వికీపీడియాలో వ్యాసాలలో చేరుస్తున్న వివరాలకు మూలాలు (రిఫరెన్సులు) ఎలా చేర్చాలో ఈ పేజీ వివరిస్తుంది.
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
గమనిక: సాధ్యమయినంత వరకు వికీపీడియాలో ఉన్న ఇతర వ్యాసములను మూలాలలో చేర్చవద్దు. అలాంటి వాటిని "ఇవికూడా చూడండి" జాబితాలో ఉంచండి.
మీరు ఏదయినా కొత్త సమాచారాన్ని సేకరించి, దానిని ఇక్కడ ఉన్న వ్యాసాలలో చేర్చాలనుకున్నప్పుడు, మొదట ఆ సమాచారం యొక్క మూలాన్ని తెలుపండి. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక వెబ్సైటులోని పేజీ లాంటివి ఏదయినా కవచ్చు, కాకపోతే మీరు పొందుపరచిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా చదివేవారెవరయినా నిర్ధారించగలిగేటట్లు ఉండాలి. ఒక వేళ మీరు రాసే సమాచారం గురించి మీకు ముందే తెలిసినట్లయితే మీరు ఎటువంటి మూలాలను చూడాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ అలాంటి సమయాలలో ఇతరులకు మీరు రాసిన దానిపై సందేహాలుంటే వాటిని తీర్చటానికి కావలిసిన మూలాలను చేర్చండి, అప్పుడు ప్రతీ ఒక్కరి సందేహాలను తీర్చాల్సిన అవసరం ఉండదు.
మూలాల యొక్క అసలు అవసరం, ఏదయినా విషయంపై అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు ఉంటుంది. అలా అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు, దానిని ధృవపరచటానికి సరయిన మూలం చూపించారంటే, ఇంక అందరూ మీ వాదననే ఒప్పుకుంటారు (దానికి వ్యతిరేకంగా ఇంకో మంచి మూలం చూపించే దాకా). "కొంతమంది ఇలా భావిస్తారు", "కొంతమంది అలా భావిస్తారు", లాంటి వాక్య నిర్మాణాలను సాధ్యమయినంతవరకు తగ్గించండి. సాధారణంగా అలాంటి వాక్యాలు, చదివేవారి మదిలో వ్యతిరేక ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా "వీరందరూ ఇలా అన్నారు", "వారు అలా అన్నారు", అని రాసి ఆ వారు లేదా వీరందరూ ఎవరో తెలిపి, ఎప్పుడు, ఎక్కడ అన్నారో కూడా తెలిపారంటే ఆ రచన యొక్క ప్రామాణికత ఎన్నోరెట్లు మెరుగుపడుతుంది. మరొకసారి గుర్తుంచుకోండి, వికీపీడియా మీ అభిప్రాయాలను తెలుపటానికి ఒక వేదిక కాదు.
ఇది తెలుగు భాషలో ఉన్న వికీపీడియా కాబట్టి మీ మూలాలను సాధ్యమయినంత వరకూ తెలుగులో ఉండేటట్లు చూడండి. ఒక వేళ తెలుగులో సరయిన మూలాలు దొరకకపోతే, అప్పుడు ఆంగ్లంలో ఉండే మూలాలను సూచించండి.
మీరు చేర్చని విషయాలకు కూడా మీకు తెలిసిన మూలాలు ఏమయినా ఉంటే వాటిని కూడా చేర్చవచ్చు. చేర్చేముందు ఒక సారి పరిశీలించి చేర్చండి. అంతే కాదు వ్యాసానికి మూలాలను చేర్చడం వికీపీడియాలో చాలా గొప్ప కృషిగా భావిస్తారు. వాక్యాలకు పక్కనే మూలాలకు సంబందించిన లింకులు గానీ సమాచారం కానీ ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే, వాటిని మీరు రాస్తున్న వాక్యాల పక్కనే ఉంచటం మంచిది.
గొడవకు కారణమయిన వ్యాస భాగాన్ని వెంటనే చర్చా పేజీకి తరలించండి. ఒకవేళ ఆ వ్యాస భాగం అంత కీడు తలపెట్టేది కాదు అని అనుకున్నప్పుడు, లేదా దానికి సంబంధించిన మూలాన్ని చేరిస్తే సరిపోతుంది అని భావించినప్పుడు {{మూలాలు అవసరం}} అనే మూసను ఆ వ్యాస భాగం తరువాత ఉంచండి. {{ మూలాలు సమీక్షించండి}} అనే మూస కొన్ని సందర్భాలలో మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
ముందుగానే ఊహించండి: మీరు చేర్చిన విషయం మీద ఎవరికయినా సందేహం కలుగవచ్చేమో అనే విషయాన్ని ఆలోచించండి. వికీపిడియాలో మీరు చేర్చిన సమాచారానికి ఊతంగా ఏదయినా మంచి మూలాన్ని చేర్చినట్లయితే అప్పుడు ఇతర సభ్యులు ఆ సమాచారాన్ని తొలగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మూలాలను తెలిపేటప్పుడు సాదారణంగా జరిగే తప్పు.., అసలు సమాచారం ఇంకోదగ్గర ఉంది అని తెలిపిన మధ్యవర్తి గురించి తెలుపకపోవటం. ఉదాహరణకు మీరు ఒక వెబ్ సైటులో ఒక విషయాన్ని గురించి చదివారు, అదే వెబ్సైటులో ఆ సమాచారాన్ని ఫలానా పుస్తకం నుండి సేకరించబడినదని తెలుపుతారు, అలాంటప్పుడు మీరు స్వయానా ఆ పుస్తకాన్ని చదవందే, దానిని వికీపిడియా మూలాలలో చేర్చకూడదు, ఆ మధ్యవర్తి అయిన వెబ్సైటు యొక్క చిరునామాని మాత్రమే మూలాలలో చేర్చాలి. అలాంటి వాటిని మూలాలలో ఇలా చేర్చాలి:
మీరు ఆ పుస్తకాన్ని చదవనంత వరకూ దానినొక్క దానినే మూలాలలో ఉంచకూడదు. ఒక సారి మీరు ఆ పుస్తకాన్ని చదివేసిన తరువాత మాత్రం దానినొక్క దానినే మూలలలో ఉంచవచ్చు. కానీ వెబ్పేజీలో కూడా ఇంకొంచెం మంచి సమాచారం దొరుకుతుందని అనుకున్నప్పుడు పాఠకులకు దాని గురించి కూడా తెలుపవచ్చు. ఇలా:
దీని వెనుక ప్రధాన ఉద్దేశం మీరు సేకరించిన సమాచారం మొత్తం, మీ పాఠకులు ఎటువంటి సందేహాలు లేకుండా జీర్ణించేసుకోవడానికి.
వికీపీడియాలో మూలాలను రెండు రకాలుగా చేర్చవచ్చు. మొదటిరకంలో మీరు రాస్తున్న వ్యాస భాగంలో సమాచారం చేర్చిన దగ్గరే మూలాన్ని కూడా ప్రస్తావించవచ్చు. లేదా వాటన్నిటినీ వేరుగా మూలాలు అనే విభాగంలో చేర్చవచ్చు. మూలాలను ఏరకంగా చేర్చినా కూడా వాసాన్ని చదివేవారికి ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే వ్యాసంలో మార్పులు చేసేవారికి ఏదో ఒక రకమయిన విధానమే నచ్చవచ్చు. అప్పుడు వారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.
ఈ విధానంలో మీరు ఎటువంటి మూసలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ పద్దతిలో మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ క్రింది విధముగా చేర్చాలి.
ఒకటో రచయిత, రెండో రచయిత, (2001)లో రాసిన ఫలానా పుస్తకంలోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: అఆఇఈ ప్రచురణలు
ఇలా మీరు చేరుస్తున్న సమాచారానికి రుజువులుగా, సమాచారంతోనే చేర్చేయండి. ఆ తరువాత మూలాలు లేదా రిఫరెంసులు విభాగంలో
అనే దానిని తగిలిస్తే సరిపోతుంది.
ఉదాహరణ
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [[:en:Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference|వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?]] [[:en:Wikipedia:Why_Wikipedia_is_not_so_great|వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]] .
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు .
పై పద్ధతిలో కాకుండా, ఈ క్రింది మూసలను కూడా వాడవచ్చు. ఈ మూసలను మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి.
{{చూడు|పేరు}} - ఈ మూసను వ్యాసము మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుండి. మీరు చేర్చబోయే ఏదయినా అంశమునకు ఆధారాలు, రుజువులు చూపించదలచిన చోట్ల ఈ మూసను తగిలించండి. పేరు అనేది మీరు ఇచ్చే ఆధారాలకు లేదా మూలాలకు గుర్తుగా, వ్యాసములో ఉన్న మరే ఇతర పేర్లతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇవ్వవలిసిన నామము. దీంతో మీరు చేర్చిన విషయం నుండి మూలాన్ని చేరుకోవడానికి ఒక లింకు ఏర్పడుతుంది.
{{మూలం|పేరు}} - ఈ మూసను మూలాలు లేదా రిఫరెన్సులు విభాగాలలో, మూలాల చిరునామాకు ముందు తగిలించవలసి ఉంటుంది. దానివలన ఒక ఈ మూలము నుండి ఏ విషయానయితే సేకరించారో ఆ వివరణకు ఒక లింకు ఏర్పడుతుంది.
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికపీిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు {{చూడు|en3}} {{చూడు|en4}}.
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [1] [2].
# {{మూలం|en3}} [[:en:Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference|వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?]] # {{మూలం|en4}} [[:en:Wikipedia:Why_Wikipedia_is_not_so_great|వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]]
జాల మూలాల కు వాడవలసిన మూస ఉదాహరణ: {{Cite web|title=కోట్ల రూపాయల కోడి పందేలు|last1=కె|first1=శ్రీనివాస్ |url=http://www.suryaa.com/features/article-1-12718 |publisher=సూర్య|date= 2011-01-12|accessdate=2014-01-13}}
పుస్తక మూలాలకు వాడవలసిన మూస ఉదాహరణ:{{cite book |last= Cordell |first= Bruce R. |coauthors= Jeff Grubb, David Yu |title= [[Manual of the Planes]] |publisher= [[Wizards of the Coast]] |year= 2001 |month= September |isbn= 0-7869-1850-8 }}
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
To help prevent dead links, persistent identifiers are available for some sources. Some journal articles have a digital object identifier (DOI); some online newspapers and blogs, and also Wikipedia, have permalinks that are stable. When permanent links aren't available, consider archiving the referenced document when writing the article; on-demand web archiving services such as WebCite (http://www.webcitation.org) are fairly easy to use (see pre-emptive archiving).
Dead links should be repaired or replaced if possible. Do not delete a citation merely because the URL is not working today. Follow these steps when you encounter a dead URL being used as a reliable source to support article content:
{{dead link|date=ఏప్రిల్ 2024}}
, so that you can estimate how long the link has been dead.{{citation needed}}
. It may be appropriate for you to move the citation to the talk page with an explanation, and notify the editor that added the now-dead link.వికీపీడియాలో మూలాల విశ్లేషణ అధారంగా వాడిన మూలాల తరచుదనాన్ని బట్టి (F-model) జూన్ 2020 లో ఈ క్రింది విధంగా వున్నాయి. వీక్షణలతో పాటు, లేక వ్యాస రచయితలతోపాటు కూడా ఇతర గణాంకాలు వున్నాయి.
# | Website | Score in June 2020 | 1m changes | వెబ్సైటు భాష |
---|---|---|---|---|
1 | censusindia.gov.in | 42,943 | +57 | |
2 | books.google.com | 7,346 | +115 | |
3 | archive.org | 4,333 | +108 | |
4 | census2011.co.in | 3,381 | +65 | |
5 | indiatimes.com | 3,380 | +155 | |
6 | thehindu.com | 2,839 | +72 | |
7 | indiarailinfo.com | 2,222 | 0 | |
8 | ourtelugunadu.com | 1,877 | -2 | తెలుగు |
9 | cia.gov | 1,591 | +7 | |
10 | onefivenine.com | 1,576 | -2 | |
11 | hindu.com | 1,396 | +51 | |
12 | bbc.co.uk | 1,368 | +19 | |
13 | sakshi.com | 1,295 | +31 | తెలుగు |
14 | andhrajyothy.com | 1,281 | +50 | తెలుగు |
15 | eenadu.net | 991 | +6 | తెలుగు |
16 | ap.gov.in | 985 | +14 | |
17 | telangana.gov.in | 876 | +40 | |
18 | nytimes.com | 841 | +24 | |
19 | ntnews.com | 797 | +6 | |
20 | indianexpress.com | 719 | +36 | |
21 | britannica.com | 711 | +16 | |
22 | google.co.in | 698 | +44 | |
23 | idlebrain.com | 647 | +20 | |
24 | youtube.com | 632 | +28 | |
25 | imf.org | 618 | +4 |
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:మూలాలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.