నిర్ధారత్వం

ఏదైనా విషయాన్ని వికీపీడియాలో వ్రాయవచ్చునా అనే సమస్యకు ప్రామాణికత - నిజం మాత్రమే కాదు, నిర్ధారింప తగినది (verifiability, not truth).

నిర్ధారత్వం సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: ప్రశ్నింపబడిన, లేదా ప్రశ్నింపబడే అవకాశం ఉన్న విషయాలన్నింటికీ, మరియు కొటేషన్లకు విశ్వసనీయమైన, ఇంతకుముందు ప్ చూపాలి

అంటే వికీపీడియాలో ఉంచిన విషయాలు ఇంతకు ముందే విశ్వసనీయమైన ప్రచురణలలో వెలువడి ఉండాలి. ఇది నిజం అనుకుంటే చాలదు. ముఖ్యంగా వివాదాస్పదం కావచ్చుననిపించే విషయాలకు, లేదా ఇతరులు ప్రశ్నించిన విషయాలకు విశ్వసనీయమైన మూలాలు చూపడం చాలా అవుసరం. అలా చూపలేని పక్షంలో ఆ విషయాలను తొలగించాలి ({{fact}} (ఆధారం చూపాలి అని వస్తుంది) అనే మూస తగిలించి వదిలేస్తే చాలదు.)

వికీపీడియా:నిర్ధారింప తగినది అనేది వికీపీడియా రచనలకు వర్తించే మూడు మౌలిక సూత్రాలలో ఒకటి. తక్కిన రెండు వికీపీడియా:తటస్థ దృక్కోణం మరియు వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం - ఈ మూడు సూత్రాలు వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక సంయుక్తంగా, విచక్షణతో అమలు చేయాలి.

ఆధారం ఎవరు చూపాలి?

వికీలో ఆ విషయం వ్రాసిన వారు లేదా చెరిపివేసిన విషయాన్ని పునస్థాపించినవారు తగిన ఆధారాలను చూపాలని ఆశిస్తాము. ఇందుకు విషయంపాఠంలోపల అంతర్గతంగా సముచితమైన మూలాలను పేర్కొనవలసి ఉంది.

అలా మూలాలను చూపని పక్షంలో ఆ విషయాలను తొలగించడం సరైన పద్ధతి. అయితే రచయితలకు తగిన హెచ్చరిక, అవకాశం ఇచ్చేందుకు మూలాలు అవసరమనిపించిన చోట {{fact}} అనే మూసను ఉంచి, దానికి తగిన స్పందనలను పరిశీలించండి . లేదా వ్యాసంలో కనిపించని వ్యాఖ్యలు ఉంచితే రచయితలు దానిని దిద్దుబాట్ల సమయంలో మాత్రమే చూడగలుగుతారు.

ముఖ్యంగా జీవించి ఉన్న వ్యక్తులను, లేదా సంస్థలను కించపరిచేలా ఉన్న విషయాలు తగిన ఆధారాలు లేకుండా ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించవచ్చును. ఈ విషయమై (en:Wikipedia:Biographies of living persons) జిమ్మీ వేల్స్ ఇలా అన్నాడు.

I can NOT emphasize this enough. There seems to be a terrible bias among some editors that some sort of random speculative 'I heard it somewhere' pseudo information is to be tagged with a 'needs a cite' tag. Wrong. It should be removed, aggressively, unless it can be sourced. This is true of all information, but it is particularly true of negative information about living persons.

మూలాలు

విశ్వసనీయమైన మూలాలు

వికీపిడియాలోని వ్యాసాలు ఇతరులు ప్రచురించిన వాటిపై ఆధారపడుతాయి గనుక ఆ మూలాలు కూడా విశ్వసనీయమైనవి, సత్యానికి కట్టుబడేవి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనేవి అయి ఉండాలి. వ్రాసిన వ్యాసాలలోని విషయాన్ని నిర్ధారించడానికీ, దానిని ఎక్కడినుండి సేకరించారో ఆ రచయితలను, ప్రచురణ కర్తలను పేర్కొనడానికీ, గ్రంధ చౌర్యాన్ని అరికట్టడానికీ, కాపీ హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికీ కూడా ఈ ప్రమాణాలు పాటించడం చాలా అవసరం. మూలాలలో ఉన్నంత భావం కంటే ఎక్కువగా వికీపీడియా రచనలలో ధ్వనించరాదు. విపరీతమైన విషయాలకు (exceptional claims) ఖచ్చితమైన మూలాలు మరింతగా అవసరమౌతాయి. అన్ని రచనలూ తటస్థ దృక్కోణానికి అనుగుణంగా ఉండాలి. ఆయా వ్యాసాలలో ఉన్న విషయాలపై ప్రధాన అభిప్రాయాలతో పాటు, ఇతర అభిప్రాయాలను కూడా తగినంతగా, ఆధారాలతో సహా, పేర్కొనాలి.

రచయితలు పేర్కొన్న మూలాలు ఆయా రంగాలకు చెందిన నమ్మకమైన ప్రచురణలు - జర్నల్‌లు, పాఠ్యపుస్తకాలు, ప్రధాన వార్తా పత్రికలు - అయితే వాటి పట్ల విశ్వాసం పెరుగుతుంది. విషయంలోని నిజాన్ని, దాని చట్టపరమైన సమస్యలను కూలంకషంగా పరిశీలించిన తరువాత ప్రచురించే ప్రచురణలు విశ్వసనీయమైన మూలాలు అనవచ్చును. అన్నింటికంటే, ఆయా రంగాల్లోని నిపుణుల పరిశీలనలో వెలువడే ప్రచురణలు అత్యంత ఆదరణీయాలు. వీటి గురించిన మరికొన్ని వివరాలు ఈ ఆంగ్ల వికీ వ్యాసంలో చూడవచ్చును.

ప్రశ్నార్ధకమైన మూలాలు

నిజాన్ని నిర్ధారించుకోకుండా అవాకులూ, చవాకులూ ప్రచురించే సంస్థలనుండి వెలువడిన ప్రచురణలపై విశ్వసనీయత రావడం కష్టం. ఒక విధమైన అభిప్రాయానికి లేదా వాదానికి పట్టం కట్టే వెబ్‌సైటులు ఈ కోవలోకి వస్తాయి. ఇటువంటి మూలాలను ఆ సంస్థల గురించి లేదా వ్యక్తుల గురించి వ్రాసే వ్యాసాలలో మాత్రం వాడవచ్చును. Articles about such sources should not repeat any contentious claims the source has made about third parties, unless those claims have also been published by reliable sources.

స్వీయ ప్రచురణలు

స్వీయ ప్రచురణలు అంటే కర పత్రాలు కావచ్చును. పార్టీ ప్రణాళికలు కావచ్చును. లేదా వ్యక్తులు లేదా సమూహాలు నడిపే వెబ్‌సైటులు కావచ్చును. చాలా బ్లాగులు ఈ కోవలోకి వస్తాయి. అటువంటి ప్రచురణలలో ఉన్న విషయాలు ఆ దృక్కోణాన్ని ఉదాహరించడానికి తప్ప ఇతర నిర్ధార ప్రయోజనాలకు వాడడం వలన ప్రయోజనం లేదు.

స్వీయ ప్రచురణలు ఆ రంగంలో ఆ వ్యక్తులకున్న స్థానాన్ని బట్టి అంగీకరించవచ్చును. కానీ ఇటువంటి మూలాలను విచక్షణతో, తప్పని పరిస్థితిలో మాత్రం వాడాలి. అది ఆ వ్యక్తుల లేదా సంస్థల ప్రయోజనాలను పెంపొందించే ఉద్దేశ్యంతో రూపొందించిన మూలమైతే అసలు పనికిరాదు. ఒకరి అభిప్రాయం నిజంగా ఆమోదయోగ్యమైతే మరెక్కడైనా అది ప్రచురించి ఉండాలి. స్వీయ ప్రచురణలను ఆ రచయితల జీవిత చరిత్రకు సంబంధించిన వ్యాసాలలో మూలాలుగా అసలు వాడకూడదు.(en:WP:BLP#Reliable sources).

వికీపీడియాలోని వ్యాసాలను, వికీ చర్చలలోని విషయాలను మూలాలుగా పేర్కొనరాదు.

వార్తాపత్రికలు - పత్రికల బ్లాగులు

కొన్ని వార్తాపత్రికలు, పత్రికలు, ఇతర వార్తా సంస్థలు బ్లాగులు అని పిలిచే ప్రత్యేక అంతర్జాల శీర్షికలను నిర్వహిస్తాయి.రచయితలు వృత్తినిపుణుడు (ప్రొఫెషనల్స్) అయితే ఇవి ఆమోదయోగ్యమైన వనరులు కావచ్చు, కానీ బ్లాగులు వార్తా సంస్థ యొక్క సాధారణ నిజ నిర్ధారణ ప్రక్రియకు లోబడి ఉండకపోవచ్చు కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి. ఒక వార్తా సంస్థ ఒక బ్లాగులో ఒక అభిప్రాయ భాగాన్ని ప్రచురిస్తే, ఆ ప్రకటనను రచయితకు ఆపాదించండి, ఉదా. "జేన్ స్మిత్ ఇలా రాశాడు ..." అయుతే ఇందులో పాఠకులు వదిలిపెట్టిన బ్లాగ్ వ్యాఖ్యలను మూలాలుగా ఎన్నడూ ఉపయోగించవద్దు.

ఇవి కూడా చూడండి

    ఆంగ్ల వికీపీడియాలో ఈ విషయానికి సంబంధించిన వ్యాసాలు

మూలాలు

Tags:

నిర్ధారత్వం ఆధారం ఎవరు చూపాలి?నిర్ధారత్వం మూలాలునిర్ధారత్వం ఇవి కూడా చూడండినిర్ధారత్వం మూలాలునిర్ధారత్వంమూస:Fact

🔥 Trending searches on Wiki తెలుగు:

లక్ష్మిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్దీపావళివాయు కాలుష్యంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాపెళ్ళివరిబీజంసంధిఏడిద నాగేశ్వరరావుPHతిరుపతిఇంటి పేర్లువిజయనగర సామ్రాజ్యంరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంశ్రీ కృష్ణదేవ రాయలుమురుడేశ్వర ఆలయంసూర్య నమస్కారాలునారా బ్రహ్మణినిర్వహణజూనియర్ ఎన్.టి.ఆర్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితానవగ్రహాలు జ్యోతిషంఊరు పేరు భైరవకోనదువ్వాడ శ్రీనివాస్ఉపద్రష్ట సునీతషిర్డీ సాయిబాబాశ్రీశైలం (శ్రీశైలం మండలం)2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుడామన్మరణానంతర కర్మలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంబలి చక్రవర్తికేరళకస్తూరి రంగ రంగా (పాట)కల్క్యావతారముఏప్రిల్నువ్వు నేనుఆర్తీ అగర్వాల్హరే కృష్ణ (మంత్రం)భారత రాజ్యాంగంసరస్వతిఉప్పు సత్యాగ్రహంతోట త్రిమూర్తులుఅపర్ణా దాస్ఖండంనానార్థాలుక్రిక్‌బజ్ఎయిడ్స్నోటాఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతెలుగు సాహిత్యంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితానామనక్షత్రముఆది శంకరాచార్యులుసిరికిం జెప్పడు (పద్యం)వంతెనభారతదేశంలో కోడి పందాలునాయట్టుపద్మశాలీలుశాసనసభదినేష్ కార్తీక్తమిళ అక్షరమాలపురాణాలుపులిసునాముఖిసింహంకోణార్క సూర్య దేవాలయంఅన్నప్రాశనరాజమహల్షర్మిలారెడ్డిడి. కె. అరుణగరుత్మంతుడురావి చెట్టుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంచోళ సామ్రాజ్యంతెలుగు పదాలుఐక్యరాజ్య సమితియేసు🡆 More