విటమిన్

విటమిన్లు (ఆంగ్లం: Vitamins) జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు.

ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి 'vitamines' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని 'vitamins' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తిప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కొన్ని విటమిన్లు సహ అజము (Coenzymes) లుగా పనిచేస్తాయి.

విటమిన్
కూరగాయలు, పండ్లు విటమిన్లకు ప్రధానమైనవి.

మానవులలో విటమిన్లు

మానవులలో 13 విటమిన్లు గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.

  • 1. కొవ్వులలో కరిగే విటమిన్లు: A, D, E, K విటమిన్లు కొవ్వులలో కరిగేవి. ఇవి శోషణం (absorption) చెందడానికి పైత్యరసం (bile) అవసరం. ఎందుకనగా ఆహారంలో గల క్రొవ్వులు జీర్ణం కావడానికి పైత్యరస లవణాలు తోడ్పడతాయి. జీర్ణమయిన కొవ్వులలో కరిగి ఈ విటమిన్ లు శోషణ ప్రక్రియ ద్వారా వివిధ భాగాలకు అందుతాయి.
  • 2. నీటిలో కరిగే విటమిన్లు: B, C విటమిన్లు నీటిలో కరిగేవి. ఇవి పేగులనుండి నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి.
విటమిన్ పేరు రసాయన నామం Solubility: ఎందులో కరుగుతుంది? Recommended dietary allowances: రోజువారీ మోతాదు
(male, age 19–70)
Deficiency disease; మోతాదు తగ్గితే వచ్చే జబ్బు Upper Intake Level
(UL/day)
Overdose disease; మోతాదు మించితే వచ్చే జబ్బు
విటమిన్ ఎ Retinoids
(retinol, retinoids
and carotenoids)
కొవ్వులు 900 µg రేచీకటి and
Keratomalacia night blindness, xerapthalmia,
3,000 µg Hypervitaminosis A
విటమిన్ బి1 థయామిన్ నీరు 1.2 mg బెరిబెరి, N/D ?
విటమిన్ బి2 రిబోఫ్లావిన్ నీరు 1.3 mg Ariboflavinosis, CHELOSIS, GLOSSITIS N/D ?
విటమిన్ బి3 నికోటినిక్ ఆమ్లం నీరు 16.0 mg పెల్లాగ్రా 35.0 mg "Niacin flush"
విటమిన్ బి5 పాంటోథెనిక్ ఆమ్లం నీరు 5.0 mg Paresthesia burning of foot N/D ?
విటమిన్ బి6 పైరిడాక్సిన్ నీరు 1.3-1.7 mg రక్తహీనత 100 mg Impairment of proprioception
విటమిన్ బి7 బయోటిన్ నీరు 30.0 µg None identified N/D ?
విటమిన్ బి9 ఫోలిక్ ఆమ్లం నీరు 400 µg Deficiency during pregnancy is associated with birth defects, such as neural tube defects 1,000 µg ?
విటమిన్ బి12 సయనో కోబాలమిన్ నీరు 2.4 µg పెర్నిషస్ (ఆడంబరం లేకుండా హాని చేసే) రక్తహీనత N/D ?
విటమిన్ సి ఎస్కార్బిక్ ఆమ్లం నీరు 90.0 mg శీతాదం (స్కర్వీ) 2,000 mg Refer to Vitamin C megadosage
విటమిన్ డి ErgoCalciferol and
Cholecalciferol
కొవ్వులు 5.0 µg-10 µg Rickets and Osteomalacia 50 µg Hypervitaminosis D
విటమిన్ ఇ టోకోఫెరాల్ and
టోకోట్రీనాల్
కొవ్వులు 15.0 mg Deficiency is very rare; mild hemolytic anemia in newborn infants. 1,000 mg ?
విటమిన్ కె నాప్థోక్వినోన్ Phylloquinone కొవ్వులు 120 µg రక్తస్రావం N/D ?

రంగుల్లో పోషకాలు

రంగుల ఆహారము చూసేందుకు అందముగా ఉండడమేకాక ఎన్నో పోషకాలు కలిగి ఉండి ఆరోగ్యాన్నిస్తుంది. ఏయే రంగుల ఆహారములో ఏయే పోషకాలు ఉంటాయో చూడండి:

తెలుపు : పాలలా మెరిసే వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాలు వంటి తెలుపురంగు ఆహారములో 'ట్యూమర్ల'నుంచి మనల్ని కాపాడే 'అల్లిసన్' ఉంటుంది. ఇక పుట్టగొడుగుల్లో వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు, కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న 'ప్లావయినాడ్స్' ఉన్నాయి .

ఎరుపు, బచ్చలిపండు రంగు (పర్పుల్)  : ఈ రంగులలో ఉండే ఆహారములో 'యాంథోసయానిన్స్' ఉంటాయి, ఇవి శక్తివంతమైన ప్రతిభస్మీకరులు (యాంటిఆక్సిడెంట్లు) గాను, రక్తము గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి. కాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి. ఉదా: టమాటో, ముదురు పర్పుల్ రంగుగల ద్రాక్ష మొదలగునవి.

పసుపు : ఈ రంగుతో ఉన్న ఆహారము రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరంజ్ రంగులో ఉండే ఆహారములో 'బీటాక్రిప్టాక్సాన్థిన్ (beta cryptaxanthin) అనే ప్రతిభస్మీకరి ఉంటుంది. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే 'విటమిన్ -సి- ఉంటుంది. ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది, కళ్లకు రక్షణ కూడా ఇస్తుంది.

ఆకుపచ్చరంగు : ఈ రంగులో ఉన్న ఆహారములో ఇనుము (ఐరన్), ఖటికం (కాల్షియం), ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను సరిచేస్తుంది. కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాన్సర్ తో పోరాడే కాలేయ అజముల (లివర్ ఎంజైముల) ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

బ్రౌన్, ఆరంజ్ : ఈ రంగు ఆహారములో విటమిన్ -ఎ- ఎక్కువగా ఉంటుంది, కంటి జబ్బులు రాకుండా 'బీటాకెరోటీన్లు' కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉండేందుకు దోహదము చేస్తాయి.

విటమిన్లు - చెడు ప్రభావము

మనిషి ఆరోగ్యముగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరమెంతోవుంది. విటమిన్ల లోపము వలన ఎన్నో వ్యాధులు వచ్చినా సదరు లోపాన్నిపూరించినట్లైతే ఆయా వ్యాధులు ఇట్టే మాయమవుతాయి. అయితే వచ్చిన చిక్కేమిటంటే విటమిన్ల లోపాలను పూరించే ఆదుర్దాలో విటమిన్లు పుష్కలముగా ఉండే తాజా పండ్లు, ఆకు కూరలకు బదులు ఏకంగా విటమిన్ గుళికలు మింగడము వల్ల ప్రయోజనానికి బదులు కీడే ఎక్కువ జరుగుతుందని ఐరోపా శాస్త్రజ్ఞులు అంటున్నారు. డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన 'గోరన్ బెలకోవిచ్' నాయకత్వములో జరిగిన పరిశోధనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, బీటాకెరోటిన్లను గుళికల రూపంలో తీసుకుంటే ఏకంగా ప్రాణహాని సంభవిస్తుందని తేలింది. అయితే విటమిన్ సి, సెలీనియం లను ఈవిధంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదన్నారు. గతంలో కొన్ని పరిశీలనలు విటమిన్ గుళికలలో వుండే యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపాయి. ప్రస్తుత పరిశోధనా ఫలితాలు అందుకు విరుద్ధముగా ఉన్నాయి. ఒక సందర్భంలో 180,938 మంది ప్రజలపై చేసిన పరిశోధనల వల్ల 5 శాతము ప్రజలు విటమిన్ గుళికల వలన మరణించేరని తేలింది. వివిధ రకాల విటమిన్లు వేరు వేరుగా పరిశీలించినపుడు,

  • బీటా కెరోటిన్ వల్ల 7 శాతము
  • విటమిన్ A వల్ల 16 శాతము
  • విటమిన్ E వల్ల 4 శాతము మంది మరణించారు అని పరిశోధనల వల్ల తెలిసింది. సెలీనియం వల్ల 10 శాతము మరణపు రేటు తగ్గిందని గమనించారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

విటమిన్ మానవులలో లువిటమిన్ రంగుల్లో పోషకాలువిటమిన్ లు - చెడు ప్రభావమువిటమిన్ ఇవి కూడా చూడండివిటమిన్ మూలాలువిటమిన్ వనరులువిటమిన్1912ఆంగ్లంజీవక్రియవిటమిన్లు

🔥 Trending searches on Wiki తెలుగు:

విష్ణువుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుహైదరాబాదుఏ.పి.జె. అబ్దుల్ కలామ్చంద్రుడు జ్యోతిషంపునర్వసు నక్షత్రముక్రియ (వ్యాకరణం)రజాకార్మదర్ థెరీసాజీలకర్రజయలలిత (నటి)బొత్స సత్యనారాయణనువ్వు వస్తావనితొలిప్రేమప్రశాంతి నిలయంసత్య సాయి బాబాయాదవబ్రాహ్మణ గోత్రాల జాబితాఅక్షయ తృతీయసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంవాల్మీకిభాషా భాగాలుకొంపెల్ల మాధవీలతపరీక్షిత్తుశోభితా ధూళిపాళ్లపాడ్యమిజానకి వెడ్స్ శ్రీరామ్పులివెందుల శాసనసభ నియోజకవర్గందశరథుడుఉప్పు సత్యాగ్రహంతెలంగాణనీతి ఆయోగ్ఇన్‌స్టాగ్రామ్చదరంగం (ఆట)కాశీక్వినోవాశ్రీముఖిఅంగుళంపామునర్మదా నదిజ్ఞానపీఠ పురస్కారంతెలుగు వికీపీడియాశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముతెలుగు సినిమాలు 2023జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సౌర కుటుంబంవసంత ఋతువుదెందులూరు శాసనసభ నియోజకవర్గంఎస్. జానకిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఅండాశయముఆంధ్రప్రదేశ్ చరిత్రభారతదేశంప్రధాన సంఖ్యకర్కాటకరాశిరాజమహల్శుక్రాచార్యుడుకడియం కావ్యగన్నేరు చెట్టుఎనుముల రేవంత్ రెడ్డిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంబాలకాండభారతదేశంలో మహిళలుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపంచారామాలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితిథిపిఠాపురంతీన్మార్ మల్లన్నఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభారత రాజ్యాంగ ఆధికరణలుజవహర్ నవోదయ విద్యాలయంతెలంగాణ ప్రభుత్వ పథకాలుజూనియర్ ఎన్.టి.ఆర్PHదసరాతెలంగాణ జిల్లాల జాబితా🡆 More