మేక

మేక (ఆంగ్లం Goat) ఒక రకమైన జంతువు.

ఈ మేకలు ఆసియా, ఐరోపా దేశపు కొండ మేకను పెంపుడు జంతువుగా మార్పుచెందినవి. ఇవి బొవిడే కుటుంబానికి చెందినవి, గొర్రె, జింక లకు సంబంధించిన కాప్రినే ఉపకుటుంబం లోనివి. ఇవి నెమరువేయు జంతువులు.

మేక
మేక
Conservation status
పెంపుడు జంతువు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
ఆర్టియోడాక్టిలా
Family:
బొవిడే
Subfamily:
కాప్రినే
Genus:
Species:
C. aegagrus
Subspecies:
C. a. hircus
Trinomial name
Capra aegagrus hircus

మేకలలో సుమారు 300 సంకర జాతులున్నాయి.

మేకలు అతి పుతాతన కాలం నుండి మానవుడు పెంచుకుంటున్న జంతువులు. వేల సంవత్సరాల నుండి వీటిని పాలు, మాంసం, ఊలు, తోలు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నాయి. మేక మాంసాన్ని మటన్ అంటారు. నిక్కచ్చిగా చెప్పాలంటె chevon చెవన్ అని అంటారు.

చరిత్ర

మేకలు భారత ఉపఖండంలో సుమారు 9000 BCE నుండి పెంపుడు జంతువులుగా వాడకంలో ఉన్నాయి. ఇవి సుమారు 10,000 సంవత్సరాల పుర్వం ఇరాన్ లోని జాగ్రోస్ పర్వతాలలో పెంచుకున్నట్లు తెలుస్తుంది. నియోలిథిక్ కాలపు వ్యవసాయదారులు వీటిని పాలు, పేడ, మాంసం, ఎముకలు, జుత్తు మొదలైన వాటి విస్తృత ఉపయోగాల కోసం పెంచుకొనేవారు. పెంపుడు మేకలు మందలలో కొండ చరియల్లో మేతకోసం సంచరిస్తాయి.

మేకల ఉపయోగాలు

మేకలు మానవులకు బాగా ఉపయోగకరమైన జంతువులు. వీటి నుండి పాలు, మాంసం, తోలు మొదలైనవి లభిస్తాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేదవారికి వీటిని దానమిస్తాయి. ఎందుకంటే పశువుల కంటే వీటిని పెంచడం చాలా సులువు, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, విస్తృత ఉపయోగాలు ఉన్నాయి.

మేక పేగుల నుండి శస్త్రచికిత్సలో ఉపయోగించే 'కేట్ గట్' అనే దారాన్ని తయారుచేస్తారు. మేక కొమ్ముల నుండి చెంచాలు తయారుచేయవచ్చును.

మేక 
ఒక బుట్టలో నిలబడిన మేక
మేక 
బోర్ మేక - మాంసం కోసం ప్రసిద్ధిచెందినది.
మేక 
మేక కన్ను, సమాంతర కనుగుడ్డును చూడవచ్చు

మేక మాంసం

మేక మాంసాన్ని కారీబియన్, ఆసియా, భారతదేశాలలో మటన్ అంటారు. మేక మాంసం కూర, వేపుడు మొదలైన వివిధ రకాలుగా వంటలలో ఉపయోగిస్తారు. భారతదేశంలో అన్నంలో కలిపి తయారుచేసే బిర్యానీ రుచికి చాలా ప్రసిద్ధి. మేక మాంసం సామాన్యంగా తక్కువ వేడిలో, నెమ్మదిగా వండాల్సి ఉంటుంది. జెర్కీ మేక దీనికి ప్రసిద్ధిచెందినది.

కోడి మాంసంతో పోలిస్తే మేక మాంసంలో కొవ్వు, కొలెస్టిరాల్ తక్కువగాను, ఖనిజ లవణాలు ఎక్కువగాను ఉంటాయి. మేకలు సన్నంగా వుండడానికి కారణం, ఇవి సాధారణంగా లావెక్కవు.

మాంసమే కాకుండా మేక శరీరంలోని మెదడు, కాలేయం వంటి ఇతర భాగాలు కూడా వండుకొని తినవచ్చును. మేక తల మాంసం కొందరికి ప్రత్యేకమైన ఇష్టం.

పాల ఉత్పత్తులు

మేక 
మేక పొదుగు నుండి పాలు పితకుతున్న దృశ్యం

కొన్ని రకాల మేకలను పాలు, ఇతర సంబంధ ఉత్పత్తుల కోసం పెంచుతారు. మేక పాలు పితకగానే తాగవచ్చును, కానీ బాక్టీరియా సంబంధ వ్యాధుల నుండి రక్షణ కోసం పాశ్చురైజేషన్ చేయడం మంచిది. ఒక విధమైన ఘాటు వాసన కలిగే మేక పోతుని మంద నుండి వేరుచేయకపోతే మేకపాలు వాసన కలిగి ఉంటాయి. మేక పాలు నుండి వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ మొదలైనవి తయారుచేయవచ్చును. మేక పాలలో ఆవుపాల మాదిరిగా కాక నురుగు పైకి తేలకుండా పాలతో కలిసిపోతుంది.

మేక 
భారత దేశపు దేశవాళీ మేకలు.. మేకల మంద

ఆవు పాలు పడని వారికి మేక పాలు ఆహారంలో ఉపయోగించవచ్చును. అయితే మేక పాలలో కూడా లాక్టోజ్ ఉండటం మూలంగా లాక్టోజ్ అలర్జీ ఉన్నవారు మాత్రం ఇవి ఉపయోగించకూడదు.

చాలా మేకలు ఇంచుమించు 10 నెలల పాటు 3-5 లీటర్లు పాలిస్తాయి. ఈ పాలలో సుమారు 3.5 శాతం వెన్న ఉంటుంది. మేక పాల నుండి తీసిన వెన్న తెల్లగా ఉంటుంది. పసుపుపచ్చని బీటా కెరోటిన్ వర్ణ హీనమైన విటమిన్ A మారిపోవడం దీనికి కారణం.

ఊలు

మేక 
ఊలు కోసం పెంచే అంగోరా మేక
జపాన్లో గడ్డి మేస్తున్న మేకలు.

కొన్ని మేకలను ఊలు కోసం పెంచుతారు. చాలా మేకలకు శరీరం మీద మెత్తని వెండ్రుకలు ఉంటాయి. కాష్మీరి మేక నుండి కాష్మీరి ఊలు తయారౌతుంది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన ఉన్ని. ఇది మెత్తగా, సన్నగా ఉంటుంది.

అంగోరా మేకలకు పొడవైన రింగుల్లా తిరిగే జడలు కట్టే మోహైర్ ఉంటుంది. ఈ వెండ్రుకలు 4 అంగుళాల పొడవుండవచ్చును. ఈ రకమైన మేకల నుండి పైగోరా, నిగోరా అనే సంకరజాతి మేకలను తయారుచేశారు.

ఊలు తీయడానికి మేకలను చంపాల్సిన అవసరం లేదు. కాష్మీరి మేక నుండి ఊలు దువ్వితే వస్తుంది; అదే అంగోరా మేకల నుండి వెంట్రుకలను కత్తిరించాల్సి వస్తుంది. అంగోరా మేకల నుండి సంవత్సరానికి రెండు సార్లు ఊలు వస్తే, కాష్మీరి మేకల నుండి ఒక్కసారే వస్తుంది.

ఈ విధంగా తీసిన ఊలును చలి ప్రదేశాలలో ఉపయోగించే దుస్తులు తయారుచేయడానికి ఉపయోగిస్తారు.

దక్షిణ ఆసియా దేశాలలో కాష్మీరి ఊలును పశ్మినా అంటారు. "పశ్మినా" అంటే (పర్షియా భాషలో "fine wool" అని అర్ధం. ఈ మేకలను పశ్మినా మేకలు అంటారు. ఈ రకమైన మేకలు కాష్మీర్, లడక్ ప్రాంతానికి చెందినవి కావడం మూలంగా వీటి ఊలుకు పశ్చిమ దేశాలలో కాష్మీరి అని పేరు వచ్చింది. ఎంబ్రాయిడరీ చేసిన పశ్మినా షాల్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి.

మేకల పెంపకం

భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతిప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడితో లాభదాయక వృత్తి.

వ్యాధులు

వర్షాకాలంలో నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యాధి) వస్తుంది. వ్యాధి సోకితేనోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.

మూలాలు

బయటి లింకులు

Tags:

మేక చరిత్రమేక ల ఉపయోగాలుమేక ల పెంపకంమేక వ్యాధులుమేక మూలాలుమేక బయటి లింకులుమేక

🔥 Trending searches on Wiki తెలుగు:

మానవ శరీరముఅక్కినేని నాగార్జునసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంఅష్ట దిక్కులుస్వలింగ సంపర్కంపాండవులుప్రధాన సంఖ్యఋగ్వేదంకాకతీయుల శాసనాలునారా చంద్రబాబునాయుడుశుక్రుడు జ్యోతిషంభారతదేశ ఎన్నికల వ్యవస్థజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిప్రియమణిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలుగు భాష చరిత్రభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాకేశినేని శ్రీనివాస్ (నాని)విరాట్ కోహ్లివై.యస్.అవినాష్‌రెడ్డిమహాభారతంభారతీయ రైల్వేలుబ్రహ్మంగారి కాలజ్ఞానంనవగ్రహాలుమహేశ్వరి (నటి)శోభితా ధూళిపాళ్లద్రౌపదికాజల్ అగర్వాల్వరిబీజంమదర్ థెరీసాకుంభరాశిసంధిభారతరత్నకడియం కావ్యహనుమజ్జయంతిధన్‌రాజ్ధనిష్ఠ నక్షత్రముషర్మిలారెడ్డివందేమాతరంప్రేమంటే ఇదేరాసుభాష్ చంద్రబోస్విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాసమాచార హక్కుకులంశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంవిమానందేవదాసిఆర్టికల్ 370హిందూధర్మంరాబర్ట్ ఓపెన్‌హైమర్పసుపు గణపతి పూజమౌన పోరాటంకీర్తి సురేష్దశరథుడువిజయ్ దేవరకొండవినుకొండదీపక్ పరంబోల్రెండవ ప్రపంచ యుద్ధంమొఘల్ సామ్రాజ్యంక్లోమముతిరువణ్ణామలైపొంగూరు నారాయణవిశాఖపట్నంగుంటకలగర2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుచరవాణి (సెల్ ఫోన్)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామప్ప దేవాలయంఅక్కినేని అఖిల్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుసోనియా గాంధీవరలక్ష్మి శరత్ కుమార్శ్రీముఖిఎనుముల రేవంత్ రెడ్డిఇతర వెనుకబడిన తరగతుల జాబితామీనరాశి🡆 More