అనితా దేశాయి

అనితా మజుందార్ దేశాయి భారతీయ నవలా రచయిత్రి, విశ్వవిద్యాలయ ఆచార్యులు.

1937జూన్ 24న జన్మించిన అనితా మజుందార్ రచయిత్రిగా మూడు పర్యాయాలు బుకర్ ప్రైజ్ కు నామినేట్ అయ్యింది. 1978లో ఫైర్ అన్ ది మౌంటెన్ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. ద విలేజ్ బై ది సీ రచనకు గానూ ఆమె బ్రిటీష్ గార్డియన్ ప్రైజ్‌ను పొందింది.

అనితా దేశాయి
పుట్టిన తేదీ, స్థలంఅనితా మజుందార్
(1937-06-24) 1937 జూన్ 24 (వయసు 86)
ముస్సోరీ, భారతదేశం
వృత్తిరచయిత, ఆచార్యులు
జాతీయతభారతీయురాలు
పూర్వవిద్యార్థిఢిల్లీ విశ్వవిద్యాలయం
కాలం1963–వర్తమానం
రచనా రంగంకాల్పానిక
సంతానంకిరణ్ దేశాయ్

కుటుంబ నేపథ్యం

అనితా మజుందార్ ఉత్తర భారతదేశంలోని నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రడన్ జిల్లాలోని ముస్సూరీలో జన్మించింది. టోనీ నైమ్‌, డి.ఎన్‌.మజుందార్ ఈమె తల్లిదండ్రులు. తల్లి జర్మన్ జాతీయురాలు, తండ్రి బెంగాళీ వ్యాపారవేత్త. ఇంట్లో తల్లిదండ్రుల భాషలు నేర్చుకుంటూ పెరిగింది. ఆమె సాహితీక్షేత్రానికి సాధనమైన ఆంగ్లభాషను పాఠశాల స్థాయిలో నేర్చుకుంది. తరువాత ఉర్దూ, హిందీ భాషలూ అలవడినవి. అనిత తన ఏడవ యేట నుండే రచనలు చేయడం ప్రారంభించింది. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే ఆమె రాసిన కథ అచ్చైంది.

ఢిల్లీలోని క్వీన్ మేరీ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1957లో ఆంగ్లసాహిత్యం ఐచ్చికాంశంగా పట్టభద్రురాలైంది. అదే సంవత్సరం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్టర్, రచయిత అయిన అశ్విన్ దేశాయిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు. బుకర్ ప్రైజ్ విజేత నవలా రచయిత అయిన కిరణ్ దేశాయి ఆ నలుగురిలో ఒకరు. అనిత వారాంతాలలో తన పిల్లలను అలీబాగ్ సమీపాన ఉన్న తుల్ కు వెళ్ళేది. అక్కడి అనుభవాలు, సంగతుల ఆధారంగానే ఆమె ది విలేజ్ బై ది సీ పుస్తకాన్ని రచించింది. ఈ పుస్తకం 1983లో గార్డియన్ చిల్డ్రన్స్ ఫిక్షన్ ప్రైజ్‌ను గెలుచుకుంది. బ్రిటీష్ బాల సాహిత్య సృజనకారులు ఈ పుస్తకానికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా ప్రకటించారు.

సాహితీ ప్రస్థానం

1963లో అనితా దేశాయి తన మొదటి నవల క్రై ది పికాక్ వెలువరించింది. 1980లో క్లియర్ లైట్ ఆఫ్ డే వెలువరించింది.ఇది ఆమె జీవన స్మృతుల ఆధారంగా రాయబడింది. 1984లో ఇన్ కస్టడీ నవలను ప్రచురించింది. ఇది ఒక ఉర్దూ రచయిత చరమాంక జీవితాన్ని ప్రతిబింబించిన రచన. 1993లో అనితా దేశాయి మసాచుసెట్ సాంకేతిక విద్యాలయంలో క్రియేటివ్ విభాగంలో అధ్యాపకురాలిగా చేరింది ఇటీవల తన కథలను ద ఆర్టిస్ట్ ఆఫ్ డిసప్పీయరెన్స్ పేరుతో కథాసంకలనంగా 2011లో వెలువరించింది.

వృత్తి జీవితం

అనితా దేశాయి మౌంట్ హోల్‌యోక్ కళాశాలలో, బార్చ్ కళాశాలలో, స్మిత్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. రాయల్ సొసైటీ (సాహిత్యం) ఫెలోగా గౌరవాన్ని అందుకుంది.

దస్త్రం:The Zigzag Way.jpg
ది జిగ్‌జాగ్ వే

రచనలు

  1. ది ఆర్టిస్ట్ ఆఫ్ డిసప్పీయరెన్స్ (2011)
  2. ది జిగ్‌జాగ్ వే (2004)
  3. డైమండ్ డస్ట్ అండ్ అదర్ స్టోరీస్ (2000)
  4. ఫాస్టింగ్, ఫీస్టింగ్ (1999)
  5. జర్నీ టూ ఇథాకా (1995)
  6. బామ్‌గార్నర్స్ బాంబే (1988)
  7. ఇన్ కస్టడీ (1984)
  8. ద విలేజ్ బై ది సీ (1982)
  9. క్లియర్ లైట్ ఆఫ్ డే (1980)
  10. గేమ్స్ ఎట్ ట్విలైట్ (1978)
  11. వేర్ షల్ వి గో దిస్ సమ్మర్? (1975)
  12. ద పికాక్ గార్డెన్ (1974)
  13. బై బై బ్లాక్ బర్డ్ (1971)
  14. వాయిసెస్ ఇన్ ది సిటీ (1965)
  15. క్రై, ది పికాక్ (1963)

చలన చిత్రంగా నవల

అనితా దేశాయి రచించిన ఇన్ కస్టడీ నవల ఆధారంగా 1993లో అదే పేరుతో ఆంగ్లంలో చలనచిత్రం వచ్చింది. దీనిని మర్చంట్ ఐవరీ ప్రోడక్షన్స్ నిర్మించింది. షారుక్ హుస్సేన్ చిత్రానువాదం చేయగా, ఇస్మాయిల్ మర్చంట్ దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది. ఈ చిత్రంలో శశి కపూర్, షబనా అజ్మీ, ఓంపురి తదితరులు నటించారు.

అవార్డులు

  • 1978 –ఫైర్ ఆన్ ది మౌంటెన్ రచనకు వినిఫ్రెడ్ హోల్ట్‌బై స్మారక పురస్కారం.
  • 1978 – ఫైర్ ఆన్ ది మౌంటెన్ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు.
  • 1980 – కాల్పనికా సాహిత్యంలో (క్లియర్ లైట్ ఆఫ్ డే రచన) బుకర్ ప్రైజుకు నామినేట్
  • 1983 – ద విలేజ్ బై ది సీ రచనకు గార్డియన్ చిల్డ్రన్స్ ఫిక్షన్ పురస్కారం
  • 1984 – కాల్పనికా సాహిత్యంలో (ఇన్ కస్టడీ రచన) బుకర్ ప్రైజుకు నామినేట్
  • 1993 – నైల్ గన్ పురస్కారం
  • 1999 – కాల్పనికా సాహిత్యంలో (ఫాస్టింగ్, ఫీస్టింగ్ రచన) బుకర్ ప్రైజుకు నామినేట్
  • 2000 – అల్బెర్టో మొరావియా సాహిత్య పురస్కారం (ఇటలీ)
  • 2003 – రాయల్ సొసైటీ సాహిత్య విభాగం నుండి బెన్సన్ పతకం
  • 2007 - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • 2014 - పద్మభూషణ్

మూలాలు

అనితా దేశాయి 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

అనితా దేశాయి కుటుంబ నేపథ్యంఅనితా దేశాయి సాహితీ ప్రస్థానంఅనితా దేశాయి వృత్తి జీవితంఅనితా దేశాయి రచనలుఅనితా దేశాయి చలన చిత్రంగా నవలఅనితా దేశాయి అవార్డులుఅనితా దేశాయి మూలాలుఅనితా దేశాయి మూలంఅనితా దేశాయి వెలుపలి లంకెలుఅనితా దేశాయి19371978జూన్ 24బుకర్ బహుమతి

🔥 Trending searches on Wiki తెలుగు:

మర్రి రాజశేఖర్‌రెడ్డివిశ్వక్ సేన్పద్మశాలీలుఇన్‌స్టాగ్రామ్కల్వకుంట్ల కవితభారతీయ తపాలా వ్యవస్థఎయిడ్స్పాల కూరవిద్యుత్తురక్షకుడుచందనా దీప్తి (ఐపీఎస్‌)గుండెయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారత జాతీయగీతండెన్మార్క్పెరుగువన్ ఇండియావాల్మీకిదూదేకులవేంకటేశ్వరుడురూప మాగంటిబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలురాశిపన్నునగరి శాసనసభ నియోజకవర్గంగద్వాల విజయలక్ష్మిసీ.ఎం.రమేష్రంగస్థలం (సినిమా)సూర్య (నటుడు)జ్యోతిషంజయప్రదకంప్యూటరుకాకతీయుల శాసనాలుఎనుముల రేవంత్ రెడ్డిభారత జాతీయ కాంగ్రెస్నవగ్రహాలుకడియం శ్రీహరిపరకాల ప్రభాకర్ఫిదాజో బైడెన్వరలక్ష్మి శరత్ కుమార్గౌతమ్ మీనన్నాని (నటుడు)ఈనాడుఆదిత్య హృదయంసత్యనారాయణ వ్రతంసూర్యవంశం (సినిమా)దశరథుడుకిరణజన్య సంయోగ క్రియరమ్యకృష్ణగజేంద్ర మోక్షంధనిష్ఠ నక్షత్రమువినుకొండకామాక్షి భాస్కర్లతెలుగుదేశం పార్టీభారత జాతీయ ఎస్టీ కమిషన్రక్త పింజరిఅనుష్క శర్మగోదావరిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకాజల్ అగర్వాల్ప్రియాంకా అరుళ్ మోహన్మార్చి 27గోత్రాలు జాబితాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసూర్యుడుకడియం కావ్యఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌జాతిరత్నాలు (2021 సినిమా)వాతావరణంనాయీ బ్రాహ్మణులుసుహాసిని (జూనియర్)సెక్స్ (అయోమయ నివృత్తి)అర్జునుడుదక్షిణామూర్తి ఆలయంమోదుగచతుర్వేదాలుఋగ్వేదంగంగా నది🡆 More