హిందూ కుష్

35°N 71°E / 35°N 71°E / 35; 71

హిందూ కుష్
హిందూ కుష్
హిందూ కుష్ రేంజి టోపోగ్రఫీ
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంతిరిచ్ మీర్
ఎత్తు7,708 m (25,289 ft)
నిర్దేశాంకాలు36°14′45″N 71°50′38″E / 36.24583°N 71.84389°E / 36.24583; 71.84389
భౌగోళికం
దేశాలుఆఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్ and తజికిస్తాన్
Regionదక్షిణ మధ్య ఆసియా
పర్వత శ్రేణిహిమాలయాలు
హిందూ కుష్
Hindu Kush and its extending mountain ranges to the west

హిందూ కుష్ 800 కిలోమీటర్ల పొడవైన (500 మైళ్ళు) పర్వత శ్రేణి. ఇది ఆఫ్ఘనిస్తాన్ అంతటా విస్తరించి ఉంది. ఇది దాని కేంద్రం నుండి ఉత్తర పాకిస్తాన్, తజికిస్తాన్ వరకు విస్తరించి ఉంది. హిందూ కుష్ పదానికి పర్షియా భాషలో హిందూ హంతకులు లేదా హిందువుల హంతకుడు అని దీనికి అర్ధం

ఇది హిందూ కుష్ హిమాలయా ప్రాంతం పశ్చిమ విభాగాన్ని ఏర్పరుస్తుంది. ఇది పామీరు పర్వతాలు, కారకోరం పర్వతశ్రేణితో కూడిన హిమాలయాల పశ్చిమ విస్తరణగా ఉంది. ఇది సింధు నది లోయ నుండి అము దర్యా (పురాతన ఆక్సస్) లోయ ఉత్తర ప్రాంతాలను విభజిస్తుంది. ఈ శ్రేణిలో మంచుతో కప్పబడిన అనేక శిఖరాలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని ఖైబరు పఖ్తున్ఖ్వాలోని చిత్రాలు జిల్లాలో 7,708 మీటర్లు (25,289 అడుగులు) ఎత్తులో తిరిచు మీరు లేదా టెరిచ్మిరు వంటి హిమశిఖరాలు ఉన్నాయి. ఉత్తరాన, దాని ఈశాన్య సరిహద్దున చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు కలిసే ప్రదేశానికి సమీపంలో హిందూ కుష్ పామీరు పర్వతాలు ఉన్నాయి. తరువాత ఇది పాకిస్తాన్ గుండా నైరుతి దిశగా విస్తరించి పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళుతుంది. ఉత్తర హిందూ కుష్ తూర్పు కారకోరం శ్రేణితో విలీనం అవుతుంది. దాని దక్షిణ చివరలో ఇది కాబూల్ నదికి సమీపంలో ఉన్న స్పిన్ఘరు శ్రేణితో కలుస్తుంది.

హిందూ కుష్ శ్రేణి ప్రాంతం చారిత్రికంగా బౌద్ధమత కేంద్రంగా ఉంది. బమియాన్ బౌద్ధప్రాంతాలు ఉన్నాయి. ఇది 19 వ శతాబ్దం వరకు బహుదేవత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. దానిలో స్థిరపడిన సంఘాలకు చెందిన పురాతన మఠాలు, ముఖ్యమైన వాణిజ్య అనుసంధానాలు, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా మధ్య ప్రయాణికులకు ఆతిథ్యం ఇచ్చాయి. హిందూ కుష్ శ్రేణి భారత ఉపఖండం దండయాత్రల మార్గంగా కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఆధునిక యుగ యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన యుద్ధభూమిగా ఉంది.

భౌగోళికం

భౌగోళికంగా 160 మిలియన్ల సంవత్సరాల క్రితం మధ్య జురాసిక్ కాలంలో తూర్పు ఆఫ్రికా నుండి దూరమైన ఈ పర్వతశ్రేణి గోండ్వానా ప్రాంతం నుండి ఉపఖండం ఏర్పడటానికి కారణంగా ఉంది. భారత ఉపఖండం, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్రం ద్వీపాలు మరింత ఈశాన్య దిశగా పయనించాయి. భారత ఉపఖండం దాదాపు 55 మిలియన్ల సంవత్సరాల క్రితం పాలియోసినె ముగిసే సమయానికి ప్లేటుతో ఢీకొన్నది. ఈ ఘర్షణ కారణంగా హిమాలయాలు, హిందూ కుష్ సృష్టించబడ్డాయి.

హిందూ కుష్ శ్రేణి భౌగోళికంగా క్రియాత్మకంగా ఉండి ఇప్పటికీ పెరుగుతోంది. క్రియాత్మకంగా ఉన్న ఫలితంగా ఇది భూకంపాలకు గురవుతుంది.

పేరువెనుక చరిత్ర

"హిందూ కుషు" అనే పేరు చారిత్రక కోణంలో సమీపకాలంలో ఏర్పడినది. పురాతన కాలంలో, క్రీస్తుపూర్వం మొదటి సహస్రాబ్ది చివరలో హెలెనిక్ గ్రీకులు పర్వత శ్రేణిని "పరోపామిసాడే" అని పిలిచారు. ఆసమయానికి పూర్వం దీనిని ప్రపంచ పటాలలో పరోపామిసాడే అని పేర్కొన్నారు. హిందూ కుష్ అనే పేరు మొదటిసారిగా 14 వ శతాబ్దంలో ప్రస్తావించబడింది. ఎర్విన్ గ్రట్జ్‌బాచ్ ఇలా పేర్కొన్నాడు. ఇది "ప్రారంభ అరబు భూగోళ శాస్త్రవేత్తల ఖాతాల నుండి తప్పిపోయింది. ఇబ్ను బావునా (ca. 1330) లో మొదటిసారి సంభవిస్తుంది." ఇబ్ను బాసునా, గ్రట్జిబాచు, "హిందూ కుష్ (హిందూ-కిల్లర్) అనే పేరు మూలాన్ని చూశాడు. వాస్తవానికి అనేక మంది హిందూ బానిసలు భారతదేశం నుండి తుర్కెస్తాన్ తీసుకునివస్తున్న మార్గంలో పాస్ దాటుతూ మరణించారు". భారతదేశం గురించి తన ప్రయాణ స్మృతులలో 14 వ శతాబ్దంలో మొరాకో యాత్రికుడు ముహమ్మదు ఇబ్ను బటుటా హిందూ కుష్ పర్వత మార్గాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడాన్ని పేర్కొన్నాడు. తన రిహ్లాలో ఆయన ఈ పర్వతాలను, బానిస వ్యాపారంలో ఈపర్వశ్రేణికి ఉన్న చరిత్రను పేర్కొన్నాడు. అలెగ్జాండరు వాన్ హంబోల్టు ముహమ్మదు ఇబ్ను బటుటా వ్రాసిన రిహ్లా నుండి నేర్చుకోవచ్చని పేర్కొన్నాడు. ఈ పేరు ఒకే పర్వత మార్గాన్ని మాత్రమే సూచిస్తుంది. ఈ మార్గంలో పయనించిన భారతీయులు అనేకమంది ఇక్కడ ఉన్న శీతలవాతావరణం కారణంగా మరణించారు. బటురా ఇలా వ్రాసారు,

దీని తరువాత నేను బార్వాన్ నగరానికి వెళ్ళాను. రహదారిలో ఎత్తైన పర్వతం, మంచుతో కప్పబడి, చలిగా ఉంది; వారు దీనిని హిందూ కుష్ అని పిలుస్తారు. అది హిందూ-స్లేయరు, ఎందుకంటే భారతదేశం నుండి అక్కడికి తీసుకువచ్చిన బానిసలలో ఎక్కువ మంది చలి తీవ్రత కారణంగా మరణిస్తారు

— -ఇబ్న్ బటుట్టా, చాప్టర్ XIII, రిహ్లా - ఖోరాసను

ఒక పెర్షియా-ఇంగ్లీషు నిఘంటువు 'కో' అనే ప్రత్యయం: "చంపడానికి" ('కొస్తాన్' کشتن) అనే క్రియని సూచిస్తుంది. ఫ్రాన్సిసు జోసెఫ్ స్టీంగస్ అభిప్రాయం ఆధారంగా "-కుష్" అనే పదానికి పురుషుడు; (కుష్తాను కోంప్.) ఒక హంతకుడు, చంపేవాడు, హత్యలు చేసేవాడు, అజ్దాహా-కుష్ అంటే హింసించేవాడు". పెర్షియా భాష ప్రాక్టికల్ డిక్షనరీ కుష్ అనే పదానికి "హాట్‌బెడ్" అని అర్ధం ఇస్తుంది. ఒక వ్యాఖ్యానం ఆధారంగా హిందూ కుష్ అనే పేరు "హిందూను చంపడం" లేదా "హిందూ హంతకుడు" అని అర్ధం. భారత ఉపఖండానికి చెందిన బానిసలను మధ్య ఆసియాకు తీసుకువెళుతున్నప్పుడు ఆఫ్ఘను పర్వతాల కఠినమైన వాతావరణంలో మరణించిన రోజులను ఇవి గుర్తుచేస్తాయి. వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా అభిప్రాయం ఆధారంగా కుష్ అనే పదానికి మరణం అని అర్ధం, పర్వతాలకు వాటి ప్రమాదకరమైన మార్గం కారణంగా ఈ పేరు ఇవ్వబడింది.

దీనికి విరుద్ధంగా స్టేటు ఫోస్కో మరైని, నిగెల్ అలన్, సా.శ.1000 లో ప్రచురించబడిన మ్యాపులో మొట్టమొదటిసారిగా ఈ పేరు ఉపయోగించబడింది. అలన్ అభిప్రాయం ఆధారంగా హిందూ కుష్ అనే పదం సాధారణంగా "హిందూ హంతకుడు" అని అర్ధం. కానీ ఈ పదానికి మరో రెండు అర్ధాలు "భారతదేశపు మెరిసే స్నోసు", "కుషు"తో "భారతదేశ పర్వతాలు", బహుశా కుష్ మృదువైన వైవిధ్యంగా "పర్వతం" అని అర్ధం. అరబు భౌగోళిక శాస్త్రవేత్తలకు అల్లను అభిప్రాయం ఆధారంగా " హిందూ కుష్ " అంటే హిందూస్తాన్ సరిహద్దు అని అర్ధం. ఈ సిద్ధాంతం మధ్య ఆసియా నుండి హిందూ ఆర్యులను విభజించే సరిహద్దును సూచిస్తుంది.

హిందూ కుష్ 
An 1879 map of Hindu Kush and its passes by Royal Geographic Society. Kabul is in lower left, Kashmir in lower right.

మెక్కాలు అభిప్రాయం ఆధారంగా హిందూ కుష్ పేరు మూలాలు వివాదాస్పదంగా ఉన్నాయి. భారతీయ బానిసల నాశనంలో దాని మూలంతో పాటు, మరో రెండు వివరణలు ఉన్నాయి. ఈ పదం ఇస్లామికు పూర్వ కాలం నుండి హిందూ కో రూపాంతరం కావచ్చు. ఇక్కడ దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ జనాభాను ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూయేతర జనాభా నుండి వేరు చేసింది. రెండవ వివరణ ఏమిటంటే ఈ పేరు పురాతన అవెస్టాను భాషకు చెందినది కావచ్చు. దీని అర్థం "నీటి పర్వతం".

ఇతర అర్ధాలు

మొదటి సహస్రాబ్ది చివరిలో హెలెనికు గ్రీకులు ఈ పర్వత శ్రేణిని "పరోపామిసాడే" అని కూడా పిలుస్తారు.

19 వ శతాబ్దపు ఎన్సైక్లోపీడియాలు, గెజిటీర్ల ఆధారంగా హిందూ కుష్ అనే పదం మొదట కుషాన్ మార్గం ప్రాంతంలో ఉన్న శిఖరానికి మాత్రమే వర్తింపజేసింది. ఇది మొదటి శతాబ్దం నాటికి కుషాను సామ్రాజ్యానికి కేంద్రంగా మారింది.

కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని హిందూ కుష్ అని పిలుస్తారు.

పర్వతప్రాంతం

హిందూ కుష్ ప్రాంతంలోని బలీయమైన పర్వత శ్రేణిలోని పలు శిఖరాల ఎత్తు సాధారణంగా 4,400 - 5,200 మీ (14,500 - 17,000 అడుగులు) ) మధ్య ఉంటుంది. వీటిలోకొన్ని అంతకంటే అధికంగా ఉంటాయి. పర్వతాలలో భారీ హిమపాతం, మంచు తుఫానులు సంభవిస్తుంటాయి. వీటిలో అతి తక్కువ ఎత్తైన ఘాటుమార్గంలో దక్షిణ షిబారు ఘాటుమార్గం (2,700 మీ లేదా 9,000 అ), ఇక్కడ హిందూ కుష్ శ్రేణి ముగుస్తుంది. ఇతర పర్వత మార్గాలు సాధారణంగా 3,700 మీ (12,000 అడుగులు) లేదా అంతకంటే అధికమైన ఎత్తులో ఉన్నాయి. ఇవి వసంత ఋతువు, వేసవిలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి.

హిందూ కుష్ పర్వతశ్రేణి పడమటి వైపు విస్తరిస్తూ దిగువ స్థాయికి చేరుకుంటాయి. పశ్చిమాన కాబూల్ సమీపంలో ఇవి 3,500 - 4,000 మీటర్లు (11,500 - 13,100 అడుగులు) ఎత్తుకు చేరుకుంటాయి; తూర్పున అవి 4,500 - 6,000 మీటర్లు (14,800 - 19,700 అడుగులు) వరకు విస్తరించి ఉన్నాయి. హిందూ కుష్ సగటు ఎత్తు 4,500 మీటర్లు (14,800 అడుగులు).

హిందూ కుష్ వ్యవస్థ 966 కిలోమీటర్లు (600 మైళ్ళు) విస్తరించి ఉంది. దాని మధ్యస్థ ఉత్తర-దక్షిణ కొలత 240 కిలోమీటర్లు (150 మైళ్ళు). హిందూ కుష్ వ్యవస్థలో 600 కిలోమీటర్లు (370 మైళ్ళు) విస్తీర్ణతలో ఉన్న పర్వతప్రాంతాలను మాత్రమే హిందూ కుష్ పర్వతాలు అంటారు. మిగిలిన వ్యవస్థలో అనేక చిన్న పర్వతశ్రేణులు ఉంటాయి. పర్వతవ్యవస్థ నుండి ప్రవహించే నదులలో హెల్మండు నది, హరి నది, కాబూల్ నది సిస్తాన్ బేసిను కొరకు వాటరు షెడ్లుగా ఉన్నాయి. దక్షిణ హిందూ కుష్ నుండి కరిగినమంచుతో లభించే నీటితో దిగువ హెల్మాండు నది ఉద్భవించింది. పశ్చిమ హిందూ కుష్ నుండి ఉద్భవించిన ఖాషు, ఫరా, అరష్కను (హరుతు) వంటి చిన్న నదులు నీటి అవసరాలకు సరిపడిన నీటిని అందిస్తున్నాయి. ఈ నదుల ముఖద్వారాలు హిందూ కుషుకు పశ్చిమప్రాంతంలో పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు సహకారం అందిస్తున్నాయి. అయితే ఈ నదులలో నీటిప్రవాహం తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న కారణంగా ఈప్రాంతంలో స్థిరంగా నివసించడం సమస్యగా ఉంది. ఈప్రాంతంలో విపరీతమైన కరువు విస్తరించడం సాధారణం.

హిందూ కుషులో ఆగస్టులో బదక్షానులోయ (ఎడమ).

హిందూ కుష్ భౌగోళికంగా అనేక రచనలలో వివరించబడింది. పశ్చిమ హిందూ కుష్ యార్షాటరు నుండి 5,100 మీ (16,700 అడుగులు) ఎత్తుకు ఎదిగి దర్రా-యే సేకారి, పశ్చిమాన షిబారు ఘాటుమార్గం, తూర్పున ఖావాకు ఘాటుమార్గం మధ్య విస్తరించి ఉంది. మద్య హిందూ కుష్ 6,800 మీ (22,300 అడుగులు) పైకి పెరుగుతోంది. తూర్పున ఖావాకు ఘాటుమార్గం, పశ్చిమాన దురా ఘాటుమార్గం మధ్య అనేక ఎత్తుపల్లాలు ఉన్నాయి. 7,000 మీ (23,000 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తైన శిఖరాలతో ఉన్న తూర్పు హిందూ కుష్ ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉన్న దురాహు ఘాటుమార్గం నుండి బరోగిలు ఘాటుమార్గం వరకు విస్తరించి ఉంది. ఖావాకు ఘాటుమార్గం, బదక్షను మధ్య ఘాటుమార్గం 5,800 మీ (19,000 అడుగులు) కంటే అధికమైన ఎత్తున ఉంది. దీనిని కాజా మొహమ్మదు పర్వతశ్రేణి అని కూడా పిలుస్తారు.

హిందూ కుష్ యార్షాటరుపర్వతప్రాంతం యురేషియా పర్వత శ్రేణిలో ఒక భాగంగా ఉన్నాయి. ఇది స్కిస్టు, గ్నిసు, పాలరాయి వంటి రూపాంతర శిలలతో ​​కూడి ఉంటుంది. వేర్వేరు కాలాలకు చెందిన గ్రానైటు, డయోరైటు వంటి రాతిపొరలను కలిగి ఉంటుంది. హిందూ కుష్ ఉత్తర ప్రాంతాలు హిమాలయ శీతాకాలవాతావరణానికి సాక్ష్యంగా ఉండి హిమానీనదాలతో ఉంటాయి. అయినప్పటికీ దాని ఆగ్నేయసరిహద్దు ప్రాంతం భారత ఉపఖండంలోని వేసవి రుతుపవనాలకు సాక్ష్యమిస్తుంది. సుమారు 1,300 నుండి 2,300 మీ (4,300 నుండి 7,500 అడుగులు) వరకు, "స్క్లెరోఫిలసు అడవులు క్వెర్కసు, ఒలియా (వైల్డు ఆలివు) వృక్షాలు అధికంగా ఉన్నాయి; 3,300 మీ (10,800 అడుగులు) ఎత్తైనప్రాంతంలో దేవదారులతో పిసియా, అబీసు, పినసు, జునిపెర్సు వంటి వృక్షాలతో కూడిన శంఖాకార అడవులు ఉంటాయి.". హిందూ కుష్ లోపలి లోయలలో కొద్దిగా వర్షపాతం, ఎడారి వృక్షాలు ఉంటాయి.

అనేక ఉన్నతమైన ఘాటుమార్గాలు ("కోటల్") పర్వతమయప్రాంతాలుగా ఉంటాయి. ఇవి యాత్రికుల రవాణాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన నెట్వర్కును ఏర్పరుస్తాయి. అతి ముఖ్యమైన పర్వతమార్గం అయిన సలాంగు ఘాటుమార్గం (కోటల్-ఇ సలాంగ్) (3,878 మీ లేదా 12,723 అ) ; ఇది కాబూల్‌ను కలుపు మీదుగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ కు చేరడానికి అనుకూలంగా ఉంటుంది. 1964 లో ఈ ఘాటుమార్గం లోపల ఒక సొరంగం పూర్తి కావడం వలన కాబూల్ ఉత్తరం, మధ్యప్రాంతాల ప్రయాణసమయం కొన్ని గంటలకు తగ్గించబడింది. ఇంతకుముందు కోటల్-ఇ షిబారు (3,260 మీ లేదా 10,700 అడుగులు) మీదుగా ఉత్తరాన ప్రవేశించడానికి మూడు రోజులు పట్టింది. ఈ సొరంగమార్గం నిర్మించడానికి ఆర్థిక, సాంకేతిక సహాయంతో హిందూ కుష్ కేంద్రప్రాంతం ద్వారా 2.7 కిమీ (1.7 మైళ్ళు) డ్రిల్లింగు చేయబడింది. సలాంగు సొరంగమార్గం గోల్బహారు పట్టణానికి వాయవ్యంగా ఉన్న ఆఫ్ఘని హైవే 76 లో ఉంది. దీనిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న వివిధ పార్టీలతో ఇది సాయుధ పోరాటానికి కేంద్రప్రాంతంగా ఉంది.

ఈ పర్వతప్రాంతాలు ఎక్కువగా బంజరు, లేదా చాలా అరుదుగా చెట్లు, కుంగిపోయిన పొదలతో నిండి ఉంటాయి. కౌచెహు లోయలో లాపిసు లాజులిని ఉత్పత్తి చేసే చాలా పురాతన గనులు కనిపిస్తాయి. కాబూల్‌కు ఉత్తరాన పంజ్షెరు నది లోయలో దాని ఉపనదులలో కొన్ని అయితే రత్నం-గ్రేడ్ పచ్చలు ఉత్పన్నం అయ్యాయి. వాల్టరు షూమాను అభిప్రాయం ఆధారంగా పశ్చిమ హిందూ కుష్ పర్వతాలు వేలాది సంవత్సరాలుగా అత్యుత్తమ లాపిస్ లాజులీకి మూలంగా ఉన్నాయి.

తూర్పు హిందూ కుష్

హిందూ కుష్ 
చిత్రాలు జిల్లాలోని పర్వతాలు
హిందూ కుష్ 
కైలాషు లోయలలోని కైలాషు మహిళలు

ఉన్నత హిందూ కుష్ శ్రేణి అని పిలువబడే తూర్పు హిందూ కుష్ శ్రేణిలో ఎక్కువగా ఉత్తర పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని నురిస్తాన్, బడాఖాను ప్రావిన్సులు ఉన్నాయి. పాకిస్తాన్ లోని చిత్రాలుజిల్లా హిందూ కుష్ లోని ఎత్తైన శిఖరాలైన తిరిచు మీరు, నోషాకు, ఇస్తోరో నల్ లకు నిలయంగా ఉంది. ఈ శ్రేణి పాకిస్తాన్ ఉత్తరప్రాంతాలలో ఘిజారు, యాసినువ్యాలీ, ఇష్కోమను వరకు కూడా విస్తరించింది.

పాకిస్తాన్ లోని చిత్రాలు హిందూ కుష్ ప్రాంతానికి పరాకాష్ఠగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతంలో ఎత్తైన శిఖరాలు, అలాగే లెక్కలేనన్ని ఘాటుమార్గాలు భారీ హిమానీనదాలు ఉన్నాయి. చియాంతారు, కురంబారు, టెరిచు హిమానీనదాలు హిందూ కుషులో అత్యంత విస్తృతమైనవిగా ఉన్నాయి. ఈ హిమానీనదాల నుండి కరిగేనీరు కునారు నదిని ఏర్పరుస్తాయి. ఇది చివరికి దక్షిణాదిగా ఆఫ్ఘనిస్థానులోకి ప్రవహిస్తుంది. బష్గలు, పంజ్షీరు, చివరికి కాబూల్ నదిలో సంగమిస్తుంది.[ఆధారం చూపాలి]

ఎత్తైన పర్వతశిఖరాలు

పేరు ఎత్తు దేశం
తిరిచి మిరు 7800 మీ (25,289 అ) పాకిస్థాను
నోషకు 7,492 metres (24,580 ft) ఆఫ్ఘనిస్థాను, పాకిస్థాను
ఇస్తరు-ఒ-నల్ 7,403 మీ (24,288 అ) పాకిస్థాను
సరఘరు 7,338 మీ (24,075 అ) పాకిస్థాను
ఉద్రెను జాం 7,140 మీ (23,430 అ) పాకిస్థాను
లంఖొ ఇ దొసరె 6,901 మీ (22,641 అ) ఆఫ్ఘనిస్థాను, కాకిస్థాను
కుహు-ఇ-బందక 6,843 మీ (22,451 అ) ఆఫ్ఘనిస్థాను
కొహు-ఇ-కేష్ని ఖాన్ 6,743 మీ (22,123 అ) ఆఫ్ఘనిస్థాను
సాకరు సార్ 6,272 మీ (20,577 అ) ఆఫ్ఘనిస్థాను, పాకిస్థాను
కొహె మండి 6,234 మీ (20,453 అ) ఆఫ్ఘనిస్థాను

చరిత్ర

హిందూ కుష్ 
హిందూ కుష్ పర్వతశ్రేణిలో సముద్రమట్టానికి 5900 ఆ (1800 మీ) ఎత్తున ఇరుకైన లోయలో ఉన్న కాబూల్‌

భారత ఉపఖండం, చైనా, ఆఫ్ఘనిస్తాన్లలో ఈ పర్వతాలకు చారిత్రకప్రాముఖ్యత ఉంది. హిందూ కుష్ పర్వతశ్రేణి బౌద్ధమతం ప్రధాన కేంద్రంగా బామియను బుద్ధులతో ఉంది. భారతీయ ఉపఖండం మీద జరిగిన దాడులకు హిందూ కుష్ పర్వతాలు దండయాత్రా మార్గాలుగా ఉన్నాయి. తాలిబను, అల్ ఖైదా వంటి పార్టీలు అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఆఫ్ఘనిస్తాన్ ఆధునికయుగం యుద్ధానికి కూడా ఇది మార్గంగా ఉంది.

1896 లో ఆఫ్ఘనిస్తానులోని బామియన్ల బౌద్ధ (టాప్) ప్రాంతాలు 2001 లో తాలిబాన్ల చేత నాశనం చేయబడిన తరువాత.

పురాతన హిందూ కుష్ ప్రాంతంలో బౌద్ధమతం విస్తృతంగా వ్యాపించింది. ప్రాచీన హిందూ కుష్ దక్షిణ, పశ్చిమ సరిహద్దున బౌద్ధమతాన్ని బామియను బుద్ధ అని పిలిచేవారు. ఈ పర్వతశ్రేణిలో బామియను బౌద్ధమతానికి చెందిన రాతితో చెక్కిన భారీవిగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలను తాలిబాను ఇస్లాంవాదులు పేల్చివేశారు. సింధులోయ ప్రాంతానికి అనుసంధానమైన హిందూ కుష్ ఆగ్నేయలోయలలో మఠాలు, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన మతగురువులు, వాణిజ్య నెట్వర్కులు ప్రాచీన భారతీయ ఉపఖండంలోని వ్యాపారులకు ఆతిథ్యం ఇచ్చే ప్రధాన కేంద్రంగా ఉంది.

ప్రారంభ బౌద్ధ గురుకులాలలో ఒకటైన మహాసాజిక-లోకోతరవాడ బామియను ప్రాంతంలో ప్రముఖ్యత కలిగి ఉంది. క్రీస్తుశకం 7 వ శతాబ్దంలో చైనా బౌద్ధసన్యాసి జువాన్జాంగు ఆఫ్ఘనిస్తాన్లోని బామియాను వద్ద ఉన్న లోకోతరవాడ ఆశ్రమాన్ని సందర్శించాడు. హిందూ కుష్ గుహలలో మహాయాన సూత్రాలతో సహా ఈ మఠం సేకరణలో బిర్చిబార్కు తాటి ఆకు వ్రాతప్రతులు కనుగొనబడ్డాయి. ఇవి ఇప్పుడు షాయెనుసేకరణలో ఒక భాగంగా ఉన్నాయి. కొన్ని వ్రాతప్రతులు గోంధేరి భాష, ఖరోహు లిపిలో ఉన్నాయి. మరికొన్ని సంస్కృతంలో, గుప్తా లిపి రూపాలలో వ్రాయబడ్డాయి.

ఆల్ఫ్రెడ్ ఫౌచరు అభిప్రాయం ఆధారంగా సా.శ. 1 వ శతాబ్దం నాటికి హిందూ కుషు, సమీప ప్రాంతాలు క్రమంగా బౌద్ధమతంలోకి మారాయి. బౌద్ధమతం ప్రాధాన్యత కలిగిన హిందూ కుష్ను దాటి ఇస్లాం మధ్య ఆసియాలోని ఆక్ససులోయ ప్రాంతం వరకు విస్తరించింది. తరువాత ఈప్రాంతంలో బౌద్ధమతం మాయమై స్థానికులందరూ దాదాపు ముస్లింలు అయ్యారు. హిందూ కుష్కు ఉత్తరాన ఇస్లాం కుర్దిస్తాన్ వరకు వ్యాపించి అబ్బాసిదు కాలం వరకు ఉనికిలో ఉంది. తరువాత ఇది ఒక కొత్త విభాగానికి కేంద్రంగా ఉందని రిచర్డ్ బుల్లిటు ప్రతిపాదించాడు. తరువాత ఈ ప్రాంతం కాబూల్ హిందూషాహి రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. సాబుక్టిగిను ఆధ్వర్యంలో ఇస్లాంసైన్యాలు పెషావరుకు పశ్చిమాన ఉన్న జయపాలను ఓడించాడు.

పురాతన

పర్షియాకు చెందిన మొదటి డారియసు కాలం నుండి ఈ పర్వతశ్రేణి గురించిన ప్రస్తావన వ్రాతపూర్వకంగా నమోదు చేయబడింది. క్రీస్తుపూర్వం 329 వసంత ఋతువులో ఆయన సైన్యం ఆఫ్ఘనులోయలను దాటి వెళ్ళినసమయంలో అలెగ్జాండరు ది గ్రేటు హిందూ కుష్ పర్వతశ్రేణి దాటి భారత ఉపఖండంలోకి ప్రవేశించాడు. తరువాత ఆయన క్రీ.పూ 327 లో భారత ఉపఖండంలోని సింధులోయ నదిప్రాంతం వైపు వెళ్ళాడు. ఆయన సైన్యాలు రెండు సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో అనేక పట్టణాలను నిర్మించాయి.

క్రీస్తుపూర్వం 323 లో అలెగ్జాండరు ది గ్రేటు మరణించిన తరువాత క్రీస్తుపూర్వం 305 లో భారత మౌర్యసామ్రాజ్యంలో భాగమయ్యే ముందు, క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో వ్రాసిన స్ట్రాబో చరిత్ర ఆధారంగా ఈ ప్రాంతం సెలూసిదు సామ్రాజ్యంలో భాగమైంది. కామనుశకం ప్రారంభంలో ఈ ప్రాంతం కుషాను సామ్రాజ్యంలో ఒక భాగంగా మారింది.

మద్య యుగం

సా.శ. 1 వ సహస్రాబ్ది మధ్యలో హెఫ్తాలైటుల ఆధిపత్యంలో హిందూ కుష్కు ఉత్తరాన ఉన్న భూములలో బౌద్ధమతం ప్రధానమతంగా ఉంది. ఈ బౌద్ధులు మతసహనంతో ఉంటూ వారు జొరాస్ట్రియనిజం, మానిచేసిజం, నెస్టోరియను క్రైస్తవ మతం అనుయాయులు ఉన్నారు. 8 వ శతాబ్దం నాటికి హిందూ కుష్ వెంట ఉన్న మధ్య ఆసియాప్రాంతాన్ని పాశ్చాత్య తురుక్కులు, అరబ్బులు స్వాధీనం చేసుకుని అత్యధికంగా ఇరానియన్లతో యుద్ధాలను ఎదుర్కొన్నారు. ఇందుకు మినహాయింపుగా 7 వ శతాబ్దం చివరికాలంలో చైనా నుండి తంగు రాజవంశం ఉత్తరప్రాంత తురుక్కులను ధ్వంసంచేసి పాలనను ఆక్ససునదిని దాటి హిందూ కుష్ ప్రాంతంలోని మద్య ఆసియా సరిహద్దు వరకు విస్తరించింది.

హిందూ కుష్ 
హిందూ కుష్ బాక్టీరియా, బామియను, కాబూల్‌, గాంధార (కుడి దిగువ) కు సంబంధించి

సింధు నదిలోయ దక్షిణ ప్రాంతాలైన సింధు వంటి ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నప్పటికీ, 9 వ శతాబ్దం వరకు హిందూ కుష్ లోయలను ఇస్లామికు సైన్యాలు స్వాధీనం చేసుకోలేదు. 7 వ శతాబ్దంలో అబ్బాసిదు కాలిఫు అల్-మా ' మున్ సైన్యాలు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. 808 లో స్థానిక పాలకుడు ఇస్లాం ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ సామంతుడుగా కాలీఫాకు కప్పంచెల్లించడానికి అంగీకరించాడు. ఆంధ్రేవింకు రాజ్యానికి చెందిన శిలాశాసనాలు హిందూ కుష్ ప్రాంతంలోని కాబూల్ ప్రాంతంలో ఆరంభకాల ఇస్లాం ఉనికికి సాక్ష్యంగా ఉన్నాయి.

తరువాత ఈ పర్వతశ్రేణి కాబూల్ హిందూషాహి రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. కానీ జయపాల ఆధిపత్యాన్ని పెషావరుకు పశ్చిమప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సాబుక్టిగిను స్వాధీనం చేసుకున్నాడు.

సా.శ. 998 లో ఘజ్నీకి చెందిన మహమూదు ఘజ్నా, ఆఫ్ఘనిస్తాన్, కాబూల్‌కు దక్షిణాన ఉన్న హిందూ కుష్ పరిధిలో అధికారంలోకి వచ్చాడు. 997 - 1030 మధ్య ఆయన తన పాలనలో హిందూ కుష్ పర్వతశ్రేణి రెండు వైపులా వేగవంతమైన సైనిక పోరాటాన్ని ప్రారంభించాడు. ఆయన తన ఆఫ్ఘను స్థావరం నుండి సింధు నదికి తూర్పు నుండి యమునా నదికి పశ్చిమాన ఉన్న ఉత్తర భారతదేశంలోని రాజ్యాల మీద 17 మార్లు దాడులు చేసి దోచుకున్నాడు. ఘజ్నీకి చెందిన మహమూదు రాజ్యాల ఖజానా మీద దాడి చేసి నగరాలను కొల్లగొడుతూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. పోరాటాలన్ని వసంతకాలంలో ప్రారంభమం చేయబడ్డాయి. కాని ఉపఖండంలోని వాయవ్య భాగంలో వర్షాకాలం రాకముందే ఆయన సైన్యం ఘజ్నిలోని హిందూ కుష్ స్థావరాలకు తిరిగి వచ్చారు. ఆయన ప్రతిసారీ యుద్ధంనుండి ఉపసంహరించుకుంటూ ఇస్లామికు పాలనను పశ్చిమ పంజాబులోకి మాత్రమే విస్తరించాడు.

1017 లో ఘజ్నీకి చెందిన మహమూదు యుద్ధం తరువాత ఇరాను ఇస్లాం చరిత్రకారుడు అల్-బిరుని వాయవ్య భారత ఉపఖండానికి పంపబడ్డాడు. అల్ బిరుని ఈ ప్రాంతంలో సుమారు 15 సంవత్సరాలు ఉండి సంస్కృతం నేర్చుకుని అనేక భారతీయ గ్రంథాలను అనువదించాడు. అలాగే భారతీయ సమాజం, సంస్కృతి, శాస్త్రాలు, మతం గురించి పర్షియా, అరబికు భాషలలో వ్రాసాడు. ఆయన కొంతకాలం హిందూ కుష్ ప్రాంతంలో, ముఖ్యంగా కాబూల్ సమీపంలో ఉన్నాడు. 1019 లో హిందూ కుష్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆధునికయుగ ఆఫ్ఘనిస్తాన్ లోని లాగ్మాను ప్రావింసులో సూర్యగ్రహణాన్ని నమోదు చేసి వివరించాడు. అల్ బిరుని రావడానికి చాలా కాలం ముందు హిందూ కుష్ ప్రాంతాన్ని పాలించిన కాబూల్ రాజుల ప్రారంభ చరిత్ర గురించి వ్రాసాడు. కాని ఈ చారిత్రకయుగం నుండి లభించే ఇతర రికార్డులకు ఇది విరుద్ధంగా ఉంది. అల్ బిరునికి సుల్తాను మహముదు మద్దతు ఇచ్చాడు. హిందూ కుష్ ప్రాంతంలో స్థానికంగా భారతీయ సాహిత్యాన్ని పొందడం అల్ బిరునికి కష్టమనిపించింది. ఆయన దీనిని వివరిస్తూ ఇలా వ్రాశాడు, "మహమూదు దేశం శ్రేయస్సును పూర్తిగా నాశనం చేసాడు. అద్భుతమైన దోపిడీలు చేశాడు, దీని ద్వారా హిందువులు అన్ని దిశలలో చెల్లాచెదురైన అణువులుగా మారారు. ప్రజల నోటిలో పాత కథ లాగా. (...) హిందూ శాస్త్రాలు మనచేత జయించబడిన దేశంలోని ఆ ప్రాంతాల నుండి చాలా దూరంపయనించి మన చేతితో చేరలేని కాశ్మీరు, బెనారసు వంటి ఇతర ప్రదేశాలకు చేరవేయబడ్డాయి.

12 వ శతాబ్దం చివరలో హిందూ కుష్ ప్రాంతాన్ని శక్తివంతమైన ఘురిడు సామ్రాజ్యం ముయిజ్ అల్-దిన్ నేతృత్వంలో పరిపాలించింది. ఢిల్లీ సుల్తానేటును స్థిరంగా నాటుకోవడంలో ఆయన ప్రభావం చూపాడు. తన సుల్తానేటు స్థావరాన్ని హిందూ కుష్ శ్రేణికి దక్షిణప్రాంతం నుండి ఘజ్ని యమునా నదీతీరంలోని ఢిల్లీ వైపుకు మార్చారు. ఫలితంగా ఆయన ఇస్లాం పాలనను భారత ఉపఖండంలోని ఉత్తర మైదానాలకు తీసుకురావడానికి సహాయం చేశాడు.

మొరాకో యాత్రికుడు ఇబ్ను బటుటా హిందూ కుష్ గుండా ఢిల్లీ సుల్తానేటు చేరుకున్నారు. హిందూ కుష్ శ్రేణి, పర్వత మార్గాలను తైమూరు, ఆయన సైన్యం ఉపయోగించాయి. 1398 లో వారు ఉత్తర భారత ఉపఖండంలో దండయాత్రను ప్రారంభించారు. పాశ్చాత్య పరిశోధకుల రచనలలో తైమూరు, టామెర్లేను అని కూడా పిలువబడే తైమూరు తన సైన్యంతో ఢిల్లీకి వెళుతూ మర్గమంతటా ఎదురైన ప్రజలందరిని దోపిడీ చంపాడు. తరువాత రాజధాని ఢిల్లీకి వచ్చాడు, అక్కడ ఆయన సైన్యం దాని నివాసితులను దోచుకుని చంపింది. తరువాత ఆయన దోచుకున్న సంపదను, స్వాధీనం చేసుకున్న బానిసలను తీసుకుని హిందూ కుష్ మీదుగా తన రాజధానికి తిరిగి వచ్చాడు.

మొఘలు సామ్రాజ్యం స్థాపకుడు బాబరు తండ్రి ద్వారా మధ్య ఆసియాలో ఆధిపత్యం చేసిన తైమూరు వారసుడు. ఆయన ముందుగా హిందూ కుష్ ప్రాంతంలోని కాబూల్‌లో తన సైన్యాన్ని, స్థాపించాడు. 1526 లో ఆయన ఉత్తర భారతదేశంలోకి అడుగుపెట్టి పానిపట్టుయుద్ధంలో విజయం సాధించి చివరి ఢిల్లీ సుల్తానేటు రాజవంశాన్ని ముగింపుకు తీసుకునివచ్చి మొఘలుల శకాన్ని ప్రారంభించాడు.

బానిసత్వం

మధ్య ఆసియా, దక్షిణ ఆసియా చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో బానిసత్వం ఒక భాగంగా ఉంది. హిందూ కుష్ పర్వత మార్గాలు దక్షిణ ఆసియాలో స్వాధీనం చేసుకున్న బానిసలను మధ్య ఆసియాలోని బానిస మార్కెట్లతో అనుసంధానించాయి. క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దం నుండి భారత ఉపఖండంలో బానిసలను స్వాధీనం చేసుకోవడం, రవాణా చేయడం తీవ్రమైంది, ఇస్లాంపాలన యుగంలో వివిధ కాలాలలో నిర్వహించిన బానిసరవాణాలో భారతదేశానికి చెందిన "లక్షలాది" బానిసలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. జాన్ కోట్స్వర్తు, ఇతర చరిత్ర అధ్యయనకారుల అభిప్రాయం ఆధారంగా మొఘలు చక్రవర్తి అక్బరు, ఢిల్లీ సుల్తానేటు యుగంలో "గుర్రాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు బదులుగా చెల్లించడానికి బానిసలను అందించారని ఈ బానిసవాణిజ్యంలో భాగంగా ప్రతి సంవత్సరం వేలాది మంది హిందువులు ఉత్తర, మధ్య ఆసియాకు పంపించబడ్డారు. ఏది ఏమయినప్పటికీ హిందూ కుష్ప్రాంతం మధ్య ఆసియా, దక్షిణ ఆసియా మధ్య పరస్పర విక్రయం బానిసత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇందులో ఆహారం, వస్తువులు, గుర్రాలు, ఆయుధాల వ్యాపారం కూడా ఉంది.

19 వ శతాబ్దం వరకు హిందూ కుష్ కేంద్రంగా బానిస వ్యాపారం కోసం తెగల మీద దాడి చేయడం, వేటాడటం, ప్రజలను కిడ్నాపు చేయడం విస్తృతమైన స్థాయిలో కొనసాగింది. 1874 నాటి బ్రిటిషు యాంటీ-స్లేవరీ సొసైటీ నివేదిక ఆధారంగా ఫైజాబాదు గవర్నరు మీర్ గులాం బే 8,000 గుర్రాలు, అశ్వికదళ సైనికదళాలను ముస్లిమేతరులు (కాఫీర్), షియా ముస్లింలను బానిసలుగా పట్టుకున్నారు. బానిస వ్యాపారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులు అమీర్ షీర్ అలీ వంటి జమీందారులు ఉన్నారు. హిందూ కుష్లోని ఏకాంత సమాజాలు ఈ బానిస వేట యాత్రల లక్ష్యాలలో ఒకటిగా ఉన్నాయి.

ఆధునిక యుగం

హిందూ కుష్ 
Landscape of Afghanistan with a T-62 in the foreground.

19 వ శతాబ్దం ప్రారంభంలో వాయువ్యంలో రంజితు సింగు ఆధ్వర్యంలో సిక్కు సామ్రాజ్యం హిందూ కుష్ శ్రేణి వరకు విస్తరించింది. 1896 వరకు చివరి బహుదేవతారాధకుల కోట "కాఫిరిస్తాన్ " అని పిలువబడింది. అమీరు అబ్దురు రెహ్మాను ఖాను ఆధ్వర్యంలో ఆఫ్ఘన్ల దండయాత్ర జరిగే వరకు ఇక్కడి ప్రజలు హిందూ మతాన్ని అభ్యసించారు.

హిందూ కుష్ పర్వప్రాంతం బ్రిటీషు సామ్రాజ్యానికి భౌగోళిక అవరోధంగా పనిచేసింది. బ్రిటుషు అధికారులలు సమాచారలభ్యత కొరత కారణంగా మధ్య ఆసియా ప్రజల మధ్య పరస్పర సంబంధాలు అధికరించాయి. సమాచారం కోసం బ్రిటిషు వారు గిరిజన అధిపతులు, సడోజాయి, బరాక్జాయి కులీనుల మీద ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. వారు సాధారణంగా భౌగోళిక-రాజకీయ వ్యూహాత్మక ప్రయోజనాలు ఆశిస్తూ ఈ ప్రాంతంలో నిర్వహించబడుతున్న బానిసత్వం వంటి హింసాత్మకత కార్యక్రమాలను తగ్గించి బ్రిటిషు అధికారులకు నివేదించారు.

వలసరాజ్యాల యుగంలో హిందూ కుష్ అనధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా, బ్రిటిషు ప్రాంతాల మధ్య విభజన రేఖగా పరిగణించబడింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో హిందూ కుష్ పర్వతశ్రేణి ఒక వ్యూహాత్మక రంగస్థలంగా మారింది. ముఖ్యంగా 1980 లలో సోవియటు దళాలు వారి ఆఫ్ఘనిస్తాన్ మిత్రదేశాలతో కలిసి ముజాహిదీనులతో పోరాడినసమయంలో సంయుక్తరాష్ట్రాల మద్దతుతో పోరాడిన సైన్యం పాకిస్తాన్ మీదుగా పయనించాయి. సోవియటు ఉపసంహరణ, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత చాలా మంది ముజాహిదీన్లు తాలిబాను, అల్ ఖైదా దళాలు కఠినమైన ఇస్లాం చట్టం (షరియా) విధించాయి. అల్ ఖైదా ఆధ్వర్యంలో కాబూల్ ఈ పర్వతాలు, ఆఫ్ఘనిస్తాన్ ఇతర ప్రాంతాలు షరియాచట్టానికి స్థావరంగా ఉన్నాయి. ఇతర ముజాహిదీన్లు తాలిబాన్ పాలనను వ్యతిరేకించడానికి ఉత్తర కూటమిలో చేరారు.

2001 సెప్టెంబరు 11 న న్యూయార్కు నగరం, వాషింగ్టను డి.సి.లలో జరిగిన ఉగ్రవాద దాడుల తరువాత, అల్ ఖైదా, వారి తాలిబాన్ మిత్రదేశాలకు వ్యతిరేకంగా అమెరికా, ఐ.ఎస్.ఎ.ఎఫ్. పోరాటం హిందూ కుష్ను మరోసారి సైనికీకరించిన సంఘర్షణ ప్రాంతంగా మార్చింది.

మూలాలు

Tags:

హిందూ కుష్ భౌగోళికంహిందూ కుష్ పేరువెనుక చరిత్రహిందూ కుష్ పర్వతప్రాంతంహిందూ కుష్ చరిత్రహిందూ కుష్ మూలాలుహిందూ కుష్

🔥 Trending searches on Wiki తెలుగు:

అమెరికా సంయుక్త రాష్ట్రాలురైతువిచిత్ర దాంపత్యంనిర్వహణగర్భాశయముహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితారుక్మిణీ కళ్యాణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరాయలసీమనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంసంక్రాంతిచిరంజీవిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థవినాయకుడుతెలుగు పదాలువై.ఎస్.వివేకానందరెడ్డినందమూరి తారక రామారావుప్రకాష్ రాజ్మరణానంతర కర్మలుతాన్యా రవిచంద్రన్మెరుపుతూర్పు చాళుక్యులుఇజ్రాయిల్దేవులపల్లి కృష్ణశాస్త్రిసంఖ్యమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంరాశి (నటి)తెలుగు సినిమాలు 2024క్రికెట్భారత జాతీయ కాంగ్రెస్చతుర్వేదాలుసత్య సాయి బాబాభారతదేశంయవలురామరాజభూషణుడుప్రేమలుమామిడిభారతీయ స్టేట్ బ్యాంకుపక్షవాతంజాషువావిజయవాడకోడూరు శాసనసభ నియోజకవర్గంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితారమ్య పసుపులేటిసప్త చిరంజీవులుఐడెన్ మార్క్‌రమ్భారత జాతీయ చిహ్నంరేవతి నక్షత్రంఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్సాయిపల్లవినారా బ్రహ్మణిమియా ఖలీఫాయానిమల్ (2023 సినిమా)కడియం కావ్యనువ్వు నాకు నచ్చావ్ఆర్టికల్ 370 రద్దుభద్రాచలంతెలుగు సాహిత్యంశ్రేయా ధన్వంతరి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతోట త్రిమూర్తులునవధాన్యాలుభారతీయ రిజర్వ్ బ్యాంక్రామప్ప దేవాలయంబోడె రామచంద్ర యాదవ్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాదక్షిణామూర్తికింజరాపు అచ్చెన్నాయుడుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకె. అన్నామలైఅనుష్క శెట్టివిటమిన్ బీ12మలబద్దకంమృగశిర నక్షత్రమునెమలి🡆 More