మానవ శాస్త్రం

మానవ శాస్త్రము లేదా మానుష శాస్త్రము (Anthropology) మానవజాతి పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం..

(గ్రీక్ భాష లో "Anthropos-" అంటే "మనిషి", "-logy" అంటే "శాస్త్రము" అని అర్థం).

మానవ శాస్త్రం

మానవ శాస్త్రము ఒక జీవ శాస్త్రం మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య చారిత్రాత్మకంగా ఏర్పడిన భేదాలను కూడ తెలిపే సాంఘిక శాస్త్రం కూడా. మానవ శాస్త్రజ్ఞులు అనేక ప్రాంతాలలో పరిశోధనలు చేసి ప్రజలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారో, పూర్వం ఎలా జీవించేవారో పురావస్తు శాస్త్రము (Archealogy) ప్రకారంగా అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనాలు ఆధునిక నగరాల నుంచి పల్లెటూర్లు, అడవిలో నివసించే తెగల దాక విస్తరిస్తూంతాయి. వివిధ సమూహాల్లో జనం సమయాన్ని, స్థలాన్ని, జీవన శైలిని ఎలా అవగాహన చేసుకున్నారో, ఈ అధ్యయనాలు పరిశీలిస్తాయి.

అనువర్తిత మానవ శాస్త్రం (Applied Anthrology) అనే విభాగం సైన్సు ద్వారా తెలుసుకున్న విజ్ఞానాన్ని ప్రజలకు ఎలా ఉపయోగించాలో తెలుపుతుంది. దక్షిణ అమెరికా లో ఉత్తమమైన పురాతన వ్యవసాయ ప్రక్రియలను అధ్యయనం చేసరుద్ధానం చేయదం ఈ మధ్య ఈ శాస్త్రం సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరుగున పడిపోతున్న ప్రాచీన భాషలను నేర్చుకునే విధానాలను ఆ యా భావి తరాల వారికి అంద జేయడం కూడ ఈ విభాగం కిందికే వస్తుంది.

మానవ శాస్త్రంలో ఇతర విభాగాలు

  • పురావస్తు శాస్త్రం - పూర్వ కాలం లో ప్రజలు ఎలా బ్రతికారో అధ్యయనం చేసే విభాగం. ఇది ఆ యా నాగరికతల పనిముట్లు, పాత్రలు ఇతర వస్తువుల ఆధారంగా ఈ పరిశోధన చేస్తుంది.
  • వివిధ ప్రాంతాలలోని పరిసరాలకు అనుగుణంగా మానవాళి మనుగడ, శరీర భౌతిక లక్షణాలు కాలక్రమేణా లో ఎలా మార్పు చెందాయో పరిశీలించే శాస్త్రమే భౌతిక మానవ శాస్త్రం (Physical Anthropology). మానవాళితో పాటుగా భౌతిక మానవ శాస్త్రజ్ఞులు జీవ పరిణామం లో పూర్వీకులైన వానర జాతులను కూడ పరిశోధిస్తారు.
  • భాషాపర మానవశాస్త్రం (Linguistic Anthropology) - నాగరికత పరిణామాన్ని భాష కోణంలోంచి పరిశీలిస్తుంది. పదాలు, వాటి అర్థాల కాలానుగత మార్పులు, పరిసర భాషల ప్రభావము వంటి విషయాలే కాక భాష, పదాల ఆధారంగా ప్రజల ఆలోచనాసరళి లో పరిణామాన్ని కూడ ఈ శాస్త్ర పరిధిలో అధ్యయనం చేస్తారు.
  • జనుల ప్రస్తుత జీవన విధానం, కాలానుగుణంగా కలిగిన మార్పులు, దేశకాల పరిస్థితులననుసరించి వారు వాడిన పనిముట్లు, వారి ఆహారపుటలవాట్లు ఇతరత్రా విషయాలను అర్థంచేసుకునేందుకు సాంస్కృతిక మానవ శాస్త్రం (Cultural Anthropology) ప్రయత్నిస్తుంది. ఈ విభాగం సామాజిక శాస్త్రం (Sociology), సాంఘిక మనస్తత్వ శాస్త్రము(Social Psychology) లకు దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది.

చాలామట్టుకు మానవ శాస్త్రజ్ఞులు మొదట అన్ని విభాగాలలోనూ ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించి, పోను పోను ఒకటి రెండు విభాగాలలో నైపుణ్యం సాఢిస్తారు.

జీవ మానవ శాస్త్రం (Bio-Anthropology)

ఇవి కాక కొన్ని సందర్భాలలో జీవ మానవశాస్త్రాన్ని ప్రత్యేక విభాగంగానో, జీవ శాస్త్రంలో భాగంగానో కూడ అధ్యయనం చేయటం పరిపాటి.

Tags:

గ్రీక్ భాషమనిషిశాస్త్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్. రాజశేఖరరెడ్డికాలేయంజనసేన పార్టీతీన్మార్ సావిత్రి (జ్యోతి)మర్రి జనార్దన్ రెడ్డిజాంబవంతుడుఅమెజాన్ ప్రైమ్ వీడియోచాకలివిజయనగర సామ్రాజ్యంకన్యాదానంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరామాయణంలో స్త్రీ పాత్రలుతూర్పు చాళుక్యులుదృశ్యం 2దిల్ రాజుపూజా హెగ్డేఎస్త‌ర్ నోరోన్హాజీలకర్రఅర్జునుడుసత్యయుగంఆయాసంపల్లెల్లో కులవృత్తులుగరుత్మంతుడుకేంద్రపాలిత ప్రాంతంవర్షంనువ్వులుశుభ్‌మ‌న్ గిల్దీపావళిరామాయణం (సినిమా)అరటిశ్రీశ్రీప్రకృతి - వికృతియోగాభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకిలారి ఆనంద్ పాల్ఒంటెఋగ్వేదంసీతారామ కళ్యాణం (1961 సినిమా)వ్యతిరేక పదాల జాబితాఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఇన్‌స్టాగ్రామ్తెలుగు సినిమాలు డ, ఢచిత్త నక్షత్రముమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఅంగచూషణఉత్తరాభాద్ర నక్షత్రమునరేంద్ర మోదీమౌర్య సామ్రాజ్యంనక్సలైటుభారతదేశ ప్రధానమంత్రిహనుమంతుడుతెలుగు సినిమాలు 2023తొలిప్రేమఇంద్రజఆల్ఫోన్సో మామిడిఅగ్నికులక్షత్రియులులేపాక్షికొణతాల రామకృష్ణపాములపర్తి వెంకట నరసింహారావుకౌసల్యవినుకొండఇందుకూరి సునీల్ వర్మశివసాగర్ (కవి)తెలుగు సంవత్సరాలుబండారు సత్యనారాయణ మూర్తిభీమా (2024 సినిమా)గోత్రాలు జాబితాశాసనసభ సభ్యుడుకుటుంబంఅయోధ్య రామమందిరంగుప్త సామ్రాజ్యంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఅభిరామిక్షత్రియులునవగ్రహాలు జ్యోతిషంమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంగాయత్రీ మంత్రంకనకదుర్గ ఆలయం🡆 More