మడగాస్కర్

మడగాస్కర్ లేదా రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్ (ఆంగ్లం : Madagascar, లేదా Republic of Madagascar (పాతపేరు : మలగాసీ రిపబ్లిక్), హిందూ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం, ఆఫ్రికా ఖండపు ఆగ్నేయ తీరంలో గలదు.

ప్రపంచంలో గల జంతుజాలాలలో 5% జంతుజాలాలు ఈ దేశంలోనే గలవు. ప్రాచీన హిందువులు తూర్పున మలే ద్వీపకల్పం మొదలుకొని జావా, సుమత్రా దీవుల నుంచి పశ్చిమంలో మడగాస్కర్ ద్వీపం వరకు తమ వ్యాపారవాణిజ్యాలు విస్తరించారు. (ఫ్రెంచి: రిపబ్లిక్ దే మడగాస్కర్) తూర్పు ఆఫ్రికా తీరంలో సుమారు 400 కిలోమీటర్ల (250 మైళ్ళు) దూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం. ఈ దేశం మడగాస్కర్ ద్వీపం (ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ద్వీపం) గా ఉంది. ఒక చిన్న ద్వీపసమూహాన్ని అంతర్భాగంగా ఉంది. గతంలో మలగసి రిపబ్లికు అని పిలువబడింది. మహాఖండం గోండ్వానా చరిత్రపూర్వ విచ్ఛిన్నత తరువాత మడగాస్కర్ సుమారు 88 మిలియన్ల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో నుండి విడిపోయింది. స్థానిక మొక్కలను, జంతువులను ఏంకాంతం కారణంగా అభివృద్ధి చేయడానికి వీలు కల్పించింది. పర్యవసానంగా మడగాస్కర్ ఒక జీవవైవిధ్యం హాట్స్పాటు; దాని వన్యప్రాణులలో 90% పైగా భూమిమీద మరెక్కడా కనిపించలేదు. ద్వీపంలోని విభిన్న జీవావరణవ్యవస్థలు, ప్రత్యేక వన్యప్రాణులు వేగంగా పెరుగుతున్న మానవ జనాభా, ఇతర పర్యావరణ ఆక్రమణతో బెదిరించబడుతున్నాయి.

రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్
రిపోబ్లికా'ని మడగాసికారా
République de Madagascar
Flag of మడగాస్కర్ మడగాస్కర్ యొక్క చిహ్నం
నినాదం
Tanindrazana, Fahafahana, Fandrosoana  (Malagasy)
Patrie, liberté, progrès  (French)
"Fatherland, Liberty, Progress"
జాతీయగీతం
en:Ry Tanindrazanay malala ô!
Oh, Our Beloved Fatherland

మడగాస్కర్ యొక్క స్థానం
మడగాస్కర్ యొక్క స్థానం
రాజధానిAntananarivo
18°55′S 47°31′E / 18.917°S 47.517°E / -18.917; 47.517
అతి పెద్ద నగరం Antananarivo
అధికార భాషలు Malagasy, French, ఆంగ్లభాష1
ప్రజానామము Malagasy
ప్రభుత్వం Unitary state government
 -  President Hery Rajaonarimampianina
 -  Prime Minister Jean Ravelonarivo
స్వాతంత్ర్యము ఫ్రాన్స్ నుండి 
 -  Date 26 జూన్ 1960 
 -  జలాలు (%) 0.13%
జనాభా
 -  జూలై 2008 అంచనా 20,042,551 (55వది)
 -  1993 జన గణన 12,238,914 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $19.279 billion 
 -  తలసరి $979 
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $7.711 billion 
 -  తలసరి $391 
జినీ? (2001) 47.5 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.533 (medium) (143వది)
కరెన్సీ Malagasy ariary (MGA)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mg
కాలింగ్ కోడ్ +261
1Official languages since 27 April 2007.

మడగాస్కర్‌లో పురాతత్వ పరిశోధన సాక్ష్యాలు మొట్టమొదటి మానవ ఆవిర్భావం 10,000 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని తెలియజేస్తున్నాయి.

మడగాస్కర్ మానవ నివాసాలు క్రీ.పూ 350, క్రీ.పూ 550 మధ్య ఆస్ట్రోనేషియన్ ప్రజలచే సంభవించాయి. బోర్నెయో నుండి వచ్చిన నౌకాదళ శిబిరాలకు చేరుకున్నారు. ఇవి క్రీ.పూ 9 వ శతాబ్దం కాలంలో బంటు వలసదారులు తూర్పు ఆఫ్రికా నుండి మొజాంబికు చానెల్ను ద్వారా ప్రయాణిస్తూ వీరిని కలిసారు. కాలక్రమంలో మడగాస్కర్‌లో ఇతర బృందాలు స్థిరపడ్డాయి. ప్రతి ఒక్కరూ మాలాగజీ సాంస్కృతిక జీవితానికి శాశ్వతమైన కృషిని చేశారు. మలగాసి జాతి సమూహం 18 లేదా అంతకంటే ఎక్కువ ఉపవిభాగాలుగా విభజించబడింది. వాటిలో అతి పెద్దది మద్య ఎగువప్రంతలో ఉన్న మెరీనా.

18 వ శతాబ్దం చివర వరకు మడగాస్కర్ ద్వీపం సాంఘిక రాజకీయ సంకీర్ణాలు మార్చడం ద్వారా పరిపాలించబడుతుంది. 19 వ శతాబ్దం ఆరంభంలో ప్రారంభించి దీవిలో ఎక్కువ భాగం సమైక్యపరచబడి మెరీనా ప్రముఖులచే మడగాస్కర్ రాజ్యంగా పరిపాలించబడింది. 1897 లో ఈ ద్వీపం ఫ్రెంచి వలస సామ్రాజ్యంలోకి ప్రవేశించడంతో ఇది ముగిసింది. ఈ ద్వీపం 1960 లో స్వాతంత్ర్యం పొందింది. మడగాస్కర్ స్వతంత్ర రాజ్యం నాలుగు ప్రధాన రాజ్యాంగ కాలాలకు గురైంది. ఇది రిపబ్లికుగా పిలువబడింది. 1992 నుండి దేశం అధికారికంగా అంటనేనారివోలో రాజధాని నుండి రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా పరిపాలించబడింది. అయితే 2009 లో ప్రముఖ తిరుగుబాటులో అధ్యక్షుడు మార్కు రావలోమన్ననా రాజీనామా చేసాడు. అధ్యక్ష అధికారం 2009 మార్చిలో ఆండ్రీ రాజోలీనాకు బదిలీ చేయబడింది. 2013 జనవరిలో హేరీ రాజాయోనరిమాంపియానినా అధ్యక్షుడిగా నియమించడం అంతర్జాతీయ సమాజం న్యాయమైన, పారదర్శకంగా పరిగణించబడిన తరువాత 2014 జనవరిలో రాజ్యాంగ పరిపాలన పునరుద్ధరించబడింది. మడగాస్కర్ యునైటెడు నేషన్సు, ఆఫ్రికా యూనియను (ఎ.యు), దక్షిణాఫ్రికా డెవలప్మెంటు కమ్యూనిటీ (ఎస్.ఎ.డి.సి), ఆర్గనైజేషను ఇంటర్నేషనలు డి లా ఫ్రాంకోఫోనీలో సభ్యదేసంగా ఉంది.

ఐక్యరాజ్యసమితి ప్రకారం మడగాస్కర్ కనీసం అభివృద్ధి చెందిన దేశంగా వర్గీకరించబడింది. మడగాస్కర్‌లో మలగాసీ, ఫ్రెంచి అధికార భాషలుగా ఉన్నాయి. సాంప్రదాయ విశ్వాసాలు, క్రైస్తవత్వం రెండింటి సమ్మేళనలకు జనాభాలో ఎక్కువమంది కట్టుబడి ఉంటారు. పర్యావరణ పర్యాటకం, విద్య, ఆరోగ్యం, ప్రైవేటు సంస్థల ఎక్కువ పెట్టుబడులతో జతకాబడిన మడగాస్కర్ అభివృద్ధి వ్యూహంలో ముఖ్యమైన అంశాలుగా భావించబడుతున్నాయి. రావలోమనానా పాలనలో ఈ పెట్టుబడులు గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించాయి. కానీ ప్రయోజనాలు ప్రజలందరికీ సమానంగా అందజేయబడలేదు. పెరుగుతున్న జీవన వ్యయం, పేద - మధ్యతరగతిలోని కొన్ని విభాగాల జీవన ప్రమాణాల క్షీణతపై ఒత్తిడి తెచ్చాయి. 2017 నాటికి ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. 2009-2013 రాజకీయ సంక్షోభం అత్యధిక మలగసీ జీవన నాణ్యత తక్కువగా ఉంది.

పేరు వెనుక చరిత్ర

మలగసీ భాషలో ఈ ద్వీపాన్ని మడగాసికర అని పిలిచారు. దీని ప్రజలు మాలాగబిసులుగా సూచించబడ్డారు. ద్వీపం "మడగాస్కర్" అనే పేరు స్థానిక మూలం కాదు. మధ్యయుగంలో యూరోపియన్లచే ఇది ప్రాచుర్యం పొందింది. 13 వ శతాబ్దపు వెనిసు అన్వేషకుడు మార్కో పోలో జ్ఞాపకాలలో మొగడిసు అనే పేరు స్వరబేధంతో సూచించబడింది. సోమాలి నౌకాశ్రయం పోలోను ఈ ద్వీపం గందరగోళంలో పడవేసింది.

1500 లో సెయింటు లారెన్సు డే రోజున పోర్చుగీసు అన్వేషకుడు డయోగో డయాసు ద్వీపంలో అడుగుపెట్టి సావో లారెనుస్కో అనే పేరు పెట్టాడు. సవరణ చేసిన మ్యాపులో పోలో పేరు ప్రాధాన్యత, ప్రాచుర్యం పొందింది. మలగాసీ భాషావాడుకరులైన స్థానిక ప్రజలెవ్వరూ మడగాస్కారను సూచించే పేరును పేర్కొనలేదు. మలగాజీ-భాష పేరు ఈ ద్వీపానికి సూచించడానికి వాడతారు. అయితే కొన్ని వర్గాలు తమ సొంత పేరును కలిగి ఉన్నాయి.

చరిత్ర

హిందూమహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మడగాస్కర్. తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నా కూడా ఈ మడగాస్కర్ దీవి దేశం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ అక్కడ ఆసియా ప్రజల ఛాయలే ఉన్నాయి. దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. సా.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు.

అనేక రకాల ఖనిజాలు ఈ దీవిలో లభ్యమవుతున్నప్పటికీ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. జనాభాలో 80 శాతం మంది ప్రజలు కేవలం జీవనం కొనసాగడానికే వ్యవసాయం చేస్తున్నారు. వరిధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది.

చరిత్ర కాలానికి ముందు

మడగాస్కర్ 
Malagasy ancestry reflects a blend of Austronesian (Southeast Asian) and Bantu (East African) roots.

ఈశాన్య ప్రాంతంలో కనిపించే ఎముకలలోని కత్తిరించిన మార్కులు వంటి పురాతత్వ అన్వేషణలు క్రీ.పూ 2000 నాటికి మడగాస్కర్‌ను సందర్శకులు సందర్శించారని సూచిస్తున్నాయి. ఎముకలలో మానవులు లిఖించినన పొడవైన గీతలు ఆధారపడి 10,500 సంవత్సరాల క్రితం ద్వీపంలో ప్రారంభ హోలోసీను మానవులు ఉనికిలో ఉండవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ ఒక కౌంటరు అధ్యయనంలో మానవ నిర్మిత మార్కులు 1,200 సంవత్సరాల క్రితం ప్రారంభమైనవి. గతంలో పేర్కొన్న ఎముక నష్టం స్కావెంజర్లు, భూమి కదలికలు, త్రవ్వకాల ప్రక్రియ నుండి కోతలు తయారు చేయబడిందని తేల్చింది.

సాంప్రదాయకంగా పురావస్తు శాస్త్రజ్ఞులు సుమారుగా క్రీ.పూ. 350 నుండి సా.శ. 550 మధ్యకాలంలో అంతకుముందు తరంగాలలో స్థిరపడ్డరు అని భావిస్తున్నారు. అయినప్పటికీ మరికొందరు ఈ తేదీలు సా.శ. 250 అని భావిస్తున్నారు. భూమిపై ప్రధాన భూభాగాల్లో మానవులను స్థిరపడిన చివరి భూభాగం మడగాస్కర్ అని భావిస్తున్నారు.

ఆరంభకాల మానవుల ఆగమనం తరువాత ప్రారంభంలో స్థిరపడినవారు వ్యవసాయం కోసం తీరప్రాంత వర్షారణ్యాలను తొలగించడానికి స్లాష్-అండ్-బర్ను వ్యవసాయాన్ని అభ్యసించారు. మొట్టమొదటి స్థిరనివాసులు మడగాస్కర్‌లో విస్తారమైన జంతుజాలాన్ని ఎదుర్కొన్నారు. వీటిలో రాక్షస లెమర్లు, ఏనుగు పక్షులు, రాక్షస ఫౌసా, మలగసీ హిప్పోపోటామాలు ఉన్నాయి. ఇవి వేట, ఆవాసాల నాశనం కారణంగా అంతరించిపోయాయి. సా.శ. 600 నాటికి ఈ ప్రారంభ నివాసితుల సమూహాలు కేంద్ర పర్వత ప్రాంత అడవులను తొలగించడం ప్రారంభించాయి. 7 వ - 9 వ శతాబ్దాల మధ్య అరబు వర్తకులు ఈ ద్వీపానికి మొదటిసారి చేరుకున్నారు. ఆగ్నేయ ఆఫ్రికా నుండి బంటు-మాట్లాడే వలసదారుల అల సుమారు సా.శ. 1000 కి చేరుకుంది. 11 వ శతాబ్దంలో దక్షిణ భారత తమిళ వ్యాపారులు వచ్చారు. వారు పొడవైన కొమ్ముల పశువులను వారు పెద్ద మందలుగా ఉన్న పెద్ద మూపురం కలిగిన ఎద్దును పరిచయం చేశారు. కేంద్ర హైలాండు బెట్సిలియో రాజ్యంలో నీటిపారుదల వరి పొలాలు అభివృద్ధి చేయబడ్డాయి. పొరుగున ఉన్న ఇమెరినా సామ్రాజ్యం అంతటా శతాబ్దం తరువాత పొడవాటి సోపానాలతో విస్తరించబడ్డాయి. 17 వ శతాబ్దం నాటికి జెబుల మేత కొరకు భూమి సాగుకు పెరుగుతున్న గిరాకీ కారణంగా అటవీ పర్యావరణ వ్యవస్థ నుండి ప్రధాన పర్వత ప్రాంతాలు పచ్చిక మైదానాలుగా మారాయి. ప్రధానంగా మార్చింది. మౌఖిక చరిత్రల ఆధారంగా మెరినా ప్రజలలు 600 నుండి 1,000 సంవత్సరాల క్రితం మధ్య కేంద్ర పర్వత ప్రాంతాలకు వచ్చారు. వారు వాజీంబా అని పిలవబడే స్థాపిత జనాభాను ఎదుర్కోవడాన్ని వర్ణించారు. పూర్వ ప్రజల తక్కువ సాంకేతిక నైపుణ్యం కారణంగా సాంకేతిక అభివృద్ధి చెందిన ఆస్ట్రోనేషియను సెటిల్మెంటు అల సంతతికి చెందిన ప్రజలు వజిమ్బా 16 వ - 17 వ శతాబ్దాల్లో మెరీనా రాజులు ఆండ్రీమాలెలో, రలాంబో, ఆండ్రియన్జాకా ఎత్తైన ప్రదేశాల నుండి బహిష్కరించబడడం లేక విలీనం చేసుకోవడం సంభవించింది. ప్రస్తుతం వజింబా ఆత్మలు అనేక సాంప్రదాయ మలగు సమూహాలచే తాంపంటనీ (భూమి పూర్వీకులు) గా గౌరవించబడ్డాయి.

అరబు, ఐరోపా సంబంధాలు

మడగాస్కర్ 
A pirate cemetery at Île Sainte-Marie

మడగాస్కర్ మానవ సెటిల్మెంటు తరువాత ప్రారంభ శతాబ్దాల్లో హిందూ మహాసముద్రం ఓడరేవులను అనుసంధానించే ముఖ్యమైన సముద్రమార్గ వాణిజ్య కేంద్రంగా ఉంది. మడగాస్కర్ వ్రాతపూర్వక చరిత్ర అరబ్బులతో మొదలైంది. వాయవ్య తీరం వెంట కనీసం 10 వ శతాబ్దం నాటికి వర్తకపు స్థావరాలను ఏర్పాటు చేసి ఇస్లాంను అరబికు లిపి ( మలగాజీ భాషని లిప్యంతరీకరణ చేసేందుకు ఉపయోగించే లిపిని " సొరబే " పిలిచారు), అరబ్బు జ్యోతిషశాస్త్రం, ఇతర సాంస్కృతిక అంశాలు ప్రవేశపెట్టారు. పోర్చుగీససు సముద్ర కెప్టెను డియోగో డయాసు దీవిని చూసిన తరువాత 1500 లో ఐరోపా పరిచయం ప్రారంభమైంది. 17 వ శతాబ్దం చివరలో ఫ్రెంచి తూర్పు తీరంలో వాణిజ్య పోస్టులు ఏర్పాటు చేసింది.

1774 నుండి 1824 వరకు మడగాస్కర్ పైరేట్సు, ఐరోపా వ్యాపారుల మధ్య ప్రత్యేకించి, ట్రాన్సు-అట్లాంటికు బానిస వ్యాపారంలో పాల్గొన్నవారి ప్రాముఖ్యతను సంతరించుకుంది. మడగాస్కర్ ఈశాన్య తీరంలోని నోసీ బోరోహా అనే చిన్న ద్వీపం లిబెర్టాలియా పురాతన పైరేటు ఉటోపియా నివాసిత ప్రాంతం అని కొందరు చరిత్రకారులు ప్రతిపాదించారు. చాలామంది ఐరోపా నావికులు ఈ ద్వీపం తీరప్రాంతాలపై నౌకాప్రామాదంలో చిక్కుకున్నారు. వీరిలో రాబర్టు డ్రూరీ వ్రాసిన పత్రిక 18 వ శతాబ్దంలో దక్షిణ మడగాస్కర్లో వ్రాయబడిన కొన్ని జీవిత చరిత్రలలో ఒకటిగా గుర్తించబడుతుంది. సముద్ర వాణిజ్యం ద్వారా సృష్టించబడిన సంపద ద్వీపంలో వ్యవస్థీకృత రాజ్యాల పెరుగుదలను ప్రోత్సహించింది. వాటిలో కొన్ని 17 వ శతాబ్దం నాటికి చాలా శక్తివంతమైనవిగా మారాయి. వీటిలో తూర్పు తీరంలో బెట్సిమిసరకా సంకీర్ణం, పశ్చిమ తీరంలో మెనబె, బొయినా ప్రజల సకలవా రాజ్యాలు, మద్య పర్వతప్రాంతాలలో అండ్రిమనెడో నాయకత్వంలో ఇమెరినా రాజ్యం అంతననరివొ రాజధానిగా చేసుకుని పాలించబడింది.

మడగాస్కర్ రాజ్యం

మడగాస్కర్ 
King Andrianampoinimerina (1787–1810)

17 వ శతాబ్దం ఆరంభంలో ఉద్భవించిన ఇమెరినా పర్వతప్రాంత రాజ్యం ప్రారంభంలో పెద్ద తీర రాజ్యాల సంబంధించి ఒక చిన్న శక్తిని కలిగి ఉంది. 18 వ శతాబ్దం ప్రారంభంలో రాజు అండ్రియమినినవలోన తన నాలుగు కుమారులకు రాజ్యాన్ని విభజించినప్పుడు మరింతగా బలహీనపడింది. సుమారుగా ఒక శతాబ్దం కాలం కరువుతో పోరాడిన తరువాత 1793 లో రాజు ఆండ్రియాంపోమోనిమోనిరైన (1787-1810) ఇమేరినా తిరిగి సమైక్యం చేసాడు. అతని ప్రారంభ రాజధాని అమ్బోహింగంగా, తర్వాత రోవా అంటనేనారివో కాలం నుండి ఇమెరీనా పొరుగునున్న రాజ్యపాలనపై తన పరిపాలనను విస్తరించింది. అతని నియంత్రణలో మొత్తం ద్వీపాన్ని తీసుకొచ్చే అతని ఆశయం ఎక్కువగా అతని కొడుకు, వారసుడైన మొదటి రాడామా (1810-28) పూర్తి చేసాడు. బ్రిటీషు ప్రభుత్వం అయనను మడగాస్కర్ రాజుగా గుర్తింపు పొందింది. 1817 లో బ్రిటీషు మారిషసు గవర్నరు రాడామాతో లాభదాయకమైన బానిస వాణిజ్యాన్ని నిషేధించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని బదులుగా బ్రిటీషు సైనిక, ఆర్థిక సహాయం అదించింది. లండను మిషనరీ సొసైటీ నుండి ఆర్టిసను మిషనరీ రాయబారులరాక 1818 లో ప్రారంభించారు. వారిలో పాఠశాలలను స్థాపించిన జేంసు కామెరాను, డేవిడు జోన్సు, డేవిడు గ్రిఫిత్సు రోమను నుండి మలగాసియా భాషలోకి బైబిల్ను అనువదించాడు. ఈ ద్వీపానికి వివిధ రకాల నూతన సాంకేతిక పరిజ్ఞానాలు పరిచయం చేసాడు.

రాడామా వారసురాలు రాణి మొదటి రనవాలోనా (1828-61), బ్రిటీషు, ఫ్రాన్సుల కారణంగా సంభవించిన రాజకీయ, సాంస్కృతిక ఆక్రమణకు స్పందిస్తూ మడగాస్కర్‌లో క్రైస్తవ మతం అభ్యాసాన్ని నిషేధించి, భూభాగాన్ని విడిచి వెళ్ళమని చాలా మంది విదేశీయులను ఆదేశం జారీచేసింది. ప్రభుత్వ ప్రాజెక్టులను పూర్తిచేయటానికి 20,000 - 30,000 మద్య ఉన్న మెరీనా సైనికుల సంఖ్యను అభివృద్ధి చేయటానికి ఆచరణాత్మక సాంప్రదాయ అభ్యాసాన్ని (పన్ను చెల్లింపుగా నిర్బంధిత కార్మికులు) భారీగా ఉపయోగించుకుంది. అధికరించిన సైనిక సహాయంతో ఆమె ద్వీపం వెలుపలి ప్రాంతాలను ప్రశాంతపరిచి మరింత సామ్రాజ్యాన్ని విస్తరించింది. మడగాస్కర్‌లో చాలాభాగం మెరీనా ఆధీనంలోకి మారింది. మడగాస్కర్ నివాసితులు దొంగల, క్రైస్తవ మతం, ముఖ్యంగా మంత్రవిద్యలతో (టంగెనా ఆర్డియలు) సహా వివిధ నేరాలకు పాల్పడినట్లు ఒకరి మీద ఒకరు ఆరోపించారు. 1828, 1861 మధ్య టంగెనా కారణంగా సంవత్సరానికి 3,000 మరణాలు సంభవించాయి. 1838 లో ఇమెరినాలో 1,00,000 మంది ప్రజలు (దాదాపు 20%) టాంగెనా అగ్నిప్రమాదం కారణంగా మరణించారని ఇతర అంచనాలు వివరించాయి. జనాభాలో దాదాపు 20 శాతం మంది ఉన్నారు. తరచుగా యుద్ధాలను ఎదుర్కొనడం, వ్యాధి, కష్టమైన పనులను బలవంతంగా చేసే కార్మిక వ్యవస్థ, న్యాయం కొరకు కఠినంగా పోరాడడం కారణంగా 33 ఏళ్ల పాలనలో సైనికులు, పౌరుల మధ్య ఉన్నత స్థాయి మరణాలు సంభవించాయి. ఇమెరినాలో నివసించే వారిలో జీన్ లాబోర్డే, రాచరికం తరపున ఆయుధాలను, ఇతర పరిశ్రమలను అభివృద్ధి చేసిన ఒక వ్యాపారవేత్త, ఫ్రెంచి సాహసికుడు బానిసల వ్యాపారవేత్త అయిన జోసెఫు-ఫ్రాంకోయిసు లాంబెర్టులతో అప్పటి ప్రిన్సు రెండవ రాడామా వివాదాస్పద వాణిజ్యం మీద సంతకం చేశాడు. ఒప్పందం లాంబెర్టు చార్టరు అని పిలుస్తారు. రాణి కఠినమైన విధానాలను విరమించుకోవటానికి అతని తల్లి రెండవ రాడామా (1861-63) సఫలీకృతం అయ్యింది. కాని రెండు సంవత్సరాల తరువాత ప్రధాన మంత్రి రెయిన్వినానిహిత్రినియోనీ (1852-1865), ఆండ్రియానా (ప్రముఖుడు), హోవా (సామాన్యుడు) సామ్రాజ్యం పూర్తి శక్తిని అంతం చేయడానికి ప్రయత్నించాడు.

ఈ తిరుగుబాటు తరువాత రాడామా రాణి రసొహెరినా (1863-68) పాలన కొనసాగించడానికి ఒక అవకాశం కల్పించారు. అందులో ప్రధానితో ఒక అధికార భాగస్వామ్య ఏర్పాటు ఒప్పదం చేసి వారి మధ్య రాజకీయ వివాహం జరగాలని ప్రతిపాదించారు. రాణి రసొహెరినా ముందుగా రెయిన్వినానిహిట్రినియోనీతో వివాహానికి అంగీకరించింది. తరువాత ఆయనను త్రోసిపుచ్చి అతని సోదరుడు ప్రధాన మంత్రి రైనాలియర్వివానీ (1864-95) వివాహం చేసుకున్నది. ఆయన రాణి రెండవ రంనాలోనా (1868-83)వివాహం చేసుకున్నాడు. తరువాత రాణి మూడవ రంనాలోనా III (1883-97) వారసురాలైంది. రైనీలైయర్వివాని 31 ఏళ్ళ ప్రధానమంత్రిగా పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని ఆధునీకరించడానికి, ఏకీకరించడానికి పలు విధానాలు అవలంబించబడ్డాయి. ద్వీపమంతా పాఠశాలలు నిర్మించబడ్డాయి, హాజరు తప్పనిసరి చేయబడింది. సైనిక సంస్థ మెరుగుపడింది, సైనికులకు శిక్షణ ఇవ్వడానికి, వృత్తిపరంగా శిక్షణ ఇవ్వడానికి బ్రిటిషు కన్సల్టెంట్సు నియమించబడ్డారు. బహుభార్యాత్వం చట్టవిరుద్ధం చేయబడింది. 1869 లో న్యాయస్థానం క్రైస్తవమతాన్ని అధికారిక మతంగా ప్రకటించబడింది. సాంప్రదాయిక విశ్వాసాలతో పాటు జనాభాలో పెరుగుతున్న ఆదరణతో క్రైస్తవమతం దత్తత తీసుకోబడింది. బ్రిటీషు చట్టం ఆధారంగా మూడు చట్టాలు సంస్కరించబడ్డాయి. రాజధాని నగరంలో మూడు ఐరోపా తరహా న్యాయస్థానాలు స్థాపించబడ్డాయి. కమాండర్-ఇన్-చీఫ్గా అతని ఉమ్మడి పాత్రలో, రైనాలివావిని కూడా విజయవంతంగా అనేక ఫ్రెంచి కాలనీల దాడులకు వ్యతిరేకంగా మడగాస్కర్ రక్షణను సమర్థించింది.

French colonization

మడగాస్కర్ 
A French poster about the Franco-Hova War
మడగాస్కర్ 
Bond of the French colony Madagascar, issued 7. May 1897

మొట్టమొదటిసారిగా లాంబెర్టు చార్టరు గౌరవించబడలేదు. 1883 లో ఫ్రాన్కో-హోవా యుద్ధంలో ఫ్రాన్సు మడగాస్కర్ను ఆక్రమించింది. యుద్ధం ముగిసే సమయంలో మడగాస్కర్ ఉత్తర నౌకాశ్రయ పట్టణం అంట్సిరాననా (డియెగో సువరేజు) ను ఫ్రాంసుకు అప్పగించి లాంబెర్టు వారసులకు 5,60,000 ఫ్రాంక్లను చెల్లించాడు. 1890 లో బ్రిటీషు ద్వీపం ఫ్రెంచి రక్షితప్రాంతంగా అధికారికంగా ఆమోదించినప్పటికీ కానీ ఫ్రెంచి అధికారాన్ని మడగాస్కర్ ప్రభుత్వం గుర్తించలేదు. 1894 డిసెంబరులో తూర్పు తీరంలో టోమసానా ఓడరేవును, 1895 లో పశ్చిమ తీరంలోని మహాజంగా ఫ్రెంచి సైన్యం బలవంతంగా బాంబుదాడితో ఆక్రమించుకుంది.

తరువాత ఫ్రెంచి సైన్యం తరువాత అంటననారివో వైపుకు వెళ్ళింది. తరువాత ఫ్రెంచి మలేరియా, ఇతర వ్యాధులకు చాలా మంది సైనికులను కోల్పోయింది. అల్జీరియా, ఉప-సహారా ఆఫ్రికా నుండి బలగాలు వచ్చాయి. 1895 సెప్టెంబరులో నగరాన్ని చేరిన తర్వాత వాయుసేన రాజ భవనముమీద భారీ ఆయుధాలతో బాంబు దాడులలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఫలితంగా మూడవ రాణి లొంగిపోయింది. 1896 లో ఫ్రాన్సు మడగాస్కర్ను స్వాధీనం చేసుకుంది. మరుసటి సంవత్సరం ఈ ద్వీపాన్ని ఒక కాలనీగా ప్రకటించింది. మెరీనా రాచరికాన్ని పతనం చేసి రాజకుటుంబాన్ని బహిష్కరించి రీయూనియను ఐలాండు, అల్జీరియాలకు పంపింది. రాయలు ప్యాలెసు ఫ్రెంచి సంగ్రహణకు ప్రతిస్పందనగా నిర్వహించిన రెండు సంవత్సరాల ప్రతిఘటన ఉద్యమం 1897 చివరిలో ప్రభావవంతంగా అణిచివేయబడింది.

వలసరాజ్యాల పాలనలో వివిధ రకాల వాణిజ్య పంటలను ఉత్పత్తి చేయడానికి ప్లాంటేషన్సు స్థాపించబడ్డాయి. 1896 లో బానిసత్వం రద్దు చేయబడింది. 5,00,000 మంది బానిసలను విముక్తం చేశారు. చాలామంది తమ మాజీ మాస్టర్సు గృహాలలో సేవకులుగా, వాటాదారులుగా ఉన్నారు. ద్వీపంలో అనేక ప్రాంతాలలో బానిస వారసుల పట్ల బలమైన వివక్షతా దృక్పథాలు ఇప్పటికీ ఉన్నాయి. రాజధాని నగరం అంటననారివోలో విస్తారమైన పేవుమెంటుతో వీధులు, కూడలి ప్రాంతాలు నిర్మించబడ్డాయి. రోవా రాజభవనం ప్రాకారం ఒక మ్యూజియంగా మారింది. అదనపు పాఠశాలలు నిర్మించబడ్డాయి, ముఖ్యంగా గ్రామీణ, మెరీనా తీర ప్రాంతాల్కు పాఠశాలలు చేరుకోలేదు. 6 నుంచి 13 ఏళ్ల మధ్య నిర్బంధ విద్య అమలు చేయబడింది. ప్రాథమికంగా ఫ్రెంచి భాషా ఉపయోగం, ఆచరణాత్మక నైపుణ్యాల మీద దృష్టి పెట్టింది.

కార్మికుల రూపంలో చెల్లించిన మెరీనా రాయలు సాంప్రదాయం ఫ్రెంచి పాలనలో కొనసాగింది. కీరవాణా నగరాలను అంటనేనారివోకు కలిపే ఒక రైల్వే, రహదారులను నిర్మించడానికి ఇది ఉపయోగించబడింది. మొదటి ప్రపంచయుద్ధంలో మలగసీ దళాలు ఫ్రాంసు తరఫున పోరాడారు. 1930 వ దశకంలో నాజీ రాజకీయ ఆలోచనాపరులు మడగాస్కర్ ప్రణాళికను అభివృద్ధి చేశారు. ఇది ఐరోపా యూదులను బహిష్కరించడానికి ఒక శక్తివంతమైన ప్రదేశంగా ఈ ద్వీపాన్ని గుర్తించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విచి ప్రభుత్వం, బ్రిటీషు మధ్య జరిగిన మడగాస్కర్ యుద్ధానికి ఈ ద్వీపం వేదిక అయింది.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్సు ఆక్రమణ మడగాస్కర్‌లో కాలనీల పరిపాలన గౌరవాన్ని దెబ్బతీసింది. స్వతంత్ర ఉద్యమానికి ప్రేరణ కలిగించి 1947 లో మలగాసియా తిరుగుబాటుకు దారి తీసింది. 1956 లో ఈ ఉద్యమం కారణంగా ఫ్రెంచి లోయి కాడ్రే (ఓవర్సీసు సంస్కరణ చట్టం) ఆధారంగా సంస్కరించబడిన సంస్థలను స్థాపించడానికి దారితీసింది. మడగాస్కర్ శాంతియుతంగా స్వతంత్రం లక్ష్యంగా ముందుకు కదిలింది. 1958 అక్టోబరు 14 న మడగాస్కర్ ఫ్రెంచి కమ్యూనిటీ లోని స్వయం ప్రతిపత్తిత మలగసీ రిపబ్లిక్కుగా ప్రకటించబడింది. 1959 లో రాజ్యాంగం స్వీకరించబడింది. 1960 జూన్ 26 నలో పూర్తి స్వతంత్ర దేశంగా మారింది.

స్వతంత్ర దేశం

మడగాస్కర్ 
Philibert Tsiranana, the first president of Madagascar (1960–72).

స్వతంత్రాన్ని పొందడంతో మడగాస్కర్ రిపబ్లిక్లను దాని రాజ్యాంగానికి తగినట్లుగా మార్చింది. ఫ్రాంసు-నియమించిన అధ్యక్షుడు ఫిలిబెర్టు సిరనానా నాయకత్వంలో మొదటి రిపబ్లికు (1960-72), ఫ్రాంసుకు మద్య బలమైన ఆర్థిక, రాజకీయ సంబంధాల కొనసాగాయి. అనేకమంది ఉన్నత-స్థాయి సాంకేతిక స్థానాలు ఫ్రెంచి నిపుణుల చేత భర్తీ చేయబడ్డాయి. ఫ్రెంచి ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు, పాఠ్యప్రణాళిక దేశవ్యాప్తంగా పాఠశాలలలో ఉపయోగించడం కొనసాగింది. ఈ "నియో-కలోనియలు" ఏర్పాటుకు సిరననా సహనం ప్రజల ఆగ్రహానికి కారణం అయింది. 1972 లో రైతు, విద్యార్థి నిరసనలు ఆయనపాలన పతనానికి దారితీసాయి.

సైన్యంలో ఒక ప్రధాన సైన్యాధికారి అయిన గాబ్రియెలు రామాంజాంవో అదే సంవత్సరంలో తాత్కాలిక అధ్యక్షుడిగానూ, ప్రధానమంత్రిగానూ నియమితుడయ్యాడు. కానీ ప్రజా ఆమోదం తగినంత లేని కారణంగా 1975 లో పదవీవిరమణ చేసాడు. ఆయన తరువాత కల్నలు రిచర్డు రాట్సిమండ్రావా నియమించబడ్డాడు. అతని పదవీబాధ్యత వహించిన 6 రోజుల తరువాత హత్య చేయబడ్డాడు. తరువాత సైనిక నాయకుడు జనరలు గిల్లెసు అండ్రిమహాజో నియామకుడు స్థానంలో నాలుగు నెలలు పాలించాడు: తరువాత 1975 నుండి 1993 వరకు సోషలిస్టు-మార్క్సిస్టు వైస్ అడ్మిరల్ డిడియర్ రత్సిరాకా సెకండు రిపబ్లికును పాలన కొనసాగించాడు.

ఈ కాలంలో తూర్పు బ్లాకు దేశాల రాజకీయ అమరిక కనిపించింది. ఆర్థిక సంక్షోభం సంభవించింది. ఈ విధానాలు 1973 చమురు సంక్షోభం నుండి ఉత్పన్నమైన ఆర్థిక ఒత్తిడులతో కలిసి మడగాస్కర్ ఆర్థికవ్యవస్థ త్వరితగతి పతనానికి దారితీసి జీవన ప్రమాణాలు గణనీయంగా క్షీణించాయి. 1979 నాటికి దేశం పూర్తిగా దివాళా తీయబడింది. రాటుసిర్కా పరిపాలన పారదర్శకంగా నిర్వహించడానికి అంగీకరించాడు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, వివిధ ద్వైపాక్షిక దాతలచే విధించబడిన అవినీతి నిరోధక చర్యలు, స్వేచ్ఛా మార్కెట్టు విధానాలు, దేశంలో విధ్వశం అయిన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సహకరించాయి.

1980 ల చివరలో రాట్సికా తగ్గిపోతున్న జనాదరణ 1991 లో ఒక ర్యాలీలో నిరాయుధులైన నిరసనకారులపై కాల్పులు జరిపడంతో తీవ్రమైన అంశంగా మారింది. రెండు నెలల లోపల 1992 అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి మూడవ రిపబ్లికు (1992-2010) ను ప్రారంభించిన ఆల్బర్టు జఫీ (1993-96) నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. కొత్త మడగాస్కర్ రాజ్యాంగం ఒక బహుళ-పార్టీ ప్రజాస్వామ్యంగా అవరరించింది. జాతీయ అసెంబ్లీ గణనీయమైన అధికారం కల్పించబడింది. కొత్త రాజ్యాంగం మానవ హక్కులు, సామాజిక - రాజకీయ స్వేచ్ఛలు, స్వేచ్ఛా వాణిజ్య అవసరాలను కూడా నొక్కిచెప్పింది. అయినప్పటికీ జఫీ పాలనలో ఆర్థిక క్షీణత, అవినీతి ఆరోపణలు, తనకు విశేషాధికారాలు కలిగించేలా చట్టంలో సవరణలు ప్రవేశపెట్టడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. 1996 లో అతన్ని అభిశంసించటంతో తదుపరి అధ్యక్ష ఎన్నికకు ముందే మూడు నెలలపాటు ఒక తాత్కాలిక అధ్యక్షుడుగా నోర్బర్టు రాట్సిరాహోనానాను నియమించారు. రెండోసారి రాట్సిరాకా అధికారంలోకి (1996 నుండి 2001) వికేంద్రీకరణ, ఆర్థిక సంస్కరణల హామీతో అధికారంలోకి తిరిగి ఎన్నిక చేయబడ్డాడు.

2001 లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అంటననారివో మేయరు మార్కు రావాలోమోననా విజయం సాధించిన తరువాత రావాలోమనాన, రత్సిరాకా మద్దతుదారుల మధ్య 2002 లో ఏడు మాసాల స్తంభన ఏర్పడింది. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల ప్రతికూల ప్రభావాన్ని రావలోమనానా ప్రగతిశీల ఆర్థిక, రాజకీయ విధానాలతో అధిగమించాడు. ఇది విద్య, పర్యావరణ విధానంలో పెట్టుబడులను ప్రోత్సహించింది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేసింది. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార భాగస్వామ్యాలను అభివృద్ధి చేసింది. తన పరిపాలనలో సగటున సంవత్సరానికి 7% జాతీయ జి.డి.పి అధికరించింది. తన రెండో పదవీకాలం సగం కాలంలో స్థానిక, అంతర్జాతీయ పరిశీలకులు రావలోమనాపాలనలో నిరంకుశత్వం, అవినీతి అధికరించిందని విమర్శించారు.

ప్రతిపక్ష నాయకుడు అంటనేనారివో మేయరు ఆండ్రీ రాజోలీనా నాయకత్వంలో 2009 ప్రారంభంలో ఒక ఉద్యమం జరిగింది. ఇందులో రావలోమనాన రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియలో అధికారం నుండి వైదొలగడం విస్తృతంగా ఖండించబడింది. 2009 మార్చిలో రాజోలీనాను సుప్రీం కోర్టు అధిక అధికారం కలిగిన తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించింది. ఇది అధ్యక్ష ఎన్నికలకు దేశాన్ని కదిలించడానికి బాధ్యతగల తాత్కాలిక పాలనా యంత్రాంగంగా భావించబడింది. 2010 లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఒక నూతన రాజ్యాంగం దత్తత తీసుకుంది. అది నాలుగవ రిపబ్లిక్కును స్థాపించింది. ఇది మునుపటి రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య, బహుళ-పార్టీ నిర్మాణాన్ని నిలబెట్టుకుంది. 2013 అధ్యక్ష ఎన్నికల విజేతగా హెరా రాజనారిమాంపిమినాను ప్రకటించారు. ఈ ఎన్నికలను అంతర్జాతీయ సమాజం న్యాయమైన, పారదర్శకంగా భావించింది.

భౌగోళికం

The terraced paddy fields of the central highlands of Madagascar (left) give way to tropical rainforest along the eastern coast (center) bordered by the shores of the Indian Ocean (right).

592,800 చ.కి.మీ వైశాల్యంతో మడగాస్కర్ ప్రపంచంలో 47 వ అతిపెద్ద దేశంగా ఉంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ద్వీపంగా ఉంది. దేశం అక్షాంశాల 12 ° నుండి 26 ° డిగ్రీల దక్షిణ అక్షాంశం! 43 ° నుండి 51 ° తూర్పురేఖాంశంలో ఉంది. పొరుగున ఉన్న ద్వీపాలు ఫ్రెంచి ప్రాంతం, రీయూనియను, మారిషసు దేశానికి తూర్పుదిశలో ఉన్నాయి. అలాగే కోమోరోసు, ఫ్రెంచి భూభాగం మాయొట్టే వాయవ్యంలో ఉన్నాయి. పశ్చిమాన సమీప ప్రధాన భూభాగం మొజాంబిక్ ఉన్నాయి.

135 మిలియన్ల సంవత్సరాల క్రితం మాహాఖండం గోడ్వానా విచ్ఛిన్నత కారణంగా ఆఫ్రికా-దక్షిణ అమెరికా భూభాగాల నుంచి మడగాస్కర్-అంటార్కిటికా-భారతదేశ భూభాగం వేరుచేయబడ్డాయి. సుమారు క్రీ.పూ 88 మిలియన్ల సంవత్సరాల క్రితం క్రెటేషియసు కాలంలో భరతఖండం నుండి మడగాస్కర్ వేరుచేయబడింది. ద్వీపంలో నెలకొన్న ఏకాంతం ద్వీపంలో మొక్కలు, జంతువులు ఆవిర్భవించి అభివృద్ధి చెందడానికి కారణంగా మారింది. తూర్పు తీరం పొడవునా ఉన్న ఇరుకైన, నిటారైన భూభాగం ఉష్ణమండల లోతట్టు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.

ఈ శిఖరం పశ్చిమాన ద్వీపం మద్యలో ఉన్న పీఠభూమి క్రమంగా సముద్ర మట్టానికి 750 నుండి 1,500 మీ (2,460 నుండి 4,920 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ఈ కేంద్ర పర్వత ప్రాంతాలు సాంప్రదాయికంగా మెరీనా ప్రజల మాతృభూమి. వారి చారిత్రాత్మక రాజధాని అంటననారివో ఉన్నాయి. ఇవి ద్వీపంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా ఉన్నాయి. గడ్డి కొండలు, మడగాస్కర్ పర్వతప్రాంతంలో ఉన్న అడవుల వరిపండించబడుతున్న లోయలు ఉన్నాయి. పర్వతాల పశ్చిమాన పెరుగుతున్న శుష్క భూభాగ వాలు ప్రాంతం క్రమంగా మొజాంబిక్ చానెలు తీరప్రాంత మడుగులకు చేరుకుంటుంది.

The grassy plains that dominate the western landscape are dotted with stony massifs (left), patches of deciduous forest, and baobab trees (center), while the south is characterized by desert and spiny forests (right).

మడగాస్కర్ ఎత్తైన శిఖరాలు మూడు ప్రముఖ పర్వత మాసిఫ్స్ నుండి పెరుగుతాయి: సరతనాన మాసిఫ్లో మార్మోకోట్రో శిఖరం 2,876 మీ (9,436 అడుగులు) ఎత్తుతో, ద్వీపంలో అత్యున్నత స్థానంగా ఉంది. తర్వాత ఆండ్రింగిత్రా శిఖరం 2,658 మీ ఎత్తు ఉంటుంది.అంకరాత్రా మాసిఫ్ లోని సియాఫజవొన 2643 మీ ఎత్తు ఉంటుంది. తూర్పున, కెనాల్ డెస్ పంగాలనేస్ అనేది తూర్పు తీరప్రాంతం నుండి కేవలం అంతర్గత ఫ్రెంచ్ నిర్మించిన కాలువలను అనుసంధానించిన మానవ నిర్మిత, సహజ సరస్సుల గొలుసు, ఇది దాదాపు 600 కిలోమీటర్ల (370 మైళ్ళు) తీరానికి సమాంతరంగా ఉంటుంది.

పశ్చిమ, దక్షిణ ప్రాంతాల మధ్యభాగం, మధ్య పర్వతాల వర్షపు నీడలో ఉంటాయి. ఆకురాల్చే అడవులు, స్పినీ అడవులు, ఎడారులు, క్సెరిక్ పొదలతో నిండి ఉంటాయి. తక్కువ జనసాంద్రత కారణంగా, మడగాస్కర్ పొడి ఆకురాల్చే అడవులు తూర్పు వర్షారణ్యాలు, కేంద్ర పీఠభూమి అరణ్యాల కంటే సురక్షితంగా ఉన్నాయి. పశ్చిమ తీరం అనేక రక్షిత నౌకాశ్రయాలను కలిగి ఉంటుంది. కానీ పడమటి మైదానాలను దాటే నదులు, అధికవర్షపాతంతో లోతట్టు భూక్షీణత ఏర్పడుతుంది.

మడగాస్కర్ 
A Köppen climate classification map of Madagascar

వాతావరణం

మడగాస్కర్ 
Biogeographic timetable of Madagascar over the last 200 million years

ఆగ్నేయ వాణిజ్య వర్షాలు, వాయవ్య రుతుపవనాల కలయికతో వేడిగా ఉండే వర్షపు సీజను (నవంబరు-ఏప్రిలు) తరచుగా వినాశకరమైన తుఫానులు సంభవిస్తుంటాయి. చల్లగా ఉండే పొడి సీజను (మే-అక్టోబరు) తో మొదలౌతుంది. హిందూ మహాసముద్రం నుండి ఉత్పన్నమయ్యే వర్షం మేఘాలు ద్వీపం తూర్పు తీరానికి అధికమైన తేమను అందిస్తుంది. ఫలితంగా అత్యధికమైన వర్షపాతం కారణంగా వర్షారణ్యాల పర్యావరణానికి సహకరిస్తుంది. మద్యపర్వతప్రాంతాలు పొడిగానూ చలిగానూ ఉంటాయి. నైరుతూప్రాంతం, దక్షిణ లోతట్టుప్రాంతాలలో పాక్షిక శుష్కవాతావరణం నెలకొని ఉంటుంది.

ఉష్ణ మండలీయ తుఫానులు మౌలిక సదుపాయాలకు, స్థానిక ఆర్థికవ్యవస్థలకు నష్టం కలిగిస్తూ ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి. 2004 లో గఫిలో తుఫాను మడగాస్కర్‌కు ఎన్నడూ లేనంత తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. తుఫానులో 172 మంది మృతి చెందారు. 2,14,260 మంది నిరాశ్రయులయ్యారు. $ 250 మిలియన్ల అమెరికా డాలర్ల కంటే ఎక్కువ నష్టం కలిగించింది.

పర్యావరణం

మడగాస్కర్ 
The island's iconic traveller's palm (ravinala) features in the national emblem.

పొరుగునున్న ఖండాల నుండి ద్వీపం దీర్ఘకాల ఒంటరితనం ఫలితంగా, మడగాస్కర్ భూమిమీద ఎక్కడా కనిపించని వివిధ మొక్కలు, జంతువులకు నిలయంగా ఉంది. మడగాస్కర్‌లో కనిపించే వృక్ష, జంతు జాతులన్నింటిలో 90% స్థానికంగా ఉన్నాయి. ఈ విలక్షణమైన పర్యావరణం మడగాస్కర్‌ను "ఎనిమిదవ ఖండం"గా సూచించడానికి దారితీసింది. కన్సర్వేషను ఇంటర్నేషనలు ఈ ద్వీపాన్ని ఒక జీవవైవిధ్యం హాటుస్పాటుగా వర్గీకరించింది.

మడగాస్కర్ (14,883) వృక్ష జాతులలో 80% కంటే అధికంగా ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. వీటిలో ఐదు వృక్షజాతులు కుటుంబాలు ఉన్నాయి. డిడియేరియాసియే వృక్షజాతి కుంటుంబానికి చెందిన 11 జాతులౌ నైరుతి మడగాస్కర్ లోని స్పైను అడవులకు మాత్రమే పరిమితం. ప్రపంచంలోని పచోపొడియమ్ ఐదు జాతులలో నాలుగుజాతులకు ఈ ద్వీపం స్థావరంగా ఉంది. ఆర్కిడ్ నాలుగింట మూడు వంతుల, మడగాస్కర్ 860 జాతులు ఒంటరిగా ఇక్కడ కనిపిస్తాయి. ప్రపంచంలోని తొమ్మిది బాబోబ్ జాతులలో ఆరు ఉన్నాయి. ఈ ద్వీపంలో సుమారు 170 పామ్ (ఏకదళ బీజ వృక్షాలు) జాతులు ఉన్నాయి. ఇది ఆఫ్రికా ప్రధాన భూభాగం మొత్తంలో ఉన్న జాతుల కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. వాటిలో 165 అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. పలు స్థానిక వృక్ష జాతులు అనేక రకాల బాధలకు మూలికా ఔషధాలుగా ఉపయోగిస్తారు. వింబ్లాస్టైను, చికిత్సకు వినియోగించే మందులలో వింక్రిస్టైను, వింకా అల్కలాయిడు, హడ్జ్కిను వ్యాధి నివారణకు వాడుతుంటారు. లుకేమియా, ఇతర కేన్సరు, మడగాస్కర్ పెరివింక్లె మందును ఉపయోగిస్తారు. ట్రావలరు పాం స్థానికంగా " రవినలా " అంటారు. తూర్పు వర్షారణ్యంలో అంతరించిపోతున్న దశలో ఉంది. ఇది మడగాస్కర్ చిహ్నంగా ఉంది. ఇది జాతీయ చిహ్నంగానూ అలాగే ఎయిరు మడగాస్కర్ లోగోగా ఉంది.

మడగాస్కర్ 
రింగు టైల్ లీముర్సు కలిసి వంకరగా ఉన్నాయి. మడగాస్కర్లో మాత్రమే కనిపించే 100 కి పైగా లెమూరు జాతులు, ఉపజాతుల రింగు తోక లెమూర్ ఒకటి.

మడగాస్కర్ వృక్షజాలంలా మాడగాస్కర్ జంతుజాలం ​​వైవిధ్యమైనది. వీటిలో అత్యధికశాతం అంతరిచిపోతున్న దశలో ఉన్నాయి. " కన్జర్వేషను ఇంటర్నేషనలు " మడగాస్కర్ ప్రధాన క్షీరద జాతులు"గా లెమెర్సు ఉన్నాయని వర్ణించింది. కోతులు, ఇతర పోటీదారులు లేకపోవడంతో ఈ ప్రైమేట్సు అనేక రకాల ఆవాసాలకు అనుగుణంగా పలు జాతులుగా విస్తరించాయి. 2012 నాటికి అధికారికంగా లెమూరు యొక్క ఉపజాతులు 103 ఉన్నాయి. 2000, 2008 మద్య జంతుశాస్త్రకారులు వీటిలో 39 జాతులను గుర్తించారు. అవి దాదాపు అరుదైనవిగా, అంతరించిపోతున్న దశలో ఉన్నట్లుగా వర్గీకరింపబడతాయి. మడగాస్కర్‌లో మానవులు చేరినప్పటి నుండి కనీసం 17 రకాలైన లెమూరు జాతులు అంతరించిపోయాయి. వాటిలో మిగిలినవి మనుగడలో ఉన్న లెమూరు జాతుల కంటే పెద్దవి.

పిల్లి లాంటి ఫస్సాతో సహా అనేక క్షీరదాలు, మడగాస్కర్ కు మాత్రమే స్థానికంగా ఉన్నాయి. ఈ ద్వీపంలో 300 కంటే ఎక్కువ పక్షిజాతులు నమోదు చేయబడ్డాయి. వాటిలో 60% (నాలుగు కుటుంబాలు, 42 జాతులు ఉన్నాయి) స్థానికంగా ఉన్నాయి. మడగాస్కర్ చేరుకునే కొన్ని కుటుంబాలలో 260 కంటే అధికమైన విభిన్నమైన జాతులు ఉన్నాయి. వాటిలో 90% అంతరించిపోయేదశలో ఉన్నాయి. (ఒక స్థానిక కుటుంబంతో సహా). ఈ ద్వీపం ప్రపంచంలోని ఊసరవెల్లి జాతులలో మూడింట రెండు వంతులకు నిలయంగా ఉంది. వీటిలో బ్రుకేసియా కూడా ఉంది. మడగాస్కర్ ఊసరవెల్లి జాతులన్నింటికీ మూలం కావచ్చునని పరిశోధకులు ప్రతిపాదించారు.

మడగాస్కర్‌లో అంతరించిపోతున్న చేపలు రెండు కుటుంబాలు (15 జాతులు) ఉన్నాయి. ద్వీపంలోని సరస్సులు, నదులలోని మంచినీటిలో 100 జాతుల కంటే చేపలు జీవిస్తున్నాయి. మడిగాస్కర్లో అకశేరుకాలు చాల తక్కువగా అధ్యయనం చేయబడినప్పటికీ కనుగొనబడిన జాతులలో అధిక శాతం అంతరించిపోతున్న దశలో ఉన్నాయని కనుగొన్నారు. ద్వీపంలోని సీతాకోకచిలుకలు, స్రరాబు బీటిల్సు, లాచింగ్సు, సాలీడులు, తూనీగలు వంటి కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న నత్తజాతులు అన్నీ (651) జాతుల మడగాస్కర్‌లో స్థానికంగా ఉన్నాయి.

పర్యావరణ వివాదాలు

Tavy (slash-and-burn) destruction of native forest habitat is widespread (left), causing massive erosion (center) and silting of rivers (right).

మడగాస్కర్ వైవిధ్యమైన జంతుజాలం, వృక్షజాలం మానవ కార్యకలాపాల కారణంగా ప్రమాదంలో ఉన్నాయి. సుమారు 2,350 సంవత్సరాల క్రితం మానవుల రాకతో మడగాస్కర్ అడవిలోని 90% కంటే అధికంగా కోల్పోయింది. ఈ అటవీ నష్టాన్ని ఎక్కువగా టావి ("కొవ్వు") అని పిలుస్తారు. ఇది మొట్టమొదట స్థిరనివాసులు మడగాస్కర్‌కు దిగుమతి చేసుకున్న సాంప్రదాయ స్లాష్ అండ్ బర్ను వ్యవసాయ పద్ధతి కారణంగా సంభవించింది. వ్యవసాయం ఆచరణాత్మక లాభాలకి మాత్రమే కాకుండా, సంపన్నత, ఆరోగ్యం, పూర్వీకుల పూర్వ సాంప్రదాయ (ఫామ్బా మాలగసీ) లతో దానిని చేపడుతున్నారు. ద్వీపంలో మానవ జనాభా సాంద్రత పెరగడంతో 1,400 సంవత్సరాల క్రితం అటవీ నిర్మూలన ప్రారంభమైంది. 16 వ శతాబ్దం నాటికి కేంద్ర పర్వత ప్రాంతాల అడవులు అధికంగా తొలగించబడ్డాయి. సుమారు 1000 సంవత్సరాల క్రితం వారు పరిచయంచేసిన పశువుల మంద పరిమాణం పెరుగుదల, వంట కోసం ఇంధనం వలె కర్ర బొగ్గు నిరంతర ఉపయోగం, గత శతాబ్దంలో కాఫీ పంటకు అధికరించిన ప్రాముఖ్యత అటవీప్రాంతాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సాంప్రదాయిక అంచనాల ప్రకారం, 1950 ల నుండి 2000 వరకు ద్వీపంలోని అటవీ ప్రాంతంలో దాదాపు 40% క్షీణించింది. మిగిలిన అడవి ప్రాంతాలను 80% పలుచబడింది. సంప్రదాయక వ్యవసాయ అభ్యాసంతో రక్షిత అడవులలో అక్రమ పంటలు పండించడం వన్యప్రాణి పరిరక్షణ సవాలుగా మారింది. 2000 నుండి 2009 వరకు అప్పటి అధ్యక్షుడు మార్కు రావలోమననా నిషేధించినప్పటికీ జాతీయ ఉద్యానవనాల నుండి చిన్న పరిమాణంలో విలువైన కలప సేకరణ 2009 జనవరిలో తిరిగి అనుమతించబడింది. అధికారంలోకి వచ్చిన ఆండ్రీ రాజోలీనా పరిపాలనలో దాతల మద్ధతు తగ్గించడానికి ప్రభుత్వ ఆదాయం ప్రధాన వనరుగా ఉన్న కలప మీద రావలోమనానా నిషేధాన్ని తొలగించాడు.

మానవులతో ప్రవేశపెట్టబడిన జంతు జాతులు కూడా ఉన్నాయి. ఆసియా సాధారణ టోడు మడగాస్కర్లో 2014 ఆవిష్కరణ తరువాత (1930 ల నుంచి ఆస్ట్రేలియాను తీవ్రంగా దెబ్బతీసిన ఒక టోడు జాతి బంధువు) టోడు "దేశం ప్రత్యేకమైన జంతుజాలం ​నాశనానికి కారణంగా మారింది" అని పరిశోధకులు హెచ్చరించారు. నివాస విధ్వంసం, వేట మడగాస్కర్ యొక్క అనేక జాతుల జాతులకు బెదిరించింది లేదా వాటిని అంతరించిపోయేలా చేసింది. 17 వ శతాబ్దంలో లేదా అంతకుముందు ద్వీపంలోని ఏనుగుల పక్షులు, స్థానిక జైంటు రైట్ల కుటుంబం, అంతరించిపోయాయి. వయోజన పక్షుల వేట, ఆహారం కోసం పెద్ద గుడ్లను వేటాడటం వలన ఇది సంభవించి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ద్వీపంలో మానవ స్థిరనివాసుల రాకతో అనేక భారీ లెమోరు జాతులు శతాబ్దాలకాలంలో అంతరించిపోయాయి. పెరిగిన మానవ జనాభా లీమురు ఆవాసాల మీద ఒత్తిళ్లను అధికం చేసాయి. ఆహారం కోసం కూడా లెమురు వేటాడబడింది. 2009 నుండి ప్రకృతి వనరుల దోపిడీ ద్వీపం వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారిందని ఉందని 2012 జూలై అంచనాలు కనుగొన్నాయి: 90% లెమోరు (ద్వీపంలోని క్షీరదాలలో ఇది అయధికమని భావిస్తున్నారు) జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. వాటిలో 23 జాతులు తీవ్ర అపాయంలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా 2008 లో మునుపటి అధ్యయనంలో లెమరు జాతుల 38% మాత్రమే అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలియజేస్తుంది.

2003 లో రావలోమనాన డర్బను విజన్ను ప్రకటించాడు. ద్వీపంలోని రక్షిత సహజ ప్రాంతాల్లో 60,000 చ.కి.మీ (23,000 చదరపు మైళ్ళు) లేదా మడగాస్కర్ భూ ఉపరితలం 10% కంటే ఎక్కువ 2011 నాటికి ప్రభుత్వ రక్షణ పొందిన ప్రాంతాలుగా ఉంటాయి. వీటిలో ఐదు ప్రకృతి రిజర్వులు (రిసెర్ర్వెసు నేచర్లిల్సు ఇంటెగ్రెల్సు), 21 వన్యప్రాణి రిజర్వులు (రీసర్వెస్ స్పెయెల్సెల్స్) 21 నేషనల్ పార్కులు (పార్కులు నేషనాకు) ఉన్నాయి. 2007 లో ఆరు పార్కులు జాతీయ ఉద్యానవనాలు రెయిన్ఫారెస్టు ఆఫ్ ది అట్టీనాననా పేరుతో ఒక ఉమ్మడి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడ్డాయి. ఈ ఉద్యానవనాలు మరోజెజీ, మాసోయాలా, రనోమాఫానా, జహామెనా, అందోహహేల, ఆంధ్రింగిత్రా. స్థానిక కలప వర్తకులు మారోజ్జీ నేషనలు పార్కులో రక్షిత వర్షారణ్యాల నుండి ఎర్రచెదనం చెట్ల కొరతని పెంచుతున్నారు. లగ్జరీ ఫర్నిచరు, సంగీత వాయిద్యాల తయారీ కోసం చైనాకు చెక్కను ఎగుమతి చేస్తున్నారు. మడగాస్కర్ పర్యావరణ సవాళ్ల గురించి ప్రజా అవగాహనను పెంచటానికి, వన్యప్రాణి కన్సర్వేషను సొసైటీ "మాడగాస్కర్" అనే పేరుతో ఒక ప్రదర్శనను ప్రారంభించింది. 2008 జూన్ లో న్యూయార్కులోని బ్రోంక్సు జూలో జరిగింది.

ఆర్ధికరంగం

మడగాస్కర్ 
మడగాస్కర్ ఎగుమతుల ప్రాతినిథ్యం
మడగాస్కర్ 
ఎంబ్రాయిడరీ టేబుల్క్లాత్లు నసీ కోంబలో పర్యాటకులకు విక్రయించబడతాయి.

మడగాస్కర్ మొట్టమొదటి రిపబ్లికు సమయంలో మడగాస్కర్ ఆర్థిక ప్రణాళిక, పాలసీని ఫ్రాన్సు తీవ్రంగా ప్రభావితం చేసి ముఖ్య వాణిజ్య భాగస్వామిగా పనిచేసింది. నిర్మాతలు, వినియోగదారుల సహకారాల ద్వారా ముఖ్యమైన ఉత్పత్తులు సాగుచేయబడి, జాతీయంగా పంపిణీ చేయబడ్డాయి. బియ్యం, కాఫీ, పశువులు, పట్టు, పామాయిలు వంటి వస్తువుల ఉత్పత్తిని పెంచడానికి గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, ప్రభుత్వ వ్యవసాయ రంగాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. సోషలిస్టు-మార్కిస్టు సెకండు రిపబ్లికును ప్రారంభించడంలో ఈ విధానాలపై ప్రముఖ అసంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో ప్రైవేటు బ్యాంకు, బీమా పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి; వస్త్రాలు, పత్తి, విద్యుత్తు వంటి పరిశ్రమల కోసం ప్రభుత్వ గుత్తాధిపత్య సంస్థలు స్థాపించబడ్డాయి. దిగుమతి-ఎగుమతి వాణిజ్యం, షిప్పింగు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. మడగాస్కార్ ఆర్థిక వ్యవస్థ వేగంగా క్షీణించి ఎగుమతులు పడిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తి 75% తగ్గింది. ద్రవ్యోల్బణం అధికరించింది. ప్రభుత్వం రుణం అధికరించింది. గ్రామీణ జనాభా త్వరలో జీవనస్థాయి క్షీణించించింది. దేశం ఎగుమతి ఆదాయంలో 50% పైగా రుణ సేవల కొరకు ఖర్చు చేశారు.

1982 లో ప్రభుత్వం దివాలా తీయడంతో ఆర్థిక వ్యవస్థ సరళీకరణను ఆమోదించడానికి మడగాస్కర్ ప్రభుత్వం వత్తిడిచేయబడింది. 1980 వ మొదటి దశకంలో ప్రభుత్వ నియంత్రిత పరిశ్రమలు క్రమంగా ప్రైవేటీకరించబడ్డాయి. 1991 రాజకీయ సంక్షోభం ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు సహాయం నిలిపివేతకు దారితీసింది. జఫీ నేరారోపణ మీద ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి సహాయం అందించేముందు ప్రభుత్వం ఇతర రకాల ఆదాయాన్ని ఆకర్షించడానికి విఫల ప్రయత్నం చేసింది. జాఫి కింద నిధి సహాయాన్ని పునరుద్ధరించడంలో విఫలం అయ్యాడు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన తరువాత నిధి సహాయం పునరుద్ధరించబడింది. 2004 లో రావాలోమననా పరిపాలన కింద సగం మడగాస్కర్ రుణాన్ని అందించడానికికి ఐ.ఎం.ఎఫ్. అంగీకరించింది. క్లిష్టమైన ఆర్థిక, పరిపాలన, మానవ హక్కుల ప్రమాణాలను ఎదుర్కొన్న మడగాస్కర్ 2005 లో మిలీనియం ఛాలెంజ్ ఖాతా నుండి ప్రయోజనం పొందిన మొట్టమొదటి దేశం అయింది.

2015 లో మడగాస్కర్ జి.డి.పి. $ 9.98 బిలియన్ల అమెరికా డాలర్లు అని అంచనా వేయబడింది. తలసరి జి.డి.పి. $ 411.82. జనాభాలో దాదాపు 69% మంది రోజుకు ఒక డాలరు ఆదాయంతో జాతీయ దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో సగటు వృద్ధిరేటు 2.6%. పబ్లికు వర్కు కార్యక్రమాలు, సేవ రంగం పెరుగుదల కారణంగా 2016 లో 4.1% చేరుకునే అవకాశం ఉందని భావించబడింది. వ్యవసాయ రంగం 2011 లో మలగసీ జిడిపిలో 29% ఉంది. అదే సమయంలో ఉత్పాదకత జి.డి.పి.లో 15% ఉంది. మడగాస్కర్ ఇతర వనరులలో పర్యాటకం, వ్యవసాయం, వెలికితీత పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. పర్యాటక రగం ప్రస్తుతం పర్యావరణ-పర్యాటక విఫణి మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. మడగాస్కర్ జీవ జీవవైవిధ్యం, సహజ ఆవాసాలు, జాతీయ ఉద్యానవనాలు, లెముర్ జాతులు పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. 2008 లో మడగాస్కర్‌ను 3,65,000 మంది పర్యాటకులు సందర్శించారు. కానీ 2010 లో రాజకీయ సంక్షోభ సమయంలో పర్యాటకులసంఖ్య 1,80,000కు తగ్గింది. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా పర్యాటక రంగం క్రమంగా పెరుగుతోంది; 2016 లో 2,93,000 పర్యాటకులు ఆఫ్రికన్ ద్వీపంలో 2015 నాటికి 20% పెరుగింది; 2017 నాటికి దేశంలో 3,66,000 మంది సందర్శకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018 నాటికి ప్రభుత్వ అంచనాలు 5,00,000 వార్షిక పర్యాటకులను చేరుకుంటుందని అంచనా.

మడగాస్కర్ 
Nosy Iranja is one of the international tourism destinations in Madagascar

2018 లో ఈ ద్వీపం ఇప్పటికీ చాలా పేద దేశంగా ఉంది: నిర్మాణాత్మకమైన ఆటంకాలు ఆర్థికాభివృద్ధికి అడ్డుగోడలుగా ఉన్నాయి. అవినీతి ప్రజా పరిపాలన సంకెళ్ళుగా ఉన్నాయి. చట్టపరమైన నిశ్చితత్వం లేకపోవడం, భూమి చట్టాల వెనుకబాటుతనం ఆర్థికాభివృద్ధి కుంటుబడడానికి కారణంగా ఉంది. 2011 నుండి ఆర్థికంరంగంలో 4% జి.డి.పి. వృద్ధితో అభివృద్ధి మొదలైంది. దాదాపుగా అన్ని ఆర్థిక సూచికలు పెరుగుతున్నాయి, 2017 నాటికి తలసరి జి.డి.పి. అనేది $ 1600 (పి.పి.పి) గా ఉంది, 2012 నుండి పెరుగుతున్నప్పటికీ ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంది; నిరుద్యోగం కూడా (2016 లో 2.1%) తక్కువైంది. 2017 నాటికి కార్మికశక్తి 13.4 మిలియన్లకు చేరింది. మడగాస్కర్ ప్రధాన ఆర్థిక వనరులగా పర్యాటకం, వస్త్రాలు, వ్యవసాయం, మైనింగు ఉన్నాయి.

జాతీయ వనరులు, వాణిజ్యం

మడగాస్కర్ 
Toy animals made from raffia, a native palm

మడగాస్కర్‌లో వివిధరూపాల వ్యవసాయం, ఖనిజ వనరులు సహజ వనరులుగా ఉన్నాయి. వ్యవసాయం (అభివృద్ధి చెందుతున్న రాఫియా సహా), మత్స్యపరిశ్రమ, అటవీ ఆర్థిక ప్రధాన వనరులుగా ఉన్నాయి. మాడగాస్కర్ వెనిల్లా, లవంగాలు, య్లాంగు-య్లాంగు ప్రపంచంలో ప్రధాన సరఫరాదారుగా ఉంది. ప్రపంచ సహజ వెనిల్లాలో మడగాస్కర్ 80% సరఫరా చేస్తుంది. ఇతర ముఖ్యమైన వ్యవసాయ వనరులు కాఫీ, లీచీలు, రొయ్యలు ఉన్నాయి. ముఖ్యమైన ఖనిజ వనరులలో వివిధ రకాలైన విలువైన, అరుదైన రాళ్ళు, మడగాస్కర్ ప్రస్తుతం ప్రపంచంలోని సఫైరుల సరఫరాలో సగభాగాన్ని అందిస్తుంది. ఇవి 1990 ల చివరలో ఇలకాకా సమీపంలో కనుగొనబడ్డాయి.

మడగాస్కర్‌లో ప్రపంచంలో అతి పెద్ద ఇల్మేనైటు (టైటానియం ధాతువు) రిజర్వులు ఉన్నాయి. అలాగే గణనీయమైన క్రోమైటు, బొగ్గు, ఇనుము, కోబాల్టు, రాగి, నికెలు నిల్వలు ఉన్నాయి. చమురు, సహజ వాయువు మాలగసీ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన పురోగతిని ఇస్తాయి. టొలానరో సమీపంలో రియోటింటో సంస్థ ఆధ్వర్యంలో ఇల్మేనైటు, జిర్కోను మైనింగు, జిరాన్ మైనింగు వంటి భారీ ఖనిజాల వెలికితీత ఆర్థికరంగానికి మరింత చేయూత ఇస్తున్నాయి. మోర్మంగా సమీపంలోని నికెలు వెలికితీత, టోమాసినా సమీపంలో షెర్రిట్ ఇంటర్నేషనలు, సిమిరోరో, బెమోలాంగా మడగాస్కర్ ఆయిలు భారీ చమురు నిక్షేపాల వెలికితీత అభివృద్ధి చేయబడింది.

2009 లో ఎగుమతులు జి.డి.పిలో 28% భాగస్వామ్యం వహించాయి. దేశంలోని ఎగుమతి ఆదాయంలో అధిక భాగం వస్త్ర పరిశ్రమ, చేప, షెల్ఫిషు, వెనిల్లా, లవంగాలు, ఇతర ఆహార పదార్థాల నుండి లభించింది. యునైటెడు స్టేట్సు, జపాన్, జర్మనీ దేశాలతో దేశానికి బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నప్పటికీ ఫ్రాన్సు మడగాస్కర్ ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉంది. 2003 లో స్థానిక హస్థకళాఖండాలను విదేశాలకు ఎగుమతి చేయడానికి " యు.ఎస్.ఎయిడు అండ్ మలగసీ ఆర్టిసన్ ప్రొడ్యూసర్సు " సహకార విధానంలో " మడగాస్కర్-యు.ఎస్ బిజినెస్ కౌనిలు " రూపొందించబడింది. ఆహార పదార్థాలు, ఇంధనం, మూలధన వస్తువులు, వాహనాలు, వినియోగదారుల వస్తువులు, ఎలక్ట్రానిక్సు వంటి వస్తువుల దిగుమతుల కొరకు జిడిపిలో 52% వినియోగిస్తున్నాయి. మడగాస్కార్ ప్రధానంగా చైనా, ఫ్రాన్స్, ఇరాన్, మారిషస్ హాంకాంగ్ నుండి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది.

మౌలిక సౌకర్యాలు, మాధ్యమం

మడగాస్కర్ 
A news stand in Antananarivo

2010 లో మడగాస్కర్ సుమారు 7,617 కిలోమీటర్లు (4,730 మైళ్ళు) కాలిబాట నిర్మించిన రహదార్లు ఉన్నాయి. 854 కిమీ (530 మైళ్ళు) రైలుమార్గాలు, 432 కిలోమీటర్ల (270 మైళ్ళు) నౌకాయాన జలమార్గాలు ఉన్నాయి. మడగాస్కర్‌లో అత్యధికమైన రహదారులకు కాలిబాట నిర్మించబడలేదు. చాలా రహదారులు వర్షాకాలంలో అగమ్యంగా మారుతుంటాయి. భారీగా నిర్మించబడిన స్వల్పంగా కాలిబాట నిర్మించిన, కాలి బాట నిర్మించని 6 జాతీయ రహదారులు అతిపెద్ద ప్రాంతీయ పట్టణాలను అంటననారివోతో అనుసంధించాయి. ప్రతి జిల్లాలో ఇతర జనాభా కేంద్రాలకు చేరడానికి వీలుగా చిన్న కాలిబాట నిర్మించని మార్గాలు ఉన్నాయి.

మడగాస్కర్‌లో అనేక రైలు మార్గాలు ఉన్నాయి. అంటననారివో రైలు ద్వారా టొమాసినీ, అంబాటొన్ద్రజకా, అన్సిరాబబే నగరాలు అనుసంధానించబడి ఉన్నాయి. మరొక రైలు మార్గం ఫియనరంత్సోయా, మానాకరా నగరాలను కలుపుతుంది. మడగాస్కర్‌లో టొమాసినాలో తూర్పు తీరంలో ఉన్న నౌకాశ్రయం సముద్రమార్గ రవాణాకు సహకరిస్తుంది. మహాజంగా, అన్సింగరనాలో ఉన్న నౌకాశ్రయాలు దూరం కారణంగా తక్కువగా ఉపయోగించబడతాయి. 2038 లో టొన్నారో సమీపంలో సంస్థ మైనింగు ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత 2008 లో నిర్మించిన ఇయోలాలో సరికొత్తగా నిర్మించబడిన నౌకాశ్రయం, రియో ​​టింటోచే ప్రైవేటుగా నిర్వహించబడుతుంది. ఎయిర్ మడగాస్కర్ ద్వీపం అనేక చిన్న ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తుంది. ఇవి వర్షాకాలంలో రహదారులు కొట్టుకుపోయిన సమయంలో మాత్రమే అనేక మారుమూల ప్రాంతాలకు చేరడానికి వాయుమార్గ రవాణా సౌకర్యాలు అందిస్తాయి. మార్గాలను అందిస్తాయి.

ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ అయిన జిరామా జాతీయ స్థాయిలో నీటిసరఫరా, విద్యుత్తు సరఫరా వ్యవస్థలను నడుపుతుంది. దీనికి ప్రజలందరికీ అవసరమైన సౌకర్యాలను అందించే సమర్ధత లేదు. 2009 నాటికి మడగాస్కర్‌లోని ఫకోంటనీ ప్రజలలో 6.8% మాత్రమే జైరామా నీటిని అదించింది. అలాగే 9.5% ప్రజలకు మాత్రమే విద్యుత్తు సదుపాయం అందించబడింది. మడగాస్కర్ అధికారంలో 56% జలవిద్యుత్తు కేంద్రాలు పనిచేద్తున్నాయి. మిగిలిన 44% డీజిలు ఇంజిను జనరేటర్లు అందిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలో మొబైలు టెలిఫోను, ఇంటర్నెటు సదుపాయాలు విస్తారంగా ఉన్నాయి. కానీ ద్వీపంలోని గ్రామీణ ప్రాంతాలలో ఇవి పరిమితంగా ఉంటాయి. 30% జిల్లాలలకు మొబైలు టెలిఫోన్లు లేదా భూభాగ మార్గాలలో అనేక ప్రైవేటు టెలికమ్యూనికేషన్సు నెట్వర్కులు అందుబాటులో ఉంటాయి.

రేడియో ప్రసారాలు మాలాగసీ జనాభాకు అంతర్జాతీయ, జాతీయ స్థానిక వార్తలను అందజేస్తున్నాయి. ద్వీపం మొత్తంలో రేడియో ప్రసారాలను ప్రభుత్వసంస్థలు మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. స్థానిక లేదా ప్రాంతీయ పరిధి కలిగిన వందలాది ప్రభుత్వ, ప్రైవేటు స్టేషన్లు ప్రభుత్వ ప్రసారాలకు ప్రత్యామ్నాయాలను అందిస్తాయి. ప్రభుత్వ టెలివిజను ఛానలుతో, ప్రైవేటు యాజమాన్యంలోని టెలివిజను స్టేషన్లు మడగాస్కర్ అంతటా స్థానిక, అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. అనేక మీడియా సంస్థలు రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకులకు స్వంతంగా ఉన్నాయి. వీటిలో ఎం.బి.ఎస్ (రావలోమనానా యాజమాన్యం), వివా (రాజోలీనా యాజమాన్యం) వంటి మీడియా గ్రూపులు ఉన్నాయి. ఇవి రాజకీయ రిపోర్టింగుకు పరిమితమయ్యాయి.

మీడియా చారిత్రకపరంగా ప్రభుత్వంపై వారి విమర్శలను సెన్సారు చేయడానికి వివిధ స్థాయిలలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రిపోర్టర్లను అప్పుడప్పుడు బెదిరించడం లేదా వేధించడం జరుగుతుంది. మీడియా సంస్థలు కాలానుగుణంగా బలవంతంగా మూసివేయాలని వత్తిడి చేయబడుతుంటాయి. రాజకీయ విమర్శల మీద సెన్సారుషిపు అధికరించిన కారణంగా 2009 నుండి మాధ్యమ సెన్సార్షిపు మీద ఆరోపణలు అధికరించాయి. గత దశాబ్దంలో ఇంటర్నెటుకు అందుబాటు నాటకీయంగా అధికరించింది. 2011 డిసెంబరులో మాడగాస్కరులో 3,52,000 మంది నివాసితులు ఇంటి నుండి లేదా దేశంలోని అనేక ఇంటర్నెటు కేఫులలో సభ్యులుగా చేరారు.

గణాంకాలు

1900 నాటికి మడగాస్కర్ జనసంఖ్య 2.2 మిలియన్ల నుండి 25 మిలియన్లు ఉంటుందని అంచనా వేయబడింది. 2009 లో మడగాస్కర్‌లో వార్షిక జనాభా పెరుగుదల రేటు 2.9% ఉంది.

జనాభాలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 42.5% మంది, 15, 64 సంవత్సరాల మద్య వయస్సులో 54.5% మంది, 65 సంవత్సరాల కంటే అధికమైన వయసు కలిగిన ప్రజలు 3% ఉన్నారు. స్వతంత్రం తరువాత 1975 - 1993 మద్యకాలంలో రెండు జనరలు జనాభా గణనలు మాత్రమే నిర్వహించబడ్డాయి. ద్వీపంలోని తూర్పు పర్వత ప్రాంతాలు, తూర్పు తీరం అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. పాశ్చాత్య మైదానాలలో జంసాంధ్రత చాలా తక్కువగా ఉంటుంది.

సంప్రదాయ సమూహాలు

మడగాస్కర్ 
The regional distribution of Malagasy ethnic subgroups

మడగాస్కర్‌లో మడగాస్కర్ జాతి సమూహం 90% కంటే అధికంగా ఉన్నారు. వీరు 18 ఉపజాతులుగా విభజింపబడ్డారు. ఇటీవలి డి.ఎన్.ఎ. పరిశోధన సగటు మలగసీ వ్యక్తి జన్యుపరమైన ఆకృతి ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికా జన్యువుల మిశ్రితంగా ఉంటుందని తెలియజేసింది. అయినప్పటికీ కొంతమంది జన్యువులు ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికా, అరబు, భారతీయ, ఐరోపా జన్యుమూలాలను కలిగి ఉన్నారు. ఆగ్నేయాసియా ఆసియా లక్షణాలు - ముఖ్యంగా బోర్నియో దక్షిణ భాగం నుండి - మెరీనా ప్రధాన పర్వతాల ప్రజలలో అత్యధికంగా ఉన్నాయి. వారు అతిపెద్ద మలగాసి జాతి ఉపవిభాగంగా జనాభాలో 26% మంది ఉన్నారు. తీరప్రాంత ప్రజలలోని కొన్ని వర్గాలలో (కోటియర్లు అని పిలుస్తారు) తూర్పు ఆఫ్రికా లక్షణాలను కలిగి ఉంటారు. అతిపెద్ద తీరప్రాంత జాతుల ఉపవిభాగాలు బెట్సిమిసారకా (14.9%), సిమిహెట్టి - సకాలావ (6%) ఉన్నారు.

Malagasy ethnic subgroups Regional concentration
Antankarana, Sakalava, Tsimihety Former Antsiranana Province
Sakalava, Vezo Former Mahajanga Province
Betsimisaraka, Sihanaka, Bezanozano Former Toamasina Province
Merina Former Antananarivo Province
Betsileo, Antaifasy, Antambahoaka, Antaimoro, Antaisaka, Tanala Former Fianarantsoa Province
Mahafaly, Antandroy, Antanosy people, Bara, Vezo Former Toliara Province

మడగాస్కర్‌లో చైనీయుల, భారతీయ, కొమొరోసు మూలాలు కలిగిన అల్పసంఖ్యాక ప్రజలు ఉన్నారు. అలాగే చిన్న ఐరోపా (ప్రధానంగా ఫ్రెంచి) జనాభా ఉంది. 20 వ శతాబ్దం చివరలో వలసలు ఈ అల్పసంఖ్యాక జనాభాను తగ్గించాయి. అప్పుడప్పుడు ఆకస్మిక తరంగాలలో 1976 లో మహాజంగాలో కొమారో వ్యతిరేక అల్లర్ల తరువాత కొమారియన్ల నిష్క్రమణ వంటివి సంభవించాయి. మాలాగాసియా ప్రజల సంఖ్య గణనీయమైన సంఖ్యలో ఉంది. 1958 లో 68,430 ఉన్న ఐరోపియన్ల సంఖ్య స్వాతంత్ర్యం తరువాత తగ్గుముఖం పట్టింది. మూడు దశాబ్దాల తరువాత ఈ సంఖ్య 17,000 కు చేరింది 1980 ల మధ్యకాలంలో మడగాస్కర్‌లో సుమారు 25,000 మంది కొమోర్యన్లు, 18,000 మంది భారతీయులు, 9,000 మంది చైనీయులు నివసించారు.

భాషలు

మడగాస్కర్ 
A Malagasy child

మలగాసియాయా భాషకు మలయా-పాలినేసియన్ భాషలు మూలంగా ఉన్నాయి. ఇది ద్వీపం అంతటా సాధారణంగా వాడుకలో ఉంటుంది. మలగాసిలో పలు మాండలికాలు వాడుకలో ఉన్నప్పటికీ అవి పరస్పరం చక్కగా అర్ధమయ్యే రీతిలో ఉంటాయి. అనేక మాండలికాలు రెండు ఉపసమూహాలతో ఒకదానితో ఒకటి కలుపుతాయి: తూర్పు మలగసీ తూర్పు అటవీ ప్రాంతంలో అంటననరివొ మేరీనా మాండలికం వాడుకలో ఉంది. పశ్చిమ మలగసీ పశ్చిమ తీరప్రాంతాలలో (మడగాస్కర్‌లో ఫ్రెంచ్ పాలన అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీల కాలంలో ఫ్రెంచి అధికారిక భాష అయ్యింది) వాడుకలో ఉంది. 1958 లో మొట్టమొదటి జాతీయ రాజ్యాంగంలో మాలగసీ, ఫ్రెంచి భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. మడగాస్కర్ ఒక ఫ్రాంకోఫోన్ దేశం. ఎక్కువగా విద్యావంతులైన జనాభాలో ఫ్రెంచి రెండవ భాషగా వాడుకలో ఉంది. ఇది అంతర్జాతీయ సమాచార మార్పిడి కోసం ఉపయోగించబడుతుంది. పశ్చిమ తీరప్రాంతాలలో మాట్లాడే మాండలికాన్ని పాశ్చాత్య మలగసీ అంటారు.

1992 లో రాజ్యాంగంలో అధికారిక భాషలు నమోదు చేయబడలేదు. అయితే మాలాగజీ జాతీయ భాషగా గుర్తించబడింది. అయినప్పటికీ చాలామంది వర్గాలలో ఇప్పటికీ మలగాసి, ఫ్రెంచ్ అధికార భాషలుగా ఉన్నాయి. చివరికి పౌర భాషలో అధికారిక పత్రాలను ప్రచురించడం అనేది రాజ్యాంగ విరుద్ధం కావటంతో అధికారపత్రాలు ఫ్రెంచిభాషలో ప్రచురించడం రాజ్యాంగ విరుద్ధమని 2000 ఏప్రెలులో ఒక పౌరుడు చట్టపరమైన కేసును ప్రారంభించాడు. అధికార రాజ్యాంగ న్యాయస్థానం దీనిని పరిశీలించి దేశంలో ఒక భాషా చట్టం లేనప్పటికీ ఫ్రెంచి భాష అధికారిక భాష పాత్రను పోషిస్తుందని ప్రకటించింది.

2007 రాజ్యాంగంలో మలగసీ జాతీయ భాషగా మిగిలిపోయింది. అయినప్పటికీ అధికారిక భాషలు తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి: మాలాగజీ, ఫ్రెంచి, ఆంగ్లం. 2010 నవంబరు ప్రజాభిప్రాయ సేకరణలో ఓటర్లు ఆమోదించిన రాజ్యాంగం నుంచి ఇంగ్లీషు అధికారిక భాషగా తొలగించబడింది. ప్రజాభిప్రాయ ఫలితంగా అధికారిక, జాతీయ భాషా విధానానపర్యవసానాలు పారదర్శకంగా లేవని రాజకీయ ప్రత్యర్థులచే గుర్తించబడలేదు.

మతం

Religion in Madagascar (2010) according to the Pew Research Center

  Protestantism (51.8%)
  Roman Catholicism (38.1%)
  Other Christian (1.1%)
  Islam (3%)
  Folk religions (5.4%)
మడగాస్కర్ 
A Famadihana reburial ceremony.

2011 లో " యు.ఎస్ డిపార్టుమెంటు అఫ్ స్టేట్ " ఆధారంగా మడగాస్కర్‌లో 41% క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు, 52% సాంప్రదాయ మతాలకు కట్టుబడి ఉన్నారని భావిస్తున్నారు. ఇది ఇప్పటికీ ఉనికిలో ఉన్న ప్రజలకు, రేజాన (పూర్వీకులు) ప్రాధాన్యత ఇస్తుంది. కానీ 2010 లో " ప్యూ రీసెర్చి సెంటరు " ఆధారంగా జనాభాలో 85% మంది క్రైస్తవనతాన్ని అనుసరిస్తున్నారు. అయితే మడగాస్కర్‌లో కేవలం 4.5% జానపద మతాలను అభ్యసించారు. క్రైస్తవుల మధ్య, ప్రొటెస్టెంటిజం అనుసరించే ప్రజలు రోమను కాథలిక్కుల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు.

పూర్వీకుల పూజల సంప్రదాయం విస్తారంగా సమాధి భవనం నిర్మాణాలకు దారితీసాయి. అదేవిధంగా పర్వతప్రాంతాల ప్రజలు " ఫామాడిహానా " సంప్రదాయాలను అనుసరిస్తుంటారు. మరణించిన కుటుంబ సభ్యుల అవశేషాలు సమాధినుండి వెలుపలకు తీసి తాజా పట్టు బట్టలతో తిరిగి చుట్టబడతాయి. ఫమదిహానా సందర్భంలో దీనిని ప్రియమైన పూర్వీకుల జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఇది కుటుంబం, కమ్యూనిటీతో తిరిగి చేరి ఆనందించడానికి అవకాశం కల్పిస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నివాసితులు తరచూ విందుకు ఆహ్వానించబడతారు. ఇక్కడ ఆహారం, రం అందించి సత్కరిస్తారు. ఒక బృందగానం, ఇతర సంగీత వినోదం విందులో భాగంగా ఉంటాయి. పూర్వీకుల గురించి ఆలోచించడం, వాటికి కట్టుబడి ఉండడం తమను ఈ లోకానికి తీసుకువచ్చిన పెద్దలను జీవించిన సమయంలోనూ మరణించిన తరువాత కూడా గౌరవించడం అవసరమని భావిస్తారు. ఇలా చ్చేయడం ద్వారా వారు తమకు శుభం కలుగజేస్తారని విశ్వసిస్తారు. పూర్వీకులను గౌరవించనట్లైతే తమకు కష్టాలు, దురదృష్టకరమైన సంఘటనలు సంభవిస్తాయని వారు విశ్వసిస్తారు.

ప్రస్తుత అనేకమంది క్రైస్తవులు తమ మత విశ్వాసాలతో పూర్వీకులను గౌరవించే సంప్రదాయాన్ని కలిపారు. ఉదాహరణకి సాంప్రదాయిక సమాధుల ఆచారాలకు ముందు చర్చిలో వారి మృతదేహాన్ని ఆశీర్వదించడం లేక ఫమదిహనా సంప్రదానికి ఒక క్రైస్తవ అధికారిని ఆహ్వానించవచ్చు. మలగసీ కౌంసిలు ఆఫ్ చర్చెసు (రోమను కాథలికు, చర్చి ఆఫ్ జీసస్ క్రైస్టు, లూథరను, ఆగ్లికను) నాలుగు పురాతన, అత్యంత ప్రముఖ క్రైస్తవ చర్చీలు మాలగసీ రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా ఉంది.

ద్వీపంలో ఇస్లాం కూడా ఆచరించబడుతోంది. అరబు, సోమాలియా ముస్లిం వర్తకులు మధ్యయుగ కాలంలో మడగాస్కర్‌కు ఇస్లాంను మొదటిసారి తీసుకుని వచ్చారు. వీరు తూర్పు తీరంలో అనేక ఇస్లామికు పాఠశాలలను స్థాపించారు. అరబికు లిపి, పదాల ఉపయోగం, ఇస్లామికు జ్యోతిషశాస్త్రం, ద్వీపం అంతటా వ్యాపించి ఉన్నాయి. ఇస్లామికు మతం కొద్దిపాటి ఆగ్నేయ తీరప్రాంత సమాజాలలో మాత్రమే ఉనికిలో ఉంది. ప్రస్తుతం మడగాస్కర్‌లో ముస్లింలు 3-7% ఉన్నారు. వీరు వాయవ్య ప్రావిన్సులైన మహాజంగా, అన్సిరననాలో అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. ముస్లింలలో సున్నీ ముస్లిములు అత్యధికంగా ఉన్నారు. ముస్లింలు మలగాసీ జాతి, భారతీయులు, పాకిస్థానీలు, కొమొరియను మూలాలకు చెందినవారై ఉన్నారు.

19 వ శతాబ్దం చివరలో భారతదేశంలోని సౌరాష్ట్ర ప్రాంతం నుండి వలసవచ్చిన గుజరాతీ ప్రజల ద్వారా హిందూమతం మడగాస్కర్‌కు పరిచయం చేయబడింది. మడగాస్కర్‌లో హిందువులు అధికంగా గుజరాతీ లేదా హిందీలో ఇంట్లో మాట్లాడతారు.

ఆరోగ్యం

మడగాస్కర్ 
Maternal mortality declined after 1990 but rose sharply after 2009 because of political instability.

పట్టణ ప్రాంతాల్లో వైద్య కేంద్రాలు, మందులు, ఆసుపత్రులు కనిపిస్తాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో (ముఖ్యంగా అంటననారివోలో) కేంద్రీకృతమై ఉన్నాయి. చాలామంది మలగాసిసు ప్రజలకు (ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలీ) వైద్య సేవలు అందడం లేదు. వీరిలో నొప్పి నివారణలకు చాలామంది సంప్రదాయ వైద్యులను ఆశ్రయిస్తారు. సగటు మలగసీయుల ఆదాయానికి సంబంధించి వైద్య ఖరీదైనదిగా మారింది. శిక్షణ పొందిన వైద్య నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2010 లో మడగాస్కర్‌లో 10,000 మందికి మూడు ఆసుపత్రి పడకలు ఉండగా. మొత్తం 3,150 వైద్యులు, 5,661 నర్సులు, 385 కమ్యూనిటీ హెల్త్ కార్మికులు, 175 ఫార్మసిస్టులు, 57 మంది దంతవైద్యులు ఉన్నారు. 2008 లో ప్రభుత్వం ఖర్చులో 15% ఆరోగ్య రంగం వైపు మళ్ళించబడింది. ఆరోగ్యంపై సుమారు 70% ఖర్చులు ప్రభుత్వంచేత అందించబడుతున్నాయి. 30% అంతర్జాతీయ దాతలు, ఇతర ప్రైవేటు వనరుల ద్వారా భర్తీ చేయబడుతుంది. ప్రభుత్వం కమ్యూనుకు కనీసం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందిస్తుంది. ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాంతాలలో (ముఖ్యంగా కేంద్ర పర్వత ప్రాంతాలలో) కేంద్రీకృతమై ఉన్నాయి.

అందుబాటులోకి తీసుకురావడంలో ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ ఆరోగ్య సేవలు గత 20 సంవత్సరాలలో అభివృద్ధి ధోరణిని చూపించాయి. హెపటైటిస్ బి, డిఫెట్రియా, తట్టు వంటి అనారోగ్య వ్యాధులకు వ్యతిరేకంగా శిశు రోగ నిరోధకత ప్రస్తుతం సగటున 60% అధికరించింది. తక్కువగా అయినా వైద్య సేవలు, చికిత్సల లభ్యత అభివృద్ధి చెందుతూ ఉంది. 1990 లో మహిళకు సంతానోత్పత్తి రేటు స్త్రీకి 6.3 ఉండగా 2009 నాటికి 4.6 కి తగ్గించబడింది. 2011 లో 14.8% టీన్ గర్భధారణ రేటు, ఆఫ్రికా సగటు కంటే చాలా అధికంగా ఉంది. ఇది వేగవంతమైన జనాభా పెరుగుదలకు దోహదపడింది. 1990 లో 10,00,000 ప్రసవాలలో ప్రసూతి మరణాల రేటు 484.4, 2008 లో ప్రసూతి మరణాల రేటు 371.1 ఉండగా 2009 తిరుగుబాటు ఫలితంగా 2010 నాటికి 440కు చేరుకుంది. 2011 లో శిశు మరణాల రేటు 1000 జననలలో 41 సంభవించాయి. సంవత్సరాల లోపు పిల్లల మరణాలు 1,000 మందిలో 61 సంభవించాయి. ఎయిడ్సు సంక్రమణ రేట్లు ప్రధాన ఆఫ్రికాలోని అనేక దేశాల కంటే తక్కువగా ఉన్నాయి. వయోజన జనాభాలో 0.2% ఉంది. అయినప్పటికీ స్కిస్టోసోమియాసిసు, మలేరియా, లైంగిక సంక్రమణ వ్యాధులు మడగాస్కర్‌లో సర్వసాధారణం. ఆఫ్రికాలో అత్యంత తక్కువ మలేరియా మరణాలు (10,00,000 మందికి 8.5) సంభవించాయి. దోమతెరలు అధికవాడకం కారణంగా మలేరియా మరణాల రేటు ఆఫ్రికాదేశాలలో మడగాస్కర్‌లో అత్యల్పంగా ఉంది. 2009 లో అఆయుఃపరిమితి పురుషులకు 63 సంవత్సరాలు, మహిళలకు 67 సంవత్సరాలు.

2017 లో మడగాస్కర్ పట్టణ ప్రాంతాలను ప్రభావితం చేసిన బుబోనిక్ ప్లేగు (నల్లటి చావుగా కూడా పిలుస్తారు) సంభవించింది.

విద్య

మడగాస్కర్ 
Education access and quality were prioritized under Ravalomanana.

19 వ శతాబ్దానికి ముందు మడగాస్కర్‌లోని విద్యలు మొత్తం అనధికారికంగా ఉండేవి. పూర్వీకులు, పెద్దలకు గౌరవంతో సహా సాంఘిక, సాంస్కృతిక విలువలను అలవడజేస్తూ అభ్యాస నైపుణ్యాలను నేర్పటానికి ఉపయోగపడతాయి. 1818 లో లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎం.ఎస్) సభ్యులు తొమాసానాలో మొట్టమొదటి ఐరోపా శైలి పాఠశాల స్థాపించారు. రాజు మొదటి రాడమా ప్రముఖుల పిల్లలకు ప్రాథమిక అక్షరాస్యత పెంపొదించడానికి సంఖ్యాశాస్త్రం బోధించడానికి ఇమిలీనా అంతటా ఈ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడానికి ఎల్.ఎం.ఎస్.ను ఆహ్వానించాడు. 1835 లో మొదటి రనవలనోనా ఈ పాఠశాలలు మూసివేసింది. కానీ ఆమె మరణించిన తరువాత తిరిగి ఈ పాఠశాలలు తెరిచి విస్తరించబడ్డాయి.

19 వ శతాబ్దం చివరినాటికి పూర్వ-వలసవాద ఉప-సహారా ఆఫ్రికాలో మడగాస్కర్‌లో అత్యంత అభివృద్ధి చెందిన ఆధునిక పాఠశాల వ్యవస్థను కలిగిన దేశంగా మారింది. కాలనీల కాలంలో తీర ప్రాంతాలలో పాఠశాలల అందుబాటును విస్తరించింది. ఫ్రెంచి భాష, ప్రాథమిక పని నైపుణ్యాలు పాఠ్య ప్రణాళిక కేంద్రంగా మారాయి. వలసరాజ్యపు మొదటి రిపబ్లికులో ఫ్రెంచి జాతీయుల ఉపాధ్యాయులగా, బోధనా భాషగా ఫ్రెంచి మీద ఒక నిరంతర విశ్వాసం ఉండేది. మాజీ వలసరాజ్యంగా మారిన తరువాత పూర్తి విభజన కోరుకుంటున్నవారికి ఇది అసంతృప్తి కలిగించింది. ఫలితంగా " సోషలిస్టు సెకండు రిపబ్లికు " ఫ్రెంచి అధ్యాపకులు, ఇతర జాతీయులను బహిష్కరించింది. మాలాగసీ బోధనా భాషగా ప్రకటించబడింది. యువ మలగసీలకు వేగవంతంగా ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చి రెండు సంవత్సరాల జాతీయ సేవా విధానాలలో తప్పనిసరిగా దూరప్రాంత గ్రామీణ పాఠశాలల్లో బోధించడానికి పంపారు.

ఈ విధానం మలగసిజేషను అని పిలువబడింది. తీవ్రమైన ఆర్థిక తిరోగమనం, విద్యా నాణ్యత నాటకీయంగా క్షీణించింది. ఈ కాలంలో పాఠశాలలు సాధారణంగా ఫ్రెంచి భాష లేదా అనేక ఇతర అంశాలకు నైపుణ్యం సాధించడంలో విఫలమయ్యాయి. ఉపాధిని పొందేందుకు ఇబ్బంది పడ్డాయి. అనేకమంది అనధికారిక ఉద్యోగాలు లేదా నల్ల మార్కెట్లో ఉద్యోగాలు పొందడం, బలవంతంగా తక్కువ-చెల్లించే ఉద్యోగాలు చేయవలసిన అగత్యానికి గురైయ్యారు. 1975 నుండి 2001 వరకు (1992 నుండి 1996 వరకు ఆల్బర్టు జాఫి సంక్షిప్త అధ్యక్షుడిగా కొనసాగిన కాలం మినహాయింపుగా) రాట్సిరాకా అధికారంలో కొనసాగాడు. అతని పదవీకాలంలో విద్యలో గణనీయమైన మెరుగుదలలు సాధించలేకపోయారు.

రావలోమననా పరిపాలన (2002-09) పాలనలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది ప్రస్తుతం ఉచిత, నిర్బంధవిద్య (6 నుండి 13 ఏళ్ల వయస్సు) గా చేయబడింది. ఐదు సంవత్సరాలు ప్రాథమిక పాఠశాల, దాని తరువాత నాలుగు సంవత్సరాలలో ఉన్నత మాధ్యమిక స్థాయి, మూడు సంవత్సరములు ఉన్నతస్థాయి విద్యావిధానం ఉంది. రావలోమనానా మొదటి పదవీకాల సమయంలో వేలాది కొత్త ప్రాథమిక పాఠశాలలు, అదనపు తరగతి గదులను నిర్మించారు. పాత భవనాలు పునర్నిర్మించబడ్డాయి. వేలాది మంది కొత్త ప్రాథమిక ఉపాధ్యాయులు నియమించబడ్డారు, శిక్షణ పొందారు. ప్రాథమిక పాఠశాల ఫీజులు తొలగించబడ్డాయి. ప్రాథమిక విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల సరఫరా కలిగి ఉన్న కిట్లు పంపిణీ చేయబడ్డాయి.

ప్రతి సమాజంలో ఒక ఫొకోంటనీకి కనీసం ఒక ప్రాథమిక పాఠశాలకు, లోవరు సెకండరీ పాఠశాలకు భరోసా కల్పించాయి. కనీసం ఒక ఉన్నత సెకండరీ పాఠశాల పెద్ద పట్టణ కేంద్రం ప్రతి స్థానంలో ఉంటుందని ప్రభుత్వ పాఠశాల నిర్మాణ కార్యక్రమాలు హామీ ఇస్తున్నాయి. నేషనలు పబ్లికు యూనివర్శిటీ మూడు శాఖలు అంటననారివో, మహాజంగా, ఫినారన్సాంతోయాలో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ టీచరు-శిక్షణ కళాశాలలు, అనేక ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక కళాశాలలు ఉంటాయి.

విద్యా ప్రాప్తి అధికరించిన ఫలితంగా 1996 - 2006 మధ్య నమోదు రేట్లు రెట్టింపు కంటే అధికం అయ్యాయి. అయినప్పటికీ విద్య నాణ్యత బలహీనంగా ఉంది. ఒకే తరగతిలో తిరిగి చదవడం, పాఠశాల నుండి నిలిచిపోవడం అధిక శాతం ఉన్నాయి. రవలోమనా రెండవ పదవీ కాలంలో విద్యావిధానం నాణ్యతమీద దృష్టిసారించింది. ప్రాథమిక ఉపాధ్యాయులు నియామకం కొరకు కనీస విద్యా ప్రమాణాలను అధికరించడం, ఒక మిడిలు స్కూలు లీవింగు సర్టిఫికేటు (బి.ఇ.పి.సి) ఒక హై స్కూలు లీవింగు సర్టిఫికేటు (బి.ఎ.సి), సంస్కరించబడిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం వంటి నాణ్యతాభివృద్ధి చర్యలు చేపట్టబడ్డాయి. 2008 లో మొత్తం ప్రభుత్వ ఖర్చులో 13.4% ఉండగా జి.డి.పి.లో 2.9%, ప్రాథమిక తరగతి గదులలో 47: 1 ఉపాధ్యాయుల సగటు విద్యార్థుల నిష్పత్తితో నిండి ఉన్నాయి.

సంస్కృతి

మడగాస్కర్లో ఉన్న అనేక జాతుల ఉపజాతులు తమ సొంత గుర్తింపుల విశ్వాసాలు, ఆచరణలు, చారిత్రాత్మికంగా వారిప్రత్యేతను వెల్లడించే జీవిత మార్గాలకి కట్టుబడి ఉంటాయి.అయినప్పటికీ ద్వీపమంతా చాలా సమైక్యంగా ఉండే కొన్ని సాంస్కృతిక లక్షణాలు ఉన్నాయి. ఇవి బలమైన ఐక్యత గల మలగాసియా సాంస్కృతిక గుర్తింపును సృష్టించాయి. ఒక అందరినీ కలిపే సమైక్య భాష, అదనంగా సృష్టికర్త దేవుడు, పూర్వీకులను పూజించే సాంప్రదాయిక మత విశ్వాసాలను పంచుకుంటూ, సాంప్రదాయ మలగసీ ప్రపంచ దృక్పథం ఏర్పరచుకున్నారు. ఫిహావానన (సంఘీభావం), విన్టానా (విధి), టోడీ (కర్మ), హసీనా పవిత్ర జీవనశైలి సాంప్రదాయక సంఘాలు ఏర్పడ్డాయి. నమ్మకాల ప్రేరణతో సంఘంలో, కుటుంబం లోపల అధికారం చట్టబద్ధం చేయబడింది. ద్వీపమంతా సాధారణంగా కనిపించే ఇతర సాంస్కృతిక అంశాలు మగ సున్నతి ఆచారం. బలమైన బంధుత్వ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఇంద్రజాలం, భక్తి, జ్యోతిష్యం, మంత్ర వైద్యం వంటి బలమైన నమ్మకం ఏర్పరచుకున్నారు. ఉన్నత వర్గాలు, సామాన్య ప్రజలు, బానిసలు సాంప్రదాయిక సాంఘిక తరగతుల విభజన జరిగింది.

సాంఘిక కులాలు చట్టపరంగా గుర్తించబడకపోయినప్పటికీ పూర్వీకుల కుల అనుబంధం సాంఘిక స్థితి, ఆర్థిక అవకాశాలు, సమాజంలో ప్రాముఖ్తలకు మూలంగా ఉంది. అరబ్బులు పరిచయం చేసిన సాంప్రదాయ జ్యోతిషశాస్త్ర వ్యవస్థ ఆధారంగా వివాహాలు, ఫమదిహానా వంటి ముఖ్యమైన సంఘటనల కోసం అత్యంత పవిత్రమైన రోజులను గుర్తించడానికి ఉపయోగించబడింది. వలసవాదానికి పూర్వ కాలంలో ఉన్న అనేక మగాసి కమ్యూనిటీల ప్రముఖులు సాధారణంగా ఒంబియాసీ (ఒలోనా-బీ-హసినా నుండి "చాలా ధర్మప్రవర్తన కలిగిన మనిషి") అని పిలవబడే సలహాదారులను నియమించుకున్నారు. ఆగ్నేయ ఆంటోమోరో జాతి సమూహానికి ప్రారంభ అరబు సెటిలర్లు పూర్వీకులని చెప్పుకుంటారు.

మలగసీ సంస్కృతి వైవిధ్య మూలాలు పారదర్శకమైన వ్యక్తీకరణలలో స్పష్టంగా ఉన్నాయి. మడగాస్కర్ అత్యంత సంగీత వాయిద్యం వలిహా. దక్షిణ బోర్నెయో నుండి వచ్చి స్థిరపడిన ప్రారంభప్రజలు మడగాస్కర్‌కు తీసుకురాబడిన ఒక వెదురు గొట్టం జితే, ఇండోనేషియా, ఫిలిప్పీంసులో కనిపించే వాటికి సమానంగా ఉంటుంది. మడగాస్కర్‌లో సాంప్రదాయిక గృహాలు సింబాలిజం, నిర్మాణం పరంగా దక్షిణ బోర్నియో గృహనిర్మాణం పోలి ఉంటాయి. ఇందులో పైకప్పు, కేంద్ర మద్దతు స్తంభముతో దీర్ఘచతురస్రాకార ఆకారంలో నిర్మించబడి ఉంటుంది. పూర్వీకుల విస్తార పూజలు ప్రతిబింబిస్తూ అనేకప్రాంతాలలో నిర్మించిన సమాధులు సాంస్కృతికప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఇవి మరింత మన్నికైన పదార్థం (సాధారణంగా రాతితో నిర్మించబడ్డాయి) నివాస గృహాల కంటే మరింత అధికమైన అలంకరణలను ప్రదర్శిస్తాయి. పట్టు ఉత్పత్తి, నేత ద్వీపంలో మొట్టమొదటి స్థిరపడినవారివని గుర్తించవచ్చు. మడగాస్కర్ జాతీయ దుస్తులు, నేసిన లాంబా, వైవిధ్యమైన, అభివృద్ధి చేసిన కళగా రూపొందింది.

ఆగ్నేయాసియా సాంస్కృతిక ప్రభావం మాలగసీ వంటలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ప్రతి భోజనంలో బియ్యం వినియోగిస్తారు. వీటిలో సాధారణంగా వివిధ రకాల కూరగాయల లేదా మాంసంతో తయారుచేసిన వంటకం ఒకటి ఉంటుంది. ఆఫ్రికా ప్రధాన భూభాగంలోని సంప్రదాయాలలో పవిత్రమైన ప్రాముఖ్యత కలిగిన జీబ్యూ పశువుల యజమాన్యం గొప్పసంపదగా విశ్వసించబడుతుంది. పశువుల దోపిడీ నిజానికి మడగాస్కర్‌లోని మైదానాల్లోని యువకుల కొరకు ఒక ఆచారంగా ఉంది. అతిపెద్ద పశువుల మందలు ఉండే మడగాస్కర్ మైదానాలలో ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా ఉంటుంది. పశువులు రక్షించడానికి నైరుతి ప్రాంతంలో పశువుల కాపరులకు ప్రమాదకరమైనదిగా కొన్నిసార్లు ఘోరమైన నేరారోపణగా మారింది. సాయుధ వృత్తిపరమైన దోపిడీదారుల నుండి తమ పశువులను రక్షించడానికి పశువుల కాపర్లు కూన్ని సమయాలలో ఈటెలను ప్రయోగిస్తుంటారు.

కళలు

మడగాస్కర్ 
A Hiragasy dancer.

మడగాస్కర్‌లో పలు రకాల మౌఖికసాహిత్యం, వ్రాతసాహిత్యం అభివృద్ధి చెందింది. సాహిత్యం హేన్టినీ (కవిత్వం), కబరీ (పబ్లికు సంభాషణ), ఓబొలోనా (సామెతలు) రూపాలలో వ్యక్తీకరించబడింది. ఈ సంప్రదాయాలను ఉదహరించిన ఇతిహాసం ఐబోనియా శతాబ్దాలుగా ద్వీపంలో అనేక విభిన్న రూపాలలో అందచేయబడింది. ఇది సాంప్రదాయ మలగాసి కమ్యూనిటీల విభిన్న పురాణకథనాలు, నమ్మకాలకు సంబంధించిన అవగాహనను అందిస్తుంది. ఈ సాంప్రదాయం 20 వ శతాబ్దంలో జీన్-జోసెఫ్ రబరీవెలో వంటి కళాకారులచే కొనసాగింది. ఆయన ఆఫ్రికా మొట్టమొదటి ఆధునిక కవిగా గుర్తించబడ్డాడు. ఎలీ రాజానరిసను మాలాజీ కవిత్వం కొత్త తరంగ నమూనాగా భావించబడుతుంది. మడగాస్కర్ ఒక గొప్ప సంగీత వారసత్వాన్ని కూడా అభివృద్ధి చేసింది. తీరప్రాంత విలాసవంతమైన హైలాండు హిరాగసీ వంటి డజన్ల కొద్దీ ప్రాంతీయ సంగీత శైలులు చోటుచేసుకున్నాయి. గ్రామ సమావేశాలు, స్థానిక నృత్య వేదికలు, జాతీయ ప్రసారాలలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. మడగాస్కర్‌లో సాంస్కృతిక సంగీతంలో పెరుగుతున్న సంస్కృతిని యువజన అకాడమీలు, సంస్థలు, ఆర్కెస్ట్రాలు ప్రోత్సహించాయి.

ద్వీపమంతా ప్లాస్టికు ఆర్ట్సు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. రాఫియా, ఇతర స్థానిక వృక్షపదార్ధాలను పట్టు వస్త్రం, లంబ ఉత్పత్తి సంప్రదాయానికి అదనంగా, కాళ్ళపట్టలు, బుట్టలు, పర్సులు, టోపీలు వంటి విస్తార శ్రేణి ఆచరణాత్మక వస్తువులను సృష్టించేందుకు ఉపయోగిస్తున్నారు. చెక్క బొమ్మలు అత్యంత అభివృద్ధి చెందిన కళా రూపంగా చెప్పవచ్చు. బాల్కనీ రెయిలింగులు, ఇతర వాస్తు శిల్పకళల అలంకరణలో ప్రత్యేక ప్రాంతీయ శైలులు కనిపిస్తాయి. శిల్పులు వివిధ రకాల ఫర్నిచరు, గృహోపకరణాలు, అలోయో ఫెల్లెరీ పోస్టులు, చెక్క శిల్పాలను తయారు చేస్తారు. వీటిలో చాలా పర్యాటక మార్కెట్టు కోసం తయారు చేయబడతాయి. సెంట్రల్ పర్వత ప్రాంతాలలోని జాఫిమనీరి ప్రజల అలంకార, చెక్క పని సంప్రదాయాలు 2008 లో యునెస్కో " ఇంటరాంజిబులు కల్చరలు హెరిటేజు " జాబితాలో పొందుపరచబడ్డాయి.

అంటిమొరొ ప్రజల మధ్య పువ్వులు, ఇతర అలంకరణ సహజ పదార్ధాలతో పొందుపర్చిన కాగితం ఉత్పత్తి పర్యావరణ-పర్యాటకుల కొరకు సమాజం ప్రారంభించిన సుదీర్ఘ-సంప్రదాయంగా ఉంది. దారంతో చేసే ఎంబ్రాయిడరీ పని చేతితో తయారు చేస్తారు. అలాగే స్థానిక చేతిపనుల విఫణిలో టేబులు క్లాతు, ఇతర గృహ వస్త్రాలు విక్రయించబడతాయి. అంటనేనారివోలో చిన్న, పెద్ద సంఖ్యలో జరిగే సుందరమైన కళా ప్రదర్శనశాలలలో అనేక ఇతర పట్టణ ప్రాంతాల స్థానిక కళాకారుల చిత్రలేఖనాలను అందిస్తాయి. రాజధానిలోని హోసోట ఓపెన్-ఎయిర్ ఎగ్జిబిషన్ వంటి వార్షిక కళా కార్యక్రమాలు ఉంటాయి.

క్రీడలు

మడగాస్కర్ 
Moraingy is a traditional martial art of Madagascar.

మడగాస్కర్‌లో అనేక సంప్రదాయ వినోదాలు ఉద్భవించాయి. మోరింగి, ఒక రకమైన ముష్టి యుద్ధము తీరప్రాంత ప్రాంతాలలో ప్రముఖ ప్రేక్షకాదరణ కలిగిన క్రీడగా ఉంది. ఈ క్రీడలో సాంప్రదాయకంగా పురుషులు పాల్గొంటారు. అయినప్పటికీ మహిళలు ఇటీవల పాల్గొనడం ప్రారంభించారు. టోలోను-ఒబ్బి అనే జీబూ పశువుల కుస్తీ, అనేక ప్రాంతాలలో అభ్యసించబడుతుంది. క్రీడలతో అనేక రకాల ఆటలు ఆడతారు. ఫినోరోనాలో హైలాండు ప్రాంతాల అంతటా విస్తారంగా ఆడబడుతున్న బోర్డు ఆట. జానపద పురాణాల ఆధారంగా రాజా ఆండ్రియాంజికా ఆయన తండ్రి రాలంబో తర్వాత వారసత్వం పొందడానికి ఆండ్రియాజకా, అన్నతో " ఫనోరనా " ఆట ఆడి గెలుపొంది పాలనాబాధ్యతలకు వారసుడయ్యాడని విశ్వసించబడుతుంది.

గత రెండు శతాబ్దాల్లో మడగాస్కర్‌కు పాశ్చాత్య వినోద కార్యక్రమాలను పరిచయం చేశారు. రగ్బీ యూనియను మడగాస్కర్ జాతీయ క్రీడగా పరిగణించబడుతుంది. సాకరు క్రీడ కూడా ప్రజాదరణ పొందింది. మడగాస్కర్ పెంటంక్యూ ఒక ప్రపంచ ఛాంపియనుగా నిలిచింది. ఇది లాను బౌలింగు లాంటి ఒక ఫ్రెంచి క్రీడ. ఇది పట్టణ ప్రాంతాలలో, పర్వతప్రాంతాలు అంతటా విస్తృతంగా ఆడతారు. స్కూలు అథ్లెటిక్సు కార్యక్రమాలలో సాధారణంగా సాకరు, ట్రాకు అండ్ ఫీల్డు, జూడో, బాక్సింగు, మహిళల బాస్కెట్బాలు, మహిళల టెన్నిసు ఉన్నాయి. 1964 లో మడగాస్కర్ ఒలంపికు క్రీడలకు మొదటి పోటీదారుడిని పంపింది. ఆఫ్రికా క్రీడలలో కూడా పోటీ పడింది. స్కౌటింగు మూడు స్కౌటింగు క్లబ్బులు దాని సొంత స్థానిక సమాఖ్య మడగాస్కర్‌లో ప్రాతినిధ్యం వహిస్తూఉంది. 2011 లో 14,905 మంది సభ్యులు నమోదైనట్లు అంచనా వేయబడింది.

అంటనానరివో ఆధునిక సౌకర్యాల కారణంగా 2011 ప్రపంచ ఎఫ్.ఐ.బి.ఎ. ​​ఆఫ్రికా చాంపియన్షిపు, 2009 ఎఫ్.ఐ.బి.ఎ. ​​ఆఫ్రికా చాంపియన్షిపు ఫర్ వుమెను, [165] 2014 ఎఫ్.ఐ.బి.ఎ. ​​ఆఫ్రికా అండరు -18 ఛాంపియన్షిపు, ది 2013 Fఎఫ్.ఐ.బి.ఎ.​​ఆఫ్రికా అండరు -16 చాంపియన్షిపు, 2015 ఎఫ్.ఐ.బి.ఎ. ​​ఆఫ్రికా అండరు -16 ఛాంపియన్షిపు ఉమన్ వంటి ఆఫ్రికాలో అత్యుత్తమ అంతర్జాతీయ బాస్కెట్బాలు పోటీలకు ఆతిథ్యం ఇచ్చే హక్కులను పొందింది.

ఆహారసంస్కృతి

మాలగసీ వంటకాలు ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా, భారతీయ, చైనా, ఐరోపా పాక సంప్రదాయాల విభిన్న ప్రభావాలను ప్రతిబింబిస్తాయి. మలగాసీ భోజన సంక్లిష్టసంప్రదాయం సాధారణ, సాంప్రదాయ ఆహారాల తయారీ ప్రారంభ స్థిరపడినవారిచే ప్రవేశపెట్టబడ్డాయి. 19 వ శతాబ్దపు సామ్రాజ్యాలు ఉత్సవసమయాలలో సిద్ధం చేయబడిన శుద్ధిచేసిన ఉత్సవ వంటకాలు ఉండేవి. దాదాపు మొత్తం ద్వీపంలో మడగాస్కర్ సమకాలీన వంటకం సాధారణంగా ఒక కూరల (లాకా) తో వడ్డిస్తారు. లాకా అనేక రకాలుగా తయారుచేయబడుతుంటాయి. లాకాను కూరగాయలతో శాకాహారంగానూ, జంతు ప్రోటీన్లతో మాంసాహారంగానూ తయారు చేయబడుతుంది. సాధారణంగా అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి, టొమాటో, వనిల్లా, కొబ్బరి పాలు, ఉప్పు, కూర పొడి, ఆకుపచ్చ మిరియాలు, ఇతర మసాలా దినుసులు, మూలికలను చేర్చి లాకాను తయారు చేస్తుంటారు. శుష్క దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో గ్రామీణ కుటుంబాలు మొక్కజొన్న, కాసావా, లేదా పులియబెట్టిన జెబు పాలతో తయారు చేసిన పెరుగుతో బియ్యం ఆహారాన్ని భర్తీ చేస్తారు. వైవిధ్యమైన ఉష్ణమండల, సమశీతోష్ణ-వాతావరణ పండ్లు, వివిధ రకాల తీపి, రుచికరమైన వడలు అలాగే ఇతర వీధి ఆహారాలు ద్వీపంలో అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా ఉత్పత్తి చేసే పానీయాలు పండ్ల రసాలు, కాఫీ, మూలికా టీలు, సాధారణ పానీయాలతో రం, వైన్, బీరు వంటి మద్య పానీయాలు సేవిస్తుంటారు. మూడు గుర్రాలు బీరు ద్వీపంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీరుగా ఉంది. ఇది మడగాస్కర్ చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ ద్వీపం ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ చాక్లెట్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. 1940 లో స్థాపించబడిన చాకొలేటరీ రాబర్టు, ద్వీపంలో అత్యంత ప్రసిద్ధ చాక్లెటు కంపెనీగా గుర్తించబడుతుంది.

నైసర్గిక స్వరూపము

  • వైశాల్యం : 5,87,041 చదరపు కిలోమీటర్లు
  • జనాభా : 2,37,52,887 (అంచనా)
  • రాజధాని : అంటనానారివో
  • కరెన్సీ : మలగాసీ అరియారీ
  • ప్రభుత్వం : యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
  • భాషలు : అధికార భాష-మలగాసీ, ఫ్రెంచ్ భాషలు
  • మతం : క్రైస్తవులు-40 శాతం, ముస్లిములు 7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 50 శాతం.
  • వాతావరణం : సాధారణంగా చల్లగా ఉంటుంది. జూలైలో 9 నుండి 20 డిగ్రీలు, డిసెంబరులో 16 నుండి 27 డిగ్రీలు ఉంటుంది.
  • పంటలు : వరి, కస్సావా, మామిడి, బంగాళదుంపలు, అరటి, చెరకు, మొక్క జొన్న, కాఫీ, మిరియాలు.
  • పరిశ్రమలు : వస్త్ర, సముద్ర ఉత్పత్తులు, పొగాకు, చక్కెర, ప్లాస్టిక్, ఫార్మా, తోలు వస్తువుల పరిశ్రమలు మొదలైనవి.
  • సరిహద్దులు : నలువైపులా హిందూమహాసముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి సమీపంలో ఉంది.
  • స్వాతంత్య్రం : 1960 జనవరి 26

పరిపాలనా పద్దతులు

మడగాస్కర్ దీవి పరిపాలన సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ ఆరు ప్రాంతాలు తిరిగి 22 రీజియన్‌లుగా విభజింపబడి ఉన్నాయి. ఈ రీజియన్‌లను ఫరిత్ర అంటారు. అంట్‌సిరనానా, అంటనానారివో, మహాజంగ, టోమాసినా, ఫియానారంట్‌సోవా, టోలియారాలు ఆరు ప్రాంతాలు. దేశంలో మొత్తం 119 జిల్లాలు ఉన్నాయి. మడగాస్కర్ దేశంలో పదినగరాలు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అవి - అంటనానారికో, టోమాసిన, అంట్‌సిరాబే, ఫియానారంట్‌సోవా, మహాజంగ, టోలియారా, అంట్‌సిరనానా, అంటానిఫోట్సీ, అంబోవోంబే, అంపరఫరవోలా.

సంస్కృతి

మడగాస్కర్ దేశంలో అనేక మానవ తెగలు ఉన్నాయి. ముఖ్యంగా మెరినా, బెట్సి మిసరాకా, బెట్సిలియో, సిమిహేతి, సకలావ, అంటాయసక, అంటన్‌డ్రాయ్ మొదలైన తెగలున్నాయి. జనాభాలో సగభాగం పురాతన సంస్కృతిని అనుసరిస్తున్నారు. వీరంతా క్రైస్తవ మతావలంబకులు. ప్రజలు ఇస్లాం మతాన్ని కూడా ఆచరిస్తున్నారు.భారతీయులు కూడా మడగాస్కర్‌లో ఉన్నారు. వీరు హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడతారు. గ్రామాలలో గుడిసెలలాంటి ఇళ్లు నిర్మించుకుంటారు. స్త్రీలు, పురుషులు దాదాపు సమాన భావనతో జీవిస్తారు. పురుషులు కుటుంబాన్ని పోషించేందుకు కావలసిన వనరులను సేకరిస్తారు. వ్యవసాయం స్త్రీలు, పురుషులు కలిసిచేస్తారు. ప్రభుత్వం విద్యాలయాలను నెలకొల్పింది. క్రిస్టియన్ మిషినరీలు విద్యావ్యాప్తిని కొనసాగిస్తున్నాయి.

దర్శనీయ ప్రదేశాలు

సింగీ రోగ్

సింగీ రోగ్ ఎర్రమట్టి రెడ్ లాటరైట్‌తో సహజసిద్ధంగా ఏర్పడి పైకి లేచిన ముళ్లమాదిరిగా కనబడతాయి. ఈ ప్రాంతం అంకరానా పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం భారీవర్షాల కారణంగా మట్టి కోసుకుపోయి, కోపులు కోపులుగా తయారై ఒక వినూత్న డిజైనుగా మారిపోయింది. వేలాది ఏళ్ళ క్రితం ఏర్పడిన ఈ వింత ఆకారాలు ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. క్రమంగా ఇసుక వీటిమీద చేరిపోయి ఎరుపు రంగుకు చేరుకొని ఇప్పుడవి సహజసిద్ధ నిర్మాణాలుగా మారిపోయాయి. ఇక్కడే చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నాయి. సందర్శకులకు ఈ ప్రాంతం ఒక భూమి మీది స్వర్గం మాదిరిగా అనిపిస్తుంది.

బావోబాబ్ చెట్లు

మడగాస్కర్ 
బావోబాబ్ చెట్లు

మడగాస్కర్ దీవిలో చాలా విచిత్రమైన ప్రకృతి కనబడుతుంది. ఎన్నో అగ్నిపర్వతాలు, రహస్యంగా ప్రవహించే జలపాతాలు ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం దీవి అంతా అడవే. బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, మూడు నుండి నాలుగు మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది.

నోసీ బే , ఇతర దీవులు

  • మడగాస్కర్ దీవికి ఉత్తర ప్రాంతంలో నోసీ బే ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. కొన్ని దీవులు కొన్ని అడుగుల వెడల్పే ఉండి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి సమీపంలోనే నోస్ సకాటియా, నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రథను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిసెలాగో మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా స్వర్గదామంగా కనిపిస్తుంది. నోసీ సకాటియాను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ కేవలం 300 జనాభా ఉంది. ఇక్కడే ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లి కనబడుతుంది. ఈ ఊసరవెల్లి కేవలం ఒక సెంటీమీటరు ఉంది. రాక్షస గబ్బిలాలు కూడా ఇక్కడ ఉంటాయి.
  • నోసీ కోంబా ఒక చిన్నద్వీపం. గుండ్రంగా ఉండి ఆకాశంలోంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనబడుతుంది. ఈ ద్వీపంలో మనకు ఎగిరే నక్కలు కనిపిస్తాయి. అలాగే రాక్షస గబ్బిలాలు కూడా కనబడతాయి. ఈ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. లెబార్ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి.
  • రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ ద్వీపంలో సందర్శకులు రెండు మూడు రోజులు ఉండడానికి వీలుగా హోటళ్ళు ఉంటాయి. సందర్శకులు ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ తెలుపు రంగులో ఉండే ఇసుక బీచ్‌లు ఉన్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. బవోబాబ్ వృక్షాలు కూడా ఇక్కడే ఉన్నాయి.
  • ఈ ప్రాంతంలో ఇంకా నోసీనింజా, రథమ ఆర్బిపెలాగోలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ముఖ్య భూభాగంనుండి పడవలో గానీ, హెలికాప్టర్‌లో కాని వెళ్ళవచ్చు.

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

Madagascar గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

మడగాస్కర్  నిఘంటువు విక్షనరీ నుండి
మడగాస్కర్  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
మడగాస్కర్  ఉదాహరణలు వికికోట్ నుండి
మడగాస్కర్  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
మడగాస్కర్  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
మడగాస్కర్  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

    ప్రభుత్వము

Tags:

మడగాస్కర్ పేరు వెనుక చరిత్రమడగాస్కర్ చరిత్రమడగాస్కర్ భౌగోళికంమడగాస్కర్ ఆర్ధికరంగంమడగాస్కర్ గణాంకాలుమడగాస్కర్ ఆరోగ్యంమడగాస్కర్ విద్యమడగాస్కర్ సంస్కృతిమడగాస్కర్ నైసర్గిక స్వరూపముమడగాస్కర్ పరిపాలనా పద్దతులుమడగాస్కర్ సంస్కృతిమడగాస్కర్ దర్శనీయ ప్రదేశాలుమడగాస్కర్ చిత్రమాలికమడగాస్కర్ మూలాలుమడగాస్కర్ బయటి లింకులుమడగాస్కర్ఆఫ్రికాద్వీప దేశంహిందూ మహాసముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

వాయు కాలుష్యంపులివెందులవసంత వెంకట కృష్ణ ప్రసాద్ప్లీహముముదిరాజ్ (కులం)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్తేటగీతిఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలంగాణ ఉద్యమంనువ్వు నాకు నచ్చావ్నవధాన్యాలుఆవేశం (1994 సినిమా)శ్రీ కృష్ణదేవ రాయలుబోడె రామచంద్ర యాదవ్షర్మిలారెడ్డికీర్తి రెడ్డివెలిచాల జగపతి రావుఫహాద్ ఫాజిల్భూకంపంనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంపన్ను (ఆర్థిక వ్యవస్థ)రాష్ట్రపతి పాలనఝాన్సీ లక్ష్మీబాయివరిబీజంషాబాజ్ అహ్మద్సలేశ్వరంటమాటోబద్దెనభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థరాహుల్ గాంధీనెమలిభారతీయ తపాలా వ్యవస్థతెలంగాణా బీసీ కులాల జాబితాఆర్టికల్ 370చిరంజీవి నటించిన సినిమాల జాబితాధనూరాశిసురేఖా వాణితెలుగు నాటకరంగంఅలంకారంవృత్తులుశాంతిస్వరూప్పిఠాపురంనవగ్రహాలుభాషా భాగాలువిద్యభగత్ సింగ్కంప్యూటరుపూరీ జగన్నాథ దేవాలయంతెలుగు అక్షరాలుతీన్మార్ మల్లన్నగుడివాడ శాసనసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపాట్ కమ్మిన్స్భూమిరాజంపేట శాసనసభ నియోజకవర్గంవిడాకులుతీన్మార్ సావిత్రి (జ్యోతి)యూట్యూబ్గాయత్రీ మంత్రంశ్రీశ్రీఉత్తర ఫల్గుణి నక్షత్రముఢిల్లీ డేర్ డెవిల్స్ఆవర్తన పట్టికపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅచ్చులుసముద్రఖనిరెడ్యా నాయక్రామాయణంతెలుగు కథజై శ్రీరామ్ (2013 సినిమా)అడాల్ఫ్ హిట్లర్వ్యవసాయంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాలోక్‌సభ నియోజకవర్గాల జాబితావరంగల్ లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ జిల్లాల జాబితారెండవ ప్రపంచ యుద్ధం🡆 More