తెలుగు వ్యాకరణం నామవాచకం

ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి పరిశీలించవచ్చు.

ఇలా విడగొట్టిన భాగాలకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఇటువంటి భాషాభాగాల పేర్లలో ముఖ్యమైనవి: నామవాచకం (noun), సర్వనామం (pronoun), విశేషణం (adjective), క్రియ (verb), విభక్తి ప్రత్యయం (post position). ఈ భాగంలో ప్రస్తావన నామవాచకం గురించి మాత్రమే.

నిర్వచనం

ఒక వ్యక్తిని కాని, ఒక స్థలాన్ని కాని, ఒక వస్తువుని కాని, ఒక ఊహని కాని సూచించేది నామవాచకం.

వచనం

  • తెలుగులో తారసపడే నామవాచకాలకి, సర్వసాధారణంగా, "వచనం" (number), "లింగం" (gender) ఉంటాయి.
  • మనుష్యులలో మగ వారిని సూచించేది పుంల్లింగం లేదా పురుష లింగం
    • రాముడు, తాత, ఎరకయ్య, పిల్లడు, మొ.
  • మనుష్యులలో ఆడ వారిని సూచించేది స్త్రీ లింగం.
    • సీత, మామ్మ, రత్తాలు, పిల్ల, మొ.
  • పశువులు, చెట్లు, ప్రాణం లేని పదార్థాలు, అన్నీ కూడా స్త్రీ లింగమే
    • ఆవు, గంట, అడవి, మొ.
  • నామవాచకాలు "ఏకవచనం" (singular) లోనయినా ఉంటాయి, "బహువచనం" (plural) లోనయినా ఉంటాయి.
  • బహువచనంలో ఉన్న మాటలు, సర్వసాధారణంగా, "లు"తో కాని "ళ్లు"తో కాని అంతం అవుతాయి.
    • ఏకవచనంలో ఉన్న కొన్ని నామవాచకాలకి కేవలం "లు" తగిలిస్తే బహువచనాలు అవుతాయి.:
      • గోడ --> గోడలు
      • చేప --> చేపలు
      • మాట --> మాటలు
      • పన్ను ---> పన్నులు (tax-->taxes)
    • సంస్కృతం నుండి తెలుగు లోకి వచ్చినప్పుడు ఏకవచనంలో "డు" సంతరించుకున్న మాటలు బహువచనంలో "డు"ని పోగొట్టుకుని "లు" చేర్చుకుంటాయి:
      • పండితుడు --> పండితులు
      • స్నేహితుడు --> స్నేహితులు
      • ఆత్మీయుడు --> ఆత్మీయులు
    • బహువచనంలో "లు" చేర్చినప్పుడు, అప్పుడప్పుడు, సంధి చేయవలసి వస్తుంది:
      • పేరు --> పేరులు --> పేర్లు
      • కారు --> కారులు --> కార్లు
      • బోటు --> బోటులు --> బోట్లు
      • చెట్టు --> చెట్టులు --> చెట్లు
      • మెట్టు --> మెట్టులు --> మెట్లు
      • రోడ్డు --> రోడ్డులు --> రోడ్లు
    • ఏకవచనంలో ఉన్న నామవాచకం "లు"తో అంతం అయితే దాని బహువచనం "ళ్లు"తో అంతం అవుతుంది:
      • కీలు --> కీళ్లు
      • తేలు --> తేళ్లు
      • కాలు --> కాళ్లు
      • పాలు --> పాళ్లు (portion -->portions)
      • పెనిసిలు --> పెనిసిళ్లు (pencils)
    • ఏకవచనం "డి", "డు", "లి", "రు" లతో అంతం అయితే దాని బహువచనం "ళ్లు"తో అంతం అవుతుంది:
      • బడి --> బళ్లు (schools)
      • బండి --> బళ్లు (carts)
      • పెరడు --> పెరళ్లు (backyards)
      • ఊరు --> ఊళ్లు (villages)
    • కొన్ని నామవాచకాలకి "లు" తగిలించినప్పుడు మాట వర్ణక్రమంలో కొద్ది మార్పు వస్తుంది.
      • నది --> నదులు
      • గది --> గదులు
      • బంతి --> బంతులు
    • ప్రత్యేకమైన సందర్భాలు
      • మడి --> మళ్లు
      • గడి --> గళ్లు
      • సుడి --> సుళ్లు
      • పండు --> పండ్లు, పళ్లు (fruits)
      • పన్ను ---> పళ్లు (tooth-->teeth)
      • ఇల్లు --> ఇళ్లు
      • ఎద్దు --> ఎడ్లు
    • కొన్ని నామవాచకాలు ఎల్లప్పుడూ బహువచనాలే!
      • పాలు, నీళ్లు

లింగం

  • సర్వసాధారణంగా "డు"తో అంతం అయ్యే పేర్లు అన్నీ పుంల్లింగమే అవుతాయి.
    • రాముడు, తమ్ముడు, అల్లుడు, మనుమడు, ముఖ్యుడు, మొ.
  • పుంల్లింగములు అన్నీ "డు"తో అంతం అవ్వాలని నియమం ఏదీ లేదు
    • తండ్రి, అన్న, మామ, మొ.
    • జంతువులు అన్నీ స్త్రీ లింగములే.
      • ఆవు, ఎద్దు, మగ గుర్రం, ఆడ గుర్రం, మొసలి, మొ.
    • ప్రాణము లేనివి అన్నీ స్త్రీ లింగములే
      • చెట్టు, నది, రాయి, మొ.
    • కొన్ని వర్గాలలో ఆడ, మగ, వ్యత్యాసం చూపించడానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి:
      • అమ్మ, అత్త, అక్క, కోడలు, అమ్మాయి, పిల్ల, మొ. స్త్రీ లింగములు
      • నాన్న, మామ, అన్న, అల్లుడు, అబ్బాయి, పిల్లడు, మొ. పుంల్లింగములు

లింగం మార్పిడి

  • పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర "-ఉడు" సబ్దాన్ని తీసేసి "-టి"ని చేర్చాలి.
      • నటుడు --> నటి
      • వంచకుడు --> వంచకి
  • పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర "-డు" సబ్దాన్ని తీసేసి "-రాలు"ని చేర్చాలి.
      • వంచకుడు --> వంచకురాలు
      • ప్రియుడు --> ప్రియురాలు
      • భక్తుడు --> భక్తురాలు
      • స్నేహితుడు --> స్నేహితురాలు
  • కొన్ని మాటలు ఎల్లప్పుడు స్త్రీ లింగాలే
      • చూలాలు, ఇల్లాలు

Tags:

తెలుగు వ్యాకరణం నామవాచకం నిర్వచనంతెలుగు వ్యాకరణం నామవాచకం వచనంతెలుగు వ్యాకరణం నామవాచకం లింగంతెలుగు వ్యాకరణం నామవాచకం

🔥 Trending searches on Wiki తెలుగు:

సుమతీ శతకముపెళ్ళి చూపులు (2016 సినిమా)రతన్ టాటాతెలుగు భాష చరిత్రభారత ఆర్ధిక వ్యవస్థపార్లమెంటు సభ్యుడుసంధి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుజ్యేష్ట నక్షత్రంతెలుగు అక్షరాలుమంగళవారం (2023 సినిమా)అండాశయముభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతొలిప్రేమజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంలక్ష్మిసౌర కుటుంబంసురేఖా వాణిపూర్వాభాద్ర నక్షత్రముబలి చక్రవర్తిపుష్పసామెతలురోజా సెల్వమణిసింహరాశిభారతీయ స్టేట్ బ్యాంకుమాళవిక శర్మసుడిగాలి సుధీర్శ్రేయా ధన్వంతరితామర వ్యాధిఅడాల్ఫ్ హిట్లర్ద్వాదశ జ్యోతిర్లింగాలువిరాట పర్వము ప్రథమాశ్వాసముఫేస్‌బుక్కుటుంబంవిటమిన్ బీ12తెలంగాణ జిల్లాల జాబితాఅమెజాన్ (కంపెనీ)గైనకాలజీఉత్తరాభాద్ర నక్షత్రముపాండవులుప్రియురాలు పిలిచిందిస్టాక్ మార్కెట్తెలుగు కులాలుహైపర్ ఆదికోవూరు శాసనసభ నియోజకవర్గంశింగనమల శాసనసభ నియోజకవర్గంతాటి ముంజలువిష్ణువుమహర్షి రాఘవబమ్మెర పోతనసలేశ్వరంసన్ రైజర్స్ హైదరాబాద్చెమటకాయలుటిల్లు స్క్వేర్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రివంగవీటి రంగాలగ్నంరాహుల్ గాంధీఐక్యరాజ్య సమితిభారతదేశంలో సెక్యులరిజంకింజరాపు అచ్చెన్నాయుడుభూమిసజ్జల రామకృష్ణా రెడ్డిరామాయణంఅశ్వత్థామచిరంజీవులుకాళోజీ నారాయణరావుశాంతిస్వరూప్గుంటూరు కారంచాణక్యుడుభారత రాజ్యాంగ సవరణల జాబితాజాతీయ ప్రజాస్వామ్య కూటమిగుంటూరురాజంపేట శాసనసభ నియోజకవర్గంరావణుడురామరాజభూషణుడుమహాభారతం🡆 More