లక్ష్మీనారాయణ వి వి

వాసగిరి లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లాకు చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి.

డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో సొంతరాష్ట్రమైన హైదరాబాద్ లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డైరెక్టర్.

లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ వి వి
లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ)
జననంలక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ)
1965 ,ఏప్రిల్ 3
శ్రీశైలం, కర్నూలు జిల్లా
ఇతర పేర్లులక్ష్మీనారాయణ
ప్రసిద్ధిమహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి

జీవిత విశేషాలు

ఆయన ఏప్రిల్ 3, 1965కర్నూలు జిల్లా శ్రీశైలం లో జన్మించారు. ఆయన వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నందు బాచలర్ ఆఫ్ ఇంజరీరింగ్ పూర్తిచేశారు. తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎం.టెక్ పూర్తి చేశారు. తర్వాత సివిల్ సర్వీసు పరీక్ష ఉత్తీర్ణులై మహారాష్ట్ర కేడర్ ఐ.పి.ఎస్ అధికారిగా చేరారు అతను నందేడ్ లో ఎస్.పి గా పనిచేశారు. తర్వాత మహారాష్ట్ర నందు ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గా పనిచేశారు. ఆయన హైదరాబాదు లో డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు జూన్ 12, 2006 నుండి నిర్వర్తించారు.ఈయన "ఇండియన్ పోలీస్ మెడల్" ను 2006 లో పొందారు

సంచలనాల కేసుల దర్యాప్తు

మొదట్లో ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన వచ్చిన కొత్తలో తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయంలో తలపెట్టిన అవుటర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఇది సద్దుమణిగేలోపే సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయింది. రూ.ఏడు వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసు కొలిక్కి వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని భారీగా అక్రమాలకు పాల్పడ్డ కుంభకోణాల కేసులే. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ వార్తల్లో వ్యక్తి అయ్యారు. అది మొదలు ఓఎంసీ కేసులో వరుసగా అరెస్టులు జరిగాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారి రాజ్‌గోపాల్‌ తదితరులను అరెస్టు చేశారు. దీంతోపాటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్యలను అరెస్టు చేశారు. ఇదే సమయంలో జగన్‌ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులతోపాటు కడప ఎంపీ జగన్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు విషయంలోనే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు తమ పదవులు పోగొట్టుకున్నారు. మరో ఇద్దరు ముగ్గురు మంత్రుల తలలపై కత్తి వేలాడుతోంది.

ఈ కేసుల దర్యాప్తు జరుగుతుండగానే ఓఎంసీ కేసులో అరెస్టయిన గాలి జనార్దనరెడ్డికి అక్రమ పద్ధతుల్లో బెయిల్‌ ఇప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సీబీఐ కన్నేసింది. న్యాయమూర్తులకు పెద్దఎత్తున డబ్బు ముట్టజెప్పి బెయిల్‌ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర ఏసీబీ అధికారులు ఇద్దరు జడ్జీలను, ఒక మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేశారు. ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలో రాజకీయంగా దుమారం రేపిన గనుల కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై నమోదయిన కేసు దర్యాప్తు కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ .రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపైనా ఆయన విచారణ జరిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు కూడా లక్ష్మీనారాయణే దర్యాప్తు జరిపారు. జగన్ అక్రమ ఆస్తుల కేసు తప్ప మిగతా కేసుల దర్యాప్తు దాదాపు పూర్తికావొచ్చింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ల ఎన్ కౌంటర్ల కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యత లక్ష్మీనారాయణకు అప్పగించారు. రాజకీయంగా వివాదాస్పదమైన ఈ కేసులను కూడా లక్ష్మీనారాయణకు అప్పగించడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

బదిలీ

(జేడీ) లక్ష్మీనారాయణ మహారాష్ట్ర వెళ్ళిపోయారు. డిప్యుటేషన్‌పై ఏడేళ్లు సొంత రాష్ట్రంలో సేవలు అందించిన ఆయన గడువు పూర్తయింది. దీంతో ఆయనను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో చెన్నై సీబీఐ విభాగానికి జేడీగా వ్యవహరిస్తున్న అరుణాచలానికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

స్వచ్చంద పదవీ విరమణ

వి.వి. లక్ష్మీనారాయణ 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేయడానికి నిర్ణయించుకుని, ఆ మేరకు తన శాఖలో పదవీ విరమణ ప్రక్రియ ప్రారంభించారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పత్రికలు, మీడియా వ్యాఖ్యానిచ్చాయి.

అవార్డులు, గౌరవాలు

2017 జనవరి 26న లక్ష్మీనారాయణ విశిష్ట సేవలకు గాను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు.

నటించిన సినిమాలు

మూలాలు

యితర లింకులు

Tags:

లక్ష్మీనారాయణ వి వి జీవిత విశేషాలులక్ష్మీనారాయణ వి వి సంచలనాల కేసుల దర్యాప్తులక్ష్మీనారాయణ వి వి బదిలీలక్ష్మీనారాయణ వి వి స్వచ్చంద పదవీ విరమణలక్ష్మీనారాయణ వి వి అవార్డులు, గౌరవాలులక్ష్మీనారాయణ వి వి నటించిన సినిమాలులక్ష్మీనారాయణ వి వి మూలాలులక్ష్మీనారాయణ వి వి యితర లింకులులక్ష్మీనారాయణ వి వికర్నూలుమహారాష్ట్రహైదరాబాద్

🔥 Trending searches on Wiki తెలుగు:

కుండలేశ్వరస్వామి దేవాలయంఆప్రికాట్ఉత్తరాఖండ్వేమనపాఠశాలజాన్వీ క‌పూర్మకరరాశిజానంపల్లి రామేశ్వరరావుఉయ్యాలవాడ నరసింహారెడ్డియేసు శిష్యులునవరసాలుఈజిప్టుపిఠాపురంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుజగ్జీవన్ రాంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపాండవులుభౌతిక శాస్త్రంరాగులుఐక్యరాజ్య సమితిఇండియన్ ప్రీమియర్ లీగ్శాసనసభ సభ్యుడుకిలారి ఆనంద్ పాల్తెలుగు కవులు - బిరుదులుపరిపూర్ణానంద స్వామిభారతీయ శిక్షాస్మృతిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పుష్యమి నక్షత్రముభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377ప్రకృతి - వికృతిచిన్న ప్రేగు90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ఫేస్‌బుక్బంగారంగ్రామ పంచాయతీసర్పిఎనుముల రేవంత్ రెడ్డిచంద్ర గ్రహణంపెళ్ళిపందిరి (1997 సినిమా)నరసింహావతారందత్తాత్రేయజోర్దార్ సుజాతభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసెల్యులార్ జైల్రాబర్ట్ ఓపెన్‌హైమర్వాట్స్‌యాప్మీనాAతాజ్ మహల్ఉత్తరాభాద్ర నక్షత్రమురాజ్యసభతెలుగు సినిమాలు 2023గుణింతంనిర్మలా సీతారామన్కరక్కాయసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిమహామృత్యుంజయ మంత్రంపాముపార్వతినువ్వు నేనుగౌడవందేమాతరంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితారజాకార్లునరసింహ శతకమువావిలిక్వినోవాహృదయం (2022 సినిమా)శివ సహస్రనామాలుభారత జాతీయ కాంగ్రెస్అనిష్ప సంఖ్యతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసోరియాసిస్గుడ్ ఫ్రైడేఅనుష్క శెట్టిమరణానంతర కర్మలుడాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంమహాభారతంయునైటెడ్ కింగ్‌డమ్🡆 More