వికీపీడియాలో ఓ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండొచ్చో లేదో నిర్ణయించడానికి పనికివచ్చే పరీక్ష, విషయ ప్రాముఖ్యత.
వికీపీడియాలో ఉన్న సమాచారం నిర్థారించుకోదగినదిగా ఉండాలి; విషయానికి సంబంధించి విశ్వసనీయమైన, స్వతంత్రమైన వనరులు దొరక్కపోతే, ఆ విషయానికి వ్యాసం ఉండకూడదు. వికీపీడియాలో విచక్షణారహితంగా వ్యాసాలను చేర్చకుండా ఉండటానికి ఈ మౌలిక సూత్రాన్ని వర్తింపజేస్తుంది. వ్యాసాలు, జాబితా వ్యాసాల విషయాలకు తప్పనిసరిగా విషయ ప్రాముఖ్యత ఉండాలి. కీర్తి, ప్రాముఖ్యత లేదా ప్రజాదరణ వంటివి విషయపు ప్రాముఖ్యతను పెంచుతాయేమో గానీ పూర్తిగా వాటిపై అది ఆధారపడి ఉండదు.
తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి
ఏదైనా విషయం ఇక్కడ చూపిన మార్గదర్శకాలకు సరిపోయినంత మాత్రాన, దానికి ప్రత్యేకంగా ఒక పేజీ ఖచ్చితంగా ఉండొచ్చని అర్థం కాదు. మరో వ్యాసంలో భాగంగా రాసేందుకో, లేదా మరేదైనా విషయంతో కలిపి ఒకే వ్యాసంగా రాసేందుకో వాడుకరులు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు ఫలానా విషయానికి వికీపీడియాలో పేజీ ఉండవచ్చునా అనేది చెబుతాయే తప్ప, ఆ వ్యాసంలో కంటెంటు ఏమి ఉండాలో, ఏం ఉండకూడదో చెప్పవు. ఆ సంగతిని వివరించేందుకు తటస్థ దృక్కోణం, నిర్థారత్వం, మౌలిక పరిశోధనలు నిషిద్ధం, ఏది వికీపీడియా కాదు అనే మౌలిక నిబంధనలు ఉన్నాయి.
ఒక విషయానికి స్వతంత్రమైన, విశ్వసనీయమైన వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చినపుడు ఆ విషయానికి వికీపీడియాలో ప్రత్యేకమైన వ్యాసం ఉండవచ్చని భావిస్తారు.
ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధ్రువీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.
వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వ్యాసాలకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాల కోసం కింది పేజీలను చూడవచ్చు:
వ్యాసాన్ని సృష్టించవచ్చా లేదా అనేదానికి వర్తించే ప్రమాణాలు, ఆ వ్యాసం లోని కంటెంటుకు వర్తించే ప్రమాణాలూ ఒకటి కాదు. విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వ్యాసం లోని కంటెంటుకు వర్తించవు (జాబితాల్లో విషయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను చేర్చడాన్ని నిరోధించే మార్గదర్శకాలను మినహాయించి). వ్యాసాల్లో చేర్చే కంటెంటు, కంటెంటు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది.
విషయ ప్రాముఖ్యత అనేది వ్యాస విషయపు లక్షణం, వ్యాసపు లక్షణం కాదు. వ్యాస విషయానికి వికీ బయట తగినంత కవరేజీ లేకపోతే, ఆ వ్యాసం లోని కంటెంటును ఎంతగా మెరుగుపరచినా, ఎంతగా అభివృద్ధి చేసినా ఆ వ్యాస విషయానికి హఠాత్తుగా ప్రాముఖ్యత వచ్చేయదు. పైగా, వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉంటే, వ్యాసం లోని కంటెంటు ఏమంత బాగా రాయకపోయినా విషయ ప్రాముఖ్యతకు లోటేమీ రాదు.
విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలలో, దండలో దారం లాంటి సాధారణ సూత్రం ఏమిటంటే, వ్యాస విషయానికి స్వతంత్ర వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చిందని ధ్రువీకరించుకోదగిన, వస్తుగతమైన ఆధారాలు ఉండాలి.
ఓ విషయం ఉనికిలో ఉన్నంత మాత్రాన, ఆటోమాటిగ్గా దానికి ప్రాముఖ్యత చేకూరినట్లు కాదు: ఆ విషయానికి స్వతంత్ర వనరుల్లో గణనీయమైన కవరేజి లేదా గుర్తింపు లభించిందని చూపించగలగాలి. ఇది, ఏదో తాత్కాలిక గుర్తింపు కాకూడదు. ప్రాపగాండా కార్యకలాపాల్లో భాగంగా ఉండకూడదు. విచక్షణారహిత ప్రచారం కాకూడదు. వేరే ఏ ఇతర కారణాల వల్లనైనా అనుచితమైన విషయంగా పరిగణింపబడకూడదు. మూలాల్లో, గుర్తించబడిన సాటివారి-సమీక్ష జరిగిన గుర్తింపు పొందిన ప్రచురణలు, విశ్వసనీయమైన, సాధికారిత కలిగిన పుస్తకాలు, ప్రశస్తి కలిగిన మీడియా వనరులు తదితర విశ్వసనీయ వనరులు ఆధారాలుగా పనికివస్తాయి.
ఏదైనా వ్యాసంలో ఉన్న కంటెంటుకు మూలాలను చూపించనంత మాత్రాన (మూలాలు అసలు ఉనికి లోనే లేకపోవడం కాదు) ఆ వ్యాస విషయానికి ప్రాముఖ్యత లేనట్లు కాదు. విషయ ప్రాముఖ్యతకు కావలసినది విశ్వసనీయమైన, నిర్థారించుకోదగ్గ, స్వతంత్ర వనరులు ఉనికిలో ఉండడం - అంతేగానీ, వాటిని వ్యాసంలో ఉల్లేఖించారా లేదా అనేది కాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను మదింపు చేసే సంపాదకులు వ్యాసంలో పేర్కొన్న మూలాలను మాత్రమే కాకుండా, వ్యాసంలో ఉల్లేఖించని ప్రాముఖ్యతను-సూచించే మూలాల ఉనికిని కూడా పరిగణించాలి. అందువల్లనే, తొలగింపు కోసం ఒక వ్యాసాన్ని ప్రతిపాదించడానికి ముందుగానీ, తొలగింపు చర్చలో అభిప్రాయాన్ని రాసే ముందుగానీ, సంపాదకులు సదరు విషయపు ప్రాముఖ్యతను నిర్థారించగల మూలాలను కనుగొనే ప్రయత్నం చెయ్యాలని బలంగా ఉద్బోధిస్తాం.
వికీపీడియా వ్యాసాలను తుది ముసాయిదాగా భావించరాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలను ప్రస్తుతానికి చూపించి ఉండక పోవచ్చు.., కానీ అవి ఉండే ఉండవచ్చు. ప్రాముఖ్యతను నిరూపించే, సముచితమైన మూలాలు లభించే అవకాశం ఉంటే, విషయ ప్రాముఖ్యత లేదని తొలగించడం సరికాదు. అయితే, విషయ ప్రాముఖ్యతను నిరూపించమని అడిగిన తరువాత, ఆ మూలాలను చూపించవలసి ఉంటుంది, ఉన్నాయనీ, ఉండే ఉంటాయనో చెబితే సరిపోదు.
విషయ ప్రాముఖ్యత తాత్కాలికమైనది కాదు; వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉందంటూ ఒకసారి నిర్థారణ అయ్యాక (అంటే, విషయ ప్రాముఖ్యత మార్గదర్శకం ప్రకారం "గణనీయమైన కవరేజీ" వస్తే), ఇక ఆ వ్యాస విషయానికి అలాంటి కవరేజీ వస్తూనే ఉండాల్సిన అవసరం లేదు.
విషయ ప్రాముఖ్యత తాత్కాలికమైనది కానప్పటికీ, వ్యాస విషయాల ప్రాముఖ్యతను నిరూపించిన మూలాలపై మళ్ళీ మూల్యాంకనం చెయ్యాలని గానీ, వాటి గురించి కొత్త సందేహాలు వెలుగు లోకి తీసుకురావడం గానీ వాడుకరులు చేసే అవకాశం ఉంది. తొలగింపుకు ప్రతిపాదించి అక్కడి చర్చలో ఈ అంశాలను లేవనెత్తవచ్చు. లేదా గతంలో ప్రాముఖ్యత లేదని భావించిన అంశాల విషయంలో కొత్త ఆధారాలు వెలుగు లోకి రావచ్చు. అంచేత వ్యాసాలను సృష్టించిన కొన్ని నెలలు ఏళ్ళ తరువాత వాటి విషయ ప్రాముఖ్యతపై సందేహంతో తొలగింపుకు ప్రతిపాదించబడే అవకాశం లేకపోలేదు.
ఈ ప్రమాణానికి అనుగుణంగా లేని అంశాలకు వికీలో పేజీలు ఉంచరు. అలాంటి పేజీలను వాటికి దగ్గరి సంబంధం ఉన్న ముఖ్యమైన వ్యాసాలు లేదా జాబితాల పేజీల్లో విలీనం చేస్తారు. అయితే అలా విలీనం చేసే అవకాశాలు లేని పేజీలను తొలగిస్తారు.
ఒక వ్యాసం దాని విషయ ప్రాముఖ్యతను చూపే మూలాలను ఉదహరించడంలో విఫలమైతే, మూలాల కోసం మీరే చూడండి, లేదా:
తగిన మూలాల కోసం మంచి విశ్వాసంతో శోధించిన తర్వాత కూడా కనుగొనలేకపోతే, ఆ వ్యాసం లోని నిర్థారించదగిన కంటెంటును సందర్భోచితమైన మరో పెద్ద వ్యాసంలో విలీనం చెయ్యవచ్చేమో పరిశీలించండి. లేదా తొలగిస్తోంటే:
ప్రాముఖ్యత లేదని "స్పష్టంగా" తెలిసిన వ్యాసాల విషయంలో, తొలగింపు అనేది సాధారణంగా సరైన చర్య. అయితే ఇతర పద్ధతులను పాటించడం వలన అందులో ఏదైనా ఉపయోగకరమైన కంటెంటు ఉంటే సముదాయం దాన్ని భద్రపరచుకునే వీలుంటుంది.
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:విషయ ప్రాముఖ్యత, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.