పూసల, బలిజ, వాల్మీకి, బోయ, సగర (ఉప్పర), భట్రాజు లకు ప్రత్యేక ఫెడరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది (13.2.2009)
వెనుకబడిన కులాల జాభితాలో చేర్చాలని 75 కులాల నుంచి అందిన పత్రాలు పరిశీలనలో ఉన్నాయని వెనుకబడిన తరగతుల కమిషను తన నివేదికలో తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషను 2008-09 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికను 2010 జూలై 15 నాడు శాసన సభకు సమర్పించింది.
ఆం.ప్ర.వె.త.కమిషనుకు గత రెండేళ్ళ కాలంలో 107 కులాలను వె.త. జాబితాలో చేర్చాలని పత్రాలు వచ్చాయి. ఇందులో 32 కులాలను వె.త. కమిషను సిఫార్సు మేరకు ఆం.ప్ర. ప్రభుత్వము వె.త. జాబితాలో చేర్చింది.
బీసీ - ఎ జాబితాలో 'వంశ్ రాజ్', 'పిచ్చిగుంట్ల' ను కలిపింది. తూర్పు కాపులు, గాజుల కాపులకు సంబంధించి కొన్ని జిల్లాలలో మాత్రమే బీసీ జాబితాలో ఉన్నరు. జిల్లాల పరిమితిని తొలగించాలని, ఆ కులాల నుంచి వచ్చిన కోరిక మేరకు, వె.త. కమిషను పరిశీలించి సిఫార్సు చేసింది. ఈ విషయం ఆం.ప్ర. ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
వె.త కులాల జాబితాలోని ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి మార్చాలని 35 పత్రాలు వె.త.కమిషనుకి అందాయి.
బీసీ-డి జాబిగాలో ఉన్న 'ముదిరాజ్', 'ముతరాసి', 'తెనుగోళ్ళ', 'పూసల ' కులాలను 'బీసీ - ఎ' జాబితాలో చేర్చాలని సిప్ఫార్సు చేయడంతో ఆం.ప్ర. ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశం 'ఉన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు)లో పెండింగ్ లో ఉంది.
'బీసీ-డి' జాబితాలో ఉన్న 'మాలి' కులానికి సమానమైన అర్ధం ఇచ్చే 'బారె', 'బరాయి', 'మరార్', 'తంబోలి'లను ఒకే క్రమ సంఖ్యలో చేర్చింది.
వె.త. కమిషను సిఫార్సు చేసినా,'కళింగ కోమటి' కులాన్ని, ప్రభుత్వం వె.త.జాభితాలో చేర్చలేదు.
'మురళీధర రావు కమిషను' ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వె.బ. తరగతుల బాగోగుల గురించి వేసింది. ఈ కమిషను వె.బ. తరగతుల గురించి పూర్తిగా పరిశీలించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
'మండల్ కమిషన్' ను కేంద్ర ప్రభుత్వము (ఆనాటి జనతా ప్రభుత్వం) భారతదేశంలోని వెనుక బడిన కులాల రిజర్వేషన్లు గురించి పరిశిలించమని నియమించింది. మండల్ కమిషను, ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగాలలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం వెనుకబడినకులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని.
అరుణ్ శౌరీ (ఒ.బి.సి)లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడాన్ని శౌరీ వ్యతిరేకించడం పత్రిక సంపాదక వర్గంలో .
రిజర్వేషన్లు 50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండల్ కమిషన్ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలని, తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడులో 69 శాతం, కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.
కాళింగులు. 2011 మార్చి 8 నాటికి పలు వెనుకబడిన కులాలను ఉమ్మడి జాబితాలోకి చేరుస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జాబితాలో వేర్వేరుగా ఉన్న కులాలను తాజాగా ఒకే కేటగిరిలోకి చేర్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళింగ కులస్తులు ఒకే గొడుగు కిందకు రానున్నారు. వీరందరినీ ఒకే తరగతిగా పరిగణిస్తారు. దీని ప్రకారం పందిర కాళింగ, కింతలి కాళింగ, బోరగాన కాళింగ కులస్తులు కాళింగులుగా కొనసాగుతారు. జిల్లాలో 1.44 లక్షల మంది కింతలి కాళింగ, 38 వేల మంది బోరగాన కాళింగులు, ఓటర్లుగా ఉన్నారు . కింతలి కాళింగులు అత్యధికంగా ఆమదాలవలస, పొందూరు, టెక్కలి, సంతబొమ్మాలి, నందిగాం, పలాస, సరుబుజ్జిలి, తదితర ప్రాంతాల్లో ఉన్నారు. బోరగాన కాళింగులు కవిటి, ఇచ్చాపురం, సోంపేట, గార, వజ్రపు కొత్తూరు, మందస తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఉప కులాల వారు కూడా రిజర్వేషన్ల పరంగా ప్రయోజనం పొందుతారు. కేంద్రం నిర్ణయంతో 1.82 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది.
చాకలి. 2011 మార్చి 8 నాటికి పలు వెనుకబడిన కులాలను ఉమ్మడి జాబితాలోకి చేరుస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది . కేంద్ర జాబితాలో వేర్వేరుగా ఉన్న కులాలను తాజాగా ఒకే కేటగిరిలోకి చేర్చారు. 2011 మార్చి 8 శ్రీకాకుళం జిల్లాల్లో 32 వేల మంది చాకలి కులస్తులు ఓటర్లుగా ఉన్నారు చాకలి కులస్తులు రజిత జాబితాలో ఉంటారు.
గ్రూప్. ఏ (ఆదిమ తెగలు, విముక్త జాతి, సంచార, సెమీ సంచార తెగలు
This article uses material from the Wikipedia తెలుగు article ఇతర వెనుకబడిన తరగతుల జాబితా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.