ట్రినిడాడ్ అండ్ టొబాగో

ట్రినిడాడ్ అండ్ టొబాగో (అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో) , కరేబియన్‌లో దక్షిణాన ఉన్న ద్వీప దేశం.

ప్రధాన ద్వీపాలైన ట్రినిడాడ్, టొబాగో లతో పాటు దేశంలో అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇది గ్రెనడాకు దక్షిణంగా 130 kilometres (81 miles), ఈశాన్య వెనిజులా తీరానికి 11 kilometres (6.8 miles) దూరంలో ఉంది. దీనికి ఈశాన్యంలో బార్బడోస్, వాయవ్య దిశలో గ్రెనడా, దక్షిణ పశ్చిమాల్లో వెనిజులాలు సరిహద్దులుగా ఉన్నాయి. ట్రినిడాడ్, టొబాగో వెస్టిండీస్‌లో భాగం.

రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో
ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ అండ్ టొబాగో
Motto: టుగెదర్ వియ్ యాస్పైర్, టుగెదర్ వియ్ ఎఛీవ్
Anthem: "ఫోర్జ్‌డ్ ఫ్రం ది లవ్ ఆఫ్ లిబర్టీ"
ట్రినిడాడ్ అండ్ టొబాగో
Location of ట్రినిడాడ్ అండ్ టొబాగో
ట్రినిడాడ్ అండ్ టొబాగో
Location of ట్రినిడాడ్ అండ్ టొబాగో
Capitalపోర్ట్ ఆఫ్ స్పెయిన్
Largest city శాన్ ఫెర్నాండో
10°17′N 61°28′W / 10.283°N 61.467°W / 10.283; -61.467
Official languages ఇంగ్లీషు
ఇతర భాషలు See Languages in Trinidad and Tobago
Ethnic groups (2011)
  • 37.6% భారతీయ మూలాలు
  • 36.3% ఆఫ్రో ట్రినిడాడియన్లు
  • 24.4% మిశ్రమ
  •    — 7.66% డూగ్లా
  • 0.65% ఐరోపావాసులు
  •    — 0.06% పోర్చుగీసు
  • 0.30% చైనీయులు
  • 0.11% స్థానికులు
  • 0.08% అరబ్బులు
  • 0.17% ఇతరులు
  • 6.22% Undeclared
Government యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు
 -  ప్రధానమంత్రి
 -  స్పీకరు
 -  సెనేట్ అధ్యక్షుడు
 -  ప్రధాన న్యాయమూర్తి
 -  ప్రతిపక్ష నేత
Legislature పార్లమెంటు
 -  Upper house సెనేట్
 -  Lower house హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్
స్వాతంత్ర్యం యు.కె నుండి
 -  వెస్టిండీస్ ఫెడరేషనులో సభ్యుడు 1958 జనవరి 3 – 1962 జనవరి 14 
 -  స్వాతంత్ర్యం 1962 ఆగస్టు 31 
 -  CARICOM లో చేరింది 1973 ఆగస్టు 1 
 -  రిపబ్లిక్ 1976 ఆగస్టు 1 
Area
 -  Total 5,131 km2 (164th)
1,981 sq mi 
 -  Water (%) బహు స్వల్పం
Population
 -  2021 estimate 13,67,558 (151st)
 -  2011 census 13,28,019
 -  Density 264/km2 (34th)
684/sq mi
GDP (PPP) 2019 estimate
 -  Total $45.148 billion
 -  Per capita $32,684
GDP (nominal) 2022 estimate
 -  Total $22.438 billion
 -  Per capita $17,921
Gini (2012)39.0
medium
HDI (2021)Decrease 0.810
very high · 57th
Currency ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్ (TTD)
Time zone AST (UTC-4)
Date format dd/mm/yyyy
Drives on the left
Calling code +1 (868)
Internet TLD .tt

ట్రినిడాడ్ ద్వీపం 1498లో క్రిస్టోఫర్ కొలంబస్ రాక తర్వాత స్పానిష్ సామ్రాజ్యంలో కాలనీగా మారడానికి ముందు ఇక్కడ శతాబ్దాలుగా స్థానిక ప్రజలు నివసించేవారు. స్పానిష్ గవర్నర్ జోస్ మరియా చాకోన్ 1797లో సర్ రాల్ఫ్ అబెర్‌క్రోంబీ ఆధ్వర్యంలో బ్రిటిష్ నౌకాదళానికి లొంగిపోయాడు. అదే కాలంలో, టొబాగో ద్వీపం స్పానిష్, బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్, కోర్లాండర్ వలసవాదుల మధ్య చాలాసార్లు, కరేబియన్‌లోని ఇతర ద్వీపాల కంటే ఎక్కువగా, చేతులు మారింది. 1802లో అమియన్స్ ఒప్పందం ప్రకారం ట్రినిడాడ్, టొబాగోలు బ్రిటన్‌కు దక్కాయి. వీటిని 1889లో ఏకం చేసారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో 1962లో స్వాతంత్ర్యం పొంది, 1976లో రిపబ్లిక్‌గా అవతరించింది.

2022 నాటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో యునైటెడ్ స్టేట్స్, కెనడా, ప్యూర్టో రికో, బహామాస్, అరుబా, గయానాల తర్వాత అమెరికాఖండ దేశాల్లో కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ఆధారంగా అత్యధిక తలసరి GDPలో 7 వ స్థానంలో ఉంది దీన్ని అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంకు గుర్తించింది. పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడే చాలా కరేబియన్ దేశాలు, భూభాగాల మాదిరిగా కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పారిశ్రామికంగా పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌పై ఆధార పడింది. దేశ సంపదలో ఎక్కువ భాగం చమురు, సహజ వాయువుల నిల్వల నుండి వస్తుంది.

ట్రినిడాడ్ అండ్ టొబాగో అక్కడి ఆఫ్రికా, భారతీయ సంస్కృతులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కార్నివాల్, దీపావళి, హోసే వేడుకలలో ఇది ప్రతిబింబిస్తుంది, అలాగే స్టీల్‌పాన్, లింబో, కాలిప్సో, సోకా, రాప్సో, పరాంగ్, చట్నీ, చట్నీ సోకా వంటి సంగీత శైలులకు ఇది జన్మస్థలం.

చరిత్ర

స్వదేశీ ప్రజలు

ట్రినిడాడ్ అండ్ టొబాగో రెంటి లోను మొదట దక్షిణ అమెరికా వచ్చిన స్థానిక ప్రజలు స్థిరపడ్డారు. ట్రినిడాడ్‌లో కనీసం 7,000 సంవత్సరాల క్రితం వ్యవసాయానికి ముందరి ప్రాచీన ప్రజలు స్థిరపడ్డారు. ఇది కరేబియన్‌లో జనావాసాలు ఏర్పడిన తొలి ప్రాంతం. నైరుతి ట్రినిడాడ్‌లోని బన్వారీ ట్రేస్ కరీబియన్‌లోని అత్యంత పురాతనమైన పురావస్తు ప్రదేశం. ఇది దాదాపు సా.పూ. 5000 నాటిది. తరువాతి శతాబ్దాలలో అనేక వలస తరంగాలు సంభవించాయి. వాటి పురావస్తు అవశేషాలలో తేడాల ద్వారా వీటిని గుర్తించవచ్చు. ఐరోపాతో సంపర్కం సమయంలో, ట్రినిడాడ్‌లో నేపోయా, సుప్పోయాతో సహా వివిధ అరవాకన్ -మాట్లాడే సమూహాలు, యావో వంటి కరీబన్-మాట్లాడే సమూహాలు నివసించేవారు. టొబాగో ద్వీపంలో కారిబ్‌లు, గాలిబిలు నివసించేవారు. ట్రినిడాడ్‌ను స్థానిక ప్రజలు "ఐరీ" ('హమ్మింగ్ బర్డ్ యొక్క భూమి') అని పిలిచేవారు.

యూరోపియన్ వలసరాజ్యం

క్రిస్టోఫర్ కొలంబస్ 1498లో అమెరికాకు చేసిన మూడవ సముద్రయానంలో ట్రినిడాడ్‌ను చూసిన మొదటి యూరోపియన్. అతను సుదూర హోరిజోన్‌లో టొబాగోను చూసినట్లు నివేదించాడు. అతడు దానికి బెల్లాఫార్మా అని పేరు పెట్టాడు. అయితే అతడు ద్వీపంలోకి దిగలేదు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
సర్ వాల్టర్ రాలీ 1595లో ట్రినిడాడ్‌లోని స్పానిష్ స్థావరాలపై దాడి చేశాడు

1530లలో ఆంటోనియో డి సెడెనో అనే స్పానిష్ సైనికుడు ట్రినిడాడ్ ద్వీపాన్ని జయించాలనే ఉద్దేశంతో, ద్వీపంలోని స్వదేశీ జనాభాను అణచివేయాలనే ఉద్దేశంతో దాని నైరుతి తీరంలో ఒక చిన్న సైన్యంతో అడుగుపెట్టాడు. సెడెనో, అతని మనుషులు అనేక సందర్భాలలో స్థానిక ప్రజలతో పోరాడారు. తరువాత ఒక కోటను నిర్మించారు. తరువాతి 1592 వరకు కొన్ని దశాబ్దాల పాటు స్థానిక ప్రజలతో యుద్ధాలు చేసాడు. స్థానిక అధిపతి (కాసిక్ అని అంటారు) అయిన వన్నవానారే (గ్వానాగ్వానారే అని కూడా పిలుస్తారు) ఆధునిక సెయింట్ జోసెఫ్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని డొమింగో డి వెరా ఇ ఇబార్గెన్‌కు ఇచ్చేసి, తాను ద్వీపం లోని మరొక భాగానికి తరలిపోయాడు. తరువాత 1592లో ఆంటోనియో డి బెర్రియో ఇక్కడ శాన్ జోస్ డి ఒరునా ఆవాసాన్ని స్థాపించాడు. కొంతకాలం తర్వాత ఆంగ్ల నావికుడు సర్ వాల్టర్ ర్యాలీ ఎల్ డొరాడో " ("స్వర్ణ పురి") ను వెతుకుతూ 1595 మార్చి 22 న ట్రినిడాడ్‌కు వచ్చాడు. అతను శాన్ జోస్‌పై దాడి చేసాడు, ఆంటోనియో డి బెర్రియోను పట్టుకుని అతన్ని విచారించాడు. అతని నుండి కాసిక్ టోపియావారి నుండి చాలా సమాచారాన్ని సేకరించాడు; ఆ తరువాత ర్యాలీ తన దారిన తాను వెళ్ళిపోయాడు. స్పానిష్ అధికారం పునరుద్ధరించబడింది.

ఇంతలో, 1620-40ల కాలంలో టొబాగోలో స్థిరపడనికి యూరోపియన్ శక్తులు అనేక ప్రయత్నాలు చేసాయి. డచ్, ఇంగ్లీష్, కొరోనియన్లు ( డచీ ఆఫ్ కోర్లాండ్, సెమిగల్లియా ప్రజలు, ఇప్పుడు లాట్వియాలో భాగమైనవారు) ద్వీపాన్ని వలసరాజ్యం చేసుకోడానికి ప్రయత్నించారు. 1654 నుండి డచ్, కోర్లాండర్లు పట్టు సాధించగలిగారు. ఆ తరువాత అనేక వందల మంది ఫ్రెంచ్ స్థిరనివాసులు చేరారు. చక్కెర, నీలిమందు, రమ్ ఉత్పత్తిపై ఆధారపడిన తోటల ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఆఫ్రికన్ బానిసలు పనిచేశారు. వారు త్వరలోనే యూరోపియన్ వలసవాదుల సంఖ్యను మించిపోయారు. టొబాగో ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బ్రిటన్ మధ్య వివాదానికి మూలంగా మారడంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో కోటలు నిర్మించారు. ఈ ద్వీపం 1814కి ముందు దాదాపు 31 సార్లు చేతులు మారింది. విస్తృతమైన సముద్రపు దొంగల కారణంగా ఈ పరిస్థితి తీవ్రమైంది. బ్రిటిష్ వారు టొబాగోను 1762 నుండి 1781 వరకు ఆక్రమించగలిగారు. ఆ తర్వాత దానిని ఫ్రెంచ్ వారు స్వాధీనం చేసుకుని, తిరిగి బ్రిటన్ 1793 లో ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే వరకు పాలించారు.

ట్రినిడాడ్‌లో 17వ శతాబ్దం పెద్దగా ఎటువంటి సంఘటనలు లేకుండానే గడిచిపోయింది, అయితే స్వదేశీ జనాభాను నియంత్రించడానికి, పాలించడానికి స్పెయిన్ దేశస్థులు చేసిన నిరంతర ప్రయత్నాలకు తరచుగా తీవ్రంగా ప్రతిఘటన ఎదురయ్యేది. 1687లో ట్రినిడాడ్, గయానాల్లోని స్థానిక ప్రజల మతమార్పిడులకు కాథలిక్ కాటలాన్ కాపుచిన్ సన్యాసులు బాధ్యత వహించారు. వారు ట్రినిడాడ్‌లో అనేక మిషన్‌లను స్థాపించారు, పాలకుల మద్దతు, సమృద్ధిగా నిధులు వారికి సమకూరాయి. స్థానిక ప్రజలపై వారు ఎన్‌కోమియెండ హక్కును కూడా పొందారు. దీనిలో స్థానిక ప్రజలు స్పానిష్‌ వారి వద్ద పనిచేయవలసి వచ్చింది. 1689లో స్థాపించబడిన శాంటా రోసా డి అరిమా, మిషజ్న్ టాకారిగువా, అరౌకా ( అరౌకా ) యొక్క పూర్వపు ఎన్‌కోమియెండస్‌లోని స్వదేశీ ప్రజలను మరింత పశ్చిమానికి తరిమివేసింది. స్పెయిన్ దేశస్థులు, స్వదేశీ ప్రజల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు 1689లో హింసకు దారితీశాయి. శాన్ రాఫెల్ ఎన్‌కోమియెండాలోని స్థానిక ప్రజలు తిరుగుబాటు చేసి అనేక మంది పూజారులను చంపారు. చర్చిపై దాడి చేసి స్పానిష్ గవర్నర్ జోస్ డి లియోన్ వై ఎచల్స్‌ను చంపారు. గవర్నర్ పార్టీలో చంపబడిన వారిలో కౌరా, టకారిగువా, అరౌకాలోని నెపుయో గ్రామాలకు మిషనరీ పూజారి జువాన్ మజియన్ డి సోటోమేయర్ కూడా ఉన్నారు. స్పానిష్ వారు తీవ్రంగా ప్రతీకారం తీర్చుకున్నారు. అరేనా ఊచకోతగా పిలవబడే సంఘటనలో వందలాది మంది స్థానిక ప్రజలను వధించారు. ఫలితంగా, వారిపై స్పానిష్ బానిసల చేత చేయించే దాడులను కొనసాగించడం, వారికి రోగనిరోధక శక్తి లేని వ్యాధులను అంటించడం వగైరాలతో, తరువాతి శతాబ్దం చివరి నాటికి స్థానిక జనాభా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది.

ఈ కాలంలో ట్రినిడాడ్ అనేది సెంట్రల్ అమెరికా, ప్రస్తుత మెక్సికో, తరువాత నైరుతి యునైటెడ్ స్టేట్స్‌గా మారిన న్యూ స్పెయిన్ వైస్‌రాయల్టీకి చెందిన ఒక ద్వీప ప్రాంతం. 1757లో అనేక సముద్రపు దొంగల దాడుల తరువాత రాజధానిని శాన్ జోస్ డి ఒరునా నుండి ప్యూర్టో డి ఎస్పానా (ఆధునిక పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ) కి మార్చారు. అయితే, స్పానిష్ ద్వీపాలను వలసరాజ్యం చేయడానికి ఏ విధమైన కృషి చేయలేదు; ఈ కాలంలో ట్రినిడాడ్ ఇంకా చాలావరకు అటవీ ప్రాంతంగానే ఉంది. కొద్దిమంది బానిసలు, కొన్ని వేల మంది స్వదేశీ ప్రజలతో పాటు కొంతమంది స్పెయిన్ దేశస్థులు ఉన్నారు. నిజానికి, 1777లో జనాభా 1,400 మాత్రమే.

ఫ్రెంచ్ వలసవాసుల ప్రవాహం

1777లో, కెప్టెన్ జనరల్ లూయిస్ డి అన్‌జాగా 'లే కన్సిలియేటర్', ఫ్రెంచ్ క్రియోల్‌ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అతడు ట్రినిడాడ్‌లో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతించాడు, ఫ్రెంచ్ వాసులను ఆకర్షించాడు. దాని ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. అప్పట్లో ట్రినిడాడ్ జనాభా తక్కువగా ఉన్నందున, గ్రెనడాలో నివసిస్తున్న రూమ్ డి సెయింట్ లారెంట్ అనే ఫ్రెంచ్ వ్యక్తి 1783 నవంబరు 4 న స్పానిష్ రాజు చార్లెస్ III నుండి ట్రినిడాడ్‌కు వలస పోయేందుకు అనుమతి (సెడులా డి పోబ్లాసియోన్‌) పొందాడు. 1776లో రాజు ఇచ్చిన అలాంటి అనుమతి వలన పెద్దగా ఫలితం కనబడనందున ఈ కొత్త అనుమతిని మరింత ఉదారంగా ఇంది. ఈ అనుమతి పత్రం స్పెయిన్ రాజుకు విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్న రోమన్ కాథలిక్ విదేశీ వాసులకు 10 సంవత్సరాల పాటు ఉచితంగా భూమి ఇచ్చి, పన్ను మినహాయింపును మంజూరు చేసింది. ప్రతి స్వేచ్ఛా పురుషుడు, స్త్రీ, బిడ్డలకు 30 ఫనేగాల (13 హెక్టార్లు/32 ఎకరాలు) భూమిని మంజూరు చేసింది. వారు తమతో పాటు తెచ్చుకున్న ఒక్కో బానిసకు అందులో సగం వంతున ఇచ్చారు. కొత్త సెడులా నిబంధనలను అమలు చేయడానికి స్పానిష్ కొత్త గవర్నర్ జోస్ మారియా చాకోన్‌ను పంపింది .

సెడులాను ఫ్రెంచ్ విప్లవానికి కొన్ని సంవత్సరాల ముందు జారీ చేసారు. ఆ తిరుగుబాటు సమయంలో, ఫ్రెంచ్ ప్లాంటర్లు తమ బానిసలు, ఉచిత రంగులు, ములాట్టోలతో పొరుగున ఉన్న మార్టినిక్, సెయింట్ లూసియా, గ్రెనడా, గ్వాడెలోప్, డొమినికా నుండి ట్రినిడాడ్‌కు వలస వచ్చారు, అక్కడ వారు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను (చక్కెర, కోకో) స్థాపించారు. ఈ కొత్త వలసదారులు బ్లాంచిస్యూస్, చాంప్స్ ఫ్లూర్స్, పారామిన్, క్యాస్కేడ్, కారెనేజ్, లావెంటిల్‌లలో స్థానిక సమాజాలను స్థాపించారు.

ఫలితంగా, ట్రినిడాడ్ జనాభా 1789 చివరి నాటికి 15,000కి పెరిగింది. 1797 నాటికి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జనాభా కేవలం ఐదేళ్లలో 3,000 నుండి 10,422కి పెరిగింది. విభిన్న జనాభాలో మిశ్రమ జాతి వ్యక్తులు, స్పెయిన్ దేశస్థులు, ఆఫ్రికన్లు, ఫ్రెంచ్ రిపబ్లికన్ సైనికులు, రిటైర్డ్ పైరేట్స్, ఫ్రెంచ్ ప్రభువులు ఉండేవారు. ట్రినిడాడ్ మొత్తం జనాభా 17,718 లో 2,151 మంది యూరోపియన్ పూర్వీకులు, 4,476 మంది "స్వేచ్ఛా నల్లజాతీయులు, రంగుల ప్రజలు", 10,009 మంది బానిసలు, 1,082 మంది స్వదేశీ ప్రజలు ఉన్నారు. స్పానిష్ పాలనలో (తర్వాత బ్రిటిష్ పాలనలో కూడా) చాలా తక్కువ జనాభా, జనాభా పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన ట్రినిడాడ్ వెస్టిండీస్‌లోని తక్కువ జనాభా కలిగిన కాలనీలలో ఒకటిగా ఉండేది. అతి తక్కువ అభివృద్ధి చెందిన ప్లాంటేషన్ మౌలిక సదుపాయాలు ఉండేవి.

బ్రిటిష్ పాలన

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
1797లో బ్రిటిష్ వారు ట్రినిడాడ్ అండ్ టొబాగోను స్వాధీనం చేసుకున్నట్లు చూపే పతకం.

ట్రినిడాడ్‌పై బ్రిటిష్ వారి ఆసక్తి పెరిగింది. 1797లో జనరల్ సర్ రాల్ఫ్ అబెర్‌క్రోంబీ నేతృత్వంలోని బ్రిటిష్ దళం ట్రినిడాడ్‌పై దండయాత్ర ప్రారంభించింది. అతని స్క్వాడ్రన్ బోకాస్ గుండా ప్రయాణించి చాగురామస్ తీరంలో లంగరు వేసింది. సంఖ్యాపరంగా బ్రిటిష్ వారి కంటే బాగా తక్కువ సైన్యం ఉన్న చాకోన్, పోరాడకుండానే బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. ఆ విధంగా ట్రినిడాడ్ బ్రిటిష్ క్రౌన్ కాలనీగా మారింది. ఎక్కువగా ఫ్రెంచ్ మాట్లాడే జనాభా, స్పానిష్ చట్టాలు ఉన్న బ్రిటిషు వలస రాజ్యం అది. తరువాత అమియన్స్ ఒప్పందం (1802) ప్రకారం బ్రిటిష్ పాలనను అధికారికంగా ధ్రువీకరించారు. ఈ వలసకు మొదటి బ్రిటిష్ గవర్నర్ థామస్ పిక్టన్. అయితే అతడు అవలంబించిన హింస, ఏకపక్ష అరెస్టులు తదితర పద్ధతులతో బ్రిటిష్ అధికారాన్ని రుద్దే అతని విధానం కారణంగా అతనిని వెనక్కి పిలిపించారు.

బ్రిటిష్ పాలన కారణంగా యునైటెడ్ కింగ్‌డమ్, తూర్పు కరేబియన్‌లోని బ్రిటిష్ కాలనీల నుండి ప్రజలు భారీగా వలస వచ్చారు. ఇంగ్లీష్, స్కాట్స్, ఐరిష్, జర్మన్, ఇటాలియన్ కుటుంబాలు వచ్చాయి. అలాగే 1812 యుద్ధంలో బ్రిటన్ కోసం పోరాడిన " మెరికిన్స్ " అని పిలువబడే కొంతమంది స్వేచ్ఛా నల్లజాతీయులు, దక్షిణ ట్రినిడాడ్‌లో భూమిని మంజూరు చేశారు. బ్రిటిష్ పాలనలో కొత్త రాష్ట్రాలను సృష్టించారు. బానిసల దిగుమతి పెరిగింది. అయితే ఈ సమయానికి నిర్మూలనవాదానికి మద్దతు బాగా పెరిగింది. ఈ సమయానికి ఇంగ్లాండ్‌లో బానిస వ్యాపారానికి వ్యతిరేకత ఎదురైంది. 1833లో బానిసత్వాన్ని రద్దు చేసారు. ఆ తర్వాత మాజీ బానిసలు "అప్రెంటిస్‌షిప్" వ్యవస్థలో పనిచేసారు. 1837లో పశ్చిమ ఆఫ్రికా బానిస వ్యాపారి అయిన డాగాను పోర్చుగీస్ బానిసలు బంధించగా, అతన్ని బ్రిటిష్ నావికాదళం రక్షించి స్థానిక రెజిమెంట్‌లో నిర్బంధించారు. దాగా తన దేశీయులతో కలిసి సెయింట్ జోసెఫ్‌లోని బ్యారక్‌ల వద్ద తిరుగుబాటు చేసి, తమ స్వదేశానికి తిరిగి వచ్చే ప్రయత్నంలో తూర్పు వైపుకు బయలుదేరాడు. అరిమా పట్టణం వెలుపల ఈ తిరుగుబాటుదారులపై మిలీషియా యూనిట్ మెరుపుదాడి చేసింది. దాదాపు 40 మంది మరణాల తరువాత తిరుగుబాటును అణిచివేసారు. దాగాను, అతని మిత్రులను తరువాత సెయింట్ జోసెఫ్ వద్ద ఉరితీసారు. 838 ఆగస్టు 1న అప్రెంటిస్ వ్యవస్థ ముగిసింది. అయితే 1838లో జనాభా గణాంకాలను పరిశీలిస్తే, ట్రినిడాడ్‌కు దాని పొరుగు దీవులకూ మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది: 1838లో బానిసల విముక్తి తర్వాత, ట్రినిడాడ్‌లో కేవలం 17,439 మంది బానిసలు ఉన్నారు. బానిస యజమానుల్లో 80% మందికి ఒక్కొక్కరికి 10 మంది కంటే తక్కువ బానిసలు ఉన్నారు. దీనికి విరుద్ధంగా, ట్రినిడాడ్ కంటే రెట్టింపు పరిమాణం ఉన్న జమైకాలో దాదాపు 3,60,000 మంది బానిసలు ఉన్నారు.

భారతీయ ఒప్పంద కార్మికుల రాక

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కొత్తగా వచ్చిన ఒప్పంద భారతీయ కార్మికులు .

ఆఫ్రికన్ బానిసలకు విముక్తి లభించిన తర్వాత చాలామంది తోటల పనిని కొనసాగించడానికి నిరాకరించారు. వాళ్ళు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు తూర్పున ఉన్న లావెంటిల్, బెల్మాంట్ వంటి పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఫలితంగా, తీవ్రమైన వ్యవసాయ కూలీల కొరత ఏర్పడింది. ఈ లోటును పూరించడానికి బ్రిటిష్ వారు, వెట్టి చాకిరీ వ్యవస్థను తీసుకువచ్చారు. తద్వారా భారతీయులు, చైనీయులు, పోర్చుగీస్‌లతో సహా వివిధ జాతీయులతో ఈ విధానంలో ఒప్పందం చేసుకున్నారు. వీరిలో, తూర్పు భారతీయులను అత్యధిక సంఖ్యలో దిగుమతి చేసుకున్నారు. 1845 మే 1 న రవాణా అయిన తొలి విడతలో, ఫటెల్ రజాక్‌ అనే ఓడలో 225 మంది భారతీయులను ట్రినిడాడ్‌కు తీసుకువచ్చారు. భారతీయుల వెట్టిచాకిరీ 1845 నుండి 1917 వరకు కొనసాగింది. ఆ సమయంలో 1,47,000 కంటే ఎక్కువ మంది భారతీయులు చెరకు తోటలపై పని చేయడానికి ట్రినిడాడ్‌కు వచ్చారు.

ఈ నిర్బంధ కార్మిక ఒప్పందాలు కొన్నిసార్లు దోపిడీకి దారితీశాయి. హ్యూ టింకర్ వంటి చరిత్రకారులు దీనిని "కొత్త బానిసత్వ వ్యవస్థ" అని పిలిచేవారు. కాలనీలోకి ప్రవేశించే భారతీయులు కూడా మిగిలిన జనాభా నుండి వారిని వేరుచేసే కొన్ని చట్టాలకు లోబడి ఉండాలి. ఉదాహరణకు వారు తోటల నుండి బయటికి వెళ్తే తమతో పాటు పాస్‌ను తీసుకెళ్లాలి. విముక్తి పొందినట్లయితే, వారు తమ "ఉచితం" ఒప్పంద కాలం పూర్తయినట్లు సూచించే పేపర్లు" లేదా సర్టిఫికేట్ చూపించాల్సి ఉండేది. అయితే, ఇది నిజంగా బానిసత్వ వ్యవస్థకు కొత్త రూపం కాదు, ఎందుకంటే కార్మికులకు చెల్లింపులు ఉండేవి, ఒక నిర్దుష్టమైన ఒప్పంద కాలపరిమితి ఉండేది, ఒక వ్యక్తి మరొకరికి ఆస్తి అనే ఆలోచనను తొలగించారు. అదనంగా, ఒప్పంద కార్మికుల యజమానులకు వారి కార్మికులను కొరడాలతో కొట్టడానికి చట్టపరమైన హక్కు లేదు; వీటికి కోర్టులలో ప్రాసిక్యూషన్, జరిమానాలు లేదా (ఎక్కువగా) జైలు శిక్షలు ఉండేవి. 20వ శతాబ్దం ప్రారంభంలో 25 సెంట్ల కంటే తక్కువ రోజువారీ వేతనంతో ఐదేళ్ల కాలానికి ప్రజలు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి కాంట్రాక్ట్ వ్యవధి ముగింపులో వారు భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు హామీ ఇచ్చారు. అయితే, కార్మికులను నిలుపుకోవడానికి బలవంతపు మార్గాలను ఉపయోగించేవారు. ప్లాంటర్లు తమ కార్మికులను చాలా త్వరగా కోల్పోతున్నారని ఫిర్యాదు చేయడంతో 1854 నుండి ఇండెంచర్‌షిప్ ఒప్పందాలను 10 సంవత్సరాలకు పొడిగించారు. వెనక్కి వెళ్ళేందుకు బదులుగా, అక్కడే స్థిరనివాసాన్ని ప్రోత్సహించడానికి బ్రిటిష్ అధికారులు వారికి భూమిని ఇచ్చారు. 1902 నాటికి, ట్రినిడాడ్‌లోని చెరకులో సగానికి పైగా స్వతంత్ర చెరకు రైతులే ఉత్పత్తి చేసేవారు; వీరిలో అత్యధికులు భారతీయులు. నిర్బంధ కార్మిక వ్యవస్థ కింద కష్టతరమైన పరిస్థితులు అనుభవించినప్పటికీ, దాదాపు 90% మంది భారతీయ వలసదారులు తమ ఒప్పంద కాల వ్యవధి ముగిసాక, ట్రినిడాడ్‌ లోనే శాశ్వతంగా స్థిరపడేందుకు మొగ్గుచూపారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగో యొక్క కలోనియల్ జెండా, 1889-1958

అయితే కొంతమంది భారతీయులు టొబాగోలో స్థిరపడ్డారు. ఆఫ్రికన్ బానిసల వారసులు ద్వీప జనాభాలో ఎక్కువ భాగం కొనసాగారు. 19వ శతాబ్దం మధ్య నుండి చివరి వరకు కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం విస్తృతమైన పేదరికానికి కారణమైంది. 1876లో రోక్స్‌బరో ప్లాంటేషన్‌లో ఒక పోలీసు హత్యకు గురైన తర్వాత బెల్మన్నా తిరుగుబాటు అనే ఘటనతో అసంతృప్తి చెలరేగింది. బ్రిటిష్ వారు చివరికి నియంత్రణను పునరుద్ధరించగలిగారు. అయితే, అవాంతరాల ఫలితంగా టొబాగో శాసనసభ తనను తాను రద్దు చేసుకుంది. దానితో ద్వీపం 1877లో బ్రిటిషు వలసగా మారింది. చక్కెర పరిశ్రమ దాదాపుగా కూలిపోయే స్థితిలో ఉండడంతో, ద్వీపం ఇక ఏమాత్రం లాభదాయకంగా లేదు. దాంతో బ్రిటిష్ వారు 1889లో టొబాగోను తమ ట్రినిడాడ్ కాలనీకి జోడించారు.

20వ శతాబ్దం ప్రారంభంలో

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగో యొక్క 1953 స్టాంపులపై రాణి

1903లో, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో కొత్త నీటి ధరల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన అల్లర్లుగా చెలరేగింది; 18 మందిని కాల్చి చంపారు. రెడ్ హౌస్ (ప్రభుత్వ ప్రధాన కార్యాలయం) అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది. 1913లో కొన్ని పరిమిత అధికారాలతో, ఎన్నికైన శాసనసభను ప్రవేశపెట్టారు. ఆర్థికంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానంగా వ్యవసాయ కాలనీగా మిగిలిపోయింది; 19వ శతాబ్దం చివరలో 20వ శతాబ్దపు ప్రారంభంలో చెరకుతో పాటు, కోకో ( కోకో ) పంట కూడా ఆర్థిక ఆదాయానికి బాగా దోహదపడింది.

1919 నవంబరులో, డాక్ వర్కర్లు తప్పుడు నిర్వహణ పద్ధతులపైన, అధిక జీవన వ్యయం, దానితో పోలిస్తే తక్కువ వేతనాలు మొదలైన వాటిపై సమ్మెకు దిగారు. సమ్మెను విఫలం చేసేందుకు, ఓడరేవుల ద్వారా కనీస స్థాయిలో వస్తువులను తరలించడానికి కార్మికులను తీసుకువచ్చారు. 1919 డిసెంబరు 1 న, సమ్మె చేస్తున్న డాక్‌వర్కర్లు హార్బర్‌లోకి దూసుకెళ్లి స్ట్రైక్‌బ్రేకర్లను తరిమికొట్టారు. తర్వాత వారు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని ప్రభుత్వ భవనాలపైకి వెళ్ళారు. అవే సమస్యలున్న ఇతర సంఘాలు, కార్మికులు, అనేకమంది, డాక్ కార్మికుల సమ్మెలో చేరారు. దీనిని సాధారణ సమ్మెగా మార్చారు. హింస చెలరేగింది. బ్రిటిష్ నౌకాదళ నౌక HMS Calcutta నావికుల సహాయంతో మాత్రమే దాన్ని అణచివేయగలిగారు. సమ్మె తెచ్చిన ఐక్యత ఆ సమయంలో అక్కడ నివసించిన వివిధ జాతుల మధ్య మొట్టమొదటి సారి పరస్పర సహకారానికి కారణమైంది. చరిత్రకారుడు బ్రిన్స్లీ సమరూ "1919 సమ్మెలు యుద్ధం తర్వాత వర్గ స్పృహ పెరుగిందని, కొన్ని సమయాల్లో ఇది జాతి భావాలను అధిగమించిందిఅని సూచిస్తున్నాయి" అని చెప్పాడు.

అయితే, 1920లలో, చెరకు పరిశ్రమ పతనమవడం, అదే సమయంలో కోకో పరిశ్రమ వైఫల్యం రెండూ కలిసి, ట్రినిడాడ్‌లోని గ్రామీణ, వ్యవసాయ కార్మికులలో నిస్పృహ కలిగి, అది కార్మిక ఉద్యమానికి బాటలు వేసింది. 1930లలో గ్రేట్ డిప్రెషన్ ప్రారంభంతో ద్వీపాలలో పరిస్థితులు మరింత దిగజారాయి, 1937లో కార్మిక అల్లర్లు చెలరేగడంతో అనేకమంది మరణించారు. కార్మిక ఉద్యమం పట్టణ శ్రామిక వర్గం, వ్యవసాయ కార్మిక వర్గాలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది; ట్రినిడాడ్ లేబర్ పార్టీ (TLP) కి నాయకత్వం వహించిన ఆర్థర్ సిప్రియానీ, బ్రిటిష్ ఎంపైర్ సిటిజన్స్ అండ్ వర్కర్స్ హోమ్ రూల్ పార్టీకి చెందిన టుబల్ ఉరియా "బజ్" బట్లర్, ట్రినిడాడ్ సిటిజెన్స్ లీగ్ (TCL), ఆయిల్ ఫీల్డ్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, ఆల్ ట్రినిడాడ్ షుగర్ ఎస్టేట్స్ అండ్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లకు నాయకత్వం వహించిన అడ్రియన్ కోలా రియెంజీలు కీలక వ్యక్తులు. ఉద్యమం ఊపందుకోవడంతో బ్రిటిష్ వలస పాలన నుండి మరింత స్వయంప్రతిపత్తి కోసం పిలుపులు విస్తృతంగా వ్యాపించాయి; ఈ ప్రయత్నాన్ని బ్రిటిష్ హోమ్ ఆఫీస్, బ్రిటన్‌లో చదువుకున్న ట్రినిడాడియన్ ఉన్నతవర్గం తీవ్రంగా దెబ్బతీసాయి. వీరిలో చాలా మంది ప్లాంటోక్రసీ తరగతి నుండి వచ్చినవారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
వాలర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక సైనికుడు, 1940లలో బ్రిటన్ అమెరికాకు లీజుకు ఇచ్చింది.

1857లో ఇక్కడ పెట్రోలియాన్ని కనుగొన్నారు. అయితే 1930ల లోను ఆ తర్వాత చెరకు, కోకో పంటలు పతనమవడం, పెరుగుతున్న పారిశ్రామికీకరణ ఫలితంగా పెట్రోలియమ్‌కు ఆర్థికంగా ప్రాముఖ్యత వచ్చింది. 1950ల నాటికి ట్రినిడాడ్ ఎగుమతుల్లో పెట్రోలియం ప్రధానమైనదిగా మారింది. ట్రినిడాడ్ జనాభాలోని అన్ని వర్గాలలో మధ్యతరగతి వృద్ధికి కారణమైంది. ట్రినిడాడ్ యొక్క ప్రధాన వ్యవసాయ వస్తువుల పతనం, మాంద్యం తరువాత, చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల కారణంగా, దేశపు సామాజిక నిర్మాణంలో పెద్దయెత్తున మార్పులు చోటుచేసుకున్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ట్రినిడాడ్‌లోని చగురామాస్, క్యుముటో లలో అమెరికా సైనిక స్థావరాలు ఉండటం సమాజంపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికన్లు ట్రినిడాడ్‌లో మౌలిక సదుపాయాలను బాగా మెరుగుపరిచారు. చాలా మంది స్థానికులకు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇచ్చారు; అయితే, అంతమంది యువ సైనికులను ద్వీపంలో ఉంచడం వల్ల కలిగే సామాజిక ప్రభావాలు, అలాగే తరచుగా బయటపడుతూ ఉండే వారి జాతి వివక్ష స్థానికుల్లో ఆగ్రహం కలిగించాయి. 1961లో అమెరికన్లు వెళ్ళిపోయారు.

యుద్ధానంతర కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం అంతటా బ్రిటిష్ వారు వలసరాజ్యాల నుండి తప్పుకోవడం ప్రారంభించారు. 1945లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సార్వత్రిక ఓటు హక్కు ప్రవేశపెట్టబడింది. ద్వీపంలో రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి, అయితే ఇవి ఎక్కువగా జాతి పరంగా విభజించబడ్డాయి: ఆఫ్రో-ట్రినిడాడియన్లు ప్రధానంగా పీపుల్స్ నేషనల్ మూవ్‌మెంట్ (PNM) కి మద్దతు ఇవ్వగా, ఇండో-ట్రినిడాడియన్లు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) కి ఎక్కువగా మద్దతు ఇచ్చారు. పిడిపిని 1957లో డెమోక్రటిక్ లేబర్ పార్టీ (DLP) లో విలీనం చేసారు. బ్రిటన్ వారి కరేబియన్ వలసలన్నీ కలిసి 1958లో వెస్టిండీస్ ఫెడరేషన్‌గా ఏర్పడ్డాయి. స్వాతంత్ర్య సాధన కోసం ఇది ఒక వాహకం. అయితే 1961లో సభ్యత్వ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితంగా జమైకా ఉపసంహరించుకున్న తర్వాత ఫెడరేషన్ రద్దైంది. తదనంతరం ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వతంత్రం పొందాలని స్వంతంగా ఎంచుకుంది.

సమకాలీన యుగం

స్వాతంత్ర్య సమయంలో నాయకులు
ఎలిజబెత్ II
రాణి
ఎరిక్ విలియమ్స్
ప్రధానమంత్రి
రుద్రనాథ్ కాపిల్డియో
ప్రతిపక్ష నాయకుడు

ట్రినిడాడ్ అండ్ టొబాగో 1962 ఆగస్టు 31 న యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొందింది ఎలిజబెత్ II ట్రినిడాడ్ అండ్ టొబాగో రాణిగా దేశాధినేతగా కొనసాగింది. స్థానికంగా గవర్నర్-జనరల్ సోలమన్ హోచోయ్ రాణికి ప్రాతినిధ్యం వహించాడు. పీపుల్స్ నేషనల్ మూవ్‌మెంట్‌కు చెందిన ఎరిక్ విలియమ్స్ మొదటి ప్రధానమంత్రి అయ్యాడు, 1981 వరకు నిరంతరాయంగా ఆ పదవిలో పనిచేశాడు. అతడు ప్రముఖ చరిత్రకారుడు, మేధావి. కొంతమంది అతన్ని " జాతి పితామహుడు"గా పరిగణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ప్రధానమైన వ్యక్తి డెమోక్రటిక్ లేబర్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు రుద్రనాథ్ కాపిల్డియో. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు మొదటి స్పీకర్ క్లయిటస్ ఆర్నాల్డ్ థామస్సోస్, సెనేట్ మొదటి అధ్యక్షుడు J. హామిల్టన్ మారిస్. 1960వ దశకంలో యునైటెడ్ స్టేట్స్‌లోని పౌరహక్కుల ఉద్యమం నుండి అందుకున్న ప్రేరణతో బ్లాక్ పవర్ ఉద్యమం పెరిగింది. నిరసనలు, సమ్మెలు సర్వసాధారణమైన పరిస్థితుల్లో, 1970 ఏప్రిల్‌లో బాసిల్ డేవిస్ అనే నిరసనకారుడిని పోలీసులు కాల్చి చంపిన సంఘటనలతో పతాక స్థాయికి చేరాయి. శాంతి భద్రతలు దెబ్బతింటాయని భయపడి, ప్రధాన మంత్రి విలియమ్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. అనేక మంది బ్లాక్ పవర్ నాయకులను అరెస్టు చేయాలని ఆదేశించాడు. బ్లాక్ పవర్ ఉద్యమం పట్ల సానుభూతి చూపిన కొంతమంది ఆర్మీ నాయకులు, ముఖ్యంగా రఫీక్ షా, రెక్స్ లస్సల్లెలు తిరుగుబాటుకు ప్రయత్నించారు. అయితే, దీనిని ట్రినిడాడ్ అండ్ టొబాగో కోస్ట్ గార్డ్ అణచివేసింది. ప్రతిపక్షంలో విభేదాల కారణంగా విలియమ్స్ అధికారాన్ని నిలబెట్టుకున్నాడు.

1963లో టొబాగో హరికేన్ ఫ్లోరా వలన దెబ్బతింది. ఇందులో 30 మంది మరణించారు. ద్వీపం అంతటా అపారమైన విధ్వంసం జరిగింది. పాక్షికంగా దీని ఫలితంగా, తరువాతి దశాబ్దాలలో ద్వీపపు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయం స్థానాన్ని పర్యాటకం ఆక్రమించింది. 1968 మే 1 న ట్రినిడాడ్ అండ్ టొబాగో కరీబియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (CARIFTA) లో చేరింది. వెస్టిండీస్ ఫెడరేషన్ విఫలమైన తర్వాత ఈ సంఘం, మాజీ బ్రిటిష్ వెస్టిండీస్ ఇంగ్లీష్ మాట్లాడే దేశాల మధ్య రాజకీయంగా కాకుండా, ఆర్థిక సంబంధాన్ని కొనసాగించింది. CARIFTA తదనంతరం వచ్చిన కరేబియన్ కమ్యూనిటీ (CARICOM) లో ట్రినిడాడ్ అండ్ టొబాగో వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది. ఇది అనేక కరేబియన్ దేశాలు, భూభాగాలతో ఏర్పడిన రాజకీయ, ఆర్థిక యూనియన్ .

1972, 1983 సంవత్సరాల మధ్య, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో, దేశపు ప్రాదేశిక జలాల్లో విస్తారమైన కొత్త చమురు నిక్షేపాలను కనుగొనడం ద్వారా దేశం బాగా లాభపడింది. ఫలితంగా జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. 1976లో దేశం కామన్వెల్త్‌లో గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అయితే అది ప్రివీ కౌన్సిల్ యొక్క జ్యుడీషియల్ కమిటీనే తన చివరి అప్పీలేట్ కోర్టుగా ఉంచుకుంది. గవర్నర్-జనరల్ స్థానంలో అధ్యక్షుడు వచ్చాడు; ఉత్సవ మూర్తి వంటి ఈ పదవిని అలంకరించిన తొలి వ్యక్తి ఎల్లిస్ క్లార్క్. 1980లో టొబాగో హౌస్ ఆఫ్ అసెంబ్లీని ఏర్పాటు చేయడంతో టొబాగోకు పరిమిత స్వీయ-పాలన మంజూరు చేయబడింది

విలియమ్స్ 1981లో మరణించాడు. అతని స్థానంలో జార్జ్ ఛాంబర్స్ 1986 వరకు దేశానికి నాయకత్వం వహించాడు. ఈ సమయానికి చమురు ధర తగ్గడం వల్ల మాంద్యం ఏర్పడింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగాయి. నేషనల్ అలయన్స్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ (NAR) బ్యానర్ క్రింద ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. 1986 ట్రినిడాడ్ అండ్ టొబాగో సాధారణ ఎన్నికలలో విజయం సాధించాయి. NAR నాయకుడు ANR రాబిన్సన్ కొత్త ప్రధాన మంత్రి అయ్యాడు. రాబిన్సన్ అంతంతమాత్రంగా ఉన్న NAR సంకీర్ణాన్ని కలిపి ఉంచలేకపోయాడు. అతని ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమం అమలు, కరెన్సీ విలువ తగ్గింపు వంటివి సామాజిక అశాంతికి దారితీశాయి. 1990లో, యాసిన్ అబూ బకర్ (గతంలో లెన్నాక్స్ ఫిలిప్ అనేది అతని పేరు) నేతృత్వంలోని జమాత్ అల్ ముస్లిమీన్‌కు చెందిన 114 మంది సభ్యులు రెడ్ హౌస్ ( పార్లమెంటు స్థానం), ఆ సమయంలో దేశంలో ఉన్న ఏకైక టెలివిజన్ స్టేషన్ అయిన ట్రినిడాడ్ అండ్ టొబాగో టెలివిజన్‌పై దాడి చేశారు. ఆరు రోజుల పాటు రాబిన్సన్‌ను, ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుని చివరికి లొంగిపోయాడు. తిరుగుబాటు నాయకులకు క్షమాభిక్ష ఇస్తామని వాగ్దానం చేసారు. కానీ లొంగిపోయిన తర్వాత వారిని అరెస్టు చేసి, సుదీర్ఘమైన కోర్టు తగాదాల తర్వాత విడుదల చేసారు.

1991 ట్రినిడాడ్ అండ్ టొబాగో సాధారణ ఎన్నికల తరువాత పాట్రిక్ మానింగ్ నేతృత్వంలోని PNM తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో మెరుగుదలను పొందాలని ఆశిస్తూ, 1995లో మాన్నింగ్ ముందస్తు ఎన్నికలకు పిలుపు నిచ్చాడు. అయితే దీని ఫలితంగా హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. 1989లో NAR నుండి విడిపోయిన ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ (UNC) కి ఇద్దరు NAR ప్రతినిధులు మద్దతు ఇచ్చారు. దేశపు మొట్టమొదటి ఇండో-ట్రినిడాడియన్ ప్రధాన మంత్రి అయిన బాస్డియో పాండే ఆధ్వర్యంలో వారు అధికారాన్ని చేపట్టారు. వరుసగా అనేక ఎన్నికలలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానందున ఏర్పడిన రాజకీయ గందరగోళం తర్వాత, 2001లో పాట్రిక్ మానింగ్ తిరిగి అధికారంలోకి వచ్చాడు. 2010 వరకు అతను ఆ పదవిలో ఉన్నాడు.

2003లో దేశం రెండవ చమురు విజృంభణలోకి ప్రవేశించింది. పెట్రోలియం, పెట్రోకెమికల్స్, సహజ వాయువులు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా కొనసాగుతున్నాయి. టొబాగో ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం, ప్రజా సేవ ప్రధానమైనవి. అవినీతి కుంభకోణం ఫలితంగా 2010లో కొత్తగా ఏర్పడిన పీపుల్స్ పార్టనర్‌షిప్ కూటమి చేతిలో మాన్నింగ్ ఓడిపోయాడు. కమ్లా పెర్సాద్-బిస్సేసర్ దేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి అయింది. అయితే, అవినీతి ఆరోపణలు కొత్త ప్రభుత్వాన్ని బలహీనపరచాయి. 2015లో కీత్ రౌలీ ఆధ్వర్యంలోని PNM చేతిలో పీపుల్స్ పార్టనర్‌షిప్ ఓడిపోయింది. 2020 ఆగస్టులో, పాలక పీపుల్స్ నేషనల్ మూవ్‌మెంట్ సాధారణ ఎన్నికలలో విజయం సాధించి, ప్రస్తుత ప్రధాన మంత్రి కీత్ రౌలీకి రెండవసారి పదవిని చేపట్టాడు.

భౌగోళికం

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాప్
ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగో స్థలాకృతి

ట్రినిడాడ్ అండ్ టొబాగో 10° 2' - 11° 12' N అక్షాంశాలు, 60° 30', 61° 56' W రేఖాంశాల మధ్య ఉంది. ఉత్తరాన కరేబియన్ సముద్రం, తూర్పు, దక్షిణాల్లో అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన గల్ఫ్ ఆఫ్ పారియా ఉన్నాయి. ఇది కరేబియన్ ప్రాంతంలో ఆగ్నేయ చివరన ఉంది. ట్రినిడాడ్ ద్వీపం కేవలం వెనిజులా తీరంలో దక్షిణ అమెరికా ప్రధాన భూభాగంలో కొలంబస్ ఛానల్ మీదుగా 11 kilometres (6.8 mi) దూరంలో ఉంది. ఈ ద్వీపాలు దక్షిణ అమెరికాకు భౌతిక పొడిగింపు. దేశపు 5,128 km2 (1,980 sq mi) విస్తీర్ణంలో ట్రినిడాడ్, టొబాగో అనే రెండు ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. వీటి మధ్య దూరం 32 కి.మీ. ఇవి కాక చాకాచాకేర్, మోనోస్, హ్యూవోస్, గాస్పర్ గ్రాండే (లేదా గ్యాస్పారీ), లిటిల్ టొబాగో, సెయింట్ గైల్స్ ద్వీపంతో సహా అనేక చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి.

ట్రినిడాడ్ విస్తీర్ణం 4,768 km2 (1,841 sq mi). దేశం మొత్తం వైశాల్యంలో ఇది 93.0%. దీని సగటు పొడవు 80 kilometres (50 mi) ), సగటు వెడల్పు 59 kilometres (37 mi) . టొబాగో విస్తీర్ణం సుమారు 300 km2 (120 sq mi). ఇది దేశ విస్తీర్ణంలో 5.8%. దీని పొడవు 41 km (25 mi), వెడల్పు 12 km (7.5 mi) ఉంటుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో దక్షిణ అమెరికా ఖండాంతర షెల్ఫ్‌పై ఉంది. భౌగోళికంగా ఇది పూర్తిగా దక్షిణ అమెరికాలో ఉన్నట్లు పరిగణిస్తారు.

దీవుల భూభాగం పర్వతాలు, మైదానాల మిశ్రమం. ట్రినిడాడ్‌లో ఉత్తర శ్రేణి ఉత్తర తీరానికి సమాంతరంగా నడుస్తుంది. దేశంలోని ఎత్తైన శిఖరం ( ఎల్ సెర్రో డెల్ అరిపో ) ఈ శ్రేణి లోనే ఉంది. ఇది సముద్ర మట్టానికి 940 metres (3,080 ft) ఉంటుంది. ద్వీపం మధ్యలో సెంట్రల్ రేంజ్, మోంట్‌సెరాట్ కొండలు, దక్షిణాన సదరన్ రేంజ్, ట్రినిటీ హిల్స్ ఉంటాయి. మిగతా ద్వీపం సాధారణంగా చదునుగా ఉంటుంది. మూడు పర్వత శ్రేణులు ట్రినిడాడ్ డ్రైనేజీ నమూనాను నిర్ణయిస్తాయి. తూర్పు తీరం దాని బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మంజానిల్లా బీచ్ ప్రముఖమైనది. ఈ ద్వీపంలో కరోని స్వాంప్, నరివా స్వాంప్ వంటి అనేక పెద్ద చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి. ట్రినిడాడ్‌లోని ప్రధాన నీటి వనరులలో హోలిస్ రిజర్వాయర్, నావెట్ రిజర్వాయర్, కరోని రిజర్వాయర్ ఉన్నాయి. ట్రినిడాడ్‌లో వివిధ రకాలైన నేలలున్నాయి. వీటిలో ఎక్కువ భాగం చక్కటి ఇసుక, భారీ బంకమట్టి. ఉత్తర శ్రేణిలోని ఒండ్రు లోయలు, తూర్పు-పశ్చిమ కారిడార్‌లోని నేలలు అత్యంత సారవంతమైనవి.  ప్రపంచంలోనే అతిపెద్ద సహజ తారు రిజర్వాయర్ అయిన పిచ్ లేక్‌కు ఈ దీవి ప్రసిద్ధి చెందింది. టొబాగోలో నైరుతిలో ఒక చదునైన మైదానం ఉంది. ద్వీపపు తూర్పు సగం పర్వతాలతో కూడుకుని ఉంటుంది, ఇక్కడే ద్వీపం యొక్క ఎత్తైన ప్రదేశం 550 metres (1,800 ft) వద్ద ఉంది. టొబాగో తీరంలో అనేక పగడపు దిబ్బలు కూడా ఉన్నాయి.

జనాభాలో ఎక్కువ మంది ట్రినిడాడ్ ద్వీపంలో నివసిస్తున్నారు. ఇది అతిపెద్ద పట్టణాలు, నగరాల ప్రదేశం. ట్రినిడాడ్‌లో నాలుగు ప్రధాన మునిసిపాలిటీలు ఉన్నాయి: రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్, శాన్ ఫెర్నాండో, అరిమా, చగువానాస్ . టొబాగోలోని ప్రధాన పట్టణం స్కార్‌బరో .

శీతోష్ణస్థితి

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
పిచ్ లేక్, నైరుతి ట్రినిడాడ్‌లో

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సముద్రీయ ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంది. సంవత్సరానికి రెండు సీజన్లు ఉన్నాయి: సంవత్సరంలో మొదటి ఐదు నెలలు పొడి కాలం, మిగిలిన ఏడు నెలలు వర్షాకాలం. గాలులు ప్రధానంగా ఈశాన్యం నుండి వీస్తాయి. ఈశాన్య వాణిజ్య పవనాలు ఎక్కువగా వీస్తాయి. అనేక కరేబియన్ దీవుల వలె కాకుండా ట్రినిడాడ్ అండ్ టొబాగో హరికేన్‌లు వచ్చే ప్రధానమైన ప్రాంతాలకు వెలుపల ఉంది; అయితే, టొబాగో ద్వీపాన్ని 1963 సెప్టెంబరు 30 న హరికేన్ ఫ్లోరా తాకింది. ట్రినిడాడ్ ఉత్తర పర్వత శ్రేణిలో ఎప్పుడూ ఉండే మేఘాలు పొగమంచు కారణం గాను, పర్వతాలలో పడుతూ ఉండే భారీ వర్షాల కారణంగానూ అక్కడ, దిగువన మైదాన ప్రాంతాల్లో ఉండే విపరీతమైన వేడి కంటే చల్లగా ఉంటుంది.

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో రికార్డు ఉష్ణోగ్రతలు 39 °C (102 °F) పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో. కనిష్ఠంగా 12 °C (54 °F)

ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది రెండు-పార్టీల వ్యవస్థ. బ్రిటన్ లోని వెస్ట్‌మినిస్టర్ వ్యవస్థ ఆధారంగా ఏర్పాటైన రెండు సభల పార్లమెంటరీ వ్యవస్థతో కూడిన రిపబ్లిక్.

పార్లమెంటులో సెనేట్ (31 సీట్లు), ప్రతినిధుల సభ (41 సీట్లు, ప్లస్ స్పీకర్) అనే రెండు సభలు ఉంటాయి. సెనేట్ సభ్యులను అధ్యక్షుడు నియమిస్తాడు; ఇందులో 16 మంది ప్రభుత్వ సెనేటర్లు ప్రధానమంత్రి సలహాపై నియమితులౌతారు, ఆరుగురు ప్రతిపక్ష సెనేటర్లు ప్రతిపక్ష నాయకుని సలహాపై నియమితులౌతారు. తొమ్మిది మంది స్వతంత్ర సెనేటర్లను పౌర సమాజంలోని ఇతర రంగాలకు ప్రాతినిధ్యం వహించేలా అధ్యక్షుడు నియమిస్తారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని 41 మంది సభ్యులు " ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ " విధానంలో గరిష్ఠంగా ఐదు సంవత్సరాల కాలానికి ప్రజలచే ఎన్నుకోబడతారు.

పరిపాలనా విభాగాలు

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రాంతీయ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు

ట్రినిడాడ్‌లో 9 ప్రాంతాలు, 5 మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటికి పరిమిత స్థాయి స్వయంప్రతిపత్తి ఉంది. వివిధ కౌన్సిల్‌లలో సభ్యత్వం ఎన్నుకోబడిన, నియమించబడిన సభ్యుల కలయికతో ఉంటుంది. ప్రతి మూడేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి.  టొబాగో పరిపాలన టొబాగో హౌస్ ఆఫ్ అసెంబ్లీ నిర్వహిస్తుంది. గతంలో దేశం కౌంటీలుగా విభజించబడి ఉండేది.

రాజకీయ సంస్కృతి

రెండు ప్రధాన పార్టీలు పీపుల్స్ నేషనల్ మూవ్‌మెంట్ (PNM), యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ (UNC). PNM ఆఫ్రో-ట్రినిడాడియన్ ఓట్లలో మెజారిటీని, UNC ఇండో-ట్రినిడాడియన్ మద్దతులో మెజారిటీని పొందడంతో, ఈ పార్టీలకు మద్దతు జాతి పరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అనేక చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. 2020 ఆగస్టు సాధారణ ఎన్నికల నాటికి, 19 నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో ప్రోగ్రెసివ్ ఎంపవర్‌మెంట్ పార్టీ, ట్రినిడాడ్ హ్యుమానిటీ క్యాంపెయిన్, న్యూ నేషనల్ విజన్, మూవ్‌మెంట్ ఫర్ సోషల్ జస్టిస్, కాంగ్రెస్ ఆఫ్ ది పీపుల్, మూవ్‌మెంట్ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పేట్రియాట్స్, నేషనల్ కోయలిషన్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రోగ్రెసివ్ పార్టీ, ఇండిపెండెంట్ లిబరల్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ వి ది పీపుల్, అన్‌రిప్రజెంటెడ్ పీపుల్స్ పార్టీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో డెమోక్రటిక్ ఫ్రంట్, ది నేషనల్ పార్టీ, వన్ టొబాగో వాయిస్, యూనిటీ ఆఫ్ పీపుల్స్ ఉన్నాయి.

మిలిటరీ

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
కోస్ట్ గార్డ్ నౌక

ట్రినిడాడ్ అండ్ టొబాగో డిఫెన్స్ ఫోర్స్ (TTDF) అనేది ట్రినిడాడ్ అండ్ టొబాగో రక్షణకు బాధ్యత వహించే సైనిక సంస్థ. ఇందులో రెజిమెంట్, కోస్ట్ గార్డ్, ఎయిర్ గార్డ్, డిఫెన్స్ ఫోర్స్ రిజర్వ్‌లు ఉన్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి ట్రినిడాడ్ అండ్ టొబాగో స్వాతంత్ర్యం పొందిన తరువాత దీన్ని 1962లో స్థాపించారు. TTDF కరేబియన్‌లో ఇంగ్లీషు మాట్లాడే దేశాల సైనిక దళాలలో అతిపెద్ద వాటిలో ఒకటి. 

2019లో, ట్రినిడాడ్ అండ్ టొబాగో అణ్వాయుధాల నిషేధపు UN ఒప్పందంపై సంతకం చేసింది.

ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇటీవలి దశాబ్దాలలో నేరాలు అధికంగా ఉన్నాయి; ప్రస్తుతం సంవత్సరానికి దాదాపు 500 హత్యలు జరుగుతున్నాయి. దక్షిణ అమెరికా నుండి కరేబియన్‌లోని మిగిలిన ప్రాంతాలకు, ఉత్తర అమెరికాకు ఆవల ఉన్న చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల రవాణాకు దేశం ఒక ప్రసిద్ధ ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రంగా ఉంది. కొన్ని అంచనాల ప్రకారం "లెక్కల లోకి రాని ఆర్థిక వ్యవస్థ" పరిమాణం లెక్కించిన GDPలో 20-30% వరకు ఉంటుంది.

తీవ్రవాదం

1990 తిరుగుబాటు ప్రయత్నం నుండి దేశంలో తీవ్రవాద-సంబంధిత సంఘటనలు ఏవీ లేనప్పటికీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఒక సంభావ్య లక్ష్యంగానే ఉంది; ఉదాహరణకు, 2018 ఫిబ్రవరిలో కార్నివాల్‌పై దాడి చేసే ప్రణాళికను పోలీసులు విఫలం చేశారు. ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాడేందుకు దేశంలోని దాదాపు 100 మంది పౌరులు మధ్యప్రాచ్యానికి వెళ్లినట్లు అంచనా. 2017లో ప్రభుత్వం ఉగ్రవాద, తీవ్రవాద వ్యతిరేక వ్యూహాన్ని రూపొందించుకుంది.

జనాభా

దేశ జనాభా ప్రస్తుతం 13,67,558 (2021 జూన్ అంచనా).

జాతి సమూహాలు

ట్రినిడా అండ్ టొబాగోలో వివిధ జాతుల జనాభా
జాతులు శాతం
ఇండో ట్రినిడాడియన్లు
  
35.4%
ఆఫ్రో ట్రినిడాడియన్, టొబాగోనియన్లు
  
34.2%
మిశ్రమ
  
15.3%
డూగ్లా (ఆఫ్రికన్/ఇండియన్ మిశ్రమం)
  
7.7%
వెల్లడించని
  
6.2%
ఇతరులు
  
1.3%

భాషలు

ఇంగ్లీష్, ఇంగ్లీష్ క్రియోల్స్

ఇంగ్లీషు దేశపు అధికారిక భాష (ఇక్కడి ఇంగ్లీషును ట్రినిడాడ్ అండ్ టొబాగో స్టాండర్డ్ ఇంగ్లీష్ (TTSE) అంటారు). కానీ ప్రధానంగా మాట్లాడే భాషలు ట్రినిడాడియన్ క్రియోల్ లేదా టొబాగోనియన్ క్రియోల్. ఇది దేశపు దేశీయ, యూరోపియన్, ఆఫ్రికా, ఆసియా వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. రెండు క్రియోల్‌లు వివిధ రకాల ఆఫ్రికన్ భాషల మూలకాలను కలిగి ఉంటాయి; అయితే ట్రినిడాడియన్ ఇంగ్లీష్ క్రియోల్ భాష ఫ్రెంచి భాష చేత, ఫ్రెంచ్ క్రియోల్ (పాటోయిస్) చేత కూడా ప్రభావితమైంది.

హిందుస్తానీ

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మాట్లాడే కరేబియన్ హిందుస్తానీ యొక్క రూపాంతరాన్ని ట్రినిడాడియన్ హిందుస్తానీ, ట్రినిడాడియన్ భోజ్‌పురి, ప్లాంటేషన్ హిందుస్తానీ లేదా గావ్ కే బోలీ అని పిలుస్తారు. ప్రారంభ భారతీయ వలసదారులలో ఎక్కువ మంది భోజ్‌పురి, అవధి మాట్లాడేవారు. ఇదే తరువాత ట్రినిడాడియన్ హిందుస్థానీగా ఏర్పడింది. 1935లో, భారతీయ సినిమాలను ట్రినిడాడ్‌లో ప్రదర్శించడం ప్రారంభించారు. చాలా భారతీయ చలనచిత్రాలు ప్రామాణిక హిందుస్థానీ (హిందీ) మాండలికంలో ఉన్నాయి. వీటి ద్వారా ట్రినిడాడియన్ హిందుస్తానీకి ప్రామాణిక హిందీ పదబంధాలు, పదజాలం జోడించబడి ట్రినిడాడియన్ హిందుస్తానీని కొద్దిగా సవరించింది. భారతీయ చలనచిత్రాలు ఇండో-ట్రినిడాడియన్, టొబాగోనియన్లలో హిందుస్తానీని పునరుజ్జీవింపజేశాయి. 1970ల మధ్య నుండి చివరి వరకు ఇండో-ట్రినిడాడియన్, టొబాగోనియన్ల భాష ట్రినిడాడియన్ హిందుస్థానీ నుండి ఒక విధమైన "హిందీనైజ్డ్" ఇంగ్లీషుకు మారింది. భజన్, భారతీయ శాస్త్రీయ సంగీతం, భారతీయ జానపద సంగీతం, ఫిల్మీ, పిచాకరీ, చట్నీ, చట్నీ సోకా, చట్నీ పరంగ్ వంటి ఇండో-ట్రినిడాడియన్, టొబాగోనియన్ సంగీత రూపాల ద్వారా నేడు హిందుస్థానీ మనుగడ సాగిస్తోంది. 2003 నాటికి, ట్రినిడాడియన్ హిందుస్థానీ మాట్లాడే ఇండో-ట్రినిడాడియన్, టొబాగోనియన్లు దాదాపు 15,633 మంది ఉన్నారు. 2011 నాటికి ప్రామాణిక హిందీ మాట్లాడేవారు 10,000 మంది ఉన్నారు. ఈ రోజు చాలా మంది ఇండో-ట్రినిడాడియన్లు, టొబాగోనియన్లు, ట్రినిడాడియన్ టొబాగోనియన్ ఇంగ్లీషుతో కూడిన ఒక రకమైన హింగ్లీష్ మాట్లాడతారు. ఇది ట్రినిడాడియన్ హిందుస్తానీ పదజాలంతో, పదబంధాలతో కూడుకుని ఉంటుంది. చాలా మంది ఇండో-ట్రినిడాడియన్లు, టొబాగోనియన్లు ఈ రోజు హిందుస్తానీలో పదబంధాలు లేదా ప్రార్థనలను చదవగలరు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అనేక ప్రాంతాలకు హిందుస్థానీ మూలాల పేర్లు ఉన్నాయి. కొన్ని పదబంధాలు, పదజాలం దేశంలోని ప్రధాన స్రవంతి ఇంగ్లీషు లోకి, ఆంగ్ల క్రియోల్ మాండలికంలోకి కూడా ప్రవేశించాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కల్చర్, హిందీ నిధి ఫౌండేషన్, ఇండియన్ హైకమిషన్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్, సనాతన్ ధర్మ మహా సభ నిర్వహించే కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విషామ్ భీముల్ నేతృత్వంలోని కరేబియన్ హిందుస్తానీ ఇంక్ సంస్థ ట్రినిడాడియన్ హిందుస్థానీని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది.

స్పానిష్

మూస:Excerpt

తమిళం

తమిళ భాషను పాత తమిళ (మద్రాసీ) ఇండో-ట్రినిడాడియన్, టొబాగోనియన్ జనాభాలో కొందరు మాట్లాడతారు. ఎక్కువగా తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన ఒప్పంద కార్మికుల వారసుల్లో కొద్దిమంది దీనిని మాట్లాడతారు. తమిళం మాట్లాడే ఇతరుల్లో ఇటీవలి కాలంలో తమిళనాడు నుండి వలస వచ్చినవారు ఉన్నారు.

చైనీస్

19వ శతాబ్దంలో వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది దక్షిణ చైనా నుండి వచ్చారు. 20వ శతాబ్దంలో ఒప్పంద సంవత్సరాల తర్వాత నేటి వరకు అనేక మంది చైనీస్ ప్రజలు వ్యాపారం కోసం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వలస వచ్చారు. వారు మాండరిన్, మిన్ వంటి ఇతర చైనీస్ మాండలికాలతో పాటు ఇండెంచర్ల మాండలికాలు కూడా మాట్లాడతారు. J. డయ్యర్ బాల్ 1906లో ఇలా రాసాడు: "ట్రినిడాడ్‌లో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం 4,000 లేదా 5,000 మంది చైనీయులు ఉండేవారు, కానీ వారు దాదాపు 2,000 లేదా 3,000, [1900లో 2,200]కి తగ్గారు. వారు చెరకు తోటలలో పని చేసేవారు, కానీ ఇప్పుడు ప్రధానంగా దుకాణదారులు. అలాగే సాధారణ వ్యాపారులు, మైనర్లు, రైల్వే బిల్డర్లు మొదలైన వృత్తుల్లో ఉన్నారు."

మతం

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
కారాపిచైమాలోని 26 మీటర్ల హనుమాన్ మూర్తి, హిందూ, ఇండో-ట్రినిడాడియన్ సంస్కృతికి ప్రసిద్ధ కేంద్రం; ఇది భారతదేశం వెలుపల అతిపెద్ద హనుమంతుని విగ్రహం

2011 జనాభా లెక్కల ప్రకారం, క్రైస్తవ మతం దేశంలో ప్రధానమైన మతం, జనాభాలో 63.2% మంది క్రైస్తవులున్నారు. మొత్తం జనాభాలో 21.60% మందితో రోమన్ కాథలిక్‌లు అతిపెద్ద మతాధార తెగ. పెంటెకోస్టల్ / ఎవాంజెలికల్ / ఫుల్ గోస్పెల్ తెగలు 12.02% జనాభాతో మూడవ అతిపెద్ద సమూహంగా ఉన్నాయి. అనేక ఇతర క్రైస్తవ తెగలలో ( ఆధ్యాత్మిక బాప్టిస్ట్ (5.67%), ఆంగ్లికన్లు (5.67%), సెవెంత్-డే అడ్వెంటిస్టులు (4.09%), ప్రెస్బిటేరియన్లు లేదా కాంగ్రేగేషనలిస్టులు (2.49%), యెహోవాసాక్షులు (1.47%), బాప్టిస్టులు (1.21%), మెథడిస్టులు ఉన్నారు. (0.65%), మొరావియన్ చర్చి (0.27%) ) ఉన్నారు.

హిందూమతం దేశంలో రెండవ అతిపెద్ద మతంగా ఉంది, 2011లో 20.4% మంది హిందువులు. హిందూమతం దేశవ్యాప్తంగా ఆచరిస్తారు, దీపావళి ప్రభుత్వ సెలవుదినం. ఇతర హిందూ సెలవులు కూడా విస్తృతంగా జరుపుకుంటారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అతిపెద్ద హిందూ సంస్థ సనాతన్ ధర్మ మహా సభ. ఇది రెండు ప్రధాన హిందూ సంస్థల విలీనం తర్వాత 1952లో ఏర్పడింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో చాలా మంది హిందువులు సనాతని (సనాతనిస్ట్/ఆర్థడాక్స్ హిందూ) హిందువులు. దేశంలో ఆర్యసమాజ్, కబీర్ పంత్, సీనరియాని (సియునారిని/సీవ్నరైణి/శివనారాయణి), రామనంది సంప్రదాయం, ఔఘర్ (అఘోర్), రవిదాస్ పంత్, కాళీ మాయి (మద్రాసి) , సత్యసాయి బాబా ఉద్యమం, షిర్డీ సాయిబాబా ఉద్యమం, (హరే కృష్ణ) , చిన్మయ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘం, డివైన్ లైఫ్ సొసైటీ, మురుగన్ (కౌమారం), గణపతి సచ్చిదానంద ఉద్యమం, జగద్గురు కృపాలు పరిషత్ (రాధా మాధవ్) బ్రహ్మ కుమారీలు తదితర శాఖలు సంస్థలూ ఉన్నాయి.

2011లో ముస్లింలు జనాభాలో 4.97% మంది ఉన్నారు ఈద్ అల్-ఫితర్ పబ్లిక్ సెలవుదినం. ఈద్ అల్-అధా, మౌలిద్, హోసే, ఇతర సెలవులు కూడా జరుపుకుంటారు.

ఆఫ్రికాలో ఉత్పన్నమైన లేదా ఆఫ్రోసెంట్రిక్ మతాలను కూడా ఆచరిస్తారు. ముఖ్యంగా ట్రినిడాడ్ ఒరిషా ( యోరుబా ) విశ్వాసులు (0.9%), రాస్తాఫారియన్లు (0.27%). సాంప్రదాయ ఒబాహ్ నమ్మకాలను ఇప్పటికీ ద్వీపాలలో ఆచరిస్తారు.

అనేక శతాబ్దాలుగా ద్వీపాలలో యూదుల సంఘం ఉంది, అయితే వారి సంఖ్య ఎప్పుడూ స్వల్పం గానే ఉంటుంది, 2007 అంచనా ప్రకారం దేశంలో యూదుల జనాభా 55.

మతపరమైన అనుబంధాన్ని పేర్కొనని వారు జనాభాలో 11.1% మంది ఉన్నారు, 2.18% మంది తమను తాము మతరహితంగా ప్రకటించుకున్నారు .

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మతం (2011 జనగణన)
మతం శాతం
క్రైస్తవం
  
63.2%
హైందవం
  
20.4%
ఇస్లాం
  
5.6%
ఓరీషా
  
1.0%
రస్టాఫారీ
  
0.3%
ఇతర మతాలు
  
7.0%
మతమే లేదు/వెల్లడించలేదు
  
2.5%

చదువు

పిల్లలు సాధారణంగా రెండున్నర సంవత్సరాల వయసులో ప్రీ-స్కూల్ ప్రారంభిస్తారు. కానీ ఇది తప్పనిసరి కాదు. అయితే, వారు ప్రాథమిక పాఠశాలలో చేరే సమయానికి కనీస మాత్రపు స్థాయిలో చదవడం, రాయడం నేర్చి ఉండాలని భావిస్తున్నారు. ఐదు సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పాఠశాల మొదలౌతుంది. ఏడు సంవత్సరాల తర్వాత మాధ్యమిక స్థాయికి వెళతారు. ప్రాథమిక పాఠశాలలో ఉండే మొత్తం ఏడు తరగతుల్లో ముందుగా మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఉంటాయి. ఆ తరువాత ఒకటవ తరగతితో మొదలై ఐదవ తరగతి వరకు ఉంటాయి. ప్రాథమిక పాఠశాల చివరి సంవత్సరంలో, విద్యార్థులు మాధ్యమిక ప్రవేశ పరీక్షకు (SEA) కూర్చుంటారు. ఈ పరీక్షలో ఫలితాన్ని బట్టి విద్యార్థి చేరే మాధ్యమిక పాఠశాల ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థ

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
పాయింట్-ఎ-పియర్ వద్ద చమురు శుద్ధి కర్మాగారం

ట్రినిడాడ్ అండ్ టొబాగో కరేబియన్‌లో కెల్లా అత్యంత అభివృద్ధి చెందిన దేశం, అత్యంత సంపన్న దేశాలలో ఒకటి. ప్రపంచంలోని 70 అధిక-ఆదాయ దేశాలలో టాప్ 40 (2010 సమాచారం) లో ఉంటుంది.  దాని స్థూల జాతీయ తలసరి ఆదాయం US$20,070 (2014 అట్లాస్ పద్ధతిలో స్థూల జాతీయ ఆదాయం). ఇది కరేబియన్‌లో అత్యధికం. 2011 నవంబరులో OECD, ట్రినిడాడ్ అండ్ టొబాగోను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుండి తొలగించింది. ట్రినిడాడ్ ఆర్థిక వ్యవస్థ పెట్రోలియం పరిశ్రమచే బలంగా ప్రభావితమైంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం, తయారీ కూడా ముఖ్యమైనవి. పర్యాటక రంగం ముఖ్యంగా టొబాగోలో అభివృద్ధి చెందుతోంది. అనేక ఇతర కరేబియన్ దీవుల కంటే ఇక్కడ దామాషా ప్రకారం పర్యాటకానికి ఆర్థిక వ్యవస్థలో చాలా తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. వ్యవసాయ ఉత్పత్తులలో సిట్రస్, కోకో ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వస్తువుల్లో, ముఖ్యమైనవి ఆహారం, పానీయాలు, సిమెంటు.

చమురు, గ్యాసు

ట్రినిడాడ్ అండ్ టొబాగో చమురు, గ్యాస్ ఉత్పత్తిలో ప్రముఖ ఉత్పత్తిదారు. దాని ఆర్థిక వ్యవస్థ ఈ వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. చమురు, గ్యాసు రంగానికి దేశ GDPలో 40%, ఎగుమతుల్లో 80% వాటా ఉంది, అయితే ఉపాధిలో మాత్రం దీని వాటా 5% మాత్రమే. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG), పెట్రోకెమికల్స్, స్టీల్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇటీవలి వృద్ధికి ఆజ్యం పోసింది. అదనపు పెట్రోకెమికల్, అల్యూమినియం, ప్లాస్టిక్ ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో ప్రణాళికలో ఉన్నాయి.

దేశం ప్రాంతీయ ఆర్థిక కేంద్రంగా కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య మిగులు పెరుగుతోంది. గత ఆరు సంవత్సరాలుగా అట్లాంటిక్ LNG విస్తరణ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అతిపెద్ద ఆర్థిక వృద్ధిని సృష్టించింది. దేశం LNG ఎగుమతిదారు. 2017లో మొత్తం 13.4 బిలియన్ మీ 3 గ్యాసును సరఫరా చేసింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో గ్యాసు ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్లు చిలీ, యునైటెడ్ స్టేట్స్.

ట్రినిడాడ్ అండ్ టొబాగో చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారింది. 2017లో, సహజ వాయువు ఉత్పత్తి మొత్తం 18.5 బిలియన్ m 3. 2016 లోని ఉత్పత్తితో పోలిస్తే ఇది 0.4% తగ్గుదల. 2007 - 2017 దశాబ్దంలో చమురు ఉత్పత్తి సంవత్సరానికి 7.1 మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి 4.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గింది.  

పర్యాటకం

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
టొబాగోలోని పిజియన్ పాయింట్ బీచ్ వద్ద పర్యాటకులు

ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేక ఇతర కరేబియన్ దేశాల కంటే పర్యాటకంపై చాలా తక్కువగా ఆధారపడి ఉంది. పర్యాటక కార్యకలాపాలలో ఎక్కువ భాగం టొబాగోలో జరుగుతాయి. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో ప్రయత్నాలు చేస్తోంది.

వ్యవసాయం

చారిత్రికంగా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయోత్పత్తి (ఉదాహరణకు, చక్కెర, కాఫీ) పై ఆధారపడి ఉండేది. అయితే ఈ రంగం 20వ శతాబ్దం నుండి బాగా క్షీణించి, ఇప్పుడు దేశ GDPలో కేవలం 0.4%గా ఉంది. ఈ రంగం 3.1% శ్రామికశక్తికి ఉపాధి కల్పిస్తోంది. దోసకాయలు, వంకాయ, సరుగుడు, గుమ్మడికాయ, డాషీన్ (టారో), కొబ్బరి వంటి వివిధ పండ్లు, కూరగాయలు పండిస్తారు; చేపలు పట్టడం ఇప్పటికీ చేస్తూంటారు.

రవాణా

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
చర్చిల్-రూజ్‌వెల్ట్ హైవే - ఉరియా బట్లర్ హైవే ఖండన, 2009

ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని రెండు ప్రధాన ద్వీపాలలో హైవేలు, రహదారుల దట్టమైన నెట్‌వర్క్‌ను ఉంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ను స్కార్‌బరో, శాన్ ఫెర్నాండోతో అనుసంధానించే ఫెర్రీలు, రెండు ద్వీపాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఉరియా బట్లర్ హైవే, చర్చిల్ రూజ్‌వెల్ట్ హైవే, సర్ సోలమన్ హోచోయ్ హైవే ట్రినిడాడ్ ద్వీపంలో ఉన్నాయి. టొబాగోలో క్లాడ్ నోయెల్ హైవే ప్రధానమైన రహదారి. నేలపై ప్రజా రవాణాకు పబ్లిక్ బస్సులు, ప్రైవేట్ టాక్సీలు, మినీ బస్సులు ఉన్నాయి. సముద్రం ద్వారా, ఫెర్రీలు ఇంటర్-సిటీ వాటర్ టాక్సీలు నడుస్తున్నాయి.

ట్రినిడాడ్ ద్వీపానికి పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందిస్తుంది. దీన్ని 1931 జనవరి 8 న ప్రారంభించారు. ఇది సముద్రమట్టం నుండి 17.4 metres (57 ft) ఎత్తున, 680 hectares (1,700 acres) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 3,200 metres (10,500 ft) ) రన్‌వే ఉంది. ఈ విమానాశ్రయంలో రెండు టెర్మినల్స్ ఉన్నాయి. పాత సౌత్ టెర్మినల్ 2009లో అమెరికా 5వ సమ్మిట్ సందర్భంగా VIP ప్రవేశ ద్వారంగా మార్చారు. నార్త్ టెర్మినల్ 2001లో పూర్తయింది.

క్రీడలు

క్రికెట్

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
భారత్‌పై వెస్టిండీస్ తరఫున బ్రియాన్ లారా బ్యాటింగ్ చేస్తున్నాడు

క్రికెట్, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఒక ప్రసిద్ధ క్రీడ. దీన్ని జాతీయ క్రీడగా పరిగణిస్తారు. దాని కరేబియన్ పొరుగు దేశాలతో తీవ్రమైన అంతర్-ద్వీప పోటీ ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో వెస్టిండీస్ జట్టు సభ్యునిగా టెస్ట్ క్రికెట్, వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రాంతీయ నాలుగు రోజుల పోటీ, ప్రాంతీయ సూపర్50 వంటి ప్రాంతీయ పోటీలలో జాతీయ జట్టు ఫస్ట్-క్లాస్ స్థాయిలో ఆడుతుంది. అదే సమయంలో, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతుంది .

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఉన్న క్వీన్స్ పార్క్ ఓవల్ 2018 జనవరి నాటికి 60 టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది వెస్టిండీస్‌లో కెల్లా అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో పాటు కరేబియన్‌లోని ఇతర ద్వీపాలు 2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు సహ-ఆతిథ్యమిచ్చాయి.

ప్రసిద్ధ క్రికెటరు బ్రియాన్ లారా, శాంటా క్రజ్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ప్రిన్స్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లేదా ప్రిన్స్ అని అతన్ని పిలుస్తూంటారు.

జాతీయ చిహ్నాలు

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగో జెండా

1962లో స్వాతంత్ర్య కమిటీ జెండాను ఎంపిక చేసింది. ఎరుపు, నలుపు, తెలుపు రంగులు ఇక్కడి ప్రజల ఆప్యాయతను, భూమి, నీటి గొప్పతనాన్నీ సూచిస్తాయి.

కోట్ ఆఫ్ ఆర్మ్స్

ట్రినిడాడ్ అండ్ టొబాగో 
ట్రినిడాడ్ అండ్ టొబాగో కోట్ ఆఫ్ ఆర్మ్స్

కోట్ ఆఫ్ ఆర్మ్స్‌ని ఇండిపెండెన్స్ కమిటీ రూపొందించింది. ఇందులో స్కార్లెట్ ఐబిస్ (ట్రినిడాడ్‌కి చెందినది), కోక్రికో (టోబాగోకు చెందినది), హమ్మింగ్‌బర్డ్‌లు ఉన్నాయి. షీల్డులో మూడు నౌకలు ఉంటాయి. ఇది ట్రినిటీని, కొలంబస్ ప్రయాణించిన మూడు నౌకలనూ సూచిస్తుంది.

మూలాలు

Tags:

ట్రినిడాడ్ అండ్ టొబాగో చరిత్రట్రినిడాడ్ అండ్ టొబాగో భౌగోళికంట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాట్రినిడాడ్ అండ్ టొబాగో ఆర్థిక వ్యవస్థట్రినిడాడ్ అండ్ టొబాగో మూలాలుట్రినిడాడ్ అండ్ టొబాగోగ్రెనడాద్వీప దేశంబార్బడోస్వెనుజులా

🔥 Trending searches on Wiki తెలుగు:

గౌడవాల్మీకిభారతదేశ ప్రధానమంత్రిఇంటి పేర్లుశ్రీదేవి (నటి)అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుద్విగు సమాసముఉపద్రష్ట సునీతపుష్పరాబర్ట్ ఓపెన్‌హైమర్భువనేశ్వర్ కుమార్తిథిరుక్మిణీ కళ్యాణంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభారతదేశంసంస్కృతంమంగళవారం (2023 సినిమా)నరసింహ శతకమువిజయనగర సామ్రాజ్యందాశరథి కృష్ణమాచార్యస్త్రీవాదంనరేంద్ర మోదీశ్రవణ నక్షత్రముగ్లోబల్ వార్మింగ్భారత రాజ్యాంగ ఆధికరణలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుఛత్రపతి శివాజీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఘట్టమనేని కృష్ణగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంభారత పార్లమెంట్సూర్య నమస్కారాలుజాతీయ ప్రజాస్వామ్య కూటమిమొదటి ప్రపంచ యుద్ధంవెలిచాల జగపతి రావునానార్థాలువిద్యయోనిద్రౌపది ముర్మునవరసాలువంగవీటి రంగాతమన్నా భాటియాకామసూత్రఅక్కినేని నాగార్జునవర్షం (సినిమా)మూలా నక్షత్రంస్త్రీశోభితా ధూళిపాళ్లఉష్ణోగ్రతగురువు (జ్యోతిషం)ఉగాదిసరోజినీ నాయుడువై.ఎస్.వివేకానందరెడ్డి హత్యశ్రీశైల క్షేత్రంఆటవెలదివిశాల్ కృష్ణపన్ను (ఆర్థిక వ్యవస్థ)కోల్‌కతా నైట్‌రైడర్స్జగ్జీవన్ రాంఆవర్తన పట్టికభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకొంపెల్ల మాధవీలతభారత జాతీయ మానవ హక్కుల కమిషన్తెలంగాణ ప్రభుత్వ పథకాలుఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాపి.వి.మిధున్ రెడ్డితేటగీతిద్వాదశ జ్యోతిర్లింగాలుసన్ రైజర్స్ హైదరాబాద్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఆటలమ్మఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునయన తారఫిరోజ్ గాంధీవరల్డ్ ఫేమస్ లవర్వృశ్చిక రాశిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి🡆 More