సిల్క్ రోడ్డు

సిల్క్ రోడ్డు తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే వాణిజ్య మార్గాల అల్లిక.

క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నుండి సా.శ. 18 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన పరస్పర సంపర్కాలకు ఈ సిల్క్ మార్గం అనుసంధాన కర్తగా ఉంది. సిల్క్ రోడ్డు ప్రధానంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలను దక్షిణ ఆసియా, పర్షియా, అరేబియా ద్వీపకల్పం, తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఐరోపాతో కలిపే భూ మార్గాలను సూచిస్తుంది.

సిల్క్ రోడ్డు (Silk Road)
Map of Eurasia with drawn lines for overland routes
సిల్క్ రోడ్డులోని ముఖ్య దారులు
మార్గ సమాచారం
Time periodసుమారు సా.శ.పూ 114–సా.శ 1450ల వరకు
అధికారిక పేరుSilk Roads: the Routes Network of Chang'an-Tianshan
రకంCultural
క్రైటేరియాii, iii, iv, vi
గుర్తించిన తేదీ2014 (38th session)
రిఫరెన్సు సంఖ్య.1442
RegionAsia-Pacific
సిల్క్ రోడ్డు
చైనా నుండి వియత్నాం, జావా, ఇండోనేసియా, భారతదేశం, మధ్య ఆసియా, ఇరాన్, అరేబీయ ద్వీపకల్పం, ఈజిప్టు గుండా ఐరోపా వరకూ ఉన్న పట్టు దారి . భూమార్గాలు ఎరుపురంగులోనూ, జలమార్గాలు నీలంరంగులోనూ చూపించబడ్డాయి

సిల్క్ రోడ్డు అంటే పట్టు మార్గం అని అర్థం. చైనాలోని హాన్ రాజవంశం కాలం నుండి (సా.శ.పూ 207–సా.శ 220) మొదలు, ఈ దారి పొడవునా జరిగిన లాభదాయకమైన పట్టు వ్యాపారం కారణంగా దీనికి సిల్క్ రోడ్డు దాని పేరు వచ్చింది. చైనా సామ్రాజ్య రాయబారి జాంగ్ కియాన్ చేసిన యాత్రలూ, అన్వేషణల ద్వారానూ, అనేక సైనిక విజయాల ద్వారానూ హాన్ రాజవంశం క్రీ.పూ. 114 ప్రాంతంలో మధ్య ఆసియాలో విస్తరించింది. చైనీయులు తమ వాణిజ్య ఉత్పత్తుల భద్రత పట్ల ఎంతో ఆసక్తి చూపారు. వాణిజ్య మార్గపు రక్షణ కోసం మహా కుడ్యాన్ని విస్తరించారు.

చైనా, కొరియా, జపాన్, భారత ఉపఖండం, ఇరాన్, ఐరోపా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, అరేబియా నాగరికతల అభివృద్ధిలో సిల్క్ రోడ్డు వాణిజ్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. వివిధ నాగరికతల మధ్య సుదూరమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెరిచింది. చైనా నుండి ఎగుమతి చేసిన ప్రధాన వాణిజ్య వస్తువు పట్టు అయినప్పటికీ, మతాలు (ముఖ్యంగా బౌద్ధమతం), సమకాలీన తత్వాలు, శాస్త్రాలు, కాగితం, గన్‌పౌడర్ వంటి సాంకేతికతలతో సహా అనేక ఇతర వస్తువులు, ఆలోచనలూ కూడా మార్పిడి చేసుకున్నారు. కాబట్టి ఆర్థిక వాణిజ్యంతో పాటు, సిల్క్ రోడ్డు వివిధ నాగరికతల మధ్య సాంస్కృతిక వాణిజ్యం కోసం కూడా ఉపయోగపడింది. వ్యాధులు, ముఖ్యంగా ప్లేగు, కూడా సిల్క్ రోడ్డు వెంట వ్యాపించాయి.

ఈ దారి గుండా చైనా ప్రధానంగా పట్టు, తేయాకు, పోర్సలీన్ ఎగుమతి చేసేది. భారతదేశం సుగంధద్రవ్యాలు, దంతాలు, మిరియాలు, నేతవస్త్రాలు, విలువైన రత్నాలూ ఎగుమతి చేసేది. రోమన్ సామ్రాజ్యం బంగారం, వెండి, ద్రాక్షరసం, తివాచీలు, నగలు ఎగుమతి చేసేది. ఈ దారి పొడవునా పూర్తిగా ఒకే మనిషి ప్రయాణించడం చాలా తక్కువ. మధ్యలో ఎంతోమంది దళారీలు ఉండేవారు. ప్రాచీన భారతీయులూ, బాక్టీరియనులూ ప్రధాన వర్తకులుగా ఉండగా, సా.శ. 5–8 శతాబ్దాలలో సోగ్దియనులూ, ఆ తర్వాతకాలంలో అరేబియా, పర్షియా వర్తకులూ ప్రధానంగా వర్తకం చేసేవారు.

2014 జూన్‌లో, యునెస్కో సిల్క్ రోడ్డు లోని చాంగన్-టియాన్షాన్ కారిడార్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొంది. భారతీయ భాగం తాత్కాలిక సైట్ జాబితాలో ఉంది.

పేరు

సిల్క్ రోడ్డు 
చైనాలోని[permanent dead link] హునాన్ ప్రావిన్స్లోని చాంగ్షాలోని మావాంగ్డుయ్ వద్ద సమాధి నంబర్ 1 నుండి నేసిన పట్టు వస్త్రాలు, క్రీ.పూ 2 వ శతాబ్దం

సిల్క్ రోడ్డుకు ఆ పేరు లాభదాయకమైన పట్టు నుండి వచ్చింది. ఇది మొదట చైనాలో అభివృద్ధి చేసారు. వాణిజ్య మార్గాలను విస్తృతమైన ఖండాంతర నెట్‌వర్కుగా అనుసంధానించడానికి ఇది ఒక ప్రధాన కారణం. దశాబ్దాలుగా విద్యావేత్తల్లో ఉన్న ఏకాభిప్రాయం ఏమిటంటే, ఫెర్డినాండ్ వాన్ రిచ్‌థోఫెన్ 1868 నుండి 1872 వరకు చైనాకు ఏడు యాత్రలు చేశాక, 1877 లో జర్మన్ పదం Seidenstraße ("సిల్క్ రోడ్") ను కాయించాడు. అయితే, ఇటీవలి పరిశోధనల్లో, ఈ పదం అంతకు కనీసం కొన్ని దశాబ్దాల క్రితమే వాడుకలో ఉందని తేలింది. సిల్క్ రోడ్డు భావన యొక్క అభివృద్ధి చాలా మంది వ్యక్తుల గణనీయమైన కృషి ఫలితమేనని ఇప్పుడు భావిస్తున్నారు.

"సిల్క్ రూట్" అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ పదం 19 వ శతాబ్దంలో సృష్టించబడినప్పటికీ, ఇది 20 వ శతాబ్దం వరకు అకాడెమియాలో విస్తృతంగా ఆమోదం పొందలేదు లేదా ప్రజలలో ఆదరణ పొందలేదు. ది సిల్క్ రోడ్డు పేరుతో మొదటి పుస్తకం 1938 లో స్వీడిష్ భూగోళ శాస్త్రవేత్త స్వెన్ హెడిన్ రాసాడు.

'సిల్క్ రోడ్' అనే పదం వాడుకకు వ్యతిరేకులూ లేకపోలేదు. ఉదాహరణకు, రోమన్ సామ్రాజ్య ఆర్థికవ్యవస్థకు భారతదేశం, అరేబియాలతో సముద్రమార్గంలో చేసిన సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఎంతో ఎక్కువ ప్రభావశీలమైనదని వార్విక్ బాల్ వాదించాడు. ఇది సముద్రంలో ఎక్కువగా భారతదేశం ద్వారానే జరిగింది. భూమిపై సోగ్డియన్ల వంటి అనేక మంది మధ్యవర్తుల ద్వారా జరిగింది. ఇదంతా ఆధునిక అకాడెమియా సృష్టించిన "పౌరాణిక కల్పన" అనేంతవరకు బాల్ వెళ్ళాడు. మంగోల్ సామ్రాజ్యం కాలం వరకు తూర్పు ఆసియా నుండి పశ్చిమానికి పొందికైన భూభాగ వాణిజ్య వ్యవస్థ లేదని, వస్తువులు స్వేచ్ఛగా రవాణా చెయ్యగలిగే పరిస్థితి లేదనీ వార్విక్ బాల్ వాదించాడు. మార్కో పోలో, ఎడ్వర్డ్ గిబ్బన్ వంటి తూర్పు-పశ్చిమ వాణిజ్యాన్ని చర్చించిన సాంప్రదాయిక రచయితలు ప్రత్యేకించి ఏ మార్గాన్నీ "పట్టు"గా ముద్ర వెయ్యలేదని అతడు పేర్కొన్నారు.

సిల్క్ రోడ్డు దక్షిణ భాగాలైన, ఖోటాన్ (జిన్జియాంగ్) నుండి తూర్పు చైనా వరకు ఉన్న రోడ్డును, చాలాకాలంగా, క్రీ.పూ 5000 నుండే, పచ్చల (జేడ్) వ్యాపారం కోసం ఉపయోగించారు గాని, పట్టు కోసం కాదు. ఇప్పటికీ పచ్చల వ్యాపారం కోసం ఈ మార్గాన్ని వాడుతున్నారు. పట్టు వాణిజ్యం చాలా పెద్దదీ, భౌగోళికంగా చాలా విస్తృత ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి గానీ, లేకపోతే "సిల్క్ రోడ్" కంటే "జేడ్ రోడ్" అనే పదమే దీనికి బాగా సరిపోతుంది. ఈ పదం చైనాలో ప్రస్తుత ఉపయోగంలో ఉంది కూడా.

చైనాలో మొదలు (క్రీ.పూ. 130)

మధ్య ఆసియాలో చైనా దండయాత్రలు, విజయాల ద్వారా సిల్క్ రోడ్డు మొదలైంది, ప్రపంచీకరణ చెందింది.

ఫెర్గానా లోయతో మధ్యధరా అనుసంధానించబడినందున, ఇక తారిమ్ బేసిన్ హెక్సీ కారిడార్ మీదుగా చైనా ప్రధాన భూభాగానికి మార్గాన్ని తెరవడమే తరువాతి అడుగు. ఈ పొడిగింపు క్రీస్తుపూర్వం 130 లో వచ్చింది. రాయబారి జాంగ్ కియాన్ ఇచ్చిన నివేదికల పర్యవసానంగా హాన్ రాజవంశపు రాయబార కార్యాలయాల మధ్య ఆసియాకు వచ్చాయి (జియాంగ్నుకు వ్యతిరేకంగా యూజీతో పొత్తు కలపటానికి జాంగ్ కియాన్‌ను పంపారు). జాంగ్ కియాన్ నేరుగా ఫెర్గానా లోని దాయువాన్, ట్రాన్స్‌ఆక్సియానా లోని యూజీ, డాక్సియాకు చెందిన బాక్ట్రియా, ఖాంగ్‌జు సందర్శించాడు. అతను సందర్శించని పొరుగు దేశాలైన అంక్సీ (పార్థియా), టియాజి ( మెసొపొటేమియా ), షెండు ( భారత ఉపఖండం ), వుసున్ వంటి దేశాల గురించి కూడా అతడు నివేదికలు తయారు చేశాడు. జాంగ్ కియాన్ నివేదిక, పశ్చిమ దిశగా చైనా విస్తరణకూ గోడల నిర్మాణానికీ తగిన ఆర్థిక కారణాన్ని సూచించింది. పట్టు దారిలో తొలు అడుగులు వేయించింది. ఇది చరిత్రలో, ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ వాణిజ్య మార్గాలలో ఒకటిగా నిలిచింది.

హెవెన్లీ హార్సెస్ యుద్ధం, హాన్-జియాంగ్ను యుద్ధాల్లో విజయం సాధించిన తరువాత, చైనా సైన్యాల మధ్య ఆసియాలో పాతుకుపోయాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రధాన మార్గంగా సిల్క్ రోడ్డును వాడడం మొదలుపెట్టాయి. ఫెర్గానా, బాక్ట్రియా, పార్థియన్ సామ్రాజ్యాల పట్టణ నాగరికతలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవటానికి చైనా చక్రవర్తి వు ఆసక్తి కనబరిచారని కొందరు అన్నారు: "ఇవన్నీ విన్నప్పుడు స్వర్గపు కుమారుడు ఇలా అభిప్రాయపడ్డాడు: ఫెర్గానా, బాక్ట్రియా, పార్థియన్ లు పెద్ద దేశాలు. ఇక్కడ బోలెడన్ని అరుదైన వస్తువులున్నాయి. ప్రజలు స్థిరమైన ఆవాసాల్లో ఉంటారు. వీళ్ల వృత్తులు చైనీయుల వృత్తుల్లాంటివే. కానీ వీళ్ళ సైన్యాలు బలహీనమైనవి. చైనా వస్తువులంటే వారికి మక్కువ ఎక్కువ " ( హౌ హన్షు, మలి హాన్ చరిత్ర ). వూ చక్రవర్తి ప్రధానంగా జియాంగ్నుతో పోరాడడం పట్లే ఆసక్తి కనబరిచాడనీ, హెక్సీ కారిడార్‌లో అశాంతి చల్లబరచిన తరువాతే చైనీయులు వాణిజ్యంపై దృష్టి పెట్టారనీ కొందరు అన్నారు. సిల్క్ రోడ్ల మూలం చైనీయుల చేతిలో ఉంది. చైనాలోని మట్టిలో సెలీనియం లేదు. దీనివలన గుర్రాల కండరాలు బలహీనపడి, వాటి పెరుగుదలకు సరిగా ఉండేదిం. కాదు. పర్యవసానంగా, చైనాలోని గుర్రాలు చైనా సైనికుడి బరువును మోయలేకపోయేవి. చైనీయులకు యురేసియన్ స్టెప్పీల్లో సంచార జాతులు పెంచే మేలుజాతి గుర్రాలు అవసరమయ్యాయి. వ్యవసాయ సమాజాలు మాత్రమే ఉత్పత్తి చేసే ధాన్యం, పట్టు వంటి వస్తువులు కావాలని సంచార జాతులు కోరుకున్నారు. చైనా గోడ కట్టిన తరువాత కూడా, సంచార జాతులు గోడల ద్వారాల వద్ద గుమిగూడి వస్తుమార్పిడి చేసుకునేవారు. గోడను కాపాడేందుదుకు నియమించిన సైనికులకు ప్రభుత్వం జీతాలను పట్టురూపంలో చెల్లించేది. ఆ సైనికులు ఈ పట్టుతో సంచార జాతులతో వ్యాపారం చేసేవారు. ప్రారంభంలో, చైనీయులు సిల్క్ రోడ్లపై ఆధిపత్యం కొనసాగించారు, ఈ ప్రక్రియ "చైనా సిల్క్ రహదారిపై నియంత్రణను హ్సియంగ్-ను నుండి లాక్కోవడంతో" ఇది మరింత వేగవంతమైంది. చైనీస్ జనరల్ చెంగ్ కీ "కారా షహర్, కుచా ల మధ్య ఉన్న వులీ వద్ద తారిమ్ కు రక్షకుడిగా తనను తాను స్థాపించుకున్నాడు".

సిల్క్ రోడ్డు 
చైనీస్ ఈస్టర్న్ హాన్ రాజవంశం (1 వ - 2 వ శతాబ్దం CE) నుండి సిరామిక్ గుర్రపు తల, మెడ (శరీరం నుండి విరిగింది)
సిల్క్ రోడ్డు 
కాన్స్టాంటియస్ II యొక్క కాంస్య నాణెం (337–361), చైనాలోని జిన్‌జియాంగ్‌లోని కార్ఘాలిక్‌లో కనుగొనబడింది

గ్జియాంగ్‌ను సంచార జాతితో పోరాడడంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన డాయువాన్ ల వద్ద ఉన్న పొడవైన, శక్తివంతమైన గుర్రాలు ("స్వర్గలోకపు గుర్రాలు" అని పేరు పెట్టారు) కూడా చైనీయులను బాగా ఆకర్షించాయి. . హాన్-డాయువాన్ యుద్ధంలో వారు డాయువాన్‌ను ఓడించారు. చైనీయులు తదనంతరం అనేక రాయబారాలను, ప్రతి ఏటా పది దాకా, ఈ దేశాలకు, సెలూసిడ్ సిరియా దాకా పంపారు.

"అందువలన మరింత రాయబారాలను యాంక్షీకి, యాన్‌కాయ్, లిజియాన్, టియావోజి ( మెసొపొటేమియా), టియాన్‌జు (వాయువ్య భారతదేశం) లకు పంపారు. సంవత్సరానికి పది కంటే ఎక్కువ ఉండేవి, కనీసం ఐదారైతే కచ్చితంగా ఉండేవి. " ( హౌ హన్షు, మలి హాన్‌ల చరిత్ర).

ఈ కనెక్షన్లతో రోమన్ సామ్రాజ్యం వరకు విస్తరించిన సిల్క్ రోడ్డు వాణిజ్య జాలం మొదలైంది. చైనీయులు అనేక సందర్భాల్లో మధ్య ఆసియాలో దండయాత్రలు చేశారు. హాన్ దళాలకు, రోమన్ సైనికులకూ (వీళ్ళను జియాంగ్ ను ఖైదీలుగా పట్టుకుని ఉండవచ్చు లేదా కిరాయి సైనికులుగా నియమించుకుని ఉండవచ్చు) మధ్య ప్రత్యక్ష పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా 36 BCE సోగ్డియానా యుద్ధం (జోసెఫ్ నీధం, సిడ్నీ షాపిరో). అటువంటి సందర్భాలలోనే చైనా క్రాస్‌బౌ (విల్లు) రోమన్ ప్రపంచానికి పరిచయమైందని భావిస్తారు. అయితే రోమన్ గ్రీకు గ్యాస్ట్రాఫేట్లు రోమను విల్లుకు మూలమనే భావన కూడా ఉంది. ఆర్. ఎర్నెస్ట్ డుపుయ్, ట్రెవర్ ఎన్. డుపుయ్ లు ఇలా అన్నారు. 36 BCE లో,

"[a] జాక్సార్టెస్ నదికి పశ్చిమంగా మధ్య ఆసియా లోకి హాన్ చేసిన దండయాత్రలో రోమన్ సైనికుల బృందాన్ని ఎదుర్కొని వారిని ఓడించింది. పార్థియాపై దండెత్తిన ఆంటోనీ సైన్యంలో రోమన్లు ఉండి ఉండవచ్చు. ఆక్సస్ నదికి తూర్పున ఉన్న పాలిటిమెటస్ నది ఒడ్డున ఉన్న సోగ్డియానా (ఆధునిక బుఖారా ), ఆసియాలో రోమన్ దళాలు అక్రమించుకున్న ప్రాంతాల్లో అత్యంత తూర్పున ఉన్న ప్రాంతం. చైనీయుల విజయానికి కారణం వారి క్రాస్‌బౌస్‌ అని అనిపిస్తుంది. దీని బోల్ట్‌లు, బాణాలు రోమన్ కవచాలను సులభంగా చీల్చుకుని పోయినట్లు తెలుస్తోంది. "

సా.పూ 27 నుండి సా.శ 14 వరకు పాలించిన మొదటి రోమను చక్రవర్తి ఆగస్టస్ వద్దకు సెరెస్ (చైనా) వంటి అనేకమంది రాయబారులు వచ్చారని కూడా రోమను చరిత్ర కారుడు ఫ్లోరస్ చెప్పాడు:

రోమను సామ్రాజ్యంలో భాగం కాని దేశాలు కూడా దాని గొప్పదనం పట్లా, రోమను ప్రజల పట్లా ఆరాధనాభావంతో ఉండేవారు.సిథియన్లు, సర్మాటియన్లు కూడా రోముతో మైత్రి కోసం రాయబారాలు పంపించారు. సెరెస్ అలాగే వచ్చాడు. సూర్యుడికి నేరుగా కింద ఉండే భారతీయులు కూడా నాలుగేళ్ళ పాటు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని కూడా పట్టించుకోకుండా, రత్నాలు, ముత్యాలు, ఏనుగుల వంటి అనేక విలువైన బహుమతులను తెచ్చారు. నిజానికి, వాళ్ళ శరీర వర్ణాన్ని చూస్తే వారు మనకంటే భిన్నమైన, వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళ లాగా కనిపిస్తారు.

—హెన్రీ యూల్, కాథే అండ్ ది వే థిథర్ (1866)

హాన్ సైన్యం వాణిజ్య మార్గంలో కాపలా కాస్తూ సంచార బందిపోటు దళాల నుండి రక్షిస్తూండేది. క్రమంగా మెరుగుపరుస్తుంది. సంచార బందిపోట్లంటే సాధారణంగా జియాంగ్‌ను లే. సా.శ 1 వ శతాబ్దం CE లో హాన్ జనరల్ బాన్ చావో 70,000 మౌంటెడ్ పదాతిదళం, తేలికపాటి అశ్వికదళ దళాలతో వాణిజ్య మార్గాలను రక్షిస్తూండేవాడు. బాన్ చావో తన విజయాలను పామీర్స్ మీదుగా కాస్పియన్ సముద్రం, పార్థియా సరిహద్దుల వరకూ విస్తరించాడు. ఇక్కడి నుండే ఈ హాన్ సేనాధిపతి, తన రాయబారి గాన్ యింగ్‌ను డాకిన్ (రోమ్) కు పంపించాడు. పాశ్చాత్య ప్రపంచానికి, భారతదేశానికి ఒక రహదారిని ఏర్పాటు చేయడానికి చైనా చేసిన ఈ ప్రయత్నాల తరువాత, తారిమ్ బేసిన్ ప్రాంతంలో స్థావరాల ఏర్పాటు, డాయువాన్, పార్థియన్లు, బాక్ట్రియన్లతో దౌత్య సంబంధాలు నెలకొల్పదం ద్వారా క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో సిల్క్ రోడ్డు ఉనికిలోకి వచ్చింది. సిల్క్ రోడ్లు "వాణిజ్య మార్గాల సంక్లిష్ట నెట్వర్కు". దీనివలన ప్రజలకు వస్తువులు, సంస్కృతిని మార్పిడి చేసుకోడానికి అవకాశం కలిగింది.

1 వ శతాబ్దం నాటికి, చైనా నియంత్రణలో ఉన్న గియావో చో (ఆధునిక వియత్నాంలో, హనోయికి సమీపంలో) తో సముద్రపు పట్టుదారి మొదలైంది. ఇది భారతదేశం, శ్రీలంక తీరాలలోని ఓడరేవుల ద్వారా, రోమన్ ఈజిప్టులోని రోమన్- నియంత్రిత ఓడరేవుల వరకు, ఎర్ర సముద్రపు ఈశాన్య తీరంలో ఉన్న నాబాటియన్ భూభాగాల వరకూ విస్తరించింది. చైనాలో లభించిన మొట్టమొదటి రోమన్ గాజుసామాను గిన్నెను గ్వాంగ్జౌలోని పశ్చిమ హాన్ సమాధిలో కనుగొన్నారు. ఇది క్రీ.పూ 1 వ శతాబ్దం ప్రారంభం నాటిది. దక్షిణ చైనా సముద్రం ద్వారా రోమన్ వాణిజ్య వస్తువులు దిగుమతి అయ్యేవని ఇది సూచిస్తోంది. చైనీస్ రాజవంశ చరిత్రల ప్రకారం, ఈ ప్రాంతం నుండి రోమన్ రాయబారులు చైనాకు వచ్చారు. ఇది సా.శ. 166 లో మార్కస్ ఆరేలియస్, హాన్ చక్రవర్తి హువాన్ ల పాలనలో ప్రారంభమైంది. ఇతర రోమన్ గాజుసామాను తూర్పు-హాన్-యుగం నాటి సమాధులలో (సా.శ. 25–220) నాన్జింగ్, లుయాంగ్‌ల్లో లోతట్టులో కనబడ్డాయి.

2 వ లేదా 3 వ శతాబ్దపు రోమన్ గిల్ట్ సిల్వర్ ప్లేట్ చైనాలోని జిన్యువాన్, గన్సులో దొరికింది. గ్రీకో-రోమన్ దేవుడు డియోనిసస్ ఒక పిల్లి జాతి జంతువుపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు దానిపై చిత్రించి ఉంది. ఇది గ్రేటర్ ఇరాన్ ద్వారా (అంటే సోగ్డియానా) వచ్చి ఉంటుందని పిఒ హార్పర్ నొక్కిచెప్పాడు. వాలెరీ హాన్సెన్ (2012) చైనాలో దొరికిన తొలి రోమన్ నాణేలు 4 వ శతాబ్దం నాటివని, అవి బైజాంటైన్ సామ్రాజ్యం నుండి వచ్చాయనీ భావించాడు. అయితే, ఇటీవల జియాన్ (గతంలో చంగాన్, హన్ రాజధానుల్లో ఒకటి) లో కనుగొన్న ప్రిన్సిపేట్ -కాలానికి చెందిన 16 రోమన్ నాణాలు, రోమన్ చక్రవర్తులు టిబేరియస్ కాలం నుండి ఆరేలియన్ కాలం వరకు (అంటే 1 నుండి 3 వ శతాబ్దాలు CE) ముద్రించినవని వార్విక్ బాల్ (2016) చెప్పాడు.

ఈ నాణేలు చైనాలో లభించాయన్నది నిజం, కాని అవి అక్కడకు చేరినది ఎప్పుడో ప్రాచీన కాలంలో కాదు, ఇరవయ్యవ శతాబ్దంలోనే. అందువల్ల అవి చైనా, రోమ్‌ల మధ్య చారిత్రక సంబంధాలపై వెలుగు చూపవు.

వికాసం

రోమన్ సామ్రాజ్యం (30   BCE - 3 వ శతాబ్దం CE)

సిల్క్ రోడ్డు 
రోమన్ కాలంలో మధ్య ఆసియా, మొదటి సిల్క్ రోడ్డు తో

క్రీస్తుపూర్వం 30 లో రోమన్ సామ్రాజ్యం ఈజిప్టుపై విజయం సాధించిన వెంటనే చైనా, ఆగ్నేయాసియా, భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఐరోపాల మధ్య సాధారణ సమాచార మార్పిడి, వాణిజ్యం అపూర్వమైన స్థాయిలో వికసించాయి. రోమన్ సామ్రాజ్యం మునుపటి హెలెనిస్టిక్ శక్తులు, అరబ్బుల నుండి సిల్క్ రోడ్డులో భాగమైన తూర్పు వాణిజ్య మార్గాలను వారసత్వంగా పొందింది. ఈ వాణిజ్య మార్గాల నియంత్రణతో, రోమన్ పౌరులు కొత్త విలాసాలను, మరింత సంపదనూ పొందారు. సిల్లా రాజ్యపు (కొరియా) రాజధాని జియోంగ్జుకు చెందిన పురావస్తు ప్రదేశాలలో కనబడిన రోమన్ తరహా గాజుసామాను బట్టి కొరియా ద్వీపకల్పం వరకు రోమన్ హస్తకృతుల వర్తకం చేసేవారని తెలుస్తోంది. సా.పూ. 130 లో సిజికస్కు చెందిన యుడోక్సస్ భారతదేశంతో మొదలుపెట్టిన గ్రీకో- రోమన్ వాణిజ్యం పెరుగుతూ పోయింది. స్ట్రాబో (II.5.12) ప్రకారం, అగస్టస్ సమయానికి, రోమన్ ఈజిప్టులోని మైయోస్ హార్మోస్ నుండి భారతదేశానికి ప్రతి సంవత్సరం 120 వరకు ఓడలు ప్రయాణించేవి. రోమన్ సామ్రాజ్యానికి మధ్య ఆసియా సిల్క్ రోడ్డు ద్వారా భారతదేశం లోని బారిగాజా (ఈ రోజు భరూచ్ అని పిలుస్తారు), బర్బరీకం (కరాచీ ) రేవులతో సంబంధాలుండేవి. ఈ సంబంధాలు భారతదేశపు పశ్చిమ తీరం వెంబడి కొనసాగాయి. సా.పూ. 60 లో రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రేయన్ సీ, ఈ హిందూ మహాసముద్ర వాణిజ్య మార్గానికి పురాతన "ట్రావెల్ గైడ్"

మాస్ టిటియానస్ తన యాత్రా బృందంతో మధ్యధరా ప్రపంచం నుండి సిల్క్ రోడ్డు వెంబడి తూర్పున చాలా దూరం వెళ్ళాడు. బహుశా తమ పరిచయాలను క్రమబద్ధీకరించడం, మధ్యవర్తుల పాత్రను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ యాత్ర చేసి ఉండవచ్చు. ఖండాంతర వాణిజ్యం, కమ్యూనికేషన్లు క్రమబద్ధంగాను, వ్యవస్థీకృతంగానూ జరిగేది. దీన్ని గొప్ప సామ్రాజ్యాలు సంరక్షిస్తూండేవి. చైనీస్ పట్టు (పార్థియన్ల ద్వారా సరఫరా అయ్యేది) పట్ల రోమన్ల వ్యామోహం కారణంగా రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం విపరీతంగా జరిగేది. ప్లినీ ది ఎల్డర్ తన సహజ చరిత్రలు (నేచురల్ హిస్టరీస్) లో పట్టు చిమ్మట గురించి మాట్లాడుతూ, "సాలెపురుగుల లాగా వాళ్ళు గూళ్ళు నేస్తారు. ఇది మహిళలకు విలాసవంతమైన వస్త్ర పదార్థంగా మారుతుంది, దాన్ని పట్టు అని పిలుస్తారు." అని రాసాడు. రోమన్లు సుగంధ ద్రవ్యాలు, గాజుసామాను, పరిమళ ద్రవ్యాలు, పట్టుల వర్తకం చేశారు.

సిల్క్ రోడ్డు 
ఒంటెపై పాశ్చాత్యుడు, నార్తర్న్ వీ రాజవంశం (386–534)

రోమన్ చేతివృత్తులవారు నూలు స్థానంలో కొరియాలోని జియోంగ్జు నుండి, చైనా నుండి వచ్చే విలువైన పట్టు వస్త్రాలు వాడడం ప్రారంభించారు. రోమన్ సామ్రాజ్యానికి పట్టు, ఇతర లగ్జరీ వస్తువులను పంపిణీ చేయడంతో చైనా సంపద పెరిగింది. ధనవంతులైన రోమను మహిళలు వాటి అందాన్ని మెచ్చుకున్నారు. రోమన్ సెనేట్ ఆర్థిక, నైతిక ప్రాతిపదికన, పట్టు ధరించకూడదని దాన్ని నిషేధించడానికి అనేక శాసనాలు జారీ చేసింది గానీ, లాభం లేకపోయింది. చైనీస్ పట్టు దిగుమతి వల్ల బంగారం భారీగా బయటకు పోయింది. పట్టు బట్టలను పతనానికి, అనైతికతకూ గుర్తుగా పరిగణించేవారు

పశ్చిమ రోమన్ సామ్రాజ్యం 5 వ శతాబ్దంలో కుప్పకూలింది. అధునాతన ఆసియా ఉత్పత్తులకుండే డిమాండు కూడా దాంతోటే పడిపోయింది.

1 నుండి 3 వ శతాబ్దాలలో, మధ్య ఆసియా, ఉత్తర భారతదేశాలు కుషాణ సామ్రాజ్యంలో కలిసిపోవడంతో బాక్ట్రియా, తక్షశిలలకు చెందిన శక్తివంతమైన వ్యాపారుల పాత్ర బలపడింది. దీంతో బహుళ-సాంస్కృతిక సంపర్కాలు పెంపొందాయి. గ్రీకు-రోమన్ ప్రపంచంలో చైనా, భారతదేశాలకు చెందిన వస్తువులతో నిండిన 2 వ శతాబ్దపు ఖజానాలు (ఉదా: బెగ్రామ్ లోని పురావస్తు స్థలం ) దీనికి దృష్టాంతం.

బైజాంటైన్ సామ్రాజ్యం (6 వ -14 వ శతాబ్దాలు)

సిల్క్ రోడ్డు 
చైనా దక్షిణ రాజవంశాల విచ్ఛిన్నత కాలంలో బైజాంటియంతో పాటు ఇతర ప్రధాన పట్టు రహదారి అధికారాలను చూపించే మ్యాప్.

ఇద్దరు నెస్టోరియన్ క్రైస్తవ సన్యాసులు చివరికి పట్టు తయారయ్యే విధానాన్ని కనుగొన్నారని బైజాంటైన్ గ్రీకు చరిత్రకారుడు ప్రోకోపియస్ పేర్కొన్నాడు. ఇది తెలియగానే బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ (527–565 పాలించారు), సన్యాసులను కాన్స్టాంటినోపుల్ నుండి చైనాకు సిల్క్ రోడ్డులో గూఢచారులుగా పంపించాడు. వాళ్ళు పట్టు పురుగు గుడ్లను దొంగిలించి తెచ్చారు. ఫలితంగా మధ్యధరాలో, ముఖ్యంగా ఉత్తర గ్రీస్‌లోని థ్రేస్‌లో, పట్టు ఉత్పత్తి జరిగింది. దీంతో మధ్యయుగ ఐరోపాలో పట్టు ఉత్పత్తిపై బైజాంటైన్ సామ్రాజ్యం గుత్తాధిపత్యం సాధించింది. 568 లో, తుర్కిక్ ఖగానేట్ పాలకుడు ఇష్టామీకి ప్రతినిధిగా ఒక సోగ్డియన్ రాయబారి బైజాంటైన్ పాలకుడు జస్టిన్ II ను కలిసాడు. ఆ రాయబారం ద్వారా తుర్కిక్ ఖగానేట్, అతను సాసానియన్ సామ్రాజ్యానికి చెందిన ఖోస్రో I కి వ్యతిరేకంగా బైజాంటైన్‌లతో ఒక కూటమిని ఏర్పరచుకున్నాడు. దీంతో సాసానియన్ వ్యాపారులను దాటవేసి, చైనీస్ పట్టు కొనుగోలు కోసం సోగ్డియన్లతో నేరుగా వ్యాపారం చేసే వీలు బైజాంటైన్‌లకు కలిగింది. ఈ సమయానికి చైనా నుండి పట్టు పురుగు గుడ్లను బైజాంటైన్స్ కొనుగోలు చేసినప్పటికీ, చైనా పట్టు నాణ్యత పాశ్చాత్య దేశాలలో ఉత్పత్తైన దానికంటే, చాలా మెరుగ్గా ఉండేది. ఈ వాస్తవం చైనాలో, షాన్సీ ప్రావిన్స్ లోని సుయి రాజవంశానికి (581–618) చెందిన ఒక సమాధిలో జస్టిన్ II కాలపు నాణేలు దొరకడాన్ని బట్టి నొక్కి చెప్పవచ్చు. .

సిల్క్ రోడ్డు 
చైనీస్ టాంగ్ రాజవంశానికి రాయబారులను పంపిన అనేక బైజాంటైన్ చక్రవర్తులలో మొట్టమొదటిగా చైనా మూలాల్లో పేరుపొందిన కాన్స్టాన్స్ II (r. 641–648) నాణెం

చైనీస్ టాంగ్ రాజవంశం (618-907) చరిత్రను వివరించే ఓల్డ్ బుక్ ఆఫ్ టాంగ్‌కు చెందిన పాత గ్రంథం, కొత్త గ్రంథం రెండూ, ఫు-లిన్ (拂 菻; బైజాంటైన్ సామ్రాజ్యం) అనే కొత్త సామ్రాజ్యం మునుపటి డా కిన్ (大秦; అనగా రోమన్ సామ్రాజ్యం) లాంటిదేనని చెప్పాయి. టాంగ్ కాలంలో అనేక ఫు-లిన్ రాయబారుల వివరాలు నమోదయ్యాయి. 643 లో కాన్స్టాన్స్ II అనే రాయబారి (అతని మారుపేరు "కాన్స్టాంటినోస్ పోగోనాటోస్"ను బో డుయో లి అని లిప్యంతరీకరించారు) మొదటివాడు. ది హిస్టరీ ఆఫ్ సాంగ్, 1081 లో జరిగిన తుది రాయబారం గురించి వివరిస్తుంది. సాంగ్ రాజవంశంపు చక్రవర్తి షెన్జోంగ్ (960–1279) దర్బారుకు మైఖేల్ VII డౌకాస్ పంపిన రాయబారం అది. అయితే, యువాన్ రాజవంశ స్థాపకుడైన కుబ్లాయ్ ఖాన్ (1271-1368) దర్బారులో ఒక బైజాంటైన్ మనిషి ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, వైద్యుడు ఉండేవాడని యువాన్ చరిత్ర చెబుతోంది. ఉయ్ఘుర్ నెస్టోరియన్ క్రైస్తవ దౌత్యవేత్త రబ్బన్ బార్ సౌమా అర్ఘున్ (కుబ్లాయ్ ఖాన్ మనవడు) కు ప్రతినిధిగా, ఖాన్బాలిక్ (బీజింగ్) లోని తన చైనీస్ ఇంటి నుండి బయలుదేరి, ఐరోపా అంతటా ప్రయాణించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఎడ్వర్డ్ I, ఫ్రాన్స్‌కు చెందిన ఫిలిప్ IV, పోప్ నికోలస్ IV, అలాగే బైజాంటైన్ పాలకుడు ఆండ్రోనికోస్ II పాలియోలోగోస్‌తో సైనిక సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించాడు. ఆండ్రోనికోస్ II కు ఇద్దరు సవతి సోదరిలు ఉన్నారు. వీరు చెంఘిజ్ ఖాన్ మునిమనవరాళ్లను వివాహం చేసుకున్నారు. దీంతో అతడు, బీజింగ్‌లోని యువాన్-రాజవంశపు మంగోల్ పాలకుడు కుబ్లాయ్ ఖాన్‌కు వియ్యాల వారి వైపు చుట్టమయ్యాడు. మింగ్ రాజవంశాన్ని (1368-1644) స్థాపించిన హాంగ్వు చక్రవర్తి, బైజాంటైన్ వ్యాపారి అయిన నీహ్-కు-లూన్ (捏 古 had) ద్వారా కొత్త రాజవంశ స్థాపన గురించి 1371 సెప్టెంబరులో బైజాంటైన్ రాజు జాన్ వి పాలియోలోగోస్ దర్బారులో వెల్లడించింట్లు మింగ్ చరిత్రలో రాసారు ఈ నీహ్-కు-లూన్ మరెవరో కాదని ఖాన్బిలాక్ కు చెందిన రోమన్ కాథలిక్ బిషప్ నికోలస్ డి బెంట్రా యే నని, మునుపటి ఆర్చ్ బిషప్ జాన్ ఆఫ్ మాంటెకోర్వినో స్థానంలో పోప్ జాన్ XXII ఎంపిక చేసిన వ్యక్తేననీ ఫ్రెడరిక్ హిర్త్ (1885), ఎమిల్ బ్రెట్స్నైడర్ (1888), ఇటీవల ఎడ్వర్డ్ లుట్వాక్ (2009) లు చెప్పారు .

టాంగ్ రాజవంశం (7 వ శతాబ్దం)

సిల్క్ రోడ్డు 
ద్రాక్ష సారాయి తిత్తితో ఒక సోగ్డియన్ మనిషి. చైనీస్ సంకాయ్ బొమ్మ. టాంగ్ రాజవంశం (618-907)
సిల్క్ రోడ్డు 
టాంగ్ గోక్‌టర్కులను ఓడించిన తరువాత, వారు పశ్చిమాన సిల్క్ రోడ్డును తిరిగి తెరిచారు.

సిల్క్ రోడ్డును హాన్ చక్రవర్తి (క్రీ.పూ. 141–87) పాలనలో రూపొందించినప్పటికీ, 639 లో హౌ జుంజి పశ్చిమ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నప్పుడు టాంగ్ సామ్రాజ్యం దాన్ని తిరిగి ప్రారంభించింది. అప్పటి నుండి దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెరిచే ఉంది. 678 లో టిబెటన్లు దానిని స్వాధీనం చేసుకున్న తరువాత దాన్ని మూసివేసారు. కాని 699 లో, ఎంప్రెస్ వు కాలంలో, టాంగ్ ఆంక్సీలో 640 లో స్థాపించబడిన నాలుగు సైనిక శిబిరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాక, సిల్క్ రోడ్డు తిరిగి మొదలైంది. చైనా మరోసారి వాణిజ్యం కోసం పశ్చిమంతో భూ మార్గం ద్వారా నేరుగా అనుసంధానమైంది. గిల్గిట్ లోయ గుండా వెళ్ళే కీలకమైన దారిని 722 లో టిబెట్ నుండి టాంగ్ స్వాధీనం చేసుకుంది, 737 లో టిబెటన్ల చేతిలో ఓడిపోయింది, తిరిగి గోగురియో-కొరియన్ జనరల్ గావో జియాన్జి ఆధ్వర్యంలో దాన్ని తిరిగి సాధించింది.

టాంగ్ రాజవంశం రెండవ పాక్స్ సినికాను స్థాపించింది. ఈ కాలంలో సిల్క్ రోడ్డు స్వర్ణయుగానికి చేరుకుంది. దాని ద్వారా పెర్షియన్, సోగ్డియన్ వ్యాపారులు తూర్పు పశ్చిమాల మధ్య వాణిజ్యం నుండి లబ్ధి పొందారు. అదే సమయంలో, చైనా సామ్రాజ్యం విదేశీ సంస్కృతులను స్వాగతించింది. దాని పట్టణ కేంద్రాల్లో ఇది చాలా కాస్మోపాలిటన్‌గా మారింది. భూ మార్గంతో పాటు, టాంగ్ రాజవంశం సముద్ర సిల్క్ మార్గాన్ని కూడా అభివృద్ధి చేసింది. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నుండి చైనా రాయబారులు హిందూ మహాసముద్రం గుండా భారతదేశానికి ప్రయాణించారు, కానీ పెర్షియన్ గల్ఫ్ లోన, ఎర్ర సముద్రంలోనూ పర్షియా, మెసొపొటేమియా, అరేబియా, ఈజిప్ట్, అక్సమ్ (ఇథియోపియా), సోమాలియాల్లో చైనా ఉనికి బలంగా కనిపించింది మాత్రం టాంగ్ రాజవంశ కాలం లోనే.

సోగ్డియన్-టర్కిక్ తెగలు (4 వ -8 వ శతాబ్దాలు)

సిల్క్ రోడ్డు 
సిల్క్ రోడ్డులోని కారవాన్, 1380

సిల్క్ రోడ్డు ద్వారా జరిగిన అంతర-ప్రాంతీయ వాణిజ్యం కారణంగా రాజకీయ, సాంస్కృతిక సమైక్యత మొదలైంది. దాని ఉచ్ఛస్థితిలో, ఇది మాగ్యార్లు, అర్మేనియన్లు, చైనీయుల వంటి వైవిధ్య జన సమూహాలను కలగలిపిన అంతర్జాతీయ సంస్కృతికి కారణమైంది. బైజాంటైన్ సామ్రాజ్యం సమయంలో సిల్క్ రోడ్డు పశ్చిమాన ఉచ్ఛ స్థాయికి చేరుకుంది. అలాగే సస్సానిడ్ సామ్రాజ్యం కాలం నుండి ఇల్ ఖానేట్ కాలం వరకు నైలు- ఆక్సస్ విభాగంలోను, మూడు రాజ్యాల కాలం నుండి యువాన్ రాజవంశం కాలం వరకు ఉన్న సైనటిక్ జోన్‌లోనూ ఇది ఉచ్ఛస్థితికి చేరుకుంది. హిందూ మహాసముద్రం అంతటా, ఈజిప్టులోని అలెగ్జాండ్రియా, చైనాలోని గ్వాంగ్జౌ మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందింది. పెర్షియన్ సస్సానిడ్ నాణేలు కరెన్సీ సాధనంగా ఉద్భవించాయి. పట్టు దారాలు, వస్త్రాల లాగానే ఇవి కూడా విలువైనవి.

సిల్క్ రోడ్డు ప్రభావం కారణంగా దాని వెంట నివసించే ఒంటరి గిరిజన సమాజాలు, అనాగరిక సంస్కృతులకు చెందినవారూ వివిధ నాగరికతల సంపద పట్ల, అవకాశాల పట్లా ఆకర్షితులయ్యారు. వీరు కిరాయి సైనికుల వర్తకంలోకి దిగారు "చాలా బార్బేరియన్ తెగల ప్రజలు నైపుణ్యం యోధులుగా తయారై, గొప్ప నగరాలు, సారవంతమైన భూములను స్వాధీనం చేసుకుని, బలమైన సైనిక సామ్రాజ్యాలను స్థాపించారు."

సిల్క్ రోడ్డు 
వాణిజ్య నెట్‌వర్క్‌లను చూపించే యురేషియా, ఆఫ్రికా మ్యాప్, సి. 870

4 వ శతాబ్దం తరువాత 8 వ శతాబ్దం వరకు తూర్పు-పడమర వాణిజ్యంలో సోగ్డియన్లు ఆధిపత్యం చెలాయించారు. ఉత్తరాన సుయాబ్, తలాస్ లు వారి ప్రధాన కేంద్రాలు. మధ్య ఆసియాలో ప్రధాన కారవాన్ వ్యాపారులు వారు. వారి వాణిజ్య ప్రయోజనాలను పునరుత్థానం చెందిన సైనిక శక్తి గోక్‌టర్కులు రక్షించారు. గోక్‌టర్కుల సామ్రాజ్యం " ఆషినా తెగ, సోగ్డియన్ల ఉమ్మడి సామ్రాజ్యం". AV డైబో "చరిత్రకారుల ప్రకారం, గ్రేట్ సిల్క్ రోడ్డు యొక్క ప్రధాన చోదక శక్తి కేవలం సోగ్డియన్లు మాత్రమే కాదు, సోగ్డియన్-టర్కిక్ మిశ్రమ సంస్కృతి యొక్క వాహకాలు."

వారి వాణిజ్యం, 9 వ శతాబ్దంలో ఉయ్ఘర్ సామ్రాజ్యం కాలంలో మధ్యలో కొన్ని ఆటంకాలతో, కొనసాగింది. ఇది 840 వరకు ఉత్తర మధ్య ఆసియా అంతటా విస్తరించింది. గుర్రాలకు మారుగా చైనా అపారమైన పట్టును పంపిణీ చేసింది. ఈ సమయంలో ఎగువ మంగోలియాకు ప్రయాణించిన సోగ్డియన్ల యాత్రికుల గురించి చైనా వర్గాలు ప్రస్తావించాయి. వారు కూడా అంతే ముఖ్యమైన మత, సాంస్కృతిక పాత్ర పోషించారు. 10 వ శతాబ్దానికి చెందిన ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్తలు అందించిన తూర్పు ఆసియా గురించిన డేటాలో కొంత భాగం వాస్తవానికి 750–840 కాలం నాటి సోగ్డియన్లకు చెందినది. తద్వారా తూర్పు పడమరల మధ్య సంబంధాల మనుగడను చూపిస్తుంది. అయితే, ఉయ్‌ఘుర్ సామ్రాజ్యం ముగిసిన తరువాత, సోగ్డియన్ వాణిజ్యం సంక్షోభంలో పడింది.

సిల్క్ రోడ్డు ఉత్తర చైనాలో సంచార మూలాలు కలిగిన సైనిక రాజ్యాల సమూహాలకు దారితీసింది. నెస్టోరియన్, మానిచీయన్, బౌద్ధ, ఇస్లామిక్ మతాలను మధ్య ఆసియా, చైనాలలోకి ప్రవేశపెట్టింది.

ఇస్లామిక్ యుగం (8 వ -13 వ శతాబ్దాలు)

సిల్క్ రోడ్డు 
767 - 912 మధ్య బాగ్దాద్, సిల్క్ రోడ్డు వెంబడి అత్యంత ముఖ్యమైన పట్టణం.
సిల్క్ రోడ్డు 
8 వ శతాబ్దం, సోగ్డియన్ పాలిక్రోమ్ పట్టుపై సింహం బొమ్మ, బుఖారాకు చెందినదై ఉండవచ్చు

ఉమాయద్ శకం నాటికి, స్టెసిఫోన్‌ను ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా డమాస్కస్ అధిగమించింది. అమాసిడ్ రాజవంశం బాగ్దాద్ నగరాన్ని నిర్మించే వరకు ఇది సాగింది. ఇది పట్టు దారి వెంట అత్యంత ముఖ్యమైన నగరంగా మారింది.

దాని వెలుగు తగ్గే దశలో, సిల్క్ రోడ్డు చరిత్రలోనే అతిపెద్ద ఖండాంతర సామ్రాజ్యం, మంగోల్ సామ్రాజ్యం స్థాపన చూసింది. దాని రాజకీయ కేంద్రాలు సిల్క్ రోడ్డు పొడుగునా విస్తరించాయి (ఉత్తర చైనాలో బీజింగ్, మధ్య మంగోలియాలో కారకోరం, ట్రాన్స్‌ఆక్సియానాలో సమర్కండ్, ఉత్తర ఇరాన్‌లో టాబ్రీస్). గతంలో వదులుగా, కలిసీ కలవనట్లుండే ప్రాంతాలను మంగోలియా సామ్రాజ్యం రాజకీయంగా ఏకీకరించింది. 8 వ శతాబ్దంలో ఉమయ్యద్ కాలిఫేట్ క్రింద ఇస్లామిక్ ప్రపంచం మధ్య ఆసియాలోకి విస్తరించింది. దాని తరువాత వచ్చిన అబ్బాసిడ్ కాలిఫేట్ 751 లో తలాస్ యుద్ధంలో (ఆధునిక కిర్గిజ్స్తాన్లోని తలాస్ నది సమీపంలో) చైనా పశ్చిమ దిశగా విస్తరించడాన్ని ఆపేసింది. అయితే, వినాశకరమైన ఆన్ లుషాన్ తిరుగుబాటు (755–763) తరువాత, టిబెటన్ సామ్రాజ్యం పాశ్చాత్య ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత, టాంగ్ సామ్రాజ్యం మధ్య ఆసియాపై తన నియంత్రణను నిలుపులేకపోయింది. సమకాలీన టాంగ్ రచయితలు ఈ దశ తరువాత రాజవంశం ఎలా క్షీణించిందో వివరించారు. 848 టాంగ్ చైనీయులు, జాంగ్ యిచావో నేతృత్వంలో టిబెటన్ల నుండి హేక్సి కారిడార్, గన్సు లోని డుంహుఆంగ్ లను మాత్రమే మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. బుఖారా ( ఉజ్బెకిస్తాన్ ) లో కేంద్రీకృతమై ఉన్న పెర్షియన్ సమానిడ్ సామ్రాజ్యం (819-999) సోగ్డియన్ల వాణిజ్య వారసత్వాన్ని కొనసాగించింది. 10 వ శతాబ్దం చివరినాటికి ప్రపంచంలోని ఆ ప్రాంతంలో వాణిజ్యానికి అంతరాయాలు తగ్గిపోయాయి. మధ్య ఆసియాను తుర్కిక్ ఇస్లామిక్ కారా-ఖనిద్ ఖానేట్ స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ మధ్య ఆసియాలో నెస్టోరియన్ క్రైస్తవ మతం, జొరాస్ట్రియనిజం, మానిచైజం, బౌద్ధమతం దాఅదాపుగా కనుమరుగై పోయాయి.

13 వ శతాబ్దం ప్రారంభంలో మంగోలులు ఖ్వారెజ్మియాను ఆక్రమించారు. మంగోల్ పాలకుడు చెంఘిజ్ ఖాన్, ఒకప్పుడు కళకళాలాడిన బుఖారా, సమర్కాండ్ నగరాలను ముట్టడించి, వాటిని తగలబెట్టి నాశనం చేసాడు. అయితే, 1370 లో సమర్కాండ్ కొత్త తైమురిడ్ సామ్రాజ్యానికి రాజధానిగా పునరుజ్జీవనాన్ని చూసింది.. తుర్కో-మంగోల్ పాలకుడు తైమూర్ ఆసియా అంతటా ఉన్న చేతివృత్తులవారిని, మేధావులను సమర్కాండ్‌కు బలవంతంగా తరలించాడు. ఇది ఇస్లామిక్ ప్రపంచంలోని అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా విలసిల్లింది .

మంగోల్ సామ్రాజ్యం (13 వ -14 వ శతాబ్దాలు)

సిల్క్ రోడ్డు 
1271–1295లో మార్కో పోలో యొక్క ప్రయాణాల మ్యాప్

1207 నుండి 1360 వరకు ఆసియా ఖండం అంతటా జరిగిన మంగోల్ విస్తరణ రాజకీయ స్థిరత్వాన్ని తీసుకు వచ్చింది. సిల్క్ రోడ్డు (కారకోరం, ఖాన్బాలిక్ ద్వారా) తిరిగి వెలుగొందింది. ప్రపంచ వాణిజ్యంపై ఇస్లామిక్ కాలిఫేట్ ఆధిపత్యాన్ని అంతం చేసింది. మంగోలులు వాణిజ్య మార్గాలను నియంత్రించినందున, ఈ ప్రాంతం అంతటా వాణిజ్యం వ్యాపించింది, అయినప్పటికీ వారు తమ సంచార జీవనశైలిని ఎప్పటికీ వదల్లేదు.

మంగోల్ పాలకులు తమ రాజధానిని మధ్య ఆసియా గడ్డి మైదానాల్లో స్థాపించాలని కోరుకున్నారు. కాబట్టి ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రతి విజయం తరువాత వారు తమ సామ్రాజ్యాన్ని నిర్మించటానికి, నిర్వహించడంలో సహాయపడటానికీ స్థానిక ప్రజలను (వ్యాపారులు, పండితులు, చేతివృత్తులవారు) తమతో చేర్చుకున్నారు. మంగోలులు యురేషియా ఖండం, నల్ల సముద్రం, పశ్చిమాన మధ్యధరా, దక్షిణాన హిందూ మహాసముద్రం అంతటా నేలపైన, సముద్రంపైనా మార్గాలను అభివృద్ధి చేశారు. పదమూడవ శతాబ్దం రెండవ భాగంలో మంగోలు మధ్య ప్రాచ్యాన్నీ, మంగోల్ చైనాలనూ కలుపుతూ హిందూ మహాసముద్రంలో మంగోల్-ప్రాయోజిత వ్యాపార భాగస్వామ్యం వృద్ధి చెందింది

మంగోల్ దౌత్యవేత్త రబ్బన్ బార్ సౌమా 1287–88లో ఐరోపా న్యాయస్థానాలను సందర్శించి, మంగోలియన్లకు వివరణాత్మక వ్రాతపూర్వక నివేదికను అందించారు. అదే సమయంలో, సిల్క్ రోడ్డు గుండా చైనాకు ప్రయాణించిన మొదటి యూరోపియన్లలో వెనీషియన్ అన్వేషకుడు మార్కో పోలో ఒకడయ్యాడు . ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలోలో డాక్యుమెంట్ చేయబడిన అతని కథలు ఫార్ ఈస్ట్ యొక్క కొన్ని ఆచారాల పట్ల పాశ్చాత్యులకు అవగాహన కలిగించాయి. మార్కోపోలో ఆయా దేశాల కథనాలను వెనక్కి తీసుకెళ్ళిన మొదటివాడేమీ కాదు. కానీ అతడి రచనలను ఎక్కువగా చదివారు. అతడి కంటే ముందు అనేక మంది క్రైస్తవ మిషనరీలు - విలియం ఆఫ్ రుబ్రక్, బెనెడిక్ట్ పోలాక్, గియోవన్నీ డా పియాన్ డెల్ కార్పైన్, లాంగ్జూమియోకు చెందిన ఆండ్రూ తూర్పు దేశాలకు వెళ్ళారు. అతడి తరువాత, ఓడోరిక్ ఆఫ్ పోర్డెనోన్, గియోవన్నీ డి మారిగ్నోల్లి, జాన్ ఆఫ్ మోంటెకోర్వినో, నికోలో డి కాంటి, మొరాకో ముస్లిం యాత్రికుడు ఇబ్న్ బటుటా వెళ్ళారు. ఇబ్న్ బటూటా 1325-1354 మధ్య ప్రస్తుత మధ్యప్రాచ్యం గుండా టబ్రిజ్ నుండి సిల్క్ రోడ్డు మీదుగా వెళ్ళారు.

13 వ శతాబ్దంలో ఫ్రాంకో-మంగోల్ కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. రాయబారుల మార్పిడి, ఆ తరువాత క్రూసేడ్ల సమయంలో పవిత్ర భూమిలో సైనిక సహకారం కోసం (విఫల) ప్రయత్నాలు జరిగాయి. చివరికి ఇల్ఖానేట్‌లో ఉన్న మంగోలులు, అబ్బాసిడ్, అయూబిడ్ రాజవంశాలను నాశనం చేసిన తరువాత, ఇస్లాం మతంలోకి మారి, అప్పటికి మనుగడలో ఉన్న ముస్లిం శక్తి అయిన ఈజిప్టు మమ్లుక్‌లతో 1323 అలెప్పో ఒప్పందంపై సంతకం చేశారు. 1340 ల చివరలో ఐరోపాను సర్వనాశనం చేసిన బ్లాక్ డెత్ వ్యాధి, మంగోల్ సామ్రాజ్యం యొక్క వాణిజ్య మార్గాల్లో మధ్య ఆసియా (లేదా చైనా) నుండి ఐరోపాకు చేరుకుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారం, ఉత్తర టర్కీలోని ట్రెబిజోండ్ నుండి వస్తున్న జెనోయిస్ వ్యాపారులు ఈ వ్యాధిని పశ్చిమ ఐరోపాకు తీసుకువెళ్లారు. అనేక ఇతర ప్లేగుల మాదిరిగా, ఇది మధ్య ఆసియాలోని మార్మోట్లలో ఉద్భవించిందనీ, సిల్క్ రోడ్డు వ్యాపారులు పశ్చిమానికి నల్ల సముద్రం వరకు తీసుకువెళ్లారనీ బలమైన ఆధారాలు ఉన్నాయి.

క్షీణత, విచ్ఛిన్నం (15 వ శతాబ్దం)

సిల్క్ రోడ్డు 
సముద్ర పట్టు మార్గంలో ఓడరేవు నగరాలు. ఇవి జెంగ్ హి ప్రయాణాలలో ఉన్నాయి .

మంగోల్ సామ్రాజ్యం యొక్క విచ్ఛిన్నంతో సిల్క్ రోడ్డు యొక్క రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక ఐక్యత సడలింది. తుర్క్మెని ప్రభువులు సిల్క్ రోడ్డు యొక్క పశ్చిమంగా ఉన్న భూమిని క్షీణిస్తున్న బైజాంటైన్ సామ్రాజ్యం నుండి స్వాధీనం చేసుకున్నారు. మంగోల్ సామ్రాజ్యం పతనం తరువాత, సిల్క్ రోడ్డు వెంబడి ఉన్న గొప్ప రాజకీయ శక్తులు ఆర్థికంగా, సాంస్కృతికంగా విడిపోయాయి. ప్రాంతీయ రాజ్యాలు ఏర్పాటుకు, బ్లాక్ డెత్ కలిగించిన వినాశనం, కొంతవరకు గన్‌పౌడర్‌తో కలిగిన నిశ్చల నాగరికతలు ఆక్రమించడం వల్ల సంచార శక్తులు క్షీణించడం కూడా తోడైంది

పశ్చిమ ఆసియాలో పాక్షిక పునరుద్ధరణ

పశ్చిమ ఆసియాలో ఒట్టోమన్, సఫావిడ్ సామ్రాజ్యాల ఏకీకరణ భూమార్గ వాణిజ్య పునరుజ్జీవనానికి దారితీసింది. వాటి మధ్య యుద్ధాల వల్ల అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడింది.

1720 లలో సఫావిడ్ సామ్రాజ్యం పతనంతో అంతరాయం కలిగే వరకు పట్టు వ్యాపారం వృద్ధి చెందింది.

కొత్త సిల్క్ రోడ్డు (20 - 21 వ శతాబ్దాలు)

సిల్క్ రోడ్డు 
హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షాలోని మావాంగ్‌డూయి లోని పట్టు బ్యానర్ ; ఇది లేడీ డై యొక్క శవపేటికపై కప్పబడి ఉంది (d.   168 BCE), మార్క్వెస్ లి కాంగ్ (利 蒼) భార్య (డి.   186 BCE), చాంగ్షా రాజ్యానికి ఛాన్సలర్.

1966 లో మధ్య ఆసియాలో తాష్కెంట్‌ను తాకిన భూకంపం తరువాత, నగరాన్ని తిరిగి నిర్మించాల్సి వచ్చింది. దీనివలన వారి మార్కెట్లు భారీగా నష్టపోయినప్పటికీ, దీనితో ఆధునిక పట్టు దారి నగరాల పునరుద్ధరణ మొదలైంది.

రైల్వే (1990)

చైనా, కజాఖ్స్తాన్, మంగోలియా, రష్యాల గుండా వెళ్ళే రైలు మార్గం - యురేషియన్ ల్యాండ్ బ్రిడ్జిని కొన్నిసార్లు "న్యూ సిల్క్ రోడ్" అని పిలుస్తారు. 1990 లో చైనా, కజాఖ్స్తాన్ రైల్వే వ్యవస్థలు అలటావ్ పాస్ (అలషాన్ కౌ) వద్ద కలిసినపుడు ఈ రైల్వే మార్గంలో చివరి లింకు పూర్తయింది,. 2008 లో, చైనా యొక్క జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉరుమ్‌కి నగరాన్ని, కజాఖ్స్తాన్‌లోని అల్మాటి, నూర్-సుల్తాన్‌లతో అనుసంధానించడానికి ఈ లైన్ ఉపయోగపడింది. 2008 అక్టోబరు లో, మొదటి ట్రాన్స్-యురేషియా లాజిస్టిక్స్ రైలు జియాంగ్టాన్ నుండి హాంబర్గ్ చేరుకుంది. జూలై చైనాలోని చాంగ్‌కింగ్‌ను జర్మనీలోని డ్యూయిస్‌బర్గ్‌తో కలిపే ఈ లైన్ను 2011 నుండి సరుకు రవాణాకు ఉపయోగిస్తున్నారు. సరుకు ప్రయాణ సమయం కంటైనర్ ఓడ ద్వారా 36 రోజులు పట్టే ప్రయాణం రైలు ద్వారా కేవలం 13 రోజులకు తగ్గిపోయింది. 2013 లో, హ్యూలెట్ ప్యాకర్డ్ ఈ రైలు మార్గంలో ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, మానిటర్లను రవాణా చెయ్యడం మొదలుపెట్టింది. 2017 జనవరి లో, ఈ సేవ తన మొదటి రైలును లండను పంపింది. ఈ నెట్‌వర్క్ అదనంగా మాడ్రిడ్, మిలన్‌లకు అనుసంధానిస్తుంది.

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (2013)

2013 సెప్టెంబరు కజకిస్తాన్ పర్యటన సందర్భంగా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ చైనా నుండి ఐరోపా‌కు కొత్త సిల్క్ రోడ్డు కోసం ఒక ప్రణాళికను ప్రవేశపెట్టారు. " బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ " (BRI) గా పిలిచే ఈ ప్రణాళికలో, భూ-ఆధారిత సిల్క్ రోడ్డు ఎకనామిక్ బెల్ట్, 21 వ శతాబ్దపు మారిటైమ్ సిల్క్ రోడ్డు ఉన్నాయి. ఉరుమ్‌కి, దోస్తిక్, నూర్-సుల్తాన్, గోమెల్, బేలారస్ లోని బ్రెస్ట్, పోలండు లోని మాలాసెవిజ్, లోడ్జ్ నగరాలు ఈ దారిలో లాజిస్టిక్ హబ్బుల్లాగా, ఇతర ఐరోపా నగరాలకు వెళ్ళే సరకుకు ట్రాన్‌షిప్మెంటు కేంద్రాలుగా ఉంటాయి.

2016 ఫిబ్రవరి 15 న, రూటింగ్‌లో చేసిన కొన్ని మార్పులతో, ఈ పథకం కింద బయలుదేరిన మొదటి రైలు తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్ నుండి టెహ్రాన్‌కు చేరుకుంది. ఈ విభాగంతో, చైనా, ఐరోపా మధ్య సిల్క్ రోడ్డు తరహా ఓవర్‌ల్యాండ్ కనెక్షను ఇంకా పూర్తి కానప్పటికీ, ఇస్తాంబుల్ ద్వారా చైనాను ఐరోపా‌కు అనుసంధానించే కొత్త రైల్వే మార్గం ఏర్పడింది. అసలు మార్గం అల్మాటి, బిష్కెక్, సమర్కాండ్, దుశాన్‌బే ల గుండా వెళ్తుంది.

మార్గాలు

సిల్క్ రోడ్డులో అనేక మార్గాలున్నాయి. ఇది చైనా యొక్క పురాతన వాణిజ్య కేంద్రాల నుండి పడమర వైపుకు సాగుతూ, తక్లామకాన్ ఎడారి, లాప్ నూర్లను బైపాస్ చేస్తూ, ఖండాంతర సిల్క్ రోడ్డు ఉత్తర, దక్షిణ మార్గాలుగా విడిపోయింది. ఈ మార్గాల్లో వ్యాపారులు "రిలే ట్రేడ్"లో పాల్గొనేవారు. "వస్తువులు తమ తుది గమ్యస్థానాలకు చేరుకునే లోపు చాలాసార్లు చేతులు మారేవి."

ఉత్తర మార్గం

సిల్క్ రోడ్డు 
1[permanent dead link] వ శతాబ్దంలో సిల్క్ రోడ్

ఉత్తర మార్గం ప్రాచీన చైనా రాజధాని చాంగన్ (ఇప్పుడు షియాన్ అని పిలుస్తారు) వద్ద మొదలైంది. క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో హాన్ వుడి సంచార గిరిజనుల వేధింపులను అణచివేసినపుడు ఈ మార్గం ఉనికి లోకి వచ్చింది. 

ఉత్తర మార్గం షాంగ్జీ నుండి చైనీస్ ప్రావిన్స్ గన్సు ద్వారా వాయవ్య దిశగా వెళ్తూ మూడు మార్గాలుగా చీలిపోయింది. వాటిలో రెండు, తక్లామకాన్ ఎడారికి ఉత్తరం వైపున, దక్షిణం వైపునా ఉన్న పర్వత శ్రేణుల వెంట చీలి కష్గార్‌ వరకు పోయి మళ్ళీ అక్కడ కలుస్తాయి. మూడవది తూర్పాన్, తల్గార్, అల్మాటి (ప్రస్తుతం ఆగ్నేయ కజాఖ్స్తాన్ లో ఉంది) గుండా టియాన్‌షాన్ పర్వతాలకు ఉత్తరంగా వెళ్ళింది. ఈ మార్గాలు కష్గర్‌కు పశ్చిమాన మళ్ళీ విడిపోయి, దక్షిణ శాఖ అలై లోయ నుండి టెర్మెజ్ (ఆధునిక ఉజ్బెకిస్తాన్లో), బాల్ఖ్ (ఆఫ్ఘనిస్తాన్) వైపు వెళుతుంది. రెండవది ఫెర్గానా లోయలోని కోకాండ్ (ప్రస్తుత తూర్పు ఉజ్బెకిస్తాన్లో) వెళ్ళి, ఆ తరువాత కరాకుమ్ ఎడారి మీదుగా పడమరకు వెళ్తుంది. తుర్క్మెనిస్తాన్లోని పురాతన మెర్వ్ చేరుకోవడానికి ముందు రెండు మార్గాలు ప్రధాన దక్షిణ మార్గంలో కలుస్తాయి. ఉత్తర మార్గం యొక్క మరొక శాఖ అరల్ సముద్రం దాటి వాయవ్యానికి తిరిగి, కాస్పియన్ సముద్రానికి ఉత్తరం వైపు, తరువాత నల్ల సముద్రం వైపు తిరిగింది.

బిడారు వర్తకుల మార్గమైన ఉత్తర సిల్క్ రోడ్డు ద్వరా చైనాకు "పర్షియా నుండి ఖర్జూరాలు, కుంకుమపువ్వు, పిస్తా గింజలు; సుగంధ ద్రవ్యాలు, కలబంద, సోమాలియా నుండి మిర్ర (ఓ రకమైన సుగంధం), భారతదేశం నుండి గంధపు చెక్క, ఈజిప్టు నుండి గాజు సీసాలు, ఇతర ఖరీదైన, కావాల్సిన వస్తువులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి వెళ్ళేవి " బదులుగా, యాత్రికులు పట్టు, లక్క-సామాను, పోర్సెలీను వస్తువులనూ తిరిగి పంపించేవారు.

దక్షిణ మార్గం

దక్షిణ మార్గం లేదా కారకోరం మార్గం ప్రధానంగా చైనా నుండి కారకోరం పర్వతాల గుండా వెళ్ళే ఒకే మార్గం. ఆధునిక కాలంలో కారకోరం హైవే రూపంలో ఉంది. ఇది పశ్చిమ దిశగా వెళ్తూ, ఎత్తైన పర్వతాలను దాటి, ఉత్తర పాకిస్తాన్ గుండా, హిందూ కుష్ పర్వతాల మీదుగా, ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లి, తుర్క్మెనిస్తాన్లోని మెర్వ్ సమీపంలో తిరిగి ఉత్తర మార్గంలో కలుస్తుంది. మెర్వ్ నుండి, ఇది పర్వత ఉత్తర ఇరాన్, మెసొపొటేమియా, సిరియన్ ఎడారి యొక్క ఉత్తర కొన నుండి లెవాంట్ వరకు దాదాపు సరళ రేఖలో పోతుంది. ఇక్కడి నుండి వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం ద్వారా ఇటలీకి నడుస్తూండేవి. భూ మార్గాలు ఉత్తరాన అనటోలియా ద్వారా లేదా దక్షిణాన ఉత్తర ఆఫ్రికాకూ వెళ్తాయి. మరొక శాఖ రహదారి హేరట్ నుండి సుసా మీదుగా పెర్షియన్ గల్ఫ్ వద్ద ఉన్న చరాక్స్ స్పాసిను వరకూ, అక్కడి నుండి పెట్రా, అలెగ్జాండ్రియా వరకు, ఇతర తూర్పు మధ్యధరా ఓడరేవుల వరకూ వెళ్తుంది. ఆ రేవుల నుండి ఓడలు సరుకులను రోమ్‌కు తీసుకువెళ్ళేవి.  

నైరుతి మార్గం

నైరుతి మార్గం గంగా / బ్రహ్మపుత్ర డెల్టా అని భావిస్తారు. రెండు సహస్రాబ్దాలుగా అంతర్జాతీయంగా దీనిపై ఆసక్తిని ఉంది. 1 వ శతాబ్దపు రోమన్ రచయిత స్ట్రాబో, డెల్టా భూముల గురించి ప్రస్తావించాడు: "ఇప్పుడు ఈజిప్ట్ నుండి ప్రయాణించే వ్యాపారుల గురించి ... గంగానది వరకు, వారు ప్రైవేట్ పౌరులు మాత్రమే. . . " రోమన్ పూసలు, ఇతర వస్తువులు పురాతన నగరమైన వారీ-బటేశ్వర్ శిథిలాల వద్ద వెలుగు చూస్తున్న నేపథ్యంలో అతని వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని పాత బ్రహ్మపుత్ర పక్కన తవ్వకాలు నెమ్మదిగా జరుగుతున్నాయి. టోలెమి యొక్క గంగా డెల్టా యొక్క మ్యాప్, చాలా కచ్చితంగా ఉంటుంది. అతనికి సమాచారం ఇచ్చేవారికి బ్రహ్మపుత్ర నది గురించి పూర్తిగా తెలుసని ఆ మ్యాపును చూస్తే అర్థమౌతుంది., హిమాలయాల గుండా వెళ్తూ, టిబెట్‌లోని దాని జన్మస్థానం నుండి పడమర వైపు తిరుగుతుంది. సామాన్య శకం కంటే చాలా ముందు నుండే ఈ డెల్టా ఒక ప్రధాన అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేదనడంలో సందేహమే లేదు. థాయిలాండ్, జావా నుండి వచ్చిన రత్నాలు, ఇతర వస్తువులపై డెల్టాలో వ్యాపారం జరిగేది. చైనా పురావస్తు రచయిత బిన్ యాంగ్ తో పాటు, జానైస్ స్టార్‌గార్డ్ వంటి మరి కొంతమంది రచయితలు, పురావస్తు శాస్త్రవేత్తలు, సిచువాన్ - యున్నాన్ - బర్మా - బంగ్లాదేశ్ మార్గమే అంతర్జాతీయ వాణిజ్య మార్గమని గట్టిగా సూచిస్తున్నారు. బిన్ యాంగ్ ప్రకారం, ముఖ్యంగా 12 వ శతాబ్దం నుండి యునాన్ నుండి వెండీ బంగారాలను రవాణా చేయడానికి ఈ మార్గం ఉపయోగించేవారు. (యున్నాన్ లో విరివిగా లభించే ఖనిజాల్లో వెండి బంగారాలు ఉన్నాయి), ఉత్తర బర్మా ద్వారా, ఆధునిక బంగ్లాదేశ్‌లోకి, లెడో అనే పేరున్న పురాతన మార్గం ద్వారా వీటిని పంపేవారు. బంగ్లాదేశ్ యొక్క పురాతన నగరాలలో ఉద్భవిస్తున్న సాక్ష్యం, ముఖ్యంగా వారీ-బటేశ్వర్, మహాస్థాన్‌గఢ్, భీతాగఢ్, బిక్రంపూర్, ఎగర్సిందూర్, సోనార్‌గావ్ వంటి పురాతన బంగ్లాదేశ్ నగరాల్లో లభిస్తున్న ఆధారాలను బట్టి ఈ స్థలాలు ఈ మార్గంలోని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలని తెలుస్తోంది.

సముద్ర మార్గం

మారిటైమ్ సిల్క్ రోడ్డు లేదా మారిటైమ్ సిల్క్ రూట్ అనేది చైనాను ఆగ్నేయాసియా, ఇండోనేషియా ద్వీపసమూహం, భారత ఉపఖండం, అరేబియా ద్వీపకల్పం, ఈజిప్టు, చివరకు ఐరోపాకూ అనుసంధానించే చారిత్రాత్మక సిల్క్ రోడ్డు యొక్క సముద్ర విభాగం.

వాణిజ్య మార్గం అనేక సముద్రాల గుండా వెళ్తుంది; దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, పెర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం. సముద్ర మార్గం చారిత్రాత్మక ఆగ్నేయాసియా సముద్ర వాణిజ్యం, మసాలా దినుసుల వ్యాపారం, హిందూ మహాసముద్రం వాణిజ్యం, 8 వ శతాబ్దం తరువాత అరేబియా నావికాదళ వాణిజ్య మర్గాలతో ఓవర్‌ల్యాఅప్ (అతివ్యాప్తి) అవుతుంది. కొరియా ద్వీపకల్పం, జపనీస్ ద్వీపసమూహంతో చైనాను అనుసంధానించడానికి ఈ నెట్‌వర్క్ తూర్పు వైపు తూర్పు చైనా సముద్రం, పసుపు సముద్రం వరకు విస్తరించింది.

మతాల విస్తరణ

సిల్క్ రోడ్డు 
781 లో సృష్టించబడిన నెస్టోరియన్ స్టీల్, చైనాకు నెస్టోరియన్ క్రైస్తవ మతం పరిచయం గురించి వివరిస్తుంది

రిచర్డ్ ఫోల్ట్జ్, జిన్రు లియు తదితరులు అనేక శతాబ్దాలుగా సిల్క్ రోడ్డు వెంబడి వాణిజ్య కార్యకలాపాలు వస్తువులకే కాకుండా ఆలోచనలను, సంస్కృతిని, ముఖ్యంగా మతాలను ప్రసారం చేయడానికి ఎలా దోహదపడ్డాయో వివరించారు. జొరాస్ట్రియనిజం, జుడాయిజం, బౌద్ధమతం, క్రైస్తవ మతం, మానికేయిజం, ఇస్లాం ఇవన్నీ యురేషియా అంతటా నిర్దిష్ట మత వర్గాలకు వారి సంస్థలతో ముడిపడి ఉన్న వాణిజ్య నెట్‌వర్క్‌ల ద్వారా వ్యాపించాయి. ముఖ్యంగా, సిల్క్ రోడ్డు వెంబడి స్థాపించబడిన బౌద్ధ మఠాలు విదేశీయులకు విశ్రాంతి స్థలంతో పాటు కొత్త మతాన్ని కూడా ఇచ్చాయి.

జెర్రీ హెచ్. బెంట్లీ ప్రకారం, సిల్క్ రోడ్ల వెంట మతాలు, సాంస్కృతిక సంప్రదాయాలు వ్యాప్తి చెందడం సమకాలీకరణకు కూడా దారితీసింది. చైనీస్, జియాంగ్ను సంచార జాతుల మధ్య జరిగిన సాంస్కృతిక సంపర్కం.ఒక ఉదాహరణ. దాదాపుగా అసంభవమైన ఈ సాంస్కృతిక సంపర్కం వలన ఈ రెండు సంస్కృతులు ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా మారడానికి వీలైంది. జియాంగ్ను, చైనీస్ వ్యవసాయ పద్ధతులు, దుస్తుల శైలి, జీవనశైలిని అవలంబించగా, చైనీయులు జియాంగ్ను సైనిక పద్ధతులు, కొన్ని దుస్తుల శైలి, సంగీతం, నృత్యాలను స్వీకరింంచారు. చైనా, జియాంగ్నుల మధ్య సాంస్కృతిక మార్పిడి గురించి చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం, చైనా సైనికులు కొన్నిసార్లు తమ సైన్యాన్ని వదలిపెట్టి, జియాంగ్ను లోకి వెళ్ళిపోవడం. శిక్షకు భయపడి వాళ్ళు స్టెప్పీల్లోనే ఉండిపోయేవారు.

పురాతన సిల్క్ రోడ్ల వెంట ప్రాంతాల మధ్య సంపర్కం, సాంస్కృతిక మార్పిడి లను సులభతరం చేయడంలో సంచార జాతులు కీలక పాత్ర పోషించాయి.

క్రైస్తవ మత వ్యాప్తి

సిల్క్ రోడ్డులో క్రైస్తవ మతం వ్యాప్తిని నెస్టోరియనిజం అని పిలుస్తారు. 781 లో, సిల్క్ రోడ్డులోకి నెస్టోరియన్ క్రైస్తవ మిషనరీలు రావడాన్ని ఒక స్థూపంపై చెక్కిన శాసనం చూపిస్తుంది. క్రైస్తవ మతం తూర్పు, పడమర రెండింటిలోనూ వ్యాపించింది, దాంతోపాటు సిరియాక్ భాషను తీసుకువచ్చింది. ఆరాధన రూపాలను అభివృద్ధి చేసింది.

బౌద్ధమత వ్యాప్తి

సిల్క్ రోడ్డు 
సిల్క్ రోడ్డు (200AD - 400AD) వెంబడి మిరాన్ లోని ఒక స్థూపం పై బుద్ధుడిని వర్ణించే గోడ చిత్రం లోని భాగం.
సిల్క్ రోడ్డు 
నీలి కళ్ళ మధ్య ఆసియా సన్యాసి; తూర్పు ఆసియా సన్యాసికి బోధిస్తున్నాడు. బెజెక్లిక్, టర్ఫాన్, తూర్పు తారిమ్ బేసిన్, చైనా, 9 వ శతాబ్దం. కుడి వైపున ఉన్న సన్యాసి బహుశా టోచారియన్ కానీ సోగ్డియన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది

చైనా చక్రవర్తి మింగ్ (58-75) పశ్చిమ దేశాలకు పంపిన ఒక రాయబారి చెప్పిన అర్థ-పౌరాణిక కథనం ప్రకారం, సా.శ. 1 వ శతాబ్దంలో సిల్క్ రోడ్డు ద్వారా చైనాకు బౌద్ధమతం చేరుకుంది. ఈ కాలంలో బౌద్ధమతం ఆగ్నేయ, తూర్పు, మధ్య ఆసియా అంతటా వ్యాపించడం ప్రారంభించింది. మహాయాన, తెరవాద, టిబెటన్ బౌద్ధమతాలు, బౌద్ధమతం యొక్క మూడు ప్రాథమిక రూపాలు. ఇవి సిల్క్ రోడ్డు ద్వారా ఆసియా అంతటా వ్యాపించాయి.

బౌద్ధ ఉద్యమం ప్రపంచ మతాల చరిత్రలో మొట్టమొదటి పెద్ద-స్థాయి మిషనరీ ఉద్యమం. చైనీయుల మిషనరీలు బౌద్ధమతాన్ని కొంతవరకు స్థానిక చైనీస్ డావోయిస్టుల్లో మిళితం చెయ్యగలిగారు. బుద్ధుని అనుచరులతో కూడిన బౌద్ధ సంఘాల్లో స్త్రీ, పురుష సన్యాసులు, సాధారణ గృహస్తులూ ఉండేవారు. ఈ ప్రజలు బుద్ధుని ఆలోచనలను వ్యాప్తి చేయడానికి భారతదేశం అంతటా, భారతదేశం వెలుపలా ప్రయాణించారు. సంఘంలో సభ్యుల సంఖ్య పెరిగేకొద్దీ, ఖర్చులు పెరిగాయి. తద్వారా పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే బౌద్ధాన్ని, బుద్ధుడి శిష్యుల సందర్శనలనూ భరించగలిగాయి. కుషాణుల నియంత్రణలో, బౌద్ధమతం మొదటి శతాబ్దం మధ్య నుండి మూడవ శతాబ్దం మధ్యకాలం వరకు చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని భావిస్తున్నారు. 2 వ శతాబ్దంలో విస్తృతమైన సంపర్కాలు ప్రారంభమయ్యాయి - బహుశా కుషాణ సామ్రాజ్యం చైనా భూభాగమైన తారిమ్ బేసిన్లోకి విస్తరించడంతో, చైనా లోకి అధిక సంఖ్యలో బౌద్ధ సన్యాసులు రావడం వలన అయి ఉండవచ్చు. మొదటి బౌద్ధ మత ప్రచారకులు, బౌద్ధుల గ్రంథాలను చైనీస్లోకి అనువదించినవారూ పార్థియన్, కుషాణ, సోగ్డియన్, కుచేయన్ లలో ఎవరో ఒకరై ఉండవచ్చు.

సిల్క్ రోడ్డు 
సా.పూ. 3 వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ద్విభాషా శాసనం ( గ్రీకు, అరామిక్); ఈ శాసనం ధర్మానికి యూసీబీయా అనే గ్రీకు పదాన్ని ఉపయోగించి "దైవభక్తి"ను స్వీకరించాలని సూచించింది. కాబూల్ మ్యూజియం.

సిల్క్ రోడ్డు వెంబడి బౌద్ధమతం వ్యాప్తి చెందడంతో, పర్యవసానంగా ప్రజల స్థానభ్రంశం, సంఘర్షణలు జరిగాయి. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం ప్రారంభంలో పార్థియన్స్ అని పిలువబడే కొత్త ఇరానియన్ రాజవంశం గ్రీకు సెలూసిడ్స్‌ను ఇరాన్‌కు, మధ్య ఆసియాకూ తరిమికొట్టారు. ఫలితంగా పార్థియన్లు రోమన్లు ప్రధాన కస్టమర్లైన పట్టు వాణిజ్యానికి మధ్యవర్తు లయ్యారు. పార్థియన్ పండితులు బౌద్ధగ్రంథాలను మొట్టమొదటిగా చైనీస్ భాషలోకి అనువదించారు. సిల్క్ రోడ్డులోని దాని ప్రధాన వాణిజ్య కేంద్రమైన మెర్వ్ నగరం, 2 వ శతాబ్దం మధ్య నాటికి చైనాలో బౌద్ధమతం వేళ్ళూనుకునే సమయానికి ఒక ప్రధాన బౌద్ధ కేంద్రంగా మారింది. మౌర్య వంశపు చక్రవర్తి అశోకుడు (క్రీ.పూ. 268–239) బౌద్ధమతంలోకి మారి, ఉత్తర భారతంలోని తన సామ్రాజ్యంలో బౌద్ధానికి అధికారిక హోదా ఇచ్చినపుడు కూడా సిల్కు రోడ్లపై నున్న ప్రజల్లో జ్ఞానం పెరిగింది.

4 వ శతాబ్దం నుండి, చైనా యాత్రికులు సిల్క్ రోడ్డులో భారతదేశానికి కూడా వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ ఒరిజినల్ బౌద్ధ గ్రంథాలను చదివి మెరుగైన జ్ఞానం పొందడం వీరి ఆశయం. ఫాహ్సియాన్ భారతదేశ యాత్ర (395–414), ఆ తరువాత జువాన్జాంగ్ (629– 644), కొరియా నుండి భారతదేశానికి ప్రయాణించిన హైకో మొదలైనవారు ఇలా యాత్రలు చేసారు. జువాన్జాంగ్ యొక్క ప్రయాణాల గురించి 16 వ శతాబ్దంలో జర్నీ టు ది వెస్ట్ అనే కాల్పనిక సాహస నవలలో కథలుగా వర్ణించారు. ఇది రాక్షసులతో పరీక్షలు, ప్రయాణంలో వివిధ శిష్యులు చేసిన సపర్యల గురించి ఆ నవలలో వర్ణించారు.

సిల్క్ రోడ్డు 
3,000 km (1,864 mi) సారనాథ్ నుండి బుద్ధుడు ఉపన్యాసం ఇస్తున్నట్లు విగ్రహం ఉరుంకి నైరుతి, జిన్జియాంగ్, 8 వ శతాబ్దం

సిల్క్ రోడ్డులో బౌద్ధమతం యొక్క అనేక రూపాలు ప్రయాణించాయి. ధర్మగుప్తకాలు, సర్వాస్తివాదినులు రెండు ప్రధాన నికాయ బోధనలు. చివరికి మహాయాన బౌద్ధం ఈ రెండింటినీ తొలగించి, వాటి స్థానాన్ని ఆక్రమించింది. మహాయానం మొదట ఖోటాన్ ప్రాంతంలో ప్రభావం చూపింది. మహాయానం బౌద్ధమతంలోని శాఖగా కంటే, అదే బౌద్ధమంటే అదే అన్నంతగా వ్యాపించింది. ఇది కచ్చితంగా ఏ స్థలంలో పుట్టిందో స్పష్టంగా లేనప్పటికీ, క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో వాయవ్య భారతదేశం లేదా మధ్య ఆసియాలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కొన్ని మహాయాన లిపిలను ఉత్తర పాకిస్తాన్‌లో కనుగొన్నారు. అయితే ప్రధాన గ్రంథాల మధ్య ఆసియాలో సిల్క్ రోడ్డు వెంబడే రచించి ఉంటారని భావిస్తున్నారు. సిల్క్ రోడ్డు పొడవునా ఉన్న విభిన్నమైన, సంక్లిష్టమైన విశ్వాసాలు, ప్రభావాల కారణంగా బౌద్ధమతంలోని విభిన్న శాఖలు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. మహాయాన బౌద్ధమతం పెరగడంతో బౌద్ధ మతానికి ప్రారంభంలో ఉన్న దిశలో మార్పు వచ్చింది. జిన్రు లియు చెప్పినట్లుగా, మహాయానం "సంపదలతో సహా భౌతిక వాస్తవికత లోని మార్మికతను" హైలైటు చేసింది. భౌతిక వాంఛలను వదిలించుకోవడం గురించి కూడా ఇది నొక్కి చెప్పింది. మాహాయానాన్ని పాటించేవారికి దాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది.

5 వ, 6 వ శతాబ్దాల్లో మతాల వ్యాప్తిలో, ముఖ్యంగా బౌద్ధమత వ్యాప్తిలో పెద్ద పాత్ర పోషించారు. బౌద్ధమతం ప్రవచించే సదాచారాలు, నైతిక బోధల వలన వ్యాపారులకు అది మునుపటి మతాల కంటే ఆకర్షణీయంగా కనిపించింది. తత్ఫలితంగా, వ్యాపారులు సిల్క్ రోడ్డు వెంబడి బౌద్ధ మఠాలకు మద్దతు ఇచ్చారు. దానికి బదులుగా బౌద్ధులు వ్యాపారులు ఓ నగరం నుండి మరో నగరానికి వెళ్ళేటప్పుడు అక్కడ వారికి వసతి కల్పించేవారు. తత్ఫలితంగా, వ్యాపారులు వ్యపారులు బౌద్ధమతాన్ని తాము వెళ్ళేచోట్లకు తీసుకెళ్ళారు, వ్యాప్తిచేసారు. కాలక్రమేణా వారి సంస్కృతులు బౌద్ధమతం ఆధారంగా మారాయి. తత్ఫలితంగా, ఆయా సమాజాలు మంచి వ్యవస్థీకృత మార్కెట్ ప్రదేశాలు, బస, నిల్వ సౌకర్యాలు కలిగి, అక్షరాస్యతకూ సంస్కృతికీ కేంద్రాలుగా మారాయి. చైనా పాలకవర్గాలు స్వచ్ఛందంగా బౌద్ధానికి మారడంతో, తూర్పు ఆసియాలో బౌద్ధమతం వ్యాప్తికి సహాయపడింది. చైనా సమాజంలో బౌద్ధమతం విస్తృతంగా వ్యాపించింది. సిల్క్ రోడ్డు వెంట బౌద్ధమత వ్యాప్తి, 7 వ శతాబ్దంలో మధ్య ఆసియాలో ఇస్లాం పెరుగుదలతో ముగిసింది.

సిల్క్ రోడ్డులో జుడాయిజం

559 లో పెర్షియన్ బాబిలోన్‌ను సైరస్ ది గ్రేట్ సైన్యాలు స్వాధీనం చేసుకున్న తరువాత, యూదు మతావలంబికులు మొదట మెసొపొటేమియా నుండి తూర్పు వైపు ప్రయాణించడం మొదలుపెట్టారు. పెర్షియన్లు బాబిలోన్‌ను ఆక్రమించుకున్నాక విడుదలైన యూదు బానిసలు పెర్షియన్ సామ్రాజ్యం అంతటా చెల్లాచెదురయ్యారు. కొంతమంది యూదులు తూర్పున సుదూరాన ఉన్న బాక్ట్రియా, సోగ్డియా వరకు ప్రయాణించి ఉండవచ్చు. అయితే, ఈ యూదుల ప్రారంభ స్థావరాలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు. స్థిరపడ్డాక, చాలా మంది యూదులు వర్తక వాణిజ్యాల్లో ప్రవేశించి ఉండవచ్చు. వాణిజ్య నెట్‌వర్క్‌లు విస్తరించడంతో యూదు వ్యాపారుల పట్టు వాణిజ్యం పెరిగింది. సంప్రదాయ యుగం నాటికి, తూర్పున చైనా నుండి నుండి పశ్చిమాన రోమ్ వరకూ వాణిజ్యం విస్తరించినప్పుడు, మధ్య ఆసియాలోని యూదు వ్యాపారులు సిల్క్ రోడ్డు వెంట వాణిజ్యంలో పాల్గొనడానికి అనుకూలమైన స్థితిలో ఉండేవారు. గౌల్ ప్రాంతానికి ఎందిన రాడనైట్లు అనబడే యూదు వ్యాపారులు చైనా నుండి రోమ్ వరకు వాణిజ్యాన్ని వృద్ధి చేసుకున్నారు. ఖాజాఅర్ టర్కులతో రాడనైట్లు స్థాపించుకున్న సత్సంబంధాల వలన ఈ వాణిజ్యం సానుకూలపడింది. చైనా, రోమ్ ల మధ్య ఖాజార్లు మంచి అనుకూల ప్రదేశంగా ఉండేవారు. రాడానైట్లతో తమ సంబంధాలను వారు మంచి వాణిజ్య అవకాశంగా చూశారు. ఖాజార్లకు యూదులకూ మధ్య ఉన్న ఈ సుదీర్ఘ సంబంధం చివరికి ఖాజార్లు జుడాయిజాన్ని తమ ప్రధాన మతంగా స్వీకరించడానికి దారితీసింది.

ఈ సమయంలో, యూదు మతాన్ని ఇరానియన్ మతం ప్రభావితం చేసింది. మంచి వాళ్లకు స్వర్గం, దుర్మార్గులకు నరకం, యుగాంతాన ప్రపంచం అంతమై పోవడం వంటి భావనలు ఇరానియన్ మతం నుండే వచ్చాయి. బహిష్కరణకు ముందు ఉన్న యూదు మూలాల్లో ఇటువంటి భావనలు ఉండేవి కావు. దయ్యం అనే భావన కూడా ఇరానియన్ పురాణాలలోని దుష్ట వ్యక్తి ఇరానియన్ అంగ్రా మెయిన్యు నుండే వచ్చినట్లు కూడా చెబుతారు.

కళల విస్తరణ

సిల్క్ రోడ్డు 
వాయుదేవుడి ఐకానోగ్రాఫికల్ పరిణామం. ఎడమ: గ్రీకు వాయుదేవుడు (హడ్డా వద్ద), 2 వ శతాబ్దం. మిడిల్: వాయుదేవుడు (కిజిల్, తారిమ్ బేసిన్), 7 వ శతాబ్దం. కుడి: జపనీస్ వాయుదేవుడు (ఫుజిన్), 17 వ శతాబ్దం.

సిల్క్ రోడ్డు ద్వారా, ముఖ్యంగా మధ్య ఆసియా ద్వారా అనేక కళాత్మక ప్రభావాలు ప్రయాణం చేసాయి. ఇక్కడ హెలెనిస్టిక్, ఇరానియన్, భారతీయ, చైనీస్ ప్రభావాలు పరస్పరం కలిసిపోయాయి. గ్రీకో-బౌద్ధ కళ ఈ పరస్పర చర్యకు చాలా స్పష్టమైన ఉదాహరణలలో ఒకటి. పట్టు కూడా కళగా, మతపరమైన చిహ్నంగా ఉండేది. మరీ ముఖ్యంగా, సిల్క్ రోడ్డు వెంట పట్టును వాణిజ్యంలో మారక ద్రవ్యంగా ఉపయోగించారు.

బౌద్ధమతం అభివృద్ధిలో ఈ కళాత్మక ప్రభావాలను చూడవచ్చు. ఉదాహరణకు, కుషాణ కాలంలో బుద్ధుడిని మొదట మానవుడిగానే చిత్రీకరించారు. గ్రీకు ప్రభావమే దీనికి కారణమని చాలా మంది పండితులు పేర్కొన్నారు. గ్రీకు, భారతీయ అంశాల మిశ్రమాన్ని చైనాలోని బౌద్ధ కళలోను, సిల్క్ రోడ్డులోని దేశాలలోనూ చూడవచ్చు.

కళాసాధనలో తూర్పు నుండి పడమర వరకు సిల్క్ రోడ్ల వెంట వర్తకం జరిగిన అనేక విభిన్న వస్తువులున్నాయి. లాపిస్ లాజులి, బంగారు మచ్చలుండే నీలిరంగు రాయి ఎక్కువగా ఉపయోగించే వస్తువు. దీనిని పొడి చేసి, తరువాత పెయింట్‌గా ఉపయోగించేవారు.

సంస్మరణ

2014 జూన్ 22 న, ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) సిల్క్ రోడ్డును ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొంది . ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ 1993 నుండి శాంతినీ, అవగాహననూ పెంపొందించే లక్ష్యంతో స్థిరమైన అంతర్జాతీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.

సిల్క్ రోడ్డు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారిన జ్ఞాపకార్థం, చైనా నేషనల్ సిల్క్ మ్యూజియం 19- 2020 జూన్ 25 న "సిల్క్ రోడ్డు వీక్"గా ప్రకటించింది.

బిష్కెక్, అల్మాటీ నగరాల్లో సిల్క్ రోడ్డు పేరు మీద ఒక ప్రధాన తూర్పు-పడమర వీధులు ఉన్నాయి. బిష్కెక్‌లో జిబెక్ జోలు అని, అల్మాటీలో జిబెక్ జోలీ అనీ అంటారు. UK లోని మాక్లెస్‌ఫీల్డ్‌లో కూడా ఒక సిల్క్ రోడ్డు ఉంది.

వివిధ భాషల్లో పట్టుదారి

భాషా టెక్స్ట్ లిప్యంతరీకరణ (వర్తిస్తే)
చైనీస్ Sīchóu zhī lù
సంస్కృతం / హిందీ कौशेय मार्ग కౌశేయ మార్గ్
పెర్షియన్ جاده ابریشم Jâdeye Abrišam

Shâhrâh-i Abrešim

పంజాబీ ਕੌਸ਼ਿਆ ਮਾਰਗ Kausheya Mārg
ఉర్దూ شاہراہ ریشم shah rah resham
కన్నడ ರೇಶ್ಮೆ ದಾರಿ రేష్మే దారి
కావి భాష Sutra dalan
తమిళ பட்டு வழி Paṭṭu vaḻi
ఉజ్బెక్ إيباك يولي Ipak yo'li
తుర్క్‌మెన్ Ýüpek ýoly
టర్కిష్ İpek yolu
అజెరి İpək yolu
అరబిక్ طريق الحرير Tarīq al-Ḥarīr
హిబ్రూ דרך המשי Derekh ha-Meshi
గ్రీకు Δρόμος του μεταξιού Drómos tou metaxioú'
లాటిన్ Via Serica
ఆర్మేనియన్ Մետաքսի ճանապարհ Metaksi chanaparh
తగలోగ్ Daang Sutla, Daang Seda
సోమాలి Waddada Xariir
కొరియన్ 비단길 Bidangil
సింహళం සේද මාවත Sedha mawatha

గ్యాలరీ


మూలాలు

Tags:

సిల్క్ రోడ్డు పేరుసిల్క్ రోడ్డు చైనాలో మొదలు (క్రీ.పూ. 130)సిల్క్ రోడ్డు వికాసంసిల్క్ రోడ్డు కొత్త (20 - 21 వ శతాబ్దాలు)సిల్క్ రోడ్డు మార్గాలుసిల్క్ రోడ్డు మతాల విస్తరణసిల్క్ రోడ్డు కళల విస్తరణసిల్క్ రోడ్డు సంస్మరణసిల్క్ రోడ్డు వివిధ భాషల్లో పట్టుదారిసిల్క్ రోడ్డు గ్యాలరీసిల్క్ రోడ్డు మూలాలుసిల్క్ రోడ్డుఅరేబియా ద్వీపకల్పంఇరాన్దక్షిణాసియా

🔥 Trending searches on Wiki తెలుగు:

కార్తెసమాసంశ్రీ గౌరి ప్రియశ్రీలలిత (గాయని)సంగీతంఅర్జునుడుధనూరాశినర్మదా నదిభారతదేశంరకుల్ ప్రీత్ సింగ్తెలుగు సంవత్సరాలుసచిన్ టెండుల్కర్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంఅక్బర్పసుపు గణపతి పూజహల్లులుథామస్ జెఫర్సన్న్యుమోనియావిశ్వబ్రాహ్మణసర్పిరాయప్రోలు సుబ్బారావుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుమదర్ థెరీసాకుటుంబంశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఆంధ్రప్రదేశ్రైలురవీంద్రనాథ్ ఠాగూర్ఎయిడ్స్పెళ్ళి చూపులు (2016 సినిమా)తిథియోనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిరమణ మహర్షివై.ఎస్.వివేకానందరెడ్డి హత్యఐడెన్ మార్క్‌రమ్సిద్ధార్థ్నరేంద్ర మోదీవిభక్తికాలుష్యంతమన్నా భాటియాగ్లెన్ ఫిలిప్స్వాతావరణంరజాకార్రామోజీరావుజయలలిత (నటి)కల్వకుంట్ల చంద్రశేఖరరావునెమలిఅశోకుడుమహాభాగవతంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిమహాభారతంషాహిద్ కపూర్హనుమాన్ చాలీసానవధాన్యాలునవగ్రహాలుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థనీతి ఆయోగ్భూమా అఖిల ప్రియపేర్ని వెంకటరామయ్యపేరువిష్ణువుబారసాలఇన్‌స్టాగ్రామ్ఇక్ష్వాకులురాజ్యసభదానం నాగేందర్భారత జాతీయ క్రికెట్ జట్టుతోట త్రిమూర్తులుబుధుడు (జ్యోతిషం)రామాయణంమానవ శరీరముఋగ్వేదంభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితా🡆 More