రిషబ్ పంత్

రిషబ్‌ పంత్‌ (జననం 1997 అక్టోబరు 4) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు.

ఆయన 2022లో దక్షిణ ఆఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్ కు భారత జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రతినిధ్యం వహించాడు. రిషబ్ పంత్ డిసెంబర్ 2021లో తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు.

రిషబ్ పంత్
రిషబ్ పంత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిషబ్ రాజేంద్ర పంత్
పుట్టిన తేదీ (1997-10-04) 1997 అక్టోబరు 4 (వయసు 26)
రూర్కీ, ఉత్తరాఖండ్, భారతదేశం
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగుకుడి చేతి మీడియం ఫాస్ట్
పాత్రవికెట్‌ కీపర్‌ - బ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
  • భారత జట్టు (2017–ప్రస్తుతం)
తొలి టెస్టు (క్యాప్ 291)2018 18 ఆగష్టు - ఇంగ్లాండు తో
చివరి టెస్టు2022 మార్చి 12 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 224)2018 21 అక్టోబర్ - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే2022 ఫిబ్రవరి 11 - వెస్ట్ ఇండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.17
తొలి T20I (క్యాప్ 68)2017 ఫిబ్రవరి 1 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2022 ఫిబ్రవరి 18 - వెస్ట్ ఇండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.17
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015–ప్రస్తుతంఢిల్లీ
2016–ప్రస్తుతంఢిల్లీ క్యాపిటల్స్ (స్క్వాడ్ నం. 17)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే క్రికెట్‌ టీ20 ఫస్ట్
మ్యాచ్‌లు 30 24 43 54
చేసిన పరుగులు 1,920 715 683 3,772
బ్యాటింగు సగటు 40.85 32.50 24.39 47.15
100లు/50లు 4/9 0/5 0/3 9/17
అత్యుత్తమ స్కోరు 159* నాటౌట్ 85 65* నాటౌట్ 308
క్యాచ్‌లు/స్టంపింగులు 107/11 19/1 13/7 177/18
మూలం: Cricinfo, 14 మార్చి 2022

జూన్ 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన T20I సిరీస్‌కు కెప్టెన్ కె.ఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమవ్వగా రిషబ్ పంత్‌ని భారత కెప్టెన్‌గా నియమించారు.

బాల్యం

రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో రాజేంద్ర పంత్, సరోజ్ పంత్ దంపతులకు జన్మించాడు. 12 సంవత్సరాల వయస్సులో రిషబ్ పంత్ తన తల్లితో కలిసి వారాంతాల్లో సోనెట్ క్రికెట్ అకాడమీలో తారక్ సిన్హా దగ్గర శిక్షణ కోసం ఢిల్లీకి వెళ్లేవాడు. అక్కడ వసతి లేకపోవడంతో మోతీ బాగ్‌లోని గురుద్వారాలో బస చేసేవారు. రిషబ్ తండ్రి ఏప్రిల్ 2017లో గుండెపోటుతో మరణించాడు.

కెరీర్

తారక్ సిన్హా సూచనమేరకు రిషబ్ పంత్ రాజస్థాన్‌ U-13, U-15 క్రికెట్ ఆడటానికి సిద్ధమయ్యాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మెరుగైన బ్యాట్స్‌మన్‌గా రాణించాలని తన బ్యాటింగ్ టెక్నిక్‌ను సరిదిద్దుకున్నాడు. అతను ఆడిన అస్సాంతో ఢిల్లీ తరపున U-19 క్రికెట్ ఆటతో తన కెరీర్ మలుపుతిరిగింది. రిషబ్ పంత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేశాడు.

2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా రిషబ్ పంత్ 2016 ఫిబ్రవరి 1న నేపాల్‌పై 18 బంతుల్లో ఫిఫ్టీని సాధించాడు.

రోడ్డు ప్రమాదం

2022 డిసెంబరు 30న రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి స్వస్థలం ఉత్తరాఖండ్‌ కు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కీ దగ్గర ఆయన ప్రయానిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‎ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆయనని వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.

ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా గాయాల నుంచి కోలుకుంటున్నాడు. ఈ మేరకు ఆయన 2023 ఫిబ్రవరి 8న సోషల్ మీడియా వేదికగా ఒక ఫొటో షేర్ చేసాడు.

మూలాలు

Tags:

రిషబ్ పంత్ బాల్యంరిషబ్ పంత్ కెరీర్రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంరిషబ్ పంత్ మూలాలురిషబ్ పంత్ఉత్తరాఖండ్ఢిల్లీ డేర్ డెవిల్స్దక్షిణ ఆఫ్రికా

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉత్తరాషాఢ నక్షత్రమునందమూరి హరికృష్ణఆంధ్ర విశ్వవిద్యాలయంఅంగచూషణఎండోస్కోపీవాయవ్యంఅక్కినేని నాగార్జునఆవర్తన పట్టికబాల కార్మికులుభారతదేశ చరిత్రకీర్తి రెడ్డిపార్వతీపురం మన్యం జిల్లాజోర్దార్ సుజాతగుమ్మడిరామ్ చ​రణ్ తేజఆతుకూరి మొల్లతెనాలి రామకృష్ణుడుసమాసంవేంకటేశ్వరుడువిడదల రజినిజాంబవంతుడువిజయ్ (నటుడు)లెనిన్రాజ్యసభవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)యాదవతెలుగు సినిమాలు డ, ఢపొడుపు కథలుసూర్య నమస్కారాలువాతావరణంచందనా దీప్తి (ఐపీఎస్‌)అమెరికా సంయుక్త రాష్ట్రాలువావిలిప్రకటనఅక్కినేని నాగేశ్వరరావుమంగ్లీ (సత్యవతి)సురేఖా వాణిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంకొంపెల్ల మాధవీలతవై.యస్. రాజశేఖరరెడ్డిబాల్యవివాహాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంచిరుధాన్యంఅక్షయ తృతీయపెరిక క్షత్రియులుసీతా రామంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసప్తర్షులుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపది ఆజ్ఞలుభారతదేశంహైదరాబాదుసామెతల జాబితాఅవకాడోవై.యస్.భారతికాజల్ అగర్వాల్తాటి ముంజలుఅంతర్జాతీయ ద్రవ్య నిధిఆంధ్ర మహాసభ (తెలంగాణ)మశూచివర్షంతెలుగు కులాలుఉండి శాసనసభ నియోజకవర్గంవై.ఎస్.వివేకానందరెడ్డిపచ్చకామెర్లుఅమితాబ్ బచ్చన్సామజవరగమనవెల్లలచెరువు రజినీకాంత్దేవదాసిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుశ్రీలీల (నటి)సూర్యుడు (జ్యోతిషం)బౌద్ధ మతంపుచ్చనరేంద్ర మోదీసంగీతా రెడ్డితిక్కన🡆 More