు మార్గము, , చక్రాల వాహనాలను రెండిటినీ ఉపయోగిస్తుంది, చక్రాల వాహనాలకు ఉదాహరణలలో సీజర్ (ఎ.ఎం.ఎక్స్. 10 ఆర్.సి). దాని ముఖ్య యుద్ధనౌక " లెక్ లెర్క్ " అయినప్పటికీ ఎ.ఎం.ఎక్స్. 30 వంటి పురాతన టాంకులు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఇది ఎ.ఎం.ఎక్స్ 30 ఎ.యు.ఎఫ్.ను ఫిరంగుల కొరకు ఉపయోగిస్తుంది. " యూరోకాప్టర్ టైగర్స్ " హెలికాప్టర్స్ ను కలిగి ఉంది.
  • " ఆర్మీ డి ఎల్'ఎయిర్ " ప్రపంచంలోని పురాతన , మొట్టమొదటి వాయుసేన. అది ఇప్పటికీ ఒక గుర్తించదగిన సామర్ధ్యాన్ని నిలుపుకుంది. అది ముఖ్యంగా రెండు యుద్ధవిమానాలను ఉపయోగిస్తుంది: పురాతనమైన " మిరేజ్ ఎఫ్ 1 " ఇటీవలి ఆధునిక మిరేజ్ 2000. ఉపరితలంపై దాడిచేయగల తరువాత నమూనాను " మిరేజ్ 2000డి " అని పిలుస్తారు. ఆధునిక " రాఫెల్ " ను ఫ్రెంచ్ వాయుసేన, నౌకాదళం రెండిటిలోనూ ప్రవేశపెట్టారు.

రవాణా వ్యవస్థ

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఒక టి.జి.వి. సుడ్-ఎస్ట్ (TGV Sud-Est, అక్షరాలా "టి.జి.వి. ఆగ్నేయం" లేదా "టి.జి.వి. దక్షిణ-తూర్పు").

విస్తారమైన ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థ 31,840 కిలోమీటర్లు (19,784 మై) పొడవుతో పశ్చిమ ఐరోపా‌లో అధిక విస్తృతమైందిగా ఉంది. ఇది ఎస్.ఎన్.సి.ఎఫ్. చే నిర్వహించబడుతుంది. అధిక వేగపు రైళ్ళలో థాలిస్, యూరోస్టార్, టి.జి.వి. ఉన్నాయి. ఇవి 320 కి.మీ. (199 మై) మధ్య వాణిజ్య అవసరాలకు ఉపయోగించబడుతున్నాయి. యూరోస్టార్, యూరోటన్నెల్ షటిల్‌తో యునైటెడ్ కింగ్డం ఛానల్ టన్నల్‌తో కలుపుతుంది. అండొర్రా మినహా ఐరోపా లోని ఇతర పొరుగు దేశాలన్నిటికీ రైలుమార్గాలు ఉన్నాయి. పట్టణ-అంతర్గత సేవలు కూడా బాగా అభివృద్ధి చెంది భూగర్భ సేవలు, ట్రాం మార్గ సేవలు రెండిటితో బస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫ్రాన్స్‌లో సుమారు 8,93,300 కి.మీ. (5,55,071 మై) పొడవైన సేవలనందించే రోడ్డుమార్గాలు ఉన్నాయి. దేశంలో అన్ని ప్రాంతాలను కలుపగలిగిన విస్తృతమైన రహదారులు, ప్రధాన రహదారులతో పారిస్ ప్రాంతం చుట్టబడింది. పరిసరాలోని బెల్జియం, స్పెయిన్, అండొర్రా, మొనాకో, స్విడ్జర్లాండ్, జర్మనీ ఇటలీల లోని అనేక నగరాలను కలుపుతూ ఫ్రెంచ్ రహదారులు అంతర్జాతీయ ట్రాఫిక్‌ను రవాణా చేయగలుగుతున్నాయి. వార్షిక నమోదు రుసుము లేదా రహదారి పన్నులేదు. అయినప్పటికీ పెద్ద కమ్యూన్ల పరిసరాలలో తప్ప ఇతరప్రాంతాలలో వాహన వాడకం సుంకం ఉంటుంది. రెనాల్ట్ (2003లో ఫ్రాన్స్ లో అమ్మబడిన కార్లలో 27% ), పియగియో (20.1%),సిట్రోయిన్ (13.5%) వంటి దేశీయ బ్రాండ్లు నూతన కార్ల విపణిలో ప్రాధాన్యతవహిస్తూ ఉన్నాయి. 2004లో అమ్మబడిన నూతన కార్లలో 70% డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉన్నాయి. ఇవి పెట్రోల్ (ఎల్.పి.జి) ఇంజిన్ల కంటే చాలా ఎక్కువ. ఫ్రాన్స్ ప్రపంచంలోని అతి ఎత్తైన రోడ్డు వంతెనను కలిగిఉంది: దానిపేరు మిల్లవు వియడక్ట్. అంతేకాక పాంట్ డి నోర్మండీ వంటి అనేక ముఖ్యమైన వంతెనలను నిర్మించింది.

విమానాలు దించే స్థలాలతో కలిపి ఫ్రాన్స్ లో 478 విమానాశ్రయాలు ఉన్నాయి. పారిస్‌కు సమీపంలో ఉన్న " పారిస్-చార్లెస్ డి గల్లే విమానాశ్రయం " దేశంలోని అతిపెద్ద అత్యంత సందడిగల విమానాశ్రయంగా ఉంది. దీనిద్వారా దేశంలోని అత్యధిక ప్రజా, వాణిజ్య రవాణా జరుగుతుంది.ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్దనగరాలతో ఫ్రాన్స్‌ను కలుపుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ అనేది జాతీయ విమానయాన సంస్థ. అయితే దానితోపాటు అనేక ప్రైవేటు విమానయాన సంస్థలు దేశీయ, అంతర్జాతీయ రవాణా సేవలను కల్పిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో పది పెద్ద నౌకాశ్రయాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది మార్సిల్లె. ఇది మధ్యధరా సముద్ర సరిహద్దులలో అతి పెద్దది.ఫ్రాన్స్‌లో 14,932 కి.మీ (9,278 మై) జలమార్గాలు ఉన్నాయి.ఇవి కెనాల్ డు మిడి గరోన్నే నది ద్వారా మధ్యధరా సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో కలుపుతుంది.

పరిపాలనా విభాగాలు

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రాన్స్ మహానగర 22 ప్రాంతాలు, 96 విభాగాలలో కోరిస్కా అంతర భాగం (కర్సే,కుడిప్రక్క కిందవైపు). పారిస్ వైశాల్యం విస్తరించబడినది (ఎడమ ప్రక్క అంతర చిత్రం లో)
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రాంతాలు ఒకే భౌగోళిక కొలమానంలో చూపబడ్డాయి.

ఫ్రాన్స్ 26 పరిపాలక ప్రాంతాలుగా విభజించబడింది. 22 పట్టణప్రాంతాలు (21 పట్టణప్రాంత ఫ్రాన్స్ ఖండాంతర భాగంలోను. ఒకటి కోర్సికా భూభాగ కలయిక) నాలుగు దేశాంతర ప్రాంతాలు. ఈ ప్రాంతాలు ఇంకా 100 విభాగాలుగా విభజించబడ్డాయి. (ప్రధానంగా అక్షరక్రమంలో). ఈ సంఖ్యను తపాలా కోడ్‌ల లోను, ఇతరములతోపాటు వాహనాల సంఖ్యా ఫలకం (నెంబర్ ప్లేట్)లపైన ఉపయోగిస్తారు. ఈ 100 విభాగాలు 341 ఆరోన్దిస్మెంట్స్ విభజింపబడతాయి. అవి తిరిగి ఇవి 4,032 కంటోన్స్ గాను విభజింపబడ్డాయి. ఈ కాన్టోన్స్ మరల 36,680 కమ్యూన్స్‌గా విభజింపబడి,ఎన్నుకోబడిన మునిసిపల్ కౌన్సిల్ కలిగిన మునిసిపాలిటీలుగా ఉంటాయి. ఇంకా ఈ 36,680 కమ్యూన్లలో 33,414 కమ్యూన్లను 2,588 ఇంటర్ కమ్యూన్లుగా విభజించారు (అంటే అన్ని కమ్యూన్లలో 91.1%). మూడు కమ్యూన్ లైన, పారిస్, లియాన్, మార్స్ఇల్లేలు కూడా 45 మునిసిపల్ ఆరోన్దిస్స్మెంట్సుగా ఉపవిభజన చేయబడ్డాయి.

ఈ ప్రాంతాలు విభాగాలు కమ్యూన్లు అన్నీకలిపి భూభాగాలు స్థానికసభలను దానితోపాటు ఒక కార్యనిర్వాహకుడిని కలిగిఉంటాయి. ఆరోన్దిస్సేమెంట్స్, కాన్టోన్ కేవలం పరిపాలనావిభాగాలుగా ఉన్నాయి. ఎప్పుడూ ఈ విధంగానే ఉండదు. 1940 వరకు ఆరోన్దిస్సేమెంట్స్ ఎన్నికకాబడిన సభలను కలిగిన భూభాగాలను ( విచి పాలన) తాత్కాలికంగా నిలిపివేసింది. 1946లో " ఫోర్త్ రిపబ్లిక్ " ద్వారా కచ్చితంగా రద్దుచేయబడింది. చారిత్రాత్మకంగా కాన్టోన్స్ కూడా ఎన్నిక చేసుకోబడిన సభలను కలిగిన భూభాగాలుగా ఉన్నాయి.

ప్రధాన ప్రాంతాలు , విభాగాలు

ప్రాంతం విభాగాలు
అల్ససే బస్-రిన్, హూట్-రిన్
అక్విటనే డోర్డోగ్నే, గిరోండే, లన్డేస్, లాట్-ఎట్-గరోన్నే, పిరినీస్-అట్లాన్టిక్స్
ఆయుర్జెనె అలిఎర్, కాంతల్, హూట్-లోఇర్, పుయ్-డి-డొం
బస్సె- నార్మండీ కాల్వడోస్, మంచే, ఒర్నే
బౌర్గొగ్నే కోటే-డి'ఒర్, నిఎవ్రే, సోనే-ఎట్-లోఇరే, యోన్నె
బ్రెటగ్నే కోటేస్-డి'అర్మొర్, ఫినిస్తేరే, ఇల్లే-ఎట్-విలినే, మొర్బిహన్
సెంట్రే చెర్, యూరె-ఎట్-లోఇర్, ఇంద్రే, ఇంద్రే-ఎట్-లోఇరే, లోఇరేట్, లోఇర్-ఎట్-చెర్
చంపగ్నె- అర్డెన్నే అర్దేన్నస్, ఆబే, హూట్-మారనే, మారనే
కర్సే కర్సే-డు-సుడ్, హుటె-కర్సే
కంటే డౌబ్స్, హుటె-సోనే, జుర, టెర్రితొఇరే డి బెల్ఫోర్ట్
నార్మండీ యూరే, సేఇనే-మారి టైం
ఇలె- డీ-ఫ్రాంసే ఎస్సోన్నే, హుట్స్-డి-సేఇనే, పారిస్, సేఇనే-ఎట్-మారనే, సేఇనే-సెయింట్-డెనిస్, వాల్-డి-మారనే, వాల్-డి'ఒఇసే, య్వేలిన్స్
రుస్సిల్లాన్ ఆడే, గార్డ్, హేరాల్ట్, లోజీరే, పైరినీస్-ఒరిఎన్టేల్స్
లిమౌసిన్ కర్రీజే, క్రేయూస్, హుటె-విఎన్నే
లోరైనే మేఉర్తే-ఎట్-మోసేల్లే, మేయూస్, మోసేల్లే, వొస్జేస్
పైరెనీస్ అరిఈజే, అవేయ్రోన్, గేర్స్, హుటె-గరోన్నే, హుటేస్-పైరినీస్, లోట్, టర్న్, టర్న్-ఎట్-గరోన్నే
నార్డ్-పాస్-డీ-కాలైస్ నోర్డ్, పాస్-డి-కాలిస్
పేస్ డీ లా లోయిరీ లోఇరే-అట్లాంటిక్, మైనే-ఎట్-లోఇరే, మఎన్నే, సార్తే, వెండీ
పికార్డీ ఐస్నే, ఒఇసే, సొమ్మే
పొయిటౌ- చారెంటీస్ చరెంటే, చరెంటే-మారి టైం, డ్యూక్-సివ్రేస్, విఎన్నే
ప్రొవెంస్-అల్పెస్-కోటే డీ అజుర్ అల్పెస్-డి-హుటె-ప్రోవెన్స్, అల్పెస్-మారి టైమ్స్, బౌచేస్-డు-రానే, హుటేస్-అల్పెస్, వార్, వుక్లుసే
రోనె-అల్పెస్ ఐన్, అర్డిచే, ద్రుమే, హుటె-సవోయి, ఇసిరే, లోఇరే, రూనే, సవోయీ

వలస ప్రాంతాలు

ఫ్రాన్స్ 100 విభాగాలలో నాలుగు (ఫ్రెంచ్ గయానా, గుదేలోప్, మార్టినిక్, రియూనియన్) వలస ప్రాంతాలు. అవి ఫ్రాన్స్‌లో సమీకృత భాగాలు (ఐరోపా సమాఖ్య), ఆ విధంగా పట్టణప్రాంత విభాగాలతో సమానమైనస్థానాన్ని పొందుతున్నాయి.

ఈ26 ప్రాంతాలు, 100 విభాగాలతో ఫ్రెంచ్ గణతంత్రం ఆరు వలసప్రాంతాలను (ఫ్రెంచ్ పోలినేషియా, మయోటే, సెయింట్ బార్తిలేమి, సెయింట్ మార్టిన్, సెయింట్ పిఎరీ - మిక్వేలోన్, వాలిస్ - ఫ్యుటున ), ఒక స్యు జెనేరిస్ సమూహం (న్యూ కాలెడోనియా), ఒక వలస ప్రాంతం (దక్షిణ ఫ్రెంచ్ - అంటార్కిటిక్ భూభాగాలు), పసిఫిక్ మహా సముద్రంలోని ఒక ద్వీపం (క్లిప్పేర్టన్ ద్వీపం) కలిగి ఉంది. దూరతీర భూభాగాలు ఫ్రెంచ్ గణతంత్రంలో భాగంగా ఉంటాయి. కానీ అవి ఐరోపా సమాఖ్యలో కానీ దాని ఆర్థిక వ్యవహారాలలో భాగంగా లేవు. ఫ్రెంచ్ పోలినేషియా పసిఫిక్ సమూహాలు, వాలిస్ - ఫార్చ్యున, న్యూ కాలెడోనియా పసిఫిక్ ఫ్రాంకును ఉపయోగించడం కొనసాగిస్తున్నాయి. దీని విలువ యూరో విలువతో జత చేయబడింది. దీనికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ ఫ్రాంక్ ను ఉపయోగించిన నాలుగు దూరతీర ప్రాంతాలు ఇప్పుడు యూరోను ఉపయోగిస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థ

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
టౌలోస్ లో 2005 జనవరి 18న జరిగిన “A380 రెవీల్” ప్రదర్శనలో మొట్టమొదటి పూర్తినిర్మిత ఎయిర్ బస్ A380. ఫ్రెంచ్, యూరోపియన్ యూనియన్ యొక్క ప్రపంచీకరణకు ఎయిర్ బస్ ఒక చిహ్నం.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల నేతృత్వంలోని " జి 8" సమూహంలో ఇది సభ్యదేశంగా ఉంది. నామమాత్ర జి.డి.పి. పరంగా ఐదవ పెద్ద దేశంగా ఉంది. 1999 జనవరి 1న ఫ్రాన్స్ 11 ఇతర ఐరోపాసమాఖ్య సభ్యదేశాలతో కలిసి యూరోను ప్రారంభించింది. 2002 ప్రారంభం నాటికి " యూరో నాణాలులు ", " బాంక్ పత్రాలు " ఫ్రెంచ్ ఫ్రాంకు " స్థానాన్ని పూర్తిగా ఆక్రమించాయి.

విస్తృతమైన ప్రైవేటు సంస్థలతో (సుమారు 2.5 మిలియన్ సంస్థలు నమోదయ్యాయి) బలమైన (తగ్గుతున్నప్పటికీ) ప్రభుత్వ జోక్యంతో ఫ్రాన్స్ ఆర్ధికవ్యవస్థ ఏర్పడింది. రైల్వే, విద్యుచ్ఛక్తి, విమానయానం, దూరసమాచార సంస్థలలో యాజమాన్యం, అవస్థాపనా రంగాల కీలకవిభాగాలలో ప్రభుత్వం చెప్పుకోదగ్గ ప్రభావాన్ని నిలుపుకుంది. 1990ల నుండి ఈ రంగాల మీద దాని నియంత్రణను సడలిస్తోంది. ఫ్రాన్స్ టెలికా, ఎయిర్ ఫ్రాన్స్ సంస్థలతో భీమా, బ్యాంకింగ్, రక్షణ పరిశ్రమలలో గల తన భగస్వామ్యాలను ప్రభుత్వం నెమ్మదిగా విక్రయిస్తుంది. ఫ్రాంస్ యూరోపియన్ కన్సార్టియంచే నడపబడే ఒక ముఖ్యమైన అంతరిక్ష విమాన పరిశ్రమ ఎయిర్ బసును కలిగి ఉంది. తన స్వంత అంతరిక్షకేంద్రం సెంటర్ స్పేషియల్ గయానైజ్ను కూడా కలిగి ఉంది.

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రాన్సు ఎక్కువగా అణుశక్తిపై ఆధారపడ్డది (గొల్ఫెక్ రియాక్టర్).

" వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " నివేదిక ప్రకారం. 2009లో యాంత్రిక తయారీ వస్తువుల ఎగుమతిలో ఆరవ-అతిపెద్ద దేశంగా, దిగుమతిలో ఐదవ-అతిపెద్ద దేశంగా ఉంది. 2008లో ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్స్ $117.9 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన మూడవ-పెద్ద దేశంగా ఉంది. లక్సెంబర్గ్ (అక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆదేశంలోని బ్యాంకులకు ద్రవ్య మార్పిడులుగా ఉంటాయి), యునైటెడ్ స్టేట్స్ ($316.1 బిలియన్లు) తరువాత స్థానం పొందింది, కానీ యునైటెడ్ కింగ్డం ($96.9 బిలియన్లు), జర్మనీ ($24.9 బిలియన్లు), జపాన్ ($24.4 బిలియన్లు)ల కంటే ముందరి స్థానాన్ని పొందింది. ఇదే సంవత్సరంలో ఫ్రెంచ్ సంస్థలు ఫ్రాన్స్ వెలుపల $220 బిల్లియన్ల పెట్టుబడిని పెట్టి ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్స్‌ను బాహ్య ప్రత్యక్ష పెట్టుబడులలో రెండవ అత్యంత ముఖ్య స్థానంలో ఉంచాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ ($311.8 బిలియన్లు)కు తరువాతి స్థానం, యునైటెడ్ కింగ్డం ($111.4 బిలియన్లు), జపాన్ ($128 బిలియన్లు), జర్మనీ ($156.5 బిలియన్లు)ల ముందరి స్థానంలో ఉంది.

ఫ్రాన్స్ అణుశక్తిలో తన భారీ పెట్టుబడులు పెడుతుంది. ప్రపంచంలోని ఏడు అత్యంత పారిశ్రామిక దేశాలలో అతితక్కువ బొగ్గుపులుసు వాయువును విడుదల చేసే దేశంగా ఉంది.. అణు సాంకేతికతలో భారీ పెట్టుబడుల ఫలితంగా, దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యే విద్యుచ్చక్తి 59 అణుశక్తి కేంద్రాల ద్వారా జరుగుతుంది (2006 లో 78%, 1973 లో కేవలం 8%, 1980లో 24%,, 1990లో 75%). ఈ సందర్భంలో, పునరుత్పత్తి చేయగల వనరులు (చూడుము శక్తి సహకారసంస్థ ఏనార్కోప్) వెలికితీతకు ఇబ్బందులను ఎదుర్కొంతునాయి. సారవంతమైన విస్తారమైన భూములు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఐరోపా సమాఖ్య మినహాయింపులు కలిసి ఫ్రాన్స్‌ను వ్యవసాయ ఉత్పత్తులలో, ఎగుమతులలో ఐరోపాలో అగ్రగామిగా నిలిపాయి. గోధుమ, కోళ్ళు, పాడి, గొడ్డు మాంసం, పంది మాంసం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆహార పదార్థాలు, మత్తుపదార్ధాల పరిశ్రమ ఫ్రెంచ్ వ్యవసాయ ఎగుమతులలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రాన్స్‌కు ఐరోపాసమాఖ్య నుండి వ్యవసాయ మినహాయింపులు తగ్గుతున్నాయి. అయినప్పటికీ 2007లో $8 బిలియన్ల వరకూ ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం నుండి ప్రభుత్వం జర్మనీతో రాజకీయంగా, ఆర్థికంగా మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తోంది. నేడు ఈరెండు దేశాలు ఐరోపా సమాఖ్య మరింత దగ్గరవడానికి దోహదంచేసే 'కీలక' దేశాలుగా తరచూ చెప్పబడుతున్నాయి.

శ్రామిక విపణి

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
La Défense, పారిస్,ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు హృదయం వంటిది.

ఫ్రెంచ్ తలసరి జి.డి.పి. ఐరోపా దేశాలైన జర్మనీ, యునైటెడ్ కింగ్ డంల తలసరి జి.డి.పి. ఒకే విధంగా ఉంటాయి. తలసరి జి.డి.పి. నిర్ధారణ ఒక పని గంట ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది.2005లో ఒ.ఇ.సి.డి. ఆధారంగా జి 8 దేశాలలో ఫ్రాన్సులో ఇది అత్యధికంగా ఉంది. (ii) పనిగంటలు అభివృద్ధి చెందిన దేశాలలో అత్యల్పాలలో ఒకటి, (iii) ఉద్యోగితుల శాతం కూడా తక్కువ. 15–64 సంవత్సరాల మధ్య ఉద్యోగితుల శాతం ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్సులో అత్యల్పం: 2004లో, 15–64 సంవత్సరాల మధ్యగల ఫ్రెంచ్ జనాభాలో కేవలం 68.8% మాత్రమే ఉద్యోగం కలిగిఉన్నారు. ఈ రకమైన జనాభా జపాన్లో 80.0%, యు.కె.లో 78.9%, యు.ఎస్.లో 77.2%, జర్మనీలో 71.0% ఉన్నారు.

ఉద్యోగుల శాతం చాల స్వల్పంగా ఉండటం ఈ తేడాకు కారణమైంది:2007లో 55–64 మధ్య వయసుగల జనాభా ఉద్యోగుల శాతం 38.3%, ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 46,6% ఉంది. 15–24 సంవత్సరాల మధ్య వయసుకలిగిన జనాభా ఉద్యోగుల శాతం ఫ్రాన్సులో 2007లో 31,5% ఉండగా ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 37,2% ఉంది. తక్కువ ఉద్యోగుల శాతం కారణాలు ఈవిధంగా వివరించబడుతున్నాయి. తక్కువ ఉత్పాదకత, అత్యంత కనిష్ఠ వేతనాలు యువకార్మికులను శ్రామిక విపణిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. శ్రామిక విపణికి తగినట్లుగా విద్యార్థులను తయారుచేయడంలో విశ్వవిద్యాలయాల అసమర్ధత కూడా మరొక కారణంగా ఉంది. వృద్ధులైన పనివారి విషయంలో పనిపై చట్టపరమైన నియంత్రణలు ముందుగా పదవీ విరమణ చేయుటకు ప్రోత్సాహకాలు ఉన్నాయి.

2006లో 9% నుండి ఉద్యోగుల శాతం ఇటీవల కాలంలో 2008లో 7.2%కి తగ్గినప్పటికీ యూరోప్‌లో ఇప్పటికీ ఇది అత్యధికంగా ఉంది. 2009 జూన్‌లో ఫ్రాన్స్ నిరుద్యోగుల శాతం 9.4% నికి చేరుకుంది. శ్రామిక విపణి సంస్కరణలలో పనిగంటలు తగ్గించడంలో విముఖత ఫ్రెంచ్ ఆర్థికవ్యవస్థలో బలహీనతగా పెర్కొనబడుతుంది. వామపక్ష సాంఘిక న్యాయవిధానాలను ప్రభుత్వం అనుసరించక పోవడం కారణమని మరొక పేర్కొంటుంది. మొత్తం జనాభాలో పనిచేసే ఉద్యోగులసంఖ్యను అభివృద్ధి చేయడానికి, పన్నుల స్థాయిని పరిపాలనా భారాన్ని తగ్గించడానికి ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు ముఖ్య విషయమని ఫ్రెంచ్ ఆర్థిక వేత్తలతో సహా అనేక స్వేచ్చా ఆర్థికవేత్తలు[ఎవరు?] అనేక సంవత్సరాలుగా నొక్కిచెబుతూనే ఉన్నారు. కీన్స్ సిద్ధాంతాన్ని అనుసరించే ఆర్థికవేత్తల నిరుద్యోగ సమస్యకు విభిన్న సమాధానాలను సూచించారు. 2000ల లోని వారి సిద్ధాంతాలు వారానికి 35-పని గంటల చట్టానికి దారితీసాయి. కానీ ఇది నిరుద్యోగితను తగ్గించడంలో వైఫల్యం చెందింది. దాని తరువాత నిరుద్యోగ ఎదుర్కునేందుకు 2004 - 2008 మధ్య ప్రభుత్వం కొన్ని సరఫరా-సంబంధిత సంస్కరణలను తయారు చేసింది కానీ తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కుంది. ప్రత్యేకించి కాంట్రాట్ నౌవేల్లె ఏమ్బుచే, కాంట్రాట్ ప్రేమీరే ఏమ్బుచేతో ప్రతిఘటన వలన చివరకు వాటిని వెనుకకు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం రెవేను డి సోలిడరిటీ అక్టివేను అందుకుంటోంది.

పర్యాటకం

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
వేర్సైల్లెస్ భవనం ఫ్రాన్సులో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి.

2007లో 81.9 మిలియన్ల విదేశీ సందర్శకులతో ఫ్రాన్సు ప్రపంచ సందర్శక స్థలాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇది స్పెయిన్ (2006లో 58.5 మిలియన్లు), యునైటెడ్ స్టేట్స్ (2006లో 51.1 మిలియన్లు)ను అధిగమించింది. ఈ 81.9 మిలియన్ల సంఖ్యలో వేసవికాలంలో స్పెయిన్ నుండి ఇటలీకి వెళ్ళే మార్గంలో ఫ్రాన్సును దాటేసమయంలో అక్కడ 24 గంటలకంటే తక్కువకాలం ఫ్రాంసులో ఉండే ఉత్తర యూరోపియన్ల సంఖ్య మినహాయించబడింది. ఫ్రాన్సులో సాంస్కృతిక ఉన్నతి కలిగిన నగరాలలో (పారిస్ అన్నిటికంటే ముందుండేది), తీరప్రాంతాలు, సముద్రతీర విశ్రాంతిమందిరాలు, హిమ విశ్రాంతిమందిరాలు, సౌందర్యం, ప్రశాంతతతో అనేకులను ఆనందపరచే గ్రామీణ ప్రాంతాలను కలిగిఉంది. సాధారణ సందర్శకులతో పాటు ఫ్రాన్సు హుటేస్-పిరీనీస్ డిపార్ట్మెంట్ నందుగల " లౌర్డస్ " నగరానికి ప్రతి సంవత్సరం అనేక మిలియన్ల మంది మతపరమైన సందర్శకులను ఆకర్షిస్తుంది.

ఇతర ప్రజాదరణ పొందిన దర్శనీయ స్థలాలలో: (2003 స్థాన పట్టిక వార్షికక సందర్శకులను అనుసరించి): ఈఫిల్ టవర్ (6.2 మిలియన్లు), లౌవ్రే సంగ్రహశాల (5.7 మిలియన్లు), వేర్సైల్లెస్ రాజప్రాసాదం (2.8 మిలియన్లు), మూసీ డి'ఒరసి (2.1 మిలియన్లు), ఆర్క్ డి ట్రియమఫే (1.2 మిలియన్లు), సెంటర్ పోమ్పిడౌ (1.2 మిలియన్లు), మోంట్-సెయింట్-మిచెల్ (1 మిలియన్), చాటెయు డి చంబోర్డ్ (711,000), సెయింట్యే-చపెల్లే (683,000), చాటేయు డు హూట్-కానిస్బర్గ్ (549,000), పుయ్ డి డొమే (500,000), మూసీ పికాస్సో (441,000), కార్కాస్సోన్నే (362,000).

జనాభా విజ్ఞానం

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
1999 జనాభా లెక్కల ప్రకారం ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క జన సాంద్రత.
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
100,000 పైగా నివాసితులతో ఉన్న ఫ్రెంచ్ మహా నగరాలు.

ఫ్రాన్స్ జనసంఖ్య 65.1 మిలియన్లు. ప్రపంచపు అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 19వ స్థానంలో ఉంది. ఫ్రాన్స్ లోని పెద్ద నగరాలు పారిస్, మార్స్ ఇల్లే, లయోన్, లిల్లే, తౌలౌస్, నైస్, నాన్టేస్.

2003లో ఫ్రాన్స్ సహజ జనాభా పెరుగుదల (వలస జనాభా లేకుండా) యూరోపియన్ సమాఖ్యలో సహజ జనాభా పెరుగుదలకు బాధ్యత వహిస్తూ ఉంది. 2004లో జనాభా పెరుగుదల 0.68% ఉంది. 2005లో సంతానోత్పత్తి శాతం పెరగటం కొనసాగింది. 2006లో జననాల సహజ పెరుగుదల మరణాలకంటే 2,99,800 ఎక్కువగా ఉంది. మొత్తం సంతానోత్పత్తి రేటు 2002లో 1.88 నుండి 2008 నాటికి 2.02కు అధికరించింది.

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
ఫ్రాన్సు యొక్క వారసత్వ సంపద:ఫ్రాంకోఫోన్ ప్రపంచ పటం.[166][167][168][169]

2004లో ఫ్రాన్స్‌కు 1,40,033 మంది వలస వచ్చారు. వారిలో 90,250 మంది ఆఫ్రికా నుండి, 13,710 మంది ఐరోపా నుండి వచ్చారు. 2005లో వలసస్థాయి కొద్దిగా తగ్గి 135,890కు చేరింది.

" 1789 విప్లవ " మూలాలతో " 1958 నాటి రాజ్యాంగం "లో తిరిగి ధ్రువపరచబడిన చట్ట ఆధారంగా ఫ్రెంచ్ ప్రభుత్వం సంస్కృతి , జాతిని గురించి సమాచారాన్ని సేకరించడం చట్టం అంగీకరించదు. ఏదిలేకున్నా ఫ్రాన్స్ ఆరు మిలియన్ల ఉత్తర ఆఫ్రికన్లు, సుమారు 2.5 మిలియన్ల నల్లవారితో సాంస్కృతికంగా వైవిధ్యభరిత దేశంగా ఉంది. ప్రస్తుత ఫ్రెంచ్ జనాభాలో 40% విభిన్న వలస వారసత్వం కలిగిన ప్రజలు ఉన్నారని తెలియజేసింది. " ఫ్రెంచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్ స్టడీస్ " వారి అంచనా ప్రకారం ఆదేశంలో 4.9 మిలియన్ల విదేశాలలో జన్మించిన వలసదారులుండగా వారిలో 2 మిలియన్ల మంది ఫ్రెంచ్ పౌరసత్వాన్ని స్వీకరించారు. 2005లో 50,000 దరఖాస్తులతో (2004లో కంటే 15% తక్కువ) ఫ్రాన్స్ పశ్చిమ ఐరోపాలో శరణార్ధ గమ్యస్థానాలలో ముందున్నది. ఫ్రెంచి ఐరోపా సమాఖ్య సభ్యదేశాల మధ్య స్వేచ్ఛాయుత కదలికలకు వీలు కలిగిస్తుంది. ఐర్లాండ్లో విధమైన నియంత్రణలు పెట్టనప్పటికీ " తూర్పు ఐరోపా " వలసలను అరికట్టేందుకు ఫ్రాన్స్ నియంత్రణలను ప్రవేశపెట్టింది.

శాశ్వతమైన రాజకీయ గ్రామీణ జనాభాతరుగుదలకు కారణంగా ఉంది. 1960–1999ల మధ్యకాలంలో పదిహేను గ్రామీణ విభాగాలు జనాభా తరుగుదలను చూసాయి. క్రేయూస్ జనాభా 24%తో తగ్గడం అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ఆర్ధారంగా 1992 నుండి ఫ్రెంచిలో ఫ్రెంచి ఏకైక అధికారిక భాషగా ఉంది. ఇది ఫ్రాన్స్‌ను పశ్చిమ యూరోపియన్ దేశాలలో (చిన్న రాజ్యాలను మినహాయించి) ఒకే ఒక అధికార భాష కలిగిన ఏకైక దేశంగా చేసింది. ఏదేమైనా ప్రధాన ఫ్రాన్స్‌ వలస భూభాగాల్లో 77 ప్రాంతీయ భాషలు మాట్లాడబడతాయి. ఇటీవలి కాలం వరకు ఫ్రెంచ్ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ వీటిలోని ఏ భాష ఉపయోగాన్నీ ప్రోత్సహించలేదు. కానీ నేడు అవి కొన్ని పాఠశాలలలో అనేక స్థాయిలలో బోధించాబడుతున్నాయి. పోర్చుగీస్, ఇటాలియన్, మఘ్రేబి అరబిక్,బెర్బెర్ భాషలు వంటి ఇతర భాషలు వలస వాదులచే మాట్లాడబడుతున్నాయి.

మతం

ఫ్రాన్స్ మతపరమైన స్వేచ్ఛను రాజ్యాంగ హక్కుగా కలిగిన ఒక లౌకికవాద దేశంగా ఉంది. జనవరి 2007లో కాధలిక్ వరల్డ్ న్యూస్ సర్వే ప్రకారం: 51% కాథలిక్ లుగా గుర్తించబడ్డారు, 31% " నాస్తికులుగా " ఉన్నట్లు గుర్తించబడ్డారు(మరొక సర్వే నాస్తికుల వాటా 27% నికి సమానంగా ఉంది), 10% ఇతర మతాలకు చెందినవారు లేదా ఏవిధమైన అభిప్రాయం లేనివారు ఉన్నారు. 4% ముస్లింలు గుర్తించబడ్డారు, 3% ప్రొటస్టన్ట్ లుగా గుర్తించబడ్డారు, 1% బౌద్ధులుగా, 1% యూదులుగా గుర్తించబడ్డారు.

ఇటీవలి కాలంలో జరిగిన యూరో బారోమీటర్ పోల్ 2005 ప్రకారం 34% మంది ఫ్రెంచ్ పౌరులు “తాము ఒక దేవుడున్నట్లు నమ్ముతామని” ప్రతిస్పందించారు, అయితే 27% మంది “ఒక విధమైన ఆత్మ లేదా జీవిత శక్తి ఉన్నట్లు నమ్ముతామని” సమాధానమిచ్చారు 33% “తాము ఏ విధమైన ఆత్మ, దేవుడు, లేదా జీవిత శక్తిని నమ్మమని” తెలిపారు. ఒక అధ్యయనం ప్రకారం ఫ్రాన్స్ లో 32% జనాభా తమని తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. మరొక 32% తమని తాము ఈ విధంగా ప్రకటించుకున్నారు. “దేవుని ఉనికి సందేహాస్పదంగా ఉంది కానీ నాస్తికులు కాదు”.

ఫ్రాన్స్ లోని ముస్లింల సంఖ్య అంచనాలపై విస్తృతమైన భేదాలున్నాయి. 1999 ఫ్రెంచ్ జనాభా లెక్కల ప్రకారం, ఫ్రాన్స్‌లో 3.7 మిలియన్ల మంది ప్రజలు “ముస్లిం విశ్వాసం కలిగినవారు” (మొత్తం జనాభాలో 6.3%). 2003లో ఫ్రెంచ్ ఆంతరంగిక మంత్రిత్వశాఖ మొత్తం ముస్లింల జనాభా ఐదు, ఆరు మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది (8-10%). వరల్డ్ జ్యూయిష్ కాంగ్రెస్ ప్రకారం ప్రస్తుతం ఫ్రాన్స్‌లో యూదు సమూహం సంఖ్య సుమారు 6,00,000 ఉంది. ఇది ఐరోపా లోనే అధికం.

లైసిటే అనే భావన ఫ్రాన్స్ లో 1905 నుండి అమలులో ఉంది. దీనివలన ఫ్రెంచ్ ప్రభుత్వం ఏ మతాన్ని అయినా గుర్తించడాన్ని చట్టపరంగా నిషేధించింది. (సైనిక శిక్షకులకు అల్సస్-మోసేల్లే వంటి చట్టపరమైన స్థాయిలకు తప్ప). మత సంస్థలను మాత్రమే గుర్తిస్తుంది. వ్యావహారిక చట్టప్రకారం అది ఏవిధమైన మతసిద్ధాంతాన్ని ప్రబోధించకూడదు.మత సంస్థలు విధాన-నిర్ణయాలలో కల్పించుకోకుండా ఉండాలి.

కొన్ని నమ్మకాలైన జ్ఞానతత్వం, దేవుని బిడ్డలు, చర్చి ఐక్యత, సౌర దేవాలయ పద్ధతి, విభాగాలుగా భావించబడతాయి, అందువలన ఇవి ఫ్రాన్స్‌లో మతంతో సమానమైన స్థాయిని కలిగిలేవు. "విభాగం" అనేది ఫ్రాన్స్‌లో తిరస్కారాన్ని సూచించే పదంగా భావించబడుతోంది.

ప్రజారోగ్యం

1977లో ఫ్రెంచి ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థకు " వరల్డ్ హెల్త్ ఆరనైజేషన్ ప్రథమ స్థానాన్ని ఇచ్చింది. సాధారణంగా కాన్సర్లు, ఎయిడ్స్ (సిస్టిక్ ఫైబ్రోసిస్) వంటి దీర్ఘ వ్యాధులతో ప్రభావితమైనవారికి వైద్యం అందించబడుతుంది. సగటు జీవనప్రమాణం 79.73 సంవత్సరాలు.

2007 నాటికి ఫ్రాన్స్ నివాసితులలో 1,40,000 మంది (0.4%) ఎయిడ్స్ వ్యాధితో జీవిస్తున్నారు.

ఫ్రాన్స్ ఐరోపా సమాఖ్యలోని ఇతర అన్నిదేశాల వలెనే కొన్ని ప్రాంతాలకు మురుగునీటి పారుదల తగ్గించే విషయంలో ఐరోపా సమాఖ్య నిర్దేశాలకు లోబడి ఉంది. 2006 నాటికి ఫ్రాన్స్ నీటివ్యర్ధాల శుద్ధి ప్రమాణాల లక్ష్యంలో కేవలం 40% మాత్రమే సాధించింది. ఈవిషయంలో ఐరోపా సమాఖ్యలో అతి తక్కువగా సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచింది.

" చంతల్ సిబిరే " మరణం ఫ్రాన్సులో ఇచ్ఛామరణంపై చర్చను పునరుద్ధరించింది.

సంస్కృతి

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
క్లాడ్ మొనేట్,భావ వాద ఉద్యమ నిర్మాత.
2

నిర్మాణకళ

సాంకేతికంగా చెప్పాలంటే ఫ్రెంచి నిర్మాణకళగా పెర్కొనగలిగే నిర్మాణకళ ఏదీలేదు అనడం నిజం కాదు. గోతిక్ నిర్మాణకళ పూర్వనామం ఫ్రెంచి నిర్మాణకళ ( ఓపస్ ఫ్రాన్సిజెనుం) “గోతిక్” అనే పదం తరువాత అందరి చేత అంగీకరించబడింది. కొన్ని ముఖ్యమైన గోతిక్ కేథడ్రాల్, బసిలికాలకు ఉత్తర ఫ్రాన్స్ నిలయంగా ఉంది. వీటిలో మొదటిది " సెయింట్ డెనిస్ బసిలికా " (రాజ సమాధిగా వాడబడింది); ఇతర ముఖ్యమైన ఫ్రెంచ్ గోతిక్ కేథడ్రాలలో నోత్రే-దమే డి చార్ట్రేస్, నోత్రే-దమే డి'ఆమియెన్స ఉన్నాయి. మరొక ముఖ్యమైన గోతిక్ చర్చి " నోట్రే-డేం డి రీంస్‌ "లో రాజులకు పట్టాభిషేకం జరిగేది.

చర్చిలతో పాటుగా గోతిక్ నిర్మాణకళను అనేక మతపరమైన భవనాలకు కూడా ఉపయోగించారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది అవిజ్ఞాన్ లోని " పాలైస్ డెస్ పాపెస్ ".

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
మత వాస్తు శాస్త్రంపై ఫ్రెంచ్ ప్రభావానికి ప్రతినిధిగా సెయింట్ లూయిస్ యొక్క సెయింట్ చాపెల్ ను చెప్పవచ్చు.

మధ్య యుగాలలో చుట్టూ గోడకట్టబడిన కోటలు భూస్వామ్య ప్రభువులు వారి శత్రువులకు తమ శక్తిని చాటుటకు నిర్మించారు. ఉదాహరణకు కింగ్ రెండవ ఫిలిప్ రౌఎన్ కోటను కింగ్ జాన్ నుండి స్వాధీనం చేసుకున్నపుడు. మరొక పెద్దకోటను నిర్మించడానికి ఆయన దానిని పడగొట్టాడు. రక్షణకుడ్యం ఉన్న నగరాలు కూడా సాధారణంగా ఉండేవి, అయితే దురదృష్టవశాత్తు అనేక ఫ్రెంచ్ కోటలు కాలపరీక్షకు నిలబడలేకపోయాయి. అందువల్లనే " రిచర్డ్ ది లయన్ హార్ట్, చెటేవు-గైల్లర్డ్ "తో పాటు " చెటేవు డి లుసిజ్ఞాన్ " కూడా పడగొట్టబడింది. నిలిచి ఉన్న కొన్ని ముఖ్యమైన ఫ్రెంచ్ కోటలలో చినోన్, చెటేవు డి'అన్గేర్స్, చెటేవు డి విన్సున్న్స్ కాతర్ కోటలుగా పిలువబడేవి ఉన్నాయి.

పశ్చిమ ఐరోపాలోని అధికభాగం వలెనే ఫ్రాన్స్ కూడా ఈనిర్మాణకళ ప్రదర్శనకు ముందు " రోమనెస్క్యూ నిర్మాణకళ "ను ఉపయోగిస్తూ ఉండేది. (మూరేస్క్యూ నిర్మాణకళను ఉపయోగించిన ఐబీరియన్ ద్వీపకల్పం దీనికి మినహాయింపు). ఫ్రాన్స్ లో ఉన్న రోమనెస్క్యూ చర్చలకు ఉదాహరణగా తౌలౌస్ లో సెయింట్ సెర్నిన్ బసిలికా క్లునియక్ అబ్బీ శిథిలమయ్యాయి (విప్లవం నెపోలియన్ యుద్ధాల వలన అధికభాగం నాశనమయ్యాయి).

ఫ్రెంచ్ నిర్మాణకళ పరిణామంలో 100 సంవత్సరాల యుద్ధం ముగింపు ఒక ముఖ్య దశగా గుర్తించబడింది. " ఫ్రెంచ్ పునరుజ్జీవన " సమయంలో ఇటలీ, స్పెయిన్ల నుండి అనేక కళాకారులు ఫ్రెంచ్ ఆస్థానానికి ఆహ్వానించబడ్డారు. లోయిర్ లోయలో ఇటాలియన్-ప్రేరణ పొందిన అనేక నివాస భవానాలు నిర్మించబడినాయి. అటువంటి నివాసభవనాలలో చెటేవు డి చంబోర్డ్, చెటేవు డి చేనోన్శివు (చెటేవు డి ఆమ్బొఇసే " ప్రాధాన్యత వహిస్తున్నాయి. మధ్యయుగాల చివరిలో గోతిక్ నిర్మాణకళ స్థానాన్ని " బరోక్యు నిర్మాణకళ " ఆక్రమించింది. ఏదేమైనా ఫ్రాన్స్ లో మతపరమైన పాలనకంటే లౌకికపాలనలో బరోక్యు నిర్మాణకళ గొప్ప విజయాన్ని పొందింది. లౌకిక పాలనలో " వేర్సైల్లెస్ రాజప్రాసాదం " అనేక బరోక్యు లక్షణాలను కలిగిఉంది.

" జులేస్ హర్దౌయిన్ మన్సర్ట్ " బరోక్యు శైలిలో నిర్మించిన ప్రఖ్యాతి చెందిన " లెస్ ఇన్వెలిడెస్ " గోపురం బాగా ప్రభావితం చేసింది. కలిగించిన బరోక్యు నిర్మాణకళ ప్రతిబింబించే ప్రదేశాలలో ఫ్రెంచికి చెందని నాన్సీ లోని ప్లేస్ స్టానిస్లాస్ వంటివి ఉన్నాయి. సైనిక నిర్మాణకళ విభాగంలో వుబాన్ ఐరోపాలోని కొన్ని గొప్ప కట్టడాలను నిర్మించి ప్రభావవంతమైన ఫ్రెంచ్ సైనిక వాస్తుశిల్పి అయ్యారు.

దస్త్రం:Eiffel-tower-2008.jpg
పారిస్, ఫ్రాన్సులకు ఈఫిల్ టవర్ ఒక ప్రసిద్ధ కట్టడం

విప్లవం తరువాత రిపబ్లికన్లు నూతన తరగతివాదం వైపు మొగ్గుచూపారు అయితే ఈ వాదం ఫ్రాన్సులో విప్లవానికి పూర్వమే పరిసియన్ పాంతియాన్ లేక కపిటలే డి తౌలౌసే వంటి భవనాలతో ప్రవేశపెట్టబడింది. ఫ్రెంచ్ సామ్రాజ్యంలో నిర్మించబడిన " ఆర్క్ డి త్రియోమ్ఫే సైంటే మారీ-మాడేలీనే " ఈ విధమైన శైలిని ప్రతిబింబిస్తాయి.

మూడవ నెపోలియన్ పాలనలో ఒక నూతన పట్టణీకరణ, నిర్మాణకళ ఊపిరిపోసుకున్నాయి. ఆ కాలంలోని చక్కగా వ్యవస్థీకరించబడిన నగరప్రణాళిక కచ్చితత్వం కారణంగా నూతన-బరోక్యు భవనాలైన, పాలైస్ గార్నియర్, వంటివి నిర్మించబడ్డాయి. ఉదాహరణకు " పారిస్‌లో పునర్నిర్మించబడిన బరోన్ హుస్స్మంన్. ఆంగ్లం మాట్లాడే ప్రాంతాలలో ఈయుగానికి చెందిన నిర్మాణకళ రెండవ సామ్రాజ్యంగా పిలువబడుతుంది. ఈపదం రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం నుండి తీసుకొనబడింది. ఈకాలంలో ఐరోపా అంతటా బలమైన గోతిక్-పునరుద్ధరణ జరగడం గమనించవచ్చు. ఫ్రాన్సులో వాస్తుశిల్పి యూగీనే విఒల్లేట్-లే-డక్ గోతిక్ నిపుణుడుగా ప్రసిద్ధి చెందాడు. 19వ శతాబ్దం చివరిలో గుస్టేవే ఈఫిల్ అనేక వంతెనలకు రూపకల్పనచేసి (గరబిట్ వియడక్ట్ వంటివి) ఆకాలంలో వంతెనలను రూపకల్పన చేసిన అత్యంత ప్రభావమంతమైన వ్యక్తులలో ఒకరిగా ఉన్నారు. అయితే ఆయన ఈఫిల్ టవర్‌కు నిర్మాతగా అధికంగా గుర్తుచేసుకోబడతారు.

20వ శతాబ్దంలో స్విస్ వాస్తుశిల్పి " లీ కార్బూసియర్ " ఫ్రాన్సులో అనేక భవనాలకు రూపకల్పన చేసారు. ఇటీవలికాలంలో ఫ్రెంచ్ వాస్తుశిల్పులు ఆధునిక పురాతన నిర్మాణశైలులను మేళవించారు. పురాతన భవనానికి ఆధునిక వాస్తుకళను మేళవించడానికి " లౌవ్రే పిరమిడ్ " ఒక మంచి ఉదాహరణ. ఫ్రెంచ్ నగరాలకు ఆకాశసౌధాలు గుర్తిపుగా ఉన్నాయి. అవి చాలాదూరం నుండి కనిపిస్తాయి. ఫ్రాన్స్ అతిపెద్ద ఆర్థిక జిల్లా " లా డేఫెన్సే ". ఇక్కడ పెద్ద సంఖ్యలో ఆకాశసౌధాలు ఉన్నాయి. ఇతర భవనాలలో పెద్దభవనాలు వాటి ప్రత్యేకతను తగ్గిస్తూ ఉన్నాయి. మిలావ్ వియడక్ట్ మార్గం దీనికి ఒక మంచి ఉదాహరణగా ఉంది. ప్రఖ్యాతి గాంచిన ఫ్రెంచ్ వాస్తుశిల్పులుగా జీన్ నౌవెల్, పాల్ ఆండ్రూ ఉన్నారు.

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
Comédie-Française లో అత్యధికంగా ఆడబడిన రచయిత మోలీర్

సాహిత్యం

తొలినాటి ఫ్రెంచ్ సాహిత్యం మధ్య యుగాలకు చెందినది. అప్పుడు ఆధునిక ఫ్రాన్స్‌గా పిలువబడే ప్రాంతంలో ఒకే విధమైన భాష లేదు. అనేక భాషలు, మాండలికాలు ఉండేవి. ప్రతి రచయితా తన స్వంత అక్షరక్రమము, వ్యాకరణము ఉపయోగించారు. మధ్య యుగాలనాటి అనేక ఫ్రెంచ్ గ్రంథాలకు రచయితలు ఎవరో తెలియదు. ఉదాహరణకు త్రిస్తాన్ - సేవుల్ట్ " లంసెలోట్ - హోలీ గ్రెయిల్ ". మధ్యయుగాలకు చెందిన ఫ్రెంచ్ కవిత్వం ఎక్కువగా " ఫ్రాన్సు వ్యవహార " ఇతిహాసాల నుండి ప్రేరణను పొందింది. ఉదాహరణకు " ది సాంగ్ అఫ్ రోలాండ్, అనేక చాన్సన్స్ డి గెస్టే వంటివి. 1175లో పెర్రౌట్ డి సెయింట్ క్లౌడేచే రచించబడిన “రోమన్ డి రెనార్ట్” తొలి ఫ్రెంచ్ రచనలకు మరొక ఉదాహరణ. ఇది రెనార్డ్ ('నక్క') కథను తెలియచేస్తుంది. ఈ కాలంలోని కొందరు రచయితల పేర్లు తెలిసాయి. ఉదాహరణకు ఖ్రెటిఎన్ డి ట్రోఎస్ (ఆసిటన్‌లో) రచించినది అక్విటైన్ డ్యూక్ 9 వ విలియం.

16 వ శతాబ్దపు ముఖ్య ఫ్రెంచ్ రచయిత ఫ్రాన్క్వోయిస్ రాబెలిస్ ఆధునిక ఫ్రెంచ్ శబ్ద సముదాయాన్ని, ఉపమానాలను ప్రభావితం చేసాడు. 17వ శతాబ్దంలో పిఎర్రే కార్నియిల్లే, జేయన్ రాసినే మొలీరేల నాటకాలు బ్లైసే పాస్కాల్, రెనీ డెస్కార్టేసుల నీతి, తత్వసంబంధ గ్రంథాలు ఒక గొప్ప సంస్కృతిని తరువాతి దశాబ్దాల రచయితలకు అందించింది. జీన్ డి లా ఫోన్టైనే ఈ శతాబ్దపు ముఖ్య కవిగా గుర్తించబడుతున్నాడు.

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
19 వ శతాబ్దపు కవి,రచయిత,, అనువాదకుడు చార్లెస్ బౌడేలైర్.

ఫ్రెంచ్ సాహిత్యం, కవిత్వం 18 - 19వ శతాబ్దాలలో బాగా అభివృద్ధి చెందాయి. 18వ శతాబ్దం వోల్టైర్, డెనిస్ డిదేరోట్, జీన్-జాక్విస్ రూసో వంటి రచయితలు, వ్యాసకర్తలు, నైతికవేత్తలను చూసింది. చార్లెస్ పెరాల్ట్ పిల్లల కథలను విస్తారంగా వ్రాసే రచయితగా ఖ్యాతి గడించాడు.ఆయన “పుస్ ఇన్ బూట్స్”, “సిన్డరెల్ల ”, “స్లీపింగ్ బ్యూటీ” "బ్లూబియర్డ్ ” వంటి కథలను రచించారు.

చార్లెస్ బాడిలేర్, పాల్ వెర్లైన్]ప్, స్టీఫన్ మల్లర్మీ వంటి కవులతో పందొమ్మిదవ శతాబ్దం చివరి కాలానికి చెందిన సంజ్ఞాత్మక కవిత్వం ఫ్రెంచ్ సాహిత్యంలో ఒక ముఖ్యమైన ఉద్యమంగా రూపొందింది. 19వ శతాబ్దం ఫ్రాన్స్ దేశంలో వెలుపలా ప్రఖ్యాతి చెందిన విక్టర్ హుగో (లెస్ మిసీరబ్లేస్), అలేక్సండ్రే డుమాస్ (ది త్రీ మస్కటీర్స్, ది కౌంట్ అఫ్ మోంటే-క్రిస్టో), జులేస్ వెర్నే (ట్వెంటీ థౌజండ్ లీగ్స్ అండర్ ది సీ) వంటి రచయితలను చూసింది. 19 వ శతాబ్దపు ఇతర కల్పిత కథల రచయితలలో ఎమిలే జోలా, గే డి మపసంట్, థీఒఫిలే గుతిఎర్, స్టెన్ధాల్ ఉన్నారు.

1903 లో ప్రిక్స్ గాన్కోర్ట్ అనే ఫ్రెంచ్ సాహిత్య బహుమతి మొదటిసారిగా ఇవ్వబడింది. 20వ శతాబ్దపు ముఖ్య రచయితలలో మార్సెల్ ప్రౌస్ట్, లూయిస్-ఫెర్డినాండ్ సీలైన్, ఆల్బర్ట్ కాముస్, జీన్-పాల్ సార్త్రే ఉన్నారు. అంటోయినే డి సెయింట్ ఎక్సుపీరి రచించిన లిటిల్ ప్రిన్స్ అనేక దశాబ్దాలపాటు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలలో ప్రజాదరణ పొందింది.

క్రీడ

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
టూర్ డే ఫ్రాన్స్

ప్రజాదరణ పొందిన ఆటలలో ఫుట్ బాల్, రగ్బీ ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్ ఉన్నాయి. ఫ్రాన్స్ 1938 - 1998 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్ లను నిర్వహించింది. 2007 లో రగ్బీ సమాఖ్య ప్రపంచ కప్‌కి ఆతిధ్యమిచ్చింది. పారిస్‌లో ఉన్న " స్టేడే డి ఫ్రాన్స్ " ఫ్రాన్స్‌లో ఉన్న అతి పెద్ద స్టేడియం," లో 1998 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.వరల్డ్ కప్ ఫైనల్ "కు, 2007 రగ్బీ వరల్డ్ కప్ ఫైనల్ కు 2007 అక్టోబరులో ఆతిధ్యమిచ్చింది. ఫ్రాన్స్ ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రసిద్ధిపొందిన టూర్ డి ఫ్రాన్స్ అనే పేరుతొ రోడ్ సైకిల్ పోటీని నిర్వహిస్తుంది. ఫ్రాన్స్ సార్తే డిపార్టుమెంటులో జరిగే " 24 గంటల లే మాన్స్ స్పోర్ట్స్ కార్ " ఓర్పు పోటీకి కూడా ప్రసిద్ధి చెందింది. ఫ్రాన్స్‌లో అనేక ముఖ్యమైన టెన్నిస్ క్రీడాపోటీలు జరుగుతాయి. వీటిలో పారిస్ మాస్టర్స్ నాలుగు గ్రాండ్ స్లాం పోటీలలో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ఉన్నాయి.

ఆధునిక ఒలింపిక్ క్రీడలతో ఫ్రాన్స్‌కు దగ్గరి సంబంధం ఉంది. 19 వ శతాబ్దపు చివరిభాగంలో ఫ్రెంచ్ ధనికుడైన బారన్ పిఎర్రీ డి కోబెర్టిన్ ఈ క్రీడల పునరుద్ధరణ చేసాడు. పురాతన ఒలింపిక్ క్రీడలకు గల గ్రీకు మూలంగా ఉన్నందున మొదటి క్రీడలు ఎథెన్సులో నిర్వహించబడ్డాయి. 1900లో రెండవ క్రీడలకు పారిస్ ఆతిధ్యమిచ్చింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, లుసానేకు మారకముందు పారిస్ మొదటి కేంద్రంగా ఉండేది. 1900లో నిర్వహించిన క్రీడల తరువాత ఫ్రాన్స్ ఒలింపిక్ క్రీడలను నాలుగుసార్లు నిర్వహించింది: 1924 వేసవి ఒలింపిక్స్ మరలా పారిస్లో మూడు శీతాకాల క్రీడలను (1924లో చమోనిక్సులో, 1968 లో గ్రేనోబ్లెలో, 1992లో ఆల్బర్ట్ విల్లె)లో నిర్వహించబడ్డాయి.

జాతీయ ఫుట్ బాల్ జట్టు, జాతీయ రగ్బీ సమాఖ్య జట్టు రెండిటికీ వారి చొక్కా రంగు, ఫ్రెంచ్ జాతీయ ఝండాకు సూచనగా “లెస్ బ్లూస్ ” అనే మారుపేరు పెట్టబడింది. ఈ ఫుట్ బాల్ జట్టు ప్రపంచంలో విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉంది. ప్రత్యేకించి 21వ శతాబ్దపు చివరిలో " 1998లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్ " విజయం, 2006లో ఎఫ్.ఎఫ్.ఐ.ఎ. వరల్డ్ కప్పులో రెండవ స్థానాన్ని, రెండు " యూరోపియన్ చాంపియన్షిప్పు " లను, 1984, 2000లో గెలుచుకుంది. జాతీయస్థాయిలో నిర్వహించబడే ఒకటవ లీగ్ ఉన్నత ఫుట్ బాల్ క్లబ్ పోటీ వీటిలో ఒకటి. రగ్బీ కూడా బాగా ప్రజాదరణ పొందింది. ప్రత్యేకించి పారిస్, నైరుతి ఫ్రాన్సులను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. జాతీయ రగ్బీజట్టు క్రీడలు అన్ని " రగ్బీ వరల్డ్ కప్పులో పోటీ చేసింది. సాంవత్సరిక సిక్స్ నేషన్స్ చాంపియన్షిప్పులో పాల్గొంటుంది. బలమైన దేశీయ పోటీ వలన ఫ్రెంచ్ రగ్బీ జట్టు పదహారు సిక్స్ నేషన్స్ చాంపియన్ షిప్పులలో ఎనిమిది గ్రాండ్ స్లాములను గెలుచుకుంది. రగ్బీ వరల్డ్ కప్పు సెమి-ఫైనస్లుకు చేరుకుంది.

మరియన్నె

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం 
మారియన్

ఫ్రెంచ్ గణతంత్రం గుర్తు మరియన్నె. ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఆమె స్వేఛ్చ, గణతంత్రం రూపాత్మక సంజ్ఞ మొదటిసారి దర్శనమిచ్చింది. మరియన్నే మొట్టమొదటి చిత్రాలు ఫ్రిజియన్ టోపీ ధరించిన మహిళగా ఆమెను సూచించేవి. మరియన్నే మూలాల గురించి తెలియదు. 18వ శతాబ్దంలో అయినప్పటికీ మారీ-అన్నే చాలా సాధారణమైన మొదటి పేరుగా ఉండేది. ఆ కాలంలోని విప్లవ-వ్యతిరేకులు ఆమెను లా గ్యూయూస్ (సాధారణం) అని ఎగతాళి చేసేవారు. దక్షిణ ఫ్రాన్స్ లోని విప్లవకారులు గ్రీసు, రోమ్‌ లలో స్వేఛ్చ పొందిన బానిసలు ధరించిన స్వేచ్చకు సంకేతమైన ఫ్రిగియన్ టోపీని ధరించడం అనుసరించారని విశ్వసిస్తున్నారు. మధ్యధరా నావికులు నేరం ఒప్పుకున్న ఓడల కావలి వారు ఇదే విధమైన టోపీని ధరించేవారు.

మూడవ రిపబ్లిక్కులో మరియన్నే విగ్రహాలు, ముఖ్యంగా నడుము వరకూ ఉండేవి. ప్రత్యేకించి టౌన్ హాల్ లలో విస్తారంగా పెట్టారు. ఆమె విప్లవాత్మక స్వభావాన్ని సూచిస్తున్నారా ( “ జ్ఞానము ” నా ) అనే దానిపై ఆధారపడి ఆమెను అనేక విభిన్న పద్ధతులలో సూచించేవారు. కాలాంతరంలో ఫ్రిగియన్ టోపీ మరీ రెచ్చగొట్టినట్లు భావింపబడి ఒక తల పాగా లేదా కిరీటం దాని స్థానంలో ఉంచబడింది. రోజువారీ వస్తువులైన పోస్టేజ్ స్టాంపులు, నాణాలు ఆమె చిత్రాన్ని కలిగి ఉంటాయి. ఇటీవలి కాలంలో ప్రసిద్ధ ఫ్రెంచ్ మహిళలను, సోఫీ మర్సియు, లేతిషియ కాస్ట వంటి వారిని ఈ విగ్రహాలకు నమూనాగా ఉపయోగిస్తున్నారు.

అంతర్జాతీయ స్థానాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

France గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం  నిఘంటువు విక్షనరీ నుండి
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం  ఉదాహరణలు వికికోట్ నుండి
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

    ప్రభుత్వం
    సంస్కృతి
    సాధారణం
  • ఫ్రాన్స్, BBC నుండి
  • ఫ్రాన్స్, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నుండి
  • France entry at The World Factbook
  • ఫ్రాన్స్ ఎట్ UCB లైబ్రరీస్ గవర్నమెంట్ పబ్లికేషన్స్
  • ఫ్రెంచ్ ఫోన్ పుస్తకం అధికారిక సైట్
  • వాతావరణ సూచన
  • ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో ఫ్రాన్సు
  • ఫ్రాన్సు: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళిక స్వరూపం  Wiki Atlas of France

47°N 2°E / 47°N 2°E / 47; 2

Tags:

ఫ్రాన్సు పేరు వెనుక చరిత్రఫ్రాన్సు చరిత్రఫ్రాన్సు భౌగోళిక స్వరూపంఫ్రాన్సు ప్రభుత్వంఫ్రాన్సు సాంప్రదాయాలు , సంకేతాలుఫ్రాన్సు చట్టంఫ్రాన్సు విదేశీ సంబంధాలుఫ్రాన్సు సైన్యంఫ్రాన్సు రవాణా వ్యవస్థఫ్రాన్సు పరిపాలనా విభాగాలుఫ్రాన్సు ఆర్థిక వ్యవస్థఫ్రాన్సు జనాభా విజ్ఞానంఫ్రాన్సు మతంఫ్రాన్సు ప్రజారోగ్యంఫ్రాన్సు సంస్కృతిఫ్రాన్సు అంతర్జాతీయ స్థానాలుఫ్రాన్సు ఇవి కూడా చూడండిఫ్రాన్సు మూలాలుఫ్రాన్సు బయటి లింకులుఫ్రాన్సుEnglish languageFrench languageఖండం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎస్. వి. కృష్ణారెడ్డికంప్యూటరుజ్యేష్ట నక్షత్రంమహేంద్రసింగ్ ధోనియేసుయునైటెడ్ కింగ్‌డమ్ఈస్టర్తెలుగు సినిమాలు డ, ఢరాశిసోరియాసిస్నామనక్షత్రముఆటలమ్మకావ్య థాపర్శ్రీఆంజనేయంసామజవరగమనపెరిక క్షత్రియులుచెట్టుH (అక్షరం)కీర్తి సురేష్భారత ప్రధానమంత్రుల జాబితాఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంఅయోధ్యతెలుగు కథకిలారి ఆనంద్ పాల్శక్తిపీఠాలుబాలకాండమఖ నక్షత్రముమొదటి పేజీఉగాదిమానవ జీర్ణవ్యవస్థరావి చెట్టుతెలుగు పద్యముభారతదేశంలో కోడి పందాలువృద్ధిమాన్ సాహాఆవర్తన పట్టికపుష్యమి నక్షత్రమునరేంద్ర మోదీమెరుపుప్రకృతి - వికృతిక్షయరాజమండ్రికాలుష్యంమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిషడ్రుచులుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాదివ్యవాణిచిరుత (సినిమా)రచిన్ రవీంద్రభారతదేశ రాజకీయ పార్టీల జాబితాగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుసరోజినీ నాయుడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీదుక్కిపాటి మధుసూదనరావుసావిత్రిబాయి ఫూలేభీమా (2024 సినిమా)2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుతెలంగాణ ఉద్యమంజోల పాటలుమురుడేశ్వర ఆలయంయానాంఇత్తడికిరణజన్య సంయోగ క్రియకుక్కశివమ్ దూబేగాయత్రీ మంత్రంమాంగల్య బలం (1958 సినిమా)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఎయిడ్స్గాలి జనార్ధన్ రెడ్డిఆరుద్రమంగ్లీ (సత్యవతి)రోహిణి నక్షత్రంవిద్యా హక్కు చట్టం - 2009డిస్నీ+ హాట్‌స్టార్జనాభాఆత్మగౌరవంతోట త్రిమూర్తులువ్యాసుడుమీనరాశి🡆 More