2023 నూతన సంవత్సరం ఆదివారంతో ప్రారంభం అవుతుంది. 2023 అనేది 3వ సహస్రాబ్ది, 21వ శతాబ్దపు 23వ సంవత్సరం. 2020 దశాబ్దపు సంవత్సరం.
సంఘటనలు
- జనవరి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మహబూబాబాద్, కొత్తగూడెం పట్టణాలలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయాలు ప్రారంభించబడ్డాయి.
- జనవరి 25: 2022వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 106 మందికి (పద్మ విభూషణ్ పురస్కారం - 6, పద్మభూషణ్ పురస్కారం - 09, పద్మశ్రీ పురస్కారం - 91) పద్మ పురస్కారాలు ప్రకటించబడ్డాయి.
- ఫిబ్రవరి 1: 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
- ఫిబ్రవరి 3: తెలంగాణ శాసనసభ బడ్జెట్ (2023-24) సమావేశాలు ప్రారంభమై, ఫిబ్రవరి 12 వరకు కొనసాగాయి.
- ఫిబ్రవరి 6: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
- ఫిబ్రవరి 6 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 41,000 మందికి పైగా మరణించారు. 120,000 మందికిపైగా గాయపడ్డారు.
- ఫిబ్రవరి 9: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్, లుంబినీ పార్క్ సమీపంలో ప్రారంభించబడింది.
- ఫిబ్రవరి 11: హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.
- ఫిబ్రవరి 15: కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, సుమారు 850 ఎకరాల్లో దేవాలయ అభివృద్ధి చేయడంకోసం 600 కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించాడు.
- ఫిబ్రవరి 24: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో బయో ఏషియా సదస్సు-2023 ప్రారంభమై, ఫిబ్రవరి 26న ముగిసింది.
- ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు.
- ఏప్రిల్ 30: హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంను ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించాడు.
- మే 10: కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు ప్రకటించగా, 224 నియోజకవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 136 చోట్ల గెలుపొందింది. మే 20న కర్నాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేశాడు.
- జూన్ 2: ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 294 మంది మరణించారు. 1,175 మంది గాయపడ్డారు.
- జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడి, జూన్ 22న ముగిసాయి.
- జూన్ 4: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నిర్మల్ పట్టణంలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
- జూన్ 6: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నాగర్‌కర్నూల్ పట్టణంలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
- జూన్ 6: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర: రష్యా నియంత్రణలో ఉన్న ఖేర్సన్ ప్రాంతంలోని నోవా కఖోవ్కా ఆనకట్ట ధ్వంసమైంది, ఈ ప్రాంతాన్ని వినాశకరమైన వరదలతో ముప్పుతిప్పలు పెట్టింది.
- జూన్ 9: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మంచిర్యాల పట్టణంలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
- జూన్ 11: మార్చిలో తైవాన్‌తో సంబంధాలను తెంచుకున్న తర్వాత హోండురాస్ తన మొదటి రాయబార కార్యాలయాన్ని చైనాలోని బీజింగ్‌లో ప్రారంభించింది.
- జూన్ 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా గద్వాల పట్టణంలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
- జూన్ 13: నైజీరియాలోని క్వారా స్టేట్‌లోని నైజర్ నదిపై పెళ్లి పడవ బోల్తా పడడంతో కనీసం 106 మంది మరణించారు.
- జూన్ 14: స్పెర్మ్ లేదా గుడ్డు కణాల అవసరం లేకుండా స్టెమ్ సెల్స్ నుండి మొదటి కృత్రిమ మానవ పిండాన్ని సృష్టించినట్లు శాస్త్రవేత్తలు నివేదించారు.
- జూన్ 14: పెలోపొన్నీస్ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో కనీసం 82 మంది మరణించారు, 500 గల్లంతయ్యారు.
- జూన్ 16: ఉగాండాలో, జిహాదిస్ట్ గ్రూప్ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ మ్పాండ్వేలోని ఒక పాఠశాలలో 42 మందిని చంపింది.
- జూన్ 18: టైటాన్ సబ్మెర్సిబుల్ పేలుడు: టైటానిక్ శిథిలాలను అన్వేషిస్తున్న లోతైన సముద్ర జలాంతర్గామి అయిన టైటాన్‌లోని ఐదుగురు సిబ్బంది, ఓడ విపత్తు పేలుడు కారణంగా మరణించారు.
- జూన్ 20: హోండురాస్‌లోని తెగుసిగల్పా సమీపంలోని మహిళా జైలులో MS-13, బార్రియో 18 ముఠా సభ్యుల మధ్య జరిగిన అల్లర్లలో కనీసం 46 మంది మరణించారు.
- జూన్ 21: అట్లాంటిక్‌లోని స్పానిష్ కానరీ దీవుల తీరంలో వలస డింగీ మునిగిపోవడంతో కనీసం 35 మంది మరణించారు.
- జూన్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది.
- జూన్ 23: ఉక్రెయిన్‌పై రష్యా దాడి: యెవ్జెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నెర్ గ్రూప్, రష్యా సైన్యంతో సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించిన శాంతి ఒప్పందం తర్వాత, మరుసటి రోజు ఉపసంహరించుకునే ముందు రోస్టోవ్-ఆన్-డాన్ నగరాన్ని, వొరోనెజ్ ఒబ్లాస్ట్‌లోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకుంది.
- జూన్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఆసిఫాబాద్ పట్టణంలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
- జూలై 20: 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రారంభమయ్యాయి.
- ఆగస్టు 1 – గ్లోబల్ వార్మింగ్: ప్రపంచ మహాసముద్రాలు 2016లో మునుపటి రికార్డును అధిగమించి 20.96 °C యొక్క కొత్త రికార్డు అత్యధిక ఉష్ణోగ్రతను చేరుకున్నాయి. జూలై కూడా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు గణనీయమైన మార్జిన్‌తో నమోదు చేయబడిన అత్యంత వేడి నెలగా నిర్ధారించబడింది ( 0.3 °C).
- ఆగస్టు 4: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమై, ఆగస్టు 6న ముగిసాయి.
- ఆగస్టు 20: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సూర్యాపేట పట్టణంలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
- ఆగస్టు 23: భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-3, చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి వ్యోమనౌకగా నిలిచింది.
- ఆగస్టు 23: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మెదక్ పట్టణంలో కలెక్టరేట్ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
- డిసెంబరు: తెలంగాణ శాసనసభ ఎన్నికలు
మరణాలు
- జనవరి 2: ఎం. శ్రీధర్ రెడ్డి, రాజకీయ నాయకుడు, కవి, రచయిత (జ. 1945)
- జనవరి 2: రమాకుమారి దేవి, జయపురం ఆఖరి మహారాణి, మాజీ శాసనసభ్యురాలు (జ. 1930)
- జనవరి 5: రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (జ. 1946)
- జనవరి 6: సునీల్ బాబు, సినిమా ఆర్ట్ డైరెక్టర్
- జనవరి 9: వసంత్ కుమార్ బావ, విశ్రాంత ఐఏఎస్, చరిత్రకారుడు, రచయిత.
- జనవరి 12: పావులూరి కృష్ణ చౌదరి, హోమియోపతి వైద్య నిపుణుడు (జ. 1926)
- జనవరి 12:శరద్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి
- జనవరి 14: సంతోఖ్ సింగ్ చౌదరి, రాజకీయ నాయకుడు (జ. 1946)
- జనవరి 15: ముకర్రం జా, నిజాం వారసుడు (జ. 1933)
- జనవరి 20: ఆరుమిల్లి సూర్యనారాయణ, భారతీయ సినిమా నిర్మాత (జ. 1939)
- జనవరి 27: జమున, సినిమా నటి (జ. 1936)
- జనవరి 29: వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి (జ. 1955)
- ఫిబ్రవరి 2: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ. 1930)
- ఫిబ్రవరి 2:విద్యాసాగర్ రెడ్డి, తెలుగు సినిమాదర్శకుడు.
- ఫిబ్రవరి 4:వాణీ జయరామ్,భారతీయ నేపథ్య గాయని
- ఫిబ్రవరి 4: ఆర్.వి.గురుపాదం, భారతీయ సినిమా నిర్మాత (జ. 1970)
- ఫిబ్రవరి 5: పర్వేజ్ ముషార్రఫ్, పాకిస్తాన్ కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ సైనికాధికారి (జ. 1943)
- ఫిబ్రవరి 8: జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (జ. 1936)
- ఫిబ్రవరి 18: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (జ. 1983)
- ఫిబ్రవరి 19: జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ. 1951)
- ఫిబ్రవరి 19: ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (జ. 1962)
- మార్చి 2: బచ్చుల అర్జునుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
- మార్చి 3: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (జ. 1930)
- మార్చి 13:కె.విజయరామారావు, రాజకీయ నాయకుడు ఐపీఎస్ అధికారి.
- ఏప్రిల్ 2: కాస్ట్యూమ్ కృష్ణ, సినీ నిర్మాత, నటుడు
- ఏప్రిల్ 15:కణితి విశ్వనాథం, రాజకీయ నాయకుడు
- ఏప్రిల్ 15:అతీక్ అహ్మద్, గ్యాంగ్ స్టార్ రాజకీయ నాయకుడు
- ఏప్రిల్ 21: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (జ. 1943)
- ఏప్రిల్ 24: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (జ. 1966)
- మే 3: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (జ. 1953)
- మే 9: మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (జ. 1940)
- మే 18:రతన్ లాల్ కటారియా, కేంద్ర మాజీ మంత్రి లోక్‌సభ సభ్యుడు
- మే 21: రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (జ. 1954)
- మే 22: కేతు విశ్వనాథరెడ్డి, తెలుగు రచయిత (జ. 1939)
- మే 22: శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (జ. 1951)
- జూన్ 11: కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (జ. 1976)
- జూన్ 13: కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (జ. 1958)
- జూన్ 18: రాకేష్ మాస్టర్, కొరియోగ్రాఫర్
- జూన్ 27: సోలిపేట రామచంద్రారెడ్డి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు, తొలితరం కమ్యూనిస్టు నేత.
- జూన్ 29: సాయిచంద్, తెలంగాణ కళాకారుడు, గాయకుడు (జ. 1984)
- జూలై 13: జోసెఫిన్ చాప్లిన్,సినీ నటి చార్లీ చాప్లిన్ కూతురు
- జూలై 15: కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (జ. 1956)
- జూలై 18: ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (జ. 1943)
- జూలై 19: శ్రీరమణ, రచయిత కథకుడు
- జూలై 20: చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ. 1944)
- ఆగష్టు 6: గద్దర్,ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు
- ఆగష్టు 15:బిందేశ్వర్ పాఠక్ భారతీయ సమాజ శాస్త్రవేత్త
- ఆగష్టు 15: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (జ. 1949)
- సెప్టెంబరు 18: రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (జ. 1939)
- అక్టోబరు 23: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిషన్ సింగ్ బేడి (జ. 1946)
- నవంబర్ 11:చంద్రమోహన్ తెలుగు సినిమా నటుడు
మూలాలు
This article uses material from the Wikipedia తెలుగు article 2023, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.