జావా దీవి

జావా, ఇండోనేషియాలోని ఆగ్నేయ మలేషియా, సుమత్రా, బోర్నియో (కాలిమంటన్), పశ్చిమ బాలికి దక్షిణాన ఉన్న ద్వీపం.

ఇండోనేషియా రాజధాని జకార్తా కూడా ఇక్కడే ఉంది. అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడిన ఈ ద్వీపం ప్రపంచంలోని 13వ అతిపెద్ద ద్వీపం, ఇంకా ఇండోనేషియాలో 5వ అతిపెద్ద ద్వీపం. ఒకప్పుడు హిందూ రాజులు, తరువాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీచే ఆధిపత్యం చెలాయించిన జావా దీవి, 1930-140 కాల వ్యవధిలో, ఈ ద్వీపం ఇండోనేషియా స్వాతంత్ర్య ఉద్యమానికి కేంద్రంగా కూడా ఉంది. ఇప్పుడు ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. జపనీస్ ద్వీపం హోమ్షు తర్వాత ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన ద్వీపంగా మారింది. 2020 జనాభా లెక్కల ప్రకారం 151.6 మిలియన్ల జనాభాతో (మదురా యొక్క 4.0 మిలియన్లతో సహా), జావా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రధాన ద్వీపం. బంగ్లాదేశ్‌తో సమానంగా ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఇది కూడా ఒకటి. ద్వీపంలోని ప్రతి ప్రాంతంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇండోనేషియా జనాభాలో సుమారు 56% మంది ఇక్కడ నివసిస్తున్నారు. జావా మొత్తం భూభాగం 138,794 చ.కి.మీ. ఈ ద్వీపం తూర్పు నుండి పడమర వరకు 1,064 కి.మీ పొడవు, కానీ కేవలం 100 నుండి 160 కి.మీ వెడల్పు మాత్రమే. ఇది మూడు ప్రధాన భాషలను కలిగి ఉంది, జావానీస్ ఆధిపత్య భాష. ఇది ఇండోనేషియా 60 మిలియన్ల ప్రజల మాతృభాష. జావాలో అత్యధిక జనాభా ముస్లింలు అయినప్పటికీ, జావా మత విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతి మిశ్రమాన్ని కలిగి ఉంది.

చరిత్ర

జావా దీవిలో వ్యవసాయం మొదటిసారిగా ఆచరించబడింది. కొన్ని అధ్యాయనాల ప్రకారం ఇది 2500 BCE, నాటిది జావానీస్ ప్రజలు ఎక్కువగా వలస వచ్చిన వారి సంతతికి చెందినవారు. క్రీ.పూ 4000 నుండి అలలలో ద్వీపంలో స్థిరపడ్డారు. క్రీ.పూ 2000 నుండి క్రమంగా వ్యవసాయం అభివృద్ధి చెంది దక్షిణప్రాంతంతో వాణిజ్యం జరిగింది. భారతదేశ పరిచయం తీరప్రాంత రాజ్యాలలో హిందూ మతాన్ని స్వీకరించడానికి దారితీసింది. ఆగ్నేయ ఆసియా బౌద్ధమతం కూడా ఒక ప్రభావం చూపుతూ అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు పాత నమ్మకాలతో పాటు హిందూ మతం వైపు మొగ్గు చూపారు. క్రీ.శ 732 లో సంజయ అనే హిందూ రాజు జావాలోని మాతరం రాజ్యాన్ని స్థాపించాడు, 4వ, 16వ శతాబ్దాల మధ్య, జావాలో హిందూ-బౌద్ధ రాజ్యాలు ఏర్పడ్డాయి. 16వ శతాబ్దం చివరలో జావాలో ఇస్లాం ఆధిపత్య మతంగా మారింది.

మూలాలు

Tags:

ఇండోనేషియామలేషియా

🔥 Trending searches on Wiki తెలుగు:

విటమిన్ బీ12సజ్జా తేజభారత జాతీయపతాకంతెలుగు వికీపీడియాసిరికిం జెప్పడు (పద్యం)దశదిశలుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంతమిళ అక్షరమాలలగ్నంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముస్వామియే శరణం అయ్యప్పస్వాతి నక్షత్రముసునాముఖిమహేంద్రసింగ్ ధోనిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాజాషువాతెలుగు సినిమాభారతీయుడు (సినిమా)లలితా సహస్రనామ స్తోత్రం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసుడిగాలి సుధీర్పాముసంక్రాంతిదివ్యభారతిఅనురాధ శ్రీరామ్రాశి (నటి)పర్యాయపదంవిద్యవై.యస్.రాజారెడ్డిరిషబ్ పంత్రుతురాజ్ గైక్వాడ్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుకురుక్షేత్ర సంగ్రామంరామాయణంనారా లోకేశ్కాశీశాసనసభవృషణంభారతదేశంలో సెక్యులరిజంగోదావరికాళోజీ నారాయణరావుపి.సుశీలసామజవరగమనరమణ మహర్షికె.బాపయ్యనక్షత్రం (జ్యోతిషం)వేమనఅపర్ణా దాస్యోనినామనక్షత్రముద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయిటిల్లు స్క్వేర్బ్రాహ్మణ గోత్రాల జాబితాగర్భాశయముపమేలా సత్పతితెలంగాణా సాయుధ పోరాటంఆతుకూరి మొల్లబి.ఆర్. అంబేద్కర్తొట్టెంపూడి గోపీచంద్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంమృగశిర నక్షత్రమునువ్వు వస్తావనిదేవికజయలలిత (నటి)భారత ఆర్ధిక వ్యవస్థపాల్కురికి సోమనాథుడుసలేశ్వరంజానకి వెడ్స్ శ్రీరామ్జాతీయ విద్యా విధానం 2020రాధ (నటి)రాజమహల్ఉదయం (పత్రిక)ఖమ్మంసన్నిపాత జ్వరంబ్రహ్మంగారి కాలజ్ఞానంరక్త పింజరిదేవుడు🡆 More