కోస్టారీకా

కోస్టారీకా (ఆంగ్లం : Costa Rica) (/ˌkɒstə ˈriːkə/ ( listen); Spanish: ; literally meaning Rich Coast), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ కోస్టారీకా, (స్పానిష్: Error: }: text has italic markup (help)), ఇదొక మధ్య అమెరికా లేదా లాటిన్ అమెరికా దేశం.

దీని ఉత్తరసరిహద్దులో నికరాగ్వా, తూర్పు, ఆగ్నేయసరిహద్దులో పనామా, పశ్చిమసరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం, తూర్పు సరిహద్దులో కరీబియన్ సముద్రం, కొకోస్ ద్వీపం దక్షిణంలో ఈక్వెడార్ ఉన్నాయి. సేన్ జోసే దీని రాజధాని. దేశజనసంఖ్య 4.5మిలియన్లు. వీరిలో 4వ వంతు ప్రజలు రాజధాని నగరం, దేశంలోని అతిపెద్ద నగరమైన శాంజోస్ మహానగరప్రాంతాలలో నివసిస్తున్నారు. 16వ శతాబ్దంలో స్పెయిన్ ఈప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పాలించడానికి పూర్వం ఈ ప్రాంతంలో స్థానికజాతులకు చెందిన ప్రజలు అక్కడక్కడా నివసిస్తూ ఉండేవారు. స్వతంత్రం లభించడానికి ముందు ఈప్రాంతం స్వల్పకాలం ఉన్న " ఫస్ట్ మెక్సికన్ ఎంపైర్ "లో భాగంగా ఉంది. యినైటెడ్ ప్రొవింసెస్ ఆఫ్ సెంట్రల్ అమెరికా సభ్యత్వం పొందిన తరువాత 1847లో కోస్టారికా సార్వభౌమ రాజ్యంగా ప్రకటించబడింది.అప్పటి నుండి అత్యంత స్థిరమైన, సమృద్ధమైన , అభివృద్ధిపధంలో నడుస్తున్న లాటిన్ అమెరికన్ దేశాలలో కోస్టారికా నిలిచి ఉంది.కోస్టారికా అంతర్యుద్ధం తరువాత 1949లో కోస్టారికా సైన్యాన్ని శాశ్వతంగా రద్దుచేసి సైన్యరహితదేశాలలో ఒకటిగా మారింది. కోస్టారికా " ఆర్గనజేషన్ ఇంటర్నేషనీ డీ లా ఫ్రాంకోఫోనీ " పర్యవేక్షణ సంభ్యత్వదేశంగా ఉంది. కోస్టారికా " హ్యూమన్ డెవెలెప్మెంటు ఇండెక్స్ "లో 69వ స్థానంలో ఉంది. కోస్టారికా " యునైటెడ్ నేషంస్ డెవెలెప్మెంటు ప్రోగ్రాం " పర్యవేక్షణలో ఉంది. ఒకే ఆదాయ స్థాయిలో ఉన్న దేశాలన్నింటిలో మానవాభివృద్ధి కొరకు వ్యయం చేస్తున్న దేశాలలో కోస్టారికా అత్యున్నత స్థానంలో ఉంది. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టారికా ఆర్థికరంగం గతంలో వ్యవసాయ ఆదాయం మీద మాత్రమే ఆధారపడి ఉన్నా ఆర్థికరంగం ప్రస్తుతం ఫైనాంస్, ఔషధాల తయారీ , ఎకోపర్యాటకం మీద కేంద్రీకృతమై ఉంది.కోస్టారికా 2016 ఎంవిరాన్మెంటు పర్ఫార్మెంస్ ఇండెక్స్ ఆధారంగా పర్యావరణ పరిరక్షణలో కోస్టారికా ప్రపంచంలో 42వ స్థానంలో ఉంది. న్యూ ఎకనమిక్స్ ఫౌండేషంస్ (ఎన్.ఇ.ఎఫ్), హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో కోస్టారికా బెస్ట్ పర్ఫార్మింగ్ దేశంగా గుర్తించబడుతూ ఉంది. 2009లో ఎన్.ఇ.ఎఫ్ కోస్టారికాను పచ్చని దేశం (గ్రీనెస్ట్ కంట్రీ) గా పేర్కొన్నది. 2021 నాటికి కోస్టారికా " కార్బన్ న్యూట్రల్ కంట్రీగా " ఉండాలని అధికారికంగా ప్రణాళిక రూపొందించింది. 2012 లో వినోదం కొరకు సాంగించే వేటను నిషేధించి ఇలా నిషేధం విధించిన మొదటి అమెరికన్ దేశంగా కోస్టారికా మారింది.

రిపబ్లికా డె కోస్టారికా
కోస్టా రీకా గణతంత్రం
Flag of కోస్టా రికా కోస్టా రికా యొక్క చిహ్నం
జాతీయగీతం

కోస్టా రికా యొక్క స్థానం
కోస్టా రికా యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
San José
9°55′N 84°4′W / 9.917°N 84.067°W / 9.917; -84.067
అధికార భాషలు స్పానిష్
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Mekatelyu
జాతులు  94% European and en:Mestizo
3.0% West African
1.0% en:Amerindian
1.0% Chinese
1.0% Other
ప్రజానామము Costa Rican
ప్రభుత్వం en:Constitutional democracy
(Presidential en:republic)
 -  President en:Carlos Alvarado (PLN)
 -  en:Vice President unoccupied
en:Independence from Spain (via Guatemala) 
 -  Declared September 14, 1821 
 -  Recognized by Spain May 10, 1850 
 -  from the UPCA 1838 
 -  జలాలు (%) 0.7
జనాభా
 -  July 2009 అంచనా 4,253,877 (119th)
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $48.741 billion 
 -  తలసరి $10,752 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $29.828 billion 
 -  తలసరి $6,580 
జినీ? (2001) 49.9 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase 0.847 (high) (50th)
కరెన్సీ en:Costa Rican colón (CRC)
కాలాంశం (UTC-6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ en:.cr
కాలింగ్ కోడ్ +en:+506

చరిత్ర

కోస్టారీకా 
A stone sphere created by the Diquis culture at the National Museum of Costa Rica. The sphere is the icon of the country's cultural identity.

కొలబియన్ కాలానికి పూర్వచరిత్ర

కోస్టారీకా స్థానికజాతి ప్రజలు మద్యప్రాంతానికి చెందిన వారని చరిత్రకారులు వర్గీకరించారు. వీరు మెసొమెరికన్ , ఆండియన్ సాంస్కృతిక ప్రజలు నివసించిన ప్రాంతాల సరిహద్దులో నివసించారు. కొలంబియన్ పూర్వ కోస్టారీకా " ఇస్త్మొ - కొలంబియన్ ప్రాంతం "లో భాగంగా ఉండేది.కోస్టారికాలో రాతి యుగానికి చెందిన మానవులు నివసించినదానికి ఆధారాలకు వివిధ వేట ఆధారిత బృందాలు ప్రవేశించడానికి సంబంధం ఉంది. వీరు క్రీ.పూ 10,000 - 7,000 ప్రాంతంలో ఇక్కడ నివసించారని పరిశోధకులు భావిస్తున్నారు. వీరు కామన్ ఎరాకు ముందు టురియల్బా లోయలో నివసించారు. క్లోవిస్ సంస్కృతికి (దక్షిణ అమెరికాకు చెందినది) చెందిన ఈటె మొనలు , బాణాలు ఈప్రాంతంలో లభించినందున ఈప్రాంతంలో ఒకేసమయంలో రెండు సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించారనడానికి నిదర్శనంగా ఉంది. 5,000 సంవత్సరాలకు ముందుగా కోస్టారికాలో వ్యవసాయం ఆరంభమైనదని ఆధారాలు వివరిస్తున్నాయి. వారు ప్రధానంగా దుంపలు , కేరెట్ వంటి పంటలు పండించబడ్డాయి. క్రీ.పూ 1-2 సహస్రాబ్ధాలలో ఇక్కడ వ్యవసాయ సమూహాలు స్థిరపడ్డాయి. ఇవి చిన్నవిగా చెదురుమదుగా ఉన్నాయి. వేట , అటవీ వస్తు సేకరణ నుండి వ్యవసాయ జీవితానికి మారడానికి గల కారణాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. ఈప్రాంతంలో మట్టిపాత్రల ఉపయోగం క్రీ.పూ 2,000-3,000 లలో మొదలైంది.ఈప్రాంతంలో గుండ్రని పాత్రలు, పళ్ళాలు, కాయలు , ఇతర రూపాలకు గాడి, వర్ణాలు , జంతువుల చిత్రాలతో అలంకరించబడిన మట్టిపాత్రల ముక్కలు లభించాయి. ఆరంభకాలంలో శక్తివంతమైన స్థానికజాతి ప్రజలు నివసించిన ప్రాంతం అయినప్పటికీ ఆధునిక కోస్టారికాలో స్థానిజాతి ప్రజల ప్రభావం ఇతర దేశాలతో పోల్చితే తక్కువగా ఉంటుంది.అత్యధికంగా స్థానికజాతి ప్రజలు కులాంతర వివాహాలద్వారా స్పానిష్ మాట్లాడే కాలనీ సంఘంలో మిశ్రితమయ్యారు.అల్పసఖ్యాక బ్రిబ్రి , బొరుకా స్థానికజాతులకు చెందిన ప్రజలు పనామా సరిహద్దులో కోస్టారీకా ఆగ్నేయప్రాంతంలో ఉన్న " కార్డిలేరా డీ టలమంకా " పర్వత ప్రాంతాలలో నివసిస్తున్నారు.

స్పెయిన్ కాలనీ పాలన

క్రిస్టోఫర్ కొలంబస్ తన చివరి సముద్రయాత్రలో 1502లో కోస్టారికా తూర్పుతీరంలో ప్రవేశించిన సమయంలో ఈప్రాంతాన్ని చూసి " లా కోస్టా రీకా " (సుసంపన్నమైన సముద్రతీరం) అని వర్ణించాడని భావిస్తున్నారు. అయినప్పటికీ ఈఅభిప్రాయంతో కొందరు విభేదిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న స్థానికజాతి ప్రజల వద్ద విస్తారంగా బంగారు ఆభరణాలు ఉన్నాయని క్రిస్టోఫర్ కొలంబస్ వర్ణించాడు. సాహసయాత్రికుడు " గిల్ గాంజలెజ్ డావిలా " 1522 కోస్టారీకా పశ్చిమతీరాంలో ప్రవేశించి స్థానికజాతి ప్రజలను కలుసుకున్నాడు.

కోస్టారీకా 
The Ujarrás historical site in the Orosí Valley, Cartago province. The church was built between 1686 and 1693.

కాలనీ కాలంలో అధికభాగం కోస్టారీకా " కేప్టెంసీ జనరల్ ఆఫ్ గౌతమాలా " దక్షిణ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అది వైశ్రాయి పాలనలో ఉన్న న్యూ స్పెయిన్‌లో నామమాత్రం భాగంగా మాత్రమే ఉంది. అయినప్పటికీ కోస్టారీకా స్పెయిన్ సామ్రాజ్యంలో స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. గౌతమాలా రాజధానికి కోస్టారీకా సుదూరంగా ఉంది. చట్టబద్ధంగా స్పానిష్ చట్టం దక్షిణ సరిహద్దులో ఉన్న పనామా దేశంతో వ్యాపారం మీద నిషేధం విధించింది. బంగారం , వెండి కొరత కోస్టారీకాను పేదరికంలో , ఒంటరిప్రాంతంగా నిలిపింది. స్పానిష్ సామ్రాజ్యంలో ఈప్రాంతంలో మాత్రమే జనసాధ్రత అల్పంగా ఉంది. 1719లో స్పానిష్ గవర్నర్ కోస్టారీకాను అమెరికాలో అతిపేద , దీనాఅవస్థలో ఉన్న స్పానిష్ కాలనీగా పేర్కొన్నాడు.

కోస్టారీకా పేదరికానికి మరొక ముఖ్యకారణం ఉంది.బానిసత్వానికి ఉపకరించే స్థానికజాతి ప్రజలు ఈప్రాంతంలో లభించక పోవడం ఒక కారణంగా ఉంది.కోస్టారీకాలో నివసిస్తున్న ప్రజలు అధికంగా వారి స్వంతభూములలో పనిచేస్తూ ఉండేవారు. ఇక్కడ పెద్ద ఎత్తున తోటలు (హాసియండ్స్) అభివృద్ధి చేయడానికి ఇది ఆటంకంగా మారింది.అందువలన స్పానిష్ ప్రభుత్వం ఈప్రాంతం పట్ల ఆసక్తి కనబరచక వారి అభివృద్ధి బాధ్యత వారికే వదిలింది.ఇలాంటి విపరీతమైన పరిస్థితి కోస్టారికాకు విచిత్రమైన గుర్తింపు తీసుకువచ్చాయి.మిగిలిన పొరుగు దేశాలకంటే కోస్టారీకాలో సమానత్వం అధికంగా ఉంది. ఇది కోస్టారీకా అభివృద్ధికి దోహదం చేసింది.కోస్టారీకా మెస్టిజోలు , స్థానికజాతి ప్రజల వత్తిడికి గురికాని గ్రామీణ ప్రజాస్వామ్యంగా మారింది.క్రమంగా స్పానిష్ వలస ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం , సారవంతమైన అగ్నిపర్వత ధూళితో నిండిన ప్రాంతాల వైపు దృష్టి కేంద్రీకరించడంతో ఈప్రాంతం ఒంటరితనం క్రమంగా దూరం అయింది.

స్వతంత్రం

మద్య అమెరికాలోని ఇతరదేశాల మాదిరి కోస్టారీకా స్పైయిన్ నుండి స్వతంత్రం కొరకు పోరాడనేలేదు. 1821 సెప్టెంబరు 15న " మెక్సికన్ వార్ ఆఫ్ ఇండిపెండెంస్ " (1802-21) లో చివరిగా స్పెయిన్ అపజయం పొందిన తరువాత గౌతమాలాలో ఉన్న అధికారులు మద్య అమెరికా దేశాలన్నింటికీ స్వతంత్రం ప్రకటించారు.ఆ తారీఖును ఇప్పటికీ కోస్టారీకా స్వతంత్రదినంగా జరుపుకుంటుంది. 1820లో స్పానిష్ రాజ్యాంగాన్ని స్వీకరించిన నికరాగ్వా , కోస్టారీకా లియోన్ (నికరాగ్వా) రాజధానిగా చేసుకుని స్వయంప్రతిపత్తితో వ్యవహరించాయి.

స్వతంత్రం తరువాత అధికారికంగా దేశభవిష్యత్తును నిర్ణయించడంలో కోస్టారీకా సమస్యలను ఎదుర్కొన్నది. కోస్టారికాలో స్వతంత్రం వచ్చిన తరువాత మెక్సికన్ ఎపైర్‌లో విలీనం అయిన కార్టగొ (నికరాగ్వా) , హెరెడియా ప్రొవింస్ మద్దతుతో ఇంపీరియలిస్టులు , శాన్ జోస్ (కోస్టారీకా) , అలజుయేలా మద్దతుతో రిపబ్లికన్లు కొత్తగా రూపుదిద్దుకున్నారు.రెండు వర్గాలమద్య సమగ్రమైన అంగీకారం లేని కారణంగా కోస్టారికాలో మొదటి అంతర్యుద్ధం సంభవించింది.1823లో కోస్టారీకన్ సెంట్రల్ వ్యాలీలో ఉన్న ఒచొమొగొ కొండప్రాంతంలో " ది బాటిల్ ఆఫ్ ఒచొమొగొ " సంభవించింది. యుద్ధంలో రిపబ్లికన్లు విజయం సాధించారు. తరువాత కారాగో (కోస్టారీకా) నగరం రాజధాని హోదాను కోల్పోయింది. రాజధాని శాన్ జోస్ (కోస్టారీకా)కు తరలించబడింది.

కోస్టారీకా 
The 1849 national coat of arms was featured in the first postal stamp issued in 1862

1838లో " ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా " పనిచేయకుండా నిలిపివేయబడింది. తరువాత కోస్టారీకా సార్వభౌమ దేశంగా ప్రకటించబడింది.గౌతమాలా నగరం, ప్రస్తుతం కంటే కోస్టారికన్లు అధికంగా నివసిస్తున్న సెంట్రల్ ప్లాట్యూ మద్య సమాచారమార్గాలు బలహీనంగా ఉన్నందున ప్రాంతీయ ప్రజలు గౌతమాలా ప్రభుత్వం పట్ల తగినంత విధేయత చూపలేదు. కాలనీ కాలం నుండి ప్రస్తుత కాలం వరకు కోస్టారికా మద్య అమెరికాతో రాజకీయంగా సంబంధం కలిగి ఉండడానికి విముఖంగా ఉండడం ఈప్రాంతం ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి అడ్డంకిగా నిలిచింది.

ఆర్ధిక ప్రగతి

19వ శతాబ్దంలో మొదటిసారిగా ఫాఫీ తోటలపెంపకం ఆరంభించబడింది. 1843లో కాఫీ గింజలతో మొదటి షిప్ కోస్టారీకా నుండి ఐరోపా‌కు చేరుకుంది.తరువాత కోస్టారికా కాఫీ ఎగుమతి చేస్తున్న ప్రధాన దేశాలలో ఒకటిగా మారింది.20వ శతాబ్దం నాటికి కోస్టారీకా సంపద అభివృద్ధికి కాఫీ ప్రధాన వనరుగా మారింది.జనసాంధ్రత అధికంగా ఉన్న సెంట్రల్ ప్లాట్యూలో అధికంగా పండించబడుతున్న కాఫీ పంట ఎద్దుల బండ్లద్వారా పసిఫిక్ సముద్రతీరంలోని పుంటరెనాస్ నౌకాశ్రయం చేరుకుంటుంది.ఐరోపా ప్రధాన మార్కెటుగా మారినప్పటి నుండి సెంట్రల్ ప్లాట్యూ నుండి అట్లాంటిక్ సముద్రం వరకు రవాణా మార్గం నిర్మించడానికి కోస్టారికా అధిక ప్రాధాన్యత ఇచ్చింది.ఈ ప్రయోజనం కొరకు 1870లో కోస్టారికా యు.ఎస్. వ్యాపారి మైనర్ సి.కెయిత్‌తో వెస్టర్న్ కరీబియన్ జోన్‌లో లైమన్ నౌకాశ్రయం వరకు రైలుమార్గం నిర్మించడానికి సంప్రదింపులు జరిపింది. అనేక కష్టనష్టాలకు ఓర్చి వ్యాధులు, ఆర్థికసమస్యలతో పోరాడి 1890లో రైలుమార్గ నిర్మాణం పూర్తి అయింది.రైలుమార్గ నిర్మాణంలో పాల్గొన్న ఆఫ్రో - కోస్టారికన్లలో అనేక మంది (మొత్తం జనాభాలో 3%) జమైకా నుండి పారిపోయి కోస్టారికా చేరుకున్నారు. యు.ఎస్. నేరస్థులు, ఇటాలియన్లు, చైనీయులు కూడా రైలుమార్గం నిర్మాణంలో పాల్గొన్నారు.రైలుమార్గ నిర్మాణంలో పాల్గొన్నందుకు బదులుగా కోస్టారికన్ ప్రభుత్వం కెయిత్‌కు పెద్ద భూభాగం, రైలుమార్గ లీజు మంజూరు చేసారు. వాటిలో కెయిత్ అరటిపంటను పండించి యునైటెడ్ స్టేట్స్‌కు ఎగుమతి చేసాడు. ఫలితంకా కోస్టారికన్ ప్రధాన ఎగుమతి కాఫీ పంటకు అరటిపంట పోటీగా మారింది. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ వంటి విదేశీయులకు స్వంతమైన కంపెనీలు దేశీయ ఆర్థికరగంలో ప్రధానపాత్ర పోషించాయి.[ఆధారం చూపాలి]

20వ శతాబ్ధం

చారిత్రకంగా కోస్టారికా సాధారణంగా శాంతిని, స్థిరమైన రాజకీయాలు కలిగి ఉంది.సహ లాటిన్ అమెరికన్ దేశాలలో ఇవి తక్కువగా ఉంటాయి.19వ శతాబ్దంలో కోస్టారీకాలో రెండు హింసాత్మక పీరియడ్స్ చోటుచేసుకున్నాయి. 1917-1919లో జనరల్ " ఫెడెరికో టినొకొ గ్రనాడోస్ " పదవీచ్యుతుని చేసి దేశం నుండి తరిమే వరకు సైనిక నియంతలా పాలన చేసాడు. ప్రజలచేత ద్వేషించబడిన టినొకొ పాలన కారణంగా కోస్టారీకా సైన్యం సంఖ్యాపరంగా, సంపదపరంగా, రాజకీయ మద్దతు పరంగా క్షీణించింది. 1948లో " జోస్ ఫిగర్స్ ఫెర్రర్ " అధ్యక్ష ఎన్నికను వ్యతిరేకిస్తూ సైనికతిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. 44రోజుల కోస్టారీకన్ అంతర్యుద్ధంలో దాదాపు 2,000 మంది మరణించారు. విజయవంతమైన తిరుగుబాటుదారులు సైనిక ప్రభుత్వం స్థాపించారు. తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక చేయబడిన అసెంబ్లీ రాజ్యాంగ స్థాపనకు కృషి చేసారు. సస్కరణలు పనిచేయడం మొదలైన తరువాత సైనిక ప్రభుత్వం అధికారాన్ని 1949 నవంబరు 8న ఉల్టేకు బదిలీ చేసింది. తిరుగుబాటు ముగింపుకు వచ్చిన తరువాత పాల్గొన్న నాయకులు జాతీయ కథానాయకులు అయ్యారు.1953లో ఎన్నికల ద్వారా నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి కోస్టారీకా 14 అధ్యక్ష ఎన్నికలు నిర్వహించింది. చివరిగా 2014లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1948 నుండి నిరాటంకంగా సాగిన ప్రజాస్వామ్యంతో కోస్టారీకాలో స్థిరమైన పాలన కొనసాగుతుంది.

భౌగోళికం

కోస్టారీకా 
Costa Rica map of Köppen climate classification.
కోస్టారీకా 
Arenal Volcano

కోస్టారికా మద్య అమెరికాలో ఉంది. ఇది 8-12 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82-86 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.దేశం తూర్పు సరిహద్దులో కరీబియన్ సముద్రం, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి.మొత్తం సముద్రతీరం 1290 కి.మీ. ఇందులో కరీబియన్ సముద్రతీరం పొడవు 212 కి.మీ., పసిఫిక్ సముద్రతీరం పొడవు 1016 కి.మీ ఉన్నాయి.కోస్టారికా ఆగ్నేయ సరిహద్దులో పనామా (సరిహద్దు పొడవు 330కి.మీ ), ఉత్తర సరిహద్దులో నికరాగ్వా (సరిహద్దు పొడవు 309 కి.మి) ఉన్నాయి.మొత్తం కోస్టారికా భూభాగ జలాలు 51100 చ.కి.మి., 589 చ.కి.మి ఉన్నాయి.

చెర్రో చిరిపొ (3819 మీ ఎత్తు ) ప్రాంతం దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావించబడుతుంది. మద్య అమెరికాలో ఇది 6వ స్థానంలో ఉంది. " ఇరాజో వాల్కనొ " (3,431 మీ ఎత్తు) దేశంలో అత్యత ఎత్తైన వాల్కనొ (జ్వాలాముఖి) గా గుర్తించబడుతుంది.అత్యంత పెద్ద సరోవరం " లేక్ అరెనల్ " . కోస్టారీకాలో ఉన్న 14 అగ్నిపర్వతాలలో గత 75 సంవత్సరాల కాలంలో 7 అగ్నిపర్వతాలు బద్దలు అయ్యాయి. దేశంలో 5.7 మాగ్నిట్యూడ్ కంటే అధికమైన భూకంపాలు 10 మార్లు (వీటిలో 3 భూకంపాలు7.0 కంటే అధికం) సంభవించాయి.

కోస్టారికాలో పలు ద్వీపాలు ఉన్నాయి. కొకొస్ ద్వీపం (24 చ.కి.మి), దేశంలో అత్యంత విశాలమైన ద్వీపం ఇస్లా కలెరొ (151.6 చ.కి.మి). కోస్టారికా 25% నేషనల్ టెర్రిటరీ " ఎస్.ఐ.ఎన్.ఎ.సి" సంరక్షణలో ఉంది. కోస్టారికాలో పలు జాతుల జంతువులు ఉన్నాయి.

వాతావరణం

భూమద్యరేఖకు ఉత్తరంగా 8-12 డిగ్రీలలో ఉన్న కోస్టారీకా సంవత్సరమంతా ఉష్ణమండల వాతావరం కలిగి ఉంటుంది. సముద్రమట్టం నుండి ఎత్తు, వర్షపాతం, టోపోగ్రఫీ, భౌగోళిక వైవిధ్యం కారణంగా దేశం అంతటా ప్రాంతాలవారిగా వైవిధ్యమైన మైక్రోక్లైమేట్ నెలకొని ఉంది.

కోస్టారీకా వాతావరణం వర్షపాతం ఆధారితంగా వర్గీకరించబడుతున్నాయి. వాతావరణపరంగా సంవత్సరం రెండుభాగాలుగా విభజించబడుతుంది. వేసవి పొడి వాతావరణం (డ్రై సెషన్), వర్షాకాలం ప్రాంతీయంగా వింటర్ భావించబడుతుంది. వేసవి కాలం డిసెంబరు, ఏప్రిల్ వరకు, వింటర్ సెషన్ లేక వర్షాకాలం మే నుండి నవంబరు వరకు కొనసాగుతున్నాయి.ఈ సమయంలోనే అట్లాంటిక్ హరికేన్లు సంభవిస్తుంటాయి. ఈసమయంలోనే అధికంగా వర్షం కురుస్తుంటుంది.కరీబియన్ పర్వతసానువులలో ఉన్న " కార్డిలెరా సెంట్రల్ ప్రాంతాలలో వర్షపాతం అధికంగా ఉంటుంది. ఇక్కడ వార్షిక వర్షపాతం 5,000 మి.మి ఉంటుంది. కరీబియన్ వైపు వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. సముద్రతీర దిగువభూభాగంలో సరాసరి 27 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత , జనసంఖ్య అధికంగా ఉన్న ప్రధాన భూభాగంలో (కార్డిలెరా సెంట్రల్)) సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత , పర్వతప్రాంతాలలో 10 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Costa Rica
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 27
(81)
27
(81)
28
(82)
28
(82)
27
(81)
27
(81)
27
(81)
27
(81)
26
(79)
26
(79)
26
(79)
26
(79)
27
(81)
సగటు అల్ప °C (°F) 17
(63)
18
(64)
18
(64)
18
(64)
18
(64)
18
(64)
18
(64)
18
(64)
17
(63)
18
(64)
18
(64)
18
(64)
18
(64)
సగటు అవపాతం mm (inches) 6.3
(0.25)
10.2
(0.40)
13.8
(0.54)
79.9
(3.15)
267.6
(10.54)
280.1
(11.03)
181.5
(7.15)
276.9
(10.90)
355.1
(13.98)
330.6
(13.02)
135.5
(5.33)
33.5
(1.32)
1,971
(77.61)
Percent possible sunshine 40 37 39 33 25 20 21 22 20 22 25 34 28
Source:

Flora and fauna

కోస్టారీకా 
Red-eyed Tree Frog (Agalychnis callidryas)
కోస్టారీకా 
Heliconius doris Linnaeus butterfly of Costa Rica

కోస్టారీకా పలు జాతుల మొక్కలకు , జంతువులకు నిలయంగా ఉంది. ప్రపంచ భూభాగంలో 0.1% భూభాగం ఉన్న కోస్టారీకాలో 5% ప్రపంచపు జీవవైవిధ్యం ఉంది. దేశంలోని 25% భూభాగంలో సంరక్షిత జాతీయ వన్యప్రాంతం (ప్రొటెక్టెడ్ నేషనల్ పార్క్స్)ఉంది. అతిపెద్ద సంరక్షిత ప్రాంతాలు కలిగిన దేశంగా కోస్టారీకా గుర్తించబడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల సరాసరి 13% , అభివృద్ధి చెందిన దేశాలలో 8% ఉంది. అరణ్యాల నరికివేతను తగ్గించడంలో కోస్టారికా విజయం సాధించింది. 1973 నుండి 1989 మద్య ప్రంపంచంలో చివరి స్థానంలో ఉండగా 1989 నుండి 2005 నాటికి 0% ఉంది." కొర్కొవాడొ నేషనల్ పార్క్, జీవవైవిధ్యం (బిగ్ క్యాట్, టాపిర్స్) అంతర్జాతీయంగా పర్యావరణ ప్రేమికులచేత ప్రశంశించబడుతుంది.పర్యాటకులు ఇక్కడ విస్తారమైన జంతుజాలం చూడగలమని భావిస్తుంటారు. కొర్కొవాడో నేషనల్ పార్క్‌లో మాత్రమే 4 జాతుల కోస్టారికన్ కోతులు ఉన్నాయి. వీటిలో " వైట్ హెడెడ్ కాపుచిన్, మాంటిల్డ్ హౌలర్, జియోఫ్రాయ్ స్పైడర్ మంకీ, మద్య అమెరికన్ స్క్వైరల్ మంకీ (పసిఫిక్ తీరంలో ఉన్న కోస్టారీకా , పనామాలో కొంత భూభాగంలో మాత్రమే ఉన్నాయి). 2008 వరకు అంతరించిపోతున్న జంతువులుగా ఇవి గుర్తించబడ్డాయి.అరణ్యాల నిర్మూలన, చట్టవిరుద్ధమైన పెంపుడు జంతువుల వ్యాపారం , వేట ఈజంతువుల స్థితికి ప్రధాన కారణంగా ఉన్నాయి. " టార్టుగ్యురొ నేషనల్ పార్క్ " సాలీడులు, హైలర్ , వైట్ త్రోటెడ్ కాపూచిన్ మంకీలు, త్రీ టోడ్ స్లాత్ , టూ - టోడ్ స్లాత్ లకు నిలయంగా ఉంది. 320 జాతుల పక్షులు , వైవిధ్యమైన సరీసృపాలు ఇక్కడ ఉన్నాయి.ఈపార్క్ వార్షికంగా గ్రీన్ తాబేళ్ళకు ఆశ్రయం ఇస్తుంది. ఈజంతువులకు ఇది చాలా ప్రాధాన్యత కలిగిన ఆశ్రయప్రాంతంగా ఉంది. గెయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్, హాక్స్బిల్ టర్టిల్ , లాగర్ హెడ్ సీ టర్టిల్ కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతుంటాయి. " మాంటెవర్డే క్లౌడ్ ఫారెస్ట్ రిజర్వ్ " 2,000 జాతుల మొక్కలకు నిలయంగా ఉంది. అనేక తోటలు 400 జాతుల పక్షులు , 100 జాతుల క్షీరదాలు ఇక్కడ కనిపెట్టబడ్డాయి. కోస్టారీకాలో 840 జాతుల పక్షులు గుర్తించబడ్డాయి. ఇక్కడ ఉత్తర , దక్షిణ అమెరికాకు చెందిన జంతువులు కనిపిస్తుంటాయి. దేశంలో సంవత్సరమంతా పడ్లను అందిస్తున్న చెట్లు విస్తారంగా ఉన్నాయి. పక్షులు వీటికి అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నాయి. పక్షులలో రెస్ప్లెండెంట్ క్యుత్జెల్, స్కార్లెట్ మాకా, త్రీ - వాటిల్డ్ బెల్బర్డ్, బేర్ - నెక్డ్ అంబ్రెల్లా బర్డ్ , కీల్- బిల్డ్ టౌకాన్ జాతి పక్షులు ఉన్నాయి. " ఇంస్టిట్యూటో నషియోనల్ బయోడైవర్శిడాడ్ రాయల్టీ వసూలు చేసుకోవడానికి అనుమతి పొందింది. సరీసృపాల వైవిధ్యానికి, ఆంఫిబియంస్‌కు కోస్టారికా కేంద్రంగా ఉంది. ప్రపంచపు అతివేగవంతమైన బల్లిజాతి జంతువు, స్పినీ టెయిల్డ్ ఇగుయానా ఇక్కడ ఉన్నాయి.

ఆర్ధికం

కోస్టారీకా 
An Intel microprocessor facility in Costa Rica is responsible for 20% of Costa Rican exports and 5% of the country's GDP.
కోస్టారీకా 
A coffee plantation in the Orosí Valley

వరల్డ్ బ్యాంక్ నివేదికల ఆధారంగా కోస్టారీకా తలసరి జి.డి.పి. 12,874 అమెరికన్ డాలర్లు (2013)అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ ఇప్పటికీ మౌలిక సౌకర్యాల నిర్వహణా లోపం, కొత్త పెట్టుబడుల కొరత మొదలైన సమద్యలను ఎదుర్కొంటున్నది. దేశంలో పేదరికం శాతం 23%. నిరుద్యోగ శాతం 7.8% (2012) వాణిజ్య లోటు బడ్జెట్ 5.2%. 2008లో 3% ఆర్థికాభివృద్ధి చెందింది. 2012 కోస్టారీకా ద్రవ్యోల్భణం 4.5%. 2006 అక్టోబరు 16న విదేశీమారకం విధానం ప్రవేశపెట్టబడింది. ఈవిధానం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం తగ్గించడం, యు.ఎస్.డాలర్ వాడకం తగ్గించడానికి కృషి చేయడానికి వీలు కలిగింది. అయినప్పటికీ 2006 కంటే 2009 నాటికి అమెరికన్ డాలర్‌కు వ్యతిరేకంగా కోస్టారీకన్ కోలాన్ విలువ 86% తగ్గింది.2014 నాటికి 550 కోస్టారీకన్ కోలన్‌కు 1 అమెరికన్ డాలర్‌గా క్రయవిక్రయాలు జరిగాయి. అలాగే ఒక యూరోకు 760 కోస్టారీకన్ కోలన్‌గా క్రయవిక్రయాలు జరిగాయి. కోస్టారీకా ప్రభుత్వం దేశంలో పెట్టుబడులు పెట్టేవారిగి పన్ను మినహాయింపు ప్రకటించింది. పలు అంతర్జాతీయ ఉన్నతసాంకేతిక సంస్థలు ఈప్రాంతంలో సంస్థలు స్థాపించి (ఇంటెల్, గ్లాక్సో స్మిత్ క్లైన్, ప్రాక్టర్ & గాంబ్లే ) ఎగుమతులు ప్రారంభించాయి.2006 లో ఇంటెల్ మైక్రొప్రొసెసర్ ఫెసిలిటీ మాత్రమే 20% కోస్టారీకన్ ఎగుమతులకు, 4.9% జి.డి.పి.కి భాగస్వామ్యం వహించింది. 2014 ఇంటెల్ కోస్టారీకాలో తయారీని నిలిపివేస్తున్నట్లు 1,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఫెసిలిటీ టెస్ట్‌గా కొనసాగుతూ ఉంది. డిజైన్ ఫెసిలిటీలో 1,600 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2004 - 2005 మద్య కాలంలో ఆగ్నేయాసియా, రష్యా లతో వ్యాపారం అతివేగంగా అభివృద్ధి చెందింది. 2004లో " ఆసియా - పసిఫిక్ ఎకనామిక్ ఫొరం "పర్యవేక్షణ దేశంగా ఉన్న కోస్టారీకా 2007లో నాటికి సభ్యత్వదేశం అయింది. 2003 నుండి విదేశీ పెట్టుబడుల ప్రణాళిక ఆధారంగా ఈప్రాంతంలో మొదటిదేశంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కోస్టారీకా సాధించిన అభివృద్ధిని గుర్తించిన " ది ఫైనాంషియల్ టైంస్ ఇంటెలిజెంస్ యూనిట్ " కోస్టారీకాకు " కరీబియన్ అండ్ సెంట్రల్ అమెరికన్ కంట్రీ ఆఫ్ ది ఫ్యూచర్ 2011/12 " అవార్డ్ ప్రధానం చేసింది. ఫార్మాస్యూట్ల్కల్స్, ఫైనాంషియల్ ఔట్ సౌర్సింగ్, సాఫ్ట్‌వేర్ డెవెలెప్మెంటు , ఎకోటూరిజం కోస్టారీకా ఆర్ధికరంగంలో ప్రధానపరిశ్రమలుగా ఉన్నాయి. కోస్టారీకా పౌరుల ఉన్నతవిద్యార్హత పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.1999 నుండి పర్యాటకం మొత్తం ఎగుమతుల కంటే అధికంగా దేశానికి విదేశీమారక ఆదాయం అందించింది. అరట్, అనాస , కాఫీ ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్నాయి. కోస్టారీకా కాఫీ ఉత్పత్తి కోస్టారీకా చరిత్ర , ఆర్ధికరంగంలో ప్రధానపాత్ర వహించింది. 2006 నాటికి వాణిజ్య పంటల ఎగుమతిలో కాఫీ 3వ స్థానానికి చేరింది. కోస్టారీకాలోని శాన్ జోస్, అలజుయేలా, హెరెడియా, పుంటరెనాస్ , కార్టగొ ప్రాంతాలలో కాఫీ అధికంగా పండించబడుతుంది. కోస్టారీకాలో పండించబడుతున్న రుచికరమైన కాఫీగింజలలో " కోస్టారీకన్ టర్రజ్ " ఒకటి. ఇవి నాణ్యమైన అరాబికా కాఫీబీంస్ గింజలలో ఒకటిగా భావిస్తున్నారు. ఎక్స్ప్రెస్సొ కాఫీ తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.ఎక్స్ప్రెస్సొ కాఫీ తయారుచేయడానికి ఉపయోగించే కాఫీ గింజలు జమైకా లో ( " జమైకన్ బ్లూ మౌంటెన్ కాఫీ " ), గౌతమాలాలో " ఆంటిగ్వా గౌతమాలా " అని , ఎథియోపియా లో ( " ఎథియోపియన్ సిడామొ " ) మొదలైన దేశాలలో కూడా పండించబడుతున్నాయి. కోస్టారీకా అమెరికా మార్కెట్లకు అనుమతి కల్పిస్తుంది. అలాగే యూరప్ , ఆసిలకు డైరెక్ట్ ఓషన్ యాక్సెస్ కల్పిస్తుంది. 2007 అక్టోబర్ మాసంలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలలో స్వేచ్ఛావిఫణికి అనుకూలంగా 51.6% ఓట్లు లభించాయి.

పర్యాటకరంగం

కోస్టారీకా 
Poás Volcano Crater is one of the country's main tourist attractions.

మద్య అమెరికాలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే దేశం కోస్టారీకా. 2016 లో 2.9 మిలియన్ల విదేశీయులు కోస్టారీకాను సందర్శించారు. 2015 నుండి పర్యాటకుల సంఖ్య 10% అభివృద్ధి చెందింది 2012 లో పర్యాటకరంగం నుండి 2.8 మిలియన్ల ఆదాయం లభించింది. వీరిలో యునైటెడ్ స్టేట్స్ పర్యాటకుల సంఖ్య 10,00,000 , యూరప్ పర్యాటకుల సంఖ్య 4,34,884. కోస్టారికా వెకేషంస్ అనుసరించి 22% పర్యాటకులు టామరిండోకు, 18% పర్యాటకులు అరెనల్, 17% ప్రజలు లిబరియా(ఇక్కడ డానియల్ ఒడూబర్ క్యురోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " ఉంది), 16% పర్యాటకులు శాన్ జోస్ (ఇది దేశరాజధాని ఇక్కడ జుయాన్ శాంటామరియా ఎయిర్ పోర్ట్ ఉంది), 18% పర్యాటకులు మాన్యుయల్ అంటానియో, 7 % పర్యాటకులు మాంటెవెర్డే లను సందర్శిస్తున్నారని భావిస్తున్నారు. కోస్టారీకాకు అరటి, కాఫీ ఎగుమతి ద్వారా లభించే విదేశీమారకం కంటే పర్యాటక రంగం నుండి లభిస్తున్న విదేశీమారకం అధికంగా ఉంది. ఎకోపర్యాటకం పయనీర్ స్థంస్థ కోస్టారికాలోని విస్తారమైన నేషనల్ పార్కులు, అభయారణ్యాలను పర్యాటకులు సందర్శించడానికి విశేషంగా కృషిచేస్తుంది. 2011లో " ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్ " ఆధారంగా కోస్టారీకా అంతర్జాతీయంగా 44వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. అలాగే లాటిన్ అమెరికా దేశాలలో ద్వితీయస్థానంలో ఉంది. ప్రథమస్థానంలో మెక్సికో ఉంది. " ది కోస్టారీకా రిసౌర్సెస్ సబ్ ఇండెక్స్ " ఆధారంగా కోస్టారీకా అంతర్జాతీయంగా నేచురల్ రిజర్వ్ పిల్లర్స్‌లో 6వ స్థానంలో సస్కృతిక సంపదలో 104 వ స్థానంలో ఉంది. 2014 లో " గ్లోబల్ గ్రీన్ ఎకనమీ ఇండెక్స్ " ఆధారంగా కోస్టారీకా 106 దేశాల జాబితాలో 6వ స్థానంలో ఉంది. ది సస్టెయినబుల్ పర్యాటకం వర్గీకరణలో కోస్టారీకా ప్రథమస్థానంలో ఉంది.పర్యాటకరంగం అభివృద్ధి చేయడానికి కోస్టారీకా " పేమెంట్ ఫర్ ఎకోసిస్టం సర్వీస్ " విధానం అభివృద్ధి చేసింది. కోస్టారీకా వ్యాపార సంస్థల కారణంగా అభివృద్ధి చెందుతున్న జలకాలుష్యానికి, గృహయాజమాన్యం బయటవేస్తున్న చెత్త, వ్యవసాయ రసాయనాలు, నీటి కాలువలలో చేర్చబడుతున్న ఇతర కాలుష్యాలకు పన్ను విధిస్తుంది. 2007 మే మాసంలో కోస్టారీకా ప్రభుత్వం 2021నాటికి దేశాన్ని " 100% కార్బన్ నేచురల్ "గా మార్చుతామని ప్రకటించింది. 2015 గణాంకాలు దేశం వినియోగిస్తున్న 93% విద్యుత్తు " రిన్యూవబుల్ ఎనర్జీ " ద్వారా లభిస్తుందని తెలియజేస్తుంది. 2016లో దేశం రిన్యూవబుల్ సౌర్స్ నుండి 98% విద్యుత్తును ఉత్పత్తి చేసి దేశానికి 110 రోజుల నిరంతర విద్యుత్తు అందించింది. 1996 లో పర్యావరణరక్షణ సేవలను అందించే భూస్వాములకు నేరుగా ఆర్థికసాయం అందించడానికి ప్రభుత్వం ఫారెస్ట్ లా రూపొందించింది. వాణిజ్య టింబర్ ఉత్పత్తి, అరణ్య నిర్మూలన సమస్యల నుండి అరణ్యాలను రక్షించడానికి ఈ విధానం సహకరిస్తుంది. ప్రజలను చైతన్యం చేయడానికి సేవలద్వారా ప్రజలు ఆదాయంపొదడానికి ఈప్రణాళిక సహకరిస్తుంది.ఇది మంచినీటి వనరుల రక్షణ, జీవవైద్య రక్షణ, ప్రకృతిసౌదర్య రక్షణకు సహకరిస్తుంది.

గణాంకాలు

2011 గణాంకాల ఆధారంగా కోస్టారీకా జనసంఖ్య 43,01,712. వీరిలో స్వేతజాతీయులు (మెజిస్టోలు) 83.6%, ములాటోలు 6.7%, ఇండిజినియస్ స్థానిక ప్రజలు (స్థానిక అమెరికన్లు) 2.4%, నల్లజాతి ప్రజలు (ఆఫ్రో కరీబియన్లు )1.1%., ఇతరులు 5.2% ఉన్నారు. స్థానిక అమెరికన్లు 1,04,000. వీరు అధికంగా అభయారణ్యాలలో నివసిస్తున్నారు. వీరిలో క్యుయితిర్రిసి (ది సెంట్రల్ వ్యాలీ), మతంబు లేక చొరొటెగా ప్రజలు (గయానాకాస్టే), మలెకు ప్రజలు (నార్తెన్ అలజుయెలా), బ్రిబ్రిప్రజలు (సదరన్ అట్లాంటిక్), కబెకార్ (కార్డిలెరా డీ టలమంకా), గయామి (సదరన్ కోస్టారీకా, పనామా సరిహద్దు వెంట), బొరుకా ప్రజలు (సదరన్ కోస్టారీకా), టెర్రాబా (సదరన్ కోస్టారీకా). యుపేరియన్ పూర్వీకత కలిగిన ప్రజలలో అధికంగా స్పానిష్ సంతతికి చెందినవారు, జర్మన్, ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, ఐరిష్, పోర్చుగీసు, పోలిష్ కుటుంబాలు, జూయిష్ కుటుంబాలు ఉన్నాయి. ఆఫ్రో కోస్టారికన్లకు క్రియోల్ ఇంగ్లీష్ వాడుక భాషగా ఉంది. వీరు 19వ శతాబ్దంలో జమైకా నుండి వలసవచ్చిన శ్రామికవర్గానికి చెందిన ప్రజల సంతతికి చెందిన వారు.

కోస్టారీకా 
Costa Rican school children

2011 గణాంకాల ఆధారంగా 83.6% ప్రజలు శ్వేతజాతీయులు లేక మెస్టిజోలు, 6.7% ములాటోలు (స్వేతజాతి, నల్లజాతి మిశ్రిత ప్రజలు), స్థానికజాతి ప్రజలు 2.4% ఉన్నారు. స్థానిక, యురేపియన్ మిశ్రిత ప్రజలు మిగిలిన లాటిన్ అమెరికన్ దేశాలకంటే తక్కువగా ఉన్నారు. కోస్టారీకా అనేకమంది శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అధికంగా కొలంబియా, నికరాగ్వా ప్రజలు ఉన్నారు. ఫలితంగా కోస్టారీకాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ప్రజలు 10% నుండి 15% (4,00,000- 6,00,000) ఉన్నారు. కొంతమంది నికరాగ్వా ప్రజలు సీజనల్ పనుల కొరకు కోస్టారీకా వచ్చి సీజన్ తరువాత తిరిగి వారి దేశానికి పోతుంటారు. 1970-1980 మద్య కాలంలో ఇతర లాటిన్ అమెరికాలలో అంతర్యుద్ధం సంభవించిన సమయాలలో ఆయాదేశాల ప్రజలు (ప్రత్యేకంగా చిలీ, అర్జెంటీనా )కోస్టారీకాలో శరణార్ధులుగా ఆశ్రయం పొందారు.ఎల్ సల్వేడార్ గొరిల్లాలు, ప్రభుత్వ డెత్ స్క్వాడ్ నుండి తప్పించుకున్న ప్రజలు శరణార్ధులుగా కోస్టారీకా చేరుకున్నారు.2010లో వరల్డ్ బ్యాంక్ నివేదిక ఆధారంగా 4,89,200 వలసప్రజలు కోస్టారీకాలో నివసిస్తున్నారని అంచనా. వీరిలో నికరాగ్వా,పనామా,ఎల్ సల్వేడార్,హొండూరాస్,గౌతమాలా, బ్రెజిల్ దేశాల ప్రజలు ఉన్నారు. కోస్టారీకా ప్రజలు 1,25,306 మంది విదేశాలలో నివసిస్తున్నారు. వీరు అధికంగా యునైటెడ్ స్టేట్స్,పనామా,నికరాగ్వా,స్పెయిన్,మెక్సికో,కెనడా,వెనుజులా,డోమనికన్ రిపబ్లిక్, ఈక్వెడార్ దేశాలలో నివసిస్తున్నారు.

మతం

Religion in Costa Rica

  Catholicism (70.5%)
  Protestantism (13.8%)
  Irreligion (11.3%)
  Buddhism (2.1%)
  Other religions (2.2%)
కోస్టారీకా 
Basílica de Nuestra Señంra de los Ángeles (Basilica of Our Lady of the Angels), during 2007 pilgrimage

కోస్టారీకాలో రోమన్ కాథలిజం ప్రధాన భాషగా, 1949 రాజ్యాంగాన్ని అనుసరించి దేశ అధికార భాషగా ఉంది. అదేసమయంలో దేశంలో మతస్వాతంత్ర్యం ఉంది. అమెరికా ఖండాలలో రోమన్ కాథలిజం దేశీయ మతంగా అంగీకరించిన దేశం కోస్టారీకా మాత్రమే. ఐరోపా లోని సూక్ష్మ దేశాలైన లీచ్తెంస్టియన్, మొనాకొ, వాటికన్, మాల్టా దేశాలలో రోమన్ కాథలిజం దేశీయమతంగా ఉంది.

2007లో యూనివర్శిటీ ఆఫ్ కోస్టారీకా దేశవ్యాప్తంగా నిర్వహించిన మతపరమైన గణాంకాల ఆధారంగా 70.5% కోస్టారీకాలో రోమన్ కాథలిక్కులు (44.9% కాథలిక్కులు), 13.8% ఎవాంజికల్ ప్రొటెస్టెంట్లు, నాస్థికులు 11.3%, ఇతర మతస్థులు 4.3% ఉన్నారు. ఆసియా, మిడిల్ ఈస్ట్ నుండి స్వల్పంగా, నిరంతరంగా సాగుతున్న వలసల కారణంగా ఇతర మతస్థుల సంఖ్య (మొత్తం జనసంఖ్యలో 2%) అభివృద్ధి చెందుతూ ఉంది. బౌద్ధులలో చాలామంది హాన్ చైనీస్ కమ్యూనిటీ సభ్యులుగా ఉన్నారు. 40,000 మంది ఉన్న బౌద్ధులలో కొత్తగా మతం మారిన ప్రజలు ఉన్నారు. దేశంలో 500 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. మొత్తం ప్రజలలో వీరి సంఖ్య 0.001% ఉంది. " ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ "లో 35,000 మంది సభ్యులు ఉన్నారు. శాన్ జోస్ కోస్టారీకా టెంపుల్ ప్రాంతీయ ఆరాధనా కేంద్రంగా సేవలందిస్తుంది. వీరు మొత్తం జనసంఖ్యలో 1% ఉన్నారు.

Languages

కోస్టారీకా అధికంగా స్పానిష్ భాష వాడుకలో ఉంది. ఇది కోస్టారీకన్ స్పానిష్‌గా పిలువబడుతుంది. ఇండిజెజియస్ రిజర్వ్ ప్రాంతాలలో ఇప్పటికీ కొన్ని స్థానిక భాషలు వాడుకలో ఉన్నాయి. వీటిలో బిర్బిరి, మలేకు, కబెకార్ , న్గబెరె ప్రధానమైనవి. వీటిలో కొన్ని భాషలకు వేలసంఖ్యలో వాడుకరులు ఉండగా మరికొన్ని భాషలకు వందల సంఖ్యలో వాడుకరులు ఉన్నారు. టెరిబె , బొరుకా భాషలకు వెయ్యి మంది కంటే తక్కువ వాడుకరులు ఉన్నారు. ఇంగ్లీష్ ఆధారిత క్రియోల్, జమైకన్ పటోసి (లెమనీస్ క్రియోల్) కరీబియన్ సముద్రతీర ప్రజలకు వాడుక భాషగా ఉంది. 18 వయసు పైబడిన ప్రజలలో 10.7% ప్రజలకు ఆంగ్లం వాడుక భాషగా ఉంది,07% ప్రజలకు ఫ్రెంచి వాడుక భాషగా ఉంది, 3% ప్రజలకు పోర్చుగీస్ వాడుక భాషగా జర్మన్ ద్వితీయ భాషగా ఉంది.

సంస్కృతి

కోస్టారీకా 
కోస్టారీకన్ ఉపాహారం గాలో పింటో
కోస్టారీకా 
లాస్ కర్రెటాస్ (జాతీయ చిహ్నం)

మెసొమెరికన్ , దక్షిణమెరికా సంస్కృతులు కలుసుకునే ప్రధానకేంద్రం కోస్టారికా. 16వ శతాబ్దంలో స్పానిష్ విజయయాత్ర ఇక్కడకు చేరుకున్న సమయంలో నైరుతీప్రాంతంలో ఉన్న నికోయా ద్వీపకల్పం నహుయత్ నాగరికత ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి దక్షిణసరిహద్దుగా ఉంది. మద్య , దక్షిణ ప్రాంతాలలో చిబ్చా నాగరికత ప్రభావం ఉంది. అట్లాంటిక్ సముద్రతీరంలో 17-18 శతాబ్ధాలలో ఆఫ్రికన్ శ్రామికులు ఆధిక్యతలో ఉన్నారు.

16వ శతాబ్దంలో స్పానిష్ వలసల ఫలితంగా స్పానిష్ సంస్కృతి ప్రజల దైనందిక జీవితంలో ప్రభావం చూపింది. స్పానిష్ భాష , కాథలిక్ మతం ప్రాథమికంగా ప్రభావితం చేసాయి.

" ది డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్, యూత్, స్పోర్ట్స్ " సాంస్కృతిక జీవన అభివృద్ధి , అనుసంధానానికి బాధ్యత వహిస్తుంది. డిపార్టుమెంటు కార్యక్రమాలలో సంస్కృతి, విషయుయల్ ఆర్ట్స్, సైన్సు ఆర్ట్స్, సంగీతం, పాట్రిమొని , గంధాలయ విధానం మొదలైన విభాగాలుగా విభజించబడ్డాయి. శాశ్వత కార్యక్రమాలలో సింఫొనీ ఆర్కెస్ట్రా ఆఫ్ కోస్టారీకా , యూత్ సింఫొనీ ఆర్కెస్ట్రా అంతర్భాగంగా ఉన్నాయి.[ఆధారం చూపాలి] నృత్యసంబంధిత కార్యక్రమాలలో సొకా మ్యూసిక్‌ల్సొక, సల్సా మ్యూసిక్‌ల్సొక,బచట, మెరెంగ్యూ, కుంబియా , కోస్టారికన్ స్వింగ్ నృత్యాలు వయసైన , యువతను ఆకర్షిస్తున్నాయి. జానపద నృత్యాలకు పక్కవాయిద్యంగా గిటార్ ప్రాధాన్యత కలిగి ఉంది. అయినప్పటికీ మరింబా వాయిద్యానికి జాతీయ వాయిద్యంగా గుర్తింపు ఇవ్వబడింది.

కోస్టారీకన్‌తో సంబధితమై ఉన్న సామెత " పురా విదా ". ఇది కోస్టారీకా జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలు వీధులలో సంచరించే సమయంలో దుకాణాలలో ఆహారం కొనుగోలుచేసే సమయంలో ఒకరిని ఒకరు చూసుకునే సమయంలో " ప్యూరా విదా " (మంచి జీవితం అని దీనికి అర్ధం) చెప్పుకుంటారు.

ఆహారం

కోస్టారీకా ఆహారవిధానాలలో స్థానిక అమెరికన్, స్పానిష్, ఆఫ్రికన్ , ఇతర ఆహారవిధానాలు మిశ్రితమై ఉంటాయి. టమలె మరుయు మొక్కజొన్నతో చేసే సంప్రదాయ ఆహారాలు ఇండిజెనియస్ ప్రజల ఆహారవిధానాలను , పొరుగున ఉన్న మెసొమెరికన్ ఆహారవిధానాలను ప్రతిబింభిస్తుంటాయి. స్పెయిన్ వారు మసాలాదినుసులు , పెపుడు జంతువులను ఇతర ప్రాంతాల నుండి తమ వెంట ఇక్కడకు తీసుకుని వచ్చారు. 19వ శతాబ్దంలో ఆఫ్రికన్ రుచులు ఇతర కరీబియన్ రుచులతో కోస్టారీకన్ ఆహారం మీద ప్రభావం చూపాయి.అందువలన కోస్టారీకన్ ఆహారం ప్రస్తుతం అత్యంత వైద్యభరితంగా మారింది. సమీపకాలంలో దేశంలో భాగంగా మారిన ప్రతి ఒక్క సంప్రదాయ సమూహం ఆహారవిధానాలు కోస్టారికా ఆహారసంస్కృతితో మిశ్రితమై ఉన్నాయి.

క్రీడలు

కోస్టారీకా 
క్లౌడియా పాల్ (మొదటి ఒలింపిక్ బంగారుపతక గ్రహీత 1996)

1936లో కోస్టారీకా " సమ్మర్ ఒలింపిక్స్ "లో పాల్గొన్నది. ఇందులో కోస్టారీకన్ క్రీడాకారుడు " బెర్నార్డో డీ లా గుయార్డియా " పాల్గొన్నాడు. 1980లో మొదటిసారిగా " వింటర్ ఒలింపిక్స్ "లో పాల్గొన్నది. ఇందులో కోస్టారీకన్ క్రీడాకారుడు " అర్తురో కించ్ " పాల్గొన్నాడు. కోస్టారీకా సాధించిన 4 ఒలింపిక్ పధకాలను స్విమ్మింగ్ క్రీడ ద్వారా సిల్వియా పాల్ , క్లౌడియా పాల్ సోదరీమణులు సాధించారు.1996లో క్లౌడియా స్విమ్మింగ్‌లో బంగారుపతకం సాధించింది.

కోస్టారీకాలో ఫుట్ బాల్ క్రీడ చాలా ప్రబలమైనదిగా ఉంది. " కోస్టారీకా నేషనల్ ఫుట్ బాల్ టీం " నాలుగుమార్లు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ క్రీడలలో పాల్గొని 2014 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. టోర్నమెంటులో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 2002 లో " రీజనల్ కాంకాకాఫ్ గోల్డ్ కప్ " రన్నర్‌గా నిలిచింది. పౌలో వాంచాపే ఇంగ్లాండులో మూడు క్లబ్బుల తరఫున 1900, 2000 లలో పాల్గొని కోస్టారీకన్ ఫుట్ బాల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వచ్చాడు.

విశేషాలు

  • సైన్యం లేని దేశం.
కోస్టారీకా 
Quepos coastline as seen from the Tarrazu highlands, Costa Rica

మూలాలు

బయటి లింకులు

    Government and administration

Tags:

కోస్టారీకా చరిత్రకోస్టారీకా భౌగోళికంకోస్టారీకా ఆర్ధికంకోస్టారీకా గణాంకాలుకోస్టారీకా సంస్కృతికోస్టారీకా విశేషాలుకోస్టారీకా మూలాలుకోస్టారీకా బయటి లింకులుకోస్టారీకా184719492012En-us-Costa Rica.oggen:Caribbean Seaదస్త్రం:En-us-Costa Rica.oggనికరాగ్వాపనామాపసిఫిక్ మహాసముద్రంవర్గం:Lang and lang-xx template errorsస్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

బ్రాహ్మణులుఅక్షరమాలఈస్టర్మోదుగభారతీయ జనతా పార్టీకె. అన్నామలైజ్యోతీరావ్ ఫులేఅంగుళంఅనుష్క శెట్టిసద్గురుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్కయ్యలునీతి ఆయోగ్యానిమల్ (2023 సినిమా)ఉండవల్లి శ్రీదేవిపొన్నం ప్రభాకర్కిరణజన్య సంయోగ క్రియవిటమిన్ బీ12తెలుగు అక్షరాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమార్చి 26గాలి జనార్ధన్ రెడ్డితెలుగు సినిమాజిల్లా కలెక్టర్నువ్వు నాకు నచ్చావ్కాళోజీ నారాయణరావుబాక్టీరియాప్రకృతి - వికృతిసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుమకరరాశిఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితావిజయ్ (నటుడు)తిక్కనశని (జ్యోతిషం)శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)నితిన్ఐశ్వర్య రాయ్నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఉపమాలంకారంపర్యాయపదండిస్నీ+ హాట్‌స్టార్రాజమండ్రికోవూరు శాసనసభ నియోజకవర్గంఎమ్.ఎ. చిదంబరం స్టేడియంలగ్నంఅన్నమయ్యతన్నీరు హరీశ్ రావుఇంటి పేర్లుమార్చి 27దుప్పిశోభన్ బాబు నటించిన చిత్రాలుజీలకర్రహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుధనూరాశిరాశి (నటి)గంగా నదిఅండమాన్ నికోబార్ దీవులుపసుపు గణపతి పూజఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపురాణాలుత్యాగరాజురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంగోత్రాలు జాబితాఉలవలుచెన్నై సూపర్ కింగ్స్సుడిగాలి సుధీర్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిశ్రీ కృష్ణుడుపావని గంగిరెడ్డిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)ఉగాదిరోహిణి నక్షత్రంభారత రాజ్యాంగంకాశీరమణ మహర్షిగుంటూరు కారంనీటి కాలుష్యంతిరుమల🡆 More