సైరస్ ది గ్రేట్

సైరస్ ది గ్రేట్ (ఆంగ్లం : Cyrus the Great) (ప్రాచీన పర్షియన్: 𐎤𐎢𐎽𐎢𐏁, (ఉచ్ఛారణ : kʰuːrʰuʃ : ఖురుస్ ) పర్షియన్: کوروش بزرگ (ఖురోష్ బుజర్గ్) Kūrošé Bozorg), (క్రీ.పూ.

600 లేదా 576 - ఆగస్టు 530 లేదా 529 ), ఇంకనూ "సైరస్ II ఆఫ్ పర్షియా, సైరస్ ది ఎల్డర్ అని ప్రసిద్ధి.

సైరస్ II ద గ్రేట్
పర్షియా, అన్‌షాన్, మిడియా, బాబిలోన్ రాజ్యాలకు రాజు.
సైరస్ ది గ్రేట్
పరిపాలనక్రీ.పూ. 559 - 529
పట్టాభిషేకముఅన్‌షాన్, పెర్సిస్
జననంక్రీ.పూ. 600 లేదా 576
జన్మస్థలంఅన్‌షాన్, పెర్సిస్
మరణంక్రీ.పూ. ఆగస్టు ?, 530 లేదా 529
మరణస్థలంసిర్ దర్యా
సమాధిపసర్గడే
ఇంతకు ముందున్నవారుకేంబెసెస్ I
తరువాతి వారుకేంబిసెస్ II
Consortకస్సడానె of పర్షియా
సంతానముకేంబిసెస్ II
స్మెర్డిస్
ఆర్టిస్టోన్
అటోస్సా
తెలియదు
రాజకుటుంబముఅకేమినిడ్
తండ్రికేంబిసెస్ I (పర్షియా)
తల్లిమండానే (మిడియా)?
Religious beliefsజొరాస్ట్రియన్ మతము?

ఇతను ఒక పర్షియన్ షాహన్‌షాహ్ (షాహ్=రాజు, షాహన్‌షాహ్=రాజులకు రాజు, "చక్రవర్తి"), అకేమెనిడ్ వంశపు పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు.

ఇతని పరిపాలనా కాలంలో ఇతని సామ్రాజ్య విస్తరణ దాదాపు నౌఋతి ఆసియా, మిక్కిలి మధ్య ఆసియా భాగాలు, ఈజిప్టు నుండి పశ్చిమాన హెల్లెన్స్‌పాంట్ వరకూ, తూర్పున సింధు నది వరకు, విశాలంగా వ్యాపించియుండేది. ప్రపంచంలో ఇంత పెద్ద విస్తీర్ణం గల రాజ్యము చరిత్రలో గాని నేటికినీ లేదు.

ఇతని 29-30 సంవత్సరాల రాజ్యకాలంలో, ఎన్నో యుద్ధాలు చేసి సమకాలీన రాజ్యాలను జయించాడు, అలాంటి వాటిలో మిడియన్ సామ్రాజ్యం, లిడియన్ సామ్రాజ్యం, నియో బాబిలోనియన్ సామ్రాజ్యం మొదలైనవి. ఇవే కాకుండా మధ్యాసియా లోని అనేక దేశాలు ఇతని ఆధీనంలోకొచ్చాయి. సైరస్ ప్రాచీన ఈజిప్టు వైపు వెళ్ళలేదు, ఇతడు సిథియన్లతో సిర్ దర్యా వెంట పోరాడుతూ క్రీ.పూ. 530 లేదా 529 లో, యుద్ధమైదానంలోనే మరణించాడు. ఇతడి తరువాత ఇతని కుమారుడు కాంబిసెస్ II రాజయ్యాడు, కొద్దిపాటి రాజ్యకాలంలోనే, ఈజిప్టును జయించాడు. తన దేశంలోనే కాక యూద మతము లోనూ, మానవహక్కుల విషయాలలో, రాజకీయాలలో, మిలిటరీ విధానలలో, ఇటు తూర్పు దేశాలలోనూ అటు పాశ్చాత్య దేశాలలోనూ గుర్తింపబడినాడు.

నియో-బాబిలోనియన్ సామ్రాజ్యం

క్రీ.పూ. 539 లో, సైరస్ ఇలం (సుసియానా), రాజధాని సుసా[ఆధారం చూపాలి]ను ఆక్రమించాడు. బాబిలోనియన్ సైన్యాలను టైగ్రిస్ నది వద్ద ఓడించి ఒపిస్ లను జయించాడు.

సమాధి

సైరస్ ది గ్రేట్ 
పసర్‌గడే ఇరాన్, లోని సైరస్ సమాధి. ప్రస్తుతం యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశం (2006).

సైరస్ సమాధి ఇరాన్ లోని పసర్‌గడే ప్రాంతంలో వున్నది (అని భావింపబడుచున్నది). స్ట్రాబో, అర్రియన్ లు, అరిస్టోబులస్ (కసాండ్రియా) రిపోర్టుల ఆధారంగా, ఇది సైరస్ సమాధేనని ధ్రువీకరిస్తున్నారు. అలెగ్జాండర్ ఈ సమాధ్ ప్రదేశాన్ని రెండుసార్లు సందర్శించాడని ఉవాచ.

లెగసీ

సైరస్ ది గ్రేట్ 
సైరస్ ది గ్రేట్, హిబ్ర్యూ ప్రజలకు బాబిలోనియన్ ఆక్రమణల నుండి సహాయపడి జెరూసలెంలో ఆవాసం కల్పించుటలో సహాయపడ్డాడు. యూదమతంలో గొప్ప గౌరవం పొందాడు.

సైరస్ ఉదారవాదిగా తన జీవితాన్ని గడిపాడు, ప్రజలను సుఖశాంతులతో జీవించేందుకు తోడ్పడ్డాడు. సమానత్వం, సమైక్యత, సామాజిక న్యాయం, పరమత సహనం ఇతని ప్రధాన సూత్రాలుగా వుండేవి. ఇరానీయులు ఇతడిని తమ "పిత"గా భావిస్తారు. యూదులు దైవప్రసాదంగా భావిస్తారు.

ఇతడి "శంఖులిపీ శాసనం" (సైరస్ సిలిండర్) నేటికినీ అంతర్జాతీయంగా కొనియాడబడింది. మానవహక్కుల సూత్రాలను తయారుచేయు సమయంలో ఐక్యరాజ్యసమితిచే ప్రముఖంగా ప్రస్తావింపబడిన సూత్రాలు, సైరస్ "సిలిండర్"లో ప్రకటించినవే.

మతము

సైరస్ యొక్క మతపరమైన విధానాలు చాలా సరళంగానూ, సహనము, ఉదారత కలిగివుండేవి. ఈ విషయం ఇతని "సిలిండర్ శాసనం" ద్వారా తెలుస్తున్నది. దుల్‌కర్నైన్ అనే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిగురించే ఖురాన్ లో పొగడబడింది. ఖురాన్ లో వర్ణింపబడిన దుల్‌కర్నైన్, ఈ సైరస్ ఒకరేనని, వర్ణణల ఆధారంగా కొందరు భావిస్తున్నారు. ఇతడి మంచి తత్వాన్ని యూదులు కూడా పొగుడుతూవుంటారు. నెబూచద్‌నెజ్జార్-2 అనే రాజు జెరూసలేంను ధ్వంసంచేసి, యూదులకు వారి దేశం నుండి తరిమివేసి వారి ఆలయాన్నీ ధ్వంసం చేసినపుడు, సైరస్ యూదుల ప్రాంతాన్ని తిరిగీ వారికప్పగించి, వారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాడు, ఈ విషయం యూదుల బైబిల్ కెటువీం లోని రెండవ క్రానికల్ లో ప్రస్తావింపబడింది. ఈ విషయము ఎజ్రా గ్రంథం లోనూ లిఖించబడింది.

సైరస్ సిలిండర్

సైరస్ కాలంనాటి వనరు, అదియూ శంఖాకారపు పత్రము (డాక్యుమెంట్) సైరస్ గురించి తెలియజెప్పే ఓ అరుదైన వనరు. ఇందుపై బాబిలోనియన్ భాషలో లిఖింపబడింది.

పాదపీఠికలు

మూలాలు

కి సంబంధించిన మీడియా ఉంది.

Iran Chamber Society

Other

This article uses material from the Wikipedia తెలుగు article సైరస్ ది గ్రేట్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

సైరస్ ది గ్రేట్ నియో-బాబిలోనియన్ సామ్రాజ్యంసైరస్ ది గ్రేట్ సమాధిసైరస్ ది గ్రేట్ లెగసీసైరస్ ది గ్రేట్ పాదపీఠికలుసైరస్ ది గ్రేట్ మూలాలుసైరస్ ది గ్రేట్ బయటి లింకులుసైరస్ ది గ్రేట్en:Old Persian languageen:Romanization of Persianఆంగ్లంపర్షియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భగవద్గీతపేర్ని వెంకటరామయ్యధనూరాశిరుతురాజ్ గైక్వాడ్విజయనగర సామ్రాజ్యంఅష్టదిగ్గజములుప్రకృతి - వికృతిసామెతలుభారత ఎన్నికల కమిషనుసౌందర్యనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిభారతదేశంలో బ్రిటిషు పాలననన్నయ్యతీన్మార్ మల్లన్నసంధిపెరిక క్షత్రియులుఉలవలుగోల్కొండసమాసంమొలలువేమన శతకముత్రిష కృష్ణన్వరంగల్వల్లభనేని బాలశౌరిమండల ప్రజాపరిషత్హార్దిక్ పాండ్యామధుమేహందగ్గుబాటి వెంకటేష్సెక్యులరిజంమంజుమ్మెల్ బాయ్స్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంచరాస్తిఘట్టమనేని మహేశ్ ‌బాబుశామ్ పిట్రోడాదివ్యభారతితమిళ అక్షరమాలప్రజా రాజ్యం పార్టీఉత్పలమాలప్రేమమ్వంగా గీతసాహిత్యంబ్రహ్మంగారి కాలజ్ఞానంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామొదటి ప్రపంచ యుద్ధంనితిన్ గడ్కరిపార్వతిభారతీయ తపాలా వ్యవస్థబతుకమ్మఎఱ్రాప్రగడకరోనా వైరస్ 2019సూర్యుడుపొంగూరు నారాయణపూర్వాషాఢ నక్షత్రమురైతుహనుమంతుడుయూట్యూబ్చే గువేరాపిఠాపురం శాసనసభ నియోజకవర్గంద్వంద్వ సమాసముయువరాజ్ సింగ్వినోద్ కాంబ్లీరష్మి గౌతమ్శుక్రుడుమాగుంట శ్రీనివాసులురెడ్డిలావు శ్రీకృష్ణ దేవరాయలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.యస్.అవినాష్‌రెడ్డిరేవతి నక్షత్రంక్రికెట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంబోగీబీల్ వంతెనకేరళసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుఅశోకుడువేయి స్తంభాల గుడిపరశురాముడుజ్యోతిషంకేతువు జ్యోతిషం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు🡆 More