బెలిజ్

బెలిజ్ (ఆంగ్లం : Belize), దీని పాత పేరు బ్రిటిష్ హోండురాస్, మధ్య అమెరికా లోని ఒక స్వతంత్ర దేశం.

ఒకానొకప్పుడు మాయా నాగరికత సామ్రాజ్యం. దీని ఉత్తరాన మెక్సికో, పశ్చిమాన గౌతమాలా, తూర్పు, ఆగ్నేయాన కరీబియన్ సముద్రం గలవు. దేశప్రధాన భూభాగం 290 కి. మీ పొడవు, 110 కి. మీ వెడల్పు ఉంటుంది.

బెలిజ్
Flag of బెలిజ్ బెలిజ్ యొక్క చిహ్నం
నినాదం
“Sub Umbra Florero”  (Latin)
"Under the Shade I Flourish"
జాతీయగీతం

రాజగీతం
రాణిని దేవుడు రక్షించుగాక
బెలిజ్ యొక్క స్థానం
బెలిజ్ యొక్క స్థానం
రాజధానిen:Belmopan
17°15′N 88°46′W / 17.250°N 88.767°W / 17.250; -88.767
అతి పెద్ద నగరం en:Belize City
అధికార భాషలు ఆంగ్లము
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Kriol (the en:lingua franca), Spanish
జాతులు  en:Mestizo, Kriol, Spanish, Maya, en:Garinagu, en:Mennonite, East Indian
ప్రజానామము Belizean (/bəˈliːziən (or bəˈliːʒən)/)
ప్రభుత్వం Parliamentary democracy and Constitutional monarchy
 -  Monarch Elizabeth II
 -  Governor-General Sir Colville Young
 -  Prime Minister Dean Barrow
Independence from the United Kingdom 
 -  Date 21 September 1981 
 -  జలాలు (%) 0.7
జనాభా
 -  2008 అంచనా 320,000 (173th²)
జీడీపీ (PPP) (2008 est.) అంచనా
 -  మొత్తం $2.574 billion (163rd)
 -  తలసరి $8,500 (74th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $1.383 billion 
 -  తలసరి $4,407 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase0.777 (medium) (88th)
కరెన్సీ en:Belize dollar (BZD)
కాలాంశం central time (UTC-6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bz
కాలింగ్ కోడ్ +501
1 These ranks are based on the 2007 figures.

బెలిజే వైశాల్యం 22,800 చ. కి. మీ. జనసంఖ్య 3,68,310. మద్య అమెరికా దేశాలలో అత్యంత తక్కువ జనసాంధ్రత కలిగిన దేశంగా బెలిజ్ ప్రత్యేకత కలిగి ఉంది.2015 గణాంకాల ఆధారంగా దేశ జనసంఖ్యాభివృద్ధి 1. 87%. జనసఖ్యాభివృద్ధిలో దేశం ఈప్రాంతంలో ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో వెస్టర్న్ హెమీస్ఫెరే ఉంది. బెలిజెలో విస్తారంగా భూస్థిత, సముద్రజీవజాలం ఉంది. అంతేకాక వైవిధ్యమైన పర్యావరణం దేశాన్ని అంతర్జాతీయంగా గుర్తించతగిన మెసోమరికన్ బయోలాజికల్ కారిడార్‌గా గుర్తించబడుతుంది. బెలిజే వైవిధ్యమైన భాషలు, సంప్రదాయాలు కలిగిన దేశం. బెలిజెలో అధికార భాష, ఇంగ్లీషు. బెల్జియన్ క్రియోల్ అనధికార భాషగా వాడుకలో ఉంది. దేశంలో సగంకంటే ఎక్కువ మందికి బహుభాషా జ్ఞానం ఉంది. స్పానిష్ భాష ద్వితీయస్థానంలో ఉంది. బెలిజె, మద్య అమెరికా, కరిబియన్ దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. దేశానికి లాటిన్ అమెరికా, కరిబియన్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి.

బెలిజే కరిబియన్ కమ్యూనిటీ, కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్, కరిబియన్ స్టేట్స్, సెంట్రల్ అమెరికన్ ఇంటిగ్రేషన్ సిస్టంలలో సభ్యత్వం కలిగి ఉంది. మూడు రీజనల్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వం ఉన్న ఒకే దేశంగా బెలిజెకు ప్రత్యేకత ఉంది. రెండవ ఎలిజబెత్ రాణి పాలనలో ఉన్న దేశాలలో బెలిజే ఒకటి. బెలిజే సెప్టెంబరు ఉత్సవాలు, పగడపు దిబ్బలు, పుంటా సంగీతం దేశానికి ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుంది.

పేరు వెనుక చరిత్ర

బెలిజే పేరుకుగల కారణాలు స్పష్టంగా లేవు.1677లో డోమియన్ ప్రీస్ట్ " ఫ్రే జోస్ డెల్గాడో " వెలువరించిన జనరల్‌లో ప్రస్తావించబడిన బెలిజే పేరు మొదటిసారిగా నమోదైన ఆధారంగా భావించబడుతుంది. కరీబియన్ సముద్రతీరంలో సంచరిస్తున్న సమయంలో డెల్గాడో మూడు ఈప్రాంతంలో ప్రవహిస్తున్న రియో సొయాటే, రియో క్సిబం, రియో బలిస్ అనే మూడు ప్రధాన నదులను దాటినట్లు తన రికార్డులలో ప్రస్తావించాడు.ఈ నదులకు సిట్టీ నది, సైబన్ నది, బెలిజే నదులు జలాలను అందిస్తున్నట్లు డెల్గాడో పేర్కొన్నాడు. డెల్గాడో పేర్కొన్న బాలిస్ పదానికి మాయన్ పదం బెలిక్స్ లేక బెలిజే (మట్టితో కూడిన జలాలు) అని అర్ధం.1638లో స్కాటిష్ నావికుడు " పీటర్ వాలెస్ " బెలిజే నది ముఖద్వారంలో స్థాపించిన సెటిల్మెంటు కారణంగా ఈ ప్రాంతనికి ఈ పేరు వచ్చిందని మరికొదరు భావిస్తున్నారు. వాలెస్ ఈ ప్రాంతంలో సెటిల్మెంట్ స్థాపించినదానికి తగిన ఆధారాలు లభించని కారణంగా ఇది ఒక విశ్వాసం మాత్రమే అని పరిశోధకులు భావిస్తున్నారు. రచయితలు, చరిత్రకారులు పేరుకు కలిగిన పలు ఇతర కారణాలను సూచిస్తున్నారు.

చరిత్ర

ఆరంభ కాల చరిత్ర

బెలిజ్ 
Extent of the Maya civilisation

యుకటాన్ ద్వీపకల్పంలో ఉన్న దిగువభూములు, దక్షిణంలో ఉన్న ఎగువభూములలో (ప్రస్తుత మెక్సికో, బెలిజె, గౌతమాలా, పశ్చిమ హండూరాస్ ప్రాంతాలుగా ఉన్నాయి). మాయా నాగరికత మొదలై దాదాపు మూడువేల సంవత్సరాలైంది. ఈ నాగరికతలోని పలు అంశాలమీద గత 500 సంవత్సరాల నుండి యూరపియన్ నాగరికతలు ఆధిక్యత సాధించాయి. క్రీ. పూ. 2,500 కంటే ముందు వేటప్రజల బృందాలు ఇక్కడ ఉన్న చిన్న వ్యవసాయ గ్రామాలలో స్థిరపడ్డారు. తరువాత వారు మొక్కజొన్న, బీన్స్, స్క్వాష్, మిరపకాయలు మొదలైన పంటలు పండించడానికి అలవాటుపడ్డారు. తరువాత మాయా నాగరికత నుండి పలు భాషలు, ఉపనాగరికతలు ఆవిర్భవించాయి. క్రీ. పూ. 2,500 నుండి క్రీ. శ. 250 వరకు మాయానాగరికత ప్రధానసంస్థలు ఆవిర్భవించాయి. క్రీ. శ. 250 నాటికి మాయానాగరికత ఉచ్ఛస్థితికి చేరింది.

బెలిజ్ 
"Caana" at Caracol
బెలిజ్ 
"El Castillo" at Xunantunich

మాయా నాగరికత

మాయానాగరికత ప్రస్తుత బెలిజే ప్రాంతం అంతటా క్రీ. పూ. 1500 ఆరంభమై క్రీ. శ 900 వరకు వర్ధిల్లింది. మధ్య, దక్షిణ ప్రాంత రాజకీయాల మీద 1,40,000 మంది మద్దతుదార్లతో కారకో ఆధిక్యత సాధించిందని నమోదైన చారిత్రికాధారాలు తెలియజేస్తున్నాయి. మాయా పర్వతం ఉత్తర భాగంలో లామానై ప్రాంతం ప్రాధాన్యత కలిగి ఉంది. మాయా నాగరికతలో చివరిదశ మెసొమరికన్ చరిత్రలో (క్రీ. శ. 600 - క్రీ. శ. 1000) బెలిజే ప్రాంతంలో దాదాపు 10,00,000 మంది ప్రజలు నివసించారని భావిస్తున్నారు. 16 వ శతాబ్దంలో ఈప్రాంతానికి స్పెయిన్ అన్వేషకులు చేరుకున్న ప్రాంతమే ప్రస్తుత బెలిజె. ఇందులో కొరొజెల్ బే సమీపంలో ఉన్న చెటుమల్ ప్రొవిన్స్, న్యూ రివర్, టిపూ, సిబన్ రివర్ ప్రాంతం, మొంకే రివర్, సర్స్టూన్ రివర్ సమీపప్రాంతంలో ఉన్న మంచె చోల్ నియంత్రణలో ఉన్న సమీపంలోని డ్జులునికాబ్ ప్ర్రాంతం ఉన్నాయి.

ఆక్రమణ , కాలనీపాలన (1506–1862)

స్పెయిన్‌కు చెందిన కాంక్విస్టేడర్ ఇక్కడి ప్రాంతాన్ని అణ్వేషించి దానిని ఫ్రెంచి కాలనీగా ప్రకటించాడు. అయినప్పటికీ యుకాటన్ లోని ఇండియన్ గిరిజనుల అతితీవ్రమైన ప్రతీకార స్వభావం, వనరుల కొరత కారణంగా ఇక్కడ నివసించడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నివారించాడు. 17-18 శతాబ్ధాలలో బేమాన్ అని పిలువబడే ఇంగ్లీష్, స్కాటిష్ వలసప్రజలు, సముద్రపు బంధిపోట్లు ఈప్రాంతానికి చేరుకుని ఈప్రాంతంలో లాగ్‌వుడ్ ట్రేడ్ కాలనీ, నౌకాశ్రయం నిర్మించారు. తరువాతి కాలంలో అది బెలిజే డిస్ట్రిక్ అయింది.1638లో మొదటగా సముద్రతీరంలో ఉన్న ప్రస్తుత బెలిజే ప్రాంతంలో స్థిరపడ్డారు. తరువాత వారు దాడిచేసిన స్పానిష్ షిప్పుల నుండి ఆశ్రితప్రాంతం కోరారు. 18 వ శతాబ్దంలో వలసప్రజలు లాగుల కటింగ్ పని చేపట్టి అట్లాంటిక్ బానిసవ్యాపారుల నుండి బానిసలను కొనుగోలు చేసి బానిస శ్రాంకులచే పనిచేసే విధానం ప్రవేశపెట్టారు. కట్టింగ్ చేసిన కొయ్యను ఉన్ని పరిశ్రమలో ఉపయోగించే అచ్చుల తయారీకి వాడుకున్నారు. స్పానిష్ ప్రభుత్వం ఈప్రాంతంలో సముద్రపు దోపిడీ దారులను నియంత్రించడానికి అనువుగా బ్రిటిష్ వలసప్రజలకు ప్రాంతాన్ని ఆక్రమించి లాగ్‌వుడ్ కాలనీ నెమించడానికి అనుమతించింది.

బెలిజ్ 
An excerpt from the 1898 Gazette that declared September 10 an official holiday, part of the efforts of the Centennial Committee

1786లో బ్రిటిష్ వలసప్రజల తరఫున బెలిజే ప్రాంతంలో సూపరింటెండెంటును నియమించబడ్డాడు. అప్పటివరకు స్పెయిన్‌కు ఆగ్రహం కలుగుతున్న కారణంతో బెలిజే ప్రాంతాన్ని బ్రిటిష్ కాలనీగా గుర్తించలేదు. ప్రభుత్వం గుర్తింపు జాప్యం చేసిన సమయంలో వలసప్రజలు తమస్వంత చట్టాలను ఏర్పాటు చేసుకుని స్వంత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. కొంతమంది వలసప్రజలు విజయవంతంగా భూమి, టింబర్ మీద పట్టుసాధించారు.

1798లో స్పెయిన్ సైన్యం, బేమన్ల మద్య " సెయింట్ జార్జి యుద్ధం " సంభవించింది. యుద్ధంలో చివరికి బేమన్లు విజయం సాధించారు. యుద్ధంలో సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ బెలిజే జాతీయశలవు దినం ప్రకటించి " ఫస్ట్ బెలిజియంస్ " ఉత్సవంగా జరుపుకుంటుంది.

బ్రిటిష్ సాంరాజ్యంలో భాగంగా (1862–1981)

19 వ శతాబ్దంలో బ్రిటన్ వలసప్రజల సంస్కరణ చేయాలని భావించింది. 1833లో హెచ్చరిక జారీచేసిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం బానిసత్వం నిర్మూలించింది. ఫలితంగా వలసప్రజలు బానిసలకు వారి మహోగనీ వెలికితీత సామర్ధ్యం ఆధారంగా ఒక్కొకరికి 53. 69 యూరోలను నష్టపరిహారం అందజేసింది. బానిసత్వం నిర్మూలించే చివరిదశ నాటికి తమ ఉద్యోగాలలో కొనసాగిన మునుపటి బానిసల పనివిధానాలు, జీవనవిధానాలలో కొంత మార్పు సంభవించింది. కొత్తగా స్వతంత్రత పొందిన ప్రజలకు వ్యక్తిగతమైన భూములకొనుగోలు ౠణసహాయం మొదలైన విషయాలలో పలు సూచనలు, నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. కాలనీలో నివసించే ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలకు ఎక్స్ట్రా స్పెషల్ మహోగనీ, లాగ్‌వుడ్ కట్టింగ్ పనుల సామర్ధ్యం అర్హతగా ఉండేది. మునుపటి బానిసలకు టింబర్ కట్టింగ్ పనిచేయడం కాక ఇతర ఉపాధి అవకాశాలు ఉండేవికావు.1836లో స్పెయిన్ అమెరికన్ స్వతంత్రయుద్ధం తరువాత బ్రిటన్ ఈప్రాంత పాలనాధికారం పొందింది. 1862లో గ్రేట్ బ్రిటన్ ఈ ప్రాంతాన్ని " రిటిష్ క్రౌన్ కాలనీ "గా ప్రకటించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈప్రాంతాన్ని జమైకా సబార్డినేట్ కాలనీగా చేసి దీనికి బ్రిటిష్ హండూరాస్ అని నామకరణం చేసింది. బ్రిటిష్ కాలనీగా బెలిజె ప్రాంతం బ్రిటిష్ పెట్టుబడిదార్లను ఆకర్షించింది. 19 వ శతాబ్దంలో బ్రిటిష్ వాణిజ్య సంస్థలలో బెలిజె ఎస్టేట్ , ప్రొడ్యూస్ కంపెనీ ఆధిక్యతసాధించింది. ఆది చివరకు కాలనీలో సగం ప్రైవేట్‌యాజన్య భూమిని కొనుగోలు చేసింది. 19 వ శతాబ్దం అంతటా , 20 వ శతాబ్దం సగం వరకు బెలిజె ఎస్టేట్ మహోగనీ వాణిజ్యంలో తలమానికంగా నిలిచింది.

1930 గ్రేట్ డిప్రెషన్ కాలనీ ఎకానమీ పతనావస్థకు కారణం అయింది. ప్రాంతమంతటా వ్యాపించిన నిరుద్యోగ సమస్య 1931 నాటికి మరింత తీవ్రం అయింది. ప్రభుత్వం అందజేసిన రీలీఫ్ నిధులు సరిపడక చట్టబద్ధం చేసిన లేబర్ యూనియన్లు కనీసవేతనాలు ఇవ్వాలని నిర్భంధించాయి. రెండవ ప్రపంచయుద్ధం కాలంలో బెలిజె ప్రజలలో చాలామంది సైన్యంలో చేరడంతో ఆర్థిక పరిస్థితి కొంత కోలుకుంది.

యుద్ధానికి అధికంగా వ్యయంచేసిన కారణంగా యుద్ధం తరువాత కాలనీ ఆర్థికస్థితి స్తంభించింది. 1949లో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్రిటిష్ హండూరాస్ డాలర్ విలువ మరింత పతనమై ఆర్థికస్థితి మరింత దిగజారి పీపుల్స్ కమిటీ రూపకల్పనకు దారితీసింది. పీపుల్స్ కమిటీ బెలిజె స్వంత్రం కొరకు పోరాడింది. పీపుల్స్ కమిటీ తరువాత పీపుల్స్ యునైటెడ్ పార్టీ ఆవిర్భవించింది. పీపుల్స్ యునైటెడ్ పార్టీ రాజ్యాంగ సంస్కరణలు , పెద్దలందరికీ ఓటుహక్కు కావాలని కోరింది. 1954లో యూనివర్సల్ సఫ్రేజ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ హండూరాస్ జనరల్ ఎకెక్షంస్ నిర్వహించబడ్డాయి. స్వతంత్రసమర యోధుడు " జార్జ్ కేడిల్ ప్రైస్ " 1956లో పి. యు. పి. నాయకుడయ్యాడు , 1961లో ప్రభుత్వంలో శక్తివంతమైన నాయకుడు అయ్యాడు. 1984 వరకు వివిధ బిరుదులతో కూడిన పదవిలో కొనసాగాడు. కొత్తరాజ్యాంగ విధానాలతో 1964లో బ్రిటిష్ హండూరాస్‌కు స్వయంప్రతిపత్తి అధికారం ఇవ్వబడింది. 1973 జూన్ 1న బ్రిటిష్ హండూరాస్‌కు బెలిజె అని నామకరణ మార్పిడి చేయబడింది. బెలిజియన్ గౌతమాలన్ టెర్రిటోరియల్ వివాదం స్వతంత్ర పోరాటాన్ని మరింత ముందుకు నడిపించింది.

బెలిజె స్వతంత్ర పోరాటం (1981)

1981లో బెలిజెకు స్వతంత్రం ఇవ్వబడింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న భూభాగ వివాదాల కారణంగా సరికొత్తగా ఏర్పడిన బెలిజె దేశాన్ని గౌతమాలా గుర్తించడానికి నిరాకరించింది. గౌతమాలా బెలిజె ప్రాంతం తమకు స్వతం అని వాదించింది. ఇరుదేశాలమధ్య సంఘర్షణ తలెత్తకుండా బెలిజెలో 1,500 బ్రిటిష్ సైన్యం నిలిపి ఉంచబడింది. ప్రైస్ నాయకత్వంలో 1984 వరకు అన్ని ఎన్నికలలో పి. యు. పి. విజయం సాధించింది. స్వతంత్ర తరువాత 1984 లో మొదటిసారిగా నిర్వహించబడిన బెలిజె ఎన్నికలలో యునైటెడ్ డెమిరటిక్ పార్టీ పి. యు. పి. ని ఓడించింది. యు. డి. పి. నాయకుడు " మాన్యుయల్ ఎస్క్యువెల్ " ప్రైస్‌ను తొలగించి ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. ప్రైస్ తన స్వంత నియోజకవర్గంలో కూడా ఓటమి (బెలిజె హౌస్ ఆఫ్ రిప్రెజెంటివ్ పదవి కోల్పోయాడు) పొందాడు. ప్రైస్ నాయకత్వంలో పి. యు. పి. పార్టీ 1989లో తిరిగి అధికారం చేపట్టింది. తరువాత సంవత్సరం యునైటెడ్ కింగ్డం బెలిజె లోని సైన్యాన్ని ఉపసహరించుకున్నట్లు ప్రకటించింది. 1994లో బ్రిటిష్ సైన్యం బెలిజెను వదిలివెళుతూ సరికొత్తగా రూపొందించబడిన " బెలిజే డిఫెంస్ ఫోర్స్ "కు సహకరించడానికి సైనికశిక్షణా బృందాన్ని బెలిజెలో వదిలి పోయింది.

1993లో యు. డి. పి. తిరిగి అధికారం చేజిక్కించుకుంది. ఎస్క్యువెల్ తిరిగి ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. తరువాత ఎస్క్యువెల్ చేపట్టిన రాజ్యాంగ విధానాలు గౌతమాలా సరిహద్దు వివాదాలకు తెరతీసింది.

1998లో పి. యు. పి. తిరిగి ఎన్నికలలో విజయం సాధించింది. సైద్ ముసా ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. 2003 ఎన్నికలలో పి. యు. పి. మెజారిటీ నిలబెట్టుకుంది. ముసా ప్రధానమంత్ర పదవిలో కొనసాగాడు. ఆఉఅన అభివృద్ధి రహిత దక్షిణప్రాంతాన్ని అభివృద్ధిపరచడానికి కృషిచేసాడు.

2005లో బెలిజే దేశంలో పి. యి. పి. ప్రభుత్వం అవిశ్వాసతీర్మానం ఎదుర్కొన్నది అలాగే జాతీయ పన్నులు అధికరించబడ్డాయి. బెలిజే జనరల్ ఎన్నికలలో (2008) యునైటెడ్ డెవెలెప్మెంటాఊ పార్టీ విజయం సాధించిన తరువాత 2008 ఫిబ్రవరి 8 న డీన్ బారో ప్రధానమత్రిగా పదవీప్రమాణం చేసాడు. 2012లో బెలిజే జనరల్ లోకల్ ఎన్నికలలో యునైటెడ్ డెవెలెప్మెంటు పార్టీ స్వల్పమెజారిటీతో తిరిగి విజయం సాధించింది.

బెలిజే చరిత్ర మొత్తం బెలిజే, గౌతమాలా మద్య భూవివాదాలు కొనసాగాయి. గౌతమాలా ప్రభుత్వం బెలిజెను తమ మయాపులో 23 వ డిపార్ట్మెంటుగా చిత్రించింది. బెలిజే దేశానికి గౌతమాలాతో ఉన్న సరిహద్దు వివాదాలు అపరిష్కృతంగా నిలిచిపోయాయి గౌతమాలా 1859 ఆంగ్లో - గౌతమాలా ఒప్పందం ఆధారంగా బెలిజే భూభాగాన్ని కొంత స్వాధీనం చేసుకుంది. ఒప్పందం తరువాత బ్రిటిష్ ప్రభుత్వానికి గౌతమాలా బెలిజే గౌతమాలా నగరాల మద్య రహదారి నిర్మాణానికి అంగీకారం లభించింది. వివిధ సందర్భాలలో బెలిజే, గౌతమాలా మద్య కొనసాగిన భూవివాదాల పరిష్కారానికి యునైటెడ్ కింగ్డం, కరీబియన్ కమ్యూనిటీ, ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ దేశాలు ప్రయత్నించాయి.

భౌగోళికం

బెలిజ్ 
Belize Topography
బెలిజ్ 
Belizean jungles are home to the jaguar and many other mammals. Cockscomb Basin Wildlife Sanctuary was founded in 1990 as the first wilderness sanctuary for the jaguar and is regarded by one author as the premier site for jaguar preservation in the world.

బెలిజే సెంట్రల్ అమెరికా ఉత్తరదిశలో కరీబియన్ సముద్రతీరంలో ఉంది. దేశుత్తర సరిహద్దులో మెక్సికో లోని క్వింటానా రూ, పశ్చిమ సరిహద్దులో గౌతమాలన్ డిపార్టుమెంటు, పెటెన్ డిపార్టుమెంటుల నడుమ నిర్ణయించబడని లైన్ (బఫర్ జోన్), దక్షిణ సరిహద్దులో గౌతమాలా డిపార్టుమెంటుకు చెందిన ఇజ్బాల్ ఉన్నాయి. తూర్పు సరిహద్దులో కరిబియన్ సముద్రం, బలిజే బారియర్ రీఫ్ ఉన్నాయి. దేశం మొత్తం వైశాల్యం 22960 చ. కి. మీ. ఇది ఎల్ సల్వృడర్, ఇజ్రాయిల్, న్యూ జెర్సీ, వేల్స్ కంటే కొంచం అధికం. బెలిజే దీర్ఘచతురస్ర రూపంలో ఉంటుంది. ఉత్తర దక్షిణాల మధ్యదూరం 280 కి. మీ., తూర్పు పడమరల మధ్య దూరం 100 కి. మీ. మొత్తం భూసరిహద్దు 516 కి. మీ. బలిజెలో రియో హండో, సార్స్టూన్ నది ఉన్నాయి. ఈ నదీ ప్రవాహాలు అధికంగా దేశ ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తున్నాయి. పశ్చిమ సరిహద్దులో సహజవనరులు అధికంగా లేనప్పటికీ ఉత్తర దక్షిణంగా కొంత దిగువభూమి అరణ్యం, ఎగువభూమి పీఠభూమి విస్తరించి ఉంది. ఉత్తర బెలిజే ప్రాంతం అధికంగా చదరంగా ఉండి చిత్తడి సముద్రతీరం కొన్ని ప్రదేశాలలో దట్టమైన అరణ్యం ఉంది. బెలిజే జీవజాలం, వృక్షజాలం వైశాల్యపరంగా పోల్చిచూస్తే అధికవైవిధ్యం కలిగి ఉంటుంది. దక్షిణప్రాంతంలో ఎత్తు తక్కువైన మాయా పర్వతశ్రేణి ఉంది. బెలిజెలో డోలేస్ డిలైట్ అధిక ఎత్తైన శిఖరంగా (1124 మీ ఎత్తు) గుర్తించబడుతుంది. బెలిజే కఠినమైన భౌగోళిక స్థితి మెక్సికోలో ప్రవేశించే మాదకద్రవ్యాల వ్యాపారులకు, అక్రమరవాణాదారుల ఆకర్షణీయంగా మారింది. ప్రధాన మాదకద్రవ్యాల తయారీ, రావాణా జరుగుతున్న దేశాలలో ఒకటిగా 2011లో యునైటెడ్ స్టేట్స్ బలిజెను పేర్కొన్నది.

పర్యావరణ రక్షణ , బయోడైవర్శిటీ

బెలిజ్ 
Scarlet macaws are native to Central and northern South America. Various bird sanctuaries exist in Belize, such as the Crooked Tree Wildlife Sanctuary.

జీవవైవిధ్య సంపద అధికంగా ఉన్న దేశాలలో బెలిజే ఒకటి. ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మధ్య ఉన్న కారణంగా వైవిధ్యతలు కలిగిన వాతావరణం, జీవజంతుజాలాల వైవిధ్యం ఉన్నాయి. బెలిజే తక్కువ జనసాంధ్రత కలిగి ఉంటుంది. జనసాంధ్రత 8867/చ. కి. మీ. దేశంలో 5,000 జాతుల వృక్షజాలం, అర్మాడిల్లోస్, పాములు, కోతులవంటి జంతువులు ఉన్నాయి. దక్షిణ మద్య బెలిజే ప్రాంతంలోని అరణ్యాలు వృక్షజాలం, జలాశయాలను సంరక్షించడానికి "ది కోక్ స్కాంబ్ బేసిన్ వైల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ" మాయాపర్వతశ్రేణి తూర్పున 400 చ. కి. మీ వైశాల్యంలో స్థాపించబడింది. 1990లో స్థాపించబడిన ఈ అభయారణ్యం చిరుతపులుల కొరకు స్థాపించబడిన మొదటి అభయారణ్యంగా భావించబడుతుంది.

వృక్షజాలం , జంతుజాలం

60% బెలిజే భూభాగం అరణ్యప్రాంతాలతో నిండి ఉంది. 20% భూభాగం వ్యవసాయ భూములుగా, మానవ నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతం చిత్తడి, గరిక నేలలుగా ఉన్నాయి. బెలిజే భూభాగంలో మాంగ్రోవ్ (వర్షారణ్యాలు) కూడా కొంతమేర విస్తరించి ఉంది. దక్షిణ మెక్సికో నుండి పనామా వరకు అంతర్జాతీయంగా గుర్తించబడిన మెసొనెరికన్ కారిడార్‌లో భాగంగా ఉన్న బెలిజే అమెరికా ఖండంలో సముద్రతీర జీవవైవిధ్యం, భూభాగ జీవవైవిధ్య సంపదతో విలసిల్లుతూ విస్తారమైన జీవజాలం, జంతుజాలంతో విలసిల్లుతున్న దేశాలలో ఒకటిగా ఉంది. జీవవైవిధ్యం, ప్రకృతిసంపదలను చక్కగా సంరక్షిస్తున్న దేశాలలో బెలిజే ఒకటి. "వరల్డ్ డేటాబేస్ ప్రొటెక్టెడ్ ఏరియా" నివేదికల ఆధారంగా బెలిజెలోని 37% భూభాగం అధికారంగా సంరక్షించబడుతూ ఉందని తెలుస్తుంది. ఇది అమెరికా ఖండంలో అత్యధికంగా భూభాగ సంరక్షణ చేస్తున్న దేశంగా బెలిజెకు గుర్తింపును తీసుకువస్తుంది. కోస్టారికాలో 27% భూమిని మాత్రమే ప్రొటెక్టెడ్ భాభాగం ఉంది. బెలిజెలో ఉన్న 13. 6% జలాశయాలు, బెలిజే బారియర్ రీఫ్ కూడా సంరక్షిత ప్రాంతాలుగా ఉన్నాయి. బెలిజే బారియర్ రీఫ్ యునెస్కో గుర్తించిన ప్రపంచవారసత్వ సంపదలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇది బారియర్ రీఫ్‌లలో అంతర్జాతీయంగా ద్వితీయస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా గ్రేట్ రీఫ్ ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది. వాటర్ సెంటర్ ఫర్ హ్యూమిడ్ ట్రాపీక్స్ ఆఫ్ లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ అండ్ నాసా 2010లో ప్రచురణ ఆధారంగా బెలిజెలో 1980లో 75. 9% అరణ్యప్రాంతం 2010 నాటికి 62. 7% క్షీణించిందని తెలియజేస్తుంది. అలాగే బెలిజే ట్రాపికల్ ఫారెస్ట్ అధ్యయనాలు, కంసర్వేషన్ ఇంటర్నేషనల్ బెలిజే అరణ్యప్రాంతం గురించి ఇలాంటి అభిప్రాయాలే వెలువరించింది. రెండు అధ్యయనాలు వార్షికంగా బెలిజెలో 0. 6% అరణ్యం నరికివేతకు గురౌతూ ఉందని వార్షికంగా సుమారుగా 24835 చ. ఎకరాలు క్షీణిస్తున్నాయని తెలియజేస్తున్నాయి. ఇతర అధ్యయనాలు బెలిజే అరణ్యప్రాంతాలు శక్తివంతంగా సంరక్షించబడుతున్నాయని 1980 నుండి 2010 మద్య కాలంలో కేవలం 6. 4% మాత్రమే క్షీణించినట్లు తెలియజేస్తున్నాయి. 1980-2010 మధ్య కాలంలో మిగిలిన భూభాగంలో నాలుగవ వంతు మాత్రమే క్షీణించిందని భావిస్తున్నారు. అత్యధిక అరణ్యప్రాంతం, తక్కువ అరణ్యక్షీణత ఉన్న దేశాంగా బెలిజే ఆర్. ఇ. ఇ. డి, ఎస్. ఇ. ఆర్. వి. ఐ. ఆర్ అధ్యయనాలకు అనుకూలమైనదిగా భావించబడుతుంది. బెలిజెను " గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్ " గుర్తించి సభ్యత్వం ఇచ్చింది.

జియాలజీ, ఖనిజసంపద , విద్యుత్తు

బెలిజెలో ఆర్థికంగా ముఖ్యత్వం ఉన్న పలు ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవీ పెద్దమొత్తంలో నిల్వలు కలిగినవి కావు. ఖనిజాలలో డోలోమైట్, బారిటె, బరియం, బాక్సైట్, టిన్, బంగారం ఉన్నాయి. 1990లో రహదారి నిర్మాణం కొరకు ఉపయోగించిన లైం స్టోన్ మాత్రమే దేశీయ, ఎగుమతి కొరకు వెలికితీయబడింది. 2006లో కొత్తగా స్పానిష్ లుక్కౌట్ పట్టణంలో కనిపెట్టిన క్రూడ్ ఆయిల్ నిల్వలు దేశానికి కొత్త భవిష్యత్తు, సమస్యలు తెచ్చింది.

బెలిజె బారియర్ రీఫ్

బెలిజ్ 
Belize Barrier Reef, aerial view looking north
బెలిజ్ 
The Great Blue Hole. A phenomenon of karst topography

బెలిజే సముద్రతీరంలో వరుసగా కోరల్ రీఫులు ఉన్నాయి దీనిని బెలిజే బారియర్ రీఫ్ అంటారు. ఉత్తరభూభాగంలో 300 మీ, దక్షిణ భూభాగంలో 40 కి. మీ పొడవున ఈ పగడపు దిబ్బలు ఉన్నాయి. మెసొమెరికన్ బారియర్ రీఫులో 300 కి. మీ పొడవైన బారియర్ రీఫ్ బెలిజెలో ఉంది. ఉత్తర భూభాగంలో కాంకన్ వద్ద ఆరంభమై యుకాటన్ ద్వీపకల్పం రివేరా మాయా హండూరాస్ ద్వారా పయనించి హండూరాస్ వద్ద ముగుస్తుంది. ప్రపంచంలో అతి పొడవైన పగడపు దిబ్బలలో ఇది ఒకటిగా భావించబడుతుంది. బెలిజే స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ క్రీడలకు ప్రఖ్యాతిచెందింది. వార్షికంగా బెలిజే చేరుకుంటున్న 2,60,000 పర్యాటకులలో సగంమంది ఈ క్రీడలకొరకు వస్తుంటారు. బెలిజే చేపలపరిశ్రమలకు కేంద్రంగా ఉంది. 1842లో దీనిని చాలాప్రాముఖ్యత కలిగిన రీఫ్‌గా అభివర్ణించాడు. 1996లో ఇక్కడ ఉన్న జంతుజాలం సంరక్షించడానికి బెలిజే బారియర్ రీఫ్ ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించబడుతుంది.

జాతులు

బెలిజే బారియర్ రీఫ్ అత్యధిక వృక్షజాతులకు, జంతుజాతులకు నిలయంగా ఉంది.

  • 70 హార్డ్ కోరల్ జాతులు
  • 36 సాఫ్ట్ కోరల్ జాతులు.
  • 500 చేప జాతులు
  • వందలాది అకశేరుక జాతులు. 90% రీఫ్ ఇప్పటికీ పరిశోధించబడుతుంది. ఇందులో 10% మాత్రమే కనుగొనబడినట్లు కొంతమంది భావిస్తున్నారు.

కంసర్వేషన్

2010లో " బాటం ట్రాలింగ్ " మీద నిషేధం విధించి ఇలా నిషేధం విధించిన దేశాలలో బెలిజే ప్రథమస్థానంలో నిలిచింది. 2015 డిసెంబరులో బారియర్ రీఫ్ ప్రాంతం, దేశంలో 7 ప్రపంచవారసత్వసంపదలో భాగంగా ఉన్న ప్రాంతాలలో ఆఫ్ షోర్ ఆయిల్ డ్రిల్లింగ్ పై నిషేధం విధించింది. సంరక్షితచర్యలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ రీఫ్‌ రక్షణకు అనియంత్రిత పర్యాటకం, సముద్రయానం, చేపలవేట మొదలైన సముద్రతీర కాలుష్యం బెదిరింపుగా మారింది. తుఫానులు, గ్లోబల్ వార్మింగ్ కూడా రీఫ్ రక్షణను సవాలు చేస్తుంది. ఇవి " కోరల్ బ్లీచింగ్‌కు కారణం ఔతున్నాయి. 1998 నుండి బెలిజె కోరల్ రీఫ్ 40% దేబ్బతిన్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

వాతావరణం

బెలిజెలో ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రాంతాలవారీగా వాతవరణంలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ దేశంలో సహజంగా వెట్ (తేమ) , డ్రై (పొడి) సీజన్లు కొనసాగుతుంటాయి. ఎత్తును అనుసరించి ఉష్ణోగ్రతలలో వైవిధ్యం నెలకొని ఉంటుంది. సముద్రతీరానికి సమీపంలో ఉండడం , కరీబియన్ పవనాలు వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తూ ఉంటుంది. సముద్రతీరంలో జనవరిలో సరాసరి ఉష్ణోగ్రత 24 డిగ్రీలు సెల్షియస్ , జూలై మాసంలో 27 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.

తుఫానులు

ఉత్తరభూభాగంలో 1350 మి. మీ వర్షపాతం , పశ్చిమ భూభాగంలో 4500 మి. మీ వర్షపాతం ఉంటుంది. దక్షిణప్రాంతంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఉత్తర , మద్య భూభాగంలో వర్షపాతంలో గొప్ప వ్యత్యాసాలు ఉంటాయి. దక్షిణప్రాంతంలో డ్రై సీజన్ తక్కువగా (ఫిబ్రవరి నుండి ఏప్రెల్ వరకు)ఉంటుంది. తక్కువ కాలం , స్వల్పకాలం ఉండే వర్షపాతాన్ని స్థానికులు " లిటిల్ డ్రై " అంటారు. ఇది సాధారణంగా జూలై , ఆగస్టు మాసాల మద్య ఉంటుంది. బెలిజె ప్రాంతంలో తుఫానులు ప్రధానపాత్ర వహించి బెలిజె చరిత్రలో విధ్వంశాలు సృష్టించిన కాలాలను నమోదుచేసాయి. 1931 లో పేరు పెట్టని తుఫాను బెలిజె నగరంలోని మూడింట రెండువంతుల భవనాలను కూల్చివేయడమేగాక 1000 మంది మరణాలకు కారణం అయింది. 1995 లో జానెట్ తుఫాను ఉత్తరభూభాం లోని కొరొజెల్ నగరాన్ని సమమట్టం చేసింది. 6 సంవత్సరాల తరువాత హట్టీ తుఫాను మద్య సముద్రతీరంలో విధ్వంశం సృష్టించింది. ఇది బెలిజె నగరంలో సృష్టించిన వినాశనం కారణంగా రాజధానిని తరలించడానికి ప్రేరణకు కారణం అయింది. తరువాత రాజధాని కొరకు " బెల్మొపెన్ " నగరం రూపొందించబడింది. 1978 లో బెలిజెను కేటగిరీ 2 " గ్రెటా తుఫాను " సృష్టించిన తుఫాను దేశం లోని దక్షిణ సముద్రతీరంలో 25 మిలియన్ల అమెరికన్ డాలర్ల నష్టం కలిగించింది. 2001 అక్టోబరు 9 న ఇరిస్ (కేటగిరీ ) తుఫాను కారణంగా మంకీ రివర్ టౌన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. తుఫాను అరటితోట్లను పడగొట్టి గ్రామంలోని పలు నివాసాలను పడగొట్టింది. 2007 డీన్ తుఫాను కారణంగా (కేటగిరీ 5) బెలిజే ఉత్తరభూభాగంలో ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. డీన్ తుఫాను ఉత్తర బెలిజే ప్రాంతంలో విస్తారంగా విధ్వంసం సృష్టించింది. 2010లో బెలిజెను రిచర్డ్ తుఫాను (కేటగిరి 2) నేరుగా చేరి విధ్వంసం సృష్టించింది. అది బెలిజే నగర ఆగ్నేయభూభాగంలో కొండచరియలను పడగొట్టింది. తుఫాను సృష్టించిన విధ్వంసంలో పంటలు, నివాసాల కారణంగా 33. 8 మిలియన్ల బెలిజే డాలర్ల నష్టం కలిగించింది. సమీపకాలంలో 2016లో ఎర్ల్ తుఫాను దేశంలో విధ్వంసం సృష్టించింది.

ఆర్ధికం

బెలిజ్ 
A proportional representation of Belize's exports in 2015
బెలిజ్ 
A sugar cane processing plant, Orange Walk Town, Belize. Sugar is one of Belize's top exports.

బెలిజెలో స్వల్పంగా ప్రైవేట్ యానమాన్య వ్యాపారసంస్థలు ఉన్నాయి. అవి పెట్రోలియం, క్రూడాయిల్, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సామాగ్రి, మొదలైన ఎగుమతులు ఆధారితంగా పనిచేస్తున్నాయి. అదనంగా పర్యాటకం, నిర్మాణరంగం సమీపకాలంలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. As of 2007, ఆయిల్ ఉత్పత్తి 3,000 bbl/d (480 m3/d) and as of 2006ఆయిల్ ఎగుమతి 1,960 bbl/d (312 m3/d)., పారిశ్రామిక ఖనిజాల ఉత్పత్తి బెలిజే ప్రదాన ఆదాయవనరులుగా ఉన్నాయి. వ్యవసాయంలో చెరకు (కాలనీ పాలన నుండి), ప్రధానపంటగా ఉండి పండించిన పంటలో సగం ఎగుమతి చేయబడుతుంది. అదనంగా అరటి పంట అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న వనరుగా ఉంది. ఆర్థిక ప్రభుత్వం ఆర్థికాస్థిరతను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం సత్వచర్యలు చేపట్టి సమర్ధవంతంగా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వ్యయానికి కళ్ళెం వేయడంలో విఫలమైన కారణంగా ఎక్చేంజి రేట్ వత్తిడికి గురౌతూ ఉంది. 1999లో పర్యాటకం, నిర్మాణరంగం బలపడ్డాయి. బెలిజెలో విద్యుత్తు అత్యంత వ్యయభరితంగా ఉంది. బలిజే యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, యురేపియన్ యూనియన్, మద్య అమెరికాలతో వ్యాపారసంబంధాలు కలిగి ఉంది.

బెలిజెలో ఐదు బ్యాంకులు ఉన్నాయి. వీటిలో బెలిజే బ్యాంక్ పెద్దదిగా గుర్తించబడుతుంది. ఇతర బ్యాకులలో అట్లాంటిక్ బ్యాంక్, ఫస్ట్ కరిబియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్, స్కూటియా బ్యాంక్ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. 1940లో మారియన్ ఎం. గనే, ఎస్. జె. నాయకత్వంలో క్రెడిట్ యూనియన్లు ప్రారంభం అయ్యాయి. బెలిజే మద్య అమెరికా సముద్రతీరంలో ఉంది. ఇది శలవుదినాలలో చేరడానికి ఆకర్షణీయమైన గమ్యంగా ఉంది. అయినప్పటికీ బెలిజే భౌగోళికస్థితి అంతర్జాతీయంగా మాదకద్రవ్యం అక్రమరవాణాచేస్తున్న వారిని ఆకర్షిస్తుంది.

పారిశ్రామిక నిర్మాణాలు

బి. ఇ. ఎల్ " ఫోర్టిక్ ఐ. ఎన్. సి. "లో 70% భాగస్వామ్యం వహిస్తుంది. ఒక కెనడియన్ పెట్టుబడిదారుడు యుటిలిటీ డిస్ట్రిబ్యూషన్‌కు (ఫోర్టిస్‌లో 2%) యాజమాన్యం వహిస్తున్నాడు. 1999లో ఫోర్టిస్ బి. ఇ. ఎల్. మేనేజ్మెంటు బాధ్యత వహిస్తుంది. స్థానీయంగా నిర్వహిస్తున్న యుటిలిటీ కారణంగా తలెత్తిన ఆర్థికసమస్యల వలన బెలిజె ప్రభుత్వం ఫోర్టిస్ కంపెనీని బాధ్యత వహించడానికి ఆహ్వానించింది. అదనంగా ఫోర్టిస్ బి. ఇ. ఎల్ కంపెనీలో పెట్టుబడులను క్రమబద్ధీకరణ చేసింది. ఫోర్టిస్‌కు స్వంతంగా బెలిజె " ఎలెక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ " సంస్థ ఉంది. ఇది ఒక " నాన్ - రెగ్యులేటెడ్ హైడ్రోఎలెక్ట్రిక్ జనరేషన్ బిజినెస్ " కంపెనీ. మాకెల్ నది మీద నిర్మించబడిన మూడు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. 2011 జూన్ 14న బెలిజె ప్రభుత్వం బి. ఇ. ఎల్. లోని ఫోర్టిస్ ఐ. ఎన్. సి. స్వంతమైన భాగస్వామ్యంలో ప్రధానభాగాన్ని జాతీయం చేసింది. 2008లో ప్రభుత్వ " పబ్లిక్ యుటిలిటీ కమిషన్ " అవలింబించిన విధానాల కారణంగా బి. ఇ. ఎల్. సంస్థ ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నది.

2009 ఆగస్టులో బెలిజె ప్రభుత్వం " బెలిజే టెలెమీడియా లిమిటెడ్ "ను జాతీయం చేసింది. తరువాత అది స్పీడి నెట్ పోటీని ఎదుర్కొన్నది. జాతీయం చేసిన ఫలితంగా ఇంటర్ కనెక్షన్ ఒప్పందంలో సమస్యలు ఎదురయ్యాయి. బి. టి. ఎల్., స్పీడ్ నెట్ సంస్థలు రెండు పూర్తిస్థాయి సామాగ్రి, బేసిక్ టెలీఫోన్ సర్వీసులో అంతర్భాగంగా నేషనల్, ఇంటర్నేషనల్ కాల్స్, ప్రీపెయిడ్ సర్వీసు, సెల్యులర్ సర్వీసు, 3జి సర్వీసు, ఇంటర్నేషనల్ రోమింగ్, ఫిక్సెడ్ వైర్లెస్, డయల్ - అప్, ఇంటర్నెట్ సౌకర్యాలు, హైస్పీడ్ డిజిటల్ సంస్క్రైబర్ లైన్, ఇంటర్నెట్ సర్వీసు, నేషనల్, ఇంటర్నేషనల్ డేటా నెట్వర్క్స్, అందిస్తామని కంపెనీలు రెండూ ప్రగల్భాలు చెప్తున్నాయి.

పర్యాటకం

Panoramic view of Amigos del Mar diving dock and shop in Ambergris Caye

బెలిజే వాతావరణం, బెలిజే రీఫ్, సముద్రంభాగంలో ఉన్న 450 అతి చిన్న ద్వీపాల సమూహం, అద్భుతమైన చేపలవేట, సురక్షితంగా బోటింగ్ చేయడానికి అవసరమైన నీరు, స్కూబా డైవింగ్, స్నార్కెల్లింగ్ క్రీడలు, రాఫ్టింగ్, కేయాకింగ్ చేయడానికి అనువైన అనేక నదులు, వైవిధ్యమైన అరణ్యాలు, వన్యమృగ అభయారణ్యాలు, హైకింగ్ చేయడానికి వృక్షజాలం, జంతుజాలం, పక్షులను చూడడం, హెలికాఫ్టర్ టూరింగ్ మాయా అవశేషాల సందర్శన బెలిజెను గొప్ప పర్యాటక కేంద్రంగా, ఎకో టూరింగ్ కేంద్రంగా చేసింది. ఇక్కడ పెద్ద గుహల సముదాయం కూడా ఉంది. పర్యాటక అభివృద్ధి వ్యయం అధికంగా ఉన్నప్పటికీ బెలిజే వ్యవసాయం తరువాత పర్యాటకరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తుంది. 2012లో 9,17,869 మంది పర్యాటకులు బెలిజెను సందర్శించారు. వీరిలో యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చేవారు 5,84,683 మంది ఉన్నారు. పర్యాటకరంగం నుండి బెలిజే 1. 3 బిలియన్ల ఆదాయం అందుకుంటుంది.

గణాంకాలు

బెలిజ్ 
Belize is known[ఆధారం చూపాలి] for its diversity of cultures and races

2010 గణాంకాల ఆధారంగా బెలిజే జనసంఖ్య 3,24,528. 2009 గణాంకాల ఆధారంగా మొత్తం ఫర్టిలిటీ రేటు ఒక మహిళకు 3.6. జననాల 1000 మందికి 27.33, మరణాలు 1000 మందికి 5.8.

సంప్రదాయ ప్రజలు

మాయా

బెలిజ్ 
Mayan children

బెలిజే యుకటాన్ ప్రాంతంలో మాయాప్రజలు క్రీ.పూ. 2000ల నుండి నివసిస్తున్నారని భావిస్తున్నారు. అయినప్పటికీ స్థానిక జాతుల మద్య నిరంతరాయంగా కలహాల కారణంగా మాయాప్రజలు ఈ ప్రాంతాలలో క్షీణించారు. యురేపియన్లు ఈ ప్రాంతాన్ని అణ్వేషించి చేరుకున్న తరువాత అంటువ్యాధుల కారణంగా మరి కొంతమంది మరణించారు. ప్రస్తుతం మూడు మాయాసమూహాలకు చెందిన ప్రజలు బెలిజెలో నివసిస్తున్నారు.వీరిలో 1840లో సంభవించిన ఆటవికమైన జాతి కలహాల కారణంగా యుకాటన్ (మెక్సికో) ప్రాంతం నుండి తప్పించుకుని వచ్చిన యుకాటెక్ మాయాప్రజలు ఉన్నారు. మోపన్ ప్రజలు బెలిజే స్థానిక ప్రజలైనా బ్రిటిష్ ప్రభుత్వం వీరిని తరిమి వారి ప్రాంతాలలో సెటిల్మెంట్లు ఏర్పరచుకున్న తరువాత వీరు గౌతమాలా చేరుకున్నారు. తరువాత బానిసలుగా విక్రయించడం నుండి తప్పించుకుని 19వ శతాబ్దంలో వీరు తిరిగి గౌతమాలా నుండి బెలిజే చేరుకున్నారు. మిగిలిన వారు టోలెడో డిస్ట్రిక్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

క్రియోల్స్

క్రియోలెస్ (వీరిని క్రియోల్స్ అని కూడా అంటారు) బెలిజియన్ ప్రజలలో 21% ఉన్నారు. అలాగే బెలిజే విదేశీ ఉపాధి దారులలో 75% క్రియోల్స్ ఉన్నారు. వీరు బేమెన్ బానిస యజమాన్య సంతతికి చెందినవారై ఉన్నారు. బెలిజెకు బానిసలను కొయ్యపరిశ్రమలో పనిచేయడానికి తీసుకుని రాబడ్డారు. వీరు పశ్చిమ ఆఫ్రికా, మద్య ఆఫ్రికా ప్రాంతానికి చెందినవారై ఉన్నారు. వీరు ఆఫ్రికాలో పుట్టి స్వల్పకాలం జమైకా, బెర్ముడా లలో నివసించారు. బే ఐలాండర్లు, జమైకా సంప్రదాయానికి చెందిన ప్రజలు 19వ శతాబ్దంలో బెలిజే చేరుకున్నారు. బానిసత్వ కాలంలో ఇంగ్లీష్ భాషను నేర్చుకున్న ఇంగ్లీష్ బెలిజే క్రియోల్ ప్రజలకు ఇంగ్లీష్ వాడుక భాషగా ఉంది. వీరు బెలిజియన్ లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం 45% బెలిజే ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడగలరు. బెలిజే క్రియోల్ ఇంగ్లీష్ నుండి జనించింది. క్రియోల్ భాషలలో స్థానిక అమెరికన్ భాష అయిన మిస్కిటో, పలు పశ్చిమ ఆఫ్రికన్ భాషలు, బంటు భాషలు ఉన్నాయి. ఇవి బానిసల ద్వారా బెలిజెలోకి ప్రవేశించాయి. క్రియోల్స్ బెలిజే అంతటా నివసిస్తున్నారు. అయినప్పటికీ బెలిజే నగరం, సముద్రతీర పట్టణాలు, గ్రామాలు, బెలిజే నదీ ముఖప్రాంతాలలో అధికంగా నివసిస్తుంటారు.

గరినగు

బెలిజ్ 
Traditional Garifuna dancers in Dangriga, Belize

బెలిజెలో గురినగు ప్రజలు 4.5% ఉన్నారు. వీరు పశ్చిమ, ఆఫ్రికన్, అరవాక్, ఐలాండ్ కరీబ్ పూర్వీకత కలిగిఉన్నారు.వీరు బానిసలుగా నమోదుచేయబడలేదు. 1635లో నైకాప్రమాదం నుండి బ్రతికిబయటపడిన వారని ఒక నమోదుచేయబడిన అధ్యయనం సూచిస్తుంది. చరిత్ర అంతటా వారు పొరపాటుగా బ్లాక్ కరిబ్స్‌గా పిలువబడ్డారు. 1763లో జరిగిన ఒప్పందం ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం " సెయింట్ వింసెంట్ , ది గ్రెనాడైంస్ " స్వాధీనం చేసుకున్న తరువాత వారిని ఫ్రెంచ్ వలస ప్రజలు, గరినగు సంకీర్ణం వ్యతిరేకించారు. 1796 నాటికి గరినగు బ్రిటిష్ వారికి లొంగిపోయారు. అధికంగా ఆఫ్రికన్ ప్రజలలా కనిపించే గరిఫ్యునాలను స్థానికప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం వేరుచేసింది. గ్రెనడైన్ ద్వీపం నుండి 5,000 మంది గరినగు ప్రజలు వెలుపలకు తరిమి వేయబడ్డారు. హండూరాస్ సముద్రతీరంలో ఉన్న రోటన్ ద్వీపానికి చేసిన ప్రయాణంలో 2,500 మంది మాత్రమే సజీవంగా గమ్యస్థానానికి చేరారు. గరనగు భాష అరవాకన్ భాషాకుటుంబానికి చెందినది. అయినప్పటికీ గరినగు భాష కరీబియన్, ఆంగ్లభాషల నుండి పలు పదాలను దత్తు తీసుకుంది.

రోటన్ అతి చిన్నద్వీపమే కాక పంటలకు, వ్యవసాయానికి అనుకూలమైనది కాదు కనుక గరినగు ప్రజలు తమను ప్రధాన భూమిలో నివసించశానికి అనుమతించమని హండూరాస్ స్పెయిన్ ప్రభుత్వానికి విఙాపన చేసుకున్నారు. స్పెయిన్ అధికారులు వారికి సైన్యంలో ఉపాధి కల్పించారు. తరువాత వారు మద్య అమెరికాకు చెందిన కరీబియన్ సముద్రతీరమంతటా విస్తరించారు. 1802 నాటికి గరినగు ప్రజలు సైనే బైట్, పుంటా గొర్డా, పుంటా నెగ్రా, బెలిజెలలో స్థిరపడ్డారు. ఒక జన్యు అధ్యయనంలో వారి 76% సబ్ సహరన్ ఆఫ్రికా పూర్వీకత, 20% అరవాక్ (కరీబియన్ ద్వీపం), 4% యురేపియన్ సంప్రదాయ పూర్వీకత ఉందని తెలియజేస్తుంది.

మెస్టిజోలు

మెస్టిజో సాంస్కృతిక ప్రజలలో స్పానిష్, మాయా సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. వారు జాతి కలహాల నుండి తప్పించుకుని 1847లో బెలిజెకు చేరుకున్నారు. యుకాటన్‌లో నివసిస్తున్న వేలాది మాయాప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నప్పుడు చెలరేగిన జాతికలవరాలలో మాయాప్రజలలో మూడవవంతు మూకుమ్మడిగా హత్యచేయబడ్డారు. తప్పించుకున్న మిగిలిన ప్రజలు సరిహద్దులను దాటి బ్రిటిష్ భూభాగానికి చేరుకున్నారు. మెస్టిజోలు బెలిజే అంతటా విస్తరించి ఉన్నారు. అయినప్పటికీ వీరు అధికంగా ఉత్తరప్రాంతంలో ఉన్న కొరొజల్, ఆరంజ్ వాక్‌లో నివసిస్తున్నారు. మెక్సికోలో సమిహ్యాపరంగా అధికంగా ఉన్న మెస్టిజోలు మొత్తం జనసంఖ్యలో సగం ఉన్నారు. మెస్టిజో ప్రజల భాష స్పానిష్. అయినప్పటికీ వీరిలో చాలా మంది ఆంగ్లం, క్రియోల్ భాషలను ధారాళంగా మాట్లాడుతుంటారు. క్రియోల్, ఆంగ్ల భాషలతో కలిసి మెస్టిజోలు అధికంగా కిట్చెన్ స్పానిష్ మాట్లాడుతుంటారు.

ఆహారం , కళలు

బెలిజెలో లాటిన్, మాయా ఆహారసంస్కృతి మిశ్రమంగా టామెల్స్, క్రిమోల్, రెల్లెనో, ఎంపానడాస్ వంటి ఆహారాలు మెక్సికో నుండి బెలిజే చేరాయి. కార్న్ టార్టిలాస్ మాయాల ప్రత్యేకత. మారింబా నుండి సంగీతం వచ్చింది. ప్రజలు గిటారు వాయిస్తూ చక్కగా పాడుతుంటారు. గ్రామీణ ఉత్సవాలలో హాగ్ హెడ్, జపటీడోస్, ది మెస్టిజాడా, పాసో డోబ్లే, పలు ఇతర నృత్యాలు ఉన్నాయి.

జర్మన్ భాషా - మెన్నోనిటీలు

బెలిజెలో 4% ప్రజలు జర్మన్ భాషా మెన్నోనిటీలు ఉన్నారు. వీరిలో వ్యవసాయదారులు, చేతిపనివారు ఉన్నారు. రషన్ మెన్నోనిటీలు 18 - 19 శతాబ్ధాలలో రష్యాలో స్థిరపడిన జర్మన్ సంతతి ప్రజలు. రష్యన్ మెన్నోనిటీలు అధికంగా స్పానిష్ లుక్కౌట్, బెలిజే షిప్‌యార్డ్, లిటిల్ బెలిజే, బ్లూ క్రీక్ మొదలైన మెన్నోనిటీ సెటిల్మెంటు ప్రాంతాలలో నివసిస్తున్నారు.వీరికి దినసరి వాడుక భాషగా జర్మన్ భాషా కుటుంబానికి చెందిన్ ప్లౌట్డియాత్చ్ భాష ఉన్నప్పటికీ బైబిల్ చదవడానికి వ్రాయడానికి జర్మన్ భాషను వాడుతుంటారు.ప్లౌట్డియాత్చ్ భాష మాట్లాడే మెన్నోనిటీలు 1958 తరువాత మెక్సికో నుండి వచ్చి చేరారు.పెన్సిల్వేనియా జర్మన్ భాషను మాట్లాడే మన్నోనిటీ ప్రజలు 1960లో యునైటెడ్ స్టేట్స్, కెనడా నుండి వచ్చి చేరారు. ఆరంభకాలంలో వీరు అప్పర్ బార్టన్ క్రీక్, సంబంధిత సెటిల్మెంట్లలో నివసించారు. అనబాప్టిస్ట్ నేపథ్యం కలిగిన వీరు కొత్త సమూహంగా ఏర్పడ్డారు. వీరు అమిష్ ప్రజలను పోలి ఉన్నప్పటికీ వారికీ వీరికీ మద్య పూర్తి బేధం ఉంది.

ఇతర సమూహాలు

మిగిలిన 5% ప్రజలలో దేశాభివృద్ధి సహాయం కొరకు తీసుకురాబడిన ఇండియన్లు, యునైటెడ్ స్టేట్స్, కెనడా దేశాలకు చెందిన శ్వేతజాతీయులు, పలు దేశాలకు చెందిన ఇతర ప్రజలు ఉన్నారు. 1860లో ఈస్టిండియన్లు ప్రవాహంలా బెలిజెకు వచ్చిచేరారు. వీరిలో జమైకాలో కొంతకాలం నివసించిన వారు, అమెరికన్ అంతర్యుద్ధంలో పాల్గొన్న లూసియానా ప్రజలు ఉన్నారు.20వ శతాబ్దంలో చైనా, భారతదేశం, సిరియా, లెబనాన్ మొదలైన ఆసియన్ దేశాల ప్రజలు బెలిజెకు రావడం మొదలైంది. పాలస్తీనా నుండి వచ్చి స్థిరపడిన వలసదారుని కుమారుడైన సయ్యద్ ముసా 1988 - 2008 వరకు బెలిజే ప్రధానిగా ఉన్నాడు. మద్య అమెరికా వలస ప్రజలు, అమెరికా నుండి బహిష్కరించబడిన ప్రజలు, ఆఫ్రికన్లు బెలిజెలో స్థిరపడడం ఆరంభం అయింది.

విదేశాలకు వలస పోవడం , స్వదేశానికి వలస రావడం

క్రియోల్స్, ఇతర సంప్రదాయ ప్రజలు అధికంగా యునైటెడ్ స్టేట్స్‌, ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు మెరుగైన అవకాశాల కొరకు వలస పోతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో 1,60,000 మంది బెలిజే ప్రజలు ఉన్నారని అమెరికా గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీరిలో 70,000 మంది చట్టబద్ధంగా నివసిస్తున్నారు. వీరిలో క్రియోల్ ప్రజలు, గరినగు ప్రజలు అధికంగా ఉన్నారు.1980లో మద్య అమెరికా దేశాలలో నెలకొన్న కలహాల కారణంగా ఎల్ సల్వేడర్, గౌతమాలా, హండూరాస్ నుండి మెస్టిజో శరణార్ధులు బెలిజే చేరుకున్నారు. ఈ కారణంగా 30 సంవత్సరాల నుండి బెలిజే గణాంకాలలో గుర్తించతగినంత మార్పులు సంభవిస్తున్నాయి.

భాషలు

బ్రిటిష్ కాలనీ రాజ్యంగా బెలిజే అధికార భాష ఆంగ్లం. విద్య, ప్రభుత్వం, అత్యధిక మాద్యమాలలో ఆంగ్లం ప్రధానభాషగా ఉంది.బెలిజియన్లలో సంగం మంది క్రియోల్ ఆధారిత ఆంగ్లం (బెల్జియన్ క్రియోల్) వాడుకభాషగా ఉంది.క్రియోల్, లెక్సిఫియర్ భాషలకు కొనసాగింపుగా లెక్సిఫియర్ భాషా మిశ్రిత క్రియోల్ వాడుకలో ఉంది. 50% బిల్జియన్లు తమను తాము మెస్టిజో, లాటినో, హిస్పానిక్‌లుగా ప్రకటించుకున్నారు. 30% ప్రజలకు స్పెయిన్ వాడుకభాషా ఉంది. బెల్జియన్ బ్రిటిష్ కాలనీగా ఉన్న సమయంలో స్పెయిన్ భాష పాఠశాలలలో రద్దు చేయబడింది. అయినప్పటికీ ప్రస్తుతం స్పెయిన్ భాష ద్వీతీయ భాషగా దేశమంతటా విస్తరించి ఉంది.స్పానిష్, క్రియోల్ మిశ్రిత భాషను స్పానింగ్లీష్ భాషగా పిలుస్తున్నారు.ఇది ఉత్తరభూభాగంలో ఉన్న కొరొజల్, పెడ్రో ప్రాంతాలలో వాడుకలో ఉంది. సంగం కంటే అధికమైన ప్రజలు బహుభాషలలో ప్రావీణ్యత కలిగి ఉన్నారు. స్పానిష్ వాడుక భాషగా ఉన్న దేశాల మద్య బహుసంప్రదాయ ప్రజలతో ఉన్న బెలిజెలో భాహుభాషాప్రావీణ్యత ప్రోత్సహించబడుతుంది. బెలిజెలో క్యూ ఎక్విచి, మోపన్, యుకాటెక్ అనే మూడు మాయాభాషలు వాడుకలో ఉన్నాయి. దాదాపు 16,100 ప్రజలు అరవాకన్ ఆధారిత గరినగు భాష వాడుకలో ఉంది. బెలిజెలో 6,900 మంది ప్రజలకు మెనానిటీలు ప్లౌట్డిస్ట్చ్ భాష వాడుకలో ఉంది. అల్పసంఖ్యాక మెనానిటీలలో పెంసిల్వేనియా జర్మన్ వాడుకలో ఉంది.

మతం

Religion in Belize – 2010 Census
Religion percent
Roman Catholic
  
40.1%
Protestant
  
31.8%
Jehovah's Witnesses
  
1.7%
Other religion
  
10.3%
No religion
  
15.5%

2010 గణాంకాల ఆధారంగా బెలిజే ప్రజలలో రోమన్ కాథలిక్కులు 40.1%, ప్రొటెస్టెంట్లు 31% (ప్రొటెకోస్టల్ 8.4%, ఆగ్లికన్ 4.7%, మెన్నోనిటీ 3.7%, బాప్టిస్టులు 3.6%, మెథడిస్టులు 2.9%, చర్చి ఆఫ్ ది నజరెనె), జెహోవాస్ విట్నెస్ 1.7%, మిగిలినవారు ఇతర మతానికి (మాయా మతం, గరిఫ్యూనా మతం, ఒబీచ్, మ్యాలిజం, మొర్మంస్ అల్పసంఖ్యాకులు, హిందువులు, బౌద్ధులు, ముస్లిములు, బహాలు, రాస్టఫరియన్లు, ఇతరులు), నాస్థికులు ఉన్నారు. 1990 వరకూ బెలిజే రోమన్ కాథలిక్కులు అధికంగా ఉన్న దేశంగా భావించబడింది.1991లో 57% ఉన్న రోమన్ కాథలిక్కులు 2000 నాటికి 47% చేరుకున్నారు. ప్రొటెస్టెంటు చర్చీలు అధికమైన కారణంగా, నాస్థికులు అధికమైన రోమన్ కాథలిక్కుల సంఖ్య క్షీణించసాగింది. బెలిజెలో రోమన్ కాథలిక్కుల తరువాత ప్రొటెస్టెంట్లు అధికంగా ఉన్నారు. దీనిని బ్రిటిష్ ప్రజలు, జర్మన్ ప్రజలు, బ్రిటిష్ కాలనీలో స్థిరపడిన హండూరా ప్రజలు బెలిజెకు తీసుకువచ్చారు.దీనిని ఆంగ్లికన్లు, మెన్నోనిటీలు అనుసరిస్తున్నారు. ప్రొటెస్టెంట్లు బెలిజెలో పెంటెకోస్టా, సెవెంత్ డే అడ్వెంచరిస్టు ప్రాంతంలో స్థిరపడ్డారు. సమీపకాలంలో ఎవాంజికల్ ప్రొటెస్టెంట్లు లాటిన్ అమెరికా అంతటా నివసిస్తున్నారు. జర్మన్ మెన్నోనిటీలు సుదూరంలోని కేయో, ఆరంజ్ వాక్ ప్రాంతంలో నివసిస్తున్నారు.ది గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి శాంటా ఎలెనాలో అధికంగా నివసిస్తున్నారు. బెలిజెలో 7,776 మంది బాహా ప్రజలు నివసిస్తున్నారని " ది అసోసియేషన్ ఆఫ్ రిలీజియన్ డేటా ఆర్చివ్స్ " 2005 అంచనాలు తెలియజేస్తున్నాయి. వారు బహాలు అత్యధికంగా నివసిస్తున్న ఏకైకదేశం బెలిజే అని చెప్తున్నారు. ఈ వివరాలు బహా బెలిజెలో రెండవ స్థానంలోనూ తరువాత స్థానంలో హిదూయిజం (2.0%), మూడవ స్థానంలో జ్యూడిజం (1.1%) ఉన్నాయి. భారతీయ వలసప్రజలు అధికంగా హిదూమతం అవలంభిస్తున్నారు, ముస్లిములు ఆఫ్రికా నుండి బానిసలద్వారా బెలిజెలో ప్రవేశించింది. వారు బెలిజెలో ప్రవేశించడానికి ఇతర ఆధారాలు లభించలేదు. 1980లో మొదలైన ముస్లిముల రాక 2000 నాటికి వారి సంఖ్య 243 చేరింది, 2010 నాటికి వారి సంఖ్య 577కు చేరింది. వీరి శాతం 0.16% ఉంది. ఇస్లామిక్ మిషన్ ఆఫ్ బెలిజెలో ఒక మసీదు ఉంది. 2008లో మసీదు అల్- ఫలాహ్ బెలిజే నగరంలో అధికారికంగా ప్రారంభించబడింది.

ఆరోగ్యం

బెలిజెలో అంటువ్యాధి అయిన మలేరియా, శ్వాససంబంధిత వ్యాధులు, ఇంటెస్టినల్ ఇల్‌నెస్ ప్రాబల్యత అధికంగా ఉంది.

విద్య

బెలిజెలో కిండర్ గార్టెన్, సెకండరీ, టెరిటరీ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. వీటిలో అధికమైన పాఠశాలలు ప్రభుత్వం చేత స్థాపించబడ్డాయి. బెలిజెలో డజన్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో " యూనివర్శిటీ ఆఫ్ బెలిజె " అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంది. 6-14 సంవత్సరాల వరకు బెలిజెలో నిర్భంధ విద్య అమలులో ఉంది. బెలిజే అక్షరాస్యత 79.7%. పశ్చిమార్ధగోళంలో అక్షరాస్యత తాక్కువగా ఉన్న దేశాలలో బెలిజే ఒకటి. బెలిజెలో విద్యావిధానం " ఎజ్యుకేషన్ సెక్టర్ స్ట్రేటజీ 2011-2016 "ను అనుసరిస్తుంది. ప్రభుత్వ విద్యాశాఖ విద్యార్థులకు సాంకేతిక , ఒకేషనల్ విద్యను అందిస్తుంది.

నేరం

బెలిజెలో నేరాలు అత్యధికస్థాయిలో నమోదౌతున్నాయి. వీటిలో అధికంగా మాదకద్రవ్యాల అక్రమరవాణా, విక్రయం, మాదకద్రవ్యమార్గాల రక్షణ మాదకద్రవ్యవిక్రయ ప్రాంతాల రక్షణ సంబంధిత నేరస్థుల ముఠాల సంబంధిత కేసులు ఉంటాయి.2015లో 119 హత్యలు నమోదయ్యాయి. ప్రతి లక్షమందిలో 34 గృహాంతరహత్యలు (హోమీసైడ్) నమోదౌతున్నాయి. ప్రంపంచంలో గృహాంతరహత్యలు అధికంగా జరుగుతున్న దేశాలలో బెలిజె ఒకటి. అయినా పొరుగున ఉన్న గౌతమాలా, హండూరాస్, ఎల్.సల్వృడర్ కంటే ఇది తక్కువ. బెలిజె లోని ఇతర నగరాలతో పోల్చి చూస్తే బెలిజెలో హత్యలు అధికంగా జరుగుతున్నాయి. 2007లో బెలిజెలో జరిగిన హత్యలలో 57% బెలిజె జిల్లాలో నమోదయ్యాయి. బెలిజెలో జరుగుతున్న హత్యలు అధికంగా వర్గపోరాటం కారణంగా సంభవిస్తున్నాయి.2015లో 40 మానభంగాలు, 214 దోపిడీలు, 742 దారిదోపిడీ , 1047 దొంగతనాలు నమోదయ్యాయి. బెలిజె పోలీస్ నేరాలను తగ్గించడానికి అనుమానిత ప్రాంతాలలో పెట్రోలింగ్ అధికం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.నేరం జరగకుండా అడ్డగించడానికి " డూ ది రైట్ తింగ్ ఫర్ యూత్స్ ఎట్ రిస్క్ " ప్రోగ్రాం, క్రైం ఇంఫర్మేషన్ హాట్ లైన్, యాబ్రా సిటిజెన్ డెవెలెప్మెంటు కమిటీ రూపకల్పన (యువతకు సహకారం అందించే సేవా సంస్థ) మొదలైన కార్యక్రమాలు ఆరంభించారు.బెలిజె పోలీస్ నేరస్థులను లక్ష్యంగా తీసుకుని ప్రారంభించిన " నేరవ్యతిరేక క్రిస్మస్ యుద్ధం " (యాంటీ క్రైం క్రిస్మస్ కంపాజిన్) తరువాత ఆమాసంలో నేరాలసంఖ్య పతనం అయింది. దేశంలో నేరాల స్థాయి తగ్గించడానికి 2011లో గ్యాంగుల మద్య ప్రభుత్వం సంధిచేయడానికి ప్రయత్నించింది.

సంస్కృతి

బెలిజె సాంఘిక నిర్మాణం అధికార వితరణ, సంపద వితరణ , అంతస్తులలో బేధం అత్యధికంగా కలిగి ఉంది. స్వల్పజనసంఖ్య కలిగిన బెలిజె దేశంలో ధనిక పేద వర్గాల మద్య బేధం అధికంగా ఉంది. కరీబియన్ , మద్య అమెరికా లోని జమైకా , ఎల్ సల్వేడర్ కంటే ఈబేధం బెలిజెలో అధికంగా ఉంది. బెలిజెలో హింసాపూరిత , వర్గకక్ష్యలతో కూడిన ప్రజలు అధికంగా ఉన్నారు. రాజకీయ , ఆర్థిక అధికారాలు అధికంగా ప్రాంతీయ ప్రముఖులుగా ఉన్న శ్వేతజాతీయులు, క్రియోల్ , మెస్టిజోలకు ఉంది. మద్య తరగతికి చెందిన ప్రజలు బహుళసంప్రదాయాలకు చెందినవారై ఉన్నారు. మద్యతరగతికి చెందిన శ్రామిక ప్రజలకు విద్య, గౌరవం, పరపతి , ఉన్నత వర్గాల స్థాయికి ఎదగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

మహిళలు

2013లో " ది వరల్డ్ ఫోరెం " బెలిజ్‌ను " గ్లోబల్ జండర్ గ్యాప్ " (మహిళల పట్ల వివక్ష) లో 131వ స్థానంలో (మొత్తం 135) ఉన్నట్లు పేర్కొన్నది.లాటిన్ అమెరికా, ది కరేబియన్ దేశాలలో బెలిజే 3వ స్థానంలో ఉంది. ప్రాథమిక పాఠశాలలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలలు:బాలికల నిష్పత్తిలో బెలిజే దిగువస్థానంలో ఉంది. 2013లో ఐక్యరాజ్యసమితి జండర్ గ్యాప్ ఇండెక్స్ బెలిజే 148 దేశాలలో 79 వ స్థానంలో ఉందని పేర్కొన్నది. 2013 గణాంకాల ఆధారంగా బెలిజెలో మహిళలలో 48.3% ఉద్యోగాలు చేస్తున్నారని పురుషులలో 81.8% ఉద్యోగాలు చేస్తున్నారని తెలియజేస్తున్నాయి. బెలిజే నేషనల్ అసెంబ్లీలో మహిళలు 13.3% భాగస్వామ్యం వజిస్తున్నారు.

మూలాలు

బయటి లింకులు

Belize గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

బెలిజ్  నిఘంటువు విక్షనరీ నుండి
బెలిజ్  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
బెలిజ్  ఉదాహరణలు వికికోట్ నుండి
బెలిజ్  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
బెలిజ్  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
బెలిజ్  వార్తా కథనాలు వికీ వార్తల నుండి


Tags:

బెలిజ్ పేరు వెనుక చరిత్రబెలిజ్ చరిత్రబెలిజ్ భౌగోళికంబెలిజ్ జియాలజీ, ఖనిజసంపద , విద్యుత్తుబెలిజ్ వాతావరణంబెలిజ్ ఆర్ధికంబెలిజ్ పర్యాటకంబెలిజ్ గణాంకాలుబెలిజ్ విద్యబెలిజ్ నేరంబెలిజ్ సంస్కృతిబెలిజ్ మూలాలుబెలిజ్ బయటి లింకులుబెలిజ్en:British Hondurasen:Central Americaen:Maya civilizationగౌతమాలామెక్సికో

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మకుమ్మరి (కులం)ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావింధ్య విశాఖ మేడపాటిజమ్మి చెట్టుశేఖర్ మాస్టర్పి.సుశీలద్వాదశ జ్యోతిర్లింగాలుహనుమజ్జయంతిభీమా (2024 సినిమా)ప్రేమ (1989 సినిమా)విభీషణుడువిమానంత్రిష కృష్ణన్ఉత్తర ఫల్గుణి నక్షత్రముఢిల్లీ డేర్ డెవిల్స్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)తులసీదాసుభారతదేశ పంచవర్ష ప్రణాళికలురేణూ దేశాయ్విశాల్ కృష్ణఆర్టికల్ 370 రద్దుకరక్కాయవిష్ణువు వేయి నామములు- 1-1000రాజస్తాన్ రాయల్స్విద్యదశావతారములువినుకొండసీ.ఎం.రమేష్సజ్జా తేజఅక్కినేని నాగార్జునవాణిశ్రీపూజా హెగ్డేతమలపాకుతెలుగు భాష చరిత్రకలువభారత రాజ్యాంగ పీఠికవిశ్వబ్రాహ్మణభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంతెలుగు వికీపీడియాడీజే టిల్లుఉష్ణోగ్రతపసుపు గణపతి పూజచంపకమాలఅనుష్క శెట్టిPHశుక్రుడురావణుడుసామెతల జాబితాలలితా సహస్ర నామములు- 1-100పరిసరాల పరిశుభ్రతతెలంగాణ ఉద్యమంగ్రామ పంచాయతీఅమిత్ షాతమిళనాడుఅర్జునుడుతెల్ల గులాబీలునితీశ్ కుమార్ రెడ్డిభూమన కరుణాకర్ రెడ్డిభారత రాజ్యాంగ సవరణల జాబితాఆంధ్రప్రదేశ్ శాసనసభపరిటాల రవిసీత్లగౌడఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంభామావిజయంభద్రాచలంశ్రీముఖివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)వెలమజై శ్రీరామ్ (2013 సినిమా)రమణ మహర్షినారా లోకేశ్దర్శి శాసనసభ నియోజకవర్గంమాగుంట శ్రీనివాసులురెడ్డి🡆 More