తోట త్రిమూర్తులు

తోట త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు.

తోట త్రిమూర్తులు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
19 నవంబర్ 2021 – ప్రస్తుతం
నియోజకవర్గం గవర్నర్‌ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 22 ఏప్రిల్ 1961
వెంకటాయపాలెం గ్రామం, రామచంద్రపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తోట త్రిమూర్తులుతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పుండరీకక్షులు, సూర్యకాంతం
జీవిత భాగస్వామి సూర్య కుమారి

జననం, విద్యాభాస్యం

తోట త్రిమూర్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం, వెంకటాయపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించాడు. 7వ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

తోట త్రిమూర్తులు యువకుడిగా ఉన్న సమయంలోనే రాజకీయాలు పట్ల ఆసక్తి పెంచుకొని గ్రామ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తరువాత 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదుగుతూ వచ్చాడు.

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం1995 లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2004లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి 2008లో నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం వల్ల కాంగ్రెస్ లో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

2014 రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరి 2014లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014-19 వరకు జిల్లా మెట్ట సీమలో వివిధ రూపాల్లో తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా జిల్లా కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడుగా ఏదీగాడు.

తోట త్రిమూర్తులు 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు. తోట త్రిమూర్తులు 2019 సెప్టెంబరు 14లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, 2019 సెప్టెంబరు 15న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2021 జూన్ 14లో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడయ్యాడు. ఆయన 2021 జూన్ 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.

శాసనసభకు పోటీ

సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1994 రామచంద్రపురం జనరల్ గుట్టల శ్రీ సూర్యనారాయణ బాబు తెలుగుదేశం పార్టీ 34027 తోట త్రిమూర్తులు స్వతంత్ర 30923 3104 గెలుపు
1999 రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ 46417 తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 27242 19,175 గెలుపు
2004 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 45604 పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర 53160 7,556 ఓటమి
2009 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం పార్టీ 52558 పిల్లి సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ 56589 4,031 ఓటమి
2012 (ఉప ఎన్నిక) రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 77292 తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 65373 11,919 గెలుపు
2014 రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 85254 తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 68332 16,922 గెలుపు
2019 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ 70,197 చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 75,365 5,168 ఓటమి
2023 మండపేట జనరల్

వివాదాలు

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నాడు. విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టులో 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడిన అనంతరం 2024 ఏప్రిల్ 16న ఈ కేసులో తోట త్రిమూర్తులుకు 18నెల‌ల జైలుశిక్ష‌తో పాటు రూ.2ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. తోట త్రిమూర్తులుతో పాటు ఈ కేసులో 9మంది నిందితులున్నారు.

మూలాలు

Tags:

తోట త్రిమూర్తులు జననం, విద్యాభాస్యంతోట త్రిమూర్తులు రాజకీయ జీవితంతోట త్రిమూర్తులు శాసనసభకు పోటీతోట త్రిమూర్తులు వివాదాలుతోట త్రిమూర్తులు మూలాలుతోట త్రిమూర్తులుఆంధ్రప్రదేశ్ శాసనమండలి

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ రాష్ట్ర సమితిసింధు లోయ నాగరికతఏప్రిల్ 24తిరుపతిమౌర్య సామ్రాజ్యంనారా బ్రహ్మణిమహామృత్యుంజయ మంత్రంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుకాప్చా2024కొణతాల రామకృష్ణవాయు కాలుష్యంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్నువ్వు వస్తావనినవలా సాహిత్యముశ్రీ చక్రంశోభన్ బాబుగోత్రాలుమహాత్మా గాంధీపాల కూరఐక్యరాజ్య సమితితోట త్రిమూర్తులువెంట్రుకభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఉండి శాసనసభ నియోజకవర్గంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభారతరత్నకె. అన్నామలైరఘురామ కృష్ణంరాజుకలియుగంశతక సాహిత్యమునీతి ఆయోగ్అహోబిలంపూరీ జగన్నాథ దేవాలయంభారత జాతీయపతాకంమంగళవారం (2023 సినిమా)ఉప రాష్ట్రపతిఈశాన్యంఏనుగుకంప్యూటరుఉదయం (పత్రిక)తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుటిల్లు స్క్వేర్నోటామిథునరాశిమీనరాశిసన్నిపాత జ్వరంఅండాశయమునిర్వహణస్నేహఅర్జునుడుఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుకల్వకుంట్ల కవితభారత పార్లమెంట్తెలుగు కథబొత్స సత్యనారాయణరుక్మిణీ కళ్యాణంగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంఆరుద్ర నక్షత్రముధర్మవరం శాసనసభ నియోజకవర్గంసిద్ధు జొన్నలగడ్డమ్యాడ్ (2023 తెలుగు సినిమా)జాతీయములుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితామహాభాగవతంవిశాఖపట్నంకృపాచార్యుడుశ్రీలీల (నటి)విశాఖ నక్షత్రముతెలుగు నాటకరంగంరామావతారందీవించండిఅమిత్ షాజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్అయోధ్యవాల్మీకిచంద్రుడు జ్యోతిషం🡆 More