ఆఫ్రికా మహా సరస్సులు

ఆఫ్రికా మహా సరస్సులు తూర్పు ఆఫ్రికా చీలిక లోను, ఆ చుట్టుపక్కలా ఉన్న చీలిక లోయ సరస్సులలో భాగంగా వరుసగా ఉన్న సరస్సులు.

ఈ వరుసలో విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన విక్టోరియా సరస్సు కూడా ఉంది. ఘనపరిమాణం, లోతు ప్రకారం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సైన టాంగన్యికా సరస్సు, విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలోని ఎనిమిదో అతిపెద్ద మంచినీటి సరస్సైన మలావి సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత ఎడారి సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్కలీన్ సరస్సూ ఐన టర్కానా సరస్సు ఉన్నాయి. సమిష్టిగా, వాటిలో 31,000 ఘన కి.మీ నీరు ఉంది. ఇది బైకాల్ సరస్సు లేదా ఉత్తర అమెరికా గ్రేట్ లేక్స్ కంటే ఎక్కువ. ఈ మొత్తం, యావత్తు గ్రహం పైని ఘనీభవించని ఉపరితల మంచినీటిలో 25% ఉంటుంది. ఆఫ్రికాలోని పెద్ద చీలిక సరస్సులు గొప్ప జీవవైవిధ్యానికి పురాతన నిలయం. ప్రపంచంలోని 10% చేప జాతులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి.

ఆఫ్రికా మహా సరస్సులు
తూర్పు ఆఫ్రికా ఉపగ్రహ చిత్రంలో ఎడమ వైపున చీలిక సరస్సుల వరుస
తూర్పు ఆఫ్రికా ఉపగ్రహ చిత్రంలో ఎడమ వైపున చీలిక సరస్సుల వరుస
అక్షాంశ,రేఖాంశాలు8°00′00″S 35°00′00″E / 8.00000°S 35.00000°E / -8.00000; 35.00000
రకంమంచినీటి సరస్సులు
ఇందులో భాగంతూర్పు ఆఫ్రికా చీలిక
వెలుపలికి ప్రవాహంతెల్ల నైలు నది, కాంగో నది, షైర్ నది
ప్రవహించే దేశాలుబురుండి, కాంగో గణతంత్ర రిపబ్లిక్, ఇథియోపియా, కెన్యా, మలావి, మొజాంబిక్, రువాండా, జాంబియా, టాంజానియా, ఉగాండా
31,000 cubic kilometres (7,400 cu mi)
ఆఫ్రికా మహా సరస్సులు
ఆఫ్రికా మహా సరస్సుల వ్యవస్థ (నీలం రంగులో)
ఆఫ్రికా మహా సరస్సులు
తూర్పు ఆఫ్రికా చీలిక లేదా గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనే పేరున్న పెద్ద ప్రాంతపు మ్యాపు

ఆఫ్రికా మహాసరస్సుల ప్రాంతం లోని పరీవాహక దేశాలలో బురుండి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, కెన్యా, మలావి, మొజాంబిక్, రువాండా, జాంబియా, టాంజానియా, ఉగాండా లు ఉన్నాయి.

సరస్సులు, పారుదల బేసిన్లు

డ్రైనేజీ బేసిన్ ను బట్టి సమూహం చేసిన ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ జాబితాలలో కిందివి ఉంటాయి. ఆఫ్రికా మహా సరస్సులలో భాగంగా పరిగణించబడే సరస్సుల ఖచ్చితమైన సంఖ్య జాబితాను బట్టి మారుతూ ఉంటుంది. చీలిక లోయలలో ఉండే చిన్న సరస్సులు కూడా వీటిలో ఉండవచ్చు. ప్రత్యేకించి అవి పెద్ద సరస్సుల డ్రైనేజీ బేసిన్‌లో భాగంగా ఉంటే.

వైట్ నైలులోకి ప్రవహించే సరస్సులు

  • విక్టోరియా సరస్సు
  • క్యోగా సరస్సు (గ్రేట్ లేక్స్ వ్యవస్థలో భాగం కానీ అది "గొప్ప సరస్సు" కాదు)
  • ఆల్బర్ట్ సరస్సు
  • ఎడ్వర్డ్ సరస్సు

కాంగో నదిలోకి ప్రవహించే సరస్సులు

  • టాంగన్యికా సరస్సు
  • కివు సరస్సు
  • మ్వేరు సరస్సు

జాంబేజీలోకి ప్రవహించే సరస్సు

  • మలావి సరస్సు, షైర్ నది ద్వారా

మూసి ఉన్న బేసిన్లతో సరస్సులు

  • తుర్కానా సరస్సు
  • రుక్వా సరస్సు

ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతం

గ్రేట్ లేక్స్ తీరప్రాంతంలో పది దేశాలున్నాయి: బురుండి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, కెన్యా, మలావి, మొజాంబిక్, రువాండా, టాంజానియా, ఉగాండా, జాంబియా . interlacustrine ("సరస్సుల మధ్య") అనే విశేషణం, ఈ ప్రాంతాన్ని సూచిస్తుంది. మరింత ప్రత్యేకంగా, సరస్సుల సరిహద్దులో ఉన్న దేశాలు లేదా ప్రాంతాన్ని సూచిస్తుంది.

ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతంలో స్వాహిలి భాష సాధారణంగా మాట్లాడే భాష. ఇది ఈ ప్రాంతంలోని టాంజానియా, కెన్యా, ఉగాండా, రువాండా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లలో జాతీయ లేదా అధికారిక భాషగా కూడా ఉంది.


ఇక్కడి అధిక జనాభా - 10.7 కోట్ల మంది ప్రజలు ఉంటారని అంచనా, ఈ ప్రాంతంలో వ్యవసాయ మిగులుల కారణంగా, ఈ ప్రాంతం అనేక చిన్న దేశాలుగా ఏర్పడింది. ఈ రాచరికాలలో అత్యంత శక్తివంతమైనవి బుగాండా, బున్యోరో, కరాగ్వే, రువాండా, బురుండి.


నైలు నదికి మూలం ఉండడం, నైలు, కాంగో, జాంబేజీ నదుల మధ్య పరీవాహక ప్రాంతం అవడం వలన చాలా కాలంగా ఈ ప్రాంతంపై యూరోపియన్లకు ఆసక్తి ఉంది. ఈ ప్రాంతానికి వచ్చిన మొదటి యూరోపియన్లు క్రైస్తవ మిషనరీలు. వారు స్థానికులను మార్చడంలో కొద్దిపాటి విజయాన్నే పొందగలిగారు. అయితే వారు ఈ ప్రాంతంలో వలసరాజ్యాల ఏర్పాటుకు దారులు తెరిచారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పెరిగిన పరిచయం ఈ ప్రాంతంలో మానవులను, పశువులనూ ప్రభావితం చేసే వినాశకరమైన అంటువ్యాధులకు దారితీసింది.

స్వాతంత్ర్యం తర్వాత గొప్ప సంభావ్యత కలిగిన ప్రాంతంగా పరిగణించబడుతున్నప్పటికీ, గ్రేట్ లేక్స్ ప్రాంతం 21వ శతాబ్దం ప్రారంభంలో నాలుగు దశాబ్దాల పాటు (సుమారు 1980 - 2020) అంతర్యుద్ధాలతో, సంఘర్షణలతో బాధపడింది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్థులను స్వాగతించి, వారికి సహాయం చేఇనందుకు టాంజానియాను యునైటెడ్ నేషన్స్ హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్ ప్రశంసించారు.

వాతావరణం

ఎత్తైన ప్రాంతాలు సాపేక్షంగా చల్లగా ఉంటాయి, సగటు ఉష్ణోగ్రతలు 17 °C (63 °F) - 19 °C (66 °F) మధ్య ఉంటాయి. సమృద్ధిగా వర్షపాతం ఉంటుంది. ప్రధాన పారుదల బేసిన్లలో కాంగో-జైర్, నైలు, జాంబేజీ నదులు ఉన్నాయి. ఇవి అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం. హిందూ మహాసముద్రంలోకి ప్రవహిస్తాయి.

కాంగో-జైర్ బేసిన్‌లోని లోతట్టు ప్రాంతాలలో అడవులు ప్రబలంగా ఉన్నాయి, అయితే గడ్డి భూములు, సవన్నాలు (పొడి గడ్డి భూములు) దక్షిణ, తూర్పు ఎత్తైన ప్రాంతాలలో సర్వసాధారణంగా ఉంటాయి. లోతట్టు ప్రాంతాలలో సగటు ఉష్ణోగ్రతలు 35 °C (95 °F) ఉంటుంది. తుర్కానా సరస్సు చుట్టూ, వాతావరణం వేడిగా, చాలా పొడిగా ఉంటుంది. అక్టోబరులో కొద్దిపాటి వర్షాలుండగా, ఏప్రిల్ నుండి మే వరకు ఎక్కువ వర్షాకాలం ఉంటుంది.

భూగర్భ శాస్త్రం

1.2 కోట్ల సంవత్సరాల క్రితం వరకు, భూమధ్యరేఖ పీఠభూమి ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న జలాలు పశ్చిమాన కాంగో నది వ్యవస్థలోకి లేదా తూర్పున హిందూ మహాసముద్రంలోకి ప్రవహించాయి. మహా చీలిక లోయ ఏర్పడటంతో ఇది మారింది. రెండు టెక్టోనిక్ ప్లేట్‌లు విడిపోవడం కారణంగా భూమి పైపెంకులో ఏర్పడే బలహీనమైన ప్రదేశమే చీలిక. తరచుగా గ్రాబెన్ లేదా ట్రఫ్‌తో కలిసి సరస్సు నీరు సేకరించవచ్చు. తూర్పు ఆఫ్రికా, మాంటిల్‌లోని ప్రవాహాల ద్వారా ప్రేరేపించబడినప్పుడు, మిగిలిన ఆఫ్రికా నుండి విడిపోయి, ఈశాన్యానికి వెళ్లినప్పుడు ఈ చీలిక ప్రారంభమైంది. ఇప్పుడు ఉత్తరాన ప్రవహించే నీటితో నిండిన భౌగోళిక ఉద్ధరణల ఫలితంగా ఏర్పడిన బేసిన్లు.

విక్టోరియా సరస్సు వాస్తవానికి చీలిక లోయలో లేదు. ఇది తూర్పు, పశ్చిమ చీలికల మధ్యనున్న పల్లపు ప్రాంతంలో ఉంది. చీలికలు రెండు వైపులనూ పైకి లేపడం వలన ఇది ఏర్పడింది.

ఆర్కియాలజీ

సుమారు 20, 30లక్షల సంవత్సరాల క్రితం, తుర్కానా సరస్సు ఇంతకంటే పెద్దదిగా ఉండేది, ఈ ప్రాంతం మరింత సారవంతంగా ఉండేది. ఇది తొలి హోమినిడ్‌లకు కేంద్రంగా ఉండేది. రిచర్డ్ లీకీ ఈ ప్రాంతంలో అనేక మానవశాస్త్ర త్రవ్వకాలను జరిపాడు. ఇక్కడ అనేక ముఖ్యమైన హోమినిన్ అవశేషాలు లభించాయి. 1972 లో, 20 లక్షల సంవత్సరాల నాటి స్కల్-1470 ను కనుగొన్నారు. మొదట దీనిని హోమో హాబిలిస్ అని భావించారు. కానీ, ఆ తరువాత కొంతమంది మానవ శాస్త్రవేత్తలు దీనిని కొత్త జాతికి కేటాయిస్తూం దీనికి హోమో రుడాల్ఫెన్సిస్ అని సరస్సు పేరే పెట్టారు (గతంలో దీన్ని లేక్ రుడాల్ఫ్ అని పిలిచేవారు). 1984 లో హోమో ఎరెక్టస్ బాలుడి దాదాపు పూర్తి అస్థిపంజరాన్ని కనుగిన్నారు. దీనికి తుర్కానా బాలుడు అని పేరు పెట్టారు. 1999 లో, అక్కడ 35,00,000 సంవత్సరాల పురాతనమైన పుర్రెను కనుగొన్నారు. దానికి కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ అని పేరు పెట్టారు. దీనికి అర్థం "చదునైన ముఖం కలిగిన కెన్యా వ్యక్తి".

ఆర్థిక వ్యవస్థ

చేపలు పట్టడం ఈ ప్రాంతంలోని ప్రజల ప్రధాన జీవనోపాధి. ఉగాండా సరిహద్దుల్లో నాలుగు మహా సరుస్సులున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపల ఉత్పత్తిదారులలో ఒకటి. ఇక్కడి వాతావరణం, ఎత్తైన ప్రాంతాలలో ఉన్న అగ్నిపర్వత నేలలు పెద్దయెత్తున వ్యవసాయానికి తోడ్పడుతున్నాయి.

మహా సరస్సుల ప్రాంతం లోని దేశాల ఆర్థిక వ్యవస్థలు విభిన్న రకాలుగా ఉన్నాయి. ఇవి అభివృద్ధిలో వివిధ దశల్లో ఉన్నాయి. GDP వాస్తవ వృద్ధి రేటు బురుండిలో 1.8 శాతం నుండి DRCలో 4.4 వరకు ఉంది. తలసరి దేశీయోత్పత్తి కాంగో, బురుండిలలో $600, ఉగాండాలో $800 లుగా ఉంది.

మూలాలు

Tags:

ఆఫ్రికా మహా సరస్సులు సరస్సులు, పారుదల బేసిన్లుఆఫ్రికా మహా సరస్సులు ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతంఆఫ్రికా మహా సరస్సులు వాతావరణంఆఫ్రికా మహా సరస్సులు భూగర్భ శాస్త్రంఆఫ్రికా మహా సరస్సులు ఆర్కియాలజీఆఫ్రికా మహా సరస్సులు ఆర్థిక వ్యవస్థఆఫ్రికా మహా సరస్సులు మూలాలుఆఫ్రికా మహా సరస్సులుతూర్పు ఆఫ్రికా చీలికబైకల్ సరస్సుమహా సరస్సులువిక్టోరియా సరస్సుసరస్సు

🔥 Trending searches on Wiki తెలుగు:

అల్లు అర్జున్గాయత్రీ మంత్రంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్శాతవాహనులుసుందర కాండఉపద్రష్ట సునీతహిందూధర్మంపుచ్చలపల్లి సుందరయ్యమహాభాగవతంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకొంపెల్ల మాధవీలతకడియం కావ్యమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిప్రకృతి - వికృతిదివ్యవాణివై.యస్. రాజశేఖరరెడ్డిఅల్లూరి సీతారామరాజుకె.ఎల్. రాహుల్కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)ఎస్. జానకిసజ్జా తేజతెలుగు వికీపీడియాకలబందతీన్మార్ సావిత్రి (జ్యోతి)గరుత్మంతుడుకన్యకా పరమేశ్వరిమీనరాశిi243jయానిమల్ (2023 సినిమా)హను మాన్అనిల్ జాదవ్కస్తూరి రంగ రంగా (పాట)బుధుడు (జ్యోతిషం)ఓటుశివుడుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికార్ల్ మార్క్స్రెండవ ప్రపంచ యుద్ధంఝాన్సీ లక్ష్మీబాయియేసు శిష్యులుమోదుగకాకతీయులుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాజనసేన పార్టీజ్యోతిషంవికీపీడియామలబద్దకంలలిత కళలురైతుబంధు పథకంఉపనిషత్తుస్త్రీవాదంఎనుముల రేవంత్ రెడ్డిపక్షవాతంభారత జాతీయగీతంఅక్షయ తృతీయప్రధాన సంఖ్యఫ్యామిలీ స్టార్కుంభరాశిపాములపర్తి వెంకట నరసింహారావుఓం నమో వేంకటేశాయభూమి వాతావరణంఇజ్రాయిల్అన్నమయ్యరాజ్‌మాఅక్కినేని నాగ చైతన్యలావు శ్రీకృష్ణ దేవరాయలువై.యస్.అవినాష్‌రెడ్డిరావణుడుపురాణాలుపూర్వాభాద్ర నక్షత్రముతెలంగాణ చరిత్రభూమిసత్య సాయి బాబాబాసర ట్రిపుల్ ఐటిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభారత రాజ్యాంగ ఆధికరణలుసచిన్ టెండుల్కర్వంగవీటి రాధాకృష్ణఆర్.నారాయణమూర్తి🡆 More