సిక్ఖు సామ్రాజ్యం

సిక్ఖు సామ్రాజ్యం పంజాబ్, దాని సమీప ప్రాంతాలను కలుపుకుంటూ మతరహిత రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజీత్ సింగ్ నాయకత్వంలో 19వ శతాబ్దిలో భారత ఉపఖండంలో ఏర్పడ్డ ప్రధాన రాజకీయ శక్తి.

1799లో రంజిత్ సింగ్ లాహోర్ ను పట్టుకున్న నాటి నుంచీ 1849 వరకూ కొనసాగింది. స్వతంత్ర మిస్ల్ లు, ఖల్సాలో సామ్రాజ్యపు పునాదులు పాదుకున్నాయి. 19వ శతాబ్దిలో అత్యున్నత స్థితిలో ఉండగా సామ్రాజ్యం పడమట ఖైబర్ కనుమ నుంచి తూర్పున పశ్చిమ టిబెట్ వరకూ, దక్షిణాన మిథన్ కోట్ నుంచీ ఉత్తరాన కాశ్మీర్ వరకూ విస్తరించింది. సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ వారు భారత ఉపఖండంలో ఆక్రమించిన ఆఖరి ప్రధానమైన భాగం.

సిక్ఖు సామ్రాజ్యం
సిక్ఖు సామ్రాజ్యంలో మహారాజా ప్రధాన దర్బారు, లాహోర్ దర్బారు.

సిక్ఖు సామ్రాజ్యపు పునాదులు 1707లో ఔరంగజేబు మరణం, ముఘల్ సామ్రాజ్య పతనం నుంచి చూడవచ్చు. గురు గోవింద్ సింగ్ ప్రారంభించిన ఖల్సా మరో రూపమైన దాల్ ఖల్సా ఒకవైపు ముఘల్ సామ్రాజ్యం చెప్పుకోదగ్గ విధంగా బలహీన పడిపోవడంతో పశ్చిమాన ఆఫ్ఘాన్లపై దండయాత్రలతో పోరాటం సాగించారు. ఆ క్రమంలో ఈ సైన్యాలు విస్తరించి, విడిపోయి వివిధ సమాఖ్యలు, పాక్షికంగా స్వతంత్రత కలిగిన మిస్ల్ ల స్థాపన సాగింది. వివిధ ప్రాంతాలు, నగరాలను ఈ సైన్య విభాగాలు నియంత్రించడం ప్రారంభించాయి. ఏదేమైనా 1762 నుంచి 1799 వరకూ మిస్ల్ ల సైన్యాధ్యక్షులు స్వతంత్ర సైనిక నాయకులుగా రూపాంతరం చెందారు.

లాహోరును రంజీత్ సింగ్ ఆఫ్ఘాన్ పరిపాలకుడు జమాన్ షా అబ్దాలీ నుంచి గెలుచుకుని, ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధాల్లో ఆఫ్ఘాన్లను ఓడించి బయటకు పంపేయడం, వివిధ సిక్ఖు మిస్ల్ ను ఏకీకరణ చేయడంతో సామ్రాజ్య స్థాపన జరిగింది. 12 ఏప్రిల్ 1801న వైశాఖి పండుగ నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకుని, ఏకీకృతమైన రాజ్యంగా ప్రకటించారు. గురు నానక్ వంశస్తులైన సాహఙబ్ సింగ్ బేడీ పట్టాభిషేకం జరిపించారు.

ఒక మిస్ల్ కు నాయకుని స్థానం నుంచి పంజాబ్ మహారాజా అయ్యేంతవరకూ రంజిత్ సింగ్ అతికొద్ది కాలంలోనే అధికారం సంపాదించారు. అప్పటికి ఆధునికమైన ఆయుధాలు, యుద్ధ పరికరాలు, శిక్షణ సమకూర్చి సైన్యాన్ని ఆధునీకరించారు. సిక్ఖు సామ్రాజ్య కాలంలో సిక్ఖులు కళారంగంలోనూ, విద్యాల్లోనూ పునరుజ్జీవనం పొందారు. రంజిత్ సింగ్ మరణానంతరం అంతర్గత కుమ్ములాటల్లోనూ, రాజకీయమైన తప్పులతోనూ సామ్రాజ్యం బలహీనపడింది. చిరవకు 1849లో ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో ఓటమి అనంతరం సామ్రాజ్యం పతనమైంది. సిక్ఖు సామ్రాజ్యం 1799 నుంచి 1849 కాలంలో లాహోర్, ముల్తాన్, పెషావర్, కాశ్మీర్ ప్రావిన్సులుగా ఉండేది.

మూలాలు

Tags:

ఖైబర్ కనుమటిబెట్పంజాబ్ ప్రాంతంబ్రిటీష్భారత ఉపఖండంరంజీత్ సింగ్లాహోర్సిక్ఖు

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతీయ జనతా పార్టీతెలంగాణ చరిత్రకల్లుచోళ సామ్రాజ్యంనువ్వు నేనుజైన మతంపచ్చకామెర్లుఏ.పి.జె. అబ్దుల్ కలామ్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంమొదటి ప్రపంచ యుద్ధంభారత కేంద్ర మంత్రిమండలిచిలకమర్తి లక్ష్మీనరసింహంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపన్ను (ఆర్థిక వ్యవస్థ)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంలావణ్య త్రిపాఠిఅమ్మచెక్ రిపబ్లిక్బర్రెలక్కబాల్యవివాహాలుబాలకాండసాక్షి (దినపత్రిక)అనూరాధ నక్షత్రంఆంధ్ర విశ్వవిద్యాలయంరామ్ చ​రణ్ తేజఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థశ్రీశైల క్షేత్రంపాల కూరశ్రీకాంత్ (నటుడు)జీలకర్రహరే కృష్ణ (మంత్రం)సుకన్య సమృద్ధి ఖాతాకుప్పం శాసనసభ నియోజకవర్గంరెడ్డిలోక్‌సభనవనీత్ కౌర్మీనరాశిరక్తపోటుకింజరాపు అచ్చెన్నాయుడుభగత్ సింగ్డీజే టిల్లుమానవ శరీరముఇన్‌స్టాగ్రామ్మార్చి 28అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభావ కవిత్వంఊర్వశిభారత ఆర్ధిక వ్యవస్థఇందుకూరి సునీల్ వర్మహృదయం (2022 సినిమా)తహశీల్దార్టైఫాయిడ్ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కాకతీయులుగోత్రాలు జాబితాబేతా సుధాకర్తట్టుమహాసముద్రంశ్రీకాళహస్తివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిశ్రీశైలం (శ్రీశైలం మండలం)ఈనాడుయేసు శిష్యులులోక్‌సభ స్పీకర్గద్దలు (పక్షిజాతి)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురామావతారంగుమ్మడిశక్తిపీఠాలుసందీప్ కిషన్భారతదేశ జిల్లాల జాబితాపుట్టపర్తి నారాయణాచార్యులుH (అక్షరం)ప్రియురాలు పిలిచిందిరజినీకాంత్ముదిరాజ్ (కులం)స్టాక్ మార్కెట్ద్వాదశ జ్యోతిర్లింగాలు🡆 More