బహామాస్: ఉత్తర అమెరికా ఖండానికి చెందిన దేశం

బహామాస్ (ఆంగ్లం : The Bahamas), అధికారికనామం కామన్వెల్త్ ఆఫ్ ది బహామాస్, ఇదో ద్వీపసమూహాల ద్వీప దేశం.

ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో గలదు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బహామాస్‌లో 700 కంటే అధికంగా ద్వీపాలు, పగడపు దిబ్బలు, చిన్నచిన్న ద్వీపఖండాలు భాగంగా ఉన్నాయి.ఇది క్యూబా, హిస్పానియోలా, డోమియన్ రిపబ్లిక్‌లకు ఉత్తరదిశలో, టర్కీ, కైకోస్ ద్వీపాలకు వాయవ్యంలో, యు.ఎస్.రాష్ట్రాలకు చెందిన ఫ్లోరిడా రాష్ట్రానికి ఆగ్నేయంలో, ఫ్లోరిడా కేస్ తూర్పు దిశలో ఉంది.న్యూ ప్రొవింస్ ద్వీపంలో దేశారాజధాని అయిన నస్సౌ నగరం ఉంది.దీనిని దేశంగా, టర్కీ, కైకోస్ ద్వీపాలతో చేరిన ద్వీపసమాహారంలో భాగంగా, రాయల్ బహామాస్ డిఫెంస్ ఫోర్స్‌గా గుర్తించబడుతుంది.

Commonwealth of The Bahamas
Flag of బహామాస్
నినాదం
"Forward, Upward, Onward Together"
జాతీయగీతం

రాజగీతం
"en:God Save the Queen"
బహామాస్ యొక్క స్థానం
బహామాస్ యొక్క స్థానం
రాజధానిNassau
25°4′N 77°20′W / 25.067°N 77.333°W / 25.067; -77.333
అధికార భాషలు ఆంగ్లం
జాతులు  85% Black (esp. [:en:[West Africa]]n), 12% European, 3% en:Other
ప్రజానామము Bahamian
ప్రభుత్వం Parliamentary democracy and Constitutional monarchy
 -  Monarch Queen Elizabeth II
 -  Governor-General Arthur Dion Hanna
 -  Prime Minister Hubert A. Ingraham
Independence from the United Kingdom 
 -  Self-governing 1973 
 -  Full independence July 10, 1973 
 -  జలాలు (%) 28%
జనాభా
 -  2007 అంచనా 330,549 (177వది)
 -  1990 జన గణన 254,685 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $8.310 బిలియన్లు  (145వది)
 -  తలసరి $24,960 (IMF) (38వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $6.571 బిలియన్లు 
 -  తలసరి $19,736 (IMF) 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.845 (high) (49th)
కరెన్సీ Dollar (BSD)
కాలాంశం EST (UTC−5)
 -  వేసవి (DST) EDT (UTC−4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bs
కాలింగ్ కోడ్ +1 242
బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం
The Bahamas from space. NASA Aqua satellite image, 2009

బహామాస్ క్రిస్టోఫర్ కొలంబస్ (1492)స్వస్థానం. ఆసమయంలో ఇక్కడ ల్యుకేయాన్ ప్రజలు నివసిస్తూ ఉండేవారు. వీరు టైనో ప్రజలలో అరావాకన్ మాట్లాడే తెగలకు చెందినప్రజలు. స్పానియర్లు బహామాస్‌ను తమ వలససామ్రాజ్యంలో భాగంగా చేయలేదు. వారు హిస్పానియా లోని ప్రజలను తరలించి బానిసలుగా చేసుకున్నారు. 1513 నుండి 1648 ఈద్వీపాలు నిర్జనప్రాంతాలుగా మారాయి.తరువాత బెర్ముడా నుండి వచ్చిన ఆంగ్లేయులు ఎలెయుతెరా ద్వీపాన్ని వలసప్రమ్ంతంగా మార్చుకున్నారు.

1718లో గ్రేట్ బ్రిటన్ బహామాస్‌ను తమ వలసప్రాంతాలలో ఒకటిగా చేసుకుంది. అమెరికన్ అంతర్యుద్ధం తరువాత వేలాదిమంది అమెరికన్లు బహామాస్‌లో స్థిరపడ్డారు. వారు తమతోబానిసలను తీసుకువచ్చి వారితో దీవులలో తోటల పెంపకం అభివృద్ధి చేసారు.ఈ సమయంలో దీవులలో ఆఫ్రికన్ ప్రజలసంఖ్య అధికరించింది. అలా బహామస ఆఫ్రికన్ బానిసలకు స్వతంత్రత ప్రసాదించిన స్వర్గంగా మారింది.రాయల్ నేవీ ఇక్కడ స్థిరపరిచి చట్టవ్యతిరేకమైన బానిసలకు స్వతంత్రత కలిగించింది. అమెరికన్ బానిసలు, సెమినోలెసులు ఫ్లోరిడా నుండి పారిపోయి బహామాస్ చేరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ డొమెస్టిక్ నావలలో తీసుకురాబడిన బానిసలకు ప్రభుత్వం స్వతంత్రత కల్పించింది. 1834లో బహామాస్‌లో బానిసత్వం నిషేధించబడింది. ప్రస్తుతం బహామాస్‌లో ఆఫ్రికన్ - బహామాస్ ప్రజలు 90% ఉన్నారు. బానిసత్వ కాలపు సమాచారం ఇప్పటికీ ప్రజాజీవితంలో భాగంగా ఉంది.

1773లో కామంవెల్త్ పాలన నుండి బహామాస్ స్వతంత్రత పొందింది. బహామాస్ తలసరి ఆదాయం ఆధారంగా ఉత్తర అమెరికాదేశాలలోని సంపన్నదేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. బాహామాస్ ఆర్థికవ్యవస్థ పర్యాటకం, ఫైనాంస్ ఆధారితమై ఉంది.

పేరువెనుక చరిత్ర

బహామాస్ అనే పదం టయానో భాషకు చెందిన " బ హా మా " (విశాలమైన ఎగువ మధ్యభూమి) నుండి వచ్చింది. స్థానిక అమెరిండియన్లలో ఈ పదం వాడుకలో ఉండేది. స్పానిష్ భాషలో బజా మార్ అంటే షాలో వాటర్ లేక సముద్రం అని అర్ధం. ఆంగ్లంలో పేరుకు ముందు ది ఉన్న చిన్నపేరు కలిగిన రెండు దేశాలలో బహామాస్ ఒకటి.రెండవ దేశం " ది గాంబియా ".

చరిత్ర

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A depiction of Columbus' first landing, claiming possession of the New World for Spain in caravels; the Niña and the Pinta, on Watling Island, an island of The Bahamas that the natives called Guanahani and that he named San Salvador, on October 12, 1492.

11వ శతాబ్దంలో టైనోప్రహలు హిస్పానియా, క్యూబా నుండి వలసగా వచ్చి అప్పటికి ఆవాసరహితంగా ఉన్న దక్షిణ బహామాస్ చేరుకున్నారు. వీరు హిస్పానియా, క్యూబా ప్రాంతాలకు దక్షిణ అమెరికా నుండి చేరుకున్నారని భావించారు. వీరు ల్యూకేనియన్లు అని పిలువబడ్డారు. 1492లో ఇక్కడ 30,000 ల్యుకేనియన్ ప్రజలు ఉన్నారని ఇక్కడకు చేరుకున్న క్రిస్టీఫర్ కొలంబస్ పేర్కొన్నాడు.

కొలంబస్ మొదటగా ప్రవేశించిన ద్వీపానికి " శాన్ సాల్వడార్ " (ల్యుకేనియన్లు దీనిని గుయానహని అనేవారు) అని నామకరణం చేయబడింది.అది ప్రస్తుతం బహామాస్ ఆగ్నేయంలో ఉన్న " శాన్ సాల్వడార్ ఐలాండ్ " (పూర్వం దీనిని వాట్లింగ్ అనే వారు) అని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 1986లో నేషనల్ జియోగ్రాఫిక్ ప్రచురించిన పత్రికలో సంపాదకుడు, రచయిత రచనల ఆధారంగా " కొలబస్ ప్రవేశించిన ద్వీపం " సమనా కే " అని భావిస్తున్నారు.అయినప్పటికీ దీనికి సరైన ఆధారాలు లభించలేదు. కొలబస్ ఈ ప్రాంతంలో ల్యుకేనియన్ ప్రజలను కలుసుకుని వారితో కొన్ని వస్తువులను వస్తుమార్పిడి పద్ధతిలో మార్చుకున్నాడని పేర్కొనబడింది.స్పానిష్ వారు ల్యుకేయన్ ప్రజలను బలవంతంగా హిస్పానియాకు తరలించి వారితో బలవంతపు చాకిరి చేయించారు.బానిసత్వహింసలతో బాధించబడిన ప్రజలు అంటువ్యాధులకు బలై ప్రాణాలు వదిలారు. వీరిలో సగానికంటే అధికులు " చిన్న అమ్మవారు " (స్మాల్ ఫాక్స్) వ్యాధిసోకి మరణించారు. ఫలితంగా బహామస్ ప్రజలసంఖ్య చాలావరకు క్షీణించింది.1648లో ఎలెతెరియన్ అణ్వేషకులు విలియం సేలే నాయకత్వంలో బెర్ముడా నుండి ఇక్కడకు వలస వచ్చారు. ఈ ఆగ్లేయులు ఇక్కడ మొదటి యురేపియన్ వలసప్రాంతం స్థాపించి దానికి ఎలెతేరియా అని నామకరణం చేసారు. ఈ పేరు గ్రీక్ భాష నుండి స్వీకరించబడింది. గ్రీకు భాషలో ఎలెతేరియా అంటే స్వతంత్రం అని అర్ధం. తరువాత " న్యూ ప్రొవిడెంస్ " స్థాపించి దానికి " సేలేస్ ఐలాండ్ " అని నామకరణం చేసారు. 1670లో ఇంగ్లాండుకు చెందిన " రెండవ చార్లెస్ " ద్వీపాలను నార్త్ అమెరికా లోని కరోలినాకు చెందిన " లార్డ్స్ ప్రొప్రైటర్లకు " ఇచ్చాడు. వారు రాజు నుండి అద్దెకు తీసుకున్న ద్వీపాలలో వ్యాపారం, సుంకం వసూలు, గవర్నరును నియమించడం , పాలనాధికారం పొందారు. 1684లో స్పాన్rain ష్‌కు చెందిన కార్సియర్ జుయాన్ అల్కాన్ రాజధాని చార్లెస్ టౌన్ (తరువాత దీనిని నస్సౌ అని నామకరణం చేసారు) మీద దాడి చేసాడు. 1703లో ఫ్రాంకో - స్పానిష్ సైన్యంనస్సౌ మీద దాడి(వార్ ఆఫ్ స్పానిష్ సక్సెషన్) చేసింది.

18వ–19వ శతాబ్ధాలు

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Sign at Bill Baggs Cape Florida State Park commemorating hundreds of African-American slaves who escaped to freedom in the early 1820s in the Bahamas

ప్రొప్రైటరీ పాలనాకాలంలో బహామాస్ సముద్రపు బందిపోట్లకు (పైరేట్లకు) స్వర్గధామంగా మారింది. ఈకాలంలోనే ప్రబల బ్లాక్ బియర్డ్ (1680-1718) బందిపోటు ముఠాలు తలెత్తాయి. సముద్రపు బందిపోట్ల ప్రభుత్వానికి ముగింపు పలకడానికి బ్రిటన్ 1718లో బహామాస్‌ను స్వాధీనం చేసుకుని బ్రిటన్ ఓవర్సీస్ భూభాగంగా మార్చి " వుడ్స్ రోజర్స్ " ను గవర్నర్‌గా నియమించింది.సముద్రపు బందిపోట్లతో కఠినంగా పోరాడి వుడ్స్ రోజర్ వారికి ముగింపు పలికాడు. 1720లో రోజర్స్ స్పానిష్ దాడిని ఎదుర్కోడానికి ప్రాంతీయసైన్యాలను సమీకరించాడు.

18వ శతాబ్ధంలో ఆరంభమైన అమెరికన్ స్వాతంత్రసమరం సమయంలో ఈద్వీపాలు వేలాది అమెరికన్ నావికాదళాలకు స్థావరం అయింది.నావికాదళాలకు కమ్మోడోర్ ఎసెక్ హాప్కింస్ నాయకత్వం వహించాడు.యునైటెడ్ స్టేట్స్ నావికాదళం రాజధాని నస్సౌను ఒకేరాత్రివేళ ఆక్రమించుకుంది.

1782లో బ్రిటిష్ ఓటమి (యోర్క్ టౌన్ ఆక్రమణ) తరువాత నస్సౌ సముద్రతీరంలో స్పానిష్ నావికాదళం నిలిచింది. యుద్ధం లేకుండానే నగరం స్పానిష్ వశం అయింది. తరువాత సంవత్సరం పారిస్ ఒప్పందం (1783) ఆధారంగా స్పానిష్ ప్రభుత్వం ఆక్రమిత బహామాస్ భూభాగాన్ని తిరిగి బ్రిటన్‌కు అప్పగించింది.ఈ విషయం వినడానికి ముందుగా బ్రిటన్ ఆండ్ర్యూ డెవీక్స్ నాయకత్వంలో స్వల్పసైన్యంతో బహామాస్‌ను స్వాధీనం చేసుకుంది.

అమెరికన్ స్వాతంత్రం తరువాత బ్రిటన్ 7,300 మంది లాయలిస్టులు వారి బానిసలతో బాహామాస్‌లో సరొకొత్త సెటిల్‌మెంటును స్థాపించింది. తరువాత దేశంలో ఆర్ధికస్థితి మెరుగుపరచడానికి వారికి భూభాగంలో తోటలను అభివృద్ధి చేయడానికి తగిన భూమిని మంజూరు చేసింది. డీవీక్స్ మొదలైన లాయలిస్టులు దీవులలో తోటలను అభివృద్ధి చేసి ప్రాంతీయ రాజకీయశక్తిగా మారింది.క్రమంగా ఆఫ్రికన్ బానిసల సంఖ్యతో కూడిన యురేపియన్ అమెరికన్ల సంఖ్య స్థానిక యురేపియన్ల సంఖ్యను అధిగమించింది. స్థానిక యురేపియన్లు అల్పసంఖ్యాక వర్గంగా మారింది.

బానిసత్వ నిర్మూలన

1807లో బ్రిటన్ బానిసవ్యాపారాన్ని రద్దు చేసింది. తరువాత సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ కూడా బానిసత్వవ్యాపారాన్ని రద్దు చేసింది. తరువాత దశాబ్ధాలలో రాయల్ వేవీ వాణిజ్యాన్ని అడ్డగిస్తూ బహామాస్‌లో తిరిగి వేలసంఖ్యలో మకాంవేసారు. తరువాత వేలాది ఆఫ్రికన్లకు బానిసత్వం నుండి విముక్తి లభించింది.

1820లో ఫ్లోరిడాలో సంభవించిన సెమినోల్ యుద్ధకాలంలో వందలాది అమెరికన్ బానిసలు , ఆఫ్రికన్ సెమినోల్స్ కేప్ ఫ్లోరిడాను విడిచి బహామాస్ చేరుకుని వారు ఆండ్రోస్ ద్వీపంలో స్థిరపడ్డారు.అక్కడ వారు " రెడ్ బేస్ " పేరుతో గ్రామాన్ని అభివృద్ధి చేసారు. 1823లో మాస్ ఫ్లైట్ మార్గంలో 300 మంది బహామాస్ సాయంతో ఫ్లోరిడా నుండి ఇక్కడకు చేరుకున్నారని మిగిలిన వారు కేనోస్ (చిన్న పడవ) ద్వారా చేరుకున్నారు.2004లో ఈవిషయాన్ని గుర్తుచేసుకునేలా ఫ్లోరిడాలోని " బిల్ బాగ్స్ కేప్ స్టేట్ పార్క్ " లో స్మారకచిహ్నం ఏర్పాటు చేసారు. వారి సంతతివారు రెడ్ బేస్ ప్రాంతంలో ఇప్పటికీ వారి సంప్రదాయ సంబంధిత ఆఫ్రికన్ సెమిలోన్ ప్రజల తరహాలో బుట్టలతయారీ , సమాధుల నిర్మాణం చేస్తున్నారు. " నేషనల్ అండర్‌గ్రౌండ్ రైల్ రోడ్ నెట్ వర్క్ " నిర్వహిస్తున్న యునైటెడ్ స్టేట్స్ నేషనల్ పార్క్ సర్వీసెస్ రెడ్ బేస్ ప్రాంతంతో అమెరికన్ బానిసలకు ఉన్న సంబంధం గురించి పరిశోధించడానికి నస్సౌలో ఉన్న బహమియన్ మ్యూజియం , రీసెర్చ్ సెంటర్‌తో కలిసి పనిచేస్తూ ఉంది.మ్యూజియం దక్షిణ ఫ్లోరిడా నుండి తప్పించుకుని బహమాస్ చేరుకున్న ఆఫ్రికన్ సెమినోల్స్ గురించి పరిశోధించి వ్రాతబద్ధం చేసింది. 1818లో లండన్ హోం ఆఫీస్ ఆదేశం ఆధారంగా వెస్టిండీస్ మినహా వెలుపలి ప్రాంతాల నుండి బహమాస్‌కు తీసుకురాబడిన 300 మంది యు.ఎస్. కు స్వంతమైన బానిసలకు 1830-1835 మద్య బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ సముద్రతీర బానిస వ్యాపారాలకు కోమెట్ , ఎంకోమియం అనే అమెరికన్ నౌకలు వాడుకలో ఉండేవి.1830 డిసెంబర్ , 1834 ఫిబ్రవరిలో అబాకో ద్వీపంలో ఈ నౌకలను స్వాధీనం చేసుకుని మాస్టర్లను, పాసింజర్లను , బానిసలను నస్సౌకు తీసుకువెళ్ళిన కస్టంస్ అధికారులు అమెరికన్ నిరసనలను నిరోక్ష్యం చేస్తూ బానిసలకు విముక్తి కలిగించారు. కోమెట్ నౌకలో 165 మంది , ఎంకోమియంలో 48 మంది బానిసలున్నారని భావిస్తున్నారు.1855లో (1853 ఒప్పందం ఆధారంగా) బ్రిటన్ చివరికి యునైటెడ్ స్టేట్స్‌కు నష్టపరిహారం చెల్లించింది. అది ఇరుదేశాల మద్య పలు నష్టపరిహార కేసులను పరిష్కరించింది. 1834 ఆగస్ట్ 1న బానిసత్వం నిర్మూలించబడింది.తరువాత 1835లో బ్రిటన్ ఎంటర్ప్రైస్ బానిస నౌక నుండి 78 మంది బానిసలకు , 1840లో హెర్మోసా బానిస నౌక నుండి 38 మంది బానిసలకు స్వతంత్రం కలిగించింది. 1841లో వర్జీనియా నుండి న్యూ ఆర్లాండ్‌కు తరలించబడుతున్న 135 మంది బానిసలు తిరగబడి నౌకను నస్సౌకు మళ్ళించి ఈ దీవులలో స్థిరపడాలనుకున్న 128 మంది బానిసలకు విముక్తి కలిగించారు.యు.ఎస్. బానిసలచరిత్రలో క్రియోల్ విష్యయం బహుదా చర్చించబడింది. 1830-1842 మంద్యకాలంలో దాదాపు 447 మంది బానిసలకు విముక్తి లభించింది. ఇది యునైటెడ్ నేషంస్ , బ్రిటన్ మద్య ఉద్రిక్తలకు దారితీసింది. క్రియోల్ సంఘటన బానిసలకు తిరుగుబాటుకు ప్రోత్సాహం అందిస్తుందని యునైటెడ్ స్టేట్స్ ఆందోళన చెందింది.

20వ శతాబ్ధం

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Edward VIII, the Duke of Windsor and Governor of the Bahamas from 1940 to 1945

1940 ఆగస్ట్‌లో బ్రిటిష్ ప్రభుత్వంఆటంకాలను అధిగమిస్తూ " విండ్సర్ డ్యూక్ "ను బహామాస్ గవర్నర్‌గా నియమించబడి తన భార్య(వాలిస్ సింప్సన్)తో ఈదీవులకు చేరుకున్నాడు. ప్రభుత్వ గవర్నర్ బంగాళాలో నివసించడానికి పరిస్తితులు వారికి అనుకూలించనప్పటికీ వారు ఇక్కడ పరిస్తితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అసంతృప్తికరమైన పదవీ బాధ్యతల కారణంగా ఈ ద్వీపాలను మూడవ తరగతి బ్రిటిష్ కాలనీగా వర్ణించాడు. 1940 అక్టోబర్ 29న గవర్నర్ చిన్న ప్రాంతీయ పార్లమెంటును ఏర్పాటుచేసాడు. దంపతులు ఆ నవంబర్‌లో ద్వీపాలకు వెలుపల ఉన్న " ఆక్సెల్ - వెన్నర్ - గ్రెన్ " యాచ్ట్ సందర్శించడం వివాదాలకు దారి తీసింది. యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజంస్ " ఆక్సెల్ - వెన్నర్ - గ్రెన్" జర్మన్ నాజీ కమాండర్ " హెర్మన్ గోరింగ్ "కు సన్నిహితుడని (పొరపాటున) బ్రిటిష్ ప్రభుత్వానికి సూచనలు అందించడంమే ఇందుకు కారణం. ద్వీపాలలో పేదరికం మీద సాగించిన పోరు బహుదా ప్రశంశించబడింది. 1991లో ప్రచురించబడిన "ఫిలిప్ జైగ్లర్ " ఆత్మకథలో ఆయన, యురేపియాకు చెందని బహామాస్ ప్రజలు తిరుగుబాటు బహామాస్ దారులుగా వర్ణించబడ్డారు.1942లో శ్రమకు తగిన జీతబత్యాలు ఇవ్వడంలేదని ఆయన నస్సౌలో ప్రారంభించిన పోరాటం ప్రజల ప్రంశలు అందుకున్నది. 1945 మార్చిలో డ్యూక్ పదవికి రాజీనామా చేసాడు.

రెండవ ప్రపంచయుద్ధం

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Sign at the entrance of the Sir Roland Symonette Park in North Eleuthera district commemorating Sir Roland Theodore Symonette, the Bahamas' first Premier

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆధునిక రాజకీయ అభివృద్ధి మొదలైంది. 1950లో మొదటి రాజకీయపార్టీలు ఆవిర్భవించాయి.1964లో స్వయంప్రతిపత్తి కలిగిన బ్రిటిష్ పార్లమెంటరీ పాలన మొదలైంది.మొదటి ప్రీమియర్‌గా " యునైటెడ్ బహామియన్ " పార్టీకి చెందిన " సర్ రోనాల్డ్ సిమానెట్టీ " నియమితుడయ్యాడు.1964 జనవరి 7న బహామాస్‌కు ఇంటర్నల్ అటానమీతో నియోజకవర్గం ఏర్పాటు చేయబడింది. 1967లో ప్రోగ్రెసివ్ లిబరల్ పార్టీకి చెందిన లిండెన్ పిండ్లింగ్ మొదటి నాల్లజాతి ప్రీమియర్‌గా నియమించబడ్డాడు. 1968లో ప్రీమియర్ అనే పదవి ప్రధానమంత్రి పదవిగా మార్చబడింది. 1968 లో పిండ్లింగ్ బహామియన్ సంపూర్ణ స్వాతంత్ర్యన్ని ప్రకటించాడు. 1968లో 1968లో బహామియన్ల అధికార పరిధి విస్థరిస్తూ కొత్త నియోజకవర్గం ఇవ్వబడింది. 1973 జూన్ 22న " ది బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ " బహామియన్ల స్వతంత్రానికి మద్దతుగా ఓటు వేసింది. 1973 జూలై 10న ప్రింస్ చార్లెస్ బహామాస్ స్వతంత్రానికి అధికారికంగా అంగీకారం తెలుపుతూ బహామాస్ ప్రధానమంత్రి లిండెన్ పిండ్లింగ్‌కు లేఖ అందించాడు. అదే రోజు బహామాస్ కామంవెల్త్ దేశాలలో చేర్చబడింది. స్వతంత్రం లభించిన స్వల్పకాలంలో బహామాస్ మొదటి గవర్నర్‌గా (రెండవ క్వీన్ ఎలిజబెత్ ప్రతినిధిగా) సర్ మిలో బట్లర్ నియమించబడ్డాడు. 1974 ఆగస్టు 22న బహామాస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ సభ్యత్వం పొందింది. 1973 సెప్టెంబరు 18న బహామాస్ ఐక్యరాజ్య సమితి సభ్యదేశం అయింది. 1950 నుండి బహామాస్ ఆర్థికరంగం పర్యాటకం, ఆఫ్ షోర్ ఫైనాంస్ ఆధారంగా అభివృద్ధి పధంలో కొనసాగింది. తరువాతి కాలంలో బహామాస్ విద్య, ఆరోగ్యరక్షణ, నివాసగృహాలు, అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణా, హైతీ చట్టవ్యతిరేక వలసలు మొదలైన సమస్యలు ఎదుర్కొన్నది." యూనివర్శిటీ ఆఫ్ బహామాస్ " బహామాస్ ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రధానపాత్ర వహిస్తుంది. యూనివర్శిటీ బాచులర్, మాస్టర్స్, సంబంధిత డిగ్రీలను అందిస్తుంది. సి.ఒ.బి దేశమంతటా టీచింగ్, రీసెర్చి కేంద్రాలు కలిగి ఉంది.

భౌగోళికం

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Bahamas from space. NASA Aqua satellite image, 2009

బహామాస్ 20-28 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72-80 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. 1864లో బహామాస్ గవర్నర్ బహామాస్‌లో 29 ద్వీపాలు, 661 కేలు, 2,387 రాక్స్ ఉన్నాయని నివేదికలో తెలియజేసాడు. వీటిలో బిమిని ద్వీపం యునైటెడ్ స్టేట్స్‌కు అత్యంత సమీపంలో ఉంది. ఇది బహామాస్ " గేట్ వే "గా భావించబడుతుంది. గ్రాండ్ బహామాస్ తూర్పు తీరంలో అబాకో ద్వీపం ఉందిఈశాన్యతీరంలో ఇనగ్వా ద్వీపం ఉంది. ఆండ్రోస్ ద్వీపం అత్యంత విశాలమైనదిగా ఉంది.ఇతర మానవ ఆవాస ద్వీపాలలో ఎలెయుతెరా, కేట్ ద్వీపం, లాంగ్ ద్వీపం, శాన్ సల్వడార్ ద్వీపం, అక్లింస్, క్రూక్డ్ ద్వీపం, ఎక్సుమా, బెర్రీ , మేయాగయానా ప్రధానమైనవి. న్యూ ప్రొవిడెంస్ బహామాస్ రాజధానిగా ఉంది.ద్వీపాలన్నీ దిగువగా , చదరంగా ఉన్నాయి. దీవులలో సముద్రమట్టానికి 15-20 మీటర్ల ఎత్తులో కొన్ని శిఖరాలు మాత్రమే ఉంటాయి.ఈ ద్వీపాలలో ఒకటైన కేట్ ద్వీపంలో సముద్రమట్టానికి 63 మీ ఎత్తున ఉన్న అల్వెమియా పర్వతం (సాధారణంగా కోమో హిల్ అంటారు)అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావించబడుతుంది.

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Damaged homes in the Bahamas in the aftermath of Hurricane Wilma in 2005

ఆగ్నేయంలో టర్క్స్ , కైకోస్ ద్వీపాలు ఉన్నాయి. మౌచొయిర్ బ్యాంక్, సిల్వర్ బ్యాంక్ , నవిదాద్ బ్యాంక్ అనే మూడు విస్తారమైన సబ్మెరీన్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి భౌగోళికంగా బహామాస్ కొనసాగింపుగా ఉన్నాయి.

వాతావరణం

కోపెన్ వాతావరణ వర్గీకరణ ఆధారంగా బహామాస్ వాతావరణం " ట్రాపికల్ సవన్నాహ్ వాతావరణం "గా వర్గీకరించవడింది. ఉత్తర అమెరికా భూభాగం నుండి వీచే వాయువుల కారణంగా ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుని అత్యంత కొన్ని గంటల సమయం చలివాతావరణం నెలకొన్నప్పటికీ బహామాస్‌లో ఎప్పుడూ హిమపాతం సంబవించినట్లు నమోదు కాలేదు.లో లాటిట్యూడ్, వార్మ్‌ ట్రాపికల్ గల్ఫ్ స్ట్రీం , సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉండడం బహామాస్ వేడి , శీతాకాలరహిత వాతావరణం కలిగి ఉంటుంది.శీతాకాలం , వేసవి కాలాల మద్య బేధం కేవలం 8 డిగ్రీల సెల్షియస్ మాత్రమే ఉంటుంది.సాధారణంగా ఉష్ణమండల వాతావరణంలో ఉన్నట్లు వేసవి తరువాత వర్షాకాలం మొదలౌతుంది. బహామాస్‌లో ఎక్కువ రోజులు ఎండ , పొడివాతావరణం నెలకొని ఉంటుంది. వార్షికంగా 340 రోజులు (3,000 గంటలు) కంటే అధికంగా ఎండ ఉంటుంది. బహామాస్‌ను ఉష్ణమండల తుఫాన్లు , హరికెన్లు బాధిస్తుంటాయి. 1992లో ఆండ్ర్యూ హరికెన్ బహామాస్ ఉత్తరభాగాన్ని దాటుకుంటూ వెళ్ళింది.1999లో ఫ్లోయ్డ్ హరిజెన్ బహామాస్‌ను దాటి వెళ్ళింది.

శీతోష్ణస్థితి డేటా - Nassau
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 25.4
(77.7)
25.5
(77.9)
26.6
(79.9)
27.9
(82.2)
29.7
(85.5)
31.0
(87.8)
32.0
(89.6)
32.1
(89.8)
31.6
(88.9)
29.9
(85.8)
27.8
(82.0)
26.2
(79.2)
28.8
(83.9)
రోజువారీ సగటు °C (°F) 21.4
(70.5)
21.4
(70.5)
22.3
(72.1)
23.8
(74.8)
25.6
(78.1)
27.2
(81.0)
28.0
(82.4)
28.1
(82.6)
27.7
(81.9)
26.2
(79.2)
24.2
(75.6)
22.3
(72.1)
24.8
(76.7)
సగటు అల్ప °C (°F) 17.3
(63.1)
17.3
(63.1)
17.9
(64.2)
19.6
(67.3)
21.4
(70.5)
23.3
(73.9)
24.0
(75.2)
24.0
(75.2)
23.7
(74.7)
22.5
(72.5)
20.6
(69.1)
18.3
(64.9)
20.8
(69.5)
సగటు అవపాతం mm (inches) 39.4
(1.55)
49.5
(1.95)
54.4
(2.14)
69.3
(2.73)
105.9
(4.17)
218.2
(8.59)
160.8
(6.33)
235.7
(9.28)
164.1
(6.46)
161.8
(6.37)
80.5
(3.17)
49.8
(1.96)
1,389.4
(54.70)
సగటు అవపాతపు రోజులు 8 6 7 8 10 15 17 19 17 15 10 8 140
Mean monthly sunshine hours 220.1 220.4 257.3 276.0 269.7 231.0 272.8 266.6 213.0 223.2 222.0 213.9 2,886
Source: World Meteorological Organization (UN), Hong Kong Observatory (sun only)
Average Sea Temperature
Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
23 °C

73 °F

23 °C

73 °F

24 °C

75 °F

26 °C

79 °F

27 °C

81 °F

28 °C

82 °F

28 °C

82 °F

28 °C

82 °F

28 °C

82 °F

27 °C

81 °F

26 °C

79 °F

24 °C

75 °F

ఆర్ధికరంగం

తలసరి జి.డి.పి. పరంగా అమెరికా దేశాలలోని సంపన్న దేశాలలో బహామాస్ ఒకటిగా గుర్తించబడుతుంది.

పర్యాటకం

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Cruise ships in Nassau Harbour

బహామాస్ ప్రభుత్వం ఆదాయం కొరకు ప్రధానంగా పర్యాటకరంగం మీద ఆధారపడి ఉంది. పర్యాటకరంగం బహామాస్ జి.డి.పి.లో 60%కి భాగస్వామ్యం చేయడమే కాక బహామాస్ ఉద్యోగాలలో సంగంకంటే అధికంగా భర్తీచేస్తుంది. 2012లో బహామాస్ 5.8 మిలియన్ల పర్యాటకులను ఆకర్షించింది. వీరిలో 70% కంటే అధికంగా క్రూసీద్వారా పయనించారు.

ఆర్ధికసేవలు

పర్యాటకరంగం తరువాత దేశ ఆర్థికరంగంలో ఫైనాంస్, విదేశీఋణ సంబంధిత సేవలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. దేశ జి.డి.పి.లో ఆర్థికసేవలు 15% భాగస్వామ్యం వహిస్తుంది.బహామాస్ ప్రభుత్వం విదేశీ ఫైనాంస్ వాణిజ్యానికి ప్రోత్సాహం అందిస్తుంది. అదనంగా బ్యాంకింగ్, ఆర్థిక సంస్కరణలు చేపట్టబడుతూ ఉన్నాయి. " సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహామాస్ " మొదలైన ప్రధాన ఫైనాంషియల్, సెక్యూరిటీ సంస్థలు, ఎక్స్చేంజ్ కమిషన్లను విలీనం చేయాలని బహామాస్ ప్రభుత్వం భావిస్తుంది. బహామాస్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో 19 పన్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి.

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A proportional representation of the Bahamas exports.

ప్రభుత్వం దిగుమతి సుంకం, విలువ ఆధారిత పన్ను విధింపు, లైసెంస్ ఫీజు, ప్రాపర్టీ, స్టాంపు పన్నుల నుండి ప్రభుత్వం ఆదాయం లభిస్తుంది. అయినప్పటికీ ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, కేపిటల్ గెయింస్ టాక్స్ (సంపద పన్ను) మాత్రం విధించబడడం లేదు. పేరోల్ టాక్స్ ఫండ్ సోషల్ ఇంసూరెంస్ బెనిఫిట్స్ కొరకు ఉద్యోగి వేతనం నుండి 3.9%, ఉద్యోగదాత నుండి 5.9% సేకరించబడుతూ ఉంది. 2010లో మొత్తం దేశ జి.డి.పి.లో పన్నుల ద్వారా 17.2% లభిస్తుంది.

వ్యవసాయం

బహామాస్ ఆర్థికరంగంలో వ్యవసాయం మూడవ స్థానంలో ఉంది.ఇది దేశ జి.డి.పి.లో 5-7%కు భాగస్వామ్యం వహిస్తుంది. బహామాస్ దేశానికి అవసరమైన 80% దిగుమతి చేయబడుతుంది. దేశంలో పండించబడుతున్న పంటలలో ఎర్రగడ్డలు, బెండకాయలు, కమలాలు, ద్రాక్ష, కీరదోస, చెరుకు, నిమ్మ, లైం, చిలగడదుంప ప్రధానమైనవి.

గణాంకాలు

2010లో బహామాస్ జనసంఖ్య 392,718. వీరిలో 14 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారు 25.9%, 15 - 64 మద్య వయస్కులు 67.2% ఉన్నారు. జనసంఖ్య అభివృద్ధి శాతం 0.925%. ప్రతి 1,000 మందిలో 17.81 జననాలు, ప్రతి 1,000 మందిలో 9.35 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి 1,000 మందిలో 2.13 వలసలు జరుగుతున్నాయి. ప్రతి 1,000 మందిలో 23.21 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. ఆయుఃప్రమాణం 69.87. వీరిలో స్త్రీల ఆయుః ప్రమాణం 73.49. పురుషుల ఆయుఃప్రమాణం 66.32.సరాసరి ఫర్టిలిటీ ఒక స్త్రీకి 2 సంతానం. రాజధాని నగరం, అతిపెద్ద నగరంగా ప్రత్యేకత కలిగిన నస్సౌ నగరం ఉన్న న్యూ ప్రొవిడెంస్ ద్వీపం అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వీపంగా ఉంది. వైశాల్యపరంగా రెండవ స్థానంలో ఉన్న ఫ్రీపోర్ట్ నగరం గ్రాండ్‌బహామా ద్వీపంలో ఉంది.

జాతులు , సంప్రదాయాలు

2010 గణాంకాలను అనుసరించి 99% ప్రజలజాతి ప్రశ్నార్ధకంగా ఉన్నప్పటికీ 90.6% ప్రజలు వారిని నల్లజాతీయులుగా నమోదు చేసుకున్నారు, 4.7% ప్రజలు శ్వేతజాతీయులు, 2.1% మిశ్రమజాతీయులు (నల్లజాతి, శ్వేతజాతీయ దంపతులకు జన్మించిన వారు) ఉన్నారు. 1722 బహామాస్ గణాంకాలు 74% శ్వేతజాతీయులు, 26% నల్లజాతీయులు ఉన్నట్లు వివరించాయి.

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Afro-Bahamian children at a local school

కాలనీ ప్రభుత్వకాలంలో తోటలలో పనిచేయడానికి ఆఫ్రికన్లు (ఆఫ్రో బహామియన్లు) వినియోగించబడిన కారణంగా ఆఫ్రో బహామియన్లు అతిపెద్ద సంప్రదాయబృందానికి చెందిన ప్రజలుగా ఉన్నారు. వారి పూర్వీకత ఆఫ్రికాలో ఉండేది. మొదటిసారిగా విడుదల చేయబడిన బెర్ముడా ప్రజలు మొదటి ఆఫ్రికన్ ప్రజలుగా భావిస్తున్నారు. వారు జీవనోపాధి వెతుకుతూ ఎల్యూథరన్ ప్రజలతో బహామీలో ప్రవేశించారు.బహామాస్‌లో ఉన్న హైతీస్ ప్రజలలో అధికంగా ఆఫ్రికన్ సంతతికి చెందినవారే. వీరి సంఖ్య 80,000 ఉంటుంది. పెద్ద సంఖ్యలో బహామాస్‌కు వలస వచ్చిన కారణంగా చట్టవ్యతిరేకంగా బహామాస్‌లో ప్రవేశించిన హైతీస్ ప్రజలను 2014లో బహామాస్ ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపింది. శ్వేతజాతి బహామియన్లలో ప్రధానంగా " ఇంగ్లీష్ ప్యూరిటన్లు " (మతసంబంధిత మూకుమ్మడి ఊచకోతల సమయంలో పారిపోయి వచ్చిన వారు, అమెరికన్ లాయలిస్టులు, అమెరికన్ రివల్యూషన్ చెందిన ప్రజలు) అధికంగా ఉన్నారు. వీరు 1649 - 1783 మధ్య కాలంలో బహామీస్‌కు వచ్చి చేరారు. సదరన్ లాయలిస్టులలో అధికంగా అబాకో ద్వీపాలకు చేరుకున్నారు. 1985 నాటికి ఈ ద్వీపాలప్రజలలో యురేపియన్ సంతతికి చెందిన వారు ఉన్నారు. ఆంగ్లేయ సంతతికి చెందిన ప్రజలను సాధారణంగా శ్వేతజాతీయులు అంటారు. అలాగే లైట్ స్కిండ్ ఆఫ్రో - బహామియన్లు కూడా ఉన్నారు. కొన్నిమార్లు ఆగ్లో సంతతికి చెందిన బహామియన్లను " కోంచీ జ్యూ " అని కూడా అంటారు. యూరో - బహామియన్లలో కొంతమంది గ్రీక్ సంతతికి చెందిన వారు ఉన్నారు. 1900లో వీరు స్పాంజింగ్ పరిశ్రమలో పనిచేయడానికి ఇక్కడకు వచ్చారు. వీరు బహామీ ప్రజలలో 1% ఉన్నారు. అయినా వారు ఇప్పటికీ గ్రీకు సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. [ఆధారం చూపాలి]సాధారభంగా బహామియన్లు తమనుతాము నల్లజాతి లేక శ్వేతజాతీయులుగా భావిస్తుంటారు

భాషలు

బహామాస్ అధికార భాష ఆంగ్లం. బహామీయులు అధికంగా ఆంగ్ల ఆధారిత క్రియోల్ భాష మాట్లాడుతుంటారు. ఈ భాషను సాధారణంగా బహామియన్ క్రియోల్ (బహామియన్ యాస) లేక బహామియనీస్ అంటారు. బహామియన్ రచయిత, నటుడు జేంస్ కేటలిన్ ఈ భాషను పద్యరచనలో ఉపయోగించాడు. ఫ్రెంచ్ ఆధారిత క్రియోల్ భాష " హైతియన్ క్రియోల్ " భాషను హైతియన్ ప్రజలలో వాడుకలో ఉంది. మొత్తం బహరియన్ ప్రజలలో 25% ప్రజలలో హైతియన్ భాష వాడుకలో ఉంది. రెండు యాసల మద్య బేధం గుర్తించేలా దీనిని క్రియోల్ అని అంటారు.

మతం

2008 యినైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ డెమొక్రసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్ ", మానవహక్కులు, శ్రామికులు ఆధారంగా ద్వీపాలలో క్రైస్తవ మతం ఆధిక్యతలో ఉందని భావిస్తున్నారు. వీరిలో ప్రొటెస్టెంట్లు 70%, బాప్టిస్టులు 35%, ఆంగ్లికన్లు 15%, పెంటేకోస్టల్స్ 8%, చర్చి ఆఫ్ గాడ్ 5%, సెవెంత్ డే అడ్వెంటిస్టులు 5%, మెథడిస్టులు 4% ఉన్నారు. అదనంగా రోమన్ కాథలిక్కులు 14% ఉన్నారు. బహామాస్‌లో అదనంగా యూదులు, ముస్లిములు, బహైప్రజలు, హిందువులు, రాస్టఫారీలు, ఒబీహ్ అనుయాయులు ఉన్నారు.

సంస్కృతి

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Junkanoo celebration in Nassau

అభివృద్ధి తక్కువగా ఉన్న వెలుపలి దీవులలో (ఫ్యామిలీ దీవులు) తాటి ఆకులతో తయారుచేయబడిన వస్తువులు విక్రయించబడుతుంటాయి. వీటిని సాధారణంగా " స్ట్రా " అంటారు. తాటి ఆకుతో తయారుచేయబడే టోపీలు, బ్యాగులు ప్రాబల్యత సంతరించుకున్నాయి. వీటిలో " వూడూ డాల్స్ " కూడా ప్రాబల్యత సంతరించుకున్నాయి. ఈ బొమ్మలు అధికంగా చారిత్రక ఆధారితంగా కాక అమెరికన్ వ్యూహాత్మకత ఆధారంగా తయారుచేయబడుతుంటాయి. ఫ్యామిలీ ద్వీపాలలో ఉన్న బహామియన్లు " ఒబీహ్ " అనే జానపద ఇంద్రజాలం చేస్తుంటారు. అయినప్పటికీ బహామీ చట్టం ఆధారంగా " ఒబీహ్ " ఇంద్రజాల ప్రదర్శన చట్టవిరోధమైనది, శిక్షార్హమైనదిగా భావించబడుతుంది.

ఉత్సవాలు

ప్రతి బాక్సింగ్ డే, న్యూ ఇయర్స్ డే ఉత్సవాలలో " జంకనో " అనే ఆఫ్రో- బహామియన్ సంప్రదాయ పేరేడ్‌లో సంగీతం, నేత్యం, కళలు ప్రదర్శించబడుతుంటాయి. ఎమాంసిపేషన్ వంటి ఇతర ఉత్సవాలలో కూడా జంకనో పేర్డ్ ప్రదర్శించబడుతూ ఉంటుంది.పలు ఫ్యామిలీ దీవులలో రెగట్టా ప్రధాన సాంఘిక వేడుకగా ఉంటుంది. ఇందులో పురాతన శైలి బోటులో నీటిలో పయనిస్తూ ఈ వేడుక ఒకటి లేక అధికదినాలు నిర్వహించబడుతుంటుంది.

ఆహారసంస్కృతి

బహామియన్ ఆహారాలలో పలు ఆహారాలు ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. ఇందులో కరేబియన్, ఆఫ్రికన్, యురేపియన్ ఆహారసంస్కృతుల ప్రభావం అధికంగా ఉంటుంది. కొన్ని సెటిల్మెంట్లు ఆహారం, పంట సంబంధిత ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో గ్రిగేరీ టౌన్‌లో నిర్వహించే ఫైనాఫిల్ ఫెస్ట్, ఆణ్డ్రోస్‌లో నిర్వహించే " క్రాబ్ ఫెస్ట్ " ప్రధానమైనవి.మిగిలిన వేడుకలలో స్టోరీ టెల్లింగ్ ఒకటి.

సాహిత్యం

బహామియన్లు సుసంపన్నమైన కవిత్వ, చిన్న కథలు, నాటకాలు, చిన్న కాల్పానిక సాహిత్యం మొదలైన ప్రక్రియలతో కూడిన సాహిత్యసంప్రదాయం ఏర్పరిచారు. వీటిలో సాధారణంగా మార్పు, ఆడంబరాల కొరకు ప్రాకులాట, గుర్తింపు కొరకు అణ్వేషణ, పురాతన సంప్రదాయాల మీద మక్కువ, సౌందర్యారాధన స్థూలవస్తువుగా ఉంటాయి. సూసన్ వాలెంస్, ప్రిసివిల్ మిల్లర్, రాబర్ట్ జాంసన్, రేమండ్ బ్రౌన్, ఒ.ఎం. స్మిత్, విలియం జాంసన్, ఎడ్డీ మిన్నీస్, వింస్టన్ మొదలైన రచయితల రచనలు ప్రజాదరణ చూరగొన్నాయి.

విశ్వాసాలు

బహామియన్ సంప్రదాయం విశ్వాసాలు, సంప్రదాయాలు, జానపద కథనాలు, పురాణకథనాలతో సుసంపన్నంగా ఉంటుంది. బహామియన్లలో అత్యధికంగా గుర్తింపు పొందిన జానపదాలు, పురాణకథనాలలో ఆండ్రోస్ బహామాస్‌లో ల్యూస్కా, ఎక్సుమా బహామాస్ మీద ప్రెట్టీ మొల్లీ, ఆండ్రో బహామాస్ ది చిక్‌చర్నీస్, భీమ్నీ బహమాస్ ది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ ప్రధానమైనవి.

క్రీడలు

బహామియన్ జీవనసరళిలో క్రీడలు ప్రధానపాత్ర వహిస్తుంటాయి.క్రికెట్ జాతీయ క్రీడగా గుర్తించబడుతుంది. 1846 నుండి బహామాస్‌లో క్రికెట్ క్రీడ ఆడబడుతూ ఉంది. ప్రస్తుతం దేశంలో ప్రాచుర్యంలో ఉన్న క్రీడలలో క్రికెట్ పురాతనమైనది.1936లో " ది బహామాస్ క్రికెట్ అసోసియేషన్ " రూపొందించబడింది. 1940-1970 వరకు బహామియన్లు అనేకమంది క్రికెట్ ఆడుతూ ఉన్నారు. బహామియన్లు " వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డ్ " భాగస్వామ్యంవహించలేదు. అందువలన బహామియన్ క్రికెటర్లు వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీంలో పాల్గొనడం లేదు. 1970లో క్రికెట్ పట్ల గొప్ప ఆరాధన కలిగిన యునైటెడ్ కింగ్డం శిక్షకులను తొలగించి వారి స్థానంలో యునైటెడ్ స్టేట్స్‌లో శిక్షణ పొందిన వారిని నియమించిన తరువాత బహామియన్ క్రికెట్ క్రీడలో క్షీణత మొదలైంది. బహామియన్ ఫిజికల్ ఎజ్యుకేషన్ టీచర్స్‌కు క్రికెట్ క్రీడ గురించిన అవగాహన కొరవడడం ఇందుకు ఒక కారణం. వారు బాస్కెట్ బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ట్రాక్ & ఫీల్డ్ వాలీబాల్, అసోసియేషన్ ఫుట్‌బాల్ మొదలైన క్రీడలలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. క్రికెట్ ఇప్పటికీ కొంతమంది ప్రాంతీయవాసులకు, జమైకా,గయానా,హైతీ, బర్బడో నుండి వలసవచ్చిన ప్రజలకు అభిమానపాత్రమైన క్రీడగా ఉంది. విండ్సర్ పార్క్, హైనెస్ ఓవల్ ప్రాంతాలలో శని ఆదివారాలలో క్రికెట్ ఆడబడుతూ ఉంది.

ఇతర క్రీడలు

క్రికెట్ కంటే ముందున్న ఒకేఒక క్రీడ గుర్రపుస్వారీ. గుర్రపు స్వారీ 1796లో ప్రారంభం అయింది. అత్యధిక ప్రజాదరణ పొందిన క్రీడలలో యునైటెడ్ స్టేట్స్‌లో నుండి దిగుమతి చేసుకున్న బాస్కెట్ బాల్, అమెరికన్ ఫుట్‌బాల్,, బేస్‌బాల్ ప్రధానమైనవి. గ్రేట్ బ్రిటన్ కంటే యునైటెడ్ స్టేట్స్ సమీపంలో ఉన్న కారణంగా ఇతర కరేబియన్ దేశాలవలె కాకుండా బహామాస్‌లో క్రికెట్, రగ్బీ, నెట్‌బాల్ ప్రజాదరణ కలిగి ఉన్నాయి.

క్రీడాకారులు

డెక్సర్ కేంబ్రిడ్జ్, రిక్ ఫాక్స్, ఇయాన్ లాఖర్ట్, బడ్డీ హీల్డ్ మొదలైన బహామియన్ క్రీడాకారులు లాస్ ఏంజలెస్‌కు చెందిన మైకేల్ థాంప్సన్‌తో కలిసి ఎన్.బి.ఎ. ర్యాంకులో స్థానం పొందారు. అసోసియేషన్ ఫుట్‌బాల్ కంటే అమెరికన్ ఫుట్‌బాల్ అద్జిక ఆదరణ కలిగి ఉంది. అయొనప్పటికీ ఇది హైస్కూల్ సిస్టంలో చేర్చబడలేదు. బహామియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కొరకు యువకులు, టీనేజర్లు శిక్షణపొందుతూ ఉన్నారు. అసోసియేషన్ ఫుట్‌బాల్ సాధారణంగా సాకర్ అని పిలువబడుతూ ఉంది. ఇది బహామియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చేత హైస్కూల్ విద్యార్థులలో లీగ్స్‌గా నిర్వహించబడుతున్నాయి.బహామియన్ క్రీడాకారులను యురేపియన్ క్రీడలలో పాల్గొనజేయడానికి అనుకూలంగా బహామియన్ ప్రభుత్వం లండన్ లోని టోట్టెంహాం హాట్స్‌పర్‌తో కలిసి పనిచేస్తుంది. 2013లో బహామాస్ క్రీడాకారులు జమైకా నేషనల్ ఫుట్‌బాల్ టీంకు వ్యతిరేకంగా ఆడిన సందర్భంలో స్పర్స్ మొదటి బహామియన్ ప్రీమియర్ లీగ్ క్లబ్‌గా గుర్తించబడింది. బహామా లోని టోట్టెన్ హాట్‌స్పర్ క్లబ్‌కు జో లూయిస్ యజమానిగా ఉన్నాడు.

ఇతర ప్రధాన క్రీడలు

ఇతర ప్రధాన క్రీడలలో స్విమ్మింగ్ (ఈత), టెన్నిస్,, బాక్సింగ్ ప్రధానమైనవి. గోల్ఫ్ రగ్బీ లీగ్ rugby union బీచ్ సాకర్ , నెట్ బాల్ మొదలైన క్రీడలలో బమామియన్ క్రీడాకారులు అంతర్జాతీయ గుర్తింపును కలిగి ఉన్నారు.

అథ్లెటిక్ క్రీడలు

బహామాస్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అనే అథ్లెటిక్ క్రీడ అత్యంత విజయవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. బహామియన్ క్రీడాసంప్రదాయంలో స్ప్రింట్, జంపింగ్ క్రీడలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. దేశంలో బాస్కెట్ బాల్ తరువాత ట్రాక్ అండ్ ఫీల్డ్ అధిక ప్రాబల్యత కలిగి ఉంది. నస్సౌ, ఫ్యామిలీ ద్వీవులలో ట్రైత్లోన్లు ప్రజాదరణ కలిగి ఉన్నాయి. ఒలింపిక్ క్రీడలు, ఐ.ఎ.ఎ.ఎఫ్. వరల్డ్ చాంపియంస్ ఇన్ అథ్లెటిక్స్, కామంవెల్త్, పాన్ అమెరికన్ గేంస్‌లలో బహామియన్లు ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్స్ సాధించడానికి కృషిచేసారు. దేశం కొరకు మొదటి అథ్లెటిక్ ఒలింపిక్స్ గేంస్ పతకం సాధించిన ఘనత ఫ్రాంక్ రూథర్‌ఫోర్డ్‌కు దక్కింది. 1992లో ఆయన " ట్రిపుల్ జంప్ " క్రీడలో కామ్శ్యపథకం సాధించాడు.

అథ్లెట్ క్రీడాకారులు

పౌలైన్ డేవిస్ - థాంప్సన్, డెబ్బీ ఫర్గుసన్, చంద్ర స్టర్రుప్, సవతెడా ఫినెస్, ఎల్డెస్ క్లార్కే - లూయిస్ బృందం 400 మీ రిలే పోటీలో పాల్గొని దేశానికి మొదటి ఒలింపిక్ స్వర్ణపతకం సాధించింది. వారిని ప్రేమతో " గోల్డెన్ గరల్స్ " అని పిలుస్తున్నారు. టోనిక్యూ - విలియంస్ మొదటి వ్యతిగత ఒలింపిక్ స్వర్ణపతకం సాధించిన గుర్తింపు పొందింది. 2004 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆమె 400మీ స్ప్రింట్ పోటీలో స్వర్ణపతకం సాధించింది.

మూలాలు

బయటి లింకులు

Bahamas గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  నిఘంటువు విక్షనరీ నుండి
బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  ఉదాహరణలు వికికోట్ నుండి
బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
బహామాస్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం  వార్తా కథనాలు వికీ వార్తల నుండి


Tags:

బహామాస్ పేరువెనుక చరిత్రబహామాస్ చరిత్రబహామాస్ భౌగోళికంబహామాస్ ఆర్ధికరంగంబహామాస్ గణాంకాలుబహామాస్ సంస్కృతిబహామాస్ క్రీడలుబహామాస్ మూలాలుబహామాస్ బయటి లింకులుబహామాస్అట్లాంటిక్ మహాసముద్రంఆంగ్లంద్వీప దేశంఫ్లోరిడా

🔥 Trending searches on Wiki తెలుగు:

దేవులపల్లి కృష్ణశాస్త్రియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీచిరంజీవి2019 భారత సార్వత్రిక ఎన్నికలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఉప రాష్ట్రపతివరల్డ్ ఫేమస్ లవర్మమితా బైజుసుందర కాండతామర పువ్వుపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంభద్రాచలంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసమంతలలిత కళలువెలిచాల జగపతి రావుశ్రేయా ధన్వంతరిబైండ్లరోహిత్ శర్మఆల్ఫోన్సో మామిడినువ్వులుపాలకొండ శాసనసభ నియోజకవర్గంఉదగమండలంపది ఆజ్ఞలుతెలంగాణ ప్రభుత్వ పథకాలుథామస్ జెఫర్సన్మొదటి ప్రపంచ యుద్ధంమియా ఖలీఫాబాదామివై.యస్. రాజశేఖరరెడ్డిఅమ్మలైంగిక విద్యవాట్స్‌యాప్రుక్మిణి (సినిమా)సిద్ధు జొన్నలగడ్డమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంసీతాదేవితిక్కనకృష్ణా నదిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావిటమిన్ బీ12రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్రాబర్ట్ ఓపెన్‌హైమర్నువ్వు నేనుసీ.ఎం.రమేష్మహర్షి రాఘవవై. ఎస్. విజయమ్మసిరికిం జెప్పడు (పద్యం)ఆర్యవైశ్య కుల జాబితాబలి చక్రవర్తిఆశ్లేష నక్షత్రముశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంరాయప్రోలు సుబ్బారావువిజయనగర సామ్రాజ్యంవిద్యుత్తుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్భారత జాతీయపతాకంకొమురం భీమ్ప్రజా రాజ్యం పార్టీప్రకృతి - వికృతిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావిజయవాడటంగుటూరి ప్రకాశంశ్రీకాళహస్తిభీష్ముడుశ్రవణ కుమారుడుజే.సీ. ప్రభాకర రెడ్డిశ్రీ గౌరి ప్రియభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిస్వామి రంగనాథానందసామజవరగమనపొడుపు కథలుమీనరాశిజీలకర్రపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్తెలుగు కథ🡆 More