మానవుడు

మనిషి జీవితం గురించి ఒక చిన్న మాట : మనిషి తన జీవితం లో ఏదో సాదించలని చేస్తున్నా పరిశోధన లో ఒక మనిషిని మనిషిగా చూడటం మనెషాడు.

మనిషి లేదా మానవుడు హోమినిడే (పెద్ద ఏప్స్) కుటుంబములో హోమో సేపియన్స్ (లాటిన్లో "తెలివైన మనిషి" లేదా "తెలిసిన మనిషి") అనే క్షీరదాల స్పీసీసుకు చెందిన రెండు పాదాల మీద నడిచే ఏప్. భూగోళంపైనున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మనుష్యులు చాలా పురోగతి సాధించారు. మానవులలో వివేకము, ఆలోచన, భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెంది ఉండడం వల్ల సాధ్యపడినాయి. దీనికి తోడు రెండు కాళ్ళపైన నిలబడగలిగే లక్షణం మానవులు అధికంగా పనిముట్లను వాడుకొని పురోగమించడానికి దోహదపడింది.డి.ఎన్.ఎ. ఆధారాల ప్రకారం మానవుల ఆవిర్భావం ఆఫ్రికాలో సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రస్తుతము అన్ని ఖండాల్లో ఉన్న మానవావాసాల ప్రకారం మానవ జాతి జనాభా దాదాపు 6.6 బిలియన్లు (2007 వరకు). ఇతర ప్రైమేట్‌ల వలె మనుషులు కూడా సహజసిద్ధంగా సంఘజీవులు. మానవులు భావ వ్యక్తీకరణ కొరకై సమాచార పద్ధతులను వాడడంలో అత్యంత నిపుణతను కలిగి ఉన్నారు. మానవులు అతిక్లిష్టమైన సంఘంలో జీవిస్తారు. ఇలాంటి సంఘంలో కుటుంబాలు, సమూహాలు లేదా జాతుల మధ్య సహాయసహకారాలతో పాటు పోటీతత్వం కూడా అగుపిస్తుంది. మానవులలో సంప్రదాయాలు, మతాలు, నీతి నియమాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మానవులు అందంగా కనిపించడానికి కృషి చేయడంతో పాటూ కళ, సాహిత్యం, సంగీతం వంటి ఆవిష్కరణలు గావించారు. ,హిందూ మత సాహిత్యంలో పేర్కొనబడిన మనువు,బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన ఆదాము ఈ ఆధునిక మానవ జాతికి చెందినవారిగా చెప్పవచ్చు.

మానవుడు
కాల విస్తరణ: Pleistocene - Recent
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
ప్రైమేట్స్
Family:
Genus:
Species:
సెపియన్స్
Subspecies:
హోమో సెపియన్స్
Trinomial name
హోమో సెపియన్స్ సెపియన్స్
మానవుడు
మానవుడు

చరిత్ర

పరిణామము

శాస్త్రీయపరంగా మానవ పరిణామము హోమో ప్రజాతితో ముడిపడి ఉంది. అయినా కొన్నిసార్లు హోమినిడ్‌లు, హోమినిన్‌ల అధ్యయనం కూడా చేస్తారు. ఆధునిక మానవుడు హోమో సేపియెన్స్గా నిర్వచించబడినాడు. ఈ జాతిలోనూ హోమో సేపియెన్స్ సేపియెన్స్ అనబడే ఉపజాతిగా ఇప్పటి మానవుడు వర్గీకరించబడ్డాడు. అదే జాతిలోని హోమో సేపియెన్స్ ఇడాల్టు (పెద్ద తెలివైన మనిషి అని అర్దం వస్తుంది) అనే ఉపజాతి అంతరించిపోయింది. ఆధునిక మానవుని శిలాజాలు ఆఫ్రికాలో 1,30,000 క్రితం నాటివి లభిస్తాయి.

బొనోబో లేదా పిగ్మీ చింపాంజీ (పాన్ పనిస్కస్), చింపాంజీ (పాన్ ట్రోగ్లోడైట్స్) అనబడే పాన్ ప్రజాతికి చెందిన ఈ రెండు జాతులు హోమో సేపియన్స్‌తో అతి దగ్గర సంబంధం కలిగి ప్రస్తుతము నివసిస్తున్న జాతులు. ఈ జాతులు పరిణామక్రమంలో ఒకే పూర్వీకుడిని కలిగి ఉన్నాయి. ఈ రెండు జాతుల మధ్య ఉన్న ఒకే ఒక ముఖ్యమైన తేడా సంఘజీవనంలో కనిపిస్తుంది: బొనోబోలు 'మాతృస్వామ్య' (కుటుంబ పెద్ద ఆడ జీవి) కాని చింపాంజీలు 'పితృస్వామ్య' (కుటుంబ పెద్ద మగ జీవి) పద్ధతులను పాటిస్తారు. మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం చేయడం వల్ల మానవుని జీనోమ్, బొనోబో/చింపాంజీ జీనోమ్ మధ్య ఉన్న తేడా (దాదాపు 6.5 మిలియన్ సంవత్సరాల విడి పరిణాం తర్వాత), ఇద్దరు సంబంధంలేని వ్యక్తుల జీనోమ్‌లలో ఉన్న తేడా కన్నా కేవలం 10 రెట్లు ఎక్కువ,, ఎలుకలు, చుంచుల జీనోమ్‌ల మధ్య ఉన్న తేడా కన్నా 10 రెట్లు తక్కువ. నిజానికి 98.4% డి.ఎన్.ఎ. సీక్వెన్స్ మానవులు, ఈ రెండు పాన్ జాతులకు ఒకే రకమైనదిగా కనుగొనబడింది.

మానవ జాతులు

ఆధునిక మానవ జాతి ఆవిర్భవించక మునుపు లక్షల సంవత్సరాల క్రితమే చాలా మానవ జాతులు విరాజిల్లాయి. వాటిలో ముఖ్యమైనవి హోమో హాబిలిస్, హోమో ఎర్గాస్టర్, హోమో హైడెల్బెర్జెసిస్, హోమో యాంటిసిసర్, హోమో, హోమో నియాండర్తాలెంసిస్ మొదలైనవి.

మూలాలు

లంకెలు

https://www.duhoctrungquoc.vn/wiki/en/Human_evolution

Tags:

మానవుడు చరిత్రమానవుడు మానవ జాతులుమానవుడు మూలాలుమానవుడు లంకెలుమానవుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

వ్యాసుడుమహాత్మా గాంధీఅమిత్ షాభాషఏ.పి.జె. అబ్దుల్ కలామ్కమల్ హాసన్ నటించిన సినిమాలుతెనాలి రామకృష్ణుడువై. ఎస్. విజయమ్మమెరుపుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఉమ్మెత్తమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితోడికోడళ్ళు (1994 సినిమా)పటిక బెల్లంపాండవులుఅయోధ్య రామమందిరంకొండా విశ్వేశ్వర్ రెడ్డివ్యవసాయంఆంధ్రప్రదేశ్ చరిత్రసెక్యులరిజంభీమసేనుడుభద్రాచలంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవింధ్య విశాఖ మేడపాటిభారతీయ రైల్వేలునువ్వు లేక నేను లేనుఉపమాలంకారంకన్యారాశిగురువు (జ్యోతిషం)భారతదేశంలో కోడి పందాలునిర్వహణనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంపుష్కరంజాతీయ విద్యా విధానం 2020జీలకర్రకలియుగంఅతిసారంఅనురాధ శ్రీరామ్పెళ్ళిఅయ్యప్పభారత రాజ్యాంగ ఆధికరణలుఆల్ఫోన్సో మామిడిమర్రిభారతీయ రిజర్వ్ బ్యాంక్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు కులాలుపమేలా సత్పతిపి.సుశీలఅల్లూరి సీతారామరాజుగురజాడ అప్పారావు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుక్వినోవాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాకమ్మమెదడు వాపుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఐక్యరాజ్య సమితిరెడ్డికర్ర పెండలంనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంథామస్ జెఫర్సన్సుడిగాలి సుధీర్యవలుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుభారత సైనిక దళంరౌద్రం రణం రుధిరంటబుమిథాలి రాజ్లగ్నంఫేస్‌బుక్వాల్మీకిదువ్వాడ శ్రీనివాస్అమర్ సింగ్ చంకీలాపాల్కురికి సోమనాథుడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసామెతల జాబితాభగవద్గీతమఖ నక్షత్రము🡆 More