బొలీవియా

బొలీవియా (ఆంగ్లం : బొలీవియా), అధికారికనామం బొలీవియా గణతంత్రం, ఒక భూపరివేష్టిత దేశం.

బొలీవియా దక్షిణ అమెరికా మధ్యప్రాంతంలో ఉన్న దేశం. దీని ఉత్తర, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, దక్షిణసరిహద్దులో అర్జెంటీనా, పరాగ్వే, పశ్చిమసరిహద్దులో చిలీ, పెరూ దేశాలు ఉన్నాయి. దేశభూభాగంలో మూడింట ఒక భాగం " ఆండెస్ పర్వతాలు విస్తరించి " ఉన్నాయి.

República de Bolivia
Bulibya Republika  
Wuliwya Suyu  
(and 34 other official names)
బొలీవియా గణతంత్రం
Flag of బొలీవియా బొలీవియా యొక్క చిహ్నం
నినాదం
"¡La unión es la fuerza!"  మూస:Langicon
"Unity is strength!"
జాతీయగీతం
బొలీవియా జాతీయగీతం

బొలీవియా యొక్క స్థానం
బొలీవియా యొక్క స్థానం
రాజధానిSucre (constitutional, judicial)
19°2′S 65°15′W / 19.033°S 65.250°W / -19.033; -65.250

La Paz (administrative)
16°29′S 68°8′W / 16.483°S 68.133°W / -16.483; -68.133
అతి పెద్ద నగరం Santa Cruz de la Sierra
17°48′S 63°10′W / 17.800°S 63.167°W / -17.800; -63.167
అధికార భాషలు స్పానిష్ భాష and 36 native languages
జాతులు  30% Quechua, 30% Mestizo, 25% Aymara, 15% White
ప్రజానామము Bolivian
ప్రభుత్వం రిపబ్లిక్
 -  President en:Evo Morales
 -  Vice President Álvaro García
Independence
 -  from స్పెయిన్ ఆగస్టు 6 1825 
 -  జలాలు (%) 1.29
జనాభా
 -  జూలై 2007 అంచనా 9,119,152 (84వది)
 -   జన గణన 8,857,870 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $40.140 బిలియన్లు (101st)
 -  తలసరి $4,084 (125వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $13.292 billion (108వది)
 -  తలసరి $1,352 (121st)
జినీ? (2002) 60.1 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.695 (medium) (117th)
కరెన్సీ Boliviano (BOB)
కాలాంశం (UTC-4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bo
కాలింగ్ కోడ్ +591

బొలీవియా తూర్పు ప్రాంతంలో ఎక్కువగా చదునైన ప్రాంతంలో అతిపెద్ద నగరం, ప్రధాన ఆర్థిక, ఫైనాంషియల్ కేంద్రం " శాంటా క్రుజ్ డి లా సియెర్రా " " లానాస్ ఓరియంటెస్ " (ఉష్ణమండల లోతట్టులు) ఉంది. " ఆఫ్రో-యురేషియా " వెలుపల ఉన్న రెండు భూపరివేష్టిత దేశాలలో బొలివియా ఒకటి.రెండవ దేశం పరాగ్వే. ఉన్నాయి. అమెరికా ఖండాలలో భౌగోళికంగా అతిపెద్ద భూభంధిత దేశం బొలీవియా. ఆర్థిక, సైనికపరంగా బొలీవియా చిన్న దేశం. బొలీవియాలో స్పానిష్ వలసరాజ్య స్థాపనకు ముందు బొలీవియాలోని ఆండియన్ ప్రాంతం " ఇంకా సామ్రాజ్యం "లో భాగంగా ఉంది. ఉత్తర, తూర్పు లోతట్టు ప్రాంతాలలో స్వతంత్ర తెగలకు చెందిన ప్రజలు నివసించారు. 16 వ శతాబ్దంలో " కస్కో " , " అసున్షియోన్ " నుండి వచ్చిన స్పానిష్ విజేతలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్పానిష్ వలసరాజ్యం కాలంలో బొలీవియా " రాయల్ ఆడియెన్సియా ఆఫ్ చార్కాస్ " నిర్వహణలో ఉంది. బొలీవియాలో అపారంగా లభించిన వెండి విక్రయాలతో స్పెయిన్‌ తనసామ్రాజ్యాన్ని నిర్మించింది.

దేశ జనాభా 11 మిలియన్లగా అంచనా వేయబడింది. వీరిలో అమెరిన్డియన్స్, మేస్టిజోలు, యూరోపియన్స్, ఆసియన్లు, ఆఫ్రికన్లు ఉన్నారు. స్పానిష్ వలసవాదం నుండి ఉద్భవించిన జాతి వేర్పాటు, సాంఘిక విభజన ఆధునిక యుగం వరకు కొనసాగింది. స్పానిష్ అధికారిక, ప్రధానమైన భాషగా ఉన్నప్పటికీ 36 స్థానిక బొలీవియా భాషలు కూడా అధికారిక హోదా కలిగివున్నాయి. వీటిలో సాధారణంగా గురాని మాండలికాలు ఐమరా భాష , క్యుచూన్ భాషలు (క్వెచువా)మాట్లాడేవారు ఉన్నారు.

ఆధునిక బొలీవియా ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్),అలీన దేశాల ఉద్యమం, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ (ఓఎఎస్),అమెజాన్ సహకార ఒప్పందం సంస్థ (ఎ.సి.టి.ఒ), బ్యాంక్ ఆఫ్ ది సౌత్, ఎ.ఎల్.బి.ఎ. యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్ (యుఎస్ఎన్) చార్టర్ సభ్యదేశంగా ఉంది. బొలీవియా రాజ్యాంగ వ్యవస్థ బొలివియాను తొమ్మిది రాజ్యాంగ విభాగాలుగా విభజించించింది. భౌగోళికంగా బొలీవియా పశ్చిమభూభాగంలో అండీస్ పర్వత శిఖరాలు, తూర్పు లోలాండ్స్ వరకు అమెజాన్ ముఖద్వారం విస్తరించి ఉంది.బొలీవియా దక్షిణ అమెరికాలో అత్యంత పేద దేశంగా ఉంది. బొలీవియా అభివృద్ధి చెందుతున్న దేశంగా మధ్యమ మనవాభివృద్ధి, పేదరికం 53% కలిగి ఉంది. ఆర్ధికరంగంలో వ్యవసాయం, వన్యసంపద, మత్స్యపరిశ్రమ, గనులు, తయారీ పరిశ్రమ (వస్త్రాలు, దుస్తులు, రిఫైడ్ మెటల్స్), రిఫైండ్ పెట్రోలియం ప్రధానపాత్ర వహిస్తున్నాయి.

పేరు వెనుక చరిత్ర

స్పానిష్ - అమెరికన్ స్వాతంత్రపోరాట యోధుడు " సైమన్ బొలీవియా " స్మృత్యర్ధం ఈ దేశానికి బొలీవియా అని నామకరణం చేయబడింది. వెనిజులా నాయకుడు " ఆంటోనియో జోస్ డి సుక్రే " బోలివర్‌కు " సుక్రి "(చార్కాస్)ను (ప్రస్తుత రోజు బొలీవియా) కొత్తగా ఏర్పడిన " రిపబ్లిక్ ఆఫ్ పెరూ "లో విలీనం చేసి " యునైటెడ్ ప్రోవిన్స్ ఆఫ్ రియో ​​డి లా ప్లాటా "తో సమైఖ్యం చేయడం లేక స్పెయిన్ నుండి పూర్తిగా స్వతంత్రం ప్రకటించాలని ప్రతిపాదించాడు. చేయడానికి లేదా స్పెయిన్ నుంచి స్వతంత్రాన్ని పూర్తిగా స్వతంత్ర దేశంగా ప్రకటించాలని. సుక్రె కొత్త దేశంగా సృష్టించబడి స్థానికుల మద్దతుతో దేశానికి " సిమోన్ బొలివర్ " గౌరవార్థం ఆయన పేరు పెట్టారు. అయినప్పటికీ " రిపబ్లిక్ బొలీవర్ "గా గుర్తించబడుతుంది.కొన్ని సంవత్సరాల తరువాత [ఎప్పుడు?] కాంగ్రెస్ సభ్యుడు " మాన్యుయల్ మార్టిన్ క్రజ్ ": రోమ్లాస్ నుండి రోం వచ్చినట్లు బొలీవర్ నుండి బొలీవియా వచ్చింది " అని వ్యాఖ్యానించాడు. (స్పానిష్: [Si de Rómulo Roma, de Bolívar Bolivia] Error: {{Lang}}: text has italic markup (help)). 1825 అక్టోబరు 3న పేరు అనుమతి పొందింది. 2009లో బొలీవియా రాజ్యాంగం దేశం అధికారిక నామం " ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా "గా మార్చి బహుళ సంప్రదాయాలకు చెందిన ప్రజలకు గుర్తింపు కలుగజేస్తూ బొలీవియా స్థానిక ప్రజలను రాజ్యాంగపరిధిలోకి తీసుకువచ్చింది.

నైసర్గిక స్వరూపము

  • స్వాతంత్య్రం వచ్చింది - 1825 ఆగస్టు 6న
  • వైశాల్యం - 10,98,581 చ.కి.మీ.
  • జనాభా - 1,05,56,102 (2014 జనాభా లెక్కల ప్రకారం)
  • రాజధాని- లా పాజ్
  • కరెన్సీ - పెసో
  • ప్రభుత్వం - యునిటరీ ప్రెసిడెన్షియల్ కాన్‌స్టిట్యూష నల్ రిపబ్లిక్
  • భాషలు- స్పానిష్, క్వెచువా, అయిమారా,
  • మతం - క్రైస్తవులు
  • వాతావరణం - జనవరి-జులై మధ్య 1 నుండి 17 డిగ్రీలు, ఆగస్టు -డిసెంబరు మధ్య 6 నుండి 19 డిగ్రీలు ఉంటుంది.
  • పంటలు - బంగాళదుంప, మొక్కజొన్న, చెరకు, వరి, కసావా, కాఫీ, లామాస్.
  • ఖనిజాలు - తగరం, రాగి, సీసం, జింకు, సల్ఫర్, ఇనుము, సహజవాయువులు, టంగ్‌స్టన్, వెండి, బంగారం, బిస్మత్, ఆంటిమొనీ మొదలైనవి.
  • పరిశ్రమలు - గనులు, సహజవాయువులు, చమురుశుద్ధి, దుస్తులు, హండీక్రాప్ట్, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమ
  • ఎగుమతులు - తగరం, ఆంటిమోనీ, టంగ్‌స్టన్, జింకు, వెండి, సీసం, సహజవాయువులు.
  • సరిహద్దులు - పరాగ్వే, చిలీ, అర్జెంటీనా, పెరూ, బ్రెజిల్

చరిత్ర

దక్షిణ అమెరికా ఖండంలో బొలీవియా ఒక నిత్యదరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న దేశం. ఇక్కడ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. ప్రభుత్వ అస్థిరత చాలా తీవ్రంగా ఉంది.16వ శతాబ్దంలో ఈ దేశం స్పెయిన్ దేశపు రాజుల అధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ పనులు చేయడానికి భారతదేశం నుండి ప్రజలను తీసుకువచ్చి బానిసలుగా మార్చి, వ్యవసాయ పనులు చేయించారు. అలా భారతీయులు శతాబ్దాలుగా అక్కడ బానిసలుగా బ్రతికి, ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అక్కడ ప్రజలుగా మారిపోయారు. ఇతర దేశాలు వీలైనంతగా ఈ దేశ భూభాగాన్ని లాక్కున్నాయి. 1952 తర్వాత మాత్రమే భారతసంతతి వారికి కొంత లాభం చేకూరింది. దేశంలో దాదాపు 50 శాతం భూమి వ్యవసాయానికి గానీ, నివాసానికి గానీ వీలుగా లేదు. జనాభా అంతా కేవలం 50 శాతం భూభాగంలోనే కేంద్రీకృతమైంది.

చరిత్ర

కాలనీ పాలనకు ముందు

బొలీవియా 
Tiwanaku at its largest territorial extent, AD 950.

ప్రస్తుత బొలీవియా ప్రాంతంలో ప్రవేశించిన ఐమారా ప్రజలు ఈప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని 2,500 సంవత్సరాలకు పైగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రస్తుత ఐమరా పురాతన టివావాకు సంస్కృతి, నాగరికతతో అనుబంధం కలిగి ఉన్నారు. బొలీవియాకు రాజధానిగా ఉన్న టివానాకు నగరం క్రీ.పూ 1500 లో స్థాపించబదే నాటికి అది చిన్న వ్యవసాయ ఆధారిత గ్రామం ఉండేది. సమూహం నివసించిన ప్రాంతం సా.శ. 600- 800 మద్య నగరంగా మారింది.ప్రస్తుతం దక్షిణ ఆండెస్ పర్వతప్రాంతంలో టియనాకు నగరం ముఖ్యమైన ప్రాంతీయశక్తిగా ఉంది.[ఎప్పుడు?] నగరవైశాల్యం 6.5 చ.కి.మీ.ఇక్కడ 15,000-30,000 మంది నివసిస్తున్నారు. 1996 లో ఉపగ్రహ ఇమేజింగ్ టివావాకు మూడు ప్రాథమిక లోయలలోకి శిలీంధ్రం కాకాస్ (వరదల కారణంగా పెరిగిన భూభాగం) విస్తరణను, 2,85,000, 14,82,000 ప్రజల మధ్య జనాభాసంఖ్యను అంచనా వేయడానికి ప్రయత్నించారు. సుమారు సా.శ. 400 టివనాకు దోపిడీ దేశంగా ఒక స్థానిక ఆధిపత్య శక్తి ఆధిపత్యంలోకి మారింది. టివావాకు యుగాలలోకి విస్తరించి పెరూ, బొలీవియా, చిలీలలోని అనేక సంస్కృతులతో తన సంస్కృతి, జీవన విధానాన్ని అనుసంధానం చేసింది. టివనాకు ఒక హింసాత్మక సంస్కృతి కాదు. విస్తరణ కొరకు టివావాకు గొప్ప రాజకీయ దృఢత్వం, కాలనీలను సృష్టించడం, వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహించడం (ఇతర సంస్కృతులపై ఆధారపడింది), దేశ సంప్రదాయాలను ఏర్పాటు చేయడం వంటి ప్రయత్నాలు చేసింది. టివనాకు సంస్కృతులను నిరంతరాయంగా అభివృద్ధి చెందింది. టివానాకు సామ్రాజ్యంలో భాగమైన సంస్కృతులలో టియాహునాకో సంస్కృతిలో క్రీ.పూ. 400- 700 నాటకీయంగా మార్పులు సంభవించడం పురావస్తు శాస్త్రవేత్తలు గమనించారు. టివానాకు శక్తి సామ్రాజ్యంలోని నగరాల్లో స్మారక నిర్మాణాలు, నివాసుల సంఖ్య అధికరించడం సంభవించాయి. టివనాకు ఇతర సంస్కృతులను తుడిచిపెట్టకుండా తమ సంస్కృతిలో కలుపుకోవడం కొనసాగించింది.టివనాకు సెరామిక్ నాటకీయంగా ఇతర సంస్కృతులను స్వీకరించి టివనాకు సామ్రాజ్యంలో అంతర్భాగం చేసాయని పురాతత్వశాస్త్రకారులు గ్రహించారు.టివనాకు శక్తి నగరాల మద్య వాణిజ్యం అభివృద్ధిచేసి సామ్రాజ్యాన్ని మరింత పఠిష్టం చేసాయి. టివనాకు ప్రముఖులు వారు తమ నియంత్రణలోని మితిమీరిన ఆహారం ద్వారా హోదాని పొందారు.వారు వెలుపలి ప్రాంతాల నుండి ఆహారాలను సేకరించి సాధారణ ప్రజానీకానికి తిరిగి పంపిణీ చేశారు. అంతేకాకుండా సరిహద్దుల నుండి పౌర కేంద్రం వరకు వస్తువులను తీసుకురావడానికి లాలాస్ తప్పనిసరి కావడంతో " ల్లామా" మందల నియంత్రణ ప్రముఖుల శక్తివంతమైన నియంత్రణ యంత్రాంగంగా మారింది. ఈ మందల యాజమాన్యం సామాన్య ప్రజలకు, ఉన్నత వర్గాల మధ్య తరగతి ప్రజల విలక్షణతకు చిహ్నంగా మారింది. మిగులు వనరులను ఈ నియంత్రణ, సమర్ధత ప్రముఖుల శక్తి సుమారు క్రీ.పూ. 950 వరకు కొనసాగింది. ఈ సమయంలో వాతావరణంలో నాటకీయ మార్పు ఏర్పడింది.[page needed] ఈమార్పుకు టిటికాకా బేసిన్లో వర్షపాతం గణనీయంగా తరుగుదల ఏర్పడడం ప్రధానకారణం అని పురావస్తు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.వర్షపాతం పడిపోవడంతో టిటికాకా సరస్సు నుండి చాలా దూరంలో ఉన్న అనేక నగరాలు ఉన్నతస్థాయికి ధరకు తక్కువ ఆహార పదార్థాలను ఇవ్వడం ప్రారంభం అయింది.ఆహారంలో నిలువలు తగ్గినకారణంగా వారి అధికారాన్ని నియంత్రించడానికి అందుబాటులో ఉన్న ఆధారం బలహీనపడిన కారణంగా ఉన్నతవర్గాల నియంత్రణ బలహీనపడింది. వ్యవసాయ రంగంలో చేపట్టిన అభివృద్ధిపధకాలు ఫలించిన కారణంగా రాజధాని నగరం ఆహార ఉత్పత్తికి అనుకూలమైనది. సా.శ. 1000 తివానాకు సమూహం ఈప్రాంతంలో కనిపించకుండా పోయింది. ఎందుకంటే ఉన్నత వర్గాల ప్రధాన వనరు ఆహార ఉత్పత్తి శుష్కించడం ఇందుకు ప్రధాన కారణం అయింది. తరువతా కొన్ని శతాబ్దాలకాలం ఈ ప్రాంతం జనావాసాలు లేకుండానే ఉంది.

బొలీవియా 
Inca Expansion (1438–1527).

1438 నుండి 1527 మద్యకాలంలో ఇంకాసామ్రాజ్యం తన రాజధాని నగరం " కుజో " (పెరూ) నుండి రాజ్యవిస్తరణ చేస్తూ ప్రస్తుత బొలీవియా ప్రాంతాన్ని ఆక్రమించుకుని అమెజాన్ నదీముఖద్వారం చేరుకున్నారు.

కాలనీ పాలనా కాలం

1524 లో ఈప్రాంతంలో స్పానిష్ సామ్రాజ్యం ఆరంభమై 1533 నాటికి విస్తరణ పూర్తి అయ్యింది. ప్రస్తుత బొలీవియా ప్రాంతం ఆసమయంలో లిమా వైస్రాయి అధికారంలో చర్కాస్ అని పిలువబడింది. చుక్యూసియా (లా ప్లాటా-ఆధునిక సుక్రలో ఉన్న " రియల్ ఆడియెన్సియా ఆఫ్ చార్కాస్ ") నుండి స్థానిక ప్రభుత్వం ఏర్పాటుచేయబడింది.1545 లో మైనింగ్ టౌన్ గా స్థాపించబడిన పోటోసి శిఘ్రగతిలో అద్భుతమైన సంపదను ఉత్పత్తి చేసిన కారణంగా నగరం న్యూ వరల్డ్‌లో అతిపెద్ద నగరంగా మారుతోంది. నగర జనసంఖ్య 150,000 కంటే అధికం అయింది. 16వ శతాబ్దం చివరినాటికి బొలీవియన్ వెండిగనులు " స్పెయిన్ సాంరాజ్యానికి " ప్రధాన ఆర్థికవనరుగా మారింది. మిటా (ఇంకా) అని పిలవబడే కొలంబియా పూర్వపు వ్యవస్థ స్పానిష్ క్రూరమైన బానిస విధానం కింద స్థానికప్రజలు పనిచేసారు. 1776 లో చర్కాస్ రియో ​​డి లా ప్లాటా వైస్రాయల్టీకి బదిలీ చేయబడ్డాడు. వైస్రాయల్టీ రాజధాని అయిన బ్యూనస్ ఎయిర్స్ నుండి వచ్చిన ప్రజలు ఈప్రాంతాన్ని "ఎగువ పెరూ" అని పేర్కొన్నారు. 1781 మార్చిలో లా పాజ్‌ ముట్టడిలో స్థానిక తిరుగుబాటుకు " టుపాక్ కాటరి " నాయకత్వం వహించాడు. ఈ దాడిసమయంలో 20,000 మంది మరణించారు. నెపోలియన్ యుద్ధాల సమయంలో స్పానిష్ రాచరిక అధికారం బలహీనపడింది. వలసల పాలనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం బలపడింది.

స్వతంత్రం తరువాత యుద్ధాలు

1809 మే 25 న సుక్రే నగరంలో " బొలీవియన్ స్వాతంత్ర పోరాటం ", " చుక్యూసికా విప్లవం " (చుక్యూసికా ఈ నగరం పేరు) ప్రారంభం అయ్యాయి. లాటిన్ అమెరికాలో స్వాంతంత్రం కొరకు ఆక్రందనగా వర్ణించబడింది . 1809 జూలై 16 న ఆ విప్లవం " లా పాజ్ విప్లవం " జరిగింది. లా పాజ్ విప్లవం స్పానిష్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా జరింది. స్పానిష్ సామ్రాజ్యం స్థానిక స్వతంత్ర సైనికరాజప్రతినిధి నెపోలియన్ బొనపార్టేను స్పానిష్ రాజప్రతినిధిగా తొలగించిన తరువాత చుక్యూసిసా విప్లవం జరిగింది. అయినప్పటికీ రెండు విప్లవాలు స్వల్పకాలికంగా ముగింపుకు వచ్చాయి. రియో ​​డి లా ప్లాటా వైస్రాయల్టీలో స్పానిష్ అధికారులచే ఇవి నిర్వీర్యం చేయబడ్డాయి.అయినప్పటికీ తరువాతి సంవత్సరం " స్పానిష్ అమెరికన్ స్వతంత్ర యుద్ధాలు " ఖండం అంతటా వ్యాపించింది.

యుద్ధం సమయంలో స్పానిష్ - అమెరికన్ విప్లవకారులు, దేశభక్తులచేత బొలీవియా అనేక సార్లు స్వాధీనం చేసుకొనబడి విడిపడి తిరిగి స్వాధీనం చేసుకొనబడింది. బ్యూనస్ ఎయిర్స్ నాయకత్వంలో పంపబడిన మూడు సైనిక బృందాలు వీటిని అన్నింటినీ ఓడించాయి. చివరికి ఇది సాల్టాలో జాతీయ సరిహద్దులను రక్షించటం వరకు పరిమితమైంది.చివరకు బొలీవియా చివరికి " ఆంటోనియో జోస్ డి సుక్రె " నాయకత్వంలో సిమోన్ బోలివర్ సైనిక మద్దతుతో రాచరిక సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొందింది. చిట్టచివరకు, ప్రచారానికి మద్దతుగా ఉత్తరం నుండి వచ్చిన సైనిక ప్రచారం. 16 సంవత్సరాల యుద్ధం తర్వాత రిపబ్లిక్ 1825 ఆగస్టు 6 న " బొలీవియన్ స్వతంత్రం " ప్రకటించబడింది.

బొలీవియా 
The first coat of arms of Bolivia, formerly named as the Republic of Bolívar in honor of Simón Bolívar.

1836 లో బొలీవియా పాలిస్తున్న " మార్షల్ ఆండ్రెస్ డి శాంటా క్రుజ్ " పదవి నుండి తొలగించబడిన పెరూ అధ్యక్షుడు " జనరల్ లూయిస్ జోస్ డి ఆర్బేగోసో "ను తిరిగి పదవిలో నిలబెట్టడానికి పెరూ మీద దాడి చేసాడు. తరువాత శాంటా క్రుజ్తో రక్షణలో పెరూ, బొలీవియా " పెరూ-బోలివియన్ కాన్ఫెడరేషన్ " ఏర్పడ్డాయి. కాన్ఫెడరేషన్, చిలీ మధ్య ఉద్రిక్తత తరువాత 1836 డిసెంబర్ 26 న చిలీ యుద్ధం ప్రకటించబడింది. అర్జెంటీనా కాన్ఫెడరేషన్‌ మీద 1837 మే 9న ప్రత్యేకంగా యుద్ధం ప్రకటించింది. పెరూ-బొలీవియన్ దళాలు " కాన్ఫెడరేషన్ యుద్ధం " సమయంలో అనేక ప్రధాన విజయాలు సాధించాయి. అర్జెంటీనా ఓటమి దండయాత్ర చేయబడిన నగరాలు ఆరక్కిపా సమీపంలోని పౌకర్పతా జిల్లా ప్రాంతాలపై మొట్టమొదటి సారిగా చిలీ ఓటమి సంభవించాయి.

యుద్ధం ప్రారంభమైన తరువాత చిలీ, పెరూ తిరుగుబాటు సైన్యం బేషరతుగా లొంగిపోయి " పౌకర్పతా ట్రీటీ " మీద సంతకం చేశాయి. పెరూ-బొలివియా నుండి చిలీ తిరోగమించవచ్చని చిలీ స్వాధీనంలో ఉన్న కాన్ఫెడరేట్ ఓడలను స్వాధీనం చేయాలని, ఆర్ధిక సంబంధాలు సాధారణ స్థితికి తీసుకురావాలని, కాన్ఫెడరేషన్ పెరువియన్ రుణాన్ని చిలీకి చెల్లించాలని ఈ ఒప్పందం ప్రతిపాదించింది. చిలీ ప్రభుత్వం, ప్రజలు శాంతి ఒప్పందాన్ని తిరస్కరించాయి.చిలీ కాంఫిడరేషన్ మీద రెండవ దాడిని నిర్వహించి " యుగనే యుద్ధం "లో కాంఫిడరేషన్‌ను ఓడించింది. ఈ ఓటమి తరువాత శాంటా క్రూజ్ రాజీనామా చేసి ఈక్వడార్ చేరుకుని తరువాత పారిస్ చేరుకున్నాడు. తరువాత పెరూ- బొలీవియన్ కాన్ఫెడరేషన్ రద్దు చేయబడింది.

పెరూ స్వతంత్రం పునరుద్ధరించబడిన తరువాత పెరువియన్ అధ్యక్షుడు జనరల్ అగస్టిన్ గామారా బొలీవియాపై దాడి చేశాడు. 1841 నవంబర్ 20 న పెరూవియన్ సైన్యం " ఇగావి యుద్ధం" లో బొలివియన్ చేతిలో ఓటమిపొందిన తరువాత గామారాను హతమార్చబడ్డాడు. జనరల్ జోస్ బల్లివియన్ నాయకత్వంలో బొలీవియన్ సైన్యం తరువాత ముందుకుసాగి అరికా ప్రావిన్స్ (పెరు]లో ఉన్న పెరువియన్ నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. తరువాత రెండు వైపులా సైన్యం 1842 లో " శాంతి ఒప్పందం " మీద సంతకం చేసి యుద్ధానికి ముగింపు పలికారు.

19 వ శతాబ్ద ప్రారంభ మధ్యలో రాజకీయ, ఆర్ధిక అస్థిరత కాలంలో బొలీవియా బలహీనపడింది. అదనంగా పసిఫిక్ యుద్ధం (1879-83) సమయంలో చిలీ బొలీవియా తీరంతో సహా సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న నైరుతి ప్రాంతంలోని విస్తారమైన భూభాగాలను ఆక్రమించింది. ప్రస్తుత చుకుకమమతా ప్రాంతం సమీపంలో ఉన్న సుసంపన్నమైన సాలిట్రే (సోడియం నైట్రేట్ క్షేత్రాలు), ఇతర బొలీవియన్ భూభాగాలలో అంటోఫాగస్టా నౌకాశ్రయం చిలీ నియంత్రణలోకి మారాయి. ఇందువలన స్వాతంత్ర్యం తరువాత బొలివియా భూభాగంలో సగం పొరుగు దేశాలు స్వాధీనం చేసుకున్నాయి. బొలీవియా ఎకర్ యుద్ధంలో రబ్బరు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఎరాక్ రాష్ట్రాన్ని కోల్పోయింది. బొలీవియా రైతులు, బొలీవియన్ సైన్యాలు స్వల్పంగా పోరాటంసాగించి కొద్ది విజయాలు సాధించిన తరువాత బ్రెజిల్కు వ్యతిరేకంగా యుద్ధం జరిగింది. యుద్ధం తరువాత 1903 లో పెట్రోపోలీస్ ఒప్పందం మీద బలవంతంగా సంతకం చేయవలసి వచ్చింది. ఒప్పందంలో బొలీవియా కొంత గొప్ప భూభాగాన్ని కోల్పోయింది. బొలీవియన్ ప్రెసిడెంట్ మారియానో ​​మెల్గారేజో (1864-71) ("ఒక అద్భుతమైన తెల్లని గుర్రం" అని పిలువబడింది)ఒక గుర్రం కొనుగోలు చేయడానికి కొంత భూమిని స్వాధీనం చేసాడు. తరువాత ఈప్రాంతం బ్రెజిల్ ప్రజావాహిని చేత నిండిపోయింది. ఈపరిణామాలు చివరికి బ్రెజిల్ యుద్ధం, ఘర్షణ భయం అధికరించడానికి దారితీసింది.[ఆధారం చూపాలి] 19వ శతాబ్దంలో అంతర్జాతీయ వెండిధరలు అధికరించడం బొలీవియా సుసంపన్నతకు, రాజకీయ సుస్థిరతకు దారితీసింది.

20వ శతాబ్ధం ఆరంభం

బొలీవియా 
Bolivia's territorial losses (1867–1938)

20 వ శతాబ్దం ప్రారంభంలో టిన్ వెండిని బొలీవియా అత్యంత ప్రధాన సంపద వనరుగా మార్చింది. 20 వ శతాబ్ద మొదటి ముప్పై సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆర్థికసామాజిక వర్గాలకు చెందిన ప్రముఖుల నాయకత్వం కొనసాగుతూ " లాయిస్జ్-ఫెయిర్ " పెట్టుబడిదారీ విధానాలను అనుసరించబడుతున్నాయి. అత్యధికసంఖ్యక వర్గాలకు చెందిన స్థానిక ప్రజల జీవనపరిస్థితులు దుర్భరమయ్యాయి. గనులలో ప్రాచీనవిధానాలను అనుసరించడం, పెద్ద భూభాగాల్లో దాదాపు భూస్వామ్యవ్యవస్థ కొనసాగడం, విద్యావకాశాలు, ఆర్థిక అవకాశాలు తక్కువగా ఉండడం, రాజకీయావకాశాలు లేకపోవడం పరిస్థితులు దుర్భరం కావడానికి ప్రధానకారణాలుగా ఉన్నాయి. చాకో యుద్ధం (1932-35)లో పరాగ్వే బొలీవియాను ఓడించడం. బొలీవియా " గ్రాన్ చాకో " ప్రాంతంలో చాలా భాగం కోల్పోవడం దేశచరిత్రలోఒక పెద్దమలుపు మారింది. " విప్లవవాద జాతీయవాద ఉద్యమం " (ఎం.ఎన్.ఆర్.) పార్టీ అత్యంత చారిత్రాత్మక ప్రధాన్యత కలిగిన రాజకీయపార్టీగా అవతరించింది. 1951 అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినందుకు తిరస్కరించబడడం 1952 లో విజయవంతమైన విప్లవానికి దారితీసింది. అధ్యక్షుడు " వైకార్ పాస్ ఎస్టెన్స్సోరో"లో పాలనలో ఎంఎన్ఆర్ ఎదుర్కొన్న బలమైన ప్రజల ఒత్తిడి కారణంగా రాజకీయ వేదికపై సార్వత్రిక ఓటు హక్కును ప్రవేశపెట్టి, గ్రామీణ విద్యను ప్రోత్సహించడం, దేశం అతి పెద్ద టిన్ గనులను జాతీయం చేయడం వంటి భారీ సంస్కరణలు చేపట్టబడ్డాయి.

20వ శతాబ్ధం ద్వితీయార్ధం

12 సంవత్సరాల గందరగోళ పాలన తరువాత ఎం.ఎన్.ఆర్. విభజించబడింది. 1964 లో తన మూడవ పదవీకాలం ప్రారంభంలో ప్రెసిడెంట్ ఎస్తేన్స్రోను " సైనిక నియంతృత్వం (జుంటా)" చేత పడగొట్టబడ్డాడు.1966 లో అధ్యక్షుడిగా ఎన్నికైన జుంటా మాజీ సభ్యుడు అధ్యక్షుడు " రెనే బార్రియంటాస్ ఓర్టునో " మరణం తరువాత ప్రభుత్వం బలహీనపడడానికి దారితీసింది.అసెంబ్లీ పట్ల అధికరిస్తున్న ప్రజాభిమానం, అధ్యక్షుడు జువాన్ జోస్ టోరెస్ పట్ల ప్రజలలో అధికరిస్తున్న అభిమానం కారణంగా 1971 లో ఎం.ఎన్.ఆర్. ఇతరులు కలిసి కల్నల్ (తరువాత జనరల్) " హుగో బన్సెర్ సుయెరేజ్ " అధ్యక్షుడిగా ఎన్నికచేసాయి. ఆయన తిరిగి 1997 - 2001లో అధ్యక్షబాధ్యత వహించాడు.

యునైటెడ్ స్టేట్స్ " సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ " (సి.ఐ.ఎ.) 1960లో బొలీవియన్ సైనిక నియంతృత్వానికి ఆర్థికసహాయం, శిక్షణను అందించడంలో చురుకుగా వ్యవహరించింది. బొలీవియాలో 1967 అక్టోబరు 9 న బొలీవియన్ సైన్యం సి.ఐ.ఎ. అధికారులు, సభ్యుల బృందం చేత విప్లవ నాయకుడు " చే గువేరా " చంపబడ్డాడు. సి.ఐ.ఎ అధికారి ఫెలిక్స్ రోడ్రిగ్జ్ బొలీవియన్ సైన్యంతో గువేరాను స్వాధీనం చేసుకుని కాల్చి చంపాడు. రోడ్రిగ్జ్ బొలీవియన్ అధ్యక్షుడికి మరణశిక్ష విధించమని ఆదేశాం పొందిన తరువాత బొలీవియన్ ప్రభుత్వం కథకు అనుగుణంగా " బొలీవియన్ సైనికసంఘర్షణలో భాగంగా అద్యక్షుడు చీ చంపబడ్డాడని " చెప్పాడు. 1979, 1981 లో ఎన్నికలు అసంపూర్తిగా, మోసపూరితమైనవిగా గుర్తించబడ్డాయి. కౌప్స్ డీట్, కౌంటర్-కూపర్, కేర్‌టేకర్ ప్రభుత్వాలు ఉన్నాయి. 1980 లో జనరల్ " లూయిస్ గార్సియా మేజా తేజాడా " చేసిన ఒక క్రూరమైన, హింసాత్మక తిరుగుబాటు ప్రజాదరణ, మద్దతును పొందలేదు.ఒక సంవత్సరం మాత్రమే అధికారంలో ఉంటానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సంవత్సరపు చివరిలో, అతను ప్రజల మద్దతుపొందడానికి ఒక టెలివిజన్ ర్యాలీ కార్యక్రమంలో " బ్యూనో మి క్యూడో (ఔను నేను అధికారంలో కొనసాగుతాను " అని ప్రకటించాడు. 1981 లో సైనిక తిరుగుబాటుతో మెజాను బలవంతంగా పదవి నుండి తొలగించిన తరువాత బొలీవియాలో పెరుగుతున్న సమస్యలతో 14 నెలలలో మూడు ఇతర సైనిక ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. అశాంతి సైన్యాలను బలవంతంగా 1980 లో ఎన్నికైన కాంగ్రెస్‌ను సమావేశపరచేలా చేసి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకోవటానికి అనుమతించింది. అక్టోబరు 1982 లో " హెర్నాన్ సైల్స్ జుయాజో " తిరిగి పదవీబాధ్యతలు చేపట్టేలా చేసింది. ఆయన మొదటి పదవీకాలం ముగిసిన 22 సంవత్సరాల తరువాత ఆయన తిరిగి అధ్యక్షుడు అయ్యాడు (1956-60).

ప్రజాపాలన

బొలీవియా 
Former President, Gonzalo Sánchez de Lozada

" గొంజాలో సాంచెజ్ డి లోజాడా " తీవ్రమైన ఆర్థిక, సాంఘిక సంస్కరణ విధానాన్ని అనుసరించాడు. "క్యాపిటలైజేషన్" పేరుతో రూపొందించబడిన అత్యంత నాటకీయ సంస్కరణ కార్యక్రమంలో విదేశీ పెట్టుబడిదారులు 50% యాజమాన్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణను స్వాధీనం చేసుకుని బదులుగా ప్రధానపెట్టుబడులకు అధికరించడానికి అంగీకరించాడు. 1993 లో " గొంజాలో సాంచెజ్ డే లోజాడా " టూపాక్ కాటరీ రివల్యూషనరీ లిబరేషన్ మూవ్మెంట్ తో కలసి బొలీవియా అధ్యక్షుడి అధ్యక్ష పదవికి పోటీచేసాడు. ఇది స్వదేశీ-సెన్సిటివ్, బహుళ సాంస్కృతిక- అవగాహనకు ప్రేరణ కలింగించాయి. 1993 లో సాన్చేజ్ డి లోజాడా "ప్రణాళిక డి టోడోస్"ను ప్రవేశపెట్టాడు. ఇది ప్రభుత్వం వికేంద్రీకరణకు దారితీసింది. పరస్పర సాంస్కృతిక ద్విభాషా విద్యావిధానం, వ్యవసాయం చట్టం అమలు, ప్రభుత్వ యాజమాన్య వ్యాపారాల ప్రైవేటీకరణ చేయడానికి అనుకూలించింది. బొలీవియన్ పౌరులు కనీస 51% సంస్థలభాగస్వామ్యం కలిగి ఉంటారని ఈ ప్రణాళిక స్పష్టంగా పేర్కొంది; ఈ ప్రణాళిక కింద " ప్రభుత్వ-యాజమాన్యంలోని సంస్థలు " (ఎస్.ఒ.ఇ)కి అంవైంచబడలేదు. ఎస్.ఒ.ఇ. ప్రైవేటీకరణ " నియా లిబరల్ " నిర్మాణానికి దారితీసింది.

పాపులర్ పార్టిసిపేషన్ చట్టం మున్సిపాలిటీలకు వివిధ మౌలికనిర్మాణాలు నిర్మహణబాధ్యత, సేవలను అందించే బాధ్యతలు అప్పగించింది: ఆరోగ్యం, విద్య, నీటిపారుదల వ్యవస్థల బాధ్యతలను దేశం నుంచి దూరంగా ఉంచింది.[ఎప్పుడు?][ఆధారం చూపాలి]

సంస్కరణలు, ఆర్థిక పునర్నిర్మాణాలు సమాజంలోని కొన్ని విభాగాలచే తీవ్రంగా వ్యతిరేకించబడ్డాయి. తరచుగా 1994, 1996 నుండి లా పాజ్, చాపరే, కోకా - ప్రాంతంలలో తరచుగా హింసాత్మక నిరసనలు ప్రదర్శించబడ్డాయి. ఈ సమయంలో " ది అంబ్రెల్లా లేబర్ " సెంట్రల్ ఒబ్రేరా బొలీవియానా (సి.ఒ.బి) ప్రభుత్వ విధానాన్ని సమర్థవంతంగా సవాలు చేయలేకపోయింది. సి.ఒ.బి నుండి మద్ధతు లభించని కారణంగా 1995 లో ఉపాధ్యాయుల సమ్మె ఓడించబడింది.

1997 ఎన్నికలలో " నేషనల్ డెమొక్రటిక్ ఏక్షన్ " (ఎ.డి.ఎన్) పార్టీ, మాజీ నియంత (1971-78) నాయకుడు అయిన జనరల్ " హుగో బన్జెర్ " 22% ఓట్లను గెలుచుకున్నారు. అయితే ఎం.ఎన్.ఆర్. అభ్యర్థి 18% ఓట్లు పొందాడు. అధ్యక్షుడు బన్సెర్ ప్రభుత్వం ప్రారంభంలో చపరే ప్రాంతంలో చట్టవిరుద్ధ కోకాను నిర్మూలించడానికి ప్రత్యేకమైన పోలీసు-యూనిట్లను ఉపయోగించుకోవటానికి ఒక విధానాన్ని ప్రారంభించాడు. జైమ్ పాజ్ జమోర (డిగ్నిటి ప్లాన్ అని పిలుస్తారు) బన్సర్ ప్రభుత్వం కాలం అంతటా సంకీర్ణ భాగస్వామిగా ఉన్నారు. బన్జెర్ ప్రభుత్వం ప్రధానంగా గతపాలనలో ఉన్న స్వేచ్ఛాయుత-మార్కెట్, ప్రైవేటీకరణ విధానాలను కొనసాగించింది. 1990 ల మధ్యకాలంలో బలమైన ఆర్థిక వృద్ధి పాలనలో మూడో సంవత్సరం వరకు కొనసాగింది. ఆ తరువాత ప్రాంతీయ, అంతర్జాతీయ, దేశీయ అంశాలు ఆర్థిక వృద్ధిలో క్షీణతకు కారణమయ్యాయి. అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో సంభవించిన ఆర్థిక సంక్షోభాలు ఎగుమతి వస్తువుల ప్రపంచ ధరల తరుగుదల, కోకా రంగాల్లో ఉపాధి తగ్గిపోవడం బొలీవియా ఆర్థిక వ్యవస్థను నిరుత్సాహపరిచాయి. ప్రభుత్వరంగ అవినీతి గణనీయమైన స్థాయిలో ఉండడం కూడా ప్రజలు గుర్తించారు.బాన్జర్ రెండవ భాగంలో సాంఘిక నిరసనలు అధికరించడానికి ఇవి ప్రధానకారణం అయ్యాయి.

1999 జనవరి, 2000 ఏప్రిల్ మధ్యకాలంలో విదేశీసంస్థల నీటివనరుల ప్రైవేటీకరణ కారణంగా నీటి ధరలు తరువాత రెట్టింపు అయినందుకు స్పందనగా బొలీవియా మూడవ పెద్ద నగరం కోచబాంబలో పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తాయి. 2001 ఆగస్టు 6 న క్యాన్సర్‌తో బాధపడుతున్న బాన్సర్ పదవి నుంచి రాజీనామా చేశారు. తరువాత ఆయన ఒక సంవత్సరం కంటే ముందే మరణించాడు. వైస్ ప్రెసిడెంట్ " జార్జ్ ఫెర్నాండో క్విరోగా రామిరేజ్ " తన పదవీకాలం చివరి సంవత్సరం పూర్తి చేశారు.

బొలీవియా 
Current President, Evo Morales

2002 జూన్ జాతీయ ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు గొంజలో సాన్చేజ్ డి లోజాడా (ఎం.ఎన్.ఆర్) 22.5% ఓట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.తరువాత కొకా-అడ్వకేట్, స్థానిక రైతు-నాయకుడు " ఎవో మోరల్స్ " (సోవియట్ ఫర్ సోషలిజం (బోలివియా)ఎం.ఎ.ఎస్) 20.9%,ఎం.ఎన్.ఆర్. నాల్గవ స్థానంలో ఉన్న ఎం.ఐ.ఆర్ మధ్య జూలై ఒప్పందం తరువాత అధ్యక్షుడు జైమ్ పాజ్ జమోరా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో కాంగ్రెస్ సంచెజ్ డి లోజాడా ఎన్నికను సమర్థించింది. ఆగస్టు 6 న సంచెజ్ డి లోజాడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసాడు.ఎం.ఎన్.ఆర్. మూడు విస్తృతమైన లక్ష్యాలను కలిగి ఉంది: ఆర్థిక పునఃప్రయోగం (, ఉద్యోగ సృష్టి),రాజకీయ అవినీతి వ్యతిరేకత, సామాజిక ఐక్యత.

2003 లో " బొలీవియన్ గ్యాస్ వివాదం " మొదలైంది. 2003 అక్టోబరు 12 న ప్రభుత్వం ఎల్ ఆల్టోలో మార్షల్ చట్టాన్ని విధించింది. పోలీసులు 16 మంది కాల్చి చంపారు, హింసాత్మక ఘర్షణల్లో అనేక డజన్ల మంది గాయపడ్డారు. రాజీనామా లేదా మరింత రక్తపాతంతో ఉన్న ఎంపికను ఎదుర్కొన్న శాంచెజ్ డి లోజాడా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అత్యవసర సమావేశానికి ఇచ్చాడు. అతని రాజీనామా ఆమోదించబడిన తరువాత వైస్ ప్రెసిడెంట్ " కార్లోస్ మేసా" సంయుక్త రాష్ట్రాలకు వాణిజ్యపరంగా పయనించడానికి ప్రణాళిక తయారుచేసుకున్నాడు.

దేశరాజకీయ పరిస్థితి అంతర్జాతీయ వేదికపై దేశం అంతర్గత పరిస్థితికి ప్రతికూలంగా మారింది. 2005 లో గ్యాస్ నిరసనలు పునరుద్ధరించబడిన తరువాత " కార్లోస్ మెసా " 2005 జనవరిలో రాజీనామా చేయటానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. 2005 మార్చి 22న యు.ఎస్. కార్పరేట్ ప్రయోజనాలకు మొగ్గుచూపే మెసాను నిరసించే సంస్థలు కొత్తగా వీధి నిరసనలు నిర్వహించిన తరువాత తిరిగి మేసా తన రాజీనామాను కాంగ్రెస్‌కు ఇచ్చాడు. ఇది జూన్ 10 న ఆమోదించబడిన తరువాత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎడ్వర్డో రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాడు.స్థానిక జనాభాకు చెందిన ఆండెస్ ప్రజలు ప్రభుత్వ సంస్కరణల నుండి ప్రయోజనం పొందలేకపోయింది. " ఎవో మోరల్స్ " బోలివియన్ ఎన్నికలలో అసాధారణమైన 53.7% ఓట్ల సంపూర్ణ మెజారిటీతో బొలీవియన్ అధ్యక్ష ఎన్నిక 2005 గెలిచాడు. బొలీవియన్ గ్యాస్ నిక్షేపాలను జాతీయత గురించి అభిప్రాయం వెలిబుచ్చినందుకు 2006 న మోలిలేస్ వివాదానికి దారి తీసింది.2006 ఆగస్టు 6 న ప్రచార వాగ్దానం నెరవేరింది. బొలీవియన్ రాజ్యాంగ సభ స్థానిక రాజ్యాంగంపై మరింత అధికారం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తూ నూతన రాజ్యాంగం రాయడం ప్రారంభిచాడు.యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ ఉనాసుర్ రాజ్యాంగ ఒప్పందం మీద సంతకం చేసింది.

భౌగోళికం

బొలీవియా 
Satellite image of Bolivia
బొలీవియా 
Salar de Uyuni
బొలీవియా 
Cordillera Central
బొలీవియా 
Nevado Sajama

బొలీవియా 57 ° 26'-69 ° 38'పశ్చిమ రేఖాంశం, 9 ° 38'-22 ° 53 ' దక్షిణ అక్షంశంలో అమెరికా కేంద్ర మండలంలో ఉంది. బొలీవియా వైశాల్యం 10,98,581 చదరపు కిలోమీటర్ల (424,164 చదరపు మైళ్ల). బోలివియా ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో 28 వ స్థానంలో, దక్షిణ అమెరికా దేశాలలో 5 వ స్థానంలో ఉంది. సెంట్రల్ అండీస్ నుంచి గ్రాన్ చాకోలో భాగంగా అమెజాన్ వరకు విస్తరించి ఉంది. " ది జియోగ్రాఫిక్ సెంట్ర్ ఆఫ్ ది కంట్రీ " ప్యూర్టో ఎస్ట్రెల్లా ("స్టార్ పోర్ట్")" రియో ​​గ్రాండేలో ఉన్న న్యూఫ్లో డీ చావజ్ ప్రావింస్ లోని శాంటా క్రజ్ డిపార్ట్మెంట్‌లో ఉంది.

దేశం భూగోళికంగా అనేక రకాల భూభాగాలను, వాతావరణాలను కలిగి ఉంది. బొలీవియాలో జీవవైవిద్యం ఉన్నత స్థాయిలో ఉంది. ఇది ప్రపంచంలోని వైవిధ్యభరితమైన భూభాగాలలో ఒకటిగా భావించబడుతుంది. అలాగే ఆల్టిప్లానో, ఉష్ణమండల వర్షారణ్యాలు (అమెజాన్ రెయిన్ఫారెస్ట్తో సహా), పొడి లోయలు, చిక్టిటానియా వంటి పర్యావరణ సబ్-యూనిట్లు కలిగిన అనేక పర్యావరణ ప్రాంతాలు ఉన్నాయి. అదనంగా బొలీవియాలో ఉష్ణమండల సవన్నా ఉంది.ఈ ప్రాంతాలు నెవాడో సజామాలో సముద్ర మట్టానికి 6,542 మీటర్లు (21,463 అడుగులు) ఎత్తైన ఎత్తులో ఉన్నాయి. పరాగ్వే నదికి దాదాపు 70 మీటర్లు (230 అడుగులు)ఎత్తు వరకు ఉంటాయి. గొప్ప భౌగోళిక వైవిధ్యం ఉన్న దేశం అయినప్పటికీ, బొలీవియా పసిఫిక్ యుద్ధం వరకు భూబంధిత దేశంగా ఉండడం గమనార్హం.

బొలీవియాను మూడు భౌతిక భాగాలుగా విభజించవచ్చు:

  • నైరుతి భాగంలో ఉన్న ఆండియన్ ప్రాంతం మొత్తం దేశీయ భూభాగంలో 28% వరకు 3,07,603 చదరపు కిలోమీటర్ల (1,18,766 చదరపు మైళ్ళు) విస్తరించి ఉంది. ఈ ప్రాంతం 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది రెండు పెద్ద ఆండెన్ పర్వతశ్రేణుల మద్య, కార్డిల్లెరా ఓసిడెంటల్ ("వెస్ట్రన్ రేంజ్"), కార్డిల్లెర సెంట్రల్ ("సెంట్రల్ రేంజ్") మధ్య అమెరికాలోని అత్యధిక ఎత్తైన ప్రదేశాలైన నవాడో సజ్మా 6,542 మీటర్లు (21,463 అడుగులు), ఇల్లిమాని 6,462 మీటర్లు (21,201 అడుగులు) ఎత్తుతో ఉన్నాయి. కార్డిల్లెర సెంట్రల్లో ఉన్నది టిటికాకా సరస్సు ప్రపంచంలోని అత్యధిక ఎత్తైన వాణిజ్యపరంగా నౌకాయాన సరస్సు, దక్షిణ అమెరికాలో అతిపెద్ద సరస్సుగా ప్రత్యేకత కలిగి ఉంది.

ఈ సరస్సులోని కొంతభాగం పెరూ భూభాగంలో ఉంది. ఈ ప్రాంతంలో ఆల్టిప్లానో, సాలార్ డి యునినీ కూడా ఉన్నాయి. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు ఫ్లాట్, లిథియం ముఖ్యమైన వనరుగా ఉంది.

  • దేశం మధ్య, దక్షిణాన ఉన్న ఉప-ఆండియన్ ప్రాంతం అల్టిప్లానో, తూర్పు లేనోనోస్ (సాదా) మధ్య ఉన్న ఒక మైదాన ప్రాంతం. ఈ ప్రాంతం బొలీవియా మొత్తం భూభాగంలో 13% ఉంది.ఇది 1,42,815 km2 (55,141 sq mi) విస్తరించి ఉంది. ఇది బొలీవియన్ లోయలు, యుంగాస్ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈప్రాంతం వ్యవసాయ కార్యకలాపాలు, ఇక్కడ నెలకొన్న సమశీతోష్ణ వాతావరణం ద్వారా ఇది విభిన్నంగా ఉంటుంది.
  • ఈశాన్య భాగంలో ఉన్న లానాస్ ప్రాంతం బొలీవియా మొత్తం భూభాగంలో 59% ఉంటుంది.ఇది 6,48,163 చ.కి.మీ. ఉంటుంది. (2,50,257 చ.కి.మీ) విస్తరించి ఉంటుంది. ఇది కార్డిల్లెరా సెంట్రల్‌కు ఉత్తరాన ఉన్నది, అండీన్ పర్వతాల నుండి పరాగ్వే నది వరకు వ్యాపించింది. ఇది చదునైన భూమి, చిన్న పీఠభూములు, ఇది విస్తారమైన వర్షపు అడవులచే విస్తారమైన జీవవైవిధ్యం కలిగి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం సముద్ర మట్టం కంటే 400 మీటర్ల (1,300 అడుగులు) దిగువన ఉంది.

బొలీవియా మూడు పారుదల నదీ ముఖద్వారాలు కలిగి ఉంది:

  • మొట్టమొదటగా అమెజాన్ నదీ ముఖద్వారం ఉత్తర బేసిన్‌గా కూడా పిలువబడింది. ఇది 7,24,000 చ.కి.మీ. (280,000 చ.మై)వైశాల్యం ఇది దేశంలో 66% విస్తరించి ఉంది. ఈ నదీ ముఖద్వారాలలో ఉన్న సాధారణ మీండర్లు పాండో డిపార్టుమెంటులో ఉన్న మురిల్లో సరస్సు వంటి సరస్సులను ఏర్పరుస్తాయి. అమెజాన్ బేసిన్‌ ప్రధాన బొలీవియన్ ఉపనది మమోరీ నది ఉత్తరాన 2,000 కిమీ (1,200 మైళ్ళు) పొడవు ప్రవహించి దేశంలో ప్రాధ్హానమైన నదులలో ద్వితీయస్థానంలో ఉన్న బెని నదితో 1,113 కిలోమీటర్లు (692 మైళ్ళు) సంగమిస్తుంది. అమెజాన్ నది ప్రధాన ఉపనదులలో మదీరా ఒకటి.తూర్పు నుండి పడమర వరకు విస్తరించి ఉన్న ఈ నదీముఖద్వారప్రాంతంలో మాడ్రే డియోస్ నది, ఆర్తోన్ నది, అబూనా నది, యాత నది, గుపరే నది వంటి ఇతర నదులను ఏర్పరుస్తున్నాయి. దేశంలోని సరస్సులలో రోగగుడో సరస్సు, రోగగువా సరస్సు, జరా సరస్సులు ప్రధానమైనవి.
  • రెండోది రియో ​​డే లా ప్లాటా బేసిన్ దీనిని దక్షిణ బేసిన్ అని కూడా పిలుస్తారు. ఇది 229,500 చ.కి.మీ (88,600 చ.మై)విస్తరించి ఉంది. ఇది దేశం మొత్తం భూభాగంలో 21% ఉంది. ఈ బేసిన్లో ఉపనదులు అమెజాన్ బేసిన్ ఏర్పరుస్తున్న వాటి కంటే తక్కువగా ఉంటాయి. రియో డి లా ప్లాటా బేసిన్ ప్రధానంగా పరాగ్వే నది, పిలమయయో నది, బెర్జేజో నదిచే ఏర్పడింది. బొలీవియన్ చిత్తడి భూభాగంలో ఉబబాబా సరస్సు, మాండోరీ లేక్ లు అతి ముఖ్యమైన సరస్సులు.
  • మూడవ బేసిన్ సెంట్రల్ బేసిన్ ఎండోహెరిక్ బేసిన్ వైశాల్యం 145,081 చదరపు కిలోమీటర్లు (56,016 చ.మై) దేశం మొత్తం భూభాగంలో 13% విస్తరించి ఉంది. ఆల్టిప్లనోలో పెద్ద సంఖ్యలో సరస్సులు, నదులు ఉన్నాయి. అవి సముద్రంలో సంగమించవు. ఎందుకంటే అవి ఆండెన్ పర్వతాలతో చుట్టబడి ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన నది డెల్వాడారోరో నది. ఇది 436 కి.మీ (271 మీ) పొడవు ఉంటుంది. అత్యంత పొడవైన నది అల్లిప్లనో. ఇది లేక్ టిటికాకాలో ప్రారంభమవుతుంది. తరువాత ఆగ్నేయ దిశలో ప్రవహించి పోపో సరస్సుకి చేరుకుంటుంది. ఈ బేసిన్‌ లేక్ టిటికాకా, లేక్ పూపో, దవావాడెరోరో నది, సాలార్ డి యునినీ, కోయిపాసా లేక్‌తో గొప్ప ఉప్పు ఫ్లాట్లు ఏర్పరుస్తుంది.

నీటిసరఫరా అభివృద్ధి

ఎగువ నదీ పరీవాహక ప్రాంతాలలో అటవీ నిర్మూలన పర్యావరణ సమస్యలకు కారణమైంది. ఇందులో భూక్షయం, క్షీణిస్తున్న నీటి నాణ్యత ఉన్నాయి. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఒక వినూత్న ప్రణాళికలో భాగంగా దిగువ ప్రాంతాల్లో ఉన్న నీటి వినియోగదారులైన భూస్వాములు అడవుల పరిరక్షణకు చెల్లించే ఏర్పాటు చేయబడింది. భూస్వాములు చెట్లను కాపాడటానికి పశువల వలన అడవులు కలుషితం చేయకుండా నివారించటానికి, వారి భూములలో జీవవైవిధ్యం, అటవీ కార్బన్‌ను విస్తరించటానికి 20 డాలర్లను అందుకుంటారు. వారు ఐదు సంవత్సరాలకు రెండు హెక్టార్ల నీటిని నిలువచేసే అటవీ పరిరక్షణ కోసం పరిహారం కోసం ఒక బీహైవ్‌ను కొనుగోలు చేసే 30 డాలర్లు అందుకుంటారు. హెక్టారుకు హనీ ఆదాయం సంవత్సరానికి 5 డాలర్లు ఉంటుంది కనుక కాబట్టి ఐదు సంవత్సరాలలో తేనె విక్రయాల విలువ 50 డాలర్లు అమ్ముడైంది. ఈ ప్రాజెక్టును " ఫెడోసియో నాచురా బోలివియా ", రేర్ కంసర్వేషన్ " క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ మద్దతుతో నిర్వహిస్తోంది.

నైసర్గికం

బొలీవియా వేర్వేరు లిథాలజీలు అలాగే టెక్టోనిక్, సోపానవ్యవసాయక్షేత్రాలు కలిగి ఉంది. భౌగోళిక విభాగాలు నైసర్గిక విభాగాలతో సమానంగా ఉన్నాయి.దేశం లోని పర్వత పశ్చిమ ప్రాంతం ఏటవాలుగా పసిఫిక్ సముద్రం వైపుగా ఎత్తు తగ్గుతూ మైదాన భూములుగా మారుతుంది.

బొలీవియా 
Mean annual precipitation in Bolivia

వాతావరణం

బొలీవియా 
Bolivia map of Köppen climate classification
బొలీవియా 
Los Yungas, La Paz

బొలీవియా వాతావరణం ఒక పర్యావరణ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వైవిధ్యంగా ఉంటుంది. తూర్పు ఇలానోస్‌లో ఉండే ఉష్ణమండల వాతావరణం నుండి పశ్చిమ అండీస్ ప్రాంతంలో ధ్రువ వాతావరణం బాగా మారుతుంది. వేసవికాలాలు వెచ్చగా ఉంటాయి. తూర్పున తడి ఉంటుంది, పశ్చిమ ప్రాంతంలో పొడిగా ఉంటుంది. వర్షాలు తరచూ ఉష్ణోగ్రతలు తగ్గిస్తుంటాయి. తేమ, గాలులు, వాతావరణ పీడనం, బాష్పీభవనం వంటివి మారుతుంటాయి. వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణాలను కలిగి ఉంటాయి. ఎల్ నీన్యో

అని పిలవబడుతుంది. ఇది వాతావరణంలో గొప్ప మార్పులకు కారణమవుతుంది. పశ్చిమాన చలికాలం చాలా చల్లగా ఉంటుంది. పర్వత శ్రేణులలో ఇది హిమపాతానికి కారణం ఔతుంది.పశ్చిమ ప్రాంతాల్లో, గాలులతో కూడిన రోజులు చాలా సాధారణం. ఉష్ణమండల ప్రాంతాల్లో శరదృతువు కాలం పొడిగా ఉంటుంది.

  • లానోస్ సగటు ఉష్ణోగ్రత 30 ° సెంటీగ్రేడ్ (86 ° ఫారెన్ హీట్) తో ఆర్ద్ర ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. అమెజాన్ వర్షారణ్యం నుండి వచ్చిన గాలి ముఖ్యమైన వర్షపాతం కలిగిస్తుంది. మేలో పొడి గాలుల కారణంగా తక్కువ వర్షపాతం ఉంది.వాతావరణం పొడిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఆకాశం స్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ దక్షిణాన ఉన్న గాలులను సారాజోస్ అని పిలుస్తారు. చాలా రోజుల పాటు చల్లగా ఉండే ఉష్ణోగ్రతలు తెస్తాయి.
  • ఆల్టిప్లానొ ఎడారి-పోలార్ వాతావరణం,బలమైన, చల్లని గాలులతో ఉంటుంది. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 15 నుండి 20 ° సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 0 ° సెంటీగ్రేడ్ కంటే కొద్దిగా తీవ్రంగా పతనం ఔతుంది. పగటి సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది, సౌర వికిరణం ఎక్కువగా ఉంటుంది. గ్రౌండ్ మంచు ప్రతి నెలలో సంభవిస్తుంది, హిమపాతం తరచుగా ఉంటుంది.
  • లోయలు, యుంగాస్. సమశీతోష్ణ వాతావరణం. ఈశాన్య గాలులు తేమతో కూడిన పర్వతాలకు పంపబడతాయి. ఇది ఈ ప్రాంతాన్ని చాలా తేమగా ఉంచి, వర్షంగా మారడానికి సహకరిస్తుంది. అధిక ఎత్తులో ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. 2,000 మీటర్ల (6,600 అడుగులు) ఎత్తులో మంచు ఏర్పడుతుంది.
  • చాకో. ఉపఉష్ణమండల అర్ధ-శుష్క వాతావరణం. జనవరిలో వర్షాకాలం, తేమతో ఉంటుంది, మిగిలిన సంవత్సరం అంతా వెచ్చని వాతావరణం ఉంటుంది.

జీవవైవిధ్యం

బొలీవియా 
Amazon river basin in Bolivia

బొలీవియా, అనేక రకాల జీవులు, జీవావరణవ్యవస్థలతో "లాగే-మైండ్డ్ మెగాడైస్ దేశాలు"లో భాగంగా ఉన్నాయి.

సముద్ర మట్టానికి 90-6,542 మీటర్ల (295-21,463 అడుగులు) వరకు బొలీవియా వైవిధ్యమైన ఎత్తులు విస్తారమైన జీవ వైవిధ్యాన్ని అనుమతిస్తాయి. బొలీవియా భూభాగం నాలుగు రకాల జీవావరణాలు, 32 పర్యావరణ ప్రాంతాలు, 199 పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ భౌగోళిక ప్రాంతాల్లో నోయెల్ కెంప్ఫ్ మెర్కాడో నేషనల్ పార్క్, మాడిడి నేషనల్ పార్క్, టునారి నేషనల్ పార్క్, ఎడ్వర్డో అవారో ఆండియన్ ఫ్యూనా జాతీయ రిజర్వ్, కా-ఐయా డెల్ గ్రాన్ చాకో నేషనల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ వంటి అనేక సహజ ఉద్యానవనాలు, రిజర్వులు ఉన్నాయి.

బొలీవియాలో 1,200 జాతుల ఫెర్న్,1,500 జాతులు మెర్తాంటియోఫిటా, మోస్, కనీసం 800 రకాల శిలీంధ్రాలు ఉన్నాయి. 17,000 పైగా సీడ్ మొక్కలు ఉన్నాయి. అదనంగా, 3,000 కంటే ఎక్కువ ఔషధ మొక్కలు ఉన్నాయి. బెంగూళూరు మిరపకాయలు, మిరపకాయలు, వేరుశెనగలు, బీన్స్, యుక్కా, అనేక రకాల పామ్ జాతి చెట్లు ఉన్నాయి. బొలీవియా సహజంగా 4,000 రకాల బంగాళదుంపలను ఉత్పత్తి చేస్తుంది. బొలీవియాలో 2,900 జంతుజాలు ఉన్నాయి.వీటిలో 398 క్షీరదాలు, 1,400 పక్షులకు (ప్రపంచంలో 14 శాతం పక్షులు, పక్షి జాతుల పరంగా ఆరవ అత్యంత వైవిధ్యమైన దేశం). 204 ఉభయచరాలు, 277 సరీసృపాలు, 635 చేపలు. భూబంధిత దేశం అయిన బొలీవియాలో ఉన్న చేపజాతులు అన్నీ మంచినీటి చేపలజాతికి చెందినవి. అదనంగా 3,000 కంటే ఎక్కువ రకాల సీతాకోకచిలుకలు, 60 కంటే ఎక్కువ పెంపుడు జంతువులు ఉన్నాయి.బొలీవియా " లా ఆఫ్ రైట్స్ ఆఫ్ మదర్ ఎర్త్ " హక్కుల చట్టంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది జంతువులకు మానవులకు సమానమైన హక్కులను అంగీకరించింది.

బొలీవియా 

ఆర్ధికరంగం

బొలీవియా 
Graphical depiction of Bolivia's product exports in 28 color-coded categories

2012 నాటి స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి) అధికారిక మారకపు రేటు వద్ద 27.43 బిలియన్ల డాలర్లు, కొనుగోలు శక్తి 56.14 బిలియన్ డాలర్లు. ఆర్థిక వృద్ధి 5.2% ఉంటుందని అంచనా వేయబడింది. ద్రవ్యోల్బణం 6.9%గా అంచనా వేయబడింది. [ఆధారం కోరబడినది] ది హెరిటేజ్ ఫౌండేషన్ 2010 " ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడం " బొలీవియా "అణచివేయబడినది"గా అంచనా వేయబడింది.

2006, 2009 మధ్యకాలంలో చాలామంది రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ,గత 30 ఏళ్లలో ఏ సంవత్సరంలో సాధించలేనంత ఆర్థికాభి వృద్ధి 2006 - 2009 మద్య కాలంలో మోరల్స్ పరిపాలనలో సాధించింది.ఈ పెరుగుదల మితమైన తగ్గుదలతో కూడినది. 2012 నాటికి 1.7% (జి.డి.పి.) మిగులు బడ్జెట్ సాధ్యమైంది. మొరల్స్ పరిపాలన వివేచనాత్మక ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తున్నప్పటి నుండి ప్రభుత్వం మిగులును సాధించింది.

1980 ల ప్రారంభంలో టిన్ ధరలో తీవ్రంగా పడిపోయిన కారణంగా బొలీవియా ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద దెబ్బతిన్నది. ఇది బొలీవియా ప్రధాన ఆదాయవనరులను, ప్రధాన మైనింగ్ పరిశ్రమలలో ఒకదాని మీద ప్రభావం చూపింది.

1985 నుండి బొలీవియా ప్రభుత్వం స్థూల ఆర్థిక స్థిరీకరణ కొరకు, నిర్మాణాత్మక సంస్కరణల విస్తృతమైన కార్యక్రమాన్ని అమలు చేసింది. ధర స్థిరత్వాన్ని కొనసాగించడం, నిలకడగా అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించడం, కొరత తొలగించడం. కస్టమ్స్ సేవ ప్రధాన సంస్కరణ గణనీయంగా ఈ ప్రాంతంలో పారదర్శకతను మెరుగుపరిచింది. స్థల మార్కెట్-ఉదారవాద విధానాలలో చేయబడ్డాయి సమాంతర శాసన సంస్కరణలు చేయబడ్డాయి. ముఖ్యంగా హైడ్రోకార్బన్, టెలికమ్యూనికేషన్ రంగాలలో, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాయి. విదేశీ పెట్టుబడిదారులు జాతీయ ట్రీట్మెంటులకు అర్హత కల్పించింది.

బొలీవియా 
పోటోసిలో పనిచేసే యువ మైనర్లు

ఏప్రిల్ 2000 లో బొలీవియా మాజీ అధ్యక్షుడు హుగో బన్జెర్, బొలీవియా మూడవ అతిపెద్ద నగరమైన కోచబంబాలో నీటి సరఫరాను నిర్వహించడానికి, మెరుగుపరిచేందుకు ఒక ప్రైవేట్ కన్సార్టియం " అక్వాస్ డెల్ టునారి "తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలానికే ఆ నగరంలో నీటి రేట్లు మూడురెట్లు అధికం అయ్యాయి. ఫలితంగా శుద్ధీకరించిన నీటిని కొనుగోలు చేయలేని ప్రజల నిరసన కారణంగా బొలీవియా అంతటా సంభవించిన ఆర్ధికపతనం, దేశమంతటా వ్యాపించిన అశాంతి బొలీవియా ప్రభుత్వం నీటి ఒప్పందాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది. బొలీవియా దక్షిణ అమెరికాలో రెండవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలను కలిగి ఉంది. 2019 నాటికి బ్రెజిల్‌కు సహజ వాయువును విక్రయించడానికి సుదీర్ఘకాల విక్రయ ఒప్పందాన్ని బొలీవియా ప్రభుత్వం కలిగి ఉంది. 2005 లో హైడ్రోకార్బన్ చట్టంపై ప్రభుత్వం ఒక బైండింగ్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది.బొలీవియాలో 5.4 మిలియన్ క్యూబిక్ టన్నుల లిథియం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వీస్ అంచనా వేసింది. ఇది 50% -70% ప్రపంచ నిల్వలను సూచిస్తుంది. ఏదేమైనా ఇది గని కోసం ఉప్పు ఫ్లాట్లను (సలార్ డి యునియి అని పిలుస్తారు) మంజూరు చేసింది. తరువాత ఈప్రాంతాన్ని ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది. లిథియం కొరకు పెరుగుతున్న ప్రపంచ డిమాండును తీర్చటానికి ఈ ప్రత్యేక సహజ ప్రకృతి దృశ్యాన్ని నాశనం చేయకూడదని బొలీవియా నిశ్చయించుకుంది. మరొక వైపు లిథియం స్థిరమైన వెలికితీత కొరకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రాజెక్ట్ కొమిబొల్ పబ్లిక్ కంపెనీ "రికోర్సా ఎవాపోరిటికోస్" అనుబంధ సంస్థచే నిర్వహించబడుతుంది.

బొలీవియా ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు ఆర్థిక సహాయం కోసం, ప్రజా సిబ్బందికి చెల్లించడానికి విదేశీ సహాయంపై ఆధారపడింది. 2002 చివరినాటికి ప్రభుత్వం తన విదేశీ రుణదాతలకు 4.5 బిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ మొత్తంలో 1.6 బిలియన్ డాలర్లు ఇతర ప్రభుత్వాలకు, అనేక మల్టీలేటరల్ అభివృద్ధి బ్యాంకులకు చెల్లించింది. ఇతర ప్రభుత్వాలకు చెల్లింపులు అధికంగా 1987 నుంచి పలు సందర్భాల్లో పారిస్ క్లబ్ విధానం ద్వారా రీషెడ్యూల్ చేయబడ్డాయి.

ఎందుకంటే బొలీవియా ప్రభుత్వం సాధారణంగా 1987 నుండి ఐ.ఎం.ఎఫ్. కార్యక్రమాల ద్వారా నెలకొల్పబడిన ద్రవ్య, ఆర్థిక లక్ష్యాలను సాధించింది కనుక బాహ్య రుణదాతలు దీనిని చేయటానికి సిద్ధంగా ఉన్నాయి.అయితే ఆర్థిక సంక్షోభాలు బొలీవియా రికార్డు నాణ్యతను తగ్గిస్తున్నాయి. అయితే 2013 నుండి బ్రెజిల్, అర్జెంటీనా సహజ వాయువు ఎగుమతులు లభించిన పన్నుల ఆదాయం ప్రభుత్వ బడ్జెట్ నిర్వహించబడుతుంది.1990 నుండి పర్యాటక రంగ ఆదాయం చాలా ముఖ్యమైనదిగా మారింది

విదేశీధ్రవ్యం

2000లో " హుగొ బాంజర్ సూరెజ్ " బొలీవియన్ కరెంసీ, బంగారం నిలువల మొత్తం 1.085 బిలియన్ యు.ఎస్.డాలర్లు. 2014 నాటికి " ఎవొ మొరలెస్ " ప్రభుత్వకాలానికి 15.282 బిలియన్ అమెరికన్లకు చేరుకుంది.

Foreign-exchange reserves 2000–2014 (MM US$)
బొలీవియా
Fuente: Banco Central de Bolivia, Gráfica elaborada por: Wiki.

రవాణా

వాయు మార్గం

బొలీవియా 
Boliviana de Aviación (BoA) is a state-owned company and the country's largest airline. Two BoA Boeing 737-300s parked at Jorge Wilstermann International Airport.

పౌర ఏరోనాటిక్స్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ (డైరెక్షన్ జనరల్ ది ఎయిరోనాటికా సివిల్ - డి.జి.ఎ.సి.) గతంలో ఎఫ్.ఎ.బి. భాగంగా ఉంది. సివిల్ ఏరోనాటిక్స్ పాఠశాలను " నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ " (ఇన్స్టిట్యూటో నాసియోనల్ డి ఏరోనాయుటికా సివిల్- ఐ.ఎన్.ఎ.సి.), రెండు వ్యాపార వాయు రవాణా సేవలు టి.ఎ.ఎం. టి.ఎ.బి.

టి.ఎ.ఎం. - ట్రాంస్పొరేట్ ఎయిరొ మిలిటరీ (బొలివియన్ మిలిటరీ ఎయిర్లైన్) అనేది లా పాజ్, బొలివియాలో ఉన్న ఒక వైమానిక సంస్థ. ఉత్తర, ఉత్తర ఈశాన్య బొలీవియాలో సుదూర పట్టణాలకు, కమ్యూనిటీలకు ప్రయాణీకుల సేవలను నిర్వహిస్తున్న 'ఫుర్జా ఏరియా బొలీవియానా' (బొలీవియన్ ఎయిర్ ఫోర్స్) పౌర విభాగంగా ఉంది. టి.ఎ.ఎం. (ఎ.కె.ఎ. టాం గ్రూప్ 71) 1945 నుండి ఎఫ్.ఎ.బి.లో భాగంగా ఉంది.చిన్న విమానాలకు బెని డిపార్టుమెంటు, ఎయిర్లైన్స్ లిన్యా ఏరియా అమాస్జోనాస్ సేవలందిస్తుంది. టి.ఎ.ఎం.కంటే చిన్న విమానాలను ఉపయోగిస్తుంది.

ఒక పౌర రవాణా సంస్థ టి.ఎ.బి. -1977 లో ఎఫ్.ఎ.బి. అనుబంధ సంస్థగా ట్రాన్స్పోర్టెస్ ఎరియోస్ బోలివియానోస్ సృష్టించబడింది. ఇది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (జెరెంసియా డీ ట్రాంస్పోర్టా ఎయిరోస్) కు అనుబంధంగా ఉంది, ఇది ఎఫ్.ఎ.బి. జనరల్ ద్వారా నిర్వహించబడుతుంది. టి.ఎ.బి, ఒక చార్టర్ భారీ కార్గో వైమానిక సంస్థ, పశ్చిమ అర్ధగోళంలోని అనేక దేశాలతో బొలీవియాను అనుసంధానిస్తుంది. దాని జాబితాలో హెర్క్యులస్ సి130 విమానాల సముదాయం ఉంది. టిఎ.బి. ఎల్ ఆల్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌ ప్రక్కనే ఉంది. టిఎ.బి. మయామి, హ్యూస్టన్‌కు పనామాలో ఒక స్టాప్‌తో ఎగురుతుంది.

బొలీవియర్ ఉన్న విమానాశ్రయంలో " ఎల్.ఆల్టో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " (లా పెజ్), " విరు విరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (శాంటా క్రజ్), " జార్జ్ విల్స్టర్ మ్యాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " ప్రధానమైనవిగా ఉన్నాయి.

రైలుమార్గాలు

బొలీవియా 
Railways in Bolivia (interactive map)
━━━ Routes with passenger traffic
━━━ Routes in usable state
·········· Unusable or dismantled routes

బొలీవియా విస్తారమైన రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. 1000 గేజ్, మార్గాలుగా రెండు ప్రత్యేక రైలు మార్గాలు ఉన్నాయి.రైల్వే వ్యవస్థ పురాతనమైనదిగా ఉంది.

సాంకేతికత

బొలీవియా ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ కంపెనీ ఉంది. ఇది ఒక ఆఫ్‌షోర్ సంస్థగా ఉంది.చైనాతో స్థాపించబడిన ఇ సంస్థ పేరు " తుపాక్ కటారి " 2015లో బొలీవియాలో రష్యన్ న్యూక్లియర్ కంపెనీ అభివృద్ధి చేసిన 300 మిలియన్ డాలర్ల వ్యయంతో " రోస్టం " పేరుతో న్యూక్లియర్ రియాక్టర్ స్థాపించబడింది.

మచినీటి సరఫరా, పారిశుధ్యం

1990 నుండి ఈ రంగాల పెట్టుబడిలో గణనీయమైన పెరుగుదల కారణంగా బొలీవియా త్రాగునీరు, పరిశుభ్రత కవరేజ్ బాగా మెరుగుపడింది. అయితే, దేశంలో ఖండంలోని అత్యల్ప కవరేజ్ స్థాయిలు, సేవలు తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయి. రాజకీయ, సంస్థాగత అస్థిరత జాతీయ, స్థానిక స్థాయిలో సంస్థల బలహీనతకు ప్రధానకారణాలుగా ఉన్నాయి.

2000, 2006 సంవత్సరాకు ముందే కోచబంబ, లా పాజ్ / ఎల్ ఆల్టో మూడు అతిపెద్ద నగరాల్లో రెండు ప్రైవేటు ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ముగిసాయి. దేశం రెండవ పెద్ద నగరం, శాంటా క్రుజ్ డి లా సియెర్రా విజయవంతంగా తన సొంత నీటిని, పారిశుద్ధ్య వ్యవస్థను సహకార సంస్థల ద్వారా నిర్వహిస్తుంది. ఈవో మోరల్స్ ప్రభుత్వం ఈ రంగంలోకి పౌరసత్వ భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయాలని భావిస్తుంది. పెరుగుతున్న కవరేజ్ గణనీయమైన పెట్టుబడి పెరుగుదలకు అవసరం.

ప్రభుత్వం అంచనాల ఆధారంగా దేశవ్యాప్తంగా పారిశుధ్యం తక్కువగా అందుబాటులో ఉండడం దేశంలోని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలలో నీటికి తక్కువ సదుపాయాలు తగినంత పెట్టుబడులు ప్రధానకారణంగా ఉన్నాయి. కమ్యూనిటీ సర్వీసు ప్రొవైడర్స్ తక్కువ ఉండడం. దేశీయ కస్టమ్స్ పట్ల గౌరవం లేకపోవడం, "ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో సాంకేతిక, సంస్థాగత కష్టాలు", అవస్థాపన నిర్వహించడానికి, నిర్వహించడానికి సామర్థ్యం లేకపోవడం ప్రధానసమస్యలుగా ఉన్నాయి. "సామాజిక భాగస్వామ్య పథకాలు అస్పష్టంగా ఉన్నాయి" శీతోష్ణస్థితి మార్పు వలన నీటి పరిమాణం, నాణ్యత తగ్గుదల కాలుష్యం, సమగ్ర నీటి వనరుల నిర్వహణ లేకపోవడం, వ్యర్ధ నీటిని పునర్వినియోగపరచడానికి విధానాలు, కార్యక్రమాలు లేకపోవటం. అదనపు కారణాలుగా ఉన్నాయి. 27% ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందిన పారిశుధ్య వసతులు లభిస్తున్నాయి. 80-88% ప్రజలకు అభివృద్ధి చెందిన శుద్ధీకరించిన మంచినీరు లభిస్తుంది.నగరప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో సౌకర్యాలు ఆధికంగా ఉన్నాయి.

గణాంకాలు

బొలీవియా 
People in La Paz city centre
బొలీవియా 
Festival in Sucre

బొలీవియన్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ (ఇన్స్టిట్యూట్ నేషనల్ డే ఎస్టడిస్టికా, ఐఇఇ) చేత నిర్వహించిన చివరి రెండు జనాభా గణనల ప్రకారం, జనసంఖ్య 8,274,325 వీరిలో 4,123,850 మంది పురుషులు, 4,150,475 మంది మహిళలు ఉన్నారు. 2012 నాటికి జనసంఖ్య 10,027,254 అధికరించింది. చివరి ఐదవ సంవత్సరాలలో బొలివియన్ జనాభా మూడు రెట్లు అధికరించింది.జనాభా వృద్ధి రేటు 2.25% చేరుకుంది. (1950-1976, 1976-1992) మద్య జనసంఖ్య పెరుగుదల సుమారు 2.05%, అయితే గత కాలం 1992-2001 మధ్య కాలంలో ఇది 2.74%కి చేరుకుంది.

బొలీవియన్లలో 62.43% నగర ప్రాంతాలలో నివసిస్తున్నారు. మిగిలిన వారు 37.57% గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారు. జనాభాలో ఎక్కువ భాగం (70%) లా పాజ్, శాంటా క్రూజ్, కోచబంబ విభాగాలలో కేంద్రీకృతమై ఉంది. ఆండియన్ ఆల్టిప్లానో ప్రాంతంలో లా పాజ్, ఓరూయో విభాగాలు అత్యధిక శాతం జనాభాను కలిగి ఉన్నాయి. లోయ ప్రాంతంలో అతిపెద్ద శాతం శాత క్రూజ్, బెని లానోస్ ప్రాంతంలో ఉంది. జాతీయ స్థాయిలో జనాభా సాంద్రత మధ్య తేడాలు 8.49, 0.8 (పాండో శాఖ), 26.2 (కోచబంబ విభాగం) ఉన్నాయి. అతిపెద్ద జనాభా కేంద్రం "సెంట్రల్ యాక్సిస్", లానోస్ ప్రాంతంలో ఉంది. బొలీవియాలో యువ జనాభా అధికంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 59% మంది 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నారు, 39% మందికి 15 సంవత్సరాల కంటే తక్కువ. దాదాపు 60% మంది జనాభా 25 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు గలవారు.

జెనెటిక్స్

బొలీవియన్ జన్యుశాస్త్ర అధ్యయనాలు లా పాజ్‌లో ప్రజలలో సరాసరిగా స్థానిక అమెరికన్ పూర్వీకత కలిగిన ప్రజలు 86%, యురేపియన్ పూర్వీకత కలిగిన ప్రజలు 12.5%, ఆఫ్రికన్ పూర్వీకత కలిగిన ప్రజలు 1.5% ఉన్నారని భావిస్తున్నారు.చుక్వీస్కాలో ఇది 76.8%,21%, 1.8%.

సంప్రదాయం

బొలీవియా 
Macheteros

బొలీవియా జాతి కూర్పు విభిన్నంగా ఉంటుంది. బొలీవియన్ జనాభాలో దాదాపు సగం మొత్తాన్ని కలిగి ఉన్న సుమారు మూడు డజన్ల స్థానిక సమూహాలు ఉన్నాయి.లాటిన్ అమెరికాలో ఎక్కువ మంది స్థానిక ప్రజలు నివసిస్తున్న దేశంగా బొలీవియా ప్రత్యేకత కలిగి ఉంది. జాతుల గురించిన వివరణలు ప్రభుత్వ సేకరణా విధానాలు అందుకు ప్రజల స్పందనకు అనుగుణంగా వైవిధ్యంగా ఉంటాయి. ఉదాహరణకు 2001 జనాభా లెక్కలు "మేస్టిజో"ను ప్రతిస్పందించే వివరాలు సేకరించబడలేదు. ఫలితంగా స్థానికజాతులలో ఒకదానికి చెందినట్లు మెస్టిజోలు అనబడే మిశ్రిత జాతిప్రజలు సూచిస్తున్న కారణంగా జాతుల సంఖ్యాపరమైన విభేదాలతో వివరణలు లభిస్తుంటాయి. 2009 అంచనాలు మెస్టిజోలు 68% (మిశ్రమ తెల్ల, అమెరిండియన్), 20% స్థానిక ప్రజలు, 5% శ్వేతజాతీయులు, 2% చోలో ప్రజలు, 1% నల్లజాతీయులు, 1% ఇతరులు ఉండగా, 3% ప్రజలు తమ జాతిని వివరించలేదు. 44% మంది స్థానిక సమూహాలకు (ముఖ్యంగా క్యుచూస్ లేదా ఐమారాస్కు ) తమకు తాము ఆపాదించారు.

అమెరిన్డియన్లు, లా పాజ్, పోటోసి, ఓరురో, కోచబంబా, చుక్యూకాకా పశ్చిమ విభాగాలలో కేంద్రీకృతమై ఉన్న ఐమరాస్, క్యుచూస్ (పురాతన ఇంకా సామ్రాజ్యాన్ని స్థాపించారు)ఉన్నారు. వీరు అధికంగా పశ్చిమప్రాంతంలోని లా పాజ్, పొటోసి, ఒరురో, కొచబామా, చుక్విసాకా డిపార్టుమెంటులో ఉన్నారు. తూర్పున ఉన్న స్థానిక ప్రజలలో చిక్టిటానో, చాన్, గ్వారని, మొక్సోస్ ప్రజలు ఉన్నారు. ఇతర ప్రజలు శాంటా క్రుజ్, బెని, తారిజ, పాండో ప్రాంతాలలో ఉన్నారు.మెస్టిజోలు దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. బొలీవియన్ జనాభాలో 26% మంది ఉన్నారు. చాలామంది ప్రజలు మెస్టిజోలుగా చెప్పుకుంటూ అదేసమయంలో తమ స్థానికజాతికి చెందిన వారుగా చెప్పుకుంటుంటారు.

2006 లో శ్వేతజాతీయులు జనసంఖ్యలో 14% మంది ఉన్నారు. వీరు సాధారణంగా అతిపెద్ద నగరాలైన లా పాజ్, శాంటా క్రుజ్ డి లా సియెర్రా, కోచబంబ, కానీ త్రిజా వంటి కొన్ని చిన్న పట్టణాలలో కేంద్రీకృతమై ఉన్నారు. శాంటా క్రుజ్ డిపార్టుమెంటులో దాదాపు 40,000 నివాసితులు (2012 నాటికి) జర్మన్-మాట్లాడే మెన్నోనైట్స్ పలు డజన్ కాలనీలలో కేంద్రీకృతమై ఉన్నారు. స్పానిష్ సామ్రాజ్యం సమయంలో వచ్చిన ఆఫ్రికన్ బానిసల సంతతికి చెందిన ఆఫ్రో-బోలివియన్స్ లా పాజ్ విభాగంలో, ప్రధానంగా నార్ యుంగాస్, సుడ్ యుంగాస్ ప్రావిన్స్లలో నివసిస్తూ ఉన్నారు.1831 లో బానిసత్వం నిషేధించబడింది. జపనీయుల సంఖ్య సంఘాలు 14.000., లెబనీస్ సంఖ్య 12.900. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, ఇతర అమెరికా దేశాల నుండి, అర్జెంటీనా, [[బ్రెజిల్] ], చిలీ, కొలంబియా, క్యూబా, ఈక్వడార్, యునైటెడ్ స్టేట్స్, పరాగ్వే, పెరు, మెక్సికో , వెనిజులా ఇతరులలో కాలనీలు ఉన్నాయి. లా పాజ్, ఎల్ ఆల్టో, శాంటా క్రుజ్ డి లా సియెర్రాలో ప్రాంతాలలో ముఖ్యమైన పెరూ కాలనీలు ఉన్నాయి.

Indigenous peoples

బొలీవియా స్థానికజాతి ప్రజలు రెండు వర్గాలుగా విభజింపబడ్డారు. అండీన్ అల్టిప్లానోలో, లోయ ప్రాంతంలో ఉన్న ఆండేయన్లు ఒక వర్గంగా, తూర్పు బొలీవియాలోని వెచ్చని ప్రాంతాల్లో నివసించే దిగువప్రాంతాలకు చెందిన సమూహాలు కొచంబా డిపార్టుమెంటు, ఉత్తర లా పాజ్ డిపార్ట్మెంట్, అమెజాన్ బేసిన్ ప్రాంతాలైన బెని, పాండో, శాంటా క్రుజ్, టారిజా దిగువప్రాంత డిపార్టుమెంటులు (మధ్య, తూర్పు బొలీవియా దేశం ఆగ్నేయంలో గ్రాన్ చాకో ప్రాంతం)ప్రాంతాలలో ఉన్నారు. ఆండెన్ పౌరులు పెద్ద సంఖ్యలో క్వెచువా, ఐమరా, లోతట్టు ప్రాంతాలలో వలసగా చేరుకుని పరస్పర సాంస్కృతిక కమ్యూనిటీలు ఏర్పాటు చేయడానికి కారణం అయ్యారు.

  • అండీన్ జాతుల
  • ఐమారా ప్రజలు. వారు లా పాజ్, ఓరురో, పోటోసి, ఉష్ణమండల మైదానాలు సమీపంలో కొన్ని చిన్న ప్రాంతాలు అధికంగా ఉష్ణమండల పీఠభూమిలో నివసిస్తున్నారు.
  • క్వెచువా ప్రజలు. వారు ఎక్కువగా కోచబంబ, చుక్యూకాకాలోని లోయలలో నివసిస్తారు. వారు పోటోసి, ఓరురోలో వంటి పర్వత ప్రాంతాలలో కూడా నివసిస్తారు. వారు వేర్వేరు క్వెచువా దేశాలలో తమని తాము విడిపోతూ తారాబోకోస్, ఉకుమారిస్, చల్చస్, చవ్విస్, య్రాల్పిప్స్, టిరినాస్, ఇతర పేర్లతో పిలువబడుతూ ఉంటారు.
  • ఉరు ప్రజలు
  • తూర్పు లోలాండ్స్ జాతి
  • గురాని ప్రజలు: గౌరయోస్,పౌసర్నాస్, సిరియంస్, చిరిక్యుయాంస్, విచి, చులిప్స్, తైపెటేస్ టోబాస్, యుక్విస్ అప్ మేడ్ ప్రజలుగా విభజించబడ్డారు.
  • టాకానాస్: లెకోస్, చిమనెస్, అరానాస్, మార్పాస్లతో ప్రజలుగా విభజించబడ్డారు.
  • పానోస్: చాకోబోస్, కరిపునస్, సినాబోస్, కాపాయిబోస్, గ్వాకన్గగాస్లతో ప్రజలుగా విభజించబడ్డారు.
  • అరుకోస్: అపోలిస్టా, బేర్స్, మొక్సోస్, చానే, మోవిమస్, కయాబయాస్, కరాబెకాస్, పాయియోనేకాస్ లేదా పంచాకాస్ల మేడ్ అప్.ప్రజలుగా విభజించబడ్డారు.
  • చపకురాస్: ఇటేనేజ్ లేదా మోర్, చపకురాస్, సాన్సినోనియోనోస్, కనిచనస్, ఇటోనాస్, యురాకరేస్, గ్వాటోస్, చికిటోస్.ప్రజలుగా విభజించబడ్డారు.
  • బోడోకాడోస్: బోరోరోస్ వై ఓటువిస్ మేడ్.ప్రజలుగా విభజించబడ్డారు.
  • జామకోస్: మేడ్ ప్రజలుగా విభజించబడ్డారు.

భాషలు

బొలీవియా 
బోలివియా స్థానిక భాషల భౌగోళిక పంపిణీ

2001 జనగణన ప్రకారం దేశంలో ఎక్కువభాగం మాట్లాడే అధికారిక భాష జనాభాలో 60% మంది కంటే అధికంగా ఎక్కువ మంది ఉన్నారు. రాజ్యాంగం, ప్రధాన ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు, మీడియా, వ్యాపార కార్యకలాపాలు సహా రాష్ట్రాలకు జారీ చేసిన చట్టపరమైన, అధికారిక పత్రాలు స్పానిష్లో ఉన్నాయి. బహుసాంస్కృతికత ఫలితంగా బోలీవియా గొప్ప భాషా వైవిధ్యం కలిగి ఉంది. బెలివియా రాజ్యాంగం 36 స్థానిక భాషలను గుర్తించింది.వీటిలో స్పానిష్ భాషతో పాటు అన్యారా, అరొనా, బ్యూర్, బెసిరో, కంచా, కావినినో, కాబుబాబా, చాకోబో, చిమ్యాన్, ఈస్ ఎజాజా, గ్వారని, గురుసూవే, గురాయు, ఇటోనామ, లికో, మర్జజాయి-కల్లవేయ, మాచీనరి, మోజినో-త్రినిటారియో, మోరీ, మోసేటేన్, మోవిమా, పాకవరా, పుక్వినా, క్వెచువా, సిరియోనో, టాకానా, టపెటే, టోరోమోనా, ఉరు-చిప్పయా, వేయెన్హాక్, యమినవ, యుకికి, యూరాకరే, జామూకో భాషలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ప్రధాన దేశీయ భాషలు: క్వెచువా (2001 సెన్సస్ జనాభాలో 21.2%), ఐమరా (14.6%), గురాని (0.6%), ఇతరులు (0.4%) బెనిన్ విభాగంలో మొక్కోస్‌తో సహా. శాంటా క్రజ్‌ డిపార్ట్మెంటులోని మెనోనైట్స్‌లో 70,000 మంది జర్మన్ మాండలికాలలో ఒకటైన ప్లౌడియెట్స్చ్ మాట్లాడతారు. పోర్చుగీస్ ప్రధానంగా బ్రెజిల్ సమీప ప్రాంతాలలో మాట్లాడతారు.

మతం

బొలీవియా రాజ్యాంగ పరంగా లౌకికదేశం. మతస్వేచ్ఛకు అవకాశం కల్పించబడుతుంది. " బొలీవియా యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ " నిర్వహించిన 2001 జనాభా గణాంకాల ఆధారంగా జనాభాలో 78% మంది రోమన్ కాథలిక్ తరువాత 19% ప్రొటెస్టంట్, 3% నాస్థికులు ఉన్నారు. 2010 లో, బొలీవియన్లలో 92.5% ప్రజలు క్రిస్టియన్లు, 3.1% ప్రజలు స్థానిక మతం, 2.2% ప్రజలు బహాయి మతం అనుసరిస్తున్నారని గుర్తించబడింది. 1.9% అగోనిజం ఉంది.0.1% ఇతరమతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. దేశీయ జనాభాలో చాలామంది సాంప్రదాయిక విశ్వాసాలకు అనుగుణంగా క్రైస్తవ మతం ఆచరిస్తున్నారని గుర్తించబడింది. పచమమా లేదా "మదర్ ఎర్త్" సంస్కృతి గుర్తించదగినది. కోపకబన వర్జిన్, అర్కినియ వర్జిన్, వర్జిన్ ఆఫ్ సోసావ్న్ పూజలు కూడా ఆచరణలో ఉంది. జేమ్స్ ది అపోస్టిల్‌కు బలమైన భక్తిని కలిగి ఉన్న లేక్ టిటికాకా సరస్సు సమీపంలో ముఖ్యమైన ఐమరాన్ సంఘాలు కూడా ఉన్నాయి. బొలీవియాలో పూజించే దేవతలలో అయమరాన్ దేవుడు ఎకేకొ విస్తారమైన సమృద్ధికి చిహ్నం. ఇది జనవరి 24న జరుపుకుంటారు. గురానీ ప్రజలు " తుపా "ని ఆరాధిస్తారు.

పెద్ద నగరాలు, పట్టణాలు

బొలీవియాలో దాదాపు 67% నగరప్రాంతాలలో నివసిస్తున్నారని అంచనా. దక్షిణ అమెరికాలో దేశాలలో ఇది అత్యల్ప శాతం. పట్టణీకరణ శాతం వార్షికంగా 2.5% అధికరిస్తుంది. 2001 లో 8,87,960 గా ఉన్న గృహాలసంఖ్య 2012 జనాభా గణాంకాల ఆధారంగా బొలీవియాలో మొత్తం 3,158,691 గృహాలు ఉన్నాయి. 2009 లో 75.4% గృహాలు ఇల్లు, హట్ లేదా పహుయిచిగా వర్గీకరించబడ్డాయి. 3.3% అపార్టుమెంట్లు; 21.1% అద్దె భవంతులు ఉన్నాయి. 0.1% మొబైల్ గృహాలు ఉన్నాయి. దేశం అతిపెద్ద నగరాలు పశ్చిమ, మధ్య ప్రాంతాలలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నాయి.

సంస్కృతి

బొలీవియా 
Bolivian children playing tarka
బొలీవియా 
Bolivian awayus for sale in La Paz

లాటిన్ అమెరికా ప్రసిద్ధ సంస్కృతులైన క్యుచుయా, అయమరా బొలీవియన్ సంస్కృతిని బాగా ప్రభావితం చేసాయి.సాంస్కృతిక అభివృద్ధిని మూడు విభిన్న కాలాలుగా విభజించారు: ప్రిఫోలంబియాన్, వలసవాదం, రిపబ్లికన్. ముఖ్యమైన పురావస్తు అవశేషాలలో పూర్వ-కొలంబియన్ సంస్కృతుల బంగారు, వెండి ఆభరణాలు, రాతి కట్టడాలు, సెరామిక్స్, వస్త్రాలు అనేకం మిగిలి ఉన్నాయి. ప్రధాన శిథిలాలలో టివావాకు, ఎల్ ఫ్యూరే డి సామయిపత, ఇంకల్లకత, ఇస్కనావయ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఈ దేశం చాలా తక్కువగా పురావస్తు అన్వేషణను చేసినకారణంగా, దేశంలో విస్తారంగా ఉన్న పూరావస్తు ప్రంతాలు ఇంకా వెలుగు చూడలేదు.

బొలీవియా 
The Diablada, dance primeval, typical and main of Carnival of Oruro a Masterpiece of the Oral and Intangible Heritage of Humanity since 2001 in Bolivia (File: Fraternidad Artística y Cultural "La Diablada")

స్పానిష్ వారు తమ స్థానిక సాంప్రదాయం, మతం, కళలను ఈప్రాంతానికి తీసుకు వచ్చారు. మేస్టిజో బిల్డర్స్, కళాకారులు గొప్ప, విలక్షణమైన శిల్ప శైలి, పెయింటింగ్, "మెస్టిజో బారోక్" అని పిలిచే శిల్ప శైలిని అభివృద్ధి చేశారు. కాలనీల కాలం పెరెజ్ డి హోల్గ్విన్, ఫ్లోరెస్, బిట్టి, ఇతరుల పెయింటింగ్స్ మాత్రమే కాకుండా, నైపుణ్యం కలిగిన శిల్పులు, వండ్రంగి కళాకారులు, బంగారు, వెండి కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాలనీల కాలం నాటి స్థానిక బారోక్ మతసంబంధిత సంగీతం ఒక ముఖ్యమైన సంస్థగా అభివృద్ధి చేసి 1994 నుండి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రశంసలు పొందింది. 20 వ శతాబ్దంలో బొలీవియన్ కళాకారులలో మారియా లూయిసా పచేఖో, రాబర్టో మామానీ మమని, అలెజాండ్రా మారియో యిల్లాన్స్, ఆల్ఫ్రెడో డా సిల్వా, మరినా నూనెజ్ డెల్ ప్రాడో ప్రఖ్యాతి చెంది ఉన్నారు.బొలీవియాలో గొప్ప జానపద కళలు ఉన్నాయి.బొలీవియా ప్రాంతీయ జానపద సంగీతం విలక్షణమైనది, విభిన్నమైనది. ఒరురో వార్షిక ఉత్సవంలో "డెవిల్ నృత్యాలు" దక్షిణ అమెరికా గొప్ప జానపద సంఘటనలలో ఒకటి. తారాబోకో సమీపంలో జరుపుకుంటున్న ఈ కార్నివల్ తక్కువగా గుర్తించబడుతుంది. 19 వ శతాబ్దానికి చెందిన "కార్నెల్వాల్ డి ఓరురో" అనే పేరుగల వివిధ పండుగలు ప్రసిద్ధి చెందాయి. ఇది "హ్యుమానిటీ ఆఫ్ ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ మాస్టర్ పీస్ ఆఫ్ ది"గా దీనిని 2001 మేలో యునెస్కొ ప్రకటించింది.వినోదం ఫుట్బాల్ కలిగి ఉంది [ఆధారము కోరబడినది].[ఆధారం చూపాలి].

దేశప్రజలు తమ గతకాలపు సంస్కృతిని కాపాడుకోవడానికి వివిధ దేశవాళీ పండుగలను నిర్వహించుకుంటారు. వీటిలో ముఖ్యమైనది-కాపోరేల్స్ దీనిని దేశమంతటా జరుపుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రీతులలో వస్త్రధారణ చేస్తారు. మొత్తంగా చూస్తే దేశంలో 30 రకాల వస్త్రరీతులు కనబడతాయి. మహిళలు భుజాల నుండి మోకాళ్ల కింది వరకు వచ్చే స్కర్టు ధరిస్తారు.

ఆహారసంస్కృతి

బొలీవియా ఆహారసంస్కృతిలో ప్రధానంగా స్పెయిన్, స్థానిక అయమరా, ఇంకా ఆహార విధానాలు మిశ్రితం అయ్యాయి.తరువాతి కాలంలో దీనికి జర్మన్,ఇటాలియన్, బాస్క్యూ, రష్యన్, పోలిష్, అరబ్ వలసప్రజల ఆహారసంస్కృతి తోడైంది.

ఇక్కడి ప్రజలు తినే మధ్యాహ్న భోజనాన్ని అల్‌మూర్జో అంటారు. ఈ భోజనంలో సూప్, మాంసం, అన్నం, బంగాళదుంపలు ఉంటాయి. ఉదయంపూట మనం తినే కజ్జికాయలు లాంటివి తయారుచేస్తారు. వీటిని వెన్న, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, లోకోటోలతో కలిపి తయారుచేస్తారు. పందిమాంసం, సూప్, బీన్స్‌వేపుడు వంటివాటిని భోజనంలో తీసుకుంటారు. బొలీవియా టీ (చాయ్)ని ఆపి అంటారు. ఇది నిమ్మరసం, మొక్కజొన్నపిండి, యాలకులు, లవంగాలు, కోకో ఆకులు మిశ్రమం చేసి పొడిని తయారుచేసి ఆ పొడిని వేడినీటిలో వేసి కాచి వడబోసి తాగుతారు. వరి అన్నం, వెన్న కలిపి తయారు చేసే వంటకాన్ని ఆర్రోజ్ కాన్ క్వెసో అంటారు. బొలీవియాలో వరి అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ వరిధాన్యం బాగా పండుతుంది.

కళలు

2011 కారొలైన్ అలెథియా నవల " ప్లాంట్ టీచర్ "కు 2007-2008 మద్య బొలీవియా నేపథ్యంలో వ్రాయబడింది.నవలలో రాజకీయలు, స్థానిక మతాలు, నార్కోపర్యాటకం గురించిన ప్రస్తావనలు వివరణలు చోటుచేసుకున్నాయి. 2017 వీడియో గేం " గోస్ట్ రెకాన్ విల్డ్ లాండ్స్ " బొలీవియా నార్కో ఆధారంగా తయారు చేయబడింది.

పరిపాలన

దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 9 విభాగాలుగా విభజించారు. వీటిని తిరిగి ప్రావిన్స్‌లుగా, మున్సిపాలిటీలుగా, కాంటన్‌లుగా విభజించారు. అన్ని ప్రాంతాల్లో స్వతంత్రపాలన ఉంటుంది. అన్నింటినీ దేశాధ్యక్షుడు పర్యవేక్షిస్తాడు.

విద్య

2008 లో యునస్కొ ప్రమాణాల ఆధారంగా బొలీవియా నిరక్షరాస్యులులేని దేశంగా ప్రకటించబడింది. దక్షిణ అమెరికాలో పూర్తిస్థాయి అక్షరాశ్యులు ఉన్న దేశాలలో బొలీవియా నాల్గవ దేశం అయ్యింది. బొలీవియాలో ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో: " యునివర్సిడాడ్ మేయర్, రియల్ వై పాంటిఫిరియా డి శాన్ఫ్రాన్సిస్కో జేవియర్ డి చుక్వికాకా " (యు.ఎస్.ఎఫ్.ఎల్స్) - సుక్రేలో 1624 లో స్థాపించబడింది; " యునివర్సిడాడ్ మేయర్ డి శాన్ ఆండ్రెస్ " (యు.ఎం.ఎస్.ఎ) - లా పాజ్‌లో 1830 లో స్థాపించబడింది; " యునివర్సిడాడ్ మేయర్ డి శాన్ సిమోన్ " (యు.ఎం.ఎస్.ఎస్.) - కోచబంబలో 1832 లో స్థాపించబడింది; " యూనివర్సిడాడ్ ఆటోనోమా గాబ్రియేల్ రెనే మొరెనో " (యు.ఎ.జి.ఆర్.ఎం.) - " శాంటా క్రుజ్ డి లా సియర్రా " 1880 లో స్థాపించబడింది; " యునివర్సిడాడ్ టెకికా డి ఓరురో యుటో " - ఓరురోలో 1892 లో స్థాపించబడింది;, " యూనివర్సిడ్ ఆటోనోమా టోమస్ ఫ్రైస్ " (యు.ఎ.టి.ఎఫ్.) - పోటోసిలో 1892 లో స్థాపించబడింది.

2017 లో బొలీవియా దక్షిణ అమెరికాలో ప్రభుత్వ విద్యకు కొరకు నిధులు ప్రత్యేకించిన మొదటి దేశంగా, లాటిన్ అమెరికాలో రెండవ దేశంగా గుర్తించబడుతుంది.

ఆరోగ్యం

2013 నాటి వరల్డ్ ఫాక్ట్ బుక్ అంచనాల ప్రకారం బొలీవియా ఆయుఃప్రమాణం 68.2 సంవత్సరాలు. బొలీవియా ఆయుఃప్రమాణం ప్రపంచదేశాలలో 161 వ స్థానంలో ఉంది. పురుషుల ఆయుఃపరిమితి 65.4 సంవత్సరాలు, మహిళల ఆయుఃపరిమితి 71.1.సంవత్సరాలు. ఐక్యరాజ్యసమితి అధ్యయనాలు కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ ఫండ్ అధ్యయనం ప్రకారం బోలెవియాలో రోజుకు 230 మంది పిల్లలు సరైన జాగ్రత్తలు లేకపోవడంతో చనిపోతున్నారు అని తెలియజేస్తుంది. జనాభాలో ప్రజలలో అత్యధిమంది ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సదుపాయాలకు ప్రాముఖ్యత ఇవ్వడంలేదు. విస్తృతమైన అంశాలపై 1989 నుండి బొలివియాలో జనాభా, ఆరోగ్య సర్వేలు ఐదింటిని పూర్తి చేశాయి. 2006, 2016 మధ్య బొలీవియాలో తీవ్ర పేదరికం 38.2% నుండి 16.8% పడిపోయింది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దీర్ఘకాలిక పోషకాహారలోపం కూడా 14% పతనం అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పిల్లల మరణ రేటు 50% తగ్గింది.

దర్శనీయ ప్రదేశాలు

లాపాజ్

బొలీవియా దేశానికి పరిపాలన రాజధాని నగరం. ఈ నగరం మొత్తం కొండలపైనే ఉంటుంది. ప్రపంచంలో అతి ఎత్తై రాజధాని నగరం లాపాజ్. ఇది భూమి నుండి దాదాపు 3650 మీటర్ల ఎత్తులో ఉంది. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదే. ఈ నగరం 15వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. చుట్టూ ఆండీస్ పర్వత శ్రేణులు నగరాన్ని ఎంతో అందాన్ని ఇస్తుంటాయి. నగరంలో సగర్‌నాగ వీధి ఎప్పుడూ యాత్రీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నగరంలో దయ్యాల మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్‌లో ఎండబెట్టిన కప్పలు, కొన్ని సముద్ర జంతువులను అమ్ముతారు. బ్లాక్ మార్కెట్ అని పిలుచుకునే మెర్కాడో నెగ్రో అనే ప్రాంతంలో ఎక్కువగా దుస్తులు, సంగీత పరికరాలు అమ్ముతారు. నగరంలో ఇంకా కల్లెజాన్, ప్లాజా మురిల్లో, వల్లెడిలా లూనా ప్రాంతాలతో బాటు సాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియం, టివనాకు మ్యూజియం, కోకా మ్యూజియం, మ్యూజియం ఆఫ్ మెటల్స్‌ ప్రదేశాలు దర్శించతగినవి.

వెండి గనులు

బొలీవియాలో వెండిగనులు పోటోసిలో ఉన్నాయి. ఇక్కడ క్రీస్తుశకం 1545 నుండి కొండలను తవ్వి వెండిని తీస్తున్నారు. ఈ నగరాన్ని సెర్రోరికో అంటారు. ఒకప్పుడు ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరంగా పేరుగాంచింది. ఈ గనులలోకి పర్యాటకులు వెళ్ళి అక్కడి గనుల తవ్వకాన్ని, ముడి ఖనిజాలను స్వయంగా చూడవచ్చు. ఈ గనులు భూమికి 240 మీటర్ల లోతులో ఉంటాయి. గనిలోపలి భాగాన్ని పైలావిరి అంటారు. ఇందులోకి పర్యాటకులు నేరుగా వెళ్ళే అవకాశం ఉంది. గని ముందుభాగంలో గనులరాజు బొమ్మ విచిత్రంగా కనబడుతుంది. ఇక్కడ వెండిని గత 455 సంవత్సరాలుగా నిరంతరం వెలికితీస్తూనే ఉన్నారు. ఈ గనులలో దాదాపు 10 వేలమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు.

ఉయుని ఉప్పు మైదానం

బొలీవియా 
ఉయుని ఉప్పు మైదానం.

ఇది పోటోసి నగరానికి సమీపంలో ఉంది. దేశానికి దక్షిణ భాగంలో ఉంది. ఇది 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఉప్పు మైదానంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఉప్పు ఎడారిగా పిలవవచ్చు. ఈ ఉప్పు మైదానం సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఇలా ఉప్పు ఎడారి ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక సముద్ర ద్వీపం. దాదాపు 13వేల సంవత్సరాల క్రితం ఇందులోని నీరంతా ఆవిరైపోయి ఉప్పు మాత్రమే మిగిలింది. మధ్యభాగంలో ఉప్పు 10 మీటర్ల మందంలో ఉంటుంది. ఈ ఉప్పు ఎడారి మీద నిలబడితే మేఘాలు మనల్ని తగులుతూ కదులుతుంటాయి. పర్యాటకులకు ఇదో విచిత్రమైన అనుభవం. ఎప్పుడు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఎడారిమీద గాలివీయడం వల్ల మైదానంలో పాలిహైడ్రల్ గుర్తులు ఏర్పడతాయి. వాటిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఫ్లెమింగోలు, ఆండియన్‌జాతి నక్కలు అధికంగా అగుపిస్తాయి. రాజధాని లాపాజ్ నుండి దాదాపు 12 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు.

జెసూట్ మిషన్స్

ఇది ఒకప్పుడు అడవి. ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చి ఆటవికులనందరినీ క్రైస్తవులుగా మార్చారు. ఆ తర్వాత స్పెయిన్ దేశం బొలీవియాను తమ అధీనంలోకి తీసుకున్నాక ఈ ప్రాంతంలో చర్చిల నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతాన్ని చికిటో అంటారు. ఈ ప్రాంతం 16వ శతాబ్దంలో కనుగొనబడి నేటికీ ఆనాటి వాతావరణంలోనే ఉండడం ఒక గొప్ప విశేషం. ఇక్కడి నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే విషయం. చర్చిల లోపల ఎంతో అందమైన నిర్మాణశైలి కనబడుతుంది. బంగారంతో చేసిన అలంకరణలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రదేశం సాంటాక్రజ్‌కు సమీపంలో ఉంది. మొదట జెసూట్‌లు ఇక్కడికి వచ్చి భూమి మీద దేవుడి నగరాన్ని నిర్మించాలని పూనుకున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళితే 17వ శతాబ్దపు కాలంలోకి వెళ్లినట్లుగా అనుభూతి కలుగుతుంది. 1991లో ఈ మొత్తం ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేసింది.

చిత్ర మాలిక

మూలాలు

బయటి లంకెలు

Bolivia గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

బొలీవియా  నిఘంటువు విక్షనరీ నుండి
బొలీవియా  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
బొలీవియా  ఉదాహరణలు వికికోట్ నుండి
బొలీవియా  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
బొలీవియా  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
బొలీవియా  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Tags:

బొలీవియా పేరు వెనుక చరిత్రబొలీవియా నైసర్గిక స్వరూపముబొలీవియా చరిత్రబొలీవియా చరిత్రబొలీవియా భౌగోళికంబొలీవియా జీవవైవిధ్యంబొలీవియా ఆర్ధికరంగంబొలీవియా గణాంకాలుబొలీవియా సంస్కృతిబొలీవియా పరిపాలనబొలీవియా విద్యబొలీవియా ఆరోగ్యంబొలీవియా దర్శనీయ ప్రదేశాలుబొలీవియా చిత్ర మాలికబొలీవియా మూలాలుబొలీవియా బయటి లంకెలుబొలీవియాఅర్జెంటీనాఆంగ్లంచిలీదక్షిణ అమెరికాపరాగ్వేపర్వతాలుపెరూబ్రెజిల్

🔥 Trending searches on Wiki తెలుగు:

డీజే టిల్లుకాశీనువ్వు వస్తావనికంప్యూటరుఆటలమ్మవిశాఖ నక్షత్రముతెలుగు నెలలువిశాల్ కృష్ణవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఆప్రికాట్కర్ర పెండలందగ్గుబాటి పురంధేశ్వరిచాట్‌జిపిటిదశదిశలుఅండమాన్ నికోబార్ దీవులుసామెతల జాబితాసచిన్ టెండుల్కర్గుంటూరుకాన్సర్శ్రీ కృష్ణుడుదిల్ రాజుషర్మిలారెడ్డితెలుగు సాహిత్యంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డికొంపెల్ల మాధవీలతరష్మి గౌతమ్ఉత్పలమాలద్వాదశ జ్యోతిర్లింగాలుఅమరావతిప్రీతీ జింటాజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంవిజయనగర సామ్రాజ్యంతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపి.సుశీలపక్షముశ్రీ గౌరి ప్రియరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్పూర్వ ఫల్గుణి నక్షత్రముతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకన్యకా పరమేశ్వరికల్వకుంట్ల చంద్రశేఖరరావుకుంభరాశిపసుపు గణపతి పూజదశావతారములుతెలుగులో అనువాద సాహిత్యంసామజవరగమనఅశోకుడుకమ్మపక్షవాతంరక్తనాళాలువై.ఎస్.వివేకానందరెడ్డిఅష్ట దిక్కులుఉడుములోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారత సైనిక దళంప్రేమలుపచ్చకామెర్లుగ్రామంనిర్వహణభాషమియా ఖలీఫావాణిశ్రీకీర్తి రెడ్డిన్యుమోనియాచంద్రయాన్-3వాయు కాలుష్యంక్లోమముముప్పవరపు వెంకయ్య నాయుడుత్రిఫల చూర్ణంప్లీహముపార్శ్వపు తలనొప్పిజగ్జీవన్ రాంసంతోష్ యాదవ్రమ్యకృష్ణఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంభారత రాష్ట్రపతుల జాబితాబర్రెలక్కబమ్మెర పోతన🡆 More