ప్యూ రీసెర్చి సెంటర్

ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది వాషింగ్టన్, DC లో ఉన్న నిష్పక్షపాత అమెరికన్ థింక్ ట్యాంక్ (దానిని ఫ్యాక్ట్ ట్యాంక్గా పిలుచుకుంటారు)

ఇది యునైటెడ్ స్టేట్స్‌ను, ప్రపంచాన్నీ రూపు దిద్దే సామాజిక సమస్యలు, ప్రజాభిప్రాయం, జనాభా ధోరణులపై సమాచారం అందిస్తుంది. ఇది ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది, జనాభా వివ్రాలను పరిశోధిస్తుంది, సెల్ ఫోన్, ల్యాండ్‌లైన్ నంబర్లపై ప్రజలకు యాదృచ్ఛికంగా కాల్ చేస్తుంది, మీడియా కంటెంట్ విశ్లేషణ, ఇతర అనుభావిక సామాజిక శాస్త్ర పరిశోధనలను కూడా నిర్వహిస్తుంది.

ప్యూ రీసెర్చ్ సెంటర్ విధానపరమైన అభిప్రాయాలను పెట్టుకోదు. ఇది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్‌ల అనుబంధ సంస్థ .

చరిత్ర

1990లో, టైమ్స్ మిర్రర్ కంపెనీ టైమ్స్ మిర్రర్ సెంటర్ ఫర్ ది పీపుల్ & ప్రెస్‌ అనే ఒక పరిశోధన ప్రాజెక్టును స్థాపించింది. రాజకీయాలు, విధానాలకు సంబంధించిన సర్వేలను నిర్వహించే పనిలో ఉండేది. ఆండ్రూ కోహుట్ 1993లో దానికి డైరెక్టరయ్యాడు. 1996లో ది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్‌లు దానికి ప్రాథమిక స్పాన్సర్‌గా మారాయి. దీని పేరును ప్యూ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది పీపుల్ & ప్రెస్‌గా మార్చారు.

2004 లో ట్రస్టు, వాషింగ్టన్‌లో ప్యూ రీసెర్చ్ సెంటర్‌ను స్థాపించింది. 2013 లో కోహుట్ అధ్యక్షుడిగా వైదొలిగి, వ్యవస్థాపక డైరెక్టరయ్యాడు. అలాన్ ముర్రే కేంద్రానికి రెండవ అధ్యక్షుడయ్యాడు. 2014 అక్టోబరులో ప్యూ రీసెర్చ్ సెంటర్‌లో 14 ఏళ్ల అనుభవజ్ఞుడైన మైఖేల్ డిమోక్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.

నిధులు

ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది లాభాపేక్ష రహిత, పన్ను మినహాయింపు 501(సి)(3) సంస్థ. దానికి ప్రాథమిక నిధులు అందించే ది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్‌లకు ఇది అనుబంధ సంస్థ. ప్రపంచంలోని మతాల జనాభాపై అది చేసే అధ్యయనాల కోసం, ప్యూ రీసెర్చ్ సెంటర్‌కు టెంపుల్‌టన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిధులు సమకూరుస్తుంది.

పరిశోధనా రంగాలు

ప్యూ రీసెర్చి సెంటర్ 
ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం - సర్వే

కేంద్రం కింది అంశాలపై పరిశోధన చేస్తుంది:

  • అమెరికా రాజకీయాలు, విధానం
  • జర్నలిజం, మీడియా
  • ఇంటర్నెట్, సాంకేతికత
  • సైన్స్, సమాజం
  • జాతి, జాతి
  • మతం, ప్రజా జీవితం
  • గ్లోబల్ వైఖరులు, పోకడలు
  • అమెరికా సామాజిక, జనాభా ధోరణులు

నివేదికలు

ప్యూ రీసెర్చ్ సెంటర్‌లోని పరిశోధకులు ఏటా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని, ప్రచురణలనూ జల్లెడ పడతారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్యూ-టెంపుల్టన్ గ్లోబల్ రిలిజియస్ ఫ్యూచర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా మతంపై ప్రపంచంలో ఉన్న పరిమితులపై తన 10వ వార్షిక నివేదికను విడుదల చేసింది. దీనికి ది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్‌లు, జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ లు నిధులు సమకూర్చాయి. వార్షిక నివేదిక ప్రచురణకు 18 నెలల నుండి రెండు సంవత్సరాల ముందు జరిగిన సంఘటనలను పరిశీలించింది. మునుపటి నివేదికలు సంవత్సరానికి సంబంధించిన మార్పుపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ఈ నివేదిక మాత్రం నిర్దిష్ట ప్రాంతాలలో, 198 దేశాలు, భూభాగాల్లోని పోకడలపై విస్తృత రూపాన్ని అందించింది. 2007 నుండి 2017 వరకు మతంపై ప్రభుత్వాల ఆంక్షలు, మతపరమైన సామాజిక శత్రుత్వాలు ఎలా మారాయి, ఎలా పెరిగాయి అనే విషయాన్ని నివేదికలో చూపింది. 52 ప్రభుత్వాలు మతంపై అధిక స్థాయి ఆంక్షలు విధించాయి, 2007లో ఇది 40 గా మాత్రమే ఉండేది. 2007లో 38 దేశాల్లో మతపరమైన సామాజిక ఘర్షణలు జరగ్గా, 2017 లో అది 56 కు చేరింది. నివేదిక ప్రకారం, మత స్వేచ్ఛను పరిమితం చేసే చట్టాలు విధానాలు మత సమూహాలకు ప్రభుత్వ అనుకూలత అనే రెండు రకాల ఆంక్షలు అత్యంత ప్రబలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆంక్షలు పెరుగుతున్నాయని, అయితే అన్ని భౌగోళిక ప్రాంతాలు లేదా అన్ని రకాల ఆంక్షలు అంత సమానంగా లేవని పోకడలు సూచిస్తున్నాయి.

మూలాలు

 

Tags:

ప్యూ రీసెర్చి సెంటర్ చరిత్రప్యూ రీసెర్చి సెంటర్ నిధులుప్యూ రీసెర్చి సెంటర్ పరిశోధనా రంగాలుప్యూ రీసెర్చి సెంటర్ నివేదికలుప్యూ రీసెర్చి సెంటర్ మూలాలుప్యూ రీసెర్చి సెంటర్వాషింగ్టన్, డి.సి.

🔥 Trending searches on Wiki తెలుగు:

గురువు (జ్యోతిషం)దశావతారములుశాతవాహనులుయజుర్వేదంగాంధీఅంగచూషణజీలకర్రజాతీయములుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిబ్రెజిల్కుప్పం శాసనసభ నియోజకవర్గంకరోనా వైరస్ 2019సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుచెక్ రిపబ్లిక్సంభోగంస్వామియే శరణం అయ్యప్పమారేడులోక్‌సభ స్పీకర్అన్నప్రాశనభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంతెలుగు పదాలుఆంధ్రజ్యోతిచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగాయత్రీ మంత్రంపన్నుఅక్కినేని నాగార్జునతేలుగ్రామ పంచాయతీరాబర్ట్ ఓపెన్‌హైమర్అన్నయ్య (సినిమా)తెలంగాణ చరిత్రశ్రీనాథుడుగౌడబోడె ప్రసాద్G20 2023 ఇండియా సమిట్గ్యాస్ ట్రబుల్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిమంగళవారం (2023 సినిమా)నువ్వొస్తానంటే నేనొద్దంటానావనపర్తితిక్కనమనుస్మృతిగీతా కృష్ణఆహారంపాల కూరరాధసంధిఅనూరాధ నక్షత్రంజవహర్ నవోదయ విద్యాలయంబుధుడు (జ్యోతిషం)రఘురామ కృష్ణంరాజుశాసనసభడిస్నీ+ హాట్‌స్టార్నారా చంద్రబాబునాయుడుపావని గంగిరెడ్డిధనుష్యవలుస్టార్ మాభారతీయ జనతా పార్టీసంక్రాంతికాశీనవనీత్ కౌర్భారత జాతీయ చిహ్నంమహాసముద్రంఆశ్లేష నక్షత్రముసమ్మక్క సారక్క జాతరపూర్వ ఫల్గుణి నక్షత్రముశ్రీశైలం (శ్రీశైలం మండలం)అవయవ దానంఉత్తరాషాఢ నక్షత్రముసందీప్ కిషన్పన్ను (ఆర్థిక వ్యవస్థ)భగవద్గీతఅనుష్క శెట్టిభద్రాచలంవై.ఎస్.వివేకానందరెడ్డిచిరంజీవి నటించిన సినిమాల జాబితాఆర్య (సినిమా)ధనిష్ఠ నక్షత్రము🡆 More