మారిటానియా

అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ మౌరిటానియ అని పిలువబడే మౌరిటానియ అరబ్బీ: موريتانيا‎ (సోనిన్కే:మురుటానే ; పులార్: మొరిటని French: మౌరిటానె) ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం.

ఈ దేశ పశ్చిమసరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో పశ్చిమ సహారా ఎడారి, ఈశాన్యంలో అల్జీరియ దేశం తూర్పు, ఆగ్నేయంలో మాలి దేశం, నైరుతిలో సెనెగల్ దేశం ఆనుకొని ఉన్నాయి. ఈ దేశానీ పేరును రోమన్ తాలూకా అయిన మౌరెటనియా గుర్తుగా పెట్టారు. ప్రస్తుతం ఈ దేశం పాత రోమన్ తాలూకా కంటే ఎన్నోరెట్లు విశాలమైనది. ఈ దేశ రాజధాని, పెద్ద పట్టణం నౌక్చోటు అట్లాంటిక్ తీరంలో ఉంది.

الجمهورية الإسلامية الموريتانية
Al-Jumhūriyyah al-Islāmiyyah al-Mūrītāniyyah
Republik bu Lislaamu bu Gànnaar
République Islamique de Mauritanie
Islamic Republic of Mauritania
Flag of Mauritania Mauritania యొక్క Seal
నినాదం
شرف إخاء عدل   (Arabic) (English: Honor, Fraternity, Justice)
జాతీయగీతం
National Anthem of Mauritania
Mauritania యొక్క స్థానం
Mauritania యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Nouakchott
18°09′N 15°58′W / 18.150°N 15.967°W / 18.150; -15.967
అధికార భాషలు Arabic1
ప్రజానామము Mauritanian
ప్రభుత్వం Islamic republic2
 -  President Mohamed Ould Abdel Aziz
 -  Prime Minister Moulaye Ould Mohamed Laghdaf
Independence from France 
 -  Date 28 November 1960 
 -  జలాలు (%) 0.03
జనాభా
 -  2009 అంచనా 3,291,000 (135th)
 -  1988 జన గణన 1,864,236 
జీడీపీ (PPP) 2009 అంచనా
 -  మొత్తం $6.326 billion 
 -  తలసరి $2,037 
జీడీపీ (nominal) 2009 అంచనా
 -  మొత్తం $3.029 billion 
 -  తలసరి $975 
జినీ? (2000) 39 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.520 (medium) (154th)
కరెన్సీ Ouguiya (MRO)
కాలాంశం (UTC+0)
 -  వేసవి (DST) not observed (UTC+0)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mr
కాలింగ్ కోడ్ +222
1According to article 6 of Constitution: The national languages are Arabic, Pulaar, Soninke, and Wolof; the official language is Arabic
2Not recognized internationally. Deposed leaders President Sidi Ould Cheikh Abdallahi and Prime Minister Yahya Ould Ahmed El Waghef no longer have power as they were arrested by military forces.

2008 ఆగస్టు 6 న జనరల్ మొహమదు ఔల్ద్ అబ్దేల్ అజీజ్ నేతృత్వంలో సైన్యం తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టింది. 2009 ఏప్రిల్ 16న జనరల్ అజీజ్ సైన్యం నుంచి రాజీనామా చేసి దేశ అధ్యక్షుడి పదవి కోసం జూలై 19 ఎన్నికలలో పోటి చేసి గెలిచాడు. మౌరిటానియలో 20 % మంది ప్రజల ఆదాయం రోజుకు 1.25 డల్లర్లు కన్నా తక్కువ.

చరిత్ర

పురాతన చరిత్ర

బఫౌర్లు ప్రాథమికంగా వ్యవసాయదారులు. చారిత్రిక దేశ దిమ్మరుల జీవన శైలిని వదిలిన మొట్టమొదటి సహారా ప్రజలుగా బఫర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సహారా ఎడారి తరుగుదల కారణంగా వారు దక్షిణం వైపు వలస వచ్చారు.

వారిని అనుసరించి పశ్చిమ అఫ్రికాకి వలస వచ్చినవారిలో మధ్య సహారా వారే కాకుండా చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ 1076లో ఇస్లాం మతం యుద్ధ సన్యాసులు (మురాబిటున్) దాడి చేసి పురాతన ఘనా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. తరువాతి 500 సంవత్సరాలు అరబ్బులు స్థానిక ప్రజల (బెర్బెర్లు, బెర్బెర్లు కాని వారు) నించి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను తట్టుకుని మౌరిటానియలో ఆధిపత్యం చెలాయించారు. బెని హసన్ జాతి యెమన్ మక్యిలు అరబ్బు ఆక్రమణదారుల మీద జరిపిన మౌరిటనియా 30 సంవత్సరాల యుద్ధం సత్ఫలితాలను ఇవ్వక వారు ఓడిపోయారు.

బెని హసన్ యోధుల వారసులు ఇస్లాం సమాజంలో ఆధిక్యత కలిగిన జాతిగా పరిగణించబడ్డారు. ఇస్లాం సంప్రదాయాన్ని రక్షించి, బోధించే మరబౌట్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చెయ్యటం ద్వారా బెర్బర్లు తమ ప్రభావాన్ని నిలుపుకున్నారు. చాలా మటుకు బెర్బెర్ తెగ వారు ఎమిని (కొన్నిసార్లు అరబ్) వారమని పేర్కొన్నప్పటికీ: దీనిని బలపరచడానికి చారిత్రిక ఆధారాలు తక్కువ, కొన్ని పరిశోధనలు రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొన్నాయి. బెర్బెర్ ప్రభావం ఉన్న అరబిక్ భాష హస్సనియా, దీని పేరు బెని హసన్ పేరు నుంచి వచ్చింది, ఈ భాష అధిక శాతం దేశ దిమ్మర జనాభాతో వాడుకలోకి వచ్చింది.

ఆధునిక చరిత్ర

19వ శతాబ్దం ప్రథమార్దంలో ఫ్రాన్సు రాజ్యం మెల్లగా సెనెగల్ నదీ ప్రాంతం నుంచి పైకి ప్రస్తుత మౌరిటానియలో చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. 1901లో, జేవియర్ కొప్పోలని రాచకార్యానికి నేతృత్వం వహించాడు. జావియ తెగ వారితో వ్యూహాత్మక సంధి ద్వారా, సైనిక ఒత్తిడితో హస్సనే యోధులను వశపరుచుకున్నాడు. ఫ్రెంచ్ పాలనను మౌరిటానియ సామంత రాజ్యాల పైన త్వరగా వ్యాప్తి చేయగలిగాడు.తరర్జా, బ్రాక్న, తాగంట్ సామంతులు సంధుల ద్వారా వెంటనే పరదేశ పాలనకు తలోగ్గారు (1903-04), కాని ఉత్తర ప్రాంత సామంత రాజ్యం అయిన అద్రార్ పరదేశ పాలనకు విరుద్దంగా పోరాటం (జిహాద్) చేస్తున్న శాయఖ్మా అల్-అయినిన్ సహకారంతో చాలా కాలం విరోధించారు. అది కూడా 1912 సైనిక చర్యతో ఓడిన తరువాత మౌరిటానియ రాజ్యంలో చేర్చబడింది, 1904లో సరిహద్దులను గీసారు. తద్ఫలితంగా మౌరిటానియ ఫ్రెంచ్ పాలనలో ఉన్న పశ్చిమ ఆఫ్రికా భాగంలో 1920న చేరింది.

ఫ్రెంచ్ పాలనలో బానిసత్వం పైన ఆంక్షలు విధించబడ్డాయి, అంతే కాకుండా తెగల మధ్య యుద్ధాలు ముగిసాయి. పరదేశి పాలనలో చాలా మటుకు జనాభా దేశ దిమ్మరులుగానే ఉన్నారు, కానీ పుర్వంలో వెలి వేయబడ్డవారు, మెల్లిగా మౌరిటానియకు వెనక్కి వచ్చారు. 1960లో ఆ దేశం స్వతంత్రం అయినప్పటికి, ఇప్పటి రాజధాని అయిన నౌఖ్చోట్ ను ఒక చిన్న పల్లె అయిన కాసర్ దగ్గర స్థాపించారు, అప్పటికి అక్కడి 90% జనాభా దేశ దిమ్మరిలుగానే ఉన్నారు.

1970వ దశకంలో అతి పెద్ద సాహేల్ కరువు మౌరిటానియకు పెద్ద సమస్యలు తెచ్చిపెట్టింది. స్వతంత్రం రావడంతో అనాదిగా ఉన్న సహారా-ఆఫ్రికా ప్రజలు (హాల్పులార్, సోనిన్కే,, వలోఫ్) మౌరిటానియలో సెనెగల్ నది ఉత్తర ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరి విద్యాభ్యాసం ఫ్రెంచ్ భాషలో జరిగింది. ఫ్రెంచ్ ఆచార వ్యవహారాలను అనుకరించి వీరు కొత్త దేశంలో సైనికులు, గుమాస్తాలు, పెభుత్వ నిర్వాహక వ్యవస్థలో ఉద్యోగాలు పొందారు. ఫ్రెంచ్ సైన్యం ఉత్తరాన చిత్తడి నేలలలో మొండిగా ఉన్న మూరిష్ కి చెందిన హస్సనే తెగలను అణిచి వేయడంతో ఇది సాధ్యపడింది, దక్షిణ జనాభాలు, మూరల మధ్య తగాదాలను సృష్టించారు. ఉత్తర దక్షిణ ప్రాంతాల తెగల మధ్య హరాటిన్ తెగ ఉండేది, వీరి జనాభాలో దాదాపుగా అందరూ అరబ్ బానిసలు, వీరు ఆఫ్రికా నల్ల జాతీయులు, వీరు చిత్తడి నేల ప్రాంతంలో జీవించేవారు.వీరిని నిమ్న కులంగా పరిగణించేవారు. ఆధునిక సమాజ బానిసత్వం ఈ దేశంలో ఒక మాములు వ్యవహారం. కొన్ని గణాంకాల ప్రకారం దాదాపు 600,600 లేదా 20% మంది మౌరిటానియ ప్రజలు ఇంకా బానిసత్వంలో మగ్గుతున్నారు. ఈ సామజిక అసమానత్వం ముఖ్యంగా దేశ ఉత్తర ప్రాంతనికి చెందిన "బ్లాక్ మూర్స్" (హరాటిన్) తెగలలో కనిపిస్తుంది.ఈ ప్రాంతంలో "వైట్ మూర్స్" పెత్తనం చెలాయిస్తారు. కానీ దక్షిణ ప్రాంత నిమ్న జాతులకు చెందిన ఆఫ్రికన్ నల్ల వారి జీవన శైలిని ఇటువంటి సామజిక రుగ్మతలు ప్రభావితం చేసాయి.

మారిటానియా 
నౌఖోత్ట్ రాజధాని, మౌరిటానియలో పెద్ద పట్టణం.సహారా ప్రాంతంలో పెద్ద పట్టణాలలో ఇది కూడా ఒకటి.

ఈ మార్పునకు మూరులు స్పందించారు, మౌరిటానియని అరబ్ జీవన శైలికి మార్చాలన్న అరబ్ జాతీయుల ఒత్తిడి కూడా పనిచేసింది. అరబ్ జాతీయులు తమ చట్టాలను, భాషను వీరి పైన రుద్దారు. దీని వల్ల దేశంలో ఒక రకమైన అసమానత్వం పెరిగింది, మూర్లు మౌరిటానియని ఒక అరబ్ దేశంగా భావించారు, వారి అధికార వాంఛ వల్ల ఇబ్బందులు ఎదురు అయ్యాయి, దేశం యొక్క భిన్న ఆచార, సంస్కృతులనూ, సాంఘిక అసమానతలను తొలగించడానికి వివిధ పధకాలు ప్రేవేశపెట్టినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.

ఏప్రిల్ 1989 (ది "1989 ఇవెంట్స్", "మౌరిటానియ-సెనెగల్ బోర్డర్ వార్") లో జరిగిన మత ఘర్షణల వల్ల మతాల మధ్య అగాధం ప్రస్ఫుటంగా కనిపించింది, ఇవి ప్రస్తుతం తగ్గాయి. 1980 దశకం చివరిలో దాదాపు 70,000 మంది మౌరిటానియకి చెందిన ఆఫ్రికా నల్ల జాతీయులను వెలివేసారు. మతాల మధ్య ఉద్రిక్తతలు, పాత సమస్య అయినప్పటికీ ప్రస్తుతము కొనసాగుతున్న బానిసత్వం ప్రస్తుత రాజకీయవాదులకు ఒక ఆసరా. అయినా, అన్ని వర్గాల నుంచి చెప్పుకోదగ్గ ప్రజలు భిన్నమైన సామజిక ఐక్య దేశం కోరుకుంటున్నారు.

ప్రభుత్వ పాలనా యంత్రాంగం సాంప్రదాయ పాలన, ప్రత్యేక సంస్థలు,, ప్రభుత్వ-వ్యక్తిగత సంస్థల మిశ్రమం. దేశ ఆంతరంగిక శాఖ ప్రాంతాల పాలనను పర్యవేక్షిస్తుంది, ఫ్రెంచ్ పాలనా విధానాన్ని సవ్యంగా అమలుపరిచే విధంగా కృషి చేస్తుంది. ఈ వ్యవస్థ కింద, రాజధాని జిల్లా అయిన నౌక్చొట్ తో కలిపి మౌరిటానియను పదమూడు ప్రాంతాలుగా (విలాయ ) విభజించారు. దేశ పాలన మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ పైన ఆధారపడి ఉంటుంది, కానీ 1992 నుంచి జాతీయ, పురపాలక ఎన్నికలు జరపడం వల్ల కొద్ది మేర అధికార వికేంద్రికరణంకుఅవకాశం కుదిరింది.

1976లో మౌరిటానియ, మొరాకో కలిపి పశ్చిమ సహారాను పంచుకున్నాయి. పూర్వ సామ్రాజ్య శక్తి అయిన స్పెయిన్ కోరిన మీదట మౌరిటానియ సహారా ప్రాంతంలో మూడింట ఒక వంతు ప్రదేశాన్ని తీసుకున్నారు. అల్గిరియా సైన్య, ఆయుధ సహకారం,, మొరాకో వ్యతిరేకి అయిన స్థానిక హెగెమొన్ సహకారం ఉన్నప్పటికీ పోలిసారియోలో పెద్ద సంఖ్యలో సైనిక నష్టాల తరువాత మౌరిటానియ 1979లో ఆ ప్రాంతం నుంచి వెనుతిరిగింది. ఆ ప్రాంతాన్ని మొరాకో కైవసం చేసుకుంది. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా మౌరిటానియ ఆ ప్రాంతంలో ప్రాభవం కోల్పోయింది. సరిహద్దు వివాదాలను సైనిక చర్యతో కాకుండా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తుంది. చాలా మటుకు పశ్చిమ సహారా ప్రాంతాము మొరాకో అధీనంలో ఉన్నప్పటికీ, ఆ ప్రాంత ప్రజలు తమ మనోభావలను స్వేచ్ఛగా వ్యక్త పరచాలాని ఐక్యరాజ్యసమితి కోరుతుంది: తోందరలో ఒక ప్రజా అభిప్రాయ సేకరణ చెయ్యాలని యోచిస్తోంది. పురాతన సహ్రవిలు వేరుగా ఏర్పరిచిన సహ్రవి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో ఉండటానికి ఇష్టపడతారా లేక మొరాకో వైపు మొగ్గచుపుతరా అని నిర్ధారణ కావలసి ఉంది. మొరాకో ప్రభుత్వం ఈ ప్రజా అభిప్రాయ సేకరణని జరపనివ్వలేదు.

ఔల్ద్ దాద్దః శకం (1960-78)

స్వతంత్రం తరువాత ఫ్రెంచి వారిచే నియమించబడిన అధ్యక్షుడు మొక్తరు ఔల్దు దద్దః మౌరిటానియాను 1964లో ఏకపార్టీ పాలనలో ఉండేలా రాజ్యాంగం తయారు చేసి అధ్యక్షపాలన అమలుపరిచారు. దద్దః సొంత పార్టీ " డు పీపుల్ మౌరిటానియా " (పి.పి.ఎం) ఏక పార్టీ ఏలుబడి విధానం వల్ల అధికారంలోకి వచ్చింది. మౌరిటానియ పశ్చిమ దేశాల శైలిలో బహుళ రాజకీయ పార్టీ విధానంలో పాలన అమలు చేయడానికి ప్రజాతంత్రానికి సిద్ధంగా లేదని అధ్యక్షుడు తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఏక రాజకీయ పక్ష వ్యవస్థలో 1966,1971, 1976 ఎన్నికలలో దద్దః పోటి లేకుండా గెలిచారు. సహారాలో దక్షిణప్రాంతం చేర్చుకుని "గ్రేటర్ మౌరిటానియ" ఏర్పాటు చేయడానికి జరిగిన యుద్ధం కారణంగా దాదాపు దేశం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా అధ్యక్షుడు దద్దఃను 1978 జూలై 10న రక్త రహిత సైనిక తిరుగుబాటు చేసి పదవి నుంచి తొలగించారు.

సి.ఎం.ఆర్.ఎన్. , సి.ఎం.ఎస్.ఎన్ సైనిక ప్రభుత్వాలు (1978-84)

కర్నలు ముస్తఫా ఔల్ద్ సలేక్ నేతృత్వంలో సి.ఎం.ఆర్.ఎన్. సైనిక ప్రభుత్వం ఒక బలమైన శక్తిగా ఎదగలేకపోయింది. సహ్రవి ఆందోళనకారులు పోలిసారియో ప్రాంతంలో జరిపిన సంఘర్షణ నుండి దేశాన్ని అస్థిరత్వం నుంచి బయటకు తీసుకురాలేకపోయారు కనుక ఆ ప్రభుత్వం కూలిపోయింది. చురుకైన మొహమ్మదు ఖౌన ఔల్దు హైదల్లః నేతృత్వంలో సి.ఎం.ఎస్.ఎన్. అధికారంలోకి వచ్చింది. తరువాత హైదల్లః ఒక బలమైన వ్యక్తిగా ఎదిగాడు. పశ్చిమ సహారా నుంచి వైదొలగి పోలిసారియో ప్రాంతంలో శాంతిని నెలకొల్పాడు. మౌరిటానియా ప్రధాన సహాయక దేశం అల్జీరియాతో సత్సంబంధాలు ఏర్పరిచాడు. కానీ మిగతా దేశాలు అయిన మొరాకో, ఐరోపా మిత్ర దేశం ఫ్రాన్సుతో సంబంధాలు దిగజారి అస్థిరత కొనసాగింది. హైదల్లా సంస్కరణ ఆశలకు విఘాతం కలిగింది. ఈయన ప్రభుత్వం మీద చాలాసార్లు జరిగిన సైనిక తిరుగుబాట్లు విజయవంతం కాలేదు. అంతే కాకుండా సైనిక కుట్రలతో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఆయన రాజకీయం, సైనిక వ్యతిరేకుల పైన రాజీపడని ధోరణి, కఠినంగా వ్యవహరించే తీరు, కొంత మందిని కారాగారంలో బంధించటం లేదా చంపటం వల్ల అయన పట్ల తీవ్ర వ్యతిరేకత అధికరించింది.

1948లో కర్నలు మాఔయ ఔల్ద్ సిద్'అహ్మదు తాయా ఆయనను పదవి నుండి తొలగించాడు. ఈయన సైనిక నియంత్రణ తగ్గించకుండా రాజకీయ ఉద్రిక్త వాతావరణాన్ని కొంత చల్లబరిచాడు. 1980 దశకం చివరిలో అల్జీరియాతో సానుకులతను తగ్గించి మొరాకోతో సంబంధాలను బలపరిచాడు. 1990 దశకం చివరిలో 21 శతాబ్దం ప్రారంభంలో మొరాకోతో సంబంధాలు బలపడ్డాయి. పాశ్చాత్య దేశాలు, పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఉన్న అరబ్ రాజ్యాల సమర్దనను పొందడానికి మౌరిటానియ ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. అయినప్పటికీ పశ్చిమ సహారా పోలిసారియో నుంచి వెలివేయబడ్డ ప్రభుత్వంగా వచ్చిన గుర్తింపు తోలగిపోలేదు. అయినప్పటికీ అల్జీరియాతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఇది పశ్చిమ సహారా వివాదంలో (1980 నుండి) తటస్థత పాటిస్తుంది.

ఔల్దు తాయా పరిపాలన (1984-2005)

గతంలో మాఔయ ఔల్ద్ సిద్'అహ్మదు తాయా పూర్వం నేతృత్వం వహించిన ది పార్టి రిపబ్లికైన్ డెమోక్రటిక్ ఎట్ సోషల్ (పి.ఆర్.డి.ఎస్) పార్టీ మౌరిటానియ రాజకీయాలని ప్రభవితం చేసింది. ఇది దేశంలో నిర్వహించబడిన మొదటి బహుళ పార్టీ రాజకీయ 1992 ఎన్నికలలో విజయం సాధించింది. 1991 జూలైలో జరిపిన ప్రజా అభిప్రాయ సేకరణలో ప్రజలు రాజ్యాంగాన్ని ఆమోదించారు. రక్తపాత రహిత సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన తయా 1984 డిసెంబరు 12న మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు. ఈయన 1992, 1997 ఎన్నికలలో గెలుపొందాడు. సైనిక చర్య తరువాత మౌరిటానియను పరిపాలించిన సైనిక అధికారుల కమిటికి 1978 జూలై - 1992 వరకు నాయకత్వం వహించాడు.

సైనిక పరిపాలనలో రాజకీయపార్టీలను చట్టవిరుద్ధంగా భావించారు. 1991 నుంచి రాజకీయపార్టీలకు చట్టబద్ధత కల్పించారు. 1992 ఏప్రెలు నాటికి ప్రజాపాలనను పునరుద్ధరించి 16 పెద్ద రాజకీయపార్టీలకు గుర్తింపు ఇచ్చారు. 2004 నాటికి 12 రాజకీయపార్టీలు క్రియాశీలకంగా ఉన్నాయి. 1992 నాటి మొదటి ఎన్నికలను ప్రతిపక్షాలు భాహిష్కరించాయి. దాదాపు దశాబ్దం కాలం విధాన సభలో పి.ఆర్.డి.ఎస్. అధికారంలో ఉంది. 1994 జనవరి-ఫిబ్రవరి పురపాలక ఎన్నికలలో ప్రతిపక్షాలు పాల్గొని తరువాత దేశ అధ్యక్ష ఎన్నికలలో పాల్గొన్నాయి. 2004 ఏప్రెలులో ప్రాంతీయపార్టీలు విధానసభలో మూడు స్థానాలతో ప్రాతినిధ్యం పొందారు.

2003 జూన్ 8న పూర్వ, ప్రస్తుత సైనిక అధికారులు కలిసి అధికారం హస్తగతం చేసుకోవడానికి చేసిన రక్తపాతంతో కూడిన ప్రయత్నం ఫలించలేదు. తిరుగుబాటు ప్రయత్నం చేసిన నాయకులను ఇప్పటికీ బంధించలేదు.

2003 నవంబరు 7న జరిగిన అధ్యక్ష ఎన్నిక 1992లో మౌరిటానియ ప్రజాస్వామ్యం మూడు మార్లు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో ఆరుగురు అభ్యర్థులు పోటి చేసారు. వారిలో మొట్టమొదటి మహిళా, మొదటి హరటిన్ (పూర్వ బానిస కుటుంబం) అభ్యర్థులు పోటీచేసారు. పదవిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు మాఔయ ఔల్ద్'సిదు అహ్మదు తయా ఎన్నికలలో అధికారిక గణాంకాల ఆధారంగా 67.02% ఆధిఖ్యతతో తిరిగి ఎన్నోక చేయబడ్డారు. ఈ ఎన్నికలలో మహమ్మదు ఖౌన ఔల్దు హైదల్ల ఓడిపోయాడు.

1980 చివరిలో ఔల్ద్ తయా ఇరాకుతో సత్సంబంధాలు నెలకొల్పి అరబ్బు జాతీయ విధానాన్ని అవలంబించాడు. ఆ సమయలో 1989 సెనెగల్ తో తీవ్రమైన సంఘర్షణలు మొదలయ్యాయి. రెండు దేశాలు వివిధ అల్పసంఖ్యాక మతాలవారిని వెలివేయడంతో సమస్య మొదలయ్యాయి. 1991 గల్ఫ్ యుద్ద సమయంలో ఇరాక్కు అనుకూలంగా వ్యవహరించడంతో పాశ్చాత్య దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మౌరిటానియ ప్రపంచ దేశాలలో ఏకాకి అయ్యింది. 1990 మధ్య కాలంలో తన విదేశాంగ విధానాన్ని అమెరికా, ఐరోపాలకు అనుకూలంగా మార్చడంతో ఆ దేశం పైన ఆంక్షలు తొలగించి సహాయక కార్యక్రమాలతో పాశ్యాత్య దేశాలు సహకరించాయి.

1999 అక్టోబరు 28న మౌరిటానియ విదేశాంగ మంత్రి అహ్మదు సిద్'అహ్మదు ఇజ్రాయెలుతో సంపూర్ణ దౌత్య సంబంధాలు స్థాపిస్తూ ఇజ్రాయెలు మంత్రి డేవిడు లెవితో వాషింగ్టన్ డి.సి (అమెరికాలో) ఒప్పందం మీద సంతకం చేసారు. అమెరికా రాష్ట్ర విభాగంలో ఆ దేశ కార్యదర్శి మడెలిన్ అల్బ్రయటు సమక్షంలో ఒప్పంద పత్రాల మీద సంతకాలు జరిగాయి. అరబ్బు దేశాల సమూహంలో ఈజిప్ట్, పాలస్తీనా, జోర్డాన్ మాత్రమే ఇజ్రాయిల్ ని అధికారికంగా గుర్తించాయి. తరువాత వాటి సరసన మౌరిటానియ కూడా చేరింది. ఔల్ద్ తయా ఉగ్రవాద వైవిధ్యమైన కార్యక్రమాలలో అమెరికాకి సహకరించడం మొదలుపెట్టారు. ఈ చర్యలు మనవ హక్కుల సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ చర్యల కారణంగా ఆ ప్రాంతంలో ఉగ్రవాదం అధికరిస్తిందవి వారు భావించడమే ఇందుకు కారణం. (మౌరిటానియ విదేశీ సంబంధాలు కూడా చూడండి)

ఆగష్టు 2005 సైనిక తిరుగుబాటు

2005 ఆగస్టు 3న కర్నల్.ఎలి ఔల్దు మొహమ్మదు వళ్ నేతృత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటు మాఔయ ఔల్ద్ సిద్'అహ్మదు తయా ఇరవై ఒక్క సంవత్సరాల పరిపాలనకు తెరదించింది.

ఆగస్టు 3న మౌరిటానియ సైన్యం అధ్యక్షుడు అంగరక్షకులతో కలిపి రాజధాని నౌ అక్చోటు లోని కీలక ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు తయా సౌదీ అరేబియా రాజు ఫహదు అంత్యక్రియలకు హాజరు అవ్వడానికి వెళ్లినప్పుడు సైన్యం తిరుగుబాటు చేసింది. ఈ చర్యలో ప్రాణనష్టం జరగలేదు. కొంత మంది అధికారులు తాము న్యాయానికి, ప్రజాతంత్రానికి ప్రాతినిధ్యం వహించే మిలటరీ పరిషత్తు అని చెప్పుకుంటూ ఒక ప్రకటన చేసారు:

    "జాతీయ ఆయుధ బలగాలు , రక్షణ బలగాలు కొన్ని సంవత్సరాల నుండి ప్రజలను ఇబ్బందులు పెడుతూ వారిని అణిచివేస్తున్న పనికి మాలిన ప్రభుత్వ పాలనను ఖచ్చితంగా తీయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాయి".

ఆ సైనిక పరిషత్తు తరువాత కర్నలు వళ్‌ను అధ్యక్షుడుగా, జాతీయ పోలీస్ దళం, సురేటె నేషనల్కి సంచాలాకునిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. మిగతా పదహారు అధికారులను సభ్యులుగా నమోదు చేసారు. కర్నల్ వళ్ ఒకప్పుడు పదవీచ్యుతుడు అయిన అనుచరుడిగా వ్యవహరించినట్లు భావించేవారు. ఈయన గత అధ్యక్షుడు పదవిలోకి రావడానికి కారణమైన తిరుగుబాటులో ఆయనకి సహాయకుడిగా ఉన్నాడు. తరువాత అధ్యక్షుడి భద్రతా దళానికి నేతృత్వం వహించారు.

మౌరిటానియ ప్రజలు ఈ పాలనను స్వాగతించారు[ఆధారం చూపాలి]. కానీ అంతర్జాతీయ దేశాలు ఈ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించారు. ఈ తిరుగుబాటుకు తరువాతి కాలంలో ఆమోదం లభించింది. సైనిక ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగానే రెండు సంవత్సరాలలో ఎన్నికలు నిర్వహించింది. 2006 జూన్ 26న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో మౌరిటానియ ప్రజలు అత్యధికంగా (97%) ఓటుతో రాష్ట్రపతి పదవి కాలాన్ని తగ్గిస్తూ తయారు చేసిన కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారు. సైనిక ప్రభుత్వంకు నేతృత్వం వహిస్తున్న కర్నల్ వళ్ ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉంటాను. అని పదవిని శాంతియుతంగా వేరొకరికి అప్పుచెపుతానని మాట ఇచ్చారు. ఇజ్రాయిలును గుర్తించిన మూడు అరబ్ దేశాలలో మౌరిటానియ ఒకటి. కొత్త ప్రభుత్వం కూడా ఇజ్రాయిలుతో సత్సంబంధాలు కొనసాగించింది. ఈ చర్య విమర్శలకు తావు ఇచ్చింది. తయా పాలన పశ్చిమదేశాల అనుగ్రహం పొందడానికి చేసిన ప్రయత్నం వలె ఉందని వారు వాదించారు.

2006 నవంబరు 16 డిసెంబరు 3లో విధాన సభ, పురపాలక ఎన్నికలు నిర్వహించబడ్డాయి.

2007 రాష్ట్రపతి ఎన్నికలు

1960 తరువాత మొదటిసారిగా 2007 మార్చి 11లో పూర్తి ప్రజాతంత్ర పద్ధతిలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక ద్వారా 2005లో మౌరిటానియ పరిపాలనా అధికారం సైనికపాలన నుండి ప్రజపాలనకు బదిలీచేయబడింది. స్వతంత్ర దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా అధ్యక్షుడిని బహుళ అభ్యర్థి ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు.

సిది ఔల్ద్ చేఖ్ అబ్దల్లహి, తన సమీప అభ్యర్థి అహ్మద్ ఔల్ద్ దద్దః మీద రెండో రౌండులో విజయంసాధించింది.

2008 సైనిక తిరుగుబాటు

మారిటానియా 
సిది ఔల్ద్ చేఖ్ అబ్దల్లహి.

రాష్ట్రపతి అంగరక్షకులు రాష్ట్రపతి భవనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. 2008 ఆగస్టు 6లో రాజధాని నౌక్చోత్టు లోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను సైనిక పటాలాలు చుట్టిముట్టాయి. ఆ రోజున అధికారపక్షానికి చెందిన 40 మంది మంది విధాన సభ సభ్యులు రాజీనామా చేసారు. అధ్యక్షుడు తన రక్షణ అధికారి, ఇంకొకరిని పదవి నుంచి తొలిగించాడు. అప్పుడు సైన్యం ప్రభుత్వ టెలివిజను భవనాన్ని అదుపులోకి తీసుకుంది. అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రిని నిర్బందించారు.

ఈ తిరుగుబాటుకు జనరలు మొహమ్మదు ఔల్దు అబ్దేలు అజీజు నేతృత్వం వహించారు. ఈయన మౌరిటానియ మాజీ సైనిక అధ్యక్షుని రక్షకదళాధ్యక్షుడుగా ప్రస్తుతం అధ్యక్షుడు ఈయన్ని పదవి నుంచి తొలగించాడు. అధ్యక్షుడు సిది ఔల్ద్ చేఖ్ అబ్దల్లహి, ప్రధాన మంత్రి యహ్య ఔల్ద్ అహ్మద్ వాఘ్ఫ్, అంతరంగిక మంత్రులను ద్రోహులైన సైనిక అధికారులు నిర్బంధించారు అని ఒక ప్రకటనలో మౌరిటానియ అధికార ప్రతినిధి అయిన అబ్దౌలయే మమదౌబ పేర్కొన్నారు. వారందరూ రాజధాని నౌక్చోత్టు లోని రాష్ట్రపతి భవనంలో గృహ నిర్బంధంలో ఉంచబడ్డారు. విజయం సాధించిన ఈ అనూహ్య విప్లవంలో, బి.ఎ.ఎస్.పి. (రాష్ట్రపతి రక్షక దళం) కు చెందిన రక్షణ ప్రతినిధులు మా ఇంటికి వచ్చి నాన్నగారిని తీసుకుని వెళ్లారు అని అబ్దల్లహి కుమార్తె అమల్ మింట్ చేఖ్ అబ్దల్లహి చెప్పింది. కొద్దిసేపటి తరువాత రాష్ట్రపతి శాసనం చేసి కుట్రదారులు అందరిని పదవుల నుంచి తొలగించారు. వారిలో జనరల్ ముహమ్మద్ ఔల్ద్ అబ్ద్ అల్-అజీజ్, జనరల్ ముహమ్మద్ ఔల్ద్ అల్-ఘాజ్వని, జనరల్ ఫిలిప్ స్విక్రి,, బ్రిగేడియర్ జనరల్ (అకిద్) అహ్మద్ ఔల్ద్ బాక్రి ముఖ్యులు ఉన్నారు.

తిరుగుబాటు తరువాత

"దేశంలో చాలా మంది ప్రజలు తిరుగుబాటు ప్రయత్నంను సమర్ధిస్తున్నారు , ప్రస్తుత ప్రభుత్వం "అధికారవాంఛా ప్రభుత్వం", అధ్యక్షుడు చట్ట సభలో బలవంతంగా ఆధిక్యతను సాధించారు"అని మౌరిటానియ చట్టసభ సభ్యుడు అయిన మొహమ్మదు అల్ ముఖ్తరు ప్రకటించాడు. ఈ తిరుగుబాటుకు 2007 ఎన్నికలలో అబ్దల్లహి విరోధి అయిన అహ్మదు ఔల్దు దద్దః మద్దతు కూడా ఉంది. అయినప్పటికీ ఔల్ద్ అబ్ద్ అల్-అజీజ్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఏకాకిని చేసాయి. అంతే కాకుండా దౌత్య సంబంధాల పైన ఆంక్షలు విధించి సహాయక కార్యక్రమాలు కూడా నిలిపివేసాయి. అల్జీరియా, అమెరికా, ఫ్రాన్సు వంటి ఇతర ఐరోపా దేశాలు తిరుగుబాటుని ఖండించి, అబ్దేల్లహిని అధ్యక్షుడిగా గుర్తిస్తున్నాయి. అయితే తిరుగుబాటుదారులకు మొరాకో, లిబియా, ఇరాన్ దేశాల మద్దతు లభించింది. కొన్ని పక్షాలు అబ్దేల్లహికి మద్దత్తుగా కలిసి తిరుగుబాటుదారుల మీద ఆందోళన లేవనెత్తారు. సైనికప్రభుత్వం నిరసన ప్రదర్శనలును రద్దు చేసి ప్రతిపక్షానికి చెందిన వారి మీద దాడులు చేసింది. దేశీయ అంతర్జాతీయ ఒత్తిడులు పనిచేసాయి. తన స్వగ్రామంలో గృహ నిర్బంధంలో ఉన్న అబ్దేల్లహిని విడుదల చేసారు. ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని 1999లో గుర్తించిన మౌరిటానియ కొత్తప్రభుత్వం (2008 /2009) గాజా దండయాత్రలో ఇజ్రాయిలుతో సంబంధాలను తెంచుకుంది. ఈ చర్య వల్ల అరబ్బు దేశాలలో కొద్దిగా గుర్తింపు అధికరించింది. ఇరాన్, లిబియాలు సహాయం చేస్తామని మాట ఇచ్చాయి. 2009 తోలినాళ్ళలో అబ్ద్ అల్-అజీజ్ ప్రభుత్వం బలహీనంగా, ఏకాకిగా కనిపించింది. 2010 మార్చిలో మౌరిటానియ మహిళా విదేశాంగ మంత్రి నహ హమ్ది ఔల్దు మౌక్నాస్ మౌరిటానియ ఇజ్రాయిలుతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నట్టు ప్రకటించింది.

ఎన్నికలు జరపడానికి అబ్ద్ అల్-అజీజ్ ప్రయత్నించినప్పటికీ జాతీయ అంతర్జాతీయ ఒత్తిడుల కారణంగా వాయిదా వేస్తున్నారు. 2009లో ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు, అంతర్జాతీయ పక్షాలతో సైనికప్రభుత్వం చర్చలు జరిపింది. దానివలన పరిస్థితులలో అనూహ్య మార్పులు సంభవించాయి. అబ్దల్లాహి రాజీనామా చేసాడు. కానీ ప్రతిపక్షాలు ఆయనను దూరంగా పెట్టాయి. ఫ్రాన్సు, అల్జీరియాలు అబ్ద్ అల్-అజీజుకు మద్దత్తుగా నిలిచాయి. అమెరికా తిరుగుబాటును ఖండించినప్పటికీ ఎన్నికలకు విరుద్దంగా ఏమీ అనలేదు. అబ్దేల్లహి రాజీనామా, సైన్యం బలపరిచిన మహమ్మదు ఔల్ద్ అబ్ద్ అల్-అజీజ్ని ప్రజాతంత్ర ఎన్నికల్లో అధ్యక్షుడు అవ్వడానికి మార్గం సుగమం చేసింది. ఈ ఎన్నికలలో ఆయన జూలై 18న 52% ఆధిక్యతతో నెగ్గారు. అబ్దల్లహి పూర్వ సమర్ధకులు దీన్ని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించి, ఈ ఫలితాలను గుర్తించమని చెప్పారు. సైనికప్రభుత్వం ఎన్నికలను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ దేశాలు ప్రతిపక్షాలను మోసం చేసాయి అని ఫిర్యాదు చేసారు. చిన్న చిన్న అభ్యంతరాల మినహా ఎన్నికలను పాశ్చత్య, అరబ్, ఆఫ్రికా దేశాలు గుర్తించాయి.ఆ దేశం పైన విధించిన ఆంక్షలను తొలగించి మౌరిటానియతో సహకరించడం కొనసాగించాయి. వేసవికాలం చివరికల్లా అబ్ద్ అల్-అజీజ్ జాతీయ, అంతర్జాతీయ మద్దతుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయినప్పటికీ ప్రభావ వంతమైన పక్షాలు రాజకీయవేత్తలు, ప్రత్యేకంగా చట్టసభాపతి అయిన మేసౌదు ఔల్ద్ బౌల్ఖేర్ అబ్ద్ అల్-అజీజ్ రాజీనామా చేయాలని కోరారు.

ప్రాంతాలు , విభాగాలు

మారిటానియా 
చిన్గెట్టి మసీదు

మౌరిటానియ పన్నెండు ప్రాంతాలుగా (రీజియన్స్ ) విభజింపబడింది. వీటిని విలాయ అంటారు, రాజధాని జిల్లా నౌక్చోత్ట్, వీటిని మరలా 44 విభాగాలుగా (మౌఘతా ) విభజించారు. ఆ ప్రాంతాలు, రాజధాని జిల్లా (అక్షర క్రమంలో) వాటి రాజధానులు ఈ విధంగా ఉన్నాయి:

ప్రాంతం రాజధాని జిల్లా జిల్లారాజధాని
అద్రార్ అతార్ అస్సాబా
కిఫా బరకన అలెగ్
దాఖ్లేట్ నౌఅదిబౌ నౌఅదిబౌ గోర్గోల్
కయడి గుయ్దిమక సేలిబబి
హద్ ఎచ్ చర్గుయ్ నీమ హద్ ఎల్ ఘర్భి
అయౌన్ ఎల్ అత్రౌస్ ఇంచిరి అక్జౌజ్ట్
నౌక్చోత్ట్ తగంట్ తిడ్జిక్డజ
టిరిస్ జేమ్మౌర్ ఎఫ్ డెరిక్ త్రార్జా

భౌగోళిక అంశాలు

మారిటానియా 
మారిటానియా 
అద్రార్ ప్రాంతంలో కొండలు:మౌరిటానియ భూమి ఫై ఎడారి ప్రభావం.

10,30,631 చ.కి.మీ 3,97,929 మైవైశాల్యంతో మౌరిటానియ ప్రపంచంలో 29వ అత్యంత పెద్ద వైశాల్యం కల దేశంగా (బొలీవియా తరువాత) ఉంది. మారిటానియా వైశాల్యం దాదాపు ఈజిప్టు వైశాల్యనికి సమానంగా ఉంటుంది.

మౌరిటానియ ఉపరితలం సాధారణంగా మైదానంలాగా ఉంటుంది.397929 మై (10,30,631)విశాల శుష్క మైదానాలు ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న కొండలు భూమి పైకి పొడుచుకుని ఉంటాయి. విశాల మైదానలని ఆగ్నేయంలో ఉన్న క్రమంలో కొండల వరుస విడదీస్తాయి. ఈ కొండచరియలు ఇసుకరాయి పీట భూములను వేరు చేస్తున్నాయి. వీటిలో పెద్దది అద్రారు పీటభూమి ఎత్తు 1640 అ (500 మీ). కొన్ని కొండల దిగువభాగాన స్ప్రింగ్-ఫెడ్ ఎండమావులు ఉన్నాయి. కొన్ని శిఖరాలలో సహజ వనరులు పుష్కలంగా ఉండవచ్చని అంచనా. ఇవి పీట భూమి పైన అక్కడక్కడ ఉంటాయి. చిన్న శిఖరాలను గుఎల్బు, పెద్దవాటిని కేదియాలు అంటారు. ఏకే కేంద్రక గుఎల్బు ఎర్ రిచాటు (దీనిని రిచాటు నిర్మాణము అనికూడా అంటారు) ఉత్తర-మధ్య ప్రాంతంలో ఇది ఒక గొప్ప ఆకర్షణగా ఉంది. జౌరిరాటు పట్టణం దగ్గర ఉన్నకేడియటు ఏజ్ జిల్ అత్యంత ఎత్తు అయినది. దీని పొడవు 3281 అ(1000 మీ).

మారిటానియా 
మౌరిటానియ నైరుతిలో బరెఇన ఒక గ్రామం

మౌరిటానియలో దాదాపు మూడొంతులు ఎడారి ఉంది. తీవ్ర కరువు వల్ల 1960 మధ్యకాలం నుంచి ఎడారి అధికరిస్తుంది. పడమర వైపు, సముద్రం, పీట భూముల మధ్యలో బంక నేలలు (రేగ్స్), ఇసుక తిన్నెలు (ఏర్గ్స్) ఉన్నాయి. గట్టి గాలుల కారణంగా ఇవి కదులుతూ ఉంటాయి. ఉత్తర దిశగా ఇసుక తిన్నెల పరిమాణం, కదలిక పెరుగుతూ ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థ

మౌరిటానియలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆఫ్రికాదేశాలు అన్నిటిలోకి అత్యల్ప వార్షిక ఆదాయం కలిగిన దేశంగా ఉంది. 1970 1980ల కరువుల మూలంగా సంచారజాతులు, వ్యవసాయదారులు పట్టణాలకి వలస పోయినప్పటికీ, చాలా మంది ప్రజలు వ్యవసాయం, పశువుల పెంపకం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. మౌరిటానియలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. దేశ ఎగుమతులలో 50కి ఇనుము భాగస్వామ్యం వహిస్తుంది. అంతర్జాతీయంగా లోహం, బంగారం, రాగి ధరలు పెరగడంతో సంస్థలు మారుమూల ప్రాంతాలలో కూడా గనులు తవ్వుతున్నాయి. దేశంలోని సముద్రతీర ప్రాంతం ప్రపంచంలో మత్స్యసంపద అధికంగా ఉన్న ప్రాంతంగా ఉంది. అయినప్పటికీ విదేశీయులు పరిమితికి మించి వేట ఆడడం వల్ల దేశానికీ కీలకమైన ఆర్థిక వనరును కోల్పోయే ప్రమాదం ఉంది.[ఆధారం చూపాలి] దేశంలోని సముద్రం మధ్యలో ఉన్న నౌకాశ్రయంని మొదటగా నౌక్చోత్టు సమీపంలో నిర్మించారు. ఈ మధ్య కాలంలో కరువులు, అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల విదేశీ ఋణం అధికరించింది. 1999 మార్చిలో మౌరిటానియ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు-ఐ.ఎం.ఎఫ్.తో సంయుక్తంగా 54 మిల్లియన్ల డాలర్ల ఎన్హన్సుడు స్టక్చర్లు అడ్జెస్ట్మెంటు ఫెసిలిటీ (ఇ.ఎస్.ఎ.ఎఫ్) 1999-2002లకు ఆర్థికగమ్యాలు తయారు చేసారు. ప్రైవేటీకరణ ఒక కీలకాంశంగా ఉంది. ఇ.ఎఫ్.ఎఫ్ వార్షిక ఆదాయ వృద్ది గమ్యాలు 4%-5% సాధించే అవకాశం ఉంది.

2001 సముద్ర గర్భంలో చమురునిల్వలను గుర్తించారు. చమురు మౌరిటానియ ఆర్థిక రంగానికి తోడ్పడే అవకాశం ఉన్నప్పటికీ, ఇది దేశానికీ ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచూడాలని భావిస్తున్నారు. మౌరిటానియ "పేదరిక దేశం, అరబ్ , ఆఫ్రికన్ దేశాల ముంగిట సహాయం కోసం చేతులు చాస్తుంది, ఆఫ్రికాలో కొత్తగా , చిన్న పరిమాణంలో చమురు ఉత్పత్తి చేస్తోన్న దేశం" అని అభివర్ణించబడింది. ఇంకా చమురు నిల్వలు తౌదెనినదీ పరివాహిక ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. కానీ అక్కడి భయంకర పరిసరాల కారణంగా వెలికి తీయడం ఖర్చుతో కూడుకున్న పని.

ప్రభుత్వానికి ముందున్న ప్రధానసమస్య ఆర్థిక రంగాన్ని ప్రైవేటీకరించటం.

జనాభా మార్పులు , పరిశీలన

మారిటానియా 
మౌరిటానియలో బడి పిల్లలు
    జనాభా
    3,205,060 (జూలై 2010 అంచనా ప్రకారం)
    జాతి సమూహాలు
    40% మూరలు , నల్లవారి సంకరజాతి 30%, నల్ల జాతిప్రజలు29% 1% ఫ్రెంచి వారు
    మతం
    దాదాపు 100% ముస్లింలే, అందులో చాలా మంది సున్ని తెగ వారు ఉన్నారు. దేశంలో ఒకే ఒక్క చిన్న కాథలికు సమూహం ఉంది. రోమను కాథలిక్ డియోసెసు నౌఖ్చోత్టు.
    భాషలు
    హస్సనియ అరబ్బీ భాష యాస (అధికారిక , జాతీయ);

వాడుకలో ఉన్న మిగతా భాషలు పులారు, సోనిన్కే, ఇమర్గ్యును భాష, వలోఫు, ఫ్రెంచి భాష (మీడియా, విద్యాధిక సమాజంలో, ఆఫ్రికా ఫ్రెంచి ఆధిఖ్యతలో ఉంది).

ఆరోగ్యం

2008 అంచనా ప్రకారం మనిషి జీవన ఆయుర్దాయం 53.91 సంవత్సరాలు. 2004లో ఆరోగ్యం ఫై తలసరి కర్చు 43 యు.ఎస్ డాలర్లు (PPP). 2004లో ప్రజా సంక్షేమానికి చేసిన ఖర్చు వార్షిక ఆదాయంలో 2%, ప్రైవేటు రంగంలో 0.9%. 21 శతాబ్దం ఆరంభంలో దేశంలో ప్రతి 100,100 మంది ప్రజలకు 11 డాక్టర్లు ఉండేవారు. శిశు మరణాలు పుట్టిన పిల్లల్లో 7,8% ఉండేది.

మౌరిటానియ ప్రజల దృష్టిలో అందం అంటే లావుగా ఉండడం, సన్నగా ఉన్న వాళ్ళని జబ్బు మనుషులు కింద జమ కడతారు. అందువల్ల మౌరిటానియలో ఉబకాయ ఆడవారు చాలా ఎక్కువ.

సంస్కృతి

మారిటానియా 
చిన్గెట్టి పుస్తక సంగ్రహణశాలలో ఖురాన్ సేకరణ.

దేశ పేరు లాటిన్ పదం మౌరేతనియ నుంచి వచ్చింది. దీని అర్ధం మౌరి యొక్క భూమి.

మౌర్ మత పెద్దల సహకరంతో ఫ్రెంచ్ వారు మౌరిటానియను 1860లో ఆక్రమించుకున్నారు. రాజ్యాలైన ఫౌత తోరో వాలో, అరబ్-బెర్బెర్ సంస్థానాలు తరర్జా, బ్రాక్న, తాగనేట్,, అద్రార్ సంస్థానాల వినాశనం తరువాత మౌరిటానియ దేశంగా ఏర్పడ్డది. దీని వల్ల దేశంలో రెండు ప్రధానమైన మత సమూహాలు ఉన్నాయి:నల్ల ఆఫ్రికన్ జాతి వారు, అరబ్ బెర్బెర్లు. నల్ల ఆఫ్రికన్ సమూహంలో ఫులని, సోనిన్కే,, బంబార తెగలు ఉన్నారు. మౌరుల్లో అరబ్-బెర్బెర్లు (బెయ్దన్), హారతిన్ అని కూడా పిలువబడే నల్ల మౌర్లు ఉన్నారు. హరతిన్లు నల్ల ఆఫ్రికన్లు వీరిని శ్వేత మౌర్లు బానిసలను చేసుకున్నారు. శ్వేత, నల్ల మౌర్లు తమని తాము అరబ్ వారి మని చెప్పుకుంటున్నారు. అరబ్ మౌర్లు కాని వారు ఆఫ్రికన్లు అని చెప్పుకుంటారు. అన్నింటి కన్నా ముఖ్యమైన సార్వజనికంగా ఉండేది సున్ని ఇస్లాం.

  • మౌరిటానియ సంగీతం
  • మౌరిటానియలో ఇస్లాం
  • మౌరిటానియలో మత స్వేచ్ఛ పరిస్థితులు
  • మౌరిటానియ, మడగాస్కర్ ప్రపంచంలో ఈ రెండు దేశాలు మాత్రమే సంఖ్యా ఆధారిత డబ్బుని వాడవు. ఔగుయ మూలాధారం విలువ ఐదు ఖౌములు
  • ఇక్కడ చాలా లఘు చిత్రాలు, చలనచిత్రాల చిత్రీకరణ జరిగింది. వాటిలో ఫోర్ట్ సగాన్నే (1984, లైఫ్ విత్ అవుట్ డెత్ (1997), ది ఫిఫ్త్ ఎలెమెంట్ (1997, ది బుక్స్ అండర్ ది సాండ్ (1997, విన్గ్ద్ మైగ్రేషన్ (2001,, హీరేమకోనో (2002) ముఖ్యమైనవి.

విద్య

1999 నుంచి ప్రాథమిక విద్య అంతా అరబిక్ లో చెపుతారు, ఫ్రెంచ్ ని రెండో సంవత్సరంలో నేర్పుతారు,, అన్ని విజ్ఞాన శాస్త్రాలని అందరికి ఫ్రెంచ్ లో నేర్పిస్తారు. ఇంగ్లీష్, వేల్దియ భాషల వాడకం పెరుగుతుంది.[ఆధారం చూపాలి] ఈ దేశంలో నౌక్చోత్ట్ విశ్వవిద్యాలయం, ఇతర ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. 2000-2007 ప్రభుత్వ ఖర్చులో విద్యపైన 10.7% ఖర్చుచేసారు.

వీటిని కూడా చూడండి

గమనికలు

Tags:

మారిటానియా చరిత్రమారిటానియా ప్రాంతాలు , విభాగాలుమారిటానియా భౌగోళిక అంశాలుమారిటానియా ఆర్థిక వ్యవస్థమారిటానియా జనాభా మార్పులు , పరిశీలనమారిటానియా సంస్కృతిమారిటానియా వీటిని కూడా చూడండిమారిటానియా గమనికలుమారిటానియా సూచనలుమారిటానియా బాహ్య లింకులుమారిటానియాFrench languageఅట్లాంటిక్ మహాసముద్రంఅరబ్బీ భాషఅల్జీరియాసెనెగల్

🔥 Trending searches on Wiki తెలుగు:

అనువాదంమకరరాశి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభగవద్గీతఆటలమ్మవై.యస్.రాజారెడ్డినందమూరి బాలకృష్ణచతుర్యుగాలువెలిచాల జగపతి రావుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరౌద్రం రణం రుధిరంఆంధ్ర విశ్వవిద్యాలయంరాజనీతి శాస్త్రముచంద్రుడుగొట్టిపాటి నరసయ్యపి.వెంక‌ట్రామి రెడ్డిరావి చెట్టుఅంగారకుడువిశ్వామిత్రుడుపమేలా సత్పతిశిబి చక్రవర్తివిశాఖపట్నంతెలంగాణ ఉద్యమంఉత్పలమాలజానపద గీతాలుసమాసంభారత రాష్ట్రపతుల జాబితాదాశరథి కృష్ణమాచార్యశివమ్ దూబేజమ్మి చెట్టుహనుమాన్ చాలీసాపవన్ కళ్యాణ్ఉప రాష్ట్రపతిసింగిరెడ్డి నారాయణరెడ్డినవగ్రహాలునందిగం సురేష్ బాబుమౌన పోరాటంజవహర్ నవోదయ విద్యాలయంసర్పంచిమీనరాశిమిథాలి రాజ్స్త్రీఆంధ్రజ్యోతిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ మండలాలుకాశీఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుభీష్ముడుగూగుల్భాషరాజశేఖర్ (నటుడు)నారా బ్రహ్మణిఉత్తర ఫల్గుణి నక్షత్రముఇంద్రుడుకల్క్యావతారముభారత జాతీయగీతంగజాలాభారతీయ రిజర్వ్ బ్యాంక్వై.యస్. రాజశేఖరరెడ్డిజాతిరత్నాలు (2021 సినిమా)మూలా నక్షత్రంకృత్తిక నక్షత్రముతెలుగులో అనువాద సాహిత్యంబగళాముఖీ దేవిపిత్తాశయమురమణ మహర్షిచైత్రమాసముయేసుచిరంజీవి నటించిన సినిమాల జాబితాకీర్తి సురేష్షణ్ముఖుడుతెలుగు సినిమావై.యస్.భారతిమండల ప్రజాపరిషత్తెలుగు కవులు - బిరుదులుకొండగట్టుసునాముఖిభారత ఎన్నికల కమిషను🡆 More