బాక్టీరియా

ఏక్టినోబాక్టీరియా అక్విఫిసే క్లామిడే బాక్టీరోడెటిస్/క్లోరోబి క్లోరో ఫ్లెక్సి క్రైసియో జెనిటిస్ సైనోబాక్టీరియా డిఫెర్రి బాక్టోరియేసి డీనో కోకస్-థర్మస్ డైక్టిగ్లోమి ఫైబ్రోబాక్టిరిస్/యఅసిడో బాక్టీరియా పర్మిక్యీటిస్ ఫ్యూసో బాక్టీరియా గెమ్మాటి మోనోడెటిస్ లెంటిస్‌పెరే నైట్రోస్పైరే ప్లాంక్టోమైసిటిస్ ప్రోటియోబాక్టీరియా స్పైరోకీట్స్ థర్మోడిసల్ఫో బాక్టీరియా థర్మో మైక్రోబియా థర్మోటోగె వెరుకోమైక్రోబియా

బాక్టీరియా
కాల విస్తరణ: Archean or earlier - Recent
బాక్టీరియా
E. కోలై బాక్టీరియా
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
బాక్టీరియా
Phyla

బాక్టీరియా (ఆంగ్లం Bacteria) ఏకకణ సూక్ష్మజీవులు. ఇవి కొన్ని మైక్రోమీటర్ల పొడవు కలిగి, అసాధారణమయిన నిర్మాణాత్మక వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. బాక్టీరియా సర్వాంతర్యాములు, ఎలాంటి వాతావరణంలోనైనా మనం వీటిని కనుగొనవచ్చు. సాధారణంగా ఒక గ్రాము మట్టిలో 40 మిలియన్, ఒక మిల్లీ లీటరు నీటిలో ఒక మిలియన్ బాక్టీరియా కణాలుంటాయి. లెక్క కడితే ప్రపంచంలో మొత్తం 5 నొనిలియన్ (5×1030) బాక్టీరియా కణాలుంటాయి. సగానికి పైగా బాక్టీరియా ఇంకా కారక్టరైజ్ చేయబడలేదు, చాలా కొన్ని జాతులను మాత్రం ప్రస్తుతానికి ప్రయోగశాలలో వర్ధనం ద్వారా పెంచవచ్చు. బాక్టీరియాల అధ్యయనాన్ని 'బాక్టీరియాలజీ' అంటారు. విట్టాకర్ ఐదు రాజ్యాల వర్గీకరణలో వీటిని మొనీరా రాజ్యంలో చేర్చడం జరిగింది. లీవెన్ హాక్ సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మొదటిసారిగా బాక్టీరియాను కనుక్కొన్నాడు.

మానవుని శరీరంపైన, లోపల కలిపితే మొత్తం మానవ కణాల సంఖ్యకన్నా బాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువ. చాలా శాతం బాక్టీరియాలు చర్మంపైన, జీర్ణనాళంలోనూ నివసిస్తాయి. ఇందులో అత్యధిక శాతం బాక్టీరియా మానవునికి ఎలాంటి హని కలగజేయవు, కొన్ని మానవులలో ఇమ్మూనిటికి రక్షణ కల్పిస్తాయి, ఇంకొన్ని హానికారక బాక్టీరియాలు. హానికారక బాక్టీరియాల వల్ల కలిగే అంటువ్యాధులలో కలరా, సిఫిలిస్, ఆంథ్రాక్స్, కుష్టు (లెప్రసీ), క్షయ వ్యాధులు ప్రాణాంతకమైనవి.

విస్తరణ

బాక్టీరియా అన్ని రకాల ఆవాసాలలో వ్యాపించి ఉన్నాయి. ఇవి మృత్తిక, నీరు, వాతావరణం, జీవుల దేహాలలో లేదా దేహాలపైన విస్తరించి ఉన్నాయి. వివిధరకాల ఆహారాలు, వాటి ఉత్పాదితాలపైన పెరుగుతాయి. అతిశీతల, అత్యోష్ణ, జలాభావ పరిస్థితులను కూడా తట్టుకొని బాక్టీరియా జీవిస్తాయి. కొన్ని బాక్టీరియా మొక్కల, జంతువుల దేహాలలో పరాన్నజీవులుగా లేదా సహజీవులుగా జీవిస్తున్నాయి.

ఆవిర్భావం , పరిణామం

ఆధునిక బాక్టీరియా యొక్క పూర్వీకులు సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం అవతరించిన మొట్టమొదటి ఏకకణ జీవులు. తర్వాతి 3 బిలియన్ సంవత్సరాల వరకు ఇవి అతి సూక్ష్మమైన ఏక కణ జీవులుగానే జీవనం సాగించాయి. నిర్దిష్టమైన కణనిర్మాణం లేనందువల్ల స్ట్రోమాటోలైట్‌ల శిలాజాలను అధ్యయనం చేసి బాక్టీరియా పరిణామక్రమాన్ని (ఎవలూషన్‌ను) నిర్దారించడం వీలు పడదు. కాని, జీన్ సీక్వెంస్‌లను బట్టి వాటిని ఫైలోజెనిగా గుర్తించారు. వీటివల్ల బాక్టీరియా అర్కియల్/యూకారియోటిక్ లినియేజ్ నుండి విడిపోయినట్టు నిర్దారించారు. బాక్టీరియాకు ఆర్కియాకు అత్యాధునిక కామన్ పూర్వీకులుగా థెర్మోఫైల్ (దాదాపు 2.5-3.2 బిలియన్ సంవత్సరాలు జీవించాయి)ను చెప్పుకోవచ్చు.

ఆర్కియా, యూకారియోట్ల మధ్య జరిగిన విపరిణామంతో (డైవర్జెన్స్) ముడిపడి ఉన్నట్టు ఆధారాలున్నాయి.

బాక్టీరియాలజీ చరిత్ర

బాక్టీరియా 
ఆంటోని వాన్ లీవెన్‌హాక్, బాక్టీరియాను మొట్టమొదటిసారిగా పరీక్షించిన వ్యక్తి].

ఘ్ఘృహఘ్టృహట్ట్యఊట్యహట్ట్హట్ట్ట్ట్టూయట్యట్ట్యహట్ట్

ఆకారం:రకాలు

బాక్టీరియాల ఆకారం వాటి జాతిని బట్టి మారుతుంది. ఒక జాతిలో ఆకారం నిర్ధిష్టంగా ఉంటుంది.

బాక్టీరియా 
వివిధ ఆకారాలలో ఉన్న బ్యాక్టీరియా
బాక్టీరియా 
వివిధ జీవులు, జీవాణువులతో పోల్చి చూస్తే బ్యాక్టీరియా (ప్రోకారియోట్ల) పరిమాణం

బాక్టీరియాలు వాటి నిర్మాణంలో చూపే వైవిధ్యతను మార్ఫాలజీస్ అని వ్యవహరిస్తారు. బాక్టీరియా కణాలు యూకారియోట్ల కణాలకంటే దాదాపు పదింతలు చిన్నవిగా ఉంటాయి (సాధారణంగా 0.5-5మైక్రోమీటర్లు). కాని థయోమార్గరీటా నమీబియెన్సిస్, ఎపులోపిషియమ్ ఫిషెల్‌సోని అనే బాక్టీరియా దాదాపు మిల్లీమీటరులో సగం ఉండడం చేత మం మామూలు కంటితో చూడవచ్చు. ఇక సూక్ష్మమైన వాటి విషయానికి వస్తే మైకోప్లాస్మా జాతికి చెందిన బాక్టీరియాలు 0.3 మైక్రోమీటర్ల పొడవుంటాయి.

చాలావరకు బాక్టీరియల్ జాతులు గోళాకారంలో గాని, దండాకారంలోగాని ఉంటాయి. మరికొన్ని కామా ఆకారంలో గాని, శంఖావర్తంగా (స్పైరల్) గాని ఉంటాయి. మరికొన్ని చాలా అరుదుగా టెట్రహెడ్రల్ లేదా క్యూబాయిడల్ ఆకృతిలో ఉంటాయి ఈ ఆకృతి చాలా వరకు బాక్టీరియా సెల్‌వాల్, సైటోస్కెలిటన్‌లు నిర్ణయిస్తాయి.

కోకస్

గోళాకారంగా ఉండే బాక్టీరియమ్ లను "కోకస్" (Coccus) అంటారు. కణాల సంఖ్య, అమరికలను బట్టి వీటిని ఆరు రకాలుగా విభజించారు.

  • మోనోకోకస్: ఒంటరిగా ఉండే గోళాకార బాక్టీరియమ్.
  • డిప్లోకోకస్: ఒక జత గోళాకార బాక్టీరియాలు.
  • టెట్రాకోకస్: నాలుగు గోళాకార బాక్టీరియాల సమూహం.
  • స్ట్రెప్టోకోకస్: ఒకే వరుసలో గొలుసులాగా అమరి ఉండే గోళాకార బాక్టీరియాలు.
  • స్టాఫిలోకోకస్: క్రమరహితంగా అమరి ఉండే గోళాకార బాక్టీరియాల సమూహం.
  • సార్సినా: ఘనాకారంగఅ అమరి ఉండే ఎనిమిది గోళాకార బాక్టీరియాల సమూహం.

బాసిల్లస్

దండాకార బాక్టీరియాలను "బాసిల్లస్" (Bacillus) అంటారు. ఇవి తిరిగి మూడు రకాలుగా ఉంటాయి.

  • మోనోబాసిల్లస్: ఒంటరిగా ఉండే దండాకార బాక్టీరియమ్.
  • డిప్లోబాసిల్లస్: ఒక జత దండాకార బాక్టీరియాలు.
  • స్ట్రెప్టోబాసిల్లస్: ఒకే వరుసలో గొలుసులాగా అమరి ఉండే దండాకార బాక్టీరియాలు.

విబ్రియో

కామా (,) ఆకృతిలో ఉండే బాక్టీరియాలను "విబ్రియో" (Vibrio) అంటారు.

స్పైరిల్లమ్

సర్పిలాకారంలో ఉండే బాక్టీరియాలను "స్పైరెల్లమ్" (Spirillum) అంటారు. నమ్యతను చూపించే స్పైరిల్లమ్ లను "స్పైరోకీట్స్" (Spirochetes) అంటారు. కొన్ని బాక్టీరియాలు పోగు లేదా తంతువు రూపాలలో ఉంటాయి.

చాలా బాక్టీరియల్ జాతులు ఏకకణ జీవులే, కాని కొన్ని జాతుల్లో (కన్ని కణాలు దగ్గరగా చేరి బహుకణజీవులుగా అగుపిస్తాయి.నిస్సేరియాలో రెండు కణాలు చేరి దిప్లాయిడ్‌గాను, స్ట్రెప్టొకోకస్లో గొలుసుగాను,, స్టాఫైలోకోకస్లో ద్రాక్షగుత్తివలె అమరి ఉంటాయి. ఫిలమెంటస్ బాక్టీరియాలో ఒక కవచంలో చాలా కణాలు విడివిడిగా అమరిఉంటాయి. నొకార్డియాలో శాఖలు కలిగిన ఫిలమెంట్‌లుగా అమరబడి ఉంటాయి.

గ్రామ్ అభిరంజకం

బాక్టీరియాల అభిరంజన విధానాన్ని క్రిస్టియన్ గ్రామ్ అనే శాస్త్రవేత్త 1884లో రూపొందించాడు. అభిరంజన లక్షణాన్ని బట్టి వీటిని గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగిటివ్ అనే రెండు రకాలుగా విభజించారు. ఈ విధానంలో బాక్టీరియాలు క్రిస్టల్ వయొలెట్ (Crystal violet) అనే ద్రావణం ఉపయోగించి అభిరంజనం చేస్తారు.

కణ నిర్మాణం

బాక్టీరియా 
బాక్టీరియా కణనిర్మాణం

కణాంతర్గత నిర్మాణాలు(Intracellular structures)

బాక్టీరియా కణాన్ని చుట్టి కణ త్వచం అనబడే ఒక లిపిడ్ పొర ఉంటుంది. ఈ కణ త్వచం కణనిర్మాణాలనన్నింటిని రక్షిస్తూఉంటుంది. బాక్టీరియా ప్రోకారియోట్లు కావున వాటిల్లో త్వచాలను కలిగి ఉండే కణనిర్మాణాలుండవు. దీనిమూలంగా కేంద్రకము, క్లోరోప్లాస్ట్, గాల్గీ నిర్మాణాలు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వంటి యూకారియోట్లలో ఉండే నిర్మాణాలు లోపిస్తాయి.

ప్రాముఖ్యం

బాక్టీరియాలు మానవుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకరంగాను, హానికరంగాను ఉంటునాయి. కాబట్టి వీటిని మానవుడి మిత్రులుగాను, శత్రువులుగానూ కూడా భావించవచ్చు.

ప్రయోజనాలు

  • జీవ భూరసాయన వలయాలు:
    • పూతికాహార బాక్టీరియాలు నిర్జీవ జంతు, వృక్ష దేహాలను కుళ్ళజేసి వాటిలోని సంక్లిష్ట సేంద్రియ పదార్ధాలని సరళ పదార్ధాలుగా మార్చి, నేలలో కలిపి, మొక్కల వేళ్ళకు లభించేటట్లుగా చేస్తున్నాయి. దీనివల్ల పోషక మూలకాలు నిరంతరంగఅ పునఃచక్రీయం చెందడమే కాకుండా, పరిసరాలు కూడా పరిశుభ్రమవుతున్నాయి. అందువల్ల బాక్టీరియాలను 'ప్రకృతి పారిశుధ్య పనివారు' (Natural scavengers) అని వ్యవహరిస్తారు.
    • డెల్లొవిబ్రియొ బాక్టీరియోవోరస్ హానికర బాక్టీరియాల మీద పరాన్నజీవిగా పెరుగుతుంది. గంగానదిలో నివసించే కొన్ని హానికర బాక్టీరియాలను నాశనంచేసి నీటిని పరిశుద్ధం గావిస్తుంది.
  • వ్యవసాయం:
    • అమ్మోనిఫైయింగ్ బాక్టీరియాలు: ఇవి చనిపోయిన జీవుల దేహాల్లోని ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కేంద్రకామ్లాలను అమ్మోనియాగా మారుస్తాయి. ఉదా: బాసిల్లస్.
    • నత్రీకరణ బాక్టీరియాలు:
      • అమ్మోనియాను నైట్రేట్ లుగా ఆక్సీకరణ గావిస్తాయి. ఉదా: నైట్రోసోమానాస్, నైట్రోబాక్టర్.
      • రైజోబియమ్, క్లాస్ట్రీడియమ్ వంటి బాక్టీరియాలు, కిరణజన్యసంయోగక్రియ జరిపే రోడోస్పైరిల్లమ్, రోడోమైక్రోబియమ్, క్లోరోబాక్టీరియమ్ వాతావరణంలోని వాయురూపంలో ఉన్న నత్రజనిని స్థాపనచేసి, నేలను సారవంతం చేస్తాయి.
  • పరిశ్రమలు:
    • క్లాస్ట్రీడియమ్ లు జనుము నుంచి నారలు తీయడంలో ఉపయోగపడతాయి.
    • కొన్ని బాక్టీరియాలు తోళ్ళను పదును పెట్టడంలో ఉపయోగిస్తారు.
    • పొగాకు క్యూరింగ్ లో బాసిల్లస్, తేయాకు క్యూరింగ్ లో మైక్రోకోకస్ లను ఉపయోగిస్తారు.
    • లాక్టోబాసిల్లస్ను కిణ్వనం (Fermentation) ప్రక్రియలో ఉపయోగిస్తారు.
    • మిథనోకోకస్, మిథనోబాసిల్లస్ వంటి బాక్టీయాలు వాయురహిత శ్వాసక్రియ ద్వారా పేడనుంచి 'మీథేన్' (గోబర్ గ్యాస్) ఉత్పత్తి చేస్తాయి.
    • కొన్ని రకాల బాక్టీరియాలనుపయోగించి పారిశ్రామికంగా కొన్ని రసాయన పదార్థాలను ఉత్పత్తి చేస్తారు.
  • వైద్యరంగం:
    • కొరినీబాక్టీరియమ్ గ్లుటామికమ్ - లైసిన్ అనే ఆవశ్యకత అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది.
    • డిఫ్తీరియా, న్యుమోనియా వంటి వ్యాధులను నిరోధించడానికి ఉపయోగించే టీకా మందులు బాక్టీరియా నుంచే ఉత్పత్తి చేస్తున్నారు.
    • సూక్ష్మజీవనాశకాలు (Antibiotics) చాలా వరకు బాక్టీరియాలనుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కువగా స్ట్రెప్టోమైసిస్, బాసిల్లస్ లకు చెందిన జాతులు ఈ విధంగా ఉపయోగపడతాయి.
  • జీవసాంకేతిక శాస్త్రం:
    • పునఃసంయోజక డి.ఎన్.ఎ. టెక్నాలజీని ఉపయోగించి జన్యువులని ప్రవేశపెట్టి, ఈ.కోలైని ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్లు రూపొందించారు.

హానికారకాలు

  • ఆహారపదార్ధాలు పాడుచేయడం:
  • వినత్రీకరణ:
  • మొక్కల తెగుళ్ళు:
  • జంతువుల వ్యాధులు:
  • మానవ వ్యాధులు:

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

బాక్టీరియా విస్తరణబాక్టీరియా ఆవిర్భావం , పరిణామంబాక్టీరియా లజీ చరిత్రబాక్టీరియా ఆకారం:రకాలుబాక్టీరియా గ్రామ్ అభిరంజకంబాక్టీరియా కణ నిర్మాణంబాక్టీరియా ప్రాముఖ్యంబాక్టీరియా ఇవి కూడా చూడండిబాక్టీరియా మూలాలుబాక్టీరియా బయటి లింకులుబాక్టీరియాen:Acidobacteriaen:Aquificaeen:Bacteroidetes (phylum)en:Chlamydiaeen:Chlorobien:Chloroflexien:Chrysiogenetesen:Cyanobacteriaen:Deferribacteraceaeen:Deinococcus-Thermusen:Dictyoglomien:Fibrobacteresen:Firmicutesen:Fusobacteriaen:Gemmatimonadetesen:Nitrospiraeen:Planctomycetesen:Thermodesulfobacteriaen:Thermomicrobiaen:Thermotogaeen:Verrucomicrobiaస్పైరోకీట్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

నరేంద్ర మోదీనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిహనుమంతుడునర్మదా నదిసచిన్ టెండుల్కర్ప్రధాన సంఖ్యతీన్మార్ మల్లన్నఆషికా రంగనాథ్యానిమల్ (2023 సినిమా)దిల్ రాజువారాహిధర్మవరం శాసనసభ నియోజకవర్గంత్రిష కృష్ణన్పక్షవాతంషాహిద్ కపూర్గజేంద్ర మోక్షంరామప్ప దేవాలయందివ్యభారతిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిశ్రీశ్రీఆర్యవైశ్య కుల జాబితాదినేష్ కార్తీక్సునీత మహేందర్ రెడ్డిదశరథుడుఅనూరాధ నక్షత్రంమా తెలుగు తల్లికి మల్లె పూదండభారతీయ తపాలా వ్యవస్థనోటా2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగ్లెన్ ఫిలిప్స్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుప్రీతీ జింటామర్రిభరణి నక్షత్రముఉపనయనముటంగుటూరి సూర్యకుమారిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలినూరు వరహాలుఅంగారకుడు (జ్యోతిషం)క్లోమమురాజంపేటసవర్ణదీర్ఘ సంధిఈనాడువై.ఎస్.వివేకానందరెడ్డిబైండ్లబాలకాండకామాక్షి భాస్కర్లసూర్యుడుఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుశ్యామశాస్త్రిఉత్తరాషాఢ నక్షత్రమువృషభరాశిప్రియ భవాని శంకర్సముద్రఖనిఛందస్సునవరసాలుతెలుగు సినిమాలు డ, ఢవసంత వెంకట కృష్ణ ప్రసాద్నువ్వు వస్తావనిసన్ రైజర్స్ హైదరాబాద్పరిపూర్ణానంద స్వామిరవితేజచిరుధాన్యందశదిశలుమాయదారి మోసగాడుతెలుగు సినిమాలు 2024రెడ్యా నాయక్బమ్మెర పోతనమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంజై శ్రీరామ్ (2013 సినిమా)బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంజ్యేష్ట నక్షత్రంకాజల్ అగర్వాల్మహర్షి రాఘవఅనుష్క శెట్టిగురజాడ అప్పారావు🡆 More