ప్రపంచ వారసత్వ ప్రదేశం

ప్రపంచ వారసత్వ ప్రదేశం, అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుంది.

(ఉదా: అడవి, పర్వతం, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీచే ప్రపంచ వారసత్వ గుర్తింపు కార్యక్రమాన నిర్వహింపబడి, దానిని జాబితాలో నామినేట్ చేస్తుంది.

ప్రపంచ వారసత్వ ప్రదేశం
ప్రదేశం సంఖ్య 252:తాజ్ మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
ప్రపంచ వారసత్వ ప్రదేశం
2021లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన రామప్ప ఆలయం

ఈ కమిటీలో 21 రాష్టాల పార్టీలుంటాయి. వీటికి రాష్ట్రపార్టీల జనరల్ శాసనసభ, 4 సంవత్సరాల కొరకు ఎన్నుకుంటుంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం. 2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్ర పార్టీల యందు ఉన్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ, 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.

చరిత్ర - మూలం

1954లో, ఈజిప్ట్ ప్రభుత్వం కొత్త అస్వాన్ డ్యామ్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో ఏర్పడే రిజర్వాయర్ చివరికి నైలు లోయలో పురాతన ఈజిప్ట్, పురాతన నుబియా సాంస్కృతిక సంపదను కలిగి ఉన్న పెద్ద విస్తీర్ణం వరదలో మునిగిపోతుంది. 1959లో ఈజిప్ట్, సుడాన్ ప్రభుత్వాలు, అంతరించిపోతున్న స్మారక చిహ్నాలైన ప్రదేశాలు, ప్రాంతాలు రక్షించడానికి తమకు సహాయం చేయమని యునెస్కోను అభ్యర్థించాయి. 1960లో యునెస్కో తరుపున డైరెక్టర్ జనరల్ నుబియా లోని స్మారక చిహ్నాలను రక్షించడానికి అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాడు. నుబియాలోని స్మారక చిహ్నాలను రక్షించడానికి ఈ అంతర్జాతీయ ప్రచారం ఫలితంగా వందలాది ప్రదేశాల తవ్వకం, చరిత్ర నమోదు, వేలకొద్దీ వస్తువుల పునరుద్ధరణ, అలాగే అనేక ముఖ్యమైన దేవాలయాలను రక్షించడం, మరొక ప్రాంతానికి మార్చడం జరిగింది. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనవి అబూ సింబెల్ దేవాలయాలు, ఫిలే ఆలయ సముదాయాలు మొదలగునవి. 1980లో విజయవంతంగా ప్రచారం ముగిసింది. ముఖ్యంగా ప్రచారం విజయవంతానికి సహకరించిన దేశాలకు ధన్యవాదాలు తెలిపేందుకు, ఈజిప్ట్ నాలుగు దేవాలయాలను విరాళంగా ఇచ్చింది. దెందుర్ ఆలయం న్యూయార్క్ నగరం లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు, మాడ్రిడ్‌ లోని డెబోడ్ ఆలయం, పార్క్ డెల్ ఓస్టెకు, లైడెన్‌లోని రిజ్‌క్స్‌మ్యూజియం వాన్ ఔదేడెన్‌కు, టాఫెహ్ ఆలయం, మ్యూజియో ఎజిజియో లోని ఎల్లేసియా ఆలయం లోకి మార్చబడ్డాయి.

ఈ ప్రాజెక్టు ఖర్చ 2013లో US$80 మిలియన్ ($284.14 కి సమానం), ఇందులో సుమారు $40 మిలియన్లు 50 దేశాల నుండి సేకరించబడింది. ప్రాజెక్టు విజయం వెనిస్, ఇటలీలోని వెనీషియన్ లగూన్ పాకిస్తాన్‌లోని మొహెంజదారో శిథిలాలు, ఇండోనేషియాలోని బోరోబోదుర్ ఆలయ కాంపౌండ్‌లను రక్షించడం వంటి ఇతర రక్షణ ప్రచారాలకు దారితీసింది. మాన్యుమెంట్స్, సైట్‌లపై అంతర్జాతీయ కౌన్సిల్‌తో కలిసి, యునెస్కో సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి జాబితా కన్వెన్షన్‌ను ప్రారంభించింది.

గణాంకాలు

ప్రస్తుతం 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్ర పార్టీలందున్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ, 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.

క్రింది పట్టికలో ప్రదేశాల ప్రాంతాలవారీగా వర్గీకరణ:
ప్రాంతం సహజసిద్ధ సాంస్కృతిక మిశ్రమ మొత్తం %
ఆఫ్రికా 33 38 3 74 9%
అరబ్ రాజ్యాలు 3 58 1 62 7%
ఆసియా- పసిఫిక్ 45 126 11 182 21%
యూరప్ - ఉత్తర అమెరికా 51 358 7 416 49%
లాటిన్ అమెరికా - కరేబియన్ 34 80 3 117 14%

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ప్రపంచ వారసత్వ ప్రదేశం చరిత్ర - మూలంప్రపంచ వారసత్వ ప్రదేశం గణాంకాలుప్రపంచ వారసత్వ ప్రదేశం ఇవి కూడా చూడండిప్రపంచ వారసత్వ ప్రదేశం మూలాలుప్రపంచ వారసత్వ ప్రదేశం బయటి లింకులుప్రపంచ వారసత్వ ప్రదేశంఅడవిఎడారినగరంనిర్మాణంపర్వతంభవనంయునెస్కోసరస్సు

🔥 Trending searches on Wiki తెలుగు:

సంఖ్యఉపద్రష్ట సునీతరామ్ పోతినేనిరాజ్యసభవిజయవాడమంగళసూత్రంఛందస్సువందేమాతరంకర్ణుడుస్వాతి నక్షత్రముతాజ్ మహల్ద్వంద్వ సమాసముముదిరాజ్ (కులం)రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంగోత్రాలు జాబితాకర్ర పెండలంఆంగ్ల భాషహనుమంతుడుకృతి శెట్టిమామిడిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంప్రకాష్ రాజ్ప్రేమలుతెలుగు నాటకరంగంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంబైబిల్ఇంద్రుడుపొడుపు కథలువృషభరాశితెనాలి రామకృష్ణుడురామ్ చ​రణ్ తేజహర్భజన్ సింగ్నామవాచకం (తెలుగు వ్యాకరణం)పంచకర్ల రమేష్ బాబుగ్రామ పంచాయతీవృశ్చిక రాశిసౌందర్యపురాణాలువసంత వెంకట కృష్ణ ప్రసాద్మమితా బైజుయవలుహను మాన్చే గువేరాఆర్తీ అగర్వాల్తెలుగు కులాలుసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుతెలంగాణ జిల్లాల జాబితావరంగల్ప్రశాంత్ నీల్దొమ్మరాజు గుకేష్మూర్ఛలు (ఫిట్స్)శివ కార్తీకేయన్రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంశివుడుటైఫాయిడ్జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుభారత రాజ్యాంగ పీఠికతెలుగు కవులు - బిరుదులునరేంద్ర మోదీరోజా సెల్వమణిశ్రావణ భార్గవిట్రైడెకేన్తెలంగాణ గవర్నర్ల జాబితాపులివెందుల శాసనసభ నియోజకవర్గంశాసన మండలికొమురం భీమ్హీమోగ్లోబిన్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థదసరాసన్నిపాత జ్వరంచంద్రయాన్-3సత్య సాయి బాబానాయట్టుకడియం శ్రీహరితెలుగు నెలలునిర్వహణయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంపి.వెంక‌ట్రామి రెడ్డి🡆 More