రేబీస్ ను పిచ్చికుక్క వ్యాధి, జలభీతి వ్యాధి (హైడ్రోఫోబియా) అని కూడా అంటారు.
ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఉదాహరణకు కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు, తదితర మాంసాహార జంతువులు (carnivorous), జబ్బుతో ఉన్న జంతువు మనిషికి కరిచినచో ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తిచెందును. జంతువులలోనైనా, మనుషులలోనైనా ఈ వ్యాధి కనిపిస్తే చనిపోవడం తప్ప మందులేదు. పిచ్చికుక్క కరిచిన వెంటనే టీకాలు (వ్యాక్షిన్) వేసుకుంటే ప్రమాదమేమీ ఉండదు. నూటికి నూరుపాళ్లు సురక్షితము.
రేబీస్ వైరస్ | |
---|---|
Virus classification | |
Group: | Group V ((−)ssRNA) |
Order: | మోనోనెగావైరేల్స్ |
Family: | రాబ్డో వైరిడే |
Genus: | లిస్సా వైరస్ |
Type species | |
రేబిస్ వైరస్ |
ఇది ఆర్.ఎన్.ఎ. (RNA) జాతికి చెందిన 'లిస్సా వైరస్' సిలిండ్రికల్ ఆకారములో ఉండి 180 నానో మీటర్ల పొడవు, 75 నానో మీటర్ల వ్యాసము కలిగి ఒక చివర గుండ్రముగాను, రెండవ చివర కుంభాకరము కలిగి యుండును. దీని లైపోప్రోటీన్ లో గ్లైకోప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి. వీటీనే రైబోనూక్లియో ప్రోటీన్ అంటారు, RNA చాలా ముఖ్యమైనది.
రేబిస్ నరాలకు, మెదడుకు సంబంధించిన వ్యాధి. మెదడులో 'ఎన్-సెఫలైటిస్' అనే ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలుగజేయును. మిగతా ఏ వైరస్ వ్యాధి వలనైనా ఈ ఎన్-సెఫలైటిస్ లక్షణాలు కనిపించవచ్చును. ఉదా. హెర్ఫీస్ వైరస్, ఎంటిరో వైరస్, ఆర్బోవైరస్, ముఖ్యముగా హెర్పెస్ సింప్లెక్ష్ టైప్ 1, వేరిసెల్లా జోస్టర్, మొదలగునవి. కొన్ని లేబొరేటరీ పరీక్షల వలన తేడాను కనిపెట్టాలి.
ఏ క్షీరదమైనా, మానవులతో కలిపి ఈ వ్యాధికి గురి కావచ్చును. ఈ వైరస్ ఉన్న జంతువు ఇతర జంతువులను, మనుషులను కరడం వలన ఒకరి నుండి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించును. కొన్ని సమయాలలో గాలిలో (Aerosol) ఈ వైరస్ ఎగిరి వ్యాపించే అవకాశసమూ ఉంది. ఉదా: గనులలో పనిచేసే కార్మికులు అక్కడ తిరిగే ఈ వ్యాధివున్న గబ్బిలాల ద్వారా మనుషులకు, మ్యూకస్ పొరలద్వారా వైరస్ సోకే అవకాసముంది, కాని ఎక్కువగా గబ్బిలాలు కరడం ద్వారానే ఈ జబ్బు సోకే అవకాశము చాలా ఎక్కువ. మనుషుల నుండి మనుషులకు కరుచుట వలన, కొంతమేరకు చర్మం లేదా కార్నియా ట్రాన్స్-ప్లాంటేషన్, ముద్దుల వలన వ్యాపించే అవకాశమూ ఉంది.
కచ్చితమైన జబ్బుతో బాధ పడుతున్న ఏ జంతువైనా మనుషులకు కరిస్తే రేబీస్-వైరస్ బాహ్య నాడీమండలము ద్వారా కేంద్రనాడీమండలం చేరి వ్యాధి లక్షణాలు కలుగజేయును. ఇలా జరుగడానికి పట్టే కాలము 9 రోజులనుండి 90 రోజులలో జరుగును, దీనినే ఇంకుబేషన్ కాలము అంటాము. మన శరీరము పై మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశముంది.
ఈ వ్యాధితో బాధపడుచున్న జంతువు లోనూ, మనుషులలోనూ ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. గాభరాగా ఉండడం, తికమక పడడం (confision) మితిమీరిన భయము, భయంకరమైన చూపు, తనదైన లోకములో విహరించడం, నోటి వెంబడి లాలాజలం కారడం, గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం, నీటిని, ద్రావకాలను చూస్తే భయపడడం (Due to throat muscles Spasm) ఇతరులను చూసి భయపడి కరిచేయడం మున్నగునవి. ఈ లక్షణాలు ముదిరి, గొంతు కండరాలు పెరాలసిస్ కి గురియై మనిషి ఏమీ తినలేక కోమాలోకి వెల్లి పోయి చనిపోవును. జబ్బు లక్షణాలు కనిపించిన 2 నుండి 10 రోజులలో చనిపోవును. ఒకవేల అరుదుగా బ్రతికినా మెదడు దెబ్బతిని పిచ్చివాడుగా బ్రతుకును.
This article uses material from the Wikipedia తెలుగు article రేబిస్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.