మృత సముద్రం

మృత సముద్రం (హీబ్రూ: יָם הַ‏‏מֶ‏ּ‏לַ‏ח‎, Yām Ha-Melaḥ, ఉప్పు సముద్రం;అరబ్బీ: البَحْر المَيّت‎, al-Baḥr l-Mayyit, మృత సముద్రం) పశ్చిమాన ఇజ్రాయేల్, వెస్ట్ బ్యాంక్, తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన గల ఉప్పునీటి సరస్సు.

ఇది సముద్రమట్టానికి 420 మీటర్ల దిగువన ఉన్నది, దీని అంచులు భూతలంపై ఉన్న పొడిభూమిలన్నింటికంటే దిగువన ఉన్న ప్రాంతం. మృత సముద్రం 380 మీటర్ల లోతున, ప్రపంచంలో అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సు. అంతేకాక 33.7% శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే జలాశయాలలో ఒకటి. అస్సల్ సరస్సు (జిబూబీ), గరబొగజ్కోల్, అంటార్కిటికాలోని మెక్‌ముర్డో పొడి లోయలలోని లవణీయత ఎక్కువైన డాన్ హువాన్ కుంట వంటి కొన్ని సరస్సులు మాత్రమే మృతసముద్రాని కంటే ఉప్పగా ఉన్నాయి. అత్యంత లవణీయత కలిగిన సరస్సు, వాండా సరస్సు సముద్రం కంటే 8.6 రెట్లు అధిక లవణీయత కలిగి ఉంది. మృత సముద్రం, మధ్యధరా సముద్రం కంటే పది రెట్లు ఉప్పగా ఉన్నదని నిపుణుల అంచనా (34% శాతంతో మధ్యధరా సముద్రం యొక్క 3.5% శాతంతో పోల్చినపుడు). ఈ లవణీయత వలన మృతసముద్రం జంతుజాలం యొక్క మనుగడకు అత్యంత కఠోరమైన ఆవరణంగా ఉంది. మృత సముద్రం 67 కిలోమీటర్ల పొడవు, అత్యంత వెడల్పైన ప్రదేశంలో 18 కిలోమీటర్ల వెడల్పు మేరకు విస్తరించి ఉంది. ఇది జోర్డాన్ రిఫ్ట్ లోయలో ఏర్పడినది. దీని ప్రధాన నీటివనరు జోర్డాన్ నది.

మృత సముద్రం
అక్షాంశ,రేఖాంశాలు31°20′N 35°30′E / 31.333°N 35.500°E / 31.333; 35.500
రకంendorheic
hypersaline
సరస్సులోకి ప్రవాహంజోర్డాన్ నది
వెలుపలికి ప్రవాహంలేదు
పరీవాహక విస్తీర్ణం40,650 km2 (15,700 sq mi)
ప్రవహించే దేశాలుజోర్డాన్
ఇజ్రాయెల్
వెస్ట్ బ్యాంక్
గరిష్ట పొడవు67 km (42 mi)
గరిష్ట వెడల్పు18 కి.మీ (11 మై)
ఉపరితల వైశాల్యం810 km2 (310 sq mi)
ఉత్తర బేసిన్
సరాసరి లోతు120 మీ (394 అడుగులు)
గరిష్ట లోతు380 మీ (1,247 అడుగులు)
147 km3 (35 cu mi)
తీరంపొడవు1135 కి.మీ (84 మై)
ఉపరితల ఎత్తు−420 m (−1,378 ft)
మూలాలు
1 Shore length is not a well-defined measure.

వేలాది సంవత్సరాలుగా మృతసముద్రం మధ్యధరా సముద్రపు తీరప్రాంతాలనుండి అనేకమంది యాత్రికులను ఆకర్షించింది. బైబిల్లో దావీదు రాజు ఇక్కడే తలదాచుకున్నాడు. హేరోదు పాలనాకాలంలో ప్రపంచములోనే మొట్టమొదటి హెల్త్ రెసార్ట్్‌గా మృతసముద్రం పేరుతెచ్చుకున్నది. ఈజిప్టు ప్రజలు మమ్మీలను భద్రపరచడానికి ఉపయోగించిన లేపనాల నుండి ఎరువులలో వాడే పొటాష్ వరకు అనేక రకాల ఉత్పత్తులను మృత సముద్రం సరఫరా చేసింది. మృత సముద్రం నుండి లభ్యమయ్యే లవణాలు, ఖనిజాలు సౌందర్యసాధనాలు తయారుచేయటానికి ప్రజలు ఉపయోగించేవారు.

అరబ్బీ భాషలో మృతసముద్రాన్ని audio speaker iconఅల్-బహ్ర్ అల్-మయ్యిత్   ("మృత సముద్రం") అని పిలుస్తారు. దీన్ని బహ్ర్ లూత్ (بحر لوط, "లోత్ సముద్రం"). అని కూడా పిలుస్తారు. చారిత్రకంగా అరబ్బీ భాషలో సమీప పట్టణం పేరు మీద జోర్ సముద్రం అన్న పేరు కూడా ఉంది. హీబ్రూలో మృతసముద్రాన్ని audio speaker iconయామ్ హ-మేలా , ("ఉప్పు సముద్రం," లేదా యామ్ హ-మావెత్ (ים המוות, "మృత్యువు సముద్రం") అని పిలుస్తారు. పూర్వము దీన్ని కొన్నిసార్లు యామ్ హ-మిజ్రాహీ (ים המזרחי, "తూర్పు సముద్రం") లేదా యామ్ హ-అరావా (ים הערבה, "అరబా సముద్రం") అని కూడా వ్యవహరించేవారు.. గ్రీకులు దీన్ని ఆస్ఫాల్టైట్స్ సరస్సు అని వ్యవహరించారు.

మూలాలు

Tags:

అరబ్బీ భాషఇజ్రాయేల్జోర్డాన్హీబ్రూ

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రపంచ రంగస్థల దినోత్సవంసుభాష్ చంద్రబోస్తెలుగు సంవత్సరాలునీతా అంబానీసుందర కాండపది ఆజ్ఞలుకర్ణుడుసావిత్రి (నటి)వరలక్ష్మి శరత్ కుమార్ప్రియురాలు పిలిచిందిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంముహమ్మద్ ప్రవక్తరామావతారంవృషభరాశిమానుషి చిల్లర్మండల ప్రజాపరిషత్గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిసవర్ణదీర్ఘ సంధిశ్రీ కృష్ణదేవ రాయలుసమాసంశ్రీదేవి (నటి)ఒగ్గు కథమానసిక శాస్త్రంనాగార్జునసాగర్భారతీయ జనతా పార్టీఏకలవ్యుడుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులురక్తపోటుఆరోగ్యంప్రకటనరేవతి నక్షత్రంవందే భారత్ ఎక్స్‌ప్రెస్శక్తిపీఠాలుభారతీయ శిక్షాస్మృతికారాగారంతెలుగు పదాలుబలి చక్రవర్తిఓటుతెలుగు సాహిత్యంరాశివిమలశ్రీ గౌరి ప్రియదావీదుజి.ఆర్. గోపినాథ్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంయాదవప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఇజ్రాయిల్రాధ (నటి)ఇంటి పేర్లుఐక్యరాజ్య సమితివాట్స్‌యాప్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంసంపన్న శ్రేణిఎస్. శంకర్నిజాంఉత్తర ఫల్గుణి నక్షత్రముడీజే టిల్లుధనుష్తీన్మార్ మల్లన్నశివ కార్తీకేయన్కర్కాటకరాశిసత్యనారాయణ వ్రతంమూత్రపిండమునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రికస్తూరి రంగ రంగా (పాట)వై.యస్.భారతిరోహిత్ శర్మవర్షిణిపెరిక క్షత్రియులుబమ్మెర పోతనమెయిల్ (సినిమా)ఎంసెట్రామోజీరావుశాసనసభఆది శంకరాచార్యులునవనీత్ కౌర్ఉమ్మెత్త🡆 More