గ్వాటెమాలా: మధ్య అమెరికా దేశం

15°30′N 90°15′W / 15.500°N 90.250°W / 15.500; -90.250

గ్వాటెమాలా గణతంత్రం

రిపబ్లికా డి గ్వాటెమాలా (స్పానిష్)
Flag of గ్వాటెమాలా
జండా
Coat of arms of గ్వాటెమాలా
Coat of arms
నినాదం: 
గీతం: Himno Nacional de Guatemala
National Anthem of Guatemala

March: La Granadera
The Song of the Grenadier
Location of గ్వాటెమాలా
రాజధానిGuatemala City
14°38′N 90°30′W / 14.633°N 90.500°W / 14.633; -90.500
అతిపెద్ద నగరంగ్వాటెమాలా నగరం
అధికార భాషలుస్పానిష్
జాతులు
(2010)
  • 41.5% mestizo
  • 41% indigenous peoples
    • (9.1% K'iche'
    • 8.4% Kaqchikel
    • 7.9% Mam
    • 6.3% Q'eqchi'
    • 8.6% other Maya
    • 0.2% non-Maya indigenous
    • 0.1% others)
  • 18% white
పిలుచువిధంGuatemalan
Chapín (informal)
ప్రభుత్వంUnitary presidential republic
• అధ్యక్షుడు
Jimmy Morales
• Vice President
Jafeth Cabrera
• President of the Congress
Óscar Chinchilla
• President of the Supreme Court
Nery Medina
శాసనవ్యవస్థCongress of the Republic
Independence
from the Spanish Empire
• Declared
15 September 1821
• Declared from the
First Mexican Empire
1 July 1823
• Current constitution
31 May 1985
విస్తీర్ణం
• మొత్తం
108,889 km2 (42,042 sq mi) (105th)
• నీరు (%)
0.4
జనాభా
• 2014 estimate
16,176,133 (67th)
• జనసాంద్రత
129/km2 (334.1/sq mi) (85th)
GDP (PPP)2015 estimate
• Total
$124.941 billion
• Per capita
$7,680
GDP (nominal)2015 estimate
• Total
$66.037 billion
• Per capita
$4,059
జినీ (2007)55.1
high
హెచ్‌డిఐ (2015)Increase 0.640
medium · 128th
ద్రవ్యంQuetzal (GTQ)
కాల విభాగంUTC−6 (CST)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+502
Internet TLD.gt

గ్వాటెమాలా, అధికారనామం రిపబ్లిక్ ఆఫ్ గ్వాటెమాలా, మద్య అమెరికా దేశాలలో ఒకటి. దేశానికి ఉత్తర, పశ్చిమ సరిహద్దులో మెక్సికో దేశం, నైరుతీ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం. గ్వాటెమాలా జనసంఖ్య 15.8 మిలియన్లు. మద్యఅమెరికా దేశాలలో అధికజంసంఖ్య కలిగిన దేశంగా ఇది గుర్తించబడుతుంది. గ్వాటెమాలా " రిప్రెజెంటేటివ్ డెమాక్రసీ " కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. గ్వాటెమాలా నగరం దేశానికి రాజధాని నగరంగానే కాక అతిపెద్ద నగరంగా కూడా గుర్తించబడుతుంది.

ఆధునిక గ్వాటెమాలా భూభాగం ఒకప్పుడు మాయా నాగరికత విలసిల్లిన ప్రాంతం. మాయా నాగరికత మెసోమెరికా వరకు విస్తరించబడి ఉంది. దేశంలోని అత్యధిక భూభాగం 16 వ శతాబ్దంలో స్పానిష్ ఆక్రమితప్రాంతంగా ఉండేది. ఇది న్యూ స్పెయిన్ వైశ్రాయి పాలనలో ఉండేది. గ్వాటెమాలా 1821లో స్వతంత్రదేశం అయింది. ఇది " ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ అమెరికా "లో భాగంగా ఉండేది. 1841లో ఇది విడివడింది.

19 వ శతాబ్దం మద్య నుండి గ్వాటెమాలా అస్థిరత , అంతఃకలహాలు వంటి సమస్యలను ఎదుర్కొన్నది. 20 వ శతాబ్దంలో గ్వాటెమాలాను వరుసగా నియంతలు పాలించారు. వీరికి యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ , యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఉండేది. 1944లో అథోరిటారియన్ నాయకుడు జార్జ్ ఉబికో ప్రభుత్వాన్ని ప్రొ - డెమొక్రటిక్ మిలటరీ పడగొట్టి " గ్వాటెమాలా రివల్యూషన్ " స్థాపితమైంది. అది సాంఘిక, ఆర్థిక సంస్కరణలను చేపట్టింది.1954లో గ్వాటెమాలా తిరుగుబాటు (యు.ఎస్. నేపథ్యంలో సైనిక తిరుగుబాటు అప్పటి ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి నియంత్రిత ప్రభుత్వం స్థాపించింది.

1960 - 1990 గ్వాటెమాలా అంరర్యుద్ధం యు.ఎస్. మద్దతుతో ఉన్న ప్రభుత్వం, లెఫ్టిస్ట్ తిరుగుబాటుదారుల మద్య జరిగింది. ఈ సందర్భంలో గ్వాటెమాలాలో మూకుమ్మడి హత్యలు వంటి హింసాత్మకచర్యలు చోటుచేసుకున్నాయి. సైన్యం మాయా ప్రజలమీద హింసాత్మకచర్యలు కొనసాగించింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో శాతి స్థాపించబడింది. తరువాత గ్వాటెమాలా ఆర్థికాభివృద్ధి సాధించింది. దేశంలో ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. అయినప్పటికీ గ్వాటెమాలా పేదరికం, నేరాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రాజకీయ అస్థిరత మొదలైన సమస్యలను ఎదుర్కొన్నది. 2014 గణాంకాలను అనుసరించి హ్యూమన్ డెవెలెప్మెంటు ఇండెక్స్ జాబితాలోని 33 లాటిన్ అమెరికన్, కరేబియన్ దేశాలలో గ్వాటెమాలా 31 వ స్థానంలో ఉందని తెలుస్తుంది. గ్వాటెమాలా భౌగోళిక ఉపస్థితి కారణంగా పలు పర్యావరణ వైరుధ్యాలను కలిగి ఉంది. ఇక్కడ అంతరించిపోతున్న జంతుజాలంలోని అనేక జంతువులు ఉన్నాయి. గ్వాటెమాలా స్పానిష్, స్థానిక నాగరికతా ప్రభావితమైన సుసంపన్నమైన సాంస్కృతిక సంపదను కలిగి ఉంది.

చరిత్ర

కొలంబియాకు ముందు

గ్వాటెమాలా ప్రాంతంలో మానవులు నిసించినదానికి మొదటి ఆధారం క్రీ.పూ. 12,000 కాలానికి చెందినవై ఉన్నాయి.దేశంలో పలుభాగాలలో లభించిన అబ్సిడియన్ బాణపుములుకులు క్రీ.పూ 18,000 సంవత్సరాలకు చెందినవని భావిస్తున్నారు. ఆరంభకాల గ్వాటెమాలా వాసులు వేటగాళ్ళు, సమూహికవాసులు అని భావిస్తున్నారు.పసిఫిక్ సముద్రతీరం, పోటెన్ తీరాలలో లభించిన పూలెన్ శాంపిల్స్ ఆధారంగా క్రీ.పూ. 3,500 సంవత్సరాలకు ముందు ఇక్కడ మొక్కజొన్న పండించబడిందని భావిస్తున్నారు. ఎగువభూములలో ఉన్న క్విచే ప్రాంతం, మద్య పసిఫిక్ సముద్రతీర ప్రాంతంలోని సిపాకటే, ఎస్క్యూయింట్లా ప్రాంతాలు క్రీ.పూ.6,500 సంవత్సరాల ఆధారాలు లభించాయి.పురాతత్వ పరిశోధకులు ఈప్రాంత చరిత్రను మెసొమెరికాకు చెందిన కొలబియాకు ముందు లేక ప్రీ క్లాసిక్ పీరియడ్ (క్రీ.పూ 2999 నుండి క్రీ.పూ. 250), క్లాసిక్ పీరియడ్ (సా.శ. 250 నుండి 900), క్లాసిక్ పీరియడ్ తరువాత (900 నుండి 1500) గా విభజించారు.

సమీపకాలం వరకు ప్రీ క్లాసిక్ పీరియడ్‌ను నిర్మాణాత్మక కాలంగా గౌరవించారు. వ్యవసాయ దారులు గ్రామాలలోని గుడిసెలు, స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారని భావిస్తున్నారు.అయినప్పటికీ లాబ్లాంకా లోని ఆల్టర్, శాన్ మొరాకోస్ లభించిన క్రీ.పూ 1,000 కాలంనాటికి చెందిన స్మారకచిహ్నాలు,మరిఫ్లోర్స్, నరంజోలోని క్రీ.పూ. 801 నాటికి చెందిన ఉత్సవప్రదేశాలు, ఆరంభకాల మోన్యుమెంటల్ మాస్కులు, మిరాడర్ బేసిన్ ప్రాంతంలోని నక్బె, క్సుల్నల్, ఎల్ టింటల్, వక్నా, ఎల్ మిరాడర్ ప్రాంతాలలో లభించిన ఆధారాల కారణంగా ఆరంభకాల పరిశోధనలను సవాలు చేస్తున్నారు.[ఆధారం చూపాలి]

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Maya city of Tikal

మెసొమెరికన్ నాగరికతకు చెందిన క్లాసిక్ పీరియడ్ మాయానాగరికత ఉన్నతస్థితికి చేరుకుంది. మాయానగరికత పెటెన్ ప్రాంతంలో అధికంగా కేంద్రీరించినప్పటికీ దేశంలో పలుప్రాంతాలకు విస్తరించింది. ఈ సమయంలో నగరాలు, స్వతంత్ర నగరరాజ్యాలు ఏర్పడి ఇతర మెసొమెరికన్ నాగరికతతో సంబంధాలు ఏర్పడ్డాయి.[ఆధారం చూపాలి] సా.శ. 900 లలో క్లాసిక్ మాయా నాగరికత పతనమయ్యేవరకు ఇది కొనసాగింది. మద్యదిగువ ప్రాంత వాసులు మాయానాగరికతను విడిచిపెట్టడం, కరువు కారణంగా మాయానాగరికతకు చెందిన ప్రజలు మరణించించడం వంటి సంఘటనలు సంభవించాయి. పతనానికి కారణాలను చర్చనీయంగా మార్చినప్పటికీ లేక్‌బెడ్స్, పురాతన పోలెన్, ఇతర ఆధారాలు మాత్రం కరువు సంభవించిన సంఘటనను బలపరుస్తున్నాయి. దీర్ఘకాలం కొనసాగిన వరుస కరువులు, అధిక జసంఖ్య మాయానాగరికత పతనానికి దారితీసాయని భావిస్తున్నారు. 16 వ శతాబ్దంలో కరువు కారణంగా ప్రబలిన హెమొరాజిక్ జ్వరం కారణంగా 80 - 90% స్త్యానిక ప్రజలు మరణించారు.

క్లాసిక్ పీరియడ్ తరువాత

క్లాసిక్ పీరియడ్ తరువాతి కాలంలో పెటెన్‌లో ఇత్జా, కొవొజ్, యలైన్, కెజచే రాజ్యాలు వెలసాయి. ఎగువభూములలో మాం, కిచె, కాక్విచీఎ, చజొమ, ట్జ్, ఉత్జిల్, పొక్వొంచి, క్యూ ఎక్విచి, చొరిటి రాజ్యాలు వెలిసాయి. నగరాలు విభిన్న మాయానాకరికతా రూపాలను సంరక్షించాయి. అయిన క్లాసిక్ కాలంనాటి స్థాయికి చేరుకోలేక పోయాయి. మాయానాగరికత ఇతర మెసొనెరికన్ నాగరికతలోని పలు అంశాలను కలుపుకుని సాంస్కృతిక సమ్మిశ్రిత రూపం సంతరించుకుంది. వ్రాతకళ, మాయా కేలండర్ మాయానాగరికతకు చెందినవి కానప్పటికీ మాయానగరికతకు చెందిన ప్రజలు వీటిని అభివృద్ధి చేసారు. మాయానాగరికతా చిహ్నాలు హండూరాస్, గ్వాటెమాలా, ఉత్తర ఎల్ సల్వేడర్1,000 km (620 mi) నుండి మద్య మెక్సికో వరకు విస్తరించింది. మాయా కళలు, నిర్మాణకళలో ఇతర నాగరికతల ప్రభావం కనుగొనబడింది. ఇది ప్రచ్ఛన్న యుద్ధాల కారణంగా కాక వాణిజ్య సంబంధాలు, పరస్పర సాంస్కృతిక మార్పిడి చేసుకున్న కారణంగా సంభవించిందని పరిశీలకులు భావిస్తున్నారు.

కాలనీ శకం (1519–1821)

Painting of a bearded man in early 16th-century attire including prominent ruff collar, wearing a decorative breastplate, with his right hand resting on his hip and his left hand grasping a cane or riding crop.
The Conquistador Pedro de Alvarado led the initial Spanish efforts to conquer Guatemala.

ఆధునిక ప్రంపంచంలోకి ప్రవేశించిన తరువాత 1519లో గ్వాటెమాలా వరకు పలుమార్లు స్పెయిన్ యాత్రలు ప్రారంభించింది. దీర్ఘకాలం స్పెయిన్‌తో సంబంధాల కారణంగా ప్రబలిన అంటువ్యాధుల కారణంగా స్థానిక పేజల చలావరకు క్షీణించింది. మెక్సికో దాడికి నాయకత్వం వహించిన హర్నాన్ కోర్టెస్ కేప్టన్ గంజాలో డీ అల్వరాడో, ఆయన సోదరుడు పెడ్రో డీ అల్వరాడో ఈ ప్రాంతాన్ని జయించడానికి అనుమతి ఇచ్చాడు. అల్వరాడో ముందుగా తనతానుగా కాక్విచికెల్ ప్రజలతో మైత్రిచేసుకుని క్విచేతో యుద్ధం చేసి మొత్తం ప్రాంతాన్ని స్పెయిన్ వశం చేసాడు. కాలనీపాలనా సమయంలో గ్వాటెమాలా కేప్టంసీ - జనరల్ ఆఫ్ గ్వాటెమాలా ఆధ్వర్యంలో అడియంషియాగా న్యూస్పెయిన్‌లో (మెక్సికో) భాగంగా ఉండేది. 1524 జూలై 25 న కక్విచికే రాజధాని నగరం క్సించే నగరానికి సమీపంలో మొదటి రాజధాని నగరం విల్లా శాంటియాగో (ప్రస్తుతం టెక్పాన్ గ్వాటెమాలా) స్థాపించబడింది. 1527 నవంబరు 22 న విల్లా శాంటియాగో మీద కక్విచికే దాడి చేసిన కారణంగా రాజధాని నగరం సియూడాడ్ వియేజా నగరానికి మార్చబడింది.

1541 సెప్టెంబరు 11 న కొత్త రాజధానిలో వరదలు సంభవించాయి. వా భారీవర్షం, భూకంపాల కారణంగా వోల్కానిక్ క్రేటర్ వోల్కాన్ డీ అక్ కూలిపోయింది. తరువాత రాజధాని నగరం పచాయ్ వ్యాలీ లోని ఆంటిక్వా గ్వాటెమాలాకు తరలించబడింది.6 km (4 mi) ప్రస్తుతం ఇది ప్రపంచవారసత్వ సంపదలలో ఒకటిగా చేయబడింది. ఈ నగరం 1773 - 1774 లలో పలుమార్లు భూకంపాలు సంభవించి నగరాన్ని వినాశనం చేసాయి. స్పెయిన్ రాజు రాజధాని నగరాన్ని ఎర్మిటా వ్యాలీలోని ప్రస్తుత ప్రాంతానికి మార్చమని ఆదేశించాడు. కాథలిక్ చర్చి దానికి తరువాత " వర్జిన్ డీ ఎల్ కార్మన్ " అని నామకరణం చేసింది. ఈ సరికొత్త రాజధాని 1776 జనవరిలో స్థాపించబడింది.

స్వతంత్రం , 19వ శతాబ్ధం (1821–1847)

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Criollos rejoice upon learning about the declaration of independence from Spain on September 15, 1821.

చైపాస్, గ్వాటెమాలా, ఎల్ సల్వడార్, నికరగువా, కోస్టారికా, హండూరాస్ లతో కూడుకున్న కేప్టెన్సీ జనరల్ ఆఫ్ గ్వాటెమాలా, 1821 సెప్టెంబరు 15 న స్పెయిన్ నుండి స్వతంత్రదేశంగా ప్రకటించుకుంది. గ్వాటెమాలాలో జరిగిన ఒక బహిరంగ సమావేశంలో ఈ ప్రకటన చేసింది. రెండు సంవత్సరాల తరువాత కేప్టెన్సీ - జనరల్‌ను రద్దు చేసారు. ఈ ప్రాంతం కాలనీ పాలనా కాలమంతా న్యూస్పెయిన్‌లో భాగంగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రాంతం మాత్రం ప్రత్యేకంగా పాలించబడింది. అయినప్పటికీ 1825 వరకు గ్వాటెమాలా తమస్వంత జంఢా రూపొందించుకోలేదు.

మొరజాన్

1838లో లిబరల్ ఫోర్సెస్ ఆఫ్ హండూరాస్ నాయకుడు ఫ్రాంసిస్కో మొరజాన్, గౌతమాలన్ జోస్ ఫ్రాంసిస్కో బరుండియా గ్వాటెమాలా మీద దాడి చేయడానికి శాన్ సర్ చేరుకున్నారు. అక్కడ వారు రఫీల్ కరెరా మామగారైన చుయా అల్వరెజ్‌ను హతమార్చి సైన్యాధ్యక్షుడై ఆతరువాత గ్వాటెమాలా అధ్యక్షుడు అయ్యాడు.లిబరల్ సైన్యం గౌతమలన్ కౌడిల్లో అనుయాయులను హెచ్చరించడానికి అల్వరెజ్ తలను బల్లనికి గుచ్చి ప్రదర్శించారు. కర్రెరా ఆయన భార్య పెట్రోనా మొరజాన్‌ను ఎదుర్కొన్నారు. తరువాత పంపబడిన ప్రతినిధులను కర్రెరాతో సంప్రదించడానికి అనుమతించలేదు (ప్రత్యేకంగా బరుండియా). [ఎవరు?] అయినప్పటికీ కర్రెరా బరుండియాను హతమార్చాలని అనుకోలేదు. మొరజాన్ గ్రామాలను ధ్వంసం చేసి వారి సపదను దోచుకున్నాడు. కర్రెరా సైన్యాలు పర్వతం వెనుక దాగింది. కర్రెరా పూర్తిగా ఓడిపోయాడని విశ్వసించి మొరజాన్, బరుండియా గ్వాటెమాలా నగరానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ పెడ్రో వాలెంజుయేలా, కంసర్వేటివ్ సభ్యులు వారిని రక్షుకులుగా సత్కరించి లిబరల్ బెటాలియన్‌కు మార్గదర్శకం వహించమని ప్రతిపాదించారు. వాలెంజుయేలా, బరుండియా మొరజాన్‌కు ఆర్థికసమస్యలను పరిష్కరించడానికి అవసరమైన వనరులను అప్పగించారు. రైతుల తిరుగుబాటును అణిచివేయగలిగిన మొరజాన్ వంటి వీరుడు లభించినందుకు రెండు పార్టీలకు చెందిన క్రియోలో ప్రజలు తెల్లవారే వరకు సంబరాలు జరుపుకున్నారు.

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
The Federal Republic of Central America (1823–1838) with its capital in Guatemala City.

మొరజాన్ లాస్ ఆల్టాస్‌కు మద్దతు కొనసాగిస్తూ వలెంజుయేలాను తొలగించి ఆస్థానంలో అయ్సినేనా వంశానికి చెందిన " మరియానో రివేరా పాజ్ "ను నియమించాడు.అయినప్పటికీ 1829లో స్వాధీనం చేసుకున్న వారి ఆస్తులు మాత్రం అయ్సినేనా వంశానికి తిరిగి ఇవ్వలేదు.ప్రతీకారంగా " జుయాన్ జోస్ డీ అయ్సినేనా వై పినాల్ " స్వల్ప కాలం తరువాత శాన్ సల్వేడర్‌లో సేకరించిన అభిప్రాయసేకరణ సమయంలో " సెంట్రల్ అమెరికన్ ఫెడరేషన్ " రద్దుచేయడానికి అనుకూలంగా ఓటు వేసాడు. ఫలితంగా ఫెడరల్ మేండేట్‌తో పోరాడటానికి మొరజాన్ ఎల్ సల్వేడర్‌కు తిరిగి వచ్చాడు.వచ్చే మార్గంలో కర్రేరాకు సహకరించినందుకు తూర్పు గ్వాటెమాలాలోని ప్రజలమీద ప్రతీకారంచర్యలు తీసుకున్నాడు. మొరజాన్ ఎల్ సల్వేడర్ వెళ్ళాడు. కర్రేరా మిగిలిన చిన్నపాటి సైన్యంతో సలమాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు.పోరాటంలో ఓడిపోవడమేకాక తన సోదరుడు ల్యూరియానోను కోల్పోయాడు. కర్రేరా కొంత మంది మనుష్యులతో తీవ్రమైన గాయాలతో ప్రాణాలతో తప్పించుకుని సనరాటే చేరుకున్నాడు. గాయాలనుండి కోలుకున్న తరువాత కర్రేరా జుటియాపా లోని ఒక ప్రాంతం మీద దాడిచేసి వారిని దోచుకుని లభించిన సంపదను తనను అనుసరించిన అనుయాయులకు ఇచ్చాడు. తరువాత ఆయన గ్వాటెమాలా నగరానికి సమీపంలో ఉన్న పెటాపా మీద దాడి చేసాడు. అక్కడ ఆయన విజయం సాధించాడు. అదే సంవత్సరం సెప్టెంబరు మాసంలో ఆయన రాజధాని గ్వాటెమాలా మీద దాడి చేసి " జనరల్ కార్టోస్ కాస్ట్రో " చేతిలో ఓడిపోయాడు.

కర్రెరా ఓటమి

క్యుత్జల్టెనాంగో మీద కర్రెరా చేసిన దాడి అపజయం పాలైంది. తీవ్రమైన గాయాలతో పట్టుబడిన కర్రెరా మెక్సికో జనరల్ అగస్టిన్ గుజ్మన్‌కు అప్పగించపడ్డాడు. అగస్టన్ గుజ్మన్ 1823 నుండి (విసెంటె ఫిలిసోలా చేరినప్పటి నుండి) క్యుత్జల్టెనాంగోలో ఉన్నాడు.మొరజాన్‌కు కర్రెరాను కాల్చడానికి అవకాశం లభించినా కర్రెరాను హతమార్చక మాల్టాలోని చిన్నకోటకు రక్షకునిగా చేసాడు. అయినప్పటికీ కర్రెరాకు ఆయుధాలను అందించలేదు. ఎల్ సల్వేడర్ లోని ఫ్రాంసిస్కో ఫెర్రెరాను ఓడించడానికి మొరజాన్‌కు గౌతమానా రైతుల సహాయం అవసరమైంది. మొరజాన్ ఎల్ సల్వేడర్‌కు వెళ్ళగానే ఫ్రాంసిస్కో ఫెర్రెరా కర్రెరాకు ఆయుధాలను అందించి గ్వాటెమాలా మీద దాడి చేయమని చెప్పాడు. సల్జార్ మాత్రం కర్రెరాతో సంధిచేయడానికి ప్రయత్నించాడు. 1829 ఏప్రిల్ 13 న సల్జార్ విశ్వాసం , ఫెర్రెరా ఆయుధాలతో కర్రెరా సులభంగా గ్వాటెమాలాను స్వాధీనం చేసుకున్నాడు. కాస్ట్రో సల్జార్, మారియానో గల్వెజ్ , బరుండియా గ్వాటెమాలా వదిలి పారిపోయారు. వారు పొరుగువారి గృహాలలో ఆశ్రయంపొందారు. తరువాత వారు రైతుల వేషాలలో సరిహద్దు చేరుకున్నారు. సల్జార్ వెళ్ళడంతో కర్రెరా రివెరా పాజ్‌ను రాజ్యానికి అధిపతిని చేసాడు.

వేర్పాటువాదం

1838 - 1840 మద్యకాలంలో గ్వాటెమాలా నుండి లాస్ ఆల్టాస్‌కు స్వతంత్రం కోరుతూ క్యుత్జల్టెనాంగోలో వేర్పాటువాదం ఉద్యమం కొనసాగింది. గ్వాటెమాలా లిబర్టీ పార్టీకి చెందిన ప్రముఖులు , కంసర్వేటివ్ లిబరల్ శత్రువులు ఎల్ సల్వృడర్‌ను వదిలి లాస్ ఆల్టాస్‌కు తరలివెళ్ళారు. రివరెజ్ పాజ్ కంసర్వేటివ్ ప్రభుత్వాన్ని లాస్ ఆల్టాస్ లోని లిబరల్స్ తీవ్రంగా విమర్శించారు. లాస్ ఆల్టాస్ ప్రాంతం మునుపటి గ్వాటెమాలా రాజకీయ , ఆర్థిక కేంద్రంగా ఉండేది. గ్వాటెమాలా శాతియుతమైగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ ఇరువర్గాల మద్య రెండు సంవత్సరాలకాలం తీవ్రమైన సంఘర్షణ కొనసాగింది.మద్య అమెరికాలో పట్టుసాధించడానికి 1940లో బెల్జియం కర్రెరా స్వతంత్రపోరాటానికి వెలుపలి నుండి సహాయం అందించింది. బెల్జియం రాజు మొదటి లియోపోల్డ్ బ్రిటిష్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ సెంట్రల్ అమెరికా స్థానంలో " బెల్జియం కాలనైజేషన్ కంపనీ " స్థాపించి శాంటో తామస్ డీ కాస్టిలా నిర్వాహకుడయ్యాడు] అయినప్పటికీ కాలనీ బెల్జియాన్ని అణగదొక్కి కర్రెరాకు మద్దతు కొనసాగించింది. తరువాత కర్రెరా పాలనలో బ్రిటన్ ప్రధాన వాణిజ్య, రాజకీయ భాగస్వామిగా కొనసాగింది. 1844లో రఫీల్ కర్రెరా గ్వాటెమాలా గవర్నర్‌గా ఎన్నికచేయబడ్డాడు.19 వ శతాబ్దంలో జర్మన్ గౌతమాలన్ వలసప్రజలు గ్వాటెమాలాలో ప్రవేశించడం ఆరంభం అయింది.జర్మన్ వలసప్రజలు గ్వాటెమాలాలోని క్యుత్జల్టెనాంగో, ఆల్టావెరపాజ్ ప్రాంతాలలో భూమిని కొనుగోలుచేసి కాఫీతోటల పెంపకం ఆరంభించారు.

రిపబ్లిక్ (1847–1851)

1847 మార్చి 21లో గ్వాటెమాలా తనకుతానుగా స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. కర్రెరా గ్వాటెమాలా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడయ్యాడు.

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Proclamation Coin 1847 of the independent Republic of Guatemala

అధ్యక్షునిగా మొదటి విడతగా దేశంలో తీవ్రమైన సంప్రదాయవిధానాన్ని తిరిగి తీసుకువచ్చాడు. 1848లో లిబరల్స్ కర్రెరాను పదవీచ్యుతుని చేసినప్పుడు దేశంలో కొన్నిమాసాలకాలం రాజకీయ సంక్షోభం నెలకొన్నది. కర్రెరా పదవికి రాజీనామా చేసి మెక్సికో చేరుకున్నాడు. కొత్త లిబరల్ పాలన అయ్సినియా కుటుంబంతో సంకీర్ణమై కర్రెరా గౌతమాలో ప్రవేశిస్తే మరణశిక్ష వేయాలని చట్టాన్ని వేగవంతంగా విడుదల చేసింది. లిబరల్స్ క్యుత్జల్టెనాంగో నుండి అగస్టిన్ గుజ్మన్ (నగరాన్ని కొర్రెజిడార్ జనరల్ మారినో పారడెస్ నుండి స్వాధీనం చేసుకున్న వీరుడు) నాయకత్వంలో గ్వాటెమాలా అధ్యక్షుని కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1848 ఆగస్టు 26న లిబరల్స్ తిరిగి లాస్ ఆల్టాస్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. కొత్త దేశం డొరొటియో వాస్కాంసెలాస్ పాలనకు, వెసెంటే, సెరపియో క్రజ్ గొరిల్లా సైన్యం (కర్రెరా శతృవులుగా ప్రమాణం చేసిన వారు) కు మద్దతుగా నిలిచింది. మద్యంతర ప్రభుత్వానికి గుజ్మన్ నాయకత్వం వహించగా ఫ్లొరెంసియో, ప్రీస్ట్ ఫెర్నాండో డావిలా మత్రులుగా సహకరించారు. 1848 సెప్టెంబరు 5 న క్రియోలస్ తమప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అంటోనియో మార్టినెజ్‌ను ఎన్నుకున్నారు.

కర్రెరా పునఃప్రవేశం

తరువాత కర్రెరా తిరిగి గ్వాటెమాలాకు వస్తానని ప్రకటించి అలాగే హ్యూహ్యూటెనాంగోలో ప్రవేశించాడు. అక్కడ ఆయన స్థానుక నాయకులను కలుసుకుని వారందరిని సమైక్యంగా ఉండాలని హితవుచెప్పాడు. అందుకు అంగీకరించిన స్థానిక నాయకులు కర్రెరా నాయకత్వంలో స్థానిక సమూహాలను సమైక్యపరచి సరికొత్త ఇండియన్ ప్రజాసమూహాన్ని అభివృద్ధి చేసారు. మరొకవైపు తూర్పుగ్వాటెమాలా లోని జలపా ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది. మునుపటి రివెరా పాజ్, తిరుగుబాటు నాయకుడు విసెంటే క్రజ్ ఇరువురు 1849లో కొర్రెజిడార్ కార్యాలయం చేపట్టే ప్రయత్నంలో హత్యకు గురైయ్యారు. కర్రెరా చియాంట్లలాలోని హ్యూహ్యూటెనాంగోలో ప్రవేశించగానే ఆల్టెంసిస్ ప్రతినిధులు ఇరువురు వారి సైనికులు యుద్ధంలో పాల్గొనడం లేదని తెలియజేసారు. యుద్ధంలో పాల్గొంటే అది 1840లో లాగా అంతర్యుద్ధానికి దారితీస్తుందని చెప్పి అలాగే స్థానికప్రజలను నియంత్రణలో ఉంచమని కోరారు. గుజ్మన్ సైన్యాలతో కర్రెరాను వెంటాడాడు. కౌడిల్లో స్థానిక సంకీర్ణ సైన్యాలతో వారి రక్షణార్ధం నిలిచాడు.సుచిటెపెక్యూజ్ లోని కొర్రెజిడార్‌గా జోస్ విక్టర్ జవల నియమితుడయ్యాడు. కర్రెరా, నూరు మంది జకల్టెక్ ప్రజల అంగరక్షకులతో ప్రమాదకరమైన అరణ్యాలను దాటి తన పాత స్నేహితుని కలుసుకున్నాడు. జవలా ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించక పోవడమేకాక ఆయనకు సేవచేయడానికి సంసిద్ధత తెలియజేసాడు. అది గ్వాటెమాలా నగరంలోని లిబరల్, కనసర్వేటివ్‌లకు బలమైన సంకేతాలు అందడానికి కారణం అయింది. వారికి కర్రెరాతో రాజీపడం లేక యుద్ధానికి తలపడం మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలయ్యాయి. కర్రెరా క్యుత్జల్టెనాంగోకు తిరిగి వెళ్ళాడు. జవల సుచితెపెక్యూజ్‌లోనే నిలిచాడు. గుజ్మన్ ఆంటిగుయాకు వెళ్ళి పెరెడెస్ ప్రతినిధులను కలుసుకున్నాడు. వారు లాస్ ఆల్టాస్‌ను తిరిగి గ్వాటెమాలాలో విలీనం చేయడానికి అంగీకరించాడు. అది తరువాత గుజ్మన్ శత్రువును ఓడించడానికి సహకరించింది. గుజ్మన్ పసిఫిక్ సముద్రం మీద ఒక నౌకాశ్రయం నిర్మించాడు. గుజ్మన్‌కు ఈసారి విజయావకాశాలు అధికంగా ఉన్నా ఆయన లేని సమయం చూసి కర్రెరా, సంకీర్ణ స్థానికదళాలు క్యుత్జల్టెనాంగోను ఆక్రమించాడు. కర్రెరా ఇగ్నాసియో య్రిగోయెన్‌ను కొర్రెజిడార్‌గా నియమించి కిచే క్యుయంజొబల్, మాం ప్రజానాయకులతో కలిసి పనిచేస్తూ ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచమని ఆదేశించాడు. గుజ్మన్ జల్పాకు వెళ్ళి తిరుగుబాటు నాయకులను కలుసుకున్నాడు. మరొకవైపు అధ్యక్షుడైన పెరెడెస్‌ను కలుసుకున్న లూయిస్ బాట్రెస్ జుయారోస్‌ ఆయనను కర్రెరాతో సఖ్యతగా ఉండడానికి అంగీకరింపజేసాడు. తిరిగి కొన్ని మాసాల తరువాత గ్వాటెమాలాకు చేరుకున్న కర్రెరా ఇండియన్ సైన్య, రాజకీయ మద్దతుతో కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు. 1844 - 1848 మద్య కాలంలో ఆయన దేశాన్ని సంప్రదాయబద్ధంగా మార్చాడు. అలాగే జుయాన్ జోస్ డీ అయసినెనా వై పినోల్, పెడ్రో డీ అయ్సినెనా సలహాతో రోమన్ కాథలిక్ చర్చితో సంబంధాలు పునరుద్ధరించాడు.

రెండవ కర్రెరా ప్రభుత్వం (1851–1865)

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Captain General Rafael Carrera after being appointed President for Life in 1854.

1849లో కర్రెరా బహిస్కరణ నుండి తిరిగి వచ్చిన తరువాత ఎల్ సల్వేడర్ అధ్యక్షుడు " డోర్టియో వాస్కాంసిలాస్ " గ్వాటెమాలా ప్రభుత్వాన్ని పలుమార్లు పలు మార్గాలలో ఇబ్బందికి గురిచేసిన లిబరల్స్‌కు ఆశ్రయం ఇవ్వడానికి అనుమతించాడు. " జోస్ ఫ్రాంసిస్కో బర్రూడియా " ప్రత్యేకప్రయోజనం కొరకు లిబరల్ వార్తాపత్రికను స్థాపించాడు. వాస్కాంసిలాస్ " లా మొంటానా " వర్గకక్ష్యలకు మద్దతిస్తూ వారికి ధనసహాయం, ఆయుధసరఫరా అందించాడు. 1850 నాటికి వాస్కాంసిలాస్ గ్వాటెమాలాతో యుద్ధం నిదానం అయినందుకు అసహనానికి గురై నేరుగా బహిరంగ దాడి చేయడానికి నిర్ణయించుకున్నాడు. పరిస్థితుల ప్రభావానికి గురైన సాల్వేడరన్ దేశనాయకుడు గ్వాటెమాలా కంసర్వేటివ్పాలనకు వ్యతిరేకంగా యుద్ధం ఆరంభిస్తూ " హోండురాస్ ", నికరగువాలను యుద్ధంలో పాల్గొనడానికి ఆహ్వానం పంపగా హండూరస్ ప్రభుత్వం మాత్రం " జుయాన్ లిండో " నాయకత్వంలో సైన్యం పంపడానికి అనుమతించింది. 1851లో ఎల్ సల్వేడర్, హండూరస్ సంకీర్ణ సైన్యాలను గ్వాటెమాలా " లా అరాడా యుద్ధంలో ఓడించింది.

1854లో కర్రెరా " సుప్రీం, పర్పెచ్యుయల్ లీడర్ ఆఫ్ ది నేషన్ ఫర్ లైఫ్ " తన వారసుని ఎనూకునే అధికారంతో ప్రకటించాడు. 1865 ఏప్రెల్ 14న ఆయన మరణించే వరకు తన అధికారపదవిలో కొనసాగాడు. ఆయన కంసర్వేటివ్ భూస్వాములను తృప్తిపరచడానికి ఆర్ధిక సమృద్ధి కొరకు కొన్ని మార్గాలు సూచించాడు. దేశంలో ఎదురైన సైనిక సవాళ్ళు , హోండురాస్, ఎల్ సాల్వడోర్ , నికరగువా లతో మూడు సంవత్సరాల కాలం కొనసాగిన యుద్ధం ఆయన అధ్యక్షత మీద ఆధిక్యత సాధించాయి.

ఎల్ సల్వేడర్ అధ్యక్షుడు గెరార్డో బర్రియోస్‌తో కర్రెరా శతృత్వం 1863లో బహిరంగ యుద్ధానికి దారితీసింది. " కొయాటెపెక్యూ " సమీపంలో జరిగిన యుద్ధంలో గ్వాటెమాలా ఎదుర్కొన్న ఓటమి చివరికి సంధికి దారితీసింది. గ్వాటెమాలాతో హండూరాస్, ఎల్ సాల్వడార్, నికరగువా , కోస్టారికాలతో సమైఖ్యమయ్యారు. పోటి చివరికి కర్రెరాకు అనుకూలంగా మారింది.కర్రెరా శాన్ సల్వేడర్‌ను ఆక్రమించుకుని హండూరాస్ , నికరగువాలను అధిగమించాడు. కర్రెరా క్లెరికల్ పార్టీతో మైత్రిని కొనసాగిస్తూ యురేపియన్ ప్రభుత్వాలతో స్నేహసంబంధాలను స్థిరపరిచాడు. కర్రెరా మరణించడానికి ముందుగా లాయల్ సాలిడార్ ఆర్మీ మార్షల్ " విసెంటే సెమా వై సెమా " ను ఆయన వారసునిగా ప్రతిపాదించాడు.

విసెంటె వై సెర్నా పాలన (1865–1871)

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Vicente Cerna y Cerna was the president of Guatemala from 1865 to 1871.

1865 మే 24 నుండి 1871 వరకు " విసెంటే వై సెర్నా " గ్వాటెమాలా అధ్యక్షుడుగా ఉన్నాడు.

లిబరల్ ప్రభుత్వాలు (1871–1898)

1871లో గ్వాటెమాలాను ఆధుకరీకరణ చేసి వాణిజ్యం అభివృద్ధిచేసి కొత్తపంటలను పరిచయంచేసి పారిశ్రామికంగా అభివృద్ధిదశకు తీసుకువచ్చిన లిబరల్స్ " జస్టో రుఫినో " నాయకత్వంలో " లిబరల్ రివల్యూషన్ " (లిబరల్ తిరుగుబాటు) ఆరంభం చేసారు. ఈ శకంలో గ్వాటెమాలాలో కాఫీ ప్రధానపంటగా మారింది. బారియోస్ దేశాధికారం దక్కించుకొనే లక్ష్యంతో ఎల్ సల్వేడర్‌కు వ్యతిరేకంగా యుద్ధంచేసి 1885లో జరిగిన యుద్ధంలో మరణించాడు. తరువాత 1886 నుండి 1892 మార్చి 15 వరకు " మాన్యుయల్ బరిల్లాస్ " అధ్యక్షుడుగా ఉన్నాడు. 1971 , 1944 మద్య కాలంలో గ్వాటెమాలా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో మాన్యుయల్ బరిల్లాస్ అసమానమైన అధ్యక్షునిగా గుర్తించబడ్డాడు. గ్వాటెమాలాలో ఎన్నికలు సమీపించగానే మాన్యుయల్ బరిల్లాస్ ముగ్గురు ప్రతినిధులను పంపి ప్రభుత్వం ప్రణాకల గురించి తెలపమని అడిగాడు. తరువాత జనరల్ " జోస్ మరియా రేనా బర్రియోస్ " పంపిన సందేశం అతనికి ఆనందం కలిగించింది. బరిల్లాస్ క్యుత్జల్టెనాంగో , టొటానికాపన్ గిరిజన ప్రజలు పర్వతాలు దిగివచ్చి రేనాకు ఓటు వేస్తారని రేనాకు విశ్వాసం కలిగించాడు. రేనా అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.1892 నుండి 1898 వరకు " జోస్ మరియా రేనా బర్రియోస్ " గ్వాటెమాలా అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన పాలనలో భూస్వాములు గ్రామీణ వ్యవసాయం మీద ఆధిఖ్యత సాధించారు. రేనా నగరంలో పర్షియన్ శైలిలో వీధులను నిర్మించి గ్వాటెమాలా నగరాన్ని బృయత్తరంగా అభివృద్ధి చేయడానికి నిశ్చయించాడు. ఆయన 1897లో గ్వాటెమాలాలో " ఎక్స్పొజిషన్ సెంట్రో అమెరికనా (సెంట్రల్ అమెరికన్ ఫెయిర్ " ) నిర్వహించాలని అనుకున్నాడు. ఆయన అధ్యక్షునిగా రెండవ దఫా పాలనా సమయంలో బర్రియోస్ రేనా లక్ష్యాలను సాధించడానికి బాండ్లు ముద్రించాడు. ఇది ధ్రవ్యోల్భణానికి దారితీసి ఆయన పాలనకు వ్యతిరేకత అధికమైంది.ఆయన పాలనలో విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించడానికి గ్వాటెమాలాలో రహదార్లు అభివృద్ధి చేయబడ్డాయి, జాతీయ , అంతర్జాతీయ తంతి కార్యక్రమాలు (టెలిగ్రాఫులు) స్థాపించబడ్డాయి, గ్వాటెమాలా నగరానికి విద్యుత్తు సౌకర్యం కలిగించబడింది, రైలుమార్గాల నిర్మాణం పూర్తిచేయబడ్డాయి.ఆసమయంలో పనామా కాలువ నిర్మించబడలేదు.

మాన్యుయల్ ఎస్ట్రాడా కేబ్రియా పాలన (1898–1920)

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Manuel Estrada Cabrera ruled Guatemala between 1898 and 1920.

1898 ఫిబ్రవరి 8న జనరల్ " జోస్ మరియా రేనా బర్రియోస్ " గ్వాటెమాలాకు కొత్త అధ్యక్షుని నియమించడానికి కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అధ్యక్షునిగా అర్హతలు కలిగిన " ఎస్ట్రాడా కాబ్రెరా " ను సమావేశానికి ఆహ్వానించలేదు. కాబ్రరా అధ్యక్షునిగా నియమించడానికి బిన్నాభిప్రాయాలున్నాయి. కాబ్రెరా తుపాకితో సమావేశంలో ప్రవేశించి తనను అధ్యక్షునిగా నియమించాలని నిర్భంధించాడు. ఎస్ట్రాడా కాద్రెరా తనపాలనకు ఎదురైన వ్యతిరేకతను అధిగమించడానికి 1898 ఆగస్టులో వ్యతిరేకతను అధిగమించి అధ్యక్షపీఠం అధిరోహించి సెప్టెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించి అందులో బిజయం సాధించాడు. 1898 లో లెజిస్లేచర్ సమావేశంలో ఎస్ట్రాడా ఎన్నికల విజయానికి సాధారణ దుస్తులు ధరించి ఓటువేసి తనకు సహకరించిన సైనికులు , పోలీసులకు , పెద్ద సంఖ్యలో సహకరించిన విద్యావంతుల కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపాడు. ఎస్ట్రాడా చేసిన అత్యంత ప్రభావవంతమైన అదేసమయంలో అత్యంత చేదు అనుభవాలను కలిగించిన కార్యాలలో గ్వాటెమాలా ఆర్ధికరంగంలో " యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ " ప్రవేశానికి అనుమతించడం ఒకటి. లిబరల్ పార్టీ సభ్యునిగా ఆయన దేశ రహదారులు, రైలుమార్గాలు , సముద్ర నౌకాశ్రయాల వంటి నిర్మాణవ్యవస్థను (ఇంఫ్రాస్ట్రక్చర్) అభివృద్ధిచేసి ఎగుమతుల ద్వారా ఆదాయవనరులను అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు. ఎస్ట్రాడా రైలురోడ్డు నిర్మాణం రాజధాని గ్వాటెమాలా నగరంలోని " ప్యూరిటో బర్రియోస్ " వరకు విస్తరించాడు. అతర్గత కాఫీ వ్యాపారం క్షీణించిన కారణంగా నిర్మాణకార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడింది. దాదాపు 100కి.మీ పొడవైన రైలుమార్గం నిర్మాణం నిలిచిపోయింది. కాబ్రెరా లెజిస్లేచర్ లేక న్యాయవ్యవస్థను సంప్రదించకుండా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీతో రైలుమార్గం నిర్మాణం పూర్తిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.1914లో కాబ్రెరా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి చెందిన " మైనర్ కూపర్ కెయిత్ " తో ఒప్పదం మీద సంతకం చేసాడు.ఒప్పందం కారణంగా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి పన్నురాయితీ, స్థలాల మంజూరు, అట్లాంటిక్ సైడ్ రైలుమార్గాల నియంత్రణ లభించాయి.

ఎస్ట్రాడా కాబ్రెరా తరచుగా తన అధికారం ప్రదర్శించడానికి క్రూరమైన చర్యలు చేపట్టే వాడు.తన మొదటి అధ్యక్షపాలనా కాలంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులను మరణానికి గురిచేసి సామర్ధ్యం కలిగిన గూఢాచారవ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన విషమిచ్చి చంపమని ఆదేశించిన తరువాత తప్పించుకున్న దౌత్యాధికారి యునైటెడ్ స్టేట్స్ చేరుకున్నాడు. మెక్సికో నగరంలో మునుపటి అధ్యక్షుడు మాన్యుయల్ బరిల్లాస్ కత్తిపోటుకు గురై మరణించాడు. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ కార్మికుల సమ్మెకు వ్యతిరేకంగా కాబ్రెరా హింసాత్మకంగా స్పందించాడు. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ ( సైనికబృందాలు అనుకూలంగా స్పందించలేదు) నేరుగా కాబ్రెరాను కలుసుకుని సమ్మెను పరిష్కరించమని కోరింది. అధ్యక్షుడు సైనికబృందాన్ని ఆదేశించిన తరువాత సైన్యం కంపెనీలో ప్రవేశించింది. రాత్రివేళ కంపెనీలో ప్రవేశించిన సైనికులు కార్మికులు నిద్రిస్తున్న శిబిరాలకు నిర్ధాక్షిన్యంగా నిప్పంటించారు. ఈ సంఘటనలో అనేకమంది గాయపడడం, మరణించడం సంభవించింది.

1906లో ఎస్ట్రాడా పాలనకు వరుస తిరుగుబాటులు ఎదురైయ్యాయి.కొన్ని మద్య అమెరికా దేశాల మద్దతుతో తిరుగుబాటుదారులను ఎస్ట్రాడా సమర్ధతతో అణిచివేసాడు. ఎస్ట్రాడా కాబ్రెరాకు వ్యతిరేకంగా ఎన్నికల ద్వారా ఎన్నికచేయబడిన అధ్యక్షుడు హత్యచేయబడ్డాడు. 1907లో ఆయన వాహనానికి సమీపంలో బాంబుదాడి జరిగినసమయంలో ఎస్ట్రాడా హత్యాప్రయత్నం నుండి తృటిలో తప్పించుకున్నాడు. 1907 హత్యాప్రయత్నం తరువాత హింసాత్మక చర్యలకు స్వస్థిపలకమని సన్నిహితులు సలహా అందించారు.

భూకంపం

1917లో గ్వాటెమాలా నగరంలో సంభవించిన భూకంపం నగరాన్ని ధ్వంసం చేసింది. 1920లో బలవంతంగా పదవీచ్యుతుని చేసేవరకు ఎస్ట్రాడా పదవిలో కొనసాగాడు. ఆసమయానికి ఆయన అధికారశక్తి చాలావరకు క్షీణించింది. ఆయన తిరుగుబాటుద్వారా మాత్రమే పదవిని త్యజించాలనుకుంటే యునైటెడ్ స్టేట్స్ జోక్యం చేకుంటానని బెదిరించింది. ఒక సంకీర్ణదళం ఆయనను పదవి నుండి తొలగించడంలో భాగస్వామ్యం వహించింది. నేషన్ల్ అసెంబ్లీ ఆయనకు మతిస్థిమితం తప్పిందని కారణం చూపి పదవి నుండి తొలగించి 1920 ఏప్రిల్ 8న ఆయన స్థానంలో హర్రెరాను నియమించింది.

జార్జ్ యూబికో పాలన (1931–1944)

1929లో సంభవించిన " గ్రేట్ డిప్రెషన్ " కారణంగా గ్వాటెమాలా ఆర్థికరంగం ఘోరంగా దెబ్బతిని దేశంలో నిరుద్యోగసమస్య అధికమై ఉద్యోగులు, శ్రామికులలో అశాంతి నెలకొన్నది. తిరుగుబాటు సంభవించగలదన్న భయంతో ప్రాంతీయ గవర్నరుగా పనిచేస్తున్న క్రూరత్వానికి మారుపేరుగా గుర్తించబడిన " జార్జ్ యుబికోకు " గ్వాటెమాలా ప్రజలు మద్దతు తెలిపారు. 1931లో నిర్వహించబడిన ఎన్నికలలో జార్జ్ యుబికో విజయం సాధించాడు.ఎన్నికలలో యుబికో ఒక్కడే సభ్యుడుగా నిలిచాడు. ఎన్నికల తరువాత అతివేగంగా యుబికో విధానాలు అమలులోకి వచ్చాయి. ఆయన ఋణవిధానం స్థానంలో క్రూరంగా వెగ్రంసీ చట్టం ప్రవేశపెట్టాడు. చట్టం అనుసరించి భూమిలేని యువకులంతా కనీసం 100 రోజుల కఠినశ్రమ చేయాలని నిర్భంధించబడింది. ఆయన ప్రభుత్వం జీతభత్యం లేకుండా పనిచేసే ఇండియన్ శ్రామికుల చేత రహదారులు, రైలుమార్గ నిర్మాణ పనులకు వాడుకోబడ్డారు. అంతేకాక యుబికో ఉద్యోగుల జీతాలను చాలా తక్కువస్థాయికి తగ్గించాడు. తరువాత భూస్వాములు తమ సంపద రక్షించుకోవడానికి తీసుకునే చర్యల నుండి చట్టం ద్వారా పూర్తిస్థాయి రక్షణ కల్పించాడు. హత్యలను చట్టబద్ధం చేసాడని చరిత్రకారులు వర్ణించారు. ఆయన పోలీస్ వ్యవస్థను అత్యంత బలోపేతం చేసాడు. చివరకు అది లాటిన్ అమెరికాలో అత్యంత క్రూరమైనదిగా మారింది. లేబర్ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు సందేహించే వారిని ఖైదుచేయడానికి, కాల్చివేయడానికి ఆయన పోలీసులకు పూర్తి అధికారం కల్పించాడు. ఈ చట్టం ఆయనకు వ్యవసాయకూలీల మద్య పగ శతృత్వం అధికరింపజేసింది. ఆయన ప్రభుత్వం తీవ్రంగా సైనికపరం చేయబడింది. ఆర్మీ జనరల్‌గా పనిచేసిన వారిని ప్రాంతీయ గవర్నర్లుగా నియమించబడ్డారు.

యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ

యుబికో మునుపటి పాలకుల విధానాలను అనుసరిస్తూ " యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ "కి పెద్ద ఎత్తున మినహాయింపులు కొనసాగించాడు. నౌకాశ్రయం నిర్మించడానికి బదులుగా ఆయన యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి 2,00,00 హెక్టార్ల భూమిని మంజూరు చేస్తానని ప్రమాణం చేసాడు.200,000 hectares (490,000 acres) అయినా ప్రమాణం తిరిగి అతిక్రమించాడు. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ గ్వాటెమాలాలో ప్రవేశించిన తరువాత నుండి అది వ్యవసాయదారులను తొలగిస్తూ భూమిని విస్తరించి వారి వ్యవసాయ భూములను అరటి తోటలుగా మార్చింది. ఈ విధానం యుబికో అధ్యక్షతలో వేగవంతం అయింది. ప్రభుత్వం దీనిని అడ్డగించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కంపెనీ దిగుమతి సుంకాన్ని అందుకున్నది.కంపెనీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పన్ను నుండి తప్పించుకున్నది. ప్రత్యేక వ్యక్తులకంటే అత్యధికమైన భూములను తన స్వాధీనంలో నిలిపింది. అంతేకాక దేశంలోని మొత్తం రైల్వేశాఖను తన నియంత్రణలోకి తీసుకున్నది. కంపెనీ విద్యుత్తు ఉత్పత్తి, అట్లాంటిక్ సముద్రతీరంలో ఉన్న నౌకాశ్రయ వసతుల మీద పూర్తి స్థాయిలో ఆధీనత సాధించింది.

యునైటెడ్ స్టేట్స్ మద్దతు

మెక్సికన్ కమ్యూనిస్టు ప్రభుత్వం నుండి బెదిరింపు కారణంగా యునైటెడ్ స్టేట్స్ తమకు మద్దతుగా ఉండడానికి అంగీకరిస్తుందని యుబికో ఊహించి యునైటెడ్ స్టేట్స్ మద్దతు కొరకు ప్రయత్నించాడు. 1941లో యు.ఎస్ ప్రభుత్వం జర్మనీ మీద యుద్ధం ప్రకటించిన తరువాత అమెరికన్ సూచనలను అంగీకరించి యుబికో గ్వాటెమాలాలో నివసిస్తున్న జర్మనీ సంతతికి చెందిన ప్రజలందరినీ ఖైదుచేయించాడు. పనామాకాలువను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ గ్వాటెమాలాలో ఎయిర్ బేస్ నిర్మించడానికి యుబికో అనుమతించాడు. అయినప్పటికీ యుబికో ఐరోపా‌కు చెందిన ఫ్రాంసిస్కో, బెనిటోముస్సోలిన్‌ వంటి నియంతలకు ఆరాధకుడుగా ఉండేవాడు. ఆయన తనకు తాను మరొక నెపోలియన్గా ఊహించుకునేవాడు. ఆయన డాబుసరిగా దుస్తులను ధరించి నెపోలియన్ శిల్పాలను, వర్ణచిత్రాలను చుట్టూ ఉంచుకుని క్రమంతప్పకుండా నెపోలియన్, తనకు మద్య ఉన్న పోలికల గురించి ప్రస్తావించేవాడు. ఆయన పోస్టాఫీసు, పాఠశాలలు, సింఫోనీ సంగీతకారులు మొదలైన అనేక రాజకీయ, సాంఘిక వ్యవస్థలను సైనికపరం చేసాడు. సైనికాధికారులను పలు ప్రభుత్వ అధికారపదవులలో నియమించాడు.

గ్వాటెమాలా విప్లవం (1944–1954)

1944 జూలై 1న యుబికో అధ్యక్షతకు వ్యతిరేకంగా అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని నిర్భంధిస్తూ పలు ప్రదర్శనలు, జనరల్ సమ్మె నిర్వహించబడ్డాయి. తోటకూలీల క్రూరమైన పరిస్థితిని నిరసిస్తూ తోట కూలీలు కూడా సమ్మెలో భాగస్వామ్యం వహించారు. ఆయన తనకు బదులుగా తనస్థానంలో ఎన్నిక చేసిన " జనరల్ జుయాన్ అర్గెంజ్ గుజ్మన్ " 1944 అక్టోబరు 20న " మేజర్ ఫ్రాంసిస్కో జవీర్ అర్నా ", కేప్టన్ జకోబా అర్బెంజ్ గుజ్మన్ " నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ద్వారా బలవంతంగా పదవి నుండి తొలగించబడ్డాడు. తిరుగుబాటులో దాదాపు 100 మంది ప్రజలు మరణించారు. తరువాత దేశం అర్నా అర్బెజ్ , జార్జ్ అర్బెంజ్ గుజ్మన్ నాయకత్వంలో సైనికపాలనలోకి మారింది.

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Guatemala's democratically elected president Jacobo Árbenz was overthrown in a coup planned by the CIA to protect the profits of the United Fruit Company.

సైనిక ప్రభుత్వం మొదటిసారిగా గ్వాటెమాలా స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహించింది. రచయిత , ఉపాధ్యాయుడు అయిన " జుయాన్ జోస్ అరెవాలో " ఆశించిన విధంగా దేశాన్ని లిబరల్ కాపిటలిస్టుగా మార్చడానికి అనుకూలంగా ఎన్నికలలో ప్రజలు 86% మద్దతిచ్చారు. గ్రేట్ డిప్రెషన్ సమయంలో జుయాన్ జోస్ అరెవాలో క్రైస్తవ సోషలిస్టు విధానాలకు ఆకర్షితుడైన అమెరికన్ కొత్త అధ్యక్షుడు " ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్ట్ " పెద్ద ఎత్తున సహాయం అందించాడు. అరెవాలో కొత్త ఆరోగ్యకేంద్రాలను నిర్మించాడు, విద్య కొరకు నిధులను అభివృద్ధి చేసాడు , లిబరల్ లేబర్ చట్టం ప్రవేశపెట్టాడు. 500 కంటే తక్కువ కార్మికులు ఉన్న పరిశ్రమలలో యూనియన్ రూపొందించడం నేరంగా పరిగణిస్తూ చట్టం ప్రవేశపెట్టాడు. అలాగే కమ్యూనిస్టుల పలుకుబడిని క్షీణింపజేసాడు. దేశాలమద్య అరెవాలో కీర్తి గడించినప్పటికీ ఆయనకు చర్చి , సైన్యంలో శతృవులు ఉన్నారు. ఆయన అధ్యక్షపాలనలో దాదాపు 25 తిరుగుబాటులను ఎదుర్కొన్నాడు.1950 లో నిర్వహించిన ఎన్నికలలో పాల్గొనడం నుండి అరెవాలో దూరం చేయబడ్డాడు. స్వేచ్ఛగా నిర్వహించబడిన ఎన్నికలలో అరెవాలో రక్షణమంత్రి " జాకొబ్ అర్బెంజ్ గుజ్మన్ " విజయం సాధించాడు. అర్బెంజ్ అరెవాలో ఆధునిక కాపిటలిస్టు విధానాలను కొనసాగించాడు. ఆయన ప్రధాన విధానాలలో 1952లో విడుదల చేసిన " డిక్రీ 900 " (అగారియన్ రిఫార్మ్‌ బిల్) ప్రాముఖ్యత సంతరించుకుంది. చట్టం భూమిలేని రైతులకు భూమిని అందించింది. చట్టం 3,50,000 ప్రైవేటు భూ ఆస్తుల మీద ప్రభావం చూపింది. ఇది 5,00,000 మంది ప్రజలకు మేలు చేసింది. ఇది దేశంలోని మొత్తం ప్రజలసంఖ్యలో ఆరవ భాగం ఉంది.

తిరుగుబాటు , అంతర్యుద్ధం (1954–1996)

సంస్కరణలకు దేశంలో ఆదరణ లభించినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం వాటిని ఇష్టపడలేదు. కమ్యూనిష్టు భావాలను ప్రతిబింబించే సంస్కరణలు అంతర్యుద్ధానికి దారితీసాయి. క్రూరమైన కార్మిక విధానాల కారణంగా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ ఆదాయం క్షీణించింది. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ సంఘర్షణ యునైటెడ్ స్టేట్స్ విధానాలకు కారణమైయ్యాయి.యు.ఎస్ అధ్యక్షుడు " హర్రీ ట్రూమన్ " నికరగువా నియంత " అనస్టేసియో సొమొజా గార్సియా " మద్దతుతో అర్బెంజ్‌ను జయించడానికి 1952 లో ప్రయత్నాలు ఆరంభించాడు. అయినప్పటికీ వివరాలు ముందుగా బహిర్గతం అయిన కారణంగా ఆపరేషన్ విసర్జించబడింది. 1952 ఎన్నికలలో యు.ఎస్ అధ్యక్షుడుగా " డ్వైట్ డి. ఐసెంహోవర్ " ఎన్నిక చేయబడ్డాడు. ఆయన కమ్యూనిజానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడతానని ప్రమాణం చేసాడు. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీతో సన్నిహితసంబంధం ఉన్న " జాన్ ఫోస్టర్ డల్లాస్ " , అల్లెన్ డల్లెస్‌లతో అధ్యక్షునికున్న సాన్నిహిత్యం అర్బెంజ్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి సహకరించింది. ఐసెంహోవర్ సి.ఐ.ఎ సాయంతో 1953 ఆగస్టులో " ఆపరేషన్ పి.బి.ఎస్. సక్సెస్ " జరిపించాడు. సి.ఐ.ఎ. 480 మంది సభ్యులతో స్థాపించిన సైనికదళానికి " కార్లోస్ కాస్టిలో ఆర్మాస్ " నాయకత్వం వహించాడు. సైనికదళం 1954 జూన్ 18న బాంబులు , అర్బెంజ్ వ్యతిరేక రేడియో ప్రసారాలు మొదలైన భారీ ఏర్పాట్లతో గ్వాటెమాలా నగరం మీద దాడి చేసింది. దాడిచేసిన సైనికబలం తక్కువగా ఉన్నప్పటికీ భౌతికమైన యుద్ధసామాగ్రి , యు.ఎస్. దాడిచేయగలదన్న భీతి గ్వాటెమాలా సైనికదళానికి భీతికలిగించిన కారణంగా యుద్ధం చేయడానికి నిరాకరించింది. ఆర్బెంజ్ జూన్ 27న రాజీనామా చేసాడు. శాన్ సల్వేడర్‌లో జరిగిన రాజీప్రయత్నాల కారణంగా కార్లోస్ కాస్టిలోస్ అర్మాస్ 1954 జూలై 7న గ్వాటెమాలా అధ్యక్షుడయ్యాడు. అక్టోబర్ ఆరంభంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో రాజకీయ పార్టీ ఏవీ పాల్గొనలేదు. కాస్టిలో అరామస్ మాత్రమే ఎన్నికలలో పాల్గొని 99% ఓట్లతో విజయం సాధించాడు. కాస్టిలో అరామస్ తిరిగి డిక్రీ 900 ప్రవేశపెట్టి 1957 జూలై 26 వరకూ (ఆయన వ్యక్తిగత అంగరక్షుకులలో ఒకడైన రోమియో వాస్క్వెజ్ చేతిలో కాల్చివేయబడే వరకు) పాలన కొనసాగించాడు. తరువాత నిర్వహించబడిన ఎన్నికలలో " జోస్ మైఖేల్ వైడిగోరస్ ఫ్యుయంటేస్ " విజయం సాధించి అధికారపదవి చేపట్టాడు. ఆయన దక్షిణతీర సరిహద్దులో చట్టవిరుద్ధంగా చేపలుపడుతున్న రెండు బోట్లను ఎయిర్ ఫోర్స్ సాయంతో ముంచివేసి మెక్సికన్ అధ్యక్షునికి సవాలు విసిరాడు. వైడిగోస్ 5,000 సభ్యులు కలిగిన " యాంటీ ఫైడెల్ కాస్ట్రో " దళాన్ని (గ్వాటెమాలాలో నివసిస్తున్న క్యూబన్లు) సంసిద్ధం చేసాడు. ఆయన పెటెన్‌లో ఎయిర్‌స్ట్రిప్ కూడా ఏర్పాటు చేసాడు. అది తరువాత 1961 లో విఫలమైన యు.ఎస్ " బే ఆఫ్ పిగ్స్ ఇంవేషంస్ " దాడిలో ఉపయోగించబడింది. 1963 లో పలు మిలిటరీ బేసుల నుండి గౌతమాలన్ దళాలు సాగించిన దాడుల కారణంగా వైడిగోస్ ప్రభుత్వం పతనం చేయబడింది. తిరుగుబాటుకు రక్షణమంత్రి " కొలెనెల్ ఎంరిక్యూ పెరల్టా అజుఇడియా " నాయకత్వం వహించాడు. 1963 లో జుంటా ఎన్నికలకు పిలుపు ఇచ్చాడు. ఎన్నికల కారణంగా దేశాంతరానికి పారిపోయిన అరెవాలో తిరిగి దేశంలో ప్రవేశించాడు. అయినా కెనడి ప్రభుత్వ మద్దతుతో ఎన్నికలు నిలిపివేయబడ్డాయి. కొత్తప్రభుత్వం గొరిల్లాలకు (వైడిగోరస్ ఫ్యూయంటెస్ మద్దతుదారులు ) వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది. 1966 లో " జులియో సెసార్ మెండెజ్ మొంటెనెగ్రో " డెమొక్రటిక్ ఓపెనింగ్ బేనర్ కింద గ్వాటెమాలా అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. మెండెజ్ మొంటెనెగ్రో రివల్యూషనరీ పార్టీ సభ్యుడు. రివల్యూషనరీ పార్టీకి యుబికోసకంలో మూలాలు ఆరంభం అయ్యాయి. ఈ సమయంలో ది వైట్ హాండ్ (మనో బ్లాంకా) , ది యాంటీ కమ్యూనిస్టు సీక్రెట్ ఆర్మీ " rఊపొందించబడ్డాయి. ఇవి అపకీర్తికరమైన " దెత్ స్క్వాడ్ "కు ముందుతరానికి చెందినవై ఉన్నాయి. గ్వాటెమాలా సైకులకు శిక్షణ అందించడానికి , గ్వాటెమాలా సైన్యాన్ని ఆధునికరించడానికి " యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ (గ్రీన్ బెరెట్స్) " పంపబడింది. చివరకు గ్వాటెమాలా సైన్యం మద్య అమెరికాలో అత్యంత ప్రతిభావంతంగా మారింది. 1970లో " కొలోనెల్ కారియోస్ మాన్యుయేల్ అర్నా ఒసారియో అధుక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. 1972 నాటికి గొరిల్లా దళానికి చెందిన సభ్యులు దేశంలో ప్రవేశించి పశ్చిమపర్వతశ్రేణులలో స్థిరపడ్డారు. 1974లో గ్వాటెమాలా జనరల్ ఎన్నికలు వివాదాస్పదంగా నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో జనరల్ " కెజెల్ యూజెనియో ల్యూజెరుద్ గార్షియా " డెమొక్రటిక్ పార్టీకి చెందిన " ఎఫ్రైన్ రియోస్ మొంటును " ఓడించాడు. ఎఫ్రైన్ రియోస్ మొంటు ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని ఆరోపించాడు.

భూకంపం

1976 ఫిబ్రవరి 4న పెద్ద భూకంపం సంభవించి గ్వాటెమాలాలోని పలు నగరాలను ధ్వంసం చేసింది. భూకంపంలో 25,000 మంది ప్రధానంగా బలహీనమైన నిర్మాణంకలిగిన పేదవర్గానికి చెందినవారు మరణించారు. భూకంపం తరువాత ప్రభుత్వం వేగవంతంగా స్పందించడంలో, నివాసగృహాలు కోల్పోయిన వారికి ఆవాసం కల్పించడంలో విఫలం అయింది. అంతటా విస్తరించిన నివాసగృహాల కొరత దేశమంతటా అశాంతిని కలిగించింది. 1978లో జరిగిన మోసపూరితమైన ఎన్నికలలో జనరల్ " ల్యూకాస్ గార్సియా " అధికారం చేపట్టాడు.

గొరిల్లాలు

1970లో సరికొత్తగా " ది గొరిల్లా ఆర్మీ ఆఫ్ పూర్ " (ఇ.జి.పి.), " ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఆర్మ్‌స్‌ " (ఒ.ఆర్.పి.ఎ.) అనే రెండు గొరిల్లా సంస్థలు తలెత్తాయి. వారు సైన్యం, సైనిక సహాయకులైన సాధారణ ప్రజలమీద పట్టణ, గ్రామీణ యుద్ధభూములలో దాడి కొనసాగించారు. సైన్యం, పారా మిలిటరీ దళాలు గొరిల్లాల మీద క్రూరంగా దాడి చేసాయి. ఫలితంగా వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1979లో యులెస్. అధ్యక్షుడు జిమ్మీకార్టర్ గ్వాటెమాలా సైనిక ఉపకరణాల సహాయం, సైనికసహాయం నిలిపివేయాలని ఆదేశించాడు. గ్వాటెమాలా సైనికబృందాలు మానహక్కులను ఉల్లంఘించిందని అంతటా ప్రచారం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ దస్తావేజులు వెలుగులోకి వచ్చిన కారణంగా సహాయం కార్టర్ పాలనా కాలం వరకూ క్లాండిస్టైన్ కాలువ మార్గంలో కొనసాగించబడింది.

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Memorial to the victims of the Río Negro massacres

1930 జనవరి 31 న కెయిచీ ప్రజలు అనే స్థానికబృందం ఒకటి గ్రామీణప్రాంతాలలో సైనికులు చేసిన మూకుమ్మడి హత్యలకు నిరసన తెలపడానికి స్పానిష్ దైత్యకార్యాలయం స్వాధీనం చేసుకున్నారు. గ్వాటెమాలా ప్రభుత్వసైన్యం దౌత్యకార్యాలయంలో ఉన్న వారిని అందరినీ చంపి కార్యాలయానికి నిప్పంటించింది. గ్వాటెమాలా ప్రభుత్వం తీవ్రవాదులు వారికి వారే నిప్పంటించారని ఆరోపించారు. అయినప్పటికీ స్పెయిన్ దౌత్యకార్యాలయాధికారి అగ్నిప్రమాదం నుండి తప్పించుకుని గ్వాటెమాలా పోలీసు దాదాపు లోపల ఉన్న ప్రతిఒక్కరిని చంపిందని, వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నిప్పు అంటించిందని ఆరోపించాడు. ఫలితంగా స్పెయిన్ గ్వాటెమాలాతో దౌత్యసంబంధాలను నిలిపివేసింది.1992లో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి " ఎఫ్రైన్ రియోస్ మోంట్ " సైనికప్రభుత్వానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన హింసాత్మచర్యలు చేపట్టి ప్రత్యర్థులను బలవంతంగా మాయంచేయడం, యుద్ధభూమిలో అగ్నిప్రమాదాలు సృష్టించడం మొదలైన హింసాత్మకచర్యలకు పాల్పడ్డాడు.దేశం అంతర్జాతీయంగా వెలివేయబడినట్లు పరిగణించబడింది. అయినప్పటికీ గ్వాటెమాలాకు రీగన్ ప్రభుత్వ మద్దతు కొనసాగింది. రీగన్ స్వయంగా రియోస్ మోంటును " ఎ మాన్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ ఇంటిగ్రిటీ " అని అభివర్ణించాడు. రియోస్ మోంట్‌ను పదవీచ్యుతుని చేసి జనరల్ " ఆస్కార్ హంబర్టో మెజియా విక్టోరెస్ " అధికారం చేపట్టి సరికొత్త రాజ్యాంగ నిర్మాణం కొరకు 1986లో ఎన్నికలకు పిలుపు ఇచ్చాడు. ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి " మార్కో వినిసియో సెరెజో అరెవలో " విజయం సాధించాడు.

గొరిల్లాల సమైఖ్యం

1992లో ఇ.జి.పి, ఒ.ఆర్.పి.ఎ, ఎఫ్.ఎ.ఆర్, పి.జి.టి నాలుగు గొరిల్లా బృందాలు " గౌతమాలన్ నేషనల్ రివల్యూషనరీ యూనిటీ "గా సమైక్యం అయ్యాయి. వీరికి లభించిన సల్వృడరన్ గొరిల్లా, ఫరబుండో మార్టి నేషనల్ ఫ్రంట్, నికరగువాకు చెందిన శాండినిష్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ , క్యూబా ప్రభుత్వాల మద్దతుతో గౌతమాలన్ నేషనల్ రివల్యూషనరీ యూనిటీ మరింత బలోపేతం అయింది. ఒకవైపు గ్వాటెమాలా సైన్యం గ్రామీణప్రాంతాలలో సృష్టిస్తున్న " స్కార్చ్డ్ ఎర్త్ " సంఘటనల కారణంగా 45,000 గ్వాటెమాలా ప్రజలు సరిహద్దును దాటి మెక్సికో చేరుకున్నారు. మెక్సికన్ ప్రభుత్వం శరణార్ధులకు చియాపాస్ , టాబాస్కోలలో స్థావరాలు ఏర్పాటుచేసారు.1992లో " రిగోబెర్టా మెంచు "కు నోబుల్ బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. యు.ఎస్. మద్దతుతో ప్రభుత్వం స్థానిక గిరిజన ప్రజలకు వ్యతిరేకంగా సాగించిన నరమేధాన్ని అంతర్జాతీయ దేశాదృష్టికి తీసుకువచ్చినందుకు ఆమెకీ పురస్కారం అందించబడింది.

1996–2000

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
An outdoor market in Chichicastenango, 2009.

1996లో గ్వాటెమాలా ప్రభుత్వం , గొరిల్లా బృందాల మద్య శాంతి నెలకొన్న తరువాత అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది. ఐక్యరాజ్యసమితి సలహాతో స్పెయిన్ , నార్వే శాతిప్రయత్నాల కొరకు ప్రయత్నించాయి. రెండు వైపులా ప్రధాన సర్ధుబాట్లు సంభవించాయి. గొరిల్లా పోరాటదారులు ఆయుధాలను విసర్జించి బదులుగా పనిచేయడానికి భూములను అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి పంపిన ట్రూత్ కమిషన్, ప్రభుత్వ , రాష్ట్రీయ సైన్యం, సి.ఐ.ఎ. శిక్షణ పొందిన పారామిలిటరీ యుద్ధకాలంలో జరిగిన 93% మానవహక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహించాయి. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులచేత అలక్ష్యంచేయబడిన మిలియన్లకొద్దీ నేరసంబంధిత దస్తావేజులు బహిర్గతం అయ్యాయి. అంతర్యుద్ధకాలంలో బలవంతంగా తరలించబడిన 45,000 గ్వాటెమాలా తిరుగుబాటు దారుల కుటుంబాలు డిజిటలైజ్ చేయబడిన దస్తావేజులను పరిశీలిస్తున్నారు.ఇది అదనపు చట్టపరమైన కార్యాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.

అంతర్యుద్ధంలో పాల్గొన్న ప్రజల వివరణ

అంతర్యుద్ధం ఆరంభం అయిన మొదటి పది సంవత్సరాలలో రాష్ట్రం నుండి పోరాటదారులలో విద్యార్థులు, ఉద్యోగులు, వృత్తి బాధ్యతలు వహిస్తున్నవారు , ప్రభుత్వానికి ప్రత్యర్థులు పాల్గొన్నారు. అయినా చివరి కాలంలో మాయాసంతతికి చెందిన గ్రామీణ వ్యవసాయదారులు , సాధారణ ప్రజలు పాల్గొన్నారు.అంతర్యుద్ధంలో 450 మాయా గ్రామాలు ధ్వంసం చేయబడ్డాయి. ఇమిలియన్ కంటే అధికమైన ప్రజలు ఆశ్రితులుగా మారడం , గ్వాటెమాలాలో స్వంతప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలించబడ్డారు. " రికుపరేషన్ డీ లా మెమోరియా హిస్టోరికా " నివేదిక ఆధారంగా 2,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు.ఒక మిలియన్ కంటే అధికమైన ప్రజలు వారి స్వంతప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలించబడ్డారు. వందలాది గ్రామాలు ధ్వంసం చేయబడ్డాయి. ది క్లారిఫికేషన్ హిస్టారికల్ కమిషన్ గ్వాటెమాలా సైనిక ప్రభుత్వం సాగించిన మానవహక్కుల ఉల్లంఘనలు 93% వ్రాతబద్ధం చేయబడ్డాయని , ఇందులో బలైన వారిలో 83% మాయా ఇండియన్లు ఉన్నారని వివరించింది. 1999లో రాష్ట్రీయంగా జాతిపరమైన నరమేధం జరిగిందని నిర్ధారించబడింది. అంతర్యుద్ధంలో బజ వర్పాజ్ వంటి ప్రాంతాలలో ప్రత్యేక సంప్రదాయానికి చెందిన ప్రజల మీద జాతిసంబంధిత నరమేధం జరగడాన్ని గ్వాటెమాలా ప్రభుత్వం ప్రోత్సహించిందని ది ట్రూత్ కమిషన్ అభిప్రాయం వెలిబుచ్చింది. 1999లో యు.ఎస్. అధ్యక్షుడు బిల్ క్లింటన్ గ్వాటెమాలా మిలటరీకి మద్దతు ఇచ్చి , క్రూరమైన హత్యలలో భాగస్వామ్యం వహించి యు.ఎస్. ప్రభుత్వం పొరపాటు చేసిందని అంగీకరించాడు.

2000–

శాంతి నెలకొన్న తరువాత గ్వాటెమాలా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. అలాగే విజయవంతంగా సమీపకాలంలో (2015 లో) ఎన్నికలను నిర్వహించింది. 2015లో రిన్యూడ్ డెమొక్రటిక్ లిబర్టీ పార్టీకి చెందిన " జిమ్మీ మోరలెస్ " విజయం సాధించి అధ్యక్షపీఠం అలకరించాడు. 2016 జనవరిలో ఆయన పదవీ బాధ్యతలు ప్రారంభించాడు.

2012 జనవరిలో గ్వాటెమాలా మునుపటి నియంత " ఎఫ్రైన్ రియోస్ మోంట్ " నరమేధం కేసు విచారణ కొరకు గ్వాటెమాలా కోర్టుకు హాజరయ్యాడు. హియరింగ్ సమయంలో గ్వాటెమాలా ప్రభుత్వం 1,771 మరణాలు , 1,445 మానభంగాలు , స్వస్థానాలనుండి తరలించబడిన 30,000 మంది ప్రజల సంబంధించిన 100 సంఘటనలకు సాక్ష్యాలను సమర్పించింది. ప్రాసిక్యూషన్ అతడిని నిర్భంధంలో ఉంచాలని భావించినా ఆయన బెయిల్ సాహయంతో స్వేచ్ఛను పొంది గ్వాటెమాలా నేషనల్ సివిల్ పోలీస్ పర్యవేక్షణలో గృహనిర్భంధంలో ఉంచబడ్డాడు. 2013లో రియోస్ మోంట్ నేరంచేసినట్లు నిర్ధారించిన కోర్టు ఆయనకు 80 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. గ్వాటెమాలా ప్రభుత్వం నరమేధ సంబంధిత నేరానికి దేశాధినేతగా పనిచేసిన వ్యక్తికి మొదటిసారిగా శిక్ష విధించిందని ప్రపంచం గుర్తించింది.

మోటు మీద నేరారోపణ

నేరారోపణ 2015 జనవరిలో మోంట్ కేసు తిరిగి విచారణ చేయబడింది. 2015 ఆగస్టులో కోర్టు రియోస్ నరమేధం , మానవత్వానికి వ్యరేకంగా నేరం చేసినది నిజమైనా ఆయన వయసు , క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా ఆయనను శిక్షనుండి తొలగించింది.

అల్ఫోంసో పోర్టిలో

2010లో మునుపటి అధ్యక్షుడు " అల్ఫోంసో పోర్టిలో " పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఖైదుచేయబడ్డాడు. అయినప్పటికీ సాక్ష్యాలు , సాక్ష్యుల సాక్ష్యం నమ్మశక్యంగా లేదని ఆయనను న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధోషిగా నిర్ణయించింది. గ్వాటెమాలా అటార్నీజనరల్ " క్లౌడియా పాజ్ వై పాజ్ " తీర్పు దోషభూషితమైనదని వ్యాఖ్యానించాడు. కేసు " ఇంటర్నేషనల్ కమిషన్ అగైనిస్ట్ ఇంప్యూనిటీ ఇన్ గ్వాటెమాలా " (గ్వాటెమాలాకు సలహాసంప్రదింపులు అందిస్తున్న ఐక్యరాజ్యసమితి జ్యుడీషియల్ గ్రూప్) అప్పీల్ చేయబడింది. న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ " కేబ్రెరా 2009 "లో నిధులు దుర్వినియోగం చేసాడని ఆరోపించింది. నేరారోపణ తరువాత గ్వాటెమాలా సుప్రీం కోర్టు ఆయనను నిర్ధోషిగా నిర్ణయించి యు.ఎస్.కు అప్పగించాలని సూచించింది. గ్వాటెమాలా జ్యుడీషియరీ దోషపూరితంగా ఉంది , సెలెక్షన్ కమిటీ నేరచరిత్ర కలిగిన వారిని కొత్త అభ్యర్థులుగా ఎన్నుకొంటున్నది.

అధ్యక్షుడు ఓట్టో పెరెజ్ మొలినా ప్రభుత్వం , లా లినియా కేసు

2011లో పదవీ విరమణ తీసుకున్న జనరల్ " ఓట్టో ప్రెజ్ మొలినా " అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. ఆయనతో " రొక్సానా బాల్డెట్టి " మొదటి గ్వాటెమాలా మహిళా ఉపాధక్షురాలిగా ఎన్నిక చేయబడింది. 2012 జనవరి 14 నుండి వారు పదవీ బాధ్యతలు ఆరంభించారు. అయినప్పటికీ 2015 ఏప్రిల్ 16న ఐక్యరాజ్యసమితి యాంటీ కరప్షన్ ఏజెంసీ నివేదికలో బాల్డెట్టి ప్రైవేట్ సైరటరీ జుయాన్ కార్లోస్ మొంజాన్ , డైరెక్టర్ ఆఫ్ ది గౌతమాలన్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ మొదలైన ఉన్నతాధికారుల పేర్లు చోటుచేసుకున్నాయి.

స్కాం బహిర్గతం కావడం అనేకమంది ప్రజలకు ఆగ్రహం కలిగించింది. ఇంటర్నేషనల్ కమిటీ అగెయినిస్ట్ ఇంప్యూనిటీ ఇన్ గ్వాటెమాలా అటార్నీ జనరల్‌తో కలిసి పనిచేసి " లా లినియా కరప్షన్ కేసు " పేరుతో కేసును విచారించి తరువాత సంవత్సరం దీర్ఘమైన ఇంవెశ్టిగేషన్ నివేదిక అందించింది.అధికారులు దిగుమతి దారుల నుండి లంచం స్వీకరించి వారికి దిగుమతి సుంకం రాయితీ కల్పించారు.

ఫేస్ బుక్ సంఘటన

ఒక ఫేస్ బుక్ సంఘటన ప్రజలను గ్వాటెమాలా నగర డౌన్ టౌన్‌కు పోయి బాల్డెట్టీ రాజీనామా కోరాలని పిలుపు ఇచ్చింది. కొన్ని రోజులలోపుగా 10,000 మంది ప్రజలు హాజరై రాజీనామాచేయాలని కోరారు. ఆర్గనైజర్లు ఈ సంఘటన వెనుక రాజకీయనాకులు ఉన్నారని తీర్మానించారు.వారు నిరసనకారులను చట్టప్రకారం చర్యతీసుకొనబడుతుందని సూచించారు.వారు ఆహారం, నీరు , సన్ బ్లాక్ వెంట తీసుకురావచ్చని అయినప్పటికీ ఎటువంటి రాజకీయవర్ణాలను వెంట తీసుకురావద్దని ప్రజలకు సూచించారు. వేలాది ప్రజలు వీధులలో ప్రదర్శన నిర్వహించిన తరువాత కొన్ని రోజులకు బాల్డెట్టి పదవికి రాజీనామా చేసింది.బాల్డెట్టి విసాను యు.ఎస్. ప్రభుత్వం రద్దు చేసిన కారణంగా బాల్డెట్టి గ్వాటెమాలాలో ఉండవలసిన నిర్భంధం ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి యాంటీ కరప్షన్ కమిటీ ఇతర కేసుల నివేదికలను అందించాయి. 20 మంది ప్రభుత్వాధికారులు విధుల నుండి తొలగించబడ్డారు. కొంతమంది ఖైదు చేయబడ్డారు. రెండు కేసులలో మునుపటి అధ్యక్షుల సెక్రెటరీలకు సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. గ్వాటెమాలా సాంఘికసేవకుడు జుయాన్ డీ డియోస్ రోడ్రిగ్యూజ్ , గస్టేవ్ మార్టినెజ్ (పెరెజ్ మొలినాస్ అల్లుడు) లకు కోయల్ పవర్ ప్లాంట్ కంపెనీ స్కాండల్ కేసులో సంబంధం ఉందని ఋజువైంది.

ప్రత్యర్ధులు

రాజకీయప్రత్యర్థులు కూడా సి.ఐ.సి.ఐ విచారణలో చిక్కుకున్నారు. పలు లెజిస్లేటర్లు , లిబరేటెడ్ డెమొక్రటికా రెనొవాడా పార్టీ సభ్యులు లంచసంబంధిత వార్తలపట్ల అసహనం ప్రదర్శించారు. ఫలితంగా అప్పటి వరకూ అధ్యక్షపీఠం అలకరిస్తాడని భావిస్తున్న " మాన్యుయల్ బాల్డిజాన్ " విజయావకాశాలు 2015 సెప్టెంబరు ఎన్నికలలో సందేహాస్పదం అయ్యాయి. బాల్డిజాన్ పాపులారిటీ క్రమంగా క్షీణించింది. ఆయన ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌తో కలిసి సి.సి.ఐ.జి. నాయకుడు " ఇవాన్ వెలాస్క్యుయెజ్ " మీద ఆరోపణలు చేసాడు.

సి.ఐ.సి.ఐ.జి. తరచుగా గురువారం తమ నివేదికలు సమర్పించడం అలవాటుగా ఉండేది. దీనిని " సి.ఐ.సి.ఐ.జి. గురువాలు " అని అభివర్ణించబడ్డాయి. శుక్రవారం సమావేశాలు సంక్షోభాలను శిఖరాగ్రానికి చేర్చాయి. 2015 ఆగస్టు 21 శుక్రవారం సి.ఐ.సి.ఐ.జి. , అటార్నీ జనరల్ తెల్మా అల్డానా ప్రజలను విశ్వశింపజేయడానికి అవసరమైన సాక్ష్యాలను అందించారు. " లా లినియా " విచారణ అధ్యక్షుడు పెరెజ్ మొలినా , మునుపటి ఉపాధ్యక్షురాలు బాల్డెట్టి నేరచరిత్ర కలిగిన నాయకులని నిర్ధారించబడింది. అదేరోజు బాల్డెట్టి ఖైదుచేయబడింది.అధ్యక్షిని మీద అభిశంశన చేయబడింది. పలువురు క్యాబినెట్ సభ్యులు రాజీనామా చేసారు. అధ్యక్షుని రాజీనామా నిర్భంధించబడింది. అయినా అధ్యక్షుడు పెరెజ్ మొలినా టెలివిజన్ సందేశం ద్వారా " తాను రాజీనామా చేయనని " తెలియజేసాడు.

నిరసన ప్రదర్శన

తిరిగి వేలాదిమంది నిరసనకారులు వీధిప్రదర్శనలో పాల్గొన్నారు. నిరసనకారులు ఒంటరిగా ఉన్న అధ్యక్షుని రాజానామా కావాలని నిర్భంధించారు. కాంగ్రెస్ ఐదుగురు సభ్యులు కలిగిన లెజిస్లేటర్ల కమిషన్ " ఈ విషయమై చర్చించడానికి నియమించింది. సుప్రీం కోర్టు అప్రూవ్ లభించింది. సమ్మె తీవ్రతరం అయింది. సమ్మెలో అదనంగా ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. వందలాది పాఠశాలలు, వ్యాపారాలు నిరసనదారులకు మద్దతుగా మూతపడ్డాయి. గ్వాటెమాలాలోని శక్తివంతమైన వ్యాపారులు ఆర్గనైజేషన్‌తో కలిసి అధ్యక్షుని కోర్టు రక్షణ రద్దు చేసి అధ్యక్షుని తొలగించాలని నిర్భంధించారు.అటాఅర్నీ జనరల్ కార్యాలయం నుండి " అధ్యక్షుని రాజీనామా " కోరుతూ స్టేట్మెంటు వెలువరించబడింది. వత్తిడి శిఖరాగ్రానికి చేరుకుంది. లంచంకేసు నిర్ధారించి రాజీనామా చేసిన అధ్యక్షుని మునుపటి రక్షణ, హోం మంత్రులు హటాత్తుగా దేశం విడిచి పారిపోయారు.

అధ్యక్షుని రాజీనామా

ఒకవైపు అధ్యక్షుడు పెరెజ్ మొలినా రోజుకురోజు మద్దతు పోగొట్టుకున్నాడు. ప్రైవేట్ రంగం అధ్యక్షుని రాజీనామా కోరుతూ పిలుపు ఇచ్చారు. అయినప్పటికీ ప్రైవేట్ రంగానికి వ్యవస్థాపకులు మద్దతుతో అధ్యక్షుడు రాజీనామా చేయకుండా కాలాం సాగించాడు.

గ్వాటెమాలా రేడియో ఎమిసోరస్ యునిదాస్ అధ్యక్షునితో పరస్పర సందేశాల ద్వారా అందుకున్న నివేదిక ఆధారంగా అధ్యక్షుడు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటానని చట్టం కోరిన విధంగా నడుకుంటానని తెలియజేసినట్లు వెలువరించింది.నిరసనదారులు జనరల్ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టారు. చివరికి 2015 సెప్టెంబరు 2న పెరెజ్ మొలినా రాజీనామా చేసాడు.

2015 సెప్టెంబరు 3న ఆయన కోర్టులో హాజరు కావాలని కోర్టు సమ్మన్ పంపింది.

2016 జూన్‌లో ఐక్యరాజ్యసమితి మద్దతుతో ప్రసిక్యూటర్ వెల్లడించిన వివరణలో " పెరెజ్ మొలినా క్రైం స్కాండల్ , మరొక లంచం కేసు గురించిన విచరణలను అందించాడు. సోషల్ సెక్యూరిటీ ఇంస్టిట్యూట్ హెడ్ , ఐదుగురు ఇతర మంత్రులు అధూక్షునికి మోటబోటు వంటి విలాసవంతమైన బహుమతులు కొనడానికి అవసరమైన ధనం దాదాపు 4 మిలియన్ల అమెరికన్ డాలర్ల వరకు అందించారని వివరణలో పేర్కొనబడింది.

భౌగోళికం

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
A map of Guatemala.
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Köppen climate types of Guatemala
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
The highlands of Quetzaltenango.

గ్వాటెమాలా చిన్న చిన్న ఎడారులు , ఇసుకతిన్నెలతో అధికంగా పర్వతమయంగా కొండలు , లోయలతో ఉంటుంది. దక్షిణంలో ఉన్న సముద్రతీరాలు ఉత్తరంలో పెటెన్ డిపార్టుమెంటులో ఉన్న దిగువభూములు ఇందుకు మినహాయింపుగా ఉన్నాయి.గ్వాటెమాలా మధ్యభాగంలో రెండు పర్వతశ్రేణులు గ్వాటెమాలాను మూడువిభాగాలుగా విభజిస్తున్నాయి. పసిఫిక్ సముద్రతీరంలో, దక్షిణపర్వతశ్రేణి , పెటెన్ ప్రాంతంలో భూభాగం పర్వతమయంగా ఉంటుంది.ప్రధాన నగరాలన్ని పర్వతప్రాంతాలలోనే ఉన్నాయి.వీటిలో పెటెన్ నగరం జనసాధ్రత తక్కువగా ఉంటుంది. మూడు పర్వతప్రాంతాలలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. దిగువభూములలో వేడి, తేమవాతావరణం ఉంటుంది. పర్వతశిఖరప్రాంతంలో వాతావరణం చల్లని, పొడివాతావరణం నెలకొని ఉంటుంది.గ్వాటెమాలాలో ఉన్న వోల్కన్ తాజుముల్కో శిఖరం మధ్య అమెరికా దేశాలలో ఎత్తైనదిగా గుర్తించబడుతుంది. గ్వాటెమాలాలో ప్రవహిస్తున్న సారహీనమైన పొట్టి నదులు పసిఫిక్ సముద్రంలో సంగమిస్తున్నాయి. లోతైన పొడవైన నదులు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సంగమిస్తున్నాయి.పొలోచిక్, డ్యూలెస్ నదులు ఇజబాల్ సరసులో సంగమిస్తున్నాయి. మొతగుయా, సర్స్టన్ నదులు బెలిజె సరిహద్దులో ప్రవహిస్తున్నాయి. యుసుమసింటా పెటెన్ , మెక్సికన్ సరిహద్దులో ప్రవహిస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలు

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
A town along the Pan-American Highway within a volcanic crater.

కరేబియన్ సముద్రం , పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉపస్థితమై ఉన్న గ్వాటెమాలా దేశాన్ని తుఫానుకు కేంద్రంగా ఉంది. మిట్చ్ తుఫాను (1998) , స్టాన్ తుఫాను (2005 అక్టోబరు) తుఫానులు 1,500 మంది ప్రజల మరణానికి కారణం అయ్యాయి.గాలులవలన నష్టం సంభవించనప్పటికీ వరదలు , కొండచరియలు విరిగి పడిన కారణంగా నష్టం సంభవించింది.సమీపకాలంలో (2010 లో) సంభవించిన " ట్రాపికల్ స్ట్రోం అగాథా " తుఫాను కారణంగా 200 మంది మరణించారు.గ్వాటెమాలా ఎగువభూములు మొటంగుయా ఫాల్ట్ వెంట ఉన్నాయి. ఇది కారేబియన్ ప్లేట్, ఉత్తర అమెరికన్ ప్లేట్ మధ్యలో ఉన్న టెక్టానిక్ ప్లేట్ మధ్యలో ఉంది. ఈ ఫాల్ట్ పలు ప్రధాన భూకంపాలకు కేంద్రంగా ఉంది. 1976 ఫిబ్రవరి 4న సంభవించిన ట్రెమోర్ భూకంపం (7.5 మాగ్నిట్యూడ్) 25,000 మంది ప్రాణాలను బలిగొన్నది. అదనంగా పసిఫిక్ సముద్రతీరంలో ఉన్న మిడిల్ అమెరికన్ ట్రెంచ్ ప్రధాన సబ్డక్షన్ జోన్‌గా పరిగణించబడుతుంది. ఇక్కడ కోకోస్ ప్లేట్, కరేబియన్ ప్లేట్ దుగువకు కుంగుతూ ఉంది. ఇది సముద్రతీర ప్రాంతాలలో అగ్నిపర్వతాల సృష్టికి కారణమౌతుంది. గ్వాటెమాలాలో 37 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో 4 (పకాయా, శాంటియాగుయిటో, వోల్కాన్ డీ ఫ్యుయేగో, టకానా ) సజీవంగా ఉన్నాయి. 2010లో ఫ్యుయేగో, పకాయా బద్దలయ్యాయి.గ్వాటెమాలా భౌగోళిక చరిత్రలో ప్రకృతివైపరీత్యాలు దీర్ఘకాల చరిత్ర కలిగి ఉన్నాయి.1541లో గ్వాటెమాలా రాజధాని ఆంటిగుయా మూడుమార్లు అగ్నిపర్వతలావా ప్రవహించింది. అలాగే 1773లో భూకంపాలు సంభవించాయి.

పర్యావరణ వైవిద్యం

గ్వాటెమాలా 14 సంరక్షిత ప్రాంతాలను కలిగి ఉంది. దేశంలో 252 తడిభూములు, 61 మడుగులు, 100 నదులు, 4 చిత్తడినేలలు ఉన్నాయి. టికల్ నేషనల్ పార్క్ ప్రపంచవాసత్వసంపదగా గుర్తించబడుతుంది. గ్వాటెమాలా ప్రత్యేక వృక్షజాలం కలిగి ఉంది. ఇక్కడ 1246 జాతుల వృక్షజాతులు ఉన్నాయి. వీటిలో 6.7% స్త్యానికజాతులకు చెందినవై ఉన్నాయి. 8.1% అంతరించిపోతున్నజాతులకు చెందినవై ఉన్నాయి. గ్వాటెమాలాలో 8,681 నాళజాతికి చెందిన మొక్కలు ఉన్నాయి.వీటిలో 13.5% స్త్యానికజాతులు ఉన్నాయి. 5.4% గ్వాటెమాలా ఐ.యు.సి.ఎన్. కేటగిరీలో సంరక్షించబడుతున్నాయి.[ఆధారం చూపాలి] పెటెన్ ప్రాంతంలో ది మాయా బయోస్ఫేర్ రిజర్వ్ (21,12,940 చ.హె. వైశాల్యం). మధ్య అమెరికాలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికాలోని బొసవాస్ ఉంది.

ఆర్ధికం

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
A proportional representation of Guatemala's exports.
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Fields in Quetzaltenango.
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
An indoor market in the regional city of Zunil.
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
A ship picking up Guatemalan bananas for export.

మద్య అమెరికాలో గ్వాటెమాలా ఆర్థికరంగం అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. గ్వాటెమాలా తలసరి జి.డి.పి. 5,200 అమెరికా డాలర్లు. గ్వాటెమాలా పలు సాంఘిక సమస్యలను ఎదుర్కొంటున్నది లాటిన్ అమెరికన్ దేశాలలో బీదదేశాలలో ఒకటిగా గ్వాటెమాలా భావించబడుతుంది. ఆదాయం ప్రజలందరికీ సమానంగా అందజేయబడడం లేదు. దేశంలో సగానికంటే అధికమైన ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. 4,00,000 (3.2%) మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. సి.ఐ.ఎ. వరల్డ్ ఫేస్ బుక్ గ్వాటెమాలాలోని 54% ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారని తెలియజేస్తుంది.2010లో గ్వాటెమాలా ఆర్థికం 3% అభివృద్ధిచెందింది. 2009 ఆర్థికసంక్షోభం నుండి గ్వాటెమాలా క్రమంగా కోలుకుంది.యునైటెడ్ స్టేట్స్, మద్య అమెరికా మార్కెట్ల నుండి డిమాండ్లు తగ్గినకారణంగా విదేశీపెట్టుబడులలో క్షీణత సంభవించింది. యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న గ్వాటెమాలా ప్రజల ద్వారా లభిస్తున్న ఆదాయం ప్రస్తుత గ్వాటెమాలా విదేశీద్రవ్య వనరుగా ఉంది. . గ్వాటెమాలా ఎగుమతులలో పండ్లు, కూరగాయలు, పూలు, హస్థకళా ఉత్పత్తులు, వస్త్రాలు, ఇతర వస్తువులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. బయోజ్యూయల్‌కు డిమాండ్ అధికం ఔతున్న కారణంగా దేశం బయోఫ్యూయల్‌కు అవసరమైన ముడిసరుకును ఉత్పత్తిచేసి ఎగుమతి చేయడం అభివృద్ధి చేసింది. ప్రధానంగా చెరకు, పాం ఆయిల్ ఉత్పత్తి అధికం చేసింది.ఇది మొక్కజొన్న (గ్వాటెమాలా ప్రజల ప్రధాన ఆహారం) వంటి ఆహారధాన్యాల ధరపెరగడానికి కారణం అయిందని విమర్శకులు భావిస్తున్నారు. యు.ఎస్. ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు తరువాత గ్వాటెమాలా యునైటెడ్ స్టేట్స్ నుండి దిగుమతి చేసుకున్న మొక్కజొన్నలో 40% బయోఫ్యూయల్ తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. గ్వాటెమాలా ప్రభుత్వం గసగసా, మార్జునా ఉత్పత్తిని చట్టబద్ధం చేయాలని ఆలోచిస్తుంది. వీటిద్వారా వచ్చే పన్ను ఆదాయాన్ని మాదకద్రవ్యాల నివారణకు ఉపయోగించాలన్నది ప్రభుత్వయోచన.2010లో గ్వాటెమాలా కొనుగోలు శక్తి " గ్రాస్ డొమస్టిక్ ప్రొడక్ట్ " మొత్తం 70.15 అమెరికన్ డాలర్లు. సేవారంగం జి.డి.పి.లో 63%, వ్యవసాయం 13% భాస్వామ్యం వహిస్తున్నాయి. గనుల నుండి బంగారం, వెండి, జింక్, కోబాల్ట్, నికెల్ . వ్యవసాయరంగం నుండి ఉత్పత్తులు ఐదింట రెండు వంతులు ఎగుమతి చేయబడుతున్నాయి. అలాగే వ్యవసాయ రంగం దేశంలో సగభాగం ఉగాది కల్పనలో భాగస్వామ్యం వహిస్తుంది. ఆర్గానిక్ కాఫీ, చక్కెర, తాజా కూరగాయలు, అరటిపండ్లు దేశం ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. 2010 ద్రవ్యోల్భణం 3.9% ఉంది.దశాబ్ధాలకాలం కొనసాగిన అంతర్యుద్ధం ముగింపుకు వచ్చి 1996లో శాతిస్థాపన చేసిన తరువాత విదేశీపెట్టుబడులకు మార్గం సుగమం అయింది. పర్యాటకంద్వారా ఆదాయం అభివృద్ధి చెందుతూ ఉంది. 2006 మార్చిలో గ్వాటెమాలా కాంగ్రెస్ " డొమినికన్ రిపబ్లిక్ సెంట్రల్ అమెరికా ఫ్రీ ట్రేడ్ " ఒప్పందంలో పలు మద్య అమెరికాదేశాలతో గ్వాటెమాలా ప్రభుత్వం భాగస్వామ్యం వహించింది. గ్వాటెమాలా ప్రభుత్వం తైవాన్, కంబోడియాల మద్య ఫ్రీట్రేడ్ ఒప్పందం జరిగింది.

పర్యాటకం

పర్యాటకం గ్వాటెమాలాలో ప్రధాన ఆర్థికవనరులలో ఒకటిగా ఉంది. 2008లో ప్రభుత్వానికి 1.8 బిలియన్లు పర్యాటకరంగం నుండి లభిస్తుంది. గ్వాటెమాలా వార్షికంగా 2 మిలియన్లమంది పర్యాటకులు వస్తున్నారు.సమీపకాలంలో గ్వాటెమాలా సముద్రతీరాలకు క్రూసీద్వారా వచ్చి చేరే పర్యాటకుల సంఖ్య అధికరిస్తూ ఉంది. పెటన్‌లో టికల్, ఇజ్బాల్‌లో క్వైరిగువా, టెక్పాన్ చిమాల్టెనంగోలో ఇక్సించే, గ్వాటెమాలా నగరాలలో ఉన్న పురాతత్వపరిశోధానా ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.అటిట్లాన్, చంపే ప్రాంతాలు ప్రకృతి సౌందర్యశోభతో అలరారుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన కాలనీ నగరాలైన ఆంటిగ్యుయా గ్వాటెమాలా ప్రాంతాలను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.16 మంది పాలించిన మాయానాగరికతా అవశేషాలను కనుగొన్న టికల్ నగరాన్ని సందర్శించడానికి అంతర్జాతీయంగా ఆకర్షణ అధికరిస్తూ ఉంది. మాయా ప్రాంతంలో అనేక ఆలయాలు, బాల్ పార్కులు నిర్మించబడ్డాయి. మాయానాగరికత విద్య, కళాభివృద్ధితో విలసిల్లిన సుసంపన్నమైన నాగరికతగా గుర్తించబడుతుంది. గ్వాటెమాలా హిస్పానిక్ నాగరికత సంబంధిత పురాతత్వపరిశోధనా ప్రాంతాలు, చరిత్రపూర్వ నగరాలు, మతసంబంధిత పర్యాటకప్రాంతాలకు, ఆహ్లాదకరమైన అట్లాంటిక్, పసిఫిక్ సముద్రతీరాలకు కూడా ప్రసిద్ధిచెందింది. నేషనల్ పార్కులు, మాయా బయోస్ఫేర్ రిజర్వ్ వంటి ప్రాంతాలు కూడా పర్యాటకప్రాధాన్యత కలిగి ఉన్నాయి.

నీటి సరఫరా , మురుగుకాల్వల నిర్వహణ

గ్వాటెమాలాలో మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువల నిర్మాణం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 1990లో 81% ప్రజలకు రక్షితనీరు లభించే ఏర్పాటు కల్పించబడింది.2004 నాటికి అది 90% నికి చేరింది. మురుగునీటి కాల్వల అభివృద్ధి కూడా 1990లో 62% చేయబడింది. 2004 నాటికి అది 86% నికి చేరింది.

గణాంకాలు

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Guatemala's population (1950–2010).
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Tz'utujil men in Santiago Atitlán.

2014 గణాంకాల ఆధారంగా గ్వాటెమాలా జనసంఖ్య 15,824,463. 1900 లో జనసంఖ్య 885,000. 20వ శతాబ్దంలో పశ్చిమార్ధగోళంలో జనసంఖ్య త్వరితగతిలో అభివృద్ధి చెందింది. గ్వాటెమాలాలో రవాణా, సమాచార రగం, వాణిజ్యం, రాజకీయాలు, గ్వాటెమాలా నగర పరిధిలో కేంద్రీకరించబడ్డాయి. గ్వాటెమాలా మాహానగరపరిధిలో దేశంలో మూడింట ఒకభాగం కంటే అధికంగా నిసిస్తున్నారా. గ్వాటెమాలా నగరపరిధిలో 2 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. మహానగర పరిధిలో 5 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. మద్య ఆఫ్రికా, ఇరాక్లతో పోల్చిచూస్తే పశ్చిమార్ధగోళంలో యువత అధికంగా ఉన్న దేశాలలో గ్వాటెమాలా ఒకటి.జనసంఖ్యలో 15 వయసుకు లోబడిన వారిశాతం 41.15% ఉంది. 15-65 మద్య వయసు కలిగిన వారిశాతం 51.1% ఉంది. 65 వయసు పైబడిన వారిశాతం 4.4%.

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Indigenous Guatemalan women in Antigua Guatemala.

విదేశీఉపాధి

గ్వాటెమాలాకు వెలుపల పనిచేస్తున్న ప్రజలు అధికంగా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నారు.విదేశీ ఉద్యోగులు 4,80,665 నుండి to 1,489,426 ఉన్నారు. విదేశాలలో నివసిస్తున్న గ్వాటెమాలా ప్రజలలో ఆశ్రితులుగా ఉండి ఆయాదేశాల గుర్తింపు కొరకు ఎదురుచూస్తున్నవారు కనీసమైన సంఖ్యలో ఉన్నందున కచ్చితమైన గణాంకాలు నిర్ణయించడం అసాధ్యంగా ఉంది. గ్వాటెమాలా నుండి అమెరికాకు వలసవెళ్ళిన ప్రజలు అధికంగా కలిఫోర్నియా, డేలావర్, ఫ్లోరిడా, ఇలినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, రోడే ద్వీపం, ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు.

విదేశాలలో నివసిస్తున్న గ్వాటెమాలా ప్రజల వివరలు :

Country Count Year
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  United States 480,665 – 1,489,426 2000–2006
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Mexico 23,529 – 190,000 2006–2010
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Canada 14,253 – 34,665 2006–2010
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Belize 10,693 2006
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Germany 5,989 2006
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Honduras 5,172 2006
మూస:Country data SLV El Salvador 4,209 2006
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Spain 2,491 – 5,000 2006–2010
గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  France 1,088 2013

Ethnic groups

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
Language map of Guatemala. The "Castilian" areas represent Spanish.

గ్వాటెమాలా అత్యంత వైవిధ్యం కలిగిన దేశం. దేశంలో వైవిధ్యమైన సంప్రదాయం, సాంస్కృతిక, భాషా పరమైన వైవిధ్యం కలిగిన ప్రజలు నివసిస్తున్నారు.2010 గణాంకాల ఆధారంగా మెస్టిజోలు (లాడినో ప్రజలు) 41% యురేపియన్ సంతతి, స్థానిక జాతుల సంతికి చెందినవారై ఉన్నారు. 41% అమెరిండియన్ సంతతికి చెందినవారై ఉన్నారు.లాటిన్ అమెరికన్ దేశాలలో అమెరిండియన్లు అత్యధికంగా ఉన్న దేశం గ్వాటెమాలా.తరువాత స్థానాలలో పెరూ, బొలీవియా దేశాలు ఉన్నాయి. గ్వాటెమాలాలోని స్థానిక ప్రజలలో మాయా సంతతికి చెందినప్రజలు అధికంగా ఉన్నారు. వీరిలో కెయిచే ప్రజలు 11%, క్యూఎక్విచి ప్రజలు 8.3%, కక్యుచికెల్ ప్రజలు 7.8%, మాం ప్రజలు 5.2%, ఇతర ప్రజలు 7.6% ఉన్నారు. 1% కంటే తక్కువగా మాయాసంతతికి చెందని ప్రజలు ఉన్నారు. గ్వాటెమాలా యురేపియన్ ప్రజలను (క్రియోల్స్ అని అంటారు) 18.5% ఉన్నారు. వీరిలో అధికంగా జర్మన్లు, స్పానిష్ సెటిలర్లు, తరువాత స్త్యానంలో ఇటాలియన్లు, బ్రిటిష్, ఫ్రెంచ్, స్విస్, బెల్జియన్లు, డచ్, రష్యన్లు,, డానిష్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. అదనంగా సాల్వేడొరన్లు 1,10,000 ప్రజలు ఉన్నారు. గరిఫ్యునా సంతతికి చెందిన ప్రజలు ముందుగా ఆఫ్రికన్ సంతతికి చెందిన వారై స్థానికజాతి ప్రజలతో వివాహసంబంధం ఏర్పరచుకున్నారు. వీరు అధికంగా లివింగ్స్టన్, ప్యూరిటో బారియోస్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆఫ్రో గ్వాటెమాలా ప్రజలు, ములట్టో సంతతికి చెందిన ప్రజలు అరటి తోటలలో పనిచేయడానికి ఇక్కడకు తీసుకుని రాబడ్డారు. ఆసియన్ ప్రజలలో హాన్ చైనీయులు, లెబనాన్, సిరియాకు చెందిన అరేయన్లు, గ్వాటెమాలా నగరం, సమీపంలోని మెక్సికోలో సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న కొరియన్లు 50,000 ఉన్నారు. గ్వాటెమాలాలో నివసిస్తున్న జర్మన్ ప్రజలు దేశంలోకి క్రిస్మస్ ట్రీ చెట్టు సంప్రదాయం తీసుకువచ్చారు.

భాషలు

గ్వాటెమాలా అధికారభాష స్పానిష్. ఇది 93% ప్రజలకు ప్రథమభాష లేక ద్వితీయభాషగా వాడుకలో ఉన్నాయి.గ్రామీణప్రాంతంలో 21 మాయన్ భాషలు అలాగే మాయాభాషా కుటుంబానికి చెందని భాషలు (స్థానిక భాష అయిన క్సినికా, కరేబియన్ సముద్రతీరంలో వాడుకలో ఉన్న అరవాకన్ భాష అయిన గరిఫ్యునా) వాడుకలో ఉన్నాయి. 2003 భాషా చట్టం మరేభాషకు అధికారభాషా హోదా ఇవ్వబడలేదు. 1996లో సంతకం చేయబడిన చట్టం తరువాత అధికారభాషా పత్రాలు, ఓటింగ్ మెటీరియల్స్ పలు స్థానిక భాషలలో అనువదించబడ్డాయి. స్పానిష్ భాషేతర ప్రజలకు లీగల్ కేసుల వివరాలు స్థానిక భాషలలో అనువదించి అందించాలని ఆదేశం జారీ చేయబడింది. విద్యాభ్యాసంలో ద్విభాషావిధానం (స్పానిష్, స్థానిక భాషలు) అమలులో ఉంది. గ్వాటెమాలా స్థానిక ప్రజలు స్పానిష్ భాషతో 4-5 స్థానిక భాషలు మాట్లాడడం సాధారణం. .[ఆధారం చూపాలి]గ్వాటెమాలాలో జర్మన్, చైనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషా ప్రజలు కూడా గుర్తించతగిన సంఖ్యలో నివసిస్తున్నారు. .[ఆధారం చూపాలి]

మతం

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
The Catedral Metropolitana, Guatemala City.

గ్వాటెమాలాలో క్రైస్తవం ప్ర్రాధాన్యత కలిగి ఉంది. ఇందులో కాలనీ శకంలో స్పానిష్ ప్రజలు ప్రవేశపెట్టిన రోమన్ కాథలిక్ మతం 48.4% ప్రజలచే అనుసరించబడుతుందని 2007 గణాంకాలు తెలియజేస్తున్నాయి.లాటిన్ అమెరికాలో ఎవాల్జెలికల్ ప్రజలు అనుసరిస్తున్న ప్రొటెస్టెంట్ మతం 33.7% ప్రజలచేత ఆచరించబడుతుంది.తరువాత స్థానాలలో యూదులు అనుసరిస్తున్న జూడిజం 1.6%, ఇస్లాం, బుద్ధిజం మతాలు, 11.6% నాస్థికం ఉన్నాయి.1970 నుండి ప్రొటస్టెంటు మతం అభివృద్ధిచెందుతూ 38% నికి చేరుకుని ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. అతర్యుద్ధం ముగింపుకు వచ్చిన తరువాత దాదాపు 2 దశాబ్ధాల నుండి మిషనరీలు చురుకుగా పనిచేస్తున్నాయి. గ్వాటెమాలా ఆర్థడాక్స్ చర్చి శక్తివంతంగా పనిచేస్తూ గత ఐదు సంవత్సరాల నుండి లక్షలాది మతమార్పిడులు నిర్వహించింది. పశ్చిమార్ధ గోళంలో ఆర్థడాక్స్ విస్తరించడానికి ఈ చర్యలు దోహదం చేసాయి. ప్రభుత్వం తీసుకున్న అనుకూల విధానాల కారణంగా స్థానిక ప్రజలు అనుసరిస్తున్న మతాలకు రక్షణ కల్పించబడుతుంది. మాయా శిధల్లాలన్నింటి వద్ద ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది.

గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం 
A church in San Andrés Xecul.

1990- 2012 మద్య కాలంలో ప్రొలేడ్స్ కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ అధ్యయనాలు కాథలిక్ మతంలో క్షీణత, ఎవాంజికల్, ప్రొటెస్టెంటు, నాస్థికం అల్పసంఖ్యాక మతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయని సూచిస్తున్నాయి.

గణాంకాల ఆధారిత గ్వాటెమాలా మతం వివరణ
గణాంకాలు రోమన్ కాథలిక్కులు ప్రొటెస్టెంటిజం నాస్థికులు ఇతరులు
1978 నవంబరు 82.9% 12.7% 4.4%**
1984 డిసెంబరు 69.6% 24.7% 4.5% 1.2%
1991 మార్చి 63.3% 21.1% 13.9% 1.7%
1995 మే 65.0% 22.0% 12.0% 1.0%
2000 అక్టోబరు నుండి 2001 జనవరి 55.1% 25.5% 17.4% 2.0%
2002 ఫిబ్రవరి 57.4% 28.9% 11.6% 2.1%
2007 జూన్ 48.4% 33.1% 16.1% 1.8%
ఏప్రిల్ నుండి 2009 మే 53.8% 34.1% 10.6% 1.5%
2010 ఆగస్టు 47.2% 39.5% 12.3% 1.0%
  • యూదులు, ఇస్లాం, మాయన్ మొదలైన మతాలతో చేర్చిన గణాంకాలు.
  • ఇతర మతాలు, నాస్థికులతో చేర్చిన గణాంకాలు.

వలసలు

కాలనీ శకంలో స్పెయిన్ ప్రజలు మాత్రమే గ్వాటెమాలాను చేరుకున్నప్పటికీ తరువాతి కాలంలో 19వ, 20వ శతాబ్ధాలలో ఐరోపా లోని ఇతర దేశాల నుండి కూడా వలస ప్రజలు గ్వాటెమాలాకు చేరుకున్నారు. జర్మన్ ప్రజలు ఫింకాస్, జకాపా, క్యుత్జల్టెనాంగో, బజ వెరపాజ్, జబాల్ ప్రాంతాలలో కాఫీతోటల పెంపకం చేపట్టారు. స్వల్పసంఖ్యలో ఫ్రాంస్, బెల్జియం, ఇంగ్లాండ్, ఇటలీ, స్వీడన్ దేశాల ప్రజలు గ్వాటెమాలాలో స్థిరపడ్డారు.

గౌతమాలో స్థిరపడిన ప్రజలలో రాజకీయనాయకులు, శరణార్ధులు, పారిశ్రామికవేత్తలు వంటివారు గ్వాటెమాలాలో స్థిరపడ్డారు. 1950 తరువాత అధికసంఖ్యలో విదేశీయులు స్థిరపడిన మద్య అమెరికా దేశలలో గ్వాటెమాలా ప్రథమ స్థానంలో ఉండగా తరువాత స్థానంలో కొస్టారిక ఉంది. గ్వాటెమాలా ఇప్పటికీ పెద్దసంఖ్యలో వలసప్రజలను ఆకర్షిస్తుంది. 1890 నుండి స్వల్పసంఖ్యలో ఆసియన్లు గ్వాటెమాలాకు వలసరావడం ఆరంభం అయింది. ఆసియన్లలో ప్రత్యేకంగా కొరియా,చైనా,జపాన్, ఫిలిప్పీన్స్ ప్రజలు అధికంగా ఉన్నారు.సమీపకాలంలో వీరి సంఖ్య అధికరిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభంలో జ్యూయిష్, పాకిస్థానీయులు వలస ప్రజలుగా గ్వాటెమాలాకు చేరుకున్నారు. 20వ శతాబ్ధపు ద్వితీయార్ధంలో లాటిన్ అమెరికన్ వలసప్రజలు గ్వాటెమాలాలో స్థిరపడ్డారు.వీరిలో ప్రత్యేకంగా మద్య అమెరికా దేశాలకు చెందిన మెక్సికో , క్యూబా, అర్జెంటీనా లకు చెందిన ప్రజలు ఉన్నారు. వీరు ఇక్కడ తాత్కాలికంగా నివసిస్తూ చివరిగమ్యంగా యునైటెడ్ స్టేట్స్‌ను ఎంచుకుంటుంటారు.

Place Country Count year
1 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  El Salvador 12,484 – 50,000 2002–2013
2 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Mexico 11,484 2002
3 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  జర్మనీ 10,000 2010
4 మూస:SPA 9,311 2014
5 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  South Korea 6,000 2013
6 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Nicaragua 5,604 2002
7 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Honduras 5,491 2002
8 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  United States 5,417 2002
9 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Italy 4,071 2009
10 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  United Kingdom 2,300 2015
11 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Belize 950 2002
12 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Costa Rica 906 2012
13 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  ఇజ్రాయిల్ 900 2012
14 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  France 824 2014
15 గ్వాటెమాలా: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికం  Colombia 757 2002
16 మూస:CHI 273 2005
Other Countries 9.489 2002

* Including immigrants from Taiwan, China, Japan, Palestine, Iraq, Cuba, Venezuela, Canada, Switzerland, Russia, Belgium, Sweden, among other countries.

ఆరోగ్యసంరక్షణ

లాటిన్ అమెరికా దేశాలలో ఆరోగ్యసరక్షణ తక్కువగా ఉన్న దేశాలలో గ్వాటెమాలా ఒకటి. దేశంలో శిశుమరణాలు అధికంగా ఉన్నాయి. 16 మిలియన్ల ప్రజలున్న గ్వాటెమాలాలో 16,000 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. " వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ "రికమెండు చేస్తున్న సగటు నిష్పత్తిలో ఇది సగం. 1997 లో గ్వాటెమాలా అంతర్యుద్ధం ముగింపుకు వచ్చిన తరువాత ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆరోగ్యసేవలను 54% ప్రజలు నివసిస్తున్న గ్రామీణప్రాంతాల వరకు విస్తరించింది. ప్రైవేట్ రంగం నుండి ఆరోగ్యసేవలు అందుకోవడానికి అంగీకరించని వివిధ రాజకీయసంస్థలు ఆరోగ్యసంరక్షణకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. As of 2013 ఆరోగ్యపరమైన ప్రణాళికలకు అవసరమైన నిధులకొరత సమస్యగా మారింది. మొత్తం జి.డి.పి.లో 6.4%- 7.3% ప్రభుత్వ , ప్రైవేట్ రంగం నుండి వ్యయం చేయబడుతుంది. 2012 గణాంకాల ఆధారంగా తలసరి 368 అమెరికన్ డాలర్లు ఆరోగ్యసంరక్షణ కొరకు వ్యయం చేయబడుతుంది. గ్వాటెమాలా రోగులు ఆరోగ్యసమస్య పరిష్కారం కొరకు స్థానిక సంప్రదాయ చికిత్స , ఆధునిక చికిత్సలను రెండిటి మీద ఆధారపడుతుంటారు.

విద్య

15 వయసు పైబడిన వారిలో 74.15% విద్యావంతులు ఉన్నారు. మద్య అమెరికా దేశాలలో ఇది అతి తక్కువ శాతం. రావోయే 20 సంవత్సరాలలో దీనిని అభివద్ధి చేయాలని గ్వాటెమాలా ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం పలు ప్రాధమిక , మాధ్యమిక పాఠశాలలను నిర్వహిస్తుంది. యువత పూర్తి స్థాయిలో విద్యను కొనసాగించడం లేదు. ప్రభుత్వం విద్యార్ధులకు పాఠశాలలలో యూనిఫాంస్, పుస్తకాలు, ఇతర ఉపకరణాలు , ప్రయాణవసతి కల్పిస్తున్నప్పటికీ అది పేదలకు అందడం లేదు. మద్య , పైతరగతి విద్యార్ధులు పాఠశాలలకు హాజరౌతూ ఉన్నారు. పేద విద్యార్ధులు పాఠశాలలకు హాజరుకావడం తక్కువగా ఉంది.గ్వాటెమాలాలో ఉన్న " యూనివర్శిటీ డీ శాన్ కార్లోస్ డీ గ్వాటెమాలా " విశ్వవిద్యాలయం, 14 ప్రైవేటు కళాశాలలు విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. చైల్డ్ ఎయిడ్, ప్యూబ్లో ఎ ప్యూబ్లో, కామన్ హోప్, సెంట్రల్ హైలాండ్స్ అంతటా విద్యాభివృద్ధి కొరకు అవసరమైన ఉపాధ్యాయశిక్షణ అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు ఉపాధ్యాయ శిక్షణ అందని కారణంగా గ్వాటెమాలా అక్షరాస్యత బలహీనంగా ఉండడానికి ప్రధానకారణంగా ఉంది.

మూలాలు

Tags:

గ్వాటెమాలా చరిత్రగ్వాటెమాలా భౌగోళికంగ్వాటెమాలా ఆర్ధికంగ్వాటెమాలా పర్యాటకంగ్వాటెమాలా గణాంకాలుగ్వాటెమాలా మూలాలుగ్వాటెమాలా

🔥 Trending searches on Wiki తెలుగు:

గజేంద్ర మోక్షంజవాహర్ లాల్ నెహ్రూభోపాల్ దుర్ఘటనజవహర్ నవోదయ విద్యాలయంవిమానంవై.యస్.భారతియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామెరుపునితీశ్ కుమార్ రెడ్డిలావు రత్తయ్యపాల్కురికి సోమనాథుడుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంచాళుక్యులుక్లోమముఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలునువ్వుల నూనెపరశురాముడుపురాణాలుఅవకాడోఆరుద్ర నక్షత్రముటమాటోజమ్మి చెట్టుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంనువ్వు నాకు నచ్చావ్త్రిష కృష్ణన్సౌందర్యరావి చెట్టుదర్శి శాసనసభ నియోజకవర్గంషణ్ముఖుడునవలా సాహిత్యముమదన్ మోహన్ మాలవ్యాబైబిల్మూర్ఛలు (ఫిట్స్)శక్తిపీఠాలునువ్వు లేక నేను లేనువిశ్వనాథ సత్యనారాయణశ్రీదేవి (నటి)సోంపుహిందూధర్మంఊరు పేరు భైరవకోనపూర్వాభాద్ర నక్షత్రమురమ్యకృష్ణతిరుపతిశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)జెర్రి కాటుగొట్టిపాటి రవి కుమార్భీమా (2024 సినిమా)కాలుష్యంఅశ్వత్థామకేదార్‌నాథ్ ఆలయంసజ్జల రామకృష్ణా రెడ్డిశివమ్ దూబేభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసామజవరగమనవిశాఖపట్నంసంధియవలుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ఆవారాలలితా సహస్ర నామములు- 1-100పల్నాడు జిల్లామృణాల్ ఠాకూర్రవీంద్రనాథ్ ఠాగూర్పూరీ జగన్నాథ దేవాలయంతెలంగాణ చరిత్ర2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఅమెరికా రాజ్యాంగంఅర్జునుడుడీహైడ్రేషన్రామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమౌన పోరాటంసద్గరు పూలాజీ బాబాజాతిరత్నాలు (2021 సినిమా)పంచారామాలుఆప్రికాట్🡆 More