ఏలకులు

ఏలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము.

పచ్చఏలకుల శాస్త్రీయ నామం ఎలెట్టరీయా (Elettaria), నల్ల ఏలకుల శాస్త్రీయ నామం అమెమం (Amomum). ఏలకులు పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడబడుతున్నవి. 2వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన చరక సంహితం లోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రం లోను వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధద్రవ్యాల రాణిగా పేర్కొంటారు. కాని వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించినది బ్రిటిష్ వారు.

ఏలకులు
ఏలకులు
True Cardamom (Elettaria cardamomum)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
ప్రజాతులు

Amomum
Elettaria

ఏలకులు
ఆకుపచ్చ ఏలకులు

యాలకులు ,ఇలద్వయ,Cardimom

మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే వస్తు వులు సమస్తం ఆరోగ్యహేతువులే. వాటిలో అత్యధికంగా వాడబడేది ఇలద్వయ. అంటే వాడుకలో దీనినే యాలకులు అని అంటాం. దీని శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్‌. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయ నాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విల క్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండూ ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుం టాయి.

ఔషధగుణాలు

యాలకులు అనాదిగా ఆయుర్వేద శాస్త్రీయ వైద్యవిధానంలో వాడకంలో ఉన్నట్టు చరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వీటినుండి తయారైన ఇలాదికర్న, ఇలాదివతి, ఇలాదిక్వత, ఇలాదిమొదక, ఇలాద్యారిష్ట, శీతోఫలాదికర్న, అరవిందసవ వంటి ఔషధాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శరీరానికి చలువచేసే గుణాలు ఎక్కువగా ఇందులో ఉండటం మూలంగా వీటిని అనేక పానీయాల్లో, వంటకాల్లో వినియోగించడం అనవాయితీగా వస్తోంది.

ఉపయోగాలు

  • దీనితో తయారుచేయబడిన అంతవర్ధ ప్రసమన, ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి దివౌషధంగా పనిచేస్తుంది.
  • ఒళ్ళు నొపðలకి, సిరోవిరికన అనే ఔషధం, నాసికా చికిత్సకి అనాదిగా వాడుతున్నట్టు వైద్య సంహితల్లో పేర్కొన్నారు. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తల నొప్పి చిటి కెలో మటుమాయమవు తుంది.
  • అలాగే యాలకుల కషా యం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉం టుంది.
  • యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
  • యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి, పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపో తాయి.
  • వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు (అల్సర్స్‌) కూడా తగ్గుముఖం పడ తాయి.
  • చాలా రకాల రుగ్మత లకి ఇలద్వయ (ఇలాచీ-యాలకులు) ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
  • యాలకుల తైలం పంటినొ ప్పిని నివారించి, క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది.
  • దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.
  • యాలకుల పొడి, సొంటిపొడి 0.5గ్రా్ప్పచొపðన సమపాళ్ళలో తయారుచేసుకుని అందులో కొంచెం తేనె కలిపి తీసుకుంటే, కఫాన్ని నిర్మూలించి, దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  • ఆస్త్మా రోగులు యాలకులు, జాతిఫల, కుంకుమ పువ్వు, వంశలోకన, నాగకేసర, శంఖజీరక సమ పాళ్ళలో నూరి తేనెతో కలిపి సేవిస్తూవుంటే ఆ వ్యాధి నుంచి మంచి ఉపశమనం ఏర్పడుతుంది.

ఇలా అన్ని రుగ్మతలకీ ఉపయోగపడే ఈ ఇలద్వయ సంజీవని వంటిదని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. దీనిని ఇంటి ఆవరణలో కూడా పెంచుకుంటే అందమైన పుష్పాలతో, సంవత్సరం పొడవునా ఉండే పచ్చని ఆకులతో ఇంటికి శోభనివ్వడమేకాకుండా మంచి ఔషధం కూడా మన పెరటిలో ఉన్నట్టే...


ఏలకులు - రకాలు

యాలకులు

భారతదేశంలో ఏలకుల సాగుబడి

దక్షిణ భారతదేశం లోని నీలగిరి కొండలు ఏలకుల జన్మస్థానం. కాని ఇప్పుడు ఇవి శ్రీలంక, బర్మా, గ్వాటిమాల, భారత్, చైనా, టాంజానియా లలో పండించబడుతున్నది. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదయిన సుగంధ ద్రవ్యం ఏలకులు. గ్రీకులు, రోమన్లు వీటిని అత్తరుగా వాడేవారు. భారత దేశపు ఏలకులు అత్యుత్తమమైనవి . మన దేశంలో పండించచే ఏలకులలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అవి, మలబార్ ఏలకులు, మైసూరు ఏలకులు. ప్రపంచంలో యాలకులు అత్యధికంగా పండించేది భారతదేశం. కాని అధిక శాతం యాలకులను దేశీయంగానే ఉపయోగిస్తారు. గ్వాతిమాలాలో మాత్రం వాణిజ్యపరంగా సాగు చేస్తారు.

యాలకులు దుంపలు, విత్తనాల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. ముందుగా విత్తనాలు నారుపోసి ఎదిగిన తర్వాత పొలంలో నాటుకోవాలి. మలబారు రకాలను 1.8 మీటర్ల దూరంలోను, మైసూర్ రకాలను 3 మీటర్ల దూరంలోను నాటుకోవాలి. యాలకులు 1400 నుంచి 1500 మి.మీ. వర్షపాతంగల ప్రాంతాలలో బాగా పండుతుంది. సారవంతమైన అడవి రేగడి నేలలు దీని సాగుకు అనుకూలం. యాలకులు పండించే భూమికి విధిగా మురుగునీటి సదుపాయం ఉండాలి. ఎందుకంటే ఈ పంట నీటి ముంపును తట్టుకోలేదు. వీటి మొక్క పొద లాగ 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సముద్రమట్టానికి 800 నుండి 1500 మీటర్ల ఎత్తులో తేమ, వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఈ మొక్కను విత్తనాల ద్వారా గాని, కణుపుల ద్వారా గాని పెంచవచ్చు. నాటిన 3 సంవత్సరాల తరువాత ఈ మొక్క ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. కాయలను సగం పండగానే కోస్తారు. వీటిని ఎండలో కాని, యంత్ర సహాయంతో గాని ఆరబెడతారు. ఉత్తమమైన వాటిని వేరుచెసి గ్రేడ్ చేస్తారు. ఆకుపచ్చనివి అన్నింటి కన్నా ఉత్తమమైనవి.

అరేబియన్ దేశాలలో ఏలకులను కాఫీ తోను, మిగిలిన దేశాలలో తేయాకుతోను కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయిలు, కేకులు, పేస్ట్రీలు మొదలైన పదార్ధాలలో సువాసన కోసం ఏలకులను వాడతారు. భారతదేశంలో కూరలు, వంటలలో మసాలా దినుసుగా కూడా వాడతారు.

దిగుబడి

మొక్కలు ఏప్రిల్ నెలలో పూతకు వచ్చి జూలై - ఆగష్టు నెలలో పంట కోతకు వస్తుంది. హెక్టారుకు సుమారుగా 200 నుంచి 300 కిలోల దిగుబడి వస్తుంది.

ఏలకులలో ఔషధగుణాలు

ఏలకుల గింజలలో టర్పనైన్, లిమొనెన్, టెర్పినోల్ లాంటి రసాయనాలు ఉంటాయి. వీటిని సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడతారు. చైనాలో జరిగిన పరిశోధనలలో వీటికి కెమోధెరపీ వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గించే శక్తి ఉందని రుజువు అయింది. వీటిని ఉదర సంబధమైన అజీర్తి, మలబద్దకం, అల్సర్ మొదలైన వ్యాధులలోను, శ్వాస సంబంధమైన ఆస్థమా, జలుబు, సైనస్ మొదలైన వ్యాధులలోను, కలరా, డీసెంట్రీ, తలనొప్పి, చెడుశ్వాస మొదలైన వాటికి చికిత్సగా వాడతారు.

చీడపీడల నివారణకు

యాలకులలో అతి ముఖ్యమైనది కట్టే జబ్బు. ఇది వైరస్ వలన వస్తుంది. అలాగే గింజ కుళ్ళు తెగులు, దుంపకుళ్ళు తెగులు, నులిపురుగులు మొదలైన చీడపీడలు పంటను ఆశిస్తాయి. వీటి నివారణకు.

1. ఆరోగ్యవంతమైన విత్తనం లేదా దుంప నాటుకోవాలి.

2. మొక్కల దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి.

3. వైరస్ వ్యాప్తి చేసే పురుగులను అరికట్టాలి.

4. బోర్డో మిశ్రమం 1 శాతం పిచికారి చేయటం, తడపుట వలన గింజ దుంపకుళ్ళును నివారించవచ్చును.

5. ఫోరేటు 50 గ్రాముల చొప్పున దెబ్బతిన్న మొదళ్ళలో వేస్తే నులిపురుగులను నివారింపవచ్చు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Tags:

ఏలకులు యాలకులు ,ఇలద్వయ,Cardimomఏలకులు ఔషధగుణాలుఏలకులు ఉపయోగాలుఏలకులు - రకాలుఏలకులు భారతదేశంలో ఏలకుల సాగుబడిఏలకులు దిగుబడిఏలకులు ఏలకులలో ఔషధగుణాలుఏలకులు చీడపీడల నివారణకుఏలకులు ఇవి కూడా చూడండిఏలకులు బయటి లింకులుఏలకులు మూలాలుఏలకులు

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్.భారతితెలుగు సాహిత్యంఅంగన్వాడితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రివిశ్వబ్రాహ్మణమహేంద్రసింగ్ ధోనివై.ఎస్. జగన్మోహన్ రెడ్డివాతావరణంరామ్ చ​రణ్ తేజబుర్రకథనల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డినామనక్షత్రముపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపూర్వ ఫల్గుణి నక్షత్రముమొదటి ప్రపంచ యుద్ధంపాఠశాలకీర్తి సురేష్అల్లసాని పెద్దనభారత పార్లమెంట్చింతఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాసుఖేశ్ చంద్రశేఖర్క్రిక్‌బజ్గౌడఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిదేవీ ప్రసాద్ప్రభాస్భారత ఎన్నికల కమిషనుచెక్ రిపబ్లిక్భీమా (2024 సినిమా)ఆరోగ్యంగరుడ పురాణంకాలేయంప్రధాన సంఖ్యశ్రీశ్రీసర్దార్ వల్లభభాయి పటేల్తమన్నా భాటియారక్త పింజరిఉలవలుటాన్సిల్స్యవలుఎఱ్రాప్రగడమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపూజా హెగ్డేమిథునరాశిచాకలి ఐలమ్మబ్రెజిల్టిల్లు స్క్వేర్హృదయం (2022 సినిమా)రామాఫలంజాతీయ విద్యా విధానం 2020శ్రీరామనవమి2019 భారత సార్వత్రిక ఎన్నికలువినాయక చవితిభారతదేశంభూమిదగ్గుబాటి పురంధేశ్వరిరాశి (నటి)2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభూమన కరుణాకర్ రెడ్డిబర్రెలక్కనరసింహావతారంనందమూరి తారక రామారావునయన తారగన్నేరు చెట్టునువ్వు లేక నేను లేనుఇండోనేషియాఅల్లూరి సీతారామరాజుఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుమోదుగసుందర కాండతెలంగాణా సాయుధ పోరాటంసిద్ధు జొన్నలగడ్డఆతుకూరి మొల్లహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాయోనిజాతిరత్నాలు (2021 సినిమా)🡆 More