విలియం షేక్‌స్పియర్

విలియం షేక్‌స్పియర్ (ఆంగ్లము : William Shakespeare) ( 1564 ఏప్రిల్ 26 న బాప్తిస్మం పొందినాడు - 23 ఏప్రిల్ 1616న మరణించాడు), ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు.

ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు. ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ (కవీశ్వరుడు) గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 37 నాటకాలు, 154 చతుర్పాద కవితలు (సొన్నెట్ - పద్యాలు), రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు (narrative poems), ఇంకా చాలా ఇతర కవితలు లభిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ తర్జుమా చెయ్యబడినాయి, అంతే కాకుండా ఏ ఇతర నాటకాలూ ప్రదర్శించనన్నిసార్లు ప్రదర్శించబడినాయి.

విలియం షేక్‌స్పియర్
విలియం షేక్‌స్పియర్
జననం: ఏప్రియల్ 1564 (ఖచ్చితమైన తారీఖు తెలీదు )
స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్, వార్విక్‌షైర్, ఇంగ్లాండు
మరణం:1616 ఏప్రిల్ 23
స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్, వార్విక్‌షైర్, ఇంగ్లాండు
వృత్తి: నాటక రచయిత, కవి, నటుడు
సంతకం:విలియం షేక్‌స్పియర్

షేక్‌స్పియర్ స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ లో జన్మించాడు. ఇక్కడనే పెరిగి పెద్దవాడయినాడు. పద్దెనిమిది సంవత్సరాల వయసులో అన్నే హాథవేను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం, మొదటి కానుపులో సుసాన్నా హాల్ అనే అమ్మాయి, తరువాత కానుపులో హామ్నెట్, జూడిత్ క్వినే అను కవలలు జన్మించారు. రమారమి 1585 - 1592 ల మధ్య కాలంలో స్వంత ఊరినుండి లండన్ వెళ్ళి నటుడు, రచయిత,, చాంబర్లేన్ ప్రభువు మనుషులు) (తరువాతి కాలంలో ఇదే కంపెనీ రాజు గారి మనుషులు కింగ్స్ మెన్ అను నాటకాల కంపెనీలో భాగస్వామిగా విజయవంతమైన జీవితం కొనసాగించాడు. 1613లో తిరిగి స్వంత ఊరికి విశ్రాంత జీవితానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ తరువాత మూడు సంవత్సరాలకు అక్కడే మరణించాడు. షేక్‌స్పియర్ వ్యక్తిగత జీవితం గురించిన ఆధారాలు కేవలం కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. మిగిలిన శూన్యాన్ని భర్తీ చెయ్యడానికి ఎన్నో కల్పనలు కల్పించబడినాయి. ఈ కల్పనల్లో అతని శృంగార జీవితం, ధార్మిక జీవితం, అతని రచనలు నిజంగా అతనే వ్రాశాడా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి.

ప్రస్తుతం లభిస్తున్న రచనల్లో చాలావరకూ 1590, 1613ల మధ్య వ్రాసినవి. తొలినాళ్ళలోని షేక్‌స్పియర్ నాటకాలు, హాస్యరస ప్రధానమైనవీ, చారిత్రక నేపథ్యం కలవి ఉన్నాయి. పదహారవ శతాబ్దంలోనికి ఇతని రచనల్లోని కళాత్మకత, నాణ్యత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత ఇతను 1608 వరకు ఎక్కువగా హామ్లెట్, లియర్ రాజు, మాక్ బెత్ వంటి విషాద నాటకాలు వ్రాసినాడు. ఈ నాటకాలు ఆంగ్ల భాషలోనే గొప్పవిగా కొనియాడబడుతున్నాయి. జీవితపు చివరి అంకంలో ఇతను షేక్‌స్పియర్ విషాదాస్య నాటకాలు రస ప్రధాన (tragicomedies) నాటకాలు వ్రాసినాడు. ఇంకా ఇతర నాటక రచయితలతో కలిసి కొన్ని రచనలు చేసాడు. ఇతని నాటకాలలో చాలావరకూ తన జీవిత కాలంలోనే ప్రచరించబడినాయి, కాకపోతే ఒక ముద్రణ నుండి మరొక ముద్రణకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. 1623 వ సంవత్సరంలో ఇతని నాటక కంపెనీలో సహచరులు ఇతని మొదటి పూర్ణ రచనా సంపుటిని ప్రచురించారు. ప్రస్తుతం షేక్స్‌పియర్‌విగా గుర్తించబడిన నాటకాల్లో రెండు తప్ప అన్నీ ఇందులో ఉన్నాయి.

విలియం షేక్‌స్పియర్
కోట్ ఆఫ్ ఆర్మ్‌స్ 1596 లో ప్రదానం చేయబడింది.
(మాడర్న్ రిక్రియేషన్)

షేక్‌స్పియర్ తన జీవిత కాలంలోనే మంచి కవిగా, నాటక రచయితగా పేరుపొందినాడు. కానీ అతని కీర్తి ప్రస్తుతము ఉన్న స్థితికి మాత్రం 19వశతాబ్దం నాటికి చేరుకున్నది. రొమాంటిక్ కవులు (Romantics), ప్రధానంగా షేక్స్పియర్లోని మేధాతత్వాన్ని గుర్తించి గౌరవించారు. ఆ తరువాత విక్టోరియన్ కాలంలోని కవులు షేక్స్పియర్ని మరింత ఎక్కువగా గౌరవించి పూజించారు. (జార్జ్ బెర్నార్డ్ షా) ఈ వ్యక్తి పూజను బార్డోలాట్రీ ("bardolatry"). అని పిల్చాడు. ఇహ 20వ శతాబ్దంలో ఇతని రచనలు విద్వత్తులోనూ, అభినయనంలోనూ వచ్చిన కొత్త విప్లవాలు దత్తతు తీసుకున్నాయి. ఇతని నాటకాలు 20వ శతాబ్దంలో, ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, విభిన్న రాజకీయ నేపథ్యంలలో తరచూ ప్రదర్శించబడుతూ, వివిధ రకాలయిన భాష్యాలు చెప్పబడుతూ వచ్చినాయి.

జీవితం

తొలినాటి జీవితం

విలియం షేక్‌స్పియర్ 
స్ట్రాట్ఫోర్డ్లోని జాన్ షేక్‌స్పియర్ ఇల్లు.

"విలియం షేక్‌స్పియర్" తండ్రి పేరు జాన్ షేక్‌స్పియర్. తల్లి పేరు మేరీ ఆర్డెన్. తండ్రి జాన్ షేక్‌స్పియర్, ఓ విజయవంతమైన చేతి తొడుగుల వ్యాపారస్తుడు (గ్లోవర్ - glover), పెద్ద అధికారి ( alderman - మేయర్ తరువాత పెద్ద సభ్యుడు). జాన్ షేక్‌స్పియర్ అసలు ఊరు స్నిట్టర్‌ఫీల్డ్. విలియం షేక్‌స్పియర్ తల్లి మేరీ ఆర్డెన్ పెద్ద మోతుబరి రైతు కుమార్తె. షేక్‌స్పియర్ తన తల్లిదండ్రుల ఎనిమిదిమంది సంతానంలో మూడవవాడు, జీవించిన వారిలో పెద్దవాడు. విలియం షేక్‌స్పియర్ స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ లో జన్మించాడు. 26 ఏప్రిల్ 1564న బాప్టిజం పొందినాడు. ఇతని కరక్టు పుట్టిన రోజు మాత్రం తెలీదు. కానీ సంప్రదాయానుసారం ఇతని పుట్టిన రోజు ఏప్రిల్ 23 సెయింట్‌జార్జి దినం నాడు జరుపుతారు. దీనికి ఎటువంటి చారిత్రిక ఆధారాలూ లేవు. ఈ సంప్రదాయం పద్దెనిమిదవ శతాబ్దంనాటి ఓ విద్వాంసుడి పొరపాటుగా తేలుతుంది. ఏప్రిల్ 23 నే షేక్‌స్పియర్ మరణించిన విషయం గమనార్హం . షేక్‌స్పియర్ చదువుకున్న స్కూలు గురించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలూ లభించకపొయినా ఇతని జీవిత చరిత్ర వ్రాసినవారిలో ఎక్కువ మంది 1553లో ప్రారంభం అయిన ఉచిత బడి అయిన స్ట్రాట్‌ఫోర్డ్ లోని రాజుగారి కొత్త బడి (కింగ్స్ ఫ్రీ స్కూల్ ) లో చదివినాడు అను విషయంలో ఏకీభవిస్తున్నారు. ఈ బడి షేక్‌స్పియర్ ఇంటినుండి పావు మైలు దూరంలో ఉంది. ఎలిజబెత్ యుగంలోని వ్యాకరణ బళ్ళు నాణ్యత విషయంలో ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి, కానీ సిలబస్ మాత్రం ఇంగ్లాండు మొత్తం ఒకటే ఉండేది. ఆ ప్రకారం మనం షేక్‌స్పియర్ చదివిన విద్యాలయంలో ల్యాటిన్ వ్యాకరణం, పౌరాణిక శాస్త్రాలు (క్లాసిక్స్) బాగా చదివించి ఉంటారని చెప్పవచ్చు.

18 సంవత్సరాల వయసులో షేక్‌స్పియర్ 26 సంవత్సరాల వయసుగల అన్నే హాతవే అను ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. వోర్సెస్టర్ లోని డియోసెస్ లోని కన్సిస్టరీ కోర్టు వారు 1582 నవంబరు 27న వీరి పెళ్ళికి లైసెన్సు ఇచ్చారు. తరువాత రోజు ఇద్దరు పక్కింటివాళ్ళు ఈ పెళ్ళికి ఎటువంటి అడ్డంకులూ, ఆటంకాలూ లేవని సాక్ష్యమిచ్చారు. బహుశా ఈ పెళ్ళి చాలా తొందరలో చేసుకొని ఉంటారు, అందుకనే వోర్సెస్టర్ చాన్సెలర్ పెళ్ళి ప్రమాణాలు సాధారణంగా చేసే మూడు పర్యాయాలను బదులు ఒక్కసారి చెయ్యడానికి అనుమతించారు అన్నే మూడు నెలల గర్భం ఓ కారణమయి ఉండవచ్చు. పెళ్ళి తరువాత అర్నెళ్ళకు మొదటి కూతురు సుసన్నా హాల్ జన్మించింది. 1583 మే 26 న సుసన్నా బాప్టిజం పొందినది]]. ఆ తరువాత రెండు సంవత్సరాలకి కవలలు హామ్నెట్ షేక్‌స్పియర్ (అబ్బాయి), జుడిత్ క్వినే (అమ్మాయి) జన్మించారు. సుమారు రెండు సంవత్సరాల తర్వాత 1585 ఫిబ్రవరి 2న వీరిద్దరూ బాప్తిజం పొందినారు. హామ్నెట్ 11 సంవత్సరాల వయసులో 1596 ఆగస్టు 11 న మరణించాడు, కారణాలు తెలీదు.

ఈ కవలలు జన్మించిన తర్వాత నుండి 1592లో లండన్ థియేటర్లో ఇతని పాత్ర గురించి తెలిసే మధ్య కాలంలోని షేక్‌స్పియర్ జీవితం గురించి ఎటువంటి ఆధారాలు లేవు. విద్వాంసులు ఈ 1585, 1592ల మధ్యగల సంవత్సరాలను కోల్పోయిన వత్సరాలు (lost years) అని అంటారు. ఈ కాలంలోని షేక్‌స్పియర్ చరిత్రను లిఖించాలని ప్రయత్నించిన జీవితచరిత్రకారులకు అభూత కల్పనలు, అర్థ వాస్తవాలూ ఎదురైనాయి. నికోలస్ రోవే అనే అతను షేక్‌స్పియర్ జీవిత చరిత్ర వ్రాసిన వారిలో మొదటివాడు. ఇతను స్ట్రాట్‌ఫోర్డ్‌వాసులు చెప్పుకునే ఓ కథను ఉటంకించాడు, దాని ప్రకారం షేక్‌స్పియర్ చట్టవిరుద్ధంగా జింకలను వేటాడిన నేరాన్ని తప్పించుకోవడానికి లండన్ నుండి పారిపొయినట్లు ఉన్నది. మరొక 18వ శతాబ్దం చెప్పుకోలు ప్రకారం షేక్‌స్పియర్ నాటక జీవితం నాటకాలు చూడటానికి వచ్చిన వారి గుర్రాలు కట్టివేశే పనితో మొదలయింది. జాన్ ఆబ్రే చెప్పడం ప్రకారం అయితే షేక్‌స్పియర్ బడి పంతులుగా పనిచేసాడు. కొంతమంది ఇరవయ్యో శతాబ్దపు విద్వాంసులు చెప్పడం ప్రకారం షేక్‌స్పియర్ లాంక్‌షైర్‌కు చెందిన అల్క్సాండర్ హోంగ్టన్ బడి పంతులు ఉద్యోగం ఇచ్చాడు. ఇతను కాథలిక్ మతస్తుడు, భూస్వామి. ఇతని విల్లులో ఒక విలియం షేక్సాఫ్ట్‌ను పేర్కొన్నాడు. ఈ కథలకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు, షేక్‌స్పియర్ మరణించిన తర్వాత నల్గురూ చెప్పుకునే మాటలు తప్ప

లండన్ , నాటక జీవితం

షేక్‌స్పియర్ ఎప్పటినుండి వ్రాయడం మొదలుపెట్టినాడో మనకు కరక్టుగా తెలీదు. కానీ ఆ కాలం నాటి ఉదాహరణల నుండి, నాటకాల ప్రదర్శనా రికార్డుల నుండి 1592 నాటికే ఇతని నాటకాలు స్టేజ్‌పై ఆడబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ కాలానికే షేక్‌స్పియర్ లండన్లో బాగా తెలిసిన వ్యక్తి అని రాబర్ట్ గ్రీన్ విమర్శ నుండి తెలుస్తుంది. ఈ విమర్శలోని పదాల కచ్చితమైన అర్థంపై విద్వాంసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ ఎక్కువమంది అంగీకరించే విషయం ప్రకారం: "క్రిస్టఫర్ మర్లోవే థామస్ నషే, , స్వయంగా ఈ విమర్శకారుడైన గ్రీన్‌ల వంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న మహామహులకు మించి షేక్‌స్పియర్ తన స్థాయికంటే ఉన్నతమైన స్థానం కైవశం చేసుకున్నాడన్న ఆక్రోశం కంపిస్తుంది. ఈ విమర్శలోని "Tiges heart wrapped in a player's hide" అను పదం షేక్‌స్పియర్ వ్రాసిన హెన్రీ 6, ఆరవ హెన్రీ మూడవ భాగంలోని "Oh, tigers heart wrapped in a woman's hide" అను పదాల పేరడీ వల్లా, shake-scene అని గేలిచేయడంవల్లా గ్రీన్ షేక్స్పియర్ని తన లక్ష్యంగా చేసుకున్నట్టు రూఢి అవుతుంది.

గ్రీన్ యొక్క విమర్శ షేక్‌స్పియర్ నట జీవితానికి తొలి లిఖిత ఆధారం. జీవిత చరిత్రకారుల ప్రకారం షేక్‌స్పియర్ నాటకాలు వ్రాయడం 1580 దశకం మధ్యలోనుండి గ్రీన్ విమర్శ 1592 కు ముందు వరకూ ఎప్పుడయినా మొదలయి ఉండవచ్చు. 1594 నుండి షేక్‌స్పియర్ నాటకాలు కేవలం చాంబర్లిన్ ప్రభువు మనుషుల కంపెనీలో మాత్రమే ప్రదర్శించారు. ఈ కంపెనీ కొంతమంది వ్యక్తులు కలిసి యజమానులుగా ఉండేవారు. వీరిలో షేక్‌స్పియర్ కూడా ఒకరు. అతి త్వరలోనే ఈ కంపెనీ లండన్లోని ప్రముఖ నాటకాల కంపెనీగా అవతరించింది. 1603వ సంవత్సరంలోని ఎలిజబెత్ రాణి మరణం తర్వాత కొత్త రాజు జేమ్స్, ఈ కంపెనీకి రాయల్ పేటెంట్ బహూకరించి కంపెనీ పేరుని రాజు గారి మనుషులు (కింగ్ మెన్, king's men) గా మార్చాడు.

1599 లో కంపెనీ సభ్యులు భాగస్వామ్యంతో థేమ్స్ నది ఒడ్డున ఒక థియేటర్ నిర్మించారు. దీనికి గ్లోబ్ అని పేరు పెట్టినారు. 1608లో వీరి భాగస్వామ్యం బ్లాక్‌ఫెయిర్స్ ఇండోర్ థియేటర్ను కూడా తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. షేక్‌స్పియర్ ఆస్థుల అమ్మకం, కొనుగోలు రికార్డులు పరిశీలిస్తే ఈ కంపెనీ షేక్స్పియర్‌ను ధనవంతున్ని చేసినట్టు తెలుస్తుంది. 1597 లో షేక్‌స్పియర్ స్ట్రాట్‌ఫోర్డ్‌లో రెండవ అతి పెద్ద ఇల్లు ఖరీదు చేసాడు. 1605 లో స్ట్రాట్‌ఫోర్డ్‌లోనే పరీష్ టైథ్స్ అనే షేర్లలో పెట్టుబడి పెట్టినాడు.

షేక్‌స్పియర్ నాటకల్లో కొన్ని 1594 నుండి చిన్న పుస్తకాల్లో ప్రచురించబడినాయి. 1598 నాటికి షేక్‌స్పియర్ పేరే సెల్లింగ్ పాయింట్‌గా రూపొంది అన్ని టైటిల్స్‌లోనూ అతని పేరు కనిపించడం ప్రారంభం అయింది. నాటక రచయితగా విజయం సాధించిన తర్వాత కూడా షేక్‌స్పియర్ తన నాటకల్లోనూ, ఇతరుల నాటకాల్లోనూ నటించడం కొనసాగించాడు. బెజ్ జాన్సన్ యొక్క 1616వ ముద్రణలో every man of his humour 1598, Sejanus, His fall 1603 నాటకాల్లోని నటీనటుల చిట్టాలో షేక్‌స్పియర్ పేరు ఉంది.

1605లో జాన్సన్ యొక్క వోల్ఫోన్ నాటక నటీనటుల జాబితాలో షేక్‌స్పియర్ పేరు లేకపోవడాన్నిబట్టి ఇతని నటనా జీవితం చివరినాళ్ళకి వచ్చిందని చెప్పవచ్చు. కానీ 1623 ప్రచురణలోని షేక్‌స్పియర్ రచనల ప్రథమ ముద్రణలోని నటీనటుల జాబితాలో అన్ని నాటకాల్లోనూ పేరు ఉన్నది, ఇందులో కొన్ని వోల్పోవ్ తర్వాత ప్రదర్శించబడినవి. కానీ ఈ నాటకాల్లో షేక్‌స్పియర్ ఏఏపాత్రల్లో నటించాడన్న విషయాలు మాత్రం లేవు. 1610వ సంవత్సరంలో హెర్ఫోర్డ్‌కు చెందిన జాన్ డేవీస్ గుడ్విల్ నైట్ (సైనికాధికారి) పాత్ర పోషించాడని చెప్పినాడు. 1709 లో రోవే ఒక పరంపరగా వస్తున్న విషయం ప్రకారం హాంలట్ తండ్రి ఆత్మ పాత్రలో షేక్‌స్పియర్ నటించాడని చెప్పినాడు. ఆ తరువాత సంప్రదాయాల ప్రకారం, 'as you like it'లో ఆడం పాత్ర ఐదవ హెన్రీలో కోరస్ పాత్ర పోషించాని చెప్పబడ్తుంది. కానీ విద్వాంసులు ఈ సమాచారపు మూలాలను అనుమానపు దృక్కులతో చూస్తారు.

షేక్‌స్పియర్ తన కాలాన్ని లండన్, స్ట్రాట్‌ఫోర్డ్‌ల మధ్య విభజించాడు. 1596వ సంవత్సరంలో, అనగా కొత్త ఇళ్ళు కొనడానికి సంవత్సరం ముందు థేమ్స్ నదికి ఉత్తరంగా ఉన్న బిషప్ గేట్, సెయింట్ హెలెన్ యొక్క పరిష్ వద్ద నివసించేవాడు. 1599 నాటికి అనగా తమ కంపెనీ గ్లోబ్ థియేటర్ కట్టేనాటికి నదికి అడ్డంగా సౌత్‌వార్క్‌కు వెళ్ళినాడు. 1604 నాటికి మరల నదికి ఉత్తరపు దిక్కున ఉన్నట్టి సెయింట్ పాల్ కాథెడ్రాల్ ఉత్తరదిక్కున ఉన్న చక్కని గృహసముదాయానికి తరళినాడు. ఇక్కడ షేక్‌స్పియర్ క్రిస్టఫర్ మౌంట్‌జాయ్ అని పిలవబడు ఫ్రెంచ్ హ్యూజ్‌నాట్ దగ్గర గదులు అద్దెకు తీసుకున్నాడు. ఈ హ్యూజ్‌నాట్, అమ్మాయిలకు విగ్గులు, ఇతర అలంకరణ సామాగ్రి తయారు చేసి అమ్మేవారు. 1612లో షేక్‌స్పియర్ తమ ఇంటి యజమాని కూతురు వివాహ వివాదం విషయంలో కోర్టుకు సాక్షిగా హాజరయినాడు. 1613 మార్చిన బ్లాక్‌ఫెయిర్ యొక్క ప్రయరీలో ఒక గేట్‌హౌజ్ కొన్నాడు. 1614 నవంబరు నుండి తన అల్లుడు జాన్ హాల్‌తో కలసి చాలా వారాలు లండన్‌లో గడిపినాడు.

1606-1607 ల మధ్య షేక్‌స్పియర్ చాలా తక్కువ నాటకాలు వ్రాసినాడు. 1613 తర్వాత ఇతను వ్రాసినట్లు చెప్పబడేవి ఏమీ లేవు. చివర మూడు నాటకాలూ బహుశా జాన్ ఫ్లెచర్ తో కలిసి వ్రాసి ఉండవచ్చు. ఈ ఫ్లెచరే రాజుగారి మనుషుల నాటకాల కంపెనీ షేక్‌స్పియర్ రచనా వారసునిగా మారినాడు.

మరణం

మరణానికి కొన్ని సంవత్సరాల ముందు షేక్‌స్పియర్ స్ట్రాట్‌ఫోర్డుకి పదవీ విరమణ చేసి వెళ్ళినాడని మనకు చెప్పిన తొలి చరిత్రకారుడు రోవే. కానీ ఈ రోజుల్లోలా ఆ రోజుల్లో పూర్తిగా బాధ్యతలనుండి తప్పుకోవడం అంటూ ఉండదు. లండన్ అప్పుడప్పుడూ వస్తూపోతూ ఉండేవాడు. 1616 ఏప్రిల్ 23 న షేక్‌స్పియర్ మరణించాడు. ఇతనికి అప్పుడు భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. సుసన్నా డాక్టరు అయిన జాన్ హాల్‌ను వివాహమాడినది. రెండవ కుమార్తె జుడిత్, షేక్ప్సియర్ మృతికి రెండు నెలలకు ముందు వైన్ అమ్మే థామస్ క్వినేను వివాహం చేసుకున్నది.

షేక్‌స్పియర్ తన వీలునామాలో ఆస్తిలో ఎక్కువ భాగం పెద్ద కుమార్తెకు చెందేట్టు వ్రాసినాడు. అలాగే ఆస్తి ఎటువంటి నష్టం లేకుండా సుసన్నా మొదటి కొడుక్కు చెందేట్టు నియమం పెట్టినాడు. క్వినేకు ముగ్గురు సంతానం, కానీ వారిలో అందరూ పెళ్ళికి ముందే మరణించారు. హాల్‌కు ఒక్కరే సంతానం - ఎలిజబెత్, వీరు రెండు మార్లు వివాహం చేసుకున్నారు, కానీ ఎటువంటి సంతానం లేకుండానే 1670లో మరణించారు. దానితో షేక్‌స్పియర్ వంశం అంతం అయినది. షేక్‌స్పియర్ వీలునామాలో భార్య గురించి కేవలం అరకొరగా మాత్రమే వ్రాయబడింది. అన్నెకి బహుశా మూడవ వంతు ఆస్తి ఆటోమేటిగ్గా వచ్చి ఉంటుంది. కాకపోతే షేక్‌స్పియర్ వీలునామాలో ఓ చోట మాత్రం తన భార్యకు తన రెండవ ఉత్తమ మంచం చెందాలి అని వ్రాసినాడు. ఈ వాక్యం వల్ల చాలా కల్పనలు వచ్చినాయి, కొంతమంది విద్వాంసుల ప్రకారం ఇది అన్నెను అవమానించామే, కానీ మరి కొంతమంది మాత్రం రెండవ ఉత్తమ మంచం పెళ్ళి నాటిదై ఉంటుందనీ, తద్వారా షేక్‌స్పియర్ భార్యపై ప్రేమను ప్రకటించినాడనీ చెప్తారు.

షేక్‌స్పియర్ మరణాంతరం రెండు రోజులకు హోలీ ట్రినిటీ చర్చి (పవిత్ర త్రిమూర్తిత్వ చర్చి)లో అంత్యక్రియలు జరిగినాయి. 1623 కు ముందు ఈ ప్రాంతంలో ఓ స్మారక చిహ్నం నెలకొల్పినారు. దీనిపై షేక్‌స్పియర్ విగ్రహం నడుము వరకూ ఉంచారు.

నాటికలు

విద్వాంసులు షేక్‌స్పియర్ రచనా కాలాన్ని నాలుగు ప్రధాన భాగాలుగా విభజించారు. 1590 వ దశకం మధ్య వరకూ ఇతను వ్రాసిన రచనల్లో రెండు రకాలు కలవు, మొదటి రకం హస్యరస ప్రధానమైనవి, వీనిపై ఇటాలియన్, రోమన్ రచనల ప్రభావం బహు మెండు. రెండవ రకం చారిత్రక కథాంశాలతో కూడినవి, వీటిపై popular chronicle సంప్రదాయపు ప్రభావం బహు మెండు.

షేక్‌స్పియర్ రచనా కాలాల్లో రెండవ భాగం 1595లో విషాద భరిత నాటకం రచించిన రోమియో, జూలియట్‌తో మొదలై 1599లో రచించిన మరొక విషాద భరిత నాటకం జూలియస్ సీజర్‌తో ముగుస్తుంది. మూడవ కాలం 1600 -1608 వరకూ షేక్‌స్పియర్ చాలా వరకూ విషాదభరిత నాటకాలు వ్రాసినాడు. 1608 - 1613ను నాల్గవ కాలంగా విభజిస్తారు. ఈ కాలంలో ఎక్కువ విషాదాస్య భరిత నాటకాలు వ్రాసినాడు.

మూడవ రిచర్డ్, ఆరవ హెన్రీ యొక్క మూడవ భాగం షేక్‌స్పియర్ తొలినాటి రచనలుగా ఆధారాలు లభిస్తున్నాయి. వీటిని 1590వ దశకంలో తొలి భాగంలో రచించాడు. చాలా కాలం పాటు రచించిన షేక్‌స్పియర్ యొక్క అన్ని నాటకాలూ సరియైన కాలాన్ని గుర్తించడం కష్టతరమైనపని. కానీ ఈ నాటకాల్లోని పాఠాన్ని బట్టి టిటస్ ఆండ్రోనికస్, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ద టేమింగ్ ఆఫ్ ష్ర్యీ, టూ జెంటిల్‌మెన్ ఆఫ్ వెరోనాలు కూడా తొలినాటి రచనలు అని చెప్తుంటారు. ఇవి చారిత్రక నేపథ్యం అల రచనలు. వీటి కథాంశాన్ని రఫెల్ హోలిన్‌షెడ్ యొక్క క్రానికల్స్ ఆఫ్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్,, ఐర్లాండ్ అను పుస్తకం యొక్క 1587వ ముద్రణ ఆధారం. ఇంక ఈ రచనలు, ఇతర ఎలిజబెత్ కాలంనాటి నాటికలనుండి కూడా ప్రేరణ పొందినాయి. ముఖ్యంగా థామస్ కైడ్, క్రిష్టఫర్ మర్లోవే రచనలు. ఇంకా మధ్య యుగం నాటి నాటక సంప్రదాయాలు, సెనికా యొక్క నాటకాల ప్రభావం కూడా ఉంది.

షేక్‌స్పియర్ తొలినాటి రచనల్లో శాస్త్రీయ, ఇటాలియనేట్ కామెడీలు క్లిష్టతరమైన ద్విముఖ కథానికలు (tight double plots), కచ్చితమైన హాస్య సన్నివేశాలు ఉన్నాయి.

A mid summar night's dream ( ఓ నడి వేసవి రాత్రి కల) అనేది శృంగారం, మంత్ర తంత్రాలు, హాస్యం మొన్నగు విషయాల కలయిక. షేక్‌స్పియర్ తరువాత హాస్యం అంతే పాళ్ళలో శృంగార రసం మేళవించిన నాటకం 'the merchant of venice' (వెనిస్ వ్యాపారి) అనేది ఒక పీనాసి యూదు వ్యాపారుని కుటిలత్వాన్ని చూపుతుంది. ఇది విక్టోరియా కాలం నాటి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది, కానీ నేడు మాత్రం జాత్యాహంకార భావనలు గలవిగా కంపిస్తుంది.

కుటిలత్వం, పదాడంబరత్వం కల 'అడో అబౌట్ నతింగ్' (Ado about nothing), 'యాజ్ యూ లైక్ ఇట్' (as you like it) లోని ఆకర్షణీయమైన గ్రామీణ వాతావరణం, ఆనందాస్వాదనతో కూడిన (twelfth night?) లతో షేక్‌స్పియర్ కామెడీల వరుస ముగుస్తుంది.

పద్య కవిత్వంతో నిండిన రెండవ రిచర్డ్ తర్వాత పూర్తిగా వచనంలో వ్రాసిన నాల్గవ హెన్రీ ప్రథమ, ద్విత్య భాగాలు, ఐదవ హెన్రీ, చారిత్రక నాటకాలలో హాస్య రసాన్ని మేళవించాడు. షేక్‌స్పియర్ హాస్యం, గంభీర్యం, పద్యం, వచనం ల మధ్య పరస్పరం మారుతూ పాత్రలను మలచి తన రచనలో పరిణతను అద్భుతంగా ప్రదర్శించాడు.

ముందుగనే చెప్పుకున్నట్టు షేక్‌స్పియర్ రెండవ కాలం ఒక విషాదరస ప్రధాన రచన రోమియో, జూలియట్‌తో మొదలయి మరొక విషాద రస ప్రధాన నాట్కం అయిన జూలియస్ సీజర్‌తో ముగుస్తుంది రోమియో, జూలియట్ అనేది ప్రపంచ ప్రఖ్యాత శృంగార, విషాద, చిత్రీకరణ ఇందులో యవ్వనం, ప్రేమ, మరణాలు చిత్రించబడినాయి. ఇహ జూలియస్ సీజర్ విషయానికి వస్తే ఇది 1579లో ప్లుటార్స్ పార్లల్ లైవ్స్ (సమాంతర జీవితాలు)కు సర్ థామస్ నార్త్ చేసిన అనువాదం ఆధారం. జూలియస్ సీజర్ ఓ కొత్తరకమైన నాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. షేక్‌స్పియర్ విద్వాంసుడు జేంస్ పాపిరో ప్రకారం ఈ జూలియస్ సీజర్‌లోని వివిహ రాజకీయ విషయాలు, పాత్రలు లోవ్యక్తిత్వం (inwardness), సమకాలీన సంఘటనలు, షేక్పియర్ స్వంత రచానా శిల్పం ఒకదానికొకటి ప్రభావం చూపినాయి.

షేక్‌స్పియర్ మూడవ రచనా కాలం, విషాద యుగంగా పిలవబడే ఈ సమయం 1600 నుండి 1608 వరకు కొనసాగింది. ఈ కాలంలో షేక్‌స్పియర్ సమస్యా నాకాలుగా పిలవబడే మెజర్ ఫర్ మెజర్, ఆ ఈ జ్ వెల్ దట్ ఎండ్స్ వెల్లు కూడా వ్రాసినాడు. అంతే కాకుండా ఇతను విషాద రస ప్రధాన నాటకాలు ఈ కాలానికి ముందు కూడా వ్రాసినాడు. కానీ ఈ 1600 - 1608ని మాత్రం విషాద యుగంగా పిలవడం సంప్రదాయం. ఈ విషాద రస ప్రధాన నాటకాలు షేక్‌స్పియర్ రచనల్లో శిఖరాన్ని చూపిస్తాయని చాలా మంది అంటారు. మొదటి నాటకపు నాయకుడు హాంలెట్, బహుశా షేక్‌స్పియర్ పాత్రలన్నింటిలోనూ ఎక్కువగా చర్చించబడిన పాత్రం మరీ ముఖ్యంగా అతని "చెయ్యాలా? వద్దా? అను అంతర్మథనం బహు ప్రసిద్ధి. మొదతి కథానాయకుడు హాంలెట్ అంతర్ముఖుడు కావడం అతని బలహీనత అయితే ఆ తరువాత నాట్కాల నాయకులు అయిన ఒఠెల్లో, లియర్ రాజులు తమ న్యాయ నిర్ణయంలో తప్పుల వల్ల బలహీనులు అయినారు. సాధారణంగా షేక్‌స్పియర్ విషాద నాటకాలు నాయకుది బలహీనతలు భయంకరమైన తప్పులు ఆధారంగా ఇతివృత్తంగా మలచబడి క్రమ జీవితాన్ని నాశనం చేసి కథా నాయకుని, అతనికి ఇష్టమైన వాళ్ళనీ నాశనం చేస్తాయి.

'ఒథెల్లో'లోని ప్రతినాయకుడు (అమాయకుడు) ఒథెల్లోకి భార్యపై గల అనుమానాన్ని ఎగదోసి అమాయకురాలు, ఒథెల్లోను ప్రాణప్రధంగా ప్రేమించే అతని భార్యను స్వయంగా హత్య చేసేట్టు పురికొల్పుతాడు. ఆ తరువాత 'లియర్ రాజు'లో ముసలి రాజు తన అధికారాన్ని వదులుకోవడం అనే భయంకర తప్పు చేయడం ద్వారా కుమార్తె హత్యకు గ్లౌసెస్టర్ డ్యూక్ చిత్రహింసలు - గ్రుడ్డి తనానికి కారణం అవుతాడు. విమర్శకుడు ఫ్రాండ్ కెరోడ్ ప్రకారం ఈ నాటకాలు పాత్రల మంచితనాన్ని గానీ, ప్రేక్షకులకు కౄరత్వాన్నుండి ఉపశమనాన్ని గానీ అందించవు. షేక్స్ఫియర్ సంక్లిష్ట చిన్న విషాద నాటకం అయిన మక్‌బెత్‌ లో మక్‌బెత్ దంపతులు తమ తీవ్రమైన, నిలపలేని కోరిక వల్ల మంచి రాజుని చంపి సింహాసనాన్ని అధిస్టిస్తారు. కానీ తరువాత అదే వాళ్ళని నాశనం చేస్తుంది. ఈ నాటకంలోనే షేక్‌స్పియర్ అభౌతిక పాత్రను ప్రవేశపెడతాడు.

షేక్‌స్పియర్ చివరి పెద్ద విషాద రస ప్రధాన నాటకలయిన ఆంటోనీ, క్లియోపాత్రా ఇంకా కొరియోలనస్లలు షేక్‌స్పియర్ యొక్క అద్భుత కవిత్వం కలిగి ఉన్నాయి. కవి, విమర్శకుడు అయిన టి.యస్. ఇలియట్ ప్రకారం ఈ రెండూ షేక్స్పియర్‌కి అత్యంత విజయవంతమైన నాటకాలు.

షేక్‌స్పియర్ నాల్గవ, ఆఖరి రచనా కాలములో విషాదాస్యరసంలో వ్రాసినారు. సింబెలైన్, ది వింటర్స్ టేల్, ది టెంపెస్ట్ లు. ఈ నాటకాల్లో కథానాయకులు తమ తప్పులు చివర్లో శుభంవైపు ముగుస్తాయి. కొంత మంది ఈ మార్పుని షేక్‌స్పియర్ జీవితంలో వచ్చిన మార్పుగా చెప్తారు, కానీ ఇది కేవలం ఆ కాలంలోని నాతక ప్రేక్ష్యకుల ట్రెండు మార్పుగా భావించ వచ్చు. ఈ మూడు స్వంత రచనలే కాకుండా ఈ కాలంలో షేక్‌స్పియర్ ఎనిమిదవ హెన్రీ, ది టూ నోబుల్ కిన్స్మెన్, ఇతర రచయిత భాగస్వామ్యంలో వ్రాసినాడు, బహుశా జాన్‌ ఫ్లెచర్ కావచ్చు.

ప్రదర్శనలు

తొలినాటి నాటకాలు ఏ కంపెనీ కోసం వ్రాసినాడో చెప్పడానికి ప్రస్తుతం సరియైన ఆధారాలు లేవు. కానీ టిటస్ ఆండ్రోనికస్ నాటకం యొక్క 1594 ముద్రణలో ఈ నాటకాన్ని మూడు ట్రూపులు వేసినట్టు వ్రాయబడింది. 1592 - 1593 ప్లేగు వ్యాధి బీభత్సం తర్వాత షేక్‌స్పియర్ నాటకాల్ని తమ స్వంత కంపెనీలోనే ప్రదర్శించడం మొదలుపెట్టినాడు. ఈ ప్రార్శనలు థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న కర్టన్ ఇన్ షోర్డిచ్ థియేటర్లో ప్రదర్శించేవాడు. లండన్ వాసులు ఇతని నాటకం నాల్గవ హెన్రీ చూడటానికి బారులు తీరేవారు. క్లియోనార్డో డిగ్ చెప్పినట్లు ఈ థియేటర్ భూయజమానితో గొడవల్లో చిక్కుకున్నప్పుడు ఇక్కడి థియేటర్ మొత్తం కూల్చేసి ఆ కలపను గ్లోబ్ థియేటర్ నిర్మాణానికి ఉపయోగించారు. ఇది నటీనటుల చేత నటీనటులు కొరకు నిర్మించబడిన మొదటి థియేటరు. దీనిని థేంస్ నది దక్షిణపు ఒడ్డున సౌత్‌వార్క్ దగ్గర నిర్మించారు. ఈ థియేటర్ 1599 తర్వాత చాలా వరకూ షేక్‌స్పియర్ ప్రధాన నాటకాలన్నీ గ్లోబ్ థియేటర్ కొరకే వ్రాసినాడు. హాంలెట్, ఒథెల్లో లియర్ రాజు వీటిలోనివే.

చాంబర్లైన్ ప్రభువు యొక్క మనుషులు కంపెనీకి రాజుగారి మనుషులుగా పేరు మార్చిన తర్వాత వీరు ఆ నాటి క్రొత్త రాజు అయిన జేమ్స్ ప్రతేకమైన సంభందంలోకి ప్రవేశించారు. ఆ ప్రదర్శనాధారాలు కొద్ది కొద్దిగానే లభించినప్పటికీ రాజు గారి మనుషులు కంపెనీ 1604 1605 నవంబరు 1 అక్టోబరు 31ల మధ్య మొత్తం ఏడు ప్రదర్శనలిచ్చారు. ఇందులో మర్చంట్ ఆఫ్ వెనిస్ ప్రదర్శనే రెండు సార్లు ఉంది. 1608 తర్వాత వీరు శీతాకాలంలో బ్లాక్ ఫెయిర్ ఇండోర్ థియేటర్లోనూ వేసవి కాలంలో గ్లోబ్ థియేటర్లోనూ ప్రదర్శనలిచ్చేవారు. ఇండోర్ థియేటర్లోని ఆకర్షణీయమైన అనువైన సెట్టింగులు షేక్‌స్పియర్ ప్రతేకాకర్షణగల సీన్లు పెట్టడానికి వీలు కల్పించింది. ఉదాహరణకు సింబర్లిన్‌లో జుపిటర్ భూమికి అవధరించునప్పుడు ఉరుములు మెరుపులతో కూడి ఓ గ్రద్దపైనుండి వస్తాడు, వచ్చీ రాగానే ఓ పిడుగు విసిరేసి దయ్యాలను మోకాళ్ళపై నిలబడేట్టు చేస్తాడు.

షేక్‌స్పియర్ నాటకాల ప్రదర్శనల్లో హీరోలుగా ప్రఖ్యాతిగాంచిన రిచర్డ్ బర్బేజ్, విలియం కెంపే, హెశ్రీ కాండెల్, జాన్ హెమింగ్స్ మొన్నగు వారు నటించారు. మూడవ రిచర్డ్, హాంలెట్, ఒథెల్లో నాటకాల్లో బర్బేజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ప్రముఖ హాస్య నటుడు విల్ కెంపే, రోమియో, జూలియట్లో పీటర్ సేవకుని పాత్ర, మచ్ అడో అబవుట్ నథింగ్లో డాగ్ బెర్రీ పాత్రా పోషించాడు. ఇవే కాకుండా ఇంకా చాలా షేక్‌స్పియర్ పాత్రల్లోనూ కెంపే నటించాడు. పదహారవ శతాబ్దారంబంలో కెంపే పాత్రల్లో రాబర్ట్ ఆర్మిన్ నటించడం మొదలుపెట్టినాడు. ఇతను 'as you like' లో టచ్‌స్టోన్ గానూ, 'లియర్ రాజు'లో మూర్ఖుని పాత్రలోనూ నటించాడు. 1613వ సంవత్సరంలో సర్ హెన్రీ వాట్టన్ వ్రాసిపెట్టిన ప్రకారం ఎనిమిదవ హెన్రీ చాలా సందడి సందడిగా మొదలయింది. జూన్ 29న ఒక ఫిరంగి ప్రమాదవశాత్తూ పేలి గ్లోబ్ థియేటర్ పూర్తిగా నేలమట్టం అయినది.

పుస్తక ప్రచురణలు

1623లో షేక్‌స్పియర్ యొక్క ఇద్దరు మితృలు జాన్ హెర్నింగ్స్, హెన్రీ కాండెల్ లు షేక్‌స్పియర్ నాటకాలను ఓ పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 36 షేక్‌స్పియర్ రచనలు ఉన్నాయి, వాటిలో 18 తొలిసారి ముద్రించబడినాయి. షేక్స్ప్యర్ రచనలు ఈ 1623కు ముందే చిన్న చినన్ పుస్తకాలుగా మురించారు. అయితే షేక్‌స్పియర్ ఈ ప్రచురణలకు అనుమతి ఇచ్చినట్టు తెలీదు. ఈ విషయాన్నే 1623లో ముద్రించబడిన పుస్తకం ఈ చిన్న చిన్న పుస్తకాలను దొంగిలించి ముద్రించినవిగా, తప్పుల తడకలుగా, అభివర్ణించారు. అల్ఫ్రెడ్ పోలార్డ్ ఈ చిన్న పుస్తకాలను చెడ్డ చిన్న పుసకాలు అని అబివర్ణించాడు. వీటిలోని పాఠ్యము తప్పుల తడకగా చెప్పినారు. బహుశా ఇవి విని గురించుకోని వ్రాసినవి కావచ్చు. ఈ చిన్న పుస్తకాల్లో ఒకే నాటకం వివిధ ముద్రణల్లో వివిధ రకాలుగా ఉంది. ఈ తేడాలు ముద్రణా దోషాలు, నకలు దోషాల వల్ల జరిగి ఉండవచ్చు. ఇంకా కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు హాంలెట్, ట్రోయిలస్, క్రిస్సీడా, ఒథెల్లోల విషయంలో చిన్ని పుస్తకాలను 1623 ముద్రణకు నడుమ షేక్‌స్పియర్ తన పాఠ్యాంశాన్ని సరి చేసుకోని ఉండవచ్చు. 1623 ముద్రణలోని లియర్ రాజు 1608 నాటి చిన్ని పుస్తకంలో చాలా తేడాలు ఉన్నాయి. అందుకని తరువాత "ఆక్స్‌ఫర్డ్ షేక్‌స్పియర్" రెంటీనీ ముద్రించ్నది.

కవితలు

1593, 1594 ల మధ్య్ అప్లేగు వ్యాధి కారణంగా థియేటర్లు మూసేసినప్పుడు శృంగార రస ప్రధానమైన రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు ముద్రించ్నాడు. అందులో మొదటిది వీనస్, అడోనిస్ రెండవది లుక్రీస్ మానభంగం. వీటిని సౌతంటన్ ఎర్ల్ అయిన హెన్రీ వ్రియోత్‌న్లీకి అంకితం ఇచ్చాడు. వీనస్, అడోనిస్‌లో అమాయకురాలయిన అడోనిస్, వీనస్ యొక్క ప్రేమ - శృంగారాలకు నిరాకరిస్తుంది. లుక్రిసీ మానభంగంలో కన్య అయిన లుక్రిసీని దుర్మార్గుడు టార్కిన్ పాడు చేస్తాడు. ఈ రెండూ కూడా నిరోధించలేని కామకోరికలను ఓవిడ్ యొక్క మెటామోర్ఫోస్‌చే ప్రేరణ పొంది రచించాడు. ఈ రెండు కవితలు కూడా చాలా విజయవంతం అయినాయి. షేక్‌స్పియర్ కాలంలోనే చాలా పునర్ముద్రణలు పొందినాయి. మూడవ వ్యాఖ్యాన కవిత ప్రేమికురాల పిర్యాదు (A lovers complaint) 1609 చతుర్పాద కవితా (sonnet) ముద్రణలో ముద్రించబడింది. ఇందులో ఓ యువతి తనను అనుభవించినవాని గురించి వ్యధ చెందుతూ వ్యక్తం చేసిన ఘోష ఉంది.

చాలా మంది విద్వాంశులు ఇప్పుడు ఈ ప్రేమికురాలి పిర్యాదు షేక్‌స్పియర్ వ్రాసినట్టు అంగీకరిస్తారు. విమర్శకులు ఈ కవితలోని విషాద, శోక రాగాలు అద్భుతంగా ఉన్నాయని అంగీకరిస్తారు. . 1601లో రాబర్ట్ చెస్టర్ ముద్రించిన love's martyr లో "the phoenix and the turtle", 1599లో The passionate piligrimనందు రెండు చతుర్పాద కవితలు, 138, 144 లు, షేక్‌స్పియర్ అనుమతి లేకుండా ముద్రించబడినాయి. The phoenix and the turtle లో ప్రియురాలి మరణానికి, ఫీనిక్స్ పక్షి మరణానికీ, నమ్మకమైన తాంబేలు (turtle ) మరణానికి చెందే వ్యధను వర్ణించాడు.

చతుర్పాద కవితలు

1610 లో ప్రచురించబడిన చతుర్పాద కవితలు (Sonnets) షేక్‌స్పియర్ యొక్క రచనల్లో నాటకాలు కాకుండా ఉన్న వానిలో చివరవి. ఇందులో ముద్రించిన 154 కవితలు ఎప్పుడు వ్రాయబడినవి అనే విషయంలో విద్వాంసులు సందిగ్ధంలో ఉన్నారు. కాకపోతే ఈ చిన్ని కవితలు తన రచనాకాలం మొత్తం అప్పుడప్పుడూ మితృలు, పరిచయస్తుల కోసం వ్రాసినట్టు ఆధారాలు ఉన్నాయి. 1599 లో ముద్రించిన The passionate piligrim లో రెండు చిన్ని కవితలు అనధికారికంగా వెలుబడటానికి ముందు కూడా షేక్‌స్పియర్ చిన్ని కవితల గురించి ఆధారాలున్నాయి. 1598లో ఫ్రాన్సిన్ మియర్ "షేక్‌స్పియర్ తన స్నేహితుల మధ్య చిన్న కవితలు వదిలేవాడు" అని వ్రాసినాడు. కొంత మంది విశ్లేషకులు 1609 లనాటి చతుర్పాద కవిత సంపుటిలోని 154 చిన్ని కవితల వరుస షేక్స్పియరే నిర్ణయించినాడని చెప్తారు. షేక్‌స్పియర్ ఇటువంటి రెండు ముద్రణలకు పథకాలు రచించినట్లు కంపిస్తుంది. ఒక్కటి నల్లని మేని ఛాయ గలిగిన ఓ వివాహిత యువతిపై అనియంత్రిత కామ కోరికలను వ్యకపరుస్తూ వ్రాసినవి, రెండవది చక్కని యువకునిపై ప్రేమ వ్యక్త పరుస్తూ వ్రాసినవి. అయితే ఈ కవితల్లోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులా కాదా అనే విషయమూ, ఇందులోని "నేను" షేక్స్పియర్ని సూచిస్తుందా లేదా అనే విషయం ఎటూ తేలకుండా ఉంది. కానీ వర్డ్స్‌వర్త్ మాత్రం "ఈ కవితల ద్వారా షేక్‌స్పియర్ తన హృదయాన్ని తెరచినాడు " అని విశ్వసించాడు. 1609 నాటి ముద్రణ మిస్టర్ డబ్లూ హెచ్ కి అంకితం ఇవ్వబడినట్లు వ్రాయబడింది. కానీ ఈ వాక్యాలను ఆ ప్టలోని అడుగు భాగంలో పేరు ప్రింట్ చేయబదిన పబ్లిషర్ థామస్ తోర్పే వ్రాసినాడో షేక్స్పియరే వ్రాసినాడో తెలీడంలేదు. అంతే కాకుండా ఈ మిస్టర్ డబ్లూ హెచ్ ఎవరో కూడా తెలియడంలేదు. ఎన్నో ఊహలూ సిద్దాంతాలూ వచ్చినప్పటికీ ఇంతవరకూ ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. అంతే కాకుండా అసలు ఈ పుస్తకాన్ని షేక్‌స్పియర్ అధికారికంగా అనుమతిచ్చడు అనే విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ చిన్ని కవితలు, ప్రేమ శృంగారం, సృజనాత్మకత, మరణం, కాలం మొన్నగు విషయాలను అద్భుతంగా వ్యక్తపరచినాయి అనే విషయం మాత్రం అందరూ ముక్త కంఠంతో ఒప్పుకుంటారు.

శైలి శిల్పం

తొలి నాటి షేక్‌స్పియర్ నాటకాలు ఆనాటి సంప్రదాయబద్దమైన శైలిలో వ్రాయబడినాయి. కానీ త్వరలోనే ఈ సంప్రదాయ బద్దమైన శైలిని షేక్‌స్పియర్ తన స్వంత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం మొదలుపెట్టినాడు. మూడవ రిచర్డ్‌లో మొదతి సీన్లో అంతర్మధతానికి మధ్య యుగం నాటి నాటకాల్లో స్వయం పరిచయం శైలో మూలాలు దాగున్నాయి. అదే సమయంలో రిచర్డ్ యొక్క స్వయం తెలివితేటలు, ఆత్మ జ్ఞానం (self awareness), షేక్‌స్పియర్ యొక్క అంతర్మథనంలో పరిణితి చెందిన శైలి కంపిస్తుంది. ఏ ఒక్క నాటకం కూడా సంప్రదాయ శైలికి పూర్తి భిన్నంగా నడవలేదు. షేక్‌స్పియర్ తన అన్ని నాటకాల్లోనూ సంప్రదాయ శైలినీ, స్వేచ్ఛాశైలిని ప్రభావశీలంగా కలిపి ఉపయోగించాడు.

రోమియో, జూలియట్, ఇలా శైలులు కలపడానికి చక్కని ఉదాహరణ. 1590 దశకం మధ్య కాలానికి అనగా రోమియో, జూలియట్ రెండవ రిచర్డ్, ఓ నడి వేసవి రాత్రి కల నాటికి షేక్‌స్పియర్ సహజ సిద్ద కవిత్వం వ్రాయడం మొదలు పెట్టినాడు.

హాంలెట్ తర్వాత షేక్‌స్పియర్ తన కవితా శైలిని మరింత మార్చాడు. తరువాత కాలం నాటి శైలిని సాహితీ విమర్శకుడు ఏసీ బ్రాడ్లీ మాటల్లో "మరింత చిక్కనైనదీ, వేగవంతమైనదీ, క్రమబద్దమైనదీ, ఎప్పుడోగానీ ట్విస్ట్ చేసినదీ, లేదా ఎల్లిప్టికల్ కానిదీ షేక్‌స్పియర్ రచనాకాలం చివర్లో ఈ ఎఫెక్ట్‌లు సాధించడానికి రకరకాల టెక్నిక్కులు ప్రయోగంచాడు. వీతిలో ran on lines, క్రమము కాని చోట ఆగుట, నిలుపుటలు, వాక్య నిర్మాణంలో సైజులో తీవ్రమైన విభిన్నత్వమూ, వంటివి ఉన్నాయి. ఉదాహరణకు మక్ బెత్ లో భాష ఒక సంబంధంలేని మెటాఫర్ నుండి మరొక స్మైలీకి వేగంగా మారుతుంది.

షేక్‌స్పియర్ చివరి కాలంనాతి విషాదాస్యాల కొచ్చేసరికి అశ్చర్య రీతిలోని ఇతివృత్తాలు ఇతని చివరి కవితాశైలికి ప్రేరణగా నిల్చినాయి. ఈ శైలిలో పొడుగు వాక్యాలూ, పొట్టిఒ వాక్యాలూ ఒకదాని తర్వాత ఒకటి రావడమూ, clauses are piled up subject and object are reversed,, కొన్ని పదాలు లుప్తమయినాయి. ఇవి అన్నీ కలిసి ఒక విధమైన ఆశుత్వం (spontaneity) సాధించాయి.

ఆ రోజుల్లోని అన్ని నాటక రచయితల్లాగానే షేక్‌స్పియర్ కూడా తన ఇతివృత్తాలను పెట్రర్చ్, హోల్నిషేడ్లు వంటి వాటినుండి ఎన్నుకున్నాడు. ప్రతి ఇతివృత్తాన్ని పలు ఆసక్తి దాయక సీన్లు ఉండేవిధంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా మలచాడు. ఈ రకమైన నిర్మాణం వల్ల షేక్‌స్పియర్ నాటకాలు అనువాదాలు, మార్పులు చేర్పులను, wide interpretationలను తట్టుకొని నిలబడగలిగిన core కలిగి ఉన్నాయి.

షేక్‌స్పియర్ కాలంతో పాటు పరిణితి పొందేసరికి అతని పాత్రలకు స్పష్టమైన చల ఉత్ప్రేరకాలను విభిన్న వాక్‌రీతులను ప్రయోగించాడు. కానీ ఇతని తొలినాటి నాటక పద్ధతులు చాలా వరకు చివరి కాలంనాతి నాటకాల వరకూ జ్కొనసాగించాడు. విషాదాస్యాలలో మాత్రం మరింత కృత్రిమమైన శైలికి కావాలనే మళ్ళినాడు, తద్వారా emphasised the illusion of theatre....

ప్రభావాలు

  • షేక్‌స్పియర్ సృజించిన రచన తరువాత చాలా కాలం వరకూ ఆంగ్ల కవిత్రంలోను, సాహిత్యంలోనూ, నాటకాల్లోనూ తన అమోఘమైన ప్రభావం చూపించింది. ఇతను పాత్ర చిత్రణ ఇతివృత్త నిర్మాణము, భాష, genre ల శక్తి సామర్ద్యాలను విశాలం చేసాడు. ఉదాహరణకు రోమియో జూలియట్ వరకూ శృంగార రసాన్ని విషా రసం కోఅం ఉపయోగించడం పనికొచ్చేదిగా చూడబడలేదు. అంతర్మథనం కేవలం పాత్రల గురించిన సమాచారం ఇవ్వడానికి ఏదన్నా సంఘటన గురించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే ఉపయోగంచేవారు, కానీ షేక్‌స్పియర్ ఈ అంతర్మధనాన్ని పాత్రల మనసులను వివరించడానికి విరివిగా వాడుకున్నాడు. షేక్‌స్పియర్ రచనలు తరువాతి తరాల కవులపై తీవ్ర ప్రభావం చూపినాయి. రొమాంటిక్ కాలంలోని కవులయితే ఏకంగా షేక్‌స్పియర్ వచన నాటకాలను కవిత్వంలో ంపునర్లిఖించడానికి ప్రయత్నించారు. కాకపోతే ఈ ప్రయత్నం పెద్దగా విజయవంతం అవలేఉ. జార్జ్ స్టెయినర్ అను విమర్శకుడు "కొలెరిడ్జ్ నుండి టెన్నిసన్ వరకూ వచ్చి అన్ని ఆంగ్ల నాటకాలూ షేక్‌స్పియర్ నాటకాలను బలహీనమైన (చప్పని?) అనుకరణలూ, మర్పులూ" అంటూ వ్రాసినాడు.
  • థామస్ హెర్డీ విలియం పాల్క్నర్, చార్లెస్ డికిన్స్ వంటి నవలా రచయితలను కూడా షేక్‌స్పియర్ చాలా ప్రభావం చూపినాడు. డికిన్స్ అయితే తన నవలల్లో ఇవరై ఐదింతికి పేర్లు షేక్‌స్పియర్ నుండి ప్రేరణ పొంది పెట్టినవే. అంతే కాకుండా డికిన్స్ తన నవలల్లో తరచూ షేక్స్పియర్ను ఉటంకించేవాడు.
  • అమెరికా దేశపు నవలా రచయిత హెర్మన్ మెల్‌విల్లే యొక్క రచనల్లోని అంతర్మధనాలు పై షేక్‌స్పియర్ ప్రభావం సుస్పష్టము. మెల్‌విల్లే నవల మోచీ డిక్ లోని నాయకుడు అహబ్ షేక్‌స్పియర్ లియర్ రాజు నుండి చాలా ప్రేరణ పొందినది.
  • విద్వాంసులు ఇరవై వేలకు పైగా సంగీతపు సృజనలను షేక్‌స్పియర్ రచనలకు సంబంధించిన వాటిగా గుర్తించారు. వీటిలో గిసెప్పి వెర్డికి చెందిన రెండు ఒపెరాలు ఒథెల్లో, ఫాల్ట్సాఫ్ లు కూడా ఉన్నాయి. నాణ్యత విషయంలో ఈ రెండూ మూలంతో సమస్థాయిలో ఉంటాయి.
  • అనేకమంది చిత్రకారులను కూడా షేక్‌స్పియర్ ప్రేరణగానిలిచ్నాడు. వీరిలో రొమాంటిక్ కాలమునాటి వాళ్ళూ రఫెల్ ముందతి కాలం వాళ్ళు కూడా ఉన్నారు. స్విస్ రొమాంటిక్ చిత్రకారుడు, విలియం బ్లేక్ స్నేహితుడూ అయిన హెన్రీ ఫ్యూసిలీ అయితే ఏకంగా షేక్‌స్పియర్ మక్‌బెత్‌ను జర్మన్ భాషలోనికి అనువదించాడు.

మాన్సిక శాస్త్రవేత్త అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్ షేక్‌స్పియర్ సైకాలజీ అని మరీ ముఖ్యంగ హాంలెట్ విషయంలో మానవ తప్పిదాలకు ఉదాహరణలుగా చూపినాడు.

షేక్‌స్పియర్ ఆంగ్ల భాష యొక్క వ్యాకరణం పూర్తిగా ఫిక్స్ చేయకముందు తన విరివైన రచనలు చేసాడు. ఇతని రచనలు ఆధునిక ఆంగ్ల భాష రూపు ఓ కొలిక్కి రావడానికి సాయపడ్డాయి. శామ్యూల్ జాన్సన్ తన A dictionary of the english language అనే పుస్తకంలో ఏ ఇతర రచయితనూఊ కోట్ చెయ్యనన్నిసార్లు కోట్ చేసాడు. with bated heart (వెనిస్ వ్యాపారి), a foregone conclusion (ఒథెల్లో) వంటివి ఆంగ్ల భష దైనందిక జీవనంలో భాగమయినాయి.

విమర్శాత్మక గొప్పతనం

షేక్స్ప్యర్‌కి తన జీవిత కాలంలో ఎటువంటి బిరుదులూ, సన్మానాలూ లభించలేదు, కానీ పలువురు తన జీవిత కాలంలోనే మెచ్చుకున్నారు. 1598 లో క్లెరిక్, రచయిత అయిన ఫ్రాన్సిస్ మియర్స్ ఆనాటి ఆంగ్ల రచయితల్లో హాస్యం, విషాదం లలో బ్రహ్మాండమైన నైపుణ్యం గలవాడని వ్రాసినాడు.

కేంబ్రిడ్జ్‌ లోని సెయింట్ జాన్‌కాలేజీలో పర్న్సాస్ నాటక రచయితలు షేక్స్పియర్ని చాసర్, గోవర్, స్పెన్సర్‌లతో సమ ఉజ్జీగా భావించాడు. మొదతి షేక్‌స్పియర్ ప్రచురణలో బెజ్ జాన్సన్ షేక్స్పియర్ని అప్పటి తరానికి ఆత్మగా, ఆనాటి స్టేజ్‌కి ఆనంద ప్రదాయినిగా, పొగడ్తల గ్కారకుడిగ అభివర్ణించాడు. కాకపోతే మరొక చోట ఇదే జాన్సన్ షేక్‌స్పియర్ తన కళకు సానపట్టాలి అని కూడా చెప్పినాడు.

1660 లో రాజరికాన్ని పున్స్థాపించడం నుండి పదిహేడవ శతాబ్దం చివర వరకూ క్లాసికల్ ఆలోచనలు vogue గా ఉన్నాయి. దీని ఫలితంగా ఆ కాలంలోని విమర్శకులు షేక్‌స్పియర్ రచనలను జాన్ ఫ్లెచర్, బెన్ జాన్సన్ ల తర్వాత స్థాయిగా చెప్పేవారు. ఉదాహరణకు థామస్ రెమర్ షేక్‌స్పియర్ హాస్యాన్నీ, విషాదాన్నీ కలిపి నాటకాలు వ్రాస్తున్నడని విమర్శించాడు. కానీ కవి, విమర్శకుడు అయిన జాన్ డ్రెడెన్ షేక్స్పియర్ని ఉన్నత స్థానంలో నిలబెట్టినాడు. ఇతను "నే ంజాన్సన్ను ఆరాధిస్తాను, కానీ షేక్స్పియర్ని ప్రేమిస్తాను" అని చెప్పినాడు. చాలా దశాబ్దాలు రెయర్ మాటలే ఎక్కువమంది అంగీకరించారు, కానీ పద్దెనిమిదవ శతాబ్దం నాటికి విమర్శకులు షేక్స్పియర్ని అతని దారిలోనే అర్థం చేసుకోవడం ప్రారభించారు. వీరు షేక్స్పియర్ని ఓ సహజ జీనియస్గా గుర్తించారు. ఇతని పనులుపై వివిధ పండితులు చేసిన పరిశోధనలు వ్రాసిన పుస్తకాలు పెరుగుతున్న షేక్‌స్పియర్ ప్రాభవాన్ని మరింత పెంచినాయి. 1765లో శామ్యూల్ జాన్సన్, 1790 లో ఎడ్మండ్ మలోనే వీరిలో ముఖ్యులు. 1800 సంవత్సరానికి షేక్‌స్పియర్ ఆంగ్ల జాతియ కవిగా స్థిరపడినాడు. 18, 19 వ శతాబ్దాలలో ఇతని కీర్తి ప్రతిష్ఠలు విదేశాలలో కూడా వ్యాపించినాయి. వాల్టెయిర్, గోతే, స్టెంథల్, విక్టర్ హూగోలు షేక్స్పియర్‌ను అభిమానించిన రచయితల్లో కొందరు.

రొమాంటిక్ యుగంలో కవి, సాహితీ తర్వవేత్త అయిన శామ్యూల్ టేలర్ షేక్స్పియర్ని కొలెరిడ్జ్ మెచ్చుకున్నాడు. అలాగే ఈ కాలంలోని విమర్శకుడు ఆగస్టు విల్‌హెల్మ్ షెల్గల్ షేక్‌స్పియర్ నాటకాలను జర్మన్ భాషలోనికి in the spirit of german రొమాంటిసిజంతో అనువదించాడు.

షేక్స్‌పియర్ గురించిన భావనలు

రచయితగా

షేక్‌స్పియర్ మరణించిన 150 సంవత్సరాల తర్వాత, అతని రచనలు నిజంగా షేక్స్పియరే వ్రాసినాడా! అనే అనుమానాలు మొదలయినాయి. ఫ్రాన్సిస్ బకాన్, క్రిష్టోఫర్ మార్లోవే, ఎడ్వర్డ్ డి వెరే, ఆక్స్ఫర్డ్ యొక్క ఎర్ల్ వంటి చాలా పేర్లు పరిశీలించబడినాయి. కానీ ఈ సిద్దాంతాలన్నీ విద్వాంసుల వేత కొట్టివేయబడినాయి. కాకపోతే ఆక్స్ఫర్డ్ థీయరీ మాత్రం 21 వ శతాబ్దంలో కూడా కొంత ప్రాముఖ్యం వహించింది.

మతం

కొంతమంది పండితుల ప్రకారం షేక్‌స్పియర్ కుటుంబం కాథలిక్ మతావలంబీకులు, షేక్‌స్పియర్ కాలంలో కాథలిక్ మతాన్ని అవలంబించడం చట్టవ్యతిరేకం. ఈ ఆధారం, మరికొన్ని ఆధారాలను అనుసరించి షేక్‌స్పియర్ కూడా కాథలిక్ మతావలంబీకుడని చెప్తారు. షేక్‌స్పియర్ యొక్క అమ్మ మేరీ ఆర్డన్ కాథలిక్ కుటుంబం నుండి వచ్చినది అని చెప్పడానికి గట్టి ఆధారాలు ఉన్నాయి. అలాగే షేక్‌స్పియర్ నాన్న జాన్ షేక్‌స్పియర్ చేవ్రాలు చేసిన కాథలిక్ విశ్వాస పత్రం మరొక గట్టి ఆధారం. ఈ ఆధారం 1757లో హెలెనీ వీధిలో అతని వ్యవసాయపు ఇంటిలో లభించింది. కొంతమంది పండితులు ఈ పత్రం విశ్వసనీయతను అనుమానిస్తారు. 1591లో అధికారులు జాన్ షేక్‌స్పియర్ చర్చికి ఋణం గురించిన విచారణా భయంతో హాజరు కాలేదని వ్రాసినారు. ఇలా ఋణం గురించిన విచారణాభయం ఓ సాధారణ కాథలిక్ వంక. 1606లో షేక్‌స్పియర్ కూతురు సుసన్నా స్ట్రాట్‌ఫర్డ్లో ఈస్టర్ సమావేశానికి హాజరు కాలేదని వ్రాయబడింది. ఇహపోతే షేక్‌స్పియర్ రచనల్లో అతని కాథలిక్ మతాభిమానానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ఆధారాలు లభిస్తున్నాయి.

శృంగార జీవితం

షేక్‌స్పియర్ శృంగార జీవితానికి (సంసార జీవితం?) సంబంధించి కేవలం కొన్ని వివరాలు మాత్రమే లభిస్తున్నాయి. 18 సంవత్సరాల వయసులో 26 సంవత్సరాల వయసుగల అన్నేను పెళ్ళి చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. సుసన్నా వారి మువ్వురు సంతానంలో మొదటి కుమార్తె. పెళ్ళి తర్వాత ఆరునెళ్ళకు అనగా 1583 మే 26లో పుట్టినది. ఆ తర్వాత షేక్‌స్పియర్ చతుర్పాద కవితలను అతనికి మరో యువతిపైగల ప్రేమకు సాక్ష్యంగా చూపిస్తారు, కాని ఇతరులు మాత్రం అది ప్రేమ కాదు స్నేహం మాత్రమే అని చెప్తారు. అదే సమయంలో అతని నల్లని యువతిపై రచించిన 26 చతుర్పాద కవితలను ఓ వివాహిత స్త్రీతో ఈతనికి గల సంబంధమును చెప్తాయంటారు.

రచనల జాబితా

నాటకాల వర్గీకరణ

1623వ సంవత్సరంలోని మొదటి ముద్రణలో మొత్తం 36 నాటకాలు ముద్రించబడినాయి. ఈ ముద్రణలో మొత్తం నాటకాలను మూడు రకాలుగా వర్గీకరింఛినారు. అవి: హాస్యం, విషాదం, చారిత్రకాలు. షేక్‌స్పియర్ తన రచనల్లోని ప్రతి పదమూ అతనే వ్రాయలేదు, ఆ కాలంలో సాధారణంగా జరిగినట్టే ఇతని నాటకాలు ఇతరులతో కలిసి వ్రాసిన చిన్నెలు కంపిస్తాయి. ప్రథమ సంపుటిలో రెండు నాటకాలు ముద్రించబడలేదు. ......ఈ రెండూ కూడా ఇప్పుడు షేక్‌స్పియర్ రచనలుగా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు వీటిలో సింహభాగం షేక్‌స్పియర్ వ్రాసినట్టు పండితులు విశ్వసితున్నారు. ప్రథం సంపుటిలో ఎటువంటి కవితలూ కలపబడలేదు.

19 వ శతాబ్ది చివర్లో ఎడ్వర్డ్ డౌడెన్ చివరి నాలుగు హాస్య రస ప్రధాన నాటకాలను రొమాన్సెస్ గా వర్గీకరించాడు. ఈ నాలుగు నాటకాలనూ ఇప్పుడు అందరూ విషాదాస్యాలు అని పిలుస్తున్నారు. అప్పుడప్పుడూ రొమాన్సెస్ అని కూడా పిలుస్తారు. ఈ దిగువ జాబితాలో ఈ విషాదాస్యాలను * గుర్తుతో సూచించడమైనది. 1896లో ఫెడ్రిక్ యస్ బోస్ సమస్యా నాటకాలు అని మరో వర్గాన్ని నిష్పాదించాడు. ఈ వర్గంలో నాలుగు నాటకాలు చేర్చాడు. 1.2.3.4.....ఈ పదంపై చాలా వాద ప్రతివాదాలు జరిగినాయి. నేడు ఇతర నాటకాలకి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ దిగువ జాబితాలో సమస్యా నాటకాలను ()గుర్తుతో సూచించడమైనది. షేక్‌స్పియర్ పాక్షికంగా వ్రాసిన నాటకాలు () గుర్తుతో సుచించడమైనది. ఇతర రచనలు షేక్‌స్పియర్ వ్రాసిన వాటిగా చెప్పబడుతున్నప్పటికీ అవి అన్నీ అలభ్యం.

రచనల జాబితా

మూస:Earlybard

పాదపీఠికలు

మూలాలు

మరికొంత సమాచారం

  • Schoenbaum, S. (1991). Shakespeare's Lives. Oxford: Oxford University Press. ISBN 0198186185.
  • Greenblatt, Stephen (2005). Will in the World: How Shakespeare Became Shakespeare. London: Pimlico. ISBN 0-7126-0098-1.
  • Honan, Park (1998). Shakespeare: A Life. Oxford; New York: Oxford University Press. ISBN 0-19-811792-2.
  • Wells, Stanley, et al (2005). The Oxford Shakespeare: The Complete Works, 2nd Edition. Oxford: Oxford University Press. ISBN 0-19-926717-0.

బయటి లింకులు

విలియం షేక్‌స్పియర్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

విలియం షేక్‌స్పియర్ జీవితంవిలియం షేక్‌స్పియర్ లండన్ , నాటక జీవితంవిలియం షేక్‌స్పియర్ మరణంవిలియం షేక్‌స్పియర్ నాటికలువిలియం షేక్‌స్పియర్ ప్రదర్శనలువిలియం షేక్‌స్పియర్ పుస్తక ప్రచురణలువిలియం షేక్‌స్పియర్ కవితలువిలియం షేక్‌స్పియర్ శైలి శిల్పంవిలియం షేక్‌స్పియర్ ప్రభావాలువిలియం షేక్‌స్పియర్ విమర్శాత్మక గొప్పతనంవిలియం షేక్‌స్పియర్ షేక్స్‌పియర్ గురించిన భావనలువిలియం షేక్‌స్పియర్ రచనల జాబితావిలియం షేక్‌స్పియర్ పాదపీఠికలువిలియం షేక్‌స్పియర్ మూలాలువిలియం షేక్‌స్పియర్ మరికొంత సమాచారంవిలియం షేక్‌స్పియర్ బయటి లింకులువిలియం షేక్‌స్పియర్1564161623 ఏప్రిల్en:Sonnetsఆంగ్లముఇంగ్లాండుఇంగ్లీషుఏప్రిల్ 26కవినటుడునాటకాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

వింధ్య విశాఖ మేడపాటిశివాత్మికరిషబ్ పంత్ప్రేమమ్పూర్వాషాఢ నక్షత్రముచతుర్వేదాలుపరీక్షిత్తుచోళ సామ్రాజ్యంసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఖండంమహామృత్యుంజయ మంత్రందేవదాసిమర్రిగన్నేరు చెట్టునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసజ్జా తేజజీమెయిల్తెనాలి రామకృష్ణుడునవధాన్యాలుతెలుగు కులాలుపమేలా సత్పతివెలిచాల జగపతి రావుపెరిక క్షత్రియులుదగ్గుబాటి పురంధేశ్వరిలక్ష్మివర్షం (సినిమా)బతుకమ్మ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసత్యనారాయణ వ్రతంకమల్ హాసన్ నటించిన సినిమాలుభారత ఆర్ధిక వ్యవస్థమార్కస్ స్టోయినిస్ఉత్తర ఫల్గుణి నక్షత్రమురాధ (నటి)జ్ఞానపీఠ పురస్కారంహీమోగ్లోబిన్శ్రీరామనవమిహిందూధర్మంపెళ్ళి చూపులు (2016 సినిమా)తెలుగు అక్షరాలుయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంసామజవరగమనపాములపర్తి వెంకట నరసింహారావుఫ్యామిలీ స్టార్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావిభీషణుడుహను మాన్బంగారు బుల్లోడుటంగుటూరి ప్రకాశంకిలారి ఆనంద్ పాల్కాప్చాతెలుగు సినిమాలు 2024నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిఅనురాధ శ్రీరామ్మామిడివై.యస్.అవినాష్‌రెడ్డిH (అక్షరం)అనూరాధ నక్షత్రంసచిన్ టెండుల్కర్పూరీ జగన్నాథ దేవాలయంఇందిరా గాంధీఅశోకుడుదొమ్మరాజు గుకేష్అహోబిలంవిజయ్ దేవరకొండఆవుపర్యాయపదంఇంటర్మీడియట్ విద్యనితిన్విశాఖపట్నంభారతీయ జనతా పార్టీస్వామి వివేకానందకర్ణాటకఅల్లూరి సీతారామరాజుతెలంగాణసుందర కాండరామ్ చ​రణ్ తేజ🡆 More