ఎల్ సాల్వడోర్: మధ్య అమెరికాలోని ఒక దేశం

ఎల్ సాల్వడార్ (/ɛl ˈsælvədɔːr/ ( listen); Spanish: ), అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ (స్పానిష్: Error: }: text has italic markup (help), సాధారణంగా రిపబ్లిక్ ఆఫ్ ది సాల్వడార్ అంటారు.) మద్య అమెరికాలో ఇది అతి చిన్న, అత్యంత జనసాంధ్రత కలిగిన దేశం.

ఎల్ సాల్వడోర్ దేశరాజధాని నగరం, అతిపెద్ద నగరం " శాన్ సాల్వడార్ " As of 2015, దేశజనసంఖ్య 6.38 మిలియన్లు. వీరిలో యురేపియన్ మెస్టిజోలు అధికసంఖ్యలో ఉన్నారు తరువాత స్థానంలో స్థానిక అమెరికన్ సంతతికి చెందినవారు ఉన్నారు.

Republic of El Salvador

República de El Salvador (Spanish)
Flag of El Salvador
జండా
Coat of arms of El Salvador
Coat of arms
నినాదం: "Dios, Unión, Libertad" (Spanish)
English: "God, Unity, Freedom"
గీతం: Himno Nacional de El Salvador
English: "National Anthem of El Salvador"
Location of El Salvador
రాజధాని
and largest city
San Salvador
13°40′N 89°10′W / 13.667°N 89.167°W / 13.667; -89.167
అధికార భాషలుSpanish
జాతులు
  • 86.3% Mestizo
  • 12.7% White
  • 0.23% Indigenous
  • 0.13% Black
  • 0.64% Other
పిలుచువిధంSalvadoran
Guanaco (Informal)
ప్రభుత్వంUnitary presidential constitutional republic
• President
Salvador Sánchez Cerén
• Vice President
Óscar Ortiz
శాసనవ్యవస్థLegislative Assembly
Independence
• Declared from Spain
15 September 1821
• Declared from the
First Mexican Empire
1 July 1823
• Becomes an independent nation
18 February 1841
విస్తీర్ణం
• మొత్తం
21,041 km2 (8,124 sq mi) (148th)
• నీరు (%)
1.5
జనాభా
• 2015 estimate
6,377,195 (99th)
• జనసాంద్రత
303.1/km2 (785.0/sq mi) (47th)
GDP (PPP)2015 estimate
• Total
$52.666 billion
• Per capita
$8,668
GDP (nominal)2015 estimate
• Total
$28.986 billion
• Per capita
$4,776
జినీ (2013)43.5
medium
హెచ్‌డిఐ (2014)Increase 0.686
medium · 116th
ద్రవ్యంUnited States dollara (USD)
కాల విభాగంUTC−6 (CST)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+503b
ISO 3166 codeSV
Internet TLD.sv
  1. The United States dollar is the currency in use. Financial information can be expressed in U.S. dollars and in Salvadoran colón, but the colón is out of circulation.
  2. Telephone companies (market share): Tigo (45%), Claro (25%), Movistar (24%), Digicel (5.5%), Red (0.5%).

ఎల్ సాల్వడార్‌లో అనేక శతాబ్దాలుగా మెసోమెరికన్ దేశాలకు చెందిన ప్రజలు నివసించారు. ప్రత్యేకించి కుజ్కాటిలెక్స్, అలాగే లెంకా, మయాప్రజలు నివసించేవారు. 16 వ శతాబ్దం ప్రారంభంలో, స్పానిష్ సామ్రాజ్యం ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని మెక్సికో నగరాన్ని పాలనచేస్తున్న న్యూ స్పెయిన్ వైస్రాయల్టీలో భాగంగా చేసింది. 1821 లో ఈ దేశం మొదటి మెక్సికన్ సామ్రాజ్యంలో భాగంగా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది అయినప్పటికీ సెంట్రల్ అమెరికా ఆఫ్ ఫెడరల్‌లో భాగంగా ఉంది. 1823 లో సెంట్రల్ అమెరికా ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్‌ నుండి విడిపోయింది. 1841 వరకు స్వర్వభౌమాధికారం కలిగిన రిపబ్లిక్ ఎల్ సాల్వడార్ స్వల్ప-కాలిక ఉనికి కలిగిన హోండురాస్, నికరాగ్వా దేశాలు భాగంగా ఉన్న యూనియన్ " గ్రేటర్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా "లో 1895 నుండి 1898 వరకు కొనసాగింది.

19 వ శతాబ్దం చివరి నుండి 20 వ శతాబ్దం వరకు ఎల్ సాల్వడోర్ తిరుగుబాట్లు, వారసత్వ పాలకుల ఆధికారం కారణంగా దీర్ఘకాలిక రాజకీయ, ఆర్ధిక అస్థిరతను ఎదుర్కొంది.సామాజిక ఆర్థిక అసమానత, పౌర అశాంతి చివరకు విధ్వంశకరమైన " సాల్వడోర్ సివిల్ వార్ (1979-1992) "కు దారితీసింద. ప్రభుత్వం నేతృత్వంలోని సైన్యం, లెఫ్ట్ వింగ్ గెరిల్లా సమూహాల సంకీర్ణదళాల మధ్య జరిగింది. తరువాత మల్టీపార్టీ కాంసిస్ట్యూషనల్ రిపబ్లిక్ జోక్యంతో అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది.

ఎల్ సాల్వడార్ యొక్క ఆర్ధిక వ్యవస్థను చారిత్రాత్మకంగా వ్యవసాయం ఆధిపత్యం చేస్తుంది. వలసరాజ్య సమయంలో అత్యంత ముఖ్యమైన పంటగా ఇండోగో ప్లాంట్ (స్పెయిన్ లో అనీల్) తో ప్రారంభమైంది. 20వ శతాబ్ధం నాటికి అభివృద్ధి చేయబడిన కాఫీ పంటలో 90% ఎగుమతి చేయబడింది. ఎల్ సాల్వడార్ కాఫీ మీద ఆధారపడడం తగ్గించి ఆర్ధికాభివృద్ధి కొరకు వాణిజ్యం, ఫైనాంషియల్ సంబంధాలను అభివృద్ధి చేయడం, పారిశ్రామిక రంగం మీద దృష్టిసారించింది. 1892 నుండి చెలామణిలో ఉన్న ఎల్ సాల్వడార్ అధికార నాణ్యం " సాల్వడారన్ కోలాన్ " స్థానంలో 2001 నుండి యు.ఎస్.డాలర్ చెలామణిలోకి వచ్చింది. As of 2010, హ్యూమన్ డెవెలెప్మెంట్ జాబితా ఆధారంగా ఎల్ సాల్వడార్ లాటిన్ అమెరికన్ దేశాలలో 12వ స్థానంలో ఉంది. అలాగే మద్య అమెరికా దేశాలలో 4వ స్థానంలో ఉంది. మొదటి మూడుస్థానాలలో పనామా,కోస్టారీకా, బెలిజ్ ఉన్నాయి. అయినప్పటికీ దేశం నిరంతరంగా అసమానత, దారిద్యం, అధికమౌతున్న నేరాలు వంటి సమస్యలతో బాధపడుతుంది.

పేరువెనుక చరిత్ర

అన్వేషకుడు " పెడ్రో అల్వరాడో " తాను కనుగొన్న సరికొత్త ద్వీపానికి క్రీస్తును స్పురించేలా " ఎల్ సాల్వేడర్ " (రక్షకుడు) అని నామకరణం చేసాడు. పూర్తిపేరు (రక్షకుడైన జీసెస్ క్రీస్తు భూమి) అది క్రమంగా (ది సేవియర్) గా మారింది.

చరిత్ర

చరిత్రకాలానికి పూర్వం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Excavation of a Megatherium in the Tomayate site Apopa.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Skull fossil of an ancient-horse in the Tomayate site Apopa.

అపోఫా మున్సిపాలిటీలో టొమేయెట్ అపోహా నదీతీరంలో ఒడ్డున ఉన్న ఒక పాలియాలాజికల్ (శిలాజసహిత)ప్రాంతం. ఈ ప్రాంతంలో సమృద్ధిగా ప్లైస్టోసీన్ యుగంకు చెందినది సాల్వడోర్ మెగాఫౌనా శిలాజాలు ఉన్నాయి.పాలిటియోలాజికల్ (శిలాజసహిత)ప్రాంతం 2000 లో అప్రయత్నంగా కనుగొనబడింది, తరువాతి సంవత్సరంలో ఎల్ సాల్వడోర్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఆఫ్ ఎల్ సాల్వడోర్ ఈప్రాంతంలో నిర్వహించిన త్రవ్వకాలలో పలు కువొరోనియస్ అవశేషాలు మాత్రమే కాక అనేక సకశేరుకాల (ఉభయచరాలు) శిలాజాలు కూడా లభించాయి. టొమేయెట్ ప్రాంతంలో రాక్షస తాబేళ్ళు, మెగాథెరియం, గ్లిప్తోడన్, టొక్డోడాన్, అంతరించిపోతున్న జాతికి చెందిన గుర్రాలు, పాలియో-లాలాస్, ప్రధానంగా ప్రోబేస్సిస్ జెనస్ కువెయోరోనియస్ అస్థిపంజర అవశేషాలతో మొత్తం 19జాతుల శిలాజాలు లభించాయి. టొయాటాట్ ప్రాంతం మద్య అమెరికన్ ప్లైస్టోసీన్ నిక్షేపాల కంటే ప్రత్యేకమైన పాలియాలాజికల్ (శిలాజసహిత)ప్రాంతంగా గుర్తించబడింది.ఇక్కడ లభిస్తున్న అతి పురాతన, సుసంపన్నమైన శిలాజాలు " గ్రేట్ అమెరికన్ ఇంటర్ చేంజ్ " (అమెరికాలో సంభవించిన జీవసంబంధిత మార్పులు) సంబంధిత విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో మద్య అమెరికన్ ఇస్తమస్ ల్యాండ్బ్రిడ్జ్(భూవంతెన) ప్రధానపాత్ర వహించింది. అదే సమయంలో, ఇది సెంట్రల్ అమెరికాలో అత్యంత ధృడమైన సకశేరుక(ఉభయచరాలు) పాలిటియోలాజికల్ ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈప్రాంతం అమెరికాలలో ప్రోపోసిసిడా (బృహత్తర క్షీరదాలు) అహ్యంత అధికసంఖ్యలో సంచరించిన ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Temazcal in Joya de Ceren.

కొలంబియన్ కాలానికి ముందు

ఎల్ సాల్వడోర్లో అధునాతన నాగరికత దేశీయ స్థానికజాతికి లెంకా ప్రజలు స్థావరంగా ప్రసొద్ధి చెందింది.వీరిది ఎల్ సాల్వడోర్లో స్థిరపడిన మొట్టమొదటి, ప్రాచీన దేశీయ నాగరికతగా గుర్తించబడింది .లెంకా ప్రజల తరువాత ఈప్రాంతంలో ఒల్మేక్‌లు స్థావరాలు ఏర్పరచుకుని నివసించారు.చివరికి వీరు కూడా కనుమరుగైపోయినప్పటికీ వీరు వదిలి వెళ్ళిన స్మారక చిహ్నాలు ఎల్ సాల్వడోర్లో ఇప్పటికీ పిరమిడ్ల రూపంలో ఉన్నాయి. ఒల్మేక్స్ స్థానంలో మాయాలు స్థిరపడ్డారు.కానీ ఎల్ సాల్వడార్లో ఉన్న టీ పెద్ద ఇలోపాంగో (అలోపాంగో) అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా వారి సంఖ్య భారీగా క్షీణించింది. శతాబ్ధాల కాలం తరువత మాయాప్రజల స్థానాన్ని నతుయాన్ భాష మాట్లాడే పిపిల్ ప్రజలు భర్తీచేసారు. యురేపియన్లు ఈప్రాంతాన్ని జయించడానికి కొన్న శతాబ్ధాలకు ముందుగా వీరు మెక్సికో నుండి ఈప్రాంతానికి వలస వచ్చారు.వీరు మద్య మద్య అమెరికా, పశ్చిమప్రాంతాలను ఆక్రమించుకున్నారు.పిపిల్ ప్రజలు ఎల్ సాల్వడార్‌లో నివసించిన చివరి స్థానికజాతి ప్రజలుగా భావించబడుతున్నారు. వారు వారి ప్రాంతాన్ని " కుష్కతాన్ " (ఇది ఒక పిల్పిల్ పదం) అని పిలిచారు. ఈ పదానికి " విలువైన ఆభరణాలు " అని అర్ధం. హిస్పానిక్‌భాషలో ఇది కొజ్కతాన్ , కుజ్కాట్లాన్ గా అనువదించబడింది. ఎల్ సాల్వడోర్ ప్రజలను ప్రస్తుతం సాల్వడోరియన్ అని పిలువబడుతున్నారు. కుజ్కత్లెకొ అనే పదం సాల్వడోరియన్ వారసత్వానికి చెందిన సంతతితిని సూచించడానికి ఉపయోగించబడుతుంది.కొలంబియన్ కాలంలో ఈప్రాంతంలో లెంకా ప్రజలతో ఇతర దేశీయజాతులకు చెందిన ప్రజలు కూడా నివసించారు. హిస్పానిక్ ప్రజలు తూర్పుప్రాంతంలోని పర్వతప్రాంతాలలో స్థిరపడ్డారు. ఈప్రాంతంలో స్పానిష్‌లు విజయం సాధించే వరకు కస్కట్టాన్ రాజ్యం అతిపెద్ద రాజ్యంగా ఉంది. ఎల్ సాల్వడార్ తూర్పుతీరంలో మాయనగరికతకు చెందిన ప్రజలు నివసిస్తున్నందున ఎల్ సాల్వడోర్ యొక్క శిధిలాల మూలాలు వివాదాస్పదంగా ఉన్నాయి. అయినప్పటికీ లేక్ గుజ్యా (లాగో డి గుయిజా), సిహుటాన్ చుట్టుప్రక్కల ప్రాంతాలు బహుశా మాయాప్రజలు ఆక్రమించిందని విస్తృతంగా విశ్వసిస్తున్నారు. టాజుమల్, జోయా డి సెరెన్, శాన్ ఆండ్రెస్, ఎల్ సాల్వడార్ వంటి ఇతర శిధిలాలను పిపిల్ లేదా మయ లేదా రెండుతెగలకు చెందిన ప్రజలు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు.

యురేపియన్లు (1522)

1521 నాటికి స్థానిక తెగలకు చెందిన మెసొమెరికన్ ప్రజల సంఖ్య ఈప్రాంతం అంతటా వ్యాపించిన స్మాల్ ఫాక్స్ అంటువ్యాధి కారణంగా గణనీయంగా క్షీణించింది.అయినప్పటికీ ఇది కుజ్కాట్లాన్ ప్రజలను ఆందోళనచెందవలసినంత బాధించలేదు. మద్య అమెరికాలో జైత్రయాత్ర సాగించిన స్పానిష్ అడ్మైరల్ " ఆండ్రెస్ నినో " నాయకత్వంలో ప్రస్తుత ఎల్ సాల్వడోర్ భూభాగంలో మొదటి యురేపియన్లుగా స్పెయిన్ వారు ప్రవేశించారు. 1522 మే 31న ఆయన " గల్ఫ్ ఆఫ్ ఫాంసెకా " లోని మీంగుయారా ద్వీపం (మీంగుయారా డెల్ గొల్ఫొ) ప్రవేశించి ఆప్రాంతానికి " పెట్రోనిలా " అని నామకరణం చేసారు. తరువాత లెంపానదీ ముఖద్వారంలోని " జిక్విలిస్కో బే " చేరుకుని అక్కడ తూర్పు సాల్వడోర్‌కు చెందిన లెంకా స్థానిక తెగకు చెందిన ప్రజలను కలుసుకున్నారు.

కుజ్కాట్లాన్ విజయం (1524–1525)

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Spanish Conquistador Pedro de Alvarado.

1524 లో మెక్సికో విజయయాత్రలో పాల్గొన్న తరువాత పెడ్రో డి అల్వారాడో, అతని సోదరుడు గొంజలో నాయకత్వంలోని స్పానిష్ విజేతలు రియో ​​పాజ్ నది (శాంతి నది) ప్రస్తుతం గౌతమాలా రిపబ్లిక్ లోని ప్రస్తుత ఎల్ సాల్వడోర్ రిపబ్లిక్ చేరుకున్నాడు.దేశీయ పిపిల్ ప్రజలకు గౌతమాలా లేదా మెక్సికోలో కనుగొన్న బంగారం లేదా ఆభరణాలు ఏవీ లేకపోవడం స్పానియర్డ్లను నిరాశపరిచింది. కానీ స్పానియర్డ్లు ఇక్కడ భూమి అగ్నిపర్వత ధూళితో సారవంతంగా ఉండడం గమనించారు.

పెడ్రో డి అల్వారాడో నాయకత్వంలో స్పానిష్ దళాల చొరబాటు జూన్ 1524 లో కస్క్లాతన్ (ఎల్ సాల్వాడార్) దేశం వరకు తమ అధికారాన్ని విస్తరించడానికి దారితీసింది.

ఆయన కుజ్కట్లాన్ రాజ్యపు సరిహద్దుల వద్దకు వచ్చినప్పుడు పౌరులు ఖాళీ చేయడం చూశాడు. కుజ్కాట్లాక్ యోధులు అకాజుట్లా సముద్రతీర నగరానికి తరలివెళ్ళి అక్కడ నుండి అల్వారాడో, అతని దళాలకు వేచి ఉన్నారు.అల్వారాడో మెక్సికో, గౌతమాలా ప్రజలు స్పానియర్డ్లను దేవతలుగా భావించినట్లు కుజ్కాట్లాన్ ప్రజలు కూడా భావిస్తారన్న ఆత్మవిశ్వాసంతో అల్వారాడో తన దళాలతో అక్కడకు చేరుకున్నాడు. తన మెక్సికన్ మిత్రదేశాలు, కుజ్కట్లాన్ పిపిల్ ప్రజలు మాట్లాడేభాష ఒకే పోలికకలో ఉన్న కారణంగా అల్వరాడో ఈ కొత్త దేశీయతెగలకు చెందిన ప్రజలను సులభంగా ఓడించవచ్చని అతను అనుకున్నాడు.

ఎల్ సాల్వడార్ యొక్క స్వదేశీ ప్రజలు స్పానియర్డ్లను దేవతలుగా చూడక విదేశీ ఆక్రమణదారులుగానే భావించారు. అల్వరాడో తన స్పానిష్ సైనికులను, మెక్సికన్ ఇండియన్ సంకీర్ణదళాలను కుజ్కాట్లాన్ దళాలు అధిగమిస్తున్నాడం గమనించి తన సైనికులను వెనుకకు మళ్ళించాడు. కుజ్కాట్లక్ సైన్యం వారిపై దాడి చేసి, యుద్ధ శాలలు, విల్లు బాణాలతో వారిని వెన్నంటారు. అల్వారాడో మనుగడ కోసం పోరాడడం మినహా వేరు మార్గం కనిపించలేదు.[ఆధారం చూపాలి]

ఎల్వారోడో కుజుటెక్లెక్ సైనికులను " రంగురంగుల ఆకర్షణీయమైన ఈకలతో తయారు చేయబడిన షీల్డులతో, బాణాలు, పెద్ద ఈటెలు చొచ్చుకుపోలేని పత్తితో చేసిన మూడంగుళాల కవచం ధరించి ఉన్నారు " అని వర్ణించాడు.రెండు వైపులా సైన్యాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. గాయపడిన అల్వారాడో తన మనుషులను ముఖ్యంగా మెక్సికన్ ఇండియన్ సహాయక సిబ్బందిని కోల్పోయి ఓడిపోయాడు. ఒకసారి అతని సైన్యం పునరుద్దరించబడిన తరువాత అల్వరాడో కుజ్కాట్లాన్ రాజధానికి వెళ్ళి మళ్లీ సాయుధ కూజ్కాట్లాక్ దళాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. పోరాడటానికి శక్తిచాలక శిబిరాలలో దాగిన అల్వరాడో తన స్పానిష్ అశ్వికులను కుజ్కాట్లాన్ రాజధానికి పంపి వారు తమ గుర్రాలను భయపెడుతున్నారో లేదు గమనించమని ఆదేశించాడు. వారి గుర్రాలపై పంపించాడు, వారు గుర్రాలను భయపెడుతున్నారో లేదో చూసేందుకు వారు కుస్కాటిల్లెకు వెళ్లిపోయారు, కాని వారు తిరుగుముఖం పట్టలేదు " అని ఆల్వారోడో హెర్నాన్ కోర్టేజ్‌కు వ్రాసిన లేఖలలో గుర్తుచేసుకున్నాడు.[ఆధారం చూపాలి] కుజ్కాట్లెక్ మళ్లీ దాడి చేసిన సందర్భంలో స్పానిష్ ఆయుధాలను దొంగిలించారు. అల్వారాడో తిరిగి వెళ్లి మెక్సికో ఇండియన్ దూతలను పంపి కుజ్కాట్లెక్ యోధులు దొంగిలించిన ఆయుధాలు తిరిగి అప్పగించి, స్పానిష్ రాజుకు లోగిపోవాలని బెదిరించాడు.కుజ్కాట్లెక్ ప్రతిస్పందించింది "మీరు మీ ఆయుధాలు కావాలనుకుంటే, వచ్చి వాటిని అందుకోండి "అన్నారు. రోజుల గడిచిన నాటికి, అల్వారాడో, ఆకస్మిక దాడికి గురికావచ్చన్న భయంతో మరింత మంది మెక్సికన్ ఇండియన్ దూతలను పంపి చర్చలు జరిపాడు కానీ అల్వరాడో పంపిన ఈ దూతలు తిరిగి రాలేదు. వారు మరణశిక్షకు గురిచేయబడ్డారని భావించారు.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Tazumal ruins in Santa Ana, El Salvador.

స్పానిష్ ప్రయత్నాలు పిప్పిల్, మాయన్ మాట్లాడే పొరుగువారితో చేరిన స్థానిక ప్రజలచే గట్టిగా నిరోధించబడ్డాయి. స్పెయిన్ దేశస్థులను వారు ఓడించి వారి మిత్రదళాలైన మెక్సికన్ త్లస్కాలా ఇండియన్లను గౌతమాలా నుండి ఉపసంహరించుకోవాలని బలవంతం చేసారు. గాయపడిన తర్వాత, ఆల్వారోడో యుద్ధాన్ని విడిచిపెట్టి తన సోదరుడు గొంజలో డే అల్వారాడోను ఈ పనిని కొనసాగించడానికి నియమించాడు. తరువాత జరిగిన రెండు దండయాత్రలు (మొదటి 1525 లో చిన్న సైనిక దళాలతో 1528 లో ) పిపిల్ స్పానిష్ నియంత్రణలో తీసుకు వచ్చాయి.1525లో పిపిల్ కూడా మశూచి ప్రాంతీయ అంటువ్యాధి కారణంగా బలహీనపడడం ఇందుకు ప్రధానకారణంగా ఉంది. 1525 లో కుజ్కాట్లాన్ విజయం పూర్తయ్యింది. తరువాత శాన్ సాల్వడార్ నగరం స్థాపించబడింది. స్పెయిన్‌కు పిపిల్ నుండి చాలా ప్రతిఘటన ఎదురైంది. ఫలితంగా స్పెయిన్ లేన్కాస్ నివసిస్తున్న తూర్పు ఎల్ సాల్వడార్ ప్రాంతాన్ని చేరుకోలేక పోయింది.

1526 లో, పెడ్రో అల్వరాడో మేనల్లుడు అన్వేషకుడు, విజేత " లూయిస్ డే మస్కోసోస్ అల్వరాడో " నాయకత్వంలో " సాన్ మిగ్యుఎల్, ఎల్ సాల్వడార్ " సైనిక నగరాన్ని స్థాపించారు. మయ-లెన్కా యువరాణి " అంతు సిలాన్ ఉలాప్ I " విజేతలను ప్రతిఘటానికి నాయకత్వం వహించిందని. స్థానిక కథనాలు వివరిస్తున్నాయి.

మొస్కోసో దండయాత్ర ద్వారా లెంకా సామ్రాజ్యం అప్రమత్తమైంది.అంతూ సియాన్ గ్రామం నుండి గ్రామానికి ప్రయాణిస్తూ లెంకా పట్టణాలను (ప్రస్తుత ఎల్ సాల్వడార్, హోండురాస్)అన్నింటిని స్పెయిన్‌కు వ్యతిరేకంగా సమైఖ్యం చేసింది. ఆకస్మికదాడులు, అధికసంఖ్యక సైనికుల ద్వారా వారు సాన్ మిగయూల్ నుండి స్పానిషులను వెలుపలకు పంపి ఆయుధాగారాన్ని నాశనం చేయగలిగారు.

పది సంవత్సరాలపాటు శాశ్వత స్థావరాలు నిర్మించకుండా స్పానిష్‌ను లెంకా ప్రజలు నిరోధించారు. అప్పుడు స్పానిష్ మరింత మంది సైనికులతో తిరిగి వచ్చింది. స్పెయిన్ సైనికదళంలో గౌతమాలాకు స్థానిక సమూహాలకు చెందిన సుమారు 2,000 మంది నిర్బంధ సైనిక బలగాలు ఉన్నాయి. వారు లెంకా నాయకులను ఇంటిబుకా పర్వతాలకి పైకి తరలివెళ్ళేలా చేసారు.

అంతు సిలాన్ ఉలాప్ చివరికి స్పానిష్ నిరోధనా బాధ్యతను లెంపిరా (లెంకా పాలకుడు)కు అప్పగించింది.దేశీయ నాయకులలో లెంపిరా విశేషమైన గుర్తింపు కలిగి ఉన్నాడు. స్పానిష్ వారిని అతను స్వాధీనం చేసుకున్న తర్వాత వారి దుస్తులను ధరించి, యుద్ధంలో స్వాధీనం చేసుకున్న వారి ఆయుధాలను ఉపయోగించడం ద్వారా స్పానిష్వారిని హేళన చేసాడు. లెంపిరా ఎల్ సాల్వడార్, హోండురాస్లో యుద్ధంలో చనిపోయేంత వరకు ఆరు సంవత్సరాల పాటు వేలమంది లెంకా దళాల మద్దతుతో పోరాడాడు. మిగిలిన లెంకా దళాలు కొండలలోకి వెళ్ళిపోయాయి. 1537 లో స్పానిష్ వారు శాన్ మిగ్యూల్‌లోని ఆయుధాగార పట్టణాన్ని పునర్నిర్మించగలిగారు.

స్పానిష్ పాలన (1525–1821)

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A painting of the First Independence Movement celebration in San Salvador. At the center, José Matías Delgado.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Manuel José Arce joined the movement for independence from Spain, joining in the first Cry for Independence on November 5, 1811 in San Salvador.

కాలనీల కాలంలోఎల్ సాల్వడార్ గౌతమాలా " కెప్టెంసీ జనరల్ ఆఫ్ గౌతమాలా " లో భాగంగా ఉండేది, దీనిని గౌతమాలా రాజ్యంగా కూడా పిలుస్తారు. ఇది 1609 లో న్యూ స్పెయిన్ ఒక నిర్వాహక విభాగంగా చేయబడింది.సాల్వడార్ భూభాగం శాన్సోనేట్ మేయర్ నిర్వహణలో ఉంది. శాన్ సాల్వేడార్ 1786 లో "ఇంటెండన్సియా"గా స్థాపించబడింది.

1811 చివరినాటికి మద్య అమెరికన్ దేశాలకు స్పానిష్ కిరీటం నుండి స్వాతంత్ర్యం సాధించడం లక్ష్యంగా చేసుకుని అంతర్గత, వెలుపలి ఉవ్యూహాలు రూపొందించబడ్డాయి. దేశం వ్యవహారాలలో స్పెయిన్ అధికారులు జోక్యం చేసుకోకుండా నియంత్రించడం అంతర్గత అధికారుల లక్ష్యంగా మారింది. వెలుపలు సంఘటనలు స్వాతంత్ర్యోద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడ్డాయి. 18 వ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్లవం, అమెరికన్ విప్లవం విజయవంతం కావడం సాల్వడోర్ స్వాతంత్ర్యోద్యమానికి మరికొంత ప్రేరణ కలిగించింది. స్పానిష్ రాజవంశం సైనికశక్తి బలహీనత నెపోలియన్ యుద్ధాలు ఫలితంగా బలహీన పడిన స్పెయిన్ తన కాలనీలను సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలమైంది.

నవంబరు 1811 లో సాల్వడార్ ప్రీస్ట్ " జోస్ మేటిస్ డెల్గాడో " సాన్ సాల్వడార్లోని ఇగ్లేసియా లా మెర్సిడ్ గంటలను కొట్టి స్వాతంత్ర్య ఉద్యమానికి పిలుపు ఇచ్చాడు. ఈ తిరుగుబాటు అణిచివేయబడి దానిలో చాలామంది నాయకులు ఖైదు చేయబడడం, జైలులో శిక్ష విధించడం సంభవించాయి. 1814 లో తిరిగి తలెత్తిన తిరుగుబాటు తిరిగి అణచివేయబడింది

స్వతంత్రం (1821)

1821 లో గౌతమాలాలో నెలకొన్న అశాంతి నేపథ్యంలో స్పానిష్ అధికారులు ప్రస్తుత గౌతమాలా, ఎల్ సాల్వాడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా భూభాగాలను కలిగి ఉన్న " గౌతమాలా కెప్టెన్సీ " విడుదల చేసిన " మద్య అమెరికా స్వాతంత్ర్య చట్టం "లో సంతకం చేశారు. స్పానిష్ పాలన నుండి మెక్సికో చియపాస్ వేరుపడి తనకుతాను స్వతంత్రతను ప్రకటించింది. 1821 లో ఎల్ సాల్వాడార్ కోస్టా రికా,గౌతమాలా, హోండురాస్, నికరాగ్వా సమైక్యమై యూనియన్‌గా ఏర్పడి యూనియన్‌కు " ఫెడరల్ రిపబ్లిక్ అఫ్ సెంట్రల్ అమెరికా " అని పేరు పెట్టారు.

1822 ప్రారంభంలో కొత్తగా స్వతంత్ర పొందిన సెంట్రల్ అమెరికన్ దేశాల అధికారులు గౌతమాలా నగరంలో సమావేశమై అగస్టిన్ డి ఇరుర్బైడ్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన మొట్టమొదటి మెక్సికన్ సామ్రాజ్యంలో చేరడానికి మద్దతుగా ఓటు వేశారు. సెంట్రల్ అమెరికన్ దేశాలకు స్వయంప్రతిపత్తి కల్పించడాన్ని ఎల్ సాల్వడార్ ప్రతిఘటించింది. మెక్సికన్ సైనిక దళం " శాన్ సాల్వడార్ " చేరుకుని నిరసనలను అణిచివేసింది. తరువాత1823 మార్చి 19 లో ఇటుంబైడ్ పతనంతో సైన్యం తిరిగి మెక్సికోకు చేరుకుంది. తరువాత స్వల్పకాలంలో మద్య అమెరికా దేశాల అధికారులు మెక్సికోలో చేరడానికి మద్దతుగా వేసిన ఓటును రద్దు చేశారు. మిగిలిన ఐదు దేశాలు " ఫెడరల్ యూనియన్‌గా " ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. (ఈ పరిస్థితిలో చియాపాస్ మెక్సికోలో శాశ్వతంగా చేరింది).

1841 లో సెంట్రల్ అమెరికా యొక్క ఫెడరల్ రిపబ్లిక్ రద్దు చేయబడిన సమయంలో ఎల్ సాల్వడార్ " గ్రేటర్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా "ను ఏర్పరచడానికి 1896 లో హోండారాస్, నికరాగువాలో చేరేవరకు తన స్వంత ప్రభుత్వాన్ని నిర్వహించింది.తరువాత 1898 లో రద్దు చేసింది.

19 వ శతాబ్దం మధ్య నాటికి, ఆర్థిక వ్యవస్థ కాఫీ అభివృద్ధి మీద ఆధారపడి ఉంది. ప్రపంచ నీలిమందు మార్కెట్‌లో సంభవించిన మార్పుల ప్రభావంలో ప్రపంచ కాఫీ ధరలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. కాఫీ మోనోకల్చర్ ఎగుమతి వలన లభించిన అపరిమితమైన లాభాలు కేవలం కొన్ని కుటుంబాల వరకు పరిమితమయ్యాయి.

20వ శతాబ్ధం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Gen. Tomás Regalado

1898 లో జనరల్ టోమస్ రెగాలోడో బలవంతంగా రాఫెల్ ఆంటొనియో గుతిరేర్జ్‌ను తొలగించి అధ్యక్షపీఠం అధిష్టించి 1903 వరకు పాలనసాగించాడు. తన పదవీవిరమణ తరువాత ఆయనఎల్ సాల్వడార్ సైన్యంలో చురుకుగా పనిచేసాడు. 1906 జూలై 11న ఎల్ జికారోలో వద్ద జరిగిన గౌతమాలా యుద్ధ సమయంలో టోమస్ రెగాలోడో మరణించాడు. 1913 వరకు ఎల్ సాల్వడార్ దేశంలో ప్రజల మద్య అసంతృప్తి నెలకొన్నప్పటికీ రాజకీయంగా స్థిరంగా ఉంది. 1913 లో ప్రెసిడెంట్ డా. మాన్యుఎల్ ఎన్రిక్ అరౌజో చంపబడ్డాడు. ఆయన హత్యవెనుక అనేక రాజకీయ లక్ష్యాలు ప్రేరణగా ఉన్నాయని భావించారు.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Dios, Union, Libertad (God, Unity, Liberty) El Salvador 1912 Flag.

అరెజో పాలన

అరెజో పరిపాలన తరువాత పాలనాబాధ్యతలను చేపట్టిన మెలెండెజ్-క్వినియోన్స్ రాజవంశం పాలన 1913 నుండి 1927 వరకు కొనసాగింది.అధ్యక్షుడు జార్జ్ మెలెండెజ్ తరువాత ప్రభుత్వ మాజీ మంత్రి, రాజవంశానికి విశ్వాసపాత్రుడు అయిన పియో రొమేరో బోస్క్ అధ్యక్షపదవిని స్వీకరించి 1930 లో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను ప్రకటించారు. 1931 మార్చి 1 న ఆర్టురో అరౌజో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికలు దేశంలో మొట్టమొదటిగా స్వేయుతమైన ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. ప్రజలు ఎదురుచూసినట్లు ఆర్థిక సంస్కరణలు, భూమి పునఃపంపిణీ జరగక పోవడం ప్రజలకు అరెజో ప్రభుత్వం పట్ల అసంతృప్తిని కలిగించింది. అరెజో ప్రభుత్వం తొమ్మిది నెలల పాటు కొనసాగిన తరువాత ప్రభుత్వానికి రాజకీయ, ప్రభుత్వ నిర్వహణా అనుభవం లేకపోవడం, ప్రభుత్వ కార్యాలయాలను సమర్థవంతంగా ఉపయోగించడం లేదని ఆరోపించిన జూనియర్ సైనిక అధికారులు అరెజోను పదవి నుండి తొలగించారు.

1931 డిసెంబరు లో, జనరల్ మార్టినెజ్ నేతృత్వంలో జూనియర్ అధికారులు నిర్వహించిన తిరుగుబాటు కార్యక్రమం శాన్ సాల్వడార్ డౌన్‌టౌన్‌లోని నేషనల్ ప్యాలెస్ నుండి రెజిమెంట్ ఆఫ్ ఇన్ఫాంట్రీ ప్రారంభించబడింది. కావల్రీ మొదటి జాతీయ సైన్యము, జాతీయ పోలీస్ మాత్రమే అధ్యక్ష పదవికి మద్దతుగా నిలిచింది. అయినప్పటికీ ఆ రాత్రి జరిగిన కొన్ని గంటల పోరాటం తరువాత అధ్యక్షుని మద్దతుదారులు తిరుగుబాటు దళాలకు లొంగిపోయారు.

మార్టెనెజ్

రోడోల్ఫో డ్యూక్ అని పిలవబడే కమ్యూనిస్ట్ వ్యతిరేక బ్యాంకర్, ఫాసిస్ట్ " మార్టినెజ్ను " అధ్యక్షునిగా నియమించబడ్డాడు. అధ్యక్షుడు అరౌజో కొన్ని నెలలపాటు సైన్యానికి జీతభత్యాలు సమర్పించని కారణంగా సైనికులలో నెకొన్న అసంతృప్తి తిరుగుబాటుకు ప్రధానకారణంగా మారింది. అరౌజో నేషనల్ ప్యాలెస్ను విడిచిపెట్టిన తరువాత తిరుగుబాటును ఓడించడానికి దళాలను నిర్వహించడంలో విఫలమయ్యాడు.

ఎల్ సాల్వడార్లోని యు.ఎస్ మంత్రి డైరెక్టరేట్‌ను కలుసుకున్న తరువాత అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించిన మార్టినెజ్ ప్రభుత్వాన్ని గుర్తించారు. మార్టినెజ్ ప్రభుత్వం ఎన్నికలలో పోటీ చేయటానికి ఆరు నెలల ముందు రాజీనామా చేసి బ్యాలెట్లో ఏకైక అభ్యర్థిగా అధ్యక్ష పదవిని తిరిగి గెలుచుకున్నాడు. ఆయన 1935 నుండి 1939 వరకు, తరువాత 1939 నుండి 1943 వరకు పాలించాడు. అతను 1944 లో నాల్గవసారిగా పదవిని స్వీకరించి జనరల్ స్ట్రైక్ తర్వాత మేలో రాజీనామా చేశాడు. మార్టినెజ్ అతను రాజ్యాంగం గౌరవించి వెళుతున్నాను అనిచెప్పినప్పటికీ తన వాగ్ధానాన్ని విస్మరించాడు.

తిరుగుబాటు ద్వారా 1931 డిసెంబరు నుండి మార్టినెజ్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నాటి నుండి గ్రామీణ నిరోధకత క్రూరమైన అణచివేతకు గురైంది. 1932 ఫిబ్రవరిలో ఫరూబండో మార్టి, అబెల్ కున్కా, యూనివర్శిటీ విద్యార్థులు అల్ఫోన్సో లూనా, మారియో జాపాటా నాయకత్వంలో సాల్వడోర్ రైతు తిరుగుబాటు జరిగింది. ఈ నాయకులు తిరుగుబాటు ప్రణాళికను అమలుచేసే ముందు పట్టుబడ్డారు.తిరుగుబాటుదారులలో కువెంకా మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. ఇతర తిరుగుబాటుదారులను ప్రభుత్వం చంపింది. ఉద్యమ నాయకుల సంగ్రహణ తరువాత, ఈ తిరుగుబాటు అపసవ్యంగా మారడమేకాక మూకలను నియంత్రణ పేరుతో పెద్ద ఎత్తున విస్ఫోటనం సంభవించింది.అద్యక్షుడు మార్టినెజ్ ఆదేశాలతో ప్రభుత్వం సాగించిన అణచివేత చర్యల ఫలితంగా వేలాదిమంది రైతులు చనిపోయారు.తరువాత ఇది లా మతన్జా (ది మాసకర్)గా పిలువబడింది.

కమ్యూనిస్టు పార్టీ

కొన్ని సంవత్సరాల అస్థిర రాజకీయ వాతావరణంలో, సామాజిక కార్యకర్త, విప్లవ నాయకుడు " ఫరాబుండో మార్టి " మద్య అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడానికి సహకరించాడు. ప్రతినిధులలో ఒకరైన ఫరాబుండో మార్టి రెడ్ క్రాస్ సస్థకు ప్రత్యామ్నాయంగా " ఇంటర్నేషనల్ రెడ్ ఎయిడ్ " అనే పేరుతో కమ్యూనిస్ట్ సేవాసంస్థకు నాయకత్వం వహించాడు. పేద, బలహీనమైన సాల్వడారియన్లకు సహాయం చేయడం ద్వారా వారిలో మార్కిస్టు -లెనినిస్ట్ భావజాలం (స్టాలినిజాన్ని గట్టిగా తిరస్కరిస్తుంది) పెంపొందించడం లక్ష్యంగా వారు పనిచేసారు. 1930 డిసెంబరు లో, దేశం యొక్క ఆర్థిక, సామాజిక మాంద్యం శిఖరాగ్రం చేరుకున్న సమయంలో మార్టికి దేశంలోని పేదప్రజల మధ్య అధికరిస్తున్న జనాదరణ కారణంగా దేశం నుండి బహిష్కరించబడ్డాడు.మార్టి తరువాతి సంవత్సరం ప్రెసిడెంట్‌గా నామినేషన్ చేయవచ్చని పుకార్లు వచ్చాయి. 1931 లో ఆర్టురో అరౌజో అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మార్టి ఎల్ సాల్వడార్కు తిరిగి వచ్చాడు. తరువాత అల్ఫోన్సో లూనా, మారియో జాపాతో కలిసి ప్రారంభించిన ఉద్యమాన్ని తరువాత సైన్యం అణిచివేసింది.

తరువాత వారు స్థానిక రైతుల గెరిల్లా తిరుగుబాటుకు సహకరించారు. ప్రభుత్వం ప్రతిస్పందన కారణంగా 1932 లో "సాల్వడోరియన్ రైతుల ఊచకోత "లో 30,000 మంది రైతులు మరణించారు.ఈ ఆందోళనన " లా మతన్జా (ది స్లాటర్)"గా వర్ణించబడింది. మార్టినెజ్‌కు వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటు ప్రారంభమైన పది రోజుల తరువాత సాల్వడార్ సైనిక దళం రంగప్రవేశంతో అణిచివేయబడింది. కాఫీ ధరల పతనం ద్వారా కమ్యూనిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటు కొంత ప్రారంభవిజయం సాధించింది, కాని త్వరలో రక్తప్రవాహ మార్గంలో మునిగిపోయింది. అధ్యక్షుడు మార్టినెజ్ ఓడిపోయిన మార్టిని కాల్చివేయమని ఆదేశాలు జారీ చేసాడు.

చారిత్రకంగా అత్యధికంగా ఉన్న సాల్వడోరియన్ జసాంధ్రత కారణంగా పొరుగున ఉన్న హోండురాస్ ప్రభుత్వాలమద్య ఉద్రిక్తతలు తలెత్తాయి. భూమిలేని పేద సాల్వడోరియన్లు జసాంధ్రత తక్కువగా ఉన్న హొండూరాస్ ప్రాంతాలకు తరలి వెళ్ళి అక్కడ నిరుపయోగమైన, ఉపయోగంలో ఉన్న భూభాగాలలో గుడిసెలు నిర్మించుకుని స్థిరపడ్డారు. ఈ పరిస్థితులు రెండుదేశాలమద్య సంభవించిన " ఫుట్‌బాల్ యుద్ధాలు (1969)"కు ప్రధానకారణంగా మారింది. దాదాపు 1,30,000 మంది సాల్వడోరియన్లు హొండూరాస్ నుండి బలవంతంగా తిరిగి పంపివేయబడ్డారు.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
José Napoleón Duarte.

1960 నుండి 2011 వరకు క్రిస్టియన్ డెమొక్రాటిక్ పార్టీ (పిసిసి), నేషనల్ కన్సిలియేషన్ పార్టీ (PCN) సాల్వడోర్ రాజకీయాలలో చురుకుగా ఉండేవి.2 004లో అధ్యక్ష ఎన్నికలో తగినంత ఓట్లను గెలవడంలో విఫలమైనందుకు ఈ రెండు పార్టీలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత పార్టీలు పునర్నిర్మించబడ్డాయి. విధానాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఒక పార్టీ మధ్యతరగతికి ప్రాతినిథ్యం వహిస్తుంది. రెండవపార్టీ సాల్వడోర్ సైనిక ప్రయోజనాల కొరకు కృషిచేస్తుంది.

మేయర్ ఎన్నికలకు, నేషనల్ అసెంబ్లీకి స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించిన పిడిసి అధ్యక్షుడు " జూలియో అడాల్బెర్టో రివెరా కార్బలో " మూడు మార్లు ఎన్నికలలో విజయం సాధించాడు. 1964 నుండి 1970 వరకు పిడిసి నాయకుడు " జోస్ నెపోలియన్ డ్యూరెట్ " శాన్ సాల్వడార్ మేయర్‌గా నియమించబడ్డాడు. జాతీయ అసెంబ్లీ. 1972 ఎన్నికలలో డ్యుతెర్ నేషనల్ అసోసియేషన్ యూనియన్ (యు.ఎన్.ఒ) తరఫున మాజీ హోంమంత్రి అయిన " కోల్ ఆర్టురో అర్మండో మోలినా "తో అధ్యక్షపదవికి పోటీచేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికలు మోసపూరితంగా భావించబడింది. మోరినా విజేతగా ప్రకటించబడినప్పటికీ డ్యుతర్ చాలా ఓట్లను అందుకున్నట్లు ప్రకటించారు. డ్వార్టే, కొంతమంది సైనిక అధికారుల అభ్యర్ధన తరువాత ఎన్నికల మోసాన్ని నిరసిస్తూ తిరుగుబాటుకు మద్దతిచ్చి పట్టుబడ్డాడు. పట్టుబడిన వారు హింసించబడి బహిష్కరించబడ్డారు. ఇంజనీర్గా వెనిజులాలో ప్రాజెక్టులపై పనిచేసిన తర్వాత 1979 లో డ్యుయార్టే దేశంలోకి తిరిగి వచ్చాడు.

సాల్వడోరన్ అంతర్యుద్ధం (1979–1992)

1979 అక్టోబరులో తిరుగుబాటు ఒప్పందంతో ఎల్ సాల్వడార్ తిరుగుబాటు సైనిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సైనిక ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసి ప్రైవేటు యాజమాన్యంలోని భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ కొత్త సైనికప్రభుత్వం దొంగిలించబడిన డువార్టే ఓట్లను ఎన్నికల ప్రతిస్పందనగా జరుగనున్న విప్లవాత్మక ఉద్యమాన్ని నిలిపివేసింది. సామ్రాజ్యాధినేతలు వ్యవసాయ సంస్కరణను వ్యతిరేకించారు,

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A billboard serving as a reminder of one of many massacres that occurred during the civil war.

యూనియన్ల హక్కుల కోసం పోరాడుతున్న ప్రజల అణచివేత, వ్యవసాయ సంస్కరణలు, మెరుగైన వేతనాలు, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తీకరణ స్వేచ్ఛ కొరకు ప్రజల పోరాటాన్ని సైన్యం నియంత్రణ సాధించలేకపోవడంతో సామ్రాజ్యాధిపత్యానికి ఎదురైన ఒత్తిడి కారణంగా త్వరలోనే జుంటాను రద్దు చేసింది. ఈ సమయంలో, గెరిల్లా ఉద్యమం సాల్వడోర్ సమాజం యొక్క అన్ని రంగాలకు విస్తరించింది. మధ్య, ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం.ఇ.ఆర్.ఎస్. (మోవిమియానో ఈస్టుడియాంటల్ ​​రివల్యూషనరీ డి సెకండరీస్, సెకండరీ స్టూడెంట్స్ రివల్యూషనరీ ఉద్యమం) లో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు ఎ.జి.యు.ఎస్. (అసోసియేషన్ డి ఎస్ట్యూడియెన్స్ యూనివర్సిటరిస్ సాల్వాడోర్నోస్; అసోసియేషన్ ఆఫ్ సాల్వడార్న్ కాలేజీ స్టూడెంట్స్);, కార్మికులు బి.పి.ఆర్ (బ్లోక్ పాపులర్ రివల్యూషియోరియో, పాపులర్ రివల్యూషనరీ బ్లాక్) లో పాల్గొన్నారు. 1980 అక్టోబరు లో, సాల్వడోర్ వామపక్షాల పలు ప్రధాన గెరిల్లా సమూహాలు ఫరపుండ మార్టి lనేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్.ఎం.ఎల్.ఎన్)ను స్థాపించారు. 1970 చివరినాటికి డెత్ స్క్వాడ్ ప్రతిరోజూ 10 మంది చంపారు. ఎఫ్.ఎం.ఎల్.ఎన్‌లో 6,000 - 8,000 క్రియాశీల గెరిల్లాలు, వందల వేల పార్ట్ టైమ్ మిలీషియా, మద్దతుదారులు, సానుభూతిపరులు ఉన్నారు.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
ERP combatants in Perquín, 1990.

రాజకీయ వాతావరణాన్ని మార్చడానికి, వామపక్ష తిరుగుబాటు వ్యాప్తిని ఆపడానికి రెండవ సైనికాధికార ప్రభుత్వం ఏర్పర్చడానికి యు.ఎస్. మద్దతు, ఆర్థిక సహాయం చేసింది. వెనిజులాలో ఈ కొత్త సైనిక దళానికి నాయకత్వం వహించడానికి నెపోలియన్ డ్యూరెట్ తన బహిష్కరణ నుండి పిలిపించబడ్డాడు. ఏదేమైనా, ఒక విప్లవం ఇప్పటికే కొనసాగుతోంది, జుంటా అధిపతిగా తన కొత్త పాత్ర సాధారణ ప్రజలకు అవకాశవాదంగా కనిపించింది. ఆయన తిరుగుబాటు ప్రభావాన్ని నియత్రించలేక పోయాడు. శాన్ సాల్వడార్ ఆర్చ్ బిషప్ మాన్సిగ్నోర్ రోమెరో ప్రభుత్వ దళాలు పౌరులకు వ్యతిరేకంగా చేసిన అన్యాయాలను, మారణకాండను ఖండించారు. అతను "వాయిస్ ఆఫ్ వాయిస్"గా పరిగణించబడ్డాడు, కానీ1980 మార్చి 24 న ఆయన " మాస్ " అని చెప్పినసమయంలో ఆయనను డెత్ స్క్వాడ్ చంపివేసింది.

కొంతమంది దీనిని పూర్తిగా " సాల్వడోర్ సివిల్ వార్ " ప్రారంభంగా పరిగణనలోకి తీసుకున్నారు, ఇది 1980 నుండి 1992 వరకు కొనసాగింది. ఈ సంఘర్షణలో తెలియని వ్యక్తులు "అదృశ్యమైపోయారు ". 75,000 కంటే ఎక్కువ మంది మరణించారని యు.ఎన్. నివేదికలు తెలియజేసాయి. ఎల్ మోజోట్ ఊచకోతకు 800 మంది పౌరులు హత్య చేయబడ్డారు, వాటిలో సగం మంది పిల్లలు ఎల్ కాలాబోసో ఊచకోత, ఎల్ కలాబోసో ఊచకోత, యు.సి.ఎ. స్కాలర్ల హత్య భాగంగా ఉన్నాయి. హత్యాకాండలకు శాల్వడోరియన్ ఆర్మీలో యు.ఎస్.లో శిక్షణ అందుకున్న అట్లకాట్ బెటాలియన్ బాధ్యత వహించింది.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A reconstruction of Radio Venceremos, at the Museo de la Palabra y la Imagen, San Salvador.

1992 జనవరి 16 న, ఎల్ సాల్వడార్ ప్రభుత్వానికి - అల్ఫ్రెడో క్రిస్టియానీ] విలిలోబోస్ జోక్విన్, ఎఫ్ఎల్ఎన్ఎన్‌లు ఐదు గెరిల్లా సమూహాల కమాండర్ షఫీక్ హ్యాండల్, సాల్వడార్ సాంచెజ్ సెరెన్, ఫ్రాన్సిస్కో జోవెల్, ఫెర్మాన్ సీన్ఫుగోస్ ప్రాతినిథ్యంలో ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో జరిగిన " శాతి ఒప్పదం " మీద సంతకం చేసిన తరువాత 12 సంవత్సరాల అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది. ఐక్యరాజ్యసమితి ద్వారా సంతకం చేయబడిన అన్ని శాంతి ఒప్పందాలు. మెక్సికోలోచాపల్ట్పెక్ కాసిల్‌లో జరిగిన ఈ సంఘటన, యు.ఎన్. అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. యుద్ధ విరమణ సంతకం చేసిన తరువాత, ప్రెసిడెంట్ నిలబడి మాజీ గెరిల్లా కమాండర్లతో చేతులు కలిపారు, ఈ చర్య విస్తృతంగా ఆరాధించబడింది.

యుద్ధం తరువాత (1992–ప్రస్తుతం)

" చప్ల్యుటేప్ పీస్ ఒప్పందం " సైన్యం పరిమాణంలో తగ్గింపు, నేషనల్ పోలీస్, ట్రెజరీ పోలీస్, నేషనల్ గార్డ్, సివిలియన్ డిఫెన్స్, పారామిలిటరీ గ్రూపు రద్దు కొరకు ఆదేశాలను జారీచేసింది.తరువాత కొత్తగా సివిల్ పోలీస్ నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది. సాయుధ బలగాలు చేసిన నేరాలకు న్యాయవిచారణ ముగిసింది. ఎల్ సాల్వడోర్ (కమిసియోన్ డి లా వెర్డద్ పారా ఎల్ సాల్వడార్) కమిషన్ సిఫార్సులను సమర్పించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇది 1980 నుండి సంభవించే తీవ్రమైన హింసాత్మక చర్యలను, హింసాత్మక చర్యలు, ప్రభావాలను పరిశీలిస్తుంది. " 1993 లో సంఘర్షణలో రెండు వైపులా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని నివేదికలు తెలియజేసాయి. ఐదు రోజుల తరువాత ఎల్ సాల్వడార్ శాసనసభ తిరుగుబాటు సమయంలో హింసాత్మక చర్యల కొరకు ఒక అమ్నెస్టీ చట్టమును ఆమోదించింది.

1989 నుండి 2004 వరకు సాల్వడోర్ వాసులు నేషనల్ రిపబ్లికన్ అలయన్స్ (ఎ.ఆర్.ఇ.ఎన్.ఎ) పార్టీకి మద్దతు ఇచ్చారు. ఎన్నికలలో ఎ.ఆర్.ఇ.ఎన్.ఎ పార్టీ తరఫున ఆల్ఫ్రెడో క్రిస్టియాని, అర్మండో కాల్డెరోన్ సోల్, ఫ్రాన్సిస్కో ఫ్లోరోస్ పెరెజ్,ఆంటోనియో సకా (2009 వరకు)అధ్యక్షులుగా ఎన్నిక చేయబడ్డారు. 2009 ఎన్నికలలో ఫరూబుండో మార్టి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు (ఎఫ్.ఎం.ఎల్.ఎన్) చెందిన " మారిషియో ఫంసే " అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1990 ల ప్రారంభం నుండి ఆర్ధిక సంస్కరణలు మెరుగైన సాంఘిక పరిస్థితులు, ఎగుమతి రంగం వైవిద్యం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల పెట్టుబడుల లభ్యత వంటి ప్రధానప్రయోజనాలను సమకూరాయి. పెట్టుబడుల లభ్యతకు క్రైమ్ ప్రధాన సమస్యగా మారింది.

ఈ పరిస్థితులు 2001 లో ముగిసింది. ఎ.ఆర్.ఇ.ఎన్.ఎ మద్దతు బలహీనపడింది. ఆర్ఎన్ఎఎలో అంతర్గత సంక్షోభం పార్టీని బలహీనపరిచింది. ఎఫ్.ఎం.ఎల్.ఎన్. యునైటెడ్ పార్టీ మద్దతు విస్తరించింది. అధ్యక్ష ఎన్నికలలో విజయంసాధించడానికి వామపక్ష పార్టీ ప్రయత్నాలు అసఫలం అయ్యాయి. ఎన్నికలో మాజీ గెరిల్లా నాయకుడిని ఓడించి పాత్రికేయుడు ఎంపిక చేయబడ్డాడు. 2009 మార్చి 15న టెలివిజన్ జర్నలిస్ట్ " మారిషియో ఫ్నుస్ " ఫరపుండ మార్టి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్.ఎం.ఎల్.ఎన్) పార్టీ తరఫున అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2009 జూన్ 1న న ఆయన పదవీ బాధ్యతలను ప్రారంభించాడు. గత ప్రభుత్వం నుండి ఆరోపించిన అవినీతి బహిష్కరణ

చేయబడిన సాకా విశ్వాసపాత్రులతో స్వంత పార్టీ " గ్రాన్ అలియాన్ పో లా యునిడాడ్ నాసినాల్ " (నేషనల్ యూనిటీ ఫర్ గ్రాండ్ అలయన్స్) ను స్థాపించి వ్యూహాత్మకంగా ఎఫ్.ఎం.ఎల్.ఎన్.తో చట్టబద్దమైన కూటమిలో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత సాకా స్థాపించిన జి.ఎ.ఎన్.ఎ. పార్టీ ఎఫ్.ఎం.ఎల్.ఎన్. పార్టీకి చట్టపరమైన మెజారిటీని అందించింది. ఫ్యూన్స్ దర్యాప్తు కొనసాగించలేదు. మాజీ అధికారుల అవినీతి సబంధిత న్యాయవిచారణ కొరకు చర్యలు తీసుకోలేదు.

నూతన సహస్రాబ్ది ప్రారంభంలో, ఎల్ సాల్వడోర్ ప్రభుత్వం పర్యావరణ సహజ వనరుల మంత్రిత్వశాఖ (మినిస్ట్రో డి మెడియో ఆంబియన్టే, రికోర్సాస్ నాచురల్స్ ) రూపొందించి జాతీయవిధానంలో సమైఖ్య వాతావరణ మార్పును భాగంగా చేసింది.ఫలితంగా దేశంలో నెలకొంటున్న తీవ్రవాతావరణ ప్రభావాలను నిశితంగా పరిశీలించడానికి వీలు కల్పించబడింది. శీతోష్ణ స్థితి సంబంధిత కార్యక్రమాలకు ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనస్థితి అభివృద్ధి చేయడానికి 2011 లో ఎల్ సాల్వడోర్ ప్రభుత్వం ఒక ప్రణాళికను అమలుచేసింది.

భౌగోళికం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A map of El Salvador.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Meanguera del Golfo is a municipality in the La Unión department of El Salvador, on the island of Meanguera in the Gulf of Fonseca.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Cloud forest El Imposible National Park.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Miramundo rainforest, Chalatenango.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Cerro El Pital in Chalatenango.

ఎల్ సాల్వడార్ సెంట్రల్ అమెరికా అక్షాంశాల మధ్య ఉంది 13 నుండి 15 డిగ్రీల ఉత్తరం అక్షాంశం, పొడవు [87 డిగ్రీల నుండి 91 డిగ్రీల మెరిడియన్ వెస్ట్ మద్య ఉంది. ద్వీపవైశాల్యం 21,041 చ.కి.మీ. అమెరికా ఖండాలలో అతి చిన్నదేశామైన ఎల్ సాల్వడోర్ దేశాన్ని " పుల్గార్సిటో డీ అమెరికా " అని అంటారు. ఎల్ సాల్వడార్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతంగా సెర్రో ఎల్ పిటల్ " గుర్తించబడుతుంది. హోండురాస్ సరిహద్దులో ఉన్న ఈపర్వశిఖరం సముద్రమట్టానికి 8,957 మీ ఎత్తులో ఉంది.ఎల్ సాల్వడార్ అగ్నిపర్వతాల విస్పోటం, భూకంపాల దీర్ఘకాలచరిత్రను కలిగి ఉంది. 1756, 1784 మద్య రాజధాని నగరం శాన్ సాల్వడార్ ధ్వంసం అయింది. 1919, 1982, 1986లలో ఇది మూడుమార్లు భారీవిధ్వంసానికి గురైంది. ఎల్ సాల్వడోర్‌లో ఉన్న 20 కంటే అధికమైన అగ్నిపర్వతాలలో ఇజాల్కొ, శాన్ మైక్యుయెల్ అగ్నిపర్వతాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.19 వ శతాబ్దం నుండి 1950 వరకు ఇజాల్కో పలుమార్లు లావాను వెదజల్లింది. అందువలన దీనిని " లైట్ హౌస్ ఆఫ్ పసిఫిక్ "గా అభివర్ణిస్తుంటారు. ఈపర్వతం నుండి వెలువడే అగ్నికీలలు సముద్రంలో చాలాదూరం వరకు కనిపిస్తుంటుంది.రాత్రివేళలో లావాప్రవహిస్తున్న ఈ పర్వతశిఖరం దేదీప్యమానమైన కోన్‌లా కనిపిస్తుంటుంది.

ఎల్ సాల్వడోర్‌లో దాదాపు 300 నదులు ప్రవహిస్తున్నాయి. విటిలో రియో లెంపా చాలా ప్రధానమైనది. గౌతమాలాలో జన్మించిన రియో లెంపా ఉత్తరపర్వతశ్రేణుల మద్య నుండి మద్య మైదానభూములలో ప్రవహిస్తూ దక్షిణ అగ్నిపర్వత శ్రేణుగుండా ప్రవహించి పసిఫిక్ మహాసముద్రంలో సంగమిస్తుంది.ఎల్ సాల్వడోర్ లో రవాణాకు అనుకూలమైన ఏకైక నది ఇది మాత్రమే. ఈ నది, ఈ నది ఉపనదులు దేశంలో సగభాగానికి అవసరమైన జలాలను అందిస్తున్నాయి.మిగిలిన నదులు తక్కువ పొడవుకలిగి పసిఫిక్ దిగువభూములలో ప్రవహించి పసిఫిక్ సముద్రంలో సంగమిస్తుంటాయి.మరి కొన్ని నదులు మద్యమైదాన భూములలో జన్మించి దక్షిణ అగ్నిపర్వతాలగుండా ప్రవహించి సముద్రంలో సంగమిస్తుంటాయి.వీటిలో గొయాస్క్రాన్, జిబోయా రివర్, టొరోలా రివర్, పాజ్ రివర్, రియో గ్రాండే డీ శాన్ మైక్వెల్ నదులు ప్రధానమైనవి.

ఎల్ సాల్వడార్లో అగ్నిపర్వత క్రేటర్లు ఏర్పరచిన అనేక సరస్సులు ఉన్నాయి. వాటిలో " లేక్ ఇలోపాంగో " (70 చ.కి.మీ), " లేక్ కోట్పేక్ " (26 చ.కి.మీ)సరసులు అతి ముఖ్యమైనవి. ఎల్ సాల్వడోర్ యొక్క అతిపెద్ద సహజసిద్ధమైన సరస్సు " లేక్ గుయిజా " (44 చ.కి.మీ). లెంపా ఆనకట్ట నిర్మాణం ద్వారా అనేక కృత్రిమ సరస్సులు సృష్టించబడ్డాయి. వాటిలో అతిపెద్దది ఎంబాల్సె సెర్రాన్ గ్రాండే (135 చ.కి.మీ). ఎల్ సాల్వడార్ యొక్క సరిహద్దులలో నీటి మొత్తం 125 చ.కి.మీ.

ఎల్ సాల్వడార్ సరిహద్దులో గౌతమాలా, హోండురాస్ దేశాలు ఉన్నాయి. దేశం మొత్తం జాతీయ సరిహద్దు పొడవు 339 మైళ్ళు. గౌతమాలా సరిహద్దు పొడవు 126 మైళ్ళు, హోండురాస్ సరిహద్దు పొడవు 213 మైళ్ళు. పసిఫిక్ సముద్రతీరం పొడవు 191 మైళ్ళు.ఉన్నాయి.

రెండు సమాంతర పర్వత శ్రేణులు పశ్చిమాన ఉన్న ఎల్ సాల్వడార్‌ను వాటి మధ్య కేంద్ర పీఠభూమి ఉంది. అలాగే ఇరుకైన పసిఫిక్ తీరప్రాంతం ఉంది. భౌతికమైన ఈ లక్షణాలు దేశాన్ని రెండు భౌతిక ప్రాంతాలుగా విభజిస్తున్నాయి. ఎల్ సాల్వడోర్ పర్వత శ్రేణులు, కేంద్రీయ పీఠభూమి 85% భూమిని కలిగి ఉంది.మిగిలిన తీరప్రాంత మైదానాలు పసిఫిక్ లోతట్టులుగా సూచించబడుతున్నాయి.

వాతావరణం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
El Salvador's topography.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Corral de Mulas beach, Usulutan.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Los Cobanos beach in Sonsonate.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Sunzal beach, La Libertad, La Libertad.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Pacific sunset at Salinitas beach Sonsonate.

ఎల్ సాల్వడోర్లో ఉష్ణమండల శీతోష్ణస్థితి నెలకొని ఉంటుంది. ప్రధానంగా ఎగువప్రాంతాల ఉష్ణోగ్రతలలో వైవిధ్యం ఉంటుంది. కాలానుగుణ వాతావరణ మార్పులు తక్కువగా ఉంటాయి. పసిఫిక్ లోతట్టులు ఒకేవిధమైన వేడిగా ఉంటాయి. కేంద్ర పీఠభూమి, పర్వత ప్రాంతాలు మరింత ఆహ్లాదరమైన వాతావరణం నెలెకొని ఉంటుంది. వర్షాకాలం మే నుండి అక్టోబరు వరకు కొనసాగుతుంది. దాదాపు వార్షిక వర్షపాతం ఈ కాలంలో జరుగుతుంది. వార్షిక వర్షపాతం ముఖ్యంగా దక్షిణ ముఖంగా ఉన్న పర్వత వాలులలోమి.మి. 2170 కంటే ఎక్కువగా ఉంటుంది.

ఎల్ సాల్వడోర్ సందర్శించడానికి డ్రై సీజన్ ప్రారంభంలో లేదా ముగింపులో అనుకూలంగా ఉంటుంది. సంరక్షిత ప్రాంతాలు, కేంద్ర పీఠభూమిలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ అవసరమైనంతగా వర్షపాతం ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం సాధారణంగా పసిఫిక్ మీద ఏర్పడిన అల్ప పీడనం నుండి వస్తుంది, సాధారణంగా మధ్యాహ్న ఉరుములతో భారీవర్షపాతం ఉంటుంది. అట్లాంటిక్‌లో ఏర్పడిన హరికేన్ మిచ్, మినహాయింపుతో హరికేన్ తరచుగా పసిఫిక్‌లో ఏర్పడుతుంది, అది సెంట్రల్ అమెరికా దాటి ఎల్ సాల్వడోర్ చేరుకుంటుంది.

నవంబరు నుండి ఏప్రిల్ వరకూ, ఈశాన్య పవనాలు వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తాయి. సంవత్సరంలోని ఈ సమయంలో వెరొనొ (వేసవి)గా కొనసాగుతుంది. ఈ నెలలలో కరేబియన్ నుండి ప్రవహించే గాలి హోండురాస్ పర్వతాలను దాటినప్పుడు దాని అవక్షేపణను కోల్పోతుంది. ఈ గాలి ఎల్ సాల్వడార్ చేరుకునే సమయానికి ఇది పొడి, వేడిగా, మబ్బుగా ఉంటుంది. దేశంలోని సుసంపన్నమైన ఉత్తర పర్వత శ్రేణులను మినహాయింపుగా మిగిలిన ప్రాంతంలో వేడి ఉష్ణోగ్రత నెలకొని ఉంటుంది. పర్వప్రాంతాలలో ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. " సెర్రో ఎల్ పిటల్ " సమీపంలో దేశంలోని అతి పొడవైన ఈశాన్య భాగంలో వేసవి మంచులో ఎత్తైన ప్రదేశాలు (ఇది దేశంలోని అతి శీతల భాగం) కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

ప్రకృతి వైపరీత్యాలు

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The caldera of Lake Ilopango Supervolcano.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Coatepeque Caldera.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Usulutan volcano rises above the Pacific coastal plain in El Salvador.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
San Salvador (volcano) El Boqueron Park.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
San Vicente (volcano) Chinchontepec.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Izalco (volcano).

పసిఫిక్ మహాసముద్రంపై ఎల్ సాల్వడార్ ఉపస్థితి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావంగా భారీ వర్షపాతం, తీవ్రమైన కరువులతో " ఎల్ నీనో ", " లా నినా " ప్రభావం చూపుతుంటాయి.తీవ్రమైన అటవీ నిర్మూలన, నేల క్రమక్షయం క్షయం భూములు, అటవీప్రాంతాలకు దెబ్బతినడం, కార్చిచ్చు వంటివి సంభవిస్తుంటాయి. 2001 లో తీవ్రమైన కరువుకారణంగా 80% పంటలు నాశనం అయినకారణంగా తీవ్రమైన కరువు సంభవించింది. 2005 అక్టోబరు 4 న ఘనవర్షాలు ప్రమాదకరమైన వరదలకు, భూపతనం వంటి విపత్తులకు కారణమయ్యాయి.వరదలలో 50 మంది మరణించారు. 2010లో వరదల కారణంగా 100 మిలియన్ల అమెరికన్ డాలర్ల నష్టం సంభవించింది. కరువు మూలంగా కలిగిన నష్టం 38 మిలియన్ల అమెరికన్ డాలర్లు మాత్రమే ఉంది. సెంట్రల్ అమెరికాలో ఎల్ సాల్వడోర్ ఉపస్థితి కరీబియన్ నుండి వచ్చే తీవ్రమైన తుఫానులు, హరికేన్ వంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా ఉంది. 1990 నుండి తుఫానుల తరచుదనం, వ్యవధి అధికరించింది. అలాగే తుఫానుల శైలిలో గుర్తించదగిన మార్పులు సంభవించాయి.అట్లాంటిక్ నుంచి వాయువులు ఎల్ సాల్వడార్‌లో అరుదుగా తుఫాన్ సృష్టిస్తుంటాయి.ఇవి సెప్టెంబరు, అక్టోబరు నెలల వరకు సంభవిస్తుంటాయి. ఏది ఏమయినప్పటికీ, 1990 ల మధ్యకాలం నుంచి అట్లాంటిక్, పసిఫిక్లలో ఈ తుఫానులు తరచుగా సంభవించాయి, ఆ సంవత్సరపు ఆరు వేరువేరు నెలలలో తుఫానులు సంభవించాయి.

భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటాలు

ఎల్ సాల్వెడార్ " పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉంది. అందువలన ఇక్కడ భూకంపం, అగ్నిపర్వతవిస్పోటనం వంటి ప్రకృతివైపరీత్యాలు అధికంగా సంభవిస్తుంటాయి.ప్రధానంగా ఈ ప్రాంతం టెక్టోనిక్ ప్లేట్ ప్రభావితమై ఉంటుంది. ఉదాహరణగా భూకంపం 2013 జనవరి 13న " రిక్టర్ మాగ్నిట్యూడ్ స్కేల్ " 7.7 గా నమోదయింది. భూకంపంలో 800 కంటే ఎక్కువ మంది ప్రజలు మృతి చెందారు. ఒక నెల తరువాత 2001 ఫిబ్రవరి 13 న సంభవించిన మరొక భూకంపం 255 మంది ప్రజల మరణానికి కారణం అయింది.ఈ భూకంకం దేశంలోని 20% నివాసగృహాలను ధ్వంసం చేసింది. అదృష్టవశాత్తూ అనేక కుటుంబాలు భూకంపం వల్ల సంభవించిన భూపతనం నుండి ప్రణాలతో బయటపడ్డారు. శాన్ సాల్వడార్ ప్రాంతంలో 1576, 1659, 1798, 1839, 1854, 1873, 1880, 1917, 1919, 1965, 1986, 2001, 2005 లో భూకంపాలు సంభవించాయి. 1986లో సంభవించిన భూకంపం (5.7 మాగ్నిట్యూడ్) కారణంగా 1,500 మంది ప్రజలు మరణించారు, 10,000 మంది గాయపడ్డారు, 1,00,000 మంది నివాసాలను కోల్పోయారు. ఇటీవలి విధ్వంసక అగ్నిపర్వత విస్ఫోటనంలో 2005 అక్టోబరు 1 ఎల్ సాల్వడోర్ " శాంటా అనా అగ్నిపర్వతం "లో సంభవించిన విస్పోటనంలో బూడిద మేఘం ఏర్పడడం, వేడి మట్టి సమీపంలోని గ్రామాల్లో పడటం, రెండు మరణాలు మొదలైన విపత్తుకు సంభవించాయి. ఈ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన అగ్నిపర్వత విస్ఫోటనం సా.శ.. 5 వ శతాబ్దంలో సంభవించింది. " ఐలోపాగో అగ్నిపర్వతం అగ్నిపర్వత విస్పోటనత సూచిక (6 శక్తి) బలంతో పేలిపోయింది. ఈ విస్పోటనంలో వెలువడిన " పైరోక్లాస్టిక్ ప్రవాహం " కారణంగా వినాశకరమైన మాయా నాగరికత నగరాలు ధ్వంసం అయ్యాయి. శాంటా అనా వాల్కనొ విస్పోటనం ఇటీవలి కాలంలో విస్ఫోటనాలు 1904, 2005 లో సంభవించాయి.భారీ విస్ఫోటనం కారణంగా ఏర్పడిన " కోరేపెక్ కాల్డెరా (లాగో డి కోటేపెక్) (ఎల్ సాల్వడోర్‌లోని సరస్సులలో ఒకటి) కాల్డెరా క్రేటర్లు జలాలతో నిండి సరోవరాలుగా మారాయి.

బ్రిటిష్ " ఇంపీరియల్ కాలేజ్ " ఎల్ సాల్వడార్ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలలో భూకంప-ప్రకంపనాలకు విధ్వంశం కాకుండా నివువగలిగిన భవనాలను నిర్మించటానికి ప్రయత్నిస్తున్నారు.

పర్యావరణ వైవిధ్యం, అంతరించిపోతున్న జతువులు

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The torogoz is El Salvador's national bird.

ఈ ప్రాంతంలో ప్రపంచంలోని సముద్ర తాబేళ్ళ జాతులలో ఎనిమిది జాతులు ఉన్నాయి; వాటిలో ఆరు సెంట్రల్ అమెరికా తీరప్రాంతాల్లో నెస్ట్, నాలుగు సాల్వడోర్‌ తీరంలో వాటి నివాసాలను తయారు చేస్తాయి: లెదర్ బ్యాక్ టార్టిల్స్ (డెర్మొచెలీస్ కొరియాలి), హాక్స్బిల్ తాబేలు (ఎరెమోచేలేస్ ఇంబ్రికాటా), గ్రీన్ సీ తాబేలు (చెలోనియా అగసిజి), [[ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు (లెపిడోచెల్స్ ఒలివేసియా). ఈ నాలుగు జాతులలో ఆలివ్ రిడ్లీ తాబేలు, దాని తరువాత గోధుమ (నలుపు) తాబేలు ఈ ప్రాంతంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇతర రెండు జాతులు, హాక్స్బిల్, లెదర్‌బ్యాక్‌ తాబేలు తీవ్రస్థాయిలో అంతరిచిపోతున్న స్థితిలో ఉన్నాయి. అయితే ఆలివ్ రిడ్లీ, గోధుమ (నలుపు) తాబేలు కొంచం తక్కువస్థాయి ప్రమాదంలో ఉన్నాయి.

ప్రత్భుత్వం సహకారంతో ఇటీవలి కాలంలో కార్యరూపందాల్చిబ పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు దేశం జీవవైవిధ్యం భవిష్యత్తు మీద విశ్వాసం కలుగజేస్తున్నాయి. 1997 లో ప్రభుత్వం " పర్యావరణ, సహజ వనరుల మంత్రిత్వ శాఖను " స్థాపించింది. " జనరల్ ఎంవిరాన్మెంటల్ ఫ్రేంవర్క్ లా " 1999 లో నేషనల్ అసెంబ్లీ ఆమోదం పొందింది. వన్యప్రాణులను రక్షించడానికి ప్రత్యేక చట్టం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. అదనంగా అనేక ప్రభుత్వేతర సేవాసంస్థలు దేశంలోని అత్యంత ప్రాధాన్యతకలిగిన అటవీ ప్రాంతాలను సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎల్ సాల్వడార్ పర్యావరణ అధికారులతో జరిగిన ఒప్పందం అనుసరించి సాల్వ నాచుర సంస్థ " ఎల్ ఇంపాజిబుల్ " (దేశంలోని అతి పెద్ద జాతీయ ఉద్యానవనం) నిర్వహించే బాధ్యతవహిస్తుంది.ఈ ప్రత్నాలతో పర్యావరణ రక్షణకొరకు మరిన్ని జాగ్రత్తలు తీసుకొనవలసిన అవసరం ఉంది.ఎల్ సాల్వడార్లో 500 జాతుల పక్షులు, 1,000 రకాల సీతాకోకచిలుకలు, 400 రకాల పూలమొక్కలు, 800 రకాల వృక్షాలు, 800 జాతుల సముద్రపు చేపలు ఉన్నాయి.

ఆర్ధికం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A proportional representation of El Salvador's exports.

ఎల్ సాల్వడోర్ ఆర్ధిక వ్యవస్థ కొన్నిసార్లు భూకంపాలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల వలన ప్రభుత్వ అనుసరించిన విధానాలలో తప్పనిసరి భారీ ఆర్థిక సబ్సిడీలను ప్రకటించవలసిన అవరం ఏర్పడడం, అధికారిక అవినీతి కారణంగా ఆర్ధికరంగందెబ్బతింటూ ఉంది. 2012 ఏప్రిల్‌లో " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " కేంద్ర ప్రభుత్వంకి 750 మిలియన్ డాలర్ల రుణాన్ని నిలిపి చేసింది. ప్రెసిడెంట్ ఫంసేస్ క్యాబినెట్ చీఫ్" అలెక్స్ సెగోవియా " ఆర్ధిక వ్యవస్థ కూలిపోయే స్థితిలో ఉందని అంగీకరించింది. ఆంటీక్వా కస్కాట్లాన్ తలసరి ఆదాయం దేశంలోని అన్ని నగరాల కంటే అధికంగా ఉంది. ఈ నగరం విదేశీపెట్టుబడులకు కేంద్రంగా ఉంది..[ఆధారం చూపాలి] 2008 లో " పర్చేసింగ్ పవర్ పార్టీ " (పి.పి.పి.)(కొనుగోలు శక్తి) జి.డి.పి.$ 25.895 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.ఆధికరంగంగంలో అత్యంత ప్రాధాన్యత వహిస్తున్న సేవారంగం 64.1% జి.డి.పికి బాధ్యతవహిస్తుంది. తరువాత స్థానంలో ఉన్న పారిశ్రామిక రంగం 24.7% భాగస్వామ్యం వహిస్తుంది (2008 అంచనా). వ్యవసాయం జి.డి.పి.లో 11.2% మాత్రమే బాధ్యత వహిస్తుంది (2010 అంచనా).

1996 లో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వార్షిక సరాసరి వృద్ధిరేటు 3.2%. ప్రభుత్వం స్వేచ్ఛా విఫణి అంగీకరించిన కారణంగా 2007 జి.డి.పి. వృద్ధి రేటు 4.7%.చేరింది. డిసెంబరు 1999 లో నికర అంతర్జాతీయ నిధుల నిల్వలు $ 1.8 బిలియన్ యు.ఎస్.డాలర్లు. ( ఇది సుమారు ఐదు నెలల దిగుమతులను సమం). ఆర్ధికసంక్షోభం కారణంగా సాల్వడోర్ ప్రభుత్వం 2001 జనవరి 1 ద్రవ్య అనుసంధానం ప్రణాళికను చేపట్టింది, దీని ద్వారా యు.ఎస్. డాలర్‌కు సాల్వడార్ కొలోన్‌ తో పాటు చట్టబద్ధత కలుగజేసింది. అలాగే అన్ని అధికారిక ఆర్ధికవ్యవహారాలకు యు.ఎస్.డాలర్లు ఉపయోగించబడ్డాయి. బహిరంగ మార్కెట్ ద్రవ్య విధానాలను అమలు చేయడాన్ని ప్రభుత్వం పరిమితంగా పరిమితం చేసింది. సెప్టెంబరు 2007 నాటికి నికర అంతర్జాతీయ నిల్వ వ్యవస్థ 2.42 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆర్ధికాభివృద్ధికి ఇతర రంగాలను ఎల్.సాల్వడోర్‌కు పెద్ద సవాలుగా మారింది. గతంలో దేశంలో బంగారం, వెండి ఉత్పత్తి చేయబడ్డాయి. మైనింగ్ రంగాన్ని తిరిగి తెరిచేందుకు అధ్యక్షుడు సకా చేసిన ప్రయత్నాలు పసిఫిక్ రిమ్ మైనింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసిన తర్వాత దేశ ఆర్ధిక రంగానికి బిలియన్ల ఆదాయం లభిస్తుందని ఆశ పతనం అయింది.

మిగిలిన కాలనీల మాదిరిగా ఎల్ సాల్వడార్ ఒక మోనో-ఎగుమతి ఆర్థికశక్తిగా పరిగణించబడింది. ఇది చాలా సంవత్సరాలుగా ఒక రకమైన ఎగుమతిపై ఆధారపడింది. వలసరాజ్యాల కాలంలో ఎల్ సాల్వడార్ ఒక అభివృద్ధి చెందుతున్న ఎగుమతి దేశంగా ఇండిగో రంగును ఎగుమతి చేసింది. కానీ 19 వ శతాబ్దంలో కృత్రిమ రంగులు కనుగొనడంతో కొత్తగా ఏర్పడిన ఆధునిక దేశానికి కాఫీ ప్రధాన ఎగుమతిగా మారింది.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
San Miguel is an important economic center of El Salvador and home to the "Carnival of San Miguel", one of the biggest festivals of entertainment and food in Central America.

ప్రభుత్వం ఆదాయాన్ని అభివృద్ధి చేయడానికి పరోక్ష పన్నులపై దృష్టి కేంద్రీకరించింది. 1992 1992 సెప్టెంబరులో అమలుచేసిన 10% విలువ-ఆధారిత పన్ను (స్పానిష్‌లో ఐ.వి.ఎ.) 1995 జూలై నాటికి 13%కు పెరిగింది.

ద్రవ్యోల్బణం నిలకడగా ఉండడమేగాక ఈ ప్రాంతంలో అతి తక్కువగా ఉంది. 1997 నుండి ద్రవ్యోల్బణం సగటున 3%, ఇటీవలి సంవత్సరాలలో 5% అధికరించింది. 2000-2006 మధ్యకాలంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ఫలితంగా మొత్తం ఎగుమతులు 2.94 బిలియన్ డాలర్ల నుండి 3.51 బిలియన్ డాలర్లకు అధికరించాయి. మొత్తం దిగుమతులు 4.95 బిలియన్ డాలర్ల నుంచి 7.63 బిలియన్ డాలర్లకు అధికరించాయి. ఫలితంగా వాణిజ్యం 102% అభివృద్ధి చెందింది

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
El Chorreron, El Salvador; tourism is the fastest-growing sector of the Salvadoran economy.

ఎల్ సాల్వడార్ ఓపెన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంటును ప్రోత్సహించింది. అలాగే ప్రైవేటీకరణ కార్యంరమాలను టెలీకమ్యూనికేషన్స్, విద్యుత్ పంపిణీ, బ్యాంకింగ్, పెన్షన్ ఫండ్లకు విస్తరించింది.దేశ ఉత్తరప్రాంతంలో పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చేసుకుని 2006 చివరలో ప్రభుత్వం, " మిలీనియం ఛాలెంజ్ కార్పోరేషన్ " ఐదు సంవత్సరాల 461 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పదం మీద సంతకాలు చేసాయి. పౌర యుద్ధ సమయంలో ప్రాథమిక యుద్ధభూమిగా ఉన్న దేశం ఉత్తర ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించడం, విద్యాభివృద్ధి, ప్రజా సేవల అభివృద్ధి, వాణిజ్యసంస్థల అభివృద్ధి, రవాణా సౌకర్యాల అభివృద్ధి లక్ష్యంగా ఈ ఒప్పందం రూపొందించబడింది. 2001 లో కరెన్సీగా యు.ఎస్.డాలర్ స్వీకరించడంతో ఎల్ సాల్వడార్ ద్రవ్య విధాన నియంత్రణను కోల్పోయింది. ఏ విధమైన అంతర్జాతీయ ఫైనాన్సింగ్ విధానం ఆమోదించడానికి మూడింట రెండు వంతుల లెజిస్లేటివ్ మెజారిటీకి అవసరమౌతుంది.

Exports to Imports from
Country % Country %
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  United States 66% ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  United States 43.4%
Caribbean 26% ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  Guatemala 8.2%
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  Mexico 1% ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  Mexico 7.8%
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  Spain 1% Europe 7.0%
Others 6% Others 33.6%

విదేశీధనసహాయం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Torre Cuscatlan bank building.

ఎల్ సాల్వడార్ తలసరి చెల్లింపులలో ఈ ప్రాంతంలో ప్రథమస్థానంలో ఉంది. దేశానికి చేరుతున్న ద్రవ్యం మొత్తం ఎగుమతుల ఆదాయానికి సమానంగా ఉంది. కుటుంబ ఆదాయంలో మూడోవంతు విదేశీద్రవ్యం రూపంలో లభిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తున్న ఎల్ సాల్వడోర్ పౌరులు ఎల్ సాల్వడార్‌లోని నివసిస్తున్న కుటుంబ సభ్యులకు పంపిన ద్రవ్యం మొత్తం $ 4.12 బిలియన్ల ఉంటుంది. ఇది గణనీయంగా వాణిజ్య లోటును అధిగమిస్తున్నాయి. గత దశాబ్దంలో చెల్లింపులు నిలకడగా పెరిగాయి 2006 లో మొత్తం 3.32 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నాయి (అంతకు ముందు సంవత్సరం కంటే 17% పెరిగింది). ఇది దేశ జి.డి.పి.లో దాదాపు 16.2% ఉంది. దేశానికి చేరుతున్న విదేశీద్రవ్యం అనుకూల, ప్రతికీల ప్రభావం చూపుతుంది.2005లో సాల్వడోర్ ప్రజలలో 20% దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ఆధారంగా విదేశీనుండి ద్రవ్యం అందని పేదరికంలో నివసిస్తున్న సాల్వడోర్యన్ల శాతం 37% ఉంటుందని భావిస్తున్నారు.సాల్వడోర్ విద్య స్థాయి అధికరించింది.నైపుణ్యాలు లేదా ఉత్పాదకత కంటే వేగంగా వేతనం ఎదురుచూపులు అధికరించాయి. ఉదాహరణకు, కొంతమంది సాల్వడోర్యన్లు ఇకపై విదేశాల్లోని కుటుంబ సభ్యుల నుండి నెలవారీగా వారు పొందుతున్న దానికంటే తక్కువగా చెల్లించే ఉద్యోగాలను తీసుకోవడానికి ఇష్టపడడంలేదు. ఫలితంగా హోండారన్లు, నికారాగువాన్ల తకిఉవ వేతన వేతనం తీసుకుని పనిచేయడానికి సిద్ధపడుతూ ప్రవాహంలా వచ్చి చేరుతున్నారు. స్థానికులు పెట్టుబడిరంగంలో ఆసక్తిచూపడం అధికరించింది.

విదేశీద్రవ్యం అధికరించడం కారణంగా రియల్ ఎస్టేట్ వంటి కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. చాలా ఎక్కువ వేతనాలతో, చాలామంది విదేశాలలో ఉన్న సాల్వడోర్యన్లు సాల్వడోద్‌లోని గృహాలను కొనుగోలు చేయడానికి సాల్వడోర్‌లో నివసిస్తున్న ప్రజలకంటే అధిక ధరలను చెల్లించగలిగిన స్థాయికి చేరుకున్నారు. అందువలన సాల్వడార్ వాసులందరూ కూడా అధికథరలు చెల్లించి నివాసగృహాలను కొనుగోలుచేయవలసిన అగత్యం ఏర్పడుతుంది.

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Torre Futura at World Trade Center San Salvador.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Centro Financiero Gigante building
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Torre Roble building of Grupo Roble

2006 లో సెంట్రల్ అమెరికా-డొమినికన్ రిపబ్లిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను ఆమోదించిన మొదటి దేశం ఎల్ సాల్వడార్. 2005 లో మల్టీ-ఫైబర్ ఒప్పందం ముగియనున్న తరుణంలో ఆసియా పోటీని ఎదుర్కొనడానికి సి.ఎ.ఎఫ్.టి.ఎ. ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర, ఇథనాల్ ఎగుమతులను ప్రోత్సహిస్తూ తయారీ దుస్తులు రంగానికి మద్దతు అందించింది. దుస్తులు రంగం పోటీతత్వం క్షీణించిన మునుపటి ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను ప్రాంతీయ పంపిణీ, లాజిస్టిక్స్ కేంద్రంగా ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను పన్ను ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను విస్తరించాలని ప్రయత్నించింది.

ఎల్ సాల్వడార్లో మొత్తం 15 స్వేచ్ఛా వాణిజ్య మండలాలు ఉన్నాయి. ఎల్ సాల్వడార్ 2004 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలిసి మధ్య అమెరికా, డొమినికన్ రిపబ్లిక్ల ఐదు దేశాలచే సంతకం చేయబడిన సెంట్రల్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (సి.ఎ.ఎఫ్.టి.ఎ)మీద సంతకం చేసింది.సాల్వడోర్ ప్రభుత్వం " స్వేచ్చాయుత వాణిజ్యం " అభివృద్ధి చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించాలని సి.ఎ.ఎఫ్.టి.ఎ ఎల్ సాల్వడోర్ ప్రభుత్వాన్ని కోరుతుంది. ఎల్ సాల్వడార్ మెక్సికో, చిలీ, డొమినికన్ రిపబ్లిక్, పనామాతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు సంతకం చేసి, ఆ దేశాలతో వ్యాపారాన్ని అధికరించింది. ఎల్ సాల్వడార్ గౌతమాలా, హోండురాస్, నికరాగ్వా, కెనడాతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కొరకు చర్చలు చేస్తుంది. 2007 అక్టోబరులో ఈ నాలుగు దేశాలు, కోస్టారీకా యూరోపియన్ యూనియన్‌తో ఉచిత వాణిజ్య ఒప్పందం చర్చలు ప్రారంభించాయి. కొలంబియాతో ఉచిత వాణిజ్య ఒప్పందం కొరకు 2006 లో చర్చలు ప్రారంభమయ్యాయి.

విదేశీ పెట్టుబడులు

2009 లో ఎన్నికలలో అరేనా ఓటమి గురించిన విశ్లేషణలో శాన్ సాల్వడార్లోని యు.ఎస్. ఎంబసీ సకా పరిపాలనలో అధికారిక అవినీతిని జరిగిందని బహిరంగంగా సూచించింది. ARENA ప్రభుత్వానికి ప్రజలు బహిరంగంగా తిరస్కరించడం కొనసాగించారు. వికిలీక్స్ బహిరంగంగా చేసిన ఒక రహస్య దౌత్య సమాచార సేఇఅరణ ఆధారంగా "సాల్వడార్ ప్రజలు రాజకీయవేత్తల స్వీయ-సేవల ప్రవర్తనకు గాయపడ్డారు. అరేనా పాలనలో సాకా, ఆయన మనుషులు తమ సంపదలను అభివృద్ధి చేసుకోవడానికి స్థానాలను ఉపయోగించినట్లు ప్రజలు విస్తృతంగా భావించారు.అరెనా వ్యవస్థాపకుడు రాబర్టో డి'యుబుసినంబ్ కుమారుడు అరెనా డిప్యూటీ రాబర్టో డి'యుబుసుసన్, ఒక అమెరికా దౌత్యవేత్తకి మంజూరుచేయబడిన పబ్లిక్ వర్క్స్ మంత్రివర్గం ప్రభుత్వ కాంట్రాక్ట్ కిక్బాక్స్ పథకాన్ని సాకా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నాడు. ఈ కేసు పత్రికా ప్రకటనలో వెల్లడైంది, ఇంకా US వ్యాపార వనరుల ఆధారంగా సాకా పాలన చట్టాలు సకా కుటుంబం వ్యాపార ప్రయోజనాలకు లబ్ది చేకూర్చే ఉద్దేశ్యంతో రూపొందించి నిబంధనలను అమలుచేసింది "అని తెలియజేసింది. ఫ్యూన్ ప్రభుత్వ పాలనలో ఎల్ సాల్వడోర్ విదేశీ పెట్టుబడులు అధికరించాయి.2014 లో ప్రపంచ బ్యాంక్ " ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ " (వ్యాపారం చేయడానికి అనువైన దేశాల జాబితాలో ఎల్ సాల్వడోర్ 109వ స్థానంలో ఉంది. బెలిజె 118 వ స్థాంలో, నికరాగ్వా 119వ స్థానంలో ఉన్నాయి. విదేశీ పెట్టుబడిలో స్పెయిన్ థింక్ ట్యాంక్ ఆధారంగా "శాంటాండర్ ట్రేడ్, ఎల్ సాల్వడోర్ విదేశీ పెట్టుబడులు గత కొన్ని సంవత్సరాలలో క్రమంగా అభివృద్ధిచెందాయి. 2013 లో ఎఫ్‌డిఐ ప్రవాహం అధికరించింది. అయినప్పటికీ మద్య అమెరికా దేశాలకంటే ఎల్ సాల్వడోర్ విదేశీపెట్టుబడులు తక్కుగగా ఉన్నాయి. వ్యాపార వాతావరణం మెరుగుపరుచుకోవడంలో ప్రభుత్వం తగినంత పురోగతి సాధించలేదు.అదనంగా పరిమితమైన దేశీయ మార్కెట్, బలహీనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంస్థల బలహీనత అలాగే అధిక స్థాయిలో ఉన్న నేరస్తులు పెట్టుబడిదారులకు నిజమైన అడ్డంకులుగా ఉన్నాయి.ఎల్ సాల్వడార్ వ్యాపార పన్నుల విషయంలో దక్షిణ అమెరికాలో అత్యంత "వ్యాపార స్నేహపూర్వక" దేశం. ఇది యువ, నిపుణులైన కార్మిక శక్తి, వ్యూహాత్మక భౌగోళిక స్థానం కలిగి ఉంది.డిఆర్-సి.ఎ.ఎఫ్.టి.ఎ.లో దేశానికి సభ్యత్వం ఉంది. అలాగే సి4 దేశాలకు (పత్తి నిర్మాతలు) ఏకీకరణ అనేది ఎఫ్డిఐ పెరుగుదలకు దారి తీస్తుంది. సాల్వడార్ ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ వాణిజ్య ట్రిబ్యునల్స్ పూర్తిగా వ్యతిరేకించినందున విదేశీ కంపెనీలు మధ్యవర్తిత్వం వహించాయి. 2008 లో ఎల్ సాల్వడార్ ఇటలీ ఎనెల్ గ్రీన్ పవర్‌కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. సాల్వడోర్ ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రిక్ కంపెనీల తరఫున ఎనేల్ పెట్టుబడి పెట్టిన " జియో థర్మల్ ప్రాజెక్ట్ (భూతాపం ప్రాజెక్టు) కొరకు ఎనెల్ సాల్వడార్‌కు వ్యతిరేకంగా ఎనేల్ మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటుంది అని సూచించబడింది.ఎనేల్ పెట్టుబడిని పూర్తి చేయకుండా నిరోధించే పరిష్కరించబడని సాంకేతిక సమస్యల ఎనేల్ ప్రభుత్వాన్ని నిందించింది. రాజ్యాంగంలోని ఆర్ట్ 109 ఏ ప్రభుత్వం (వారు చెందిన పార్టీని సంబంధం లేకుండా) జాతీయ వనరులను (ఈ సందర్భంలో భూఉష్ణ శక్తి) ప్రైవేటీకరించడానికి అనుమతించదని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ వివాదం డిసెంబరు 2014 లో ముగిసింది, ఇద్దరు పార్టీలు పరిష్కారం చేసుకున్న తరువాత ఎటువంటి వివరాలను విడుదల చేయలేదు. వాషింగ్టన్ ఆధారిత " ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్ " నుండి ఒత్తిడికి ఎల్ సాల్వడోర్ ప్రభుత్వం రజీకి అంగీకరించింది. సాల్వడోర్ ప్రభుత్వం కృత్రిమంగా విద్యుత్తు ధరలను తగ్గించాలని నిర్భంధం చేయడం వంటి విధానాలు ప్రైవేట్ రంగ లాభాలను దెబ్బతీశాయని, ఇది ఇంధన రంగంలో అమెరికన్ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు వర్తిస్తుందని యు.ఎస్. ఎంబసీ (2009 లో)హెచ్చరించింది. అమెరికా ఎంబసీ ఎల్ సాల్వడార్ యొక్క న్యాయవ్యవస్థ అవినీతిని ఎత్తి చూపింది. దేశంలో వ్యాపారం చేసేసమయంలో "మధ్యవర్తిత్వ సమాచారం విదేశీ వేదికగా వెల్లడిచ కూడదని " అమెరికన్ వ్యాపారాలను పరోక్షంగా కోరింది. 2009 లో సాల్వడోర్ ప్రభుత్వం విధానాలు ప్రైవేట్ రంగ లాభదాయకతను దెబ్బతీశాయని, ఇంధన రంగంలో అమెరికన్ పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని యు.ఎస్. ఎంబసీ హెచ్చరించింది. 2008 లో " యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ " నివేదిక ఎల్ సాల్వడార్లో విద్యుత్ ఉత్పత్తిలో మూడవ వంతు ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుండగా రెండు వంతులు అమెరికన్, ఇతర విదేశీ యాజమాన్యంలో ఉన్న సంస్థలు ఉత్పత్తిచేస్తున్నాయని పేర్కొన్నది. పేద ప్రజలు అత్యధికు సంఖ్యలో ఉన్న ఎల్ సాల్వడార్ వంటి ప్రభుత్వాలు వనరులకి రాయితీ ఇవ్వడం సహజం. కొన్ని సంఘటనల కారణంగా ఎల్ సాల్వడార్ ప్రభుత్వం ప్రతిష్ఠ దెబ్బతిన్నప్పటికీ, అవినీతి స్థాయిలను ప్రజలు గ్రహించనప్పటికీ ఎల్ సాల్వడోర్ అవినీతి పర్చేషన్ ఇండెక్స్ ప్రకారం 175 దేశాలలో 80వ స్థానంలో ఉంది. పనామా రేటింగ్‌లో ఎల్ సాల్వడోర్ 175 దేశాలలో 94వ స్థానంలో ఉంది. కోస్టారీకా 47 స్థానంలో ఉంది.

పర్యాటకం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Moncagua, San Miguel.

2014లో 13,94,000 మంది పర్యాటకులు ఎల్.సాల్వడోర్‌ను సందర్శించారు. 2013 గణాంకాల ఆధారంగా ఎల్ సాల్వడోర్ జి.డి.పి.కి పర్యాటకరంగం 855.5 మిలియన్ల డాలర్లు అందిస్తుంది. ఇది మొత్తం జి.డి.పి.లో 3.5% ఉంటుంది. 2013లో పర్యాటకరంగం ప్రత్యక్షంగా 80,500 ఉద్యోగాలను కల్పిస్తుంది.ఎల్.సాల్వడోర్ మొత్తం ఉద్యోగాలలో 3.1% ఉద్యోగాలు పర్యాటకరంగం నుండి లభిస్తున్నాయి. 2013 లో పర్యాటకరంగం 2,10,000 పరోక్ష ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. ఇది దేశం మొత్తం ఉద్యోగాలలో 8.1% ఉంది. ఎల్.సాల్వడోర్ లోని " కొమలప ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " అంతర్జాతీయ విమానాలరాకపోకలకు సహకరిస్తుంది.ఇది శాన్ సాల్వడోర్ నగరానికి ఆగ్నేయంలో 40 కి.మీ దూరంలో ఉంది.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
El Salvador has surf tourism due to large waves from the Pacific Ocean.

ఉత్తర అమెరికా, యూరోపియన్ పర్యాటకులలో చాలామంది ఎల్ సాల్వడోర్ సముద్రతీరాలు, రాత్రిజీవితం కోసం అంవేషిస్తారు. ఈ రెండు ఆకర్షణలతో పాటు ఎల్ సాల్వడార్ పర్యాటక భూభాగం ఇతర మధ్య అమెరికా దేశాల నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. భౌగోళిక పరిమాణము, పట్టణీకరణ కారణంగా పర్యావరణ పర్యటనలు, పురావస్తు ప్రదేశాలలో ప్రజలకు ప్రవేశం లేదు. " సర్ఫింగ్ " సాల్వెడార్ సముద్రతీరాలకు అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవలి సమీప సంవత్సరాలలో సాల్వడోరియన్ సముద్రతీరాలు అత్యధికంగా జనాదరణ పొందుతున్నాయి.

సర్ఫింగ్ క్రీడాకారులు లా లిబర్టాడ్, ఎల్ సాల్వడార్ తూర్పు తీరంలో చాలా సముద్రతీరాలను సందర్శిస్తున్నారు. పర్యాటకుల సంఖ్యకు తగిన సర్ఫింగ్ స్పాట్లు లేనట్లు గ్రహించారు. యు.ఎస్. డాలర్లను సాల్వడార్ కరెన్సీగా ఉపయోగించడం, సంయుక్త రాష్ట్రాలలో ఉన్న అనేక పట్టణాల నుండి 4 నుంచి 6 గంటలకు ప్రత్యక్ష విమానాల సౌకర్యం అమెరికన్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సాల్వడోర్ సంస్కృతి పట్టణీకరణ, అమెరికీకరణీకరణ కారణంగా మూడు ప్రధాన పట్టణ ప్రాంతాల్లో (ముఖ్యంగా శాన్ సాల్వడార్‌) అమెరికన్-తరహా మాల్స్ దుకాణాలు, రెస్టారెంట్లు సమృద్ధిగా ఉండడానికి దారితీసింది.

ఎల్ సాల్వడార్ వార్తాపత్రిక ఎల్ డియారియో డి హోయ్ ఆధారంగా సాల్వడోర్‌లోని 10 ఆకర్షణలు: తీరప్రాంత సముద్రతీరాలు; లా లిబర్టాడ్, రుటా లాస్ ఫ్లోర్స్, సుచిటోత్, లా పాల్మ, శాంటా అనా (దేశంలోని అతి పెద్ద అగ్నిపర్వత ప్రాంతం), న్యాజిజల్కో, అపనేకా, జుయౌయు, శాన్ ఇగ్నాసియో, సాన్ ఇగ్నాసియో.

మౌలిక నిర్మాణాలు

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
RN-21 (Boulevard Diego Holguin), now known as Boulevard Oscar Romero, is El Salvador's and one of Central America's first freeways. El Salvador is one of the top listed Latin American countries with the best road infrastructure.

మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ

మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ స్థాయి గణనీయంగా పెరిగింది. 2005లో నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం (ఎల్ సాల్వడార్ అని పిలుస్తారు) ఎల్ సాల్వడోర్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరా, పారిశుద్ధ్యం అసమానత తగ్గించి పురోగతి సాధించిన దేశంగా పేర్కొన్నది. మురుగునీటి ట్రీట్మెంటు లేకుండా వాతావరణంలోకి విడిచిపెట్టబడిన మురికినీటి కారణంగా నీటి వనరులు తీవ్రంగా కలుషితమయ్యాయి. చాలా భాగం. ప్రభుత్వరంగానికి చెందిన ఒకే సంస్థ మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేయడం ఏర్పరచుకోవడం ఇందుకు ఒక కారణంగా ఉంది., ప్రధాన సేవా ప్రదాతగా వ్యవహరిస్తుంది.గత 20 ఏళ్లలో నూతన చట్టాల ద్వారా చేపట్టిన సంస్కరణలు, ఆధునీకీకరణ వంటి ప్రయత్నాలు ఫలితం సరైన ఇవ్వలేదు..

గణాంకాలు

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
El Salvador's population, 1961–2015
సంప్రదాయ సమూహాలు – 2007 ఎల్ సాల్వడోర్ గణాంకాలు
స్వయంగా-గుర్తించబడిన జాతులు జనసంఖ్య శాతం
మెస్టిజో (మెజ్‌క్లా డీ బ్లాంకొ కాన్ ఇండిజెనా)
  
86.3%
శ్వేతజాతీయులు(కౌకాసియన్లు)
  
0%
ఇండిజెనీస్ నేటివ్ అమెరికన్లు
  
0.2%
బ్లాక్ లాటిన్ అమెరికన్లు
  
0.1%
ఇతరులు
  
0.6%
మొత్తం
  
100%

1950లో ఎల్ సాల్వడో జనసంఖ్య 22,00,000. 2010లో ప్రజలలో 15 సంవత్సరాలకంటే తక్కువ వయస్కులు 32%, 15-65 సంవత్సరాల మద్య వయస్కులు 61%, 65 సంవత్సరాలకంటే అధిక వయస్కులు 6.9% ఉన్నారు. రాజధాని నగరం శాన్ సాల్వడోర్ జనసంఖ్య 2.1 మిలియన్లు. 42% ఎల్ సాల్వడోర్ ప్రజలు గ్రామీణప్రాంతాలలో నివసిస్తున్నారు. 1960 నుండి నగరప్రాంతాలకు మిలియన్ల మంది ప్రజలు తరలి వస్తున్న కారణంగా నగరప్రణాళిక, సేవాలను అందించడంలో సమస్యలు ఎదురైయ్యాయి.

సంప్రదాయ సమూహాలు

ఎల్ సాల్వడోర్ ప్రజలలో మెస్టిజోలు, శ్వేతజాతీయులు, స్థానికజాతి ప్రజలు ఉన్నారు. సాల్వడోర్ ప్రజలలో 86% మెస్టిజో పూర్వీకత కలిగి ఉన్నారు. ప్రజలలో యురేపియన్ పూర్వీకత కలిగిన మెస్టిజోలు, ఆఫ్రో సాల్వడోరియన్లు, స్థానిక ప్రజలు (వీరు స్థానిక సంస్కృతిని అనుసరిస్తున్నా వీరికి స్థానిక భాష మాట్లడడం రాదు)అందరూ తమకు తాము సాస్కృతికంగా మెస్టిజోలుగా భావిస్తుంటారు. సాల్వడోరియన్లలో లాటిన్ అమెరికన్లు 12% ఉన్నారు. రెండవప్రపంచ యుద్ధం సమయంలో మద్య ఐరోపా లోని సెజ్ రిపబ్లిక్, జర్మనీ,హంగేరీ,పోలాండ్, స్విడ్జర్లాండ్ దేశాల నుండి శరణార్ధులుగా ఎల్ సాల్వడోర్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు.సాల్వడోర్‌లో స్వల్పసంఖ్యలో యూదులు, పాలస్తీనియన్లు, అరబ్ ముస్లిములు (ప్రత్యేకంగా పాలస్తీనియన్ ముస్లిములు) ఉన్నారు. సాల్వడోర్‌లో 1,00,000 మంది నికరాగ్వా ప్రజలు నివసిస్తున్నారు. సాల్వడోర్‌లో 0.23% పూర్తిగా స్థానికజాతి పూర్వీకత కలిగిన ప్రజలు ఉన్నారు. వీరిలో కక్వారియా ప్రజలు 0.07%, పిపిల్ ప్రజలు 0.06%, లెంకా ప్రజలు 0.04%, ఇతర మైనారిటీలు 0.06% ఉన్నారు. చాలా స్వల్పంగా ఉన్న అమెరిండియన్లు కాలానుగుణంగా వారి సంప్రదాయాలను మెస్టిజో (స్పానిష్) సంప్రదాయంతో కలిపి జీవిస్తున్నారు. దేశంలో ఆఫ్రో సాల్వడోరియన్లు 0.13% ఉన్నారు. ప్రభుత్వ విధానాలు ఆఫ్రికన్ సాల్వడోరియన్లు వలస ద్వారా దేశంలో ప్రవేశించడాన్ని నిరోధిస్తుంటాయి.

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Salvadoran model Irma Dimas was crowned Miss El Salvador in 2005. She made headlines recently for her entry into Salvadoran politics.

వలస సమూహాలలో పాలస్తీనియన్ క్రైస్తవులు ప్రత్యేకంగా ఉంటారు. వారి సంతతికి చెందిన వారు దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా అత్యున్నత స్థానాలు అందుకున్నారు. అందుకు నిదర్శనంగా పాత అధ్యక్షుడు ఆటానియా సాకా, 2004లో షాఫిక్ ప్రత్యర్థి పాలస్తీనా సంతతికి చెందిన వాడే. అలాగే వాణిజ్య, పారిశ్రామిక, నిర్మాణ సంస్థలను కలిగిఉన్న ప్రముఖులలో పలువురు పాలస్తీనియన్లు ఉన్నారు.

2004 గణాంకాల ఆధారంగా ఎల్ సాల్వడార్ వెలుపల నివసిస్తున్న మిలియన్ సాల్వడోర్ వాసులు 3.2మిలియన్లు ఉన్నారు. సాల్వడార్‌కు చెందిన ఆర్థిక వలసదారులకు యునైటెడ్ స్టేట్స్ గమ్యస్థానంగా ఉంది. 2012 నాటికి సుమారు 2.0 మిలియన్ల మంది సాల్వడార్ వలసదారులు, అమెరికాలో నివసిస్తున్న సాల్వడార్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న ఆరు అతిపెద్ద సమూహాలలో సాల్వడోరియన్ సమూహం ఒకటి. ఇతరదేశాలకు వలసపోతున్న సాల్వడోరియన్ల రెండవ గమ్యం గౌతమాలా. ఇక్కడ 1,11,000 సాల్వడోరియన్లు (ప్రధానంగా గౌతమాలా నగరంలో) నివసిస్తున్నారు.సాల్వడోరియన్లు నివసిస్తున్న ఇతర దేశాలలో బెలిజె, హొండురాస్, నికరాగ్వా ప్రధానమైనవి. సాల్వడోరియన్ ప్రజలు సమూహాలుగా కెనడా, మెక్సికో, యునైటెడ్ కింగ్డం (కేమన్ ద్వీపాలు), స్వీడన్,బ్రెజిల్,ఇటలీ,కొలంబియా, ఆస్ట్రేలియా దేశాలలో నివసిస్తున్నారు.

భాషలు

ఎల్ సాల్వడోర్ అధికారభాష స్పానిష్.దాదాపు ప్రజలు అందరూ స్పానిష్ మాట్లాడగలరు. కొంత మంది స్థానిక ప్రజలు వారి స్వంత భాషలైన పిపిల్ (నవాత్), మాయా భాషలను మాట్లాడుతుంటారు. అయినప్పటికీ మెస్టిజోలుగా నమోదు చేయబడని స్థానిక ప్రజలు మొత్తం జనాభాలో 1% మాత్రమే ఉన్నారు.అయినప్పటికీ వారంతా స్పానిష్ మాట్లాడుతుంటారు.ఎల్ సాల్వడోర్‌లో నివసిస్తున్న గౌతమాలా, బెలిజె నుండి వలస వచ్చిన ప్రజలు క్యూ ఎక్విచ్ భాష మాట్లాడుతుంటారు. సమీపకాలంలో హోండురాస్, నికరాగ్వా నుండి కూడా వలసప్రజలు ఎల్ సాల్వడోర్ చేరుకుంటున్నారు. ప్రాంతీయ స్పానిష్ వర్ణమాలను " కలిచె " అంటారు. సాల్వడోరియన్లు ఉపయోగిస్తున్న వొసియోను అర్జెంటీనా,కోస్టారీకా,నికరాగ్వా, ఉరుగ్వే దేశాలలో ఉపయోగిస్తున్నారు. పిపిల్ భాష పశ్చిమ సాల్వడోర్‌లో నివసిస్తున్న చిన్న సమూహాలకు చెందిన వయోజనుల మద్య సజీవంగా ఉంది.

మతం

Religious background in El Salvador
Religion Percent
Roman Catholic
  
47%
Protestant
  
33%
None
  
17%
Other
  
3%

ఎల్ సాల్వడోర్‌లో మతపరంగా క్రైస్తవులు అధికంగా ఉన్నారు. మొత్తం జనాభాలో రోమన్ కాథలిక్కులు 47%, ప్రొటెస్టెంట్లు 33% ఉన్నారు. ఏ మతానికి చెందని ప్రజలు 17% ఉన్నారు. మిగిలిన వారిలో జెహోవాస్ విట్నెసెస్, హరేకృష్ణా, ముస్లిములు, యూదులు, బౌద్ధులు, లేటర్ డే సెయింట్స్, స్థానిక మతాలకు చెందిన వారు 3% ఉన్నారు. గుర్తించతగిన సంఖ్యలో ఎవాంజికల్స్ ఉన్నారు.

ఆరోగ్యం

2005, 2010 మధ్యకాలంలో సెంట్రల్ అమెరికాలో అత్యల్ప జననాల నిష్పత్తి కలిగిన దేశాలలో ఎల్ సాల్వడార్ ఒకటి. ఎల్ సాల్వడోర్ జననాల నిష్పత్తి 1000:22.8. అదే కాలంలో మద్య అమెరికా అత్యధిక మరణాల నిష్పత్తి కలిగిన దేశాలలో ఎల్ సాల్వడోర్ ప్రథమస్థానంలో ఉంది. సాల్వడోర్ మరణాల నిష్పత్తి 1000:5.9. ఇటీవలి యునైటెడ్ నేషన్స్ సర్వే ఆధారంగా పురుషుల ఆయుఃపరిమితి 68 సంవత్సరాలు, మహిళలకు 74 సంవత్సరాలు. 2003 లో పురుషుల ఆరోగ్యవంతమైన ఆయుఃపరిమితి 57 సంవత్సరాలు, మహిళలకు 62 సంవత్సరాలు.

విద్య

ఎల్ సాల్వడోర్‌లో విద్యా వ్యవస్థ వనరుల కొరత ఉంది. పబ్లిక్ స్కూళ్ళలో ఒక తరగతిలో 50 మంది పిల్లలు ఉండేవారు. విద్యాబోధన కొరకు వ్యయం చేయగలిగిన సాల్వడోరియన్లు తరచుగా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఇవి ప్రభుత్వ పాఠశాలల కన్నా మెరుగైన నాణ్యమైన విద్యాబోధన చేయబడుతుందని విశ్వసించబడుతుంది. చాలా ప్రైవేటు పాఠశాలలు అమెరికన్, యూరోపియన్ లేదా ఇతర ఆధునిక విద్యావిధానాన్ని అనుసరిస్తున్నాయి. దిగువ-ఆదాయ కుటుంబాలు ప్రభుత్వ విద్యపై ఆధారపడతాయి.[ఆధారం చూపాలి] ఎల్ సాల్వడోర్లో విద్య ఉన్నత పాఠశాల వరకు విద్యబోధన ఉచితం. తొమ్మిది సంవత్సరాల ప్రాథమిక విద్య (ప్రాథమిక-మధ్యతరగతి పాఠశాల) తరువాత విద్యార్థులకు రెండు సంవత్సరాల ఉన్నత పాఠశాల లేదా మూడు సంవత్సరాల ఉన్నత పాఠశాల ఎన్నిక చేయడానికి అవకాశం ఉంది. రెండు సంవత్సరాల ఉన్నత పాఠశాల విశ్వవిద్యాలయ ప్రవేశానికి విద్యార్థిని సిద్ధం చేస్తుంది. మూడు సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య విద్యార్థి వృత్తి జీవితంలో పట్టభద్రులవ్వడానికి, విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడానికి ఎంచుకున్న రంగంలో వారి విద్యను మరింత పొడిగించడానికి విశ్వవిద్యాలయ ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది.[ఆధారం చూపాలి]ఎల్ సాల్వడోర్‌లో " యూనివర్శిడాడ్ డీ ఎల్ సాల్వడోర్ ", ఇతర స్పెషలైజ్డ్ ప్రైవేట్ యూనివర్శిటీలు ఉన్నాయి.

సంస్కృతి

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The iconic statue of Christ on the globe sphere of planet earth is part of the Monumento al Divino Salvador del Mundo (Monument to the Divine Savior of the world) on Plaza El Salvador del Mundo (The Savior of the World Plaza), a landmark located in the country's capital, San Salvador.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The typical picturesque colonial Salvadoran houses of Suchitoto, are always a staple feature in Salvadoran romanization art, painting and murals.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The town of Concepción de Ataco is famed for its murals and paintings.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
La Palma-type art, is a staple feature in modern Salvadoran cultural arts and craft found in the town of La Palma, Chalatenango.

ఎల్ సాల్వడోర్‌లో అమెరికన్ స్థానిక సంస్కృతి, యురేపియన్ సంస్కృతి మిశ్రిత రూపమైన మేస్టిజో సంస్కృతి ఆధిక్యత కలిగి ఉంది. ఐరోపా సెటిలర్లు, మేసోమెరికా ప్రజల మధ్య జాత్యంతర వివాహాల ఫలితంగా ఏర్పడిన మిశ్రమ జనాభాను మెస్టిజోలను పేర్కొన్నారు. సాల్వడోర్ సంస్కృతిలో కాథలిక్ చర్చి ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆర్చ్ బిషప్ ఒస్కార్ రోమెరో సాల్వేడార్ సివిల్ వార్ వరకు దారితీసే మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పోరాడి జాతీయ నాయకుడుగా గుర్తించబడ్డాడు. 1989లో ఎల్ సాల్వడార్లో అంతర్యుద్ధంలో ప్రముఖ విదేశీ వ్యక్తులు, జెసూట్ పూజారులు ఇసొనియో ఎల్లాక్యూరియా, ఇగ్నాసియో మార్టిన్-బారో, సెగుండా మోంటెస్ సాల్వడోర్న్ సైన్యం చేత హత్య చేయబడ్డారు.

పెయింటింగ్, సెరామిక్స్, వస్త్రాలు ప్రధాన మానవీయ కళాత్మక మాధ్యమాలుగా ఉన్నాయి. రచయితలు " ఫ్రాన్సిస్కో గవిడియా " (1863-1955), సాలారూ (సాల్వడార్ సలాజర్ అరువె) (1899-1975), క్లాడియా లార్స్, అల్ఫ్రెడో ఎస్పినో, పెడ్రో జియోఫ్రాయ్ రివాస్, మన్లియో ఆర్గువేటా, జోస్ రాబర్టో సియా, కవి రోక్ డాల్టన్ ఎల్ సాల్వడార్ రచయితలలో అత్యంత ముఖ్యమైన రచయితలుగా ప్రఖ్యాతి గడించారు. 20 వ శతాబ్దంలో ఎల్ సాల్వడోర్‌కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత బాల్తాసర్ పోలియో, మహిళా చలన చిత్ర దర్శకురాలు ప్యాట్రిసియా ఛికా, కళాకారుడు ఫెర్నాండో లాలోర్ట్, కారికేచరిస్ట్ టోనో సలాజర్ చలనచిత్ర రంగంలో తమ ప్రతిభ చాటారు.

గ్రాఫిక్ ఆర్ట్స్‌లో చిత్రకారులు అగస్టో క్రెస్పిన్, నోయే కాన్జూరా, కార్లోస్ కానాస్, జూలియా డియాజ్, మారిషియో మెజియా, మరియా ఎలీనా పాలోమో డి మేజియా, కామిలో మినిరో, రికార్డో కార్బోనెల్, రాబర్టో హుజో, మిగ్యుఎల్ ఏంజెల్ సెర్నా, (మాక్లొగా పిలవబడే చిత్రకారుడు, రచయిత), ఎస్సెల్ అరౌజో, అనేక మంది ప్రఖ్యాతి గడించారు.

ప్రభుత్వ శలవుదినాలు

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Celebration of La Fiestas Patrias in Las Chinamas
శలవుదినాలు
తారీఖు ఆగ్లనామం ప్రాంతీయ నామం పర్యవేక్షణ
మార్చి/ఏప్రిల్ హోలీ వీక్/ఈస్టర్ సెమన సాంటా కాథలిక్కులు అధికంగా ఉన్న నగరాలలో కార్నివల్ వంటి ఉత్సవాలతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
మే 1 లేబర్ డే డియా డెల్ ట్రాబజొ ఇంటర్నేషనల్ లేబర్ డే
మే 3 డే ఆఫ్ క్రాస్ డియా డీ లా క్రజ్ కాలనీకి మునుపటి ఆదిమవాసుల ఉత్సవం.ప్రజలు వారి పెరటిలో శిలువకు పండ్లు, పూలమాలలతో అలంకరిస్తారు.ఇలా చేస్తే దెయ్యం ప్రత్యక్షమై వారి పెరటిలో నాట్యం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.తరువాత ప్రజలు ఇంటింటికీ వెళ్ళి శిలువ ముందు మోకరిల్లి శిలువ చిహ్నం ప్రదర్శిస్తారు.
మే 7 సాలిడర్స్ డే డియా డెల్ సొల్డాడో 1864 సైన్యానికి నిధులు మంజూరు చేసిన రోజు
మే 10 మదర్స్ డే డియా డె లాస్ మాడ్రెస్ మాతృత్వాన్ని ఆరాధించే రోజు.
జూన్ 17 ఫాదర్స్ డే డియా డెల్ పాడ్రె పితృత్వాన్ని ఆరాధించే రోజు.
ఆగస్టు 1–7 ఆగస్టు ఫెస్టివల్స్ ఫీస్ట్స్ డీ అగొస్టో వారం రోజులపాటు సాగే ఉత్సవం.
సెప్టెంబరు 15 ఇండిపెండెంస్ డే డియా డీ లా ఇండిపెండెంసియా 1821న స్పెయిన్ నుండి ఎల్ సాల్వడోర్ స్వతంత్రం పొందిన రోజు.
అక్టోబరు 1 డే ఆఫ్ ది చిల్డ్రెన్ "డియా డెల్ నినొ " పిల్లల కొరకు అంకితం చేసిన రోజు.దేశమంతటా జరుపుకుంటారు.
అక్టోబరు 12 డే ఆఫ్ ది రేస్ డియా డీ లా రాజా క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను చేరుకున్న రోజు
నవంబరు 2 డే ఆఫ్ ది డెడ్ ఎల్ డియా డీ లాస్ డిఫంటోస్ మరణించిన బంధువుల కొరకు సమాధులను సందర్శించే రోజు.
నవంబరు 7–13 నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ పుపుస ఫెస్టివల్ నసియానల్ డీ లా పుపుసా జాతీయ ఆహారం " పుపుసా " గుర్తుచేసుకునే రోజు.
నవంబరు 21 క్వీన్ ఆఫ్ ది పీస్ డే డియా డీ లా రెయినా డీ లా పాజ్ ది పాట్రన్ సెయింట్ డే ఆఫ్ ది క్వీన్ ఆఫ్ పీస్ రోజు. శాన్ మైక్వెల్ కార్నివల్.ఇది శాన్ మైక్వేల్ నగరంలో జరుపుకుంటారు.ఇలాంటి పండుగను న్యూ ఆర్లింస్‌లో " మార్ది గ్రాస్ " పేరుతో జరుపుకుంటారు.ఈ పండుగ సందర్భంలో 45 సంగీత బాండ్లు వీధిప్రదర్శన జరుపుకుంటారు.
డిసెంబరు 25 క్రిస్‌మస్ డే (డిసెంబరు 24న జరుపుకుంటారు) నొచె బుయెనా క్రిస్‌మస్ పండుగ
డిసెంబరు 31 న్యూ ఇయర్ ఈవ్ ఫిన్ డీ అనొ గ్రిగోరియన్ సంవత్సరం చివరి రోజు.

ఆహారం

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Pupusas, the national and most famous dish of El Salvador.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Salvadoran tortillas are a staple of the Salvadoran diet. These are thicker (5 mm) than Mexican tortillas, about 10 cm in diameter.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Yuca is eaten fried or boiled with salads, as a side dish or in the yuca frita dish. The oldest direct evidence of cassava cultivation in the world comes from a 1,400-year-old Maya site, Joya de Cerén, in El Salvador.
ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Sopa de pata

ఎల్ సాల్వడార్ ముఖ్యమైన వంటలలో ఒకటి పుపుస . పుపుసాస్ చేతితో తయారు చేయబడే టార్టిల్లాస్. వీటిని మాసా లేదా మాసా డి ఆర్రోజ్ అనే లాటిన్ అమెరికన్ వంటకాలలో ఉపయోగించే మొక్కజొన్న లేదా బియ్యం పిండితో తయారుచేసే పిండి ముద్దను ఉపయోగించి చేస్తారు. ఈ క్రింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్ధాలను ఉపయోగిస్తారు: సగ్గుబియ్యము, చీజ్ (మోజారెల్లా, చించర్రాన్ లేదా మాదిరిగానే ఉండే సాల్వడోరియన్ చీజ్ క్వేసిల్లో ) రెఫ్రైడ్ బీంస్ చేర్చి తయారు చేస్తారు. కొన్నిసార్లు క్వెస్సో కాన్ లారోకో ( లారోకోతో కలిపి జున్ను సెంట్రల్ అమెరికాకు చెందిన వైన్ ఫ్లవర్ మొగ్గ)చేర్చి తయారుచేస్తుంటారు. ఎల్ సాల్వడోర్ అభిమాన వంటకాలలోపుపుసాస్ రెవ్యూల్ట్స్ బీన్స్, జున్ను, పంది నింపిన పుపుసాస్ ప్రధానమైనది.ప్రజల అభిమాన వంటకాలలో శాకాహారం వంటకాలు కూడా ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు రొయ్యలు లేదా బచ్చలి కూరతో నింపి నూతన తరహాలో పుపుసాస్‌లను అందిస్తూ ఉన్నాయి. పుపుసాస్ పదానికి పిపిల్-నాదౌల్ అనే పదం పుపుషహుయా మూలపదంగా ఉంది.ఎల్ సాల్వడోర్లో పుపుసాస్ పదానికి ఖచ్చితమైన మూలాలు చర్చించబడింది.ఈ పదం స్పానియార్డ్స్ రాకకు ముందుగా ఉనికిలో ఉందని భావిస్తున్నారు.

సాల్వడార్ వంటకాలు యూకా ఫ్రైటా , పేనేస్ కాన్ పోలో . యుకా ఫ్రైటా అనే మరొక రెండు వంటకాలు ప్రజలకు అభిమానపాత్రమై ఉన్నాయి. కసావా రూట్ కర్టిడో (ఊరవేసిన క్యాబేజీ, ఉల్లిపాయ, క్యారెట్ టాపింగ్), పస్కాడిటస్ ' (వేయించిన బేబీ సార్డినెస్) తో పంది మాంసం కలిపి అందిస్తారు. యుకా కొన్నిసార్లు వేయించిన దానికి బదులుగా ఉడకబెట్టి తయారు చేస్తారు. "పాన్ కాన్ పోలో / పావో" (కోడి / టర్కీకోడి రొట్టె) వెచ్చని టర్కీకోడి లేదా కోడి మాంసం - నింపి సబ్‌మెరీన్ శాండ్విచ్ తయారీలో పక్షిని ఊరబెట్టిన తరువాత పిపిల్ మసాలాలతో కూర్చి చేతితో తిప్పుతూ కాల్చి తయారు చేస్తారు. ఈ సాండ్విచ్ సాంప్రదాయకంగా టమేటా, దోసకాయ, ఉల్లిపాయ, పాలకూర, మయోన్నైస్ క్రీం, ఆవాలు నూరి తయారు చేసిన పేస్టు చేర్చి అందించబడుతుంటాయి.

ప్లాంటియన్ ఎల్ సాల్వడోర్ విలక్షణ ఉదయాహారాలలో ఒకటి. దీనిని సాధారణంగా వేయించిన అరటి క్రీం చేర్చి వడ్డిస్తారు. ఇది సాల్వడోర్ రెస్టారెంట్లు, గృహాలలో సాధారణం. యునైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చినవారు కూడా ఈ అహారాన్ని తింటారు. అల్గిషాట్ అనేది ఎండిన పెపిటాస్ పిండితో తయారుచేసిన ఆహారం. సాధారణంగా రుచికరమైన, తీపి సాల్వడోర్ వంటలలో చేర్చబడుతుంది."" మరియా లూయిసా "" ఎల్ సాల్వడోర్లో సాధారణంగా కనిపించే భోజనానంతరం తినే ఆహారం. ఇది నారింజ మార్మాలాడేలో ముంచి పొడి చక్కెర చల్లి లేయర్ కేక్.

సాల్వడోర్యన్లు ఆనందిస్తున్న పానీయాలలో హోర్చాటా స్పెయిన్‌కు చెందిన వాలెన్సియన్ కమ్యూనిటీకు చెందిన ఒక పానీయం. హోర్చాటా సాధారణంగా సాధారణంగా మోర్రో సీడ్ పిండితో పాలు లేదా నీరు, చక్కెర కలుపుతారు. హర్చాటా సంవత్సరం పొడవునా తాగుతూ రోజులో ఏ సమయంలోనైనా తాగుతారు. ఇది ఎక్కువగా ప్యూసస్ లేదా వేయించిన యోకా ఆహారాలతో అందిస్తారు. ఉంటుంది. బియ్యం ఆధారంగా మెక్సికన్ హర్చట లా ఉన్నప్పటికీ ఎల్ సాల్వడార్ హార్చట చాలా విలక్షణమైన రుచిని కలిగి ఉంటుంది. కాఫీ కూడా ఒక సాధారణ తీసుకునే ఉదయం పానీయం.

ఎల్ సాల్వడోర్ పానీయాలలో " ఎంసాల్వడా " ఒకటి. పళ్ళరసంలో పండ్లతురుమును, కొలచంపన్ (చెరకు రసం)చేర్చి తయారు చేస్తుంటారు.

సంగీతం

సాల్వడార్ సంగీతం స్వదేశీ పిపిల్, స్పానిష్ సంగీతాలతో ప్రభావితమైన మిశ్రమసంగీతంగా ఉంటుంది. సంగీతంలో మతసంబంధిత పాటలు ఉంటాయి.ఈ పాటలు సెయింట్లు విందులో పాడే పాటలు, క్రిస్మస్, ఇతర మత సెలవుదినాలలో పాడేపాటలు ఉంటాయి. వ్యంగ్య, గ్రామీణ సాహిత్య అంశాలతో కూడిన పాటలు కూడా సంగీతంలో భాగంగా ఉంటాయి. క్యూబా, కొలంబియా, మెక్సికన్ సంగీతం దేశంలో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా సల్సా , కుంబియా మ్యూజిక్ సంగీతం దేశంలో ప్రవేశించాయి. ఎల్ సాల్వెడార్లో ప్రసిద్ధ సంగీతవాయిద్యాలలో మరీబ , తెహ్పే , వేణువు, డ్రమ్, స్క్రాపర్ (వాయిద్యం), గోర్డ్ ప్రధానమైనవిఅలాగే ఇటీవల దిగుమతి చేసుకున్న గిటార్‌లు, ఇతర సాధనాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఎల్ సాల్వడార్ యొక్క ప్రసిద్ధ జానపద నృత్యం జుక్ . ఇది కోట్యుటెపెక్, కుస్కట్టాన్ డిపార్టుమెంటులో పుట్టింది. ఇతర సంగీత ప్రదర్శనలలో డాన్జా, పసిల్లో, మార్చా, క్యాన్సియోన్స్ ఉంటాయి.

క్రీడలు

ఎల్ సాల్వడోర్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Estadio Cuscatlán in San Salvador is the largest stadium in Central America

ఎల్ సాల్వడార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అసోసియేషన్ ఫుట్ బాల్. ఎల్ సాల్వడోర్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు " 1970 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ ", 1982 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి అర్హత సాధించింది.1970 టోర్నమెంట్‌కు వారి అర్హత " ఫుట్బాల్ యుద్ధం " వర్ణించబడింది. ఎల్ సాల్వడార్ ఓడించిన హోండురాస్కు మద్య వ్యతిరేకంగా జరిగిన యుద్ధానికి ఈ టోర్నమెంటు కారణమైంది.నేషనల్ ఫుట్ బాల్ జట్టు శాన్ సాల్వడోర్ లోని " ఎస్టాడియో కస్కాట్లాన్ " వద్ద క్రీడలలో పాల్గొన్నది. ఎస్టాడియో కస్కాట్లాన్ క్రీడామైదానం 1976లో స్థాపించబడింది. ఈ మైదానంలో 53,000 మంది కూర్చుని క్రీడలను తిలకించడానికి వసతి కల్పించబడింది.ఇది మద్య అమెరికా, కరీబియన్ దేశాలలో అతిపెద్ద క్రీడామైదానంగా గుర్తించబడుతుంది.

మూలాలు


Tags:

ఎల్ సాల్వడోర్ పేరువెనుక చరిత్రఎల్ సాల్వడోర్ చరిత్రఎల్ సాల్వడోర్ భౌగోళికంఎల్ సాల్వడోర్ ఆర్ధికంఎల్ సాల్వడోర్ మౌలిక నిర్మాణాలుఎల్ సాల్వడోర్ గణాంకాలుఎల్ సాల్వడోర్ ఆరోగ్యంఎల్ సాల్వడోర్ విద్యఎల్ సాల్వడోర్ సంస్కృతిఎల్ సాల్వడోర్ మూలాలుఎల్ సాల్వడోర్En-us-El Salvador.oggదస్త్రం:En-us-El Salvador.oggదేశంవర్గం:Lang and lang-xx template errorsస్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

సింహరాశి2024 భారత సార్వత్రిక ఎన్నికలునువ్వు నేనునజ్రియా నజీమ్రాష్ట్రపతి పాలనసంగీతంరోహిణి నక్షత్రంసన్ రైజర్స్ హైదరాబాద్భూమివిజయ్ (నటుడు)పన్ను (ఆర్థిక వ్యవస్థ)సెక్స్ (అయోమయ నివృత్తి)విశాఖ నక్షత్రముపెరిక క్షత్రియులుభీమసేనుడుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారత జాతీయపతాకంఉత్తర ఫల్గుణి నక్షత్రముమూలా నక్షత్రంమొఘల్ సామ్రాజ్యంరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఅన్నప్రాశనసత్యమేవ జయతే (సినిమా)విశ్వబ్రాహ్మణతొలిప్రేమప్రియురాలు పిలిచిందికల్వకుంట్ల కవితరెండవ ప్రపంచ యుద్ధంరేణూ దేశాయ్సజ్జలుతెలుగునాట జానపద కళలుషర్మిలారెడ్డిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుచెమటకాయలుశ్రవణ నక్షత్రముఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుసత్య సాయి బాబాఉత్తరాషాఢ నక్షత్రము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆతుకూరి మొల్లనారా లోకేశ్ప్రేమలుఅర్జునుడుఘట్టమనేని కృష్ణగురజాడ అప్పారావువినోద్ కాంబ్లీఅమిత్ షాబొడ్రాయిదేవికనితీశ్ కుమార్ రెడ్డిఅలంకారంకాకతీయులుజూనియర్ ఎన్.టి.ఆర్లోక్‌సభLఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఅన్నమాచార్య కీర్తనలుభారతీయ జనతా పార్టీనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంజనసేన పార్టీఆర్యవైశ్య కుల జాబితాతమిళ అక్షరమాలనెమలిఅశ్వని నక్షత్రముఇక్ష్వాకులుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గండీజే టిల్లుబుధుడు (జ్యోతిషం)భద్రాచలంగూగుల్విష్ణు సహస్రనామ స్తోత్రముపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిక్రికెట్అనిఖా సురేంద్రన్పరకాల ప్రభాకర్విరాట్ కోహ్లిభాషా భాగాలు🡆 More