పరాగ్వే: దక్షిణ అమెరికా లోని దేశం

పరాగ్వే అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే అంటారు.ఇది మద్య దక్షిణ అమెరికాలోని ఒక భూపరివేష్టిత దేశం.

దేశ దక్షిణ, నైరుతీ సరిహద్దులో అర్జెంటీనా, తూర్పు, ఈశాన్య సరిహద్దులో బ్రెజిల్, వాయవ్య సరిహద్దులో బొలీవియా దేశాలు ఉన్నాయి. పరాగ్వే దేశం పరాగ్వే నదికి ఇరువైపులా విస్తరించి ఉంది.దేశం మద్య ఉత్తర, దక్షిణాలుగా పరాగ్వే నది ప్రవహిస్తుంది. దక్షిణ అమెరికా మద్యలో ఉన్న పరాగ్వే " కొరజాన్ డీ సుడామెరికా " (దక్షిణ అమెరికా హృదయం) అని అభివర్ణించబడుతుంది. ఆఫ్రో - యురేషియాకు వెలుపల ఉన్న రెండు భూబంధిత దేశాలలో పరాగ్వే ఒకటి (రెండ దేశం బొలీవియా) అలాగే అతి చిన్నదేశంగా ప్రత్యేకత కలిగి ఉంది. అమెరికా ఖండాలలో ఉన్న భూబంధితదేశం కూడా ఇది ఒక్కటే.

Republic of Paraguay

  • República del Paraguay  (Spanish)
  • Tetã Paraguái  (Guarani)
Flag of Paraguay
Flag (obverse)
Coat of armsమూస:Tsp[nb 1] of Paraguay
Coat of armsమూస:Tsp
నినాదం: "Paz y justicia" (Spanish)
"Peace and justice"
గీతం: 
Paraguayos, República o Muerte  (Spanish)
Paraguayans, Republic or Death
Location of Paraguay
రాజధాని
and largest city
Asunción
25°16′S 57°40′W / 25.267°S 57.667°W / -25.267; -57.667
అధికార భాషలు
  • Spanish
  • Guarani
జాతులు
(2016)
  • 95% Mestizo
  • 5% other
పిలుచువిధంParaguayan
ప్రభుత్వంUnitary presidential constitutional republic
• President
Horacio Cartes
• Vice President
Juan Afara
శాసనవ్యవస్థCongress
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
Chamber of Deputies
Independence from Spain
• Declared
14 May 1811
• Recognized
25 November 1842
విస్తీర్ణం
• మొత్తం
406,752 km2 (157,048 sq mi) (59th)
• నీరు (%)
2.3
జనాభా
• 2016 estimate
6,725,308 (104th)
• జనసాంద్రత
17.2/km2 (44.5/sq mi) (204th)
GDP (PPP)2017 estimate
• Total
$68.005 billion (100th)
• Per capita
$9,779 (107th)
GDP (nominal)2017 estimate
• Total
$28.743 billion (99th)
• Per capita
$4,133 (109th)
జినీ (2014)Negative increase 51.7
high
హెచ్‌డిఐ (2015)Steady 0.693
medium · 110th
ద్రవ్యంGuaraní (PYG)
కాల విభాగంUTC–4 (PYT)
• Summer (DST)
UTC–3 (PYST)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+595
ISO 3166 codePY
Internet TLD.py
  1. Mixed European and Amerindian.

16 వ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యం ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకొనేందుకు కనీసం ఒక సహస్రాబ్దికి పూర్వం నుండి పరాగ్వేలో స్థానికజాతులకు చెందిన గ్వారని ప్రజలు నివసించారు. స్పానిష్ సెటిలర్లు, సొసైటీ అఫ్ జీసస్ మిషన్లు ఈ ప్రాంతానికి క్రిస్టియానిటీ, స్పానిష్ సంస్కృతిని పరిచయం చేశారు. పరాగ్వే కొన్ని పట్టణకేంద్రాలు, సెటిలర్లతో స్పానిష్ సామ్రాజ్యం కాలనీగా ఉంది. 1811 లో స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన పరాగ్వేలో నిరంకుశ పాలకుల పాలనలో ఐసోలేషనిస్ట్, ప్రొటెస్టెరిస్ట్ విధానాలు అమలు చేశారు.అతి భయంకరమైన పరాగ్వేయన్ యుద్ధం (1864-1870) తరువాత పరాగ్వే జనసంఖ్యలో 60%-70% ప్రజలను, 1,40,000 చ.కి.మీ భూభాగాన్ని (దేశంలో నాలుగవ భాగం) యుద్ధం, అంటువ్యాధుల కారణంగా పోగొట్టుకుంది.యుద్ధంలో పరాగ్వే భూభాగాలను అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలు స్వాధీనం చేసుకున్నాయి.

20 వ శతాబ్దంలో పరాగ్వేలో వారసత్వ ప్రభుత్వాల పాలన కొనసాగింది.1954 నుండి 1989 వరకు అల్ఫ్రెడో స్ట్రోస్నేర్ నాయకత్వంలో సైనిక నియంతృత్వ పాలన కొనసాగింది. ఇది దక్షిణ అమెరికాలో దీర్ఘకాలం కొనసాగిన సైనిక పాలనగా ప్రత్యేకత సంతరించుకుంది.ఒక సంవత్సరం తర్వాత, పరాగ్వే అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే లలో చేరి " మెర్కోసూర్ " పేరుతో ప్రాంతీయ ఆర్థిక సహకార సంస్థను స్థాపించింది.

పరాగ్వే జనసంఖ సుమారు ఒక మిలియన్ ఉంటుంది. వీరిలో చాలామంది దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.పరాగ్వే జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు ప్రజలు రాజధాని, అతిపెద్ద నగరం అసున్సియోన్ నగర మెట్రోపాలిటన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. పలు లాటిన్ అమెరికన్ దేశాలకు విరుద్ధంగా పరాగ్వే దేశీయభాష, సంస్కృతి గురని దేశంలో అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయి. పరాగ్వేలో నిర్వహించిన జనాభా గణనలన్నింటిలో మేస్టిజోలు ప్రధాన నివాసితులుగా ఉన్నారు.శతాబ్ధాల కాలం వివిధజాతుల సహజీవనం కారణంగా జాతయంతర వివాహలు మెస్టిజోల సంఖ్య అధికరించడానికి ప్రధానకారణంగా ఉంది. స్పానిష్ భాషతో పాటుగా గ్యురానీ భాష కూడా అధికారిక భాషగా గుర్తింపు పొందింది. ఇవి కాక మరొక రెండు భాషలను దేశమంతటా మాట్లాడుతుంటారు.

పేరు వెనుక చరిత్ర

దేశంలో ప్రవహిస్తున్న పెరుగ్వే నది పేరు దేశానికి వచ్చింది. "పరాగ్వే" అర్ధం గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే పలు కథనాలు ఒకదానిని పోలి మరొకటి ఉంటుంది. కథనాలు అన్ని గురుని భాష ( పరాగ్వన్ గువాని) ఉంటాయి. "పారాగ్వా" ('పారా' అంటే 'సముద్రం',, 'శ్వాస'అని అర్ధం) '-, ('గ్వా ') అంటే నీరు, నది అని అర్ధం) "సముద్రం నుండి వచ్చే నీరు" అని అర్ధం కావచ్చు. ఇది మొదటి అర్థం అని చాలామంది నమ్ముతారు అయినప్పటికీ రెండో అర్ధం భాషాపరమైనదని భావించబడుతుంది.

" ఫ్రియర్ అంటోనియో రూయిజ్ డి మోంటోయా " (1585-1652) థసారస్ ఆఫ్ గ్వారని భాషలో వ్రాసిన " టెస్రో డి లా లెంగువా గరని" (1639) పరాగ్వా (ఈక కిరీటం) అని, వై అంటే "కిరీటాల్లోని నది" లేదా " ఈకల కిరీటాలు ధరించిన పురుషులు నివసించే నది , కిరీటాలతో అలంకరించబడిన నది" అని అర్ధం అని వివరించాడు.

స్పానిష్ అధికారి, శాస్త్రవేత్త ఫెలిక్స్ డి అజర (1746-1821) రెండు నిర్వచనాలను సూచించాడు: పయాగువా ప్రజలు (పజగువా య, "పయాగుస్ నది") నివాసిత ప్రాంతం కనుక పరాగ్వే అయిందన్నది ఒకటి. గ్రేట్ కాసిక్యూ నదీతీరంలో నివసించిన అమెరికన్‌ స్థానిక ప్రజలు ఈ ప్రాంతానికి " పరాగ్వా లేక పరాగుయాజొ అని నామకరణం చేసారన్నది మరొకటి.

మొదట గ్వారనిలో పరాగ్వే పదం "పరాగ్వే"గా పిలువబడిన ఈ దేశం స్పానిష్ భాషలో అదే విధంగా ఉచ్ఛరించబడుతుంది, పరాగ్వే పదం కేవలం నది , రాజధాని నగరం అసున్‌షన్‌కు కూడా వర్తిస్తుంది.

చరిత్ర

కొలంబియాకు పూర్వం

పరాగ్వేలో స్థానికప్రజలు వేల సంవత్సరాల నుండి నివసిస్తూ ఉండేవారు. కొలంబియన్-పూర్వం పరాగ్వే ప్రాంతంలో మహావీరులుగా పేరుపొందిన సంచారజాతులకు చెందిన సెమీ - నోమాడిక్ తెగకు చెందిన ప్రజలు నివసించారు.ఈ స్థానికతెగలకు చెందిన ప్రజలు ఐదు విభిన్న భాషా కుటుంబాలకు చెందినవిగా భావిస్తున్నారు. భాషలు వారిలో ప్రధానవిభాగాల స్థావరాలు ఏర్పడడానికి కారణంగా ఉన్నాయి. విభిన్న భాషా మాట్లాడే సమూహాలు సాధారణంగా వనరులు , భూభాగాలపై పోటీ పడతాయి. వారు భాషాశాఖల కారణంగా విభిన్న భాషలను మాట్లాడుతూ మరిన్ని తెగలుగా విడిపోయారు. ప్రస్తుతం ఈప్రాంతంలో 17 వేర్వేరు ఎథ్నోలింగ్జిస్టిక్స్ తెగలు మిగిలి ఉన్నాయి.

కాలనీపాలన

1516లో మొదటిసారిగా స్పానిష్ అంవేషకులు ఈప్రాంతానికి చేరుకున్నారు. స్పానిష్ అంవేషకుడు " జుయాన్ డీ సలాజర్ డీ ఎస్పినొసా " 1537 ఆగస్టు 15న " అసంషన్ " అనే సెటిల్మెంటు స్థాపించాడు.చివరికి ఈనగరం " స్పానిష్ కాలనియల్ ప్రొవింస్ ఆఫ్ పరాగ్వే "కి కేంద్రంగా అభివృద్ధి చెందింది.స్వయంప్రతిపత్తి కలిగిన క్రిస్టియన్ ఇండియన్ దేశం రూపొందించే ప్రయత్నంలో 18వ శతాబ్దంలో దక్షిణ అమెరికాలోని ఈ భాగాన్ని " సొసైటీ అఫ్ జీసస్ (జేస్యూట్) మిషన్లు " , సెటిల్మెంట్లు చేపట్టాయి. వారు స్వాధీనం చేసుకున్న భూభాగంలో ప్రస్తుత ఉరుగ్వే, అర్జెంటీనా , బ్రెజిల్ భూభాగాలు ఉన్నాయి. వారు స్పానిష్ బృందాల్లో గురాని కలిపేందుకు, వారిని క్రైస్తవులుగా మార్చడానికి , స్పానిష్ వలసదారుల బానిసలు కాకుండా కాపాడడానికి " జేస్యూట్ తగ్గింపు "ను అభివృద్ధిచేసారు.

పరాగ్వేలోని కాథలిక్కులను స్థానికప్రజలు ప్రభావితంచేసారు. సింక్రటిక్ మతం స్థానిక అంశాలని కలుపుకుంది. 1767 లో స్పానిష్ క్రౌన్ జెస్యూట్లను బహిష్కరించే వరకు దాదాపు 150 సంవత్సరాలు తూర్పు పరాగ్వేలో "రిడక్షంస్" వృద్ధిచెందాయి. రెండు 18 వ శతాబ్దపు " జెసూట్ మిషంస్ ఆఫ్ లా శాంటిసిమ ట్రినిడాడ్ డీ పరన అండ్ ఫెస్యూ డీ తవరగ్యూ " అవశేషాలు ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి.

స్వతంత్రం , ఫ్రాంసియా పాలన

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
José Gaspar Rodríguez de Francia, Paraguay's first dictator.

1811 మే 14న పరాగ్వే ప్రాంతీయ స్పానిష్ పాలనను త్రోసివేసింది.1814 నుండి ఆరంభమైన పరాగ్వే మొదటి నియంత " జోస్ గాస్పర్ రోడ్రిక్వెజ్ " పాలన ఆయన 1840లో మరణించే వరకు కొనసాగింది. ఈమద్య కాలంలో పరాగ్వేతో వెలుపలి సంబంధాల ప్రభావం చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. ఆయన ఫ్రెంచి సిద్ధాంతవాది " జీన్ - జాక్యూస్ రౌసెయూ " సోషల్ కాంట్రాస్ట్ ఆధారిత ఉటోపియన్ సంఘం రూపొందించడానికి ప్రయత్నించాడు. రోడ్రిక్వెజ్ డీ ఫ్రాంసికా స్థాపించిన కొత్త చట్టలు కాథలిక్ చర్చి అధికారం తగ్గించబడింది.అప్పుడు కాథలిజం దేశీయమతంగా ఉండి మంత్రిమండలికి నాయకత్వాధికారం కలిగి ఉండడమేకాక మెస్టిజో సంఘం రూపొందించడానికి కాలనియల్ పౌరుల మద్య వివాహాలను నిషేధించి నల్లజాతీయులను, ములాటోలు, స్థానికజాతి ప్రజలను మాత్రమే వివాహం చేసుకోవాలని ఆదేశించింది. ఆయన పరాగ్వేకు, మిగిలిన దక్షిణ అమెరికా మద్య సంబంధాలు లేకుండా రద్దు చేసాడు.ఫ్రాంసియా స్వతంత్రం మీద తీసుకువచ్చిన నిర్భంధాలను వ్యతిరేకిస్తూ " ఫుల్జెంసియో యగ్రాస్ ", పలువురు ఇతర నాయకులతో కలిసి 1820లో తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించారు. ఫ్రాంసియా వారి వ్యూహాలను గ్రహించి నాయకులను బంధిచి జీవితఖైదు చేయడం, వధుంచడం చేసాడు.

లోపెజ్ పాలన

1840 లో ఫ్రాన్సియా మరణం తరువాత కార్లోస్ ఆంటోనియో లోపెజ్ (1814 లో రోడ్రిగ్యుజ్ డే ఫ్రాన్సియా యొక్క మేనల్లుడు) అధికారంలోకి వచ్చే వరకు పరాగ్వేను కొత్త సైనిక అధికారంతో వివిధ సైనిక అధికారులు పాలించారు. లోపెజ్ పరాగ్వేను ఆధునీకరించి, విదేశీ వాణిజ్యానికి తెరతీసాడు.అతను అర్జెంటీనాతో " అక్రమ-ఆక్రమణ ఒప్పందం "లో సంతకం చేసి 1842 లో అధికారికంగా పరాగ్వే స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. 1862 లో లోపెజ్ మరణం తర్వాత అతని పెద్ద కుమారుడు " ఫ్రాన్సిస్కో సొలోనో లోపెజ్ "కు అధికారం బదిలీ చేయబడింది.

లోపెజ్ కుటుంబం పాలన ఉత్పత్తి , పంపిణీ విధానాలను దృఢంగా కేంద్రీకృతంచేసింది. ప్రభుత్వ , ప్రైవేటు రంగాల మధ్య వ్యత్యాసం లేదు. లోపేజ్ కుటుంబం దేశాన్ని పెద్ద ఎస్టేట్‌గా చేసి పాలించింది. ప్రభుత్వం ఎగుమతుల నిర్వహణను తన నియంత్రణలో ఉంచుకుంది. యార్బా మేట్ ఎగుమతి , విలువైన వుడ్ ఉత్పత్తులు పరాగ్వే , వెలుపలి ప్రపంచం మద్య వాణిజ్యాలను సమతూకం ఉండేలా చేసింది. పరాగ్వే ప్రభుత్వం తీవ్రమైన ప్రొటెక్షనిస్టు విధానాలను అనుసరిస్తూ విదేశీఋణాలను అనుమతించలేదు. దిగుమతి వస్తువుల మీద అధిక మొత్తంలో పన్నులు విధించింది. ఇది సంఘాన్ని స్వయంసమృద్ధం చేసింది. అలాగే ఋణాలతో బాధపడుతున్న అర్జెంటీనా , బ్రెజిల్ ప్రభుత్వాలతో సంబంధాలను తప్పించింది. కార్లోస్ ఆంటోనియో లోపెజ్ కుమారుడు " ఫ్రాన్సిస్కో సోలనో లోపెజ్ " 1862 లో తన తండ్రిని " అధ్యక్షుడు- నియంత " గా నియమించి తన తండ్రి రాజకీయ విధానాలను కొనసాగిస్తూ పాలనచేసాడు. ఇద్దరూ పరాగ్వేకు అంతర్జాతీయంగా " ప్రజాస్వామ్య, రిపబ్లికన్ " భావన కలిగించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వాస్తవానికి దేశం లోని మొత్తం ప్రజలందరి జీవనం చర్చి , కళాశాలలతో సహా అధికారం పాలక కుటుంబం ఆధీనంలో ఉంది. కార్లోస్ ఆంటోనియో లోపెజ్ సైనికపరంగా ఆధునికీకరించి సైన్యాలను విస్తరించి " హుమైతా కోట " అభివృద్ధిచేసి బలోపేతం చేసి అలాగే పరిశ్రమలను విస్తరించాడు.

విస్తరించిన ఉక్కు, వస్త్రాలు, కాగితం , ఇంక్, నౌకా నిర్మాణం, ఆయుధాలు , గన్పౌడర్ పరిశ్రమలకు సహాయంగా టెలిగ్రాఫ్ , రైల్‌రోడ్ అభివృద్ధి చేయడానికి పరాగ్వే ప్రభుత్వం 200 మంది కంటే అధికమైన నిపుణులను నియమించింది. 1850 లో పూర్తయిన యుబిసి ఫౌండరీ ఫిరంగిలు, మోర్టార్ , అన్ని కాలిబర్ల బుల్లెట్లు తయారుచేసింది. నదిలో యుద్ధనౌకలు అసున్యుయోన్ ఓడలు నిర్మించబడ్డాయి. ఫోర్టిఫికేషన్‌లు నిర్మించబడ్డాయి. ప్రత్యేకించి అఫా నది , గ్రాన్ చాకో నదులలో నిర్మించబడ్డాయి. ఈ పనులను ఆయన కుమారుడు " శాన్ ఫ్రాంసిస్కో సొలానొ " కొనసాగించాడు.

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Political map of the region, 1864

యుద్ధానికి ముందు , యుద్ధ సమయంలో పరాగ్వేయన్ సైన్యంలోని ఇంజనీర్స్ లెఫ్టినెంట్ కల్నల్ " జార్జ్ థాంప్సన్, సి.ఇ. " అభిప్రాయం ఆధారంగా లోపేజ్ ప్రభుత్వం పరాగ్వేకి మంచి చేసిందని భావిస్తున్నారు.

ఆంటోనియో లోపెజ్ పాలనలో బహుశా ప్రపంచంలో ఏ ఇతర దేశంలో లేనంతగా పరాగ్వే ప్రజల జీవితం , ఆస్తి అత్యంత సురక్షితంగా ఉంది. క్రైమ్ దాదాపు అంతం చేయబడింది. నేరాలకు పాల్పడడానికి ప్రయత్నించిన వారిని వెంటనే కనిపెట్టి శిక్షించబడ్డారు. , శిక్ష. ప్రజల జీవితం సంతోషకరంగా ఉంది. జీవనోపాధిని పొందటానికి ఏ పనినైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ప్రతి కుటుంబానికి సొంత స్థలంలో ఇల్లు లేదా కుటీరం ఉండేది. కొద్ది రోజులలో వారు పొగాకు, మొక్కజొన్న , మాండోకాకా పంటలను పండించి సొంత వినియోగం కొరకు వాడుకున్నారు. ప్రతి కుటీరం నారింజల తోట , కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. వాటి అవసరం దాదాపు ఏడాది పొడవునా తక్కువ ఉండేది. పై తరగతికి చెందిన ప్రజలు యూరోపియన్ శైలిలో జీవించారు ...

— జార్జ్ థాంప్సన్, C.E.

పరాగ్వే యుద్ధం (1864–1870)

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Francisco Solano López

12 అక్టోబరు 1864 లో పరాగ్వేయుల అల్టిమాటాలు ఉన్నప్పటికీ అర్జెంటీనా , తిరుగుబాటుదారుడైన జనరల్ వెనన్సియో ఫ్లోరోస్‌లతో పాటుగా బ్రెజిల్ సామ్రాజ్యం సామ్రాజ్యం లోపెజ్ మిత్రదేశమైన ఉరుగ్వే రిపబ్లిక్ను ఆక్రమించింది. [ఆధారం చూపాలి]), ఇది " పరాగ్వే యుద్ధానికి " ఆరంభం అయింది. రిపబ్లిక్ గ్రాండ్ మార్షల్ " ఫ్రాంసిస్కో సొలానొ లోపెజ్ " నాయకత్వంలో పరాగ్వేయన్లు భయంకరంగా ఎదిరించినప్పటికీ " సొలానొ లోపెజ్ " (1870) మరణంతో పరాగ్వే ఓటమి పాలైంది. ఈ యుద్ధానికి అసలు కారణం లాటిన్ అమెరికన్ చరిత్రలో ఘోరమైనదిగా అంతర్జాతీయంగా వివాదించబడింది. యుద్ధఫలితంగా పరాగ్వేయులకు జరిగిన విపత్తు గురించి వర్ణిస్తూ విలియం డి.రూబిన్స్టీన్ ఇలా వ్రాసాడు: సాధారణ అంచనా, 4,50,000 , 9,00,000 మధ్య ఉన్న పరాగ్వేయన్ జనాభాలో యుద్ధం తరువాత కేవలం 2,20,000 మాత్రమే ప్రాణాలతో మిగిలారు వీరిలో కేవలం 28,000 మంది మత్రమే పురుషులు ఉన్నారు. పరాగ్వే యుద్ధంలో అర్జెంటీనా , బ్రెజిల్ దేశాకు భూభాగాన్ని వదిలి విస్తారంగా నష్టపోయింది.

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Battle of Tuyutí, May 1866.

1869 లో అసున్కియోన్‌ను దెబ్బతీసే సమయంలో, బ్రెజిల్ ఇంపీరియల్ సైన్యం పరాగ్వే నేషనల్ ఆర్కైవ్‌ను " రియో ​​డి జనైరోకు " తరలించింది. బ్రెజిల్ యుద్ధవివరణలను నమోదు చేసింది. ఇది పారాగ్వే చరిత్రను కాలనీ వైపు మళ్ళించింది

20 శతాబ్ధం

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Gran Chaco was the site of the Chaco War (1932–35), in which Bolivia lost most of the disputed territory to Paraguay.

1904లో కొలరాడో పాలనకు వ్యతిరేకంగా లిబరల్ రివల్యూషన్ ఆరంభం అయింది. లిబరల్ ప్రభుత్వం రాజకీయ అస్థిరతల మద్య ప్రారంభం అయింది. 1904 నుండి 1954 మద్య 31 మంది అధ్యక్షులు పరాగ్వేను పాలించారు. వీరిలో చాలా మంది బలవంతంగా తొలగించబడ్డారు. పాలక లిబరల్ పార్టీలో మొదలైన వర్గాల మధ్య విభేదాలు పరాగ్వేయన్ సివిల్ వార్ (1922) దారితీశాయి.

చాకో ప్రాంతంపై బొలీవియాతో పరిష్కరించని సరిహద్దు వివాదం చివరకు 1930 ప్రారంభంలో " చాకో యుద్ధం "గా విస్ఫోటనం చెందింది. గొప్ప నష్టాల తర్వాత పరాగ్వే బొలీవియాను ఓడించి వివాదాస్పదమైన చాకో ప్రాంతంపై తన సార్వభౌమాధికారం ఏర్పాటు చేసింది. యుద్ధం తరువాత లిబరల్ రాజకీయ నాయకుల పట్ల ప్రజల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని సైనిక అధికారులు ప్రభుత్వాధికారాన్ని స్వాధీనం చేసుకునేందుకున్నారు.1936 ఫిబ్రవరి 17 " ఫిబ్రవరి విప్లవం (పరాగ్వే) " తరువాత కల్నల్ రాఫెల్ ఫ్రాంకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1940 , 1948 మధ్య ఈ దేశం జనరల్ " హిగినియో మోరినిగో " చేత పాలించబడింది. అతని పాలనలో అసంతృప్తి ఫలితంగా " పరాగ్వేయన్ సివిల్ వార్ (1947) ప్రారంభం అయింది. తరువాత" ఆల్ఫ్రెడో స్ట్రోస్నేర్" పాలన పట్ల ఏర్పడిన అసంతృప్తి ఫలితంగా 1954 మే 4న నాటి అతని సైనిక కూటమి తిరుగుబాటు చేసింది.

స్ట్రోయస్నర్

1954 లో నియంత " అల్ఫ్రెడో స్ట్రోస్నేర్ " పాలన స్థాపించబడే వరకు వరుసగా అస్థిర ప్రభుత్వాలు పాలన కొనసాగింది. స్ట్రోస్నేర్ పాలనలో పరాగ్వే కొంతవరకూ ఆధునీకరించబడింది అయితే అతని పాలన అత్యధికంగా మానవహక్కుల ఉల్లంఘన జరింగిందని గుర్తించబడింది. 1954 నుండి 1989 వరకు స్ట్రాస్నేర్, కొలరాడో పార్టీ దేశాన్ని పాలించింది. నియంత ఆర్థిక విస్తరణకు మానవ హక్కులు ఉల్లంఘనకు, పర్యావరణ రికార్డును కూడా కలిగి ఉన్నాడు.రాజకీయ ప్రత్యర్థుల హింస, మరణశిక్షకు గురిచేయడం సాధారణంగా జరిగాయి.పదవీచ్యుతి తరువాత "కొలరాడో" కూడా 2008 వరకు జాతీయ రాజకీయాల్లో కొలరాడో ఆధిక్యత కొనసాగింది.

1980 లలో "కొలరాడో" పార్టీలో విడిపోయింది. తరువాత స్ట్రోస్నేర్ వృద్ధాప్యం పాలనావిధానం, ఆర్థిక తిరోగమనం, " అంతర్జాతీయ ఒంటరితనం " 1988 సాధారణ ఎన్నికలకు ముందు పాలన వ్యతిరేక ప్రదర్శనలకు, ప్రతిపక్షాల ప్రకటనలకు ప్రధానకారణాలుగా ఉన్నాయి.[ఆధారం చూపాలి]

1980 రెండవ సగంలో రాడికల్ లిబరల్ పార్టీ నాయకుడు డొమింగో లినో ప్రతిపక్షాల ప్రధానకేంద్రంగా ఉన్నాడు. 1982 లో అతనిని బహిష్కరించడం ద్వారా లినోను వేరుచేయడానికి ప్రభుత్వం చేసిన కృషి వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది. 1986 లో దేశంలోకి ప్రవేశించడానికి తన ఆరవ ప్రయత్నం చేసిన సమయంలో లియోలో యు.ఎస్.నుండి మూడు టెలివిజన్ బృందాలు మాజీ యునైటెడ్ స్టేట్స్ రాయబారి, ఉరుగ్వేయన్, అర్జెంటీనా కాంగ్రెస్ సభ్యులతో తిరిగి పరాగ్వేకు వచ్చాడు. అంతర్జాతీయ వ్యతిరేకత ఉన్నప్పటికీ పోలీసులు లైనోకు తిరిగి రాకుండా నిషేధించారు.[ఆధారం చూపాలి]

స్ట్రాస్నేర్ పాలన ఏప్రిల్ 1987 లో లెనోను అసున్యూయోన్‌కు తిరిగి రావడానికి అనుమతించింది. లెనో ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రదర్శనలను నిర్వహించి అంతర్గత కహాలను తగ్గించడానికి ప్రయత్నించాడు.ప్రతిపక్షాలు ఎన్నికలకు సంబంధించి వ్యూహంపై ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం అయ్యాయి. కొన్ని పార్టీలు ఎన్నికలను అడ్డగించాలని సూచించాయి, ఇతరులు ఓటింగ్ కోసం పిలుపునిచ్చారు. పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో అనేక 'మెరుపు ప్రదర్శనలు' నిర్వహించాయి. పోలీసుల రాకకు అకస్మాత్తుగా నిర్వహించిన ప్రదర్శనలు పోలీసుల రాకకు ముందుగా త్వరితగతిలో రద్దు చేయబడ్డాయి.

ప్రతిపక్షాల చర్యలకు వ్యతిరేకంగా స్ట్రాస్నేర్ చట్టలను నిర్లక్ష్యం చేస్తూ జనరల్ ఎన్నికలను నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నించాడు. కొలరాడో పార్టీ ప్రదర్శనలను అడ్డగించడానికి స్ట్రాస్నేర్ జాతీయ పోలీస్ దళాలను సివిలియన్ విజిలెంస్‌ను ఉపయోగించి పలువురు ప్రతిపక్షనాయకులను ఖైదుచేసి వారిని హింసించాడు.1987 ఫిబ్రవరిలో ప్ల్రా నాయకుడు " హెర్మ్‌స్ రఫీల్ సాగుయర్ " ఖైదు చేయబడి నాలుగుమాసాల కాలం జైలులో ఉంచబడ్డాడు. 1988లో కొరొనెల్ ఒవియేడోలో జరిగిన " నేషనల్ కోర్డినేటింగ్ కమిటీ " సమావేశానికి హాజరైన 200 మంది ఖైదుచేయబడ్డారు. ఎన్నికలకు ముందురోజు వేకువఝామున లెనో, పులువురు ప్రతిపక్షనాయకులు ఖైదుచేయబడి 12 గంటలపాటు నిర్భంధంలో ఉంచబడ్డారు.ప్రభుత్వం స్ట్రాస్నేర్ 89% ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించింది ఎన్నికల ఫలితాలు కొలరాడో గుత్తాధిపత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్షాలు మాస్ మీడియాలో పేర్కొన్నాయి.వారిలో 53% పరాగ్వేయన్ సమాజం అసహనం ఉందని సూచించారు. 74% రాజకీయ పరిస్థితికి మార్పులు అవసరమని, 45% గణనీయమైన లేక మొత్తం మార్పు కావాలని కోరుకున్నారు. చివరగా 31% ఫిబ్రవరి ఎన్నికలలో ఓటు అడ్డగించాలని పేర్కొన్నారు.[ఆధారం చూపాలి]1989 ఫిబ్రవరి 3 న జనరల్ " ఆండ్రెస్ రోడ్రిగ్యూజ్ " నేతృత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటుతో స్ట్రోస్నేర్ తొలగించబడ్డాడు. అధ్యక్షుడిగా రోడ్రిగ్జ్ రాజకీయ, చట్టపరమైన, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి అంతర్జాతీయ సమాజంలో "సంతృప్తిని" పరిచాడు. భూమి కొరకు పరితపిస్తున్న గ్రామీణ పేదలు ఉపయోగంలో లేని స్ట్రోసెనర్, అతని సహచరులకు చెందిన లక్షల ఎకరాలను ఆక్రమించారు. 1990 మధ్యలో 19,000 కుటుంబాలు ఆక్రమించాయి. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.06 మిలియన్ల మంది నివసిస్తున్నారు. పరాగ్వే లోని మొత్తం 4.1 మిలియన్ జనసంఖ్యలో సగానికి పైగా ప్రజలకు స్వంత భూములు లేవు.

పోస్ట్-1989

1992 జూన్ రాజ్యాంగం ప్రభుత్వప్రజాస్వామ్య విధానాన్ని స్థాపించింది. నాటకీయంగా ప్రాథమిక మానవ హక్కుల రక్షణను మెరుగుపరిచింది.1993 మే మాసంలో కొలరాడో పార్టీ అభ్యర్థి " జువాన్ కార్లోస్ వాస్మోసీ " 40 సంవత్సరాల తరువాత పరాగ్వే ప్రజాస్వామ్య విధానంలో ఎన్నిక చేయబడిన మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నుక చేయబడ్డాడు. అంతర్జాతీయ పరిశీలకులు ఈ ఎన్నికలను న్యాయమైన, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలని పేర్కొన్నారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల మద్దతుతో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన సంస్థ, ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మద్దతుతో పరాగ్వేయన్ ప్రజలు ప్రెసిడెంట్ వాస్మోసీను తొలగించడానికి ఆర్మీ చీఫ్ జనరల్ " లినో ఒవియోడో " (1996 ఏప్రిల్) చేసిన ప్రయత్నాన్ని అడ్డగించారు.

1998 ఎన్నికల సందర్భంగా అధ్యక్ష ఎన్నికలలో కొలరాడో అభ్యర్థిగా ఒవియోడో నామినేట్ అయ్యాడు, 1996 తిరుగుబాటు ప్రయత్నం గురించిన ఆరోపణలపై సుప్రీం కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. అతను ఎన్నికలో పోటీ చేయడానికి అనుమతించబడకపోవడమే కాక జైలులో నిర్బంధించబడ్డాడు. తరువాత అతని మాజీ సహచరుడు రౌల్ క్యూబాస్ కొలరాడో పార్టీ అభ్యర్థి అయ్యాడు.అంతర్జాతీయ పరిశీలకులు స్వేచ్ఛాయుతమైనవిగా భావించిన మే ఎన్నికలలో ఎన్నికయ్యారు. ఆగస్టులో పదవీవిరమణ చేసిన తరువాత క్యూబా తొలిసారిగా ఓవియోడో శిక్షను ఉపసంహరించుకోవడం, అతనిని విడుదల చేయడం జరిగింది. 1998 డిసెంబరులో పరాగ్వే సుప్రీం కోర్ట్ ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ గందరగోళ వాతావరణంలో వైస్ ప్రెసిడెంట్, దీర్ఘ-కాల ఓవియోడో ప్రత్యర్థి లూయిస్ మారియా అర్గాన 1999 మార్చి 23న హత్య చేయబడడం తరువాతి రోజున క్యూబాకు ఛాంబర్స్ వివాదానికి దారితీసింది.[ఆధారం చూపాలి]26 మార్చి న ఎనిమిది మంది విద్యార్థి వ్యతిరేక నిరసనకారులు హత్య చేయబడ్డారు.ఈ హత్యలు ఓవైడో మద్దతుదారులచేసెనట్లు ప్రజలు భావించారు. క్యూబస్ అధికరించిన వ్యతిరేకత కారణంగా మార్చి 28న పదవికి రాజీనామా చేసాడు. క్యూబస్ ప్రత్యర్థి సెనేట్ అధ్యక్షుడు " లూయిస్ గోంజలెజ్ మాచి " అధ్యక్షుడిగా శాంతియుతంగా ప్రమాణ స్వీకారం చేశారు.2003 లో నికానోర్ డుర్టే ఫ్రూటోస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2008 సార్వత్రిక ఎన్నికలు కొలరాడో పార్టీకి అనుకూలంగా మారాయి. వారి అభ్యర్థిగా విద్యామంత్రి " బ్లాంకా ఒవెల్లర్ " అద్యక్షపదికి పోటీచేసి పరాగ్వేయన్ చరిత్రలో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసిన మొట్టమొదటి మహిళగా గుర్తించబడింది. అరవై సంవత్సరాల కొలరాడో పాలన తరువాత ఓటర్లు మాజీ రోమన్ కాథలిక్ బిషప్ అయిన " ఫెర్నాండో లూగోను " ఎంచుకున్నారు. ఆయన ప్రభుత్వంలో వృత్తిపరమైన రాజకీయవేత్త కాదు. అతను దక్షిణ అమెరికా సమాజాలలో వివాదాస్పదమైన లిబరేషన్ థియాలజీను అనుసరించాడు. ఆయనకు సెంటర్-కుడి లిబరల్ పార్టీ కొలరాడో పార్టీ సంప్రదాయ ప్రత్యర్థులచే మద్దతు ఉంది.

2008 లుగొ పదవీ స్వీకారం నుండి 2012 పదవీచ్యుతి వరకు

61 సంవత్సరాల కంసర్వేటివ్ పాలనకు ముగింపు పలుకుతూ లోగో అధికారపార్టీ అభ్యర్థిని ఓడించి ఘనవిజయం సాధించి అధ్యక్షపీఠం అలంకరించాడు. లోగో 41% ఓట్లు సాధించగా కొలరాడో పార్టీ అభ్యర్థి " ఒవెలర్ "కు 31% ఓట్లు మాత్రమే వచ్చాయి. అధ్యక్షుడు " " దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగపరంగా , శాంతియుత పద్ధతిలో ప్రభుత్వం ప్రతిపక్ష దళాలకు అధికారాన్ని బదిలీ చేసి " నికానార్ డ్యుయార్టే ఫ్రూటోస్ " ను అధ్యక్షుని చేసింది.ఇది పలువురి ప్రశంసలు అందుకుంది.

2008 ఆగస్టు 15 న ల్యూగో ప్రమాణ స్వీకారం చేశారు. పరాగ్వేయన్ కాంగ్రెస్‌పై రైట్ -వింగ్ అధికారుల ఆధిపత్యం కొనసాగింది. లూగో పరిపాలన అవినీతి , ఆర్థిక అసమానత తగ్గింపుకు ప్రాధాన్యతలను నిర్ణయించింది.

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Inauguration of new President Horacio Cartes, 15 August 2013

లూగో ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరత్వం , అతని మంత్రివర్గంలోని వివాదాలు కొలరాడో పార్టీకి మద్దతుగా పునరుద్ధరణ చేయడానికి ప్రోత్సహం అందించాయి. వివాదాల మధ్య వ్యాపారవేత్త హొరాసియో కార్టీస్ క్రొత్త రాజకీయ శక్తిగా అవతరించాడని నివేదికలు సూచించాయి. కార్టెస్‌మీద యు.ఎస్." డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ " మాదకద్రవ్య అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు బలంగా చేసినప్పటికీ ఆయన రాజకీయ రంగంపై అధ్యధికమైన ప్రజామద్దతుతో అధికారంలో కొనసాగాడు. 2011 జనవరి 14 న కొలరాడో పార్టీ సమావేశం పార్టీకి అధ్యక్ష అభ్యర్థిగా హొరాసియో కార్టీస్ను నామినేట్ చేసినప్పటికీ పార్టీ రాజ్యాంగం దానిని అనుమతించలేదు. [విడమరచి రాయాలి]

2012 జూన్ 12న దిగువ సభలో లూగో ప్రత్యర్ధులు " ఇంపీచెంట్ ఆఫ్ ఫెర్నాండో లూగో " ప్రవేశపెట్టారు. ల్యుగోకు ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో అధికారాన్ని వదిలిపోవాలని గడువు ఇచ్చి రక్షణ ఏర్పరుచుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే ఇవ్వబడింది. ఇంపెచ్మెంట్ త్వరితగతిలో అంగీకరించబడింది. లూగో అధికారం నుండి తొలగించబడి ఉపాధ్యక్షుడు " ఫెడరికో ఫ్రాంకో " అధ్యక్షునిగా నియమించబడ్డాడు. లూగో ప్రత్యర్ధులు సైనిక సంఘర్షణలలో 17 మంది ప్రజలు, 8 మంది పోలీసు అధికారులు , 9 మంది వ్యవసాయదారుల మరణానికి కారణమయ్యాడని లూగోను నిందించారు. లూగో మద్దతు దారులు కాంగ్రెస్ సభ్యులను " రాజకీయ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటు జరిగిందని నిరసలలు తెలియజేసారు. పొరుగున ఉన్న లెఫ్టిస్టు దేశాలు లూగోను తొలగించడం తిరుగుబాటుగా భావించారు. ది ఆర్గనైజేష ఆఫ్ అమెరికన్ స్టేట్స్ ఒక మిషన్‌ను పరాగ్వేకు పంపి సమాచారం సేకరించింది.

భౌగోళికం

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Paraguay map of Köppen climate classification.
పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Landscape in the Gran Chaco, Paraguay

పరాగ్వేను రియో పరాగ్వే రెండు విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో విభజిస్తుంది. తూర్పు ప్రాంతం (రెజియో ఓరియంటల్) ;, పశ్చిమ ప్రాంతం అధికారికంగా వెస్ట్రన్ పరాగ్వే (రెజియాన్ ఓక్సిడెంటల్) అని పిలుస్తారు. గ్రాన్ చాకో లోని భూభాగం చాకో అని కూడా పిలువబడుతుంది. ఈ దేశం దక్షిణంగా 19 °, 28 ° దక్షిణ అక్షాంశం, పొడవు 54 °, 63 ° పశ్చిమ అక్షాంశంలో ఉంది. ఈ పరాగ్వే తూర్పు ప్రాంతంలో గడ్డి మైదానాలు, వృక్షాలతో కూడిన కొండలు ఉన్నాయి. పశ్చిమాన అధికంగా తక్కువతడి కలిగిన చిత్తడి మైదానాలు ఉన్నాయి.

వాతావరణం

పరాగ్వే వాతావరణం ఉష్ణమండల వాతావరణం నుండి ఉపఉష్ణమండల వాతావరణంగా వర్గీకరించబడింది. ఈ ప్రాంతంలోని దేశలో పరాగ్వే మాత్రమే తడి, పొడి కాలాలను కలిగి ఉంటుంది. పరాగ్వే వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో పవనాలు ప్రధానపాత్ర పోషిస్తాయి: అక్టోబరు, మార్చి మధ్య కాలంలో ఉత్తరదిశలో ఉన్న అమెజాన్ నుండి వెచ్చని గాలులు, మే, ఆగస్టు మధ్య కాలం అండీస్ నుండి చల్లని గాలులను వీస్తుంటాయి.

సహజంగా అడ్డగిస్తున్న పర్వత శ్రేణులు లేకపోవడం గాలులను 161కి.మీ వేగవంతం చేయడానికి అనుమతిస్తుంది. ఇది స్వల్ప కాల వ్యవధిలో ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పులు చెందడానికి దారితీస్తుంది. ఏప్రిల్, సెప్టెంబరు మధ్య ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు ఘనీభవన స్థాయికి పడిపోతాయి. జనవరి 28 సగటు ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్ (84 డిగ్రీల ఫారెన్ హీట్) ఉంటుంది.

వర్షపాతం దేశవ్యాప్తంగా నాటకీయంగా మారుతూ ఉంటుంది, తూర్పు భాగాలలో గణనీయమైన వర్షపాతం, పశ్చిమప్రాంతంలో సెమీ-ఆరిడ్ పరిస్థితులు ఉంటాయి. సుదూర తూర్పు అటవీప్రాంతం సగటున 170 సె, మీ. వర్షపాతం ఉంటుంది. పశ్చిమ చాకో ప్రాంతం సాధారణంగా 50 సె.మీ వార్షిక వర్షపాతం ఉంటుంది. పశ్చిమాన వర్షాలు, త్వరగా ఆవిరైపోతాయి ఇది ఈ ప్రాంతం శుష్కతకు దోహదం చేస్తుంది.

ఆర్ధికం

పరాగ్వేలోని స్థూల-ఆర్ధికవ్యవస్థ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ద్రవ్యోల్బణ రేటు చారిత్రాత్మకంగా - 5% సగటుకు తగ్గించింది. (2013 లో, ద్రవ్యోల్బణ రేటు 3.7%) అంతర్జాతీయ నిల్వలు జి.డి.పిలో 20%, బాహ్య జాతీయ రుణం రెండు రెట్లు ఉంది.దేశంలో 8,700 మెగావాట్ల (ప్రస్తుత దేశీయ డిమాండ్ 2,300 మెగావాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పాదన లభిస్తుంది. 1970 నుండి 2013 మద్య వార్షికంగా 7.2% ఆర్థికాభివృద్ధితో దక్షిణ అమెరికన్ దేశాలలో అత్యధిక ఆర్థికాభివృద్ధి చెందిన దేశంగా పెరాగ్వే ప్రత్యేకత సాధించింది. 2010,2013 పరాగ్వే పంట అభివృద్ధి 14.5% నుండి 13.6% చెందిందింది.

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Graphical depiction of Paraguay's product exports in 28 color-coded categories, 2012.

ప్రపంచంలో అత్యధికంగా సోయాబీంస్ ఉత్పత్తిచేసే దేశాలలో పరాగ్వే ఆరవస్థానంలో ఉంది. స్టెవియా ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో, తంగ్ ఆయిల్ ఉత్పత్తిలో ద్వితీయస్థానంలో, మొక్కజొన్న ఉత్పత్తిలో ఆరవస్థానంలో, గోధుమ ఎగుమతిలో 10వ స్థానంలో, గొడ్డుమాసం ఎగుమతిలో ఎనిమిదవ స్థానంలోనూ ఉంది. [ఆధారం చూపాలి] మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద అనధికారిక రంగంతో విభేదించబడింది పొరుగు దేశాలకు దిగుమతి చేసుకున్న వినియోగ వస్తువులను పొరుగున ఉన్న దేశాలకు తిరిగి ఎగుమతి చేయడం, అలాగే వేలకొద్దీ చిరివ్యాపారాలు, పట్టణ వీధి విక్రయాలు మొదలైన కార్యకలాపాలు చురుకుగా సాగుతూ ఉన్నాయి. గత పదేళ్లలో పరాగ్వేయన్ ఆర్థిక వ్యవస్థ నాటకీయంగా విస్తరించింది. విద్యుదుత్పత్తి, ఆటో భాగాలు, వస్త్ర పరిశ్రమలు అధికంగా విస్తరించాయి.

పరాగ్వే ప్రపంచంలోని మూడవ అతి ముఖ్యమైన స్వేచ్ఛావాణిజ్యవిఫణి మండలంగా ఉంది: సియుడాడ్ డెల్ ఎస్టే, మయామి, హాంకాంగ్ అధిగమించింది. [ఆధారం చూపాలి] ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో జనాభాలో ఎక్కువ శాతం వ్యవసాయ కార్యకలాపాల నుండి జీవనభృతిని అందుకుటున్నారు.అనధికారిక రంగం ప్రాముఖ్యత కారణంగా కచ్చితమైన ఆర్థిక ప్రమాణాలు పొందటం అసాధ్యంగా ఉంది. 2003, 2013 మధ్య ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందింది. పరాగ్వే అత్యావసర వ్యవసాయ వస్తువుల ఆధారిత ఎగుమతి విస్తరణకు అధిక ధరలు, అనుకూలమైన వాతావరణం, ప్రపంచంలో వ్యవసాయ వస్తువుల ఆవస్యకత సహకరిస్తున్నాయి. 2012 లో పరాగ్వే ప్రభుత్వం బ్రెజిల్, అర్జెంటీనా దేశాల భాగస్వామ్యం ద్వారా ఆర్థిక, ఉద్యోగాభివృద్ధి వేగవంతం చేయడానికి మెర్కొసర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

పరిశ్రమలు

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
BBVA Paraguay

పరాగ్వే యొక్క మినరల్ పరిశ్రమ దేశం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లో 25%, ఉద్యోగాలలో 31% భాగస్వామ్యం వహిస్తుంది. పరాగ్వే పారిశ్రామిక రంగంలో సిమెంట్, ఇనుప ఖనిజం, ఉక్కు ఉత్పత్తి చేయబడుతూ ఉన్నాయి. ఈ పరిశ్రమల పెరుగుదల మాక్విలా పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తుంది. దేశంలోని తూర్పు భాగంలో పెద్ద పారిశ్రామిక సముదాయాలు ఉన్నాయి. పరాగ్వే దేశానికి పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు కల్పించింది. వారిలో ఒకదానిని "మక్విలా చట్టం" అని పిలుస్తారు. కంపెనీలు పరాగ్వేలోని ఇతర ప్రాంతాలకు మాడానికి అనుమతిస్తుంది.పరిశ్రమలు తక్కువ పన్ను రేట్ల సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. పరాగ్వేలో ఉన్న ఔషధ కంపెనీలు మరెక్కడా లేవు.[ఎప్పుడు?] దేశంలో తయారు చేయబడుతున్న ఔషధాలలో 70% దేశంలో వినియోగించబడుతుంటాయి.మిగిలిన ఔషధాలు ఎగుమతి చేయబడుతున్నాయి. పరాగ్వే త్వరితగతిలో ఔషధాల అవరాలను పూర్తిచేయడానికి విదేశీకంపెనీలను ప్రోత్సహిస్తున్నాయి.[ఆధారం చూపాలి] ఆహారాలలో ఉపయోగించే ఆయిల్, దుస్తులు, ఆర్గానిక్ చక్కెర, మాంసం ఉత్పత్తి, స్టీల్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.[ఆధారం చూపాలి] 2003 లో ఉత్పాదకత జి.డి.పి.లో 13.6% భాగస్వామ్యం వహిస్తూ ఈ రంగం (2000 లో) జనాభాలో 11% మందికి ఉపాధి కల్పిస్తుంది. పరాగ్వే ప్రధానంగా ఆహారం, పానీయాల ఉత్పత్తి మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. వుడ్ ఉత్పత్తులు, కాగితపు ఉత్పత్తులు, చర్మము, బొచ్చు, లోహ ఖనిజ ఉత్పత్తులు కూడా ఉతపత్తి రంగంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. 1990 లలో పారిశ్రామికరంగంలో ఆరంభమైన స్థిరమైన పెరుగుదల (1.2% వార్షికంగా) 2002, 2003 నాటికి వార్షిక వృద్ధిరేటు 2.5%కు పెరిగడానికి పునాది వేసింది.

సాంఘిక వివాదాలు

పరాగ్వే జనసంఖ్యలో 30%-50% ప్రజలు పేదరికం అనుభవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 41.20% మంది కనీస అవసరాలు అవసరమైనంత ఆదాయం లేదు. ఉండవు పట్టణ ఈ సంఖ్య 27.6% ఉంది. జనాభాలో అత్యున్నత ఆదాయం పొదుతున్న 10% ప్రజలకు జాతీయ ఆదాయంలో 43.8% ఆదాయంగా అందుకుంటున్నారు. తక్కువ ఆదాయం అందుకుంటున్న 10% మంది జాతీయ ఆదాయంలో 0.5% ఆదాయంగా అందుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం, ఆదాయం అసమానతలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో 1995 నుండి 1999 మద్య " గినీ కోఎఫిషియంట్ " 0.56 నుండి 0.66 కు పెరిగింది.ఇటీవలి డేటా (2009) 35% పరాగ్వే ప్రజలు పేదవారుగా ఉన్నారని తెలియజేస్తుంది.వీరిలో 19% ప్రజలు కటిక దరిద్రం అనుభవిస్తున్నారని.71% ప్రజలు గ్రామీణప్రాంతాలలో నివసిస్తున్నారని తెలియజేస్తుంది.పరాగ్వే ప్రజలలో 10% మంది ప్రజలు 66% భూమికి యజమానులుగా ఉన్నారు. 30% గ్రామీణప్రజలు భూమిరహితంగా ఉన్నారు. 1989లో స్ట్రోస్నర్ పదవీచ్యుతుడైన తరువాత 19,000 గ్రామీణప్రజలు ఉపయోగంలోలేని లక్షలాది ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు.మునుపటి నియంత ఆయన సంబంధీకులకు ఈ భూములు స్వంతంగా ఉన్నాయి. పలువురు గ్రామీణప్రజలు భూమిరహితంగా ఉన్నారు. ఈ అసమానతలు భూమిరహిత ప్రజలు, భూయజమానుల మద్య అసహనానికి దారితీసాయి.

స్థానిక ప్రజల వివాదాలు

పరాగ్వే స్థానికప్రజలలో అక్షరాస్యత తక్కువగా ఉంది. దేశజనసంఖ్యలో 7.1% ఉన్న వారిలో అక్షరాస్యత 51% ఉంది. స్థానిక ప్రజలలో 2.5% ప్రజలకు సంరక్షిత మంచినీరు లభిస్తుంది. 9.5% స్థానిక ప్రజలకు మాత్రమే విద్యుత్తు సౌకర్యం లభిస్తుంది.

గణాంకాలు

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Paraguay population density (people per km2)

పరాగ్వే జనాభా దేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. తూర్పు ప్రాంతంలో నివసిస్తున్న వారు అధికంగా రాజధాని, అతిపెద్ద నగరమైన " అసున్షియోన్ " నగరంలో నివసిస్తున్నారు. దేశ జనాభాలో 10% మంది ఈప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. " ఆల్టో పరాగ్వే డిపార్ట్మెంట్ , బొకారో డిపార్టుమెంటు ", ప్రెసిడెంటే హేస్ డిపార్ట్మెంట్, దేశభూభాగంలో 60% కలిగి ఉన్న " గ్రాన్ చాకో " ప్రాంతం నివసిస్తున్న జనసంఖ్య 2% కంటే తక్కువగా ఉంది. పరాగ్వేల్లో 56% ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దక్షిణ అమెరికాలో తక్కువగా పట్టణీకరణ చెందిన దేశాలలో పరాగ్వే ఒకటిగా ఉంది.

పరాగ్వే చరిత్రలో ఎక్కువ భాగం వలసదారుల ఆశ్రితదేశంగా ఉంది.ప్రధానంగా తక్కువ జనసాంద్రత కారణంగా, ప్రధానంగా పరాగ్వేయుల యుద్ధం తరువాత జనసంఖ్య పతనం తరువాత విదేశూయులు స్థిరపడడం అధికరించింది.పరాగ్వేలో జపాన్ పరాగ్వేయన్, కొరియన్స్ ఇన్ పరాగ్వే, చైనీస్, లెబనీస్ వలస పరాగ్వే (అరబ్బులు) , పరాగ్వేలోని ఉక్రైనియన్లు, పోలండియన్లు, యూదులు, బ్రెజిలియన్లు, అర్జెంటీనియన్లు స్థిరపడ్డారు. ఈ సమాజాలలో చాలామంది తమ భాషలు, సంస్కృతిని (ప్రత్యేకంగా బ్రెజిలియన్స్) కాపాడుకుంటూ ఉన్నారు. వీరిలో బ్రెజిలియన్లు 4,00,000 ఉన్నారు.సంఖ్యాపరంగా బ్రెజిలియన్లు అతిపెద్ద వలస సమూహంగా గుర్తించబడుతున్నారు. బ్రెజిలియన్ పరాగ్వేప్రజలలో జర్మన్లు, ఇటాలియన్లు, పోలిష్ ప్రజలు అధికంగా ఉన్నారు. ఆఫ్రో ప్రగ్వేయన్లు 63,000 మంది ఉన్నారు.దేశమొత్తం జనసంఖ్యలో వీరు 1% ఉన్నారు.

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A gathering in Caacupé

పరాగ్వేలో నివసిస్తున్న సప్రదాయప్రజల గురించిన అధికారిక గణాంకాలు కాని సర్వేలు కాని లేవు. గణాంకాలలో జాతి, సంప్రదాయ వివరాలు సేకరించబడడం లేదు.2002 గణాంకాల ఆధారంగా స్థానికప్రజలు 1.7% ఉన్నారు. సంప్రదాయంగా పరాగ్వేప్రజలలో మిశ్రిత ప్రజలు (మెస్టిజోలు) అధికంగా ఉన్నారు. హెచ్.ఎల్.ఎ.-డి.ఆర్.బి.ఐ. పాలీమార్ఫిజం అధ్యయనాలు పరాగ్వేయన్, స్పానిష్ సంబంధాలు పారాగ్వేయన్ - గురాని సంబంధం కంటే అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాయి.అధ్యయనాలు పరాగ్వేయన్ సతతిలో స్పెయిన్ ఆధిక్యతచేస్తుందని నిరూపిస్తున్నాయి. పరాగ్వేయన్లలో 95% మెస్టిజోలు, 5% ఇతరులు ఉన్నారు. వీరిలో గిరిజనప్రజలు ఉన్నారు.17 వైవిధ్యమైన సంప్రదాయాలలో 25,000 మంది ప్రజలసంఖ్యతో జర్మనీయన్లు ఆధిక్యత కలిగి ఉన్నారు.వీరు అధికంగా జర్మన్ మాట్లాడే మెనానిటెలుగా గ్రాన్ చాకోలో నివసిస్తున్నారు. జర్మన్ సెటిలర్లు హోహెనావు, ఫిలడెల్ఫియా, న్యూలండ్, ఒబ్లిగాడో, న్యూవేజెర్నియా వంటి అనేక పట్టణాలను స్థాపించారు. పరాగ్వేలోని జర్మన్ వలసలను ప్రోత్సహించే పలు వెబ్‌సైట్లు జర్మన్-బ్రెజిలియన్ సంతతికి చెందిన ప్రజలతో చేర్చి మొత్తం 1,50,000 జర్మన్ పూర్వీకులు మొత్తం పరాగ్వే జనసంఖ్యలో జనాభాలో 5-7% ఉన్నారని పేర్కొన్నాయి.

మతం

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Main Catholic Chapel in Concepción, Paraguay

పరాగ్వేలో రోమన్ కాథలిజం ఆధిక్యత కలిగి ఉంది. 2002 జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 89.9% కాథలిక్కులు, 6.2% మంది ఎవాంజెలిజలిజలియన్లు, 1.1% ఇతర క్రిస్టియన్ విభాగాలు ఉన్నాయని గుర్తించారు. 0.6% ప్రజలు స్థానిక మతాలను ఆచరిస్తున్నారు. రోమన్ కాథలిక్కులలో సువార్త ప్రొటెస్టెంటిజం, ప్రధాన ప్రొటెస్టంట్, జూడిజం (ఆర్థడాక్స్, కన్జర్వేటివ్, రిఫార్మ్), మొర్మోనిజం, బహాయి ఫెయిత్ ప్రధాన మత సమూహాలు ఉన్నాయని భావిస్తున్నారు. " ఆల్టో పరానా "లో మిడిల్ ఈస్టు వలసప్రజలు (ముఖ్యంగా లెబనాన్ నుండి వలస వచ్చిన ముస్లిం సమాజం) , బాక్విరోన్లో ప్రముఖ మెన్నోనిట్ సమాజం గురించి పేర్కొంది.

భాషలు

పరాగ్వే ద్విభాషా దేశంగా గుర్తించబడుతుంది. పారాగ్వేలో స్పానిష్ , గురాని రెండు అధికారిక భాషలుగా ఉన్నాయి. పరాగ్వేలో స్థానిక గ్యురాని సంస్కృతిలో గురాణి భాష ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది సాధారణంగా 95% జనాభాకు అర్థం అవుతుంది. గ్వారని దక్షిణ అమెరికా దేశీయ జాతీయ భాషలలో చివరిది , అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా ఉంది. 2015 గణాంకాల ఆధారంగా జనాభాలో 87% మంది స్పానిష్ మాట్లాడగరరని, గ్వారాని 90% కంటే ఎక్కువ మాట్లాడగలరని లేదా 5.8 మిలియన్ కంటే ఎక్కువ మంది మాట్లాడగలరని భావిస్తున్నారు. గ్రామీణ పరాగ్వేయుల్లో 52% ద్విభాషలు మాట్లాడగలిగిన గురానీ ప్రజలు ఉన్నారు. గ్వారని ఇప్పటికీ విస్తృతంగా మాట్లాడబడుతున్నప్పటికీ స్పానిష్ భాషను సాధారణంగా వ్యాపార, మాధ్యమం, విద్యాసంస్థలో వాడుకలో ఉంది.దక్షిణ అమెరికా " భాషా ఫ్రాంకాస్ "లో ఇది ఒకటిగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

పరాగ్వేలో భాషలు
భాషలు శాతం
గురానీ
  
90%
స్పానిష్
  
87%
పోర్చుగీసు
  
10.7%

సంస్కృతి

పరాగ్వే సాంస్కృతిక వారసత్వం పురుష స్పానిష్ వలసదారులు , స్థానిక " గురని " మహిళలు మధ్య విస్తృతంగా జరిగిన జాత్యాంతర వివాహాలతో సంబంధితమై ఉంది.పరాగ్వే సంస్కృతిని స్పెయిన్‌తో సహా పలు యూరోపియన్ దేశాల సంస్కృతులు అత్యధికంగా ప్రభావితం చేసింది.అందువలన పరాగ్వేయన్ సంస్కృతి రెండు సంస్కృతులు (యురేపియన్ , దక్షిణగరని) , సంప్రదాయాల కలయికగా ఉంది. పరాగ్వేలలో 93% కంటే ఎక్కువమంది " మేస్టిజోస్ " ఉన్నారు.పరాగ్వే లాటిన్ అమెరికాలో సజాతీయ ప్రజలు అత్యధికంగా ఉన్న లాటిన్ అమెరికన్ దేశాలలో మొదటి స్థానంలో ఉంది. ఈ సాంస్కృతిక కలయిక లక్షణం కారణంగా ప్రస్తుతం పరాగ్వే విస్తృతమైన ద్విభాషాసామర్ధ్యం కలిగిన ప్రజలను అధికంగా కలిగి ఉంది. పరాగ్వేయుల్లో 80% కంటే ఎక్కువ మంది స్పానిష్ భాష , స్వదేశీ భాష గురని ధారాళంగా మాట్లాడేసామర్ధ్యం కలిగి ఉన్నారు. గ్వారని , స్పానిష్ మిశ్రమం అయిన జోపారా భాషను కూడా దేశవ్యాప్తంగా మాట్లాడతారు.[ఆధారం చూపాలి]

పరాగ్వే: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Ovecha Ragué Festival

ఈ సాంస్కృతిక కలయిక ఎంబ్రాయిడరీ ( అయో పో ) , లేస్ తయారీ ( నందుతి ) వంటి కళలలో వ్యక్తం ఔతుంది.పరాగ్వే సంగీతం అయిన లిల్టింగ్ పోల్కాస్, బౌన్సీ గెలోపాస్, , గురువానియా (సంగీతం) "స్థానిక శైలిలో (హార్ప్ లో) గానం చేయబడుతుంటాయి.. పరాగ్వే పాకశాస్త్ర వారసత్వం కూడా ఈ సాంస్కృతిక కలయికచే ప్రభావితమౌతూ ఉంది. అనేక ప్రసిద్ధ వంటలలో మేనియాక్, కాసావా(యుకా) ప్రధానమైనవి. కసావా స్థానికంగా ప్రధానమైన పంటగా ఉంది. ఇది వాయవ్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు , మెక్సికో లో కాసావా దుంప అని కూడా పిలుస్తారు. అలాగే దేశీయ పదార్థాలు. ఒక మందపాటి మొక్కజొన్న రొట్టెకు సమానమైన సాప పారాగుయా అనే వంటకం ప్రసిద్ధిమై ఉంది.మరొక ముఖ్యమైన ఆహారాలలో చిప్పా ", బాగెల్ - బ్రెడ్, మాంసం,, చీజ్ ప్రధానమైనవి. అనేక ఇతర వంటలలో వివిధ రకాల చీజ్లు, ఉల్లిపాయలు, గంట మిరియాలు, కాటేజ్ చీజ్, మొక్కజొన్న, పాలు, మసాలాలు, వెన్న, గుడ్లు, తాజా మొక్కజొన్న ప్రధాన్యత కలిగి ఉన్నాయి.

1950, 1960 మద్య కాలంలో కొత్త తరానికి చెందిన పరాగ్వేయన్ నవలా రచయితలు, కవులు జోస్ రికార్డో మసో, రోక్ వాల్లజోస్, నోబెల్ ప్రైజ్ నామినీ అగస్టో రో బస్టోస్ వారు ప్రాబల్యత కలిగి ఉన్నారు. పరాగ్వేలో పలు పరాగ్వేన్ సినిమాలు]] తయారు చేయబడ్డాయి.

కుటుంబం లోపల సంప్రదాయవాద విలువలు ఆధిక్యత కలిగి ఉన్నాయి. దిగువ తరగతులలో గాడ్ పేరెంట్స్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం కలిగిఉంటారు. ఎందుకంటే సాధారణంగా వారిని వారి సాంఘిక స్థితి ఆధారంగా ఎంచుకుంటున్నారు.అదనపు భద్రత కల్పించడానికి వారికి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దీనికి బదులుగా కుటుంబం రక్షణ, పోషణ కోరబడుతుంది.[ఆధారం చూపాలి]

విద్య

యునెస్కో 2008 ఇండెక్స్ ఆధారంగా పరాగ్వే అక్షరాస్యత 93.6%, ప్రజలలో 87.7% పరాగ్వేప్రజలు 5వ గ్రేడ్ పూర్తిచేసారని భావిస్తున్నారు.లింగ ఆధారితంగా అక్షరాస్యత గణాంకాలలో అధికమైన వ్యత్యాసం లేదు. A more recent study 6-12 సంవత్సరాల మద్య విద్యార్థుల పాఠశాల హాజరు సంఖ్య 98% ఉంది.9 సంవత్సరాల నిర్భందవిద్య ఉచితంగా అందజేయబడుతుంది.మాద్య మిక విద్య మూడు సంవత్సరాలు కొనసాగుతుంది.

పరాగ్వే విశ్వవిద్యాలయాలు :-

  • నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ అసంక్షన్ (పబ్లిక్ అండ్ ఫండెడ్ 1889)
  • అటానిమస్ యూనివర్శిటీ ఆఫ్ అసంక్షన్ (పబ్లిక్ అండ్ ఫండెడ్ 1979)
  • యూనివర్సిడాడ్ కాటోలికా న్యూయెస్ట్రా సెనొరా డీ లా అసంక్షన్ (పబ్లిక్ అండ్ చర్చి ఫండెడ్).
  • యూనివర్సిడాడ్ అమెరికానా (ప్రైవేట్)
  • యూనివర్సిడాడ్ డెల్ పసిఫికో (పరాగ్వే) (పబ్లిక్ అండ్ ఫండెడ్ 1991)
  • 2005 గణాంకాల ఆధారంగా మొత్తం విద్యార్థుల ప్రవేశం 88%.

2000 గణాంకాల ఆధారంగా ప్రభుత్వం విద్యకొరకు జి.డి.పి.లో 4.3% వ్యయం చేస్తుంది.

ఆరోగ్యం

2006 గణాంకాల ఆధారంగా పరాగ్వే ప్రజల ఆయుఃప్రమాణం 75 సంవత్సరాలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధారంగా పరాగ్వే అర్జెంటీనా సమానమైన సంపన్నదేశంగా అమెరికాఖండాలలోని సంపన్న దేశాల జాబితాలో 8వ స్థానంలో ఉంది.పరాగ్వే ఆరోగ్యసంరక్షణ కొరకు జి.డి.పి.లో 2.6% వ్యయం చేస్తుంది.ప్రైవేట్ ఆరోగ్యరక్షణ కొరకు 5.1% వ్యయం చేయబడుతుంది. 2005 గణాంకాల ఆధారంగా శిశుమరణాలు 1000:20 ఉంది. 2000 గణాంకాల ఆధారంగా ప్రసవసమయంలో తల్లుల మరణాలు 1000:150.

ప్రపంచ బ్యాంకు పరాగ్వేయన్ ప్రభుత్వం దేశంలో సంభవిస్తున్న తల్లి, శిశు మరణాలను తగ్గించటానికి సహకరించింది.దేశణ్లోని సంతానం పొందే వయసున్న మహిళలకు " మదర్ అండ్ చైల్డ్ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ " (ఎం.సి.బి.ఐ) లో ప్రణాళిక ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించడం లక్ష్యంగా రూపొందించబడింది.ఈ పధకం 6 వయసున్న పిల్లలకు, గర్భవతులకు సహకారం అందిస్తుంది.ఈ పధకం పబ్లిక్ హెల్త్ అండ్ సోషల్ వెల్ఫేర్ యొక్క (MSPBS) నిర్వహణ మంత్రిత్వశాఖను విస్తరించడం అదనంగా కొన్ని ప్రాంతాలలో ఆరోగ్య సేవల నెట్వర్క్ నాణ్యతను, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుని కృషిచేస్తూ ఉంది

వెలుపలి లింకులు

Tags:

పరాగ్వే పేరు వెనుక చరిత్రపరాగ్వే చరిత్రపరాగ్వే భౌగోళికంపరాగ్వే ఆర్ధికంపరాగ్వే గణాంకాలుపరాగ్వే సంస్కృతిపరాగ్వే విద్యపరాగ్వే ఆరోగ్యంపరాగ్వే వెలుపలి లింకులుపరాగ్వేఅర్జెంటీనాబొలీవియాబ్రెజిల్భూపరివేష్టిత దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

సోరియాసిస్Aచైత్ర పూర్ణిమగోత్రాలుదగ్గుబాటి పురంధేశ్వరిటమాటోరామ్ మనోహర్ లోహియావిరాట పర్వము ప్రథమాశ్వాసమువృషభరాశిమంగళవారం (2023 సినిమా)మాగుంట శ్రీనివాసులురెడ్డిఇంద్రుడుతెలుగు కులాలువావిలికాన్సర్విభక్తిYవసంత వెంకట కృష్ణ ప్రసాద్నందమూరి హరికృష్ణభారతీయ తపాలా వ్యవస్థభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ఆలీ (నటుడు)మొదటి ప్రపంచ యుద్ధంశతభిష నక్షత్రముతల్లి తండ్రులు (1970 సినిమా)అమిత్ షాఇల్లాలు (1981 సినిమా)ఆంధ్రజ్యోతిహనుమాన్ చాలీసాయానాంలగ్నంగంగా నదిద్రౌపదిశ్రీశ్రీకావ్యముప్లాస్టిక్ తో ప్రమాదాలురాజమండ్రితెల్ల గులాబీలుయవలుశ్రీ కృష్ణదేవ రాయలుమహేంద్రసింగ్ ధోనివర్షం (సినిమా)ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంనవరసాలుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపటికఅశ్వని నక్షత్రముసురేఖా వాణిగురువు (జ్యోతిషం)ద్వాదశ జ్యోతిర్లింగాలుఅండాశయముశాంతికుమారికిలారి ఆనంద్ పాల్తెలుగు పదాలుపంచారామాలుఆలివ్ నూనెకస్తూరి రంగ రంగా (పాట)పిఠాపురందేవీఅభయంభరణి నక్షత్రముగరుడ పురాణంగజాలాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంహస్త నక్షత్రముఆంధ్రప్రదేశ్ శాసనసభమంతెన సత్యనారాయణ రాజుగూగుల్విష్ణుకుండినులుగౌడఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.రజాకార్తమిళనాడువెల్లలచెరువు రజినీకాంత్ప్రకటన2019 భారత సార్వత్రిక ఎన్నికలువాతావరణంPH🡆 More