చేనేత

చేనేత, ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ.

పద్మశాలీ, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, నెస్సి, కురిమిచెట్టి, కత్రి, సెంగుందం ల కుల వృత్తి. ఈ పరిశ్రమకు స్నుసంధానంగా మరికొన్ని చేతి పనులు వృత్తులు ఉన్నాయి. పడుగు (వార్పు), పేక (ఫిల్లింగ్ థ్రెడ్‌)లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడే విధానాన్ని నేత అంటారు. నిలువు వరుస దారాలను కలిపి 'పడుగు' అని, అడ్డు వరుస దారాలను కలిపి 'పేక' అని పిలుస్తారు. అందులో చేతితో మగ్గంపై నేతనేసే విధానాన్ని చేనేత అంటారు. నేసిన ఉత్పత్తులు సాదా నేత, శాటిన్ నేత, లేదా ట్విల్ నేత అనే మూడు ప్రాథమిక దశల్లో ఒకదానితో సృష్టించబడతాయి.

చేనేత
మగ్గం
చేనేత
చేనేతకు అధికంగా వాడు మగ్గం

చేనేత కేవలం భౌతిక వృత్తే కాకుండా, కళాత్మకంగా, నైపుణ్యంతో కూడిన పని కావడంతో దీనిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సివుంటుంది. చేనేత కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ కళను నేర్చుకుంటారు.

చరిత్ర

చేనేత అన్ని గొప్ప నాగరికతలలో ప్రసిద్ధి చెందింది. దీనిని స్పష్టమైన కారణ రేఖ స్థాపించబడలేదు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో, మెరోయ్‌లో పత్తి సాగు, దాని స్పిన్నింగ్, నేయడం మొదలైన జ్ఞానం ఉన్నత స్థాయికి చేరుకుంది. కుష్ రాజ్యం ఆదాయంలోని ప్రధాన వనరులలో వస్త్రాల ఎగుమతి ఒకటి. అక్సుమైట్ రాజు ఎజానా తన శాసనంలో మెరోయ్‌లో తన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో పెద్ద పత్తి తోటలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాడు.

వస్తువులు

చేనేత 
నేత ద్వారా తయారైన చీరలు

ఈ పరిశ్రమలో ఉపయోగించు వస్తు సముదాయం.

  • మగ్గం: దీని ద్వారా వస్త్రం తయారగును
  • నూలు: దీనిని మగ్గం పై అల్లుతూ వస్త్రం తయారు చేస్తారు
  • రాట్నం: దారాన్ని క్రమ పద్ధతిలో మగ్గానికి అందించు సాధనం

చేనేత కార్మికులు

చేనేత 
మగ్గంపై చీరను నేస్తున్న చేనేత కళాకారుడు (మోత్కూర్, యాదాద్రి జిల్లా, తెలంగాణ)

పురుషులు, మహిళలు ఈ చేనేత వృత్తిని చేస్తారు. వారిలో ఎక్కువమంది పురుషులు మగ్గం నేసేవారు కాగా, మహిళలు నేతకు అవసరమైన దారాన్ని సరిచేసే పనులను నిర్వహిస్తారు. అక్కడక్కడ కొంతమంది మహిళలు కూడా మగ్గం నేస్తుంటారు.

పనివిధానం

చాలామంది నేత కార్మికులకు సొంతంగా ముడిసరకు కొని, నేసిన వాటిని షాపులకు అమ్మే అంత పెట్టుబడి కానీ, మార్కెటింగ్ నైపుణ్యం కానీ ఉండవు. దీంతో వ్యాపారులు వారికి ముడిసరకు ఇచ్చి, బట్ట నేసిన తరువాత సొమ్ము చెల్లించి పట్టుకెళ్తారు. ఇక మరికొందరు మాత్రం సొంతంగా నేసి, షాపులకు ఇస్తారు.

భారతదేశంలో

భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ అయిన ఈ చేనేత వృత్తి కారంణంగా ఒకప్పుడు దేశానికి పేరు, డబ్బు తెచ్చి పెట్టింది. వందల ఏళ్ళ క్రితం నుంచీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత చేనేతది. శాతవాహనుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్‌కి ఎగుమతి చేయబడ్డాయి.

ఆర్కియాలజీ

27,000 సంవత్సరాల క్రితమే పాలియోలిథిక్ యుగంలో బట్టలు నేయడం తెలిసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. పురావస్తు శాస్త్ర సైట్‌లో ఒక అస్పష్టమైన వస్త్ర ముద్ర కనుగొనబడింది. వారు కనుగొన్న సమాచారం ప్రకారం, ఎగువ పురాతన శిలాయుగపు నేత కార్మికులు వివిధ రకాల త్రాడు రకాలను తయారు చేసేవారు, ప్లైటెడ్ బుట్టలను, అధునాతన ట్విన్డ్, సాదా నేసిన వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. కళాఖండాలలో మట్టిలో ముద్రలు, వస్త్రం కాలిన అవశేషాలు ఉన్నాయి.

అమెరికాలో పెరూలోని గిటార్రెరో గుహలో ఆరు చక్కగా నేసిన వస్త్రాలు, త్రాడుల అవశేషాలు, పురాతన వస్త్రాలు కనుగొనబడ్డాయి. మొక్కల ఫైబర్‌లతో తయారు చేయబడిన బట్టలు 10100 - 9080 BCE మధ్య కాలానికి చెందినవి.

చేనేత వస్త్రం తయారీ విధానం

చేనేత 
వస్త్రం నేసే విధానం
(1) పత్తిలో గల గింజలను తొలగించుట.
(2) ప్రత్తిలో గల మలినాలను చేప దంతముల ద్వారా శుభ్రం చేసి ఏకుట
(3) ఏకిన ప్రత్తిని స్థూపాకారంగా చుట్టుట
(4) రాట్నం ఉపయోగించి ప్రత్తినుండి దారం తీయుట.
(5) దారాలను గంజిని ఉపయోగించి గట్టిదనం తెచ్చి సరిచేసి తదుపరి మగ్గంతో వస్త్రం నేయుట
(6) నేసిన తదుపరి వస్త్రం

మూలాలు

Tags:

చేనేత చరిత్రచేనేత వస్తువులుచేనేత కార్మికులుచేనేత పనివిధానంచేనేత భారతదేశంలోచేనేత ఆర్కియాలజీచేనేత వస్త్రం తయారీ విధానంచేనేత మూలాలుచేనేతపద్మశాలీలు

🔥 Trending searches on Wiki తెలుగు:

అన్నయ్య (సినిమా)మొదటి పేజీతెలుగు సినిమాల జాబితాశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)ట్రూ లవర్కన్యారాశిగాయత్రీ మంత్రంజాతిరత్నాలు (2021 సినిమా)ప్రభుదేవాపెరిక క్షత్రియులురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్భీష్ముడుచింతామణి (నాటకం)చంద్ర గ్రహణంతెలుగు వికీపీడియాసత్యనారాయణ వ్రతంవినాయక్ దామోదర్ సావర్కర్కృత్తిక నక్షత్రముమాదిగరమణ మహర్షితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిటబుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఎస్.వి. రంగారావుఫ్లిప్‌కార్ట్అనుపమ పరమేశ్వరన్మీనాకుష్టు వ్యాధిసంక్రాంతిస్వామియే శరణం అయ్యప్పదేవీ ప్రసాద్భారతీయ జనతా పార్టీసుడిగాలి సుధీర్పోసాని కృష్ణ మురళిసుహాసినిప్రపంచ రంగస్థల దినోత్సవంసీ.ఎం.రమేష్కొణతాల రామకృష్ణవరంగల్ లోక్‌సభ నియోజకవర్గంపిచ్చుకుంటులవారురోజా సెల్వమణికృతి శెట్టికియారా అద్వానీశకుంతలకింజరాపు అచ్చెన్నాయుడుయాదవఅష్ట దిక్కులుమెరుపుకరక్కాయజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంమోదుగభారత జాతీయ ఎస్టీ కమిషన్ఆర్య (సినిమా)కస్తూరి రంగ రంగా (పాట)పసుపు గణపతి పూజకాకతీయులురాకేష్ మాస్టర్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఆలివ్ నూనెకె. అన్నామలైచైనా90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ఇన్‌స్టాగ్రామ్నికరాగ్వామాధవీ లతరజాకార్లురజినీకాంత్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంధర్మవరం శాసనసభ నియోజకవర్గంసూర్యుడు (జ్యోతిషం)హలో గురు ప్రేమకోసమేసుభాష్ చంద్రబోస్ట్రావిస్ హెడ్భారత రాజ్యాంగ సవరణల జాబితాపురాణాలురావణుడుఅమరావతి🡆 More