డీహైడ్రేషన్: శరీరంలో నీరు క్షీణించడం

డీహైడ్రేషన్ (Dehydration) అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం.

దీని వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీనినే తెలుగులో జలహరణం అనవచ్చు.

డీహైడ్రేషన్
డీహైడ్రేషన్: లక్షణాలు, కారణాలు, నివారణ
డీహైడ్రేషన్, కలరా వలన కలిగిన హైపోవోలెమియా తగ్గించడానికి నోటి ద్వారా రీహైడ్రేషన్ ద్రావణాన్ని రోగికి తాగిస్తున్న నర్సు. కలరా వచ్చినపుడు నీరు (డీహైడ్రేషన్), సోడియం రెండింటినీ కోల్పోతారు.
ప్రత్యేకతఅత్యవసర వైద్య చికిత్స

ఇది సాధారణంగా శరీరంలోనికి వెళ్ళే నీటికన్నా బయటికి వెళ్ళే నీరు ఎక్కువైనప్పుడు సంభవిస్తుంది. మితిమీరిన వ్యాయామం, వ్యాధులు, అత్యంత వేడి వాతావరణం దీనికి ముఖ్యమైన కారణాలు. వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

శరీరంలోని మొత్తం నీటిలో 3-4% ఆవిరైపోయినా మనుష్యుల్లో చాలావరకు తట్టుకోగలరు. 5-8% నష్టం అయితే కళ్ళు తిరగడం, అలసట సంభవిస్తాయి. నష్టం 10% కి మించితే భౌతికంగా మానసికంగా క్షీణించిపోతారు. విపరీతమైన దాహం వేస్తుంది. 15-25% నీరు పోతే మరణం సంభవిస్తుంది. ఒక మాదిరి డీహైడ్రేషన్ అయితే కొంచెం అసౌకర్యంగా, దాహంగా ఉంటుంది. దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ (ప్రత్యేకమైన ద్రవపదార్థాల్ని సేవింపజేయడం) ద్వారా పరిష్కరించవచ్చు.

లక్షణాలు

బాగా దాహం వేయడం, తలనొప్పి, అసౌకర్యంగా అనిపించడం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం, మానసికంగా గందరగోళం, ఏ కారణంలేకుండానే అలసటగా ఉండటం, గోళ్ళు ఊదారంగులోకి తిరగడం, మూర్ఛ మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు. శరీరంలో నీటి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి.

కారణాలు

ఎండ, తేమ శాతం ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఎక్కువగా తిరిగేవారు, ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారు, శ్రమతో కూడిన పనులు, వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొనేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొన్ని రకాల మందుల వాడకం ద్వారా కూడా డీహైడ్రేషన్కు గురి కావచ్చు.

నివారణ

సాధారణ స్థాయిలో పనిచేస్తున్నపుడు దాహం వేసినప్పుడల్లా నీరు త్రాగుతుంటే డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు. కనీసం ఎంత నీరు తీసుకోవాలి అనేది సదరు వ్యక్తి బరువుపైన, వాతావరణంపైన, తీసుకునే ఆహారంపైన, జన్యులక్షణాల మీద ఆధారపడి ఉంటుంది.

మూలాలు

బాహ్య లంకెలు

Classification
External resources


Tags:

డీహైడ్రేషన్ లక్షణాలుడీహైడ్రేషన్ కారణాలుడీహైడ్రేషన్ నివారణడీహైడ్రేషన్ మూలాలుడీహైడ్రేషన్ బాహ్య లంకెలుడీహైడ్రేషన్జీవక్రియ

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.ఎస్.వివేకానందరెడ్డిఈశాన్యంసింధూ నదికాళేశ్వరం ఎత్తిపోతల పథకంఅనసూయ భరధ్వాజ్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాకృత్రిమ మేధస్సుతిరుపతిఅలంకారముఅనంత శ్రీరామ్నివేదా పేతురాజ్వ్యవసాయంనవరత్నాలుతిథిజీమెయిల్సమ్మక్క సారక్క జాతరదక్షిణామూర్తివినుకొండగన్నేరు చెట్టుషేర్ మార్కెట్బి.ఆర్. అంబేడ్కర్సాయిపల్లవికర్మ సిద్ధాంతంతెలుగు వికీపీడియానువ్వు నేనుజ్యోతీరావ్ ఫులేఉత్తర ఫల్గుణి నక్షత్రముదాశరథి రంగాచార్యరాజ్యసంక్రమణ సిద్ధాంతంషోయబ్ ఉల్లాఖాన్పాములపర్తి వెంకట నరసింహారావుచోళ సామ్రాజ్యంనారదుడుఅల్లు అర్జున్సంగీతంచదరంగం (ఆట)భారత క్రికెట్ జట్టుఛత్రపతి శివాజీకంటి వెలుగుఆంధ్రప్రదేశ్ గవర్నర్లుశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)రోహిత్ శర్మఅంజూరంఏప్రిల్ 29తెలుగు శాసనాలుడింపుల్ హయాతినాని (నటుడు)పసుపు గణపతి పూజదుర్యోధనుడుశ్రీరామనవమిరాజమండ్రిమేషరాశిమండల ప్రజాపరిషత్సముద్రఖనిధనిష్ఠ నక్షత్రముసిలికానాంధ్ర విశ్వవిద్యాలయంగంగా పుష్కరంరోహిణి నక్షత్రంఐక్యరాజ్య సమితికాశీతేలుకొండగట్టుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమిషన్ భగీరథభారత రాజ్యాంగ పీఠికపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)సన్ రైజర్స్ హైదరాబాద్ధూర్జటికేదార్‌నాథ్ ఆలయంపనసనవధాన్యాలుకరికాల చోళుడుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షగవర్నరువెల్లుల్లిఆశ్లేష నక్షత్రముబలి చక్రవర్తికాంచన🡆 More