బయాలజీ టాక్సానమీ

సారూప్య లక్షణాల ఆధారంగా జీవుల సమూహాలను నామకరణం చేయడం, నిర్వచించడం, వర్గీకరించడం చేసే శాస్త్రీయ అధ్యయనమే జీవశాస్త్ర వర్గీకరణ (టాక్సానమీ (బయాలజీ)).

జీవులు టాక్సా (ఏకవచనం: టాక్సన్) లుగా వర్గీకరించి, ఈ సమూహాలకు వర్గీకరణ ర్యాంక్ ఇచ్చారు; ఒక ర్యాంకు లోని సమూహాలను సమగ్రపరచి, వాటికి పైన ఉండే ఉన్నత ర్యాంక్‌తో కూడిన సమూహాన్ని ఏర్పరచవచ్చు. తద్వారా వర్గీకరణ సోపానక్రమం ఏర్పడుతుంది. ఆధునిక వర్గీకరణలో ప్రధాన ర్యాంకులు డొమెయిన్, కింగ్‌డం (రాజ్యం), ఫైలం (వృక్షశాస్త్రంలో కొన్నిసార్లు ఫిలమ్ స్థానంలో డివిజన్ (విభాజం) అని వాడతారు), తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. స్వీడిష్ వృక్షశాస్త్రజ్ఞుడు కార్ల్ లిన్నేయస్ ప్రస్తుత వర్గీకరణ వ్యవస్థ స్థాపకుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే అతను జీవులను వర్గీకరించడానికి, జీవులకు పేరు పెట్టడానికి ద్వినామ నామకరణం అనే ర్యాంకుల వ్యవస్థను అభివృద్ధి చేశాడు. దీనిని లిన్నెయన్ వర్గీకరణ అని పిలుస్తారు.

బయోలాజికల్ సిస్టమాటిక్స్ సిద్ధాంతం, డేటా, విశ్లేషణాత్మక సాంకేతికతలో ఏర్పడీన పురోగతితో, లిన్నెయన్ వ్యవస్థ జీవుల మధ్య పరిణామ సంబంధాలను ప్రతిబింబించే ఉద్దేశంతో ఆధునిక జీవ వర్గీకరణ వ్యవస్థగా రూపాంతరం చెందింది.

నిర్వచనం

వర్గీకరణ యొక్క ఖచ్చితమైన నిర్వచనం ఒక్కో ప్రచురణలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఈ రంగం లోని ప్రధానాంశం మాత్రం ఒకటే: జీవ సమూహాల భావన, నామకరణం, వర్గీకరణ. వర్గీకరణ యొక్క ఇటీవలి నిర్వచనాలను క్రింద చూడవచ్చు:

  1. వివిక్త జీవులను జాతులుగా వర్గీకరించడం, జాతులను దానికి పైన ఉండే పెద్ద సమూహాలుగా అమర్చడం, ఆ సమూహాలకు పేర్లు పెట్టడం, తద్వారా వర్గీకరణను రూపొందించడం.
  2. వివరణ, గుర్తింపు, నామకరణం, వర్గీకరణలను చూపించే విజ్ఞానశాస్త్ర రంగం (సిస్టమాటిక్స్ లోని ప్రధాన భాగం)
  3. జీవశాస్త్రంలో జీవులను వర్గాలుగా అమర్చే వర్గీకరణ శాస్త్రం
  4. "జాతి జీవులకు వర్తించే వర్గీకరణ శాస్త్రం, జాతులు ఏర్పడే మార్గాల అధ్యయనం మొదలైనవి."
  5. "వర్గీకరించడం కోసం జీవి లక్షణాల విశ్లేషణ"
  6. "టాక్సానమీ లోకి అనువదించగలిగేలా చేసే సిస్టమాటిక్స్ ఫైలోజెని అధ్యయనం" (ఇదొక అసాధారణమైన నిర్వచనం)

లిన్నేయన్ యుగం

బయాలజీ టాక్సానమీ 
1735 నాటి సిస్టమా నేచురే శీర్షిక పేజీ

స్వీడిష్ వృక్షశాస్త్రజ్ఞుడు కార్ల్ లిన్నేయస్ (1707–1778) వర్గీకరణలో కొత్త శకానికి నాంది పలికాడు. 1735లో సిస్టమా నేచురే 1వ ఎడిషన్, 1753లో స్పీసీస్ ప్లాంటారం, సిస్టమా నేచురే 10వ ఎడిషన్, అనే ప్రధాన రచనల ద్వారా అతను, ఆధునిక వర్గీకరణలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. తన రచనల ద్వారా జంతు, వృక్ష జాతుల కొరకు ప్రామాణిక ద్విపద నామకరణ విధానాన్ని అమలు చేశాడు. అంతకు ముందు ఉన్న అస్తవ్యస్తమైన, క్రమరహితమైన వర్గీకరణ సాహిత్యానికి ఇది చక్కటి పరిష్కారంగా అవతరించింది. అతను, తరగతి, క్రమం, ప్రజాతి, జాతులకు ప్రమాణాలను ఏర్పరచడం మాత్రమే కాకుండా, పువ్వు లోని చిన్న భాగాలను పరిశీలించడం ద్వారా మొక్కలు, జంతువులను గుర్తించడం కూడా అతని పుస్తకం ద్వారా సాధ్యమైంది. ఆ విధంగా లిన్నెయన్ వ్యవస్థ పుట్టి, 18వ శతాబ్దంలో ఉన్న విధంగానే ఈనాటికీ ఉపయోగించబడుతోంది. ప్రస్తుతం మొక్కలు, జంతువుల (1753, 1758లో) వర్గీకరణ శాస్త్రవేత్తలు లిన్నెయస్ పనిని చెల్లుబాటు అయ్యే పేర్లకు "ప్రారంభ స్థానం"గా పరిగణిస్తున్నారు. ఈ తేదీలకు ముందు ప్రచురించబడిన పేర్లను "లిన్నెయన్-పూర్వ" (ప్రీ-లిన్నేయన్) గా సూచిస్తారు. వాటిని చెల్లేవిగా పరిగణించరు (స్వెన్స్కా స్పిండ్లార్‌లో ప్రచురించబడిన సాలీడులను మినహాయించి ). ఈ తేదీలకు ముందు లిన్నేయస్ స్వయంగా ప్రచురించిన వర్గీకరణ పేర్లను కూడా లిన్నేయన్‌-పూర్వ గానే పరిగణిస్తారు.

ఆధునిక వర్గీకరణ వ్యవస్థ

బయాలజీ టాక్సానమీ 
తరగతి స్థాయిలో సకశేరుకాల పరిణామం - కుటుంబాల సంఖ్యను కుదురుల వెడల్పు సూచిస్తుంది. పరిణామ వర్గీకరణకు స్పిండిల్ రేఖాచిత్రాలు విలక్షణమైనవి.
బయాలజీ టాక్సానమీ 
అదే సంబంధాన్ని, క్లాడిస్టిక్‌లకు విలక్షణమైన క్లాడోగ్రామ్‌గా చూపే చిత్రం

లిన్నెయస్ చేసిన మొక్కలు, జంతువుల వర్గీకరణలో, సమూహాలలో అంతర్గతంగా ఉప సమూహాల నమూనాను తయారు చేసాడు. ఈ నమూనాలు 18వ శతాబ్దం చివరి నాటికి, చార్లెస్ డార్విన్ యొక్క ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ప్రచురణ కంటే ముందే జంతు, వృక్ష రాజ్యాల డెండ్రోగ్రామ్‌లుగా సూచించబడ్డాఅయి. "సహజ వ్యవస్థ" నమూనాలో పరిణామం వంటి ఉత్పాదక ప్రక్రియ లేదు గానీ, తొలి కాలపు పరివర్తన-ఆలోచనకర్తలకు ప్రేరణ కలిగేలా సూచనామాత్రంగా ఉండి ఉండవచ్చు. జాతుల పరివర్తన ఆలోచనను అన్వేషించే ప్రారంభ రచనలలో ఎరాస్మస్ డార్విన్ (చార్లెస్ డార్విన్ తాత) 1796 లో రాసిన జూనోమియా, 1809 లో జీన్-బాప్టిస్ట్ లామార్క్ రాసిన ఫిలాసఫీ జూలాజిక్ ఉన్నాయి. 1844 లో రాబర్ట్ ఛాంబర్స్ అజ్ఞాతంగా ప్రచురించిన ఊహాజనిత వెస్టిజెస్ ఆఫ్ ది నేచురల్ హిస్టరీ ఆఫ్ క్రియేషన్ ద్వారా ఇంగ్లీషు మాట్లాడే ప్రపంచంలో ఈ ఆలోచన ప్రాచుర్యం పొందింది.

రాజ్యాలు, డొమైన్‌లు

బయాలజీ టాక్సానమీ 
ఆధునిక వర్గీకరణ ప్రాథమిక పథకం. ఇవేకాక, ఇంకా అనేక ఇతర స్థాయిలను కూడా ఇందులో ఉపయోగించవచ్చు; జీవలోకంలో డొమైన్ అత్యున్నత స్థాయి. ఇది కొత్తది, వివాదాస్పదమైన భావన..

కార్ల్ లిన్నేయస్ కనుగొనటానికి ముందు మొక్కలు, జంతువులను వేరువేరు రాజ్యాలుగా పరిగణించేవారు.   ] లిన్నేయస్ దీనిని అగ్ర ర్యాంకుగా ఉపయోగించాడు. భౌతిక ప్రపంచాన్ని కూరగాయలు, జంతువులు, ఖనిజ రాజ్యాలుగా విభజించాడు. సూక్ష్మదర్శినిలలో వచ్చిన పురోగతి వలన సూక్ష్మజీవుల వర్గీకరణ సాధ్యపడి, రాజ్యాల సంఖ్య పెరిగింది. ఐదు నుండి ఆరు-రాజ్యాల వ్యవస్థలు సర్వసాధారణంగా ఉంటూ వచ్చాయి.

సాపేక్షికంగా డొమైన్‌లు కొత్త సమూహం. 1977లో మొదటిసారిగా కార్ల్ వోస్ ప్రతిపాదించిన మూడు-డొమైన్ల వ్యవస్థ ఆ తరువాత చాలాకాలం వరకు ఆమోదించబడలేదు. మూడు-డొమైన్ల పద్ధతి లోని ఒక ప్రధాన లక్షణం -గతంలో బాక్టీరియా అనే ఒకే కింగ్‌డమ్ కింద ఉన్న ఆర్కియా, బాక్టీరియాలను వేరుచేయడం. కణాలలో కేంద్రకం కలిగి ఉన్న అన్ని జీవులకు యూకర్యోటాతో వర్గీకరించబడింది. తక్కువ సంఖ్యలో ఉన్న కొందరు శాస్త్రవేత్తలు ఆర్కియా అనే ఆరవ కింగ్‌డమ్‌ను కూడా పరిగణిస్తారు గానీ, వారు డొమైన్ పద్ధతిని అంగీకరించరు.

ఇటీవల ప్రొటిస్టుల వర్గీకరణపై విస్తృతంగా ప్రచురించిన థామస్ కావలీర్-స్మిత్, ఆర్కియా, యూకారియాలను సమూహపరిచే నియోమురా క్లాడ్, బాక్టీరియా నుండి - మరింత ఖచ్చితంగా ఆక్టినోమైసెటోటా నుండి - ఉద్భవించిందని ప్రతిపాదించాడు. అతని 2004 వర్గీకరణ ఆర్కియోబాక్టీరియాను బాక్టీరియా రాజ్యంలో ఉపరాజ్యంగా పరిగణించింది. అంటే అతను మూడు-డొమైన్ వ్యవస్థను పూర్తిగా తిరస్కరించాడు. 2012లో స్టీఫన్ లుకేటా సంప్రదాయికంగా ఉన్న మూడు డొమైన్‌లకు ప్రియోనోబయోటా (అసెల్యులార్, న్యూక్లియిక్ యాసిడ్ లేకుండా), వైరస్సోబియోటా (అసెల్యులార్ కానీ న్యూక్లియిక్ యాసిడ్‌ కలిగిన) లను చేర్చాడు.

లిన్నేయస్
1735
ఎర్నెస్ట్ హెకెల్
1866
ఎడువార్డ్ చాటన్
1925
హెర్బర్ట్ కోప్‌ల్యాండ్
1938
రాబర్ట్ విటేకర్
1969
కార్ల్ వీస్ et al.
1990
థామస్ కావలియర్ స్మిత్
1998
థామస్ కావలియర్ స్మిత్
2015
2 kingdoms 3 kingdoms 2 empires 4 kingdoms 5 kingdoms 3 domains 2 empires, 6 kingdoms 2 empires, 7 kingdoms
(not treated) ప్రోటిస్టా ప్రోకర్యోటా మొనేరా మొనేరా బాక్టీరియా బాక్టీరియా బాక్టీరియా
ఆర్కియా ఆర్కియా
యూకర్యోటా ప్రోటిస్టా ప్రోటిస్ట్ యూకర్యోట్ ప్రోటోజోవా ప్రోటోజోవా
క్రోమిస్టా క్రోమిస్టా
మొక్క మొక్క మొక్క మొక్క మొక్క మొక్క
ఫంగై ఫంగై ఫంగై
జంతువు జంతువు జంతువు జంతువు జంతువు జంతువు
లిన్నేయస్
1735
ఎర్నెస్ట్ హెకెల్
1866
ఎడువార్డ్ చాటన్
1925
హెర్బర్ట్ కోప్‌ల్యాండ్
1938
రాబర్ట్ విటేకర్
1969
కార్ల్ వీస్ et al.
1990
థామస్ కావలియర్ స్మిత్
1998
థామస్ కావలియర్ స్మిత్
2015
2 kingdoms 3 kingdoms 2 empires 4 kingdoms 5 kingdoms 3 domains 2 empires, 6 kingdoms 2 empires, 7 kingdoms
(not treated) ప్రోటిస్టా ప్రోకర్యోటా మొనేరా మొనేరా బాక్టీరియా బాక్టీరియా బాక్టీరియా
ఆర్కియా ఆర్కియా
యూకర్యోటా ప్రోటిస్టా ప్రోటిస్ట్ యూకర్యోట్ ప్రోటోజోవా ప్రోటోజోవా
క్రోమిస్టా క్రోమిస్టా
మొక్క మొక్క మొక్క మొక్క మొక్క మొక్క
ఫంగై ఫంగై ఫంగై
జంతువు జంతువు జంతువు జంతువు జంతువు జంతువు

ఇటీవలి సమగ్ర వర్గీకరణలు

జీవుల యొక్క అనేక వ్యక్తిగత సమూహాలకు పాక్షిక వర్గీకరణలు ఉన్నాయి. కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చినప్పుడు వీటిని సవరిస్తారు. అయితే, చాలా లేదా యావత్తు జీవులకూ సంబంధించిన సమగ్రమైన ప్రచురణలు చాలా అరుదుగా ఉంటాయి; ఇటీవలి ఉదాహరణల్లో అడ్ల్ తది., 2012, 2019 లలో చేసిన ప్రచురణలు యూకారియోట్‌లను ప్రొటిస్ట్‌లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తాయి. రుగ్గిరో తదితరులు, 2015 ప్రచురణలో యూకర్యోట్‌లు, ప్రొకార్యోట్‌లు రెండింటినీ ఆర్డర్ ర్యాంకు వరకూ (రెండింటి శిలాజ ప్రతినిధులను మినహాయించినప్పటికీ) కవర్ చేస్తుంది. ఒక ప్రత్యేక సంకలనం (రుగ్గిరో, 2014) కుటుంబం యొక్క ర్యాంక్ వరకు ఉన్న టాక్సాను కవర్ చేస్తుంది. ఇతర, డేటాబేస్-ఆధారిత ప్రచురణలలో ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లైఫ్, ది గ్లోబల్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ, NCBI వర్గీకరణ డేటాబేస్, మెరైన్, నాన్‌మెరైన్ జెనెరాల మధ్యంతర రిజిస్టర్, ఓపెన్ ట్రీ ఆఫ్ లైఫ్, కాటలాగ్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి . పాలియోబయాలజీ డేటాబేస్ అనేది శిలాజాలకు ఒక వనరు.

అనువర్తన

బయోలాజికల్ టాక్సానమీ అనేది జీవశాస్త్రంలో ఒక ఉప-విభాగం. దీనిని సాధారణంగా "టాక్సానామిస్ట్‌లు" అని పిలవబడే జీవశాస్త్రవేత్తలు అభ్యసిస్తారు. అయితే ఉత్సాహవంతులైన సహజవాదులు కూడా కొత్త టాక్సా తరచూ ప్రచురణలో పాల్గొంటూ ఉంటారు. వర్గీకరణ శాస్త్రం జీవితాన్ని వివరించడం, నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నందున, జీవవైవిధ్యం, పరిరక్షణ జీవశాస్త్రాల అధ్యయనానికి వర్గీకరణ శాస్త్రజ్ఞులు నిర్వహించే పని చాలా అవసరం.

జీవులను వర్గీకరించడం

జీవ వర్గీకరణ అనేది వర్గీకరణ ప్రక్రియలో కీలకమైన అంశం. ఫలితంగా, టాక్సన్ యొక్క బంధువులు ఏమై ఉంటాయని ఊహిస్తున్నారో వినియోగదారుకు తెలియజేస్తుంది. బయోలాజికల్ వర్గీకరణ ఇతర వాటితో సహా వర్గీకరణ ర్యాంక్‌లను ఉపయోగిస్తుంది (గరిష్ఠ స్థాయిలో కలిపేవాటి నుండి కనీస స్థాయిలో కలుపే వాటి వరకు ఉండే క్రమంలో). అవి: డొమైన్, కింగ్‌డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, ప్రజాతి, జాతి, స్ట్రెయిన్ (Domain, Kingdom, Phylum, Class, Order, Family, Genus, Species, Strain).

టాక్సన్ "నిర్వచనం" దాని వివరణ లేదా దాని రోగనిర్ధారణ లేదా రెండింటినీ కలిపి ఉంటుంది. టాక్సా నిర్వచనాన్ని నియంత్రించే నియమాలు ఏవీ లేవు. కానీ కొత్త టాక్సాకు పేరు పెట్టడం, ప్రచురించడంలో కొన్ని నియమాలను పాటించాలి. జంతుశాస్త్రంలో, సాధారణంగా ఉపయోగించే ర్యాంకుల (సూపర్ ఫ్యామిలీ నుండి ఉపజాతుల వరకు) నామకరణం అంతర్జాతీయ జూలాజికల్ నామకరణం (ICZN కోడ్) నియంత్రిస్తుంది. ఫైకాలజీ, మైకాలజీ, బోటనీ రంగాలలో, టాక్సా పేరు ఆల్గే, శిలీంధ్రాలు, మొక్కల (ICN) కోసం అంతర్జాతీయ నామకరణ నియమావళి నియంత్రిస్తుంది.

టాక్సన్ ప్రారంభ వివరణలో ఐదు ప్రధాన ఆవశ్యక అంశాలుంటాయి:

  1. టాక్సన్‌కు తప్పనిసరిగా లాటిన్ వర్ణమాలలోని 26 అక్షరాల ఆధారంగా పేరు పెట్టాలి (కొత్త జాతులకు ద్విపద, లేదా ఇతర ర్యాంక్‌లకు ఏకపదం).
  2. పేరు తప్పనిసరిగా ప్రత్యేకంగా (యూనిక్‌గా) ఉండాలి (అంటే హోమోనిమ్ కాదు).
  3. వివరణ తప్పనిసరిగా, కనీసం ఒక పేరు-కలిగిన టైప్ స్పెసిమెన్ ఆధారంగా ఉండాలి.
  4. అందులో టాక్సన్‌ను వివరించడానికి (నిర్వచించడానికి) లేదా ఇతర టాక్సా (రోగ నిర్ధారణ, ICZN కోడ్, ఆర్టికల్ 13.1.1, ICN, ఆర్టికల్ 38) నుండి వేరు చేయడానికి తగిన లక్షణాల గురించి ప్రకటనలు ఉండాలి. రెండు సంకేతాలూ ఉద్దేశపూర్వకంగా టాక్సన్ కంటెంట్‌ను దాని పేరును నిర్వచించడం నుండి వేరు చేస్తాయి.
  5. ఈ మొదటి నాలుగు అవసరాలు శాశ్వత శాస్త్రీయ రికార్డుగా తప్పనిసరిగా ప్రచురించబడాలి, అవి వివిధ సారూప్య కాపీలుగా అందుబాటులో ఉండాలి.

అయితే, టాక్సన్‌కు సంబంధించిన భౌగోళిక పరిధి, పర్యావరణ సంబంధ నోట్స్, రసాయనిక ధర్మాలు, ప్రవర్తన తదితర సమాచారాన్ని కూడా తరచూ చేరుస్తూంటారు. పరిశోధకులు తమ టాక్సాకు పేరు ఎలా పెడతారనే పద్ధతులు విభిన్నంగా ఉంటాయి: అందుబాటులో ఉన్న డేటాను, వనరులను బట్టి, పెద్ద మొత్తంలో DNA సీక్వెన్స్ డేటా యొక్క కంప్యూటర్ విశ్లేషణలను విశదీకరించడానికి, విశిష్టమైన లక్షణాల సాధారణ పరిమాణాత్మక లేదా గుణాత్మక పోలికల నుండి ఈ పద్ధతులు మారుతూ ఉంటాయి.

డేటాబేస్‌లు

ఆధునిక టాక్సానమీ, వర్గీకరణలు, వాటి డాక్యుమెంటేషన్‌లను శోధించడానికీ జాబితా చేయడానికీ డేటాబేస్ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. సాధారణంగా ఉపయోగించే డేటాబేస్ ఒకటి లేనప్పటికీ, కాటలాగ్ ఆఫ్ లైఫ్ వంటి సమగ్ర డేటాబేస్‌లు ఉన్నాయి. ఇందులో డాక్యుమెంట్ చేయబడిన ప్రతి జాతినీ జాబితా చేసారు. ఈ జాబితాలో ఏప్రిల్ 2016 నాటికి అన్ని రాజ్యాలకు చెందిన 16.4 లక్షల జాతులు ఉన్నాయి. ఆధునిక శాస్త్రానికి అంచనాకు అందిన జాతులలో నాలుగింట మూడు వంతులు ఇందులో ఉన్నాయని భావిస్తున్నారు.

నోట్స్

మూలాలు

Tags:

బయాలజీ టాక్సానమీ నిర్వచనంబయాలజీ టాక్సానమీ ఆధునిక వర్గీకరణ వ్యవస్థబయాలజీ టాక్సానమీ అనువర్తనబయాలజీ టాక్సానమీ డేటాబేస్‌లుబయాలజీ టాక్సానమీ నోట్స్బయాలజీ టాక్సానమీ మూలాలుబయాలజీ టాక్సానమీకరోలస్ లిన్నేయస్కుటుంబము (జీవశాస్త్రం)క్రమము (జీవశాస్త్రం)జాతిజీవితరగతి (జీవశాస్త్రం)ద్వినామ నామకరణప్రజాతివిజ్ఞానశాస్త్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

అగ్నికులక్షత్రియులుశ్రీకాంత్ (నటుడు)ఊరు పేరు భైరవకోనభారత జాతీయపతాకంప్రదీప్ మాచిరాజుఅన్నప్రాశనఅమెరికా రాజ్యాంగంతెలుగు వ్యాకరణంమదర్ థెరీసాపునర్వసు నక్షత్రముసన్ రైజర్స్ హైదరాబాద్బైబిల్హార్దిక్ పాండ్యాట్రైడెకేన్భారత ఆర్ధిక వ్యవస్థనోటావిశాఖ నక్షత్రమువై.ఎస్.వివేకానందరెడ్డిమర్రిబ్లూ బెర్రీతెలుగు పదాలుఉసిరిఇక్ష్వాకులుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనితీశ్ కుమార్ రెడ్డిపి.సుశీలవిష్ణువుఆంగ్ల భాషశోభితా ధూళిపాళ్లహనుమంతుడు73 వ రాజ్యాంగ సవరణపేర్ని వెంకటరామయ్యయువరాజ్ సింగ్సంభోగంగ్రామ పంచాయతీకొమురం భీమ్రామావతారంనామవాచకం (తెలుగు వ్యాకరణం)మంగళగిరి శాసనసభ నియోజకవర్గంప్రకటనఆర్టికల్ 370పుచ్చసూర్యుడుఅయోధ్య రామమందిరంబౌద్ధ మతంగంజాయి మొక్కమహామృత్యుంజయ మంత్రంఉలవలుపోలవరం ప్రాజెక్టునక్షత్రం (జ్యోతిషం)విజయశాంతియమధీరయానిమల్ (2023 సినిమా)మీనరాశిఉండి శాసనసభ నియోజకవర్గంఅక్షయ తృతీయభారతీయ సంస్కృతినాగార్జునసాగర్సరస్వతిఖమ్మంరుతురాజ్ గైక్వాడ్యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంహరే కృష్ణ (మంత్రం)కర్ణుడురకుల్ ప్రీత్ సింగ్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరాజ్‌కుమార్ఓం భీమ్ బుష్సంస్కృతంకాకినాడవృషణంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కామసూత్రపంచభూతలింగ క్షేత్రాలుకనకదుర్గ ఆలయంచే గువేరాఅశ్వని నక్షత్రముఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపంచారామాలు🡆 More