వ్యాయామం

|నీటిలో పరుగెత్తుతున్న అమెరికా సైనికుడు.]] వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ.

వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల వారికి ఇది తోడ్పడుతుంది. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి కూడా దూరం చేస్తుంది. బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం.

రకాలు

వ్యాయామాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును.

  • కండరాలు, కీళ్ళు కదలికలు సులభంగా జరిగేందుకు ఉపకరించే వ్యాయామం.
  • వాయుసహిత వ్యాయామాలు: సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి.
  • వాయురహిత వ్యాయామాలు: కసరత్తులు, బరువుతగ్గడానికి యంత్రాల సహాయంతో చేసే వ్యాయామాలు.

ఉపయోగాలు

  • వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాల అవసరం. మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
  • దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.

విద్యార్థులకు వ్యాయామ ఉపయోగాలు

టీనేజిలో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజూ కాస్తంత వ్యాయామం చేస్తే.. వాళ్లకు సైన్సులో మంచి మార్కులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో అంత ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధకులు తెలిపారు. 5వేల మంది పిల్లల మీద పరిశోధన చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు. 1991 నుంచి 1992 వరకు ఇంగ్లండ్ లో పుట్టిన 14వేల మంది పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని గమనించి మరీ ఈ విషయాన్ని తేల్చారు. యాక్సెలరోమీటర్ అనే పరికరాన్ని వారికి అమర్చి మూడునుంచి ఎనిమిది రోజుల వరకు వారి వ్యాయామాల తీరును లెక్కించారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో వారికి వచ్చిన మార్కులు చూడగా.. సైన్సు మార్కులలో మంచి మెరుగుదల కనిపించింది. అందులోనూ అమ్మాయిలకు ఈ మార్కుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

వ్యాయామం రకాలువ్యాయామం ఉపయోగాలువ్యాయామం విద్యార్థులకు వ్యాయామ ఉపయోగాలువ్యాయామం ఇవి కూడా చూడండివ్యాయామం మూలాలువ్యాయామంకండరాలుక్రీడరక్త ప్రసరణ వ్యవస్థ

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆది శంకరాచార్యులుతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంమహమ్మద్ సిరాజ్భారత రాజ్యాంగ సవరణల జాబితాహనుమాన్ చాలీసావిడదల రజినితెలుగు సంవత్సరాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిశివ కార్తీకేయన్పూర్వాభాద్ర నక్షత్రమురోహిత్ శర్మభారత జాతీయ కాంగ్రెస్కాళోజీ నారాయణరావుకుప్పం శాసనసభ నియోజకవర్గంటెట్రాడెకేన్ఆశ్లేష నక్షత్రముఅచ్చులుతూర్పు చాళుక్యులురామ్ చ​రణ్ తేజప్రీతీ జింటారత్నం (2024 సినిమా)రమ్య పసుపులేటిసంధిఅర్జునుడుశుక్రుడు జ్యోతిషంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శతభిష నక్షత్రముతెలుగు సినిమాలు 2023బద్దెనప్రియ భవాని శంకర్చాట్‌జిపిటిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరాహువు జ్యోతిషంజ్యేష్ట నక్షత్రంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంశిబి చక్రవర్తిజీలకర్రభారతదేశంబంగారంభారతరత్నన్యుమోనియాతులారాశిఉప్పు సత్యాగ్రహంవిద్యుత్తుతెలుగు నెలలుపురాణాలుభారత రాజ్యాంగ ఆధికరణలుతెలుగు సినిమాకాశీసునీత మహేందర్ రెడ్డిమొఘల్ సామ్రాజ్యంఅన్నమయ్య జిల్లాపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాయోనిదినేష్ కార్తీక్విశాఖపట్నంగూగ్లి ఎల్మో మార్కోనిఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుపెళ్ళి చూపులు (2016 సినిమా)చంద్రుడుకనకదుర్గ ఆలయంసునాముఖిహస్త నక్షత్రమువై.యస్.అవినాష్‌రెడ్డిలావు శ్రీకృష్ణ దేవరాయలుకీర్తి సురేష్ఎల్లమ్మఘిల్లిశాసనసభ సభ్యుడువిజయశాంతివిష్ణువు వేయి నామములు- 1-1000మహాకాళేశ్వర జ్యోతిర్లింగంస్వామి రంగనాథానందభూమిప్రధాన సంఖ్యమర్రి🡆 More