ఈజిప్టు

ఈజిప్టు, అధికారికనామం ఈజిప్టు అరబ్బి గణతంత్రం, ( ˈiː.dʒɪpt (help·info), ఈజిప్షియన్: కెమెత్; అరబ్బీ : مصر ; (మిస్ర్, మిసర్, మసర్), ఆఫ్రికా ఈశాన్యమూలలో ఉంటుంది.

ఉత్తర ఆఫ్రికాలోని సినై ద్వీపకల్పం ఏర్పరచిన భూవారధి ఈజిప్టుని పశ్చిమ ఆసియా భూవారధిగా చేసింది. ఈజిప్టుకి సరిహద్దులుగా ఉత్తరాన మెడిటేరియను సముద్రము ఈశాన్యసరిహద్దులో గజాస్ట్రిపు, ఇజ్రాయిల్, తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, పశ్చిమసరిహద్దులో లిబియా ఉన్నాయి. తూర్పుసరిహద్దులో అక్వాబా గల్ఫు, ఎర్రసముద్రం ఉన్నాయి. దక్షిణసరిహద్దులో సూడాన్ ఉన్నాయి. అక్వాబా గల్ఫు దాటిన తరువాత జోర్డాను, ఎర్రసద్రం దాటిన తరువాత సౌదీ అరేబియా, మధ్యధరా సముద్రం దాటిన తరువాత గ్రీసు, టర్కీ, సైప్రసు ఉన్నాయి.

جمهورية مصر العربية
జమ్-హూరియత్ మిస్ర్ అల్-అరబియ్యాహ్
ఈజిప్టు అరబ్బి గణతంత్రం
Flag of ఈజిప్టు ఈజిప్టు యొక్క చిహ్నం
జాతీయగీతం

ఈజిప్టు యొక్క స్థానం
ఈజిప్టు యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Cairo
30°2′N 31°13′E / 30.033°N 31.217°E / 30.033; 31.217
అధికార భాషలు Arabic1
ప్రజానామము Egyptian
ప్రభుత్వం Semi-presidential republic
 -  అధ్యక్షుడు Hosni Mubarak
 -  ప్రధాన మంత్రి Ahmed Nazif
స్థాపన
 -  మొదటి రాజవంశం c.3150 BCE 
 -  యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్ర్యం February 28 1922 
 -  గణతంత్ర రాజ్యముగా ప్రకటించబడింది June 18 1953 
 -  జలాలు (%) 0.632
జనాభా
 -  2007 అంచనా 80,335,036 (est.) 
 -  1996 జన గణన 59,312,914 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $329.791 billion (27th)
 -  తలసరి $4,836 (110th)
జినీ? (1999–00) 34.5 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.708 (medium) (112nd)
కరెన్సీ Egyptian pound (EGP)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .eg
కాలింగ్ కోడ్ +20
1 Spoken language is Egyptian Arabic.

ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. ఈజిప్టులో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ఈజిప్ట్ అధికారికంగా పిలవబడే పేరు అరబ్ రిపబ్లిక్ అఫ్ ఈజిప్టు,దీని వైశాల్యము సుమారు 10,10,000 చదరపు కిలోమీటర్లు (3,90,000 చదరపు మీటర్లు),

. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లోని అధిక జనాభా గల దేశాలలో ఈజిప్టు ముఖ్యమైనిది. 7.6 కోట్ల జనాభాలో ఎక్కువ భాగం నైలు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఇది సుమారు 40,000 చదరపు కిలోమీటర్లు (15,000 చదరపు మీటర్లు) వైశాల్యం విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అక్కడే వ్యవసాయానికి అనుకూలంగా సాగుభూమిని కనుగొన్నారు. సహారా ఎడారిలో అధిక భూభాగం ఎవ్వరూ నివసించరు. ఈజిప్టు జనాభాలోని సుమారు సగభాగం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు, వీరిలో ఎక్కువ భాగం అధిక జనసాంద్రత గల కైరో, అలెక్షాన్ద్రియా, మిగతా పెద్ద నగరాలైన నిలే డెల్టాలలో వ్యాపించి ఉన్నారు. ఈజిప్టు పురాతన నాగరికతకు పేరుగాంచినది, ప్రపంచ ప్రసిధి గాంచిన పురాతనమైన, గిజా పిరమిడ్ భవనం, గ్రేట్ స్ఫిన్క్ష్ ఉన్నాయు. లక్షర్ నగరం యొక్క దక్షిణ భాగంలో చాలా పురాతన మైన కట్టడాలు, కర్నక్ గుడి, వ్యాలీ అఫ్ ది కింగ్స్ ఉన్నాయు. మిడిల్ ఈస్ట్ లో ఈజిప్టును ముఖ్యమైన రాజకీయ, సాంసృతిక దేశంగా పరిగణిస్తారు. మిడిల్ ఈస్ట్ లో ఈజిప్టుని ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందిన దేశంగా పేరుగాంచింది. విహారం, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలలో ఈ దేశం ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిలో సగభాగం ఉంటుంది. దీనికి అనుగుణంగా ఈజిప్టు యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులను ఆకర్షించడం కోసం చట్టాలను అమలు చేయడంతో పాటు అమలులోకి తీసుకు రావడం దానితో పాటు అంతరంగిక, రాజకీయ నిచలతతో పాటు అధునాతన వ్యాపారం, విపణి స్వేచ్ఛాతత్వం కలిగి ఉంటుంది.

ప్రపంచదేశాలలో సుదీర్ఘ చరిత్రకలిగిన దేశాలలో ఈజిప్టు ఒకటి. వారసత్వం క్రీ.పూ. 6 వ -4 వ శతాబ్దం మద్యకాలం నుండి గుర్తించబడుతుంది. ఈజిప్టు నాగరికత ఒకానొక నాగరికతకు జన్మస్థానంగా పరిగణించబడుతుంది. ప్రాచీన ఈజిప్టు రచన, వ్యవసాయం, పట్టణీకరణ, వ్యవస్థీకృత మతం, కేంద్ర ప్రభుత్వం, ప్రారంభ అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి. గిజా నెక్రోపోలిసు దాని గ్రేటు స్పింక్సు వంటి స్మారక కట్టడాలు, మెంఫిసు, తెబెసు, కర్నాకు, కింగ్సు లోయ శిథిలాలు ఈ వారసత్వాన్ని, శాస్త్రీయదృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఈజిప్టు జాతీయ గుర్తింపులో సుదీర్ఘమైన సాంస్కృతిక వారసత్వం అంతర్భాగంగా ఉంది. ఇది గ్రీకు, పర్షియను, రోమను, అరబు, ఒట్టోమను టర్కీ, నూబియనులతో పలు విదేశీ సంస్కృతులను ప్రభావితం చేసి తరచూ సమ్మిళితమైంది. ఈజిప్టు క్రైస్తవ మతం ప్రారంభ, ముఖ్యమైన కేంద్రంగా ఉంది. కానీ ఇది 7 వ శతాబ్దంలో ఎక్కువగా ఇస్లాంకరించబడింది. గణనీయమైన క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గం ఉన్నప్పటికీ ప్రధానంగా ముస్లిం దేశంలో ఉంది.

16 వ నుండి 20 వ శతాబ్దం ప్రారంభం వరకు, ఈజిప్టు విదేశీ సామ్రాజ్య శక్తులు: ఒట్టోమను సామ్రాజ్యం, బ్రిటీషు సామ్రాజ్యం పాలించాయి. 1922 నాటికి బ్రిటీషు సామ్రాజ్యం నుండి ఆధునిక ఈజిప్టు రాచరిక వ్యవస్థ నామమాత్ర స్వతంత్రం పొందింది. అయినప్పటికీ ఈజిప్టు బ్రిటీషు సైనిక ఆక్రమణ కొనసాగింది. చాలామంది ఈజిప్షియన్లు బ్రిటిషు వలసవాదానికి రాజరికం ఒక సాధనమని నమ్మారు. 1952 తిరుగుబాటు తరువాత ఈజిప్టు బ్రిటీషు సైనికులను, బ్యూరోక్రాట్లను బహిష్కరించడంతో బ్రిటీషు ఆక్రమణ ముగిసింది. బ్రిటిషుకు ఆధీనంలో ఉన్న సూయజు కెనాలును జాతియం చేసి రాజా ఫరూకును, అతని కుటుంబాన్ని బహిష్కరించి స్వతంత్రం ప్రకటించింది. 1958 లో యునైటెడు అరబు రిపబ్లికును రూపొందించడానికి సిరియాలో విలీనం అయ్యింది. 20 వ శతాబ్దం రెండవ సగభాగంలో ఈజిప్టు 1948, 1956, 1967 ఇజ్రాయెలుతో పలు సాయుధ పోరాటాలు చేస్తూ సామాజిక, మత కలహాలు, రాజకీయ అస్థిరతలను ఎదుర్కొంది. 1973 - 1967 వరకు గాజా స్ట్రిపు అగ్రస్థానంలో ఉంది. 1978 లో ఈజిప్టు క్యాంపు డేవిడు ఒప్పందంపై సంతకం చేసింది. అధికారికంగా గాజా స్ట్రిపు నుండి ఉపసంహరించుకుని ఇజ్రాయెల్ను గుర్తించింది. ఇటీవల 2011 విప్లవం పరిణామాలతో సహా రాజకీయ అశాంతిని, దేశం తీవ్రవాదం, ఆర్థికాభివృద్ధి క్షీణతకు దారితీసింది. ఈజిప్టు ప్రస్తుత ప్రభుత్వం ప్రెసిడెన్షియలు రిపబ్లికుకు అధ్యక్షుడు అబ్దేలు " ఫతేహు ఎల్-సిసీ " నేతృత్వం వహిస్తున్నాడు.

ఈజిప్టు అధికారిక మతం ఇస్లాం, అధికారిక భాష అరబికు. 95 మిలియన్ల మంది నివాసితులతో ఈజిప్టు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, అరబు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేశాల్లో ఒకటిగా ఉంది. ఆఫ్రికాలో మూడవ-అత్యంత జనసంఖ్య కలిగిన (నైజీరియా, ఇథియోపియా తరువాత)దేశంగానూ ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 15 వ స్థానంలో ఉంది. జనాభాలో అధిక భాగం సాగు భూమి అధికంగా ఉండే నైలునదీ తీరంలో నివసిస్తున్నారు. 40,000 చ.కి.మీ. ప్రాంతంలో మాత్రమే నివసిస్తారు. ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈజిప్టు భూభాగంలో అధిక భాగాన్ని కలిగి ఉన్న సహారా ఎడారిలోని విస్తారమైన ప్రాంతాలలో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. ఈజిప్టు నివాసితులలో సగం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఎక్కువ మంది కైరో, అలెగ్జాండ్రియా, నైలు డెల్టాలోని ఇతర జన సాంద్రత గల ప్రధాన నగర ప్రాంతాలలో విస్తరించారు.

ఈజిప్టు సార్వభౌమ రాజ్యం ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ముస్లిం ప్రపంచం ప్రాంతీయ శక్తిగా ప్రపంచవ్యాప్తంగా మధ్యవర్తిత్వ శక్తి పరిగణించబడుతుంది. ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ మధ్యప్రాచ్యంలో అతిపెద్దదైనదిగానూ, వైవిధ్యపూరితమైనదిగానూ ఉంటుంది. 21 వ శతాబ్దంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుతుందని భావిస్తున్నారు. 2016 లో ఈజిప్టు దక్షిణాఫ్రికాను అధిగమించి, నైజీరియా తరువాత ఆఫ్రికా రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఐక్యరాజ్యసమితి, నాన్-అలైండ్ ఉద్యమం, అరబు లీగు, ఆఫ్రికా యూనియన్, ఇస్లామికు సహకార సంస్థ వ్యవస్థాపక సంస్థగా ఉంది.

చరిత్ర

చరిత్రకు పూర్వం

ఈజిప్టు 
Temple of Derr ruins in 1960

నైలుతీర భూభాగంలో, ఎడారి ఒయాసిసులో రాతి శిల్పాలు క్రీ.పూ.10 వ సహస్రాబ్ది వేట-సంగ్రాహకులు మత్స్యకారుల సంస్కృతిని ధాన్యం-గ్రైండింగు సాంస్కృతిక ప్రజలు భర్తీ చేసింది. సుమారుగా క్రీ.పూ. 8000 వాతావరణ పరిస్థితులు, జంతువులు మేత అధికరించడం కారణంగా ఈజిప్టు పచ్చికమైదానాలు క్రమంగా ఎడారిభూములుగా మారి సహారా ఎడారిని రూపొందించాయి. నైలు నదికి వలస వచ్చిన తొలి గిరిజనప్రజలు ఇక్కడ స్థిరపడి వ్యవసాయ ఆర్థికవ్యవస్థ, మరింత కేంద్రీకృత పాలిత సమాజాన్ని అభివృద్ధి చేశారు.

సుమారుగా క్రి.పూ. 6000 నాటికి నైలు నదీప్రాంతాలలో ఒక నియోలిథిక్ సంస్కృతి వేరూనింది. నియోలిథికు కాలంలో పర్వతోన్నత, దిగువ ఈజిప్టులో అనేక సంస్కృతులు స్వతంత్రంగా అభివృద్ధి చెందాయి. బడరియా సంస్కృతి, నఖాడా సంస్కృతులను సాధారణంగా ఈజిప్టుకు పూర్వగామి వమ్శావళిగా భావిస్తారు. ఈజిపుటులోని దిగువభూభాగంలో ఉన్న ప్రాంతం బడరియా సంస్కృతికి సుమారుగా 700 సంవత్సరాలకు పూర్వం ఉంది. సమకాలీన లోవరు ఈజిప్టు సమాజాలు వారి దక్షిణ సహచరులతో కలిసి 2000 సంవత్సరాల కాలం సహజీవనం చేశాయి. ఇవి సాంస్కృతికంగా విభిన్నంగా ఉన్నప్పటికీ వాణిజ్యం ద్వారా తరచుగా ఒకదానితో ఒకటి సంబంధం కొనసాగించాయి. ఈజిప్టు చిత్రలిపికి శాసనాల మొట్టమొదటి సాక్ష్యాలుగా నఖాడా (3 వ) మట్టిపాత్రలు సుమారుగా క్రీ.పూ 3200 నాటివని భావిస్తున్నారు.

ఈజిప్టు 
గిజా నక్రోపోలిసు అనేది ప్రాచీన అద్భుతాలలో అతిపురాతనమైనదిగనూ ఉనికిలో ఉన్న ఏకైక చిహ్నంగానూ గుర్తించబడుతుంది

క్రీ.పూ 3150 రాజా మెనెసు ఏకీకృత సామ్రాజ్యం స్థాపించాడు. ఇది తరువాత 3000 సంవత్సరాల కాలం ఈజిప్టులో వరుస రాజవంశాల పాలన కొనసాగడానికి దారి తీసింది. ఈ సుదీర్ఘ కాలంలో ఈజిప్టు సంస్కృతి వృద్ధి చెందింది. మతం, కళలు, భాష, ఆచారాలలో ఈజిప్టు విలక్షణంగా నిలిచింది. క్రీ.పూ 2700-2200 ఏకీకృత ఈజిప్టు మొదటి రెండు రాజవంశాల పాలన పురాతన సామ్రాజ్యాలకు వేదికగా నిలిచాయి. ఈకాలంలోనే అనేక పిరమిడ్లను నిర్మించబడ్డాయి. ముఖ్యంగా మూడవ రాజవంశం పిరమిడు " జోసరు " నాల్గవ రాజ్యం పిరమిడు గిజా.

150 సంవత్సరాలు రాజకీయ తిరుగుబాటు సమయములో మొదటి మధ్యంతర కాలంగా భావించబడుతుంది. క్రీ.పూ. 2040 నాటికి బలమైన నైలు వరదలు, ప్రభుత్వం స్థిరీకరణ, మధ్య సామ్రాజ్యంలో సంపద తిరిగి పునరుద్ధరింపబడింది.ఇది ఫారో మూడవ అమెనెంహాటు పాలనలో శిఖరాగ్రానికి చేరుకుంది. సెమటికు హైక్సోసు సమైక్యత లోపించిన ఈజిప్టు మీదదాడి చేయడంతో ఈజిప్టులో మొదటి విదేశీ పాలనా సామ్రాజ్యం మొదలైంది. క్రీ.పూ. 1650 లో హైస్కోసు ఆక్రమణదారులు దిగువ ఈజిప్టులో అధిక భాగాన్ని స్వాధీనం చేసుకుని అవరిసులో ఒక కొత్త రాజధానిని స్థాపించారు. మొదటి ఎమ్మోసు నేతృత్వంలోని ఎగువ ఈజిప్టు సైన్యం వారిని తొలగించారు. వీరు 18 వ రాజవంశాన్ని స్థాపించి రాజధానిని మెంఫిసు నుండి తెబెసుకు మార్చారు.

ఈజిప్టు 
ది హెడ్ ఆఫ్ వెయిటింగ్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ది డెడ్ ఆఫ్ ఆని

క్రీ.పూ 1550-1070 నాటికి 18 వ రాజవంశంతో ది న్యూ కింగ్డం ప్రారంభమైంది. ఇది ఈజిప్టును ఒక అంతర్జాతీయ శక్తిగా మార్చింది. ఈ సమయంలో సామ్రాజ్యం దక్షిణంలో నోబియాలోని టోంబోసు, తూర్పున లేవంటు భాగాల వరకు సామ్రాజ్యాన్ని విస్తరించబడింది. ఈ కాలం హట్షెప్సుతు, మూడవ థుట్మోసు, అఖేనాటెను, అతని భార్య నెఫెర్తిటి, టుటన్ఖమును, రెండవ రామెసెసు వంటి ప్రఖ్యాతిగాంచిన ఫారోలకు ప్రసిద్ధి చెందినది. చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారిగా అటెనిజం పేరుతో ఏకీశ్వరోపాసన గుర్తింపు పొందింది. ఇతర దేశాలతో తరచుగా పరిచయాలు న్యూ కింగ్డంకు క్రొత్త ఆలోచనలను తీసుకువచ్చాయి. తరువాత లిబియన్లు, నుబియన్లు, అస్సిరియన్లు ఈ దేశం ఆక్రమించి, స్వాధీనం చేసుకున్నారు. కానీ స్థానిక ఈజిప్షియన్లు చివరికి వారిని వెలుపలకు తరిమి తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అచమనిదు సాంరాజ్యం

ఈజిప్టు 
Egyptian soldier of the Achaemenid army, c. 480 BCE. Xerxes I tomb relief.

క్రీ.పూ. 525 లో రెండవ కాంబిసెసు నాయకత్వంలోని శక్తివంతమైన అచమెనిదు పర్షియన్లు ఈజిప్టును ఆక్రమించడం ప్రారంభించారు. చివరకు ఫెలోసియం యుద్ధంలో ఫారో మూడవ ప్సంటికును స్వాధీనం చేసుకున్నారు. రెండవ కాంబిసెసు ఫారో అధికారిక బిరుదును స్వీకరించాడు. కాని ఈజిప్టును పర్షియాలోని సుసా (ఆధునిక ఇరాన్) నుండి పాలించాడు. ఈజిప్టును సత్రాపీ నియంత్రణలో ఉంచాడు. మొత్తం ఇరవై ఏడవ రాజవంశపాలన మొత్తం (క్రీ.పూ 525-402 ) పర్షియా పరిపాలన కాలం పూర్తిగా అచమెనిదు చక్రవర్తులు ఫరొహు పేరును స్వీకరించారు. క్రీ.పూ. 5 వ శతాబ్దంలో పర్షియన్లమీద కొన్ని తాత్కాలిక విజయవంతమైన తిరుగుబాటులు జరిగాయి. కానీ ఈజిప్షియన్లు పర్షియాని శాశ్వతంగా పడగొట్టలేకపోయారు.

ఫరొనికు శకం సమయంలో 30 వ రాజవంశం స్థానిక పాలకులు పాలించిన చివరి సామ్రాజ్యంగా గుర్తించబడింది. క్రి..పూ. 343 లో చివరి స్థానిక ఫారో రాజు అయిన రెండవ నెక్టనేబొ యుద్ధంలో ఓడిపోయాక తిరిగి పర్షియన్ల వశం అయింది. అయితే 31 వ ఈజిప్టు రాజవంశం దీర్ఘకాలం కొనసాగలేదు. పెర్షియన్లు అనేక దశాబ్దాల తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ చేతిలో పరాజయం పాలయ్యారు. అలెగ్జాండరు గ్రీకు జనరలు టోలెమీ మొదటి సోటరు టోలెమికు రాజవంశాన్ని స్థాపించాడు.

ప్టోల్మాయికు, రోమను ఈజిప్టు

ఈజిప్టు 
The Ptolemaic Queen Cleopatra VII and her son by Julius Caesar, Caesarion, at the Temple of Dendera.

టోలెమైక్ సామ్రాజ్యం ఒక శక్తివంతమైన హెలెనిస్టిక్ రాజ్యం. ఇది తూర్పున సిరియా, పశ్చిమాన సైరెన్, దక్షిణాన నబియా మద్య వ్యాపించింది. అలెగ్జాండ్రియా రాజధాని నగరంగా గ్రీకు సంస్కృతి, వాణిజ్యాలకు కేంద్రంగా మారింది. స్థానిక ఈజిప్షియన్ ప్రజలచే గుర్తింపు పొందేందుకు, వారు తమను ఫరోలకు వారసులుగా పేర్కొన్నారు. తరువాత టోలెమీలు ఈజిప్షియన్ల సంప్రదాయాలను స్వీకరించి ఈజిప్టు శైలి, దుస్తులను బహిరంగ కట్టడాల మీద చిత్రీకరించారు. ఈజిప్టు మతసంప్రదాయాలను అనుసరించారు.

ఆక్టేవియను అలెగ్జాండ్రియాను స్వాధీనం చేసుకున్న తరువాత ఆమె కిరాయి సైనికులు పారిపోయిన తరువాత ఏడవ క్లియోపాత్రా ప్రియుడు మార్కు ఆంటొనీ కత్తితో పొడుచుకుని ఆమె చేతిలో చనిపోయిన తరువాత టోలెమైకు వంశానికి చెందిన చివరి పాలకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అవాంఛిత పాలన ఎదుర్కొనడానికి విదేశీ, పౌర యుద్ధాలలో స్థానిక ఈజిప్షియన్లు టొలేమీలను ఎదుర్కొన్నారు. ఇది రాజ్యంలో క్షీణతకు రోం విలీనానికి దారితీసింది. అయినప్పటికీ ఈజిప్టులో ముస్లింల విజయం తర్వాత హెలెనిస్టికు సంస్కృతి బాగా వృద్ధి చెందింది.

1 వ శతాబ్దంలో సెయింటు మార్కు ది ఇవాంజెలిస్టు క్రైస్తవ మతం క్రైస్తవ మతాన్ని ఈజిప్టుకు తీసుకువచ్చారు. బైజాంటైను శకంలో ఈజిప్టు పాలన రోమను నుండి బదిలీ (డయోక్లేటియను పాలన (284-305 సా.శ.)) చేయబడింది. ఈసమయంలో ఈజిప్టులోని చాలా మంది క్రైస్తవులు హింసకుగురయ్యారు. తరువాత క్రొత్త నిబంధన ఈజిప్టులోకి అనువదించబడింది. సా.శ. 451 లో చల్సను కౌన్సిలు తరువాత దృఢంగా ప్రత్యేకమైన ఈజిప్షియను కాప్టికు చర్చి స్థాపించబడింది.

మద్య యుగం (7 వ శతాబ్ధం – 1517)

ఈజిప్టు 
The Amr ibn al-As mosque in Cairo, recognized as the oldest in Africa

బైజాంటైను-సాసనియన్ యుద్ధం 602-628 మధ్యలో 7 వ శతాబ్దం ప్రారంభంలో కొంతకాలం సాసేనియా పర్షియా దాడి తరువాత ససనియా ఈజిప్టు అని పిలవబడిన ఒక కొత్త స్వల్ప-కాలిక (10 సంవత్సరాల) ప్రావింసును స్థాపించారు. తరువాత బైజాంటైన్లు దేశం నియంత్రణను తిరిగి పొందగలిగారు. తరువాత ముస్లిం అరబ్బుల ఇస్లామికు సామ్రాజ్యం ఈజిప్టును ఆక్రమించి (639-42 ) జయించింది. ఈజిప్టులో బైజాంటైను సైన్యాలను వారు ఓడించిన తరువాత అరబ్బులు సున్నీ ఇస్లాంను దేశంలోకి తీసుకుని వచ్చారు. ఈ కాలంలో ప్రారంభంలో ఈజిప్షియన్లు వారి కొత్త విశ్వాసాన్ని స్థానిక విశ్వాసాల అభ్యాసాలతో కలపడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అది సూఫీ ఆదేశాలుగా అభివృద్ధి చెందాయి. ఈ పూర్వ ఆచారాలు కాప్టికు క్రైస్తవ మతం కాలం ప్రారంభం అయ్యాయి.

639 లో అమరు ఇబ్ను అల్ అస్ ఆధ్వర్యంలో రెండవ ఖలీఫా ఉమరు ఈజిప్టుమీదకు సుమారు 4,000 మంది సైనికులను పంపించారు. ఈ సైన్యం 6,40,000 లో మరో 5,000 మందితో చేరి హెలిపోపోలిసు యుద్ధంలో ఒక బైజాంటైను సైన్యాన్ని ఓడించింది. తరువాత అమరు అలెగ్జాండ్రియా వైపుకు ముందుకు కదిలాడు. 641 నవంబరు 8 న ఒప్పందం సంతకం చేసి అతనికి లొంగిపోయింది. 645 లో అలెగ్జాండ్రియాను బైజాంటైను సామ్రాజ్యం కొరకు స్వాధీనం చేసుకుంది. 646 లో అలెగ్జాండ్రియాను అమరు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 654 లో రెండవ కాంస్టంసుసు పంపిన సైన్యం తిప్పికొట్టబడింది. అప్పటి నుంచీ దేశంలో స్వాధీనం చేసుకొనడానికి బైజాంటైన్లు తీవ్ర ప్రయత్నం చేయలేదు.

అరబ్బులి ఈజిప్టు రాజధానిగా ఫస్టాటును స్థాపించారు. తరువాత ఇది క్రూసేడ్సు సమయంలో దహనం చేయబడింది. 986 సంవత్సరంలో స్థాపించబడిన కైరో అరబు సామ్రాజ్యంలోని అతిపెద్ద ధనిక నగరంగా అభివృద్ధి చెందింది. తరువాత ప్రపంచంలోని అతిపెద్ద సంపన్న నగరాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది.

అభాసిదు సాంరాజ్యం

ఈజిప్టు 
The Ibn Tulun Mosque in Cairo, of Ahmad Ibn Tulun

అబ్బాసీదు కాలంలో కొత్త పన్నులు విధించబడ్డాయి. అబ్బాసిదు పాలన ప్రారంభం అయిన 4 వ సంవత్సరంలో కాప్టులు తిరుగుబాటు చేశారు. 9 వ శతాబ్దం ప్రారంభంలో అబ్దుల్లా ఇబ్ను తాహీరు ఆధ్వర్యంలో ఈజిప్టులో పాలనాబాధ్యతలు నిర్వహించడానికి గవర్నర్లు నియమించబడ్డాౠ.అబ్దుల్లా ఇబ్ను తాహీరు బాగ్దాదు వద్ద నివసించాలని నిర్ణయించుకుని ఈజిప్టు పాలనాబాధ్యతలు నిర్వహించడానికి ప్రతినిధిని పంపాడు. 828 లో మరొక ఈజిప్టు తిరుగుబాటు మొదలైంది. 831 లో కాప్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ప్రభువులతో చేరారు. చివరికి బాగ్దాదు లోని అబ్బాసిదుల పతనం సాధారణ ప్రజలు ఈజిప్టు పాలనను స్వాధీనం చేసుకునేందుకు దారితీసింది. ఇంకా అబ్బాసిదు విధేయత కింద, ఇఖ్షిడులు, తులులీ రాజవంశాలు అబ్బాసిదు కాలిఫేని నిరాకరించడంలో విజయం సాధించాయి.

ఫాతిమిదు కాలిఫేటు, మములక్సు

ఈజిప్టు 
The Al-Hakim Mosque in Cairo, of Al-Hakim bi-Amr Allah, the sixth caliph, as renovated by Dawoodi Bohra

కాలిఫెటు ప్రతిపాదించిన ముస్లిం పాలకులు తదుపరి 6 శతాబ్దాల కాలం ఈజిప్టును నియంత్రించారు. కైరో ఫాతిమిదు కాలిఫెటు స్థానంగా ఉంది. 1250 లో కర్డిషు అయుబిదు రాజవంశం ముగిసేకాలానికి టర్కో-సిర్కాసియను సైనిక కులానికి చెందిన మమ్లుకులు ఈజిప్టు నియంత్రణను స్వాధీనం చేసుకున్నారు. 13 వ శతాబ్దం చివరలో ఈజిప్టు ఎర్ర సముద్రం, భారతదేశం, మలయ, ఈస్ట్ ఇండీసులతో సంబంధాలు అభివృద్ధిచేసింది. 14 వ శతాబ్దం మధ్యలో " బ్లాక్ డెత్ " కారణంగా దేశ జనాభాలో 40% మంది మృతి చెందారు.

ఓట్టమను ఈజిప్టు (1517–1867)

1517 లో ఈజిప్టును ఒట్టోమను తుర్క్కులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇది ఒట్టోమను సామ్రాజ్య ప్రొవింసుగా మారింది. సైనికీకరణ పౌర సమాజజీవితం, ఆర్థిక సంస్థలను దెబ్బతీసింది. ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ బలహీనపడిన ఈజిప్టు ఆర్థికవ్యవస్థను ప్లేగువ్యాధి మరింత అధ్వానస్థితికి చేర్చింది. ఫలితంగా పోర్చుగీసు వర్తకులు ఈజిప్టు వర్తకం మీద ఆధీనత స్వాధీనం చేసుకున్నారు. 1687 - 1731 మధ్య ఈజిప్టులో 6 కరువులు సంభవించాయి. 1784 కరువు కారణంగా జనాభాలో సుమారుగా ఆరవ వంతు క్షీణించింది.

శతాబ్దాలుగా దేశాన్ని పరిపాలించిన సైనిక కులానికి చెందిన మమ్లుకుల నిరంతర అధికారం, ప్రభావం కారణంగా ఓట్టమను సుల్తాన్లకు ఈజిప్టు ప్రొవింసు నియంత్రణ కష్టమైనదిగా ఉండేది.

ఈజిప్టు 
Napoleon defeated the Mamluk troops in the Battle of the Pyramids, 21 July 1798, painted by Lejeune.

మమ్లుకుల నియంత్రణలో ఈజిప్టు పాక్షిక స్వయంప్రతొపత్తిని కలిగి ఉంది. 1798 జూలై 21న న పిరమిడ్ల యుద్ధంలో మామ్లుక్ దళాలను ఫ్రెంచికి చెందిన నెపోలియను బొనపార్టే ఓడించాడు. లెజియూన్ చిత్రించింది. ఫ్రెంచిదళాలు ఈజిప్టును ఓడించిన తరువాత ఈజిప్టులో అధికారశూన్యత ఏర్పడింది. తరువాత ఈజిప్టు నియంత్రణ కొరకు ఓట్టమను టర్కులు, శతాబ్దాలుగా ఈజిప్టును పాలించిన మమ్లుకులు, అల్బానియా కూలిసైనికుల మద్య త్రివిధపోరు కొనసాగింది.

ముహమ్మదు అలి సాంరాజ్యం

ఈజిప్టు 
Egypt under Muhammad Ali dynasty
ఈజిప్టు 
Muhammad Ali was the founder of the Muhammad Ali dynasty and the first Khedive of Egypt and Sudan.

1805 లో ఫ్రెంచిని బహిష్కరించిన తరువాత ఈజిప్టులోని ఒట్టోమను సైన్యం అల్బేనియను సైనిక కమాండరు " ముహమ్మదు అలీ పాషా " అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆయనకు ఈజిప్టు వైస్రాయి బిరుదు ఉన్నందున ఆయనకు ఒట్టోమను నౌకాశ్రయం స్వాధీనం చేసుకోవడం కేవలం నామమాత్రంగా ఉంది.[ఆధారం చూపాలి] మహమ్మదు అలీ మమ్లుకులను మూకుమ్మడిగా హత్యచేసి ముహమ్మదు అలీ రాజవంశాన్ని స్థాపించాడు. ఇది 1952 లో విప్లవం వరకూ ఈజిప్టును పాలించింది.

1820 లో " లాంగు-స్టాపులు " పత్తి పరిచయం ఈ పంటను శతాబ్దం ముగిసేలోపు మోనోకల్చరుగా నగదు-పంట మారింది. భూమి యాజమాన్యాన్ని కేంద్రీకరించింది. ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడింది.

ముహమ్మదు అలీ ఉత్తర సూడాన్ (1820–1824), సిరియా (1833), అరేబియా, అనటోలియా భాగాలను స్వాధీనం చేసుకుని సామ్రాజ్యంలో విలీనం చేసాడు. కానీ 1841 లో ఐరోపా శక్తులు సామ్రాజ్యాన్ని కూల్చివేస్తాయనే భయంతో ఆయన ఓట్టోమన్ల నుండి స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి ఇచ్చేలా వత్తిడికి గురయ్యాడు. ఆయన సైనికప్రధాన ప్రభుత్వం దేశాన్ని ఆధునీకరించాల్సిన అవసరాన్ని ఆయనకు తెలియజేసింది. ఆయన పరిశ్రమలు, నీటిపారుదల, రవాణా కొరకు కాలువల వ్యవస్థను నిర్మించి పౌర సేవను సంస్కరించాడు.

20 వ శతాబ్దంలో సోవియటు వ్యూహ (కమ్యూనిజం లేకుండా) సారూప్యతలతో ఓట్టమను సామ్రాజ్యంలో ఈజిప్టును శక్తివంతమైన స్థానంగా అభివృద్ధి చేయడానికి మొత్తం ప్రజలలో 4% మందిని సైనికులుగా నియమించాడు.

ముహమ్మదు అలీ పాషా కొర్వీ సంప్రదాయ ఆధారితంగా ఆధునికీకరించిన గొప్ప సైన్యాన్ని అభివృద్ధి చేసాడు. 19 వ శతాబ్దంలో ఈజిప్టులో నిర్బంధ పురుష వ్యవసాయ విధానం ప్రవేశపెట్టాడు. తన బృహత్తర సైన్యాన్ని ఆధునికీకరించడానికి నూతన విధానం అవలంబించాడు. దానిని సంఖ్యాపరంగా బలోపేతం చేశాడు. సైనికులలో నిర్బంధ విద్య, శిక్షణ అమలు చేసాడు. కొత్త భావనలు దేశాన్ని ఒంటరిగా మార్చాయి. సైనిక విభాగంలో వారిదృష్టి మరల్చకుండా ఉంచడానికి పురుషులను సైనిక శిబిరాలభవనాలలో ఉంచారు. సైనిక జీవన విధానం మీద ప్రజలకు ఆగ్రహం చివరికి పురుషులలో జాతీయవాదంతో కూడిన కొత్త భావజాలం జనించింది. కొత్తగా నియమించిన సైనికవిభాగం సహాయంతో ముహమ్మద్ అలీ ఈజిప్టులో తన పాలన సాగించాడు.

ముహమ్మదు అలీ తరువాత ఆయన కుమారుడు ఇబ్రహీం ( 1848 సెప్టెంబరులో), మనవడు మొదటి అబ్బాసు (1848 నవంబరు నవంబరులో), తరువాత సెడు (1854 లో) (సైన్సు, వ్యవసాయాన్ని ప్రోత్సహించి బానిసత్వాన్ని నిషేధించిన ఇస్మాయిలు (1863 లో) పాలన సాగించారు.

ఐరోపా చొరబాటు (1867–1914)

ఈజిప్టు 
The battle of Tel el-Kebir in 1882 during the Anglo-Egyptian War

ముహమ్మదు అలీ రాజవంశం క్రింద ఈజిప్టు నామమాత్రంగా ఒట్టోమను ప్రావిన్సుగా మిగిలిపోయింది. దీనికి 1867 లో స్వయంప్రతిపత్త వాసల్ దేశం (ఖేడివేటు) హోదా లభించింది. 1914 వరకు ఒట్టోమన్లకు అధికారం, ఉనికి లేనప్పటికి ఇది చట్టబద్ధమైన హోదాతో ఉంది.

1869 లో ఫ్రెంచి భాగస్వామ్యంతో నిర్మించిన సూయజు కాలువ పూర్తయింది. దీని నిర్మాణానికి ఐరోపా బ్యాంకులు ఆర్థిక సహాయం చేశాయి. నిర్వహణ, అవినీతికి పెద్ద మొత్తాలు కూడా అందించబడ్డాయి. కొత్తగా విధించబడిన పన్నులు ప్రజలను అసంతృప్తికి గురిచేసాయి. 1875 లో ఇస్మాయిలు కాలువలోని ఈజిప్టు వాటాలన్నింటినీ బ్రిటిషు ప్రభుత్వానికి అమ్మడం ద్వారా దివాలా తీయడం నుండి తప్పించింది. ఇది 3 సంవత్సరాలలో ఈజిప్టు మంత్రివర్గంలో బ్రిటిషు, ఫ్రెంచి నియంత్రణాధికారులను నియమించడానికి దారితీసింది.

అంటువ్యాధులు (1880 లలో పశువుల వ్యాధి), వరదలు, యుద్ధాలు వంటి ఇతర పరిస్థితులు ఆర్థిక మాంద్యానికి దారితీసి విదేశీ రుణాలపై ఈజిప్టు ఆధారపడటాన్ని మరింత అధికరింపజేసింది.

తరువాతి సంవత్సరాల్లో, రాజవంశం బ్రిటిషు తోలుబొమ్మగా మారింది. 1882 లో బ్రిటిషు ఆక్రమణ వరకు ఒట్టోమను సామంతరాజ్యంగా ఇస్మాయిలు, టెవ్ఫికు పాషా ఈజిప్టును పాక్షిక స్వతంత్ర రాజ్యంగా పరిపాలించారు.

ఈజిప్టు 
1919 లో కైరోలో ప్రదర్శిస్తున నిర్వహిస్తున్న మహిళా జాతీయవాదులు

ఇస్మాయిలు పాలనపట్ల ప్రాంతీయంగా ప్రజలలో అధికరించిన అసంతృప్తి ఐరోపా చొరబాటు 1879 లో ప్రాంతీయప్రముఖుడు అహమ్మదు ఉరాబీ నాయకత్వంలో మొదటి జాతీయవాద సమూహాల ఏర్పాటుకు దారితీసింది. తమ నియంత్రణ తగ్గుతుందనే భయంతో యుకె, ఫ్రాన్సు సైనికపరంగా జోక్యం చేసుకుని అలెగ్జాండ్రియాపై బాంబు దాడి చేసి " టెల్ ఎల్ కేబీరు " యుద్ధంలో ఈజిప్టు సైన్యాన్ని అణిచివేసాయి. తరువాత ఈజిప్టు ఇస్మాయిలు కుమారుడు టెవ్ఫికు ఆధ్వర్యంలో బ్రిటిషు రక్షితప్రాంతంగా తిరిగి స్థాపించబడింది.

1906 లో " దిన్షావే సంఘటన " చాలా మంది తటస్థ ఈజిప్షియన్లను జాతీయవాద ఉద్యమంలో చేరేలా ప్రేరేరణ కల్పించింది.

బ్రిటిషు ప్రొటక్టరేటు (1882–1952)

1914 నవంబరు 5 వరకు ఈజిప్టు ఖేడివేటు 5 నవంబరు ఒట్టోమను ప్రావింసుగా మిగిలిపోయింది. ఒట్టోమను సామ్రాజ్యం టర్కీయువకులు కేంద్రశక్తులకు మద్దతుగా మొదటి ప్రపంచ యుద్ధంలో చేరాలని తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా దీనిని బ్రిటిషు రక్షితప్రాంతంగా ప్రకటించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర శక్తులకు మద్దతు ఇస్తున్న ఒట్టోమను సుల్తాను సార్వభౌమత్వాన్ని తిరస్కరించడానికి 1914 లో ప్రొటెక్టరేటు అధికారికంగా మార్చబడి దేశాధినేత బిరుదు సుల్తానుగా మార్చబడింది. ఖెడివే సుల్తాను రెండవ అబ్బాసును పదవి నుండి తొలగించి ఆయన స్థానంలో ఆయన మామ హుస్సేను కమెలు సుల్తానుగా నియమ్ంచబడ్డాడు.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత " సాదు జాగ్లు, వాఫ్డు పార్టీ నాయకత్వంలో శాసనసభ్యులలో చాలమంది ఈజిప్టు జాతీయవాద ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. 1919 మార్చి 8 న బ్రిటిషు జగ్లులును ఆయన సహచరులను మాల్టాకు బహిష్కరించిన తరువాత దేశంలో మొదటి ఆధునిక విప్లవం ఉద్భవించింది. ఈ తిరుగుబాటు 1922 ఫిబ్రవరి 22 న యునైటెడు ప్రభుత్వం ఈజిప్టు ఏకపక్షంగా స్వాతంత్ర ప్రకటనచేసింది.

ఈజిప్టు 
ఎల్ అలమైన్ సమీపంలో బ్రిటిష్ పదాతిదళం, 1942 జూలై 17

1923 లో కొత్త ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేసింది. 1924 లో సాదు జాగ్లు ఈజిప్టు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 1936 లో ఆంగ్లో-ఈజిప్టు ఒప్పందం ముగిసింది. మిగిలి ఉన్న బ్రిటీషు ప్రభావం, రాజు రాజకీయ ప్రమేయం కారణంగా నిరంతర అస్థిరత కారణంగా 1952 లో సైనిక తిరుగుబాటుతో పార్లమెంటు రద్దు చేయబడింది. " ఫ్రీ ఆఫీసర్సు ఉద్యమం " తన కుమారుడు ఫువాడుకు మద్దతుగా రాజు ఫరూకు పదవి నుండి తొలగి ఫువాడుకు పదవీబాధ్యతలు అప్పగించాడు. 1954 వరకు ఈజిప్టులో బ్రిటిషు సైనిక ఉనికి కొనసాగింది.

రిపబ్లికు (1953–ప్రస్తుతం)

" ఫ్రీ ఆఫీసర్సు మూవ్మెంటు " నిర్వహించిన 1952 రివల్యూషను తరువాత ఈజిప్టు పాలన సైన్యం హస్థగతం అయింది. 1953 జున్ 18 న " ఈజిప్టు రిపబ్లికు " ప్రకటించబడింది. జనరలు ముహమ్మదు నాగుయిబు రిపబ్లికు మొదటి అధ్యక్షుడిగా, ఒకటిన్నర సంవత్సరాల కాలం కొనసాగాడు.

నాసరు పాలన (1956–1970)

ఈజిప్టు 
Egyptian President Gamal Abdel Nasser in Mansoura, 1960

1954 లో పాను-అరబిస్టు, 1952 ఉద్యమానికి వ్యూహకర్త అయిన గమలు అబ్దేలు నాజరు వత్తిడి కారణంగా నాగుయిబు రాజీనామా చేయవలసి పరిస్థితి ఏర్పడింది. తరువాత ఆయన గృహ నిర్బంధంలో ఉంచబడ్డాడు. నాగుయిబు రాజీనామా తరువాత 1956 లో గమలు అబ్దేలు నాజరు ఎన్నికయ్యే వరకు అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.

1956 జూనులో నాజరు అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. 1956 జూన్ 13 న ఆక్రమిత సూయజు కెనాల్ జోన్ నుండి బ్రిటిషు దళాలు వైదొలగే ప్రక్రియ పూర్తి చేశాయి. 1956 జూలై 26 న నాజరు సూయజు కాలువను జాతీయం చేసి 1956 సూయెజు సంక్షోభానికి ప్రేరేరణకలిగించాడు.

1958 లో ఈజిప్టు, సిరియా యునైటెడు అరబ్ రిపబ్లికు అని పిలువబడే సార్వభౌమ సంఘాన్ని ఏర్పాటు చేశాయి. యూనియను స్వల్పకాలికంగా ఉనికిలో ఉండి 1961 లో సిరియా విడిపోవడంతో యూనియను ముగిసింది. యునైటెడు అరబు రిపబ్లికు ఉనికిలో ఉన్న సమయంలో, యునైటెడు అరబు స్టేట్సు అని పిలువబడే ఉత్తర యెమెన్ (లేదా ముటావాక్కిలైటు కింగ్డం ఆఫ్ యెమెన్) సమాఖ్యలో ఉంది. 1959 లో ఈజిప్టు సభ్య రాజ్యమైన గాజా స్ట్రిపు ఆల్-పాలస్తీనా ప్రభుత్వం అరబు యూనియను సాకుతో యునైటెడు అరబు రిపబ్లికులో కలిసిపోయిన తరువాత తిరిగి పునరుద్ధరించబడలేదు.

1960 ల ప్రారంభంలో ఈజిప్టు ఉత్తర యెమెన్ అంతర్యుద్ధంలో పూర్తిగా జోక్యం చేస్తుంది. ఈజిప్టు అధ్యక్షుడు గమలు అబ్దేలు నాజరు 70,000 మంది ఈజిప్టు దళాలు, రసాయన ఆయుధాలతో యెమెన్ రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చారు. అనేక సైనిక కదలికలు, శాంతి సమావేశాలు ఉన్నప్పటికీ, యుద్ధం ప్రతిష్టంభనతో మునిగిపోయింది. తరువాత యెమెనులో ఈజిప్టు నిబద్ధత బాగా దెబ్బతింది.

1967 మే మధ్యలో సిరియా మీద రాబోయే ఇజ్రాయెలు దాడి గురించి సోవియట్ యూనియను నాజరుకు హెచ్చరికలు జారీ చేసింది. స్టాఫ్ చీఫ్ మొహమ్మదు ఫౌజీ వారిని "నిరాధారమైన" అని ధ్రువీకరించినప్పటికీ నాజరు వరుసగా మూడు చర్యలు తీసుకున్నాడు. ఇది యుద్ధాన్ని వాస్తవంగా యుద్ధం అనివార్యమని భావించబడింది: మే 14 న ఇజ్రాయెలు సరిహద్దుకు సమీపంలో ఉన్న సినాయిలో తన దళాలను మోహరించాడు, ఇజ్రాయెలుతో సినాయి ద్వీపకల్ప సరిహద్దులో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతిభద్రతలను బహిష్కరించాడు, మే 23 న ఆయన టిరాను జలసంధిలో ఇజ్రాయెలు నౌకల ప్రవేశాన్ని అడ్డగించాడు. మే 26 న నాజరు ఇలా ప్రకటించాడు. "యుద్ధం సాధారణమైనది, ఇజ్రాయెలును నాశనం చేయడమే మా ప్రాథమిక లక్ష్యం".

టిరాను మూసివేత జలసంధి మూసివేతను కాసుసు బెల్లీ అని ఇజ్రాయెలు ప్రతిస్పందించింది. 1967 ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెలు ఈజిప్టుపై దాడి చేసింది. 1948 అరబు-ఇజ్రాయెలు యుద్ధం ద్వారా ఈజిప్టు సినాయి ద్వీపకల్పం, గాజా స్ట్రిప్‌ను ఆక్రమించింది. 1967 యుద్ధంలో (1980/81 లో 18 నెలల విరామం మినహా) అమలు చేయబడిన అత్యవసర చట్టం 2012 వరకు అమలులో ఉంది. ఈ చట్టం ఆధారంగా పోలీసు అధికారాలు విస్తరించబడ్డాయి. రాజ్యాంగ హక్కులు నిలిపివేయబడ్డాయి, సెన్సార్‌ఉషిపు చట్టబద్ధం చేయబడింది.[ఆధారం చూపాలి]

1950 ల ప్రారంభంలో ఈజిప్టు రాచరికం పతనం సమయంలో ఈజిప్షియన్లలో 5 లక్షల కంటే తక్కువగా ఉన్నత తరగతి, ధనవంతులు, 40 లక్షల మధ్యతరగతి, 1,70,000 మంది దిగువ తరగతి (పేదలుగా) ఉన్నట్లు పరిగణించబడ్డారు. ప్రాథమిక-పాఠశాల-వయస్సు పిల్లలలో సగం కంటే తక్కువ మంది పాఠశాలకు హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది బాలురు ఉన్నారు. నాజరు విధానాలు దీనిని మార్చాయి. భూ సంస్కరణ, పంపిణీ, విశ్వవిద్యాలయ విద్యలో నాటకీయ పెరుగుదల సంభవించింది. జాతీయ పరిశ్రమలకు ప్రభుత్వ సహకారం సామాజిక చైతన్యాన్ని బాగా మెరుగుపరిచాయి. సామాజిక వక్రతను చదును చేశాయి. విద్యా సంవత్సరం 1953–54 నుండి 1965–66 వరకు మొత్తం ప్రభుత్వ పాఠశాలల నమోదు రెట్టింపు అయింది. గతంలో లక్షలాది మంది పేద ఈజిప్షియన్లు ప్రభుత్వ రంగంలో విద్య, ఉద్యోగాల ద్వారా మధ్యతరగతికి చేరుకున్నారు. ఈజిప్టులో నాజర్ ఆధ్వర్యంలో మధ్యతరగతిలో ఎక్కువ భాగం వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, జర్నలిస్టులు ఉన్నారు. 1960 లలో ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ మందగమనం నుండి పతనం అంచుకు వెళ్ళింది. సమాజంలో స్వేచ్ఛ క్షీణించింది.

సదతు పాలన (1970–1981)

ఈజిప్టు 
Egyptian tanks advancing in the Sinai desert during the Yom Kippur War, 1973

1970 లో అధ్యక్షుడు నాజరు మరణించాడు. అతని తరువాత అన్వరు సదాతు అధికారం వహించాడు. 1972 లో సదాతు సోవియటు యూనియను నుండి సదాతు ఈజిప్టు ప్రచ్ఛన్న యుద్ధ విధేయతను యునైటెడు స్టేట్సుకు మార్చి సోవియటు సలహాదారులను బహిష్కరించాడు. మతవాదం, లౌకికవాదం వ్యతిరేకతను అరికట్టేప్రక్రియలో ఇన్ఫిటా ఆర్థిక సంస్కరణ విధానాన్ని ప్రారంభించాడు. 1973 లో ఈజిప్టు, సిరియాతో కలిసి " అక్టోబరు యుద్ధం " ప్రారంభించింది. 6 సంవత్సరాల క్రితం ఇజ్రాయెలు స్వాధీనం చేసుకున్న సినాయి భూభాగంలో కొంత భాగాన్ని తిరిగి పొందటానికి ఆశ్చర్యకరమైన దాడిచేసి సదాతు ఇజ్రాయెలలుతో శాంతికి బదులుగా సినాయిని తిరిగి పొందడంలో విజయం సాధించాడు.

ఈజిప్టు 
1978 క్యాంపు డేవిడు ఒప్పందాల సంతకం జరుపుకుంటోంది: మెనాచెం బిగిను, జిమ్మీ కార్టరు, అన్వరు సదాతు

1975 లో సదాతు నాజరు ఆర్థిక విధానాలను మార్చాడు. తన ప్రజాదరణను ప్రభుత్వ నిబంధనలను తగ్గించడానికి ఉపయోగించి తన ఇన్ఫిటా కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. ఈ విధానం ద్వారా పన్నులు, దిగుమతి సుంకాల తగ్గింపు వంటి ప్రోత్సాహకాలు అందించి కొంతమంది పెట్టుబడిదారులను ఆకర్షించాడు. అయితే పెట్టుబడులు ప్రధానంగా తక్కువ సమస్యలు ఉన్న పర్యాటకం, నిర్మాణం వంటి లాభదాయక పరిశ్రమలకు కేంద్రీకరించబడి ఈజిప్టు శిశు పరిశ్రమలను వదిలివేసాయి. సదాతు విధానాలు ఈజిప్టు ఆధునికీకరణకు, మధ్యతరగతి ప్రజలకు సహకరించినప్పటికీ ప్రధాన ఆహారపదార్ధాల మీద మినహాయింపులను తొలగించిన కారణంగా అది ఉన్నతవర్గానికి అనుకూలంగా మారి " 1977 ఈజిప్టు ఆహారదోపిడీ "కి దారితీసింది.

1977 లో సదాతు ఇజ్రాయెలుకు చారిత్రాత్మక పర్యటన చేయడం 1979 శాంతి ఒప్పందానికి దారితీసింది. బదులుగా ఇజ్రాయెలు సినాయి నుండి వైదొలగింది. సదాతు చొరవ అరబు ప్రపంచంలో విపరీతమైన వివాదానికి దారితీసి అరబు లీగు నుండి ఈజిప్టు బహిష్కరణకు దారితీసింది. కాని దీనికి చాలా మంది ఈజిప్షియన్లు మద్దతు ఇచ్చారు. 1981 అక్టోబరులో సదాతును ఇస్లామికు ఉగ్రవాది హత్య చేశాడు.

ముబారకు పాలన (1981–2011)

హోస్ని ముబారకు అధికారంలోకి వచ్చాడు. సదాతు హత్య తర్వాత నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాత్రమే అభ్యర్థిగా ఉన్నాడు.

ఇజ్రాయెలుతో ఈజిప్టుకు ఉన్న సంబంధాన్ని హోస్నీ ముబారకు పునరుద్ఘాటించాడు. ఈజిప్టు అరబు పొరుగువారితో ఉద్రిక్తతలను తగ్గించాడు. దేశీయంగా ముబారకు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. వ్యవసాయ, పరిశ్రమల ఉత్పత్తి విస్తరించినప్పటికీ జనాభా పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి సాధించలేదు. సామూహిక పేదరికం, నిరుద్యోగం కారణంగా గ్రామీణ కుటుంబాలకు చెందిన ప్రజలు కైరో వంటి నగరాలలోకి ప్రవేశించటానికి దారితీశాయి. అక్కడ వారు రద్దీగా ఉన్న మురికివాడలలో నివసించి మనుగడ సాగించడంలో శ్రమపడ్డారు.

1986 ఫిబ్రవరి 25 న సెక్యూరిటీ పోలీసులు వారి విధుల కాలపరిమితిని 3 నుండి 4 సంవత్సరాలకు పొడిగించాలని కోరుతూ అల్లర్లను ప్రారంభించారు. కైరోలో హోటళ్ళు, నైట్‌ఉక్లబ్బులు, రెస్టారెంట్లు, కాసినోలు మీద దాడి చేయబడింది. ఇతర నగరాలలో అల్లర్లు జరిగాయి. 24 గంటల కాలం కర్ఫ్యూ విధించారు. పరిస్థితి పునరుద్ధరించడానికి సైన్యం 3 రోజులు సమయం పట్టింది. సంఘటనలో 107 మంది మరణించారు.

1980, 1990, 2000 లలో ఈజిప్టులో ఉగ్రవాద దాడులు చాలా తీవ్రరూపందాల్చాయి. తీవ్రవాదులు క్రైస్తవులు, విదేశీ పర్యాటకులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. 1990 వ దశకంలో ఇస్లాం సమూహం, అల్-గమా అల్-ఇస్లామియా, ప్రముఖ రచయితలు, మేధావుల హత్యలు, హత్యాయత్నాల నుండి, పర్యాటకులు, విదేశీయులను పదేపదే లక్ష్యంగా చేసుకోవడం వంటి హింసాత్మక చర్యలు విస్తృత రూపందాల్చాయి. ఈజిప్టు ఆర్థికవ్యవస్థ అతిపెద్ద రంగమైన పర్యాటకానికి ఇది హాని కలిగించింది. పర్యాటకరగం మీద ఆధారపడిన చాలా మంది ప్రజల జీవనోపాధిని కూడా నాశనం చేసింది.

ముబారకు పాలనలో రాజకీయం మీద 1978 లో సదాతు చేత సృష్టించబడిన నేషనలు డెమోక్రటికు పార్టీ ఆధిపత్యం చెలాయించింది. ఇది 1993 సిండికేట్సు లా, 1995 ప్రెస్ లా, 1999 నాన్గవర్నమెంటలు అసోసియేషన్సు చట్టం ఆమోదించబడింది. కొత్త నిబంధనలు విధించడం ద్వారా అసోసియేషను, వ్యక్తీకరణ స్వేచ్ఛను దెబ్బతీసింది. ఉల్లంఘనల మీద కఠినమైన జరిమానాలు విధించబడ్డాయి. ఫలితంగా 1990 ల చివరినాటికి పార్లమెంటరీ రాజకీయాలు అస్థవ్యస్థం అయ్యాయి. రాజకీయ వ్యక్తీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తగ్గించబడ్డాయి.

ఈజిప్టు 
Cairo grew into a metropolitan area with a population of over 20 million

1997 నవంబరు 17 న లక్సోరు సమీపంలో 62 మంది (అధికంగా పర్యాటకులు) చకోతకు గురయ్యారు.

2005 ఫిబ్రవరి చివరలో ముబారకు అధ్యక్ష ఎన్నికల చట్టం సంస్కరణను ప్రకటించాడు. 1952 ఉద్యమం తరువాత మొదటిసారిగా బహుళ అభ్యర్థుల ఎన్నికలకు మార్గం సుగమం చేశారు. ఏదేమైనా కొత్త చట్టం అభ్యర్థుల మీద ఆంక్షలు విధించింది. ముబారకు సులభంగా తిరిగి ఎన్నికలలో విజయం సాధించాడు. ఎన్నికలలో 25% ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికలలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నదని పరిశీలకులు అభిప్రాయం వెలిబుచ్చారు. ఎన్నికల తరువాత తన తరువాతి స్థానంలో నిలిచిన " అయమాను నౌరు "ను ముబారకు ఖైదుచేసాడు.

మానవహక్కుల పరిశీలన 2006 నివేదిక ఈజిప్టులో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు వివరించింది. వీటిలో సాధారణ హింస, ఏకపక్ష నిర్బంధాలు, సైనిక, దేశభద్రతా కోర్టుల ముందు విచారణలు ఉన్నాయి. ఇక్కడ ఇతర దేశాలు యుద్ధం, తీవ్రవాదం సంబంధిత అనుమానితులను విచారణ కోసం పంపే ఈజిప్టులో 2007 లో అమ్నెస్టీ ఇంటర్నేషనలు ఒక నివేదికను విడుదల చేసింది. నివేదిక ఈజిప్టు హింసకు అంతర్జాతీయ కేంద్రంగా మారిందని ఆరోపించింది. ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను ఖండించింది.

రాజ్యాంగ మార్పులు 2007 మార్చి 19 న ఓటు వేసిన పార్టీలు మత కార్యకలాపాల ప్రాతిపదికగా రాజకీయ కార్యకలాపాలకు నిషేధించబడిన పార్టీలు కొత్త ఉగ్రవాద నిరోధక చట్టాన్ని రూపొందించడానికి అనుమతించబడ్డాయి. పోలీసు అధికారాలకు ఖైదు నిఘా వంటి విస్తృత అధికారం ఇవ్వబడింది. పార్లమెంటును రద్దు చేయడానికి, న్యాయవ్యవస్థను అంతం చేయడానికి అధ్యక్షుడికి అధికారాన్ని ఇచ్చాయి. 2009 లో నేషనలు డెమోక్రటికు పార్టీ (ఎన్డిపి) మీడియా కార్యదర్శి డాక్టరు అలీ ఎల్ దీను హిలాలు డెసౌకి ఈజిప్టును "ఫారోనిక్" రాజకీయ వ్యవస్థగా ప్రజాస్వామ్య "దీర్ఘకాలిక లక్ష్యం"గా అభివర్ణిస్తూ "ఈజిప్టులో నిజమైన శక్తి కేంద్రం మిలటరీ" అని కూడా డెసౌకి పేర్కొన్నాడు.

విప్లవం (2011–2014)

Top: Celebrations in Tahrir Square after the announcement of Hosni Mubarak's resignation; Bottom: Protests in Tahrir Square against President Morsi on 27 November 2012.
2011 జనవరి 25 న ముబారకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత నిరసనలు ప్రారంభమయ్యాయి. 2011 ఫిబ్రవరిన ముబారకు రాజీనామా చేసి కైరో నుండి పారిపోయాడు. ఫలితంగా కైరో తహ్రీరు స్క్వేరులో వద్ద ఆనందకరంగా వేడుకలు జరిగాయి. ఈజిప్టు సైన్యం పాలించే అధికారాన్ని చేపట్టింది. సుప్రీం కౌన్సిలు ఆఫు ఆర్మ్డ్ ఫోర్సెసు ఛైర్మను మొహమ్మదు హుస్సేను టాంటావి తాత్కాలిక రాష్ట్ర అధిపతి అయ్యారు. 2011 ఫిబ్రవరి 13 న సైన్యం పార్లమెంటును రద్దు చేసి రాజ్యాంగాన్ని నిలిపివేసింది.

2011 మార్చి 19 న రాజ్యాంగప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మునుపటి పాలన అధికారంలో ఉన్నప్పటి నుండి 2011 నవంబరు 28 న ఈజిప్టు మొదటి పార్లమెంటు ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికలలో ఓటింగు అధికంగా జరిగింది. పెద్ద అవకతవకలు, హింస గురించి నివేదికలు లేవు.[76] మొహమ్మదు మోర్సీ 2012 జూన్ 24 న అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2012 ఆగస్టు 2 న ఈజిప్టు ప్రధాన మంత్రి హిషాం కండిలు తన 35 మంది సభ్యుల మంత్రివర్గంలో ముస్లిం బ్రదర్హుడు నుండి నలుగురుతో మొత్తం 28 మంది కొత్తవారిని ప్రకటించారు.

కఠినమైన ఇస్లామికు పద్ధతులను విధిస్తుందని విశ్వసించిన ఉదారవాద, లౌకిక సమూహాలు రాజ్యాంగ సభ నుండి బయటకు వెళ్ళాయి. అయితే ముస్లిం బ్రదర్హుడు మద్దతుదారులు మోర్సీ వెనుక తమ మద్దతుగా నిలిచారు. 2012 నవంబరు 22 న అధ్యక్షుడు మోర్సీ తన మీద డిక్రీలను నిరోధించి, రాజ్యాంగ అసెంబ్లీ బాధ్యతలు రక్షించాలని కోరుతూ తాత్కాలిక ప్రకటన విడుదల చేశారు.

ఈ చర్య ఈజిప్టు అంతటా భారీ నిరసనలు, హింసాత్మక చర్యలకు దారితీసింది. 2012 డిసెంబరు 5 న అధ్యక్షుడు మోర్సీ పదివేల మంది మద్దతుదారులు, ప్రత్యర్థులు ఘర్షణ పడ్డారు. విప్లవం తరువాత ఇస్లాంవాదులు, వారి శత్రువుల మధ్య జరిగిన యుద్ధాన్ని అతిపెద్ద హింసాత్మక యుద్ధంగా అభివర్ణించబడింది. మొహమ్మదు మోర్సీ ప్రతిపక్ష నాయకులతో చర్చలకు అవకాశం ఇచ్చినప్పటికీ " 2012 డిసెంబరు రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణ " రద్దు చేయడానికి నిరాకరించాడు.

మోర్సీ ముస్లిం బ్రదర్హుడు ప్రభుత్వం నిరంకుశ విధానాల పట్ల తీవ్రమైన ప్రజా అసంతృప్తి తరువాత 2013 జూలై 3 న సైన్యం తిరుగుబాటు చేసి అధ్యక్షుడు మోర్సీని అధికారం నుండి తొలగించి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మన్సోరు మోర్సీని తొలగించిన తరువాత కొత్త ప్రభుత్వానికి 2013 జూలై 4 న ఈజిప్టు సుప్రీం కాన్స్టిట్యూషనలు కోర్టు 68 సంవత్సరాల ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక అద్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. సైనిక మద్దతుగల ఈజిప్టు అధికారులు ముస్లిం బ్రదర్హుడు, దాని మద్దతుదారులపై విరుచుకుపడ్డారు. వేలాది మందికి జైలు శిక్ష విధించి, వందలాది వీధి నిరసనకారులను చంపారు. సామూహిక విచారణలో ముస్లిం బ్రదర్హుడు నాయకులు, కార్యకర్తలలో చాలా మందికి సామూహిక విచారణలలో మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడింది.

2014 జనవరి 18 న మధ్యంతర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ (98.1% మంది ఓటర్లు మద్దతుగా ఉన్నారు) నిర్వహించిన తరువాత కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది. నమోదిత ఓటర్లలో 38.6% మంది ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. మోర్సీ పదవీకాలంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు వేసిన 33% కంటే ఇందులో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. 2014 మార్చి 26 న ఈజిప్టు సాయుధ దళాల అధిపతి అబ్దేలు ఫట్టా ఎల్-సిసి మిలటరీకి రాజీనామా చేసి 2014 అధ్యక్ష ఎన్నికల్లో తాను అభ్యర్థిగా నిలబడతానని ప్రకటించాడు. 2014 మే 26,28 మధ్య జరిగిన ఈ ఎన్నికలలో ఎల్-సిసికి ఘన విజయం సాధించింది. 2014 జూన్ 8 న ఈజిప్ట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముస్లిం బ్రదర్హుడు, కొన్ని ఉదారవాద, లౌకిక కార్యకర్త సమూహాలు ఓటును బహిష్కరించాయి. సైనిక మద్దతు ఉన్న అధికారులు ఎన్నికలను మూడవ రోజుకు పొడిగించినప్పటికీ 46% ఓటింగు (2012 ఎన్నికలలో 52%) పోలింగు కంటే తక్కువగా ఉంది.

భౌగోళికం

ఈజిప్టు 
Nile valley near Luxor.
ఈజిప్టు 
Rocky landscape in Marsa Alam.

ఈజిప్టు ప్రధానంగా అక్షాంశాలు 22 ° నుండి 32 ° ఉత్తర అక్షాంశం, 25 ° నుండి 35 ° రేఖాంశం మధ్య ఉంటుంది. దేశవైశాల్యం 10,01,450 చ.కి.మీ. ఇది వైశాల్యపరంగా ప్రపంచంలో 30 వ స్థానంగా ఉంది. ఈజిప్టు వాతావరణంలోని తీవ్ర శుష్కత కారణంగా ఇరుకైన నైలు లోయ డెల్టా వెంట జనసాంధ్రత కేంద్రీకృతమై ఉన్నారు. అంటే మొత్తం 5.5% భూభాగంలో జనాభాలో 99% మంది నివసిస్తున్నారు. 98% ఈజిప్షియన్లు 3% భూభాగంలో నివసిస్తున్నారు.

ఈజిప్టుకు పశ్చిమసరిహద్దులో లిబియా, దక్షిణసరిహద్దులో సూడాన్, తూర్పుసరిహద్దులో గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ సరిహద్దులుగా ఉన్నాయి. వ్యూహాత్మక స్థానం కారణంగా భౌగోళిక రాజకీయాలలో ఈజిప్టు ముఖ్యమైన పాత్ర లభించింది: ఒక ఖండాంతర దేశంగా ఇది ఆఫ్రికా, ఆసియా మధ్య భూవంతెనగా (సూయజు ఇస్తమసు) ఉంది. దేశంలోని సూయజుకాలువ మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే నౌకాయాన జలమార్గం (సూయజ్ కాలువ) ఉంది.

నైలు లోయతో ఈజిప్టు భూభాగంలో ఎక్కువ భాగం ఎడారి, కొన్ని ఒయాసిసులు చెల్లాచెదురుగా ఉన్నాయి. దేశాంలో వీచేగాలులు 100 అడుగుల (30 మీ) కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఇసుక దిబ్బలను సృష్టిస్తాయి. ఈజిప్టులో సహారా ఎడారి, లిబియా ఎడారి భాగాలు ఉన్నాయి. ఈ ఎడారులు ఫారోల రాజ్యాన్ని పాశ్చాత్య ఆక్రమణల నుండి రక్షించాయి. పురాతన ఈజిప్టులో "ఎర్ర భూమి"గా అభివర్ణించబడింది.

పట్టణాలు, నగరాలలో అలెగ్జాండ్రియా రెండవ అతిపెద్ద నగరంగా ఉంది; ఆస్వాన్; అస్యుత్; కైరో ఆధునిక ఈజిప్టు రాజధాని, అతిపెద్ద నగరంగా ఉంది; ఎల్ మహల్లా ఎల్ కుబ్రా; గిజా, ఖుఫు పిరమిడు ప్రదేశం; హుర్ఘదా; లక్సోరు; కోం ఓంబో; పోర్టు సఫాగా; పోర్టు సయ్యదు; షర్ము ఎల్ షేకు; సూయజు, సూయజు కాలువ దక్షిణ భాగం ఉన్న ప్రదేశం; జగాజికు; మిన్యా. బహారియా, దఖ్లా, ఫరాఫ్రా, ఖర్గా, సివా మొదలైన ఒయాసిసులు ఉన్నాయి. రెకు మొహమ్మదు నేషనలు పార్కు, జరానికు ప్రొటెక్టరేటు, సివా ఉన్నాయి.

2015 మార్చి 13 న ఈజిప్టు కొత్త రాజధాని కోసం ప్రణాళికలు ప్రకటించబడ్డాయి.

వాతావరణం

ఈజిప్టు 
Saint Catherine in southern Sinai, on a snowy winter morning.

ఈజిప్టులో శీతాకాలంలో వర్షాలు అధికంగా వస్తుంది. కైరోకు దక్షిణంగా వర్షపాతం వార్షికంగా 2 నుండి 5 మిమీ (0.1 నుండి 0.2 అంగుళాలు) (చాలా సంవత్సరాల వ్యవధి కూడా ఉంటుంది) ఉంటుంది. ఉత్తర తీరం చాలా సన్నని భూచీలికలో వర్షపాతం 410 మిమీ (16.1 అంగుళాలు) ఎక్కువగా వర్షపాతం అక్టోబరు, మార్చి మధ్య ఉంటుంది. సినాయి పర్వతాలు, ఉత్తర తీర నగరాలైన డామిట్టా, బాల్టిం, సిడి బరానీల వంటి పర్వతప్రాంతాల మీద హిమపాతం ఉంటుంది. అరుదుగా అలెగ్జాండ్రియాలో హిమపాతం సంభవిస్తుంది. 2013 డిసెంబరు 13 న కైరోలో చాలా తక్కువగా మంచు కురిసింది. ఇది చాలా దశాబ్దాలలో మొదటిసారిగా సంభవించింది. సినాయి, ఈజిప్టు మధ్య స్వల్పంగా మంచుస్పటికాలు ఏర్పడుతుంటాయి. ఈజిప్టు ప్రపంచంలో అతి పొడిగానూ ఎండ సంభవిస్తున్న దేశం. ఈజిప్టు భూ ఉపరితలం చాలావరకు ఎడారి ఉంటుంది.

ఈజిప్టు 
ఈజిప్టు వాయవ్యంలోని ఖతారా డిప్రెషను

ఈజిప్టులో అసాధారణంగా వేడి, ఎండ, పొడి వాతావరణం ఉంది. ఉత్తరప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో దేశంలోని మిగతా ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది. ఉత్తర సముద్ర తీరం మీద స్థిరంగా చల్లటి మధ్యధరా గాలులు వీస్తాయి. ముఖ్యంగా వేసవి కాలం ఎత్తైన ప్రాంతాలలో మరింత మితమైన ఉష్ణోగ్రతను పొందడానికి ఇది సహాయపడుతుంది. దక్షిణాన విస్తారమైన ఎడారుల నుండి ఉద్భవించిన వేడి, పొడి గాలి (ఖమాసీను) వీస్తుంది. ఇది వసంత ఋతుతువులో లేదా వేసవి ప్రారంభంలో వీస్తుంది. ఇది కాలిపోతున్న ఇసుక, ధూళి కణాలను తెస్తుంది. సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 40 ° సెం (104 ° ఫా), కొన్నిసార్లు లోపలి భాగంలో 50 ° సెం (122 ° ఫా) కంటే అధికంగా ఉంటుంది. అయితే సాపేక్ష ఆర్ద్రత 5% లేదా అంతకంటే తక్కువకు పతనం ఔతుంది. ఖమాసీను వీచేటప్పుడు ఈజిప్టులో సంపూర్ణ అత్యధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తాయి. ఈజిప్టులో ముఖ్యంగా అస్వాను, లక్సోరు, అస్యుటు వంటి నగరాలలో వాతావరణం ఎల్లప్పుడూ ఎండ, స్పష్టతగా ఉంటుంది. ఇది భూమిపై అతి తక్కువ మేఘావృతం, తక్కువ వర్షపు ప్రాంతాలలో ఒకటి.

అస్వాను ఆనకట్ట నిర్మాణానికి ముందు ఈజిప్టులో నైలు నది వండ్రుమట్టిని (నైలు బహుమతి) నింపుతుంది. ఇది ఈజిప్టుకు సంవత్సరాలుగా స్థిరమైన పంటను ఇచ్చింది.

గ్లోబలు వార్మింగు కారణంగా సముద్ర మట్టాలు పెరగడం ఈజిప్టు జనసాంద్రత కలిగిన తీరప్రాంతానికి ముప్పు కలిగిస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, పారిశ్రామికరంగంలో తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. సముద్ర మట్టాలలో గణనీయమైన పెరుగుదల 21 వ శతాబ్దం చివరి నాటికి పెరుగుతున్న జనాభా ఒత్తిళ్లతో కలిపి, మిలియన్ల మంది ఈజిప్షియన్లను పర్యావరణ శరణార్థులుగా మార్చగలదని కొందరు వాతావరణ నిపుణుల అభిప్రాయపడ్డారు.

జీవవైవిద్యం

1992 జూన్ 9 న ఈజిప్టు రియో కన్వెన్షను ఆన్ బయోలాజికలు డైవర్సిటీపై సంతకం చేసింది. 1994 జూన్ 2 న సమావేశంలో పాల్గొన్నది. తరువాత జాతీయ జీవవైవిధ్య వ్యూహం, కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. 1998 జూలై 31 న సమావేశంలో వెలువరించబడింది. అనేక సి.బి.డి. నేషనలు బయోడైవర్శిటీ స్ట్రాటజీ, యాక్షను ప్లాన్సు జంతువులు, మొక్కలతో పాటు జీవవైవిధ్య సంరక్షణను విస్మరించాయి. అన్ని రకాల జీవితాల గురించి సమతుల్య సమాచారాన్ని అందించడంలో ఈజిప్టు ప్రణాళిక అసాధారణమైనదిగా భావించబడింది.

ఈజిప్టు నుండి వివిధ జాతిసమూహాల సంఖ్య నమోదు చేయబడిందని ప్రణాళిక పేర్కొంది: ఆల్గే (1483 జాతులు), జంతువులు (వీటిలో 15,000 జాతులు 10,000 కంటే ఎక్కువ కీటకాలు), శిలీంధ్రాలు (627 కంటే ఎక్కువ జాతులు), మోనెరా (319 జాతులు) ), మొక్కలు (2426 జాతులు), ప్రోటోజోవాన్లు (371 జాతులు). కొన్ని ప్రధాన సమూహాల ఉదాహరణకు లైకెన్-ఏర్పడే శిలీంధ్రాలు, నెమటోడు పురుగులు, సంఖ్య తెలియదు. ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు, సరీసృపాలు వంటి చిన్న, బాగా అధ్యయనం చేసిన సమూహాలు కాకుండా ఈజిప్టు నుండి మరిన్ని జాతులు నమోదు చేయబడినందున ఆ సంఖ్యలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు లైకెన్-ఏర్పడే జాతులతో సహా శిలీంధ్రాల కోసం, తరువాతి పనిలో ఈజిప్టు నుండి 2200 కు పైగా జాతులు నమోదయ్యాయని తేలింది. వాస్తవానికి దేశంలో ఉనికిలో ఉన్న శిలీంధ్రాల తుది సంఖ్య చాలా అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈజిప్టులో 284 స్థానిక గడ్డిజాతులు గుర్తించబడి నమోదు చేయబడ్డాయి.

ఆర్ధికరంగం

Share of world GDP (PPP)
Year Share
1980 0.69%
1990 0.83%
2000 0.86%
2010 0.96%
2017 0.95%
ఈజిప్టు 
Egypt Exports by Product (2014) from Harvard Atlas of Economic Complexity

ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, మాధ్యమం, పెట్రోలియం దిగుమతులు, సహజ వాయువు, పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంటుంది. 3 మిలియన్ల మంది ఈజిప్షియన్లు ప్రధానంగా లిబియా, సౌదీ అరేబియా, పెర్షియన్ గల్ఫ్, ఐరోపా దేశాలలో పనిచేస్తున్నారు. 1970 లో " అస్వాను హై " ఆనకట్ట పూర్తి తరువాత నాజరు సరస్సు ఈజిప్టు వ్యవసాయం, పర్యావరణ పరంగా నైలు నది ప్రాముఖ్యతకు ప్రత్యామ్నాయంగా మారింది. వేగంగా పెరుగుతున్న జనాభా, పరిమిత వ్యవసాయ అనుకూలమైన భూమి, నైలు నది ఆధారపడటం ఇవన్నీ వనరుల మీద అధిక పన్నులభారం పడడానికి కారణమై ఆర్థిక వ్యవస్థను వత్తిడిని అధికరింపజేసింది.

ప్రభుత్వం సమాచారరంగం భౌతిక మౌలిక నిర్మాణాలలో పెట్టుబడులు పెట్టింది. 1979 నుండి ఈజిప్టు యునైటెడు స్టేట్సు విదేశీ సహాయాన్ని పొందింది (సంవత్సరానికి సగటున 2.2 బిలియన్ల డాలర్లు). ఇరాకు యుద్ధం తరువాత యునైటెడు స్టేట్సు నుండి ఇటువంటి నిధులను పొందిన దేశాలలో ఈజిప్టు మూడవ స్థానంలో ఉంది. ఈజిప్టు ఆర్థికవ్యవస్థ ప్రధానంగా ఈ ఆదాయ వనరులపై ఆధారపడుతుంది: పర్యాటకం, విదేశాలలో పనిచేసే ఈజిప్షియన్ల నుండి చెల్లింపులు, సూయజు కాలువ నుండి వచ్చే ఆదాయాలు.

ఈజిప్టుకు బొగ్గు, చమురు, సహజ వాయువు, జలశక్తి ఆధారిత అభివృద్ధి చెందిన ఇంధన మార్కెట్టును ఉంది. ఈశాన్య సినాయిలో ఉన్న గణనీయమైన బొగ్గు నిక్షేపాల నుండి సంవత్సరానికి 6,00,000 టన్నుల (590,000 పొడవైన టన్నులు; 660,000 చిన్న టన్నులు) చొప్పున తవ్వబడతాయి. పశ్చిమ ఎడారి ప్రాంతాలు, సూయజు గల్ఫు, నైలు డెల్టాలో చమురు, సహజ వాయువు ఉత్పత్తి చేయబడతాయి. ఈజిప్టులో భారీగా గ్యాసు నిల్వలు ఉన్నాయి. వీటిని 2,180 క్యూబికు కి.మీ (520 క్యూ మై), ఎల్‌ఎన్‌జి 2012 వరకు అనేక దేశాలకు ఎగుమతి చేసింది. 2013 లో ఈజిప్టు జనరలు పెట్రోలియం కో (ఇజిపిసి) దేశం సహజ వాయువు ఎగుమతులను తగ్గిస్తుందని, ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి, రాజకీయ అశాంతిని నివారించడానికి ఈ వేసవిలో ఉత్పత్తిని మందగించాలని ప్రధాన పరిశ్రమలకు చెబుతుందని రాయిటర్సు నివేదించింది. ఈజిప్టు వేసవిలో ఖాతరు నుండి టాప్ లిక్విడు నేచురలు గ్యాసు (ఎల్‌ఎన్‌జి) ద్వారా అదనపు గ్యాసు వాల్యూంలను పొందవచ్చని గణిస్తుంది. అదే సమయంలో ఇజిపిసి చైర్మను " తారెక్ ఎల్ బర్కటవీ " అత్యధిక డిమాండు ఉన్న మాసాలలో ఫ్యాక్టరీలు తమ వార్షిక నిర్వహణను ప్లాను చేయమని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఈజిప్టు దాని స్వంత విద్యుత్తు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2008 నుండి నికర చమురు దిగుమతిదారుగా ఉంటూ సహజ వాయువు నికర దిగుమతిదారుగా వేగంగా మారుతోంది.

కైరో నుండి అలెగ్జాండ్రియాలోని శాన్ స్టెఫానో గ్రాండ్ ప్లాజా (ఎడమ)

.

ఈజిప్టు ఆర్థిక స్తబ్దత తరువాత ప్రభుత్వం మరింత ఉదార ఆర్థిక విధానాలను అవలంబించడంతో పాటు పర్యాటకం నుండి వచ్చే ఆదాయాలు, వృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్టు కారణంగా ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడటం ప్రారంభించాయి. అంతర్జాతీయ ఈజిప్టును ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) తన వార్షిక నివేదికలో ఆర్థిక సంస్కరణలను చేపట్టే ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా పేర్కొంది. 2003 నుండి ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రధాన ఆర్థిక సంస్కరణలలో కస్టమ్సు సుంకాలను నాటకీయంగా తగ్గించబడ్డాయి. 2005 లో అమలు చేయబడిన కొత్త పన్ను చట్టం కార్పొరేటు పన్నులను 40% నుండి ప్రస్తుత 20%కి తగ్గించింది. దీని ఫలితంగా 2006 నాటికి పన్ను ఆదాయంలో 100% పెరుగుదల జరిగింది.

ఈజిప్టు 
స్మార్టు విలేజు, హైటెకు వ్యాపారాల వృద్ధిని సులభతరం చేయడానికి 2001 లో స్థాపించబడిన వ్యాపార జిల్లా

పెట్టుబడుల మంత్రి మహమూదు హోస్నీ ముబారకును తొలగించే ముందు మొహీద్దిను తీసుకున్న ప్రైవేటీకరణ ఆర్థిక సరళీకరణ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ) 2006 లో 6 బిలియన్ల డాలర్లకంటే అధికస్థాయికి పెరిగాయి. తరువాత ఈజిప్టు విదేశీ పెట్టుబడులు, పర్యాటక ఆదాయాలు రెండింటిలోనూ భారీ పతనానికి గురైయ్యాయి. 60% విదేశీ మారక నిల్వలు తగ్గాయి, 3% వృద్ధి తగ్గాయి, ఈజిప్టు పౌండు వేగవంతమైన విలువ తగ్గింపు సంభవించింది.

ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఎదుర్కొంటున్న ప్రధాన అవరోధాలలో ఒకటి సగటు జనాభాకు సంపదను పరిమితం చేయడం ఒకటి. ఈజిప్టు ప్రభుత్వవిధానాలు ప్రాథమిక వస్తువుల ధరలను అధికరించాయని ఫలితంగా వారి జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి స్తంభించిందని చాలామంది ప్రజలు విమర్శిస్తున్నారు. అవినీతి ఆర్థిక వృద్ధికి ప్రధాన అవరోధంగా మారిందని ప్రజలు పేర్కొన్నారు. 2006 లో ఎటిసలాటు కొత్తగా సంపాదించిన మూడవ మొబైలు లైసెన్సు (3 బిలియన్ల డాలర్లు) కోసం చెల్లించిన డబ్బును ఉపయోగించి దేశం మౌలిక సదుపాయాల ప్రధాన పునర్నిర్మాణం చేస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. 2013 లో అవినీతి అవగాహన సూచిక ఈజిప్టు 177 దేశాలలో 114 వ స్థానంలో ఉంది.

ఈజిప్టు 
సూయజ్ కాలువ

ఈజిప్టులోని బహుళజాతి కంపెనీలలో ఒరాస్కాం గ్రూప్ & రాయ కాంటాక్టు సెంటరు ప్రాధాన్యత కలిగి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ఫర్మేషను టెక్నాలజీ (ఐటి) రంగం వేగంగా విస్తరించింది. అనేక స్టార్టపు సంస్థలు ఉత్తర అమెరికా, ఐరోపాకు అవుట్‌సోర్సింగు సేవలను విక్రయిస్తున్నాయి. మైక్రోసాఫ్టు, ఒరాకిలు, ఇతర ప్రధాన సంస్థలతో పాటు అనేక చిన్న, మధ్యస్థ సంస్థలతో పనిచేస్తున్నాయి. ఈ కంపెనీలలో కొన్ని ఎక్స్‌సైడ్ కాంటాక్ట్ సెంటర్, రాయ, ఇ గ్రూప్ కనెక్షన్లు, సి 3. ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త ఈజిప్టు వ్యవస్థాపకులు ఐటి రంగాన్ని ఉత్తేజపరిచారు.

విదేశాలలో పనిచేస్తున్న 2.7 మిలియన్ల ఈజిప్షియన్లు తమ చెల్లింపుల ద్వారా (2009 లో US $ 7.8 బిలియన్లు), సామాజిక మూలధనం, పెట్టుబడుల ద్వారా చురుకుగా ఈజిప్టు ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నారు. ఈజిప్షియన్లు విదేశాలలో నివసిస్తూ ఇంటికి పంపిన డబ్బు 2012 లో రికార్డు స్థాయిలో 21 బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

ఈజిప్షియన్ల ఆదాయం అందుబాటులో కొంచం అసమానతలు ఉంటాయి. 35% నుండి 40% ప్రజల దినసరి ఆదాయం ఒక రోజుకు 2 అమెరికా డాలర్లకంటే తక్కువగా ఉంటుంది. 2-3% ప్రజలు మాత్రమే సంపన్నులుగా ఉన్నారు.

పర్యాటకం

ఈజిప్టు 
Muizz Street. Old Cairo has the greatest concentration of medieval architectural treasures in the Islamic world.

ఈజిప్టు ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. 2008 లో 12.8 మిలియన్లకు పైగా పర్యాటకులు ఈజిప్టును సందర్శించారు. ఇది దాదాపు 11 బిలియన్ల ఆదాయాన్ని అందించింది. ఈజిప్టులో 12% ఉద్యోగులు పర్యాటక రంగంలో పనిచేస్తున్నారు. పర్యాటక మంత్రి హిషాం జాజౌ పరిశ్రమ నిపుణులు, విలేకరులతో మాట్లాడుతూ 2012 లో పర్యాటకం 9.4 బిలియన్ల డాలర్లు సంపాదించిందని వెల్లడించాడు. 2011 లో చూసిన 9 బిలియన్ల డాలర్లు ఉంది.

ఈజిప్టు 
హుర్ఘడ సమీపంలోని రిసార్ట్ టౌన్ సహల్ హషీషు

ప్రస్తుతం ఉనికిలో ఉన్న పురాతన ప్రపంచం ఏడువింతలలో ఒకటైన గిజా నెక్రొపోలిసు అత్యధికస్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

మధ్యధరా సముద్రం లోని ఈజిప్టు సముద్రతీరాలు, ఎర్రసముద్రం (3000 కి.మీ విస్తరించింది)లతో అఖ్వాబా ఖాతం సముద్రతీరాలు, సఫాగా, షర్ము ఎల్ షేక్, హుర్ఘడా, లక్సరు, దహాబు, రాసు సిద్రు, మర్సా ఆలం పర్యాటక ఆకర్షణలలో ప్రాముఖ్యత వహిస్తున్నాయి.

విద్యుత్తు

ఈజిప్టు 
An offshore platform in the Darfeel Gas Field.

2013 లో ఒపెకు మినహాయింపుగా 2,141.05 టిసిఎఫ్ సహజ వాయువు, 6,91,000 చమురు ఉత్పత్తిదారుగానూ ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద పొడి సహజ వాయువు ఉత్పత్తిదారుగానూ గుర్తించబడుతుంది. 2013 లో ఈజిప్టు ఆఫ్రికాలో అత్యధికంగా చమురు, సహజ వాయువును వినియోగించే దేశంగా ఉంది. ఎందుకంటే ఈజిప్టు ఆఫ్రికాలో మొత్తం చమురు వినియోగంలో 20% కంటే అధికం, మొత్తం పొడి సహజ వాయువు వినియోగంలో 40% కంటే అధికం వినియోగిస్తుంది. అలాగే ఈజిప్టు ఆఫ్రికాలో అతిపెద్ద చమురు శుద్ధి సామర్ధ్యం (726,000 బిబిఎల్ / డి (2012 లో)) కలిగి ఉంది.

ఈజిప్టు ప్రస్తుతం ఉత్తర భాగంలో రష్యా ఫైనాన్సింగులో (25 బిలియన్ల డాలర్లు)ఎల్ డాబాలో తన మొదటి అణు విద్యుతు ప్లాంటును నిర్మించాలని యోచిస్తోంది.

రవాణా సౌకర్యాలు

ఈజిప్టులో రవాణా కైరో చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఎక్కువగా నైలు నది ఆధారిత రవాణా విధానాన్ని అనుసరిస్తుంది. దేశంలో 40,800 కిలోమీటర్ల (25,400 మైళ్ళు) పొడవైన రైల్వే నెట్‌వర్కు ఉంది. ప్రధాన రైలుమార్గం అలెగ్జాండ్రియా నుండి అస్వాను వరకు నిర్మించబడింది. ఇది ఈజిప్టు జాతీయ రైల్వే నిర్వహణలో పనిచేస్తుంది. వాహన రహదారి నెట్‌వర్కు వేగంగా 21,000 మైళ్ళకు విస్తరించింది. ఇందులోని 28 రైలుమార్గాలలో 796 స్టేషన్లు, నైలు లోయ, నైలు డెల్టా మార్గాలలో 1800 రైళ్ళు నడిచాయి. వీటిలో మధ్యధరా, ఎర్ర సముద్రం తీరాలు, సినాయి, పశ్చిమ ఒయాసిసు ఉన్నాయి.

ఈజిప్టు 
కైరో మెట్రో (మార్గం 2)

ఈజిప్టులోని "కైరో మెట్రో" ఆఫ్రికా, అరబ్బు ప్రపంచంలోని రెండు పూర్తి స్థాయి మెట్రో వ్యవస్థలలో మొదటిది. ఈజిప్టులో 12 బిలియన్ల ఈజిప్టు పౌండ్ల ఖర్చుతో నిర్మించబడిన ఇది ఇటీవలి నిర్మించబడిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వ్యవస్థ మూడు కార్యాచరణ పంక్తులతో భవిష్యత్తులో నాలుగవ మార్గం నిర్మించాలని ప్రణాళిక వేయబడింది.

1932 లో ఈజిప్టు పారిశ్రామికవేత్త తలాతు హర్బు ఈజిప్టు ప్రభుత్వ యాజమాన్యంలో ఈజిప్టు ఎయిరు, ప్రస్తుతం దేశంలోని జెండా క్యారియరుగానూ అతిపెద్ద విమానయాన సంస్థను స్థాపించాడు. ఈ విమానయాన సంస్థ కైరో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. దాని ప్రధాన కేంద్రం 75 గమ్యాలకు (మిడిలు ఈస్టు, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాలు) ప్రయాణీకులు, సరుకు రవాణా సేవలు అందిస్తుంది. ప్రస్తుత " ఈజిప్టు ఎయిరు " విమానసమూహంలో 80 విమానాలు ఉన్నాయి.

సూయజు కాలువ

ఈజిప్టు 
The Suez Canal Bridge.

ఈజిప్టులో కృత్రిమ సముద్ర మట్టంలో నిర్మించబడిన సూయజుకాలువ జలమార్గం మధ్యప్రాచ్యంలో సముద్ర రవాణాకు అత్యంత ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇది మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను అనుసంధానం చేస్తుంది. ఇది 10 సంవత్సరాల నిర్మాణ పనుల తరువాత 1869 నవంబరులో ప్రారంభించబడింది. ఇది ఆఫ్రికా చుట్టూ సముద్రమార్గంలో ప్రయాణించకుండా ఐరోపా, ఆసియా మధ్య ఓడ రవాణాకు అవకాశం కల్పిస్తుంది. ఉత్తర టెర్మినసు పోర్టు సైడు, దక్షిణ టెర్మినసు సూయజు నగరంలో పోర్టు తవ్ఫికు అంటారు. సగం మార్గం నుండి 3 కిలోమీటర్లు (1.9 మైళ్ళు) పడమటి ఒడ్డున ఇస్మాయిలియా ఉంది.

2010 నాటికి ఈ కాలువ 193.30 కిలోమీటర్లు (120.11 మైళ్ళు) పొడవు, 24 మీటర్లు (79 అడుగులు) లోతు, 205 మీటర్లు (673 అడుగులు) వెడల్పుతో ఉంది. ఉత్తరమార్గ కాలువ 22 కిలోమీటర్ల (14 మైళ్ళు) (14 మైళ్ళు) కలిగి ఉంది. కాలువ 162.25 కిలోమీటర్లు (100.82 మైళ్ళు), దక్షిణమార్గ కాలువ 9 కిలోమీటర్లు (5.6 మైళ్ళు). ఈ కాలువ బల్లా బై-పాసు, గ్రేటు బిట్టరు సరస్సుల మద్య ఒక ఇరుకైన మార్గంలో ప్రయాణిస్తుంది. దీనికి లాకులు ఉండవు. కాలువ గుండా సముద్రపు నీరు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. సాధారణంగా బిట్టరు సరస్సుల ఉత్తరాన ఉన్న కాలువ శీతాకాలంలో ఉత్తరమార్గంలో, వేసవిలో దక్షిణమార్గంలో ప్రవహిస్తుంది. సరస్సుల దక్షిణమార్గంలోని సూయజు వద్ద ఆటుపోట్లతో జలప్రవాహం మారుతుంది.

2014 ఆగస్టు 26 న కొత్త సూయజు కాలువ తెరవాలన్న ప్రతిపాదన వచ్చింది. 2015 జూలైలో కొత్త సూయజు కాలువ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన బడ్జెట్లకు అనుగుణంగా, 2015 ఆగస్టు 6 న విదేశీ నాయకులు హాజరైన, సైనిక ఫ్లైఓవర్లను ప్రదర్శించే కార్యక్రమంతో ఈ ఛానెలు అధికారికంగా ప్రారంభించబడింది.

మంచినీటి సరఫరా, పారిశుద్ధం

ఈజిప్టులో నీటి సరఫరా 1990 - 2010 మధ్య పట్టణ ప్రాంతాలలో 89% నుండి 100% నికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతాలలో 39% నుండి 93% నికి అధికరించింది. ఆ కాలంలో ఈజిప్టు గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన అలవాటు తొలగింపును సాధించింది. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టింది. ఈజిప్టులో మెరుగైన నీటి వనరులకు ప్రాప్యత ఇప్పుడు 99% ఉంది. జనాభాలో సగం మంది శానిటరీ మురుగు కాలువలతో అనుసంధానించబడ్డారు.

పారిశుద్ధ్యం తక్కువగా ఉన్నందున ప్రతి సంవత్సరం 17,000 మంది పిల్లలు అతిసారం కారణంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో అతి తక్కువ ఉన్న నీటి సుంకాల కారణంగా సౌకర్యాలకు అవసరమైనంత నిధులకొరత సమస్యగా పరిణమించింది. దీనికి నిర్వహణ వ్యయాలకు కూడా ప్రభుత్వ రాయితీలు అవసరం ఔతుంటాయి. అరబు తురుగుబాటు తరువాత సుంకం పెరగకుండా జీతం పెరుగుదల కారణంగా పరిస్థితి తీవ్రతరం అయింది. నీరు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు పరిమిత ప్రభుత్వ జవాబుదారీతనం, పారదర్శకతలేని కారణంగా పేలవమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఈజిప్టు 
Green irrigated land along the Nile amidst the desert and in the delta

నీటిపారుదల

ఈజిప్టు వర్షపాతం అత్యంత తక్కువగా ఉన్నందున వ్యవసాయం పూర్తిగా నీటిపారుదల మీద ఆధారపడి ఉంటుంది. ఈజిప్టు ప్రధాన నీటి వనరు నైలు నది. అస్వాను సమీపంలో నిర్మించబడిన బృహత్తరమైన ఆనకట్ట ద్వారా నదీ జలాలు నియంత్రించబడుతూ వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యం అందించబడుతుంది. ఇది వార్షికంగా అందిస్తున్న 55 ఘనకిలోమీటర్ల (4,50,00,000 ఘన.ఎ) 46 ఘన.కి.మీ, (3,70,00,000 ఘ.ఎ) నీటిపారుదలకు అందించబడుతుంది.

నైలు లోయ, డెల్టా ప్రాంతాలలో 33,600 చ.కి.మీ (13,000 మంది, (13,000 చ.మై) ప్రాతానికి ఈ ప్రవాహజలాలు నీటిపారుదల సౌకర్యం అందించబడుతుంది.

గణాంకాలు

ఈజిప్టు 
Egypt's population density (people per km2).
Historical populations in thousands
సంవత్సరంజనాభా±% p.a.
1882 6,712—    
1897 9,669+2.46%
1907 11,190+1.47%
1917 12,718+1.29%
1927 14,178+1.09%
1937 15,921+1.17%
1947 18,967+1.77%
1960 26,085+2.48%
1966 30,076+2.40%
1976 36,626+1.99%
1986 48,254+2.80%
1996 59,312+2.08%
2006 72,798+2.07%
2013 84,314+2.12%
2017 94,798+2.97%
Source: Population in Egypt

ఈజిప్టు మద్యతూర్పు దేశాలలో అత్యధిక జనసాంధ్రత కలిగిన దేశంగా ఉంది. 2017 నాటికి 95 మిలియన్ల జనాభాతో ఈజిప్టు ఆఫ్రికా ఖండంలో 3 వ స్థానంలో ఉంది. 1970 - 2010 మద్య కాలంలో ఈజిప్టు జనసాంధ్రత, వ్యవసాయ ఉత్పత్తి వేగవంతంగా అభివృద్ధి చెందింది. హరిత విప్లవంతో వ్యవసాయం చైతన్యవంతంగా మారింది. 1978 లో నెపోలియను దండెత్తిన సమయంలో ఈజిప్టు జనసంఖ్య 3 మిలియన్లు ఉండేదని భావించబడింది.

ఈజిప్టు పట్టణీకరణ అధికంగా ఉంది. ప్రజలు అధికంగా నైలు నది (ముఖ్యంగా కైరో, అలెగ్జాండ్రియా)డెల్టా, సూయజు కాలువ సమీపంలో కేంద్రీకృతమై ఉన్నారు. ఈజిప్షియన్లు ప్రధాన పట్టణ కేంద్రాలలో నివసించేవారు, గ్రామీణ గ్రామాలలో నివసించే ఫెల్లహిన్లు (రైతులు) అని రెండువర్గాలుగా విభజించబడ్డారు. మొత్తం జనావాస ప్రాంతం 77,041 చ.కి.మీ మాత్రమే ఉంది. జనసాంద్రత బంగ్లాదేశ్ మాదిరిగానే కిమీ 2 కు 1,200 మందికి పైగా ఉంటుంది.

నాజరు పాలనలో వలసలు పరిమితం చేయబడినప్పటికీ అరబ్బు ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో వేలాది మంది ఈజిప్టు నిపుణులను విదేశాలకు పంపించారు. 1971 లో అధ్యక్షుడు సదాతు ఆధ్వర్యంలో ఈజిప్టు వలస సరళీకృతం చేయబడిన తరువాత 1973 లో చమురు సంక్షోభం తరువాత రికార్డు స్థాయిలో చేరుకుంది. 2.7 మిలియన్ల ఈజిప్షియన్లు విదేశాలలో నివసిస్తున్నారని అంచనా. ఈజిప్టు వలసదారులలో సుమారు 70% మంది అరబ్బు దేశాలలో నివసిస్తున్నారు (సౌదీ అరేబియాలో 9,23,600, లిబియాలో 3,32,600, జోర్డానులో 2,26,850, కువైటులో 1,90,550), మిగిలిన 30% ఐరోపా, ఉత్తర అమెరికాలో నివసిస్తున్నారు. (3,18,000 మంది) యునైటెడు స్టేట్సు, కెనడాలో 1,10,000, ఇటలీలో 90,000). 1950 ల నుండి అరబు- దేశాలు కాక ఇతర దేశాలకు వలస వెళ్ళే ప్రక్రియ కొనసాగుతోంది.

సంప్రదాయ సమూహాలు

సంప్రదాయ ఈజిప్షియన్లు దేశంలో (మొత్తం జనాభాలో 91% మంది) అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. అల్పసంఖ్యాక ప్రజలలో తూర్పు ఎడారులలో నివసిస్తున్న అబాజాసు, టర్కుప్రజలు, గ్రీకులు, బెడౌయిను అరబు తెగలకు చెందిన ప్రజలు ఉన్నారు. సినాయి ద్వీపకల్పంలో సివా ఒయాసిసు ప్రాంతంలో బెర్బెరు మాట్లాడే సివిసు (అమాజిగు) ప్రజలు, నైలు నదీ తీరంలో నివసించే న్యూబియను ప్రజలు ఉన్నారు. దేశంలోని ఆగ్నేయ-మూలలో గిరిజన బేజా వర్గాలు కేంద్రీకృతమై ఉన్నారు. నైలు డెల్టా, ఫైయుంలోని అనేక డోం వంశాలు పట్టణీకరణ పెరిగేకొద్దీ క్రమంగా కలిసిపోతున్నాయి.

ఈజిప్టులో 5 మిలియన్ల మంది వలసదారులు నివసిస్తున్నారు. వీరిలో అధికంగా సుడానీప్రజలు ఉన్నారు. "వీరిలో కొందరు తరతరాలుగా ఈజిప్టులో నివసిస్తున్న వారు ఉన్నారు." ఇరాక్, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సూడాన్, ఎరిట్రియా దేశాలకు చెందిన ప్రజలు తక్కువ సంఖ్యలో ఉన్నారు.

ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనరు కార్యాలయం అంచనాల ఆధారంగా మొత్తం "సమస్యాత్మక స్థితిలో ఉన్న ప్రజలు" (శరణార్థులు, ఆశ్రయంకోరే ప్రజలు, స్థితిలేని ప్రజలు) 2,50,000 మంది ఉన్నారని అంచనా వేశారు. 2015 లో ఈజిప్టులో నమోదైన సిరియా శరణార్థుల సంఖ్య 1,17,000. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. ఈజిప్టులో అర మిలియను మంది సిరియా శరణార్థులు నివసిస్తున్నారని ఈజిప్టు ప్రభుత్వం పేర్కొంది. ఈజిప్టులో 28,000 నమోదిత సుడానీ శరణార్థులు ఉన్నారు.

ఈజిప్టులో ఒకప్పుడు శక్తివంతంగా ఉన్న ప్రాచీన గ్రీకు, యూదు సమాజాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. దేశంలో కొద్ది సంఖ్యలో మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది ఈజిప్టు యూదులు మతపరమైన లేదా ఇతర సందర్భాలలో, పర్యాటక రంగాలను సందర్శిస్తారు. కైరో, అలెగ్జాండ్రియా, ఇతర నగరాలలో అనేక ముఖ్యమైన యూదుల పురావస్తు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

భాషలు

రిపబ్లికు అధికారిక భాషగా అరబిక్కు ఉంది. వాడుకలో ఉన్న భాషలు: ఈజిప్టు అరబికు (68%), సాయిది అరబిక్ (29%), తూర్పు ఈజిప్షియన్ బెడావి అరబిక్ (1.6%), సుడానీస్ అరబిక్ (0.6%), డోమారి (0.3%), నోబిను (0.3%), బేజా (0.1%), సివి, ఇతర భాషలు ఉన్నాయి. అదనంగా గ్రీకు, అర్మేనియను, ఇటాలియను ఉన్నాయి. ఇటీవల, ఆఫ్రికను భాషలైన అమ్హారికు, టిగ్రిగ్నా వలసదారుల ప్రధాన భాషలుగా ఉన్నాయి.

ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మను, ఇటాలియన్ భాషలు పాఠశాలల్లో బోధించే ప్రధాన విదేశీ భాషలలో ప్రజాదరణపొందిన భాషలుగా ఉన్నాయి.

చారిత్రాత్మకంగా వాడుకలో ఉన్న ఈజిప్షియన్ భాష తాజాగా కాప్టికు ఈజిప్షియన్ భాషగా రూపాంతరం చెందింది. 17 వ శతాబ్దం నాటికి స్పోకెన్ కాప్టికు ఎక్కువగా అంతరించిపోయింది. కాని 19 వ శతాబ్దం చివరి నాటికి ఎగువ ఈజిప్టులో ఉనికిలో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది అలెగ్జాండ్రియాలోని కాప్టిక్ ఆర్థోడాక్సు చర్చి ప్రార్థనా భాషగా వాడుకలో ఉంది. ఇది ఆఫ్రోసియాటిక్ భాషల కుటుంబంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పరుస్తుంది.

మతం

ఈజిప్టు ప్రధానంగా మతంగా సున్నీ ముస్లిం ఉంది. ఈజిప్టులో వివిధ మతాలకు చెందిన ప్రజల శాతంలో వివాదాస్పద అంశంగా ఉంది. జనాభా లెక్కలు లేనికారణంగా సంఖ్యలు ఖచ్ఛితంగా తెలియకపోయినా ఈజిప్టులో 85-90% మంది ముస్లింలు, 10–15% మంది కాప్టికు క్రైస్తవులు, 1% ఇతర క్రైస్తవ వర్గాలు ఉన్నట్లు గుర్తించబడ్డారు. ఇతర అంచనాల ప్రకారం క్రైస్తవ జనాభా 15-20% వరకు ఉంది. " మైక్రోసాఫ్టు ఎంకార్టా ఆన్లైను " సున్నీ ప్రజల శాతం 90% ఉందని అంచనా వేసింది. " ప్యూ ఫోరం ఆన్ రిలీజియను అండు పబ్లికు లైఫ్ " ముస్లిం పజల శాతం 94.6% ఉన్నట్లు అంచనా వేసింది. 2017 లో ప్రభుత్వ వార్తాపత్రిక " అల్ అహ్రం " క్రైస్తవుల శాతం 10-15% ఉన్నట్లు అంచనా వేసింది.}} నాన్-డినామినేషను ముస్లిములు 12% ఉన్నట్లు అంచనా వేసింది.

7 వ శతాబ్దానికి ముందు ఈజిప్టు ఒక క్రైస్తవ దేశంగా ఉంది. ఇస్లాం వచ్చిన తరువాత, ఆ దేశం క్రమంగా ఇస్లామీకరణ చేయబడి ముస్లిం ఆధిక్య దేశంగా మారింది. 1000 నుండి 14 వ శతాబ్దం వరకు ముస్లిముల ఆధిక్యత సాగింది. ఈజిప్టు ముస్లిం ప్రపంచంలో రాజకీయ, సంస్కృతికి కేంద్రంగా ఉద్భవించింది. అన్వరు సదాతు పాలనలో ఇస్లాం అధికారిక దేశమతం, షరియా చట్ట ప్రధాన వనరుగా మారింది. 15 మిలియన్ల మంది ఈజిప్షియన్లు స్థానిక సూఫీ ఆదేశాలను అనుసరిస్తారని అంచనా చాలా మంది ఈజిప్టు సూఫీలు అధికారికంగా సూఫీ ఆర్డరుతో నమోదు చేయబడనందున ఈ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని సూఫీ నాయకత్వం పేర్కొంది. 2017 నవంబరులో సినాయిలోని సూఫీ మసీదు మీద దాడిలో కనీసం 305 మంది మరణించారు.

ఈజిప్టులో కొంత అల్పసంఖ్యాక షియా ప్రజలు కూడా ఉన్నారు. జెరూసలేం సెంటరు ఫర్ పబ్లికు అఫైర్సు షియా జనాభాను 1 - 2.2 మిలియన్లు లేక 3 మిలియన్లు ఉంటుందని అంచనా. అహ్మదీయ జనాభా 50,000 కన్నా తక్కువ, సలాఫీ (అల్ట్రా-కన్జర్వేటివ్) జనాభా ఐదు నుండి 6 మిలియన్లుగా అంచనా వేయబడింది. కైరో అనేక మసీదు మినార్లకు ప్రసిద్ధి చెందింది. దీనిని "ది సిటీ ఆఫ్ 1,000 మినారెట్సు"గా పిలుస్తారు.

ఈజిప్టు 
St. Mark Coptic Cathedral in Alexandria

ఈజిప్టులోని క్రైస్తవ జనాభాలో 90% పైగా " ఓరియంటలు ఆర్థోడాక్సు క్రిస్టియను చర్చి " (అలెగ్జాండ్రియా స్థానిక కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చి) చెందినవారు ఉన్నారు. ఇతర స్థానిక ఈజిప్షియను క్రైస్తవులు కోప్టికు కాథలికు చర్చి, ఎవాంజెలికలు చర్చి ఆఫ్ ఈజిప్టు, అనేక ఇతర ప్రొటెస్టంటు తెగలకు చెందినవారు ఉన్నారు. కైరో, అలెగ్జాండ్రియా పట్టణ ప్రాంతాలలో గ్రీకు కాథలికు, గ్రీకు ఆర్థోడాక్సు, మెరోనైటు కాథలికు వర్గాలకు చెందిన సిరో-లెబనీయులు వంటి స్థానికేతర క్రైస్తవ సంఘాలు ఎక్కువగా కనిపిస్తాయి.

జాతి గ్రీకులలో గతంలో అత్యధిక గ్రీకు ఆర్థోడాక్సు ఉన్నారు. అదేవిధంగా అర్మేనియన్లలో అప్పటి పెద్ద అర్మేనియను ఆర్థోడాక్సు, కాథలికు వర్గాలు ఉన్నాయి. ఈజిప్టులో పెద్ద రోమను కాథలికు సమాజం కూడా ఉండేది. వీరిలో ఎక్కువగా ఇటాలియన్లు, మాల్టీలు ఉన్నారు. ఈజిప్టులో ఈ స్థానికేతర సంఘాలు నాజరు పాలనకు ముందుకు చాలా పెద్దవిగా ఉన్నాయి.

ఈజిప్టు ఆతిథ్యం ఇస్తున్న అలెగ్జాండ్రియాలోని కాప్టికు ఆర్థోడాక్సు చర్చి మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అతిపెద్ద చర్చిగా పరిగణించబడుతుంది. ఇది మొదటి శతాబ్దంలో స్థాపించబడింది.

ఈజిప్టు అల్-అజారు విశ్వవిద్యాలయం (సా.శ. 969 లో స్థాపించబడి సా.శ. 975 లో బోధించడం ప్రారంభించింది) ప్రస్తుతం ప్రపంచంలోని సున్నీ ఇస్లాం స్థాపన అత్యంత ప్రభావవంతమైనదిగా ఉంది. నిరంతరాయంగా నడుస్తున్న పురాతనమైనది ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ఇది రెండవది.

ఈజిప్టు ఇస్లాం, క్రైస్తవ మతం, జుడాయిజం అనే మూడు మతాలను మాత్రమే గుర్తించింది. చిన్న బహాయి, అహ్మదీ సమాజం, ఇతర విశ్వాసాల వంటి అల్పసంఖ్యాక ముస్లిం వర్గాలను రాజ్యాంగం గుర్తించలేదు. ఈ సమూహాలు ఈజిప్టు జాతీయ భద్రతకు ముప్పుగా ముద్రవేస్తూ ప్రభుత్వం వీరిని హింసకు గురిచేస్తుంది. బహాయిలు, నాస్తికులుకు చెందిన ప్రజలు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులలో తమ మతాన్ని (లేదా లేకపోవడం) చేర్చాలని కోరుకున్నప్పటికీ నిరాకరిస్తారు (ఈజిప్టు గుర్తింపు కార్డు వివాదం చూడండి). వీరు తమకు అవసరమైన గుర్తింపును పొందలేని స్థితి లేదా వారి విశ్వాసం గురించి అబద్ధం చెప్పవలసిన స్థితిలో ఉంటారు. 2008 లో గుర్తించబడని విశ్వాసాల సభ్యులను గుర్తింపు పొందటానికి, మత క్షేత్రాన్ని ఖాళీగా ఉంచడానికి కోర్టు అనుమతించింది.

సంస్కృతి

ఈజిప్టు 
Bibliotheca Alexandrina is a commemoration of the ancient Library of Alexandria

అరబికు మాట్లాడే ప్రపంచంలో ఈజిప్టు సాంస్కృతిక ధోరణి గుర్తింపు పొందింది. ఈజిప్టు సాహిత్యం, సంగీతం, చలనచిత్రం, టెలివిజను సమకాలీన అరబికు మధ్య-తూర్పు సంస్కృతిని ప్రభావితం చేసింది. 1950 - 1960 లలో ఈజిప్టు ప్రాంతీయ నాయకత్వ పాత్రను వహించడం అరబికు మాట్లాడే ప్రపంచంలో ఈజిప్టు సంస్కృతికి శాశ్వతమైన ప్రోత్సాహం లభించింది.

ఈజిప్టు 
Al-Azhar Park is listed as one of the world's sixty great public spaces by the Project for Public Spaces

అల్-అజారు పార్కు ప్రపంచంలోని 60 గొప్ప బహిరంగ ప్రదేశాలలో ఒకటిగా ప్రాజెక్టు ఫర్ పబ్లికు స్పేసెసు జాబితాలో చేర్చబడింది. ఈజిప్టు దీర్ఘకాల చరిత్రలో ఇస్లాం, క్రైస్తవ మతం, జుడాయిజం, కొత్త భాష, అరబికు భాషావాడుకరులు, ఈజిప్టు అరబికు (అనేక ప్రాచీన ఈజిప్టు పదాలపై కూడా ఆధారపడింది) ఈజిప్టుకు గుర్తింపు కలిగింపజేస్తుంది.

19 వ శతాబ్దం ప్రారంభంలో పండితుడు రిఫా అల్-తహ్తావి చేసిన కృషి ఈజిప్టు ప్రాచీనతపై ఆసక్తిని పునరుద్ధరించి ఈజిప్టు సమాజాన్ని జ్ఞానోదయ సూత్రాలను బహిర్గతం చేసింది. విద్యా సంస్కర్త అలీ ముబారకుతో కలిసి తహ్వాతి స్థాపించిన ఈజిప్టు చరిత్రను, భాషను, పురాతన వస్తువుల అధ్యయనం చేసిన సుయుతి, మక్రిజి వంటి మధ్యయుగ ఈజిప్టు పండితులకు ప్రేరణ కలిగించింది.

19 వ శతాబ్దం చివరలో 20 వ శతాబ్దం ప్రారంభంలో ముహమ్మదు అబ్దుహు, అహ్మదు లుట్ఫీ ఎల్-సయీదు, ముహమ్మద్ లౌత్ఫీ గౌమా, తవ్ఫికు ఎల్-హకీం, లూయిసు అవదు, ఖాసిం అమిను, సలామా మౌసా, తహా హుస్సేను, మహమ్మౌను వంటి వ్యక్తుల కృషి ద్వారా గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, లౌకికవాదం, విజ్ఞానశాస్త్రంలో విశ్వాసం పట్ల పురోగతి తీసుకురావడానికి వారు ఈజిప్టు కోసం ఒక ఉదార మార్గాన్ని రూపొందించారు.

కళలు

ఈజిప్టు 
The weighing of the heart scene from the Book of the Dead.

ఈజిప్షియన్లు కళ, వాస్తుశిల్పం, డిజైను అంశాలను క్రోడీకరించిన మొదటి ప్రధాన నాగరికతలలో ఒకటిగా గుర్తించబడుతుంది. కాల్షియం రాగి సిలికేటు అని పిలువబడే ఈజిప్టు నీలం ఈజిప్షియన్లు వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది మొదటి కృత్రిమ వర్ణద్రవ్యంగా భావించబడుతుంది. ఫారోల సేవలో చేసిన కుడ్యచిత్రాలు దృశ్య నియమాలు, అర్థాలు, కఠినమైన సంకేతాలను అనుసరించాయి. ఈజిప్టు నాగరికత దాని భారీ పిరమిడ్లు, దేవాలయాలు, స్మారక సమాధులకు ప్రసిద్ధి చెందింది.

పురాతన వాస్తుశిల్పం, నిర్మాణనైపుణ్యాలకు సింహిక, అబూ సింబెలు ఆలయం రూపొందించిన పిరమిడ్ ఆఫ్ జొజరు ప్రసిద్ధ ఉదాహరణలుగా ఉన్నాయి. ఆధునిక, సమకాలీన ఈజిప్షియను కళ ప్రపంచ కళాసంస్కృతిలో విభిన్నంగా ఉంటుంది. హసను ఫాతి, రాంసేసు విస్సా వాస్సెఫు స్థానిక వాస్తుశిల్పం, మహమూదు మోఖ్తరు శిల్పాలు వరకు, ఐజాకు ఫానసు విలక్షణమైన కాప్టికు ఐకానోగ్రఫీ వరకు విభిన్నంగా ఉంటుంది. కైరో ఒపెరా హౌసు ఈజిప్టు రాజధానిలో ప్రధాన ప్రదర్శన కళల వేదికగా పనిచేస్తుంది.

సాహిత్యం

ఈజిప్టు 
Naguib Mahfouz, the first Arabic-language writer to win the Nobel Prize in Literature.

పురాతన ఈజిప్టు నుండి ఈజిప్టు సాహిత్యం అభివృద్ధి చెందింది. ఈజిప్టు సాహిత్యం పురాతన సాహిత్యాలలో ఒకటిగా గుర్తించబడింది. ప్రస్తుతం మనకు తెలిసిన పుస్తకరూపంలో సాహిత్యాన్ని అభివృద్ధి చేసిన వారిలో ఈజిప్షియన్లు ప్రథమస్థానంలో ఉన్నారు. ఇది ఈజిప్టు సాంస్కృతిలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక అంశంగా భావించబడుతుంది. ఈజిప్టు నవలా రచయితలు, కవులు అరబికు సాహిత్యంలో ఆధునిక శైలులతో ప్రయోగాలు చేసారు. వారు అభివృద్ధి చేసిన రూపాలు మధ్యప్రాచ్యం అంతటా విస్తృతంగా అనుకరించబడ్డాయి. 1913 లో ఈజిప్టు భాషలో ముహమ్మదు హుస్సేను హాయకాలు రాసిన మొట్టమొదటి ఆధునిక ఈజిప్టు నవల జైనాబు ప్రచురించబడింది. ఈజిప్టు నవలా రచయిత నాగుయిబు మహాఫౌజు సాహిత్యంలో నోబెలు బహుమతి పొందిన మొదటి అరబికు భాషా రచయిత. ఈజిప్టు మహిళా రచయితలలో నవాలు ఎల్ సాదావి, మహిళలు, సంప్రదాయం గురించి వ్రాసే అలీఫా రిఫాతు స్త్రీవాద క్రియాశీలతకు ప్రసిద్ధి చెందారు.

రచనల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈజిప్షియన్లలో అహ్మదు ఫౌదు నెగ్ము (ఫగుమి), సలా జహీను, అబ్దేలు రెహ్మాను ఎల్-అబ్నుడి వెర్నాక్యులర్ కవిత్వం బహుశా అత్యంత ప్రాచుర్యం పొందిన సాహిత్య ప్రక్రియ.[ఆధారం చూపాలి]

మాధ్యమం

ఈజిప్టు మాధ్యమాన్ని అరబు ప్రపంచం అంతటా అత్యధికంగా ప్రభావితం చేసింది. దీనికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, ప్రభుత్వ నియంత్రణ నుండి స్వేచ్ఛ అభివృద్ధి చెందింది. రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛకు హామీ ఉన్నప్పటికీ అనేక చట్టాలు ఇప్పటికీ ఈ హక్కును పరిమితం చేస్తాయి.

చలన చిత్రాలు

ఈజిప్టు 
Suad Husni, film star.

ధ్వని రాకతో ఈజిప్టు సినిమా ప్రాంతీయ శక్తిగా మారింది. 1936 లో పారిశ్రామికవేత్త తలాతు హర్బు చేత ఆర్థిక సహాయం చేయబడిన స్టూడియో మిస్రు ఈజిప్టులోని ప్రముఖ స్టూడియోగా అవతరించింది. ఈ పాత్ర మూడు దశాబ్దాలుగా కొనసాగించింది. 100 సంవత్సరాలకంటే అధికమైన ఈజిప్టు చలనచిత్ర చరిత్రలో 4000 కన్నా ఎక్కువ సినిమాలు నిర్మించబడ్డాయి. ఇది మొత్తం అరబు ఉత్పత్తిలో నాల్గింట మూడు వంతులు ఉంది. అరబు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నటులు కీర్తి కోసమే ఈజిప్టు సినిమాల్లో కనిపించాలని కోరుకుంటారు. కైరో ఇంటర్నేషనలు ఫిల్ము ఫెస్టివలును 11 చలనచిత్ర ఉత్సవాలలో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా టాప్ క్లాసు రేటింగుతో ఇంటర్నేషనలు ఫెడరేషను ఆఫ్ ఫిల్ము ప్రొడ్యూసర్సు అసోసియేషను వర్గీకరించింది.

సంగీతం

ఈజిప్టు సంగీతం స్వదేశీ, మధ్యధరా, ఆఫ్రికా, పాశ్చాత్య అంశాల గొప్ప మిశ్రమం. ఇది ప్రాచీన కాలం నుండి ఈజిప్టు సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. పురాతన ఈజిప్షియన్లు తమ దేవుళ్ళలో ఒకరైన హాథోరు సంగీత ఆవిష్కర్తగా భావిస్తారు. ఒసిరిసు ప్రజలను నాగరికులుగా మార్చే ప్రయత్నంలో భాగంగా సంగీతాన్ని ఉపయోగించారు. అప్పటి నుండి ఈజిప్షియన్లు సంగీత వాయిద్యాలను ఉపయోగించారు.

ఈజిప్టు సంగీతకారులు సయ్యదు డార్విషు, ఉం కుల్తుం, మహ్మదు అబ్దేలు వహాబు, అబ్దేలు హలీం హఫీజు వంటి వారు అబ్దు అల్-హములి, అల్మాజు, మహమూదు ఉస్మాను వంటి వ్యక్తులను ప్రభావితం చేసారు. ప్రముఖ సమకాలీన ఈజిప్టు పాప్ గాయకులలో అమరు డియాబు, మొహమ్మదు మౌనిరు ప్రాముఖ్యత కలిగి ఉన్నారు.

నృత్యం

ఈజిప్టు తరచుగా బెల్లీ డ్యాన్సు నివాసంగా పరిగణించబడుతుంది. ఈజిప్టు బెల్లీ డ్యాన్సులో రెండు ప్రధాన శైలులు ఉన్నాయి; రాక్సు బలాడి, రాక్సు షార్కి. ఈజిప్టు తరహా బెల్లీ డాన్సరు కచేరీలలో భాగంగా అనేక జానపద, నృత్యపాత్రలు కూడా ఉన్నాయి. అలాగే ఆధునిక షాబి అనే వీధి నృత్యం రాక్సు బాలాడితో కొన్ని అంశాలను పంచుకుంటుంది.

మ్యూజియంలు

ఈజిప్టు 
The Egyptian Museum in Cairo.

ఈజిప్టు ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. ఇది అనేక ఇతర నాగరికతలతో, దేశాలతో సంబంధాలు కలిగి ఉంది. చరిత్రపూర్వ యుగం నుండి ఆధునిక యుగం వరకు ప్రత్యేకతతో అనేక యుగాలను దాటింది; ఫారోనికు, రోమను, గ్రీకు, ఇస్లామికు అనేక ఇతర యుగాలు. యుగాల ఈ విస్తృత వైవిధ్యం కారణంగా ఇతర దేశాలతో నిరంతర పరిచయం, ఈజిప్టులో పెద్ద సంఖ్యలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈజిప్టులో కనీసం 60 మ్యూజియాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ యుగాలు సంఘర్షణాత్మకంగా ఉన్నాయి.

ఈజిప్టు 
ఈజిప్టు మ్యూజియం ప్రధాన ఆకర్షణలలో ఒకటైన టుటన్ఖమును ఖననం ముసుగు

ఈజిప్టులోని మూడు ప్రధాన మ్యూజియంలలో ఈజిప్టు మ్యూజియం ఒకటి. ఇందులో 1,20,000 కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నాయి. ఈజిప్టు నేషనలు మిలిటరీ మ్యూజియం, " అక్టోబరు 6 పనోరమా ".

గిజా మ్యూజియం అని కూడా పిలువబడే గ్రాండు ఈజిప్షియను మ్యూజియం (జిఇఎమ్) నిర్మాణంలో ఉంది. ఇది ప్రపంచంలోని పురాతన ఈజిప్టు కళాఖండాల అతిపెద్ద సేకరణను కలిగి ఉంటుందని భావించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురావస్తు మ్యూజియంగా ఉంటుందని వర్ణించబడింది. ఈ మ్యూజియం 2015 లో ప్రారంభం కావాల్సి ఉంది. గిజా నెక్రోపోలిసు నుండి సుమారు రెండు చదరపు కిలోమీటర్ల (1.2 మైళ్ళు) 50 హెక్టార్ల (120 ఎకరాల) భూమిలో నిర్మించబడుతుందని అంచనా. ఇది పీఠభూమి కొత్త మాస్టరు ప్లానులో భాగంగా ఉంది. 2015 మేలో పురాతన వస్తువుల మంత్రి మందౌహు అల్-డమాటి మ్యూజియం పాక్షికంగా 2018 మేలో ప్రారంభమవుతుందని ప్రకటించారు.

పండుగలు

ఈజిప్టు అనేక పండుగలు, మతపరమైన కార్నివాలులను (దీనిని ములిదు అని కూడా పిలుస్తారు) జరుపుకుంటుంది. వారు సాధారణంగా ఒక నిర్దిష్ట కాప్టికు లేదా సూఫీ సాధువుతో సంబంధం కలిగి ఉంటారు. కాని దీనిని తరచూ మతం సంబంధం లేకుండా ఈజిప్షియన్లు జరుపుకుంటారు. రంజాను ఈజిప్టులో ప్రత్యేకమైన ఆసక్తితో ఆచరించబడుతుంది. శబ్దాలు, లైట్లు (ఫవానీసు అని పిలువబడే స్థానిక లాంతర్లు), రంజాను సందర్భంగా చాలా మంది ముస్లిం పర్యాటకులు ఈజిప్టుకు తరలివస్తుంటారు.

సాధారణంగా ఈజిప్టు నెలల పరేమౌడు (ఏప్రిల్), పాషన్స్ (మే) మధ్య ఈస్టరు ఆదివారం తరువాత ఈజిప్షియన్లు వేలాది సంవత్సరాలుగా పురాతన వసంతకాల పండుగ షాం ఎన్ నిసిం (కాప్టిక్: సమి: కాప్టికు షోం ఎన్ నిసిం) జరుపుకుంటారు.

ఆహారసంస్కృతి

ఈజిప్టు 
Kushari, one of Egypt's national dishes.

ఈజిప్టు వంటకాలు ముఖ్యంగా శాకాహార ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది అధికంగా చిక్కుళ్ళు, కూరగాయల వంటకాలపై ఆధారపడుతుంది. అలెగ్జాండ్రియాలోని ఆహారవిధానాలు, ఈజిప్టు తీరంలో ఆహారవిధానంలో అధికంగా చేపలు, ఇతర మత్స్యాలను ఉపయోగిస్తున్నప్పటికీ, చాలావరకు ఈజిప్టు వంటకాలు శాకాహారం ఆహారాలపై ఆధారపడి ఉంటాయి. ఈజిప్టు చరిత్ర అంతటా చాలా మంది ఈజిప్షియన్లకు మాంసం చాలా ఖరీదైనదిగా ఉన్నందున కాబట్టి సంఖ్యలో శాకాహార వంటకాలు అభివృద్ధి చేయబడ్డాయి.

కొందరు కుషారి (బియ్యం, కాయధాన్యాలు, మాకరోనీల మిశ్రమం) ను జాతీయ వంటకంగా భావిస్తారు. కుషారీలో వేయించిన ఉల్లిపాయలను కూడా చేర్చవచ్చు. అదనంగా ఫులు మెడమ్సు (మెత్తని ఫావా బీన్సు) అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఒకటిగా ఉంది. ఫలాఫెలు ("తైమియా" అని కూడా పిలుస్తారు) తయారీలో ఫాలా బీన్సు ఉపయోగిస్తారు. ఇది ఈజిప్టులో ఉద్భవించి మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. మోలోఖియాకు కొత్తిమీరతో వేయించిన వెల్లుల్లిని కలుపుతారు, ఇది మెత్తగా తరిగిన జనపనార ఆకుల ( కొన్నిసార్లు కోడి లేదా కుందేలు) నుండి తయారైన ఆకుపచ్చ సూపు.

క్రీడలు

ఈజిప్టు 
A crowd at Cairo Stadium to watch the Egypt national football team.

ఈజిప్టులో అత్యంత ప్రాచుర్యం పొందిన జాతీయ క్రీడ ఫుట్బాలు. కైరో డెర్బీ ఆఫ్రికాలోని తీవ్రమైన డెర్బీలలో ఒకటి. బిబిసి దీనిని ప్రపంచంలోని 7 కష్టతరమైన డెర్బీలలో ఒకటిగా ఎంచుకుంది. సి.ఎ.ఎఫ్. ప్రకారం ఆఫ్రికా ఖండంలో 20 వ శతాబ్దంలో అల్ అహ్లీ అత్యంత విజయవంతమైన క్లబుగా పేర్కొనబడింది. వారి ప్రత్యర్థులు జమలేక్ ఎస్.సి.ని "ఆఫ్రికన్ క్లబ్ ఆఫ్ ది సెంచరీ" అని పిలుస్తారు. అల్ అహ్లీ ఇరవై టైటిళ్లతో అంతర్జాతీయ ట్రోఫీల పరంగా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్లబు ఇటలీకి చెందిన ఎ.సి. మిలను, అర్జెంటీనాకు చెందిన బోకా జూనియరులను (రెండూ పద్దెనిమిది ఉన్నాయి) అధిగమించింది.

ఫారోసు అని పిలువబడే ఈజిప్టు జాతీయ ఫుట్‌బాల్ జట్టు 2006, 2008, 2010 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు సహా " ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్‌ను " ఏడుసార్లు గెలుచుకుంది. ఇది అత్యంత విజయవంతమైన ఆఫ్రికన్ జాతీయ జట్టుగా పరిగణించబడుతుంది. ఇది ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్సులో మొదటి 10 స్థానాల్లో నిలిచింది. ఈజిప్టు మూడుసార్లు ఫిఫా ప్రపంచ కప్పుకు అర్హత సాధించింది. వారి చివరి క్వాలిఫైయింగు గేంలో స్టారు ప్లేయరు మొహమ్మదు సలా సాధించిన రెండు గోల్సు ఈజిప్టును 2018 ఫిఫా ప్రపంచ కప్పులోకి తీసుకువెళ్లాయి. ఈజిప్టు యువజన జాతీయ జట్టు యంగు ఫారోసు అర్జెంటీనాలో నిర్వహించబడిన 2001 ఫిఫా యువ ప్రపంచ కప్పులో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 1928 - 1964 ఒలింపిక్సులో ఫుట్‌బాలు టోర్నమెంటులో ఈజిప్టు 4 వ స్థానంలో ఉంది.

ఈజిప్టులో ఇతర ప్రసిద్ధ క్రీడలలో స్క్వాషు, టెన్నిసు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఈజిప్టు స్క్వాషు జట్టు 1930 ల నుండి అంతర్జాతీయ ఛాంపియన్షిప్పులో పోటీ పడింది. ఈజిప్టు ఉత్తమ ఆటగాళ్ళు అమరు షబానా, రామి అషౌరు ఇద్దరూ ప్రపంచంలోని నంబరు వన్ స్క్వాషు ప్లేయర్లుగా ప్రసిద్ధి చెందారు. ఈజిప్టు స్క్వాషు ప్రపంచ ఛాంపియన్‌షిప్పును నాలుగుసార్లు గెలుచుకుంది. చివరి టైటిలు 2017 లో ఉంది.

1999 లో ఈజిప్టు ఐ.హెచ్.ఎఫ్. ప్రపంచ పురుషుల హ్యాండుబాలు ఛాంపియన్‌షిప్పుకు ఆతిథ్యం ఇచ్చింది. 2021 లో మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. 2001 లో జాతీయ హ్యాండుబాలు జట్టు టోర్నమెంటులో నాల్గవ స్థానానికి చేరుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని సాధించింది. ఆఫ్రికా పురుషుల హ్యాండుబాలు ఛాంపియన్‌షిప్పులో ఈజిప్టు ఐదుసార్లు గెలిచి ఆఫ్రికాలో ఉత్తమ జట్టుగా నిలిచింది. దానికి తోడు ఇది 2013 లో మధ్యధరా క్రీడలు, 2004 లో బీచి హ్యాండుబాలు ప్రపంచ ఛాంపియన్‌షిప్పులు, 2010 లో సమ్మరు యూతు ఒలింపిక్సును కూడా సాధించింది. అన్ని ఆఫ్రికా దేశాలలో, ఈజిప్టు జాతీయ బాస్కెటుబాలు జట్టు బాస్కెటుబాలు ప్రపంచ కప్పులో, సమ్మర్ ఒలింపిక్సులో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఇంకా ఈ జట్టు ఆఫ్రికన్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో 16 పతకాలు సాధించింది.

ఈజిప్టు 1912 నుండి సమ్మరు ఒలింపికు క్రీడలలో పాల్గొంది. 1951 లో అలెగ్జాండ్రియా మొదటి మధ్యధరా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈజిప్టు అనేక అంతర్జాతీయ పోటీలను నిర్వహించింది. చివరిది 2009 ఫిఫా U-20 ప్రపంచ కప్పు, ఇది 2009 లో 24 సెప్టెంబరు - అక్టోబరు 16 మధ్య జరిగింది.

2014 సెప్టెంబరు 19 న శుక్రవారం 332.35 మీటర్లు (1,090.4 అడుగులు) ఈజిప్టు స్కూబా డైవరు అహ్మదు గాబ్రు లోతైన ఉప్పునీటి స్కూబా డైవు కొత్త టైటిలు హోల్డరు అని గిన్నిసు వరల్డు రికార్డ్సు ప్రకటించింది. 1,000 అడుగుల (300 మీటర్లు) లోతుకు చేరుకుని అహ్మదు శుక్రవారం కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 14 గంటల ఫీటు గాబ్రు 1,066 అడుగుల (325 మీటర్లు) ఎర్ర సముద్రం లోని ఈజిప్టు పట్టణం దహాబు సమీపంలో అగాధంలో దిగి అక్కడ అతను డైవింగు బోధకుడిగా పనిచేస్తున్నాడు. 2015 సెప్టెంబరున రనీం ఎల్ వెలీలీ ప్రపంచ నంబరు వన్ ఉమెన్ స్క్వాషు ప్లేయరుగా నిలిచారు. ఇతర మహిళా ఈజిప్టు స్క్వాషు క్రీడాకారులు నౌరు ఎల్ తాయెబు ఓమ్నియా అబ్దేలు కావి, నౌరన్ గోహరు, నౌరు ఎల్ షెర్బిని ప్రఖ్యాతి చెందారు.

సమాచారరంగం

ఈజిప్టులో వైర్డు, వైర్‌లెసు టెలికమ్యూనికేషను పరిశ్రమ 1854 లో కైరో, అలెగ్జాండ్రియాలను అనుసంధానం చేస్తూ దేశం మొట్టమొదటి టెలిగ్రాం లైను ప్రారంభించడంతో ప్రారంభమైంది. 1881 లో రెండు నగరాల మధ్య మొదటి టెలిఫోన్ మార్గం స్థాపించబడింది. 1999 సెప్టెంబరులో ఐటి-రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈజిప్టు ప్రభుత్వం చేసిన నిబద్ధతను ప్రతిబింబిస్తూ సాంకేతిక అభివృద్ధి కొరకు జాతీయ ప్రాజెక్టు ప్రకటించారు.

తపాలా

ఈజిప్టులో పోస్టలు సేవకు బాధ్యత వహించే సంస్థ ఈజిప్ట్ పోస్టు. 1865 లో స్థాపించబడిన ఇది దేశంలోని పురాతన ప్రభుత్వ సంస్థలలో ఒకటి. యూనివర్సలు పోస్టలు యూనియను స్థాపనకు సహకారం అందించిన 21 దేశాలలో ఈజిప్టు ఒకటి. మొదట జనరలు పోస్టలు యూనియను అని పేరు పెట్టబడింది. ఇది బెర్ను ఒప్పందం మీద సంతకం చేసింది.

మాధ్యమం

2018 సెప్టెంబరులో ఇంటర్నెటు నియంత్రణలను కఠినతరం చేయడంలో భాగంగా దేశంలోని సోషలు మీడియా వినియోగదారులను పర్యవేక్షించే హక్కును ఈజిప్టు ఆమోదించింది.

విద్య

ఈజిప్టు 
Cairo University.
ఈజిప్టు 
Egyptian literacy rate among the population aged 15 years and older by UNESCO Institute of Statistics

1996 నుండి 2013 నాటికి నిరక్షరాస్యత 39.4% నుండి 25.9%కి తగ్గింది. 2014 నాటికి వయోజన అక్షరాస్యత రేటు 73.9%గా అంచనా వేయబడింది. 60 ఏళ్లు పైబడిన వారిలో నిరక్షరాస్యత శాతం అత్యధికంగా 64.9%గా అంచనా వేయబడింది. అయితే 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో నిరక్షరాస్యత 8.6% ఉంది.

19 వ శతాబ్దం ప్రారంభంలో విశ్వసనీయ అధికారులు, సైనిక అధికారులను పోషించడానికి ఒట్టోమన్లు ఈజిప్టులో ఐరోపా తరహా విద్యావ్యవస్థను ప్రవేశపెట్టారు. బ్రిటీషు ఆక్రమణలో విద్యలో పెట్టుబడులు తీవ్రంగా అరికట్టబడ్డాయి. గతంలో ఉచితంగా ఉన్న ప్రభుత్వ లౌకిక పాఠశాలలు ఫీజులు వసూలు చేయడం ప్రారంభించాయి.

1950 లలో అధ్యక్షుడు నాజరు ఈజిప్షియన్లందరికీ దశలవారీగా ఉచిత విద్యను ఇచ్చారు. ఈజిప్టు పాఠ్యాంశాలు ఇతర అరబు విద్యా వ్యవస్థలను ప్రభావితం చేశాయి. అవి తరచూ ఈజిప్టు-శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాయి. ఈజిప్టు ఉపాద్యాయుల వినియోగం అందుబాటులో ఉన్న దేశవనరుల స్థాయిని అధిగమించింది. దీనివల్ల ప్రభుత్వ విద్య నాణ్యత క్షీణించింది. ఈ ధోరణి ప్రస్తుతం పేలవమైన ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తులు (తరచుగా ఒకటి నుండి యాభై వరకు), నిరంతర లింగ ఆధారిత అసమానతలతో ముగిసింది.

6 సంవత్సరాల వయస్సు నుండి ఈజిప్టు పిల్లలకు హక్కు 6 సంవత్సరాల ప్రాథమికవిద్య, 3 సంవత్సరాల మాధ్యమికవిద్య. 9 వ తరగతి తరువాత విద్యార్థులు మాధ్యమిక విద్య రెండు విభాగాలలో ఒకదానిని ఎంచుకుంటారు: సాధారణ, సాంకేతిక పాఠశాలలు. జనరలు సెకండరీ విద్య ఉన్నత విద్య కోసం విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఈ ట్రాకు గ్రాడ్యుయేట్లు సాధారణంగా " తనావేయా అమా " ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలలో చేరతారు.

సాంకేతిక మాధ్యమిక విద్యకు రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి 3 సంవత్సరాలు, రెండవది మరింత అధునాతన 5 సంవత్సరాల విద్య ఐదు ఉంటాయి. ఈ పాఠశాలల గ్రాడ్యుయేట్లు చివరి పరీక్షలో వారి ఫలితాల ఆధారంగా ఉన్నత విద్యను పొందగలుగుతారు. కాని ఇది అసాధారణం.

అకాడెమికు ర్యాంకింగు ఆఫ్ వరల్డు యూనివర్శిటీసు (షాంఘై ర్యాంకింగు)లో కైరో విశ్వవిద్యాలయం 500 విశ్వవిద్యాలయంలో 401 స్థానంలో ఉంది. క్యూఎస్ వరల్డు యూనివర్శిటీ ర్యాంకింగ్సు ప్రకారం 600 విశ్వవిద్యాలయంలో 501 స్థానంలో ఉంది. క్యూఎస్ వరల్డు యూనివర్శిటీ ర్యాంకింగ్సు, అల్-అజారు విశ్వవిద్యాలయం, అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయం, ఐన్ షామ్సు విశ్వవిద్యాలయం 701+ పరిధిలో ఉంది. కైరోలోని అమెరికా విశ్వవిద్యాలయం 360 వ స్థానంలో ఉంది. దేశంలో పరిశోధనలను ఆధునీకరించే లక్ష్యంతో ఈజిప్టు ప్రస్తుతం కొత్త పరిశోధనా సంస్థలను ప్రారంభిస్తోంది. దీనికి ఇటీవలి ఉదాహరణ జెవైల్ సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాపించబడింది.

ఆరోగ్యం

ఈజిప్టు 
57357 Hospital

2011 లో ఈజిప్టులో ప్రజల ఆయుఃపరిమితి 73.20 సంవత్సరాలు. మగవారికి 71.30 సంవత్సరాలు, ఆడవారికి 75.20 సంవత్సరాలు. ఈజిప్టు తన స్థూల జాతీయోత్పత్తిలో 3.7%ఆరోగ్యానికి ఖర్చు చేస్తుంది. చికిత్స ఖర్చులు 22% పౌరులు, మిగిలినవి ప్రభుత్వం వ్యయం చేస్తుంది. 2010 లో ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు దేశ జిడిపిలో 4.66% వ్యయం చేసింది. 2009 లో 10,000 మంది నివాసితులకు 16.04 మంది వైద్యులు, 33.80 మంది నర్సులు ఉన్నారు.

సంవత్సరాలుగా ఆధునీకరణ ప్రయత్నాల ఫలితంగా ఈజిప్టు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గొప్ప పురోగతి సాధించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ మెరుగుపడింది. రోగనిరోధకత కార్యక్రమాలు ఇప్పుడు 98% జనాభాకు అందుబాటులో ఉన్నాయి. 1960 లలో ప్రజల ఆయుఃపరిమితి 44.8 సంవత్సరాల ఉండగా 2009 నాటికి 72.12 సంవత్సరాలకు పెరిగింది. శిశు మరణాల శాతం గణనీయంగా తగ్గింది. (1970 ల నుండి 1980 ల వరకు శిశు మరణాల రేటు 101-132 / 1000 ప్రత్యక్ష జననాలు, 2000 లో రేటు 50-60 / 1000, 2008 లో ఇది 28-30 / 1000).

2008 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం దేశంలో చట్టవిరుద్ధం అయినప్పటికీ ఈజిప్టులోని 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 91.1% మంది జననేంద్రియ వైకల్యానికి గురయ్యారు. 2016 లో ఈ విధానాన్ని నిర్వహించినందుకు దోషులుగా కఠినమైన జరిమానాలు విధించేలా చట్టసవరణ జరిగింది. దీనిని నిర్వహించిన వారికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ ప్రక్రియకు బాధితుల వెంట ఉండేవారికి వారు 3 సంవత్సరాల వరకు జైలు శిక్షను అనుభవించవచ్చు.

2009 లో ఆరోగ్య బీమా ఉన్న మొత్తం ఈజిప్షియన్ల సంఖ్య 37 మిలియన్లకు చేరుకుంది. వారిలో 11 మిలియన్లు మైనర్లే, ఈజిప్టు జనాభాలో సుమారు 52% మందికి బీమా సౌకర్యం కల్పిస్తుంది.

రాజకీయ సంక్షోభము [2013]

దేశంలో చెలరేగిన రాజకీయ సంక్షోభము కారణంగా ఈజిప్టు ప్రభుత్వం ఆగస్టు 14, 2013 బుధవారం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి మద్దతుగా ఆందోళనలకు దిగిన నిరసనకారులపై సైన్యం విరుచుకుపడింది. సైన్యం దాడిలో 149 మంది మరణించారు. ఇదిలా ఉండగా, హింసాకాండపై కలత చెందిన ఈజిప్టు ఉపాధ్యక్షుడు ఎల్‌బరాడీ తన పదవికి రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి అమలులోకి వస్తున్నట్లు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం ప్రభుత్వ టీవీ చానల్ ద్వారా ప్రకటించింది. ముర్సీ మద్దతుదారులపై విరుచుకుపడిన సైన్యం, వారు వేసుకున్న శిబిరాలను బుల్‌డోజర్లతో నేలమట్టం చేసింది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు తగిన చర్యలు చేపట్టేందుకు ఎమర్జెన్సీ సైన్యానికి తగిన అధికారాలు కల్పిస్తోందని అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సైన్యం దాడుల్లో 95 మంది మరణించగా, 758 మంది గాయపడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అయితే, మృతుల సంఖ్య రెండువేలకు పైనే ఉంటుందని, దాదాపు పదివేల మంది గాయపడ్డారని ముర్సీకి చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్ తెలిపింది

మూలాలు

ఈజిప్ట్ వికీపీడియా

Tags:

ఈజిప్టు చరిత్రఈజిప్టు భౌగోళికంఈజిప్టు ఆర్ధికరంగంఈజిప్టు గణాంకాలుఈజిప్టు సంస్కృతిఈజిప్టు క్రీడలుఈజిప్టు సమాచారరంగంఈజిప్టు విద్యఈజిప్టు ఆరోగ్యంఈజిప్టు రాజకీయ సంక్షోభము [2013]ఈజిప్టు మూలాలుఈజిప్టుEn-us-Egypt.oggఅరబ్బీ భాషఇజ్రాయిల్ఎర్ర సముద్రంగ్రీసుటర్కీదస్త్రం:En-us-Egypt.oggలిబియాసూడాన్సౌదీ అరేబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

వాట్స్‌యాప్మంగళవారం (2023 సినిమా)కల్వకుంట్ల తారక రామారావుతెలంగాణా సాయుధ పోరాటంకౌరవులుచతుర్వేదాలుగుణింతంచెల్లుబోయిన వేణుగోపాల కృష్ణజై శ్రీరామ్ (2013 సినిమా)ఏప్రిల్శివపురాణంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థహలో (2017 సినిమా)జవహర్ నవోదయ విద్యాలయంమంగళసూత్రంవిశాఖ నక్షత్రముకోల్‌కతా నైట్‌రైడర్స్ప్రియా వడ్లమానిచాకలిపాట్ కమ్మిన్స్ఉలవలుభారతదేశ అత్యున్నత న్యాయస్థానంసాహిత్యంమహానందిమహాత్మా గాంధీహనుమాన్ చాలీసానరసింహావతారంనువ్వొస్తానంటే నేనొద్దంటానాఅనుష్క శెట్టిమాల (కులం)భగత్ సింగ్కృష్ణ జననంఅష్ట దిక్కులుటాన్సిల్స్బి.ఆర్. అంబేద్కర్కోదండ రామాలయం, ఒంటిమిట్టత్రేతాయుగంఅగ్నికులక్షత్రియులులవకుశశ్రీశైల క్షేత్రంపమేలా సత్పతివై.యస్.రాజారెడ్డిగర్భంకాజల్ అగర్వాల్గోవిందుడు అందరివాడేలే2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుసురేఖా వాణికాటసాని రామిరెడ్డితెలంగాణ చరిత్రపటికసర్పంచిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఆవురాశి (నటి)సునయననగ్మాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఇస్లాం మతంకమ్మమియా ఖలీఫాఒంటిమిట్టశాంతికుమారికాటసాని రాంభూపాల్ రెడ్డివిడదల రజినిపటిక బెల్లంఎనుముల రేవంత్ రెడ్డిశ్రీలీల (నటి)మీనరాశిగీతాంజలి (1989 సినిమా)పేర్ని వెంకటరామయ్యకొణతాల రామకృష్ణతెలుగు సినిమాలు 2024రజినీకాంత్సుశ్రుతుడుపి.వి. సింధుఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాభోజనం🡆 More