కొలంబియా

Francis, John Michael (2007).

Invading Colombia: Spanish accounts of the Gonzalo Jiménez de Quesada expedition of conquest Vol. 1. Penn State Press. ISBN 9780271029368. కొలంబియా (/kəˈlʌmbiə/ kə-LUM-biə or /kəˈlɒmbiə/ kə-LOM-biə; Spanish: [koˈlombja]), (ఆంగ్లం Colombia), అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా, (మూస:Audio-es), దక్షిణ అమెరికా లోని వాయువ్యభాగాన గల ఒక దేశం. దీని తూర్పున వెనుజులా, బ్రెజిల్; దక్షిణాన ఈక్వెడార్, పెరూ; ఉత్తరాన కరీబియన్ సముద్రం; దీని వాయవ్యంలో పనామా;, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. దేశసముద్రతీర సరిహద్దులను కోస్టారీకా,నికరాగ్వా,హోండురాస్,జమైకా,హైతి, డోమినికన్ ఋఇపబ్లిక్‌లతో పంచుకుంటుంది. కొలంబియా రిపబ్లిక్‌లో 32 శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కొలంబియాలో ఉన్న 30 శాఖలలో ముందుగా స్థానికజాతి ప్రజలు నివసించారు. వీరిలో అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన ప్రజలలో మూయిస్కా, క్యుయింబయా, టైరొనా ప్రజలు ప్రాధాన్యత వహించారు.

1499లో కొలంబియా భూమి మీద స్పెయిన్ ప్రజలు పాదం మోపారు. 16వ శతాబ్దం సగంలో స్పెయిన్ కొలంబియా మీద విజయం సాధించి " న్యూ కింగ్డం ఆఫ్ గ్రనాడా " పేరుతో వలసరాజ్యం స్థాపించారు.కొత్త రాజ్యానికి " సనాటే డీ బొగొటా " రాజధానిగా ఉంది. 1819లో స్పెయిన్ నుండి కొలబియాకు స్వతంత్రం లభించింది.అయినప్పటికీ 1830లో మాత్రమే " గ్రాన్ కొలంబియా ఫెడరేషన్ " రద్దు చేయబడింది.ప్రస్తుత కొలంబియా, పనామా కలిసి " రిపబ్లిక్ ఆఫ్ న్యూ గ్రనాడా "గా రూపొందింది. కొత్త దేశం " గ్రానడైన్ కాంఫిడరేషన్ " (1858) పేరుతో ప్రయోగపూర్వకంగా ఫెడరలిజం , " యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియా " (1863) ప్రవేశపెట్టింది.చివరిగా 1836లో " రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా " ప్రకటించబడింది.1903లో కొలంబియా నుండి పనామా విభజించబడింది. 1960 నుండి కొలంబియాలో ఆరంభమైన " సైనిక ఘర్షణ " 1990 నాటికి ఉచ్ఛస్థాయికి చేరుకుని 2005 నాటికి సద్దుమణిగింది.

సంప్రదాయంగా , భాషాపరంగా వైవిధ్యం కొనసాగుతున్న ప్రపంచదేశాలలో కొలబియా ఒకటి. గొప్ప సాస్కృతిక వైభవం కలిగిన దేశాలలో కొలంబియా ఒకటి.నగరప్రాంతాలు అధికంగా ఆండెన్ పర్వతప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.

కొలంబియన్ భూభాగంలో అమెజాన్ వర్షారణ్యాలు, ఉష్ణమండల పచ్చిక మైదానాలు , కరీబియన్ ప్రాంతం , పసిఫిక్ సముద్రతీరం ఉన్నాయి. ప్రపంచంలోని 17 అత్యధిక వైవిధ్యమైన , అత్యంత జీవవైవిధ్య సాంద్రత కలిగిన కొలంబియా ఒకటి. కొలంబియా లాటిన్ అమెరికాలో 4వ ఆర్థికశక్తిగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందుతున్న 6 మార్కెట్లలో (సి.ఐ.వి.ఇ.టి.ఎస్.), ఐక్యరాజ్యసమితి, డబల్యూ.టి.ఒ., ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ది పసిఫిక్ అలయంస్ , ఇతర అంతర్జాతీయ ఆర్గనైజేషన్లలో కొలంబియా భాగస్వామ్యం వహిస్తుంది. స్థిరమైన , క్రమంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికశక్తి కలిగిన దేశాలలో కొలంబియా ఒకటి.

పేరు వెనుక చరిత్ర

కొలంబియా 
Colombia is named after Christopher Columbus

" క్రిస్టోఫర్ కొలంబస్ " పేరులోని చివరి కొలంబస్ అనే పేరు దేశం పేరుగా నిర్ణయించబడింది. (Italian: Cristoforo Colombo, స్పానిష్: [Cristóbal Colón] Error: {{Lang}}: text has italic markup (help)). వెనుజులియన్ విప్లవాత్మక రచయిత " ఫ్రాంసిస్కో డీ మిరాండా " ఊహించి కొత్త ప్రపంచానికి వివరించాడు. ఈపేరు 1849లో " రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా " దత్తతగా స్వీకరించింది. వెనుజులా, ఈక్వెడార్ , కండినమరికా 1820లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. మునుపటి కండనమరికా " రిపబ్లిక్ ఆఫ్ న్యూ గ్రనడా " పేరును స్వీకరించింది. 1858లో న్యూ గ్రనడా పేరు అధికారికంగా " గ్రనాడైన్ కాంఫిడరేషన్ "గా మార్చబడింది.1863 లో ఈపేరు తిరిగి మార్పుకు లోనై " యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియా " అయింది. 1886లో చివరిగా "ది రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా "గా మార్చబడింది. ప్రస్తుతం దేశం కొలంబియా , రిపబ్లికా డీ కొలంబియా " అని పిలువబడుతూ ఉంది.

చరిత్ర

కొలంబియా కాలానికి ముందు చరిత్ర

San Agustín Archaeological Park
Ciudad Perdida ("The Lost City")

కొలంబియా భౌగోళిక స్థితి ఆధారంగా ఆదికాల మానవుల మెసొమెరికా నుండి కరీబియన్‌కు, ఆండెస్‌కు, అమెజాన్ బేసింకు వలసమార్గంలో కారిడార్‌గా ఉండేది.ఆరంభకాల బొగొటాకు నైరుతిలోని 100 kilometres (62 mi) మగ్డలెనాలోయ లోని ప్యుబెంజా, ఎల్.టాటుమొ ప్రాంతంలో జరిపిన పురాతత్వపరిశోధనలు క్రీ.పూ 18,000 - 8,000 మద్యకాలంలో ఇక్కడ పాలియో ఇండియన్లు నివసించారని తెలియజేస్తున్నాయి.ప్యూట్రొ హార్మింగా, ఇతర ప్రాంతాలలో జరిపిన పూరాతత్వ పరిశోధనలలో ఆర్చియాక్ కాలానికి (క్రీ.పూ 8,000 - 2,000) చెందిన ఆధారాలు లభించాయి. కుండిన్మార్కా డిపార్టుమెంటులోని ఎల్.అబ్రా, టెక్యుయెండామా ప్రాంతాలలో కూడా ఆరంభకాల ఆది మానవులు నివసించిన ఆధారాలు లభించాయి. శాన్ జాసింటో ప్రాంతంలో క్రీ.పూ. 5,000 - 4,000 నాటి అమెరికాలోని అతి పురాతన మట్టిపాత్రలు లభించాయి.

కొలంబియా 
Muisca raft. The figure refers to the ceremony of the legend of El Dorado.

కొలంబియా ప్రాంతంలో క్రీ.పూ 12,000 ఇండిజెనియస్ ప్రజలు నివసించారని భావిస్తున్నారు. ప్రస్తుత బొగొటా సమీపంలోని ఎల్.ఆబ్రా, టిబిటో, టెక్యుయెండామా ప్రాంతాలలో నివసించిన వేట, ఆటవీ వస్తుసేకరణ జీవనోపాధిగా చేసుకున్న నోమాడిక్ ప్రజలు ఒకరితో ఒకరు, మగ్డలేనానది తీరప్రాంతాలలోని లోయలలో నివసించిన ఇతర సంస్కృతికి చెందిన ప్రజల మద్య వ్యాపారసంబంధాలు కలిగిఉన్నారు. క్రీ.పూ 5,000, 1,000 వేట - సేకరణ గిరిజనులు అగ్రారియన్ సంఘాలుగా పరివర్తన చెంది సెటిల్మెంట్లు చేసుకుని మట్టిపాత్రల తయారుచేసి ఉపయోగించారు.క్రీ.పూ ప్రథమ సహస్రాబ్ధిలో ముయిస్కా, క్వింబయా, టరొనా జాతులకు చెందిన అమెరిండియన్లు " కసికాజ్గొ " రాజరిక వ్యవస్థ స్థాపించారు. కాసిక్యూస్ పిరమిడ్ ఆకార నిర్మాణాలు చేసారు.ముయిస్కా ప్రజలు ప్రస్తుత బొయాకా, కుండనంర్కా మొదలైన కొలంబియా డిపార్టుమెంటు ప్రాంతంలో నివసించారు.అక్కడ వారు ముయిస్కా కాంఫిడరేషన్ రూపొందించారు.వారు మొక్కజొన్న, ఉర్లగడ్డలు, క్యుయినొయా, పత్తి పండించారు. బంగారం, కొలంబియన్ ఎమరాల్డ్, బ్లాంకెట్లు, సెరామిక్ కళాఖండాలు, కొకా, రాతి ఉప్పు వంటి వస్తువులను పొరుగుదేశాల మద్య క్రయవిక్రయాలు చేసారు.టైరొనా ప్రజలు ఉత్తర కొలంబియాలో జనావాసాలకు దూరంగా ఉన్న సియేరా నెవడా డీ శాంటా మార్టా పర్వతశ్రేణిలో నివసించారు. క్వింబాయా ప్రజలు కొలంబియన్ ఆండెస్ పర్వత శ్రేణిలోని కౌకానదీ లోయ ప్రాంతంలోని కొర్డిలెరా ఆక్సిడెంటల్, కొర్డిలెరా సెంట్రల్ ప్రాంతాలలో నివసించారు. అమెరిండియన్లు అధికంగా వ్యవసాయం చేసారు. ఒక్కొక ఇండిజెనియస్ సమూహం సాంఘిక నిర్మాణం ఒక్కొక విధంగా ఉంటుంది. కరిబ్స్ వంటి కొన్ని ఇండిజెనీస్ సమూహాలు పర్మనెంటు వార్ రాష్ట్రంలో నివసించారు.ఇతరులు బెలికోస్ పర్వతప్రాంతాలలో నివసించారు. కొలంబియా నైరుతీ ప్రాంతంలో ఇంకాస్ " ఇంకా సామ్రాజ్యం " స్థాపించారు.

స్పానిష్ విజయం

కొలంబియా 
Routes of exploration and conquest.

1499లో " అలొంసొ డీ ఒజెడా " (క్రిస్టోఫర్ కొలంబస్‌తో సాహసయాత్రలో పాల్గొన్నాడు)గుయాజిరా ద్వీపకల్పం చేరుకున్నాడు. 1,500 లో రొడ్రిగొ డీ బస్టిడాస్ నాయకత్వంలో తమ మొదటి అన్వేషణ యాత్రలో భాగంగా కరీబియన్ సముద్రతీరానికి చేరుకున్నారు. 1502లో క్రిస్టోఫర్ కొలంబస్ కరీబియన్ సముద్ర ప్రాంతంలో ప్రయాణించాడు. 1508లో " వాస్కో న్యునెజ్ డీ బాల్బొ " గల్ఫ్ ఆఫ్ అరాబా " మీదుగా సాహసయాత్రచేసి 1510లో శాంటా మరియా లా అంటిద్వా డేల్ డారియన్ పట్టణం చేరుకుని మొదటి స్థిరమైన సెటిల్మెంటు స్థాపించాడు. 1525లో శాంటా మార్టా స్థాపించబడింది. 1533లో కార్టజెండా, కొలబియా స్థాపించబడింది. స్పానిష్ సాహసయాత్రికుడు " గాంజలో జిమెనెజ్ డీ క్యుయెస్డా " నాయకత్వంలో ఒక బృందం పయనించి 1536 ఏప్రిల్ లో ఇక్కడకు చేరుకున్నది. 1538 ఆయన బకాటా లోని ముయిస్కా కాసికాజో సమీపంలో నగరం స్థాపించి దానికి " శాంటా ఫే " అని నామకరణం చేసాడు. తరువాత ఈపేరు శాంటా ఫె డీ బొగొటాగా మారింది. తరువాత అదే సమయంలో సాహసయాత్రికుడు సెబస్టియన్ డీ బెలాల్కజర్ (క్యుయిటో విజేత) ఉత్తరభూభానికి చేరుకుని 1536లో కలి స్థాపించాడు. తరువాత పొపయాన్ 1537లో పొపయాన్ స్థాపించాడు. 1536 నుండి 1539 జర్మన్ సాహసయాత్రికుడు " నికొలస్ ఫెడర్మన్ " ఒరినొక్యుయియా నేచురల్ ప్రాంతం " దాటి ఎల్.డొరడొను (సిటీ ఆఫ్ గోల్డ్) అన్వేషిస్తూ కార్డిలెరా ఓరియంటల్ చేరుకున్నాడు. 16 - 17 శతాబ్ధాలలో పురాణాలు, బగారం స్పానిష్, యురేపియన్లలో ఆశలు రేకెత్తించడంలో ప్రధాన పాత్ర వహించాయి. ఇండిజెనియస్ సమూహాలు వారి సమూహాలకు మాత్రమే విశ్వాసంగా ఉన్నారు. అందువలన సాహసయాత్రికులు ఇండిజెనియస్ సమూహాల ప్రజల శతృవులతో సంకీర్ణం చేసుకున్నారు. విజేతలు, మైనింగ్ సామ్రాజ్యం రూపొందించే వారు ఇండిగెనియస్ ప్రజలతో సంకీర్ణం ఏర్పరుచుకున్నారు. దాడుల సమయంలో మొదలైన మసూచి వంటి అంటువ్యాధుల కారణంగా ఇండిజెనియస్ జనసంఖ్య క్షీణించింది. ఇండిజెనియస్ ప్రజలలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధానకారణం. విసర్జించబడిన భూమిని స్పానిష్ ప్రభుత్వం కాలనీల నిర్మాణాలకు, పెద్ద తోటల కొరకు, గనులు త్రవ్వడానికి ఆసక్తి కలిగినవారికి విక్రయించబడింది. 16వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన నాటికల్ సైన్సు ఇబరియన్ షిప్ అభివృద్ధికి (1400-1600) సహకరించింది.

కాలానీ శకం

1542లో న్యూ గ్రనడా ప్రాంతం దక్షిణ అమెరికాలోని మిగిలిన స్పానిష్ ప్రాంతాలు అన్నింటితో కలిసి లిమాను రాజధానిగా చేసుకుని " వైశ్రాయిటీ ఆఫ్ పెరూ " భాగం అయ్యాయి. 1547లో వైశ్రాయల్టీలో న్యూ గ్రనడా " కెప్టెంసీ జనరల్ ఆఫ్ న్యూ గ్రనడా " అయింది.1549లో రాయల్ డిక్రీ రాయల్ ఆడియెంసియా రూపొందించింది. న్యూ గ్రనడా రాయల్ ఆడియంస్ ఆఫ్ శాంటా ఫే డీ బొగొటా (శాంటా మార్టా, రియో డీ శాన్ జుయాన్, పొపయాన్, గయాన, కార్టజెనా భాగంగా ఉన్నాయి)పాలనలోకి మారింది. కౌంసిల్ ఆఫ్ ఇండీస్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. 16వ శతాబ్దంలో యురేపియన్లు ఆఫ్రికా నుండి బానిసలను తీసుకురావడం ఆరంభించారు. యురేపియన్ దేశాలలో స్పెయిన్ మాత్రమే ఆఫ్రికాలో బానిసలను కొనుగోలుచేసే కేంద్రాలను స్థాపించలేదు. అందువలన స్పెయిన్ అసియెంటో విధానంద ఆధారపడుతూ వ్యాపారులకు (అధికంగా పోర్చుగీసు,ఫ్రెంచి,ఇంగ్లాండ్, డచ్చి వ్యాపారులకు)విదేశీభూభాగాలలో పనిచేయడానికి బానిసలను కొనుగోలుచేసే అనుమతిపత్రాలను మంజూరు చేస్తూ ఉండేది. కొలంబియాలోని ప్రజలలో కొందరు మానవహక్కుల రక్షణ, అణిచివేతకు గురైన ప్రజలకు స్వతత్రం కల్పించడం కొరకు పోరాడుతుండేవారు.కొలంబియాలో చట్టపరంగా స్పానిష్ సామ్రాజ్యంలోని ప్రజలుగా గుర్తించిన కారణంగా ఇండిజెనియస్ ప్రజలు బానిసలుగా చేయబడలేదు. అందువలన ఇండిజెనియస్ ప్రజలు పలు రూపాలలో సంరక్షించబడ్డారు. వారికి భూమిస్వంతం చేసుకునే అధికారం ఇవ్వబడింది.వారి కొరకు రెసాగార్డ్స్, ఎంకొమియెండాస్, హెసియెండాస్ వంటి రెగ్యులేషన్లు రూపొందించబడ్డాయి.

కొలంబియా 
Many intellectual leaders of the independence process participated in the Royal Botanical Expedition to New Granada.

1717లో " ది వైశ్రాయిటీ ఆఫ్ న్యూ గ్రనడా " తాత్కాలికంగా రద్దు చేయబడి తిరిగి 1739లో పునఃస్థాపించబడింది. వైశ్రాయిటీకి శాంటా ఫే డీ బొగొటా రాజధానిగా ఉండేది. ఈవైశ్రాయిటీలో అదనంగా గతంలో న్యూ స్పెయిన్, పెరూ వైశ్రాయిటీలలో ఉన్న దక్షిణ అమెరికాలోని వాయవ్యప్రాంతాలు వీలీనం చేయబడ్డాయి. అవి ప్రస్తుతం వెనుజులా, ఈక్వెడార్, పనామా దేశాలలో ఉన్నాయి.అందువలన లీమా, మెక్సికో నగరాల మాదిరిగా బొగొటా స్పానిష్ ఆధీనంలో ఉన్న అమెరికన్ ప్రాంతాలకు ప్రధాన అడ్మినిస్టేటివ్ కేంద్రాలలో ఒకటిగా ఉండేది.అయినప్పటికీ ప్రస్తుతం లిమా, మెక్సికన్ నగరాలతో పోల్చిచూస్తే బొగొటా కొంత ఆర్థికంగా, రవాణామార్గాల వంటి అభివృద్ధిలో వెనుకబడి ఉంది. 1739లో స్పెయిన్ మీద గ్రేట్ బ్రిటన్ యుద్ధం (కార్టగెనా యుద్ధం) ప్రకటించింది. యుద్ధంలో బ్రిటన్ విజయం సాధించినప్పటికీ " జెంకింస్ ఇయర్ యుద్ధంలో విజయం సాధించి స్పెయిన్ బ్రిటన్‌కు నిరుత్సాహం కలిగించింది.కరీబియన్ సముద్రంలో గ్రేట్ బ్రిటన్ మీద ఆర్థిక ఆధీనం సాధించడానికి 7 సంవత్సరాల కాలం జరిగిన యుద్ధం తరువాత కరీబియన్ సముద్రంలో స్పానిష్ ఆధీనత బలపడింది. 18వ శతాబ్దంలో ప్రీస్ట్ బాటనిస్ట్ , గణితశాస్త్రవేత్త " జోస్ సెలెస్టినొ మ్యూటిస్ "ను ఆహ్వానించిన " ఆంటానియో కాబెల్లెరో వై గొంగొరా " న్యూ గ్రనడా గురించిన పర్యావరణం గురించిన పరిశోధన నిర్వహించాలని కోరాడు. 1783లో " రాయల్ బొటానికల్ ఎక్స్పెడిషన్ టు న్యూ గ్రనడా " పేరుతో ఆరంభమైన ఈ పరిశోధనలో ఈప్రాంతంలోని మొక్కలు , వన్యమృగాలు వర్గీకరించబడ్డాయి.అంతేకాక శాంటా ఫె డీ బొగొటా నగరంలో మొదటి ఆస్ట్రానొమల్ అబ్జర్వేటరీ స్థాపించబడింది. 1801 జూలైలో ప్రుసియన్ శాస్త్రవేత్త " అలెగ్జాండర్ వొన్ హంబోల్డ్ " శాంటా ఫె డీ బొగొటా చేరుకుని అక్కడ మ్యూటిస్‌ను కలుసుకున్నాడు. పరిశోధనల ప్రక్రియ ఆరభించిన కారణంగా న్యూ గ్రనడా స్వతంత్రప్రక్రియలో స్థానం సంపాదించుకున్న చారిత్రకప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు ఆస్ట్రోనమర్‌గా (ఫ్రాంసిస్కో జోస్ డీ కాల్దాస్), శాస్త్రవేత్తగా (ఫ్రాంసిస్కో అంటానియో జియా), జుయాలజిస్టుగా (జార్గ్ టాడియో లోజానొ) , చిత్రకారునిగా (సల్వేడర్) పేరుతెచ్చుకున్నారు.

స్వతంత్రం

కొలంబియా 
The Battle of Boyacá was the decisive battle which would ensure the success of the liberation campaign of New Granada.

కాలనైజేషన్ ఆరంభకాలంలో స్పానిష్ పాలనకు వ్యతిరేకంగా పలు తిరుగుబాట్లు జరిగాయి. అయినప్పటికీ ఇవి చాలావరకు అణిచివేతకు గురికావడం లేక మొత్తం విధానంలో మార్పులు తీసుకురాలేనంతటి బలహీనంగా ఉండడం సంభవించింది. 1810లో చివరిగా కొలంబియన్ స్వతంత్ర పోరాటం జరిగింది. 1804లోఎస్.టి డోమింగ్యూ (ప్రస్తుత హైథీ)స్వతంత్రం ఇచ్చిన తరువాత వారు తిరుగుబాటుదారుడు " సైనన్ బొలివర్ "కు మద్దతు ఇచ్చారు.స్వతంత్ర పోరాటంలో ఫ్రాంసిస్కో డీ పౌలా శాంటాండర్ ప్రధానపాత్ర వహించాడు. ole.

కొలంబియా 
The Socorro Province was the site of the genesis of the independence process.

అంటానియా నరినొ స్పానిష్ నాయకత్వంలో కేంద్రీకృత అధికారం , వైశ్రాయిలిటీకి వ్యతిరేకంగా ఉద్యమం ఆరంభించబడింది. 1811లో కార్టజెనా (కొలంబియా)కు స్వతంత్రం లభించింది. 1811లో కామిలో టారెస్ టెనొరియో నాయకత్వంలో " యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ న్యూ గ్రనడా " ప్రకటించబడింది. పార్టియా బొబలింస్టబిలిటీ సమయంలో ఫెడరలిజం , కేంద్రీకృత అధికారానికి మద్దతు ఇస్తూ ఇద్దరు దేశభక్తులు వెలుగులోకి వచ్చారు. నపొలియొనిక్ యుద్ధం ముగిసిన స్వల్పకాలం తరువాత 7వ ఫర్డినాడ్ స్పెయిన్ అధికార పదవి చేపట్టాడు. ఆయన ఎదురుచూడకుండా స్పెయిన్ చేత జయించబడిన " న్యూ గ్రనడాల్టో "ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైన్యాలను పంపాడు. తరువాత స్పెయిన్ ఉత్తర అమెరికా లోని అధికభాగం తిరిగి స్వాధీనం చేసుకుంది.తిరిగి జుయాన్ సమానొ నాయకత్వంలో కొత్త వైశ్రాయిటీ స్థాపించబడింది.ఆయన పాలనలో దేశభక్తి ఉద్యమంలో పాల్గొన్న వారు దండనకు గురయ్యారు. ప్రతీకారం తీవ్రమై వెనుజులియన్ పూర్వీకత కలిగిన " సైమన్ బొలివర్ " నాయకత్వంలో సమైక్య తిరుగుబాటుగా మారి స్పెయిన్‌ను బలహీనపరుస్తూ 1819లో స్వతంత్రం ప్రకటించబడింది. 1822లో కొలంబియాలో " ది రాయలిస్ట్ " ఓటమి పొందింది, 1833లో వెనెజులాలో ఓటమి పొందింది. వైశ్రాయిటీ న్యూ గ్రనడా భూభాగం " రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా " అయింది. గ్రాన్ కొలంబియా సబ్‌డివిషన్లలో ప్రస్తుతం కొలంబియా, పనామా,ఈక్వెడార్,వెనుజులా, గయానాలో కొంత భూభాగం , బ్రెజిల్ మారాయి. 1821 లో కుకుటా కాంగ్రెస్ కొత్త రిపబ్లిక్ కొరకు కొలంబియన్ రాజ్యాంగాన్ని రూపొందించింది. సిమిన్ బొలివర్ మొదటి కొలంబియన్ అధ్యక్షుడుగా నియమించబడ్డాడు. అలాగే ఫ్రాంసిస్కా డీ పౌలా శాంటండర్ ఉపాధ్యక్షుడుగా నియమించబడ్డాడు. కొత్త రిపబ్లిక్ అస్థిరంగా మారింది. గ్రాన్ కొలంబియా పతనం నుండి 1830లో న్యూ గ్రనడా, ఈక్వెడార్ , వెనుజులా అనే మూడు దేశాలు ఏర్పడ్డాయి.

కొలంబియా 
Formation of the present Colombia since the Viceroyalty of New Granada's independence from the Spanish Empire

దక్షిణ అమెరికాలో కొలంబియా మొదటి రాజ్యాంగం రూపొందించుకున్న దేశంగా గుర్తించబడుతుంది. 1848 లో కొలబియన్ లిబరల్ పార్టీ , 1849 లో కొలంబియన్ కంసర్వేటివ్ పార్టీ స్థాపించబడ్డాయి. ఇవి అమెరికాలో కొనసాగుతున్న రెండు పురాతన పార్టీలుగా గుర్తించబడుతున్నాయి. కొలంబియాలో 1851లో బానిసత్వం నిషేధించబడింది. అంతర్గత రాజకీయాలు , ప్రాంతీయ విభాగాలు 1830 లో గ్రాన్ కొలంబియా పతనం కావడానికి దారితీసాయి. " కుండినంర్కా ప్రొవింస్ " రిపబ్లిక్ ఆఫ్ న్యూ గ్రనడా పేరును స్వీకరించింది. 1858 వరకు ఆపేరు అలానే ఉండి తరువాత కాంఫిడరేషన్ గ్రాండినె అయింది. రెండు సంవత్సరాల కొలంబియన్ సివిల్ వార్ (1860-1862) తరువాత 1863లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలమియా రూపొందించబడింది. 1886 వరకు అలాగే ఉండి చివరిగా కొలంబియా రిపబ్లిక్ రూపొందించబడింది. అంతర్గత విభజనలు రాజకీయపార్టీల మద్య విభజితం కావడం తరచుగా అంతర్యుద్ధాలకు దారి తీసింది. వీటిలో " తౌజండ్ డేస్ వార్ " (1899 - 1902) అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.

20వ శతాబ్ధం

యునైటెడ్ స్టేట్స్ ఈప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించడం (ప్రధానంగా పనామా కాలువ నిర్మాణం , ఆధీనం) 1903 నాటికి కొలంబియా నుండి పనామా విడిపోవడానికి , కొలంబియా దేశంగా స్థాపించడానికి దారితీసింది. పనామా నిర్మాణం పూర్తి చేసిన 7 సంవత్సరాల తరువాత 1921లో యునైటెడ్ స్టేట్స్ పనామా రూపొందించడంలో అధ్యక్షుడు రూజ్వెల్ట్ వహించిన పాత్ర కారణంగా జరిగిన నష్టానికి పరిహారంగా కొలంబియాకు 25 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఇచ్చింది. " థాంసన్ - ఉరుటియా ట్రీటీ " షరతులను అనుసరించి కొలంబియా పనామాను గుర్తించింది. అమెజాన్ డిపార్టుమెంటు దాని రాజధాని లెటిసియా విషయంలో కొలంబియా పెరూ మద్య తలెత్తిన భూవివాదాలు " వార్ విత్ పెరూ " యుద్ధానికి దారితీసింది.

కొలంబియా 
The Bogotazo in 1948

కొలంబియా కొంత రాజకీయ స్థిరత్వం సాధించిన కొంతకాలం తరువాత 1940 - 1950 మద్య రెండు రాజకీయ పార్టీల మద్య తలెత్తిన విభేదాల కారణంగా " లా వియోలెంసియా " పేరిట తీవ్రమైన అంతఃకలహం కొనసాగింది.1948 ఏప్రిల్ 9న లిబరల్ పార్టీ తరఫున అధ్యక్షపదవికి పోటీచేసిన " జార్జ్ ఎలియేసర్ గైటన్ " హత్యకు గురికావడంతో రెండు పార్టీల మద్య ఆరంభమైన కలహాలు ఉచ్ఛస్థాయికి చేరుకున్నాయి. "ఎల్.బొగొటాజో " పేరిట బొగొటాలో మొదలైన అల్లర్లు దేశం అంతటా విస్తరించి 1,80,000 కొలంబియన్ పౌరుల ప్రాణాలను హరించాయి. " ల్యూరియానొ గొమెజ్ " అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత కొలంబియా కొరియన్ యుద్ధంలో చేరింది. లాటిన్ అమెరికా దేశాలలో కొలంబియా మాత్రమే యునైటెడ్ స్టేట్స్ సంకీర్ణ దళాలలో నేరుగా సైన్యంతో ఈయుద్ధంలో పాల్గొంది. గుస్టోవ్ రోజస్ ల్యూరియానొ గొమెజ్‌ను అధ్యక్షపీఠం నుండి తొలగించి గొరిల్లాలతో సంప్రదింపులు జరిపి జనరల్ గాబ్రియల్ పారిస్ నాయకత్వంలో సైనికపాలన ఏర్పడిన తరువాత రెండు పార్టీల మద్య హింసాత్మక చర్యలు సమసి పోయాయి.

కొలంబియా 
The Axis of Peace and Memory: A “memorial” in recognition of the victims of the conflict

రోజాస్ వాగ్మూలం తరువాత దేశాన్ని కలిసి పాలించడానికి అంగీకరిస్తూ కొలంబియన్ కంసర్వేటివ్ పార్టీ, కొలంబియన్ లిబరల్ పార్టీ " నేషనల్ ఫ్రంట్ " రూపొందించింది. ఒప్పందం అనుసరిస్తూ కంసర్వేటివ్స్, లిబరల్ పార్టీలు ప్రతి 4 సంవత్సరాలకు అధ్యక్షపదవిని ఒకరి తరువాత మరొకటి 16 సంవత్సరాలు వహించాయి. నేషనల్ ఫ్రంట్ " లా వియోలెంసియా " అయింది. నేషనల్ ఫ్రంట్ అధికారులు అభివృద్ధి కొరకు అలయంస్ అనే నినాదంతో సాంఘిక, ఆర్థిక అమ్శాలు బోధించడానికి ప్రయత్నించింది. అయా రంగాలలో అభివృద్ధి తరువాత పలు సాంఘిక, రాజకీయ సమస్యలు కొనసాగాయి. గొరిల్లా సమూహాలు ఎఫ్.ఎ.ఆర్.సి. రూపొందించాయి. నేషనల్ లిబరేషన్ ఆర్మీ (కొలబియా), ఏప్రిల్ 19 ఉద్యమం ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాయి. 1960 నుండి కొలంబియాలో అసిమిట్రిక్ వార్,లో ఇంటెంసిటీ కాంఫ్లిక్ట్, కొలంబియన్ ఆర్మ్‌డ్ కాంఫ్లిక్ట్ (1964- నుండి ప్రస్తుతం వరకు)కూ ప్రభుత్వ ఫోర్సెస్, గొరిల్లా మూవ్మెంట్ ఇన్ కొలంబియా, పారామిలటరిసం ఇన్ కొలంబియా మద్య కలహాల వంటి సమస్యలను ఎదుర్కొన్నది. 1990 సంఘర్షణలు వేగవంతం అయింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో మరింత అధికం అయ్యాయి. సంఘర్షణల ఆరంభకాలంలో మానవ హక్కుల సంరక్షకులు మానవహక్కులను గౌరవించాలని పోరాడాయి. . శాంతి చర్చల తరువాత పలు గొరిల్లాస్ ఆర్గనైజేషంస్ తమ కార్యక్రమాలు తగ్గించాలని (1989-1994) నిర్ణయించుకున్నాయి. 1960 లో యు.ఎస్. ప్రభుత్వం కొలంబియన్ మిలటరీ గ్రామీణ ప్రాంతాలలో లెఫ్టిస్ట్ మిలిటెంట్ మీద అటాక్‌కు ప్రోత్సాహం అందించినప్పటి నుండి యునైటెడ్ స్టేట్స్ ఈ సంఘర్షణలకు ప్రోత్సాహం అందించడం కొనసాగించింది. యు.ఎస్. కమ్యూనిజానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో భాగంగా ఉంది. 1991 జూలై 4న సరికొత్త కొలంబియన్ రాజ్యంగం రూపొందించబడింది. కొత్త రాజ్యాంగంలో చేయబడిన మార్పులకు కొలంబియన్ పౌరుల నుండి ఆదరణ లభించింది.

21వ శతాబ్ధం

కొలంబియా 
Colombia's President Juan Manuel Santos signed a historic peace accord.

అధ్యక్షుడు " అల్వారొ అరిబె " ప్రభుత్వం ఆరంభించిన (2002-2010) డెమొక్రటిక్ సెక్యూరిటీ పాలసీలో ఇంటిగ్రేటెడ్ కౌంటర్ - టెర్రరిజం, కౌంటర్ - ఇంసర్జెంసీ కంపాజిన్ భాగంగా ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఆర్థికప్రణాళిక కూడా పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించింది. వివాదాస్పదమైన శాంతి ప్రయత్నాలలో భాగంగా " యునైటెడ్ సెల్ఫ్ - డిఫెంస్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా " (రైట్ వింగ్ - పారామిలటరీ) కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. 2008 ఫిబ్రవరిలో మిలియన్ల కొద్దీ కొలంబియన్లు ఎఫ్.ఎ.ఆర్.సి., ఇతర చట్టవిరోధ బృందాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలలో పాల్గొన్నారు. క్యూబాలో శాంతి సంప్రదింపులు జరిగిన తరువాత కొలంబియా అద్యక్షుడు " జుయాన్ మాన్యుయెల్ ", ఎఫ్.ఎ.ఆర్.సి. - ఇ.పి గొరిల్లా కలిసి 6 అంశాలతో కూడిన శాంతి ప్రణాళిక ప్రకటించాడు. నేషనల్ రెఫరెండంలో (2006) మొదటి శాంతి ఒప్పందం సమర్పించబడింది.ఇది 50.2% ఓట్లతో నిరాకరించబడింది. అనుకూలంగా 48.9% ఓట్లు వేశారు. తరువాత కొలంబియన్ ప్రభుత్వం, 2016 నవంబరులో ఎఫ్.ఎ.ఆర్.సి సరిదిద్దబడిన కొలంబియన్ పీస్ ప్రొసెస్ మీద సంతకం చేసారు. దీనికి కొలంబియన్ కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. ప్రభుత్వం సహకారం, శ్రద్ధ వహించడం, బాధించబడిన వారికి సమగ్రమైన పరిహారం అందించడం ఆరంభించింది. 2016లో అధ్యక్షుడు శాంటోస్ నోబుల్ శాతి పురస్కారం (2016) అందుకున్నాడు. కొలంబియా మానవహక్కుల సంరక్షణలో తగిన అభివృద్ధి సాధించిందని " హ్యూమన్ రైట్స్ వాచ్ " అభిప్రాయం వెలిబుచ్చింది. అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా కొలబియా - వెనుజులా దౌత్యసంబంధాలు పునరుద్ధరించ బడ్డాయి. " పారిస్ క్లైమేట్ అగ్రిమెంటు "కు మద్దతుగా కొలంబియా అత్యంత కాలుష్యరహిత విద్యుత్తు ఉత్పత్తి విధానం చేపట్టింది.

భౌగోళికం

కొలంబియా 
Relief map

కొలంబియా భౌగోళికంగా 6 ప్రకృతిసహజ ప్రాంతాలుగా విభజించబడింది: ఆండెస్ పర్వతశ్రేణి ప్రాంతంలో వెనుజులా, ఈక్వెడార్ సరిహద్దులు ఉన్నాయి;పసిఫిక్ సముద్రతీర ప్రాంతంలో పనామా, ఈక్వెడార్ సరిహద్దులు ఉన్నాయి. కరీబియన్ సముద్రతీర ప్రాంతంలో వెనుజులా, పనామా ప్రాంతాలు ఉన్నాయి. లాస్ లానోస్ ప్రాంతంలో (మైదానాలు) వెనుజులా సరిహద్దు ఉంది; అమెజాన్ వర్షారణ్యాల ప్రాంతంలో వెనుజులా,బ్రెజిల్,పెరు, ఈక్వెడార్ సరిహద్దులు ఉన్నాయి.ఇంసులర్ ప్రాంతంలో పసిఫిక్ సముద్ర ద్వీపాలు, అట్లాంటిక్ సముద్రద్వీపాలు ఉన్నాయి. కొలంబియా వాయవ్య సరిహద్దులో పనామా, తూర్పు సరిహద్దులో వెనుజులా, బ్రెజిల్, దక్షిణ సరిహద్దులో ఈక్వెడార్, పెరూ దేశాలు ఉన్నాయి. కొలంబియా సముద్ర సరిహద్దులను పొరుగున ఉన్న 7 కరీబియన్ సముద్రదేశాలతో, మూడు పసిఫిక్ మహాసముద్రదేశాలతో ఒప్పందాల ద్వారా స్థాపించింది. కొలంబియా 12-4 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 67 - 79 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

కొలంబియా 
Colombia map of Köppen climate classification

పసిఫిక్ రింగులో భాగంగా ఉన్న కరీబియాలో భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కొలంబియాలోని ఆండెస్ పర్వతశ్రేణిలో దేశంలోని నగరప్రాంతాలు ఉన్నాయి. కకుయా, నరినో డిపార్టుమెంట్లతో కూడిన కొలంబియన్ మాసిఫ్ మూడు శాఖలుగా విభజింపబడింది: కార్డిలెరాస్ పర్వతశ్రేణి: కకుయా, మగ్డలెనా నదీలోయ మద్య విస్తరించి ఉన్న కార్డిలెరాస్ సెంట్రల్‌లో మెడెల్లిన్మనిజలెస్,పెరియా, ఆర్మెనియా నగరాలు ఉన్నాయి. కార్డిలెరా ఓరియంటల్ బొగొటా, బుకరమంగా, కుకుటాలతో కూడిన గుజిరా ద్వీపకల్పం వరకు విస్తరించి ఉంది. కార్డిలెరా యాక్సిడెంటల్ 4,700 మీ ఎత్తు, కార్డిలెరా సెంట్రల్, కార్డిలెరా ఓరియంటల్ 5,000 మీ.ఎత్తు. బొగొటా (2,600 మీ ఎత్తు.) వైశాల్యపరంగా ప్రపంచంలో అత్యంత ఎత్తైన నగరంగా గుర్తించబడుతుంది. ఆండెస్ పర్వతానికి తూర్పున లాస్ లానోస్ సవన్నా, ఒరినొకొ నదిలో కొంతభాగం, అమెజాన్ వర్షారణ్య జంగిల్ ఉంది. వీటితో సగం కొలంబియన్ భూభాగం ఉంది. అయినప్పటికీ ఇక్కడ 6% ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. ఉత్తరంలో ఉన్న కరీబియన్ సముద్రతీరంలో 21.9% ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ బర్రంగుయిల్లా, కార్టజండా వంటి ప్రధాన నౌకాశ్రయ నగరాలు ఉన్నాయి. ఇక్కడ సాధారణంగా దిగువభూమి మైదానాలు, సెయిరా నెవడా డీ శాంటా మార్టా పర్వతశ్రేణి ఉంది. ఇక్కడ దేశంలోని అత్యంత ఎత్తైన పికొ క్రిస్టోబల్ కొలాన్, పికొ సైమన్ బొలివర్, లా గుయాజిరా డిసర్ట్ మొదలైన శిఖరాలు ఉన్నాయి. కొలంబియన్ పసిఫిక్ ప్రాంతంలో సెరానియా డీ బౌడో పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న దట్టమైన అరణ్యప్రాంతంలో అక్కడక్కడా మానవ నివాసాలు ఉన్నాయి. బుయెనవెంతురా, కొలంబియా పసిఫిక్ ప్రాంత ప్రధాన నౌకాశ్రయంగా గుర్తించబడుతుంది.

కొలంబియాలోని నదులలో మగ్డలెనా నది, కౌకా నది, గౌవియారే నది, ఆట్రాటొ నది, మెటా నది, పుతుమయొ నది, కక్వెటా నది ప్రధానమైనవి.కొలంబియాలో 4 వీటిపారుదల విధానాలు ఉన్నాయి: పసిఫిక్ డైన్, కరీబియన్ డ్రైన్, ఒరినొకొ బేసిన్ డైన్, అమెజాన్ డైన్ ఉన్నాయి. ఒరినొకొ, అమెజాన్ నదులు కొలంబియా, వెనుజులా, పెరు దేశాల సరిహద్దులలో ఉన్నాయి. కొలంబియాలో ఉన్న సంరక్షిత ప్రాంతాలు, నేషనల్ పార్కుల మొత్తం వైశాల్యం 1,42,68,224 చ.హె. ఇది దేశవైశాల్యంలో 12.77% ఉంది. పొరుగుదేశాలతో పోల్చిచూసినట్లైతే కొలంబీయాలో అరణ్యనిర్మూలన (డిఫారెస్టేషన్) తక్కుగా ఉంది. కొలంబియాలో మంచినీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి.

వాతావరణం

కొలంబియా వాతావరణం ఉష్ణమండల వాతావరణంగా వర్గీకరించబడింది. కొలంబియన్ 6 ప్రకృతిసహజ ప్రాంతాలలో ప్రాంతాలవారిగా ఎత్తు, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలులు, వర్షపాతం కారణంగా వాతావరణ వైవిధ్యం ఉంటుంది. కొలంబియా వాతావరణ వైవిధ్య భూభాగాలు వర్షారణ్యాలు, సవన్నా (మిశ్రితారణ్యం), స్టెప్పే (సోపాన వ్యవసాయక్షేత్రాలు), ఎడారి పర్వతప్రాంత వాతావరణాలుగా వర్గీకరించబడుతున్నాయి.

ఆండెస్ ప్రాంతంలో మౌంటెన్ క్లైమేట్, ఇతర పర్వతప్రాంతాలలో ఎత్తును అనుసరించి వాతావరణ మార్పులు సంభవిస్తుంటాయి. 1,000మీ కంటే తక్కువ ఎత్తైన ప్రాంతాలలో టియేరా కాలినెటే ప్రాంతంలో ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. 82.5% భూభాగం వాం అల్టిట్యూడినల్ జోన్‌లో ఉంటుంది. టియేరా టెంప్లాడా (1001-2000 మీ ఎత్తు) ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. టియేరా ఫ్రియాల్‌కోల్డ్ వాతావరణం (2001 - 3000 మీ ఎత్తు) ఉష్ణోగ్రత 12-17 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. పరామొలోని అరణ్యప్రాంతాలు, వృక్షరహిత పచ్చిక భూభాగంలో (4000మీ ఎత్తు) ఉష్ణోగ్రత ఫ్రీజింగ్ కంటే తక్కువగా ఉంటుంది. టియేరా హెలడా భూభాగంలో నిరంతరం హిమపాతం, ఐస్ ఉంటుంది.

జీవవైవిధ్యం

కొలంబియా 
Chlorochrysa nitidissima. Colombia is home to more bird species than any other country in the world.
కొలంబియా 
The national flower of Colombia is the orchid Cattleya trianae, which was named after the Colombian botanist and physician José Jerónimo Triana.

కొలంబియా అత్యంత అధికమైన జీవవైవిధ్యం కలిగిన దేశం. పక్షి జాతులలో మొదటిస్థానంలో ఉంది. దేశంలో 40,000 - 45,000 వృక్షజాతులు ఉన్నాయి. మొత్తం ప్రంపచ వృక్షజాతులలో ఇది 10-20% ఉంటుంది. కొలంబియా వైశాల్యపరంగా ఇది అత్యధికం. జీవవైవిధ్యంలో కొలంబియా అంతర్జాతీయంగా ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బ్రెజిల్ ఉంది. (వైశాల్యపరంగా దాదాపు 7 రెట్లు పెద్దది). భూగ్రహంలో జీవవైద్యం అత్యధికంగా ఉన్న కొలంబియాలో అనేక జాతుల జీవజాలం ఉంది. ఎండిమిస్మ్ (మరెక్కడా కనపడని జాతులు) అధికంగా ఉన్న దేశం కొల్ంబియా. ప్రపంచంలో 10% జాతులు కొలంబియాలో ఉన్నాయి. 1,900 జాతుల పక్షులు (ఐరోపా, ఉత్తర అమెరికాలను కలిపినదాంకంటే అధికం) ఉన్నాయి. కొలంబియాలో ప్రపంచంలోని 10% క్షీరదాలు ఉన్నాయి. కొలంబియాలో ప్రపంచంలోని 14% ఉభయచరాలు ఉన్నాయి. కొలంబియాలో ప్రపంచంలోని 18% పక్షిజాతులు ఉన్నాయి. కొలంబియాలో 2,000 జాతుల మారైన్ చేపలు ఉన్నాయి. మంచినీటి చేపజాతులు అధికంగా ఉన్న ప్రపంచదేశాలలో కొలంబియా ద్వితీయస్థానంలో ఉంది. 7,000 మంది బీటిల్ కీటకాలు ఉన్నాయి. ఉభయచరాల జాతుల సంఖ్యలో కొలంబియా ద్వితీయస్థానంలో ఉంది. అలాగే సరీసృపాలు, ఏకదళబీజ వృక్షాలలో కొలంబియా అంతర్జాతీయంగా తృతీయస్థానంలో ఉంది. 1,900 జాతుల నత్తలు, 3,00,000 జాతుల అకశేరుకాలు ఉన్నాయి. కొలంబియాలో 32 టెర్రెస్ట్రియల్ బయోమెస్, 314 జాతుల ఎకోసిస్టంస్ ఉన్నాయి.

ఆర్ధికం

కొలంబియా 
Colombia's gross domestic product by sector for the second half of the year 2015

కొలంబియా చారిత్రకంగా వ్యవసాయ ఆధారిత ఆర్థికరంగం కలిగి ఉన్నప్పటికీ 20వ శతాబ్దంలో వేగవంతంగా నగరీకరణ చేయబడింది. ఫలితంగా 15.8% మాత్రమే శ్రామికరంగం మిగిలిన వ్యవసాయరంగం 6.8% జి.డి.పికి ఆధారంగా ఉంది; 19.6% శ్రామికశక్తితో పారిశ్రామికరంగం 34% జి.డి.పికి ఆధారంగా ఉంది; 64.6% సేవారంగం 59.2% జి.డి.పికి ఆధారంగా ఉంది; దేశ ఆర్థిక ఉత్పత్తిని దేశ అంతర్గత అవసరాలు ఆధిక్యత చేస్తున్నాయి. కొనుగోలు శక్తి జి.డి.పిలో ప్రధాన పాత్ర వహిస్తుంది. 20వ శతాబ్దంలో కొలంబియన్ ఆర్థికరంగం స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 1970-1998 మద్య వార్ధికంగా జి.డి.పి. 4% అభివృద్ధి చెందింది.1999 లో దేశంలో ఆర్థికాభివృద్ధిలో స్థబ్దత చోటు చేసుకుంది. మొదటి సారిగా ఆర్థికరంగంలో అవరోహణ (గ్రేట్ డిప్రెషన్ సమయం) మొదలైంది. దీర్ఘకాలం బాధాకరమైన పరిస్థితి కొనసాగిన తరువాత ఆర్థికరగం కోలుకున్నది.2007 నాటికి ఆర్థికరంగం 6.9% అభివృద్ధి (లాటిన్ అమెరికా దేశాలలో అత్యధిక అభివృద్ధి) చెందింది. " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " అంచనాల ఆధారంగా 2012 లో కొలంబియా జి.డి.పి. $500 బిలియన్లు. ఇది దక్షిణ అమెరికాదేశాలలో 3వ స్థానంలో ఉంది. మొత్తం దేశీయ ఆదాయంలో ప్రభుత్వ వ్యయం 28.7%. ఋణం 41%. 2016లో వార్షిక ద్రవ్యోల్భణం 5.75% (2015 ద్రవ్యోల్భణం 6.77%). 2016లో నిరుద్యోగం 9.2%. అయినప్పటికీ అనధికార సంస్థలు లేబర్ మార్కెట్జ్ ప్రధాన సమస్యగా మారింది. అధికార కార్మికులసంఖ్య 24.8% అభివృద్ధి చెందగా అనధికార కార్మిక వర్గం 9% మాత్రమే అభివృద్ధి చెందింది. కొలంబియా స్వేచ్ఛావిఫణి ప్రాంతాన్ని కలిగి ఉంది. కకుయాలో " జోనా ఫ్రాంకా డెల్ పసిఫికొ " విదేశీపెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలలో ఒకటి. ఆర్థిక వెసులుబాటు కారణంగా ఫైనాంషియల్ రంగం అభివృద్ధి చెందింది. వరల్డ్ బ్యాంక్ ఆధారంగా లీగల్ రైట్స్ ఇండెక్స్‌లోని పర్ఫెక్ట్ స్కోర్ సంపాదించిన మూడుదేశాలలో కొలంబియా ఒకటి.

విద్యుత్తు

కొలంబియా 
The Colombian Stock Exchange is part of the Latin American Integrated Market (MILA).

కొలంబీయాలో విద్యుదుత్పత్తి అధికంగా " రిన్యూవబుల్ ఎనర్జీ " ద్వారా లభిస్తుంది. 69.97% జలవిద్యుత్తు ప్లాంటుల ద్వారా లభిస్తుంది. 2014లో " గ్లోబల్ గ్రీన్ ఎకానమీ ఇండెక్స్ " కొలంబియా రిన్యూవబుల్ విద్యుదుత్పత్తికి కొరకు చేస్తున్న కృషిని గుర్తించింది. గ్రీనింగ్ ఎఫీషియంసీ రగంలో ప్రథమ 10 స్థానాలలో ఉన్న ప్రపంచదేశాలలో కొలంబియా ఒకటి.

సహజ వనరులు

సహజవనరులలో కొలంబియా సుసంపన్నంగా ఉంది. కొలంబియా ఎగుమతులలో " ఖనిజాలు, ఆయిల్, డిస్టిలేషన్ ఉత్పత్తులు, పండ్లు , ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఎగుమతులలో చక్కెర, చక్కెర మిఠాయి, ఆహారౌత్పత్తులు, ప్లాస్టిక్స్, విలువైన రత్నాలు, లోహాలు, వన్య ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, వాహనాలు, ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎలెక్ట్రికల్ ఉపకరణాలు, సెంట్లు , సౌందర్య సాధనాలు, మిషనరీ, మాన్యుఫాక్చర్ ఆర్టికల్స్, వస్త్రాలతయారీ , దుస్తులు, పాదరక్షలు, గాజు , గాజు సామానులు, నిర్మించిన భవనాలు, ఫర్నీచర్, మిలటరీ ఉత్పత్తులు, గృహ , కార్యాలయ వస్తువులు, నిర్మాణ ఉపకరణాలు, సాఫ్ట్ వేర్ ప్రాధాన్యత వహిస్తున్నాయి. వాణిజ్య ప్రాధాన్యత కలిగిన దేశాలలో యునైటెడ్ స్టేట్స్, చైనా,యురేపియన్ యూనియన్ , లాటిన్ అమెరికన్ దేశాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. సంరదాయేతర ఎగుమతులు కొలంబియా విదేశీ అమ్మకాలలో విప్లవాత్మక అభివృద్ధి కలిగించాయి. స్వేచ్ఛావిఫణి ఒప్పందాలద్వారా ఎగుమతుల విధానంలో సంభవించిన మార్పుద్వారా ఇది సాధ్యం అయింది.2016 లో " నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు డిపార్టుమెంటు ఆఫ్ స్టాటిస్టిక్స్ " నివేదికలు కొలంబియాలోని 28% ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని తెలియజేస్తుంది.వీరిలో 8.5% అత్యంత దైన్యస్థితిలో జీవిస్తున్నారు. అతి దీనస్థితిలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఆర్ధికసాయం అందించే విధానం అభివృద్ధి చేసింది. సమీపకాల ఆర్ధికాభివృద్ధి గణనీయంగా సరికొత్త మిలియనీర్లను, కొత్త సంస్థల వ్యవస్థాపకులను, బిలియనీర్లను (1 బిలియన్ యు.ఎస్.డి కంటే అధికం) అధికరించేలా చేసింది.2016 లో కొలంబియన్ " ట్రావెల్ & పర్యాటకం " ద్వారా కొలంబియా ఆర్ధికరంగానికి $ 5,880.3 బిలియన్ల యు.ఎస్.డి ఆదాయం లభించింది. పర్యాటకరంగం 5,56,135 మందికి ఉపాధి (మొత్తం ఉపాధిలో 2.6%. )కల్పిస్తుంది. 2007 లో 0.6 మిలియన్ల విదేశీ పర్యాటకులు కొలంబియాను సందరించగా 2015 లో ఈసంఖ్య 2.98 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది.

సైంస్ , టెక్నాలజీ

కొలంబియా 
COLCIENCIAS is a Colombian Government agency that supports fundamental and applied research.

కొలంబియాలో 3,950 కంటే అధికమైన పరిశోధన బృందాలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థ " ఇంపుల్స " ఆరంభ సంస్థలకు గ్రాంటులను అందిస్తూ సంస్థస్థాపన , సరికొత్త పరిశోధనలకు ప్రోత్సాహం అందిస్తుంది. అదనంగా ఇతర సేవలను అందిస్తుంది.తరువాత కమ్యూనిటీ చిన్న పెద్ద కంపెనీలకు ఆరంభసంస్థలకు సహకార వర్క్ స్పేస్ తలెత్తాయి. సైంటిఫిక్ వర్క్ ఆసక్తి కలిగిన యువత కొరకు కొలంబియాలో " కార్పొరేషన్ ఫర్ బౌఅలాజికల్ రీసెర్చి " విజయవంతంగా అభివృద్ధి చేయబడింది. కొలంబియాలోని " ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ " అధికమౌతున్న " భూతాపం " , " ఆహార రక్షణ " గురించి పరిశోధన చేస్తుంది. కొలంబియాలో వైద్యసంబంధమైన ముఖ్యమైన పరిశోధనలు జరిగాయి.ఎలెక్ట్రానిక్ ఇంజనీర్ " జార్జ్ రెనాల్డ్స్ పొంబొ " గుండెపోటుతో బాధపడే వారికి ముఖ్యత్వం ఇస్తూ కనిపెట్టిన " ఎక్స్టర్నల్ ఆర్టిఫిషియల్ పేస్‌మేకర్ విత్ ఇంటర్నల్ ఎలెక్ట్రోడ్స్ " గుండెజబ్బు వ్యాధిగ్రస్థులకు సహకరిస్తూ ఉంది.తరువాత నేత్రచికిత్సకు ఉపకరించే మైక్రొకెరాటోం , కెరాటోమైల్యూసిస్ టెక్నిక్ కనిపెట్టబడ్డాయి.అలాగే హైడ్రోసెఫలస్ చికిత్సకు సహకరించే హకిం వాల్యూ కనిపెట్టబడింది. కొలంబియా తనస్వంత సైనికావసరాలకు , ప్రంపచావసరాల కొరకు సరికొత్త మిలటరీ టెక్నాలజీ అభివృద్ధిచేయడం ప్రారంభించింది. ప్రత్యేకంగా పర్సనల్ బాలిస్టిక్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్, మిలటరీ హార్డ్ వేర్, మిలటరీ రొబొట్లు, బాంబులు, సిమ్యులేటర్లు , రాడార్ పరిశోధనలు చేపట్టింది. కొలంబియన్ పరిశోధకులలో జోసెఫ్.ఎం.తొహ్మె " జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ " మాన్యుయెల్ ఎల్కిన్ పటర్రొయొ " మలేరియా కొరకు (సింథటిక్ వ్యాక్సి), " ఫ్రాంసిస్కొ లొపెరా " (పెయిసా మల్టేషన్ ) మొదలైన పరిశోధకులు ప్రధాన్యత వహిస్తున్నారు. అలాగే రొడాల్ఫ్ లినాస్ (ఇంట్రిన్సిక్ న్యూరాన్ ప్రాపర్టీ అధ్యయనం) ఇది మెదడు పనితీరు అర్ధంచేసుకోవడానికి సహకరిస్తుంది, (దియరీ ఆఫ్ సిండ్రోం అధ్యయనం, జైరొ క్యుయిరొగ ప్యూలో (కేరక్టరైజేషన్ ఆఫ్ సింథటిక్ సంస్టాంస్ అధ్యయనం) ఇది ఫంగస్, ట్యూమర్స్, ట్యూబర్కులోసిస్, కొన్ని వైరస్‌ల మీద పోరాడుతుంది. అలాగే రెస్ట్రెపొ (కచ్చితమైన మెడికల్ డయాగ్నొసెస్) ప్రాముఖ్యత వహిస్తున్నారు.

మౌలికసౌకర్యాలు

కొలంబియా 
Port of Cartagena.

" మినిస్టరీ ఆఫ్ ట్రాంస్పోర్ట్ " పర్యవేక్షణలో కొలంబియా రావాణా క్రమబద్ధీకరణ చేయబడుతుంది. జాతీయ రహదారులు బాధ్యతను హైవేస్ ఇన్ కొలంబియా (13,000 కి.మీ) వహిస్తుంది." ది ఎయిరొసివి " అవియేషన్, ఎయిర్ పోర్టుల బాధ్యత వహిస్తుంది. " నేషనల్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఏజెంసీ ", ఇన్ చార్జ్ ఆఫ్ కంసెషంస్ డిజైన్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ, ట్రాంస్పోర్ట్ ఇంఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతుంటాయి. " ది జనరల్ మారీటైం డైరెక్టరేట్ " కోర్డినేషన్ ఆఫ్ మారీటైం ట్రాఫిక్ కంట్రోల్, కొలంబియన్ నేవీ లకు బాధ్యత వహిస్తుంది. 2016-2020 మద్య కొలంబియా 7,000 కి.మీ రహదారి నిర్మించడం లక్ష్యంగా 20% నిర్ణయించి ప్రయాణసమయం, రవాణావ్యయం తగ్గించడానికి యోచిస్తుంది. టాల్ రోడ్ కంసెషంస్ ప్రోగ్రాంలో 40 ప్రణాళికలు ఉన్నాయి. రైల్వే విధానం, మగ్డలేనా నదిని తిరిగి రవాణాకు అనుకూలంగా మార్చడం, నౌకాశ్రయనగరాలను అభివృద్ధి చేయడం, బొగొటా విమానాశ్రయం విస్తరణ మొదలైన మౌలిక నిర్మాణాల వ్యయానికి $50 బిలియన్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసింది.

గణాంకాలు

కొలంబియా 
Population density of Colombia

2017లో కొలంబియా జనసంఖ్య 49 మిలియన్లు. జనసంఖ్యలో లాటిన్ అమెరికా దేశాలలో కొలంబియా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో బ్రెజిల్, మెక్సికో దేశాలు ఉన్నాయి. స్పానిష్ భాషా వాడుకరుల సంఖ్యాపరంగా కొలంబియా ప్రపంచంలో మూడవస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ దేశాలు ఉన్నాయి. 20వ శతాబ్దం అఆరంభంలో కొలంబియా జనసంఖ్య 4 మిలియన్లు. 1970 నుండి కొలంబియా సంతానోత్పత్తి, మరణాలు, జనసంఖ్యాభివృద్ధి తగ్గుముఖం పట్టింది. 2015లో జనసంఖ్యాభివృద్ధి 0.9%. 2015 సరాసరి సంతానోత్పత్తి 1.9. ప్రజలలో 15 సంవత్సరాలలోపు వారిశాతం 26.8%, 15-64 మద్య వయస్కులు 66.7%, 65 వయసు పైబడినవారి శాతం 7.4%. వయసుపైబడిన వారి సంఖ్య క్రమంగా గణనీయంగా అధికరిస్తూ ఉంది. 2020 నాటికి కొలంబియా జనసంఖ్య 50 మిలియన్లు, 2050 నాటికి కొలంబియా జనసంఖ్య 55 మిలియన్లు ఉంటాయని అంచనావేయబడింది. ఆండెన్ ఎగువభూభాగంలో, కరీబియన్ సముద్రతీరంలో జసంఖ్య అధికంగా కేంద్రీకరించి ఉంది. ఆండెన్ ప్రాంతం కంటే కరీబియన్ ప్రాంతంలో జనసాంధ్రత అధికం. తూపుప్రాంతంలోని 9 దిగువభూభాగ డిపార్ట్మెంట్ల మొత్తం వైశాల్యం కొలంబియా వైశాల్యంలో 54% ఉంటుంది. ఇక్కడ జనసంఖ్య 6% కంటే తక్కువగా ఉంటుంది. సంప్రదాయంగా గ్రామీణప్రాంతం అధికంగా ఉన్న కొలంబియా 20వ శతాబ్దం నుండి త్వరితగతిలో నగరీకరణ చేయబడింది. లాటిన్ అమెరికా దేశాలలో అత్యధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో కొలంబియా ఒకటి. 1938 నగరప్రాంత జనసంఖ్య 31% అభివృద్ధి చెందగా 1973 నాటికి 60%, 2014 నాటికి 76%కి చేరుకుంది. 1938లో 3,00,000 ఉన్న బొగొటా జనసంఖ్య నుండి ప్రస్తుత కాలానికి 8 మిలియన్లకు చేరుకుంది. 2012 గణాంకాల ఆధారంగా అంతర్జాతీయంగా విస్తరించిన జనసంఖ్య కలిగిన ప్రపంచదేశాలలో కొలంబియా ప్రథమస్థానంలో ఉంది.దాదాపు 4.9 మిలియన్ల కొలంబియన్ ప్రజలు దేశానికి వెలుపల నివసిస్తున్నారని అంచనా.2015 గణాంకాల ఆధారంగా ఆయుఃప్రమాణం 74.8 సంవత్సరాలు. శిశుమరణాలు ప్రతి వెయ్యి మందికి 13.6. 2015 గణాంకాల ఆధారంగా వయోజనుల అక్షరాస్యత 94.58%, యువత అక్షరాస్యత 98.66%. ప్రభుత్వం 4.49% జి.డి.పి. విద్యాభివృద్ధి కొరకు వ్యయం చేస్తుంది. హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో కొలంబియా మూడవస్థానంలో ఉంది.

భాషలు

కొలంబియాలో 99.2% ప్రజలకు స్పానిష్ వాడుకభాషగా ఉంది. 65 అంరిండియన్ భాషలు, 2 క్రియోల్ భాషలు, రోమాని భాష మరుయు కొలంబియన్ సైగల భాషలు కూడా మాట్లాడుతుంటారు. ఆర్చిపిలాగో ఆఫ్ శాన్ ఆండ్రెస్, ప్రొవిడెనికా, శాంటా కాటాలినా ప్రాంతాలలో ఆంగ్లభాకు అధికార హోదా ఉంది. కొలంబియాలో స్పానిష్ భాషతో చేర్చి మొత్తం 101 భాషలు జాబితాలో (ఎథ్నోలాగ్ డేటాబేస్) చేర్చబడ్డాయి. మాట్లాడే భాషలు కొంచం వేరుపడుతూ ఉన్నాయి. కొందరు రచయితలు యాసల అనుసరించి ఒకే భాషను వేరు వేరు భాషలుగా భావిస్తుంటారు. వీటిలో కచ్చితమైన జాబితా అని భావిస్తున్న జాబితాలో 71 భాషలు ప్రస్తుతం దేశంలో మాట్లాడబడుతున్నాయి. ఇవి అధికంగా చిబ్చన్, టుకనొయన్, బొరా- విటొటొ, గుజుబొయాన్, అరవాకన్, కరీబియన్, బార్బకోయన్, పియరొయా భాషాకుటుంబాలకు చెందినవై ఉన్నాయి.ప్రస్తుతం 8,50,000 మందికి స్థానిక భాషలు వాడుకభాషగా ఉన్నాయి.

సంప్రదాయ ప్రజలు

Human biological diversity and ethnicity
Percentage
Mestizo and White
  
86%
Black (includes Mulatto)
  
10.6%
Amerindian
  
3.4%
Roma
  
0.01%

కొలంబియా వైవిధ్యమైన సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న దేశం. ఆరంభంలోవీరిలో స్థానికులు, కాలనిస్ట్ స్పానిష్ ప్రజలు, ఆఫ్రికన్ కొలంబియన్లు (వీరు బానిసలుగా దేశంలోకి తీసుకుని రాబడ్డారు ఉన్నారు. 20వ శతాబ్దంలో ఐరోపా డయాస్పొరా (దేశాంతర ఉద్యోగులు), అరబ్ కొలంబియన్లు కొలంబియా చేరారు. గణాంకాల చరిత్రను కాలనియల్ చరిత్ర ప్రభావితం చేస్తుంది. శ్వేతజాతీయులు బొగొటా, మెడెల్లిన్ లేక కాలి మొదలైన నగరప్రాంతాలు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఎగువప్రాంత నగరాలలో అధికంగా నివసిస్తున్నారు. ప్రధాన నగరాలలో మెస్టిజోలు అధికంగా నివసిస్తున్నారు. ఆండెన్ ఎగువప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో స్పానిష్ కాంక్వరర్లు అమెరిండియన్ రాజ్యాలలోని స్త్రీలతో కలిసి నివసిస్తుంటారు. సమీపకాలంలో మహానగర విస్తరణలో చేర్చబడిన నగరప్రాంతాలలో నివసిస్తున్న మెస్టిజోలలో కళాకారులు, చిరువ్యాపారులు ప్రధానపాత్ర వహిస్తున్నారు. 2005 గణాంకాల ఆధారంగా సంప్రదాయేతర ప్రజలలో శ్వేతజాతీయులు మెస్టిజోలు 86%, ఆఫ్రో కొలంబియన్లు 10.6%, ఇండిజెనియస్ ప్రజలు 3.4%, రోమాని ప్రజలు 0.01% ఉన్నారని భావిస్తున్నారు. అనధికార గణాంకాల ఆధారంగా కంబోడియాలో 49% ప్రజలు మెస్టిజోలు, 37% ప్రజలు శ్వేతజాతీయులు (వీరిలో స్పానిష్ సంతతికి చెందిన ప్రజలు), అరబ్ సంతతికి చెందిన ప్రజలు, స్వల్పసంఖ్యలో ఇటాలియన్ ప్రజలు, జర్మన్ ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు.

People with African ancestry in Colombia are concentrated mostly in coastal areas.
Amerindian population of Colombia by municipality in 2005.

ఇండిజెనియస్ ప్రజలసంఖ్య అధికంగా స్పానిష్ పాలనలో తగ్గుముఖం పట్టింది. వీరిలో చాలామంది మెస్టిజోలలో ఐక్యం అయ్యారు. ప్రస్తుతం మిగిలిన ప్రజలలో 80 వైవిధ్యమైన సంస్కృతులు ఉన్నాయి. ఇండిజెనియస్ ప్రజల కొరకు 3,05,71,640 చ.కి.మీ వైశాల్యమైన భూభాగం రిజర్వు చేయబడింది. ఇది దేశం మొత్తం వైశాల్యంలో 27% ఉంది. ఇక్కడ దాదాపు 8,00,000 మంది నివసిస్తున్నారు. ఇండిజెనియస్ ప్రజలలో అధికసంఖ్యలో వయూ ప్రజలు,. పీజ్ ప్రజలు, పాస్టోస్ ప్రజలు, ఎంబెరా ప్రజలు ఉన్నారు . లా గుజిరాల్, కౌకా, నరినొ, కార్డొబా, సుక్రే డిపార్టుమెంట్లలో అధికసంఖ్యలో ఇండిజెనియస్ ప్రజలు నివసిస్తున్నారు. 1982లో నేషనల్ ఇండిజెనియస్ ఆర్గనైజేషన్ ఆఫ్ కొలంబియా స్థాపించబడింది. కొలంబియా 1991లో " ఇంటర్నేషనల్ లా కంసర్నింగ్ ఇండిజెనియస్ పీపుల్స్ మీద సంతకం చేసింది.1989లో ఇండిజెనియస్ అండ్ ట్రైబల్ పీపుల్స్ కాంవెంషన్ మీద సంతకం చేసింది. 16వ శతాబ్ధం ఆరంభంలో బ్లాక్ ఆఫ్రికన్లు సముద్రతీర దిగువభూములకు బానిసలుగా తీసుకుని రాబడ్డారు. 19వ శతాబ్ధం వరకు పరిస్థితి కొనసాగింది.ప్రస్తుతం పసిఫిక్ సముద్రతీరం , కరీబియన్ సముద్రతీరాలలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. కొలంబియా పసిఫిక్ సముద్రతీరంలో ఉన్న చొకొ డిపార్టుమెంటులో బ్లాక్ ఆఫ్రికన్లు 80% నివసిస్తున్నారు. బ్రిటిష్ ప్రజలు, జమైకన్ ప్రజలు శాన్ ఆండ్రెస్ , ప్రొవిడెంసియా ద్వీపాలకు వలస పోయారు. ఇతర యురేపియన్లు , ఉత్తర అమెరికన్లు 19 - 20 శతాబ్ధాలలో ఇక్కడకు వచ్చి చేరారు. రెండవ ప్రపంచ యుద్ధకాలం , తరువాత కాలంలో సోవియట్ యూనియన్ నుండి ప్రజలు ఇక్కడకు వలస వచ్చరు. వలస ప్రజల కమ్యూనిటీలు అధికంగా కరీబియన్ సముద్రతీరంలో నివసిస్తున్నారు. ప్రత్యేకంగా పశ్చిమాసియా దేశాలు (మిడిల్ ఈస్ట్) నుండి వలస వచ్చిన ప్రజలు బర్రంక్విల్లాలో , ఇతర కరీబియన్ నగరాలలో లెబనీస్ ప్రజలు , అరబ్ ప్రజలు నివసిస్తున్నారు. కొలంబియాలో చైనీస్ ప్రజలు, జపానీస్ ప్రజలు, రోమానీ ప్రజలు , యూదులు ఉన్నారు. వెనుజులా ఆర్ధిక , రాజకీయ పరిస్థితి కారణంగా పెద్ద మొత్తంలో వెనుజులియన్ ప్రజలు కొలంబియాకు వలస వచ్చారు.

మతం

కొలంబియా 
The Las Lajas Sanctuary in the southern Colombian Department of Nariño

" ది నేషనల్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టాటిస్టిచ్స్ " మతపరమైన గణాంకాలు సేకరించ లేదు కనుక కచ్చితమైన నివేదిక లభించడం కష్టం. అయినప్పటికీ ఇతర అధ్యయనాల ఆధారంగా ప్రజలలో 90% కంటే అధికం క్రైస్తవమతాన్ని అనుసరిస్తున్నారు. వీరిలో 70.9% రోమన్ కాథలిక్కులు, 16.7% ప్రొటెస్టెంట్లు (ప్రధానంగా ఎవాంజలిజం) ఉన్నారు. నాస్థికులు 4.7% (అథిస్టులు లేక అగోనిస్టులు), 3.5% భగవంతునియందు విశ్వాసం ఉన్నప్పటికీ ఏమతాన్ని అనుసరించరు. 1.8% కొలంబియన్లు జెహోవాస్ విట్‌నెస్, అడ్వెంటిజం అనుసరిస్తున్నారు. 1% కంటే తక్కువగా ముస్లిములు, జ్యూడిజం, బుద్ధిజం, మొర్మొనిజం, హిందూయిజం, అనిమిజం (ఇండిజెనియస్ మతం), హరేకృష్ణా ఉద్యమం, రాస్టాఫరి ఉద్యమం, ఆర్థడాక్స్ కాథలిక్ చర్చి, ఆధ్యాత్మిక అధ్యయనాలు మొదలైన విశ్వాలకు చెందిన ప్రజలు ఉన్నారు.మిగిలిన ప్రజలు తమ స్పందన తెలియజేయలేదు. 35.9% ప్రజలు తాము తమ మతాచారాలను అనుసరించడం లేదని తెలియజేసారు. కొలబియాలో రోమంకాథలిక్ అత్యధికంగా ఉన్నప్పటికీ 1991 లో కొలంబియన్ రాజ్యాంగం ప్రజలందరికీ మతస్వాతంత్ర్యం కల్పించింది.

పెద్ద నగరాలు

కొలంబియా అధికంగా నగరీకరణ చేయబడిన దేశం. దేశంలో పెద్దనగరాలలో బొగొటా (8 మిలియన్ల నివాసితులు), మెడెల్లిన్ (2.5 మిలియన్ నివాసితులు), కాలి (2.4 మిలియన్లు), బర్రాంగుయిల్లా (1.2 మిలియన్ల నివాసితులు) ప్రధానమైనవి. నివాసితులు అధికంగా ఉన్న కార్టజెండా, బుకరమంగా నగరం కొలంబియా మహానగరంలో భాగంగా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

డేవిడ్ హోసాక్

మూలాలు


Tags:

కొలంబియా పేరు వెనుక చరిత్రకొలంబియా చరిత్రకొలంబియా భౌగోళికంకొలంబియా వాతావరణంకొలంబియా జీవవైవిధ్యంకొలంబియా ఆర్ధికంకొలంబియా గణాంకాలుకొలంబియా ఇవి కూడా చూడండికొలంబియా మూలాలుకొలంబియాEs-Colombia2.ogaISBN (identifier)en:Wikipedia:Pronunciation respelling keyఆంగ్లంకోస్టారీకాజమైకాదక్షిణ అమెరికాదస్త్రం:Es-colombia.oggనికరాగ్వాపనామాపసిఫిక్ మహాసముద్రంపెరూప్రత్యేక:పుస్తకమూలాలు/9780271029368బ్రెజిల్వాయువ్యంవెనుజులాహైతిహోండురాస్

🔥 Trending searches on Wiki తెలుగు:

రమ్యకృష్ణగజము (పొడవు)భారతీయ సంస్కృతికల్లుకవిత్వంజవహర్ నవోదయ విద్యాలయంసింహరాశిజవాహర్ లాల్ నెహ్రూఅమ్మఇంటి పేర్లువిశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంసుందర కాండనమితమే 3ఆర్తీ అగర్వాల్త్రిఫల చూర్ణంఎన్నికలుకంసుడుతాటి ముంజలుదున్నపోతుఓంకొంపెల్ల మాధవీలతఈనాడులక్ష్మణ ఫలంసాలార్ ‌జంగ్ మ్యూజియంశెట్టిబలిజకె. నారాయణరామసహాయం సురేందర్ రెడ్డిధాన్యంరోహిణి నక్షత్రంకుమ్మరి (కులం)సమాచార హక్కుయానాంశతభిష నక్షత్రమువాట్స్‌యాప్తెలుగు భాష చరిత్రనువ్వులుతమిళ అక్షరమాలవై.యస్. రాజశేఖరరెడ్డిపుష్కరంతెలుగు అక్షరాలురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)రజాకార్సూర్యవంశం (సినిమా)మాధవీ లతఎంసెట్హస్తప్రయోగంఊరు పేరు భైరవకోననటాషా స్టాంకోవిక్భీష్ముడుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంమదర్ థెరీసాదివ్యవాణితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంప్రియమణినాగార్జునసాగర్నవగ్రహాలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గండి. కె. అరుణపార్లమెంటు సభ్యుడుబలి చక్రవర్తిశ్రవణ నక్షత్రముజయప్రకాశ్ నారాయణ్అ ఆదశదిశలుహెచ్.డి.దేవెగౌడఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంచే గువేరాజాతిరత్నాలు (2021 సినిమా)సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్మహాభాగవతంతెలుగు సినిమాలు డ, ఢహను మాన్మానవ శరీరమురక్తంఅల్లుడా మజాకాలోక్‌సభ🡆 More