వినుకొండ

వినుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని ఒక పట్టణం, వినుకొండ మండలానికి కేంద్రం.

వినుకొండ
విష్ణుకుండినపురం, శ్రుతగిరి
పట్టణం
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర
వినుకొండ is located in Andhra Pradesh
వినుకొండ
వినుకొండ
Location in Andhra Pradesh, India
Coordinates: 16°03′N 79°45′E / 16.05°N 79.75°E / 16.05; 79.75
Countryభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
పట్టణం29 May 2015
Government
 • Typeపురపాలక సంఘం
Area
 • Total22.82 km2 (8.81 sq mi)
Elevation
95 మీ (312 అ.)
Population
 (2011)
 • Total59,725
 • Density2,600/km2 (6,800/sq mi)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
522 647
Vehicle registrationAP-07

చరిత్ర

వినుకొండ అన్న పేరు, శ్రీరాముడు సీతాదేవి అపహరణ గురించి వినడం జరిగింది కాబట్టి విను అన్న క్రియను బట్టి ఆ పేరు వచ్చిందని లోకనిరుక్తి ఉంది. ఈ నిరుక్తిని అనుసరించి తెలుగు, సంస్కృత పండితులు ఈ పేరును సంస్కృతీకరించి శృతగిరి పురం (శృత= విను, గిరి= కొండ, పురం= పట్టణం/నగరం) అన్న పదం కల్పించారు.

మెగాలిథిక్ కట్టడాలు పట్టణం చుట్టుప్రక్కల కనుగొనబడ్డాయి.[ఆధారం చూపాలి] 1000–1400 CE నాటి శిలాశాసనాలు చాలా పురాతన దేవాలయాలలో వున్నాయి. విష్ణుకుండినులనబడే రాజులు ఈ ప్రాంతాన్ని 1000 CE కాలంలో పరిపాలించారు. [ఆధారం చూపాలి] మధ్యయుగంలో కొండపై కోట వుండేది. 1640 లో నిర్మించిన జామియా మసీదు మహమ్మదీయ పాలకుల గుర్తుగా మిగిలివుంది.

భౌగోళికం

జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి నైరుతి దిశలో 44 కి.మీ. దూరంలో వుంది.

జనగణన వివరాలు

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 59,725.

పరిపాలన

1952లో వినుకొండ శాసనసభ్యులుగా గెలుపొందిన పులుపుల వెంకటశివయ్య, 1953లో వినుకొండ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైనాడు. రెండు పదవులలో 1955 దాకా ఉన్నాడు. సర్పంచిగా 1964 వరకూ పనిచేశాడు. 1962లో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొంది శాసనసభ్యులుగా 8 ఏళ్ళు పనిచేశాడు. సర్పంచిగా 11 ఏళ్ళు పనిచేశాడు. నిరాడంబరుడైన ఇతని స్మృతి చిహ్నంగా పట్టణం నడిబొడ్డున స్మారకస్థూపం ఏర్పాటుచేశారు. పఠాన్ కాశింఖాన్ వినుకొండ గ్రామ సర్పంచిగా 20 ఏళ్ళు పనిచేశాడు. 29.1.2018 న ఇతని విగ్రహం కోటనాల బజారులో నెలకొల్పారు. ఇతను పులుపుల వెంకటశివయ్య శిష్యుడు.

2005 మే 29 న మూడవ గ్రేడ్ పురపాలక పట్టణం గా గుర్తింపు పొందింది. 2018 లో రెండవ గ్రేడ్ పురపాలక పట్టణం గా మార్చబడింది. మాచర్ల పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యం

Map

పట్టణం రోడ్ల మొత్తం నిడివి106.70 km (66.30 mi). ఈ పట్టణం గుంటూరు -కర్నూలు -బళ్లారి ప్రధాన రహదారిపై వుంది. రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే లోని గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గుంటూరు - గుంతకల్ రైలు మార్గం పై వుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

దేవాలయాలు

  • శ్రీ ప్రసన్న రామలింగేశ్వరస్వామివారి ఆలయం: కొండమీద ఉంది
  • శ్రీ మదమంచిపాటి వీరాంజనేయస్వామివారి ఆలయం: వినుకొండకు ఏడు కి.మీ.దూరంలో, గుండ్లకమ్మ నదీ తీరాన వున్నది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు, స్వామివారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహించుచున్నారు. . ఈ తిరునాళ్ళ సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు.
  • శ్రీ రంగనాయక స్వామి దేవాలయం, పద్మావతి సమేత వెంకటేశ్వర దేవాలయం, తిమ్మాయపాలెం: వినుకొండ పట్టణానికి కేవలం 3 కిలోమీటర్లు దూరంలో ఉన్న తిమ్మాయపాలెం గ్రామములో శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించాడు. ఆ దేవాలయాల చుట్టూ పచ్చని పొలాలు,కోనేరు అలాగే తిమ్మాయపాలెం కొండ, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి కొన్నేళ్ల క్రితం తిమ్మాయపాలెం గ్రామస్థులు అక్కడ తిరునాళ్లు జరిపేవారు

వందేళ్ల చరిత్ర ఉన్న చెట్లు

  • వినుకొండ పట్టణానికి అతి చేరువగా ఉన్న విఠంరాజుపల్లె వాటి పుట్టిల్లు. నరసరావుపేట రోడ్డు అంచున గుబురుగా కనిపిస్తాయి. చెరువు గట్టు మీద ఉండటంతో చల్లటి ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామస్థులు, ప్రయాణికులు ఏ మాత్రం ఖాళీ ఉన్నా ఈ చెట్టు నీడలో సేదదీరుతారు. వేసవిలో ఖాళీ ఉండకుండా ఉంటారు.
  • వివాహానికి ముందు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచే ప్రతి ఒక్కరూ మార్కాపురం రోడ్డులో ఉన్న రావిచెట్టుకు పూజలు చేయాల్సిందే. ఇక్కడ పూర్వకాలం నుంచి వేపచెట్టు, రావిచెట్టు కలిసి ఉండేవి. రెండింటినీ కలిపి పూజించి వాటికి పెళ్ళిచేస్తే కొత్త దంపతులకు దోషాలు అన్నీ పోతాయన్నది ఇక్కడి వారి నమ్మకం. ఇటీవల రోడ్డు విస్తరణలో వేపచెట్టు మాయమైంది. మిగిలిన ఒక్క చెట్టుకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి.
  • ఏనుగుపాలెం రోడ్డులో గోనుగుంట్లవారిపాలెం ఉంది. గతంలో ఇక్కడ ఊరు ఉండేది కాదు. హసన్నాయునిపాలెం, పెదకంచర్ల గ్రామాల నుంచి వలస వచ్చి ఇళ్లు కట్టుకున్నారు. ఆర్‌.అండ్‌.బి. రోడ్డు అంచున పెద్ద రావి చెట్టు ఉంది. పక్క గ్రామాల ప్రజలు అక్కడే బస్సు దిగి వెళ్లే వారు. .
  • పట్టణంలోని అంకాళమ్మ గుడి ముందు ఏపుగా ఎదిగిన రావిచెట్టుకు వందేళ్లు ఉన్నాయి. నరసరావుపేట జమీందారు కాలంలో నిర్మించిన ఈ గుడికి నిత్యం వచ్చే భక్తులు అమ్మవారితోపాటు చెట్టును కూడా పూజించడం విశేషం. 108 సార్లు ప్రదిక్షణం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది ఇక్కడి వారి విశ్వాసం. చెట్టు కింద ఎత్త్తెన అరుగు వేశారు. అటు దానికి రక్షణ ఇటు ప్రజలకు ఉపయోగం ఒనగూరుతోంది.
  • ముళ్లమూరు బస్టాండులో శృంగారవనం ముందు మహాలక్ష్మమ్మ చెట్టు ఉంది. దీనికి నిత్య పూజలు చేస్తారు. ప్రారంభంలో వేప చెట్టు వరకు ఉండేది. ఇప్పుడు చుట్టుపక్కల వ్యాపారులు, ప్రజలు అరుగు కట్టించి అక్కడ అమ్మవారికి చిన్న గుడి కట్టించారు. ఏటా తొలిఏకాదశి నాడు చెట్టుకు విద్యుత్తు బల్బులు అలంకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

విశేషాలు

వినుకొండ పాలు, స్వీట్స్

నాణ్యత, రుచికి వినుకొండ పాలు ప్రసిద్ధి. మెట్ట ప్రాంతం కావడంతో పాలు నాణ్యంగా, అత్యంత ప్రత్యేకంగా ఉంటాయని పశు వైద్యాధికారులు నిర్ధారించారు. పాలలో వెన్న, ఇతర పదార్థాలు (ఎస్‌.ఎన్‌.ఎఫ్‌.) అత్యధికంగా ఉండటంతో 90 శాతం డెయిరీలు ఇక్కడి పాలను సేకరించేందుకు మక్కువ చూపుతున్నాయి. ఇక్కడి పాలు గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. సంగం డెయిరీ, హెరిటేజ్‌, తిరుమల, జెర్సీతోపాటు మొత్తం ఆరు పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

ప్రముఖులు

నోట్స్

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

వినుకొండ చరిత్రవినుకొండ భౌగోళికంవినుకొండ జనగణన వివరాలువినుకొండ పరిపాలనవినుకొండ రవాణా సౌకర్యంవినుకొండ దర్శనీయ ప్రదేశాలుదేవాలయాలువినుకొండ ప్రధాన పంటలువినుకొండ విశేషాలువినుకొండ ప్రముఖులువినుకొండ నోట్స్వినుకొండ మూలాలువినుకొండ వెలుపలి లంకెలువినుకొండఆంధ్ర ప్రదేశ్పల్నాడు జిల్లావినుకొండ మండలం

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)మీనరాశిబలి చక్రవర్తిజాతిరత్నాలు (2021 సినిమా)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవికీపీడియాపరిపూర్ణానంద స్వామివెలిచాల జగపతి రావుతిరుపతికృత్తిక నక్షత్రముభగత్ సింగ్PHవృశ్చిక రాశిఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుదసరాజాషువాతెలుగు నెలలుకులంవిష్ణువు వేయి నామములు- 1-1000పొంగూరు నారాయణఉత్తర ఫల్గుణి నక్షత్రమువిశ్వబ్రాహ్మణగోల్కొండసరోజినీ నాయుడుగోత్రాలు జాబితాఉదయకిరణ్ (నటుడు)శ్రీలలిత (గాయని)సుభాష్ చంద్రబోస్సమంతహైదరాబాదుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకూచిపూడి నృత్యంపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంవై.యస్.అవినాష్‌రెడ్డితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకాలేయంరమణ మహర్షిభీమా (2024 సినిమా)భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితామహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవై.యస్.భారతిదూదేకులనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంనర్మదా నదిజవహర్ నవోదయ విద్యాలయం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లక్ష్మిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థశ్రీవిష్ణు (నటుడు)కొబ్బరిషర్మిలారెడ్డిసెక్స్ (అయోమయ నివృత్తి)లలితా సహస్రనామ స్తోత్రంకంప్యూటరురాప్తాడు శాసనసభ నియోజకవర్గంఅనుష్క శెట్టికిలారి ఆనంద్ పాల్ఆవర్తన పట్టికదాశరథి కృష్ణమాచార్యమానవ శరీరముహల్లులుహైపర్ ఆదిమాళవిక శర్మఉపనయనముఆంధ్రప్రదేశ్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంకల్వకుంట్ల కవితఫ్యామిలీ స్టార్ఉమ్మెత్తయతిశుక్రుడుకీర్తి రెడ్డినయన తారభాషా భాగాలుదగ్గుబాటి వెంకటేష్🡆 More